Tribal
-
Mega Jhumur: ప్రధాని మోదీ గెస్ట్‌గా మెగా ఝుమైర్
ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సోమవారం అస్సాం అతిపెద్ద ఝుమైర్ నృత్య కార్యక్రమం జరగనుంది. ఇందులో ఎనిమిదివేల మందికి పైగా పాల్గొంటారు. అంతేగాదు ఈ నృత్య ప్రదర్శనను విదేశాంగ మంత్రి జైశంకర్ నేతృత్వంలో సుమారు 60 మందికి పైగా విదేశీ దౌత్యవేత్తలు వీక్షించనున్నారు. అలాగే ప్రజలందరూ వీక్షించేలా దాదాపు 800 టీ ఎస్టేట్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇంతకీ అసలేంటీ నృత్యం..? దాని ప్రాముఖ్యత తదితరాల గురించి తెలుసుకుందాం. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఝుమైర్ ప్రాముఖ్యత గురించి పలుమార్లు పునరుద్ఘాటించారు. ఇది అస్సామీ సంస్కృతిలో అంతర్భాగం, టీ తెగ కమ్యూనిటీ భావాలను ప్రతిబింబిస్తోంది. ముఖ్యమంత్రి బిస్వా ఢిల్లీలో రాబోయే ప్రదర్శనల ప్రణాళికలను ప్రకటిస్తూ..అంతర్జాతీయ వేదికపై కూడా ఈ నృత్యం ప్రదర్శించాలనే తన ఆశయాన్ని వ్యక్తం చేశారు. ఇంతలా అస్సాం గిరిజనులతో లోతుగా పాతుకు పోయిన ఝుమైర్ నృత్యం అంటే ఏంటంటే.. ఝుమైర్ నృత్యం అంటే.. ఝుమోయిర్ అనేది అస్సాంలోని టీ తెగ సంఘం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల గిరిజనులు ప్రదర్శించే సంప్రదాయ జానపద నృత్యం. ఇది టీ తోట కార్మికుల రోజువారీ జీవితాలలో లోతుగా పాతుకుపోయింది. తరచుగా పండుగలు, పంటకోత వేడుకలు, సామాజిక సమావేశాల సమయంలో ప్రదర్శిస్తారు. చూడటానికి ముగ్ధమనోహరంగా డప్పుల దరువులకు అనుగుణంగా లయబద్ధమైన కదలికలతో కూడిన ఝుమైర్ నృత్యం ఇది. సంప్రదాయ మడోల్(డ్రమ్) లయబద్ధమైన దరువులు నడుమ టీతోటల శ్రమైక జీవుల కథలను శ్రావ్యమైన జానపద పాటలతో చెబుతారు. ఈ నృత్యాన్ని సమూహాలుగా చేస్తారు. ఒకరి నడుములు ఒకరు పట్టుకుని లయబద్ధమైన చప్పట్లు, డ్రమ్ లయలకు అణుగుణంగా పాదాలు కదుపుతారు. ఈ సాంస్కృతిక దృశ్య రూప నృత్యం టీ తోటల కార్మికుల ఐక్యత, సాముహిక స్ఫూర్తిని తెలియజేస్తుంది. అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ నృత్యాన్ని ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో ప్రధాన మోదీ సమక్షంలో ప్రదర్శించనున్నారు. అంతేగాదు ఈ ప్రతిష్టాత్మక కళారూపానికి జాతీయ, ప్రపంచ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది అస్సాం రాష్ట్రం. అస్సాం గతంలో 2023లో ఇదే వేదికపై సుమారు 12 వేల మందికి పైగా నృత్యకారులతో రికార్డు స్థాయి బిహు నృత్య ప్రదర్శన ఇచ్చి చరిత్ర సృష్టించింది. మళ్లీ ఈసారి కూడా ఆ స్థాయిలో శాశ్వత ముద్రను వేసే దిశగా అగుడులు వేస్తున్నారు అస్సాం ప్రదర్శనకారులు.(చదవండి: నో ఛాన్స్ మోడల్ కాలేవంటూ తిరస్కారాలు..కానీ అతడే ఇవాళ..) -
రెక్కల రామక్క జాతర
ఆదివాసీ సమాజంలో ఇలవేల్పు జాతరలు అత్యంత ప్రధానమైనవి. ప్రతి ఏడాదీ మాఘ పున్నమి తరువాత తమ తమ కులదేవతలకు జాతరలను జరపడం ఆదివాసీల ఆచారం. ప్రతి తెగలో వంశాలు, ఇంటిపేర్లు బట్టి కులదేవతలు ఉంటారు. కోయ తెగవారిలో ఉన్న వంశాలను ‘గొట్లు’గా పిలుస్తారు. బేరంబోయిన వంశానికి చెందిన వారిది ఈ గొట్లలో ఒకటి. ఈ వంశానికి చెందిన కొమరం ఇంటి పేరు ఉన్న వారి ఇల వేల్పు ‘రెక్కల రామక్క.’ వీరు రెండేళ్లకొక మారు ఆమెకు జాతర జరపడం తరతరాలుగా వస్తోంది. భద్రాది–కొత్త గూడెం జిల్లా, ఆళ్లపల్లి మండలం, నడిమి గూడెంలో ఈ జాతర జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుండి 21 వరకు జాతర జరుగుతోంది. ప్రచారంలో ఉన్న కథ ప్రకారం–బేరంబోయిన రాజు కోయల్లో గొట్టు – గోత్రాల వ్యవస్థ ఏర్పాటు చేశారని నమ్ముతారు. ఈ రాజునే కార్తీక రాజు అంటారు. ఆయన భార్య మూడవ గట్టుకు చెందిన కాకేరి పూజారి గోత్రం అడ బిడ్డ వరందేవి. ఈమెనే ఆదిశక్తిగా కూడా పిలుస్తారు. రెక్కల రామక్క(పక్షి) రూపంలో బేరంబోయినవారు ఈమెను కొలుస్తున్నారు. జాతర సందర్భంగా ఈమెకు బోనం సమర్పిస్తారు. అలాగే ఈ దేవతకు (వంశానికి) సంబంధించిన ‘పడిగ’ జాతరలో ప్రత్యేక ఆకర్షణ. పడిగపై చిత్రలిపి ఉంటుంది. పడిగ అంటే కోయ తూర్ సమాజంలో ‘ఇంటికి పెద్ద కొడుకు’ అని అర్థం. అంటే కుటుంబాన్ని రక్షించేవాడు. మధ్య భారతంలోని కోయతూర్ సమాజం పడిగలను అతి పవిత్రంగా పూజిస్తూ వేల్పుగా కొలుస్తారు. ఈ పడిగ త్రిభుజ ఆకారంలో ఉండే ఎర్రని గుడ్డ. దీనిపై బొమ్మలు ఉంటాయి. జాతరకు వచ్చే వంశస్థులు తమ పడిగను తీసుకు వస్తారు. అక్కడ ‘డోలి’వారు వారిని కూర్చోబెట్టి పడిగలోని చిత్రలిపిని చూపి రేల పాటలతో ఆ వంశ చరిత్రను మొత్తం చెబుతారు. జాతర్లలలో పడిగలకు పసుపు, కుంకుమలు రాసి, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తారు. జాతర అయిపోయినాక ఈ పడిగలను తీసుకెళ్ళె అతి పవిత్రంగా దాచి... మరలా రెండేళ్ళకు జాతర నాడు మాత్రమే పూజలు చేసి బయటకు తీసి ఆడిస్తారు.– వూకె రామకృష్ణ దొర, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్(ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు రెక్కల రామక్క జాతర) -
‘ఆది వాణి’ ఏఐతో భాష పదిలం
దేశవ్యాప్తంగా గిరిజన తెగల భాషా వారసత్వాన్ని పెంపొందించడానికి, దాన్ని పరిరక్షించడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. భాషాపరమైన అంతరాన్ని పూడ్చే ప్రయత్నంలో భాగంగా భిలి, ముండారి, సంతాలి, గోండితో సహా అనేక దేశీయ గిరిజన భాషల్లో అనువాదం, అభ్యాసం కోసం కృత్రిమ మేధ ఆధారిత అప్లికేషన్ ‘ఆది వాణి’(Aadi Vaani)ని కేంద్రం ఆవిష్కరించనుంది.సాంకేతికతతో సాధికారతఆది వాణిని అభివృద్ధి చేయడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వంటి ప్రముఖ సంస్థల సాయం తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గిరిజన భాషల్లో ప్రత్యేకత కలిగిన భాషావేత్తలు, పరిశోధకుల సహకారం కోరినట్లు చెప్పాయి. అనువాదం, విద్యా ప్రయోజనాల కోసం ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడేలా ఈ యాప్‌ను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గిరిజన విద్యార్థులు వారి మాతృభాషలో చదువు నేర్చుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుందని చెప్పారు. అదే సమయంలో అంతరించిపోతున్న కొన్ని అరుదైన భాషలను కాపాడుకునేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.భాష పరిరక్షణకు..భారతదేశంలో 700కి పైగా విభిన్న గిరిజన సమాజాలున్నాయి. ప్రతి ఒక్కటి దాని సొంత ప్రత్యేకమైన భాష, మాండలికాలు, సంప్రదాయాలను కలిగి ఉంది. కారణాలు ఏవైనా ఈ భాషల్లో అనేకం అంతరించిపోతున్నాయి. కొన్ని తెగలు వారి భాషా గుర్తింపునే కోల్పోతున్నాయి. ఆది వాణితో ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భాషలను పరిరక్షించడమే కాకుండా దైనందిన జీవితంలో దీన్ని చురుగ్గా ఉపయోగించే వాతావరణాన్ని సృష్టించాలని కేంద్రం భావిస్తోంది.ఇదీ చదవండి: రోజూ 2 జీబీ డేటాతో బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్విద్యార్థులకు ఎంతో మేలు..ఆది వాణి యాప్‌లో గిరిజన భాషా అనువాదాలను అందించనున్నారు. దీని ద్వారా విద్యార్థులు ఏ భాషలో కంటెంట్ ఇచ్చినా అది తాము కోరుకున్న గిరిజన భాషలోకి మారుతుంది. తమ మాతృభాషలో పాఠ్యపుస్తకాలు, ఆడియో, విజువల్ కంటెంట్ పాఠాలను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ప్రయత్నం వల్ల విద్యార్థులకు కష్టంగా ఉండే గణితం, సైన్స్, చరిత్ర వంటి సబ్జెక్టులను అర్థం చేసుకోవడానికి, అందులో రాణించడానికి వీలవుతుంది. దాంతోపాటు ఈ యాప్ ఉపాధ్యాయులకు విలువైన వనరుగా ఉంటుందని, భాషా అవసరాలను అర్థం చేసుకోవడానికి, తదనుగుణంగా బోధనా పద్ధతులను మార్చుకోవడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. సాంస్కృతిక, భాషా నేపథ్యాలతో సంబంధం లేకుండా పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించాలన్న కేంద్రం విస్తృత లక్ష్యానికి ఇది తోడ్పడుతుంది. -
కేంద్ర మంత్రి సురేష్ గోపి వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీ : కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను అగ్రవర్ణాల నేతలే నిర్వహించాలి. ఒక బ్రాహ్మణుడు లేదా ఇతర అగ్రవర్ణాల నాయకులు బాధ్యతలు స్వీకరిస్తే గణనీయమైన మార్పు ఉంటుందని వ్యాఖ్యానించారు. దీంతో సురేష్ గోపి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే గిరిజన వ్యవహారాల మంత్రిని చేయడం మన దేశానికి శాపమని అర్ధం వచ్చేలా వ్యాఖ్యానించారంటూ పలు జాతీయ మీడియాలో కథనాలు వెలుగులోకి వచ్చాయి. వారి సంక్షేమం కోసం గిరిజన వర్గానికి చెందిన వ్యక్తి కాకుండా అగ్రవర్ణాలకు చెందిన నేతలకు కేటాయించాలనే నా కల, నిరీక్షణ. అదేవిధంగా, గిరిజన నాయకుల సంక్షేమం కోసం పోర్ట్‌ఫోలియో ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తం చేశారని కథనాలు హైలెట్ చేశాయి. ఢిల్లీలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో సురేష్ గోపి మాట్లాడుతూ అగ్రవర్ణాల నాయకులకు పోర్ట్‌ఫోలియో బాధ్యతలు అప్పగిస్తేనే గిరిజన సంక్షేమంలో నిజమైన పురోగతి సాధ్యమవుతుంది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను నాకు అప్పగిస్తే బాధ్యతలు చేపట్టేందుకు నేను సిద్ధం. ఇప్పటికే తనకు ఆ మంత్రివర్గం కేటాయించాలని ప్రధాని మోదీని అభ్యర్థించానని, అయితే పోర్ట్‌ఫోలియో కేటాయింపుల్లో సాధ్యం కాలేదన్నారు. సురేష్ గోపి చేసిన వ్యాఖ్యలపై కేరళలో తీవ్ర దుమారం రేపాయి. సీపీఐ రాష్ట్రకార్యదర్శి బినోయ్ విశ్వం.. సురేష్ గోపి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అతన్ని మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బినోయ్ విశ్వంతో పాటు ఇతర గిరిజన వర్గానికి చెందిన నేతలు సురేష్ గోపి వ్యాఖ్యల్ని తప్పుబడుతున్నారు. కాగా, ప్రస్తుతం, ఒడిశాకు చెందిన గిరిజన సామాజిక వర్గానికి చెందిన, ప్రముఖ బీజేపీ నేత జుయల్ ఓరం కేంద్ర మంత్రివర్గంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నాయకత్వం వహిస్తున్నారు. -
మూడు రోజుల గిరిజన జాతరకు సర్వం సిద్ధం
సాక్షి, పాడేరు: ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన అరకు లోయ శుక్రవారం నుంచి జరగబోయే చలి జాతరకు ముస్తాబైంది. గిరిజన ఆచార, సంప్రదాయాలకు చలి ఉత్సవాలు అద్దం పట్టనున్నాయి. అరకు లోయలోని డిగ్రీ కళాశాల వేదికగా అరకు చలి ఉత్సవాన్ని మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. సందర్శకులను ఆకట్టుకునేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. హాట్ బెలూన్, పారాగ్లైడ్, హెలికాప్టర్ వంటి వాటిని ప్రైవేట్ సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి. వీటిలో పర్యాటకులు, స్థానికులు విహరించేలా ఏర్పాట్లు చేశారు. 10 రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారుల నృత్యాలు, సంప్రదాయ డప్పు వాయిద్యాలు హోరెత్తనున్నాయి. ఈ నెల శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ఉత్సవాలు ప్రారంభమై ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముగిసేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. అరకు మారథాన్, పద్మాపురం గార్డెన్లో ఫ్లవర్ షో, గిరిజన వంటకాల ఫుడ్ కోర్టు, పలు రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, కాఫీ రుచులు, ఫ్యాషన్ షో, సినీ కళాకారులతో కామెడీ స్కిట్స్, సుంకరమెట్ట కాఫీ తోటల్లో అరకు ట్రెక్కింగ్, హెలికాప్టర్ రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు లోయలో ఇటువంటి ఉత్సవాలను తిలకించడం లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటుంటారు పర్యాటకులు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేసిందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
ఎఫ్–టామ్ ఆధ్వర్యంలో గిరిజన పిల్లల దీపావళి
ముంబై: ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా ఎఫ్–టామ్ ఆధ్వర్యంలో గ్రామీణ, గిరిజన పిల్లలతో దీపావళి పండుగ స్నాక్స్, గిఫ్ట్స్ టపాకాయలతో ఘనంగా జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర అధ్యక్షుడు గంజి జగన్‌బాబు ఆధ్వర్యంలో బృందావనం ఫారమ్స్, ఖోపోలిలో ఈ వేడుకలను నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామ పంచాయతీ, గిరిజన ప్రాంతాల పేద విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్నారు. వారికి ఆటలు, పర్యావరణం, మంచి అలవాట్ల గురించి పూజ పలు సూచనలిచ్చారు. కార్యక్రమానికి విఠల్, రమాకాంత్, ప్రశాంత్, గణేశ్, దిలీప్, అర్చన తదితరులు సేవలందించారు. కపిల్ పాటిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ భివండీ: కపిల్ పాటిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీపావళి పండుగ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కల్యాణ్‌లోని సాయి చౌక్ వద్ద నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బీజేపీ మాజీ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ నేతృత్వంలో నవంబర్ 2వ తేదీన ఉదయం 5 గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని నిర్వాహకులు తెలిపారు. హిందీ–మరాఠీ చలనచిత్ర గీతాలు, ప్రసిద్ధి గాంచిన వెండితెర, బుల్లి తెర కళాకారులు హాస్యనటుల ప్రదర్శనలు, భారతీయ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ముఖ్యంగా బంజారా బృందం, బెల్లీ డ్యాన్స్, భరతనాట్యం తదితర నృత్యాల ప్రదర్శనలు కొనసాగుతాయని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇండియన్ ఐడల్ విన్నర్, బిగ్‌బాస్ ఫేమ్ సింగర్ అభిజిత్ సావంత్, ప్రజక్తా శుక్రే, భూమి త్రివేది, జూలీ జోగ్లేకర్‌తో పాటు పాతిక మంది కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకలను అలరించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. . -
బొమ్మలు చెప్పే చరిత్ర..!
భావాన్ని వ్యక్తపరచడానికి భాషే అవసరం లేదు, సంజ్ఞ చాలు! కళలో ప్రావీణ్యం ఉంటే గనుక అదొక అద్భుతమే! ఆ అద్భుతం పార్వతీపురం మన్యం జిల్లా, సీతంపేట గిరిజనుల సొంతం! ఆదిమానవుడు తన బతుకు చిత్రాన్ని బొమ్మలతోనే చూపించాడు. అదే భావితరాలకు చరిత్రగా నిలిచింది. ఆ కళ నేటికీ ఉనికిలో ఉంది..ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతంలో! పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిధిలోని సవర తెగకు చెందిన గిరిజనులు తమ జీవన విధానాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను గీతల బొమ్మలతోనే అభివర్ణిస్తారు. అదే సవర చిత్రకళ! ప్రకృతిని దైవంగా కొలిచే గిరిజనులు అటవీ ఉత్పత్తుల దగ్గర్నుంచి పంట చేతికందే వరకు ప్రతిదశనూ పండుగలా జరుపుకుంటారు. ఆ క్రమంలో టెంక పండుగ, విత్తనాల పండుగ, పుష్పి పండుగ, గాటి వారాలు, పులి పండుగ, ఆగం పండుగ, అమ్మవారి పండుగ, సంబరాలు (ఇంటి పండుగ), కొత్త అమావాస్య, గొడ్డాలమ్మ (కంది పండుగ), కొర్ర కొత్త పండుగ, కొండెం కొత్త పండుగ, ఉజ్జీడమ్మ తల్లి పండుగ వంటి పర్వదినాల్లో ఇళ్లు, ముంగిళ్లు, చెట్లు, తోటలు, ఆలయాలను సవర చిత్రకళతో అద్భుతంగా అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ చిత్రాలకు ఉపయోగించే ప్రతీది సహజసిద్ధమైందే. వరి, బొగ్గు, మట్టి, ఇటుక బెడ్డ రాయి, పసుపు, చెట్టు బెరడును ఉపయోగించి బొమ్మలు వేస్తారు. ఈ చిత్రకళ సుమారు మూడువేల ఏళ్ల కిందటిది. మధ్యప్రదేశ్‌లోని భీమ్ భేట్కా గుహల్లో గుర్తించిన ఆదీవాసీ చిత్రాలను ఈ కళకు తొలి ఉదాహరణలుగా చెబుతున్నారు పురాతత్వ శాస్త్రవేత్తలు. భాష లేని ఆ కాలంలో భావాలను వ్యక్తపరచడానికి ఆనాటి మానవుడు తనలోని సృజనకు పదునుపెట్టి ఆ చిత్రాలను గీసినట్టు తేల్చారు. సవర చిత్రకళను కాపాడుకోవడానికి ఉత్సాహవంతులకు శిక్షణనూ అందిస్తున్నారు.కార్డులను అందజేస్తున్నాం..ఈ కళను సవర తెగకు చెందిన గిరిజనులు కాలానుగుణంగా అభివృద్ధిచేస్తూ బతికిస్తున్నారు. దాదాపు 500 మంది కళాకారులకు ఇదే జీవనోపాధి. రెండేళ్లుగా నేను, గౌరీశ్ మాష్టారు గిరిజన ప్రాంతాలన్నీ తిరుగుతూ సవర చిత్రకళాకారులను గుర్తిస్తూ, వారికి లేపాక్షి అధికారుల సాయంతో హస్తకళ(డీసీహెచ్) కార్డులను అందజేస్తున్నాం.బేతాళ అనిల్‌కుమార్, హస్తకళల రిసోర్స్‌పర్సన్, పాలకొండవస్తువుల మీదా బొమ్మలు..మా నాన్నకు సవర చిత్రకళలో మంచి నైపుణ్యం ఉంది. ఆయన మా ఇంటి గోడలపై బొమ్మలు వేస్తుండటం చూసి నాకూ దానిపట్ల ఆసక్తి పెరిగింది. సవర ఆదివాసీ డ్రాయింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నాను. గోడలు, కాగితాల మీదే కాదు వస్తువుల మీదా బొమ్మలు వేస్తాను. లేపాక్షి ద్వారా మాలాంటి యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం జరగాలి.గేదెల శంకర్, సవర చిత్రకళాకారుడుఅదొక వరం కేవలం గీతలతోనే సందర్భానికి తగిన సన్నివేశాన్ని గీయడం గొప్ప నైపుణ్యం. ఆదొక వరం. డిగ్రీ చదివిన నాకు సరైన ఉద్యోగం లేకపోడంతో చిన్నప్పటి నుంచీ నేర్చుకున్న ఈ కళే కొంతవరకు ఉపాధినిస్తోంది.సవర నరేష్, జగత్పల్లి గ్రామం, సీతంపేటం మండల యిర్రింకి ఉమామహేశ్వరరావు, సాక్షి, అమరావతి(చదవండి: పొడవాటి రోడ్డు సొరంగంగా రికార్డు..) -
బాలికలపై ప్రిన్సిపాల్ కర్కశత్వం 44 మందికి అస్వస్థత..
-
AP: గిరిజనుడికి చిక్కిన కోటి రూపాయల కీటకం!
సాక్షి,అనకాపల్లిజిల్లా: ఆంధ్రప్రదేశ్‌లోని మాడుగుల నియోజకవర్గం కోనాంలో కోటి రూపాలయ కీటకం ప్రత్యక్షమైంది. అడవికి వెళ్లిన గిరిజనుడికి వింత కీటకం కనిపించడంతో దానిని ఆకులో చుట్టి ఇంటికి తీసుకువచ్చాడు. నిజానికి ఆ కీటకం పేరు స్టాగ్బీటిల్. వింత ఆకారంలో ఉండటంతో ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రపంచంలో అత్యంత అరుదైన కీటకంగా స్టాగ్బీటిల్కు గుర్తింపు ఉంది. ఔషధ తయారీలో ఈ కీటకాన్ని వాడతారని తెలుస్తోంది. కీటకం విలువ మార్కెట్లో కోటి రూపాయలకుపైగా ఉంటుందని ప్రచారం. అయితే ఆ గిరిజనుడికి ప్రస్తుతం కీటకాన్ని ఏం చేయాలో తెలియక ఇంటివద్దే ఉంచుకున్నాడు. అడవిలో తిరిగే కీటకానికి ఏం తిండి పెట్టాలో తెలియక దాని ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. -
ఆదివాసీ గూడేల అభివృద్ధే నిజమైన అభివృద్ధి : మంత్రి సీతక్క
బంజారాహిల్స్: దేశంలోని మారుమూల ప్రాంతాలు, ఆదివాసీ గూడేల అభివృద్ధే నిజ మైన అభివృద్ధి అని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, రాజనీతిశాస్త్ర విభాగం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ‘ఆదివాసీ జీవనోపాధి పద్ధ తులు: సాధికారత సాధనలో సమస్యలు– వ్యూహాలు’అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును మంత్రి ధనసరి సీతక్క హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఆదివాసీ బిడ్డగా ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉం దన్నారు. గత కొన్నేళ్లుగా ఆత్మగౌరవం కోసం ఆదివాసీ పోరాటాలు ఇపμటికీ కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ అభివృద్ధి నమూనాలోనైనా వెనుకంజలో ఆదివాసీలు: హరగోపాల్ఏ అభివృద్ధి నమూనాలోనైనా ఆదివాసీలు వెనుకంజలోనే ఉన్నారని ప్రొఫెసర్ హర సదస్సులో మంత్రి సీతక్క,ప్రొఫెసర్ హరగోపాలæ తదితరులు గోపాల్ పేర్కొన్నారు. ప్రభుత్వాలు, ఆదివా సీల ప్రయోజనాల మధ్య ఎప్పుడూ వైరు ధ్యముంటుందని, ఇక్కడ నష్టపోయేది గిరిజ నులేనని ఆయన వివరించారు. కార్యక్రమం లో విశ్వవిద్యాలయ రిజి స్ట్రార్ సుధారాణి, అకడమిక్ డైరెక్టర్ పుషμచక్రపాణి, సదస్సు డైరెక్టర్ గుంటి రవీందర్, సామాజిక శాస్త్రం విభాగాధిపతి వడ్డా ణం శ్రీనివాస్, కో–డైరెక్టర్ లక్ష్మి పాల్గొన్నారు. -
ట్రైబల్ కథల్
ఒక సింహాసనం కోసం రెండు తెగలు పోటీ పడతాయి... సముద్ర తీరంలో ఉండే ఆదివాసీల కోసం ఓ వ్యక్తి పోరాటం చేస్తాడు... తమ హక్కుల కోసం పోరాటం చేస్తాడు ఓ గిరిజన తెగ నాయకుడు... ఓ తెగకు చెందిన వ్యక్తి శివభక్తుడిగా మారతాడు... సినిమా పాయింట్ ఏదైనా ఈ సినిమాలన్నింటిలోనూ కామన్ పాయింట్ ‘ట్రైబల్’ నేటివిటీ. ఇలా ట్రైబల్ కథల్తో రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.⇒ ‘కాన్సార్ ఎరుపెక్కాలా...’ అంటూ ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రంలో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్‌కి అటు అభిమానులు ఇటు ప్రేక్షకుల కేకలు, అరుపులతో థియేటర్లు దద్దరిల్లాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్’. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా మొదటి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ గత ఏడాది విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాన్సార్ సింహాసనం కోసం శౌర్యాంగ, ఘనియార్ తెగలు పోటీపడటం, వారికి దక్కకుండా తన సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం మన్నార్ తెగకు చెందిన రాజ మన్నార్ చేసే ప్రయత్నం... ఈ మూడు తెగలు ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు రచించడం మొదటి భాగంలో చూశాం. చివరికి ఏ తెగవారు కాన్సార్ సింహాసనం చేజిక్కించుకున్నారనేది తెలియాలంటే మలి భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’ విడుదల వరకూ ఆగాల్సిందే. ఇంకా సెకండ్ పార్ట్ షూటింగ్ ఆరంభం కాలేదు. ⇒ ‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ‘దేవర’ కోసం ఎన్టీఆర్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ సినిమా బ్యాక్‌డ్రాప్ ఏంటో చెప్పింది. ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. భారతదేశంలో విస్మరణకు గురైన సముద్ర తీర ్రపాంతాలకు చెందిన ఆదివాసీల కోసం దేవర చేసే పోరాటమే ఈ సినిమా అని సమాచారం. ఈ చిత్రం మొదటి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ⇒ ‘చావుని ఎదిరించే వాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం’ అంటూ ‘తంగలాన్’ మూవీ ట్రైలర్లో హీరో విక్రమ్ చెప్పిన డైలాగ్ పవర్‌ఫుల్‌గా ఉంది. పా. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాలతో ఈ చిత్రం రూపొందింది. బంగారు గనుల తవ్వకాన్ని వ్యతిరేకించే గిరిజన తెగ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఆ తెగ నాయకుడి పాత్రలో విక్రమ్ నటించారట. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ⇒ సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘కంగువ’. శివ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాలో సూర్య ఆటవిక జాతికి చెందిన ఓ తెగ నాయకుడిగా నటించారు. ఓ దట్టమైన అడవిలో రెండు ఆటవిక జాతుల మధ్య పోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు గ్లింప్స్ చూస్తే అర్థం అవుతుంది. అలాగే ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఓ గిరిజన యోధుడైన కంగువ 1678 నుంచి ప్రస్తుత కాలానికి వస్తాడు. ఓ మహిళా సైంటిస్ట్ సాయంతో తన మిషన్‌ని పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్ ఏంటి? ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైమ్ ట్రావెల్ ఎలా చేశాడు? అనే నేపథ్యంలో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలతో ఈ సినిమా కథ సాగుతుందని టాక్. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. ⇒ మంచు విష్ణు నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాలో ఓ తెగకు చెందిన తిన్నడు (ఆ తర్వాత శివ భక్తుడు కన్నప్పగా మారారు) పాత్ర చేస్తున్నారు మంచు విష్ణు. ఈ చిత్రంలో తిన్నడు వాడిన విల్లు విశిష్టత గురించి ఇటీవల మేకర్స్ తెలిపారు. తన బిడ్డ తిన్నడు ధైర్యసాహసాలకు ముగ్దుడైన నాద నాథుడు ప్రత్యేకమైన విల్లును తయారు చేస్తాడు. ఆ విల్లును ఉపయోగిస్తూ తన తెగను, అడవిలో సమతుల్యతను తిన్నడు ఎలా కాపాడాడు? అనే నేపథ్యంలో సాగే సీన్స్ ఆసక్తిగా ఉంటాయట. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుందట. -
అటవీ అధికారులపై గిరిజనుల దాడి
-
జ్యోతి ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు
-
పాడేరు మెడికల్ కాలేజీ.. సిద్ధం
గిరిజనుల జీవన ప్రమాణాలు పూర్తిస్థాయిలో పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. పాడేరులో నిర్మిస్తున్న వైద్య కళాశాల పనులు ఓ వైపు వేగంగా పూర్తి చేస్తుండడంతో పాటు, ఆ స్థాయి వైద్య సేవలను ముందుగానే అందుబాటులోకి తెస్తోంది. సాక్షి,పాడేరు: గిరిజనులకు ఉన్నత వైద్యసేవలు కల్పించడం లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన పాడేరులో మెడికల్ కళాశాలను నిర్మిస్తామని హమీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే రూ.500కోట్లతో పాడేరులో మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ప్రస్తుతం 35ఎకరాల విస్తీర్ణంలో తలారిసింగి పాలి టెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మెడికల్ కళాశాల,సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి,నర్సింగ్ కళాశాల భవన నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. ఈఏడాదిలో మొత్తం అన్ని భవనాలను పూర్తి చేసే లక్ష్యంతో ఎన్సీసీ నిర్మాణ సంస్థ చురుగ్గా పనులు నిర్వహిస్తోంది. జిల్లా జనరల్ ఆస్పత్రిగా పేరుమార్పు వైద్య విధాన పరిషత్‌లో ఇంతవరకు పనిచేసిన పాడేరు జిల్లా ఆస్పత్రిని ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో ఇటీవల విలీనం చేసి జిల్లా జనరల్ ఆస్పత్రిగా పేరు మార్చారు. మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు ఇంకా గడువు ఉండడంతో ముందస్తుగానే పాడేరు జిల్లా జనరల్ ఆస్ప త్రిలో 420 బెడ్లలో రోగులకు 24గంటల పాటు ఉన్నత వైద్యసేవలకుచర్యలు చేపట్టింది. పాడేరు జిల్లా ఆస్పత్రిలో అదనపు అంతస్తును యుద్ధప్రాతిపదికన ఇటీవల పూర్తి చేసి, అన్ని సదుపాయాలతో పడకలను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో 50 ప్రత్యేకంగా గర్భిణులకు, మరో 50 మాతా శిశువుల ఆరోగ్యసేవలకు, 50 పడకలు రక్తహీనత సమస్య ఉన్న మహిళా రోగులకు కేటాయించనున్నారు. జాతీయ వైద్యమండలి పరిశీలనకు ఏర్పాట్లు జిల్లా జనరల్ ఆస్పత్రిలో అందుబాటులోకి తెచ్చిన 420 బెడ్లు,ఇతర సౌకర్యాలు,వైద్య నిపుణులు,అందించే సేవలను సమగ్రంగా పరిశీలించేందుకు జాతీయ వైద్య మండలి పర్యటించనుంది. ఈ మండలి పరిశీలన తరువాత మెడికల్ కళాశాలకు అనుబంధంగా జిల్లా జనరల్ ఆస్పత్రి సేవలు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి. 256 పోస్టుల భర్తీకి చర్యలు మెడికల్ కళాశాల,అనుబంధ జిల్లా జనరల్ ఆస్పత్రులకు సంబంధించి వివిధ విభాగాల్లో 706 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముందుగా 256 పోస్టుల భర్తీని కలెక్టర్ అధ్యక్షతన కమిటీ వేగవంతం చేసింది. మిగిలిన వైద్యులు,నర్సింగ్,ఇతర విభాగాల పోస్టులకు వైద్య ఆరోగ్యశాఖ త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. విధుల్లో వైద్య నిపుణులు పాడేరు మెడికల్ కళాశాల,అనుబంధ జిల్లా జనరల్ ఆస్పత్రి ద్వారా జిల్లా ప్రజలకు నిరంతర ఉన్నత వైద్యసేవలు అందించే లక్ష్యంతో ముందస్తుగానే ప్రభుత్వం వైద్యులను నియమించింది. పాడేరు మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్‌తో పాటు నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫె సర్లు, 17మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. రోగులకు ఉన్నత వైద్యసేవలు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాల,అనుబంధ జిల్లా జనరల్ ఆస్పత్రి ద్వారా ఉన్నత వైద్యసేవలు అందించే లక్ష్యంతో చర్యలు తీసుకుంటోంది. భవనాల నిర్మాణాలతో సంబంధం లేకుండా 420 పడకలతో జిల్లా జనరల్ ఆస్పత్రిలో అన్ని వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చాం. అన్ని విభాగాల వైద్యపోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. – డాక్టర్ డి.హేమలతాదేవి, ప్రిన్సిపాల్,పాడేరు మెడికల్ కళాశాల -
కాంగ్రెస్ దళిత, గిరిజన వ్యతిరేక పార్టీ
సిద్ధి/సూరజ్‌పూర్: విపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ దళిత, గిరిజన వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. నూతన ముఖ్య సమాచార కమిషనర్(సీఐసీ)గా హీరాలాల్ సమారియా ఎంపిక కోసం నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ హాజరు కాలేదని ఆక్షేపించారు. ఆయన దళితుడు కావడమే ఇందుకు కారణమని అన్నారు. సీఐసీగా నియమితుడైన తొలి దళితుడు హీరాలాల్‌ను కాంగ్రెస్ నేతలు నిత్యం దూషిస్తున్నారని మోదీ విమర్శించారు. దేశంలో మొట్టమొదట గిరిజన మహిళా రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము అభ్యర్థీత్వాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తుచేశారు. ఆ పార్టీ మైండ్‌సెట్‌ను దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో, ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. తనను రోజంతా తిట్టడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. కానీ, వారు ఓబీసీ వర్గాలను తిడుతున్నారని చెప్పారు. ప్రధాని మోదీ ఓబీసీ వర్గానికి చెందిన నాయకుడన్న సంగతి తెలిసిందే. దళితులు, గిరిజనులు, ఓబీసీల సంక్షేమం కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తోందని మోదీ ఉద్ఘాటించారు. ఆయా వర్గాల ఆకాంక్షలను గౌరవిస్తోందని తెలిపారు. 2014లో తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అన్ని రకాల కుంభకోణాలకు అడ్డుకట్ట వేశామన్నారు. అలా పొదుపు అయిన డబ్బుతో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా రేషన్ సరుకులు ఇస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ పాలనలో నేరాలు, లూటీలు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడల్లా దేశంలో నక్సలైట్లు, ఉగ్రవాదులు బలం పుంజుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే, దేశమంతటా బాంబు పేలుళ్లు, హత్యల వార్తలు నిత్యం వస్తుంటాయని చెప్పారు. నేరాలు, లూటీలు విచ్చలవిడిగా జరుగుతుంటాయని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలిజాన్ని అరికట్టడంలో దారుణంగా విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే మహాదేవ్ బెట్టింగ్ యాప్ బాగోతంపై విచారణ జరిపిస్తామని, దోషులను శిక్షిస్తామని ప్రకటించారు. ఈ కుంభకోణంలో ఎంతటి బడా బాబులున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. భద్రత అనేది ప్రతి పౌరుడికి అవసరమని మోదీ చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రజలు క్షేమంగా ఉండాలంటే కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని, అయోధ్యలో రామమందిర నిర్మాణం మొదలైందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చామని ప్రధానమంత్రి తెలిపారు. -
నాగకేసరి చెట్ల నుంచి జీవ ఇంధనం
కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఆసక్తి, విషయ పరిజ్ఞానం, సాధించాలనే తపన ఉంటే దేనినైనా సాధించవచ్చని నిరూపించింది ఓ గిరిపుత్రిక. తల్లిదండ్రులు తనని చదివించలేని పరిస్థితుల్లో ఉన్నా, మొక్కవోని దృఢ సంకల్పంతో ఉన్నత చదువుల్లో ప్రతిభ చూపారు రాజేంద్రపాలేనికి చెందిన దిబ్బ చంద్రవతి. ఆమె తల్లిదండ్రులు దిబ్బ సుందర్రావు, సింగారమ్మ కూలీలు. చంద్రవతి పదో తరగతి మండలంలోని పెదమాకవరం పాఠశాలలోను, ఇంటర్ పాడేరు బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. డిగ్రీ విశాఖలో చదివారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో రెండేళ్లు ఎంఫిల్ చేశారు. పీహెచ్‌డీలో భాగంగా ‘నాగ కేసరి చెట్ల నుంచి జీవ ఇంధన తయారీ’పై పరిశోధనకు శ్రీకారం చుట్టారు. యూనివర్సిటీ ఆచార్యులు ఎస్బీ పడాల్ పర్యవేక్షణలో పరిశోధన నిర్వహించారు. దీనిపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచురణలు జరగడంతో ఆమెను డాక్టరేట్ వరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో విలువైన ఔషధాలు ఉన్నాయని తెలిపారు. ఆదిమజాతి గిరిజనులు వృక్షాలతో అన్యోన్యంగా ఉంటారని, వివిధ రకాల రోగాలకు వారి పరిసరాల్లో పెరిగే మొక్కలు, చెట్లను ఉపయోగిస్తారని చెప్పారు. అడవిలో పెరిగే నాగ కేసరి చెట్ల నుంచి సేకరించిన విత్తనాలను నూనెగా మార్చి జీవ ఇంధనంగా తయారు చేశామని ఆమె వివరించారు. తక్కువ ఖర్చుతో ఇంధనాన్ని తయారు చేయవచ్చునని తెలిపారు. పరిశోధన పూర్తి కావడంతో ఏయూ ఉప కులపతి పీవీజీడీ ప్రసాద్ రెడ్డి నుంచి ఈనెల తొమ్మిదిన డాక్టరేట్ అందుకున్నట్టు ఆమె తెలియజేశారు. -
గిరిజనులపై ప్రధానిది కపట ప్రేమ మంత్రి సత్యవతి రాథోడ్
సాక్షి, హైదరాబాద్: గిరిజనులపై ప్రధాని మోదీ కపటప్రేమ ప్రదర్శిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. పదేళ్లుగా గిరిజన వర్సిటీని తొక్కిపెట్టింది మోదీ ప్రభుత్వమే అని, దీంతో ఎంతో మంది ఉన్నత చదువుల కోసం దూరప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్నందునే మోదీకి గిరిజన వర్సిటీ గుర్తొచ్చిందన్నారు. ఈ వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా జాకారంలో 335 ఎకరాలను ఇప్పటికే కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా కేంద్రం స్పందించలేదన్నారు. -
సంక్షోభాన్ని పెంచిన ఆ అంతర్యుద్ధం
జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడంపై భారత్‌లో వెల్లువెత్తిన ఉత్సాహం... సంఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌ను వ్యూహాత్మకంగా విస్మరించడానికి దారితీసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీవ్ర నిష్క్రియాత్మకత వల్లే ఈశాన్య ప్రాంతంలో ఇంత పతనం సంభవించింది. మయన్మార్‌లో 28 నెలల నాటి అంతర్యుద్ధం పాక్షికంగా మణిపుర్ మంటలను పెంచి పోషించింది. ఫలితంగా 200 మందికి పైగా మరణించారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 4,000 ఆయుధాల చోరీ జరిగింది. మయన్మార్ నుండి వచ్చిన శరణార్థుల వెల్లువతో పాటు, కుకీలు లేని ఇంఫాల్ లోయ, మైతేయిలు లేని కుకీ–నివాస కొండ ప్రాంతాలు అనే జాతి ప్రక్షాళన మణిపుర్‌ను నిలువునా విభజించింది. కుకీలు, మైతేయిల జాతి ప్రక్షాళన ధోరణి మణిపుర్‌ను నిట్టనిలువున చీల్చింది. తీవ్రమైన ఈ విభజనే, విద్రోహం(ఇన్సర్జెన్సీ) మళ్లీ చెలరేగుతుందన్న భయా లను రేకెత్తించింది. రాష్ట్ర ఆయుధాగారాల నుండి కొల్లగొట్టిన ఆయు ధాలు అందుబాటులో ఉండటమే ఈ భయాలకు కారణం. గత నెలలో అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ పిసి నాయర్ ఇలా చెప్పారు: ‘‘పరిస్థితి అసాధారణంగా ఉంది. మేము ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు.’’ ఇంఫాల్‌లోని నాలుగు జిల్లాల్లో గల 39 పోలీస్ స్టేషన్లలోని 16 స్టేషన్లలో సాధారణ స్థితి ఏర్పడినట్లు చూపడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మార్చి 25న ఉపసంహరించుకున్న తర్వాత పరి స్థితి ఇలా ఉంది. ఈ చర్యను మళ్లీ వెనక్కి తీసుకోలేదు. ‘‘విద్రోహాన్ని గణనీయంగా తగ్గించేశాం. దాదాపుగా లేదు’’ అని మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే చెప్పారు. ఈ పరిస్థితి ఉత్తరం వైపు సైన్యాన్ని తిరిగి సమతుల్యం చేయడానికి, అలాగే ఈశాన్య ప్రాంతంలో సైనిక చర్యల బాధ్యతను అస్సాం రైఫిల్స్‌కు బదిలీ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది సాధారణ ఆచర ణకు భిన్నం. ఒక్క 1965, 1971 యుద్ధాల సమయంలో మాత్రమే ఇలా చేశారు. మయన్మార్‌లో మిలిటరీ జుంటాకూ, దానిని వ్యతిరేకిస్తున్న శక్తుల (నేషనల్ యూనిటీ గవర్నమెంట్–ఎన్‌యూజీ, ఇంకా ప్రతిఘటన)కూ మధ్య అంతర్యుద్ధం దాని మూడవ సంవత్సరంలోకి ప్రవేశించింది. నాగాలాండ్, మిజోరాం, మణిపుర్‌లకు సమీపంలోని సగాయింగ్ ప్రాంతం, చిన్ రాష్ట్రం ప్రధాన పోరాట వేదికలుగా ఉంటున్నాయి. సైనిక జుంటా ఈ ప్రాంతంలో అధికారం కోల్పోయినందున, అది నాపాం బాంబులను ప్రయోగించడం, గ్రామాలను దోచుకోవడం, తగలబెట్టడంతోపాటు వైమానిక బాంబులను ఆశ్రయిస్తోంది. పర్య వసానంగా, దాదాపు 60,000 మంది చిన్, కుకి, జోమి శరణార్థులు మిజోరం, మణిçపుర్లకు పారిపోయారు. వీరిలో కొందరు ఎన్యూ జీకి చెందిన శాసనసభ్యులు కూడా ఉన్నారు. మయన్మార్‌తో 1,600 కి.మీ. పొడవైన అంతగా గస్తీ ఉండని సరిహద్దుతోపాటు, ఇరువైపులా 16 కి.మీ. మేర స్వేచ్ఛా కదలికలకు అనుమతిస్తున్న పాలన కారణంగా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, బంగారం, విలువైన రాళ్లు మణిపూర్ లోకి అక్రమంగా రవాణా అవుతున్నాయి. ‘గోల్డెన్ ట్రయాంగిల్’ గుర్తుందిగా? మాదకద్రవ్యాల అక్రమ రవాణా మణిపుర్‌కు కొత్తేమీ కాదు. భద్రతా సిబ్బందికి కూడా ఇందులో ప్రమేయం ఉన్నదన్న ఆరోపణలు ఉన్నాయి. 2013 ఫిబ్ర వరిలో రూ.6 కోట్ల విలువైన డ్రగ్స్‌తో దొరికిన సైనిక కల్నల్‌ను అరెస్టు చేశారు. సెప్టెంబర్ 15న ‘గోవా క్రానికల్’లో ప్రచురితమైన కథనంలో, మణిపుర్‌లోని జఠిలమైన మాదకద్రవ్యాల వ్యాపార నెట్వర్క్ వివరా లను ఇచ్చారు. 2021 నుంచి మణిపుర్లో గసగసాల సాగు 33 శాతం పెరిగిందని ఐరాస నివేదిక పేర్కొంది. ఇది కుకీలకు నగదు పండించే పంట అని మైతేయిలు ఆరోపిస్తున్నారు. కానీ గోవా క్రానికల్ కథనం ప్రకారం, ముస్లిం పంగల్లతో సహా ప్రతి సమాజానికీ ఈ పంటలో వాటా ఉంది. భారతదేశ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ని మయన్మార్ వివాదం తీవ్రంగా దెబ్బతీసింది. ఇది ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల సంఘం)తో వాణిజ్యం, పరస్పర చర్యలను ముందుకు తీసుకెళ్లేందుకు రూపొందించిన విధానం. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సెప్టెంబర్ ప్రారంభంలో మీడియాతో మాట్లాడుతూ, ‘‘భారతదేశ అత్యంత ప్రతిష్ఠాత్మక మైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆగ్నేయాసియాతో ఉన్నాయి. మయన్మార్ అంతర్గత భద్రతా వ్యవస్థ విచ్ఛిన్నమైపోయిన కారణంగా అవి పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాయి,’’ అని చెప్పారు. మిజోరం మార్గంలో తిరుగుబాటు సోకిన రాఖైన్ రాష్ట్రం గుండా వెళుతున్న దాదాపు రెండు దశాబ్దాల నాటి మల్టీమోడల్ కలాదాన్ ప్రాజెక్టును అరాకాన్ సైన్యం (మయన్మార్) కాలానుగుణంగా నిరోధిస్తూ వచ్చింది. మణిపుర్‌లోని మోరేతో థాయ్‌లాండ్‌లోని మయీ సాట్‌తో కలిపే భారతదేశం, మయన్మార్, థాయ్‌లాండ్ త్రైపాక్షిక హైవే ప్రాజెక్టును సగాయింగ్(మయన్మార్) ప్రాంతంలో జరిగిన పోరాటాల కారణంగా నిలిపివేశారు. ఈ నెలలోనే జరిగిన ఆసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో జైశంకర్ మయన్మార్ విదేశాంగ మంత్రి థాన్ స్వేతో సమావేశమయ్యారు. భారతదేశం, మయన్మార్ సరిహద్దుకు సమీపంలో జరిగిన పోరాటాలు, వైమానిక దాడులు కలిగిస్తున్న ప్రమాదకరమైన ప్రభావాల గురించి థాన్ స్వేకి వివరించారు. ‘ఎన్‌యూజీ’కి చెందిన పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ (పీడీఎఫ్) సగాయింగ్ ప్రాంతంలో ఆధిపత్యం చలాయిస్తోంది. అంతర్యుద్ధ ప్రతి ష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ‘అన్ని ఫలాలను జుంటా బుట్టలో’ ఉంచే విధానాన్ని ఢిల్లీ సమీక్షించుకోవాలి. దేశ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణాన్ని సులభతరం చేయడానికి చిన్ నేషనల్ ఫ్రంట్, అరకాన్ సైన్యాన్ని భారత ఏజెన్సీలు సిద్ధం చేయాలి. ప్రజాస్వామ్య శక్తులతో సంబంధాలను పునరుద్ధరించడం, ఆయుధాల సరఫరాతో సహా ఎన్‌యూజీ/పీడీఎఫ్‌తో సమాచార మార్గాలను ఏర్పాటు చేయడం ఆచరణీయమైన ఎంపికలు. ఇది సమస్యను నిరోధించవలసిన చర్యను ఆలస్యంగా చేపట్టడం లాంటిదే అయినప్పటికీ, భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీకి కీలకంగా ఉన్న మణిపుర్ సమస్యకు తక్షణ చికిత్స అవసరం. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపుర్‌ను రక్తసిక్తం చేయడానికి అనుమతించాయి, కొత్త తిరుగుబాట్లకు బీజాలు నాటడానికి అనుమతించాయి. అంతకుమించి సైన్యం, అస్సాం రైఫిల్స్, ఇతర భద్రతా దళాల నిష్పా క్షికతకు సవాలు విసిరే అవాంఛనీయమైన దుఃస్థితిలో ఉంచాయి. ఒక సీఆర్పీఎఫ్ భద్రతా సలహాదారు మణిపుర్ సీఎం బీరెన్‌సింగ్‌కు మార్గనిర్దేశం చేస్తుండగా, భద్రతా దళాల ప్రత్యేక రక్షణ చట్టం పరిధిలోకి రాని ప్రాంతాల్లో పౌర అధికారులకు సైన్యం, కేంద్ర పారామిలటరీ బలగాలు సాయం చేస్తున్నాయి. కుకీల పట్ల పక్షపాతం చూపుతున్నాయని ఆరోపిస్తూ అస్సాం రైఫిల్స్‌పై మణిపుర్ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడం, అస్సాం రైఫిల్స్‌ను తొలగించాలని మైతేయిలు డిమాండ్ చేయడం, మరోవైపున నిషేధిత ఉగ్ర వాద గ్రూపులను సైన్యం, అస్సాం రైఫిల్స్ విడుదల చేయడంపై లేవ నెత్తుతున్న ప్రశ్నలు మణిపుర్ వాస్తవికతను ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పుడు ఆర్మీ, అస్సాం రైఫిల్స్ ప్రధాన పని లూటీకి గురైన ఆయుధాలను తిరిగి పొందడమే. వివిధ ప్రదేశాలలో ఆయుధ డిపా జిట్ పెట్టెలను ఉంచినప్పటికీ, మెజారిటీ ప్రజలు వాటి పక్కన సెల్ఫీలు తీసుకుంటున్నారు. మణిçపుర్, ఈశాన్య ప్రాంతాలపై జరుగు తున్న సెమినార్లలో పరిస్థితిని వివరించడానికి వాడుతున్న మాటలు: ‘అరాచకం’, ‘మరో కంబోడియా’, ‘సమాజాల మధ్య పూర్తి అప నమ్మకం’. ఆశ్చర్యకరంగా, ప్రధానమంత్రి లాగే, ఆర్మీ చీఫ్ గానీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గానీ మణిపుర్‌ను ఇంతవరకూ సందర్శించలేదు. జరుగుతున్న తిరుగుబాటును మొగ్గలోనే తుంచివేసే విషయంలో ప్రభుత్వం తన రాజకీయ సంకల్ప లేమిని ప్రస్ఫుటంగా చూపిందని అక్కడి నిపుణులు అంటున్నారు. ఈశాన్యం నుండి 25 మంది లోక్‌సభ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది బీజేపీ, దాని మిత్రపక్షాలకు చెందినవారే. మణిపుర్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. ఈ ప్రాంతంలో తిరుగుబాట్లు ఎప్పటినుంచో ఉన్నాయి. రాజకీయ పరిష్కారం సాధించాలంటే, ముందుగా చేయాల్సిన విధులు: హింసను అరికట్టడం, రాష్ట్రపతి పాలన విధించడం. -వ్యాసకర్త సైనిక వ్యవహారాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
డోలీ కట్టి.. మూడు కిలోమీటర్లు
ఏటూరు నాగారం: డోలీ కట్టి మూడు కిలోమీటర్ల మేర ఓ గర్భిణిని కుటుంబసభ్యులు మోసుకొచ్చి, అనంతరం 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఏటూరునాగారం మండలం రాయబంధం గొత్తికోయగూడేనికి చెందిన గర్భిణి సోది పోసికి ఆదివారంరాత్రి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని గ్రామస్తులు ఆశ కార్యకర్తకు తెలియజేయగా ఆమె 108 సిబ్బందికి సమాచారం ఇచ్చింది. గ్రామానికి సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో అక్కడికి అంబులెన్సు రాదని సిబ్బంది చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంచానికి తాళ్లుకట్టి డోలీగా మార్చి మూడు కిలోమీటర్ల దూరం మోసుకొచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
విమానాశ్రయాల్లో గిరిజన ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గిరిజన ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ‘గిరిజన్’ బ్రాండ్ పేరుతో అందిస్తున్న సహజసిద్ధమైన ఉత్పత్తులకు గిరాకీ ఉంది. ప్రధానంగా అరకు వ్యాలీ కాఫీతోపాటు గిరిజన తేనె, షర్బత్, జీడిపప్పు, చిరుధాన్యాలు, త్రిఫల పౌడర్, హెర్బల్ ఆయిల్, సబ్బులు వంటి 80 ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ప్రత్యక్షంగా స్టాల్స్ ఏర్పాటు చేసిన జీసీసీ ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా విక్రయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీతోపాటు అనేక నగరాల్లోను జీసీసీ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్వేస్టేషన్లో జీసీసీ అవుట్లెట్ ఏర్పాటు చేశారు. దేశంలో 13 విమానాశ్రయాల్లోను గిరిజన ఉత్పత్తులను అమ్ముతున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయంలో పూర్తిగా జీసీసీ ఆధ్వర్యంలో గిరిజన ఉత్పత్తుల అమ్మకాలు సాగిస్తున్నారు. విజయవాడ విమానాశ్రయంలో జీసీసీ ఏర్పాటు చేసిన స్టాల్ విక్రయాలు నిర్వహించాల్సి ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ట్రైబల్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆప్ ఇండియా లిమిటెడ్ (ట్రైఫెడ్) భాగస్వామ్యంతో అనేక అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జీసీసీ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. జైపూర్, గోవా, త్రివేండ్రం, మహారాణా ప్రతాప్ ఎయిర్‌పోర్టు (ఉదయ్‌పూర్), కోయంబత్తూరు, పుణె, కేబీఆర్ (లద్దఖ్), మాతా దంతేశ్వరి (జగదల్పూర్), కొచ్చిన్, లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ (గౌహతి), ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయాల్లో గిరిజన ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో రూ.85.56 లక్షల విలువైన ఉత్పత్తుల విక్రయాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జీసీసీ విస్తృతమైన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గిరిజనులు పండించిన ఉత్పత్తులు, సేకరించిన అటవీ ఫలసాయాలకు మంచి ధర దక్కేలా జీసీసీ దోహదం చేస్తోంది. గిరిజనుల నుంచి కొనుగోలు చేసిన వాటిని అనేక రకాల ఉత్పత్తులుగా విక్రయిస్తోంది. ఈ క్రమంలో గిరిజనులకు మరింత మేలు చేసేలా జీసీసీ సేవలు విస్తృతం చేస్తోంది. దీన్లో భాగంగానే దేశంలోని అనేక ప్రాంతాల్లో జీసీసీ అవుట్‌లెట్స్ ప్రారంభించాం. ఇతర రాష్ట్రాల్లో గతేడాది (2022–23లో) రూ.85.56 లక్షల విలువైన జీసీసీ గిరిజన్ ఉత్పత్తులు విక్రయించాం. దేశంలో ఎక్కడైనా జీసీసీ ఫ్రాంచైజీ అవుట్లెట్లు పెట్టుకునే ఆసక్తి ఉన్నవారికి ప్రోత్సాహం అందిస్తాం. – శోభ స్వాతిరాణి, జీసీసీ చైర్పర్సన్ -
ఆ గూడేనికే వెలుతురు నువ్వమ్మా!
‘ఇరవై ఏళ్ల వరకూ మా ఇంట్లో బల్బు చూళ్లేదు’ అంటుంది భాగ్యశ్రీ. మహరాష్ట్రలో నక్సల్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలోని తమ గూడేనికి చాలా కాలం పాటు సర్పంచ్‌గా ఎవరూ నిల్చునే ధైర్యం చేయలేదు. సమస్యలు తీర్చేవారూ లేరు. ‘చివరకు నేనే సర్పంచ్ అవుదామని నిశ్చయించుకున్నా’ అంది భాగ్యశ్రీ. 24 ఏళ్ల ఈ గిరిజన నాయకురాలు తన వారి కోసం పని చేస్తున్న తీరు ప్రతి అణగారిన సమూహానికి చూపుతున్న మార్గం చాలానే ఉంది. మహరాష్ట్రలో ముంబై, పూణె వంటి నగరాలది ఒక ప్రపంచమైతే గడ్చిరోలి వంటి నక్సల్ ప్రభావిత గిరిజన ప్రాంతాలది మరో ప్రపంచం. ‘మహారాష్ట్రకు ఊపిరితిత్తి’ అని పిలిచే ఈ ప్రాంతమంతా దట్టమైన అడవి, గిరిజన ఆవాసాలతో ఉంటుంది. అయితే నక్సలైట్ల ప్రభావం వల్ల, గిరిజనులనే నిర్లక్ష్యం వల్ల దారుణమైన వెనుకబాటుతనం ఇక్కడ ఉంటుంది. ‘మా గూడెంలో నాకు ఇరవై ఏళ్లు వచ్చే వరకూ కరెంటు లేదు. మా ఇంట్లో బల్బు వెలగడం చూళ్లేదు’ అంటుంది 24 ఏళ్ల భాగ్యశ్రీ లక్ష్మి. గడ్చిరోలి అడవుల్లో అత్యధిక సంఖ్యలో ఉండే మడియా తెగకు చెందిన ఈ చదువుకున్న అమ్మాయి తన సొంతగూడెం ‘కొటి’ పంచాయితీ కింద ఉన్న 9 గ్రామాలకు సర్పంచ్. ఈ ప్రాంత గిరిజనుల జీవితాలకు ఒక ఆశాదీపం. సర్పంచ్ లేని ఊరు భాగ్యశ్రీ లక్ష్మి పుట్టి పెరిగిన ‘కొటి’ గూడేనికి 2003 నుంచి సర్పంచ్ లేడు. ఎందుకంటే నక్సల్ ప్రభావం వల్ల ఏ సమస్యో అని ఎవరూ నిలబడలేదు. దాంతో ఆ ప్రాంతమంతా అనేక సమస్యలు పేరుకుపోయాయి. బాల్య వివాహాలు, చదువు మానేయడం, నక్సల్ అనే అనుమానంతో అమాయక గిరిజన యువకులను ఏళ్ల తరబడి జైళ్లల్లో పడేయడం.. ఇదీ అక్కడ జరుగుతున్నది. డాక్టర్లు పొరపాటున కూడా రారు. అదేమంటే రోడ్లు లేవంటారు. రోడ్లు వేయమని అధికారుల దగ్గరకు వెళితే వారు మరేవో సమస్యలు చెప్తారు. ‘ఇవన్నీ చూసి చూసి విని విని నేనే సర్పంచ్‌గా మారి ఏదో ఒకటి చేద్దామని బయలుదేరాను’ అంటుంది భాగ్యశ్రీ లక్ష్మి. నేనొచ్చాను భాగ్యశ్రీ లక్ష్మి తల్లి అంగన్వాడి టీచర్. తండ్రి ప్రభుత్వ టీచర్. అందుకే భాగ్యశ్రీని చదివించారు. ‘చంద్రాపూర్‌లో బి.ఏ. ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివాను. మంచి వాలీబాల్ ప్లేయర్‌ని నేను. టీచింగ్ రంగంలోకి వెళదామనుకున్నాను. కాని నా చదువు నాకు మాత్రమే ఉపయోగపడితే ఎలా? నా వారికి ఏదైనా చేయాలని సర్పంచ్ అయ్యాను. ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు’ అంది భాగ్యశ్రీ. అయితే ఆమెకు పదవి రావడాన్ని ఊహించని కొంతమంది మగవారు భాగ్యశ్రీ పదవీ స్వీకారం రోజు ఆమెతో దురుసుగా వ్యవహరించారు. మైక్ తీసుకొని మాట్లాడబోతే మాట్లాడనివ్వలేదు. అసభ్యంగా ప్రవర్తించారు. ‘నేను ఇంటికొచ్చి చాలా ఏడ్చాను. అయితే మా అమ్మ– నువ్వు ఇక మీదట మామూలు భాగ్యశ్రీగా ఉండకు. ఒక నాయకురాలు ఎలా ఉంటుందో అలా ఉండు’ అని ధైర్యం చెప్పింది. ఆ క్షణమే నేను గట్టిగా నిలబడాలనుకున్నాను’ అంటుంది భాగ్యశ్రీ. బైక్ మీద తిరుగుతూ... ప్రతి ఉదయం టీ తాగి బైక్ మీద తిరుగుతూ తన అజమాయిషీలో ఉన్న గ్రామాల సమస్యలు పరిష్కరిస్తోంది భాగ్యశ్రీ. ఆమె సర్పంచ్ అయ్యాక గూడేల్లోని తల్లిదండ్రులతో పోట్లాడి మొదటగా చేసిన పని బాల్యవివాహాలు మాన్పించడం... బాలికలను హాస్టళ్లకు పంపి చదివించడం... స్కూళ్లలో తిరిగి చేరేలా చేయడం, టాయిలెట్లు నిర్మించడం... ‘నా కింద తొమ్మిది గ్రామాల్లో ఆరింటికి కరెంటు తెప్పించాను’ అని తెలిపిందామె. ‘అధికారులు ఏది అడిగినా నక్సల్స్ సమస్యను సాకుగా చూపుతారు. ప్రజల సమస్యలను నిజంగా పరిష్కరిస్తే నక్సల్స్ అడ్డుపడరు’ అంది. ‘గిరిజనులకు కొన్ని విశ్వాసాలుంటాయి. వారు అన్ని మాటలూ వినరు. వారిని ఒప్పించి అభివృద్ధివైపు నడిపించడమే పెద్ద సవాలు. బయటవారు నాయకులు కావడం కంటే లోపలివారు నాయకులైతేనే అది సులభం. ఎవరి సమూహాల మేలు వారే చూసుకోవాలి’ అంటుంది భాగ్యశ్రీ. గిరిజనులకు కొన్ని విశ్వాసాలుంటాయి. వారు అన్ని మాటలు వినరు. వారిని ఒప్పించి అభివృద్ధివైపు నడిపించడమే పెద్ద సవాలు. బయటవారు నాయకులు కావడం కంటే లోపలివారు నాయకులైతేనే అది సులభం. ఎవరి సమూహాల మేలు వారే చూసుకోవాలి. -
గిరిజన భూ వివాదాలకు సత్వర పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గిరిజన భూ వివాదాల సత్వర పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని గిరిజనులకు చెందిన షెడ్యూల్డ్ ఏరియా ‘భూ బదలాయింపు నిబంధనలు (ఎల్టీఆర్) 1/70’ ప్రకారం వారి హక్కులను కాపాడేలా పక్కా కార్యాచరణ చేపట్టింది. దాదాపు 1976 నుంచి పేరుకుపోయిన వేలాది ఎల్టీఆర్ కేసుల్లో వేగంగా విచారణ జరిపి సత్వర న్యాయం అందించే దిశగా ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చడంతోపాటు ఇటీవల ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న ఎల్టీఆర్ కేసులు విచారణ వేగవంతం చేయడం, పాత కేసుల్లోని భూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించడం, కొత్తగా నమోదైన కేసులను 6 నెలల గడువులోను, అప్పీల్‌కు వెళ్లిన కేసులు రెండు నెలల్లో పరిష్కరించాలని ఆదేశాలిచ్చింది. అప్పటికీ వివాదం కొలిక్కిరాకపోతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, కమిషనర్ విచారణకు వెళుతుంది. కేసుల్లో గిరిజనులకు అనుకూలమైన ఉత్తర్వులను వేగంగా అమలులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. గిరిజనులకు వ్యతిరేకంగా వచ్చింన వాటి వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేయడంతోపాటు ఆయా గ్రామ సచివాలయాల వద్ద ప్రదర్శించాల్సి ఉంటుంది. ఎల్టీఆర్ కేసుల పురోగతిపై ఎప్పటికప్పుడు ఐటీడీఏ పీవోలు, మైదాన ప్రాంత కలెక్టర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి నివేదిక పంపించాలి. ఎల్టీఆర్ కేసులు, హక్కులపై ఐటీడీఏల పరిధిలో వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా గిరిజనులకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాలు ఇచ్చింది. గిరిజన భూములకు రక్ష 1/70 యాక్ట్ రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించారు. భూములకు సంబంధించి 1/70 (1959 చట్ట సవరణ) సెక్షన్–3తో గిరిజనులకు భూములపై హక్కులున్నాయి. షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులకు చెందిన భూములు వారే అనుభవించాలి. గిరిజనులు నుంచి గిరిజనులు భూములు పొందచ్చు. గిరిజనుల నుంచి గిరిజనేతరులు కొనుగోలు చేయడం, ఆక్రమించడం వంటివి చెల్లవు. భూముల అన్యాక్రాంతాన్ని నిరోధించడమే దీని ఉద్దేశం. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతం (షెడ్యూల్డ్ ఏరియా) 37 మండలాల పరిధిలోని 3,512 గ్రామాల్లో నివసించే వారికి ఈ హక్కులు వర్తిస్తాయి. గిరిజనులకు చెందిన భూవివాదాల పరిష్కారం కోసం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాలకు చెందిన రంపచోడవరం, పాడేరు, పార్వతీపురం, సీతంపేట, కోట రామచంద్రపురం, పోలవరం ఐటీడీఏల పరిధిలో ఐదు ప్రత్యేక ఎల్టీఆర్ కోర్టులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆయా ప్రాంతాల్లో భూ వివాదాలను తొలుత డిప్యూటీ తహసిల్దార్ (డీటీ) గుర్తించి నోటీసులు జారీ చేస్తారు. తగిన సమాచారం సేకరించిన అనంతరం ఐటీడీఏల పరిధిలోని పాడేరు, రంపచోడవరం, ఎల్వీఎన్ పేట, కేఆర్ పురం, పోలవరం కోర్టుల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు విచారణ చేపడతారు. ఈ వివాదాల్లో తగిన పత్రాలు, ఆధారాలను సమర్పించడం ద్వారా భూమి ఎవరిదో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎల్టీఆర్ ఆర్డర్ అమలు ఇలా ♦ ప్రారంభం (1976) నుండి ఈ ఏడాది జూన్ వరకు 29,810 ఎల్టీఆర్ వివాదాలు(1,47,554 ఎకరాలు) గుర్తించారు. ♦ 12,678 కేసులు (56,882 ఎకరాలు) గిరిజనులకు అనుకూలంగా ఉత్తర్వులు అమలయ్యాయి. ♦ 11,754 కేసుల్లో 51,278 ఎకరాలను గిరిజనులకు స్వాదీనం చేశారు. ♦ 924 కేసుల్లో 5,604 ఎకరాలను అప్పగించాల్సి ఉంది. మరికొన్ని కేసులు పలుస్థాయి (కోర్టు)ల్లో పెండింగ్‌లో ఉన్నాయి. -
కేంద్ర గిరిజన వర్సిటీకి నేడు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజనుల జీవితాల్లో విద్యా కుసుమాలు విరబూసేలా విజయనగరం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు. విభజన హామీల్లో ఒకటైన ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటును గత చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారు. గిరిజన ప్రాంతంలోనే యూనివర్సిటీ గిరిజన విశ్వవిద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో దత్తిరాజేరు మండలం మర్రివలస, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలోని ప్రభుత్వ,ప్రైవేటు భూమి సేకరించారు. విశాఖపట్నం–రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందుబాటులో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేశారు. ఇందుకోసం భూములిచ్చిన రైతులకు రూ.29.97 కోట్ల పరిహారం చెల్లించారు. మౌలిక వసతుల కల్పనకు మరో రూ. 28.49 కోట్లు ఖర్చు చేశారు. అందించే కోర్సులు ఈ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లిష్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, బయోటెక్నాలజీ, కెమెస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, బి.కామ్‌లో ఒకేషనల్ తదితర 14 కోర్సులను అందిస్తారు. వీటితో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఒకేషనల్, జాబ్ ఓరియెంటెడ్ షార్ట్ టర్మ్ కోర్సులను కూడా అందిస్తారు. గిరిజన తెగల వ్యక్తిగత, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధిని ఈ యూనివర్సిటీ ద్వారా ప్రోత్సహిస్తారు. ఇప్పటికే విజయనగరం జిల్లా కొండకరకంలోని ఆంధ్రా యూనివర్సిటీ పాత పీజీ క్యాంపస్ భవనాల్లో నిర్వహిస్తున్న వర్సిటీ తరగతుల్లో 385 మంది విద్యార్థులున్నారు. -
గిరిజన విద్యార్థి.. కష్టాలను అధిగమించి,ఐఐటీలో సీటు సాధించింది
జె.ఇ.ఇ. ఎంట్రన్స్‌లో ర్యాంకు కొట్టడం సామాన్యం కాదు.అందుకై కొందరు రాజస్తాన్ వెళ్తారు. కొందరు హైదరాబాద్, విజయవాడ చేరుకుంటారు.తల్లిదండ్రులు గైడ్ చేస్తారు. కాని నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు పుట్టిన కోయ విద్యార్థిని కొర్సా లక్ష్మి గురుకుల పాఠశాలలో చదువుకునే మంచి ర్యాంకు సాధించింది.పాట్నా ఐఐటీలో సీటు సాధించింది. కోయలలో ఒక అమ్మాయి సాధించిన స్ఫూర్తినిచ్చే విజయం ఇది. కొర్సా లక్ష్మి పరిచయం. కొంతమంది ఇళ్లల్లో, నిజానికి చాలామంది ఇళ్లల్లో పిల్లలు జె.ఇ.ఇ. ఎంట్రన్స్ రాయడానికి తల్లిదండ్రులు చాలా శ్రద్ధ పెడతారు. బాగా చదివించే కోచింగ్ సెంటర్ కోసం అవసరమైతే రాజస్థాన్‌లోని కోటాకు వెళతారు లేదా హైదరాబాద్, విజయవాడలలో ప్రఖ్యాత కోచింగ్ సెంటర్లలో వేస్తారు. ఇక పిల్లలు ఇంట్లో ఉండి చదువుకుంటుంటే టీవీలు బంద్ చేస్తారు. మాటా పలుకూ లేకుండా పిల్లలు ఇరవై నాలుగ్గంటలూ చదువుకునేలా చేస్తారు. మెటీరియల్ తెచ్చిస్తారు. చాలా హైరానా పడతారు. అదేం తప్పు కాదు. కాని ఇలాంటివన్నీ లేకుండా కూడా కొంతమంది విజయం సాధిస్తుంటారు. కొత్తగూడెంలోని గిరిజన గురుకుల పాఠశాలలో చదువుకున్న కోయ విద్యార్థిని కుర్సా లక్ష్మి అలాంటి విజేతే. పట్టుదలతో చదువుకుని ర్యాంకు సాధించిన విజేత. ఐసులమ్మే తండ్రి కూతురు కొత్తగూడెం నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజన తండా కాటాయగూడెం. 300 గడపలున్న గ్రామం ఇది. అందరూ కోయలే. వ్యవసాయ కూలీలే. ఏ కొద్దిమందికో కాసింత భూమి ఉంటుంది. కొర్సా లక్ష్మి తండ్రి కన్నయ్యకు ఎకరం భూమి ఉంది. కాని వాన పడితేనే పండుతుంది. కన్నయ్య వ్యవసాయ కూలీగా వెళతాడు. తల్లి శాంతమ్మ కూడా. వ్యవసాయ పనులు లేనప్పుడు తన టీవీఎస్ ఎక్సెల్ మీద ఐస్ బాక్స్ పెట్టుకుని ఐసులమ్ముతాడు. ముగ్గురు పిల్లలు. కాని పెద్ద కొడుకు చదువు ఇష్టం లేక 7వ తరగతిలో ఇంట్లో నుంచి పారిపోయాడు. రెండో కొడుకు మామూలు చదువే. చివరి అమ్మాయి లక్ష్మి బాగా చదువుకోవాలని నిశ్చయించుకుంది. పిన్ని స్ఫూర్తి కన్న తల్లిదండ్రులు చదువు లేని వారు కావడంతో లక్ష్మికి చదువులో ఏ సాయమూ చేయలేకపోయేవారు. ఆరవ తరగతి నుంచి కొత్తగూడెం గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న లక్ష్మికి పిన్ని సుమలత స్ఫూర్తిగా నిలిచింది. డిగ్రీ చదువుకున్న సుమలత హాస్టల్లో ఉన్న లక్ష్మిని తరచూ కలుస్తూ చదువు విలువ చెబుతూ వచ్చింది. డబ్బుకు విలువ ఇవ్వని వారు కూడా చదువుకు విలువ ఇస్తారని తెలిపింది. సెలవుల్లో ఇంటికి తీసుకువచ్చి లక్ష్మి మంచి చెడ్డలు చూసేది. ఆమె మాటలు లక్ష్మి మనసులో నాటుకుపోయాయి. ‘ఏ రోజూ కూడా రాత్రి ఒంటి గంట లోపు లక్ష్మి పుస్తకం మూయగా చూడలేదు’ అని లక్ష్మి బాబాయ్ రవి తెలిపాడు. గురుకుల పాఠశాలలో కొత్తగూడెంలోని గిరిజన గురుకుల పాఠశాలలో దాదాపు వేయి మంది అమ్మాయిలు 6 నుంచి ఇంటర్ వరకూ చదువుతున్నారు. ప్రిన్సిపాల్ దేవదాసు, ఉపాధ్యాయులు వీరి చదువు మీద బాగా శ్రద్ధ పెడుతున్నారు. చురుకైన విద్యార్థినులను ఎంపిక చేసి జె.ఇ.ఇలో శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్లో ఎం.పి.సి తీసుకున్న లక్ష్మి 992 మార్కులు సాధించింది. దాంతో ఇంకా ఉత్సాహంతో జె.ఇ.ఇకి ప్రిపేర్ అయ్యింది. జె.ఇ.ఇ అడ్వాన్స్‌డ్‌లో 1371వ ర్యాంకు సాధించింది. పాట్నా ఐ.ఐ.టిలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో మొన్నటి ఆగస్టు మొదటివారంలో సీటు పొందింది. గురుకుల పాఠశాల నుంచి ఈ ఘనత సాధించిన అమ్మాయి లక్ష్మీ. ఐ.ఏ.ఎస్ చేయాలని... బాగా చదువుకుని ఐ.ఏ.ఎస్ చేయాలనేది తన లక్ష్యమని కొర్సా లక్ష్మి చెప్పింది. జె.ఇ.ఇలో మంచి ర్యాంకు సాధించి ఐ.ఐ.టిలో సీటు పొందడంతో ఐ.టి.డి.ఏ అధికారులు లక్ష్మిని ప్రశంసించారు. ట్యాబ్ ఇచ్చి ఆర్థిక సహాయం చేశారు. లక్ష్మి ఇంత బాగా చదవడంతో ఇంకా కొంతమంది ఆమె చదువును ప్రోత్సహించడానికి ముందుకొచ్చారు. ఆ ప్రోత్సాహం వల్ల లక్ష్మి ఐ.ఏ.ఎస్ చదివి పేద వర్గాల కోసం పని చేయాలని నిశ్చయించుకుంది. -
అడవి చింత.. చారెడంత!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అరే.. చింతగింజలు ఏమిటి ఇంత భారీ సైజులో కనిపిస్తున్నాయని ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఇవి చింతగింజలు కాదు.. అచ్చం వాటిని పోలినట్లు ఉండే అడవిచింత గింజలు! మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో పెరిగే ఓ భారీ తీగ జాతి మొక్క నుంచి వీటిని సేకరిస్తారు. ఈ మొక్క కాండం చాలా పొడవుగా ఉంటుంది. దీని కాయలు సుమారు 4–5 అడుగుల వరకు పెరుగుతాయి. అచ్చం చింతకాయలను పోలి ఉండటంతో వీటిని ఆయా రాష్ట్రాల సరిహద్దులో ఉండే తెలుగువారు అడవిచింత గింజలుగా పిలుస్తున్నారు. ఈ గింజలను కరీంనగర్‌లోని పలు కూడళ్ల వద్ద ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిజనులు ఒక్కోటి సుమారు రూ. 30 వరకు విక్రయిస్తున్నారు. ఈ గింజల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని... పచ్చకామెర్లు, పంటినొప్పి, కీళ్ల నొప్పులను తగ్గించే గుణం వీటికి ఉందని చెబుతున్నారు. ఈ చింతగింజల నుంచి తీసిన నూనెను ఏదైనా గానుగ నూనెతో కలిపి కీళ్లనొప్పులకు మర్దన చేస్తే నొప్పులు తగ్గుతాయని అంటున్నారు. దట్టమైన అడవిలోనే పెరుగుతాయి ఈ అడవిచింత సీసాల్పనేసి కుటుంబపు మొక్క. దీని శాస్త్రీయ నామం ఎంటాడా పరిసేత. అధిక వర్షపాతంగల దట్టమైన అడవుల్లో పెరిగే ఔషధ మొక్క. ఈ తీగజాతి నుంచి గుత్తులు గుత్తులుగా చింతపండు ఆకారంలో వచ్చే పొడవైన కాయల నుంచి గింజలను గిరిజనులు సేకరిస్తారు. తెలంగాణలో ఇలాంటి తీగజాతులు ఎక్కడాలేవు. ఏపీలోని తలకోన, శేషాచలం అడవులు, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలు వాటికి అనుకూలం. – డాక్టర్ నరసింహమూర్తి, శాతవాహన యూనివర్సిటీ -
యువకునిపై మూత్ర విసర్జన.. నిందితుని ఇల్లు కూల్చివేత..
భోపాల్: యోగీ ఆదిత్యనాథ్ బుల్ డోజర్ విధానాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేసిన ఓ వ్యక్తి ఇంటిని రాష్ట్ర అధికారులు కూల్చి వేశారు. గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేసిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ప్రభుత్వం స్బందించింది. వీడియోలో ఓ వ్యక్తి కింద కూర్చున్న గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా మధ్యప్రదేశ్ సీఎం దృష్టికి వెళ్లింది. నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని ప్రవేశ్ శుక్లాగా గుర్తించి అరెస్టు చేశారు. #WATCH | Sidhi viral video | Accused Pravesh Shukla's illegal encroachment being bulldozed by the Administration. He was arrested last night.#MadhyaPradesh pic.twitter.com/kBMUuLtrjK — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 5, 2023 నిందితుని అరెస్టు చేసిన అనంతరం.. అక్రమంగా ఆక్రమించాడనే ఆరోపణలతో అధికారులు అతని ఇంటిని బుల్ డోజర్‌తో కూల్చివేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. నిందితుడు పాల్పడిన ఘటన అమానవీయమని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. ఇలాంటివారికి సాధారణ శిక్ష సరిపోదని చెప్పారు. ఇదీ చదవండి: Delhi Court Firing: లాయర్ల మధ్య వాగ్వాదం.. కోర్టు ప్రాంగణంలో కాల్పుల కలకలం -
భావి తరాలకు స్ఫూర్తినిచ్చేలా..గిరిజన మ్యూజియం
సాక్షి, అమరావతి: గిరిజన స్వాతంత్య్ర వీరుల చరిత్రను భావితరాలకు అందించి వారిలో స్ఫూర్తి నింపే మహోన్నత లక్ష్యంతో చేపట్టిన మ్యూజియం నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆంధ్రా కశ్మిర్‌గా పేరుగాంచిన లంబసింగికి సమీపంలో రూ.35 కోట్లతో ట్రైబల్ ఫ్రీడం ఫైటర్స్ మ్యూజియం పనులు ఇప్పటికే 62.25 శాతానికి పైగా పూర్తయ్యాయి. గిరిజన పోరాటం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అత్యాధునిక సదుపాయాలతో ఈ మ్యూజియం నిర్మాణం జరుగుతోంది. దీన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితమిచ్చేలా కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే అరకు, కర్నులు జిల్లా శ్రీశైలం, శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో మ్యూజియంలున్నాయి. అల్లూరి సీతారామరాజుతో పాటు స్వాతంత్య్ర సంగ్రామంలో గర్జించిన గిరిజన యోధులు మల్లు దొర, గంటం దొర విగ్రహాలను నెలకొల్పనున్నారు. గిరిజన యోధుల చరిత్రను భావితరాలకు అందించేలా శిల్పాలు, ఫొటోలను ఏర్పాటు చేస్తారు. బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన గిరిజన పోరాట ఘట్టాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులోకి తెస్తారు. గిరిజనుల జీవన విధానం, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన అంశాలను కళాఖండాలుగా ఏర్పాటు చేస్తారు. మ్యూజియం గోడలు, పైకప్పుపై గిరిజన కళాకృతులను ఏర్పాటు చేస్తారు. నాటి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను సందర్శకుల కళ్లకు కట్టినట్టు వివరించడానికి 300 మంది కూర్చుని వీక్షించేలా డిజిటల్ థియేటర్‌ను నిరి్మస్తున్నారు. ట్రైబల్ థీమ్ హట్‌తో కూడిన రెస్టారెంట్, ఓపెన్ థియేటర్, స్వాగత ప్లాజాలను నిర్మిస్తున్నారు. పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన గిరిజన మ్యూజియం నిర్మాణాన్ని గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దీని నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధపెట్టింది. 2021లో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగి సమీపంలోని తాజంగిలో 21.67ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడంతో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వేగంగా నిర్మాణ పనులు నాలుగు విభాగాలుగా చేపట్టిన మ్యూజియం నిర్మాణాన్ని ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోంది. కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ గిరిజన స్వాతంత్య్ర పోరాట యోధుల మ్యూజియంను మంజూరు చేసి రూ.15 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.20 కోట్లతో పాటు 21.67 ఎకరాల భూమిని కేటాయించడంతో మ్యూజియం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. – రవీంద్రబాబు, మిషన్ డైరెక్టర్, గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ -
ఆది మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
-
దళిత, గిరిజనులకు భారీ ‘నిధి’
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) చట్టానికి తాజా బడ్జెట్లో ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. 2023–24 బడ్జెట్లో దళిత, గిరిజనులకు ఏకంగా రూ. 51,983.09 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ. 36,750.48 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ. 15,232.61 కోట్ల చొప్పున నిధుల కేటాయింపులు చేసింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఎస్డీఎఫ్ కేటాయింపులు రూ. 4,632.72 కోట్లు పెరిగాయి. ఇందులో ఎస్సీఎస్డీఎఫ్ కేటగిరీలో రూ. 2,182.73 కోట్లు పెరగగా... ఎస్టీఎస్డీఎఫ్ కేటగిరీలో రూ. 1,819.99 కోట్లు పెరిగాయి. దళిత, గిరిజనులకు భారీ స్థాయిలో నిధులివ్వడంతో ఆయా వర్గాల సమగ్ర అభివృద్ధి ముందుకు సాగనుంది. దళితబంధుకు 17,700 కోట్లు.. తాజా బడ్జెట్లో దళితబంధు వాటా అగ్రభాగాన నిలిచింది. 2023–24 బడ్జెట్లో దళితబంధు పథకానికి ప్రభుత్వం రూ. 17,700 కోట్లు కేటాయించింది. హుజూరాబాద్ మినహా మిగతా 118 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2023–24 వార్షిక సంవత్సరంలో ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. ఒక్కో నియోజకవర్గానికి 1500 యూనిట్ల చొప్పున లబ్ధిదారుల ఎంపిక చేయనుంది. -
ఇదో వెరైటీ సంప్రదాయం.. పండగ వస్తే అక్కడివాళ్లంతా గుమ్మడికాయలు తీసుకుని
ఎల్.ఎన్.పేట(శ్రీకాకుళం): కొండల్లో పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే గిరిజనులు దిగువ ప్రాంతాల్లో ఉంటున్న ఇతర కులాల (తెగల) వారితో నేస్తరికం (స్నేహం) చేస్తారు. సంక్రాంతి పండగతో పాటు దసరా, దీపావళి, ఉగాది వంటి పండగల సమయంలో గిరిజన సంప్రదాయ ప్రకారం నేస్తం ఇంటికి వెళతారు. గిరిజనులు పోడు పంటగా పండించే రకరకాల పంటలను కొద్దికొద్ది గా తీసుకుని నేస్తం ఇంటికి పయనమవుతారు. భోగీ రోజున ఉదయం నేస్తం ఇంటికి చేరుకుని సాయంత్రం వరకు ఉంటారు. ఆ సమయంలో గుమ్మడికాయ, కర్రపెండ్లం, అరటి కాయలు, అరటి పళ్లు, కందికాయలు, కందులు, అరటి ఆకులను ప్రేమగా అప్పగిస్తారు. తమ గిరిజన నేస్తానికి దిగువ ప్రాంతంలోని వారు రకరకాల వంటలతో కొసరి కొసరి సంతృప్తిగా భోజనం పెట్టి కొత్త దుస్తులు, బియ్యం, పప్పులు, పిండి వంటలు, దారి ఖర్చులకు కొంత మొత్తం డబ్బులు అందిస్తారు. ఇలా సంతృప్తి పొందిన గిరిజన నేస్తం కుటుంబం పది కాలాల పాటు చల్లగా ఉండాలని దీవిస్తారు. చదవండి: సంక్రాంతి స్పెషల్.. అరిటాకంత ఆనందం! -
మనసుకు నచ్చిన పని.. పాతిక సంవత్సరాల నుంచి ఇదే పనిలో..
ఈనెల 6 నుంచి 18 వరకు ఫ్రాన్స్‌లోని ‘ఇండియన్ యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, నాన్ట్స్’లో ‘ఇండియా– ఆఫ్రికా టువార్డ్స్ ఎ డైలాగ్ ఆఫ్ హ్యూమానిటీస్’ సదస్సు జరిగింది. ఆదివాసీల సంస్కృతి, సంగీతం గురించిన సమగ్ర పరిశోధనకు ఉపకరించే ఆ కార్యక్రమానికి ఆహ్వానితులుగా హాజరైన ప్రొఫెసర్ గూడూరు మనోజ ఆ వివరాలను సాక్షితో పంచుకున్నారు. ‘‘నేను పుట్టింది వరంగల్‌లో. మా నాన్న డీపీఓ. ఆయన బదలీల రీత్యా నా ఎడ్యుకేషన్ తెలంగాణ జిల్లాల్లో ఏడు స్కూళ్లు, నాలుగు కాలేజీల్లో సాగింది. పెళ్లి తర్వాత భర్త ఉద్యోగ రీత్యా మహారాష్ట్ర, నాందేడ్‌కి వెళ్లాను. అక్కడే ఇరవై ఏళ్లు నాందేడ్‌లోని స్వామి రామానంద తీర్థ మరాఠ్వాడా యూనివర్సిటీకి చెందిన ‘స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ కల్చర్ స్టడీస్’లో లెక్చరర్‌గా ఉద్యోగం చేశాను. ఆ తర్వాత నిజామాబాద్‌లో కొంతకాలం చేసి, మహబూబ్‌నగర్ పాలమూరు యూనివర్సిటీ నుంచి 2021లో రిటైరయ్యాను. సంగీతసాధనాల అధ్యయనం ఫ్రాన్స్ సమావేశం గురించి చెప్పడానికి ముందు నేను ఎందుకు ఈ పరిశోధనలోకి వచ్చానో వివరిస్తాను. నా ఉద్దేశంలో ఉద్యోగం అంటే రోజుకు మూడు క్లాసులు పాఠం చెప్పడం మాత్రమే కాదు, యువతకు వైవిధ్యమైన దృక్పథాన్ని అలవరచాలి. నా ఆసక్తి కొద్దీ మన సంస్కృతి, కళలు, కళా సాధనాల మీద అధ్యయనం మొదలైంది. అది పరిశోధనగా మారింది. ఆ ప్రభావంతోనే పాలమూరు యూనివర్సిటీలో నేను ఫోర్త్ వరల్డ్ లిటరేచర్స్ని పరిచయం చేయగలిగాను. మన సాహిత్యాన్ని యూరప్ దేశాలకు పరిచయం చేయడం గురించి ఆలోచన కూడా మొదలైంది. విదేశీ సాహిత్యానికి అనువాదాలు మన సాహిత్యంలో భాగమైపోయాయి. అలాగే మన సాహిత్యాన్ని, సాహిత్యం ద్వారా సంస్కృతిని ప్రపంచానికి తెలియచేయాలని పని చేశాను. వీటన్నింటినీ చేయడానికి నా మీద సామల సదాశివగారు, జయధీర్ తిరుమల రావు గారి ప్రభావం మెండుగా ఉంది. తిరుమలరావుగారు ఆదిధ్వని ఫౌండేషన్ ద్వారా నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న పరిశ్రమలో భాగస్వామినయ్యాను. ఆదివాసీ గ్రామాల్లో పర్యటించి ధ్వనికి మూలకారణమైన సాధనాలను తెలుసుకోవడం, సేకరించడం మొదలుపెట్టాం. ఇల్లు, పిల్లలను చూసుకోవడం, ఉద్యోగం చేసుకుంటూనే దాదాపుగా పాతిక సంవత్సరాల నుంచి ఇదే పనిలో నిమగ్నమయ్యాను. చెంచు, కోయ, గోండ్లు నివసించే గ్రామాలకు నెలకు ఒకటి –రెండుసార్లు వెళ్లేవాళ్లం. గోండ్ లిపికి కంప్యూటర్ ఫాంట్ తయారు చేయగలిగాం. గోంద్ భాష యూనికోడ్ కన్సార్టియంలోకి వెళ్లింది కాబట్టి ఇక ఆ భాష అంతరించడం అనేది జరగదు. ఆదిధ్వని ఫౌండేషన్ ద్వారా 250 సంగీత సాధనాల వివరాలను క్రోడీకరించాం. మూలధ్వని పేరుతో పుస్తకం తెచ్చాం. అందులో క్రోడీకరించిన సంగీతసాధనాలు, 27 మంది కళాకారులను ఢిల్లీకి తీసుకువెళ్లి 2020లో ప్రదర్శనలివ్వడంలోనూ పని చేశాను. దేశంలో తెలంగాణ కళలకు మూడవస్థానం వచ్చింది. ఆద్యకళకు ఆహ్వానం ‘ఇండియన్ యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, నాన్ట్స్’ ఈ ఏడాది నిర్వహించిన ‘ఇండియా– ఆఫ్రికా టువార్డ్స్ ఎ డైలాగ్ ఆఫ్ హ్యూమానిటీస్’ సదస్సుకు మా ఆదిధ్వని ఫౌండేషన్ నిర్వహించే ‘ఆద్యకళ’కు ఆహ్వానం వచ్చింది. అందులో పని చేస్తున్న వాళ్లలో నేను, జయధీర్ తిరుమలరావుగారు సదస్సుకు హాజరయ్యాం. ‘ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ మ్యూజియమ్’ అనే అంశంపై మీద పత్రం సమర్పించాం. మనదేశంలో ఆదివాసీ సంస్కృతి మీద పరిశోధన చేసిన ఫ్రెంచ్ పరిశోధకులు డేనియల్ నాజర్స్తోపాటు అనేక మంది ఫ్రెంచ్ ప్రొఫెసర్లు ఈ సమావేశాలకు హాజరయ్యారు. అయితే వారంతా మనదేశంలో మూల సంస్కృతి, సంగీతవాద్యాలు అంతరించి పోయాయనే అభిప్రాయంలో ఉన్నారు. మేము వారి అపోహను తొలగించగలిగాం. అంతరించి పోతోందనుకున్న సమయంలో చివరి తరం కళాకారులను, కళారూపాలను ఒడిసి పట్టుకున్నామని చెప్పాం. కాటమరాజు కథ, పన్నెండు పటాలకు సంబంధించిన బొమ్మలు, కోయ పగిడీలను ప్రదర్శించాం. ఆఫ్రికాలో కళారూపాలు ఒకదానికి ఒకటి విడిగా ఉంటాయి. మన దగ్గర కథనం, సంగీతవాద్యం, పటం, గాయకుడు, బొమ్మ అన్నీ ఒకదానితో ఒకటి ముడివడి వుంటాయి. పారిస్‌లో ‘నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్’, ఆంథ్రోపాలజీ మ్యూజియాలను కూడా చూశాం. ‘ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ మ్యూజియమ్’ అనే మా పేపర్‌కి సదస్సులో మంచి స్పందన లభించింది. ఇండియాలో మరో పార్శా్వన్ని చూసిన ఆనందం వారిలో వ్యక్తమైంది. యునెస్కో అంబాసిడర్, మనదేశానికి శాశ్వత ప్రతినిధి విశాల్ వి శర్మ కూడా ప్రశంసించారు. (క్లిక్ చేయండి: ఉందిలే మంచి టైమ్ ముందు ముందూనా...) చేయాల్సింది ఇంకా ఉంది ఆది అక్షరం, ఆది చిత్రం, ఆది ధ్వని, ఆది లోహ కళ, ఆది జీవనం, పరికరాలతో మ్యూజియం ఏర్పాటు చేయాలి. మ్యూజియం ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించాలి. మ్యూజియం హైదరాబాద్ నగర శివారులో ఉంటే భావి తరాలకు మ్యూజియంకు సంబంధించిన పరిశోధనకి ఉపయోగపడుతుంది.రిటైర్ అయిన తర్వాత మనసుకు నచ్చిన పని చేయాలని నమ్ముతాను. ‘ఆదిధ్వని’ ద్వారా ఐదు మ్యూజియాల స్థాపనకు పని చేశాను. నా జీవితం ఆదిధ్వనికే అంకితం’’ అన్నారీ ప్రొఫెసర్. హైదరాబాద్‌లోని ఆమె ఇల్లు ఆదివాసీ సంస్కృతి నిలయంగా ఉంది. – వాకా మంజులారెడ్డి శబ్దం– సాధనం ప్రస్తుతం ‘ఆది చిత్రం’ పుస్తకం తెచ్చే పనిలో ఉన్నాం. ఇదంతా ఒక టీమ్ వర్క్. మన దగ్గర ఆదివాసీ గిరిజనులు, దళిత బహుజనుల దగ్గర నిక్షిప్తమై ఉన్న సంస్కృతిని వెలికి తీయడానికి మొదటి మార్గం శబ్దమే. ఆదివాసీలు తమ కథలను పాటల రూపంలో గానం చేసే వారు. కొన్ని కథలు తాటాకుల మీద రాసి ఉన్నప్పటికీ ఎక్కువ భాగం మౌఖికంగా కొనసాగేవి. మౌఖిక గానంలో ఇమిడి ఉన్న కథలను రికార్డ్ చేసుకుని, శ్రద్ధగా విని అక్షరబద్ధం చేశాం. ‘గుంజాల గొండి అధ్యయన వేదిక’ ఆధ్వర్యంలో ఐటీడీఏతో కలిసి చేశాం. ఓరల్ నేరేటివ్‌కి అక్షర రూపం ఇవ్వడాన్ని ‘ఎత్తి రాయడం’ అంటాం. ఆది కళాకారులను వెలికి తెచ్చే మా ప్రయత్నంలో భాగంగా సమ్మక్క– సారక్క కథను ఆలపించే పద్మశ్రీ సకినె రామచంద్రయ్యను పరిచయం చేశాం. ఆ కథను ఎత్తిరాసిన పుస్తకమే ‘వీరుల పోరుగద్దె సమ్మక్క సారలమ్మల కథ – కోయడోలీలు చెప్పిన కథ’. ఈ ప్రయత్నం రీసెర్చ్ మెథడాలజీలో పెద్ద టర్నింగ్ పాయింట్. – ప్రొఫెసర్ గూడూరు మనోజ, సభ్యులు, ఆదిధ్వని ఫౌండేషన్ -
గిరిజన ప్రాంత అభివృద్ధి పై సీఎం జగన్ కు ప్రత్యేక శ్రద్ద : మంత్రి రోజా
-
సుప్రీంలో తేలాకే ఎస్టీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేస్తాం: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో 10% బీసీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం తెలిపారా అని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ‘తెలంగాణాలో గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందింది. తెలంగాణ బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లు 2017లో హోంశాఖకు చేరింది. కానీ ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఈ రిజర్వేషన్ల కేసు పెండింగ్‌లో ఉంది. అందువల్ల అత్యున్నత న్యాయస్థానంలో ఈ కేసు ఏ విషయమనేది తేలాక.. ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ జీవో నెం.33ను ఆఘా మేఘాలపై జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐతే గత పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా.. తెలంగాణ జారీ చేసిన రిజర్వేషన్ల పెంపు బిల్లు విషయమై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. (చదవండి: ఈడీ ఎదుట విచారణకు హజరైన మంత్రి తలసాని పీఏ అశోక్) -
పశువుల కాపరి పై దాడి చేసిన పులి..
-
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.. సంయమనం పాటించాలి
చండ్రుగొండ ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ ఆదివాసీల చేతిలో మరణించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఆయన మరణం బాధాకరమే. నిజానికి ప్రభుత్వం పోడు భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించడంలో చూపిస్తున్న సాచివేత ధోరణే ప్రజలకూ – ప్రభుత్వ అధికారులకు మధ్య యుద్ధం జరగడానికి కారణం అని చెప్పక తప్పదు. అసలు ఈ సంఘటనకు కారణమేమిటో తేల్చడానికి జిల్లా జడ్జితో విచారణ జరిపించాలని ఆదివాసీలు కోరుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు అక్రమంగా తప్పుడు పద్ధతులలో భూ పట్టాలను మంజూరు చేస్తున్నారు అధికారులు. అలాగే గిరిజనేతరులు ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తుంటే అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఇదంతా తెలిసినా ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన షెడ్యూల్డ్ ప్రాంతంలో కనిపించకుండానే శాంతియుతమైన వాతావరణం క్రమక్రమంగా కరిగి పోతోంది. అందుకు ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్‌పై దాడి ఒక మంచి ఉదాహరణ. అటవీ అధికారులు రాష్ట్రంలో ఆదివాసీ మహిళల మీద, చిన్నారుల మీద దాడులు చేసినప్పడు; పంటలకూ, ఆహార ధాన్యాలకూ, ఇళ్ళకూ నిప్పుపెట్టినప్పుడూ, మనుషుల మీద మూత్రం పోసినప్పుడూ, ఇటువంటి మరికొన్ని అమానవీయ ఘటనలకు పాల్పడినప్పుడూ ప్రభుత్వం స్పందించిన దాఖలాలు కనిపించవు. పోడు భూములపై హక్కుల కోసం ఆదివాసీ సంఘాలు ఆందోళనలు నిర్వ హించినప్పుడు... పోడు సాగుదారులకు పట్టాలిస్తామనీ, పోడు సమస్యను పరిష్కరిస్తామనీ ఒకపక్క చెబుతూనే... మరోపక్క సాగు చేసుకుంటున్న ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులను ఉసిగొలుపుతోంది ప్రభుత్వం. ఆ నిర్లక్ష్య ధోరణి వల్లే ఈరోజు అటవీ అధికారి శ్రీనివాస్ హత్య జరిగింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు ముఖ్యమ్రంతి. చనిపోయిన శ్రీనివాసరావును ముఖ్యమంత్రి తిరిగి తీసుకొస్తాడా? ఆయన పోడు భూముల సాగుపై స్పష్టమైన వైఖరినీ, చిత్తశుద్ధినీ వెల్లడించకుండా ప్రతిసారీ ఎన్నికలసమయంలో సబ్ కమిటీల (అటవీ హక్కుల కమిటీలు) నియామకం పేరుతో కాలం వెళ్ళదీస్తూ అసలు విషయాన్ని దాటవేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆదివాసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా వాడుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారు. ఏదేమైనా... ఆదివాసీ ప్రజలూ సహనం, ఓపికతో చట్టానికి లోబడే పోరాటం కొనసాగించాలే తప్ప... ఇలా ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడం తగదు. సంయమనం పాటించాలి. (క్లిక్ చేయండి: 28 ఏళ్ల కిందట ఆయుధాలు రద్దు.. అటవీ సంరక్షకులకు రక్షణ ఏదీ?!) – వూకె రామకృష్ణ దొర, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
కాళ్లమీద పడినా కర్కశంగా.. గొత్తికోయల దారుణ కృత్యం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చంద్రుగొండ: బెండాలపాడు అటవీ ప్రాంతంలో తమ ఆఫీసర్‌పై దాడి చేయొద్దని సహచర సిబ్బంది కాళ్లపై పడి మొక్కినా గొత్తి కోయలు కనికరించలేదు. వేటకొడవళ్లతో దాడి చేయడంతో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు మెడపై తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో కింద పడి ఉన్న ఎఫ్ఆర్ఓపై తులా వేటకొడవలితో దాడి చేస్తుండగా.. ‘మీ కాళ్లు మొక్కుతా, మా సార్‌ను ఏం చేయొద్దు.. మేము ఇక్కడి నుండి వెళ్లిపోతాం’అంటూ రామారావు వేడుకున్నారు. అయినా పట్టించుకోకుండా చేతిలోని పదునైన ఆయుధంతో శ్రీనివాసరావు మెడ, తల, గొంతుపై అదే పనిగా దాడి చేశాడు. మంగును వాచర్ రాములు నిలువరించే ప్రయత్నం చేశాడు. అయితే ఆవేశంగా ఉన్న వారిద్దరినీ నిలువరించడం సాధ్యం కాక శ్రీనివాసరావును అక్కడే వదిలి రామారావు, రాములు తదితరులు ప్లాంటేషన్ నుంచి బయటకు పరుగులు తీశారు. పోలీసులు, అటవీ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకునే వరకు సుమారు గంట పాటు ఎఫ్ఆర్ఓ రక్తపుమడుగులోనే ఉన్నారు. ఆ తర్వాత కారులో మధ్యాహ్నం 1:56 గంటల ప్రాంతంలో చంద్రుగొండ ప్రాథమిక ఆస్పత్రికి, ఆ తర్వాత ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. జీపులో వెళ్లుంటే..: ఫారెస్ట్ ఆఫీసర్‌గా కేటాయించిన జీపులోనే శ్రీనివాసరావు ఎక్కువగా ఫీల్డ్ విజిట్‌కు వెళ్తుంటారు. కొత్తగూడెం నుంచి చంద్రుగొండకు తన కారులో వచ్చి అక్కడి నుంచి ఫారెస్ట్ జీపులో అడవిలోకి వెళ్లడం ఆయనకు అలవాటు. జీపులో తనతో పాటు సిబ్బందిని తీసుకెళ్లేవారు. కానీ, మంగళవారం ఆయన బైక్ మీద ఫీల్డ్ విజిట్‌కు వెళ్లడం, ఆయన వెంట ఒక్కరే సిబ్బంది ఉండడంతో ఆయనపై పగ పెంచుకుని అదను కోసం చూస్తున్న గొత్తికోయలు తేలికగా దాడి చేయగలిగారని అటవీ సిబ్బంది చెబుతున్నారు. పచ్చదనమే ప్రాణంగా బతికారు పచ్చదనమే ప్రాణంగా బతికిన సిన్సియర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావు చివరకు ఆ పచ్చని చెట్ల మధ్యే ప్రాణాలు వదిలారు. అడవుల రక్షణే ఊపిరిగా జీవించిన ఆయన చివరకు విధి నిర్వహణలో తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసరావు సహజంగానే అడవులంటే ప్రేమ కలిగిన ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎక్కడ పని చేసినా పోడు వ్యవసాయాన్ని అరికట్టడంతో పాటు అడవులు పెంచడంపై శ్రద్ధ చూపించేవారు. ఈ క్రమంలో అటవీ శాఖ నుంచి గోల్డ్ మెడల్ సైతం అందుకున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే ఆయన వ్యక్తిగతంగా మాత్రం చాలా సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రేంజ్లో ఎవరూ ఒక పుల్లను కూడా అడవిని నుంచి బయటకు తీసుకువెళ్లలేరనే విధంగా పేరు సంపాదించారని, అలాంటి ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని తోటి అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ఎఫ్ఆర్వో మృతి.. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన.. దోషులను కఠినంగా శిక్షిస్తామన్న సీఎం కేసీఆర్ -
పులి ‘గిరి’ గీసిన పల్లెలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పెద్దపులి అడుగులు కంటపడటంతో ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటే గిరిజనులు జంకుతున్నారు. వారిని పులి సంచారం వణికిస్తోంది. ఈ నెల 17న కుమురంభీం జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్‌కు చెందిన రైతు తన చేనులో పత్తి తీస్తుండగా పులి దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. అది చిరుతపులి అయి ఉంటుందని మొదటగా భావించినా, పాదముద్రలు, దాడి చేసిన తీరును బట్టి పులిగా నిర్ధారణ అయింది. చేలల్లో పత్తి తీసే సీజన్లో పులుల సంచారం కారణంగా కూలీలు పనులకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో పత్తి ఏరే పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కుమురంభీం జిల్లాలో వాంకిడి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లో ఈ పరిస్థితి నెలకొంది. ఆధిపత్యపోరు, ఆవాసం, తోడు వెతుక్కునే క్రమంలోనే పులుల సంచారం ఎక్కువైందని అధికారులు భావిస్తున్నారు. తాజాగా దాడి చేసిన పులి సైతం మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి వచ్చిందేనని అంటున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే పులి ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లలో వాంకిడి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, సిర్పూర్ టీ, కాగజ్‌నగర్ మండలాల్లోని 13 గ్రామాల పరిధిలో 37 కిలోమీటర్ల మేర ప్రయాణించినట్లుగా ఆనవాళ్లు లభించాయి. రోజుకు సగటున పది కిలోమీటర్లకుపైగా సంచరించింది. రెండేళ్ల క్రితం ఏ2 అనే వలస పులి ఇలాగే తిరుగుతూ ఇద్దరిని చంపేసిన విషయం తెలిసిందే. లోపమెక్కడ? అటవీ అధికారుల అప్రమత్తత కొరవడటంతో రెండేళ్లలో కుమురంభీం జిల్లాలో ముగ్గురు పులి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 17న ఓ లేగ దూడపై, మధ్యాహ్నం ఓ మనిషిపై పులి దాడి చేసింది. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తం కావాల్సిన అధికారులు జాప్యం చేశారు. నిత్యం అడవుల్లో సంచరిస్తూ, ట్రాకర్స్, కెమెరాలతో పులులను ట్రాప్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మహారాష్ట్రతో తెలంగాణ సరిహద్దు ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల వరకు యావత్మాల్, చంద్రాపూర్ జిల్లాల్లో తిప్పేశ్వర్, తడోబా, చంద్రాపూర్ అడవులు దాదాపు 150 కి.మీ.పైగా విస్తరించాయి. పెన్‌గంగా నుంచి ప్రాణహిత తీరం వరకు టైగర్ కారిడార్‌గా ఉంది. ఈ కొత్త పులులను ట్రాక్ చేసి, రిజర్వు ఫారెస్టులోకి పంపించడం అధికారుల ప్రధాన బాధ్యత. గోప్యత పేరుతో పులుల సంచారంపై వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియనివ్వడం లేదనే వాదనలు ఉన్నాయి. పులి దాడుల్లో మరణాలు 2020 నవంబర్ 11న దహెగాం మండలం దిగిడకు చెందిన విఘ్నేశ్(19)పై దాడి చేసి చంపేసింది. 2020 నవంబర్ 19న పెంచికల్‌పేట మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల(16)పై దాడి చేసి చంపింది. ఈ నెల 17న వాంకిడి మండలం చౌపన్‌గూడ పరిధి ఖానాపూర్‌కు చెందిన సిడాం భీము(69)పై దాడి చేసి చంపింది. పులి ఉందంటే నమ్మలేదు.. ఈ ప్రాంతంలో పులి సంచారం ఉందని మేం చెబితే అటవీ అధికారులు నమ్మలేదు. తీరా ఇప్పుడు ఓ ప్రాణం పోయింది. అయినా ఇక్కడ పులి లేదనే అంటున్నారు. పులి భవిష్యత్తులో మనుషులపై దాడులు చేయకుండా చేయాలి. బాధిత కుటుంబానికి పరిహారం, ఉద్యోగం కల్పించాలి. –సిడాం అన్నిగా సర్పంచ్, చౌపన్‌గూడ, వాంకిడి మండలం, కుమురంభీం జిల్లా అప్రమత్తం చేస్తున్నాం కొత్త పులుల రాకపై అంచనా వేస్తూ స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఇటీవల వచ్చిన పులి దాడి జరిగే వరకు స్థానికుల నుంచి సమాచారం అందలేదు. ప్రస్తుతం ఆ పులి రిజర్వు ఫారెస్టులోకి వెళ్లిపోయింది. ఇక భయం అవసరం లేదు. 12 టీంలతో 50 మంది వరకు సిబ్బంది పులిని పర్యవేక్షిస్తున్నారు. స్థానికులకు జాగ్రత్తలపై మరింత అవగాహన కల్పిస్తాం. –దినేశ్‌కుమార్, జిల్లా అటవీ అధికారి, కుమురంభీం పులిని చూసి భయపడ్డాను దాడి చేసిన రోజు పులి పశువుల మందపైకి వచ్చింది. మాకు దగ్గరగానే ఉండటంతో భయపడ్డాను. నాకు ఇప్పటికీ భయం పోలేదు. అడవుల్లోకి వెళ్లాలంటే వణుకుపుడుతోంది. –ఆత్రం అన్నిగా, చౌపన్‌గూడ -
గుర్తింపునకు నోచని రక్తచరిత్ర.. మాన్‌గఢ్ ధామ్‌పై కేంద్రం కీలక ప్రకటన
ఆదివాసీల ప్రాబల్యమున్న మాన్‌గఢ్ ప్రాంతమది. బ్రిటిష్ పాలనలో రక్తమోడింది. జలియన్‌వాలాబాగ్ ఘటనకి ఆరేళ్ల ముందు ఇక్కడ తెల్లదొరలు మారణహోమం సాగించి అక్షరాలా 1500 మంది ఆదివాసీల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. ఈ దారుణానికి చరిత్రలో అంతగా గుర్తింపు లభించలేదు. ఈ ప్రాంతం రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాలో గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది. సంఘ సంస్కర్త గోవింద్ గురు 1913లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీలను ఉత్తేజపరిచారు. ఈ ప్రాంతంలో నివసించే గిరిజనుల్ని భిల్ అని పిలుస్తాను. వీరు విలువిద్యలో ఆరితేరినవారు. బానిసత్వ వ్యవస్థ, పన్నుల భారాన్ని నిరసిస్తూ గోవింద్ గురు ఇచ్చిన పిలుపుతో గిరిజనులు ఉద్యమించారు. 1913 నవంబర్ 17న బ్రిటీష్ సైనికుల విచక్షణారహిత కాల్పుల్లో 1500 మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క దెబ్బకు మూడు రాష్ట్రాలు మాన్‌గఢ్ ధామ్‌ను నేషనల్ మాన్యుమెంట్గా ప్రకటించడం వెనుక ఆదివాసీల ఓట్లను ఆకర్షించే రాజకీయం దాగుంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో గిరిజనులు మాన్‌గఢ్ ప్రాంతాన్ని అత్యంత పవిత్రమైన స్థలంగా భావిస్తారు. ఇక్కడ రాజకీయ లబ్ధికి బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. డిసెంబర్లో గుజరాత్, వచ్చే ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీలకు ఎన్నికలున్న నేపథ్యంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఇప్పటికే ఈ ప్రాంతాన్ని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలంటూ ప్రధానికి రెండు లేఖలు రాశారు. ఆదివాసీల సంక్షేమం కోసం పని చేసే భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) నాలుగు రాష్ట్రాల్లోని 39 జిల్లాల్లో భిల్ ఆదివాసీల ప్రాంతాలతో ప్రత్యేక భిల్ ప్రదేశ్ ఏర్పాటు చేయాలని గళమెత్తుతోంది. గుజరాత్లో 16, రాజస్థాన్‌లో 10, మధ్యప్రదేశ్‌లో ఏడు, మహారాష్ట్రలో ఆరు జిల్లాలను కలిసి భిల్ ప్రదేశ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. రాజస్థాన్ జనాభాలో గిరిజనులు 13.48%, గుజరాత్లో 14.8%, మధ్యప్రదేశ్‌లో 21.1%, మహారాష్ట్రలో 9.35% ఉన్నారు. రాజస్థాన్‌లో 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భిల్ ఆదివాసీలు అధికంగా ఉన్నారు. ప్రస్తుతం వాటిలో కాంగ్రెస్ 13, బీజేపీ 8, బీటీపీ, స్వతంత్రులు చెరొక స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా 27 సీట్లలో 13 బీటీపీ నెగ్గింది. ఇక జాతీయ స్మారక చిహ్నం మాన్‌గఢ్ (రాజస్థాన్): మాన్‌గఢ్ ధామ్‌ను జాతీయ స్మారక చిహ్నంగా కేంద్రం ప్రకటించింది. మాన్‌గఢ్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ ముఖ్యమంత్రుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ప్రాంత అభివృద్ధికి రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర సీఎంలు రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే ఈ ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందన్నారు. ‘‘మాన్‌గఢ్ ధామ్‌ను మరింతగా విస్తరించడానికి అభివృద్ధి చేయాలని మనందరికీ బలమైన కోరిక ఉంది. నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చించుకొని ఒక రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయండి’’ అని ప్రధాని అన్నారు. ఈ ధామ్ని అభివృద్ధిని చేస్తే కొత్త తరంలో స్ఫూర్తిని నింపిన వాళ్లమవుతామని ప్రధాని వ్యాఖ్యానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ చదవండి: ‘మోర్బీ’ విషాదం చూశాకైనా మీరు మారరా? -
ఇంటింటికీ గిరిజన ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రేషన్ దుకాణాలు, రేషన్ పంపిణీ వాహనాల (ఎండీయూ) ద్వారా గిరిజన ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. నవంబర్ 1వ తేదీ నుంచి పైలట్ ప్రాజెక్టు కింద విశాఖపట్నం, తిరుపతి జిల్లాల్లో ప్రారంభించనుంది. తొలి దశలో 290 రేషన్ వాహనాలు, 570 రేషన్ దుకాణాల్లో అమలు చేయనున్నారు. గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ కల్పించడంతోపాటు ఎమ్మార్పీ కంటే తక్కువ రేట్లకే వినియోగదారులకు అందించనున్నారు. ఎండీయూలకు ఆర్థిక బలం చేకూర్చేలా.. ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థలో 9,260 ఎండీయూ వాహనాలు సేవలందిస్తున్నాయి. రేషన్ డోర్ డెలివరీ నిమిత్తం ఎండీయూ ఆపరేటర్లకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.18 వేల రెమ్యునరేషన్ ఇస్తోంది. వారికి మరింత ఆర్థిక బలం చేకూర్చేందుకు ప్రభుత్వరంగ సంస్థలైన గిరిజన, ఆయిల్ ఫెడ్, మార్క్‌ఫెడ్ ఉత్పత్తులను విక్రయించుకునే వెసులుబాటు కల్పించింది. ఆయా సంస్థల నుంచి సబ్సిడీపై సరుకులను తీసుకునే ఆపరేటర్లు వాటిని ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు ప్రజలకు విక్రయించాల్సి ఉంటుంది. ప్రతినెలా పీడీఎస్ బియ్యం పంపిణీలో జాప్యం లేకుండా విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టింది. వినియోగదారులకు తెలిసేలా వస్తువుల ధరల పట్టికను ప్రదర్శించనున్నారు. విక్రయించే ఉత్పత్తులు.. గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా తేనె, అరకు కాఫీ పొడి, వైశాఖి కాఫీ పొడి, త్రిఫల చూర్ణం, నన్నారి షర్బత్, ఆయుర్వేద సబ్బులు, చింతపండు, కుంకుడుకాయ పొడి, షికాకాయ పొడి, కారంపొడి, పసుపు, కుంకుమతోపాటు ఆయిల్‌ఫెడ్ నుంచి పామాయిల్, సన్‌ఫ్లవర్, రైస్‌బ్రాన్, వేరుశనగ నూనెలను అందుబాటులో ఉంచనున్నారు. గిరిజనులకు మేలు చేసేలా.. గిరిజనులకు మేలు చేసేలా ఎండీయూ వాహనాల ద్వారా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం. తొలుత విశాఖ, తిరుపతి జిల్లాల్లో స్పందనను బట్టి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం. రేషన్ లబ్ధిదారులే కాకుండా ప్రజలందరూ ఈ ఉత్పత్తులను కొనుక్కోవచ్చు. బియ్యం ఇచ్చే సమయంలో వినియోగదారులపై ఎటువంటి ఒత్తిడి చేయకుండా విక్రయాలు చేసుకోవాలని ఎండీయూలకు సూచించాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ -
విరగ్గాసిన కాఫీ.. మురిసేలా మిరియం
సాక్షి,పాడేరు: గిరిజనుల సాగులో ఉన్న కాఫీ తోటల్లో ఈ ఏడాది కాపు అధికంగా ఉంది. విరగ్గాసిన కాయలతో పాడేరు డివిజన్లో తోటలు కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ముందస్తుగానే పక్వానికి వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పండ్ల దశకు చేరుకుంటున్నాయి. కాపు ఆశాజనకంగా ఉందని, దిగుబడులు బాగుంటాయని గిరిజన రైతులు ఆనందంగా చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఐటీడీఏ కాఫీ విభాగం గత 20ఏళ్ల నుంచి కాఫీ సాగును ప్రోత్సహిస్తోంది. పాడేరు డివిజన్లోని 11 మండలాల్లో సుమారు 2,10,000 ఎకరాల్లో కాఫీ తోటలుండగా 1,50,000 ఎకరాల విస్తీర్ణంలో గల కాఫీ తోటలు ఫలాసాయాన్ని ఇస్తున్నాయి. మే నెల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలు కాఫీ పంటకు ఎంతో మేలు చేశాయి. గత ఏడాది ఏడు వేల టన్నుల వరకు దిగుబడి రాగా, ఈ ఏడాది దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కేంద్ర కాఫీ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఆశాజనకంగా మిరియాల కాపు కాఫీ తోటల్లో గిరిజన రైతులు అంతర పంటగా సాగు చేస్తున్న మిరియాల కాపు కూడా ఆశాజనకంగానే ఉంది. ముందుగానే కాపు వచ్చింది. సుమారు లక్ష ఎకరాల కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాలను గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. కాఫీ తోటకు నీడనిచ్చే సిల్వర్ ఓక్ వృక్షాలకు మిరియాల పాదులను ఎక్కించి అంతర్ పంటగా సాగు చేస్తున్నారు. ప్రతీ చెట్టుకు ఉన్న మిరియాల పాదుల ద్వారా కనీసం 10 కిలోల ఎండు మిరియాల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది మిరియాల దిగుబడులు కూడా అధికంగానే ఉంటుందని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాఫీ, మిరియాల పంటకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఐటీడీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాఫీ రైతులకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నారు. (చదవండి: అమరావతి రైతుల పేరిట ఉత్తరాంధ్రలో యాత్ర ఎలా?: చెట్టి ఫాల్గుణ) -
వికేంద్రీకరణకు మద్దతుగా పాడేరులో రౌండ్ టేబుల్ సమావేశం
-
వికేంద్రీకరణకు మద్దతుగా గిరిజనుల ఉద్యమాలు...
-
‘10 శాతం కోటా’.. వారంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్లను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి విసిగి వేసారిపోయాం. ఇకపై విసిగిపోం. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా వారం రోజుల్లో జీవోను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తాం. ప్రధాని నరేంద్ర మోదీ.. మా జీవోను అమలు చేయించి గౌరవం కాపాడుకుంటావా? లేక దానితో ఉరి వేసుకుంటవా ఆలోచించుకో..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు అతి త్వరలో పరిష్కారం చూపుతామని.. పట్టాలు ఇచ్చి రైతు బంధు పథకం అమలు చేస్తామని చెప్పారు. భూమిలేని, ఉపాధి లేని గిరిజనుల కోసం ‘గిరిజన బంధు’ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన తెలంగాణ ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ వివరాలు సీఎం కేసీఆర్ మాటల్లోనే.. అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా.. ‘‘జాతి, కులం, మతం, వర్గం అనే విభేదాలు లేకుండా 58 ఏళ్లు ఐక్యంగా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులకు ఐదారు శాతంగా ఉన్న రిజర్వేషన్లను తెలంగాణ వచ్చాక పది శాతానికి పెంచాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. ఏడేళ్లు దాటిపోయింది. దీనిపై ప్రధాని మోదీని, ఈ రోజు హైదరాబాద్‌కు వచ్చి విభజన రాజకీయాలు చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అడుగుతున్నా.. ఏం అడ్డుపడుతోందని గిరిజన రిజర్వేషన్ల బిల్లును ఆపుతున్నారు? రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే ఐదు నిమిషాల్లో జీవో విడుదల చేస్తాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రధాని మోదీని తెలంగాణ గడ్డ నుంచి చేతులు జోడించి అభ్యర్తిస్తున్నా. గిరిజన రిజర్వేషన్ల బిల్లును మీరు ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిస్తే ఆపకుండా ఆమోదం ఇస్తారు. రిజర్వేషన్లు 50శాతం మించకూడదనే ప్రతిబంధన ఎక్కడా లేదు. పక్కరాష్ట్రం తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే కేంద్రం ఏడో షెడ్యూల్లో చేర్చింది. అదే తరహాలో తెలంగాణ న్యాయపరమైన హక్కుకు కేంద్రానికి ఉన్న ప్రతిబంధకమేంటో చెప్పాలి. కేంద్రం సులభంగా పరిష్కరించే విషయాల్లో కూడా తాత్సారం చేస్తూ ప్రజలను గాలికి వదిలేస్తోంది. ప్రైవేటీకరణ పేరిట లక్షల కోట్ల రూపాయలను ప్రైవేటు వ్యక్తులకు దోచి పెడుతోంది. పోడు భూములకు పట్టాలు.. గిరిజన బంధు పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు భూమి దక్కేలా కమిటీ ఏర్పాటు చేసి జీవో 140 కూడా ఇచ్చాం. కమిటీల నుంచి నివేదికలు అందిన వెంటనే పోడు భూములకు పట్టాలు ఇచ్చి రైతుబంధు పథకం అమలు చేస్తాం. సంపద పెంచడం.. అవసరమైన పేదలకు పంచడమే మన సిద్ధాంతం. పోడు భూమి పట్టాల పంపిణీ తర్వాత భూమి లేని గిరిజనులను గుర్తిస్తాం. దళిత బంధు తరహాలో భూమి, భుక్తి, ఆధారం లేని గిరిజన బిడ్డల కోసం వెసులుబాటు చూసుకుని నా చేతుల మీదుగా ‘గిరిజన బంధు’ పథకాన్ని ప్రారంభిస్తాం. మేధోమధన వేదికలుగా ఆదివాసీ, బంజారా భవన్లు గిరిజనుల సమస్యల పరిష్కారానికి బంజారా, ఆదివాసీ భవన్లు వేదికలుగా మారాలి. రాష్ట్రంలో ‘మా తాండాలో మా రాజ్యం’ నినాదాన్ని ఆచరణలోకి తేవడంతో 3 వేలకు పైగా గిరిజన గూడేలు, తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయి. రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయమున్న పంచాయతీలకు ప్రోత్సాహం, ఉచిత విద్యుత్, గురుకులాలు, రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్, టీ ప్రైడ్ కింద గిరిజన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గిరిజన తండాలు, చెంచు, ఆదివాసీ గూడేల్లో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతోంది. రూ.300 కోట్లతో ప్రతి గిరిజన ఆవాసానికి త్రీఫేజ్ విద్యుత్, రూ.200 కోట్లు విద్యుత్ బకాయిలు మాఫీ, వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రోడ్లు, కల్యాణలక్ష్మి, పెన్షన్లు ఇలా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గిరిజనుల సంస్కృతి, భాష, జీవన శైలి కాపాడేలా జాతరలు, పండుగలను వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహిస్తున్నాం. గిరిజన గురుకులాల ద్వారా ప్రతిభ చూపుతున్న విద్యార్థులు.. బంగారు తెలంగాణ బిడ్డలుగా, భారత ప్రతినిధులుగా ఎదగాలి. గిరిజన బిడ్డలు చదుకునేందుకు మరిన్ని గురుకుల సంస్థలు ఏర్పాటు దిశగా చర్చలు జరుగుతున్నాయి..’’ అని కేసీఆర్ తెలిపారు. ఇన్నాళ్లూ పార్టీలు ఓటుబ్యాంకుగానే చూశాయి: సత్యవతి రాథోడ్ గతంలో రాజకీయ పార్టీలు గిరిజనులను ఓటు బ్యాంకుగానే తప్ప మనుషులుగా చూడలేదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్‌ను తమ జాతి ఎప్పటికి మరిచిపోదని చెప్పారు. ఇక జల్, జంగల్, జమీన్ నినాదాన్ని నిజం చేసిన నాయకుడు కేసీఆర్ అని ప్రభుత్వ విప్ రేగ కాంతారావు అన్నారు. ఈ ఆత్మీయ సభలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతా.. ‘‘తెలంగాణ సమాజం ఐక్యత, ప్రగతి పరుగులు ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవద్దు. దుర్మార్గులు, నీచ రాజకీయ నాయకులు, సంకుచిత స్వార్థంతో వస్తున్నారు. మతపిచ్చి కార్చిచ్చులా అంటుకుంటే ఎటూ కాకుండా పోతాం. మీ బిడ్డగా, తెలంగాణ సాధించిన వ్యక్తిగా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా. తెలంగాణలో కల్లోలం రానీయొద్దు. ఈ సమాజం సర్వమానవ సౌభ్రాతృత్వంతో పురోగమించే దిశగా ప్రజల పక్షాన నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తా. ప్రజల రాజ్యం, రైతుల రాజ్యం కోసం తెలంగాణ జాతిగా మనం భారత జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు కదలాలి’’ రాష్ట్రవ్యాప్తంగా సమైక్యత ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్, మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర సచివాలయం బీఆర్కేఆర్ భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాల యాలు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో సైతం ఘనంగా ఉత్సవాలను నిర్వహించారు. ఇదీ చదవండి: విమోచనమే నిజమైన స్వాతంత్య్ర దినం -
ఆదివాసీ, గిరిజనానికి ప్రత్యేక ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మించిన జంట భవనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రేపు(ఈనెల 17న) ప్రారంభించనున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఈ ఏర్పాట్లను అత్యంత ఘనంగా చేపట్టింది. భవనాల ప్రారంభోత్సవానికి ఆయా వర్గాల ప్రజలను ఆహ్వానిస్తోంది. గిరిజన గూడేలు, ఏజెన్సీ గ్రామాలు, తండాల్లోని పంచాయతీలకు ప్రత్యేకంగా ఆహ్వానాలను పంపింది. ఆదివాసీ తెగలు, గిరిజన పౌరులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని అందులో సూచించింది. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులంతా హైదరాబాద్‌లో జంట భవనాల ప్రారంభోత్సవానికి హాజరు కావాలని సూచి స్తూ, ఆయా ఉద్యోగులకు ఆన్‌డ్యూటీ సౌకర్యాన్ని సైతం కల్పించింది. జంట భవనాల ప్రారంభోత్సవం అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే గిరిజన మహాసభను విజ యవంతం చేయాల్సిందిగా ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఒక్కో భవనానికి రూ. 22 కోట్లు... మహానగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్‌లో ఈ రెండు భవనాల కోసం ఎకరా స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చింది. నిర్మాణంకోసం రూ.44 కోట్లు కేటాయించింది. ఓక్కో భవనానికి రూ.22 కోట్లు చొప్పున ఖర్చు చేసింది. ఒక్కో భవనంలో సగటున వెయ్యి మంది సమావేశమయ్యేందుకు వీలుగా నిర్మించింది. ఇక ఈ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులకు అక్కడే వసతి కల్పించేలా గదులు ఉన్నాయి. ఆయా భవనాల్లోకి ప్రవేశించగానే వారి సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే బొమ్మలు, కళాత్మక చిత్రాలను కూడా ఏర్పాటు చేసింది. గతేడాది సెప్టెంబర్ నాటికే భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సమయం కోసమే గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈనెల 17న ముహూర్తం కుదరడంతో.. రేపు ఆ రెండు భవనాలు ప్రారంభం కానున్నాయి. -
మర్రిచెట్టంత త్యాగం మరవొద్దు
‘సెప్టెంబర్ 17.. విమోచనమా, విముక్తా, విలీనమా.. ఏ దినోత్సమైనా అనుకోండ్రి. తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన ఆ రోజును అందరూ యాది చేసుకుంటుండ్రు. సంబురాలూ జేస్తున్నరు. అవ్‌గనీ.. అంతకుముందు మేం జేసిన పోరాటాలు యాదికున్నయా? అడవి బిడ్డలమైన మేం ఆఖరి శ్వాస దాకా ఎందుకు పోరాడినమో.. వెయ్యి మందిమి ఒకేపారి ఒకే మర్రిచెట్టు ఉరికొయ్యలకు ఎందుకు ఊగినమో మీకు ఎరుకేనా? కుమురం భీముడు ఏమిటికి తుపాకీ పట్టిండు..? ఎందుకు పానం ఇడిసిండు? ఏండ్ల సంది చరిత్ర పుస్తకాలల్ల మాకు ఒక్క అక్షరమంత జాగియ్యలేదు. జరంత మీరన్న.. ఇప్పటికన్న.. పట్టించుకోండ్రి’అంటూ నిర్మల్ గడ్డపై ఉన్న రాంజీ గోండు విగ్రహం ఘోషిస్తోంది. ఇంతకూ ఎవరీ రాంజీ..? ఆ వెయ్యి మంది ప్రాణాలు ఎందుకు వదిలారు.. ఇదంతా ఎక్కడ జరిగింది అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే చరిత్రకెక్కని ఈ గాథను చదవాల్సిందే. నిర్మల్: దేశ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి కొనసాగింపు అన్నట్లుగా అడవుల్లో ఉమ్మడి శత్రువులపై గోండులు, రోహిల్లాలు, మరాఠీలు, దక్కనీలు పోరు చేశారు. నిర్మల్ ప్రాంతం కేంద్రంగా 1858–60 వరకు ఈ పోరాటం సాగింది. దీనికి గోండు వీరుడు రాంజీ గోండు నేతృత్వం వహించాడు. మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లలో నివసించే అనేక మంది గిరిజన తెగల సమూహాల్లో గోండ్వానా రాజ్యం బ్రిటిష్ పాలకులు రాక పూర్వమే ఏర్పడింది. గోండుల పాలన 1750 వరకు సుమారు ఐదు శతాబ్దాలపాటు కొనసాగింది. 9 మంది గోండు రాజులలో చివరివాడైన నీల్‌కంఠ్ షా (క్రీ.శ 1735–49)ని మరాఠీలు బంధించి చంద్రాపూర్‌ను ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత బ్రిటిష్‌వాళ్లు చేజిక్కించుకున్నారు. గోండుల పాలన అంతమై ఆంగ్లేయ, నైజాం పాలన మొదలయ్యాక ఆదివాసులనూ నాటి పాలకులు పీడించారు. అడవుల్లోకి చొచ్చుకొస్తూ ఆదివాసుల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఆంగ్లేయ, నైజాం సేనలపై జనగాం (ఆసిఫాబాద్) కేంద్రంగా చేసుకున్న మర్సుకోల రాంజీగోండు పోరాటం ప్రారంభించాడు. నిర్మల్ కేంద్రంగా ఉన్న ఆంగ్లేయ కలెక్టర్.. నిజాం సేనలతో కలసి అడవులను, ఆదివాసులను పీడిస్తున్నాడని తెలియడంతో రాంజీగోండు ఈ ప్రాంతం వైపు వచ్చాడు. రోహిల్లాల తోడుతో.. ప్రథమ సాతంత్య్ర సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి వీరమరణం పొందాక నానాసాహెబ్ పీష్వా, తాంతియాతోపే, రావుసాహెబ్‌లు తమ బలగాలతో విడిపోయారు. తాంతియాతోపే అనుచరులైన రోహిల్లా సిపాయిలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీదర్, పర్బనీ, తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాలకు తరలివచ్చారు. వారు అజంతా, బస్మత్, లాథూర్, మఖ్తల్, నిర్మల్‌లను పోరాట కేంద్రాలుగా చేసుకున్నారు. నిర్మల్ ప్రాంతంలో రోహిల్లాల నాయకుడు సర్దార్ హాజీతో కలిసిన రాంజీ... ఉమ్మడి శత్రువులైన ఆంగ్లేయ, నిజాం సేనలపై విరుచుకుపడ్డాడు. సరైన ఆయుధ సంపత్తి లేకున్నా నిర్మల్ సమీపంలోని సహ్యాద్రి కొండలను, అడవులను కేంద్రంగా చేసుకొని ముప్పుతిప్పలు పెట్టాడు. నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం బలగాలు వారిపై దాడులు చేసి దెబ్బతిన్నాయి. ఈ విషయం కలెక్టర్ ద్వారా హైదరాబాద్ రాజ్యంలో వారి రెసిడెంట్ అయిన డేవిడ్సన్, నాటి పాలకుడు అఫ్జల్ ఉద్దౌలా వరకు తెలిసింది. అణచివేత కోసం బళ్లారి దళం.. ప్రథమ సంగ్రామానికి కొనసాగింపుగా రాంజీ నేతృత్వంలో నిర్మల్ కేంద్రంగా ప్రారంభమైన పోరును పాలకులు తీవ్రంగా పరిగణించారు. అణచివేత కోసం బళ్లారిలోని 47వ నేషనల్ ఇన్ఫ్రాంట్రీని నిర్మల్ రప్పించారు. కల్నల్ రాబర్ట్ నేతృత్వంలోని ఈ దళం ఇక్కడి ప్రాంతంపై అంతగా పట్టులేకపోవడంతో రాంజీసేన చేతిలో దెబ్బతింది. ఈ కసితో రాంజీని దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నించి రాబర్ట్ సఫలమయ్యాడు. సోన్–కూచన్‌పల్లి ప్రాంతంలో గోదావరి ఒడ్డున రాంజీసేన పట్టుబడింది. ఒకే మర్రికి వెయ్యి మంది ఉరి.. దొంగదెబ్బతో బంధించిన రాంజీ సహా వెయ్యి మందిని శత్రుసేనలు చిత్రహింసలు పెట్టాయి. ఇలాంటి వాళ్లు మళ్లీ తమపై పోరాడేందుకు కూడా సాహించకూడదని నరకం చూపించాయి. వారందరినీ నిర్మల్ శివారులోని ఎల్లపెల్లి దారిలో నేలలో ఊడలు దిగిన మర్రిచెట్టు వద్దకు ఈడ్చుకెళ్లి అందరూ చూస్తుండగా రాంజీ సహా వెయ్యి మందిని ఉరితీశారు. దేశ స్వాతంత్య్ర చరిత్రలోనే మునుపెన్నడూ జరగని ఈ ఘటన 1860 ఏప్రిల్ 9న జరిగింది. ఆ తర్వాత కుమురం భీమ్ సహా ఎందరో సమరయోధులకు స్ఫూర్తిగా నిలిచింది. నేటికీ చరిత్రకెక్కని పోరాటం.. ఇంతటి పోరాటాన్ని సాగించిన రాంజీగోండు, వెయ్యి మంది వీరుల త్యాగం ఇప్పటికీ చరిత్రకెక్కలేదు. గతేడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్మల్ వచ్చి నివాళులర్పించినా రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్వగ్రామానికి సమీపంలోనే వెయ్యి ఉరుల మర్రి ఉన్నా.. పట్టించుకున్న నాథుడు లేడు. జిల్లా కేంద్రంలోని ఓ చిన్నపాటి విగ్రహం, 1995లో గాలివానకు నేలకొరిగిన వెయ్యి ఉరుల మర్రిచెట్టు ప్రాంతంలో అనాథలా అమరవీరుల స్థూపం మినహా ఎలాంటి జ్ఞాపకాలు లేవు. రాంజీ పేరిట మ్యూజియం పెడతామని కేంద్రం ప్రకటించినా ఇప్పటికీ ముందడుగు పడలేదు. సెప్టెంబర్ 17 ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో తమ పూర్వీకులను గుర్తించి చరిత్రలో చోటుకల్పిస్తారేమోనన్న ఆశతో ఆ అమరవీరుల వారసులు ఎదురుచూస్తున్నారు. -
కృషి: ఇప్పపూల లడ్డు పసుపు మసాలా పానీయం
అడవి నుంచి దూరమయ్యాం.. పల్లె నుంచి పట్టణవాసంలో కరెన్సీ కోసం నిత్యం కసరత్తులు చేస్తున్నాం. కానీ, అడవి పంచే ఔషధం.. పల్లె ఇచ్చే పట్టెడన్నమే మనకు అమ్మ చేతి గోరుముద్దంత ప్రేమను అందిస్తుంది. అలాంటి ప్రేమకు వారధిగా నిలుస్తున్నారు గుంటూరు వాసి షేక్ రజియా. ఛత్తీస్‌గడ్‌లోని అటవీ ప్రాంతాల్లో గిరిజనుల స్థావరాలను వెతుక్కుంటూ వెళ్లి వారి ఆహారపు అలవాట్లు తెలుసుకుని, ‘బస్తర్ ఫుడ్ ఫర్మ్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్’ పేరుతో సంస్థను నెలకొల్పి అక్కడి మహిళల చేత ఆరోగ్యకరమైన ఉత్పత్తులను తయారు చేయిస్తున్నారు. వాటికి పట్టణాల్లోనే కాదు అంతర్జాతీయ మార్కెట్లోనూ విలువనూ.. అక్కడి మహిళలకు ఉపాధి అవకాశాలనూ పెంచుతున్నారు. ఆరేళ్లుగా రజియా చేస్తున్న ఈ కృషి గురించి అడిగితే ఆమె ఎన్నో అడవి ముచ్చట్లను ఆనందంగా పంచుకున్నారు. ‘‘జగ్దల్పూర్లో ‘బస్తర్ ఫుడ్ ఫర్మ్’ మెయిన్ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ నుంచి దంతెవాడ, బస్తర్‌లోనూ మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఆదివాసీలున్న చోటును వెతుక్కుంటూ వెళ్లి, అక్కడ కొంతమంది మహిళలతో మాట్లాడి ఒక యూనిట్‌ని తయారు చేస్తాను. అలా ఇప్పటివరకు పదికి పైగా యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఆదివాసీల ఆహార ఉత్పత్తులను నాణ్యంగా తయారు చేయిస్తుంటాను. వాటిని పట్టణవాసులకు మార్కెటింగ్ చేస్తుంటాను. వీటిలో.. మహువా (ఇప్పపూల) లడ్డూ, టీ పొడి, కుకీస్, పసుపు మసాలా, చింతపండు సాస్, ఇన్స్టంట్ చింతపండు రసం పౌడర్, చాక్లెట్స్, తేనె, సేంద్రియ బియ్యం, కారం, బెల్లం.. ఇలా 22 ఉత్పత్తులు ఉన్నాయి. ఆంధ్రా నుంచి ఛత్తీస్గడ్ మా నాన్నగారు గుంటూరులో ఉండేవారు. వ్యాపారరీత్యా ఛత్తీస్‌గడ్‌లో స్థిరపడ్డారు. అమ్మ, ఇద్దరు తమ్ములు, బాబాయ్ కుటుంబ సభ్యులు ..అందరం కలిసే ఉంటాం. అలా నా చదువు అంతా అక్కడే సాగింది. మైక్రోబయాలజీలో డిగ్రీ చేశాను. స్వచ్ఛమైన అడవి సౌందర్యం గురించి నాకు తెలుసు. అందుకే ఎప్పుడూ అడవి బిడ్డల జీవనశైలి మీద నా చూపు ఉండేది. నా చదువులో భాగంగా మొక్కల పరిశోధనకు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి, గిరిజనులను కలిశాను. అప్పుడు అక్కడి గ్రామాల్లో కొంతమంది మహిళలు మహువా (ఇప్పపూల) లడ్డూలను తయారుచేస్తున్నారు. నాకు చాలా ఆసక్తి అనిపించింది. ఇప్పపూలలో ఉండే పోషకాలను అడిగి తెలుసుకున్నాను. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఇప్పపూలలో తలనొప్పి, విరేచనాలు తగ్గించే సుగుణాలు ఉన్నాయి. చర్మ, కంటి సమస్యలతో సహా చాలా వ్యాధులకు ఔషధంగా వాడచ్చు. వంటకాలకు సహజమైన తీపిని అందిస్తాయి. దీంతో పోషకాహార నిపుణులు, మరికొంత మంది సాంకేతి నిపుణులు, ఆరుగురు గిరిజన మహిళలతో కలిసి అన్ని అనుమతులతో 2017లో ‘బస్తర్ ఫుడ్ ఫర్మ్’ ప్రారంభించాను. సవాళ్లను ఎదుర్కొంటూ... ముందు ఈ బిజినెస్‌కి ఇంట్లో వాళ్లే ఒప్పుకోలేదు. ‘ఎందుకు కష్టం. ఉద్యోగం చూసుకోక’ అన్నారు. బ్యాంకులను సంప్రదిస్తే లోన్ ఇవ్వలేదు. మహువా లడ్డూలను రుచిగా తయారు చేయడంలోనూ సవాళ్లు ఎదురయ్యాయి. చాలా మంది ‘ఎందుకు ఇదంతా వృథా... ఇది ఫెయిల్యూర్ బిజినెస్’ అన్నారు. దీనికి కారణం లేకపోలేదు. చాలాకాలంగా మన దేశంలో ఇప్పపూలను మద్యం తయారీలోనే వాడతారని తెలుసు. ఆదివాసీలే వీటిని ఉపయోగిస్తారు మనకెందుకు అనే అభిప్రాయమే ఉంది. వీటిలోని సానుకూల కోణాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాను. అనుమతి కోసం చాలా మంది అధికారులను సంప్రదించాను. 2018లో ఒక ఐఎఎస్ ఆఫీసర్ రెండు నెలల ప్రోగ్రామ్‌కు అనుమతి ఇచ్చారు. లడ్డూల నాణ్యత పెంచడానికి చాలా ప్రయోగాలు చేశాం. మహువా లడ్డూల తయారీ మార్కెటింగ్ చేస్తే రెండు లక్షల రూపాయల లాభం వచ్చింది. అప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది. నేర్చుకునేవారికి శిక్షణాలయం బస్తర్ ఫుడ్ ఫర్మ్ని ఇన్స్టిట్యూట్లా మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నాను. ఆదివాసీల ఆహారాలు ఏవున్నాయో వాటిని బయటి ప్రపంచానికి చూపించాలన్నదే నా తాపత్రయం. ప్రస్తుతం లండన్ కంపెనీతో కలిసి పని చేయబోతున్నాం. దీనివల్ల అంతర్జాతీయ మార్కెటింగ్ కూడా బాగా పెరుగుతుంది. ఈ బిజినెస్ మోడల్‌గా రాబోయే తరానికి తెలియాలి. ఈ ఆలోచనతోనే ఆసక్తి గలవారు ఒక ఏడాది పాటు ఈ కోర్సు ప్రత్యక్షంగా నేర్చుకునేలా రూపొందించాను. నేర్చుకోవాలంటే ఇక్కడ చాలా పని ఉంది. మరో రెండేళ్లలో ఇన్స్టిట్యూట్ సిద్ధం అవుతుంది. ఇప్పటికే స్టూడెంట్స్ గ్రూప్స్‌గా వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆసక్తిగలవారు నేర్చుకోవడానికి మా సంస్థను సంప్రదిస్తున్నారు’’ అని ఆనందంగా వివరించారు రజియా. పల్లెవాసుల మధ్య పని చేయాలని, కొత్త మార్గాలను అన్వేషించాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ, అనుకున్నంతగా ఆచరణలో పెట్టలేరు. సవాళ్లను ఎదుర్కొంటూ, సమస్యలను అధిగమిస్తూ పల్లెకు–పట్టణానికి వారధిగా నిలుస్తున్న రజియా లాంటివారు యువతరానికి ప్రతీకగా నిలుస్తున్నారు. సమస్యలను అధిగమిస్తూ! ‘ఈ కన్సల్టెన్సీ మీద కొంత ఆదాయం వస్తుంది. దానిని పని చేస్తున్న మహిళలకే పంచుతాం. ఇక్కడి మహిళలకు పని వచ్చు కానీ మార్కెటింగ్ తెలియదు. ఊరు దాటి బయటకు వెళ్లలేరు. చదువుకున్న వారికి పట్టణ వాతావరణం గురించి తెలియదు. వారి ప్రతిభకు మేం సపోర్ట్‌గా ఉన్నాం. నక్సలైట్స్ సమస్యలూ వస్తుంటాయి. అడవుల్లోని మారుమూల పల్లెలకు వెళ్లినప్పుడు ఒక్కోసారి ఫుడ్ దొరకదు. అక్కడి ఆదివాసీలు త్వరగా అర్థం చేసుకోరు. వారి భాష మనకు రాదు. వాళ్ల భాషల్లోనే విషయం చెప్పాలన్నా కొంచెం సమస్యే. కానీ, వాటిని అధిగమిస్తేనే ఏదైనా చేయగలం. ఒక్కసారి వారికి అర్థమైతే మాత్రం మనమంటే ప్రాణం పెట్టేస్తారు. అంతబాగా చూసుకుంటారు. వాళ్లదగ్గర ఉన్న ప్రతిభను పట్టణానికి పంచే పనిని చేస్తున్నాను.’ పల్లెకు–పట్టణానికి వారధి ‘ రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్ట్‌కి అనుకూలంగా ఉందనుకుంటే అక్కడకు మా యూనిట్ కూడా మారుతూ ఉంటుంది. నా టీమ్ మెంబర్స్ పది మంది ఎప్పుడూ నాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. మెట్రో సిటీస్‌లో ప్రమోషన్స్ కోసం చురుగ్గా ఉండాలి. అందరికీ పల్లె ఉత్పత్తులు ఇష్టమే. కానీ, అందరికీ అవి లభించేదెలా? అందుకే, నేను పల్లెకు–పట్టణానికి వారధిగా మారాను. నేను చేసే ఈ ప్రాజెక్ట్ వల్ల యుఎస్ వెళ్లడానికి ఫెలోషిప్ కూడా వచ్చింది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో కలిసి పని చేశాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా ఉత్పత్తులకు మరింత ఎక్స్పోజర్ పెరిగింది. మంచి పేరు వచ్చింది.’ – నిర్మలారెడ్డి -
సీతమ్మ ఆగ్రహం.. దుస్తులు లేకుండా ఉంటారని శాపం.. అప్పటినుంచి..
మల్కన్‌గిరి(భువనేశ్వర్): జిల్లాలోని ఖోయిర్‌పూట్ సమితి ముదిలిపొడ, ఓండ్రహల్ పంచాయతీల్లో సుమారు 10వేల మంది బొండా గిరిజన తెగలవారు జీవిస్తున్నారు. వీరి నివాసాలన్నీ సముద్ర మట్టానికి 4వేల అడుగులు ఎత్తులో, జన జీవనానికి దూరంగా, వన్య ప్రాణులు, జల పాతాలకు దగ్గరగా ఉంటాయి. వీరి వస్త్రధారణకు సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడుతో కలిసి వనవాసం చేస్తున్న సమయంలో బొండా ఘాట్ సమీపంలోని జలాపాతం వద్ద సీతాదేవి స్నానం చేస్తుండగా చూసిన ఓ బొండా మాహిళ నవ్వింది. ఆగ్రహానికి గురైన సీతమ్మ వారు.. ఇకపై మీరు కూడా దేహంపై దుస్తులు లేకుండా ఉంటారని శపించారు. దీంతో మహిళలంతా కలిసి, క్షమాపణ కోరగా.. తాను కట్టుకున్న చీరలో చిన్న ముక్కను వారికిచ్చింది. అప్పటి నుంచి బొండా మహిళలంతా సీతాదేవి మాటకు కట్టుబడి నడుము కింది భాగంలో వస్త్రం మినహా, శరీరమంతా పూసలు, వెండి కడియాలు చుట్టుకుంటారు. తాము ఫొటో దిగితే తమ ఆత్మలో సగం ఎవరో తీసుకుపోతారనే మూఢ నమ్మకంతో ఇప్పటికీ ఆయుధం తోనే బయటకు వస్తుంటారు. ప్రతి గురువారం ఒనకఢిల్లీ, ఆదివారం జరిగే ముదిలిపొడ సంతలకు అటవీ ఉత్పత్తులతో గుంపులుగా వెళ్తారు. అక్కడ తమకిష్టమైన జీలుగు కల్లు, అలంకరణ సామగ్రి, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తాంటారు. చదవండి: లవ్ వైరస్: హెచ్ఐవీ పేషెంట్‌తో ప్రేమ.. ప్రాణం మీదకు తెచ్చుకుంది! -
నిందగా మారిన గణచిహ్నం
హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రాల్లో 1983 నాటి ‘కిసీ సే న కెహనా (ఎవరితో చెప్పొద్దు)’ ప్రసిద్ధ హాస్యచిత్రం. అందులో ‘హనీమూన్’ హోటల్ బోర్డును ‘హనుమాన్’గా మార్చారని హీరోయిన్‌తో అంటాడు హీరో. అలా హనుమాన్ను వ్యాపారీకరించడాన్ని దర్శకుడు చూపించారు. ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ ఈ సినిమా స్క్రీన్ షాట్‌ను చూపి, ‘2014 ముందు హనీమూన్, 2014 తర్వాత హనుమాన్’ అని 4 ఏళ్ల క్రితం ట్వీటారు. ఇది మత భావాలను రెచ్చగొట్టే అంశంగా మారింది. భగవాన్ హనుమాన్ను కోతి అని అవమానించారని జుబేర్‌పై అభియోగం. పురాణాల్లో రాక్షసులు, దేవగణాలు, యక్షులు, రామాయణంలో వానరులు వారి గణచిహ్నాలతో పేర్కొనబడ్డ స్థానిక జాతుల మానవ సమూహాలు. గణచిహ్నాలను రూపాలకు అన్వయించారు. ‘కపి’ పదాన్ని కోతి అని అనువదించారు. సవరులు, శబరులు, ఇతర ఆదివాసీ తెగలవారు రామాయణంలో వానరులుగా పేర్కొనబడ్డారు. వీరు వాలం (తోక) గల నరులు. తోకలాంటి వస్త్రం ధరించే నరులు. వెనుక పొడవుగా వేలాడే గోచీని కట్టుకునేవారు. ఈ గోచీ పురుషులకు మాత్రమే పరిమితం. వాలి భార్య తార, సుగ్రీవుని భార్య రుమాదేవి, ఆంజనేయుని తల్లి అంజనీ దేవి వగైరా వానర జాతి స్త్రీలకు తోకలుండవు. వానరులు, వానర రాజ్యాల గురించి రామాయణం చాలా విషయాలు చెప్పింది. వాటిని కల్పిత, ఉద్దేశపూరిత వక్రీకరణలకు గురిచేశారు. వానరులంటే కోతులని ప్రచారం చేశారు. రాముడు కూడా యుద్ధంలో వానరులు మానవరూపాల్లో ఉండరాదన్నాడు. హరిరూపంలో ఉండాలన్నాడు. హరి అంటే విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, యముడు, సింహం, గుర్రం, పాము, కోతి, కప్ప అని అర్థాలు. ఆటవికుల ద్వేషులు కోతి అన్న అర్థాన్ని స్థిరీకరించారు. వానరజాతికి కోతిచేష్టలు అంటగట్టి వినోదించారు. వానరులను కోతులను చేసి ఆంజనేయుని అవమానించింది ఆర్య జాత్యహంకారులే. మతవాదులు వారి వారసులు. హేతుబద్ధ ఆలోచనలను ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత సామాజిక శాస్త్రవేత్తలదీ, విజ్ఞులదీ! (క్లిక్: ప్రశ్నించినవారికి నిర్బంధమా?) – సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి, గుంటూరు -
జాతీయ నృత్యోత్సవం.. మురిపించిన ‘జానపదం’
-
బీచ్‌రోడ్డులో కనుల పండువగా గిరిజన నృత్యోత్సవం (ఫొటోలు)
-
గిరి ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్
సాక్షి, పాడేరు : గిరిజన వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ లక్ష్యంగా కృషిచేయాలని ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ ఆదేశించారు. శనివారం సాయంత్రం పాడేరులోని వెలుగు కార్యాలయం సమీపంలోని వన్‌ధన్ యోజన మార్కెటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఐటీడీఏ పీవో పాడేరు డివిజన్ పరిధిలోని డ్వాక్రా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులన్నింటిని పరిశీలించారు. వెలుగు కార్యాలయం సమీపంలో విశాలమైన స్థలం ఉందన్నారు. అక్కడ మార్కెటింగ్ విస్తరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే చిరుధాన్యాల ఉత్పత్తుల ద్వారా డుంబ్రిగుడ మండలంలోని డ్వాక్రా మహిళలు సత్తా సాధించారని, అదే స్ఫూర్తితో డివిజన్లోని అన్ని మండలాల డ్వాక్రా సంఘాలు స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. రోడ్డు పక్కనే ఉన్న సుండ్రుపుట్టు వెలుగు కార్యాలయం ద్వారా అన్ని అటవీ, వ్యవసాయ గిరిజన ఉత్పత్తులన్నింటికి రిటైల్ మార్కెటింగ్ జరపాలన్నారు. వన్‌ధన్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వ సాయంతో అమలవుతున్న అన్ని వ్యాపార ఉత్పత్తులను రిటైల్‌గా అమ్మకాలు జరిపి ఆ లాభాలను డ్వాక్రా సంఘాలకు వర్తింపజేయాలన్నారు. స్వయం సమృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీడీ మురళి, డీపీఎం సత్యం నాయుడు, వెలుగు ఏపీఎం, ఇతర అధికారులు పాల్గొన్నారు. (చదవండి: పోలీసులకు చిక్కిన హుండీల దొంగ) -
తునికాకు.. సేకరణ ఏ మేరకు?
పాల్వంచ రూరల్: వేసవిలో గిరిజన, గిరిజనేతర కూలీలకే కాకుండా అటవీశాఖకు ఆదా యం సమకూర్చిపెట్టే తునికాకు సేకరణకు రంగం సిద్ధమైంది. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో తునికాకు సేకరణ ఆశించిన రీతిలో సాగలేదు. అయితే ఈ సారి పరిస్థితులు మెరుగుపడడంతో ఆకు సేకరణపై గిరిజను లు ఆశలు పెంచుకున్నారు. ఈ ఏడాది పాత పది జిల్లాలకు గాను ఎనిమిది జిల్లాల (నల్ల గొండ, హైదరాబాద్ మినహా) పరిధిలోని 242 యూనిట్లలో 195 యూనిట్లలోనే తుని కాకు టెండర్ల ప్రక్రియ జరిగింది. మిగతా యూనిట్లకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఆకు నాణ్యత ఆధారంగా భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలో 50 ఆకుల కట్టకు రూ.2.50 చెల్లించడానికి నిర్ణయం తీసుకోగా, మిగిలిన జిల్లాల్లో రూ.2.05 చెల్లించనున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ అధికారు లు వెల్లడించారు. తునికాకు సేకరణ ద్వారా ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు రెండు నెలల పాటు ఉపాధి లభిస్తుంది. సీజన్ మొత్తంలో ఈ పని ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా. పూర్తయిన టెండర్ల ప్రక్రియ ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,41,700 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరించాలని అటవీ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గత నెలలోనే ఆన్లైన్ ద్వారా టెండర్ల ప్రక్రియ పూర్తయింది. గతేడాది 2,41,600 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరించాలని లక్ష్యం నిర్దేశించుకున్నా.. కరోనా తదితర కారణాలతో లక్ష్యాన్ని చేరుకోలేదు. కేవలం 1,60,460 బ్యాగులే సేకరించగలిగారు. ఈ సారి పరిస్థితులు కొంత మెరుగ్గా ఉండడంతో లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. రెండేళ్లుగా పూర్తికాని లక్ష్యం రెండేళ్లుగా తునికాకు సేకరణ లక్ష్యం మేరకు జరగడం లేదు. గత ఏడాది తునికాకు టెండ ర్ల ప్రక్రయలో జాప్యం జరగడం, కాంట్రాక్టర్లు సకాలంలో ఆకుల్లోని వ్యర్థాలను శుభ్రం చేయకపోవడం ఓ కారణమని తెలుస్తోంది. దీనికి తోడు కరోనా కారణంగా ఆకు సేకరణకు గిరిజనులు పెద్దగా ఆసక్తి చూప లేదు. అలాగే, గిరిజనులు ఉపాధి హామీ పనులకు వెళుతుండడం, అడవుల్లో పోడు సాగు కారణంగా తునికాకు చెట్లు అంతరించిపోవడం, తునికాకు కట్ట ధర గిట్టుబాటు కాకపోవడం వంటి కారణాలతో లక్ష్యం నెరవేరడం లేదని చెపుతున్నారు. అలాగే ఎండాకాలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అడవుల్లో ప్రమాదకర ప్రదేశాల్లో ఆకు సేకరించడం కంటే సులభంగా ఉండే ఉపాధి పనులకు వెళ్తే రూ.250 కూలి వస్తుందని గిరిజనులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. స్టాండర్డ్ బ్యాగ్ అంటే.. ఒక్కో కట్టలో 50 ఆకులు ఉంటాయి. ఇలాంటివి వెయ్యి కట్టలు కలిపితే ఒక స్టాండర్డ్ బ్యాగ్ అవుతుంది. కూలీలు ఆసక్తి చూపడం లేదు.. తునికాకు సేకరణ క్రమంగా తగ్గిపోవడానికి గిరిజనులు, గిరిజనేతరులు పెద్దగా ఆసక్తి చూపకపోవడమే కారణం. ఉపాధి హామీ పనులకు వెళ్తే ఎక్కువ కూలీ దక్కుతుందని వారు భావిస్తున్నారు. తునికాకు సేకరణలో శ్రమకు తగిన ఫలితం రావడం లేదనే భావన గిరిజనుల్లో ఉంది. – కట్టా దామోదర్‌రెడ్డి, వైల్డ్‌లైఫ్ విభాగం ఎఫ్డీఓ, పాల్వంచ -
మళ్లొస్తా నల్లమలకు..
సాక్షి, నాగర్‌కర్నూల్: చెంచుల సంక్షేమం, జీవ నోపాధికి నిబద్ధతతో కృషి చేస్తానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. ఆదివాసీల స్థితిగతులను మెరుగుపరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 6 గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసుకున్నామని, తర్వాత మిగతా గిరిజన ఆవాసాలకూ ఈ కార్యక్రమాలను విస్తరిస్తా మని తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమ లలోని లోతట్టు అటవీప్రాంతం అప్పాపూర్ గ్రామాన్ని గవర్నర్ శనివారం సందర్శించారు. దట్టమైన అడవిలో చెంచులను వారి నివాసా ల్లో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంద ని, ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజని అన్నారు. మళ్లీ ఒకసారి నల్లమల ప్రాంతాన్ని సందర్శిస్తానని చెప్పారు. ఓ గవర్నర్‌గా కాకుండా డాక్టర్‌గా చెంచుల ఆరోగ్యం, జీవన స్థితిగతుల పట్ల తనకెప్పుడూ ఆందోళనగా ఉంటుందన్నారు. చెంచుల ఆరోగ్య సంరక్షణతో పాటు పోషకాహారం అందించేందుకు న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్ స్కీంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, మందులు, ఆస్పత్రి సౌకర్యాన్ని కల్పించనున్నట్లు వివరించారు. 6 గ్రామాలకు రూ. 1.5 కోట్లు నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో రెండేసి గ్రామాల చొప్పున మొ త్తం 6 గ్రామాలను దత్తత తీసుకున్నామని గవర్నర్ తెలిపారు. స్వచ్ఛంద సంస్థల సహకారం తో ఆయా గ్రామాల్లో సోలార్ విద్యుత్, పాఠశా లల మరమ్మతులు, గిరిజనుల ఇళ్ల మరమ్మతు ల పనులు చేపడుతున్నట్లు చెప్పారు. పోషకాహార లోపం నివారణకు ప్రత్యేక కార్యక్రమాల అమలుతో పాటు ఇంటింటికీ 10 చొప్పున రాజశ్రీ కోళ్లను పంపిణీ చేశామన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద 6 గ్రామాలకు రూ.1.5 కోట్లు కేటాయించామని తెలిపారు. గవర్నర్ పర్యటకు నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు, స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గైర్హాజరయ్యారు. మరోవైపు సమావేశానికి హాజరైన చెంచులకు అధికారులు భోజన వసతి కల్పించకపోవడంతో చెంచులు ఆకలితోనే వెనుదిరిగారు. 2 గ్రామాలకు 2 మొబైల్ బైక్ అంబులెన్స్‌లు అప్పాపూర్‌లోని చెంచు ఆవాసాలను సందర్శించిన గవర్నర్.. ఇంటింటికీ మంచినీటి సరఫరాను ప్రారంభించారు. చెంచుల ఆరాధ్య దైవం బైరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమంతో పాటు అప్పాపూర్, భౌరాపూర్ గ్రామా లకు రెండు మొబైల్ బైక్ అంబులెన్స్‌లను అం దజేశారు. ఉన్నత విద్యను చదువుతున్న చెంచు విద్యార్థులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం తో పాటు స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. గవర్నర్‌కు రాజీనామా లేఖ ఇచ్చిన సర్పంచ్ చెంచులపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ అమ్రాబాద్ మండలం సార్లపల్లి సర్పంచ్ చిగుర్ల మల్లికార్జున్ వేదికపైనే గవర్నర్‌కు తన రాజీనామా లేఖను అందించారు. గిరిజన గ్రామాల్లో సర్పంచుల తీర్మానాలకు విలువ లేకుండా పోయిందన్నారు. గిరిజన గ్రామాల సర్పంచులను వివిధ శాఖల అధికారులు హేళనగా చూస్తున్నారని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా చెంచులకు తాగునీరు అందిస్తున్నామంటున్నారని.. అది అబద్ధమని, బోర్ల ద్వారా వచ్చే చిలుము నీటితో అనారోగ్యానికి గురవుతున్నామని చెప్పారు. చెంచుపెంటల్లో సారాయి, మద్యం లేకుండా చేస్తేనే తామంతా ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. -
గిరిజనుల మనోభావాలను కేద్రం దెబ్బ తీసింది: మంత్రి హరీష్ రావు
-
జాతరలో కీచకపర్వం.. కొరడా ఝుళిపించిన ఖాకీలు
సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. జాతరకు వెళ్లిన గిరిజన యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు కొందరు దుండగులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కాగా.. ఆ కీచకులను గుర్తించి జాతీయ భద్రతా చట్టం ప్రయోగించారు ఖాకీలు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందకపోయినా.. వైరల్ అయిన ఓ వీడియోను సుమోటాగా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మొత్తం పదిహేను మంది నిందితుల్లో.. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎన్ఎస్ఏ (National Security Act) కింద కేసు నమోదు చేశారు. వాళ్లను అరెస్ట్ చేసి.. రోడ్ల వెంబడి నడిపించుకుంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వాళ్ల తల్లిదండ్రుల్ని పిలిపించి.. వాళ్ల సమక్షంలోనే ఘటన గురించి వివరించి చెప్పారు. ఇక మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మార్చి 11వ తేదీన అలిరాజ్పూర్ జిల్లా సోన్వా రీజియన్ వాల్పూర్ గ్రామంలో భగోరియా జాతర జరిగింది. ఈ జాతరకు వెళ్లిన ఇద్దరు గిరిజన యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు కొందరు. అంతటితో ఆగకుండా ఆ మృగచేష్టలను వీడియో తీసి వైరల్ చేశారు. సాయం కోసం ఆ యువతులు కేకలు వేసినా.. జనాలెవరూ వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం పదిహేను నిందితులు.. ధార్, అలిరాజ్పూర్ జిల్లాలకు చెందినవాళ్లుగా గుర్తించారు. ⚡️Distressing Video A tribal woman molested in broad daylight by saffron-clad goons during a fair in Madhya Pradesh, India.pic.twitter.com/lTZKLxVVwF — Ahmer Khan (@ahmermkhan) March 13, 2022 అయితే పోలీస్ స్టేషన్ గడప తొక్కడం ఇష్టం లేని ఆ యువతుల కుటుంబాలు.. ఘటనపై ఫిర్యాదు చేయలేదు. దీంతో పోలీసులు.. బాధితుల కుటుంబాలకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయినా స్పందన లేకపోవడంతో.. వాళ్ల కోసం వెతికారు. బాధితుల జాడ లేకపోవడంతో స్వయంగా పోలీసులే సుమోటాగా కేసు నమోదు చేసుకున్నారు. నరేంద్ర దావర్, విశాల్ కియాదియా, దిలీప్ వస్కెల్, మున్నా భీల్.. ఇలా ప్రధాన నిందితులు నలుగురు ముప్ఫై ఏళ్లలోపు వాళ్లే కావడం విశేషం. ఈ నలుగురిని ప్రస్తుతం ఉజ్జయిని జైలుకు తరలించినట్లు అల్జిపూర్ ఎస్పీ మనోజ్ సింగ్ వెల్లడించారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు ఆయన. -
అండలేని తాండా - బతుకు చిత్రం
-
Andhra Pradesh: మా ఆస్పత్రి మారింది
రాష్ట్రంలో ప్రజారోగ్యానికి మంచి రోజులొచ్చాయి. ప్రభుత్వ వైద్య రంగంలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మౌలిక వసతులకు ఏ కొరతా లేకుండా నాడు–నేడు కింద ఆస్పత్రులు సకల హంగులతో రూపు మార్చుకుంటున్నాయి. ప్రాథమిక ఆరోగ్య రంగం బలోపేతం అయిందని ఏ మారుమూల గ్రామంలోకి వెళ్లి.. ఏ పీహెచ్‌సీని చూసినా ఇట్టే తెలుస్తోంది. ఇది వరకు ఆయా గ్రామాల్లోని ఆస్పత్రులు ఎప్పుడు తెరుచుకునేవో.. ఎప్పుడు వైద్యుడుంటాడో ఎవరికీ తెలిసేది కాదు. వైద్యుడి సంగతి అటుంచితే కనీసం నర్సు కూడా అందుబాటులో లేని దుస్థితి ఇప్పుడు సమూలంగా మారిపోయింది. ఆరోగ్య పరంగా ఏ చిన్న సమస్య వచ్చినా నిమిషాల వ్యవధిలో వైద్యం అందుతోందని గ్రామీణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరుకు చెందిన ఎస్.శిరీషది మధ్యతరగతి కుటుంబం. ఇటీవల ఇంటి వద్ద ఆడుకుంటుండగా శిరీష కుమారుడిని కుక్క కరిచింది. పిల్లవాడికి ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయించడానికి వచ్చారు. వైద్య సిబ్బంది వేగంగా వివరాలు నమోదు చేసుకుని టీకా వేశారు. 15 నిమిషాల్లో వైద్య ప్రక్రియ ముగించారు. ఈ నేపథ్యంలో పీహెచ్సీలో వైద్య సేవలపై ఆమెను ప్రశ్నించగా.. ‘ఈ మధ్యే మా ఆస్పత్రి మారింది. కొన్నేళ్ల క్రితం ఇలా ఉండేది కాదు. ఆస్పత్రి లోపలంతా అపరిశుభ్ర వాతావరణం ఉండేది. రోగులు కూర్చోడానికి వీలుండదు. తాగునీరు, మరుగుదొడ్లు కూడా ఉండేవి కాదు. సిబ్బంది కొరత ఉండేది. చిన్న చిన్న జబ్బులకు, వైద్య పరీక్షలకు కంకిపాడు ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేసే వారు. అక్కడికి వెళ్లినా లాభం ఉండేది కాదు. దీంతో 20 కిలోమీటర్ల మేర ప్రయాణించి వ్యయ ప్రయాసల కోర్చి విజయవాడకు వెళ్లే వాళ్లం. కుక్క కరిచి ఎవరైనా వస్తే ఇక్కడ టీకాలు ఉండేవి కావు. ఇక్కడి నుంచి కంకిపాడుకు వెళితే.. అక్కడా కొన్ని సార్లు టీకాలు ఉండవు. దీంతో విజయవాడకు వెళ్లక తప్పేది కాదు. కానీ ప్రస్తుతం ఆస్పత్రిని బాగా అభివృద్ధి చేశారు. తగినన్ని మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య సమస్యలకు బయటకు వెళ్లే అవస్థ తప్పింది’ అని శిరీష సంతోషం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు పీహెచ్సీలో గతంలో కేవలం ఒకే ఒక్క నర్సు తప్ప ఎవరూ ఉండే వారు కాదని.. ఒంట్లో బాగోలేదని చూపించుకోవడానికి ఆస్పత్రికి వచ్చిన కె.శ్యామ్ చెప్పాడు. ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం కింద ఆస్పత్రిని బాగా అభివృద్ధి చేసిందన్నాడు. ఇప్పుడు ముగ్గురు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఎంఎన్‌వో/ఎఫ్ఎన్వో, ఇతర సిబ్బంది ఉన్నారన్నాడు. ‘గతంలో డాక్టర్లు వేళకు వచ్చే వారు కాదు. వచ్చినప్పుడు కొద్దిసేపు ఉండి వెళ్లిపోయేవారు. దీంతో వైద్యం కోసం వచ్చిన వాళ్లు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఈ కష్టాలు పడలేక కంకిపాడు, విజయవాడకు వెళ్లాల్సి వచ్చేది. చాలా మంది ఆర్ఎంపీల వద్దకు వెళ్లేవారు. ఇప్పుడా బాధలన్నీ తప్పాయి’ అని తెలిపాడు. – సాక్షి, అమరావతి అనూహ్య రీతిలో వసతుల కల్పన ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ సహా 12 మంది స్టాఫ్ ప్యాట్రన్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం భారీగా నియామకాలు చేపట్టింది. కృష్ణా జిల్లా ఉప్పులూరు పీహెచ్‌సీనే తీసుకుంటే ఇద్దరు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్ఎన్వో, ఫార్మసిస్ట్ పోస్టులు భర్తీ అయ్యాయి. అన్ని వసతులు కల్పించారు. దీంతో ఓపీ (ఔట్ పేషెంట్) సంఖ్య పెరిగింది. త్వరలో దీనికి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ (ఎన్‌క్వాస్) గుర్తింపు రానుంది. యూపీహెచ్‌సీల్లోనూ ఉత్తమ వైద్యం గతంలో 259 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ) ఉండేవి. ప్రస్తుతం ఈ కేంద్రాలకు అదనంగా మరో 301 కేంద్రాలు.. మొత్తంగా 560 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి కేంద్రానికి సొంతంగా భవనం ఉండేలా చర్యలు తీసుకుంటోంది. నాడు–నేడులో భాగంగా కొత్త భవనాలు, మరమ్మతుల కోసం రూ.399.2 కోట్లు ఖర్చు చేస్తోంది. 499 మంది వైద్యులను ఇప్పటికే నియమించారు. ఇతర సిబ్బందిని నియమిస్తున్నారు. ప్రస్తుతం 10 పడకలతో ఇన్ పేషెంట్ విభాగం అందుబాటులోకి వచ్చింది. పీహెచ్‌సీల తరహాలోనే యూపీహెచ్‌సీల్లోనూ డాక్టర్లు, నర్సులు, సిబ్బంది, మందులు, వైద్య పరీక్షలకు కొరత లేకుండా చర్యలు తీసుకుంది. కాగా, రూ.16,255 కోట్ల భారీ నిధులతో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన.. 16 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణం, 5 గిరిజన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు మరికొన్ని ఆస్పత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రూ.663 కోట్లతో నాడు–నేడు పీహెచ్‌సీల బలోపేతానికి ప్రస్తుత ప్రభుత్వం నాడు–నేడు కింద రూ.663 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,145 పీహెచ్‌సీలు ఉండగా, 1,125 ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులు చేపడుతున్నారు. 977 పీహెచ్‌సీలకు మరమ్మతులు, 148 పీహెచ్‌సీలకు కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే 580 పీహెచ్సీలలో మరమ్మతులు, వసతుల కల్పన పూర్తయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోపు మరమ్మతులు, వచ్చే ఏడాది జూన్‌లోపు కొత్త భవనాల నిర్మాణం పూర్తి కానుంది. నాడు–నేడు కింద జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వసతులు కల్పిస్తున్నారు. దీంతో దేశంలోనే అత్యధిక పీహెచ్‌సీలకు ఎన్‌క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ – కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో ఉంటుంది) గుర్తింపు ఉన్న రాష్ట్రంగా ఏపీ సత్తా చాటింది. 320 పీహెచ్‌సీలకు ఈ గుర్తింపుతో ఏపీ తొలి స్థానంలో, 191తో గుజరాత్ రెండో స్థానంలో, 134తో కేరళ మూడో స్థానంలో ఉంది. అందుబాటులో స్పెషలిస్ట్ వైద్యం ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజల కోసం స్పెషలిస్ట్ వైద్య సేవలను సైతం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా 9 స్పెషాలిటీల్లో 1,278 మంది వైద్యులను నియమిస్తోంది. వీరు వారంలో ఆరు రోజుల పాటు రోజుకు రెండు పీహెచ్‌సీలకు వెళ్లి స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే 276 పోస్టులు భర్తీ అయ్యాయి. ‘నాడు–నేడు’తో మార్పులు ఇలా.. ► ప్రతి ఆస్పత్రిలో సిటిజన్ చార్టర్ విధిగా అమలవుతోంది. దీని ప్రకారం ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వైద్య సేవలు సమయానికి అందుతున్నాయి. ఆస్పత్రిలో వసతులు/గదులకు సంబంధించిన సైన్ బోర్డులు ఏర్పాటయ్యాయి. ► నిబంధనల మేరకు అగ్నిమాపక ధ్రువీకరణ పత్రాలు, కాలుష్య నియంత్రణ మండలి సర్టిఫికెట్లు ఉన్నాయి. రక్త పరీక్షలన్నీ అక్కడే జరిగేలా అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులతో కూడిన ల్యాబ్‌లు ఏర్పాటయ్యాయి. ప్రతి 3–4 గంటలకు ఒకసారి పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. ► గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అత్యవసర మందులు అందుబాటులో ఉండేవి కాదు. ప్రస్తుతం 240 రకాల ఎసెన్షియల్ మందులు పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంటున్నాయి. ► చాలా ఆస్పత్రుల్లో గతంలో ఒకే వైద్యుడు ఉండేవాడు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులను తప్పనిసరి చేసింది. ఇందుకు తగ్గట్టుగా ఇప్పటికే 645 మంది డాక్టర్లు, 1,113 నర్సులు, 403 ల్యాబ్ టెక్నీషియన్లు సహా 2,964 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 264 డాక్టర్, 1,269 ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్ఎన్వో, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తోంది. నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ► గతంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పనివేళలు ఉండేవి. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒకరు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒకరు ఓపీ చూస్తారు. రాత్రి 8 గంటల తర్వాత అత్యవసర సేవల్లో భాగంగా ఫోన్ చేస్తే ఆస్పత్రికి వస్తారు. ► వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు మందుల సరఫరా, వైద్య పరీక్షల శ్యాంపిల్స్ సేకరించి పీహెచ్‌సీలకు తరలించడం కోసం ప్రతి పీహెచ్‌సీకి ఒక స్కూటీని త్వరలో అందుబాటులోకి తెస్తున్నారు. ► మండలానికి రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 176 కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన్నఓగిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం ఈ ఫొటోలో కనిపిస్తున్న గిరిజనుడు మల్లూరి రాముకు 65 ఏళ్లు. విజయనగరం జిల్లా పార్వతీపురం వాసి. రిక్షా నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లాలంటే 150 కిలోమీటర్లు ప్రయాణించాలి. వృద్ధాప్యంలో అంత దూరం ప్రయాణించడం ప్రయాసే. రాము తరహాలో మరెవ్వరూ ఇబ్బంది పడకూడదని రాష్ట్రంలో ఐదు గిరిజన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలకు ప్రభుత్వం పూనుకుంది. రూ. 246 కోట్లతో శ్రీకాకుళం జిల్లా సీతంపేట, విజయనగరం జిల్లా పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, పశ్చిమగోదావరి జిల్లా కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలోని బుట్టాయగూడెం, కర్నూలు జిల్లా శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని ప్రకాశం జిల్లా దోర్నాలల్లో ఈ ఆస్పత్రుల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. గిరిజన ప్రాంతాల్లో అందుబాటులో ఉండే వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయి. వైద్యులు, సిబ్బంది కోసం క్వార్టర్స్ కూడా నిర్మిస్తున్నారు. ఇబ్బందులు ఉండవు మా ప్రాంతంలోనే అన్ని వసతులతో ఆస్పత్రులు అందుబాటులోకి రాబోతుండటం శుభ పరిణామం. తద్వారా రోడ్డు ప్రమాదాలు, ఇతర అనారోగ్య పరిస్థితుల్లో సరైన సమయంలో మెరుగైన వైద్యం అందక సంభవించే మరణాలు తగ్గుతాయి. – కొవ్వాసి నారాయణ, బుట్టాయగూడెం, పశ్చిమగోదావరి జిల్లా వేగంగా పూర్తి చేస్తాం రాష్ట్రంలో ఐదు చోట్ల గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్లకు పనులు అవార్డ్ చేశాం. వాళ్లు పనులు ప్రారంభించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. – మురళీధర్‌రెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ వైస్ చైర్మన్, ఎండీ ఏపీ రోల్ మోడల్ అవ్వాలన్నదే లక్ష్యం ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్యం అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వైద్య రంగంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా అడుగులు ముందుకు వేస్తున్నాం. నాడు–నేడు కింద ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అత్యధిక ఎన్‌క్వాస్ గుర్తింపు కలిగిన పీహెచ్‌సీలతో రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంది. జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నాం. దేశానికి ఏపీ రోల్ మోడల్ అవ్వాలన్న సీఎం లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నాం. – ఆళ్ల నాని, ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పుడు మా ఊళ్లోనే మంచి వైద్యం నాకు 70 ఏళ్లు. మా గ్రామంలోనే పీహెచ్సీ ఉంది. గతంలో ఇక్కడ సేవలు సరిగా లేనందున ఉయ్యూరులో ఓ ప్రైవేట్ వైద్యుడి వద్దకు వెళ్లే వాడిని. డాక్టర్ ఫీజు, మందులు కలిపి రూ.500 అయ్యేది. ఇప్పుడు మా ఊళ్లోనే ప్రభుత్వ ఆస్పత్రి బాగుండటంతో మంచి వైద్య సేవలు అందుతున్నాయి. క్రమం తప్పకుండా ఇక్కడికే వచ్చి, మధుమేహం, ఇతర వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకువెళ్తున్నాను. వైద్యులు, సిబ్బంది బాగా చూస్తున్నారు. – బి.కోటేశ్వరరావు, చినఓగిరాల, కృష్ణా జిల్లా ఇదివరకు ఆర్ఎంపీ వైద్యమే గతి గతంలో మా ఊరికి సమీపంలోని రాకోడు పీహెచ్సీలో వైద్యుడు అందుబాటులో ఉండేవాడు కాదు. దీంతో పెద్దాస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేది. అంత దూరం వెళ్లలేక ఊర్లోనే ఆర్ఎంపీతో చూపించుకునే వాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక ఇద్దరు వైద్యులను నియమించారు. ఎప్పుడూ ఎవరో ఒకరు అందుబాటులో ఉంటున్నారు. ఆస్పత్రికి వెళితే ప్రేమగా పలకరిస్తూ వైద్యం చేస్తున్నారు. – పి.అప్పలనాయుడు, పెదవేమలి, విజయనగరం -
యూట్యూబ్ తోడుగా.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు
ఇంటర్నెట్ను సరిగా ఉపయోగించుకుంటే మంచే జరుగుతుంది. కానీ, 65 శాతం జనాభా సరదా కోణంలోనే చూస్తోంది. రోజూ వాట్సాప్ స్టేటస్లు.. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఫీడ్లతో వేస్ట్ చేస్తున్న ఇంటర్నెట్ డేటా గణాంకాలే అందుకు నిదర్శనం. అయితే.. ఇక్కడో యువకుడు అదే ఇంటర్నెట్ సాయంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. తాను ఉంటున్న గడ్డపై ఎవరూ సాధించని ఘనత సాధించాడు. జమ్ము కశ్మీర్ శ్రీనగర్‌కు చెందిన తుఫెయిల్ అహ్మద్ అనే యువకుడు.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో అర్హత సాధించాడు. జమ్ము నుంచి ఈ ఘనత సాధించిన తొలి గిరిజన వ్యక్తి తుఫెయిల్ కావడం విశేషం. పక్కా పల్లెటూరు.. పైగా కోచింగ్ స్తోమతలేని కుటుంబం ఆ యువకుడిది. అయినప్పటికీ అమ్మ ఆశీర్వాదంతో.. యూట్యూబ్ సాయంతో ఈ ఘనత సాధించాడు ఆ యువకుడు. అయితే ఇది కూడా అంత సులువుగా ఏం జరగలేదు. తుఫెయిల్ స్వగ్రామం శ్రీనగర్‌లోని ముల్నర్ హర్వాన్. పక్కా పల్లెటూరు కావడంతో ఇంటర్నెట్ సిగ్నల్ సరిగా ఉండదు. అందుకే పక్కనే ఉండే సిటీకి వెళ్లి.. యూట్యూబ్ వీడియోల్ని డౌన్లోడ్ చేసుకుని వచ్చేవాడు. వాటి సాయంతో మెటీరియల్ పొగుచేసి NEET కు ప్రిపేర్ అయ్యాడు. కొడుక్కి సెల్‌ఫోన్ కొని ఇచ్చేందుకు తాను దాచుకున్న డబ్బును అందించింది ఆ తల్లి. అలా తల్లి అందించిన సహకారం.. కష్టపడి చదివి నీట్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యాడు. ‘‘మా ఊర్లో సరైన కరెంట్, మొబైల్ సిగ్నల్ సౌకర్యాలు లేవు. అందుకే పొరుగున్న ఉన్న ఊరికి నడుచుకుంటూ వెళ్లి వీడియోలు డౌన్ లోడ్ చేసుకుని వచ్చేవాడిని. ఈ నడక చిన్నతనంలో స్కూల్ చదువుకూ పనికొచ్చేది (రోజూ రెండు కిలోమీటర్లు స్కూల్ కోసం వెళ్లేవాడట). మా ఊళ్లో వైద్య సదుపాయాలు సరిగా లేవు. అందుకే డాక్టర్ అయ్యి ఈ ఊరికి సేవ చేయాలనుకుంటున్నా. కశ్మీర్ యువత మీద కొందరికి ఉన్న అభిప్రాయాన్ని చెరిపేయాలన్నది నా ఉద్దేశం. అది మా అమ్మ కోరిక కూడా ’’ అని చెప్తున్నాడు తుఫెయిల్. ఇదిలా ఉండగా.. నార్త్ కశ్మీర్లో నీట్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ఆర్మీ ఒక ఫ్రీ కోచింగ్ క్యాంప్ తెరిచిన సంగతి తెలిసిందే. రీజియన్లవారీగా రాత పరీక్షలో ఎంపికైన మొత్తం 50 మందికి ఇక్కడ ఉచితంగా శిక్షణ అందిస్తోంది ఇండియన్ ఆర్మీ. -
గంజాయి.. ఇక గతమే
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గతేడాది వరకు గంజాయి పండించిన పొలాలు ఉద్యాన పంటల క్షేత్రాలుగా మా రుతున్నాయి. గిరి శిఖరాల నడుమ మారుమూలన ఉండే ఆ పొలాల్లో ఇప్పుడు విదేశీ కూరగాయలతో పా టు కాఫీ, పసుపు, స్ట్రాబెర్రీ వంటి పంటలు పురుడు పో సుకుంటున్నాయి. గంజాయి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడమే కాకుండా ఆ పొలాల్లో ఉద్యాన పంటలు పండించేలా గిరిజనులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. గంజాయి సాగును సమూలంగా నిర్మూలించాలని సంకల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయానికి అనుగుణంగా.. లక్ష ఎకరాల్లో ప్రత్యామ్నాయ సాగువైపు అడుగులు పడుతున్నాయి. గిరిజనులకు ప్రోత్సాహకాలందిస్తూ.. వాణిజ్య పంటల సాగుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అప్పటి పాలకులు పట్టించుకోక.. మన్యంలో గిరిజనులు పండించే పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడం, ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్నా అప్పటి పాలకులు సరిగ్గా పట్టించుకోకపోవడం వంటి పరిస్థితుల్లో అక్కడి గిరిజన రైతుల్లో కొం దరు గంజాయి సాగువైపు ఆకర్షితులయ్యారు. అలా విశాఖ మన్యంలో గంజాయి సాగు సుమారు 10 వేలకు పైగా ఎకరాల్లో విస్తరించింది. ఎట్టిపరిస్థితుల్లో గంజా యి సాగుపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాలతో యంత్రాంగం రంగంలోకి దిగింది. ఫలితంగా గతేడాది వరకు సగటున 10 వేల ఎకరాల్లో సాగయ్యే గంజాయి పంట రెండేళ్లలో 7 వేల ఎకరాలకు పడిపోయింది. పోలీసులు, సెబ్, ఐటీడీఏ, సచివాలయ సిబ్బంది డ్రోన్ల సహాయంతో గంజాయి సాగును గుర్తించి.. ఆ భూముల్లో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించకపోతే తిరిగి గంజాయి వైపు గిరి జనులు మొగ్గుచూపే ప్రమాదం ఉండటంతో మూడేళ్లలో లక్షకు పైగా ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సా గు చేపటేఊ్టలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా 62 వేల మంది గిరిజనులకు 98 వేల ఎకరాలను ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల ద్వారా అందించి ఆ భూములపై వారికి యాజమాన్య హక్కులు కల్పిం చింది. వీటితో పాటు గంజాయి సాగైన 7 వేల ఎకరాల్లో వాణిజ్య పంటలను సాగు చేయిస్తోంది. శిక్షణ ఇచ్చి మరీ.. వాణిజ్య పంటలపై గిరిజనులకు అవగాహన కల్పించడంతో పాటు సాగు రీతులు, సస్యరక్షణపై పూర్తి స్థాయిలో శిక్షణ అందించేలా ప్రభుత్వం చేర్యలు చేపట్టింది. ముఖ్యంగా వేరుశనగ, రాజ్మా, రాగులు వంటి పంట లతో పాటు డ్రాగన్ ఫ్రూట్, లిచీ, పైనాపిల్, అవకాడో, స్ట్రాబెర్రీ, అల్లం, నల్ల మిరియాలు, పొద మిరియాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బంగాళాదుంప, టమోటా, కాకర, బీర, బెండ వంటి ఉద్యాన పంటలను 46,650 ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో పాటు రానున్న రెండేళ్లలో 34 వేల ఎకరాల్లో కాఫీ గింజల సాగుకు సన్నద్ధం చేయాలని అధికారులు భావి స్తున్నారు. మరో 5 వేల ఎకరాల్లో రూ.100 కోట్లతో పసుపు పండించనున్నారు. గిరిజనుల ఆర్థికాభివృద్ధికి రూ.144 కోట్లు ప్రతి గిరిజనుడు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా మూడేళ్లకు అభివృద్ధి ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఇందుకోసం రూ.144 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. స్వచ్ఛందంగా సాగు వైపు.. ప్రభుత్వం చేపడుతున్న చైతన్య కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంతో గిరిజనులు ఈ ఏడాది స్వచ్ఛందంగా గంజాయి సాగును విడనాడారు. ప్రభుత్వం కేవలం ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి చేతులు దులిపేసుకోకుండా.. గిరిజన రైతులకు పూర్తిస్థాయి సహకారం అందించాలని నిర్ణయించింది. విత్తనాలు సరఫరా చేయడంతోపాటు పంట చేతికి వచ్చేంత వరకు సహకారం అందిస్తామని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గోపాలకృష్ణ తెలిపారు. జామ్, జ్యూస్‌గా మార్చడం, పల్పింగ్, ఆహార ఉత్పత్తుల తయారీ వంటి పనులు చేపట్టేలా వారిని ప్రోత్సహిస్తామన్నారు. దళారుల చేతిలో మోసపోకుండా.. పంట ఆదాయం చేతికొచ్చేంత వరకూ గిరిజన రైతులకు అండగా నిలుస్తామని చెప్పారు. -
ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు
కేంద్ర ప్రభుత్వం జనవరి 25న ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాలలో అవార్డు గ్రహీతగా నిలిచిన సకిన రామచంద్రయ్య తెలంగాణ ఆదివాసీ జానపద కళాకారుడు. ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక్కల పోరాట వీర గాథలను, కోయల ఇలవేల్పుల కథలను డోలి సహాయంతో పొల్లు పోకుండా చెప్పడంలో నేర్పరి. సకిన రామచంద్రయ్యది కోయదొరల వంశం. కోయజాతిలో సంప్రదాయ వేడుకలను జరిపించడంలో డోలీలు ప్రధాన భూమిక పోషిస్తారు. డోలి ఉపతెగకు చెందిన రామచంద్రయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం కూనవరం గ్రామంలో ముసలయ్య, గంగమ్మలకు 1960లో జన్మించాడు. ఈ పద్మశ్రీ గుర్తింపు ఆయన పేదరి కాన్ని ఆదుకోలేకపోయినా మరుగున పడుతున్న డోలికళకు పునరుజ్జీవం తేగలుగుతుంది. గిరిజనుల ఇలవేల్పుల చరిత్రని ఉయ్యాల పాటలు పాడుతూ చెప్పడంలో దిట్ట రామచంద్రయ్య. చదువు కోలేకపోతేనేం... ఆదివాసీల మూలాలు, సంప్రదా యాలని గడగడ చెప్పేస్తాడు. వనదేవతల కథల్ని అక్షరం పొల్లు పోకుండా చెప్తాడు. ఆదివాసుల జాతరల్లో, పండుగల్లో రామచంద్రయ్య పాట ఉండాల్సిందే. (క్లిక్: మన తెలుగు పద్మాలు వీరే...) డోలీ అంటే – రెండు అడుగుల వెడల్పు, మరి కొద్ది ఎక్కువ పొడవుతో వుండే చర్మవాద్యం. ఈ వాద్యాన్ని ఎక్కువగా కోయల ప్రత్యేక పూజలో డోలీ కోయలు వాయిస్తారు. వీరు కోయ ప్రజల కొలుపులు, జాతరలు చేస్తారు. అంతేకాదు చావు, పుట్టుకలకి కర్మ కాండలు నిర్వహిస్తారు. పెళ్లిళ్లు చేస్తారు. ఆ సమయంలో ఈ డోలు తప్పనిసరి. అంటే ఇది ఒక రకంగా అధికారిక కోయవాద్యం. పేరుకి డోలు అంటారు. కాని ఇది కోయ సంస్కృతికి మూలాధారం. డోలీలు ఈ డోలు వాయిస్తూ దాచి వుంచిన ‘పడిగె’ని తీసి వివిధ జాతర సందర్భాలలో పగిడిద్దరాజు, ఎరమరాజు, బాపనమ్మ, గడికామరాజు, గాదిరాజు, గోవిందరాజు, ఉయ్యాల బాలుడు, దూల రాజు, ఒర్రె మారయ్య, కొమ్ములమ్మ, గుంజేడు ముసలమ్మ వంటి కోయ తెగ వీరులు/ వివిధ గోత్రాల వారి కథలు చెబుతారు. ఈ వాద్యకారులు కోయ చరిత్రని, సంస్కృతిని కాపాడే చరిత్రకారులు. (చదవండి: నిబద్ధ కెమెరా సైనికుడు.. సెల్యూట్ మై ఫ్రెండ్!) తన ముగ్గురు కూతుళ్ళకు డోలీ కథల వారసత్వం రాకపోవడంతో ఇన్నాళ్ళు సంప్రదాయంగా కాస్తో కూస్తో జీవనోపాధి కల్పించిన ఈ కళ కనుమరుగు కాకూడదని తనయుడు బాబురావుకు నేర్పించే ప్రయత్నంలో ఉన్నాడు రామచంద్రయ్య. ప్రభుత్వం ఈ సంప్రదాయ డోలి కళకు ప్రాచుర్యం కల్పిస్తూ ఈ నిరుపేద గిరిజన కుటుంబాన్ని కూడా అన్నివిధాల ఆదుకోవాలని కోయగిరిజనులు కోరుతున్నారు. (చదవండి: తెలుగు కవితా దండోరా ఎండ్లూరి) – గుమ్మడి లక్ష్మినారాయణ ఆదివాసీ రచయితల వేదిక -
‘ప్రత్యేక నిధి’పై పట్టింపేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళిత, గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం తలపెట్టిన ‘ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీ ఎస్డీఎఫ్), గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్టీ ఎస్డీఎఫ్) పర్యవేక్షణ గాడి తప్పింది. ఎస్డీఎఫ్ చట్టం ప్రకారం.. కనీసం ఆరు నెలలకోసారి కమిటీల సమావేశాలు జరగాలి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)కుగాను ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ల పర్యవేక్షణ కమిటీల సమావేశాలు ఒక్కసారి కూడా జరగలేదు. గతేడాది జూన్ చివర్లో ఎస్టీ ఎస్డీఎఫ్ పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా తూతూమంత్రంగా సాగింది. ఎస్సీ ఎస్డీఎఫ్ పర్యవేక్షణపై గత ఏడాదిగా ఒక్కసారి కూడా కమిటీ భేటీ కాలేదు. లెక్కలపై స్పష్టత ఏది? ‘ఎస్డీఎఫ్’చట్టం ప్రకారం.. ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయిస్తుంది. వాటిని 42 ప్రభుత్వ శాఖల ద్వారా ఖర్చు చేస్తారు. శాఖల వారీగా ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖ నోడల్ డిపార్ట్మెంట్లుగా ఉంటాయి. వీటిని నిర్దేశించిన వార్షిక సంవత్సరంలో పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలి. ఏవైనా కారణాలతో నిధులు మిగిలితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. కానీ ప్రత్యేక అభివృద్ధి నిధుల ఖర్చు, ప్రణాళికలకు సరైన పర్యవేక్షణ లేకుండా పోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిస్తూ.. కొత్త వార్షిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అంచనాల రూపకల్పన ప్రారంభమైనా.. ఎస్డీఎఫ్కు కేటాయించిన నిధులతో చేపట్టిన పనులు, చేసిన ఖర్చు, పూర్తయిన పనులు, మిగులుకు సంబంధించిన గణాంకాలపై స్పష్టత లేదు. రూ. 33,610.06 కోట్లు కేటాయించినా.. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద 2021–22 వార్షిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.33,610.06 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీ ఎస్డీఎఫ్ కింద రూ.21,306.84 కోట్లు కేటాయించగా, ఎస్టీ ఎస్డీఫ్ కింద రూ.12,304.22 కోట్లు కేటాయించింది. 2020–21 నాటికంటే రూ.7,303.81 కోట్లు అదనంగా కేటాయించడంతో.. అభివృద్ధి పనుల్లో వేగం పెరుగుతుందని ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ పరిస్థితి భిన్నంగా తయారైంది. -
మావోయిస్టుల అదుపులో ఆదివాసీలు
చర్ల: తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాలకు చెందిన సుమారు 100 మంది ఆదివాసీ గిరిజనులను మావోయిస్టులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు రోజులు గడిచినా వారిని వదలకపోవడంతో ఆదివాసీల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న పోలీసు క్యాంపులను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనల్లో అన్ని గ్రామాల ఆదివాసీలు, గిరిజనులు పాల్గొనాలని మావోయిస్టులు గతంలో పిలుపునిచ్చారు. అయితే, వారు స్పందించకపోవడంతోనే మావోయిస్టులు ఆగ్రహించినట్లుగా తెలుస్తోంది. కాగా, మావోయిస్టులు పలువురిని బంధించిన విషయాన్ని తమకు చెప్పలేదనే కారణంతో శనివారం ఉదయం కుర్నపల్లికి వెళ్లిన సీఐ అశోక్, ఎస్సై రాజువర్మ పలువురు యువకులను చర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే సాయంత్రం వారిని విడుదల చేసి నట్లు విలేకరులకు సమాచారం ఇచ్చారు. జవాన్‌ను హతమార్చిన మావోయిస్టులు బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరో దారుణానికి ఒడిగట్టారు. గంగుళూరు పోలీ స్ స్టేషన్‌కు చెందిన జవాన్ అందో పోయం ను (49) శుక్రవారం కిడ్నాప్ చేసి తీసుకెళ్లా రు. శనివారం అతడిని హతమార్చి మృతదేహాన్ని గంగుళూరు రహదారిపై పడేశారు. -
ఆదివాసీల ఆశాజ్యోతి... హైమండార్ఫ్
ఎడతెగని చొరబాట్లు, అన్యాక్రాంతమైన అటవీ సాగు భూములు, ఆంక్షలు, దోపిడీ, హేళన – ఇది 19వ శతాబ్దం నుండి మొదలై కొనసాగుతున్న మన దేశపు ఆదివాసుల కష్ట గాథ. అటవీ, ఖనిజ సంపదలను కొల్లగొట్టడా నికి బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టిన నిషేధ విధానాలతో మొదలైన ఈ సంక్షోభం మరెన్నో హంగులు దిద్దుకొని నేటికీ కొనసాగుతూ ఉంది. ఆదివాసీల ప్రాచీన జీవన విధానం, సంస్కృ తుల్లోనే ప్రశాంతత, నెమ్మదితనం ఉన్నాయి. వారు అలాగే జీవించడంలో ఎంతో మక్కువను చూపి స్తారు. అటువంటి ఈ మొండి ప్రజలను ‘ప్రగతి శీల’ జీవన స్రవంతిలోనికి ఎట్లా తేవాలా అనే ఆలోచనలు 20వ శతాబ్ది తొలి భాగం నుండే మొదలైనాయి. బయటివారి రాజకీయ వ్యవస్థలు, పాలనా విధానాలను వారిపై రుద్దకుండా... ఆది వాసీల తత్త్వానికి సరిపడే రీతిలో మనమే ఒదిగి, బయటి వారి అతిక్రమణల ఛాయల నుండి వారిని రక్షిస్తూ... వారి సహజ ఆవరణంలోనే ఉండనిస్తూ ఆధునిక ప్రపంచపు విద్య, అవగాహనలు అందించే గొప్ప ప్రయత్నం హైదరాబాద్ సంస్థానంలో 1940ల్లో జరిగింది. ‘‘చదువుకోవటం వల్ల లౌకిక ప్రయోజనాలు న్నాయన్న సంగతి మూలవాసికి తెలిసినా అతని మనస్సులో, ఆత్మలో తనదైన సంస్కృతి పట్ల అసంకల్పితంగా, అతి లోతుగా ఇంకిపోయి ఉన్న అభిమానాన్నీ దాని పట్ల అతనికున్న గర్వభావ ననూ ఉద్ఘాటించటం ద్వారానే అతన్ని ఉత్తేజపరచ గలం,’’ అని హైదరాబాదు సంస్థానంలోని మూల వాసుల జీవనగతులను అప్పటికే పరిశీలిస్తూ నిర్ధారణకు వచ్చిన బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త క్రిస్టోఫ్ వాన్ ఫ్యూరర్ హైమండార్ఫ్ పేర్కొన్నారు. అటు వంటి హైమండార్ఫ్‌ను ఆదిలాబాద్ గోండుల కోసం ఒక ప్రాథమిక విద్యా విధానాన్ని రూపొం దించమని కోరింది నైజాం ప్రభుత్వం. తొలి గోండి భాషా వాచకాలను వాళ్ల జీవన వాతావరణం, పురాణాలు, కథలు, నమ్మకాలకు సంబంధించిన అంశాలతోనే ఆయన రూపొందించారు. ఈ ప్రయోగం ఫలించిన తర్వాత ఆదిలాబాద్ మూల వాసుల కోసం ఒక సమగ్ర పునరావాస, అభివృద్ధి పథకాన్ని కూడా రూపొందించి అమలు చేయమని, గిరిజన తెగలు, వెనుకబడిన తరగతుల విషయాల సలహాదారుగా అధికార పదవిలో ఆయనను నియమించింది నైజాం ప్రభుత్వం. ఒక మానవ శాస్త్రవేత్తకు ఇటువంటి బాధ్యతను అప్ప గించిన అరుదైన సందర్భం ఇది. కొమురం భీం తిరుగుబాటు అణచివేత తరువాత నిస్పృహలో కూరుకుపోయి ఉన్న ఆదిలాబాద్ మూలవాసుల జీవితంలో మళ్లీ ఉల్లాసాన్ని, నమ్మకాన్ని తీసుకువచ్చిన ఈ గొప్ప ప్రయత్నం గురించి కళ్లకుగట్టినట్టు వివరించే 1944, 1946 సంవత్సరాల్లో హైమండార్ఫ్ రాసిన నివేదికలు నేటికీ చదువదగినవి. 80 శాతం మూలవాసీ కుటుంబాలకు 150,000 ఎకరాల భూమిని ప్రభుత్వ పట్టాలతో అందజేసి వారికి అత్యవసరమైన జీవనభద్రతను అప్పుడు కల్పించగలిగారు. అయితే తరువాతి దశకాల్లో వచ్చిన పరిణామాలతో ఈ అభివృద్ధి లాభాలను చాలా వరకు కోల్పోయి, నక్సల్ ఉద్యమం, దాని అణచివేత, మళ్లీ ప్రభుత్వం చొరవతో అమలుపరచిన అభివృద్ధి పథకాలు, వాటి లోపాలు – ఇట్లా ఎన్నో ఒడుదొడుకులకు వారు గురవుతూ వస్తూ ఉన్నారు. తమ చివరి రోజుల వరకూ తరచూ భారతదేశం, ఆంధ్రప్రదేశ్, మరీ ముఖ్యంగా ఆదిలాబాద్‌ను సందర్శిస్తూ ఆదివాసీ జీవితాల్లో వస్తూ ఉన్న ఈ పరిణామాలను తెలుసుకుంటూ, సూచనలు సలహాలు ఇస్తూ తమ అనుబంధాన్ని కొనసాగించారు హైమండార్ఫ్ దంపతులు. వారి వలె ఆదివాసుల ఆప్యాయతను, ఆరాధనను పొందుతున్న మానవ శాస్త్రవేత్తలు అరుదు. ‘‘ఇక్కడ ఈ మూలవాసుల్లో వర్గభేదం లేని, లింగ అసమానతలు లేని, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలు లేని, విధవా వివాహాన్ని నిరోధించని ఒక ఆదర్శ సమాజం చక్కగా నిలిచి ఉన్నది... ఇటువంటి స్థితిలో మిగతా భారతీయ గ్రామీణ సమాజంలో ఇంకా కొనసాగుతున్న సామాజిక రుగ్మతలేవీ మూలవాసులకు వ్యాపించకుండా రక్షించటం దేశంలోని ప్రగతివాదుల గురుతరమైన బాధ్యత’’ అని హైమండార్ఫ్ ప్రభుత్వాధికారులకు, విధాన నిర్ణేతలకు దిశానిర్దేశం చేశారు. ఆదివాసులపై ఆయన వెలువరించిన వివిధ పుస్తకాలు, రచనల్లో వారి సంస్కృతుల గురించే కాకుండా వారికి అనువైన విద్య, తప్పనిసరిగా ఉండవలసిన సాగుభూమి భద్రత, వీటితో పాటు వారి జీవన దృష్టి గురించి చేసిన ప్రతిపాదనలు హైదరాబాద్ సంస్థానంలో, తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదివాసుల సంక్షేమం గురించి పరి తపించే అధికారులు, సామాజిక కార్యకర్తలు, నాయ కులకు స్ఫూర్తిగా, మార్గదర్శకంగా నిలిచాయి. - సుమనస్పతి రెడ్డి ఆకాశవాణి విశ్రాంత అధికారి (మూలవాసుల విద్య, అభివృద్ధుల గురించి 1944, 1946ల్లో హైమండార్ఫ్ రాసిన నివేదికల తెలుగు అనువాదం హైమండార్ఫ్ దంపతుల స్మృతి దినంగా జరుపుకొనే జనవరి 11న, ఆయన చాలా కాలం నివసించిన మార్లవాయి గ్రామంలో (ఇప్పుడు కుమురం భీం జిల్లా) విడుదల కానుంది) -
పోలీసుల దాష్టీకం: గోడ కుర్చీ వేయించి.. మూత్రం తాగించి..
సూర్యాపేట/ఆత్మకూర్(ఎస్): శీలం రంగయ్య, మరియమ్మ లాకప్‌డెత్ ఘటనలు తీవ్ర సంచలనం రేపాయి. క్షేత్రస్థాయిలోని కొందరు పోలీసుల కర్కశత్వానికి నిలువెత్తు సాక్ష్యాలుగా ఈ ఘటనలు నిలిచాయి. మరియమ్మను గుండె ఆగిపోయేలా కొడతారా అంటూ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చేయని తప్పు ఒప్పుకోవాలంటూ ఓ గిరిజన యువకుడిని పోలీసులు తీవ్రంగా చితకబాదిన ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం జరిగింది. ఆ యువకుడిని గోడ కుర్చీ వేయించారు.. ఆ యువకుడి మూత్రాన్ని అతడితోనే తాగించి రాక్షసానందం పొందారు. అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ఆత్మకూరు(ఎస్) ఠాణా పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గిరిజన యువకుడిపై జరిగిన ఈ దాడి ఇటీవల విడుదలైన జైభీమ్ సినిమాను గుర్తుచేస్తోంది. దొంగతనం చేశాడంటూ.. గతేడాదిగా ఆత్మకూరు(ఎస్) మండలంలో ఎస్సారెస్పీ కాలువపై రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లు, వ్యవసాయ పనిముట్లు చోరీకి గురవుతున్నాయి. రామోజీతండా ప్రాథమిక పాఠశాలలోనూ పలుసార్లు దొంగతనాలు జరగగా, పోలీసుల విచారణలో నిందితుల ఆచూకీ తెలియలేదు. ఇటీవల ఏపూరులోని బెల్టుషాపులో చోరీ జరిగింది. సీసీ పుటేజీ ఆధారంగా రామోజీతండాకు చెందిన బానోతు నవీన్‌ను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ చోరీల్లో తనతో పాటు మరికొందరు ఉన్నట్లు విచారణలో నవీన్ వెల్లడించాడు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా రామోజీతండాకు చెందిన గుగులోతు వీరశేఖర్‌ను బుధవారం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకుని మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. రాత్రి 12 గంటల సమయంలో పోలీసులు తండా సర్పంచ్‌కు ఫోన్ చేసి వీరశేఖర్‌ను తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో వీరశేఖర్ సోదరుడు వీరన్న పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సొంతపూచికత్తుపై వీరశేఖర్‌ను తీసుకెళ్లాడు. ఎస్సై తీసుకురమ్మన్నాడు.. బాధితుడు వీరశేఖర్ గురువారం తెల్లవారుజామున పెద్దగా కేకలు వేశాడు. ఆ తర్వాత నోటి మాట రాకపోవడంతో కుటుంబసభ్యులు స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఇద్దరు కానిస్టేబుళ్లు వీరశేఖర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు వచ్చారు. ఇంట్లోకి వెళ్లి బాధితుడి పరిస్థితి గమనించిన కానిస్టేబుళ్లు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించరు. దీంతో అప్పటికే గుమిగూడి ఉన్న తండావాసులు వారిని చుట్టుముట్టారు. తమకు ఎలాంటి సంబంధం లేదని, ఎస్సై తీసుకురావాలని చెప్పడంతోనే వచ్చామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే తండావాసులు వీరశేఖర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఆందోళన చేశారు. పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నం.. వీరశేఖర్ బంధువులు ఆగ్రహంతో గురువారం ఆత్మకూర్.ఎస్ పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించారు. నడవలేని స్థితిలో ఉన్న వీరశేఖర్‌ను ట్రాక్టర్‌పై తీసుకొచ్చి ఆందోళన చేశారు. దొంగతనంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా, వీరశేఖర్‌ను రోజంతా గోడకుర్చీ వేయించి కొట్టారని, బాధ్యులైన ఎస్సై, సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, దొంగతనం కేసులో వీరశేఖర్‌ను పిలిపించి విచారించామని, అతడిని కొట్టలేదని ఎస్సై లింగం చెప్పాడు. వీరశేఖర్‌కు చికిత్స చేయిస్తానంటూ సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే గ్రామస్తులు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా, బాధితుడికి మెరుగైన చికిత్స అందించడంతో పాటు ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని సూర్యాపేట రూరల్ సీఐ విఠల్‌రెడ్డి సర్దిచెప్పడంతో వారు శాంతించారు. మూత్రం తాగించి.. నవ్వుకున్నారు: గుగులోతు వీరశేఖర్, బాధితుడు మిర్చి తోటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లా.. కానిస్టేబుళ్లు వచ్చి తీసుకుపోయారు. ఎస్సై లింగంతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు నన్ను చితకబాదారు. ఆ సమయంలో నా పాయింట్లో మూత్రం పడగా.. ఆ మూత్రాన్ని తాగాలని ఎస్సై, కానిస్టేబుళ్లు కాళ్లతో తన్నుతూ చెప్పారు. మూత్రం తాగిస్తూ ఎస్సై, కానిస్టేబుళ్లు నవ్వుకున్నారు. చేయని దొంగతనాన్ని ఒప్పుకొంటే.. వారం పాటు జైలులో ఉండి వెంటనే ఇంటికి వెళ్లిపోవచ్చని కొడుతూ చెప్పారు. బతిమిలాడినా పంపలేదు: వీరన్న, బాధితుడి సోదరుడు ‘నేను, తమ్ముడు కలసి మిర్చి తోటకు నీళ్లు కడుతున్నం. ముగ్గురు కానిస్టేబుళ్లు వచ్చి మా వాడిని తీసుకెళ్లారు. స్థానిక ఎంపీటీసీ సభ్యుడితో కలసి నేను, మా బావ పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసులను బతిమిలాడినా మా తమ్ముడిని ఇంటికి పంపియ్యలేదు. అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి మా తమ్ముడిని తీసుకుపొమ్మని చెప్పారు. మేం వెళ్లే సరికి మా తమ్ముడు స్పృహలో లేడు. నా గుండె పగిలింది: గుగులోతు కీరా, బాధితుడి తల్లి ఎలాంటి తప్పు చేయని నా కొడుకును పోలీసులు చంపేందుకు యత్నించడం బాధగా ఉంది. వీరశేఖర్‌ను కొట్టి గాయపరచడమే కాకుండా మూత్రం తాగించారని చెప్పగానే నా గుండె పగిలిపోయింది. కనికరం లేని పోలీసుల నుంచి నా కొడుకును కాపాడాలి. నా కొడుకును కొట్టిన పోలీసులను వదిలిపెట్టొద్దు. ఉన్నతాధికారులకు నివేదిస్తాం: ఎస్.మోహన్‌కుమార్, డీఎస్పీ, సూర్యాపేట గిరిజన యువకుడు గుగులోతు వీరశేఖర్‌ను ఆత్మకూర్.ఎస్ పోలీస్‌స్టేషన్‌లో హింసించారన్న ఘటనపై లోతుగా విచారణ చేస్తున్నాం. ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను జిల్లా ఎస్పీకి అందజేస్తాం. -
గిరిజన కానిస్టేబుల్‌పై దాడి
పర్చూరు: ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న అమరావతి రైతులు విధి నిర్వహణలో ఉన్న ఒక గిరిజన కానిస్టేబుల్‌పై దాడి చేసి గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కారుమంచి ధ్రువకుమార్, కొల్లా శ్రీను తదితరులపై పర్చూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా పర్చూరులో శనివారం ఈ ఘటన జరిగింది. బాధితుడు కథనం మేరకు.. పర్చూరు వై జంక్షన్లో గిరిజన కానిస్టేబుల్ చంద్రనాయక్ విధుల్లో భాగంగా కెమెరాలో చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో పాదయాత్రలోని కొందరు ఫొటోలు ఎందుకు తీస్తున్నావంటూ కానిస్టేబుల్‌ను ప్రశ్నించారు. తాను పోలీసునని, విధుల్లో భాగంగా ఫొటోలు తీస్తున్నానని చెప్పినా వినకుండా చంద్రనాయక్‌పై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీకాంత్ మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై అమరావతి రైతులు దాడి చేయడం దారుణమన్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
భారతీయులకు కొత్త సమస్య.. కారణాలేంటి?
ప్రపంచ వ్యాప్తంగా ప్రజల సరాసరి ఎత్తు పెరుగుతున్న తరుణంలో.. భారతీయుల ఎత్తు మాత్రం తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా వెల్లడైన నివేదికలోని అంశాలపై పరిశోధకుల సమీక్షలు, కారణాల అన్వేషణ మొదలైంది. భారతీయుల సరాసరి ఎత్తు తగ్గుతోందని తెలిపింది. JNU’s Centre of Social Medicine and Community Health నిర్వహించిన సర్వేలో.. 1998 నుంచి 2015 వరకు భారతీయ వయోజనుల ఎత్తుపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1998-99లో భారతీయుల ఎత్తు కొంచెం పెరిగిందని, అయితే 2005-06 నుంచి 2015-16 మధ్య కాలంలో గణనీయమైన స్థాయిలో ఎత్తు తగ్గిందని వెల్లడించింది. కారణాలపై.. ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని, దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సూచించింది. భారతీయ జనాభాలో వివిధ సమూహాల మధ్య ఎత్తు అంతరాయంపై కూడా అధ్యయనం జరగాలని చెప్పింది. జన్యుపరమైన అంశాలే కాకుండా, వాటికి సంబంధం లేని కారకాలు కూడా ఎత్తుపై ప్రభావం చూపుతున్నాయని, ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని తెలిపింది. జీవన విధానం, పౌష్టికాహారం, సామాజిక, ఆర్థిక తదితర అంశాలు ఉన్నాయని చెప్పింది. కాలుష్యం కూడా ఓ కారణమై ఉంటుందా? అనే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నారు. భారత్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వయోజనుల్లో సరాసరి ఎత్తులో తేడాలు ఉన్నాయని చెప్పింది. 15 నుంచి 25 ఏజ్ గ్రూపులో ఉన్న వారిలో ఎత్తు తగ్గుతోందని తెలిపింది. ఈ ఏజ్ గ్రూపులోని మహిళల సరాసరి ఎత్తు 0.42 సెంటీమీటర్లు, పురుషుల్లో 1.10 సెంటీమీటర్ల మేర సరాసరి ఎత్తు తగ్గించదని వెల్లడించింది. ముఖ్యంగా గిరిజన మహిళల్లో ఈ తగ్గుదల మరింత ఎక్కువగా ఉన్నట్లు గమనించినట్లు స్టడీ వెల్లడించింది. చదవండి: కంపెనీ బోర్డుల్లో 'మహిళలు తక్కువే' -
TS: నేడు గజ్వేల్‌లో కాంగ్రెస్ ‘దండోరా’ సభ
-
గిరిజనులపై దాడులు అమానుషం: చాడ
సాక్షి, హైదరాబాద్: గిరిజనులపై అటవీశాఖ అధికారుల దాడులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో ఖండించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతయ్య గూడెంలో అటవీశాఖ అధికారులు 55 ఎకరాల్లో పోడు సాగు చేసుకుంటున్న రైతులపై దాడులు చేయడం అమానుషమన్నారు. ఈ ఘటనతో తీవ్రంగా మానసిక వేదనకు గురైన ఇద్దరు రైతులు అక్కడికక్కడే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, వారికి చికిత్స అందించారని తెలిపారు. పోడు సాగుదారులకు పట్టాలు పంపిణీ చేసేంతవరకూ కమ్యూనిస్టు పార్టీ అలుపెరుగని ఉద్యమం చేస్తుందన్నారు. ప్రభుత్వం తక్షణమే పోడు సాగుదారులపై దాడులు నిలిపివేతకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
శభాష్ యశ్వంత్.. చరిత్ర సృష్టించాడు
మరిపెడ రూరల్: విస్పష్టమైన లక్ష్యం ముందుంటే దేన్నైనా సాధించొచ్చని నిరూపించాడు రాష్ట్రానికి చెందిన గిరిజన యువకుడు యశ్వంత్. ఆఫ్రికాలోని అత్యంత ఎత్తయిన శిఖరం (5,895మీ.) కిలిమంజారోను అధిరోహించాడు. శిఖరాగ్రంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటాడు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండా గ్రామ పంచాయతీకి చెందిన భూక్యా రామ్మూర్తి, జ్యోతి దంపతుల చిన్న కుమారుడు యశ్వంత్ హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని ఎన్డీసీ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రాక్ క్లైంబింగ్ అంటే ఆసక్తి. ఈ క్రమంలోనే ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతారోహణకు ఎంపికయ్యాడు. ఈ నెల 21న పర్వతారోహణ యాత్రను ప్రారంభించి ఆగస్టు 26న శిఖరాగ్రానికి చేరుకుని త్రివర్ణపతాకాన్ని ఎగురవేశాడు. చదవండి: శ్మశానంలో ‘డాక్టర్’ చదువు -
దొంగతనం ఆరోపణతో ఆదివాసి హత్య
భోపాల్: దొంగతనం అభియోగాలపై ఒక ఆదివాసిని ఎనిమిది మంది తీవ్రంగా హింసించి చంపిన అమానవీయ ఘటన మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో జరిగింది. కన్హయలాల్ భీల్(40)అనే ఆదివాసిని చితార్‌మల్ గుర్జార్ అనే పాల వ్యాపారి బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో గుర్జార్ పాలు నేలపాలయ్యాయి. దీంతో కన్హయలాల్ కావాలనే తన బండికి అడ్డువచ్చాడని ఆరోపిస్తూ తన స్నేహితులను పిలిచి కన్హయపై గుర్జార్ దాడి చేశాడని పోలీసులు తెలిపారు. కన్హయలాల్‌ను తీవ్రంగా కొట్టి అనంతరం ఒక వాహనం వెనుక తాడుతో కట్టి ఈడ్చుకుపోయారని తెలిపారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియా లో ఉంచడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కన్హయను ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం కన్హయ గాయాల కారణంగా మరణించాడు. ఈ ఘటనపై గుర్జార్‌తో పాటు మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారని ఎస్పీ సూరజ్ కుమార్ తెలిపారు. గుర్జార్‌కు చెందిన మోటార్‌సైకిల్‌ను, కన్హయను కట్టేసిన వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. -
గిరిజనుల లోకల్ గేమ్
-
‘సంక్షేమ పథంలో సీఎం జగన్ సరికొత్త చరిత్ర సృష్టించారు’
సాక్షి, అమరావతి: గడిచిన రెండేళ్లలో అనేక ప్రజా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు రూ.లక్ష కోట్లకు పైగా నగదును నేరుగా జమ చేసి.. సంక్షేమ పథంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఎఫ్డీసీ) చైర్మన్ మొండితోక అరుణ్‌కుమార్ అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడ కేంద్రంగా నిర్వహించిన ‘భారతదేశంలో గిరిజన విధానాలు, కార్యాక్రమాలు, ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రాంతీయ ప్రతిబింబాలు’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు మంగళవారం ముగిసింది. ముఖ్య అతిథి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్ష మంది గిరిజనులకు 2 లక్షల 30 వేల ఎకరాల పోడు భూమిని పంపిణీ చేయడం గొప్ప రికార్డు అన్నారు. ఏపీ రాష్ట్ర గిరిజన కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభా రవిబాబు మాట్లాడుతూ.. గిరిజనులకు అన్ని విధాలుగా న్యాయం చేయాలనే సంకల్పంతోనే సీఎం జగన్ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతీలాల్ దండే మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తికానున్న నేపథ్యంలో గిరిజన అభివృద్ధి, సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేలా తగిన అభిప్రాయ సేకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జాతీయ సదస్సును నిర్వహించాయన్నారు. గిరిజనుల కోసం చేపట్టే ప్రతి పథకం ద్వారా ఫలాలు వారికి చేరేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు చెప్పారు. స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ వైఏ సుధాకర్‌రెడ్డి, ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మిషన్ సంచాలకుడు ఇ.రవీంద్రబాబు, ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్ డి.లక్ష్మి మాట్లాడారు. -
AP: ఆకట్టుకుంటున్న గిరిజన కట్టుబాట్లు
దట్టమైన అడవులు.. ఎత్తయిన కొండలు.. స్వచ్ఛమైన సెలయేళ్లు.. పక్షుల కిలకిలరావాలు.. పచ్చని సోయగాలు.. ప్రకృతి ఒడే ఆవాసంగా.. వన్యప్రాణుల సహవాసం మధ్య శతాబ్దాల సంస్కృతులకు గుర్తుగా నిలుస్తున్నారు పశ్చిమ ఏజెన్సీలో అడవిబిడ్డలు. దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్న వీరి జీవితాల్లో ప్రభుత్వం అభివృద్ధి వెలుగులు నింపుతోంది. వారి కష్టాలు తీర్చేందుకు బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తోంది. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు కల్పిస్తూ అన్నింటా అండగా నిలుస్తోంది. బుట్టాయగూడెం: అడవితల్లిని నమ్ముకుని వనాలే ఆరాధ్య దేవతలుగా, కొండుపోడు ఆధారంగా సంస్కృతి, సంప్రదాయాలతో జీవనం సాగిస్తున్నారు పశ్చిమ ఏజెన్సీలోని గిరిజనులు. తరాలు మారినా కటుటబాట్లు, ఆచార వ్యవహారాలు, ఆహార అలవాట్లలో ప్రత్యేక శైలితో ముందుకు సాగుతున్నారు. వారి అలవాట్లు, వ్యవహార శైలిని అపురూపంగా కాపాడుకుంటున్నారు. కొండపోడుతో పాటు అటవీ ఉత్పత్తులు సేకరించి వారంతపు సంతలలో అమ్ముకోవడం ద్వారా జీవనం సాగిస్తున్నారు. వనదేవతలే ఆరాధ్యదైవాలు ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ గిరిజనులకు వనాలే ఆరాధ్య దేవతలు. ఎక్కడ పూజలు చేసినా తప్పనిసరిగా అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. భూదేవి, బాట, మామిడికాయ, కొత్త కందులు, చింతకాయల పండగను ప్రధానంగా చేసుకుంటున్నారు. కొండల మధ్య దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటుచేసుకుని బతుకుతున్నారు. ఏళ్ల తరబడి సమస్యలతో సహవాసం చేస్తున్న వీరి జీవితాల్లో మార్పులు వస్తున్నాయి. ఆహారపు అలవాట్లు కొండరెడ్ల ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉంటాయి. అడవిలో దొరికే వాటితో వంటకాలు చేసుకుని ఆ రుచుల్ని ఆస్వాదిస్తుంటారు. తొలకరి అనంతరం కొండ కోనల్లో అడుగడుగునా కన్పించే వెదురు చెట్ల నుంచి మొలిచే కొమ్ముల్ని వండుకుని ఆనందిస్తుంటారు. అలాగే ఎర్రచీమల గుడ్లతో చేసే చారు ప్రత్యేకం. ఐటీడీఏ కృషి ఐటీడీఏ ద్వారా గిరిజనుల సర్వతోముఖాభిృద్ధికి కృషిచేస్తున్నారు. విద్య, వైద్యం, సురక్షిత తాగునీటి, రవాణా, మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ట్రైకార్ ద్వారా రుణాలు ఇస్తున్నారు. జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేసి ఉపాధి బాటలు వేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రెండేళ్ల నుంచి గిరిజన అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో సుమారు 5,327 మంది పోడు రైతులకు 2 వేలకు పైగా పట్టాలు ఇచ్చారు. రూ.40 కోట్లతో బీటీ, రూ.15 కోట్లతో గ్రామీణ సీసీ రోడ్ల నిర్మాణం, నాడు–నేడు కింద రూ.15 కోట్లతో పాఠశాలల అభివృద్ధి, రూ.18 కోట్లతో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌ల నిర్మాణ పనులు చేపట్టారు. గిరిజన ప్రాంత ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేలా సుమారు రూ.50 కోట్లతో మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి కృషి చేస్తున్నారు. 14 రోజుల్లో పట్టా ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు చింతల లచ్చిరెడ్డి. దట్టమైన అటవీ ప్రాంతం బుట్టాయగూడెం మండలంలోని రేపల్లె గ్రామం. అతనికి దాదాపు 4 ఎకరాల సొంత భూమి ఉంది. లచ్చిరెడ్డి తన భూమికి పట్టా కోసం దశాబ్దాలుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఉపయోగం లేదు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా అతడికి 1బీ పట్టాలు అందాయి. వలంటీర్ ఇంటికి వచ్చి సంతకాలు చేయించుకుని తీసుకువెళ్లగా.. 14 రోజుల్లో 1బీ పట్టాలు అందాయని లచ్చిరెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఆదివాసీల అభివృద్ధికి కృషి ఆదివాసీలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. సంక్షేమ, అభివృద్ధి ఫలాలతో ఆదివాసీలు ఆనందంగా ఉన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో రిజర్వేషన్లతో గిరిజన మహిళలకు పదవులు వరించాయి. ముఖ్యంగా గిరిజన మహిళకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను నియమించి గిరిజనులపై ఉన్న ప్రేమను సీఎం జగన్ చూపించారు. – తెల్లం బాలరాజు, పోలవరం ఎమ్మెల్యే ముంగిళ్లలోకే పథకాలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మారుమూల గిరిజన గ్రామాల్లో అడవిబిడ్డల ఇంటి ముందుకే పథకాలు వస్తున్నాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కొండ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు కష్టాలు తప్పాయి. అర్హులైన ప్రతిఒక్కరికీ పథకాలు అందుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజన పక్షపాతి. మన్యం ప్రజల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. – కొవ్వాసి నారాయణ, వైఎస్సార్ సీపీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు, కేఆర్ పురం -
ఆదివాసీల అభ్యున్నతికి పటిష్ట చర్యలు: సీఎం
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ గూడేల్లో విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతుల కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని సీఎం కేసీఆర్ తెలిపారు. సోమవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆదివాసీలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గతంలోలాగా విష జ్వరాలతో ఆదివాసీలు మరణించే పరిస్థితిని ప్రభుత్వం నివారించిందన్నారు. ఆదివాసీలను స్వయం పాలనలో భాగస్వాములను చేసే దిశగా ఆదివాసీ గూడేలను, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిందని తెలిపారు. ఎస్టీ సబ్ ప్లాన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని, పోడుభూములకు కూడా రైతుబంధును అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఆదివాసీ సంస్కృతిని ప్రపంచానికి చాటేలా కుమ్రంభీం భవనాన్ని నిర్మిస్తున్నామని, అత్యంత విలువైన బంజారాహిల్స్ ప్రాంతంలో ఈ భవన నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైందని కేసీఆర్ వెల్లడించారు. -
ఆదివాసీ గూడేలను వణికిస్తున్న దెయ్యం భయం
-
మహనీయుల కలలను నిజంచేస్తా
సాక్షి, ఆదిలాబాద్: లక్షలాది మంది పేదల అభ్యున్నతి కోసమే తాను జనంలోకి వచ్చానని, వేరే ఎజెండా లేదని స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసిన సీనియర్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన ఆయన ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని సందర్శించారు. ఉట్నూర్ మండలం దంతన్‌పల్లిలో ఓ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. మార్గమధ్యలో ముత్నూర్ వద్ద కుమ్రంభీం విగ్రహానికి, ఇంద్రవెల్లిలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘అందరూ అనుకున్నట్టుగా నేను ఫలానా పార్టీలో అభ్యర్థి అనేది ఫేక్ న్యూస్.. ప్రజలు నమ్మొద్దు’అని పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, మాన్యవార్ కాన్షీరాం, కుమ్రంభీం, పూలే వంటి మహనీయుల ఆశయాలు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయని, వారి కలలను నిజం చేసేందుకే తాను ముందుకొచ్చానని తెలిపారు. వీఆర్ఎస్ ఒకరు చెబితే చేసింది కాదని, మనస్సాక్షిగా తీసుకున్న నిర్ణయమని చెప్పారు. 26 ఏళ్ల వృత్తిలో గిరిజన, దళిత, బహుజన బిడ్డల అభ్యున్నతి కోసం కృషి చేశానని, అది కేవలం ఒక శాతమేనన్నారు. మిగిలిన 99 శాతం కూడా సాధించేందుకే తన ఈ ప్రయత్నమన్నారు. పేద బిడ్డల అభ్యున్నతే నిజమైన సామాజిక విప్లవమని, ఇదే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. ఇలాంటి అభివృద్ధిని ప్రతి గ్రామానికి, ప్రతి గల్లీకి తీసుకెళ్లబోతున్నామని తెలిపారు. అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం ఎజెండాగా ముందుకుసాగుతామని వెల్లడించారు. ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు ఆమోదం సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సోమవారం స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖా స్తు చేసుకోగా.. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. 26 ఏళ్లుగా పోలీస్ శాఖలో పలు హోదాల్లో పనిచేసిన ఆయన, తొమ్మిదేళ్లుగా సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా ఉంటూ, ఆ విద్యాసంస్థలకు గుర్తింపు తెచ్చిన సంగతి విదితమే. ఆయన స్థానంలో ఆర్థిక శాఖలో కార్యదర్శిగా ఉన్న రోనాల్డ్రాస్కు గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
గర్భిణీ మహిళను డోలీలో మోసుకెళ్లిన వాలంటీర్లు : విజయనగరం
-
అతి అణచివేతతో తిరుగుబాటు తీవ్రం
ఆదివాసీల ఆత్మీయనేస్తం ఫాదర్ స్టాన్‌స్వామి (84) నిర్బంధంలో చనిపోవడం పలువుర్ని చలింపజేసింది. ఇది మామూలు మరణం కాదని, వ్యవస్థ చేసిన హత్యగా హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులంటున్నారు. ‘మిట్టమధ్యాహ్నమే కమ్మిన కారుచీకటి’గా న్యాయకోవిదులే అభివర్ణిస్తున్నారు. ఈ మర ణాన్ని, ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం, ఐరోపా సమాజ ప్రతినిధి... ఇలా పలువురు ఖండించారు. ప్రశ్నించే గొంతుల్ని, నిరసించే బృందాలను, అసమ్మతి స్వరాలను సాక్ష్యం లేని అభియోగాలతో నిర్బంధించేందుకు ‘ఉపా’ చట్టం ఒక అస్త్రం కావడం దారుణం, అమానుషం. విచారణే మొదలు కాని కేసులో, న్యాయ ప్రక్రియే మరణశిక్ష అయింది. ఆధారాల్లేని అభియోగాలు ఎదుర్కొంటున్న ఓ హక్కుల కార్యకర్త... వృద్ధాప్యానికి, వ్యాధులకు, కడకు బెయిల్ నిరాకరణకు బలై నిర్బంధంలోనే అసహజ మరణం పొందారు. దీనికి బాధ్యులె వరు? నేరుగా జవాబు రాకపోగా... లోపభూయిష్టమైన మన నేర– న్యాయ నిర్వహణ (క్రిమినల్ జస్టిస్) ప్రక్రియపైనే ఇది సందేహాలను రేకెత్తిస్తోంది. నిర్హేతుక నిబంధనలున్న ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)’ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. రాజ్యం–పోలీసు అపవిత్ర బంధం ఎల్లలు దాటి, ‘అసమ్మతి’ని అణచివేస్తున్న దాష్టీ కాన్ని ఎత్తిచూపుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని కాదని వక్రగతిన సాగే చట్టం అమలును ఉపేక్షిస్తున్న న్యాయవ్యవస్థ దౌర్బల్యాన్ని తెరకెక్కి స్తోంది. ఇదిక్కడితో ఆగకూడదు. జరిగే దురాగతాలకు బాధ్యులెవరో తేలాలి. అందుకు, పౌరసమాజం చేతనతో, ఈ అరిష్టాలకు మూలాలు వెతికి పట్టుకోవాల్సిన, అడ్డుకోవాల్సిన సమయం వచ్చింది. ఆదివా సీల ఆత్మీయనేస్తం ఫాదర్ స్టాన్‌స్వామి (84) నిర్బంధంలో చని పోవడం పలువుర్ని చలింపజేసింది. వృద్ధాప్యం, పార్కిన్సన్ వ్యాధి, కోవిడ్ అనంతర సమస్యలు.... పలుమార్లు బెయిల్ కోరి నిరాకరణకు గురైన దురవస్థ! ఇది మామూలు మరణం కాదని, వ్యవస్థ చేసిన హత్యగా హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులంటున్నారు. ‘మిట్టమధ్యాహ్నమే కమ్మిన కారుచీకటి’గా న్యాయకోవిదులే అభి వర్ణిస్తున్నారు. ఈ మరణాన్ని, ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్యసమితి (యూఎన్) మానవహక్కుల విభాగం, ఐరోపా సమాజ (ఈయూ) ప్రతినిధి... ఇలా పలువురు ఖండించారు. దేశంలోని పది రాజకీయ (వి)పక్షాలు, బాధ్యులపై చర్య తీసుకోవాలని, భీమా–కోరేగావ్ నింది తులతో పాటు రాజకీయ కారణాలతో నిర్బంధంలో ఉన్న వారందరినీ బెయిల్‌పై విడుదల చేయాలని రాష్ట్రపతిని కోరారు. ఇదే కేసు సహ నిందితులు జైళ్లోనే ఒక రోజు నిరాహారదీక్ష చేశారు. ఇంతటి స్పంద నలు రేకెత్తించిన ఈ ఘటనను కేవలం ఒక హక్కుల కార్యకర్త మరణంగానే చూడకూడదు. ప్రజావిశ్వాసం కోల్పోతూ... రాజకీయ, పాలన, న్యాయ వ్యవస్థలు రోజురోజుకూ క్షయమవుతున్న దుస్థితికి నిలువెత్తు నిదర్శనంగా చూడాలి. సంబంధం లేని కేసులో.... కోరేగావ్ తానెప్పుడూ వెళ్లలేదని, తనకీ కేసుతో సంబంధమే లేదని రోమన్ కాథలిక్ పూజారి స్టాన్ స్వామీ మొదట్నుంచీ చెప్పారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐజీ) పథకం ప్రకారం తనను ఇరికించిన తీరుకు ఆశ్చర్యపోలేదు. అరెస్టుకు ముందు విడుదల చేసిన వీడియో కథనం ప్రకారం, ఆయనకీ విషయంలో స్పష్టత ఉంది. ‘ప్రశ్నించిన వారి గొంతు దేశమంతటా నొక్కుతున్నారు. నాకొక్కడికే జరుగుతు న్నది కాదిది. సంతోషం, ఈ ప్రక్రియలో నేను భాగమయ్యాను. ఎందు కంటే, నేను మౌన ప్రేక్షకుడిని కాదు. ఈ ఆటలో భాగమైన వాణ్ణే! ... తగు మూల్యం చెల్లించడానికి నేను సిద్ధమే!’ అన్నారు ధీమాగా! కానీ, ప్రాణాలనే ఇచ్చి మూల్యం చెల్లించాల్సి రావడం దురదృష్టకరం. 2018 జనవరి 1 భీమా–కోరేగావ్ అల్లర్ల వెనుక మావోయిస్టులున్నారని, వారిని హింసకు ప్రేరేపించిన ప్రసంగాలు 2017 డిసెంబరు 31 ఎల్గార్ పరిషత్ సమావేశంలో జరిగాయనేది కేసు. మరికొందరు ఒకరితో ఒకరు మాటాడుకుంటూ కుట్రపన్నారనేది ఆరోపణ. విప్లవకవి, హక్కుల యోధుడు వరవరరావుతో పాటు మొత్తం 17 మంది కవులు, న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు, ఇతర మేధావుల్ని ఈ కేసులో అరెస్టు చేశారు. నిషేధిత మావోయిస్టులతో చేతులు కలిపి, ప్రభు త్వాన్ని కూల్చే విశాల కుట్ర పన్నారనేది ప్రధాన అభియోగం. ‘మావో యిస్టు సిద్దాంతాలను నేను ఒప్పుకోను, వ్యతిరేకిస్తాను’ అని బహి రంగంగా ప్రకటించే వ్యక్తికి, వారితో ‘కుట్ర’ సంబంధాలు అంట గట్టడంలోనే అభియోగమెంత బలహీనమో తేలిపోయింది. బెయిల్ వినతి వచ్చినపుడు, నమ్మదగ్గ సాక్ష్యాలను బట్టే న్యాయస్థానాలు నిర్ణయం తీసుకుంటాయి. ఈ కేసులో ఇప్పటివరకు అభియోగ పత్రాన్ని ఖరారు చేసి విచారణ ప్రారంభించలేదు. ఇక స్వామిపై వచ్చిన అభియోగాలకు ఆధారమని, ఆయన ల్యాప్‌టాప్‌లోని పత్రా లను చూపిస్తున్నారు. మరో నిందితుడు సురేంద్ర గాడ్లింగ్ కంప్యూటర్ రెండేళ్లుగా దురుపయోగమౌతోందని, ‘మాల్వేర్’ ద్వారా అందులోకి డాక్యుమెంట్లు పంపేందుకు గల ఆస్కారాన్ని అమెరికాకు చెందిన డిజి టల్ ఫోరెన్సిక్ సంస్థ నిరూపించింది. అదే, స్టాన్‌స్వామీ ల్యాప్‌టాప్ తోనూ జరిగే ఆస్కారం ఉంది. ఎందుకంటే, అరెస్టుకు ముందు రెండు సార్లు ఆయన గదిలో సోదాలు జరిపి, ల్యాప్‌టాప్, మొబైల్ తది తరాల్ని దర్యాప్తు బృందం స్వాధీనపరచుకుంది. నిర్దిష్ట ఆరోపణ లున్నా, దీనిపై విచారణే జరుగలేదు, ఇది నమ్మదగ్గ సాక్ష్యం కాదు. ఇంతటి కాఠిన్యం యాధృచ్ఛికమా? న్యాయ కస్టడీలో, మొదట చికిత్సకు నిరాకరించినా, ‘వారిచ్చే చిన్న మాత్రల కన్నా, నా వ్యాధి తీవ్రతే హెచ్చుగా ఉంది, ఏమో నేను చచ్చి పోతానేమో?’ అని ఒక దశలో సందేహించిన స్వామీ, చివరకు ఆస్పత్రిలో చేరడానికి అంగీకరించారు. మూడు దశాబ్దాలకు పైగా జార్ఖండ్‌లోని ఆదివాసీల హక్కుల కోసం స్టాన్‌స్వామి పోరాడు తున్నారు. గిరిజనుల అటవీ–భూమి హక్కుల కోసం, యువత అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాటాలకు ‘బగీచా’ను స్థాపించారు. 3000 మంది యువకులను మావోయిస్టులుగా ముద్రవేసి, అక్ర మంగా జైళ్లలో కుక్కడాన్ని నిరసిస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. అరెస్టయిన 97 శాతం మందికి మావోయిస్టులతో ఏ సంబంధం లేదని, 96 శాతం యువత కుటుంబ నెలసరి ఆధాయం రూ. 5 వేల లోపని నిర్ధారించారు. నిష్కారణంగా జైళ్లో మగ్గి, విలువైన జీవిత కాలాన్ని, కొన్నిసార్లు జీవితాల్ని కోల్పోతున్నారని స్వామి తరచూ బాధపడేవారు. ఈ సుదీర్ఘ పోరాట క్రమమే పాలకులకు, వారితో అంటకాగుతున్న కార్పొరేట్ శక్తులకు కంటగింపైంది. యథే చ్చగా సహజవనరుల్ని, ప్రకృతి సంపదను కొల్లగొట్టే తమకు... పోరా టాలు అవరోధంగా, స్వామీ ఒక అడ్డంకిగా కనిపించారు. కుంటి జిల్లా ‘ముండే’ ఆదివాసీల భూహక్కుల కోసం సాగిన ‘పథల్ గాడీ’ ఉద్య మాన్ని అణచివేసేందుకు, 20 మందిపై రాజద్రోహం కేసు పెట్టారు. అందులో స్టాన్‌స్వామీ ఒకరు. రాజ్యాంగ రక్షణకు, దానికి లోబడి శాంతియుతంగా పోరాడుతున్న వ్యక్తిని వ్యవస్థ హతమార్చింది. పరి వర్తన కేంద్రాలు, సంస్కరణాలయాలు అని చెప్పుకునే మన జైళ్లలో... ఇంతటి కాఠిన్యం బయటి వారూహించరు. 84 ఏళ్ల వయసులో, పార్కిన్సన్ వ్యాధివల్ల ‘గ్లాసు పట్టుకొని నీళ్లు తాగలేకపోతున్నాను స్ట్రానో, సిప్పరో ఇప్పించండి’ అంటే, మూడు వారాలు జాప్యం చేసిన కర్కశత్వం చరిత్రలో నిలుస్తుంది. ప్రత్యేక కోర్టు జడ్జి బెయిల్ నిరా కరిస్తూ, ‘స్వామి వ్యక్తిగత స్వేచ్ఛ కన్నా సమాజ ఉమ్మడి ప్రయోజనాలే ప్రాధాన్యమైనవి’ అన్నారు నిష్కర్షగా! ఈ నెల 6న ముంబాయి హైకోర్టు ముందు బెయిల్ పిటిషన్ విచారణ ఉన్నపుడు... ఒకరోజు ముందు, 5ననే స్టాన్, ఏ బెయిలూ అవసరం లేని లోకాలకు వెళ్లి పోయారు. 2016–19 నాలుగేళ్లలో 2.2 శాతం కేసుల్లోనే నేర నిరూపణ జరిగి శిక్షలు పడ్డాయి. అందుకే, ‘ఉపా’ చట్టం పాలకుల చేతిలో దురుప యోగమౌతోంది. ప్రశ్నించే గొంతుల్ని, నిరసించే బృందాలను, అస మ్మతి స్వరాలను సాక్ష్యం లేని అభియోగాలతో నిర్బంధించేందుకు ఇదొక అస్త్రం. అరెస్టు చేయడం, బెయిల్ నిరాకరించడం, గిట్టని వారిని పాలకులు కోరుకున్నంత కాలం నిర్బంధంలోనే ఉంచడం రివాజ యింది. గొంతెత్తే ఇతరులకు, ఇది ముందస్తు హెచ్చరికగానూ పని కొస్తోంది. ఇదివరకటి నల్లచట్టాలు ‘టాడా’ ‘పోటా’ల దారిలోనే ‘ఉపా’ కూడా అటకెక్కాల్సిన సమయం వచ్చింది. అణచివేత ఎంత అధికంగా ఉంటే, అనులోమ నిష్పత్తిలోనే తిరుగుబాటు తీవ్రత ఉంటుందని రాజ్యం గ్రహించాలి. దిలీప్ రెడ్డి ఈమెయిల్ : dileepreddy@sakshi.com -
నాగర్ కర్నూల్ : అటవీ సిబ్బందిపై పెట్రోల్ పోసిన ఆదివాసీ మహిళ
-
ఉద్యమ రూపంలో హిందూ మత ప్రచారం: స్వరూపానందేంద్ర
సాక్షి, విశాఖపట్నం: విశాఖ శ్రీ శారదాపీఠం యావద్ భారతదేశానిదని.. గిరిజన భక్తులను తిరుమల తీసుకెళ్లటం ఆనందంగా ఉందని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు సోమవారం ఆయన ధర్మ ప్రచార యాత్రను ప్రారంభించారు. చిన్నముసిడివాడ శారదా పీఠం నుంచి 25 బస్సుల్లో గిరిజన భక్తులు తిరుమలకు బయలుదేరారు. సింహాచలంలో భక్తుల తొలిపూజ అనంతరం తిరుమల యాత్ర ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ, హిందూమత ప్రచారాన్ని ఉద్యమ రూపంలో శారదాపీఠం తీసుకెళ్తోందని.. స్వాత్మానందేంద్ర సరస్వతి త్వరలో భారతదేశ యాత్ర ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. దేవాదాయ భూముల పరిరక్షణలో శారదాపీఠం ముందుంటుందని పేర్కొన్నారు. ఏటా దళిత గిరిజనులను తిరుమల యాత్రకు తీసుకెళ్లి అందరికీ దేవుని అనుగ్రహాన్ని శారదాపీఠం కల్పిస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర పీఠాధిపతి పర్యటన పూర్తైందని ఆయన వెల్లడించారు. శారదాపీఠం కేవలం తెలుగు రాష్ట్రాల పరిధి కాదని.. యావత్ ప్రపంచంలో హిందూమత పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు. 30 ఏళ్లుగా హైందవ ధర్మం కోసం విశాఖ శారదాపీఠం పోరాడుతోందని స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. చదవండి: బీజేపీ - జనసేన పొత్తుపై మరోసారి సందిగ్ధం.. తీరనున్న కృష్ణలంక వాసుల వరద కష్టాలు