రిజర్వేషన్లపై అమిత్‌ షా కీలక ప్రకటన | Amit Sha Key Announcement On Reservations, Says BJP Will Not Allow Reservations To End, Slams Doubters - Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లపై అమిత్‌ షా కీలక ప్రకటన

Published Sun, Apr 14 2024 9:24 PM | Last Updated on Mon, Apr 15 2024 12:42 PM

Amit Sha Key Announcement On Reservations - Sakshi

రాయ్‌పూర్‌: రిజర్వేషన్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. తాము మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఏం చేయబోతున్నామనేదానిపై క్లారిటీ ఇచ్చారు. రిజర్వేన్లను భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎప్పటికీ రద్దు చేయదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ను కూడా ఆ పనిచేయనీయబోమని చెప్పారు. ఆదివారం(ఏప్రిల్‌14) ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్‌ షా మాట్లాడారు.‘బీజేపీ రాజకీయాలు చేసినంత కాలం రిజర్వేషన్లకు ఏమీ కానివ్వదు.

గత కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కామ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆ కోపంతో కమలం గుర్తుపై ఓటు వేయండి’ అని ఛత్తీస్‌గఢ్‌ ప్రజలకు అమిత్‌ షా పిలుపునిచ్చారు.  

ఇదీ చదవండి.. శివసేన,ఎన్సీపీల చీలికకు కారణమదే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement