విశాఖ శారద పీఠాధిపతిగా కిరణ్‌శాస్త్రి | Kiran Shastry To Takes Charge As Head Of Vishaka Sri Sharada Peetam | Sakshi
Sakshi News home page

విశాఖ శారద పీఠాధిపతిగా కిరణ్‌శాస్త్రి

Published Sat, Jun 8 2019 9:19 AM | Last Updated on Sat, Jun 8 2019 10:28 AM

Kiran Shastry To Takes Charge As Head Of Vishaka Sri Sharada Peetam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విశాఖ శారదా పీఠం అధిపతిగా ప్రస్తుత పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి శిష్యుడు కిరణ్‌శాస్త్రి నియమితులవుతున్నట్లు ఆల్‌ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్‌ తెలిపింది. ఇందుకు సంబంధించి ఈ నెల 15,16,17 తేదీల్లో విజయవాడ కృష్ణా కరకట్టపై ఉత్తరాధికారి శిష్య తురీయాశ్రమ దీక్షా స్వీకార మహోత్సవంను నిర్వహిస్తున్నట్లు అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ స్టేట్‌ అడిషనల్‌ సెక్రటరీ రఘురామయ్య చెరుకుచర్ల తెలిపారు.

ఈ మేరకు ఈ స్వీకార మహోత్సవానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను బుధవారం హైదరాబాద్‌లోని కుబేరా ప్యాలెస్‌లో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, అధికార ప్రతినిధి కె.వేణుగోపాలచారి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘురామయ్య మాట్లాడుతూ..స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పదవి ముగుస్తున్న కారణంగా ఆయన స్థానంలో తన శిష్యుడు కిరణ్‌ శాస్త్రిని విశాఖ పీఠాధిపతిగా నియమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావులతో పాటు దేశంలో పలువురు రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement