visakha sarada peetam
-
సీఎం జగన్‌కు శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలని సీఎం జగన్‌కు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు రాజశ్యామల అమ్మవారి ప్రసాదాలను స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ అందజేశారు. -
విశాఖ శారదా పీఠాధిపతుల చాతుర్మాస దీక్ష విరమణ
-
హిందూధర్మానికి ఉనికి ఆదిశంకరాచార్యులే..
సింహాచలం: హిందూ ధర్మానికి ఉనికి జగద్గురు ఆదిశంకరాచార్యులే అని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు. శ్రీశారదాపీఠంలో ఐదురోజులుగా జరిగిన వార్షికోత్సవాలు మంగళవారం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన శాస్త్ర, శ్రౌతసభల్లో స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడారు. ఆచార్యుల పేరుతో మధ్వాచార్యులు, రామానుజాచార్యులు ప్రచారం పొందినా ప్రపంచవ్యాప్తంగా ఆదిశంకరాచార్యులే తెలుసని చెప్పారు. శంకరాచార్య తత్వాన్ని కాపాడుతున్న శాస్త్ర పండితులతో ఏటా వార్షికోత్సవాల్లో శాస్త్ర, శ్రౌతసభలు నిర్వహిస్తున్నామని, బిరుదులిచ్చి స్వర్ణకంకణధారణ చేస్తున్నామని తెలిపారు. హిందూధర్మం అంటే ఆలయాలు, అర్చనలే అని సామాన్యులు భావిస్తారని, కానీ శాస్త్రం ఉంటేనే హిందూధర్మం నిలుస్తుందని తమ పీఠం నమ్ముతుందని చెప్పారు. రాజశ్యామల యాగం అంటే వ్యాపారం కాదన్నారు. అంగదేవతలతో కూడిన హోమాలు ఇందులో ఉంటాయన్నారు. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరకు రాజశ్యామల కృపను పొందారని చెప్పారు. ఈ సందర్భంగా శాస్త్రసభలో ప్రతిభకనబరిచిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రికి వ్యాకరణ భాస్కర బిరుదు ప్రదానం చేసి స్వర్ణకంకణధారణ చేశారు. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో జరిగిన ఈ సభలో షట్‌శాస్త్ర పండితులు విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, చిర్రావూరి శ్రీరామశర్మ, ఓరుగంటి రామ్‌లాల్, మణిద్రావిడ శాస్త్రి, ఆర్.కృష్ణమూర్తి శాస్త్రి, ప్రముఖ శ్రౌత పండితులు దెందుకూరి రాఘవ ఘనాపాఠి పాల్గొన్నారు. ఆశీస్సులందుకున్న గవర్నర్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ల్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. వైభవంగా మహాపూర్ణాహుతి వైభవంగా జరిగిన రాజశ్యామలయాగం, శ్రీనివాస చతుర్వేద హవనం మహాపూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, భీమిలి, పెందుర్తి ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అదీప్‌రాజ్, వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు, విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున, సీపీ శ్రీకాంత్, తెలంగాణకు చెందిన కంపెనీస్ లా ట్రిబ్యునల్ చైర్మన్ బదరీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశాఖ శారదాపీఠం చేస్తున్న ఆధ్యాత్మిక, సేవాకార్యక్రమాలు ఎంతో గొప్పవని చెప్పారు. -
విశాఖలో ఆదిశంకరుల భారీ విగ్రహం
సింహాచలం/అంబాజీపేట: విశాఖలో ఆదిశంకరాచార్యుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. ప్రపంచాన్ని ఆకర్షించేలా శంకరుల ప్రతిమ ఉంటుందని చెప్పారు. కోనసీమ జిల్లా ముక్కామలలో కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతిని స్వరూపానందేంద్ర సరస్వతి, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి గురువారం కలిసి వైదిక, ఆధ్యాత్మిక, సంప్రదాయపరమైన అంశాలపై చర్చించారు. స్వరూపానందేంద్ర మాట్లాడుతూ వానప్రస్థంలోకి అడుగుపెడుతోన్న వృద్ధ దంపతుల కోసం పురాణ, వేదాంత పరమైన ధర్మ సందేహాల నివృత్తికి ప్రత్యేక కోర్సుని ప్రవేశ పెట్టే ఆలోచన ఉందని, 2– 3 ఏళ్ల నిడివితో కోర్సుని రూపొందించాలని భావిస్తున్నామని విజయేంద్ర సరస్వతి దృష్టికి తీసుకెళ్లారు. స్వరూపానందేంద్ర యోచన పట్ల విజయేంద్ర సరస్వతి హర్షం వ్యక్తం చేశారు. అర్చకత్వం, ఆలయ సంపద పరిరక్షణ తదితర అంశాలపై కూడా ఇరువురూ చర్చించారు. హైందవ ధర్మం పరిరక్షణకు విశాఖ శ్రీశారదాపీఠం చేస్తున్న కృషిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని విజయేంద్ర సరస్వతి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ధర్మం కోసం ధైర్యంగా మాట్లాడే పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి అని ఆయన పేర్కొన్నారు. అనేకసార్లు గురువులు జయేంద్ర సరస్వతితో కలిసి విశాఖ శ్రీశారదాపీఠాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. పీఠం నుంచి వెలువడిన అనేక వేదాంత గ్రంథాలను పరిశీలించినట్టు తెలిపారు. అమలాపురం ఎంపీ అనూరాధ, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు యతీంద్రులను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ముక్కామలలో నిర్వహించిన బ్రహ్మసత్ర మహోత్సవ ముగింపు కార్యక్రమానికి పీఠాధిపతులు హాజరయ్యారు. పుష్పగిరి పీఠాధిపతులు విద్యాశంకర భారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రాజశ్యామల ఉపాసన కేంద్రం విశాఖ శారదాపీఠం
సింహాచలం: తెలుగు రాష్ట్రాల్లో రాజశ్యామల అమ్మవారిని ఆరాధించే ఏకైక ఉపాసన కేంద్రంగా విశాఖ శ్రీశారదాపీఠం ఖ్యాతిగాంచిందని, రాజశ్యామల అమ్మవారి ఆరాధనతో ఎంతోమంది ఉన్నతస్థాయికి చేరుకున్నారని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు. విశాఖ జిల్లా చినముషిడివాడలోని శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ రాజశ్యామల అమ్మవారిని ఏకాంతంగాను, అంతర్లీనంగాను ఉపాసించాలంటే అది కేవలం విశాఖ శ్రీశారదాపీఠంలోనే సాధ్యమని చెప్పారు. అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనే వారు అదృష్టవంతులవుతారన్నారు. స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ సాధారణ రోజుల్లోకన్నా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని ఆరాధిస్తే వేయిరెట్లు ఫలితం సిద్ధిస్తుందని చెప్పారు. ఈవేడుకల్లో లోకకల్యాణార్ధం చండీహోమం, చండీ పారాయణం, చతుర్వేద పారాయణం, రాజశ్యామల హోమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జగన్మాత రాజశ్యామల అమ్మవారి ప్రీతికోసం శ్రీచక్రానికి నవావరణార్చన చేస్తున్నట్లు చెప్పారు. శరన్నవరాత్రి ఉత్సవాల అంకురార్పణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత మహాగణపతిపూజ, చండీహోమం, రాజశ్యామల హోమాన్ని నిర్వహించే పండితులు దీక్షాధారణ చేశారు. తొలిరోజు సోమవారం శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు బాలాత్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. -
విశాఖ శారదపీఠంలో ఉగాది వేడుకలు
-
అమ్మవారి సేవలో సీఎం
సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి: అత్యంత వైభవంగా సాగుతున్న విశాఖ శ్రీశారదాపీఠం వార్షికోత్సవాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరై అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. బుధవారం పెందుర్తి మండలం చినముషిడివాడలోని పీఠాన్ని సందర్శించిన సీఎం జగన్ దాదాపు మూడున్నర గంటల పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామీజీ, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు గన్నవరం విమానాశ్రయం నుంచి 11.45 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ మధ్యాహ్నం 12.10 గంటలకు పీఠానికి చేరుకున్నారు. స్వరూపానందేంద్ర స్వామీజీ, స్వాత్మానందేంద్ర స్వామీజీ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులతో కలిసి శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోమాతకు పూజలు ఆచరించి నైవేద్యాన్ని సమర్పించారు. జమ్మిచెట్టుకు ప్రదక్షిణ చేసిన అనంతరం విజయ గణపతి, శంకరాచార్య, వనదుర్గ ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. రాజశ్యామల పూజల కోసం సీఎం జగన్ చేతుల మీదుగా పండితులు సంకల్పం చేయించి కలశ స్థాపన చేపట్టారు. వనదుర్గ, రాజశ్యామల యాగాలను సీఎం దర్శించుకున్నారు. రుద్రహోమం పూర్ణాహుతి కార్యక్రమంలో స్వామీజీలతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. విద్యార్థులకు ఉత్తీర్ణత పత్రాలు జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు ఉత్తీర్ణత పత్రాలు, పతకాలను ముఖ్యమంత్రి జగన్ అందజేశారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం సీఎం జగన్‌ను స్వామీజీ సత్కరించి ఆశీస్సులు అందించారు. ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి అందజేసిన ప్రసాదాన్ని సీఎం జగన్ స్వీకరించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుగు పయనమైన ముఖ్యమంత్రిని పీఠం ప్రతినిధులు సాదరంగా సాగనంపారు. అనంతరం విశాఖ ఎయిర్‌పోర్టులో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికారు. మహా విద్యాపీఠం: స్వాత్మానందేంద్ర జగద్గురు శంకరాచార్య సంప్రదాయ పీఠంగా ఆవిర్భవించిన విశాఖ శ్రీశారదాపీఠం మహావిద్యాపీఠంగా అవతరించిందని స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ చెప్పారు. పీఠం నిర్వహణలో 21 ఏళ్ల క్రితం ఏర్పాటైన జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల ఎందరో వేద పండితులను తీర్చిదిద్దిందని తెలిపారు. ఇక్కడ పట్టాలు పొందిన వారు దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు గడిస్తుండడం ఆనందాన్నిస్తోందన్నారు. వేదానికి పుట్టినిల్లుగా పేరున్న ప్రాంతంలో ఏర్పాటైన వేద పాఠశాల మంచి పేరు సంపాదించిందన్నారు. తమ పీఠం పరంపరకు 200 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. హోళే నర్సిపూర్ కేంద్రంగా పరంపర మొదలైందన్నారు. శ్రీశారదాపీఠం వార్షికోత్సవాలకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కావడం, వరుసగా ఎనిమిదేళ్లుగా పీఠానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు అందుకోవడం ఆనందాన్నిస్తోందన్నారు. -
శ్రీశారదా పీఠంలో అరుణ పారాయణ
సాక్షి, అమరావతి/పెందుర్తి: విశాఖ శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజైన మంగళవారం పీఠంలో రథసప్తమి వేడుకలు జరిగాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వేదపండితులు ఆదిత్య భగవానుడిని ప్రార్థిస్తూ త్రిచ విధానంలో సూర్యనమస్కారాలు చేశారు. అరుణ పారాయణ జరిగింది. పీఠంలోని 18 అడుగుల దాసాంజనేయస్వామికి ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర చేతుల మీదుగా విశేష అభిషేకాలు జరిపారు. దేశ రక్షణ కోసం చేపట్టిన రాజశ్యామల యాగం కొనసాగింది. వనదుర్గ హోమం, మన్యసూక్త హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, దేవదాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వాణిమోహన్, ఎమ్మెల్యేలు అదీప్‌రాజ్, శిల్ప రవికిశోర్‌రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు. నేడు పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొననున్న సీఎం జగన్ శ్రీశారదా పీఠం వార్షికోత్సవాలలో సీఎం వైఎస్ జగన్ బుధవారం పాల్గొంటారు. ఉదయం 10.15కు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు బయలుదేరుతారు. 11 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని 11.30కు శారదా పీఠంకు చేరుకుంటారు. అక్కడ జరిగే వార్షికోత్సవాల్లో పాల్గొని మధ్యాహ్నం 1.25కు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి తిరుగుపయనమవుతారు. పీఠం వార్షికోత్సవాల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొననుండటం వరుసగా ఇది మూడోసారి. -
రాజశ్యామల తంత్ర మహిమాన్వితం శ్రీశారదా పీఠం
పెందుర్తి: జగన్మాత రాజశ్యామల అమ్మవారి ఉపాసన పూర్తిస్థాయిలో తెలిసిన ఏకైక పీఠం శ్రీశారదాపీఠం అని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ తెలిపారు. 14 ఏళ్ల పాటు హిమాలయాల్లో సంచరించిన సమయంలో తపస్సంపన్నుల సాన్నిహిత్యం, మహానుభావుల ఉపదేశంతో రాజశ్యామల అమ్మవారి తంత్రాన్ని తెలుసుకోగలిగానన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలోని శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహభాషణం చేస్తూ.. రాజశ్యామల అమ్మవారి ఉపాసన బలంతో ఇక్కడ పీఠాన్ని నెలకొల్పామని తెలిపారు. కుల, మత బేధ రహిత అద్వైత వేదాంతాన్ని బోధించిన జగద్గురువు ఆదిశంకరాచార్యుని బోధనలను తమ పీఠం పుణికిపుచ్చుకుందన్నారు. వార్షికోత్సవాల్లో ప్రతి ఏటా శ్రౌత, శాస్త్ర సభలు నిర్వహించడం ఆనవాయితీ అని.. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది సభలు రద్దు చేశామని తెలిపారు. శ్రీశారదాపీఠంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎంతో అనుబంధం ఉన్నందున సీఎంను ప్రత్యేకంగా వార్షికోత్సవాలకు స్వాగతిస్తున్నట్లు తెలిపారు. శాస్త్రోక్తంగా కార్యక్రమాలు పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి సారథ్యంలో పీఠం వార్షిక మహోత్సవాలకు పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా అంకురార్పణ జరిగింది. స్వామీజీలు అమ్మవారికి ప్రత్యేక పూజలు, గోపూజ నిర్వహించారు. పండితులకు దీక్షా వస్త్రాలను అందించారు. లోకకల్యాణార్థం లక్ష్మిగణపతి హోమం, మేధాదక్షిణామూర్తి హోమం చేపట్టారు. శారదా స్వరూప రాజశ్యామల, చంద్రమౌళీశ్వరుల పీఠార్చన గావించారు. సర్వజనుల హితాన్ని కాంక్షిస్తూ చేపట్టిన చతుర్వేద పారాయణంలో వందలాది మంది పండితులు పాల్గొన్నారు. -
విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం విశాఖపట్నం వెళ్లనున్నారు. రేపు ఉదయం 10.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి 11.30 గంటలకు శ్రీ శారదా పీఠం చేరుకుంటారు. ఒంటిగంట వరకు అక్కడ ఉంటారు. మధ్యాహ్నం 1.25 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని తిరుగుప్రయాణం అవుతారు. -
హిందూ ధర్మానికి పట్టుకొమ్మలు గిరిజన ప్రాంతాలు
సింహాచలం (పెందుర్తి)/పెందుర్తి: హిందూ ధర్మానికి పట్టుకొమ్మలు గిరిజన ప్రాంతాలేనని విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి అన్నారు. శ్రీశారదా పీఠం ఆధ్వర్యంలో చినముషివాడలోని శారదా పీఠం నుంచి సింహగిరికి 5 వేల మందితో పాదయాత్రని శ్రీగురుదేవా చారిటబుల్ ట్రస్ట్ శనివారం నిర్వహించింది. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాం తం నుంచి వచ్చిన వందలాది మంది గిరిజనులతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మొత్తం 121 గ్రామాల నుంచి 5 వేల మంది ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. హరినామస్మరణలు చేస్తూ సింహగిరికి చేరుకున్నారు. సింహగిరిపై శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని తమ ప్రాంతాల్లో పండిన ధాన్యం తొలి పంటని స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా వరాహ లక్ష్మీనృసింహస్వామికి స్వాత్మానందేంద్ర ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం స్వామీజీ ఆలయ రాజగోపురం ఎదురుగా భక్తులకు అనుగ్రహ భాషణం చేశా రు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో భక్తిభావాన్ని పెం పొందించేందుకు టీటీడీ, దేవదాయశాఖ ఆలయాలను, భజన మండళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీశారదా పీఠాన్ని సందర్శించిన ఆదివాసీలు శారదా పీఠాన్ని విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వందలాది మంది గిరిజనులు శనివారం సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అన్యమతాల ఉచ్చులో పడవద్దని సూచించారు. పసుపు–కుంకుమలతో సౌభాగ్యంగా కనిపించేది కేవలం హిందూ ధర్మంలో మాత్రమేనని చెప్పారు. ఈ సందర్భంగా పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తుల సన్నిధిలో గిరిజనులు ప్రత్యేక పూజలు చేశారు. -
ఉద్యమ రూపంలో హిందూ మత ప్రచారం: స్వరూపానందేంద్ర
సాక్షి, విశాఖపట్నం: విశాఖ శ్రీ శారదాపీఠం యావద్ భారతదేశానిదని.. గిరిజన భక్తులను తిరుమల తీసుకెళ్లటం ఆనందంగా ఉందని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు సోమవారం ఆయన ధర్మ ప్రచార యాత్రను ప్రారంభించారు. చిన్నముసిడివాడ శారదా పీఠం నుంచి 25 బస్సుల్లో గిరిజన భక్తులు తిరుమలకు బయలుదేరారు. సింహాచలంలో భక్తుల తొలిపూజ అనంతరం తిరుమల యాత్ర ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ, హిందూమత ప్రచారాన్ని ఉద్యమ రూపంలో శారదాపీఠం తీసుకెళ్తోందని.. స్వాత్మానందేంద్ర సరస్వతి త్వరలో భారతదేశ యాత్ర ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. దేవాదాయ భూముల పరిరక్షణలో శారదాపీఠం ముందుంటుందని పేర్కొన్నారు. ఏటా దళిత గిరిజనులను తిరుమల యాత్రకు తీసుకెళ్లి అందరికీ దేవుని అనుగ్రహాన్ని శారదాపీఠం కల్పిస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర పీఠాధిపతి పర్యటన పూర్తైందని ఆయన వెల్లడించారు. శారదాపీఠం కేవలం తెలుగు రాష్ట్రాల పరిధి కాదని.. యావత్ ప్రపంచంలో హిందూమత పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు. 30 ఏళ్లుగా హైందవ ధర్మం కోసం విశాఖ శారదాపీఠం పోరాడుతోందని స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. చదవండి: బీజేపీ - జనసేన పొత్తుపై మరోసారి సందిగ్ధం.. తీరనున్న కృష్ణలంక వాసుల వరద కష్టాలు -
సీఎం జగన్‌ను కలిసిన స్వాత్మానందేంద్ర సరస్వతి
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి మంగళవారం కలిశారు. అనంతరం స్వాత్మానందేంద్ర సరస్వతి మీడియాతో మాట్లాడుతూ, దేవాలయాల భద్రతపై సీఎంతో మాట్లాడానని తెలిపారు. స్వరూపానంద స్వామి ఇచ్చిన సూచనలను ముఖ్యమంత్రికి నివేదించానని పేర్కొన్నారు. (చదవండి:పేదవాళ్ల ఉసురు తగులుతుంది: సీఎం జగన్) ‘‘తాను చెప్పిన అంశాలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. దాడులపై దర్యాప్తు వేగవంతం చేస్తామని సీఎం చెప్పారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలో విజయవాడలో కూల్చిన దేవాలయాలను పునర్నిర్మిస్తామని..ఈ నెల 8న శంకుస్థాపన చేస్తున్నట్టుగా సీఎం తెలిపారు. ఇప్పటికే 30 వేల ఆలయాల్లో సీసీ కెమెరాలు పెట్టినట్టు చెప్పారు. సనాతన ధర్మాన్ని కాపాడటంలో ప్రభుత్వం ముందుంటుందని సీఎం వైఎస్ జగన్ చెప్పారని’’స్వాత్మానందేంద్ర సరస్వతి వెల్లడించారు. (చదవండి: మతాలతో ఆటలా..: సజ్జల రామకృష్ణారెడ్డి) -
విగ్రహాల ధ్వంసం బాధాకరం: స్వాత్మానందేంద్ర సరస్వతి
సాక్షి, విశాఖపట్నం: బురుజు పేటలోని శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారిని ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి శారదా పీఠం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వాత్మానందేంద్ర మీడియాతో మాట్లాడుతూ, దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం బాధాకరమన్నారు. తొలిరోజుల నుంచీ హిందూ సంప్రదాయాలు, ఆలయ ఆస్తుల పరిరక్షణలో శారదాపీఠం పోరాటాలు సాగిస్తోందని తెలిపారు. మహాస్వామి స్వరూపానందేంద్ర సరస్వతి దేవాదాయశాఖ మంత్రితో చర్చించారని, ఆలయాల భద్రతపై త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో స్వరూపానందేంద్ర సరస్వతి సమావేశమవుతారని స్వాత్మానందేంద్ర సరస్వతి తెలిపారు. -
దేవాలయాలపై దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలి
పెందుర్తి: రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడుల విషయంలో విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి తీవ్రంగా స్పందించారు. దాడులకు పాల్పడుతున్న అసాంఘిక శక్తులను నియంత్రించేందుకు దేవదాయ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌తో ఫోన్ ద్వారా ఆయన చర్చించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టతో పాటు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే కుట్రను నిరోధించడం అవసరమన్నారు. దేవాలయాలపై దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్న సంకేతాలు భక్తులకు వెళ్లే విధంగా దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల జరిగిన దాడులపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. -
సుజనా, మురళీ మోహన్ ఆశీస్సులు తీసుకోలేదా?
సాక్షి, విజయవాడ : ప్రతి అంశాన్ని టీడీపీ, ఎల్లో మీడియా రాజకీయం చేయాలని చూస్తోందని బ్రాహ్మణ కార్పొరేట్ చైర్మన్, ఎమ్యెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని మఠాలు, స్వామిజీలను ప్రభుత్వం గౌరవిస్తుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాం. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినాన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తోంది. 2016లో స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకలపై గత టీడీపీ ప్రభుత్వం సర్య్కులర్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం అలాగే లేఖ రాసింది. మఠాలు, స్వామిజీల అంశాలను కూడా టీడీపీ రాజకీయం చేయాలని చూస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఒకలా.. అధికారం లేనప్పుడు మరోలా వ్యవహరిస్తోంది. (చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదు: మల్లాది) మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టాలని టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి పనిచేసే ప్రభుత్వం మాది. గత టీడీపీ ప్రభుత్వం చేసినప్పుడు.. మేం చేస్తే తప్పు ఎలా అవుతుంది?. బూట్లు వేసుకుని పూజలు చేసిన చరిత్ర టీడీపీ నేతలది. యనమల రామకృష్ణుడు దిగజారి మాట్లుడుతున్నారు. గతంలో యనమల రామకృష్ణుడు స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారా లేదా? అప్పట్లో శారదా పీఠం వెళ్లి సుజనా చౌదరి, మురళీ మోహన్ స్వామిజీ ఆశీస్సులు తీసుకోలేదా?. చంద్రబాబు డైరెక్షన్లో సీపీఐ రామకృష్ణ మాట్లాడుతున్నారు. స్వామీజీలకు పార్టీలతో సంబంధం ఉండదు. వారికి రాజకీయాలు అంటగట్టడం సమంజం కాదు. వరుస ఓటములతో యనమలకు బుద్ధి మందగించింది. యనమల రామకృష్ణుడు ప్రెస్ నోట్లకే పరిమితం అయ్యారు. తెలంగాణా లో ఆ రాష్ట్ర ప్రభుత్వం వందల ఎకరాలు శారదా పీఠంకు రాసిచ్చింది. మేం అలా రాసి ఇవ్వలేదు. మా ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాపాడుతోంది. హిందూ ధర్మాన్ని శారదా పీఠం అధినేత స్వరూపానంద సరస్వతి కాపాడుతున్నారు. స్వామీజీలు ఆయా రాజకీయ పార్టీల కండువాలు కప్పుకోవడం వారి ఇష్టం.’ అని అన్నారు. -
గ్యాస్ లీకేజీ బాధితులకు భోజన వసతి
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో విషవాయువు వలయంలో చిక్కుకున్న బాధిత కుటుంబాలకు విశాఖ శారదాపీఠం, వానప్రస్థం సంస్థలు భోజన వసతిని కొనసాగిస్తున్నాయి. సంఘటన జరిగిన వెంటనే తక్షణం స్పందించి బాధితులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసిన ఈ సంస్థలు రెండో రోజు కూడా తమ సేవా కార్యక్రమాన్ని కొనసాగించాయి. బాధిత కుటుంబాలు తల దాచుకున్న షెల్టర్ హోమ్స్ వద్దకు ఆహార ప్యాకెట్లను నేరుగా సరఫరా చేస్తున్నాయి. అధికారుల సూచన మేరకు రెండు పూటలూ భోజన వసతి కల్పించేందుకు విశాఖ శారదాపీఠం వానప్రస్థం సంస్థలు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా మధ్యాహ్నం ఐదు వేలు రాత్రికి మరో అయిదు వేల చొప్పున మొత్తం పదివేల ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నాయి. విశాఖ శారదాపీఠం ట్రస్టు సభ్యులు, వానప్రస్థం వృద్ధాశ్రమ సంస్థ నిర్వాహకులు రొబ్బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. (గ్యాస్ లీకేజీ: చంద్రబాబు వ్యాఖ్యల సరికాదు) 48 గంటల వరకు గ్రామాలకు వెళ్లొద్దు.. ‘ఇప్పట్లో చంద్రబాబు కోలుకోవడం కష్టమే’ -
ముగిసిన విశాఖ శ్రీశారదాపీఠం వార్షికోత్సవాలు
-
అత్యంత వైభవంగా..
సాక్షి, విశాఖపట్నం: రాజశ్యామల అమ్మవారు కొలువైన విశాఖ నగరం చినముషిడివాడలోని విశాఖ శ్రీశారదాపీఠం వార్షికోత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ వేడుకల్లో భాగంగా గత ఐదు రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీనివాస చతుర్వేద హవనం, లోక కల్యాణార్థం శారదాపీఠం తలపెట్టిన రాజశ్యామల యాగం శాస్త్రోక్తంగా పూర్తయ్యాయి. సీఎం వైఎస్ జగన్ సోమవారం ఈ కార్యక్రమాల్లో పట్టు వస్త్రాలు ధరించి పాల్గొన్నారు. ఉదయం 11.25 గంటలకు శారదా పీఠానికి చేరుకున్న ఆయనకు మేళతాళాలు, పూర్ణకుంభంతో పీఠం ధర్మకర్తలు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్.. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామీజీ, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో కలసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. స్వరూపానందేంద్ర ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామీజీలతోపాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులతో కలిసి శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి పూజలు చేశారు. గోమాతకు పూజలు ఆచరించి నైవేద్యం సమర్పించారు. జమ్మిచెట్టుకు ప్రదక్షిణ చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీనివాస చతుర్వేద హవనం, శారదాపీఠం తలపెట్టిన రాజశ్యామల యాగం, మహా పూర్ణాహుతిలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం పీఠంలో నూతనంగా నిర్మించిన స్వయంజ్యోతి మండపాన్ని ప్రారంభించారు. స్వరూపానందేంద్ర తన వ్యాఖ్యానంతో ముద్రించిన తత్త్వమసి గ్రంథాన్ని సీఎం వైఎస్ జగన్‌కు అందజేశారు. శ్రౌత మహాసభలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తంగిరాల విశ్వనాథ పౌండరీకయాజులుకు సీఎం చేతుల మీదుగా స్వర్ణ కంకణధారణ చేశారు. అహితాగ్ని భాస్కర అనే బిరుదును అంకితం చేశారు. శాస్త్ర సభలో ప్రతిభ చూపించిన లక్ష్మీప్రసన్నాంజనేయశర్మకు స్వర్ణ కంకణధారణ చేశారు. అనంతరం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి అందజేసిన ప్రసాదాన్ని సీఎం స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో శాసన సభాపతి తమ్మినేని సీతారాం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డితోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు. విశాఖ ప్రజల ఘనస్వాగతం.. శారదాపీఠం వార్షికోత్సవాలకోసం విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నగర ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. సోమవారం ఉదయం 10.55 గంటలకు విశాఖ విమాన్రాశయానికి సీఎం చేరుకోగా.. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు ధర్మాన కృష్ణదాస్, వెలంపల్లి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాస్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడినుంచి శారదాపీఠానికి సీఎం బయల్దేరారు. ఈ క్రమంలో ఎన్ఏడీ జంక్షన్ నుంచి శారదాపీఠం వరకు దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర విశాఖ ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి పూలవర్షం కురిపించారు. థ్యాంక్యూ సీఎం.. థ్యాంక్యూ సీఎం.. అనే నినాదాలు చేస్తూ, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడం పట్ల తమ హర్షాతిరేకాన్ని వ్యక్తీకరించారు. ఉదయం 11.25 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 గంటల వరకు శారదాపీఠంలో గడిపిన సీఎం... మధ్యాహ్నం 2.36 గంటలకు తిరిగి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని గన్నవరానికి తిరుగుపయనమయ్యారు. తెలంగాణ గవర్నర్ హాజరు.. విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ హాజరయ్యారు. రాజశ్యామల అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శారదా పీఠానికి చేరుకుని ఉత్సవాల్లో పాల్గొన్నారు. బీజేపీ జాతీయనేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా హాజరయ్యారు. -
ప్రపంచ దేశాలు బాగుండాలని..
సాక్షి, విశాఖపట్నం: దేశ సంపద, సమగ్రతతోపాటు, ప్రభుత్వాలు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శారదాపీఠం కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని బీజేపీ ఎంఎల్సీ సోము వీర్రాజు అన్నారు. గురువారం ఆయన విశాఖ శారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలన్నీ బాగుండాలనే ఆలోచనను నిర్మించే వ్యవస్థే భారతీయత అని పేర్కొన్నారు. భారతీయ వ్యవస్థ ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తుందని తెలిపారు. దేశ ప్రజలు ఆనందంగా ఉండటానికి పీఠాలు, యజ్ఞాలు, యాగాలు దోహదపడుతాయన్నారు. ముస్తాబైన పీఠం విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు యాగాల నిర్వహణకు వీలుగా విస్తృత ఏర్పాట్లు చేశారు. కాగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలో కొలువుదీరిన పీఠం ప్రాముఖ్యం నలుదిశలా వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పర్యవేక్షణలో ఐదురోజుల పాటు ఈ వేడుకలు విశిష్ట రీతిలో జరగనున్నాయి. ఉత్సవాలకు పీఠం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. యావద్దేశం, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని సర్వతోముఖాభివృద్ధి చెందాలన్న బృహత్తర సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీనివాస చతుర్వేద హవనం ప్రత్యేకంగా నిలవనుంది. ఈ వేడుకలకు అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారు. చదవండి: విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు -
శారదాపీఠంలో వర్షికోత్సవ వేడుకలు
-
30 నుంచి విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు ఈ నెల 30 నుంచి అయిదురోజుల పాటు నిర్వహించనున్నామని ఆ పీఠ ఉత్తరాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. హైందవ ధర్మ పరిరక్షణలో విశాఖ శారదా పీఠం రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం చేస్తోందన్నారు. ఇక గురువారం ఉదయం శారదా పీఠం వేడుకలు ప్రారంభం కాగా ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. అయిదు రోజుల పాటు ఘనంగా జరగనున్న ఈ వేడుకల్లో రాజశ్యామల అమ్మవారి విశేష యాగం, టీటీడీ చతుర్వేద సంహిత యాగం, తదితర హోమాలు చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 1న విఠల్ దాస్ మహరాజ్ భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. శాస్త్ర సభల్లో అధ్యయనంతోపాటు, వాటిని పరిరక్షిస్తున్న పండితులను స్వర్ణ కంకణ ధారణతో ఘనంగా సత్కరిస్తామని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో జాతీయ శాస్త్ర సభలు, అగ్నిహోత్ర సభలు ప్రత్యేకంగా నిలుస్తాయని.. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి తెలిపారు. -
కడప చేరుకున్న స్వాత్మానందేంద్ర స్వామీజీ
సాక్షి, వైఎస్సార్: హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీ స్వాత్మానందేంద్ర స్వామీజీ శనివారం కడప జిల్లాకు చేరుకున్నారు. కడప అమ్మవారిశాలలో కన్యకాపరమేశ్వరి దేవిని దర్శించుకున్న అనంతరం శ్రీశ్రీ స్వత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ... హిందూ ధర్మ ప్రచారయాత్రా పేరుతో చేపట్టిన దేశవ్యాప్త యాత్రలో ఇప్పటికే 200 పైచిలుకు ఆలయాలను సందర్శించానని తెలిపారు. మొదటి విడత యాత్రలో భాగంగా చేపట్టిన 11 వేల కిలోమీటర్లు యాత్ర జనవరి 9న కృష్ణా జిల్లాలో పూర్తవుతుందని తెలిపారు. దక్షిణ భారత్ తరువాత ఉత్తర భారత్ యాత్ర చేపడతానని స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ పేర్కొన్నారు. యాత్రలో భాగంగా తనకు భారతీయ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. స్వాత్మానందేంద్ర స్వామీజీ మొదటి విడత యాత్రలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, పల్లెలను సందర్శించనున్నారు. -
కేసీఆర్‌ను కలిసిన దర్శకుడు శంకర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సినీ దర్శకుడు ఎన్.శంకర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా స్టూడియో నిర్మాణం నిమిత్తం హైదరాబాద్ శివార్లలోని శంకర్‌పల్లిలో 5 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. అలాగే విశాఖ శారదా పీఠానికి రెండెకరాలు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం 30 జిల్లాల్లో స్థలాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం జరిగింది. -
శారదా పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర
సాక్షి, విజయవాడ: విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీని నియమిస్తున్నట్టు పీఠాధిపతి మహాస్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అధికారిక ప్రకటన చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కృష్ణా తీరంలో గల గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో మూడు రోజులపాటు నిర్వహించిన శారదా పీఠం ఉత్తరాధికారి శిష్య తురియాశ్రమ దీక్షా మహోత్సవం సోమవారంతో పరిసమాప్తమైంది. సుమారు 10గంటలకు పైగా పలు వైదిక కార్యక్రమాలు జరిపారు. స్వాత్మానందేంద్రకు స్వామిజీ సమక్షంలో సన్యాసాంగ అష్ట్రశాద్ధ కర్మలను వేదోక్తంగా నిర్వహించారు. తొలుత రుత్వికులు వేద క్రతువును నిర్వహించారు. శారదా పీఠం వేదపండితులు కృష్ణశర్మ, కేశవ అవధాని వేదోక్తంగా క్రతువును నిర్వహించారు. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి కాషాయ వస్త్రాలు, దండకమండలాలను స్వాత్మానందేంద్రకు అందించి సన్యాసం ఇప్పించారు. అనంతరం శారదా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ సమక్షంలో బాలస్వామికి యోగపట్టా అనుగ్రహం చేశారు. ఈ సందర్భంగా మహాస్వామికి, ఉత్తరాధికారికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పండ్లు, వస్త్రాలు బహూకరించారు. మహాస్వామికి కుడివైపున ఉత్తరాధికారి ఆశీనులవగా ఎడమ వైపు రెండు కుర్చీలలో ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ కూర్చున్నారు. సహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. బాలస్వామికి స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేసిన తరువాత తన ఆసనంపై కూర్చోబెట్టి ఆయన పాదాలకు మహాస్వామి సాష్టాంగ నమస్కారం చేసి హారతి ఇచ్చారు. మహాస్వామికి స్వాత్మానందేంద్ర సరస్వతి వేదమంత్రాల మధ్య పుష్పాభిషేకం చేశారు. దేవదాయశాఖ కమిషనర్ ఎం.పద్మ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల ప్రసాదాలను మహాస్వామికి అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్‌లను మహాస్వామి సత్కరించి ప్రసాదాలు అందజేశారు. తర్క, మీమాంస, వ్యాకరణ, ఉపనిషత్తుల్లో ఉత్తరాధికారి నిష్ణాతుడు ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి మాట్లాడుతూ.. నా తొడపైనే పెరిగి, నా వద్ద చదువుకుని తర్కం, మీమాంస, వేదాంతం, ఉపనిషత్తులు, శంకరాచార్యుల వారి భాష్యాలు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత రాత్రింబవళ్లు విని, కాశ్మీర్ నుంచి లఢక్ వరకు పాదయాత్ర చేసి మంచు కురుస్తున్న వేళ కూడా తపస్సు చేసిన తపోనిధి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ అని కొనియాడారు. 2024లో శారదా పీఠం పూర్తి బాధ్యతలను స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీకి అప్పగించి తాను తపస్సులో నిమగ్నమవుతానని తెలిపారు. ఎండలు 46 డిగ్రీలతో మండిపోతున్న వేళ శారదా పీఠం ఉత్తరాధికారిని ప్రకటించే సమయంలో చినుకులు పడి చల్లటి వాతావరణం ఏర్పడటమంటే భగవంతుడి కృప పూర్తిగా ఉన్నట్టేనని పేర్కొన్నారు. తామిద్దరం అద్వైత స్వరూపులమేనని చెప్పారు. ఇద్దరు సీఎంలు 15 ఏళ్లు దిగ్విజయంగా పాలించాలి ధర్మం గెలుస్తుందని, అధర్మం ఓడిపోతుందని తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రుల గెలుపే అందుకు ఉదాహరణ అని మహాస్వామి చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలవాలని, ఈ రాష్ట్రానికి మంచి జరగాలని, హిందూ ఆలయాలు బాగుపడాలని, ధూపదీప నైవేద్యాలు బాగా జరగాలని కోరుకున్నామని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మహాభారతం రెండుసార్లు చదివిన వ్యక్తి అని పేర్కొన్నారు. రాబోయే 15 ఏళ్లు ఇద్దరు సీఎంలు వారి రాష్ట్రాలను దిగ్విజయంగా పరిపాలించాలని శారదా పీఠం తపస్సు చేస్తుందన్నారు. స్వాత్మానంద సరస్వతి స్వామీజీ అంటే వైఎస్ జగన్‌కు చాలా అభిమానమని చెప్పారు. కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ సన్యాసం తీసుకుంటున్న సమయంలో కుటుంబ సభ్యులు, తల్లి, కన్నీటి పర్యంతమయ్యారు. సన్యాసం తీసుకున్న వ్యక్తి భవబంధాలకు దూరంగా ఉండాల్సి రావటంతో వారి కన్నీటికి అంతులేకుండా పోయింది. 5వ ఏటే పీఠానికి.. శారదా పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు చేపట్టిన స్వాత్మానందేంద్ర అసలు పేరు కిరణ్‌కుమార్‌శర్మ. విశాఖ జిల్లా భీముని పట్నానికి చెందిన హనుమంతరావు, ప్రభావతమ్మ దంపతుల జ్యేష్ట సంతానంగా 1993 ఏప్రిల్ 4న ఆయన జన్మించారు. ఆయనకు కిషోర్‌కుమార్ అనే సోదరుడు ఉన్నారు. తన 5వ ఏటనే శారదా పీఠానికి వెళ్లిన కిరణ్‌కుమార్‌శర్మ నాటినుంచీ మహాస్వామి స్వరూపానందేంద్ర స్వామీజీ చెంతనే ఉన్నారు. పీఠంలోనే పెరిగారు. మహాస్వామికి ఆంతరంగిక శిష్యునిగా కొనసాగారు. దూరవిద్య విధానంలో డిగ్రీ పూర్తి చేశారు. తర్కం, మీమాంస, వేదాంతం, ఉపనిషత్తులు, శంకరాచార్యుల వారి భాష్యాలు, బ్రహ్మసూత్రాలును ఔపోసన పట్టారు. లోక కళ్యాణమే ధ్యేయం స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ లోక కళ్యాణమే ధ్యేయంగా శ్రీ శారదా పీఠం పనిచేస్తోందని అనుగ్రహ భాషణంలో పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పండితులు, స్వామీజీలను సత్కరించారు. శ్రీశారదా పీఠం అభివృద్ధికి కృషి చేసిన సుబ్బిరామిరెడ్డిని స్వామీజీ సత్కరించారు.