సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తా మని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ విమర్శించారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన మాట్లాడు తూ రిజర్వేషన్లవిషయాన్ని రెండున్నరేళ్లుగా కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో గిరిజనుల కు న్యాయం చేయాలని కోరారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్న సీఎం కేసీఆర్ చేతిలోనే రిజర్వేషన్లు ఉన్నయా అని మాజీ ఎమ్మెల్యే టి.జయప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని ఒకవైపు బీజేపీ చెబుతుంటే... కేసీఆర్ ముస్లింలకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారన్నారు.