![Ktr Reacted On Cm Kcr Health - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/6/Ktr-Reacted-On-Cm-Kcr-Healt.jpg.webp?itok=aHgBBEvq)
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యం బారినపడిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు క్రమంగా కోలుకుంటున్నారని మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం వైరల్ జ్వరం బారినపడిన కేసీఆర్‌కు తర్వాత బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ సోకిందని తెలిపారు.
ఛాతీలో ఈ సెకండరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని వివరించారు. దీంతో కేసీఆర్ పూర్తిగా కోలుకునేందుకు అనుకున్న సమయం కంటే ఎక్కువకా లం పట్టే అవకాశం ఉందని తెలిపారు. వైరల్ జ్వరం బారిన పడిన సీఎం కేసీఆర్ దాదాపు మూడు వారాలుగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను కేటీఆర్ వెల్లడించారు.
చదవండి: ప్లీజ్ ఆదుకోండి.. హరిరామజోగయ్య పేరిట వీహెచ్‌కు ఫోన్ చేసి..
Comments
Please login to add a commentAdd a comment