సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం వరదలతో అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉప్పల్ పర్యటనలో ఆయన బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరణించిన కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ.. మున్సిపల్ మంత్రికి పిండప్రదానం చేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్‌కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదన్నారు. వరదలపై సమీక్షలు చేయకుండా రాజకీయాలపై దృష్టిపెట్టారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేటీఆర్ బర్త్‌డే పార్టీల్లో మునిగిపోయారు అంటూ రేవంత్ మండిపడ్డారు.
‘‘వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వరదలతో 30 మంది చనిపోయినా కేసీఆర్ ఎందుకు పరామర్శించడం లేదు. వరద బాధితుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదా? హైకోర్టు అక్షింతలు వేసినా కేసీఆర్‌కు బుద్ధి రాలేదు’’ అని ధ్వజమెత్తారు.
చదవండి: బండి బలమేంటో కమలానికి తెలిసొచ్చిందా?
‘‘సోమవారంలోగా ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో కదలిక రావాలి. లేకపోతే సోమవారం పార్లమెంట్‌లో నితిన్ గడ్కరీకి నివేదిస్తాం. వరద సాయం కింద తెలంగాణకు కేంద్రం రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలి. వరద సాయం తీసుకురావాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డిపై ఉంది. వెంటనే ప్రధానిని కిషన్‌రెడ్డి కలిసి నిధులు తీసుకురావాలి. బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు పరాకాష్ట’’ అంటూ రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment