
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు అదనంగా 10శాతం రిజర్వేషన్ కల్పించాలని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇప్పటికే బలహీనవర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఈడబ్ల్యూఎస్‌తో కలిపి రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం 60కి చేరనుంది.దీనిపై కేసీఆర్ రెండు రోజుల్లో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశం తర్వాత అధికారులకు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు.