సాక్షి, విశాఖపట్నం: విశాఖ శ్రీ శారదాపీఠం యావద్ భారతదేశానిదని.. గిరిజన భక్తులను తిరుమల తీసుకెళ్లటం ఆనందంగా ఉందని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు సోమవారం ఆయన ధర్మ ప్రచార యాత్రను ప్రారంభించారు. చిన్నముసిడివాడ శారదా పీఠం నుంచి 25 బస్సుల్లో గిరిజన భక్తులు తిరుమలకు బయలుదేరారు. సింహాచలంలో భక్తుల తొలిపూజ అనంతరం తిరుమల యాత్ర ప్రారంభమయ్యింది.
ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ, హిందూమత ప్రచారాన్ని ఉద్యమ రూపంలో శారదాపీఠం తీసుకెళ్తోందని.. స్వాత్మానందేంద్ర సరస్వతి త్వరలో భారతదేశ యాత్ర ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. దేవాదాయ భూముల పరిరక్షణలో శారదాపీఠం ముందుంటుందని పేర్కొన్నారు. ఏటా దళిత గిరిజనులను తిరుమల యాత్రకు తీసుకెళ్లి అందరికీ దేవుని అనుగ్రహాన్ని శారదాపీఠం కల్పిస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర పీఠాధిపతి పర్యటన పూర్తైందని ఆయన వెల్లడించారు. శారదాపీఠం కేవలం తెలుగు రాష్ట్రాల పరిధి కాదని.. యావత్ ప్రపంచంలో హిందూమత పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు. 30 ఏళ్లుగా హైందవ ధర్మం కోసం విశాఖ శారదాపీఠం పోరాడుతోందని స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు.
చదవండి:
బీజేపీ - జనసేన పొత్తుపై మరోసారి సందిగ్ధం..
తీరనున్న కృష్ణలంక వాసుల వరద కష్టాలు
Comments
Please login to add a commentAdd a comment