సాక్షి,తెలంగాణ భవన్ : ఫార్ములా ఈ-కారు రేసు (Formula E race case)కేసులో విచారణకు రావాలంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ తరుణంలో ఫార్ములా ఈ-కారు కేసు లొట్టపీసు కేసంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా కారు కేసుపై బుధవారం కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుడూ.. ఫార్ములా ఈకేసులో హైకోర్టు (high court) లో ఏం తీర్పు వస్తుందో చూద్దాం. అవినీతే లేనప్పుడు.. కేసు ఎక్కడది. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు. జనవరి 7న ఈడీ విచారణకు హాజరుపై మా లాయర్లు నిర్ణయిస్తారు. ఏసీబీ కేసులో అస్సలు పస లేదు. నాకు న్యాయస్థానాల మీద నమ్మకం. ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు.
పాపం.. నన్ను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోంది. నాపై ఇది ఆరో ప్రయత్నం.. రేవంత్‌కు ఏమి దొరకడం లేదు. 600కోట్లు సంగతి అటుంచితే.. ఒక్క పైసా కూడా అవినీతి లేదు. హైకోర్టు న్యాయమూర్తి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదు.
రేసు కావాలనేది నా నిర్ణయం.. వద్దనేది రేవంత్ నిర్ణయం. ఇద్దరి నిర్ణయాలపై క్యాబినెట్‌లో చర్చ జరగలేదు. నాపై కేసు పెడితే.. రేవంత్‌పై కూడా కేసు పెట్టాలి. రేవంత్ రెడ్డి.. ఒక ముఖ్యమంత్రినా? అని ప్రశ్నించారు.
భవిష్యత్ కార్యచరణ ఇదే
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. ఏడాది మెదటి ఆరునెలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం. తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీలు పూర్తి చేస్తాం. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు వచ్చే అక్టోబర్ వరకు సమయముంది. పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తాం.
బ్యాంకులను ముంచేటోళ్ళకే సెల్ఫ్ డిక్లరేషన్ లేదు..
రైతుబ రోసాతో రేవంత్ సర్కార్‌పై ప్రజల్లో తిరుగుబాటు రాబోతుంది. రైతుబరోసా కొందరకికే ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు?. బ్యాంకులను ముంచేటోళ్ళకే సెల్ఫ్ డిక్లరేషన్ లేదు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజిస్ట్రేషన్లు ఇవ్వాలని రేవంత్‌కు లేదు. 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వమే కోర్టులో కేసులు వేయిస్తోంది.
ఆర్‌ఆర్‌ఆర్‌లో రూ.12 వేల కోట్ల కుంభకోణం
ఉద్యోగస్తులు, పాన్ కార్డ్ ఉన్నవాళ్ళకు రైతుబరోసా ఎగ్గొట్టే ప్రయత్నం. ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై సుప్రీకోర్టు కు వెళ్తున్నాం .. ఈ సంవత్సరం ఉప ఎన్నికల రావొచ్చు. ఆర్‌ఆర్‌ఆర్‌లో రూ.12 వేల కోట్ల కుంభకోణం జరుగబోతుంది. ఖాజా గూడలో ఉన్న పేదోళ్లను రోడ్డుపైకి నెట్టారు. రూ. లక్ష 38 వేల కోట్ల అప్పులో వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి పోతున్నవి. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment