reservations
-
ఒకసారి రిజర్వేషన్లు పొందిన వారికి...ఆ సౌకర్యం నిలిపేయాలి
న్యూఢిల్లీ: రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఆ ఫలాలు పొంది, ఆ కారణంగా ఇతరులతో సమానంగా పోటీ పడే స్థాయికి చేరినవారికి రిజర్వేషన్లను తొలగించవచ్చని అభిప్రాయపడింది. అయితే ఇది శాసన, కార్యనిర్వహక వ్యవస్థలు తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టం చేసింది. ఎస్సీల్లో క్రీమీ లేయర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీల ధర్మాసనం గురువారం ఈ మేరకు పేర్కొంది. ఎస్సీల్లో క్రీమీ లేయర్ ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగపరంగా రాష్ట్రాలకు ఉందంటూ గత ఆగస్ట్‌లో ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన మెజారిటీ తీర్పును జస్టిస్ గవాయ్ ఈ సందర్భంగా ఉటంకించారు. ఎస్సీల్లోని వెనకబడ్డ కులాలకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా వారికి ఉద్దేశించిన రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ చేయొచ్చని ఆ తీర్పు స్పష్టం చేసింది. ఆ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ కూడా సభ్యుడే. మెజారిటీ నిర్ణయంతో సమ్మతిస్తూనే నాడు ఆయన విడిగా తీర్పు వెలువరించారు. ఎస్సీలతో పాటు ఎస్టీల్లో కూడా క్రీమీ లేయర్‌కు రిజర్వేషన్లను నిలిపేయాలని అందులో స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్రాలు విధిగా ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని కూడా ఆదేశించారు. ఆ తీర్పును తాజా కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ ప్రస్తావించారు. ‘ఒకసారి లబ్ధి పొందినవారికి రిజర్వేషన్లను తొలగించాలి. గత 75 ఏళ్ల పరిణామాలను బేరీజు వేసిన మీదట ఈ అభిప్రాయం వెలువరిస్తున్నాం‘ అని పేర్కొన్నారు. రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించి ఆరు నెలలు గడిచినా ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీ లేయర్ గుర్తింపునకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘ప్రభుత్వాలు ఆ పని చేయవు. చివరికి అత్యున్నత న్యాయస్థానమే జోక్యం చేసుకోవాల్సి వస్తుంది‘ అన్నారు. ఆ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘ఆ పని చేసేందుకు శాసన, కార్యనిర్వాహక విభాగాలు ఉన్నాయి. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు అమలయ్యేలా వాళ్లు చట్టం చేయాలి‘ అని పునరుద్ఘాటించింది. అయితే సంబంధిత వర్గాలనే ఆశ్రయిస్తామని పిటిషనర్ తెలపడంతో కేసును ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. -
రాజ్యాంగాన్ని మోసగించడమే
న్యూఢిల్లీ: కేవలం రిజర్వేషన్ ఫలాలు దోచేయాలనే దుర్భుద్దితో మతం మారిన విషయాన్ని దాచిపెట్టిన అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాంటి చర్యలు రాజ్యాంగాన్ని మోసగించడంతో సమానమని అభివర్ణించింది. క్రైస్తవమతంలోకి మారిన తర్వాత కూడా ఒక మహిళ షెడ్యూల్ కులం సర్టిఫికేట్ కోసం తాను ఇంకా హిందువునేనని వాదించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ అంశంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఆర్ మహదేవన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. హిందువు అయిన సి.సెల్వరాణి క్రైస్తవమతం పుచ్చుకుంది. అయితే రిజర్వేషన్ లబ్ది పొందేందుకు, ఉద్యోగి సంబంధిత ప్రయోజనాలు పొందేందుకు తాను ఇంకా హిందువునేనని నమ్మించే ప్రయత్నంచేశారు. అయితే ఆమె నిజంగా క్రైస్తవ మతంలోకి మారిందని, తరచూ చర్చికి వెళ్తూ, క్రైస్తవ మత కార్యక్రమాల్లో పాల్గొంటూ, పూర్తి విశ్వాసంతో క్రైస్తవమతాన్ని ఆచరిస్తోందని సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. దీంతో రిజర్వేషన్ కోసం ఆ మహిళ తన మతాన్ని దాచిపెట్టడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘బాప్టిజం పూర్తయ్యాక ఇంకా తాను హిందువును అని మహిళ చెప్పుకోవడంలో అర్థంలేదు. మతం మారాక కూడా రిజర్వేషన్ ప్రయోజనాలే పరమావధిగా ఇలా వ్యవహరించడం రిజర్వేషన్ లక్ష్యాలకే విఘాతం. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అమలుచేస్తున్న రిజర్వేషన్ల విధానం ఇలాంటి వారితో ప్రమాదంలో పడుతుంది’’అని కోర్టు వ్యాఖ్యానించింది. సెల్వరాణి తండ్రి హిందువుకాగా తల్లి క్రైస్తవురాలు. అయితే సెల్వరాణి చిన్నతనంలోనే బాప్టిజం తర్వాత క్రైస్తవురాలిగా మారారు. అయితే 2015లో పుదుచ్చెరిలో అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగం పొందేందుకు ఆమె ఎస్సీ సర్టిఫికేట్ సంపాదించారు. సెల్వరాణి తండ్రి వల్లువాన్ కులానికి చెందిన వ్యక్తి. స్థానికంగా ఈ కులం వారికి ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ సెల్వరాణి తండ్రి సైతం దశాబ్దాలక్రితమే క్రైస్తవమతం స్వీకరించారు. దీంతో తల్లిదండ్రులు క్రైస్తవులుకాగా తాను మాత్రం హిందువును అని ఈమె చేసిన వాదనల్లో నిజం లేదని కోర్టు అభిప్రాయపడింది. -
రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు స్థానం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంలో మత పరమైన రిజర్వేషన్లకు స్థానం లేదని... ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో ముస్లింలకు ఇస్తున్నట్టుగానే మహారాష్ట్రలో కూడా 4శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం సరికాదన్నారు. మంగళవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఆర్ఎస్ఎస్ వరిష్ట్ ప్రచారక్ నందకుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టులు మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేశాయని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పాయని గుర్తు చేశారు.దీనిపై సుప్రీంకోర్టులో స్టే తీసుకొచ్చి మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు స్థానం లేదు..ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని కోర్టు తీర్పు ఇచి్చందని తెలిపారు. ఆ కోర్టు తీర్పును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గౌరవించాలని సూచించారు. లగచర్ల అంశంపై చట్టం తనపని తాను చేస్తుందని, ఇది ముఖ్యంగా శాంతిభద్రతల సమస్య అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను రద్దు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నానని తెలిపారు. హిందూ దేవాలయాల్లో పనిచేసే ఇతర మతాల వారిని వేరేచోట్లకు బదిలీ చేయాలని కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
మళ్లీ మణిపూర్‌లో నిప్పు
ఇంపాల్/గువాహటి: మెజారిటీ మైతేయ్‌లకు రిజర్వేషన్లను కల్పించాలన్న నిర్ణయంతో రాజుకున్న అగ్గికి 200 మందికిపైగా బలైన ఉదంతం నుంచి తేరుకుంటున్న మణిపూర్‌లో మళ్లీ విద్వేషాగ్ని రాజుకుంటోంది. గత వారం అపహరణకు గురైన ఆరుగురి మృతదేహాలు తాజాగా నదిలో బయటపడటంతో మైతేయ్ వర్గాల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంది.మైతేయ్ అనుకూల అల్లరిమూకలు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులకు తెగబడ్డాయి. నిరసనలు, ఆందోళనలు ఒక్కసారిగా ఉధృతమవడంతో పుకార్లు, తప్పుడు వార్తల ప్రచారానికి అడ్టుకట్టవేసేందుకు మణిపూర్ ప్రభుత్వం వెంటనే ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. ఘర్షణాత్మక, సున్నిత ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కంగ్పోక్పీ, చురాచాంద్‌పూర్ జిల్లాల్లో నెట్సేవలను ఆపేశారు. అసలేం జరిగింది? కుకీ–జో వర్గానికి చెందిన గ్రామవలంటీర్లుగా చెప్పుకునే 11 మంది సాయుధులు బొరోబెక్రా ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్‌పైకి దాడికి తెగించారు. అయితే భద్రతాబలగాల ఎదురుకాల్పుల్లో ఈ 11 మంది చనిపోయారు. దీనికి ప్రతీకారంగా మైతేయ్ వర్గానికి చెందిన వారిని కుకీ సాయుధమూకలు నవంబర్ 11వ తేదీన అపహరించాయి. అపహరణకు గురైన వారిలో ఆరు గురి మృతదేహాలు శుక్రవారం జిరిబామ్ జిల్లాలో లభించాయి. అస్సాం–మణిపూర్ సరిహద్దు వెంట ఉన్న జిరిముఖ్ గ్రామ సమీప జిరి, బారక్ నదీసంగమ ప్రాంత జలాల్లో ఈ మృతదేహాలను కనుగొన్నారు. ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళల మృతదేహాలు లభించడంతో మైతేయ్ వర్గాల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. ఇంఫాల్ లోయలోని చాలా ప్రాంతాల్లో వేలాది మంది నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు ఎమ్మెల్యేల నివాసాలపై మైతేయ్ వర్గీయులు శనివారం దాడులకు తెగబడ్డారు. ముగ్గురు రాష్ట్రమంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలపై ఇళ్లపై దాడులు చేశారు. ఎమ్మెల్యే నిశికాంత్ ఇంటిపై దాడిచేశారు. -
వర్గీకరణ రివ్యూ పిటిషన్‌పై నేడు నిర్ణయం
న్యూఢిల్లీ, సాక్షి: ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాల మహానాడు సవాల్ చేసింది. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని, తీర్పును రివ్యూ చేయాలంటూ మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య, మాజీ ఎంపీ హర్ష కుమార్‌లు పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన కీలక తీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈమేరకు 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కనబెడుతూ.. 6:1 మెజారిటీతో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. తాజా తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది.‘‘వ్యవస్థాగతంగా ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా ఎస్సీ/ఎస్టీ వర్గాల వారు పైకి రాలేకపోతున్నారు. ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని 14వ అధికరణ అనుమతి కల్పిస్తుంది. అందుకే 2004 నాటి ఈవీ చిన్నయ్య తీర్పును మేం వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నాం’’ అని సీజేఐ ధర్మాసనం స్పష్టంచేసింది. అణగారిన వర్గాల వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు రిజర్వ్డ్ కేటగిరీలో రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేసుకోవచ్చని కోర్టు వెల్లడించింది. ధర్మాసనంలో దీనికి అనుకూలంగా ఆరుగురు న్యాయమూర్తులు తీర్పు చెప్పగా.. జస్టిస్ బేలా ఎం.త్రివేది మాత్రం ఉప వర్గీకరణ సాధ్యం కాదంటూ వ్యతిరేకించారు.కేసు వివాదం..ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కోటా రిజర్వేషన్లలో 50శాతాన్ని వాల్మీకి, మజహబీ సిక్కు సామాజికవర్గాలకు తొలి ప్రాధాన్యంగా ప్రత్యేకిస్తూ 2006లో పంజాబ్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. అయితే, ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ చెల్లదంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు 2010లో తీర్పు వెలువరించింది. ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2004లో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్ చట్టం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా, తొలగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుందని, రాష్ట్రాల శాసనసభలకు కాదని ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు 2004లో తీర్పు చెప్పింది. దాన్నే పంజాబ్, హరియాణా తమ ఉత్తర్వులో హైకోర్టు ప్రస్తావించింది.దీంతో, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం దీనిపై మరో 22 పిటిషన్లు దాఖలయ్యాయి. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఇందులో వ్యాజ్యదారుగా ఉన్నారు. ఈ పిటిషన్లను విచారించిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. 2020లో ఈ వివాదాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. దీనిపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆరంభంలో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఉపవర్గీకరణ చేసుకొనేలా రాష్ట్రాలకు అనుమతినిస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. విచారణ సమయంలో కేంద్రం కూడా ఎస్సీ/ఎస్టీలో ఉపవర్గీకరణను సమర్థించింది. -
కులగణన చేసి తీరుతాం
గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం జరిగే విధంగానే రిజర్వేషన్లు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం రవీంద్రభారతిలో మాజీ ఎంపీ వి.హన్మంతరావు ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ కులగణనకు అంతా సిద్ధంగా ఉందని, దీనికి నిధులు కేటాయించినట్టు తెలిపారు. ఎవరెంత అరిచి గీ పెట్టినా రాష్ట్రంలో కులగణన చేయడం ఖాయమని స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ చెప్పిన మాటలకు అనుగుణంగానే అసెంబ్లీలో తీర్మానం చేశామని, వెనువెంటనే బీసీ కమిషన్‌ను కూడా నియమించామని గుర్తు చేశారు. కులగణనకు వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని, ఇదే పార్లమెంట్లో కులగణన తీర్మానం చేస్తామని రాహుల్‌గాంధీ చెప్పారన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు బీజేపీ అసలు స్వరూపం తెలుసుకోకపోతే రాబోయేతరాలకు నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలంతా ఐక్యంగా ఉండి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. -
బీజేపీ ఉన్నంతకాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు: అమిత్ షా
అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా వేదికగా కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తుంటే.. అదే స్థాయిలో కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు.. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలను తప్పికొడుతున్నారు. తాజాగా రాహుల్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మండిపడ్డారు. దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్న శక్తులకు అండగా నిలబడటం రాహుల్‌కు, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని అమిత్ షా విమర్శించారు. ‘దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్న శక్తులకు అండగా నిలవడం, దేశవ్యతిరేక ప్రకటనలు చేయడం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయింది. అది జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన దేశ వ్యతిరేక, రిజర్వేషన్ వ్యతిరేక ఎజెండాకు మద్దతివ్వడమైనా సరే లేదా విదేశీ గడ్డపై భారత వ్యతిరేక ప్రకటనలు చేయడమైనా సరే.. రాహుల్ గాంధీ ఎప్పుడూ దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.ప్రాంతీయవాదం, మతం, భాషా భేదాల తరహాలో చీలికలు తెచ్చే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్ గాంధీ ప్రకటన బయటపెట్టింది. దేశంలో రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడటం ద్వారా.. కాంగ్రెస్‌కు, ఆయనకు రిజర్వేషన్‌పై ఉన్న వ్యతిరేకతను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. ఆయన మనసులో మెదిలే ఆలోచనలే చివరికి మాటల రూపంలో బయటపడ్డాయి. ఇక్కడ నేను రాహుల్‌కు ఒక విషయం స్పష్టంచేయాలని అనుకుంటున్నాను. బీజేపీ ఉన్నంతకాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు. అలాగే దేశభద్రతతో ఎరూ ఆటలాడలేరు’ అంటూ మండిపడ్డారు. -
‘‘ఎలా చూసినా కులగణనే కీలకం’’
ఎన్నికల వేళ సందడి చేసిన కులగణన వాదం ఆ తర్వాత కూడా చర్చనీయాంశంగా కొనసాగుతూనే ఉంది. సుప్రీంకోర్టు దేశంలోని ఉపకులాలకు న్యాయం జరిగేలా ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను విభజించవచ్చని వెలువరించిన తీర్పు ఇప్పుడు ఎంతో కీలకంగా మారింది. అయితే ఈ తీర్పును అమలుపరచడానికి రాష్ట్రాలు వేటికవి తమ ప్రాంతాల్లో కులగణన చేస్తే కుదరదు. కేంద్రం మాత్రమే జనాభా లెక్కల్లో భాగంగా ఈ పని చేయాలి. లేదంటే కోర్టులో కొత్త వివాదాలు తలెత్తుతాయి. అయితే రిజర్వేషన్ల వల్ల అత్యధిక ప్రయోజనం పొందుతున్న కులాలవారూ, అలాగే స్థానికంగా బలంగా ఉన్న రిజర్వేషన్ వెలుపల ఉన్న శూద్ర కులాలవారూ కులగణనను వ్యతిరేకిస్తూనే ఉన్నారు.దేశంలోని ఉపకులాలకు న్యాయం జరిగేలా ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను విభజించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. పోతే ఆ విభజన న్యాయబద్ధ ఆబ్జెక్టివ్‌గా తేల్చిన జనాభా లెక్కల ప్రకారమే చెయ్యాలని కూడా తేల్చి చెప్పింది. ఈ జడ్జిమెంట్ ప్రకారం ఇటువంటి లెక్కలు రాష్ట్రాలు కమిషన్ల ద్వారానో, లేదా స్వంత రాష్ట్రస్థాయి జనాభా గణన చేపట్టి చెయ్యలేరు. ఏ కేంద్ర ప్రభుత్వమైతే సుప్రీంకోర్టు ముందు ఉపకులాలకు న్యాయబద్ధమైన రిజర్వేషన్ పంపకం అవసరమే అని ఒప్పుకుందో... ఆ ప్రభుత్వమే కేంద్ర స్థాయిలో కులాల వారీగా జనాభా లెక్కలు తీయించే వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జడ్జిమెంట్ అమలుకు పూనుకోలేదు. ఒకవేళ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం సొంత రాష్ట్ర ఉపకులాల లెక్కలు తీయించి, ఏదో ఒక రిజర్వేషన్ కేటగిరీలో రిజర్వేషన్ విభజిస్తే ఆ విభజన మళ్లీ హైకోర్టులో ఉపకుల లెక్కల యాక్యురసీ (కచ్చితత్వం) కొట్టివేయబడుతుంది. చివరకు సుప్రీంకోర్టుకు పోయినా అదే సమస్య ఎదురవుతుంది.ఇది ఎస్సీ, ఎస్టీల సమస్య మాత్రమే కాదు...ఇప్పటికే ఉప కులాల లెక్కలు తీసిన బిహార్ రిజర్వేషన్ విభజన, పెంపుదలను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్ల ఉపకుల న్యాయపర విభజన కేవలం ఎస్సీలకో, ఎస్టీలకో సంబంధించింది మాత్రమే కాదు. ఓబీసీ కులాల్లో అన్ని రాష్ట్రాల్లో తమ తమ ఉపకులాల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగాలు, సీట్లు రావడం లేదని ఉద్యమాలు నడుస్తున్నాయి. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో మాదిగ, మాల కులాలకో; కోయ, గోండు, చెంచు, లంబాడాల మధ్య విభజనకో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పరిమితమై లేదు. బీసీ కులాల్లో ఉన్న ఏబీసీడీ గ్రూపుల్లో చాలా ఉప కులాలున్నాయి. డీ గ్రూపులో గొల్ల– యాదవులకు... మున్నూరు కాపులకు దొరికే అవకాశాలు దొరకడం లేదనీ, బీ గ్రూపులో కురుమలకు తమ వాటా తమకు దొరకడం లేదనే తీవ్ర అసంతృప్తి ఉంది. అందుకే వాళ్ళు తమ కులాన్ని సెమీ–నొమాడిక్ కమ్యూనిటీ (అర్ధ సంచార జాతి) లోకి మార్చాలని డిమాండ్ ఉంది.మహారాష్ట్రలో ధనగర్లు (గొర్రెల కాపర్లు) చాలా ఉద్యమాలు నడిపి తమ కులానికి మొత్తం ఓబీసీ రిజర్వేషన్లో 3 శాతం వాటా సంపాదించుకున్నారు. అక్కడి మరాఠాలు తమకూ రిజర్వేషన్లు కావాలని చాలా కాలంగా పోరాడుతున్నారు. కోర్టులు అందుకు అంగీకరించనందున తమకు కుంబి కులసర్టిఫికెట్లు ఇచ్చి రిజర్వేషన్‌లోకి చొప్పించండి అని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. గుజరాత్లో పటేళ్లు (పాటీదార్లు) తమకూ రిజర్వేషన్లు కావాలని చాలా కాలంగా ఉద్యమాలు చేస్తున్నారు. ఉపకుల రిజర్వేషన్ జడ్జిమెంట్ ద్వారా ఈ అన్ని రకాల డిమాండ్లకు పరిష్కారం వెతకాల్సి ఉంటుంది.2024 ఎన్నికల్లో ఓట్ల కోసం చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఉపకులాలకు ‘మీ వాటా మీకు ఇప్పిస్తామని’ వాగ్దానం చేసింది. ప్రధానమంత్రి స్వయంగా ఆ మీటింగులో పాల్గొన్నారు. కానీ జాతీయ స్థాయిలో కుల గణన చేయించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్... 1931 నాటి జనాభా లెక్కల్లో చేసినట్లు కులగణనను జనాభా లెక్కల్లో భాగంగా చెయ్యాల్సిన అవసరాన్ని కేంద్రం ముందు పెట్టింది. ఇక తప్పించుకోవడం సాధ్యం కాదు.కాంగ్రెస్ వెనక్కి తగ్గింది!కాంగ్రెస్ పార్టీ 2011 జనాభా లెక్కల్లో భాగంగా కులగణన ఒక ప్రత్యేక కుల లెక్కల షెడ్యూల్‌ను తయారుచేసి లెక్కలు తీయించారు. కానీ శుద్రాతీత అగ్రకులాల్లో (బ్రాహ్మణ, బనియా, క్షత్రియ, కాయస్థ, ఖత్రి కులాల వారి నుండి) వ్యతిరేకత రావడం వల్ల ఆ లెక్కలు బయట పెట్టకుండా ఆపేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో మేధావి వర్గమంతా ఈ ఐదు కులాల వారే! 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ కులజనాభా లెక్కలు కావాలని కాంగ్రెస్ ఓట్ల శాతం పెంచే ప్రయత్నం చేశారు. కానీ రిజర్వేషన్ బయట ఉన్న కులాల నుండి అన్ని పార్టీల్లో వ్యతిరేకత వస్తోంది. ఈ కారణం వల్లనే కర్ణాటకలో కులాల లెక్కలు తీసి కూడా బయట పెట్టకుండా ఆపేశారు. కారణం బ్రాహ్మణ, బనియా, లింగాయత్, వక్కళి కులాల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కనుక. వీటన్నిటికి మూలమేమంటే చాలా చిన్న శూద్రేతర కులాలు చాలా పెద్ద మొత్తంగా ఉద్యోగాలు, ప్రభుత్వరంగ ఐఐటీ, ఐఐఎమ్‌లు, మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందుతున్నాయి. వీరి కులాల సంఖ్య జనాభా లెక్కల ద్వారా బయటికి వస్తే వారు దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని నడుపడానికి వ్యతిరేకంగా చాలా పెద్ద తిరుగుబాటు వస్తుంది.మొత్తం మీద శూద్రుల వాటా తక్కువే!రెండు తెలుగు రాష్ట్రాల్లో రెడ్లు, కమ్మలు, వెలమలకు కూడా అర్థం కాని అంశమేమంటే... ఢిల్లీ అధికారంలోగానీ, బ్యూరాక్రసీలోగానీ; గవర్నర్లు, అంబాసిడర్ల వంటి పదవుల్లో కానీ వీరి వాటా చాలా తక్కువ అనేది. రిజర్వేషన్ బయట ఉన్న మొత్తం శూద్ర అగ్ర కులాలకు వారి జనాభా లెక్కల ప్రకారం చూస్తే కేంద్ర అధికారంలో కానీ, మోనోపలీ క్యాపిటల్‌లో కానీ అతి కొద్దిపాటి వాటా మాత్రమే ఉన్నది. కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్లో కాని, ప్రధానమంత్రి సెక్రటేరియట్లో కాని వారు ఎవ్వరూ కనబడరు. వారు కేవలం రాష్ట్ర అధికారం కోసమే ఆరాటపడుతున్నారు. కానీ కేంద్రంలో మొత్తం శూద్రుల వాటా చాలా చిన్నదిగా ఉంది. కుల గణన... రెడ్డి, కమ్మ, వెలమ వంటి కులాలు జాతీయ స్థాయిలో వాటా పొందడానికి పనికొస్తుంది. ఇదే పరిస్థితి కర్ణాటకలోని లింగాయత్, వక్కళి కులస్థులది కూడా! వాళ్ళు రాష్ట్ర రిజర్వేషన్ సిస్టమ్‌లో భాగస్వాములే కానీ కులలెక్కలను వ్యతిరేకిస్తున్నారు. కేరళలో నాయనార్లు కుల లెక్కలే కాదు రిజర్వేషన్లను కూడా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు తాము శూద్రులం కాదు క్షత్రియులమని చెప్పుకుంటున్నారు. ఇది కేవలం ఆ చిన్న రాష్ట్రంపై పెత్తనం చలాయించడానికి పనికొస్తుంది. కానీ కేంద్రంలో నాయనార్లకు కూడా వాటా లేదు. ప్రతి రాష్ట్రంలో ఉన్న శూద్ర పై కులాలు కులగణనను ఎందుకు స్వాగతించాలో ఆలోచించడం లేదు.1931లో బ్రిటిష్ ప్రభుత్వం కులాల లెక్కలు తీసి ఉండకపోతే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణులు తామే దేశంలో అత్యధికులం అని నమ్మించేవారు. అంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వాళ్ళు అలానే నమ్మించారు. దేశం మొత్తం మీద బ్రిటిష్ పాలక వ్యవస్థ (అడ్మినిస్ట్రేషన్)లో వాళ్ళే ఉండేవారు. జనాభా రీత్యా కూడా ‘మేమే అన్ని కులాల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నామ’ని నమ్మించేవారు. ఆచరణలో కులం ఉన్నప్పుడు ఆ కులం సంఖ్య ఎంత ఉందో తెలిస్తే తప్ప కులాల అభివృద్ధి, దేశం అభివృద్ధి జరిగే ప్రణాళికలు తయారు చెయ్యడం సాధ్యం కాదు.తక్కువ సంఖ్యలో ఉండి ఎక్కువ ఉద్యోగాలు, విద్యారంగంలో సీట్లు సంపాదించే కులాలు, కులం లెక్కలు తియ్యొద్దని తప్పకుండా వాదిస్తాయి. ఈ ఆలోచనా ధోరణి నుండే రిజర్వేషన్లలో 50 శాతానికి మించి ఉండకూడదని వాదించాయి. సుప్రీంకోర్టులో తమకు అనుకూల జడ్జిమెంటును సంపాదించాయి. దానికి మెరిట్ అనే ఒక వాదనను ముందు పెట్టాయి. అసలు కులాన్ని ఈ దేశానికి బ్రిటిష్ వలసవాదులు తెచ్చారని వాదించాయి. ఉత్పత్తి కులాలు ముఖ్యంగా శూద్రులు ఢిల్లీలో పాలకులైతే తమ చరిత్ర తలకిందులవుతుందని భావించాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉపకులాల వాటా జడ్జిమెంట్ చరిత్ర మలుపును మరో మెట్టు ఎక్కించేదనే అంశంలో సందేహం లేదు. ఇప్పుడు అన్ని శూద్ర కులాలు, దళితులు, ఆదివాసులు ఐక్యంగా కుల జనాభా లెక్కలు చెయ్యాలని పోరాడటమే వారి భవిష్యత్తుకు మార్గం. - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
క్రీమీలేయర్ పేరిట చిచ్చు పెట్టొద్దు: ఖర్గే
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీల్లోని క్రీమీలేయర్‌కు రిజర్వేషన్లు వర్తింపజేయకూడదన్న ఆలోచనను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం చెప్పారు. ఈ అంశంపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్న భాగాన్ని తొలగించాలని, ఇందుకోసం పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. క్రీమీలేయర్ పేరిట ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేయొద్దని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీలేయర్‌ను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక విధానం రూపొందించాలని సుప్రీంకోర్టు తీర్పులో న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. క్రీమీలేయర్‌కు రిజర్వేషన్లు నిరాకరించాలని ఆయన సూచించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో అస్పృశ్యత ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాల్సిందేనని మల్లికార్జున ఖర్గే తేలి్చచెప్పారు. రిజర్వేషన్ల అమలు కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విధానానికి ముగింపు పలికేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. -
బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస.. 91 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ మరోసారి హింసతో అట్టుడికింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వివాదంపై ఆందోళనచేస్తున్న ఉద్యమకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో హింస చెలరేగింది. ఆదివారం(ఆగస్టు4) జరిగిన ఈ ఘర్షణల్లో ఇప్పటివరకూ 91 మంది దాకా మృతి చెందినట్లు బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది. ఘర్షణల్లో చాలా మందికి తీవ్ర గాయాలైనట్లు తెలిపింది. ఇటీవలే కోటా వివాదంపై చెలరేగిన హింసలో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగడంతో అక్కడ ఉన్న దేశ పౌరులను భారత రాయబార కార్యాలయం అలర్ట్ చేసింది. భారత పౌరులంతా సాయం కోసం తమతో టచ్‌లో ఉండాలని కోరింది. ఇందుకు పలు ఫోన్ నంబర్లను ప్రకటించింది. ఘర్షణల నేపథ్యంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి కర్ఫ్యూ విధించారు. హింసకు పాల్పడేవారు విద్యార్థులు కాదని అలాంటివారిని అణచివేయాలని ప్రధాని షేక్‌హసీనా పిలుపునిచ్చారు. -
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు చరిత్రాత్మకం
సనత్‌నగర్ (హైదరాబాద్): ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమైందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై వాదన లు వినిపించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను పంపించి బలమైన వాదనలు వినిపించేలా చేశారని గుర్తు చేశారు. ‘ఎస్సీ వర్గీకరణ–మాదిగల భవిష్యత్తు’ అనే అంశంపై శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో మాదిగ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మేధావుల సమావేశం జరిగింది. ప్రొఫెసర్ జి.మల్లేశం అధ్యక్షతన జరిగిన సమావే శానికి హాజరైన దామోదర రాజనర్సింహ మాట్లాడు తూ, రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీల వర్గీకరణను చేసుకో వచ్చని తీర్పు రావడం ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టులో వాదనలకు పూర్తిగా సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఈ సభ ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసిందన్నారు. న్యాయనిపుణులతో ఒక కమిటీ వేసి సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యయనం చేసిన నివేదిక సీఎంకు అందజేస్తామని చెప్పారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిని మాదిగ ఎమ్మెల్యేలందరూ కలిసి ఒక కమిటీ వేయాల్సిందిగా కోరతామని, ఆ కమిటీ సూచనల మేరకు ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకు రావాలన్నారు. అంతేకాకుండా త్వరలో పెద్దఎత్తున మాదిగల సమ్మేళనం పేరుతో ఒక బహిరంగ సభను ఏర్పాటుచేసి సీఎంను ఆ సభకు ఆహ్వానించి సన్మా నించనున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యేవరకు జాతి పెద్దలుగా అందరం కలసిక ట్టుగా ముందుకుసాగుదామన్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ, మాదిగ లకు తగిన ప్రాధాన్యతనిచ్చి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మొట్టమొదటి నేత ఎన్టీఆర్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్య నారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వేముల వీరేశం, మందుల సామేల్, లక్ష్మీకాంతరావు, కాలే యాదయ్య, ప్రొఫెసర్ కాశీం, కొండ్రు పుష్పలీల, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, పిడమర్తి రవి తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక న్యాయం!! అవకాశవాదమా? అమలయ్యేనా?
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యం నెరవేరింది. పట్టువదలకుండా కృషి చేస్తే ఎప్పటికైనా అనుకున్నది సాధించవచ్చని ఈ ఉద్యమం రుజువుచేసింది. ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగకు ఇది వ్యక్తిగత విజయం అని కూడా భావించవచ్చు. మాదిగ దండోరా పేరుతో సాగిన ఉద్యమం ఉమ్మడి ఎపిలో విశేష ప్రభావం చూపిందని చెప్పాలి.ఒకప్పుడు తమ పేరు చివర మాదిగ అని పెట్టుకుంటే సమాజంలో చిన్నతనం అవుతుందేమో అనుకునే దశ నుంచి మాదిగ అన్న పదానికి ఒక గౌరవాన్ని,గుర్తింపును తెచ్చిన ఘనత ఆయనది. వర్గీకరణ కన్నా మందకృష్ణ తీసుకు వచ్చిన పెద్ద సామాజిక మార్పు ఇది అని చెప్పాలి. .. గత ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో జరిగిన సభలో మంద కృష్ణను దగ్గరకు తీసుకుని తాను కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా పనిచేస్తానని ప్రకటించారు. కృష్ణను ఏకంగా తన నాయకుడుగా కూడా ఆయన ప్రకటించడం అందరిని ఆకర్షించింది. అయినా వర్గీకరణ సాధ్యమా? కాదా? అనే చర్చ కొనసాగింది. విశేషంగా గతంలో వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన సుప్రింకోర్టు ఇప్పుడు దానిని కొట్టివేసి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయానుసారం వర్గీకరణ చేసుకోవచ్చని అత్యున్నత న్యాయ స్థానం నిర్ణయం చేసింది. దీని ప్రకారం సామాజిక, ఆర్ధిక అంశాల ప్రాతిపదికన ఎస్సీలలో వర్గీకరణ చేయవచ్చని స్పష్టం చేసింది. తత్ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలలో వర్గీకరణ ప్రాతిపదికన అవకాశాలు లభిస్తాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్ లు ఉన్నాయి. కాని ఈ రిజర్వేషన్ అవకాశాలు ఎస్సీలలో బలమైన కొన్ని వర్గాలకే అధికంగా లభించాయన్న బావనతో దండోరా ఉద్యమం ఆరంభం అయింది. ప్రధానంగా మాల వర్గంకు చెందినవారికే ఈ రిజర్వేషన్ ల ఫలాలు అధికంగా దక్కుతున్నాయన్న అభిప్రాయం మాదిగ,తదితర ఉప కులాలలో ఏర్పడింది. రాజకీయ పదవులలో సైతం మాలల ఆదిపత్యం ఎక్కువగా ఉంటున్నదని, తమ సంఖ్యకు అనుగుణంగా పదవులు దక్కడం లేదన్న ప్రచారం జరిగేది. తెలంగాణలో మాదిగలు అధిక సంఖ్యలో ఉంటారు.అదే విభజిత ఆంద్ర ప్రదేశ్ లో మాల వర్గం వారు ఎక్కువగా ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రాజకీయాలు కూడా ఉమ్మడి ఏపీలో సాగుతూ వచ్చాయి. తొలుత నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ ప్రక్రియ ఆరంభమైంది. మాలవర్గం నేతలు దీనిని పూర్తిగా వ్యతిరేకించారు. చంద్రబాబు ఎస్సీలలో విభజన చిచ్చు పెడుతున్నారని వారు ఆరోపించేవారు. ఎస్సీలలో ఎక్కువమంది కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటారన్న అభిప్రాయం అప్పట్లో ఉంది. ఆ వర్గంలో తనకంటూ ఓటు బ్యాంకును తయారుచేసుకునే ఉద్దేశంతో వర్గీకరణ వైపు చంద్రబాబు మొగ్గుచూపారన్న విమర్శ కూడా అప్పట్లో ఉండేది. అయితే.. ఈ వర్గీకరణ తమకు మేలు చేస్తుందని మాదిగ,తదితర ఉపకులాలు భావించి, మంద కృష్ణ ఉద్యమానికి మద్దతు ఇచ్చాయి.దాంతో వివిధ రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆయా రాజకీయ పక్షాలు ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయాలు చేశాయి. ఈ దశలో సుప్రింకోర్టులో వర్గీకరణ చెల్లదని తీర్పు రావడంతో ఇది అత్యంత జఠిల సమస్యగా మారింది. ఆ తరుణంలో ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా శాసనసభలో తీర్మానం చేసింది. కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వం వద్దకు దీనిపై అఖిలపక్షాన్ని పంపించి ఆయన సమస్య పరిష్కారానికి కృషి చేశారు. దీనికి వ్యతిరేకంగా మాలమహానాడు నేతలు నిరాహార దీక్షలకు దిగగా, వైఎస్ ఆర్ వారిని ఒప్పించి విరమింప చేశారు. అప్పట్లో ఉషా మెహ్రా నేతృత్వంలో ఒక కమిషన్ ను ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ వర్గీకరణపై వివిధ రాష్ట్రాలలో అభిప్రాయాలు సేకరించింది. ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న పరిస్తితులను దృష్టిలో ఉంచుకునే కేంద్రం అప్పట్లో వ్యవహరించిందన్న భావన ఉంది. ఆ కమిషన్ కూడా వర్గీకరణకు సానుకూలమైన నిర్ణయాలు వెలువరించలేదు. దాంతో ఇది పెద్ద పెండింగ్ సమస్యగా మారింది. అయితే మాదిగ దండోరా ఉద్యమాన్ని మంద కృష్ణ నిలుపుదల చేయలేదు. మద్యలో దండోరాలో చీలికలు వచ్చినా, రాజకీయాల ప్రభావం పడినా, అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన తన వాయిస్ వినిపిస్తూనే వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత నాటి టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రభుత్వం కూడా దీనిపై అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. బిజెపి అగ్రనేతలు దండోరాకు మద్దతు ఇవ్వడంతో ఇది ఒకరకంగా కొత్తరూపు దాల్చిందని చెప్పాలి. సీనియర్ నేత వెంకయ్యనాయుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటివారు కృష్ణకు సహకరించారు. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ తాను ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా ఒక భారీ సభను నిర్వహించడంతో ఈ ఉద్యమం కొత్త మలుపు తిరిగింది.ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయంతీసుకుని కోర్టుకు ఆ విషయం తెలిపింది. ఒకసారి సుప్రింకోర్టు నిర్ణయం అయిన తర్వాత తిరిగి కేసును ఓపెన్ చేసి కోర్టు విచారణ జరపడం సంచలనమే అని చెప్పాలి. తదుపరి రెండు దశాబ్దాలకు సుప్రింకోర్టు తన తీర్పును మార్చుకుని వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం ఉందని తేల్చడంతో ఇది ఒక కొలిక్కి వచ్చినట్లయింది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే.. ఒకప్పుడు రాజకీయ లక్ష్యంతో ఉమ్మడి ఏపీలో రిజర్వేషన్ లకు అనుకూలంగా నిర్ణయించిన టీడీపీ, రాష్ట్ర విభజన తర్వాత దాని జోలికి వెళ్లలేదు. 2014 టరమ్ లో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో మాదిగ దండోరా ఉద్యమానికి అనుమతి ఇవ్వలేదు. దానికి కారణం ఏపీలో మాలవర్గం వారి ప్రాధాన్యత అధికంగా ఉండడమే అని భావిస్తారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో వీరి ప్రాబల్యం అధికంగా ఉంటుందని అంటారు.మాదిగ దండోరాకు వ్యతిరేకంగా మాల మహానాడు నేతలు కూడా ఆరోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించేవారు.దీంతో ఈ వ్యవహారం క్లిష్టమైన సమస్యగా ఉండేది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయం వెలువరించడంతో ఇది ఒక కొలిక్కివచ్చినట్లయిందనిపిస్తుంది. అయితే మాల మహానాడు నేతలు ఏ రకంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇప్పుడు కొత్త సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీయులలో ఏ ఉప కులంవారు ఎంత మంది ఉన్నారన్నదానిపై గణాంకాలు సేకరించవలసి ఉంటుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం వర్గీకరణ చేసి విద్య,ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ లు కల్పిస్తే సరిపోతుందా?లేదా?అనేది చూడాల్సి ఉంది. కాగా, ఎస్సీ వర్గీకరణపై సుప్రిం తీర్పును తెలంగాణలోని రాజకీయ పక్షాలు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తమ వంతు ప్రయత్నం సాగించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఒక ప్రకటన చేస్తూ తమ రాష్ట్రం వెంటనే దీనిని అమలు చేస్తుందని ప్రకటించారు.సుప్రింకోర్టులో సీనియర్ న్యాయవాదిని నియమించి కేసును బలంగా వినిపించడంతో తీర్పు అనుకూలంగా వచ్చిందని కాంగ్రెస్ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. మరో నేత కడియం శ్రీహరి టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు వర్గీకరణపై తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది తమ ఘనతేనని బిజెపి పేర్కొంది. కాగా కాంగ్రెస్ పార్టీ మాదిగలను అణచివేసే ప్రయత్నం చేస్తే.. తమ అధినేత కేసీఆర్ వారిని ఆదుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాస్త ఆచితూచి స్పందించారనిపిస్తోంది. దీనిని సామాజిక న్యాయంగా వ్యాఖ్యానించారాయన. ఎస్సీలతో పాటు ఎస్టీ వర్గీకరణపై తీర్పు రావడంతో దాని ప్రభావం ఏ రకంగా ఉండేది అప్పుడే చెప్పజాలం. అంతా హర్షిస్తారా?లేక కొత్త ఆందోళనలు ఏమైనా వస్తాయా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం లభించిందని ఆశిద్దాం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అడ్డంకులు అధిగమించాం.. విజయం సాధించాం
సాక్షి, న్యూఢిల్లీ: ‘మాదిగల 30 ఏళ్ల పోరాటానికి తెరపడింది. వర్గీకరణ పోరాటంలో అడుగడుగునా అరెస్టులు.. ఉద్యమాలను అడ్డుకున్నా, పట్టు వీడకుండా న్యాయమైన పోరాటానికి అడుగులు వేశాం. ఉద్యమం ప్రారంభించిన తొలిరోజుల్లో ఎన్ని అడ్డంకులు వచి్చనా వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడి ఈ రోజు వర్గీకరణ సాధించాం. మాదిగల్లో పోరాట స్ఫూర్తిని నింపాం. గ్రామస్థాయి నుంచి నగరస్థాయి వరకు రిజర్వేషన్లపై చైతన్యం తెచ్చాం’ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇచి్చన నేపథ్యంలో మంద కృష్ణమాదిగను ‘సాక్షి’ పలకరించింది. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.... ఎమ్మార్పీఎస్ కార్యకర్తల పోరాటం వల్లే..మాదిగల హక్కుల కోసం 1994 జూలై 7న ‘మాదిగ పోరాట సమితి’ని స్థాపించాను. గ్రామ, మండలస్థాయిలో ఎమ్మారీ్పఎస్ కార్యకర్తలు..రాజకీయపారీ్టల కార్యకర్తలకు దీటుగా నిలబడ్డారు. ఎంతోమంది మాదిగలు వర్గీకరణ కోసం బలిదానాలు చేసుకున్న సంఘటనలు నన్ను ప్రతిరోజూ కలచివేస్తుండేవి. ‘అన్నా మేం చనిపోతున్నాం..అయినా సరే పోరాటం ఆపొద్దు.మీరు ముందుండి ఉద్యమాన్ని నడపండి...ఏదో ఒకరోజు రిజర్వేషన్లు కచి్చతంగా సాధిస్తాం’అంటూ చనిపోయే ముందు కొందరు కార్యకర్తలు నాతో మాట్లాడిన మాటలు ప్రతిరోజూ నేను గుర్తు చేసుకుంటూ పోరాటాలకు పిలుపునిచ్చేవాడిని. వారి కన్నీళ్ల ప్రతిఫలమే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు. 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు బలంగా ఉంటూ, పోరాటాలు చేశారు. ఎంతో మంది నాయకులు మా కార్యకర్తలపై భౌతికంగా దాడులు చేసినా, వేధించినా, కేసులు పెట్టినా భయపడకుండా ధైర్యంగా నిలబడ్డారు. ఎమ్మారీ్పఎస్ పోరాటస్ఫూర్తి వల్లనే ఈరోజు విజయం సాధించాం. ఎంతో మంది సహకరించారుమేం చేసిన ఈ పోరాటానికి ఎంతోమంది మద్దతు పలికారు. అనేక పర్యాయాలు ఆర్థికపరమైన సాయం, మాట సాయం, న్యాయపరమైన సాయాలు ఎందరో చేశారు. వారందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆ ఐదుగురు అలా..ఈ ఐదుగురు ఇలా2004లో జస్టిస్ సంతోష్‌హెగ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం రిజర్వేషన్లు చెల్లవు అంటూ రద్దు చేసింది. ఆ తర్వాత 2020లో అరుణ్‌మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల «ధర్మాసనం రాష్ట్రప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేయొచ్చని తీర్పు ఇచ్చింది.ఇదే సందర్భంలో ఏడుగురు సభ్యుల ధర్మాసనం దీనిపై న్యాయం చెప్పాలని సూచనలు చేసింది. ఆ సూచనల కారణంగానే తాజాగా రిజర్వేషన్లపై తీర్పు రావడం ఆనందంగా ఉంది. ముందేమో ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం వ్యతిరేకించింది, ఆ తర్వాతేమరో ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఉమ్మడి ప్రయోజనాల కోసం పోరాడుదాం వర్గీకరణ కోసం మేం పోరాటాలు చేస్తుంటే మా మాల సోదరులు రోడ్డెక్కి అడ్డుచెప్పేవారు. కానీ, కొంతకాలంగా వారి మనసులు మారాయి, మా పోరాటాలకు ఎవరూ అడ్డు పడలేదు. ఇకపై ఉమ్మడి ప్రయోజనాల కోసం ఎస్సీలందరం కలిసి పోరాడాల్సిన అవసరముంది. 2004లో తెచి్చన చట్టాన్నే ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తే సరిపోతుంది. ఇక తెలంగాణలో కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాల్సి ఉంది. వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టొద్దని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా.సీఎంకు మాదిగ ఎమ్మెల్యేల స్వీట్లుసాక్షి, హైదరాబాద్: ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పు నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డికి మిఠాయిలు తినిపించారు. అసెంబ్లీలోని సీఎం చాంబర్లో మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో డప్పు చప్పుళ్లతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో కడియం శ్రీహరి, కాలె యాదయ్య, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్య నారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, శామేలు, తోట లక్ష్మీకాంతరావు తదితరులున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు చారకొండ వెంకటేశ్, గజ్జెల కాంతం, దేవని సతీశ్, మాజీ మంత్రి పుష్పలీల కూడా సీఎం రేవంత్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
బీహార్ ప్రభుత్వానికి బిగ్ షాక్
-
సుప్రీం కోర్టులో బిహార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో బిహార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బిహార్‌లో 65 శాతం రిజర్వేషన్ చట్టం నిలుపుదలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే ఈ అంశంపై వాదనలు వినేందుకు మాత్రం సుప్రీం ధర్మాసనం అంగీకరించింది. గత ఏడాది నవంబర్‌లో రాష్ట్ర ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించిన రిజర్వేషన్ సవరణలు రాజ్యాంగ సమానత్వ నిబంధనలను ఉల్లంఘించేవని పట్నా హైకోర్టు జూన్ 20 నాటి తీర్పులో వెల్లడించింది. వెనకబడిన తరగతులకు 65 శాతం రిజర్వేషన్ కోటా ఇవ్వడాన్ని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పును బిహార్ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన రిజర్వేషన్ నిలుపుదల తీర్పుపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించటాన్ని నిరాకరించింది. చదవండి: Bihar Caste Reservation: రిజర్వేషన్లపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం -
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు తీవ్రతరం... కనిపిస్తే కాల్చివేత!
ఢాకా/సాక్షి, న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. రిజర్వేషన్లపై వారం క్రితం మొదలైన దేశవ్యాప్త హింసాకాండ నానాటికీ పెరిగిపోతోంది. భద్రతా సిబ్బందికి, విద్యార్థులకు మధ్య జరుగుతున్న ఘర్షణల్లో మృతి చెందిన వారి సంఖ్య శనివారంతో 115 దాటింది! రాజధాని ఢాకాతో పాటు ప్రధాన నగరాలు, పట్టణాల్లో కర్ఫ్యూ విధించినా, సైనికులు, పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. అయినా లాభం లేకపోగా పరిస్థితి విషమించడమే గాక పూర్తిగా అదుపు తప్పుతోంది. దాంతో తాజాగా కనిపిస్తే దేశవ్యాప్తంగా కాలి్చవేత (షూట్ ఎట్ సైట్) ఉత్తర్వులు జారీ అయ్యాయి! 978 మంది భారతీయులు వెనక్కు బంగ్లాదేశ్ నుంచి 978 మంది భారతీయ విద్యార్థులను కేంద్రం సురక్షితంగా వెనక్కు తీసుకొచి్చంది. 778 మంది నౌకల్లో, 200 మంది విమానాల్లో వచ్చారు. బంగ్లాదేశ్‌లో పనలు వర్సిటీల్లో ఇంకా 4 వేలకు పైగా భారతీయ విద్యార్థులున్నారు. వారందరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఢాకాలోని భారత హైకమిషన్ కృషి చేస్తోంది.ఇదీ సమస్య... 1971 బంగ్లాదేశ్ వార్ వెటరన్ల కుటుంబీకులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 2018లో షేక్ హసీనా వీటిని రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని ఢాకా హైకోర్టు తాజాగా తప్పుబట్టింది. ఆ రిజర్వేషన్లను పునరుద్ధరించాలంటూ జూన్ 5న ఆదేశాలిచి్చంది. దీనిపై విద్యార్థులు, ఉద్యోగార్థులు భగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా వీటిని వ్యతిరేకిస్తూ భారీగా నిరసనలు, ఆందోళనలకు దిగారు. కోటా పునరుద్ధరణ వద్దే వద్దంటూ రోడ్డెక్కారు. దాంతో కోర్టు ఉత్తర్వులను హసీనా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా పక్కన పెట్టింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆదివారం తుది విచారణకు అంగీకరించింది. -
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు.. భారత్ చేరిన వెయ్యి మంది విద్యార్థులు
ఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు పెరగుతున్న క్రమంలో ఢాకాలోని భారత హైకమిషన్ విద్యార్థులను పలు మార్గాల ద్వారా ఇండియాకు సురక్షితంగా చేర్చుతోంది. ఇప్పటివరకు 1000 మంది విద్యార్థులు బంగ్లాదేశ్ నుంచి భారత్ చేరకున్నారు. 778 మంది విద్యార్థులు వివిధ మార్గాల ద్వారా బంగ్లాదేశ్ సరిహద్దు దాటి భారత్‌కు చేరుకున్నారు. ఇక.. 200 మంది విద్యార్థులు రెగ్యులర్ విమాన సర్వీసుల్లో భాగంగా శనివారం ఢాకా, చిట్టగాంగ్ ఎయిర్‌పోర్టుల్లో విమానం ద్వారా భారత్‌కు చేరకున్నట్లు విదేశీ వ్యవహరాల శాఖ వెల్లడించింది. అయితే మరో నాలుగు వేల మంది విద్యార్థులతో టచ్‌లో ఉన్నామని అధికారులు తెలిపారు. ఇక.. శుక్రవారం 300 మంది భారతీయులు.. బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు బయలుదేరి ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల గుండా ఇళ్లకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భారత్ చేరకున్న 300 మంది విద్యార్థల్లో ఎంబీబీఎస్ విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విద్యార్థులంతా ఉత్తర ప్రదేశ్, హర్యానా, మేఘాలయా, జమ్ము కశ్మీర్ చెందినవారిగా అధికారులు గుర్తించారు.Over 300 Indian Students Return Home As 105 Bangladeshis Die In ProtestsMany of the students who returned were pursuing MBBS degrees and most of them were from Uttar Pradesh, Haryana, Meghalaya and Jammu and Kashmir.#BangladeshiStudentsareinDanger https://t.co/kL2sdGFYmL— AK_0 (@ak_2350) July 20, 2024 బంగ్లాదేశ్ నుంచి రెండు మార్గాలు ద్వారా విద్యార్థులు భారత్‌కు చేరుకున్నారు. శుక్రవారం ఈశాన్య రాష్ట్రం త్రిపుర రాజధాని అగర్తాలాకు సమీపంలోని అకురాహ్ పోర్టు, మేఘాలయాలోని దావ్కీ గుండా విద్యార్థులు భారత్‌లోకి ప్రవేశించారు. పలువరు విద్యార్థులు టాక్సిల ద్వారా సుమారు ఆరుగంటల ప్రయాణం చేసి మరీ ఇళ్లకు చేరకున్నట్లు అధికారులు తెలిపారు. 200 మంది భారతీ విద్యార్థులతోపాటు కొంతమంది భూటాన్, నేపాల్ చెందిన విద్యార్థులు కూడా భారత్‌లోకి ప్రవేశించినట్లు మేఘాలయా అధికారులు పేర్కొన్నారు.బంగ్లాదేశ్‌లో పోలీసులు, అధికార పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగుతున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ ఘటనల్లో శుక్రవారం నాటికి 64 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. గాయపడిన వారి సంఖ్య వందల్లోనే ఉంటుందని తెలిపింది. -
ప్రైవేటు ‘కోటా’ వివాదం.. కర్ణాటక ప్రభుత్వం వెనకడుగు
బెంగళూరు: కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో గ్రూప్ సీ, డీ గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. పరిశ్రమవర్గాల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. దీనిపై రానున్న రోజుల్లో సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.ప్రైవేటు రంగంలో స్థానికులకు రిజర్వేషన్ తప్పనిసారి చేస్తూ కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం కొత్త బిల్లును ఆమోదించింది. అయితే కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లుపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ఆయన ట్వీట్ ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పరిశ్రమల్లోని గ్రూప్ సీ, డీ గ్రేడ్ ఉద్యోగాల్లో వంద శాతం కన్నడిగుల నియామకాన్ని తప్పనిసరి చేస్తూ రూపొందించిన బిల్లును రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించిందని సీఎం పేర్కొన్నారు.కన్నడిగులు తమ రాష్ట్రంలో సంతోషంగా జీవించేందుకు అవకాశం కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్ధేశ్యమని సీఎం పేర్కొన్నారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగానికి వారు దూరం కాకూడదని తెలిపారు. కన్నడిగుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు. అయితే పోస్టుపై అనేక విమర్శలు వెల్లువెత్తడంతో.. తరువాత ఆయన దానిని డిలీట్ చేశారు. అనంతరం మళ్లీ సరిచేసి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. -
రిజర్వేషన్ కోటా నిరసన హింసాత్మకం.. ఆరుగురి మృతి
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్‌లో విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మాకంగా మారాయి. ఈ నిరసనల్లో మంగళవారం ఆరుగురు నిరసనకారులు మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఉన్న అధికార అవామీ లీగ్ పార్టీ విద్యార్థి విభాగం సభ్యులు, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వేలాది మంది విద్యార్థుల మధ్య ఘర్షణలు తీవ్రతరం అయ్యాయి. దీంతో నిరసన మరింత పెరగకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం ముందస్తుగా.. బుధవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.Dozens injured in Bangladesh clashes as students protest against job quotas for government jobs and a pro-government student body — in pictures https://t.co/CXkzG9mx6b pic.twitter.com/G0ETouUPvs— Al Jazeera English (@AJEnglish) July 16, 2024 బంగ్లాదేశ్‌లో 56 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు వివిధ కోటాల క్రింద రిజర్వ్ చేయబడ్డాయి. అయితే వాటిలో 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వీరుల పిల్లలు, మనవళ్లకు 30 శాతం, 10 శాతం మహిళలకు, 10 శాతం అభివృద్ధి చెందని జిల్లాలకు చెందిన వారికి, 5 శాతం స్థానిక వర్గాలకు,1 శాతం వికలాంగులకు కేటాయించబడ్డాయి. ఈ రిజేర్వేషన్లను సంస్కరించి ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వాలని కొంతమంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కోటా ద్వారా ప్రతిభ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం విద్యార్థులు చేపట్టిన తీవ్రతరం కావటంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు.Dhaka University now at 12am..#Bangladesh#StepDownHasina pic.twitter.com/PQMX2e8nJQ— Sayed Rouf 🇵🇸 (@SayedRouf4) July 16, 2024 ఈ నిరసనల్లో సుమారు 400వందల మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే తాము హింసను రెచ్చగొట్టడానికి నిరసన చేయటం లేదని ఓ విద్యార్థి నిరసనకారుడు మీడియాకు తెలిపారు. ‘ మేకు కేవలం మా హక్కులుకోసం పోరాటం చేస్తున్నాం. కానీ అధికార పార్టీ గూండాలు శాంతంగా నిరసన తెలుపుతున్నవిద్యార్థులపై దాడులు చేస్తున్నారు’ అని తెలిపారు. ఇక.. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ హక్కుల కోసం శాంతియుతంగా నిసనలు హింసాత్మకంగా మారాటంపై అంతర్జాతీయ సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్ స్పందిస్తూ.. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నిరసనకారులకు భద్రత కల్పించాలంది. యూఎస్ స్టేట్ డిపార్టుమెంట్ ఈ నిరసన హింసాత్మకంగా మారటాన్ని తీవ్రంగా ఖండించింది.দেশের বুকে আঠারো এসেছে নেমে।❤️#Bangladesh #কোটা_সংস্কার_চাই #কোটাবাতিলচাই #QuotaMovement #QuotaReform pic.twitter.com/Wkalog4iKi— toffee 🇵🇸 (@clowngrizzly) July 16, 2024 -
కూటమి మాట.. రిజర్వేషన్లు రద్దు..
సాక్షి, అమరావతి: మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేద వర్గాలకు రిజర్వేషన్లు అవసరం లేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుండబద్ధలు కొట్టారు! జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజర్వేషన్లపై తన వ్యతిరేకతను బహిర్గతం చేసిన చంద్రబాబు వాటిని రద్దు చేయాలని అభిప్రాయపడ్డారు! ‘ఎస్సీ, ఎస్టీలు, ఇతర కొన్ని వర్గాలకు ఏడు దశాబ్దాలుగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. మరి వాళ్లు ఏమైనా బాగుపడ్డారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. వారికి రిజర్వేషన్లు అవసరం లేదన్నట్లుగా మాట్లాడారు. ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ చెబుతుండగా ఎన్డీఏతో పొత్తులో ఉన్న చంద్రబాబు మాత్రం ఇప్పటివరకు మభ్యపెట్టేలా మాట్లాడారు. పోలింగ్‌కు ముందు చంద్రబాబు తన ముసుగు తొలగించి ముస్లింలకు రిజర్వేషన్లు అవసరం లేదని స్పష్టం చేయడంతో ఆ వర్గాలు ఆవేదనతో రగిలిపోతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి అధికారం ఇస్తే ఏపీలో ముస్లింలకు అమలవుతున్న 4 శాతం రిజర్వేషన్లు రద్దు కావడం ఖాయమని చంద్రబాబు వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రతి సందర్భంలోనూ పేదల పట్ల తన వ్యతిరేకతను చాటుకున్నారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వారి పుట్టుకనే అవమానించిన వ్యక్తి చంద్రబాబు. బీసీల తోకలు కత్తిరిస్తానని బెదిరించిన చరిత్ర కూడా ఆయనదే. చంద్రబాబు నరనరానా కులోన్మాదం జీర్ణించుకుపోయిందనేందుకు దళితులు, ముస్లింలు, బీసీలకు వ్యతిరేకంగా పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. తాజాగా ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు రిజర్వేషన్లు అవసరం లేదంటూ వారి పట్ల తన వ్యతిరేకతను చాటుకున్నారు. ఆయన మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో అది ఫేక్ అంటూ ఎప్పటి మాదిరిగానే గొంతు సవరించుకున్నారు.నైపుణ్య శిక్షణ చాలన్న పవన్‌చంద్రబాబు పార్ట్నర్ పవన్ కళ్యాణ్ కూడా రిజర్వేషన్లపై తన వ్యతిరేకతను చాటుకున్నారు. దేశంలో చాలా కులాలు, ఉప కులాలు ఉన్నాయని, అందరూ రిజర్వేషన్లు అడుగుతారని, కానీ అందరికీ ఇవ్వలేమని ఇటీవల ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ పేర్కొన్నారు. అర్హతను బట్టి అవకాశాలు రావాలని, అందుకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తే సరిపోతుందన్నారు. రిజర్వేషన్ల ద్వారా అందరికీ అవకాశాలు ఇవ్వలేమని, తన కులం వాళ్లు కూడా రిజర్వేషన్లు అడుగుతున్నారని, కానీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ వ్యాఖ్యల ద్వారా పేద వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పారు. -
కేంద్రంలో బీజేపీ వస్తే భవిష్యత్తు ఉండదు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ మరోమారు అధికారంలోకి వస్తే దేశంలోని బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు భవిష్యత్తు ఉండదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. 400 సీట్లు ఎప్పుడు వస్తాయా? రాజ్యాంగాన్ని ఎప్పుడు మార్చి రిజర్వేషన్లను రద్దు చేద్దామా అని ఆ పార్టీ ఉర్రూతలూగుతోందని చెప్పారు. పొరపాటున బీజేపీకి ఓటేస్తే మన గొంతు మనం కోసుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. మంగళవారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ నేతలు బండ్ల గణేశ్, సామా రామ్మోహన్‌రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. 90% మందికి హక్కులు దక్కకుండా బీజేపీ కుట్ర ‘బీజేపీ అధికారంలోకి వస్తే దళితులు, గిరిజనులు, బీసీలకు రాజ్యాంగం ద్వారా దక్కాల్సిన హక్కులు, వారి వాటా దక్కకుండాపోయే ప్రమాదముంది. తరతరాలుగా అణగదొక్కబడుతున్న దళితులు, గిరిజనులకు రిజర్వేషన్లు ఆషామాïÙగా రాలేదని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలి. ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఎస్సీ, ఎస్టీలకు అవకాశాల్లో మార్పు రావడానికి రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లే కారణం. ఈ రిజర్వేషన్ల ద్వారా ఆయా వర్గాలకు రావాల్సింది ఇంకా చాలా ఉంది. ఓవైపు దేశ వ్యాప్తంగా కులగణన చేసి జనాభా దామాషా ప్రతిపాదికన ఎవరి వాటా వారికి ఇవ్వాలనేది రాహుల్‌గాంధీ ఆలోచన. కులగణన ఊసెత్తకుండా ఇప్పటికే ఉన్న ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను తొలగించాలన్నది బీజేపీ ఆలోచన. దేశంలోని 90 శాతం మంది ప్రజలకు రావాల్సిన హక్కులు వారికి రాకుండా బీజేపీ కుట్ర చేస్తోంది. అందుకే పదే పదే 400 సీట్లు కావాలని అడుగుతోంది..’అని భట్టి చెప్పారు. పెను ప్రమాదంలో ప్రజాస్వామ్యం ‘బీజేపీ ఆలోచనలతో ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడింది. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని సమాజంపై రుద్దే కుట్ర జరుగుతోంది. ఇలాంటి వాస్తవాలను చెబుతుంటే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై కేసులు పెట్టి విచారణకు ఢిల్లీ రావాలని పిలిపిస్తున్నారు. కేసులు పెట్టి బెదిరిస్తున్నారా? ప్రజల మనసులను గెలుచుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలే తప్ప కేసులు పెట్టి కాదు. బీజేపీకి ఈ రాష్ట్రంలో స్థానం లేకుండా చేయాల్సిన బాధ్యత రాష్ట్రంలోని బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లపై ఉంది. రానున్న ఎన్నికల్లో తెలంగాణలోని ఆయా వర్గాలు కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలి. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాంగబద్ధమైన వాటాను, వారి హక్కులను కాపాడుకోవాలంటే కాంగ్రెస్‌ను నిలబెట్టుకోవాలి..’అని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడంఎవరి తరం కాదు‘ఎన్నికల కోడ్ రాకముందు మేము అధికారంలోకి వచ్చి మూడు నెలలే అవుతోంది. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ తెలంగాణను ఛిన్నాభిన్నం చేస్తే దాన్ని సరిదిద్దుతూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. పదేళ్ల కాలంలో చెప్పిన హామీలను అమలు చేయని కేసీఆర్ ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు..’అని భట్టి విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు కదా అని ప్రశ్నించగా.. ప్రభుతాన్ని కూల్చడం ఎవరి తరం కాదని భట్టి చెప్పారు. సంపూర్ణంగా ఐదేళ్ల పాటు పాలిస్తామని ధీమా వ్యక్తం చేశా రు. గత పదేళ్లలో ప్రజా సంపదను ఎలా లూఠీ చేయాలో బీఆర్ఎస్ చూపెడితే, ఆ సంపదను ప్రజలకు ఎలా పంచాలో తాము చూపెడతా మని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో గెలుస్తుందని అన్నారు. -
రిజర్వేషన్లకు ఎవరు భరోసా?
రిజర్వేషన్ల మీద జాతీయ స్థాయిలో ఇంతటి ప్రస్తావన చోటు చేసుకోవడం ఒక మంచి పరిణామం. ఇది ప్రస్తావన మాత్రంగానే సాగుతున్న వ్యవ హారం కాబట్టి దీనిని చర్చ అనడం లేదు. ప్రస్తుతం జరుగు తున్న ఎన్నికల్లో (లోక్‌సభ ఎన్ని కలు–2024) బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందనీ, రిజర్వేషన్లను రద్దు చేస్తుందనీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి కమలనాథులు తీవ్ర కలవర పాటుకు గురౌతున్నారు. అర్ఎస్ఎస్ చేత కూడా ఖండన ప్రకటనలిప్పిస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం కానీ, రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచన కానీ ఏ కోశానా లేవని చెప్పుకుంటున్నారు. రిజర్వేషన్లు జనాభాలో అత్య ధిక శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి నవి కాబట్టి బీజేపీ ఇంతగా ఇది అయిపోతోందని అర్థమవుతోంది. సామాజికంగా అణగారిన వర్గాలకు–అంటే సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అందుకు విరుద్ధంగా ఆర్థిక వెనుకబాటుతనాన్ని రాజ్యాంగంలో చేర్పించి ఆ వర్గానికి ఏకంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర బీజేపీ పాలకులది. ఇందు కోసం అగ్ర వర్ణాలనుంచి ఒత్తిడి వర్గాలను రంగంలో దింపిన ఘనత బీజేపీది. దేశంలో శతాబ్దాలుగా కఠోరంగా అమల్లో గల కుల వ్యవస్థ, బ్రాహ్మణీయ వివక్ష వల్ల చదువుకీ, ఆస్తికీ, ఆత్మగౌరవానికీ బహు దూరంగా బతుకుతూ... అదే సమయంలో సకల శ్రామిక, సేవక వృత్తులు చేస్తూ సమాజ రథాన్ని నడిపిస్తున్న వేలాది కింది కులాల ప్రజలను చేయి అందించి ముందుకు తీసుకురావలసిన కర్తవ్యాన్ని గుర్తించి రాజ్యాంగ కర్తలు సానుకూల వివక్షకు అవకాశం కల్పించారు. విద్య, ఉద్యోగాల్లో కొంత శాతాన్ని ప్రత్యేక పరిగణన ద్వారా వారికి కేటాయించాలని నిర్ణయించారు. రాజ్యాంగ అధికరణలు 15(4), 46 ఇందుకే చోటు చేసుకున్నాయి. ప్రమోషన్లలో, భర్తీ కాకుండా మిగిలిపోయిన బ్యాక్ లాగ్ ఉద్యోగాలలో కూడా ఈ రిజర్వేషన్లు వర్తింపజేయడానికి వేర్వేరు రాజ్యాంగ సవరణల ద్వారా అవకాశం కల్పించారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ అందరికీ సమానంగా ఓటు హక్కును కల్పించడంతో దేశంలో సమతా భావన బలపడడం ప్రారంభించింది. అయినా ఇప్పటికీ వెలి గ్లాసులు, వెలి బావులు వంటివి కొనసాగుతున్నాయి. అగ్రవర్ణాలకు కేటాయించిన మంచినీటి కుండలోని నీరు తాగేడనే నెపం మీద పాఠశాలలో దళిత బాలుడిని కొట్టి చంపిన మాదిరి దారుణ ఉదంతాలు జరుగతున్నాయి. రిజర్వేషన్లు కల్పించి ఏడు దశాబ్దాలు దాటినా అణగారిన వర్గాల– ఎస్సీ, ఎస్టీ, బీసీల బతుకులు చాలీ చాలని గుడిసెల్లోనే కొనసాగుతున్నాయి. నిరుద్యోగం, అధిక ధరలు వారి బతుకులను మరింతగా అంచులకు ఈడ్చివేశాయి. అందుకే జనాభాలో తామెందరో... విద్య, ఉద్యోగాల్లో అంత శాతం వాటా తమకు రావాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. కులగణన నినాదం బలం పుంజుకున్నది. కాంగ్రెస్ పార్టీ దీనిని ప్రధాన వాగ్దానంగా చేసుకుంది. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషాను బట్టి రిజర్వేషన్లు వర్తిస్తుండగా దేశ జన సంఖ్యలో సగానికి పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లను 27 శాతానికే కుదించారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీం కోర్టు గీచిన హద్దు గీత, క్రీమీ లేయర్ నిబంధన బీసీల పాలిట శాపాలయ్యాయి. ఆర్థిక వెనుకబాటుతనం పేరిట అగ్రవర్ణ పేదలకు రాజ్యాంగ సవరణ ఆయుధంతో 10 శాతం కోటా కల్పించిన మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని, క్రీమీ లేయర్‌ను తొలగించడానికి రాజ్యాంగ సవరణ ఎందుకు చేయలేదు? కులగణను బీజేపీ ఎందుకు వ్యతి రేకిస్తోంది? బీసీల దయనీయస్థితి అంకెల్లో అచ్చు గుద్ది నట్టు బయటపడి వారిని వాడుకుంటూనే తాను వారిని ఎంతగా వంచిస్తున్నదో బహిర్గతమవుతుందనే భయంతోనే కదా! బీజేపీ చరిత్రంతా రిజర్వేషన్ల వ్యతిరేక చరిత్రే. దశాబ్దాల క్రితం మండల్ నివేదిక అమలుకు తలపెట్టిన ప్పుడు చెలరేగిన రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం, మందిర్ ఆందోళన పరివార్ శక్తుల ప్రమేయంతో చెలరేగినవే కదా! సమ్మిళిత లక్షణంతో సెక్యులర్ సదాశయంతో వారి వారి అణగారినతనం ఆధారంగా హిందూయేతర మత స్థులలోని వారికీ రిజర్వేషన్ల కల్పనకు రాజ్యాంగం వీలు కల్పించింది. 2005 లో యూపీఏ ప్రభుత్వం నెలకొల్పిన జస్టిస్ రాజిందర్ సచార్ కమిటీ దేశంలో ముస్లింలు దయనీయ స్థితిలో ఉన్నారనీ, వారికి విశేష స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనీ సిఫారసు చేసింది. ఇప్పుడు ముస్లింలకు అరకొరగా ఉన్న రిజర్వేషన్లను కూడా రద్దు చేస్తామని ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రచార సభల్లో కఠోర స్వరంతో ప్రకటిస్తున్నారు. రాజ్యాంగ ధర్మాన్ని కాల రాస్తున్నారు. ముస్లింల రిజర్వే షన్లను తెగనరుకుతానంటున్న బీజేపీ, ఆ తర్వాత వారికి దగ్గరగా ఉన్న ఎస్సీ, ఎస్టీల కోటాకు టాటా చెప్పాబోదనే హామీ ఎక్కడిది? ఈ ఎన్నికల్లో తమ పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి లోక్‌సభలో 400 సీట్లు వస్తే రిజర్వేషన్లను తొలగిస్తామనీ, రాజ్యాంగాన్ని మారుస్తామనీ రాజస్థాన్ మంత్రి కిరోరి లాల్ మీనా ప్రకటించినట్టు చూపించిన ఒక వీడియో గత నెలలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. బీజేపీ తన అభిమతాన్ని అధికారికంగా కాకుండా అనధికారిక మార్గాలలో వ్యక్తం చేస్తూ ఉంటుందనే అభిప్రాయం ఉంది. రిజర్వేషన్ల జోలికి వెళ్ళబోమనీ, అది తప్పుడు ప్రచారమనీ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదే పదే చేస్తున్న ప్రకటనలను, ఇస్తున్న హామీలను నమ్మలేం. అర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ కూడా రంగ ప్రవేశం చేసి రిజర్వేషన్ల రద్దు జరగబోదని స్పష్టంగా ప్రకటించారు. అయితే గతంలో ఆయనొకసారి రిజర్వేషన్లను సమీక్షించాలని అన్నారు. 2015 లో బిహార్ ఎన్నికలకు కొద్ది వారాల ముందు మాట్లాడుతూ రిజర్వేషన్ విధానంపై సామాజిక సమీక్ష జరగాలని ప్రకటించారు. దాని మీద వివాదం చెలరేగడంతో ఇతర పేద వర్గాలకు కూడా మేలు చేసే ఉద్దేశంతోనే ఆయన అలా అన్నారని వివరణ వచ్చింది. ఆచరణలో బీజేపీ పదేళ్ల పాలనలో రిజర్వేషన్లు కను మరుగయ్యేలా ప్రైవేటైజేషన్ ముమ్మరించింది. సామా జికంగా, విద్యా విషయకంగా వెనుకబడిన బీసీలకు విధానపరంగా అది ఉపయోగపడింది శూన్యమే. బడు గులను కేవలం పేదలుగా, పైనుంచి నెలకు 5 కిలోల బియ్యం ‘ముష్టి’ వేస్తే అదే మహా ప్రసాదమని కళ్ళకు అద్దుకొనేవారుగా మాత్రమే బీజేపీ పరిగణిస్తూ ఉంది.హిందూ కుల వ్యవస్థ దశాబ్దాలుగా అణగదొక్కగా చదువు, ఆత్మగౌరవం పిసరంతైనా అంటని బానిస బతు కులు బతికినవారికి పరిహారంగా రిజర్వేషన్లను కల్పించడాన్ని తాము నెత్తిన పెట్టుకునే సనాతన నీతికి అవమా నమని వారు భావిస్తున్నారు. ఉదాహరణకు మహిళలపై గతంలో మోహన్ భాగవత్ వెలిబుచ్చిన అభిప్రాయా లను గమనించవచ్చు. ‘పెళ్లి ఒక కాంట్రాక్టు అని ఈ ఒప్పందం ప్రకారం నువ్వు నా ఇంటి బాధ్యతలు నెరవేరిస్తే నీ అవస రాలాన్నిటినీ నేను తీరుస్తాను, నిన్ను భద్రంగా కాపాడుతాను అని భర్త భార్యకు చెబుతాడు, భార్య ఈ ప్రకారం నడుచుకున్నంత కాలం భర్త ఆమె బాధ్యత వహిస్తాడు, ఆమె ఈ కాంట్రాక్టును ఉల్లంఘిస్తే ఆమెను అతడు వదిలేయవచ్చు’అని ఆయన అన్నారు. గ్రామీణ భారతంలో రేప్‌లు తక్కువనీ, పట్టణాల్లో, నగరాల్లోనే ఎక్కు వని కూడా అన్నారు. మహిళ ఆస్వతంత్రురాలుగా, పురుషుడి చేతుల్లో ఉండాలని ఆయన ప్రవచించారు. ఇటువంటి భావాలు గలవారి అధిపత్యంలో దేశం సెక్యులర్ రాజ్యాంగానికీ, రిజర్వేషన్లకూ స్వస్తి చెప్పి మనుస్మృతిని అమల్లోకి తెస్తుందనే భయాలు కలగడం సహజాతి సహజం.జి. శ్రీరామమూర్తి వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
నిప్పుతో చెలగాటమా!
న్యూఢిల్లీ: రిజర్వేషన్ల పేరిట హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి కాంగ్రెస్ నిప్పుతో చెలగాటం ఆడుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. బీజేపీ ఈసారి 400 స్థానాల్లో గెలిచి కొన్ని రాష్ట్రాల్లో మరింత మెరుగైన రాజకీయప్రతిభ కనబరచనుందని వ్యాఖ్యానించారు. పీటీఐతో ప్రత్యేక ఇంటర్వ్యూ సందర్భంగా ప్రస్తావించిన అంశాలు, అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. రాహుల్ గాంధీలో ఫైర్ లేదు ‘‘ రాహుల్ గాం«దీలో గొప్ప నాయకత్వ లక్షణం(ఫైర్)లేదుగానీ హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి విద్వేష మంటలు రాజేసే ఫైర్ చాలా ఉంది. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ సామాజిక సామరస్యాన్ని నాశనంచేస్తోంది. మత విద్వేషాలకు కారణమవుతోంది. ముస్లింలను కేవలం ఓటు బ్యాంక్‌గా చూస్తోంది. మేం గెలిస్తే ఉమ్మడి పౌర స్మృతి, ఒకే దేశం ఒకే ఎన్నికలు వంటి నిర్ణయాలను అమలుచేస్తాం.రాజ్యాంగపీఠికను బీజేపీ ఎన్నటికీ మార్చబోదు. రాజ్యాంగాన్ని సవరిస్తామంటూ కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్సే ఇప్పటికి 80 సార్లు రాజ్యాంగసవరణలు చేసింది. ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగ పీఠికలోనూ మార్చులు చేశారు. జనాల్లో భయాలు పెంచి వారి మద్దతు సాధించాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. రిజర్వేషన్లు తొలగిస్తామని మాపై అబద్ధాల బురద చల్లుతోంది’’ ప్రశంసలో ఆంతర్యమేంటి?‘‘పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫహాద్ హుస్సేన్ ఇటీవల రాహుల్ గాం«దీని నెహ్రూతో పోలుస్తూ ప్రశంసల్లో ముంచెత్తడం నిజంగా ఆందోళనకర విషయమే. భారత్‌ను అస్థిరపరచాలని చూసే శత్రుదేశం నేత రాహుల్‌ను ప్రశంసించడంలో ఉన్న ఆంతర్యమేంటో? అసలు పాక్‌తో కాంగ్రెస్‌కు ఉన్న సంబంధమేంటి? సంపద పంపిణీ విషయంలో శనివారం కూడా ఆయన పొగిడారు. ఆయన మాటల వెనుక బలమైన కారణం ఉండి ఉంటుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఖచి్చతంగా వివరణ ఇవ్వాలి. లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేద్దామని పాక్ ప్రయతి్నస్తోంది. కానీ పాక్‌కు అంత సత్తా లేదు’’ 400 సీట్లు ఖాయం ‘‘ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధిస్తుంది. బీజేపీ 370కిపైగా స్థానాల్లో గెలుస్తుంది. పశి్చమబెంగాల్లో మరిన్ని సీట్లు సాధిస్తాం. తమిళనాడులోనూ మెరుగవుతాం. కేరళలో బోణీ కొడతాం. ఒడిశా, అస్సాం, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ మెరుగైన సీట్లు సాధిస్తాం. ఛత్తీస్‌గఢ్‌లో క్లీన్‌స్వీప్ చేస్తాం. ఉత్తరప్రదేశ్‌లో 75 సీట్లదాకా గెలుస్తాం. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలికలు, సీట్ల సర్దుబాటు, ఇతరత్రా కారణాల వల్ల తక్కువ సీట్లు సాధిస్తాం. తొలి రెండు దశల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదవ్వడం వల్ల బీజేపీకి వచి్చన నష్టమేమీ లేదు’’ సంపద పునఃపంపిణీ సరికాదు‘‘ కాంగ్రెస్ చెబుతున్నట్లు సంపదను పునఃపంపిణీ చేస్తామన్న విధానం సహేతుకంకాదు. అర్జెంటీనా, వెనిజులా దేశాలు దీనిని అమలుచేసి చేతులుకాల్చుకున్నాయి. విపరిణామాలను ఎదుర్కొన్నాయి. కాంగ్రెస్ ఇలా చేస్తే భారత ఆర్థికవ్యవస్థ కుప్పకూలి వెనిజులా మాదిరిగా ద్రవ్యోల్బణం కట్టుతప్పుతుంది. భారత్‌పై పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోతారు’’ పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే ‘‘ పాక్ ఆక్రమిత కశీ్మర్ ముమ్మాటికీ మనదే. అంతమాత్రాన పీవోకేను బలవంతంగా ఆక్రమించాల్సిన అవసరం లేదు. జమ్మూకశ్మీర్‌లో సాకారమైన అభివృద్ధిని చూశాక పీఓకే ప్రజలే భారత్‌లో విలీనంకావాలని కోరుకుంటున్నారు. జమ్మూకశీ్మర్‌లో సాయుధబలగాల ప్రత్యేక అధికారాల(ఏఎఫ్ఎస్పీఏ) చట్టంను తొలగించాల్సిన సమయం దగ్గరపడింది. దీనిపై కేంద్ర హోం శాఖ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం. అయితే ఖచి్చతంగా ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేం’’ సరిహద్దు చర్చలు సానుకూలం ‘‘ తూర్పు లద్దాఖ్‌లో చైనా, భారత్ జవాన్ల ఘర్షణ తర్వాత నెలకొన్న ఉద్రిక్తతను సద్దుమణిగేలా చేసేందుకు చర్చల ప్రక్రియ సానుకూల వాతావరణంలో కొనసాగుతోంది. సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ నమ్మకం పెట్టుకుంది. చైనా కూడా అదే నమ్మకంతో చర్చలకు ముందుకొచి్చంది. సరిహద్దు వెంట మౌలికవసతుల పటిష్టానికి త్వరితగతిన ప్రాజెక్టుల్ని పూర్తిచేస్తున్నాం. సరిహద్దు త్వరలో మరింత సురక్షితంగా ఉండబోతోంది’’ -
మోదీ సభలో నోరెత్తగలవా? చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్
చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ! ఒకపక్క 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తున్న బీజేపీతో జత కడతాడు. మరోపక్క మైనార్టీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నటిస్తూ డ్రామాలు మొదలుపెట్టాడు. మైనార్టీలపై దొంగ ప్రేమ నటిస్తూ ఎన్డీఏలో కొనసాగుతానంటాడు. ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా? – నెల్లూరు సభలో సీఎం జగన్మండుటెండలోనూ పలమనేరులో చక్కటి వర్షం పడింది. మీ చిక్కటి చిరునవ్వులతోపాటు ఈ వర్షం దేవుడి ఆశీస్సులుగా భావిస్తున్నా. విజయం మనదే. – పలమనేరు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి నెల్లూరు, సాక్షి, తిరుపతి, సాక్షి, పుట్టపర్తి: ‘నేను ఈరోజు.. ధైర్యంగా చెబుతున్నా. ఆరునూరైనా కూడా 4 శాతం రిజర్వేషన్లు మైనార్టీలకు ఉండి తీరాల్సిందేనని మీబిడ్డ ఈరోజు తలెత్తుకుని చెబుతున్నాడు. ఇది మీ జగన్ మాట. ఇది మీ వైఎస్సార్ బిడ్డ మాట. దీనికోసం ఎందాకైనా పోరాడతా. మరి చంద్రబాబు ప్రధాని మోదీ సభలో ఇలా చెప్పగలడా? ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా? ఎందుకీ దొంగ ప్రేమ? ఒకవైపు ఎన్డీఏలో కొనసాగుతూ.. మరోవైపు వాళ్లు 4 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నా కూడా.. వారితోనే జతకట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు? సమాధానం చెప్పు చంద్రబాబూ..!’ అని సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా నిలదీశారు. శనివారం హిందూపురం, పలమనేరు, నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు..ఇక్కడ కొన్ని విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. మైనార్టీ సోదరులకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు మతం ప్రాతిపదికగా ఇచ్చినవి కావు. ముస్లింలలో కూడా కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్లకు, సయ్యద్‌లకు, మొఘల్‌లకు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనుకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చిన రిజర్వేషన్లు. ఇవాళ నేను ఈ రిజర్వేషన్లు వ్యతిరేకించే వారిని, బీజేపీని అడుగుతున్నా. ఒక్క ముస్లింలలో మాత్రమే కాదు. అన్ని మతాల్లో కూడా బీసీలు, ఓసీలున్నారు. అవి రాజ్యాంగానికి లోబడి వెనుకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు. మరి ఇలాంటి వెనుకబాటుకి గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్లపై రాజకీయం చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడటం ధర్మమేనా? ఇది కరెక్టేనా? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.మైనార్టీలకు మీ జగనన్న భరోసా..నేను ఇవాళ ప్రతి మైనార్టీ సోదరుడు, అక్కచెల్లెమ్మకు భరోసా ఇస్తూ చెబుతున్నా. మీకు 4 శాతం రిజర్వేషన్ల విషయం అయినా, ఎన్ఆర్సీ అయినా, సీఏఏ అయినా ఇంకా ఏ మైనార్టీ అంశమైనా.. మీ మనోభావాలకు, ఇజ్జత్ ఔర్ ఇమాన్‌కు మీ బిడ్డ జగన్ ఎప్పటికీ అండగా ఉంటాడు. మైనార్టీల పట్ల ప్రేమ చూపుతూ ఒక్క డీబీటీ స్కీమ్లే కాకుండా ఇళ్ల నిర్మాణం, షాదీ తోఫా లాంటి వాటితో అండగా నిలిచాం. ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించడం మొదలు నలుగురు మైనార్టీలను ఎమ్మెల్సీలుగా, నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం. నా మైనార్టీ సోదరుడు ఒకరిని డిప్యూటీ సీఎంగా, మైనార్టీ సోదరిని శాసనమండలి వైస్ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించి గౌరవించాం. మైనార్టీ సబ్ ప్లాన్ బిల్లు తేవడం దాకా ప్రతి సందర్భంలోనూ వారికి సముచిత స్థానం కల్పించి సాదరంగా పక్కన పెట్టుకున్న ప్రభుత్వం ఇదేనని గర్వంగా చెబుతున్నా. మొట్టమొదటిసారిగా మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు మాత్రమే కాకుండా ఎన్నికల్లో 7 స్థానాలు మైనార్టీలకే ఇవ్వడం ద్వారా వారికి రాజకీయంగానూ నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లయింది. అలా ఇచ్చిన పార్టీ వైఎస్సార్ సీపీనే అని గర్వంగా చెబుతున్నా.ఖాతాల్లోకి రూ.2.70 లక్షల కోట్లు.. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుమరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగనుంది. రాబోయే ఐదేళ్ల పాటు మీ ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలివి. మీ జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడం. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది. ఐదేళ్ల పాటు మీ రక్తం తాగుతుంది. మీ బిడ్డ 59 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చాడు. 130 సార్లు బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు రూ.2.70 లక్షల కోట్లు నేరుగా డీబీటీతో జమ చేశాడు. గతంలో రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ ఏకంగా మరో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు. మేనిఫెస్టోలోని హామీల్లో 99 శాతం నెరవేర్చి చిత్తశుద్ధి చాటుకున్నాడు. మీ బిడ్డ ఐదేళ్లలో చేసిన మంచినే చూపిస్తున్నాడు. నలుగురిలో నిలబడి కళ్లల్లో కళ్లు పెట్టి చూడగలుగుతున్నాడు. ఒక మనిషి 14ఏళ్లు సీఎంగా చేసిన తర్వాత కూడా 75 ఏళ్ల వయసుండీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లలేకపోతున్నాడంటే, పొత్తులతో నిలబడే ప్రయత్నం చేస్తున్నాడంటే, అసాధ్యమైన వాగ్దానాలు, మోసాలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాడంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? మనం చేసిన అభివృద్ధి...నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీలు పూర్తిచేసి జాతికి అంకితం చేసింది మన ప్రభుత్వమే. ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి చిత్రావతి, గండికోట, పులిచింతల రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేశాం. వెలిగొండలో రెండు టన్నెళ్లను ఇప్పటికే పూర్తిచేశాం. ఈ వర్షాకాలంలో వెలిగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకెళుతున్నాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులను పరుగులు పెట్టిస్తున్నాం. పైప్‌లైన్ వేసి రక్షిత మంచినీటి సదుపాయం కల్పించి ఉద్దానం సమస్యను శాశ్వతంగా పరిష్కరించాం. చంద్రబాబు దిక్కుమాలిన బుర్రకు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా తట్టిందా? మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎంఎస్ఎంఈలకు చేయి అందించి తోడుగా నిలిచాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రాన్ని వరుసగా నెంబర్ వన్‌గా నిలబెట్టాం. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.32 వేలు కోట్లు అయితే ఇదే మన పాలనలో వచ్చిన పెట్టుబడులు ఏకంగా రూ.లక్ష కోట్లు. వైద్య ఆరోగ్యశాఖలో 54 వేల పోస్టులు భర్తీ చేశాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు కడుతున్నాం. నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దాదాపు పూర్తి కావచ్చాయి. గడగడా చెబుతాగవర్నమెంట్ బడికి వెళ్లే పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, బడులు తెరిచేసరికే విద్యాకానుక, గోరుముద్ద, చదువులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి లాంటివి గతంలో ఉన్నాయా? పూర్తి ఫీజులతో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన గతంలో ఎప్పుడైనా చూశారా? నా అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా ఎదిగేలా ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తంతోపాటు 31 లక్షల ఇళ్ల స్థలాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపట్టాం. అవ్వాతాతలకు ఇంటికే రూ.3,000 పెన్షన్, రైతన్నలకు పెట్టుబడికి సాయంగా రైతు భరోసా లాంటివి గతంలో ఉన్నాయా? రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, ఓ ఆర్బీకే వ్యవస్థ లాంటివి ఇంతకు ముందెప్పుడైనా ఉన్నాయా? సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, ఓ చేదోడు, తోడు, లాయర్లకు లా నేస్తం లాంటి పథకాలు గతంలో ఉన్నాయా?ఆరోగ్యశ్రీని విస్తరించి రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఆరోగ్య ఆసరా ద్వారా కోలుకునే సమయంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా అండగా నిలిచాం. సచివాలయాల ద్వారా ఏకంగా 600 రకాల సేవలు ప్రజలకు గడప వద్దే అందిస్తున్నాం. వలంటీర్ వ్యవస్థ ద్వారా పథకాలు డోర్ డెలివరీ అవుతున్నాయి. నాడు ఆ డబ్బంతా ఎవరి ఖాతాల్లోకెళ్లింది? పిండి కొద్దీ రొట్టె సామెత మనకు తెలుసు. కానీ,పిండీ.. రొట్టె మొత్తం తినేసే బ్యాచ్‌కు లీడర్ చంద్రబాబు! తన 14 ఏళ్ల పాలనలో పేదలకు ఒక్కటైనా మంచిపనిగానీ, ఖాతాల్లోకి ఒక్క రూపాయిగానీ జమ చేశాడా? నాడూ నేడూ ఇదే రాష్ట్రం.. అదే బడ్జెట్. అప్పుల గ్రోత్ రేట్ ఇప్పుడే తక్కువ. మరి చంద్రబాబు ఆ డబ్బంతా ఎవరి ఖాతాల్లో జమ చేశారో నిలదీసి అడగండి. చంద్రబాబుకి ఎంత పోయింది? దత్తపుత్రుడికి ఎంతిచ్చారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5కి ఎంత పోయింది? జన్మభూమి కమిటీల జేబుల్లోకి ఎంత పోయింది?మన అభ్యర్థులను దీవించండిపలమనేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడ, చిత్తూరు ఎంపీ అభ్యర్థి ఎన్.రెడ్డెప్ప, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి æదీపికమ్మ, ఎంపీ అభ్యర్థి శాంతమ్మ, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్, రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి సాయిరెడ్డిని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. 2014లో బాబు ముఖ్యమైన విఫల హామీలివీ..» రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? » రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? » ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని నమ్మబలికి రూపాయి అయినా ఇచ్చాడా? » ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ అమలైందా? ఐదేళ్లలో ఏ ఇంటికైనా రూ.1.20 లక్షలు ఇచ్చాడా? » అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మరి ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? » రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేశాడా? » సింగపూర్‌కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందా? హిందూపురం, పలమనేరు, నెల్లూరులో ఎక్కడైనా కనిపిస్తున్నాయా?» ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు.» మళ్లీ ఇప్పుడు అదే కూటమి పేరుతో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కారు అంటూ మరోసారి మోసాలకు తయారయ్యారు.ఇంటికే పెన్షన్లను అడ్డుకున్న బాబు..చంద్రబాబు మొన్న అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పింఛన్‌ను అడ్డుకున్నారు. ఇవాళ బ్యాంకుల చుట్టూ పడిగాపులు కాయాల్సిన దుస్థితికి తీసుకొచ్చారు. వలంటీర్లు ఇంటికి రాకూడదు, వాళ్లు పెన్షన్లు ఇవ్వకూడదంటూ చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లెటర్ రాశాడు. అవ్వాతాతలు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుండటంతో ఆ నెపాన్ని మీ బిడ్డ జగన్‌పై వేయాలని ప్రయత్నించడం సిగ్గు చేటు. మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవాలని కోరుతున్నా. జగనన్న వచ్చాడు.. వర్షాన్ని తెచ్చాడుహిందూపురంలో పర్యటన ముగించుకుని సీఎం జగన్ పలమనేరు చేరుకునే సరికి మధ్యాహ్నం 2 గంటలు అయింది. అయితే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకే క్లాక్ టవర్ వద్దకు జన ప్రవాహం మొదలైంది. అందరిలో హర్షం వెల్లివిరిసేలా సీఎం జగన్‌తో పాటు వరుణ దేవుడు తోడుగా వచ్చాడు. దాదాపు 30 నిమిషాల పాటు మోస్తరు వర్షం కురిసింది. జగన్ వస్తే వానొస్తుందంటూ రైతన్నలు ఆనందం వ్యక్తం చేశారు. -
రిజర్వేషన్ల రద్దు నాటకం కాంగ్రెస్ కుట్రే
కరీంనగర్ టౌన్: తెలంగాణలో ఏ సర్వే చూసినా బీజేపీ అత్యధిక సీట్లు సాధిస్తుందని తేలడంతో రేవంత్‌రెడ్డికి భయం పట్టుకుందని, సీఎం సీటు పోతుందనే భయంతో రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చి నట్లు మాట్లాడుతున్నా రని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీని, ఆర్ఎస్ఎస్ను బద్నాం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. రిజర్వేషన్ల రద్దు కోసమే 2000లో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్‌ను బీజేపీ ప్రభుత్వం నియమించిందన్నారు. ఆయనిచ్చిన రిపోర్టును కూడా తొక్కిపెట్టారని చెబుతున్న రేవంత్‌రెడ్డికి 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ అని తెలీదా? మరి ఆ రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదని సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లోని కమాన్‌చౌరస్తా వద్ద బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోకు వేలాది మంది తరలివచ్చారు. కేంద్రమంత్రి మురుగన్‌తోపాటు సంజయ్ పాల్గొని మాట్లాడారు. తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి పార్టీని విస్తరించిన నాయకుడు మురుగన్ అని, ఆయన ఎంపీ కాకపోయినా దళితుడైన మురుగన్ సేవలను గుర్తించి నేరుగా కేంద్రమంత్రిని చేసిన ఘనత ప్రధాని మోదీదే అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు డిపాజిట్లు రావని, రెండోస్థానం కోసమే పోటీ పడుతున్నారని ఎద్దేవాచేశారు. పొన్నం, వినోద్‌కుమార్ కరీంనగర్‌కు ఏంచేశారో చెప్పాలన్నారు. ఇవి దేశ ప్రధానిని నిర్ణయించే ఎన్నికలని, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, సంక్షేమ పథకాలు అందాలంటే, దేశ రక్షణ కావాలంటే మోదీనే మళ్లీ ప్రధాని కావాలని సంజయ్ తెలిపారు. దేశమంతా కరీంనగర్లో బండి సంజయ్‌ను ఎంత మెజారిటీతో గెలిపిస్తారనే చర్చ జరుగుతోందన్నారు. తనను ఎంపీగా గెలిపించి మోదీని ప్రధానిగా ఎన్నుకునే అవకాశం కల్పించాలని కోరారు.