Formula E Race
-
రేసర్ అవని
ఈ తరం భారతీయ సమాజానికి అమ్మాయి చేతిలో స్టీరింగ్ విచిత్రం ఏమీ కాదు. స్టీరింగ్ మగవాళ్లదనే అభిప్రాయాన్ని యాభైఏళ్ల కిందటే తుడిచేశారు మహిళలు. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లోనూ స్టీరింగ్ తిప్పుతున్నారు. కానీ ఈ సంఖ్య చాలా తక్కువ. దేశం మొత్తంమీద చూసినా వేళ్లమీద లెక్కపెట్టేటంత మంది మాత్రమే ఉన్నారు. వీరిలో అత్యంత చిన్నవయసు అమ్మాయి అవని వీరమనేని. మన తెలుగు రాష్ట్రాల్లో తొలి అమ్మాయి కూడా. హైదరాబాద్‌కు చెందిన పదిహేడేళ్ల అవని ఫార్ములా ఈ రేసింగ్‌లో దూసుకుపోతోంది. → మగవాళ్లతో పోటీస్టీరింగ్ మీద ఇష్టమే అవనిని ఫార్ములా ఈ రేసింగ్ వైపుకు మళ్లించింది. అన్నయ్య కారు నడుపుతుంటే తనకూ నేర్పించమని మొండిపట్టు పట్టింది. రెండురోజుల్లో స్టీరింగ్ మీద రోడ్ మీద కంట్రోల్ వచ్చేసింది. కానీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వయసు మాత్రం రాలేదు. కారిచ్చి రోడ్డు మీదకు పంపించరు. స్టీరింగ్ మీద ప్యాషన్ తీరేదెలా? రేసింగ్ గురించి ఇండియాలో ఉన్న అవకాశాల కోసం గూగుల్‌లో సెర్చ్ చేసింది. ఫార్ములా ఈ రేసింగ్ గురించి తెలియగానే అమ్మానాన్నలను అడిగింది. నిండా పదిహేనేళ్లు లేవు. ఇందులో స్త్రీపురుషులకు పోటీలు విడిగా లేవు. డ్రైవింగ్‌లో పది–ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న నలభైఏళ్ల మగవాళ్లు కూడా అదే ట్రాక్ మీద పోటీలో ఉంటారు. కారువేగం గంటకు 160 నుంచి 170 కిలోమీటర్లు ఉంటుంది. అంత పెద్ద వాళ్ల మధ్య కుందేలు పిల్లలాగ ఉంటుందేమో అనుకున్నారు. కానీ అంతటి క్లిష్టమైన టాస్క్‌ని తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నప్పుడు వెనక్కు లాగడం ఎందుకు అనుకున్నారు. అవని కోరుకున్నట్లే ఫార్ములా ఈ రేసింగ్ లో శిక్షణ ఇప్పించారు. అవని ఇప్పుడు అహురా రేసింగ్ గ్రూప్‌తో పోటీల్లో పాల్గొంటోంది. తొలిసారి రేసింగ్ ట్రాక్ మీదకు వెళ్లిన నాటికి ఆమె తొమ్మిదో తరగతి చదువుతోంది. గడచిన మూడేళ్లుగా కోయంబత్తూర్‌లో, చెన్నైలో జరిగిన జేకే టైర్స్, ఎమ్ఆర్ఎఫ్ కంపెనీలు నిర్వహించిన పోటీల్లో పాల్గొంటున్నది. టాప్ టెన్ ర్యాంకింగ్‌లో కొనసాగుతోంది. → ఈ తరం టీన్స్అవనితోపాటు ఫార్ములా ఈ రేసింగ్‌లో స్టీరింగ్ పట్టుకున్న అమ్మాయిల గురించి చెబుతూ ‘‘దేశం మొత్తం మీద చూసినా పెద్ద నంబర్ ఏమీ లేదు. తెలుగువాళ్లెవరూ కనిపించలేదు. తమిళనాడు, మహారాష్ట్రల నుంచి చూశాను. 2023లో నాతోపాటు ఇద్దరమ్మాయిలు ఉన్నారు. 2024లో కూడా మరో ఇద్దరిని చూశానంతే. వాళ్లు కూడా నాకంటే కొద్దిగా పెద్దవాళ్లే తప్ప ఇరవై దాటిన వాళ్లెవరూ లేరు. ఓన్లీ మెన్ ఉన్న ఈ స్పోర్ట్‌లో ఉమెన్ ఎంట్రీ ఈ జనరేషన్ టీన్స్తో మొదలైందని చెప్పవచ్చు’’ అంటోంది అవని. ఈ పోటీల్లో పాల్గొనడానికి మంచి శక్తినిచ్చే ప్రత్యేకమైన ఆహారం గురించి మాట్లాడుతూ ‘‘అమ్మ డాక్టర్. నేను ఏమి తినాలో, ఎంత తినాలో అమ్మ చూసుకుంటుంది. నాకు తెలిసిందల్లా అమ్మ పెట్టింది తినడమే. నాతోపాటు ట్రైనింగ్‌కి, పోటీలకు తోడుగా అమ్మ లేదా నాన్న వస్తారు. నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్. తనకు కూడా సెలవులు కష్టమే. ఇద్దరికీ వీలుకానప్పుడు అమ్మమ్మ వస్తుంది. నన్ను భద్రంగా చూసుకోవడానికి ఎవరో ఒకరు వస్తారు. కాబట్టి ఇక నా ఫోకస్ అంతా ట్రాక్ మీదనే’’ అని సంతోషంగా నవ్వేసింది అవని. టెన్త్ క్లాస్ పరీక్ష పెట్టింది! లెవెన్త్ క్లాస్ చదువుతున్నాను. నైన్త్‌క్లాస్‌లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ మొదలు పెట్టినప్పుడు చదువుకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. టెన్త్‌లో ట్రైనింగ్ సెషన్స్, బోర్డు ఎగ్జామ్స్ ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. పగలంతా ట్రైనింగ్, రాత్రి హోటల్ రూమ్‌కి వచ్చి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ కావడం... నిజంగా క్లిష్టసమయం అనే చెప్పాలి. అలాగే బోర్డ్ ఎగ్జామ్ రాశాను. ఫార్ములా ఈ రేసింగ్ చాలా ఖర్చుతో కూడిన ఆట. నా ఇష్టాన్ని మా పేరెంట్స్ ఒప్పుకోవడం నా అదృష్టం. – అవని వీరమనేని, ఫార్ములా ఈ రేసర్– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Formula E Car Race: ఎస్ఈవో కంపెనీకి ఏసీబీ నోటీసులు
-
ఫార్ములా కారు రేసు కేసులో ఏసీబీ దూకుడు.. నోటీసులు జారీ
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-కారు రేసు కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా ఎఫ్ఈవో కంపెనీకి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కారులో రేసులో భాగంగా రూ.55కోట్లను ఎఫ్ఈవోకు బదిలీ చేసిన హెచ్ఎండీఏ. ఈ క్రమంలో ఎఫ్ఈవో సంస్థ సీఈవో స్టేట్మెంట్ను ఏసీబీ రికార్డ్ చేయనుంది. ఈ నేపథ్యంలో విచారణ కోసం ఏసీబీని నాలుగు వారాల సమయం కోరారు ఎఫ్ఈవో సంస్థ సీఈవో. దీంతో, ఏసీబీ ఎలాంటి నిర్ణయం చెబుతుందో తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో నిందితులను మరోమారు విచారణకు పిలవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఏ–1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు ఏ–2.. ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, ఏ–3.. హెచ్ఎండీఏ మాజీ సీఈ బీఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇక, ఇప్పటికే ఈనెల 9న కేటీఆర్‌ను ఏడు గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం.. కార్ రేసు నిర్వహణలో స్పాన్సర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్‌జెన్, దాని అనుబంధ సంస్థ గ్రీన్కో ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌ను విచారించిన అధికారులు కీలక వివరాలు రాబట్టినట్టు తెలిసింది. రేస్ నిర్వహణ, అందుకు సంబంధించి జరిగిన ఆర్థిక లావాదేవీలు, రేస్ నుంచి సంస్థ తప్పుకోవడం.. అందుకు దారి తీసిన పరిస్థితులు ఇలా పలు కోణాల్లో ఆయన్ను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈసారి మరింత లోతుగా..చలమలశెట్టి ఇచ్చిన కీలక సమాచారం, గతంలో సేకరించిన పత్రాల ఆధారంగా మరోమారు కేటీఆర్‌ను లోతుగా ప్రశ్నించాలని ఏసీబీ భావిస్తున్నట్టు సమాచారం. అప్పటి మంత్రి ఆదేశాల మేరకు తాము కేవలం విధులు నిర్వర్తించామని అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలు తమ స్టేట్మెంట్లలో పేర్కొన్నారు. ఇక కేటీఆర్.. మంత్రిగా తానే ఆదేశాలు జారీ చేశానని, రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యానే తాను ఆదేశించానని, నిధుల చెల్లింపులలో నిబంధనలు పాటించడం అన్నది అధికారులకు సంబంధించిన అంశమని పలుమార్లు స్పష్టం చేశారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, మరోమారు కేటీఆర్, అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను విచారించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఈసారి కేటీఆర్ విచారణ సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. -
కేటీఆర్‌పై ఈడీ ప్రశ్నల వర్షం..
ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణదాదాపు 7 గంటల పాటు కేటీఆర్‌ను ప్రశ్నించిన ఈడీఫార్ములా- ఈ కేసులో కేటీఆర్‌ను ప్రశ్నించిన ఈడీ ఫార్ములా ఈ–కార్ రేసు కేసులో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుటకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్. కొనసాగుతున్న విచారణ.. ఈడీ ఆఫీసులో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. కేటీఆర్‌పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు రెండు గంటల పాటుగా విచారణ కొనసాగుతోందిమరోవైపు.. విచారణ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన నెలకొంది. ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..కేటీఆర్ విచారణ సందర్బంగా ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసు వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు.జై తెలంగాణ నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసులు వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసు వాహనాలల్లో వారిని తరలించారు. కేటీఆర్ విచారణ ప్రారంభం..ఈడీ ఆఫీసులో కేటీఆర్ విచారణ ప్రారంభమైంది. ఈడీ ఆఫీసులో విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ విచారణ కోసం ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఈడీ ఆపీసు వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. మరోవైపు, ఈడీ ఆఫీసు వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈడీ ఆఫీసుకు బయలుదేరిన కేటీఆర్గచ్చిబౌలి నివాసం నుంచి బయల్దేరిన కేటీఆర్మరికాసేపట్లో ఈడీ కార్యాలయానికి చేరుకునే అవకాశం!ఏసీబీ విచారణ ముందు.. నందినగర్ నివాసంలో కీలక నేతలతో నేతలు చర్చలు జరిపిన కేటీఆర్ఇవాళ్టి విచారణకు మాత్రం గచ్చిబౌలి నివాసం నుంచే ఈడీ ఆఫీస్‌కు..ఈడీ విచారణ వేళ ఎక్స్‌లో కేటీఆర్ ట్వీట్ఫార్ములా-ఈ ని తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా నేను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందిఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ- మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తడం జరిగిందిఎన్ని రకాల చిల్లర కేసులు, బురదజల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవుమంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాదును పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తానుఫార్ములా-ఈ రేసు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపింది...ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్, నిబద్ధత, హైదరాబాద్ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలిఅందుకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నానురాష్ట్ర ప్రభుత్వం పంపిన 46 కోట్ల రూపాయల డబ్బులు ఫార్ములా-ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగింది.కేవలం బ్యాంక్ లావాదేవీగా స్పష్టమైన రికార్డు ఉందిఒక్క రూపాయి కూడా వృధా కాలేదు, ప్రతినయా పైసాకు లెక్క ఉందిమరి అలాంటి అప్పుడు ఇందులో అవినీతి, మనీలాండరింగ్ ఎక్కడ ఉంది?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన రేసు రద్దు నిర్ణయం వల్లనే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందిఇలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసులు విచారణల పేరుతో ఈ అంశాన్ని లాగుతుందికచ్చితంగా ఈ అంశం లో నిజమే గెలుస్తుంది... ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు, కోర్టులు కూడా త్వరలో తెలుసుకుంటాయిఅప్పటిదాకా న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఒంటరిగానే..ఈడీ విచారణకు కేటీఆర్(KTR) లాయర్లకు అనుమతి నిరాకరణ కేటీఆర్ ఒక్కరే విచారణకు హాజరుఇంతకు ముందు ఏసీబీ విచారణ టైంలో లాయర్ రగడకోర్టు అనుమతితో చివరకు లాయర్‌ను ఏసీబీ విచారణకు వెంట తీసుకెళ్లిన కేటీఆర్గతంలో ఇచ్చినా..కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో.. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఫెమా(FEMA) ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై దర్యాప్తు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, హుడా మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డిల విచారణ పూర్తిగత వారమే కేటీఆర్‌ను విచారించాల్సి ఉండగా.. హైకోర్టు తీర్పు నేపథ్యంతో గడువు కోరిన కేటీఆర్దీంతో ఇవాళ(జనవరి 16న) విచారణకు రమ్మని పిలిచిన ఈడీతప్పని పరిస్థితిఈడీ అధికారుల ముందు ఎలాంటి వాదన వినిపించాలన్నది కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ప్రత్నించడం తప్ప.. తాను ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన వాదిస్తున్నారు. మంత్రిగా ఆదేశాలిచ్చింది తానే అయినా.. నియమ నిబంధనల మేరకు నిధుల బదలాయింపు ఎలా చేయాలన్న బాధ్యత అధికారులదేనని ఈడీ ముందు చెబుతారా? అనే అసక్తి నెలకొంది.మరోసారి ఏసీబీ నోటీసులు..కేటీఆర్ గురువారం ఈడీ ముందు హాజరైన తరువాత.. పరిణామాలను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ముందుగానే కేటీఆర్‌కు ఏసీబీ చెప్పిన నేపథ్యంలో.. విచారణకు రావాలని నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండోసారి విచారణకు వస్తే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. -
నేడు కేటీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
-
ఫార్ములా ఈ రేస్ కేసులో.. అసలు నిందితులు ఎవరు ?
-
మరిన్ని పిచ్చి కేసులతో వేధిస్తారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పసలేని కేసులు నమోదు చేసి, పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేసినా ప్రజా సమస్యలను ఎత్తి చూపడంపైనే దృష్టి కేంద్రీకరించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలను ఆదేశించారు. ‘ఫార్ములా ఈ– రేస్’కేసులో ఏసీబీ విచారణకు హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుక్రవారం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. గురువారం ఏసీబీ విచారణ అనంతరం నందినగర్ నివాసానికి వెళ్లిన కేటీఆర్, శుక్రవారం తన భార్యతో కలసి ఎర్రవల్లి నివాసానికి వెళ్లారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మరో నేత కార్తీక్‌రెడ్డి కూడా కేసీఆర్‌తో జరిగిన ఈ భేటీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏసీబీ విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలు, తాను ఇచ్చిన సమాధానాలు, సమర్పించిన పత్రాలు.. తదితర అంశాలను ఈ సమావేశంలో కేటీఆర్ వివరించారు. ఇదిలా ఉండగా, ‘రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని పిచ్చి కేసులతో పార్టీ నేతలను ప్రభుత్వం వేధిస్తుంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని రేవంత్ పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒక గందరగోళం సృష్టించి స్థానిక సంస్థల గండం నుంచి బయట పడేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా జనంతో ఉంటే వారే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు’అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.ఏడాదిలోనే కాంగ్రెస్ తేలిపోయింది‘అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే కాంగ్రెస్ ప్రభుత్వం తేలిపోయింది. ఉన్న పథకాలు అమలు చేయలేక, కొత్త పథకాలు తెచ్చే తెలివిలేక ప్రభుత్వం చేతులెత్తేసింది’అని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. ఎన్నికల హామీలేవీ అమలు చేసే పరిస్థితి లేదని ప్రజలకు అర్థమైందని, గతంలో మనం చేసిన మంచితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చెడును కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బీఆర్ఎస్పై ఉందని ఆయన అన్నట్లు్ల సమాచారం. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన రీతిలో పనిచేస్తే ఫలితాలు మనకే అనుకూలంగా ఉంటాయి. పండుగ తర్వాత దృష్టి అంతా పార్టీ నిర్మాణం, బలోపేతంపైనే ఉంటుంది’అని కేసీఆర్ పేర్కొన్నారు. -
ఎవరి ఆదేశాలతో ఎఫ్ఈఓకు డబ్బులిచ్చారు?
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ కారు రేసు నిర్వహణ సంస్థ ఎఫ్ఈఓ (ఫార్ములా– ఈ ఆపరేషన్స్ లిమిటెడ్)కు హెచ్ఎండీఏ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది? నిధులు బదిలీ చేయాలని మిమ్మల్ని ఎవరు ఆదేశించారు? రేసు నిర్వహణ నిర్ణయాలను ఎవరెవరిని సంప్రదించి తీసుకునేవారు?’అని హెచ్ఎండీఏ మాజీ సీఈ బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. తాను ఉన్నతాధికారుల ఆదేశాలనే పాటించానని, వారు ఏది చెబితే అదే చేశానని ఆయన సమాధానమిచ్చినట్టు తెలిసింది. ఫార్ములా–ఈ కారు రేసు కేసులో ఏ–3గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి శుక్రవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 9.50 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి ఆయన చేరుకున్నారు.ఏసీబీ అధికారులు ముందుగా సూచించిన మేరకు బ్యాంకు లావాదేవీలకు సంబంధించి పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను తీసుకువచ్చారు. ఏసీబీ సీఐయూ (సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ) డీఎస్పీ మాజిద్ అలీఖాన్ బృందం బీఎల్ఎన్ రెడ్డిని విచారించింది. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో ఏ–1 మాజీ మంత్రి కేటీఆర్, ఏ–2 ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ విచారణ సందర్భంగా సేకరించిన వివరాలు, దర్యాప్తులో సేకరించిన ఆధారాల మేరకు బీఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించినట్టు తెలిసింది.ప్రధానంగా బ్రిటన్‌కు చెందిన ఎఫ్ఈఓ కంపెనీకి హిమాయత్‌నగర్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లోని హెచ్ఎండీఏ అకౌంట్స్ నుంచి నగదు ఎందుకు పంపారన్న అంశంపైనే ప్రశ్నించినట్టు సమాచారం. ఫార్ములా ఈ రేస్ సీజన్ 9 కోసం మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రెండు విడతలుగా రూ.45.71 కోట్లు బదిలీ చేసినట్లు బీఎల్ఎన్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది. నిధుల బదిలీ కోసం ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలకు సంబంధించి తన వద్ద ఉన్న అన్ని పత్రాలను ఏసీబీ అధికారులకు ఆయన అందించినట్టు సమాచారం. అవసరం మేరకు మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని బీఎల్ఎన్ రెడ్డికి ఏసీబీ అధికారులు సూచించినట్లు తెలిసింది. -
సుప్రీంలో న్యాయపోరాటం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకుని తనపై బురదచల్లేందుకు పెట్టిన అక్రమ కేసులపై పోరాడేందుకు రాజ్యాంగం, చట్టపరంగా ఉన్న హక్కు లను ఉపయోగించుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అక్కడ న్యాయపోరాటం కొనసాగుతుందన్నారు.మరోవైపు 9న జరిగే ఏసీబీ విచారణకు తన న్యాయవాదులతో పాటు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బుధవారం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. హైకోర్టు నుంచి ఉపశమనం దొరికితే ఏసీబీతో పాటు ఈ నెల 16న ఈడీ విచారణకు కూడా హాజరవుతానని ప్రకటించారు. మంగళవారం రాత్రి కేటీఆర్ బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసంలో పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. లొట్టపీసు కేసులో శునకానందం ‘చట్టంపై గౌరవంతో ఏసీబీ విచారణకు సోమవారం న్యాయవాదితో కలిసి వెళ్లి 45 నిమిషాలు ఎదురుచూశా. లగచర్ల కేసులో పట్నం నరేందర్‌రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ను కూడా ఇచ్చినట్లుగా మీడియాకు లీకులు ఇచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకుని న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని కోరుకుంటే నా హక్కులకు భంగం వాటిల్లేలా చేశారు. న్యాయవాదుల సమక్షంలోనే ఏసీబీ విచారణ జరగాలని కోరుతూ హైకోర్టుకు వెళ్తున్నా. ఏసీబీ తప్పుడు ఎఫ్ఐఆర్ను రద్దు చేయమంటూ నేను వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేస్తే నాకు ఉరిశిక్ష వేసినట్లుగా కాంగ్రెస్ నాయకులు చంకలు గుద్దుకుంటున్నారు. బ్రోకర్లు, దొంగలకు అవినీతే కన్పిస్తుంది ఫార్ములా–ఈ వ్యవహారంలో అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టకుండా సీఎం పారిపోయాడు. రేవంత్.. మొగోడైతే తన జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ప్రత్యక్ష చర్చ పెట్టాలి. అవినీతిపరులు, రూ.50 లక్షల సంచులతో దొరికిన బ్రోకర్లు, దొంగలకు ప్రతి పనిలో అవినీతి కనిపిస్తుంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నా మీద లొట్టపీసు కేసు పెట్టి చిట్టినాయుడు పైశాచిక, శునకానందం పొందుతున్నాడు. సీఎం నోట వచ్చేది వేదవాక్కులు, సీఎం ఆఫీసు నుంచి వచ్చే లీకులు సూక్తులు కాదు. దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కోరితే కాంగ్రెస్ నేతలు ఆగమవుతున్నారు. కొందరు మంత్రులు న్యాయమూర్తుల తరహాలో శిక్షలు వేస్తున్నారు..’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను అణాపైసా అవినీతికి పాల్పడలేదు ‘ఫార్ములా –ఈ రేస్‌లో అణాపైసా అవినీతి జరగలేదు. నేను అణాపైసా అవినీతికి పాల్పడలేదు. హైకోర్టు విచారణకు మాత్రమే అనుమతించింది, కుంభకోణం అని ఎక్కడా చెప్పలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్, మేఘా ఇంజనీరింగ్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట రూ.4,600 కోట్లు పనులు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మేఘా సంస్థ ఎలక్టొరల్ బాండ్లు ఇవ్వడం క్విడ్ ప్రోకో కిందకు వస్తుందా లేదా మంత్రి పొంగులేటి చెప్పాలి.మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీటి తరలింపు, మూసీ సుందరీకరణ పనులు కూడా మేఘా సంస్థకు ఇస్తున్నట్లు సమాచారం వ చ్చిoది. ఓ కాంట్రాక్టర్ మంత్రి, ఓ బ్రోకర్ ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రక్షణ కవచంగా నిలుస్తోందని విమర్శించారు. కేటీఆర్ నివాసానికి పార్టీ నేతలు కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా అక్కడికి చేరుకుని పార్టీ నేతలతో మాట్లాడారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గుప్తా నేతృత్వంలోని బీఆర్ఎస్ లీగల్ టీమ్‌తో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 35 పేజీల కోర్టు తీర్పును లీగల్‌టీమ్ అధ్యయనం చేయడంతో పాటు హైకోర్టులో కేటీఆర్ తరఫున వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ దవేతో ఫోన్లో చర్చించారు. ఏసీబీ, ఈడీ తాజా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని న్యాయవాదులు సూచించినట్లు సమాచారం. ఇంతకంటే బలంగా తిరిగి వస్తా: కేటీఆర్ ‘నా మాటలు గుర్తు పెట్టుకోండి.. ఈ ఎదురుదెబ్బ నుంచి ఇంతకంటే బలంగా తిరిగి వస్తా. మీ అబద్ధాలు నన్ను పడగొట్టలేవు. మీ విమర్శలు నా స్థాయిని తగ్గించలేవు. నా లక్ష్యాన్ని మీ చర్యలు అడ్డుకోలేవు. మీ అరుపులు, పెడ»ొబ్బలు నా గొంతు నొక్కలేవు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి బాటలు వేస్తాయి. నిజం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది. ప్రపంచమంతా త్వరలో దీనిని చూసి తీరుతుంది. మన న్యాయ వ్యవస్థపై నాకు అచంచల విశ్వాసం ఉంది. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది..’అని కేటీఆర్ ‘ఎక్స్’వేదికగా పేర్కొన్నారు. -
ఏస్ నెక్ట్స్ జెన్, గ్రీన్కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
(మచిలీపట్నం): ఫార్ములా –ఈ రేసు కేసులో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. ఇప్పటివరకు రేసు నిర్వహణ, నిధుల మళ్లింపులో నిబంధనల అతిక్రమణ, హెచ్ఎండీఏ అధికారిక ఖాతాల నుంచి విదేశీ కంపెనీలకు నిధుల మళ్లించడంపై ఫోకస్ పెట్టిన అధికారులు, తాజాగా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. తాజాగా తెరపైకి వచ్చిన క్విడ్ ప్రోకో కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫార్ములా–ఈ కారు రేసు నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలకు కొద్ది నెలల ముందే బీఆర్ఎస్కు గ్రీన్కో అనుబంధ సంస్థల నుంచి ఎలక్టొరల్ బాండ్ల రూపంలో కోట్ల రూపాయలు వచ్చాయనే సమాచారంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ఫార్ములా ఈ రేసుకు మొదట్లో స్పాన్సర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు దాని అనుబంధ సంస్థ గ్రీన్కో కార్యాలయాల్లో మంగళవారం ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో సైబర్ టవర్స్‌లో, మచిలీపట్నంలోని గ్రీన్కో కార్యాలయాల్లో మంగళవారం రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. సహకరించని సిబ్బంది! ఏసీబీ అధికారుల తనిఖీలకు ఆయా సంస్థల సిబ్బంది ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. మాదాపూర్ సైబర్ టవర్స్‌లోని గ్రీన్కో కార్యాలయంలో సోదాలకు ఆ సంస్థ సిబ్బంది మొదట అనుమతించలేదు. అధికారులు సెర్చ్ వారెంట్ వారెంట్ చూపడంతో వెనక్కి తగ్గారు. ఇక అదే ప్రాంతంలోని ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో అధికారులు సోదాలు జరిపారు. పలు కీలక పత్రాలు, పైళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మరోవైపు ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న గ్రీన్ కో అనుబంధ సంస్థలైన ఏస్ అర్బన్ రేస్, ఏస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయాల్లోనూ మంగళవారం రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. పలు ఫైళ్లతో పాటు హార్డ్ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మచిలీపట్నంలో కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న గ్రీన్ కో కంపెనీకి చెందిన గెస్ట్‌హౌస్‌లో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కేటీఆర్‌కు తాజాగా ఈడీ సమన్లు ఫార్ములా–ఈ కారు రేస్ కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్‌కు ఈడీ అధికారులు మరోమారు సమన్లు జారీ చేశారు. వాస్తవానికి కేటీఆర్ మంగళవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సి ఉన్నా..తనకు మరికొంత సమయం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 16న విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్‌కు మంగళవారం మరోమారు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. కాగా ఈడీ అధికారులు ఇప్పటికే ఇచ్చిన సమన్ల ప్రకారం..ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ మాజీ సీఈ బీఎల్ఎన్ రెడ్డి బుధవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. -
కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
-
‘రాజమౌళి కంటే అద్భుతంగా కథలు’.. కేటీఆర్ ఏసీబీ విచారణలో హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విచారణ సందర్భంగా హైడ్రామా నడిచింది. విచారణకు తనతో పాటు తన లాయర్‌ను ఆఫీస్‌లోకి అనుమతించకపోవడంపై కేటీఆర్ నిరసన వ్యక్తం చేశారు. అధికారుల స్పందన కోసం 40 నిమిషాల పాటు ఏసీబీ ఆఫీస్ బయట ఎదురు చూసి చివరకు అనుమతి లభించకపోవడంతో వెనుదిరిగారు. వెళ్లే క్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పోలీసులను నేను నమ్మ. లాయర్లు ఉంటేనే నాకు రక్షణ. అందుకే లాయర్‌తో వచ్చా. నా లాయర్‌తో విచారణకు హాజరవుతానంటే వీళ్లకు ఇబ్బంది ఏంటి?. అడ్వొకేట్ల సమక్షంలో విచారిస్తామంటే చెప్పమనండి.. లోపలికి వెళ్తా. పోలీసులు రాజమౌళి(దర్శకుడు) కంటే అద్భుతంగా కథలు అల్లుతున్నారు. నా స్టేట్మెంట్ను ఏఎస్పీకి రాతపూర్వకంగా ఇచ్చాను’’ అంటూ అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్లిపోయారాయన. ఏసీబీ విచారణలో హైడ్రామా నడవడంతో లిఖితపూర్వక స్టేట్మెంట్ ఇచ్చి సరిపెట్టిన ఆయన.. రేపటి ఈడీ విచారణకు హాజరవుతారా? అనే ఉత్కంఠ నెలకొంది.ఇందులో తప్పేంటి?: కేటీఆర్అంతకు ముందు నందినగర్ నివాసం నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ ఆఫీస్‌కు తన లీగల్ టీంతో చేరుకున్నారాయన. ఆ టైంలో ఆయన లాయర్‌ను పోలీసులు లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ఆపై మీడియాతో మాట్లాడారు.ఫార్ములా ఈ రేసుపై మంత్రిగా నిర్ణయం తీసుకున్నా. ఏసీబీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. ప్రభుత్వం కావాలనే కక్షపూర్వకంగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో నన్ను అసలు విచారణకు పిలవాల్సిన అవసరం లేదు. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో జరిగిందే.. నా విషయంలోనూ జరిగే అవకాశం ఉంది. నరేందర్ రెడ్డి విషయంలో తప్పుడు స్టేట్మెంట్ సృష్టించారు. అలాగే నన్ను విచారణకు పిలిచి.. నా ఇంటిపై ఏసీబీతో దాడులు చేయించాలని చూస్తున్నారు. వాళ్లే నా ఇంట్లో ఏదో ఒకటి పెట్టి ఇరికించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒకరకంగా నాపై తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నారు. నా లాయర్ నాతో పాటే విచారణకు వస్తే తప్పేంటి?. నా లాయర్‌ను అనుమతిస్తారంటే విచారణకు హాజరవుతా’’ అని బయటే అరగంటపైగా ఎదురు చూశారు. అయితే ఏసీబీ అంగీకరించకపోవడంతో ఆయన వెనుదిరిగారు.ఏసీబీది తప్పే: కేటీఆర్ లాయర్కేటీఆర్ వెంట తనను లోపలికి అనుమతించకపోవడంపై ఆయన లాయర్ సోమ భరత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏసీబీ వైఖరిని తప్పుబట్టారాయన. లాయర్‌ను వెంట తీసుకెళ్లడం రాజ్యాంగబద్ధ హక్కు. చట్టాలన్నీ రాజ్యాంగానికి లోబడి ఉంటాయి. అని అన్నారాయన. నోటీసుల్లో.. కేటీఆర్‌కు ఏసీబీ పంపిన నోటీసుల కాపీ సాక్షి(Sakshi) సంపాదించింది. అందులో ఏసీబీ అధికారులు కీలక అంశాలను పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు సూచించారు. సెక్షన్ 13 (1),13(2) పీసీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ 409,120B సెక్షన్స్ కింద ఆయనకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు.. ఎఫ్ఐఆర్ కాపీలో ఏ1గా కేటీఆర్ పేరు ఉంది.బీఆర్ఎస్ నేతల సంఘీభావంఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు హాజరవ్వడానికి ముందు.. కేటీఆర్‌ను పలువురు బీఆర్ఎస్ నేతలు కలిసి సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి. ఇతర బీఆర్ఎస్ నేతలు నందినగర్‌లోని నివాసానికి వెళ్లి మాట్లాడారు. మరోవైపు.. ముందస్తు జాగ్రత్త పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.మరోవైపు కేటీఆర్‌ను విచారించాలని.. డీజీ విజయ్‌కుమార్, డైరెక్టర్ తరుణ్ ఉదయాన్నే ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్!
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ రేసుకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కె. తారక రామారావును విచారించేందుకు సిద్ధమయ్యారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు తమ ముందు విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు ఈ నెల 3న ఏసీబీ అధికారులు సమన్లు జారీ చేయడం తెలిసిందే. ఈ మేరకు కేటీఆర్ ఏసీబీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లో ఫార్ములా–ఈ రేసు నిర్వహించిన యూకే సంస్థ ఫార్ములా–ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్ఈఓ)కు నిబంధనలకు విరుద్ధంగా, కేబినెట్ ఆమోదం లేకుండానే కేటీఆర్ ఆదేశాలతో అధికారులు పలు దఫాల్లో రూ. 54.88 కోట్లు చెల్లించారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ ఫిర్యాదుతో ఏసీబీ గతేడాది డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ–1గా, ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ను ఏ–2గా, హెచ్ఎండీఏ మాజీ సీఈ బీఎల్ఎన్ రెడ్డిని ఏ–3గా చేర్చింది. ఇప్పటికే సేకరించిన పత్రాల ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నించనుంది. మరోవైపు ఏసీబీ కేసు ఆధారంగా ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ.. ఈ నెల 7న విచారణకు రావాలంటూ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈడీ కేసులో ఏ–1గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్‌కుమార్ విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని కోరగా అంగీకరించిన ఈడీ వారిద్దరికీ మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న బీఎల్ఎన్ రెడ్డిని, 9న అరి్వంద్కుమార్ను హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సిన కేటీఆర్ సైతం వారి బాటలోనే మరికొంత సమయం అడుగుతారా లేదా అనేది వేచిచూడాల్సి ఉంది. -
ఓ చెత్త కేసు కేటీఆర్‌పై పెట్టారు.. ఈడీపై జగదీష్ రెడ్డి ఫైర్
సాక్షి, సూర్యాపేట: దేశంలో ప్రధాని మోదీ సహకారంతోనే కేసు నమోదు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేటీఆర్‌పై పెట్టింది ఒక చెత్త కేసు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలను తెలంగాణ రైతులు నిలదీయాలి అంటూ సూచించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ..‘కేటీఆర్‌పై పెట్టిన కేసు దేశంలోనే చెత్త కేసు. బడే భాయ్.. చోటే భాయ్ కలిసి కేసులు పెట్టారు. మోదీ సహకారంతోనే కేసులు పెడుతున్నారు. బ్లాక్ మనీ వైట్ చేస్తే.. ఈడీ రావాలి. అంతేకానీ.. తీసుకున్నది ఎవడో తెలియదు కానీ.. ఇచ్చినోడి మీద కేసులా?. ఇది తాత్కాలిక ఆనందం.. శునాకనందం తప్ప ఏమీలేదు.రైతు భరోసా ఎగొట్టడానికే కేసుల వ్యవహారం చర్చ తీసుకువచ్చారు. పక్కదారి పట్టించడానికే ఇవన్నీ చేస్తున్నారు. రైతులు కాంగ్రెస్ నేతలను నిలదీయండి. ఈ ప్రభుత్వం అన్ని రంగాల ప్రజలను మోసం చేసింది. ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం రాష్ట్రానికి అప్పులు చేసి ఇచ్చారు. వరంగల్ డిక్లరేషన్‌లో మాట్లాడినట్టు రైతు భరోసా అమలు చేయాలి అని డిమాండ్ చేశారు.చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. దేశంలోనే చెత్త సీఎం రేవంత్ రెడ్డి. గ్రామాల్లో పర్యటిస్తే రేవంత్‌కు అసలు విషయం తెలుస్తోంది. ఆయనపై దాడి చేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. రైతులు, తెలంగాణ ప్రజలను మోసం చేసే పనిలో కాంగ్రెస్ ఉంది. కేటీఆర్, హరీష్ రావుపై కేసులు పెట్టాలన్న ఆలోచన తప్ప మరేమీ లేదు. కాంగ్రెస్ నేతలు చివరకు సెక్రటేరియట్ కూడా అమ్ముకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలి’ అంటూ సవాల్ విసిరారు. -
6న విచారణకు రండి
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ల రేస్‌లో కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) కంటే ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు శుక్రవారం సమన్లు జారీ చేశారు. అలాగే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను 11న, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని 12వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈడీ కన్నా ముందే.. ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధుల మళ్లించారంటూ ఏసీబీ కేసు నమోదు చేయడం, దాని ఆధారంగా ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేయడం తెలిసిందే. ఈ అంశంలో వేగంగా స్పందించిన ఈడీ ఈ నెల 7న విచారణకు రావాలంటూ ఇప్పటికే కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయగా.. అంతకంటే ఒకరోజు ముందే కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీ చర్యలు చేపట్టడం ఆసక్తికరంగా మారింది. అరెస్టు చేయకుండా హైకోర్టు ఊరటతో.. ఫార్ములా–ఈ రేసు నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ ఏసీబీ అధికారులు పీసీ యాక్ట్ 13(1) (ఏ), 13(2), ఐపీసీ 409, 120–బీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశా రు. ఇవన్నీ నాన్‌బెయిలబుల్ సెక్షన్లు. అయితే కేటీఆర్ తనపై నమోదైన కేసు కక్షపూరితమని, ఆ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని (క్వాష్ చేయాలని) హైకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ పూర్తిచేసిన హైకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది. అయితే తుది తీర్పు వెలువడే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని, కేసు దర్యాప్తు చేసుకోవచ్చని ఏసీబీని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు సమన్లు జారీ చేశారు. అంతేకాదు ఈ కేసులో నిందితులుగా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్‌కుమార్‌లను కూడా ఈడీ కంటే ముందే ఏసీబీ విచారించనుండటం ఆసక్తికరంగా మారింది. పలు వివరాలు సేకరించిన ఏసీబీ అధికారులు.. ఫార్ములా–ఈ రేసుకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు రూ.54.88 కోట్లు బదిలీ చేశారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. దీనిపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఫిర్యాదుతో ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషŒన్ యూనిట్ (సీఐయూ) డీఎస్పీ మాజిద్ అలీఖాన్న్డిసెంబర్ 19న కేసు నమోదు చేశారు. ఇప్పటికే దానకిశోర్ స్టేట్మెంట్ నమోదు చేయడంతోపాటు పలు కీలక వివరాలను ఏసీబీ అధికారులు సేకరించారు. వాటి ఆధారంగా ఆయా అంశాలపై కేటీఆర్‌ను, అధికారులను విచారించేందుకు సిద్ధమయ్యారు. న్యాయవాదులతో సమావేశమైన కేటీఆర్ ఏసీబీ సమన్ల నేపథ్యంలో కేటీఆర్ శుక్రవారం తన న్యాయవాదులతో సమావేశమైనట్టు తెలిసింది. వారి సూచనలు, సలహాల మేరకు ఏసీబీ సమన్లపై ఏ విధంగా స్పందించాలనే నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. శని లేదా ఆది వారం ఈ అంశంపై కేటీఆర్ స్పందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవైపు తాము ఫార్మర్స్ (రైతుల) కోసం పోరాడుతుంటే.. ప్రభుత్వం ఫార్ములా–ఈ అంటూ వేధింపులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సీఆర్టీల సమ్మె విరమణ సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్(సీఆర్టీ)లు సమ్మె విరమించారు. ఇరవై రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శికి లిఖితపూర్వకంగా తెలిపారు. శుక్రవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.. సమ్మె చేస్తున్న సీఆర్టీలతో చర్చలు జరిపారు. సీఆర్టీల డిమాండ్లలో ఉద్యోగాల క్రమబద్దికరణ, మినిమం టైం స్కేల్ కేటగిరీలు మినహా మిగిలిన వాటిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి వివరించారు. ప్రతినెలా ఐదో తేదీలోపు వేతన చెల్లింపులు, మహిళా టీచర్లకు 180 రోజుల ప్రసూతి సెలవులు, డెత్ బెనిఫిట్స్ మంజూరు చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఉద్యోగ క్రమబద్దికరణ, మినిమం టైం స్కేల్ డిమాండ్లపై ముఖ్యమంత్రితో చర్చించి మరోసారి సీఆర్టీలతో సమావేశమవుతామని ఆమె హామీ ఇచ్చారు. ఆదివాసీ, గిరిజన విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వానికి సహకరించాలని సీఆర్టీలను కోరారు. సీఆర్టీల సర్వీసును రెన్యువల్ చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఆర్టీలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. -
ఫార్ములా-ఈ రేసు కేసులో మరో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్ : రాజకీయంగా చర్చనీయాంశమైన ఫార్ములా-ఈ రేసు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ-కార్ రేసులో అధికారులకు ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ మాజీ సీఈ బి.లక్ష్మీనరసింహారెడ్డి (బీఎల్ఎన్ రెడ్డి)లకు ఏసీబీ అధికారుల నోటీసులు జారీ చేశారు. ఈ నెల 11,12 తేదీల్లో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే కేసులోఇదే కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీన ఈడీ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ మాజీ సీఈ బి.లక్ష్మీనరసింహారెడ్డి (బీఎల్ఎన్ రెడ్డి)లకు కూడా సమన్లు జారీ చేసింది.వీరిలో బీఎల్ఎన్ రెడ్డిని ఈ నెల 2న, అర్వింద్‌కుమార్‌ను 3వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.ఆయా తేదీల్లో ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ ఆ సమన్లలో పేర్కొన్నారు.👉చదవండి : కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులుఏసీబీ కంటే దూకుడుగా.. హైదరాబాద్ నగరంలో ఫార్ములా–ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్ఎండీఏ నుంచి విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. దీనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా, అప్పటి హెచ్ఎండీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ఏ2గా, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిని ఏ3గా చేర్చింది.ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసింది. అయితే ఏసీబీ దర్యాప్తు కన్నా ఈడీ మరింత దూకుడుగా ముందుకు వెళుతోంది. నిందితులను విచారించేందుకు సమన్లు జారీ చేసింది. ఈడీ దర్యాప్తులో గుర్తించే అంశాల ఆధారంగా.. కేసులో ముందుకు వెళ్లనుంది. ఇదే సమయంలో ‘ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)’ కింద కూడా ఈడీ దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిసింది.నిధుల మళ్లింపుపైనే ఈడీ ఫోకస్.. ఫార్ములా–ఈ కార్ రేస్ సీజన్–10 నిర్వహణకు సంబంధించి రాష్ట్ర మున్సిపల్ విభాగం (ఎంఏయూడీ), ఫార్ములా–ఈ రేసు నిర్వహణ సంస్థ ఎఫ్ఈవో (ఫార్ములా–ఈ ఆపరేషన్స్) సంయుక్తంగా సిద్ధమయ్యాయి. రేసు నిర్వహణకు సంబంధించి స్పాన్సర్ ఫీజు, పన్నులు కలిపి మొత్తం రూ.110 కోట్లు (90,00,000 బ్రిటన్ పౌండ్లు)ను ఎఫ్ఈవోకు చెల్లించేలా 2023 అక్టోబర్ 30న కొత్త ఒప్పందం చేసుకున్నారు.కానీ అంతకన్నా ముందే నిధులు చెల్లించాలంటూ సెప్టెంబర్ 25న తొలి వాయిదాగా 22,50,000 పౌండ్లు (మన కరెన్సీలో రూ.22,69,63,125), 29వ తేదీన రెండో వాయిదాగా 22,50,000 పౌండ్లు (అయితే పన్నులు, కమిషన్ కలిపి రూ.23,01,97,500) చెల్లించాలంటూ ఎఫ్ఈవో ఇన్వాయిస్లు పంపింది. దీనిపై అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ప్రొసీడింగ్స్‌ను పూర్తి చేశారు.అక్టోబర్ 3న మొదటి వాయిదా కింద రూ.22,69,63,125, అక్టోబర్ 11న రెండో వాయిదా కింద రూ.23,01,97,500 మంజూరు చేశారు. ఈ మొత్తం హెచ్ఎండీఏ బోర్డ్ ఖాతా నుంచే బ్రిటన్‌కు బదిలీ అయినట్టు ఈడీ గుర్తించింది. దీనిపై బీఎల్ఎన్ రెడ్డిని విచారించాలని నిర్ణయించింది. హెచ్ఎండీఏ బోర్డు నుంచి బదిలీ అయిన రూ.45.71 కోట్లు, పెనాల్టీగా ఐటీ శాఖకు చెల్లించిన రూ.8 కోట్లు కలిపి మొత్తం రూ.54.89 కోట్లకు సంబంధించిన వివరాలను రాబట్టనుంది.ఎవరి ఆదేశాలతో ఇది చేశారు?ఇందుకు సంబంధించిన పత్రాలు, హెచ్ఎండీఏ రికార్డులపై ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అదేవిధంగా అనుమతుల వ్యవహారాలు, అప్పటి మంత్రి కేటీఆర్ నుంచి వచ్చిన ఆదేశాలతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందన్న కోణంలో ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ను ప్రశ్నించనున్నట్టు తెలిసింది. వీరి నుంచి సేకరించే అంశాల ఆధారంగానే కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. -
Formula E Car Race Case: కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
సాక్షి,హైదరాబాద్ : ఫార్ములా ఈ-కార్ రేసు కేసు (Formula E Car Race Case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ (ktr)కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. జనవరి 6న ఈ-కార్ రేసు కేసు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఇదే కేసులో ఈడీ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. తాజాగా శుక్రవారం ఏసీబీ సైతం నోటీసు జారీ చేయడం చర్చాంశనీయంగా మారింది. ఈడీ నోటీసులు ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో ఏసీబీ కంటే ముందే ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి ఏడో తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరిని జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసును ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ జరుపుతోంది. ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. FEOకు 55 కోట్లు నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. 👉చదవండి : కేటీఆర్‌కు ఈడీ నోటీసులు -
ఫార్ములా కారు రేసు కేసులో బిగ్ ట్విస్ట్
-
ఫార్ములా కారు రేసు కేసులో బిగ్ ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసులో పలు ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యేందుకు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి మరింత సమయం కోరారు. దీంతో, ఈనెల 8, 9 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు.ఫార్ములా ఈ-కారు రేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో నిన్న బీఎల్ఎన్ రెడ్డి, నేడు అరవింద్ కుమార్‌ను ఈడీ విచారించాల్సి ఉండగా.. హాజరయ్యేందుకు సమయం కావాలని వీరిద్దరూ కోరారు. మూడు వారాల సమయం కావాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు. దీంతో, స్పందించిన ఈడీ.. రెండు వారాల సమయం కుదరదని చెప్పింది. ఈనెల 8వ తేదీన విచారణకు రావాలని బీఎల్ఎన్ రెడ్డికి మరోసారి ఈడీ.. నోటీసులు జారీ చేసింది. అలాగే, ఈనెల 9న అరవింద్ కుమార్ హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. దీంతో, వీరిద్దరూ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తకరంగా మారింది.ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కారు రేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌ను ఈనెల 7వ తేదీన ఈడీ అధికారులు విచారించనున్నారు. అయితే, కేటీఆర్.. ఈడీ వెళ్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక, కారు రేసులో విదేశీ కంపెనీకి నిధులు మళ్ళించడంపై ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ స్టేట్మెంట్ను కూడా ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. ఈ స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు.ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ కంటే ముందే ఏ2, ఏ3 అయిన అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. కానీ, అనూహ్యంగా వారిద్దరూ తమకు సమయం కావాలని కోరారు. దీంతో, ఈడీ అధికారులు ముందుగా కేటీఆర్‌నే విచారించాల్సి వస్తోంది. -
ఈ-కార్ రేస్ కేసులో అధికారులకు ఈడీ మళ్లీ సమన్లు
సాక్షి, హైదరాబాద్: ఈ-కార్ రేస్ కేసులో అధికారులకు ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. 8, 9 తేదీల్లో తప్పకుండా హాజరుకావాలని హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్రెడ్డి, అరవింద్‌కుమార్‌లకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే, నేడు ఈడీ విచారణకు వారు హాజరు కావాల్సి ఉండగా.. విచారణకు మరింత సమయం కావాలని ఈడీ అధికారులను కోరారు. దీంతో 8, 9 తేదీల్లో హాజరుకావాల్సిందేనని ఈడీ స్పష్టం చేసింది.తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు విచారణలో ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. రేపు ఈడీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణకు హాజరవనున్నారు. ఈనెల ఏడో తేదీన కేటీఆర్.. ఈడీ ఎదుట హాజరు కానున్నారు.ఈ కేసులో కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్-ఏ1, ఐఏఎస్ అరవింద్ కుమార్-ఏ2, బీఎల్ఎన్ రెడ్డి-ఏ3గా ఉన్నారు. అయితే, కారు కేసులో ఫెమా నిబంధనలు ఉల్లఘించినట్టు ఈడీ పేర్కొంది. ఇందులో భాగంగానే ఈడీ.. ఈసీఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. రూ.55కోట్ల విదేశీ కంపెనీ ఎఫ్ఈవోకు సంబంధించిన బదిలీలపై ఈడీ విచారించనుంది.ఇదీ చదవండి: రెండు రోజుల్లో సర్కార్ అవినీతి స్కాం బయటపెడతా: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి -
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఈడీ విచారణ
-
కారు రేసు కేసులో ట్విస్ట్.. ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి డుమ్మా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నేడు ఈడీ విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా.. ఆయన వెళ్లలేదు. విచారణకు మరింత సమయం కావాలని ఈడీ అధికారులను కోరారు.ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు నేడు విచారించాల్సి ఉండగా.. ఆయన విచారణకు హాజరు కాలేదు. విచారణకు రావడానికి మరింత సమయం కావాలని బీఎల్ఎన్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్న అధికారికి ఆయన మెయిల్ పంపారు. దీంతో, బీఎల్ఎన్ రెడ్డి మెయిల్‌కు ఈడీ సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా తిరిగి ఎప్పుడు విచారణకు రావాలో చెబుతామని అధికారులు చెప్పారు.ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు విచారణలో ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. రేపు ఈడీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణకు హాజరవనున్నారు. ఈనెల ఏడో తేదీన కేటీఆర్.. ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ కేసులో కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్-ఏ1, ఐఏఎస్ అరవింద్ కుమార్-ఏ2, బీఎల్ఎన్ రెడ్డి-ఏ3గా ఉన్నారు. అయితే, కారు కేసులో ఫెమా నిబంధనలు ఉల్లఘించినట్టు ఈడీ పేర్కొంది. ఇందులో భాగంగానే ఈడీ.. ఈసీఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. రూ.55కోట్ల విదేశీ కంపెనీ ఎఫ్ఈవోకు సంబంధించిన బదిలీలపై నేడు ఈడీ విచారించనుంది. -
ఈ-కార్ రేస్ కేసుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
-
‘ఫార్ములా-ఈ కార్ కేసు లొట్టపీసు కేసు’
సాక్షి,తెలంగాణ భవన్ : ఫార్ములా ఈ-కారు రేసు (Formula E race case)కేసులో విచారణకు రావాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ తరుణంలో ఫార్ములా ఈ-కారు కేసు లొట్టపీసు కేసంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా కారు కేసుపై బుధవారం కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుడూ.. ఫార్ములా ఈకేసులో హైకోర్టు (high court) లో ఏం తీర్పు వస్తుందో చూద్దాం. అవినీతే లేనప్పుడు.. కేసు ఎక్కడది. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు. జనవరి 7న ఈడీ విచారణకు హాజరుపై మా లాయర్లు నిర్ణయిస్తారు. ఏసీబీ కేసులో అస్సలు పస లేదు. నాకు న్యాయస్థానాల మీద నమ్మకం. ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు.పాపం.. నన్ను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోంది. నాపై ఇది ఆరో ప్రయత్నం.. రేవంత్‌కు ఏమి దొరకడం లేదు. 600కోట్లు సంగతి అటుంచితే.. ఒక్క పైసా కూడా అవినీతి లేదు. హైకోర్టు న్యాయమూర్తి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదు.రేసు కావాలనేది నా నిర్ణయం.. వద్దనేది రేవంత్ నిర్ణయం. ఇద్దరి నిర్ణయాలపై క్యాబినెట్లో చర్చ జరగలేదు. నాపై కేసు పెడితే.. రేవంత్‌పై కూడా కేసు పెట్టాలి. రేవంత్ రెడ్డి.. ఒక ముఖ్యమంత్రినా? అని ప్రశ్నించారు.భవిష్యత్ కార్యచరణ ఇదేబీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. ఏడాది మెదటి ఆరునెలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం. తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీలు పూర్తి చేస్తాం. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు వచ్చే అక్టోబర్ వరకు సమయముంది. పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తాం.బ్యాంకులను ముంచేటోళ్ళకే సెల్ఫ్ డిక్లరేషన్ లేదు..రైతుబ రోసాతో రేవంత్ సర్కార్‌పై ప్రజల్లో తిరుగుబాటు రాబోతుంది. రైతుబరోసా కొందరకికే ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు?. బ్యాంకులను ముంచేటోళ్ళకే సెల్ఫ్ డిక్లరేషన్ లేదు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజిస్ట్రేషన్లు ఇవ్వాలని రేవంత్‌కు లేదు. 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వమే కోర్టులో కేసులు వేయిస్తోంది.ఆర్ఆర్ఆర్లో రూ.12 వేల కోట్ల కుంభకోణంఉద్యోగస్తులు, పాన్ కార్డ్ ఉన్నవాళ్ళకు రైతుబరోసా ఎగ్గొట్టే ప్రయత్నం. ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై సుప్రీకోర్టు కు వెళ్తున్నాం .. ఈ సంవత్సరం ఉప ఎన్నికల రావొచ్చు. ఆర్ఆర్ఆర్లో రూ.12 వేల కోట్ల కుంభకోణం జరుగబోతుంది. ఖాజా గూడలో ఉన్న పేదోళ్లను రోడ్డుపైకి నెట్టారు. రూ. లక్ష 38 వేల కోట్ల అప్పులో వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి పోతున్నవి. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారు. -
తుది తీర్పు వరకు కేటీఆర్ అరెస్టు వద్దు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంపై నమోదైన కేసులో ఎఫ్ఐఆర్ను రద్దుచేయాలని కోరుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తుది తీర్పు ప్రకటించేవరకు ఆయనను అరెస్టు చేయవద్దని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31 వరకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఫార్ములా–ఈ కార్ రేసింగ్ కోసం విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేటీఆర్‌పై ఏసీబీ డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ–1గా కేటీఆర్, ఏ–2గా నాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, ఏ–3గా హెచ్ఎండీఏ నాటి చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి పేరును చేర్చారు. ఈ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి, దానకిశోర్ తరఫున సీవీ మోహన్‌రెడ్డి, కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ దవే వాదనలు వినిపించారు. వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. తుది తీర్పు వెల్లడించేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని ఆదేశించారు. అవినీతి లేనప్పుడు సెక్షన్లు ఎలా పెడతారు? అవినీతే లేనప్పుడు కేసు ఎలా నమోదుచేస్తారని కేటీఆర్ తరఫు న్యాయవాది సిద్దార్థ దవే వాదించారు. ‘ఫార్ములా –ఈ రేసు నిర్వహణ ఒప్పందంలో ముందుగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేశారు. అనంతరం కేటీఆర్ నోట్ ఫైల్‌పై సంతకం చేశారు. ఆ శాఖ మంత్రిగా ఉన్నంత మాత్రాన కేటీఆర్‌ను నిందితుడిగా చేర్చడం సరికాదు. ఈ చెల్లింపుల్లో అవినీతి జరిగినట్లు గానీ, వ్యక్తిగతంగా కేటీఆర్ లబ్ధి పొందినట్లుగానీ ఏసీబీ పేర్కొనలేదు. అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అలాంటప్పుడు అవినీతి నిరోధక (పీసీ) చట్టంలోని సెక్షన్ 13(1)(్చ), 13(2) కింద కేసు పెట్టడం చెల్లదు. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. లబ్ధి చేకూర్చినట్లు చెబుతున్న సంస్థపై కేసు పెట్టలేదు. నగదు చెల్లింపు బ్యాంక్ ద్వారానే జరిగింది. బిజినెస్ రూల్స్ ఉల్లంఘించారని చెబుతున్నా.. చట్టప్రకారం ప్రతి ఉల్లంఘన క్రిమినల్ నేరం కిందకు రాదు. ఎన్నికల కోడ్ సమయంలో పాలసీ నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ, ముందే ఉన్న ఒప్పందాన్ని అమలు చేయవచ్చు. డిసెంబర్ 18 ఫిర్యాదు చేస్తే 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలి’అని విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రతినిధులకూ సెక్షన్ 405 వర్తిస్తుంది.. సిద్దార్థ దవే వాదనను ఏజీ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘2023, అక్టోబర్ 30న సీజన్ 10కు సంబంధించి రెండో ఒప్పందం జరిగింది. కానీ, అక్టోబర్ 3న రూ.22,69,63,125 (పన్నులు అదనం), 11న రూ.23,01,97,500 (పన్నులు అదనం) చెల్లించారు. అంటే ఒప్పందానికి ముందే మొత్తం రూ.54,88,87,043 చెల్లింపులు చేశారు. ఫార్ములా ఈ రేసు ఆపరేషన్స్ (ఎఫ్ఈవో), మున్సిపల్ శాఖ మధ్య 2023, అక్టోబర్‌లో ఒప్పందం కుదిరింది. విదేశీ మారక ద్రవ్యం (పౌండ్) రూపంలో చెల్లింపులకు ఆర్బీఐ నిబంధనలు, బిజినెస్ రూల్స్‌ను తప్పకుండా పాటించాలి. కానీ పాటించలేదు. హెచ్ఎండీఏ నుంచి రూ.10 కోట్లకు మించి ఎలాంటి చెల్లింపులు జరిపినా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ నోట్ ఫైల్‌కు ఆమోదం తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఫార్ములా –ఈ రేసు ఒప్పందం చేసుకున్నారు. ఎఫ్ఈవోకు డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత రేసు ప్రమోటర్ ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్‌ది. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కోర్టులను ఆశ్రయించవచ్చు. కానీ, ప్రమోటర్‌ను రక్షించడం కోసమే చెల్లింపులు జరిపినట్లుగా ఉంది. నిబంధనలు విరుద్ధంగా చెల్లింపులు జరిగినందునే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 405, 409 ప్రజా ప్రతినిధులకు కూడా వర్తిస్తాయి. చంద్రబాబునాయుడు వర్సెస్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని చెప్పింది. అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేయండి’ అని ధర్మాసనాన్ని కోరారు. సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఈ లావాదేవీల్లో అవినీతి జరిగిందా? డబ్బులు ఎలా వెళ్లాయి? మళ్లీ వచ్చాయా.. లేదా? అనేది విచారణలో తేలుతుంది. నిబంధనలు ఉల్లంఘన జరిగినప్పుడు దర్యాప్తు చేపట్టే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వ నగదు చెల్లింపులో ఉల్లంఘన జరిగితే సెక్షన్ 405 వర్తిస్తుంది. మంత్రి ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయి’ అని వాదించారు. ఏజీకి న్యాయమూర్తి సూటి ప్రశ్నలు.. నిందితుడిపై ఉన్న ఆరోపణలు ఏంటి? గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా నగదు చెల్లింపులకు పాల్పడ్డారు. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ‘ఫార్ములా– ఈ’ ప్రమోటర్ సంస్థను నిందితుల జాబితాలో చేర్చారా? లేదు. దర్యాప్తులో భాగంగా నిందితులను చేర్చడం, తొలగించడం జరుగుతుంది. దర్యాప్తు ఏ దశలో ఉంది? ఎంత మంది స్టేట్మెంట్ రికార్డు చేశారు? దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. వీలైనంత త్వరగా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఫిర్యాదుదారు దానకిశోర్ స్టేట్మెంట్ రికార్డు చేశాం. నిందితుల స్టేట్మెంట్ రికార్టు చేయాల్సి ఉంది. ఇతర నిందితులు ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా? ఇప్పటివరకు ఎలాంటి పిటిషన్లు వేయలేదు. ఎవరినీ అరెస్టు చేయలేదు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ప్రమోటర్ గ్యారంటీ సమర్పించారా? దాన్ని క్యాష్ చేసుకున్నారా? దర్యాప్తులో ఆ వివరాలు సేకరించాల్సి ఉంది. -
ఫార్ములా-ఈ కేసు ఉత్కంఠ.. సిద్ధార్థ దవే వాదనలు ఇవే
-
కేటీఆర్ కేసు విచారణపై ఉత్కంఠ!
-
అప్పటి వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దు : హైకోర్టు
సాక్షి,హైదరాబాద్ : ఫార్ములా-ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ఉదయం కేటీఆర్ తరుఫు న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు విన్న కోర్టు మధ్యాహ్నం నుంచి ఏసీబీ తరుఫు వాదనల్ని వింటోంది.ఏసీబీ తరుఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు ప్రారంభించారుఈ కార్ రేసు కేసు విచారణ పురోగతి ఏంటని.. ఏజీ సుదర్శన్‌రెడ్డిని ప్రశ్నించిన జస్టిస్ లక్ష్మణ్ఫిర్యాదుదారు స్టేట్మెంట్ రికార్డ్ పూర్తైందన్న ఏజీఏసీబీ విచారణ కొనసాగుతోందని తెలిపిన ఏజీనగదు బదిలీ పై ప్రోజీర్ ఫాల్ కాలేదన్న ఏసీబీ తరుపు వాదనలుబిజినెస్ రూల్స్ కాపీ అడిగిన న్యాయమూర్తిరూల్స్ కాపీని అందించిన ఏసీబీ న్యాయవాదిఈడీ సైతం నోటీసులు జారీ చేసిందని తెలిపిన ఏసీబీ న్యాయవాది FEO తో అగ్రిమెంట్ చేసుకున్నారు .. కానీ దాని ద్వారా ఎలా లాభాలు వస్తాయో చెప్పలేదు .. AG సుదర్శన్ రెడ్డిమూడు దఫాలుగా నగదు బదిలీ చేశారు55 కోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా FEO కి బదిలీ చేశారుఏసీబీ దర్యాప్తు ఎక్కడ వరకు వచ్చింది - హైకోర్టుఈ కేసులో ఎంత మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు - హైకోర్టుఇప్పటి వరకు ఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామన్న ప్రభుత్వ తరుఫు న్యాయ వాదిఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఎలాంటి ఆధారాలు సేకరించారని ప్రశ్నించిన న్యాయస్థానంకేసు విచారణ కొనసాగుతుంది .. విచారణ దశలో అన్ని ఆధారాలు బయట పడుతాయన్న ప్రభుత్వ తరుఫు న్యాయ వాదికేటీఆర్ తరుపున న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు ప్రారంభంఅవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు సెక్షన్లు పెట్టారు ఎక్కడ, ఎలా జరిగిందో మాత్రం పేర్కొనలేదులబ్ధి చేకూర్చినట్లు చెబుతున్న సంస్థపై కేసు పెట్టలేదుబిజినెస్ రూల్స్ ఉల్లంఘన అని చెబుతున్నారు..ప్రతి ఉల్లంఘన క్రిమినల్ నేరం కిందకు రాదన్న దవేదర్యాప్తు ప్రారంభ దశలోనే ఉందన్న ఏజీఫిర్యాదుదారు స్టేట్మెంట్ రికార్డు చేశాంవిచారణలో నిందితులను చేరవచ్చు.. తొలగించవచ్చుఆ అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంటుందిబిజినెస్ రూల్స్‌ను ఉల్లంఘించి నగదు బదిలీ చేశారుపారెన్ కరెన్సీలో చెల్లింపులు నిబంధనలకు విరుద్ధమన్న ఏజీ3 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిన వాదనలుకేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు పూర్తి..తీర్పు రీజర్వ్ చేసిన హైకోర్టు.తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్ అరెస్ట్ చెయ్యొద్దన్న హైకోర్టుఏసీబీ దర్యాప్తు చేయోచ్చు తీర్పు వెలువరించే వరకు... కేటీఆర్ అరెస్టు వద్దుమధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన హైకోర్టుఫార్పులా ఈ కార్ రేసింగ్ కేసుపై ముగిసిన వాదనలుతీర్పు రిజర్వు చేసిన జస్టిస్ కె.లక్ష్మణ్క్వాష్ పిటిషన్‌పై ముగిసిన కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు..మధ్యాహ్నం లంచ్ బబ్రేక్ తర్వాత ఏసీబీ న్యాయవాది వాదనలు కేటీఆర్ న్యాయవాది దవే వాదనలుకేటీఆర్ ఈ కేసులో లబ్ధి పొందినట్లు ఎఫ్ఐఆర్లో ఎక్కడా లేదుఈ కేసులో అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు వర్తించవుఫార్ములా- ఈ రేసుల సీజన్ 10 నిర్వహణ కోసం మంత్రిగా కేటీఆర్ అనుమతులిచ్చారుకొత్తగా వచ్చిన బీఎన్ఎస్ చట్టం కాకుండా ఐపీసీ సెక్షన్లు ఎందుకున్నాయని ప్రశ్నించిన హైకోర్టు14 నెలల క్రితం నేరం జరిగింది కాబట్టి పాత చట్టం ప్రకారం కేసు నమోదు చేశారని తెలిపిన కేటీఆర్ తరఫున న్యాయవాది దవేఐపీసీ 409పై కొనసాగుతున్న వాదనలుకేటీఆర్ ఎఫ్ఈవోతో జరిగిన ఒప్పందం ఎలాంటి లాభం పొందలేదుఅసలు ఈ కేసులో ఐపీసీ 409 సెక్షన్ వర్తించదు.. ఆధారాలు కూడా లేవుఫార్ములా ఈ రేసుల ఆపరేషన్స్ ఎఫ్ఈఓ చేసినందున వాళ్లను ఎందుకు ఎఫ్ఐఆర్లో చేర్చలేదుఈ కేసులో నిందితుడు కేటీఆర్ చేర్చినప్పుడు ఎఫ్ఈఓను కూడా చేర్చాలి కదాఎఫ్ఈఓతో అగ్రీమెంట్ పై సంతకం చేసింది అరవింద్ కుమార్ కేటీఆర్ కాదుఫార్ములా-ఈ కేసు: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ ప్రారంభంహైకోర్టులో ప్రారంభమైన కేటీఆర్ పిటిషన్‌పై విచారణ కేటీఆర్ తరపున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ దవేనేటితో ముగియనున్న కేటీఆర్ నాట్ టు అరెస్టు గడువు ఫార్ములా-ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టు ఇచ్చిన ఊరట ‘నాట్ టు అరెస్ట్’ గడువు మంగళవారం(డిసెంబర్31)తో ముగియనుంది. కేసును హైకోర్టు నేడు తిరిగి విచారించనుంది. ఎఫ్ఐఆర్ కొట్టేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై ఏసీబీ ఇప్పటికే కౌంటర్ దాఖలుచేసింది. కేటీఆర్ పిటిషన్‌కు విచారణార్హత లేదని ఏసీబీ కౌంటర్లో పేర్కొంది.కేటీఆర్ ఆదేశాలతోనే ఎఫ్ఈఓ కంపెనీకి నిధుల బదిలీ జరిగిందని తెలిపింది. అన్ని అనుమతులు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదుచేశామని పేర్కొంది. విచారణ ప్రాధమిక దశలో ఉన్నందున బెయిల్, క్వాష్ ఊరట ఇవ్వొద్దని ఏసీబీ కోర్టును కోరింది. ఏసీబీ కౌంటర్‌పై హైకోర్టులో కేటీఆర్ కౌంటర్ అఫిడవిట్ దాఖలుచేశారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని తెలిపారు.మంత్రిగా నిధుల బదిలీ మంత్రిగా తనకు సంబంధం లేని వ్యవహారమని పేర్కొన్నారు. విదేశీ సంస్థలకు నిధుల బదిలీ అనుమతి బ్యాంక్‌కు చెందిన అంశమని తెలిపారు. రాజకీయ కక్ష సాదింపుతో తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. కాగా, ఈడీ సైతం ఈ కేసులో కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. జనవరి 7న కేటీఆర్ విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో కోరింది. -
KTR: కేసులకు భయపడేదే లేదు
సాక్షి, తెలంగాణ భవన్: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో విచారణకు రావాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ తరుణంలో కేసులకు భయపడేది లేదంటూ ఫార్ములా ఈ-కారు రేసింగ్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్ సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ క్యాడర్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కనిపిస్తోంది. కేసులకు భయపడేది లేదు. ఏసీబీ కేసులో బలం లేదని రేవంత్‌కు కూడా తెలుసు. నేను మాట మార్చలేదు.. చెప్పినదానికే కట్టుబడి ఉన్నా.ఈ కార్ రేసుకు మంత్రి హోదాలో నేనే డబ్బులు కట్టమన్నా. ప్రొసీజర్ ప్రకారం జరగకపోతే .. ఈసీ,ఆర్బీఐ దగ్గరకు ప్రభుత్వం ఎందుకు పోలేదు?.డబ్బులు ముట్టిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదు?’అని ప్రశ్నించారు. ఎప్పుడు బయటకు రావాలో కేసీఆర్‌కు తెలుసుఎప్పుడు బయటకు రావాలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు తెలుసు. 24ఏళ్ళు కేసీఆర్ కష్టపడ్డారు. కాస్త రెస్ట్ తీసుకుంటున్నారు. తెలంగాణ బిడ్డ పీవీపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుంది. ఢిల్లీలో పీవీకి మెమోరియల్ కట్టాలని అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయరు? మరణంలో కూడా పీవీని కాంగ్రెస్ గౌరవించలేదు. పీవీకి గౌరవం దక్కేవరకు రాజ్యసభలో బీఆర్ఎస్ కొట్లాడుతుంది. రేవంత్‌కు బీజేపీ ఎంపీలు రక్షణ కవచంగా మారారు. అమృత్, సివిల్ సప్లై స్కాంలో కేంద్రం ఎందుకు విచారణ జరపదు. రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలకు కేంద్రం సహకరిస్తుంది. 2025లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక, సంస్థాగత కమిటీ వేస్తాం. లోకల్ బాడీస్‌లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తాం’అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో కీలక పరిణామంతెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ-కారు రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్‌కు తాజాగా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో జనవరి ఏడో తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈడీ.. కేటీఆర్ సహా అరవింద్ కుమార్‌కు సైతం నోటీసులు ఇచ్చింది.వివరాల ప్రకారం.. ఫార్ములా ఈ-కారు రేసు కేసుకు సంబంధించి తాజాగా కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ సందర్భంగా వచ్చే నెల ఏడో తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరిని జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసును ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ జరుపుతోంది. ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. FEOకు 55 కోట్లు నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కారు రేస్ కేటీఆర్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న కేటీఆర్.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్‌ను ఈనెల 30 వరకు ఆరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌లకు నోటీసులు జారీ చేసింది. -
ఫార్ములా కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు
-
ఫార్ములా-ఈ కార్ల రేసు కేసులో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు ఈడీ సమన్లు... వచ్చే నెల 7వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశం
-
‘ఫార్ములా–ఈ’ రేసు కేసు: 7న విచారణకు రండి
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్‌కు శనివారం సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 7వ తేదీన ఈడీ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో సహ నిందితు లుగా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ మాజీ సీఈ బి.లక్ష్మీనరసింహారెడ్డి (బీఎల్ఎన్ రెడ్డి)లకు కూడా సమన్లు జారీ చేసింది. వీరిలో బీఎల్ఎన్ రెడ్డిని వచ్చే నెల 2న, అర్వింద్‌కుమార్‌ను 3వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ముగ్గురినీ ఆయా తేదీల్లో శుక్రవారం వేర్వేరుగా సమన్లు జారీ చేసింది. ఆయా తేదీల్లో ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ ఆ సమన్లలో పేర్కొన్నారు. ఏసీబీ కంటే దూకుడుగా.. హైదరాబాద్ నగరంలో ఫార్ములా–ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్ఎండీఏ నుంచి విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. దీనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా, అప్పటి హెచ్ఎండీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ఏ2గా, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిని ఏ3గా చేర్చింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసింది. అయితే ఏసీబీ దర్యాప్తు కన్నా ఈడీ మరింత దూకుడుగా ముందుకు వెళుతోంది. నిందితులను విచారించేందుకు సమన్లు జారీ చేసింది. ఈడీ దర్యాప్తులో గుర్తించే అంశాల ఆధారంగా.. కేసులో ముందుకు వెళ్లనుంది. ఇదే సమయంలో ‘ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)’ కింద కూడా ఈడీ దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిసింది. నిధుల మళ్లింపుపైనే ఈడీ ఫోకస్.. ఫార్ములా–ఈ కార్ రేస్ సీజన్–10 నిర్వహణకు సంబంధించి రాష్ట్ర మున్సిపల్ విభాగం (ఎంఏయూడీ), ఫార్ములా–ఈ రేసు నిర్వహణ సంస్థ ఎఫ్ఈవో (ఫార్ములా–ఈ ఆపరేషన్స్) సంయుక్తంగా సిద్ధమయ్యాయి. రేసు నిర్వహణకు సంబంధించి స్పాన్సర్ ఫీజు, పన్నులు కలిపి మొత్తం రూ.110 కోట్లు (90,00,000 బ్రిటన్ పౌండ్లు)ను ఎఫ్ఈవోకు చెల్లించేలా 2023 అక్టోబర్ 30న కొత్త ఒప్పందం చేసుకున్నారు. కానీ అంతకన్నా ముందే నిధులు చెల్లించాలంటూ సెప్టెంబర్ 25న తొలి వాయిదాగా 22,50,000 పౌండ్లు (మన కరెన్సీలో రూ.22,69,63,125), 29వ తేదీన రెండో వాయిదాగా 22,50,000 పౌండ్లు (అయితే పన్నులు, కమిషన్ కలిపి రూ.23,01,97,500) చెల్లించాలంటూ ఎఫ్ఈవో ఇన్వాయిస్లు పంపింది. దీనిపై అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ప్రొసీడింగ్స్‌ను పూర్తి చేశారు. అక్టోబర్ 3న మొదటి వాయిదా కింద రూ.22,69,63,125, అక్టోబర్ 11న రెండో వాయిదా కింద రూ.23,01,97,500 మంజూరు చేశారు. ఈ మొత్తం హెచ్ఎండీఏ బోర్డ్ ఖాతా నుంచే బ్రిటన్‌కు బదిలీ అయినట్టు ఈడీ గుర్తించింది. దీనిపై బీఎల్ఎన్ రెడ్డిని విచారించాలని నిర్ణయించింది. హెచ్ఎండీఏ బోర్డు నుంచి బదిలీ అయిన రూ.45.71 కోట్లు, పెనాల్టీగా ఐటీ శాఖకు చెల్లించిన రూ.8 కోట్లు కలిపి మొత్తం రూ.54.89 కోట్లకు సంబంధించిన వివరాలను రాబట్టనుంది. ఎవరి ఆదేశాలతో ఇది చేశారు?ఇందుకు సంబంధించిన పత్రాలు, హెచ్ఎండీఏ రికార్డులపై ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అదేవిధంగా అనుమతుల వ్యవహారాలు, అప్పటి మంత్రి కేటీఆర్ నుంచి వచ్చిన ఆదేశాలతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందన్న కోణంలో ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ను ప్రశ్నించనున్నట్టు తెలిసింది. వీరి నుంచి సేకరించే అంశాల ఆధారంగానే కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. -
కేటీఆర్ కు ఈడీ నోటీసులు
-
ఈ-కారు రేసు కేసులో ఏసీబీ, ఈడీ దూకుడు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ, ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. తాజాగా కారు రేసింగ్‌కు సంబంధించి ఏసీబీ.. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించింది. ఇదే సమయంలో ఈ కేసు వివరాలను ఏసీబీ అధికారులు ఈడీకి అందజేశారు.తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసింగ్ కేసులో వివరాలను ఈడీకి అందజేశారు ఏసీబీ అధికారులు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ రికార్డ్స్, హెచ్ఎండీఏ చెల్లింపుల వివరాలు, హెచ్ఎండీఏ చేసుకున్న ఒప్పంద పత్రాలతో పాటు ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఏసీబీ.. ఈడీకి అందించింది. ఇక, కొన్ని గంటల ముందే ఈడీ.. ఈ కేసులో కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనవరి ఏడో తేదీన కేటీఆర్ విచారణకు రావాలని నోటీసులు పేర్కొన్నారు.ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ -కారు రేసింగ్ కేసు విషయమై హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ క్రమంలో కీలక అంశాలను ప్రస్తావన చేసిన ఏసీబీ. కౌంటర్లోని విషయాలు.. కారు రేసింగ్‌లో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగించడంతో పాటు నేర పూరిత దుష్ప్రవర్తనకు కేటీఆర్ పాల్పడ్డాడని కౌంటర్లో పేర్కొంది. క్యాబినెట్ నిర్ణయం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే చెల్లింపులు చేయాలని అధికారులపై కేటీఆర్ ఒత్తిడి చేశాడు. అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు 55 కోట్లు బదిలీ చేశారు. దీని వలన హెచ్ఎండీఏకు 8 కోట్లు అదనపు భారం పడింది. అసంబద్ధమైన కారణాలు చూపి కేసును కొట్టివేయాలని అడగడం దర్యాప్తును అడ్డుకోవడమే అవుతుందని తెలిపింది.అలాగే, కేటీఆర్ వేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఏసీబీ స్పష్టం చేసింది. అధికారుల నుండి అనుమతి పొందిన తర్వాతనే కేటీఆర్‌పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపింది. రాజకీయ కక్షతోనో, అధికారులపై ఒత్తిళ్లతోనూ కేసు నమోదు చేశామని చెప్పడం సరైనది కాదు. మున్సిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్‌ను ఉల్లంఘించారు. ఎఫ్ఈఓకు చెల్లింపులు జరపాలని స్వయంగా కేటీఆర్ వెల్లడించినట్లు ఆయనే చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ఆలస్యం అయినందున కేసు కొట్టివేయాలని కోరడం సరైంది కాదు. తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి అని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. -
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు
-
కేటీఆర్‌కు ఈడీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ-కారు రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్(KTR)కు తాజాగా ఈడీ(enforcement Directorate) అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో జనవరి ఏడో తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈడీ.. కేటీఆర్ సహా అరవింద్ కుమార్‌కు సైతం నోటీసులు ఇచ్చింది.వివరాల ప్రకారం.. ఫార్ములా ఈ-కారు రేసు కేసుకు సంబంధించి తాజాగా కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ సందర్భంగా వచ్చే నెల ఏడో తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరిని జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసును ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ జరుపుతోంది. ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. FEOకు 55 కోట్లు నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కారు రేస్ (Formula E-Car Race) కేటీఆర్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న కేటీఆర్.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్‌ను ఈనెల 30 వరకు ఆరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌లకు నోటీసులు జారీ చేసింది.ఈ క్రమంలోనే శుక్రవారం.. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. కేసులో ‘కేటీఆర్ నాట్ టు అరెస్ట్’ను ఎత్తివేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా.. కౌంటర్ దాఖలు చేయాలంటూ కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే, కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కోరగా.. న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా ఈ నెల 31 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయకూడదని పోలీసులను ఆదేశించారు. -
ఫార్ములా-ఈ రేస్ కేసుపై హైకోర్టులో విచారణ
-
కేటీఆర్‌కు ఊరట వద్దు: ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కౌంటర్
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా-ఈ కార్ రేసుల(formula-e race) కేసులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) హైకోర్టులో శుక్రవారం(డిసెంబర్27) కౌంటర్ ధాఖలు చేసింది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr)కు ఇచ్చిన ఊరట (నాట్ టు అరెస్ట్) ఆదేశాలను ఎత్తివేయాలని ఏసీబీ తన కౌంటర్లో కోర్టును కోరింది.ఏసీబీ(Acb) వేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్ తరపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారం(డిసెంబర్31)కి కోర్టు వాయిదా వేసింది.కాగా ఫార్ములా-ఈ కార్ రేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయగాకే కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు కేటీఆర్‌ను ఈ కేసులో 31 దాకా అరెస్టు చేయవద్దని ఏసీబీకి ఆదేశాలిచ్చింది. 31న జరిగే విచారణలో ఏం జరగనుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఇదీ చదవండి: చంద్రబాబుకు ఒక రూల్.. కేటీఆర్‌కు మరొకటా -
కేటీఆర్ క్వాష్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ
-
చంద్రబాబుకు ఒక రూల్.. కేటీఆర్‌కు మరొకటా?
బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌పై ఈ ఫార్ములా రేస్ విషయంలో తెలంగాణ ఏసీబీ ఇట్టా కేసు నమోదు చేసిందో లేదో, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగిపోయింది. కేటీఆర్‌పై కేసు కూడా పెట్టేసిందట. ఇది ఆశ్చర్యంగానే ఉంది. అందులో ఏమైనా మెటీరియల్ ,ఆధారాలు ఉంటే కేసు పెట్టారంటే అర్ధం చేసుకోవచ్చు. అందులో ఏమి జరిగిందో పరిశీలించకుండానే,ఇది రాజకీయ కేసు అని తెలిసి కూడా ఈడీ తెరపైకి వచ్చిందంటే సహజంగానే అనుమానాలు వస్తాయి. పోనీ అన్ని కేసుల్లోను ఇంతే వేగంగా ఈడీ వస్తుంటే ఫర్వాలేదు. కాని కొందరు నేతల విషయంలో అసలు వారి జోలికే వెళ్లదు. అంటే కేంద్రంలోని ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఎవరిపై కేసులు పెట్టాలో, ఎవరిపై పెట్టకూడదో ఈడీ,సీబీఐ వంటి సంస్థలు నిర్ణయించుకుంటాయన్న విమర్శలకు ఈ పరిణామం ఊతం ఇస్తుంది. కేటీఆర్‌పై అనూహ్యమైన రీతిలో స్పందించిన ఈడీ, అదే ఏపీలో గతంలో చంద్రబాబుపై వచ్చిన కేసుల విషయంలో ఎందుకు స్పందించలేదన్నది పలువురి ప్రశ్నగా ఉంది. తెలంగాణలో రాజకీయంగా బలపడాలన్న ఉద్దేశంతో ఉన్న బీజేపీ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ను వీక్ చేయడానికి చేస్తున్న ప్లాన్ లో ఇవన్ని భాగమా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. పార్లమెంటులో సైతం ఈడీ,సీబీఐ అనుసరిస్తున్న పద్దతుల గురించి విపక్ష సభ్యులు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ఈడీ,సీబీఐలను ఆయా నేతలపైకి ఉసికల్పడం, వారు భయపడి బీజేపీలోకి రాగానే కేసులు మూలపడడం జరిగిపోతోందన్నది వారి విమర్శ. దీనినే వాషింగ్ మిషన్ ట్రీట్ మెంట్ అంటే బీజేపీలో చేరగానే పరిశుభ్రం అయిపోతున్నారని ఎద్దేవ చేస్తుంటారు. దానికి తగినట్లుగానే ఏపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరగానే వారిలో ఇద్దరిపై ఉన్న బ్యాంకు రుణాల ఎగవేత కేసులు చప్పబడిపోయాయని అంటారు.మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ పై ఈ ఫార్ములా రేస్ విషయంలో తెలంగాణ ఏసీబీ ఇట్టా కేసు నమోదు చేసిందో లేదో, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగిపోయింది.కేటీఆర్ పై కేసు కూడా పెట్టేసిందట. ఇది ఆశ్చర్యంగానే ఉంది. అందులో ఏమైనా మెటీరియల్ ,ఆధారాలు ఉంటే కేసు పెట్టారంటే అర్ధం చేసుకోవచ్చు. అందులో ఏమి జరిగిందో పరిశీలించకుండానే,ఇది రాజకీయ కేసు అని తెలిసి కూడా ఈడీ తెరపైకి వచ్చిందంటే సహజంగానే అనుమానాలు వస్తాయి. పోనీ అన్ని కేసుల్లోను ఇంతే వేగంగా ఈడీ వస్తుంటే ఫర్వాలేదు. కాని కొందరు నేతల విషయంలో అసలు వారి జోలికే వెళ్లదు. అంటే కేంద్రంలోని ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఎవరిపై కేసులు పెట్టాలో, ఎవరిపై పెట్టకూడదో ఈడీ,సీబీఐ వంటి సంస్థలు నిర్ణయించుకుంటాయన్న విమర్శలకు ఈ పరిణామం ఊతం ఇస్తుంది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించగానే, ఎన్‌సిపి చీలిక వర్గం నేత అజిత్ పవార్ కు క్లీన్ చిట్ వచ్చేసిందని చెబుతారుఇప్పుడు తెలంగాణలో ఈ ఫార్ములా కేసులో కూడా అలాగే బీజేపీ వ్యవహరిస్తోందా? అన్నదానికి అప్పుడే అవునని చెప్పలేకపోయినా, ఈడీ వాయు వేగంతో వ్యవహరించిన తీరుపై డౌట్లు వస్తాయి.హైదరాబాద్ లో ఈ ఫార్ములా రేస్ నిర్వహణకు సంబంధించి ఆ సంస్థకు సుమారు 55 కోట్ల మేర నిధులు విడుదల చేయడం తప్పన్నది ప్రభుత్వ వాదన.ఇందులో నిధుల దుర్వినియోగం జరిగిందన్నది ఏసీబీ కేసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసులో ఇంకేదో ఉందని, 600 కోట్ల అవినీతి అని కొత్త విషయం శాసనసభలో చెప్పారు. ఆ విషయం ఫార్ములా రేస్ సంస్థవారే వెల్లడించారని,కేటీఆర్ రహస్య ఒప్పందాలు చేసుకున్నారని,ఆయన చెవిలో చెప్పారట.ఇందులో నిజం ఉందో లేదో కాని,వినడానికి మాత్రం నమ్మశక్యంగా లేదనిపిస్తుంది. ఎందుకంటే తన ఆధ్వర్యంలోని ఏసీబీ 55 కోట్లు నిధుల దుర్వినియోగం అని చెబుతుంటే, ఏకంగా ముఖ్యమంత్రి అది 600 కోట్లు అని అనడం కేవలం ప్రచారం కోసమే అన్న విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లయింది.దీనిపై కేటీఆర్ హైకోర్టుకు వెళ్లారు.అక్కడ వారు ఈ నెలాఖరువరకు అరెస్టు చేయవద్దని, అయితే కేసు దర్యాప్తు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చారు.అది వేరే సంగతి. ఈ దశలో ఈడీ రంగ ప్రవేశం చేసింది. ఏసీబీకి లేఖ రాయడం, కేటీఆర్ ,ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేయడం జరిగిపోయింది.ఇది ఏసీబీ కేసు ఆధారంగానే జరిగింది.ఇదంతా రేవంత్ రెడ్డి, బీజేపీ కుమ్మక్కు వల్లేనని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.కేటీఆర్ పై కేసు పెట్టడానికి గవర్నర్ ఓకే చేసిన తర్వాత వేగంగా ఈ పరిణామాలు సంభవించాయి.కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి కేటీఆర్ వెళితే ఈ కేసులో గవర్నర్ అనుమతి రాకుండా చేసుకోవడానికే అని కాంగ్రెస్ ప్రచారం చేసింది. తీరా చూస్తే గవర్నర్ పర్మిషన్ ఇవ్వడమే కాదు.. ఈడీ కూడా వచ్చేసింది.ఇప్పుడు కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసు నేపధ్యం ఇలా ఉంటే గతంలో జరిగిన కొన్ని విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. 2019 లో చంద్రబాబు ప్రభుత్వంఓడిపోయిన తర్వాత కొద్ది నెలలకు ఆదాయపన్ను శాఖ అధికారులు చంద్రబాబు పిఎస్ ఇంటిపై దాడి చేసి పలు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు ప్రకటించారు. ఏకంగా రెండువేల కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయని సిబిటిడి సాధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత ఇప్పటికి ఐదేళ్లు అయినా ఆ వ్యవహారంపై అతీగతీ లేదు.అంటే ప్రధానమంత్రినో,హోం మంత్రినో, ఆర్ధిక మంత్రినో మేనేజ్ చేసుకుంటే ఎలాంటి కేసు అయినా విచారణ లేకుండా ఆగిపోతుందా అని సామాన్యుడు ఎవరికైనా సందేహం వస్తే ఏమి చెప్పగలం.దేశంలో చట్టాలు కొందరికి చుట్టాలు అన్న నానుడిని నిజం చేసినట్లే కదా? గతంలో జగన్ ప్రభుత్వ టైమ్ లో అమరావతి భూములలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, దానిపై సీబీఐ దర్యాప్తు చేయాలని ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసింది.దానిని పట్టించుకోలేదు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నిధులు 350 కోట్లు దుర్వినియోగం అయ్యాయని, ఈ నిధులలో సింహభాగం షెల్ కంపెనీలకు, చివరికి టిడిపి బ్యాంక్ ఖాతాకు చేరాయని అప్పట్లో సిఐడి ఆధార సహితంగా చూపుతూ ఈడీకి కూడా తెలియచేసింది. నిజానికి తొలుత ఈ కేసును జిఎస్టి అదికారులు గుర్తించారు.దానిని ఈడీ టేకప్ చేసి కొందరిని అరెస్టు కూడా చేసింది. తీగ లాగితే డొంక కదిలినట్లు అది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్లింది.ఆయన ప్రమేయంతోనే రూల్స్ తో నిమిత్తం లేకుండా నిధులు విడుదల అయ్యాయని అభియోగం చేసింది.ఈ కేసులో చంద్రబాబును సిఐడి రిమాండ్ కు తీసుకుంది.ఏభైమూడు రోజుల పాటు జైలులో ఉండి ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పై బయటకు వచ్చారు.ఆ తర్వాత పరిణామాలలో బీజేపీకి చంద్రబాబు దగ్గరయ్యారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో భేటీ కాగలిగారు.బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.అంతే! ఈడీ ఈ కేసులో వేరేవారి ఆస్తులు జప్తు చేసింది తప్ప , చంద్రబాబు ఊసే ఎత్తలేదు. చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇవ్వలేదని కేంద్రం చెబుతున్నా,కేసు ఎందుకు ముందుకు కదలడం లేదన్నదానికి జవాబు దొరకదు.ఇప్పుడు చంద్రబాబు అదికారంలోకి రాగానే ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి అన్ని వ్యూహాలను పన్నుతున్నారన్న వార్తలు వస్తున్నాయి.ఆ కేసులను నీరుకార్చడానికి ఢిల్లీ నుంచి తమ లాయర్ సిద్దార్ధ్ లూధ్రాను రంగంలోకి తెచ్చి, ఏకంగా పోలీసు ఉన్నతాధికారులనే ఆయన వద్దకు పంపి సమాలోచనలు జరిపించారట.ఈ క్రమంలోనే గతంలో ఈ కేసులు పెట్టిన సిఐడి అదికారులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు.వారిప వేర్వేరు కేసులు పెట్టి , సస్పెండ్ చేస్తున్నారు.ఇది మంచి పరిణామం అవుతుందా?అన్నది చర్చ. ఒకవేళ ఈ ప్రభుత్వం మారి భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం వస్తే అప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగితే, ఇప్పుడు ఈప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహించారని అనేక మంది పోలీసు లేదా,ఇతర శాఖల అధికారులపై చర్యలు ఉండవా?అంటే కచ్చితంగా ఉంటాయని చెప్పాలి. రాజకీయాలలో టిట్ ఫర్ టాట్ అన్నది ఒక నానుడి. కాని ఈలోగా వ్యవస్థకు జరగాల్సి డామేజి జరిగిపోతుంది. అంతేకాదు.ఏకంగా ఏపీలో అయితే చంద్రబాబు కేసులు ఉన్న ఒక న్యాయమూర్తి ఇంటి వద్ద ఇంటెలెజెన్స్ అదికారులు కొందరు నిఘా పెట్టారట.ఈ విషయాన్ని ఆ జడ్జిగారే స్వయంగా కోర్టులో పోలీస అధికారులను ప్రశ్నించారు.ఇది చాలా సంచలన విషయం. అయినా ఎల్లో మీడియా ఇలాంటివాటిని కప్పిపెడుతోంది.గతంలో జయలలితపై కేసులు వచ్చాయి. అంతలో ఆమె ముఖ్యమమంత్రి అయ్యారు.తదుపరి ఆ కేసులను కర్నాటక రాష్ట్ర హైకోర్టుకు బదలీ చేశారు.చంద్రబాబు పై ఉన్న కేసులను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్ కూడా పడింది. కాని అది ఇంకా విచారణకు వచ్చినట్లు లేదు.పెద్ద నాయకులపై అవినీతి కేసులు వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా వ్యవస్థలు తయారు కాకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారుతుంది. తమకు ఇష్టం లేని నేతలపై కేసులు పెట్టడం, తమకు సరెండర్ అయిపోతే వాటిని పక్కనవేయడం, లేదా వారి మెడపై కత్తిమాదిరి వేలాడదీసినట్లు ఉంచడం.. ఇవి ఆయా వ్యవస్థల జవాబుదారితనాన్ని దెబ్బతీస్తాయి. గతంలో వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారని ఆయనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టింది చూశాం. ఆ విషయాన్ని అప్పటి బీజేపీ నేత సుష్మ స్వరాజ్ పార్లమెంటులోనే వెల్లడించారు. ఇప్పుడు బీజేపీ కూడా అదే మాదిరి వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు కేసుల విషయంలో ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖ ఎందుకు స్పందించలేదు? కేటీఆర్ కేసులోనే ఈడీ ఎందుకు అతిగా రియాక్ట్ అయింది? తాజాగా కాకినాడ సీపోర్టు షేర్ల బదలాయింపు విషయంలో కూడా ఈడీ ఇలాగే వేగంగా స్పందించడం గమనార్హం. ఈడీ తన బాద్యత నిర్వహిస్తే తప్పుకాదు. కాని కొందరి విషయంలోనే చేస్తే అది సంస్థ నిష్పక్షపాతం పై మరక పడుతుంది. పలుకుబడి, పరపతితో పాటు, మేనేజ్ మెంట్ స్కిల్ లేకపోతే నేతలకు ఇలాంటి చిక్కులు వస్తాయా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో నేడో రేపో కేటీఆర్‌కు ఏసీబీ సమన్లు.. అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా నోటీసులు ఇవ్వనున్న అధికారులు
-
కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు
-
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ(ACB) అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు అందాయి. దీంతో ఫిర్యాదుదారుడు దాన కిషోర్‌ను ఏడు గంటలపాటు ఏసీబీ ప్రశ్నించి..స్టేట్మెంట్ నమోదు చేసింది. ఇక.. స్టేట్మెంట్ ఆధారంగా మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ ఈ కేసులో విచారణ మొదలుపెట్టనుంది. త్వరలో కేటీఆర్(KTR), అరవింద్ కుమార్‌లకు నోటీసులు జారీ చేయనుంది. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగానే ఈ ఇద్దరినీ ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే ఆయన నుంచి తీసుకున్నన్న డాక్యుమెంట్లను వాళ్ల ముందు ఉంచే అవకాశం ఉంది. ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే దానకిషోర్ తెలంగాణ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే.. హెచ్ఎండీఏ నుంచి డబ్బు బదిలీ అయినట్లు ప్రభుత్వానికి తెలిపారాయన. ఏ1గా కేటీఆర్ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఇప్పటికే కేసు నమోదైంది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. అందులో భాగంగా ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాల్సిందిగా అవినీతి నిరోధక శాఖ(ACB)కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి లేఖ రాశారు.ఫార్ములా రేసు పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ(HMDA) ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండా రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్‌కు ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో కేటీఆర్‌తోపాటు పురపాలకశాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, చీఫ్ ఇంజినీర్‌ను బాధ్యులుగా పేర్కొన్నారు.ప్రధాన అభియోగం ఇదే.. ఫార్ములా-ఈ ఆపరేషన్స్, ఎస్ నెక్ట్స్ జెన్, పురపాలకశాఖల మధ్య 9, 10, 11, 12వ సీజన్ల కార్ రేస్‌లు నిర్వహించేలా ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్‌రోడ్డులో తొమ్మిదో సీజన్ రేసింగ్ నిర్వహించారు. ‘‘అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదంతోనే ఒప్పందం కుదిరింది. శాఖాధిపతిగా ఎంవోయూ చేశా’’ అని ఒప్పందంపై ఐఏఎస్ అర్వింద్ కుమార్ సీఎస్‌కు సమాధానమిచ్చారు. ఈ రేసు నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా రూ.55 కోట్లు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా రూ.46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం.నెక్స్ట్ ఏంటంటే.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు భావించిన, అనుమానించిన వారందరికీ ఏసీబీ నోటీసులు ఇవ్వనుంది. వారిని విచారించి, వాంగ్మూలాలను నమోదు చేస్తుంది. అధికార దుర్వినియోగం జరిగినట్లు తేలితే సంబంధిత ఆధారాలను సేకరిస్తుంది. ముఖ్యంగా ఇందులో నిధుల మళ్లింపు కోణం ఏమైనా ఉందా...? అనే అంశంపై ఎక్కువ దృష్టి సారించనుంది. ఫార్ములా సంస్థకు చెల్లించిన రూ.55 కోట్లు ఎక్కడెక్కడి నుంచి చివరికి ఎవరి ఖాతాలోకి వెళ్లాయనే కోణంలోనూ పరిశీలించే అవకాశముంది. అధికార దుర్వినియోగంపై ప్రాథమిక ఆధారాలు లభిస్తే... అందుకు బాధ్యులైన వారి అరెస్టు తప్పకపోవచ్చు. అదే జరిగితే ఆ వ్యవహారం సంచలనాత్మకంగా మారడం ఖాయం.ఇదీ చదవండి: విభజన సమస్యల పరిష్కారం మరింత జఠిలం! -
Formula E race case : టార్గెట్ కేటీఆర్.. ఎందుకంటే..?
సాక్షి,తెలంగాణ భవన్: ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కుట్ర జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తెలంగాణ భవన్లో కవిత మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్, బీజేపీలు బాయ్ బాయ్ అని కేటీఆర్ కేసుతో రుజువైంది. ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ.. నడుపుతున్నది బీజేపీ వాళ్ళు. గతంలో ఏ కేసులో కూడా ఇంత త్వరగా ఈడీ కేసు నమోదు చేయలేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలిశాకనే ఫార్ములా కేసు నమోదు చేశారు. ఫార్ములా రేసు కేసును.. రాజ్ భవన్ నుంచి నడిపించారు. ప్రాంతీయ పార్టీలు ఉండకూడదని కాంగ్రెస్, బీజేపీల ప్లాన్’ అని ధ్వజమెత్తారు. -
ఫార్ములా ఈ-కేసు..డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా ఈ కార్ రేసుల కేసుపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు. ఈ విషయమై డీకే అరుణ సోమవారం(డిసెంబర్23) సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసుకు బీజేపీకి సంబంధం ఏంటి ?ఈ కార్ రేసుల కేసులో ఈడీ తన పని తాను చేస్తోంది. హీరో అల్లు అర్జున్ విషయాన్ని రాజకీయంగా కావాలని రచ్చ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నా. ఈ విషయంలో ఎంఐఎం,కాంగ్రెస్ ఒక్కటై అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీతో సీఎం రేవంత్‌రెడ్డి కావాలని ప్రశ్న అడిగించారు’అని డీకే అరుణ చెప్పారు. ఇదీ చదవండి: కేటీఆర్‌కు త్వరలో నోటీసులు..? -
ఈ-ఫార్ములా కేసు కేటీఆర్ మెడకు చుట్టుకునేనా?
తెలంగాణ మాజీ మంత్రి, భారత రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై కేసు నమోదు కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఫార్ములా ఈరేసు నిర్వహణలో నిధులు దుర్వినియోగంపై పెట్టిన ఈ కేసు సమంజసమేనా? దీని ద్వారా కేటీఆర్ చిక్కుల్లో పడతారా? లేక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా? తెలంగాణలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం తర్వాత కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ అయింది. మంత్రి హోదాలో కేటీఆర్ నిధుల దుర్వినయోగానికి పాల్పడ్డారన్నది అభియోగం. ఆ మేరకు ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు పెట్టారు. ఇద్దరు సీనియర్ అధికారులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై కూడా కేసు నమోదైంది. కొన్ని నెలల కిందట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబు పేలబోతోందని ప్రకటిస్తే, రకరకాల ఊహాగానాలు సాగాయి. కేటీఆర్‌పై కేసు ఆ బాంబు అని అనుకోవాలిప్పుడు. అధికారం పోయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం తర్వాత తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అవడం పార్టీని ఇబ్బంది పెట్టింది. ఇదే టైమ్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం వంటి వాటిపై రేవంత్ సర్కార్ విచారణ సంఘాలను వేసింది. వీటిలో కాళేశ్వరం విచారణ తీవ్రమైందనే చెప్పాలి. పలువురు ఐఎఎస్, ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికే సాక్ష్యాలు చెప్పారు. కేబినెట్ తో సంబంధం లేకుండా, డిజైన్ల ఆమోదం లేకుండా గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు బారేజీలు నిర్మించారన్నది ఆరోపణ. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో కేసీఆర్ ప్రభుత్వానికి సమస్యలు ఆరంభం అయ్యాయి. రేవంత్ ముఖ్యమంత్రి కాగానే దానిపై విచారణకు ఆదేశించి ఒక రిటైర్డ్ జడ్జిని కూడా నియమించారు. ఈ విచారణ క్రమంలో కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు కూడా విచారణకు హాజరవుతారా? లేదా? అన్న మీమాంస నెలకొంది. ఇవి ఇలా ఉండగా, తాజాగా అవుటర్ రింగ్ రోడ్డు టోల్ వసూలు కాంట్రాక్ట్ టెండర్ల వ్యవహారంపై కూడా రేవంత్ విచారణకు సిట్ ను నియమించారు.ఇప్పటికే ఫోన్ టాపింగ్ కేసులో కొందరు అధికారులు అరెస్టు అయ్యారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లను ఏదో కేసులో ఇబ్బంది పెడతారని అంతా ఊహించిందే. నిజంగా వాటిలో తప్పులు జరిగి ఉంటే వారు కేసులు ఎదుర్కోక తప్పదు. కానీ కావాలని వేధించేందుకు కేసులు పెడుతున్నారని, తాము ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇలాంటి కక్ష సాధింపులకు దిగుతోందని జనం భావిస్తే అది కాంగ్రెస్‌కు చేటు. ఇంతకుముందు లగచర్ల దాడి కేసులో కూడా కేటీఆర్ పేరును ఇరికించాలని ప్రభుత్వం చూసింది. కేసీఆర్ శాసనసభకు రాకపోయినా, కేటీఆర్, హరీష్ రావులు సభలో కాని, బయట కాని గట్టిగానే పోరాడుతున్నారు. వారిని వీక్ చేయడానికి సహజంగానే కాంగ్రెస్ ప్రయత్నాలు ఉంటాయని. ఇది సహజం. కేటీఆర్‌పై పెట్టిన కేసు డైవర్షన్ రాజకీయాలలో భాగమేనని బీఆర్ఎస్ విమర్శిస్తుండగా, ప్రజాధనం దుర్వినియోగమైతే చూస్తూ ఊరుకోవాలా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఏసీబీ తనపై కేసు పెట్టగానే కేటీఆర్ మీడియా సమావేశం పెట్టి పలు విషయాలు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఒక కేసు వస్తే, అందులో తనదే బాధ్యత అని ఎవరూ ధైర్యంగా చెప్పడం జరగలేదు. కాని కేటీఆర్ పూర్తిగా బాధ్యత తీసుకుని కేవలం హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి చేసిన ప్రయత్నంలో ఈ ఫార్ములా రేస్ సంస్థకు డబ్బులు చెల్లించామని స్పష్టంగా తెలిపారు. ఈ డబ్బుల చెల్లింపులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, కేబినెట్ ఆమోదం లేకుండా రూ.55 కోట్లు చెల్లించారని, అది కూడా ఆర్బీఐ అనుమతులు తీసుకోకుండా, విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించారని రాష్ట్రానికి రూ. ఎనిమిది కోట్ల జరిమానా విధించిందని కాంగ్రెస్ చెబుతోంది. హైదరాబాద్ మెట్రో అభివృద్ది సంస్థ కు స్వతంత్రంగా నిధులు వినియోగించే స్వేచ్ఛ ఉంటుందని, అందులో ఇలాంటి క్రీడల ఏర్పాట్లకు నిధులు వెచ్చిండానికి ఆ సంస్థకు పవర్ ఉందని కేటీఆర్ చెబుతున్నారు. అసలు ఈ ఫార్ములా రేసింగ్ సంస్థకు మొత్తం డబ్బు చెల్లిస్తే అందులో అవినీతి ఏమి ఉంటుందని అంటున్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్దమని ఆయన సవాల్ విసిరారు. సభలో చర్చ జరగలేదు కాని, రేవంత్ మాత్రం దీని గురించి ప్రభుత్వ వాదనను వివరించారు. ఈ ఫార్ములా సంస్థ కో ఫౌండర్ ఒకసారి రేవంత్ ను కలిసివెళ్లిన విషయాన్ని కేటీఆర్ బయటపెట్టారు. దీనికి రేవంత్ బదులు ఇస్తూ, ఆ సంస్థ వారే కేటీఆర్‌తో రహస్య అవగాహన ఉందని తనకు చెప్పారని, ఈ స్కామ్ రూ.55 కోట్లు కాదని, రూ.600 కోట్లు అని సంచలనాత్మకంగా వెల్లడించారు. కాగా తదుపరి వాయిదా మొత్తం చెల్లించనందుకు గాను ప్రభుత్వానికి ఈ ఫార్ములా సంస్థ నోటీసు ఇచ్చిందని కేటీఆర్ అంటున్నారు. అంతేకాక తమతో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నందుకు గాను ఆర్బిట్రేషన్ నిమిత్తం సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేని ఆ సంస్థ నియమించుకుందని చెప్పారు. హైదరాబాద్ ఈ ఫార్ములా రేస్ నిర్వహించడం ద్వారా ప్రపంచం దృష్టిని తెలంగాణ ఆకర్షించిందని, సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులు రావడానికి, మరికొంతమంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావడానికి దోహద పడిందన్నది ఆయన వాదన. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ ఇమేజీని డామేజి చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫార్ములా ఒన్ రేస్ నిర్వహించడానికి ప్రయత్నాలు జరిగాయి కాని సఫలం కాలేదని ఆయన గుర్తు చేశారు. కాని తాము తీసుకు వచ్చి దేశానికి, తెలంగాణకు గుర్తింపు తెచ్చామని, దీనికి సంతోషించవలసింది పోయి కేసు పెడతారా అని మండిపడ్డారు. ఈ మొత్తం విషయాన్ని పరిశీలించిన తర్వాత, కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతులు విన్నాక కేటీఆర్ పెద్ద తప్పు చేయలేదేమో అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగి ఉంటే అది ప్రొసీజరల్ లోపాలు కావచ్చు అన్న భావన కలుగుతుంది. మరి దీనికి గవర్నర్ అనుమతి కూడా ఉంది కదా అని ప్రభుత్వం చెప్పవచ్చు. గవర్నర్‌కు అన్ని వివరాలు ఇవ్వకుండా తప్పుదారి పట్టించారని కేటీఆర్ ఆరోపణ. హెచ్ఎండీఏ నిధులు జాతీయ బ్యాంకు అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఉన్నాయి. కేటీఆర్ ఆదేశాల మేరకే మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ఆ నిధులను ఈ ఫార్ములా సంస్థకు పంపించే ఏర్పాట్లు చేశారు. దీనికి కేబినెట్ ఆమోదం తీసుకోకపోవడానికి కారణం అప్పట్లో ఎన్నికల హడావుడి, ఎన్నికల కోడ్ ఉండడమని చెబుతున్నారు. ఈ ఫార్ములా రేసింగ్ జరిగింది వాస్తవం, ఆ సంస్థకు డబ్బు చెల్లించింది నిజం. కాకపోతే ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదన్నది సందేహం. దానిపై బ్యాంకు అధికారులు కాని, ప్రభుత్వ అదికారులు కాని వివరణ ఇవ్వవలసి ఉంటుంది. అయినా కేటీఆర్ సంబంధిత ఫైల్ ను సీఎం ఆమోదానికి పంపి ఉంటే ఈ గొడవ ఉండేది కాదేమో! కాని ఆ రోజుల్లో ఆయన తిరుగులేని అధికారాన్ని ఎంజాయ్ చేసేవారు.మళ్లీ గెలుస్తామన్న ధీమాతో ఈ డబ్బు మంజూరు చేయించారు. కాని కథ మారింది. బీఆర్ఎస్ ఓటమిపాలు కావడంతో ఇప్పుడు ఇది మెడకు చుట్టుకుంది. అయినా కేటీఆర్‌కు ఈ సందర్భంలో పెద్ద రోల్ ఉండకపోవచ్చు. విధాన పరమైన నిర్ణయం చేశారు.అలా చేయవచ్చా? లేదా? అన్నది ఒక కోణం. ఒకవేళ అది తప్పని తేలితే కేటీఆర్ కూడా ఇబ్బంది పడతారు. ఈ కేసు నమోదైన వెంటనే ఈడీ కూడా రంగంలో దిగడం కేటీఆర్‌కు కాస్త ఆందోళన కలిగించే అంశమే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించి పది రోజులపాటు అరెస్టు కాకుండా రక్షణ పొందారు. ఏపీలో 201419 టరమ్ లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగింది. దానిని తొలుత ఈడీ గుర్తించింది. తదుపరి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వంలో సిఐడి అన్ని ఆధారాలు సేకరించి ఆ స్కామ్ డబ్బు షెల్ కంపెనీలకు ఎలా వెళ్లింది.. చివరికి టిడిపి ఆఫీస్ ఖాతాలోకి కూడా చేరింది వివరిస్తూ కేసు పెట్టారు. ఆ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లవలసి వచ్చింది. అయినా చంద్రబాబు తాను తప్పు చేయలేదని వాదించారు. అంతేకాక ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఈ విషయాలన్నిటిని పక్కనబెట్టి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ప్రచారం చేసింది. కేటీఆర్ కేసులో డబ్బు మనీ లాండరింగ్ అయినట్లు కనిపించడం లేదు. అయినా ఈడీ రంగంలోకి రావడం తో ఏమైనా అలాంటి నేరం జరిగిందా అన్న డౌటు వస్తుంది. ఈ కేసులో కేటీఆర్ అవినీతి చేశారని రుజువు చేయడం ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. ఇంకో సంగతి కూడా చెప్పాలి. చంద్రబాబు 2004 కి ముందు ఆపధ్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్‌తో సంబంధం లేకుండా ఐఎమ్ జి భరత్ అనే సంస్థకు హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన సుమారు 800 ఎకరాల భూమిని స్టేడియంల నిర్మాణానికి కేటాయించడం వివాదం అయింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ ఆర్ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. అయినా ఆ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఇప్పటికీ ఆ కేసు పరిష్కారం కాలేదు. అలాంటప్పుడు కేటీఆర్ ను ఈ కేసు ఇబ్బంది పెడుతుందా అన్నది డౌటు. ఒకవేళ హైకోర్టు స్టే తొలగిపోయి కేటీఆర్‌ను అరెస్టు చేసినా, కొద్ది రోజులపాటు జైలులో ఉండాల్సి రావచ్చు తప్ప పెద్దగా జరిగేదేమి ఉండకపోవచ్చు. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ గట్టెక్కుతారా? లేదా అన్నది ఒక పాయింట్ అయితే రేవంత్ ప్రభుత్వం తనది పై చేయిగా రుజువు చేసుకుంటుందా? లేక సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా అన్నది మరో అంశం. కేటీఆర్ తప్పు చేసినట్లు రుజువు చేసి శిక్షపడేలా చేయగలిగితే అప్పుడు కాంగ్రెస్ కు ఏదైనా ప్రయోజనం చేకూరవచ్చు. అంతవరకు కేటీఆర్‌కు, బీఆర్ఎస్కూ సానుభూతే రావచ్చన్నది ఎక్కువ మంది విశ్లేషణగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా ఈ కేసుల వివాదాలు ఎలా ఉన్నా, ఈ పరిణామాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి కొంత నష్టం చేస్తున్నాయన్నది వాస్తవం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఫార్ములా-ఈ కేసు.. కేటీఆర్‌కు త్వరలో ఏసీబీ నోటీసులు..!
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ,ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్,ఐఏఎస్ అరవింద్ కుమార్,హెచ్ఎండీఏ మాజీ సీఈ బిఎల్ఎన్ రెడ్డిలకు ఏసీబీ నోటిసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా,ఏసీబీ కేసు ఆధారంగా ఇప్పటికే ఈడీ మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.కేసులో మనీలాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కంపెనీలు, రూ.55కోట్ల లావాదేవీలు,స్పాన్సర్స్ షిప్ కంపెనీ వివరాలను ఈడీ సేకరిస్తోంది. ఈడీ కేసులో కూడా కేటీఆర్‌తో సహా ఇతర నిందితులకు త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేసుల్లో నిధుల గోల్మాల్ జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ ఏ1గా చేర్చింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కేటీఆర్‌ను డిసెంబర్ 30 దాకా అరెస్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించింది. విచారణ కొనసాగించవద్దని ఏసీబీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. -
ఫార్ములా కారు కేసులో ఈడీ, ఏసీబీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేస్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కోర్టును ఆశ్రయించడం కేసు తీవ్రతను మరింత పెంచింది.మరోవైపు.. ఈకేసులోకి ఈడీ ఎంటర్ కావడం ఆసక్తికరంగా మారింది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌పై ఈడీ ఈసీఐర్ నమోదు చేసింది. ఇందులో భాగంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సెక్షన్లు నమోదు చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ అధికారులు.. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు కేసుల వివరాల కోసం ఏసీబీకి ఈడీ లేఖ రాసింది.ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. నేడు ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డు చేయనున్నారు. హెచ్ఎండీఏ, ఏంఏయూడీలోని మరి కొంత మందిని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఇదే సమయంలో ఫార్ములా ఈ-కారు రేసుకు సంబంధించిన ప్రతీ డాక్యుమెంట్‌ను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. ఎఫ్ఈవో నుంచి వచ్చిన ఈ-మెయిల్స్, ఎల్ఎఫ్ఏతో పాటు లావాదేవీల వివరాలు కూడా ఏసీబీ పరిశీలించనుంది. ఈ క్రమంలోనే నిందితులను ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. -
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఈడీ దూకుడు
-
‘ఫార్ములా-ఈ’ కార్ల రేసింగ్ వ్యవహారంపై చర్చకు సిద్ధంగా ఉన్నాం.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
-
అట్టుడికిన అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ‘ఫార్ములా–ఈ’రేసుపై ఏసీబీ కేసు మీద చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టడం, స్పీకర్ అంగీకరించకపోవడంతో నిరసనకు దిగడం, స్పీకర్ పోడియంను ముట్టడించే క్రమంలో వారికి మార్షల్స్‌కు మధ్య తోపులాట జరగడం, కాంగ్రెస్ సభ్యులు కూడా ఢీ అంటే ఢీ అన్నట్టు సిద్ధమవటంతో కొద్దిసేపు తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమయ్యాక కూడా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు.తొలుత ఏసీబీ కేసుపై చర్చించాల్సిందే: హరీశ్‌రావు శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే భూ భారతి బిల్లు పై చర్చను ప్రారంభించేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సిద్ధమయ్యారు. అయితే బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్‌రావు జోక్యం చేసుకుని ముందుగా ఫార్ములా–ఈ రేస్ విషయంలో ఏసీబీ కేసుపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ వెంటనే చర్చించలేని పక్షంలో ఎప్పుడు చర్చకు అనుమతిస్తారో ప్రకటించాలని కోరారు. ముందైతే భూ భారతి బిల్లుపై చర్చను కొనసాగిద్దామని, ఆ తర్వాత ఈ ఫార్ములా రేస్ అంశంపై చూద్దామని స్పీకర్ పేర్కొనగా.. హరీశ్‌రావు అభ్యంతరం చెప్పారు. ఆ సభ్యుడికి అవకాశం ఇవ్వాలి కదా.. ‘కేటీఆర్‌పై పెట్టింది అక్రమ కేసు కాకుంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ సభలో ఈ–కార్ రేసింగ్ అంశంపై చర్చించాలని కోరుతున్నా. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఓ సభ్యుడిపై అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా.. ఆయనకు చెప్పుకునే అవకాశం ఇస్తే ఆ కేసులో ఆయనది తప్పా, ఒప్పా అన్న విషయంలో ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు కూడా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముమ్మాటికీ అక్రమ కేసు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల గురించి, లగచర్ల అంశం గురించి ప్రశి్నస్తున్నాడు గనుకనే కేటీఆర్‌ను వేధించే క్రమంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు పెట్టారు..’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. భూ భారతి రాష్ట్రానికి సంబంధించిన అంశం: స్పీకర్ స్పీకర్ స్పందిస్తూ..‘శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి సభలో లేరు. ఆయన వచ్చిన తర్వాత మీ వినతిపై నిర్ణయం తీసుకుంటాం. ముందైతే భూ భారతి మీద చర్చను కొనసాగిద్దాం..’అని అన్నారు. అయినా హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ సభ్యులు ముందు వరసలోకి వచ్చి ఫార్ములా–ఈ రేసుపై చర్చకు పట్టుబట్టారు. దీంతో ‘భూ భారతి రాష్ట్రానికి సంబంధించిన అంశం. మీరు అడుగుతోంది ఓ సభ్యుడికి సంబంధించింది.ముందు భూ భారతిపై చర్చ జరుపుదాం..’అని స్పీకర్ మరోసారి కోరారు. కానీ బీఆర్ఎస్ సభ్యులు పట్టువీడలేదు. కాంగ్రెస్ సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి లేచి, ఈ–కార్ రేసింగ్‌పై విచారణకు గవర్నర్ అనుమతిచ్చాక, ఏసీబీ కేసు పెట్టిన తర్వాత శాసనసభలో దానిపై చర్చించే అంశమే ఉత్పన్నం కాదని, ప్రజల్లో ఓ అయోమయాన్ని సృష్టించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. అనంతరం భూ భారతి బిల్లుపై స్పీకర్ చర్చ ప్రారంభించారు. స్పీకర్‌పైకి ప్లకార్డు ముక్కలు, కాగితాలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చను ప్రారంభిస్తూ.. భూ భారతి చట్టం తేవాలనుకోవటానికి గల కారణాలను వివరించటం ప్రారంభించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు వెల్‌లోకి వచ్చి, ఈ–కార్ రేస్‌పై పెట్టిన కేసు కక్షపూరితమైందని పేర్కొనే ప్లకార్డులు పట్టుకుని నినాదాలివ్వటం ప్రా రంభించారు. తర్వాత స్పీకర్ పోడియం దగ్గర గుమిగూడారు. మార్షల్స్‌ను తోసుకుంటూ పోడియంను ముట్టడించారు.ఈ క్రమంలో మార్షల్స్‌కు, బీఆర్ఎస్ సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. ఇంతలో మరికొందరు మార్షల్స్ అక్కడికి చేరుకుని బీఆర్ఎస్ సభ్యులను పోడియంకు దూరంగా నెట్టుకుంటూ తీసుకెళ్లారు. ఆ సమయంలో బీఆర్ఎస్ సభ్యుడు కౌశిక్‌రెడ్డి తన చేతిలోనే ప్లకార్డును ముక్కలు చేసి స్పీకర్‌పైకి విసిరారు. మరికొందరు సభ్యులు, అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన కాగితాలను పోడియం పైకి విసిరారు. బీఆర్ఎస్ సభ్యుడొకరు మంత్రి పొంగులేటి వైపు దూసుకు రావడంతో కొందరు కాంగ్రెస్ సభ్యులు ఆయనకు రక్షణగా నిలబడ్డారు. బీఆర్ఎస్ సభ్యులపైకి కాగితాలు ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సభ్యులు కొందరు ముందు వరసలోకి వచ్చి కాగితాలను బీఆర్ఎస్ సభ్యులపైకి విసిరారు. పరిస్థితి చేయిదాటేలా ఉండటంతో స్పీకర్ సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. స్పీకర్ చాంబర్లో దీనిపై కాంగ్రెస్ సభ్యులు ఆయనతో చర్చించారు. 35 నిమిషాల తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగా.. మంత్రి పొంగులేటి ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే ఆయన మాట్లాడుతున్నంత సేపు బీఆర్ఎస్ సభ్యులు వెల్‌లో నినాదాలిస్తూ నిరసన తెలుపుతూనే ఉన్నారు.చర్చకు సహకరించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కోరినా బీఆర్ఎస్ సభ్యులు పట్టువీడలేదు. చర్చలో భాగంగా బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చిన స్పీకర్, ఆ పార్టీ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డిని మాట్లాడాల్సిందిగా సూచించినా.. ఆయన నిరసనలోనే ఉండి మాట్లాడ్డానికి రాలేదు. దీంతో బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. అయినా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. దీంతో చాంబర్‌కు వస్తే మాట్లాడదామని వారికి చెప్పిన స్పీకర్ సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం తర్వాతా కొనసాగిన ఆందోళన మధ్యాహ్నం తర్వాత సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ పోడియం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు ముందుకు దూసుకువస్తుండడంతో మహిళా మార్షల్స్‌ను వారికి అడ్డుగా నిలబెట్టి నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ గందరగోళంలోనే మహేశ్వర్‌రెడ్డి భూభారతి బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు.మహేశ్వర్‌రెడ్డి, ఆ తర్వాత మంత్రి పొంగులేటి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్లు మాట్లాడుతున్నంత సేపు నినాదాలు చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు నిరసన కొనసాగించినా స్పీకర్ పట్టించుకోక పోవడం, అధికార పక్షం స్పందించకపోవడం, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక వ్యక్తి కోసం తాపత్రయపడుతున్నారంటూ వ్యాఖ్యానించడంతో సభ నుంచి ని్రష్కమించారు. ఆ సమయంలో మాట్లాడుతున్న అక్బరుద్దీన్..‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయి వెళ్లిపోతున్నారు.’అని వ్యాఖ్యానించారు. మండలిలో వాయిదాల పర్వం శాసనమండలిలో శుక్రవారం వాయిదాల పర్వం కొనసాగింది. శుక్రవారం ఉదయం మండలి ప్రారంభం కాగానే ఫార్ములా ఈ–రేస్ విషయంలో ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. మధుసుదనాచారి, సత్యవతి రాథోడ్, కవిత, వాణీదేవి తదితరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ ముందుకు సాగనీయకుండా అడ్డుకున్నారు. చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎదుటకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు.కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో చైర్మన్ స్వల్ప విరామం ఇస్తూ సభను వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభం కాగా.. బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో చైర్మన్ భోజన విరామం కోసం వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైనప్పుడు కూడా అదే వాతావరణం నెలకొనడంతో శనివారం ఉదయానికి వాయిదా వేశారు. -
‘ఫార్ములా–ఈ’లో అణా పైసా అవినీతి లేదు
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’కార్ల రేసు విషయంలో అణాపైసా అవినీతి జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ చేపట్టే పనులకు ప్రభుత్వ అనుమతులు అవసరం లేదని... హైదరాబాద్ నగర అభివృద్ధికి దోహదం చేసే ఏ కార్యక్రమం కోసమైనా ఖర్చు చేసే స్వాతంత్య్రం హెచ్ఎండీఏకు ఉందని చెప్పారు. ఫార్ములా–ఈ రేస్‌లో ఎలాంటి అవినీతి జరగలేదనే అంశం మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలతో బయటపడిందని... ఈ అంశంపై కొందరు ఉన్మాదులు తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ శుక్రవారం శాసనసభ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు లీజు విషయంలో కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటికే అమల్లో ఉన్న ‘టీఓటీ’విధానంలోనే ఔటర్ రింగ్ రోడ్డు లీజు ద్వారా నిధులు సేకరించామని.. ఆ నిధులను రైతుల రుణమాఫీ కోసం వినియోగించామని తెలిపారు.కేబినెట్ సబ్ కమిటీ సూచనలతోనే.. ‘‘ఆర్థిక వనరుల సమీకరణపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం అనేక సూచనలు చేసింది. అందులో భాగంగానే ఓఆర్ఆర్ లీజు కూడా ఉంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) కూడా ఇదే విధానంలో జాతీయ రహదారుల నుంచి డబ్బులు సేకరిస్తోంది. ప్రైవేటు కంపెనీకి లబ్ధి జరిగిందని ఆరోపిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. లీజు ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయడం లేదు? ఓఆర్ఆర్ లీజులో రూ.లక్ష కోట్లు అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్నపుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దీంతో హెచ్ఎండీఏ రేవంత్‌రెడ్డిపై వేసిన పరువు నష్టం కేసు ఇంకా కొనసాగుతోంది..’’అని కేటీఆర్ చెప్పారు. ఓఆర్ఆర్ లీజుపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి మున్సిపల్, హోం శాఖలను నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి... తన కింద పనిచేసే అధికారులతో ప్రత్యేక విచారణ బృందం (సిట్) వేసి దర్యాప్తు చేస్తే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని కేటీఆర్ ప్రశ్నించారు. ఓఆర్ఆర్ లీజును రద్దు చేసి, సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటయ్యే విచారణ సంస్థతో జాతీయ రహదారుల లీజు విధానాలను అధ్యయనం చేయించాలన్నారు. లేని పక్షంలో ఇది మరో రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ప్రజలు భావిస్తారని పేర్కొన్నారు. కోకాపేటలోని విలువై న ప్రభుత్వ భూమిని టీజీఐఐసీకి విక్రయించి రూ.10 వేల కోట్లు సేకరించే ప్రక్రియను ప్రభు త్వం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల రెండు రోజుల పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చారని.. అది స్పీకర్‌పై, ప్రతిపక్ష సభ్యులపై వాటర్ బాటిళ్లు విసరడంలో శిక్షణ ఇచ్చారా? అని విమర్శించారు. స్పీకర్‌ను పదే పదే దళితుడు అంటూ ఆయన గౌరవాన్ని అధికార పక్షం తక్కువ చేస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
అసెంబ్లీలో రేవంత్‌వన్నీ అబద్ధాలే
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా – ఈ కార్ రేస్ అంశంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో హైకోర్టు ఇచి్చన తీర్పుతో తొలి అడుగులోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నైతిక విజయం సాధించారని ఆ పార్టీ నేత హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు, గోబెల్స్ ప్రచారమని హైకోర్టు తీర్పుతో స్పష్టమైందని తెలిపారు. రేస్ నిర్వహణ సంస్థకు ప్రభుత్వం రూ.47 కోట్లు చెల్లిస్తే.. రూ.600 కోట్లు నష్టం అంటూ సీఎం అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. రేవంత్ తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రానికి రూ.700 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు.తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ అబద్ధాలతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారని విమర్శించారు. ఫార్ములా – ఈ రేస్ అంశంలో ప్రొసీజర్ ల్యాప్స్ జరిగి ఉండవచ్చు కానీ అక్రమాలు జరగలేదని స్పష్టంచేశారు. ప్రశ్నిస్తే అరెస్టులు, నిర్బంధాలు కాంగ్రెస్ చేతికి అధికారం వచ్చి ఏడాదైనా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని హరీశ్‌రావు అన్నారు. ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, నిర్బంధాలతో ప్రభుత్వం అణచివేస్తోందని విమర్శించారు. ‘సీఎం రేవంత్, ఆయన సోదరులు, అల్లుడు, బావమరిది అవినీతి బండారాన్ని కేటీఆర్ క్రమ పద్ధతిలో బయట పెడుతున్నారు. ఫోర్త్ సిటీ, మూసీ సుందరీకరణ అంశాల్లో అవి నీతిని ప్రశ్నించడంతో కేటీఆర్‌ను జైలులో పెట్టే కుట్రకు తెరలేపారు. అరెస్టుల పేరిట నాయకులను భయభ్రాంతులకు గురిచేసే యోచనలో రేవంత్ ప్రభుత్వం ఉంది’అని మండిపడ్డారు. అక్రమ కేసులు బనాయించు, అబద్ధాలతో బుకాయించు అనే రీతిలో రేవంత్ పాలన ఉందని ధ్వజమెత్తారు. కేటీఆర్‌పై కేసు నమోదైన వెంటనే ఈడీ జోక్యం చేసుకోవడం బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు. -
ఫార్ములా–ఈ ఫైర్!
రాష్ట్రంలో ‘ఫార్ములా–ఈ’ కార్ల రేసు అంశం మంటలు రేపుతోంది. ఏసీబీ కేసు నమోదైన 24 గంటల్లోనే ఈడీ రంగంలోకి దిగడం, మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు కోసం ఈసీఐఆర్ నమోదు చేయడం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. ఈ వ్యవహారం అసెంబ్లీని కూడా అట్టుడికించింది. బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, అధికార కాంగ్రెస్ సభ్యుల విమర్శలతో సభ స్తంభించిపోయింది. ఫార్ములా–ఈ అంశంపై చర్చకు సిద్ధమని, సభలోనైనా సరే లేదా బీఆర్ఎస్ కార్యాలయానికి రమ్మన్నా సరే వస్తానంటూ సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసరగా.. కార్ల రేసు అంశంలో అణా పైసా అవినీతి జరగలేదని, కొందరు ఉన్మాదులు తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మరోవైపు ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ వ్యవహారంలో కేటీఆర్ ఏం లబ్ధి పొందారని ప్రశ్నించింది. ప్రాథమిక విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. అదే సమయంలో దర్యాప్తు కొనసాగించవచ్చని సూచించింది. దీనితో దూకుడు పెంచాలని నిర్ణయించిన ఏసీబీ.. అధికారులు, నిందితుల నుంచి వాంగ్మూలాలు తీసుకునేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇక ఈ అంశంలో రంగంలోకి దిగిన ఈడీ ... ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ‘ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు’ నమోదు చేసింది. ‘ఫార్ములా–ఈ’పై ఈడీ కేసు నమోదుసాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’కార్ల రేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఏసీబీ పెట్టిన కేసు ఆధారంగా ‘ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)’ను నమోదు చేసింది. హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నుంచి విదేశీ కంపెనీకి నిధుల చెల్లింపు అంశంలో రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) గురువారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ‘ఫార్ములా–ఈ’కారు రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్ఎండీఏ నుంచి పలు దఫాల్లో రూ.45,71,60,625 సొమ్మును యూకేకు చెందిన ‘ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ)’కు బదిలీ చేశారని పేర్కొంటూ.. మాజీ మంత్రి కేటీఆర్, మరో ఇద్దరు అధికారులను అందులో నిందితులుగా చేర్చారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా.. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో విచారణ కోసం ఈడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఈడీ హైదరాబాద్ జోనల్ జాయింట్ డైరెక్టర్ శుక్రవారం ఏసీబీ డీజీ విజయ్‌కుమార్‌కు లేఖ రాశారు. విదేశీ కంపెనీతో జరిగిన నగదు లావాదేవీలు, ఇతర వివరాలన్నీ తమకు ఇవ్వాలని కోరారు. ఏసీబీ నుంచి అందిన వివరాల ఆధారంగా.. మాజీ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈసీఐఆర్ నమోదు చేశారు. అన్ని అంశాలను పరిశీలించి ‘ఫారిన్ ఎక్ఛ్సేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)’కింద కూడా దర్యాప్తు కొనసాగే అవకాశం ఉన్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీ..‘ఫార్ములా–ఈ’వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో... ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన అభియోగాలకు సంబంధించిన ఆధారాల సేకరణ, నిందితులు, కేసుతో సంబంధం ఉన్న వారి వాంగ్మూలాల నమోదుపై దృష్టిపెట్టారు. తొలుత ఈ అంశంపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ నుంచి మరోమారు వివరాలు సేకరించనున్నారు. ఈ–కార్ రేసు నిర్వహణకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాలు, నిధుల చెల్లింపులు, ఇతర లావాదేవీల వివరాలు తీసుకోనున్నారు. హెచ్ఎండీఏ సాధారణ నిధుల నుంచి ఫార్ములా–ఈ రేసు నిర్వహణ కంపెనీ ‘ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ)’కు నిధుల చెల్లింపునకు సంబంధించి.. అధికారుల మధ్య సంప్రదింపుల ఫైళ్లను పరిశీలించనున్నారు. కీలక డాక్యుమెంట్ల సేకరణతోపాటు ఎప్పటికప్పుడు వాటిని విశ్లేషించేలా దర్యాప్తు బృందం సభ్యులకు విధులు అప్పగించారు. ఈ కేసును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ప్రధాన నిందితుడు కేటీఆర్ ప్రధాన ప్రతిపక్షంలోని కీలక వ్యక్తి కావడంతో ఏసీబీ ఉన్నతాధికారులు నేరుగా కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు చేపడుతున్నారు. కీలక ఆధారాల సేకరణ తర్వాత నిందితులకు నోటీసులు జారీ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈనెల 30 వరకు అరెస్టు వద్దుసాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావుకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ నెల 30వ తేదీ వరకు ఆయనను అరెస్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించింది. అయితే కేసు దర్యాప్తును కొనసాగించవచ్చని పేర్కొంది. అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, వివరాలు అందజేసి దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్ (కేటీఆర్)కు సూచించింది. ఈ పిటిషన్‌పై పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. లంచ్‌మోషన్ పిటిషన్ మేరకు.. ఫార్ములా–ఈ వ్యవహారంలో కేటీఆర్, ఇద్దరు అధికారులను నిందితులుగా చేరుస్తూ.. ఏసీబీ రెండు రోజుల క్రితం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ శుక్రవారం హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాప్రతినిధుల కేసులపై విచారణ చేపట్టాల్సిన రోస్టర్ న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ సెలవులో ఉండటంతో.. జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ వద్ద విచారణ చేపట్టాలని న్యాయవాదులు ప్రభాకర్‌రావు, గండ్ర మోహన్‌రావు కోరారు. దీనిపై సీజే బెంచ్ అనుమతితో మధ్యాహ్నం 3 గంటల సమయంలో జస్టిస్ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదు.. కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సి.ఆర్యామ సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘‘2023 అక్టోబర్‌లో జరిగిన ఘటనపై 14 నెలలు ఆలస్యంగా ఈ నెల 18న సాయంత్రం 5.30 గంటలకు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే అవినీతి నిరోధక (పీసీ) చట్టంలోని సెక్షన్ 13(1)( ్చ), 13(2) కింద కేసు పెట్టడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులపై ప్రాథమిక విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయవద్దని లలితాకుమారి, చరణ్‌సింగ్ కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని ఏసీబీ ఉల్లంఘించింది. ప్రొసీజర్ పాటించలేదు. ఎఫ్ఐఆర్ నమోదుకు 14 నెలలు ఎందుకు ఆగారో కారణాలు లేవు. నిందితులు వ్యక్తిగతంగా ఆర్థిక లబ్ధి పొందారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పకుండానే పీసీ యాక్ట్ సెక్షన్లు పెట్టారు..’’అని న్యాయమూర్తికి వివరించారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. 2022 అక్టోబర్ 25న ఫార్ములా–ఈ రేస్ నిర్వహణపై తొలి ఒప్పందం జరిగిందని.. 2023 అక్టోబర్‌లో నిధుల చెల్లింపు ఒప్పందం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని వివరించారు. నగదు చెల్లింపులో ప్రొసీజర్ పాటించలేదని ఏసీబీ పేర్కొనడం సరికాదని.. సీజన్ 9, 10, 11, 12 నిర్వహణ కోసం 2022లోనే ఒప్పందం కుదిరిందని తెలిపారు. సీజన్ 9 నిర్వహణతో దాదాపు రూ.700 కోట్లు లాభం వచ్చిందని.. గ్లోబల్ సిటీగా హైదరాబాద్‌ను నిలపడంలో ఫార్ములా–ఈ కీలక పాత్ర పోషించిందని, అంతర్జాతీయంగా పేరు వచ్చిందని వివరించారు. సీజన్ 10 నిర్వహణ నుంచి స్పాన్సర్ తప్పుకోవడంతో ప్రభుత్వమే ఆ బాధ్యతలు తీసుకుందని, అందులో భాగంగానే చెల్లింపులు జరిపిందని తెలిపారు. కానీ కొత్త ప్రభుత్వం ఒప్పందాన్ని ఉల్లంఘించి రేసింగ్‌ను రద్దు చేసిందని.. రద్దుపై ఆర్బిట్రేషన్‌కు కూడా వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. రేసింగ్ జరిగి ఉంటే పెద్ద ఎత్తున లాభాలు వచ్చేవని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చామని ఏసీబీ పేర్కొందని, కానీ ఆ సంస్థపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని గుర్తు చేశారు. ఫిర్యాదుకు ముందే ప్రాథమిక విచారణ జరిపాంప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘ఎఫ్ఐఆర్ అనేది ఎన్సైక్లోపీడియా కాదు. ఇది విచారణ ప్రారంభం మాత్రమే. అంతా ఎఫ్ఐఆర్లో ఉండదు. కొత్తగా నిందితులను చేర్చే అవకాశం ఉంటుంది. చార్జిషీట్లో మాత్రమే అన్ని వివరాలుంటాయి. ఫిర్యాదుకు ముందే ప్రాథమిక విచారణ జరిపాం. పిటిషనర్ ఎమ్మెల్యే కావడంతో గవర్నర్ నుంచి అనుమతి కూడా పొందాం. ఆ తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. 2023 అక్టోబర్ 30న రెండో ఒప్పందం జరిగింది. కానీ అక్టోబర్ 3న (రూ.22,69,63,125 ప్లస్ పన్నులు అదనం), 11న (రూ.23,01,97,500 ప్లస్ పన్నులు అదనం).. అంటే ముందుగానే మొత్తం రూ.56 కోట్లు చెల్లింపులు చేశారు. రూ.700 కోట్లు లాభాలు వచ్చి ఉంటే స్పాన్సర్ ఎందుకు వెళ్లిపోతారు?’’అని ప్రశ్నించారు. ఫార్ములా–ఈ సంస్థకు డబ్బును విదేశీ కరెన్సీలో చెల్లించారని, దానితో హెచ్ఎండీఏపై అధిక భారం పడిందని తెలిపారు. విదేశీ కరెన్సీలో చెల్లింపు కోసం రిజర్వుబ్యాంకు అనుమతి తీసుకోలేదని.. ఆర్థికశాఖ అనుమతి కూడా లేదని వివరించారు. క్వాష్ పిటిషన్‌పై ఇంత అత్యవసరంగా విచారణ అవసరం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కల్పించుకుని.. ‘‘పిటిషనర్ ఏం లబ్ధిపొందారు? ఎందుకు ఆ సెక్షన్లు పెట్టారు?’అని ప్రశ్నించారు. అదంతా దర్యాప్తులో తేలుతుందని ఏజీ బదులిచ్చారు. పిటిషనర్‌కు ఎలాంటి ఉపశమన ఆదేశాలు ఇవ్వొద్దని కోరారు.ఎఫ్ఐఆర్ నమోదులో లోటుపాట్లు కేటీఆర్ తరఫు న్యాయవాది ఆర్యామ సుందరం వాదిస్తూ.. ఫిర్యాదుకు ముందు విచారణ చేయడం కాదని, ఫిర్యాదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్కు ముందు ప్రాథమిక విచారణ చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని న్యాయమూర్తికి వివరించారు. ఫిర్యాదుకు ముందే విచారణ చేశామని, గవర్నర్ అనుమతి తీసుకున్నామని ఏజీ చెప్పడం సరికాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎఫ్ఐఆర్ నమోదులో లోటుపాట్లు ఉన్నాయని, ప్రాథమిక విచారణ కూడా చేయలేదని పేర్కొన్నారు. సీఆరీ్పసీ సెక్షన్ 482 మేరకు హైకోర్టుకు ఎఫ్ఐఆర్ను కొట్టివేసేందుకు, అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చేందుకు విశిష్ట అధికారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ మేరకు పిటిషనర్‌ను ఈ నెల 30 వరకు అరెస్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించారు. తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేస్తూ, ఆ రోజున రోస్టర్ న్యాయమూర్తి విచారణ చేపడతారని తెలిపారు. -
ఫార్ములా-ఈ రేసులు.. కేటీఆర్‌పై ‘ఈడీ’ కేసు
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేసుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈకి సంబంధించిన లావాదేవీలను మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది. మనీలాండరింగ్‌తో పాటు ఫెమా ఉల్లంఘనలపై ఈడీ దర్యాప్తు కొనసాగనుంది.కేసులో ఏసీబీ దర్యాప్తు ఆధారంగా కేటీఆర్‌పై ఈడీ ఈసీఐఆర్ రిజిస్టర్ చేసింది. కేటీఆర్‌తో పాటు మున్సిపల్ శాఖ మాజీ కార్యదర్శి అరవింద్‌కుమార్,హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డిలపై ఈడీ కేసు నమోదు చేసింది. కాగా, ఫార్ములా ఈ వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్‌కు శుక్రవారం(డిసెంబర్ 20) సాయంత్రమే హైకోర్టులో ఊరట లభించింది. కేటీఆర్‌ను ఫార్ములా ఈ కేసులో డిసెంబర్ 30 వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను 27 వరకు వాయిదా వేసింది. కేసు దర్యాప్తును ఏసీబీ కొనసాగించవచ్చని తెలిపింది. ఇంతలోనే కేటీఆర్‌పై ఇదే వ్యవహారంలో ఈడీ కేసు నమోదు చేయడంపై బీఆర్ఎస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
Formula E Car Race: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట
-
ఫార్ములా ఈ రేసుల కేసుపై సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
ఫార్ములా ఈ కేసు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ రేసుల కేసుపై సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం(డిసెంబర్ 20)భూ భారతి బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ ఫార్ములా ఈ కేసుపై మాట్లాడారు.‘ఫార్ములా ఈ రేసులు నిర్వహించే ఎఫ్ఈవో ప్రతినిధులు నన్ను నా ఇంట్లోనే కలిశారు. రేసుల ఒప్పందంలో రూ.55 కోట్లు కాదు.. రూ.600 కోట్ల వ్యవహారం ఉంది.కేటీఆర్‌తో చీకటి ఒప్పందాలున్నట్లు కంపెనీ ప్రతినిధులే నాకు చెప్పారు.కేసు దర్యాప్తులో ఉండడంతో పాటు కోర్టులో వాదనలు కూడా జరుగుతున్నాయి.ఈ కారణంతోనే కేసు వివరాలు ఎక్కువగా చెప్పడం లేదు.బీఆర్ఎస్ ఫార్ములా ఈ కార్ల వ్యవహారంపై ఇన్నిరోజులు ఎందుకు మాట్లాడలేదు. ఏసీబీ కేసు పెట్టగానే అసెంబ్లీలో గొడవ చేస్తున్నారు.బీఏసీలో కూడా బీఆర్ఎస్ ఇచ్చిన 9 అంశాల్లో ఈ రేసుల అంశం లేదు’అని రేవంత్‌రెడ్డి అన్నారు. కాగా, ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా ఏసీబీ చేర్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కేటీఆర్‌ను హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు హైకోర్టులో ఊరట లభించింది. డిసెంబర్ 30 దాకా కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను 27కు వాయిదా వేసింది. -
సీఎం రేవంత్ రెడ్డి కావాలనే కేసు పెట్టించారు: KTR
-
చీఫ్ కోర్టులో లంచ్ మోషన్ వేసిన కేటీఆర్ న్యాయవాదులు
-
KSR Live Show: రేసు.. కేసు.. కేటీఆర్ అరెస్ట్ తప్పదా ?
-
ఈ-కార్ రేస్ స్కాంలో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్
-
సభలో ఫార్ములా ఈ రేస్ రచ్చ
-
ఏసీబీ కేసుపై కేటీఆర్ రియాక్షన్
-
ఫార్ములా– ఈ కార్ రేసులో 'ఏ1 కేటీఆర్'
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీ రామారావును ఏ–1 (మొదటి నిందితుడు)గా, పురపాలక శాఖ (ఎంఏయూడీ) మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఏ–2గా, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏ–3గా చేర్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ అనుమతి లేకుండానే.. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఫార్ములా–ఈ కార్ రేసు నిర్వహణకు సంబంధించి పలు దఫాల్లో రూ.54,88,87,043 బదిలీ చేశారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ ఫిర్యాదుతో.. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) డీఎస్పీ మాజిద్ అలీఖాన్ అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని సెక్షన్ 13(1) (ఏ), 13(2), ఐపీసీ సెక్షన్ 409, 120–బీ కింద గురువారం కేసు (ఎఫ్ఐఆర్) నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతివ్వడంతో ఏసీబీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాల ప్రకారం కేసు వివరాలు ఇలా ఉన్నాయి. సాధారణ నిధుల నుంచే రూ.54,88,87,043 చెల్లింపులు హైదరాబాద్‌లో ఫార్ములా⇒ ఈ కార్ రేసు సీజన్ 9, 10, 11, 12 నిర్వహించేందుకు 2022 అక్టోబర్ 25న యూకేకు చెందిన ఫార్ములా–ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్ఈఓ), తెలంగాణ ప్రభుత్వ పురపాలక శాఖ, ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేటు లిమిటెడ్ (స్పాన్సర్)కు మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 11న నిర్వహించిన ఫార్ములా–ఈ రేస్ మొదటి సీజన్ (9) కోసం హెచ్ఎండీఏ రూ.12 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ తర్వాత ఎఫ్ఈఓకు స్పాన్సర్‌కు మధ్య వచ్చిన విభేదాలతో ఫార్ములా⇒ ఈ కార్ రేసు సీజన్ 10 నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రైవేటు స్పాన్సర్ స్థానంలో తామే అన్ని ఖర్చులు భరించేలా హెచ్ఎండీఏ అధికారులు, ఎఫ్ఈఓ మధ్య చర్చలు జరిగాయి. సీజన్ 10 కార్ రేసు నిర్వహణకు సంబంధించిన ఫీజుల నిమిత్తం, ఇతర సదుపాయాల ఏర్పాటుకు అయ్యే మొత్తం రూ.160 కోట్లు ఖర్చు పెట్టేందుకు పురపాలక అధికారులు పరిపాలన అనుమతులిచ్చారు. ఇందులో మొదటి దఫా కింద 2023 అక్టోబర్ 3న రూ.22,69,63,125 చెల్లించేందుకు హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ మంజూరు ఇచ్చారు. రెండో దఫా కింద 2023 అక్టోబర్ 11న మరో రూ.23,01,97,500 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, హిమాయత్‌నగర్ బ్రాంచ్ నుంచి యూకేలోని ఎఫ్ఈఓ కంపెనీ ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులు బదిలీ చేయడంలో నిబంధనలు పాటించకపోవడంతో హెచ్ఎండీఏ ఆదాయ పన్ను శాఖకు మరో రూ.8,06,75,404 పన్నుల రూపంలో చెల్లించాల్సి వచ్చింది. అదేవిధంగా ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియాకు ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్ క్యాలెండర్ ఫీజు, పర్మిట్ ఫీజు కోసం మరో రూ.1,10,51,014 హెచ్ఎండీఏ చెల్లించింది. ఇలా మొత్తం రూ.54,88,87,043 హెచ్ఎండీఏ చెల్లించింది. ఇవన్నీ సాధారణ నిధుల నుంచే సంస్థ చెల్లించిందని ఏసీబీ పేర్కొంది. అనుమతుల్లేకుండానే చెల్లింపులు ⇒ హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం రూ.10 కోట్లకు మించి ఖర్చు అయ్యే పనులు చేసేందుకు పరిపాలన అనుమతులు ఇవ్వాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కానీ అనుమతి తీసుకోలేదు. ⇒ హెచ్ఎండీఏ చెల్లించిన రూ.54,88,87,043కు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. కానీ ఆర్థికశాఖ దృష్టికే తీసుకెళ్లలేదు. ⇒ హెచ్ఎండీఏ అగ్రిమెంట్లో పార్టీ కాకపోయినా నగదు చెల్లింపులు చేసింది. ⇒ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నా ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే 2023 అక్టోబర్ 30న అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు. ⇒ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా..ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఎఫ్ఈఓకు హెచ్ఎండీఏ నుంచి చెల్లింపులు జరిగాయి. ⇒ ఫారిన్ ఎక్సేంజ్ రెమిటెన్స్ నిబంధనలను ఉల్లంఘించి విదేశీ మారకద్రవ్యం రూపంలో చెల్లింపులు జరిగాయి. ⇒ ప్రభుత్వం తరఫున ఏవైనా అగ్రిమెంట్లు చేసుకోవాలంటే ఆర్థిక, న్యాయశాఖల సమ్మతితో పాటు కేబినెట్ అనుమతి తీసుకోవాలి. తీసుకోలేదు. ⇒ ఈ ఒప్పందాలన్నీ మోసపూరితమైనవని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ⇒ అధికారులు, మాజీ మంత్రి కేటీఆర్ కలిసి నేర పూరిత కుట్రకు, ఉల్లంఘనలకు పాల్పడ్డారు. అధికార దుర్వినియోగం చేశారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చేలా వ్యవహరించారని ఏసీబీ తన ఎఫ్ఐఆర్లో ఆరోపించింది. ఏమిటీ సెక్షన్లు.. శిక్ష ఏమిటి? ⇒ నిజాయితీ లేకుండా, మోసపూరితంగా సొంత ప్రయోజనం కోసం ప్రభుత్వ ఆస్తిపై ఇతరులకు హక్కు కట్టబెట్టడం అవినీతి నిరోధక చట్టం–1988 సెక్షన్ 13(1) (ఏ), సెక్షన్ 13(2) కిందకు వస్తాయి. నేరపూరిత దు్రష్పవర్తన, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా రుజువైతే ఏడాదికి తక్కువ కాకుండా అత్యధికంగా ఏడేళ్ల వరకు ఈ సెక్షన్ల కింద జైలు శిక్ష వేయవచ్చు. అదనంగా జరిమానా కూడా విధించవచ్చు. ⇒ ఐపీసీ సెక్షన్ 409, 120–బీ నేరపూరిత కుట్రకు సంబంధించినది. ప్రభుత్వోద్యోగి, బ్యాంకర్, వ్యాపారి నేరపూరితంగా విశ్వాస ఉల్లంఘనకు పాల్పడటం పబ్లిక్ సర్వెంట్ హోదాలో ఉండి అతని అదీనంలోని ఆస్తి విషయంలో నేర ఉల్లంఘటనకు పాల్పడటం, నిధులను పక్కదారి పట్టించడం వంటివి దీని కిందకు వస్తాయి. నేరం రుజువైతే ఏడాది నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, అదనంగా జరిమానా కూడా విధించవచ్చు. హైకోర్టులో నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్! తనపై నమోదైన కేసు కొట్టివేయాలని, అరెస్టు సహా ఎలాంటి కఠిన చర్యలు చేపట్టకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేటీఆర్, ఇతర నిందితులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కేటీఆర్ ప్రజా ప్రతినిధి కావడంతో పోర్ట్‌ఫోలియో ప్రకారం జస్టిస్ కె.లక్ష్మణ్ వద్ద ఇది విచారణకు వస్తుంది.అయితే శుక్రవారం ఆయన సెలవులో ఉండటంతో జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ వద్ద లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేసే చాన్స్ ఉన్నట్లు సమాచారం. -
రేవంత్ కుంభకోణాలు బయటపెడుతున్నందుకే..
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబం చేస్తున్న అవినీతి కుంభోణా లను బయట పెడుతున్నందునే రాష్ట్ర ప్రభుత్వం మాపై రాజకీయ వేధింపులకు దిగుతోంది. అవినీతి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేకున్నా రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేసింది. ఫార్ములా–ఈ రేస్ వ్యవహారంలో అవినీతి జరిగి నట్లు ఆధారాలు ఉంటే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చించాలని సవాలు చేస్తున్నా. కానీ అసెంబ్లీలో మాట్లాడలేని సీఎం, దద్దమ్మ మంత్రులు లీకులతో దుష్ప్రచారం చేస్తు న్నారు. సీఎం, మంత్రులకు ఈ అంశంపై అవగా హన ఉంటే అసెంబ్లీ సాక్షిగా అవినీతిని బయట పెట్టాలి. ఈ మొత్తం వ్యవహారంలో అణా పైసా వృథా కాలేదు అనేందుకు నా వద్ద ఆధారాలు ఉన్నా యి..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్లే రేసులు రద్దయ్యాయి. దీంతో ఈవీ రంగంలో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, పేరు రాకపోవడంతో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ దెబ్బతింది. రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు, మోసా లను ప్రజాస్వామ్య యుతంగా ప్రజల ముందు పెడతాం. నాపై నమోదైన కేసులపై చట్ట ప్రకారం ముందుకు వెళతాం. ఉద్యమ నాయకుడి బిడ్డలం.. ఉద్యమకారులం, అణిచివేతలు, చిల్లర కుట్రలకు భయపడకుండా కొట్లాడతాం..’ అని అన్నారు. ఫార్ములా–ఈ రేస్ అంశంలో తనపై కేసు నమోదైన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్లో గురువారం రాత్రి ఆయన మాట్లాడారు.‘ఈవీ’కి తెలంగాణను హబ్‌గా చేయాలనుకున్నాం..‘కేసీఆర్ నాయకత్వంలో ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి హైదరాబాద్‌ను కేంద్రంగా తీర్చిదిద్దాలని అనుకున్నాం. ఎలక్ట్రిక్ వాహన వాతావరణాన్ని అభివృద్ధి చేసేందుకు ‘ఫార్ములా–ఈ రేస్’ను నిర్వహించాలని భావించాం. నాలుగు సీజన్ల పాటు నిర్వహించేలా 2022 అక్టోబర్ 25న ఒప్పందం కుదిరింది.2023 ఫిబ్రవరి 10న తొలి సీజన్ రేసింగ్ నిర్వహించాం. రేస్ నిర్వహణకు హెచ్ఎండీఏ రూ.35 కోట్లు, ప్రమోటర్ సంస్థ గ్రీన్ కో రూ.110 కోట్లు ఖర్చు చేసింది. దీనివల్ల అదనంగా రూ.700 కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరిందని నీల్సేన్ సర్వే సంస్థ తెలిపింది. అయితే నష్టాలను కారణంగా చూపుతూ రెండో సీజన్లో ప్రమోటర్ గ్రీన్ కో తప్పుకోవడంతో హెచ్ఎండీఏ నుంచి రెండు విడతల్లో రూ.55 కోట్లు చెల్లించాలని నాటి మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్‌ను ఆదేశించా. ఎలాన్ మస్క్‌ను రప్పించి ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ద్వారా ఈవీ రంగానికి తెలంగాణను హబ్‌గా ప్రమోట్ చేయాలని అనుకున్నాం..’ అని కేటీఆర్ తెలిపారు.అవినీతే జరగనప్పుడు కేసు ఎలా?‘ఈ నేపథ్యంలో తదుపరి చెల్లింపులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత ఏడాది డిసెంబర్ 7న ఫార్ములా–ఈ సంస్థ కోరింది. దీని సహ వ్యవస్థాపకుడు ఆల్బర్టో లొంగోతో అదే నెల 13న సీఎం రేవంత్, నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ సమావేశయ్యారు. తర్వాత రేస్ నిర్వహణకు సానుకూలత వ్యక్తం చేస్తూ, కాంట్రాక్టు నిబంధనలు ప్రస్తావిస్తూ డిసెంబర్ 21 లోగా నిర్ణయం తెలపాలని సంస్థ లేఖ రాసింది. డిసెంబర్ 26 వరకు వేచి చూసి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రేస్ నిర్వహణ సాధ్యం కాదని చెప్తూ నిర్వాహక సంస్థ రూ.73 లక్షల రేస్ ఫీజును కూడా వెనక్కి పంపింది. ఎఫ్ఈఓ ఎన్నిమార్లు కోరినా తెలంగాణ ప్రభుత్వం ఈ ఫీజును వెనక్కి తీసుకోవడం లేదు. రూ.55 కోట్లు రెండు వాయిదాలలో తమకు ముట్టిన విషయాన్ని నిర్ధారిస్తూ మూడో వాయిదా చెల్లించడంపై ప్రభుత్వంతో పలుసార్లు లేఖల రూపంలో సంస్థ సంప్రదింపులు కొనసాగించింది. అత్యంత చట్టబద్ధంగా పారదర్శకంగా హెచ్ఎండీఏ ఇండియన్ ఓవర్సీస్ ప్రభుత్వ బ్యాంకు నుంచి ఈ నిధులను ఆ సంస్థకు చెల్లించింది. అవినీతే జరగనప్పుడు కేసు నమోదు చేసే అంశం ఏసీబీ పరిధిలో లేదు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హరీశ్ సాల్వే అనే ప్రముఖ న్యాయవాదితో ఫార్ములా–ఈపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసును రాష్ట్ర ప్రభుత్వం దాచి పెట్టింది..’ అని కేటీఆర్ చెప్పారు. చంద్రబాబు హయాంలో ఫార్ములా వన్ యోచన‘చంద్రబాబు హయాంలో 2001లో ‘ఫార్ములా వన్’ నిర్వహించాలనుకున్నారు. ట్రాక్ ఏర్పాటుకు కేటాయించిన భూముల్లో సీఎం రేవంత్‌రెడ్డికి సంబంధించిన 15 ఎకరాల భూమి కూడా ఉంది. ఈ విషయాన్ని 2013 ఎన్నికల అఫిడవిట్లోనూ రేవంత్ ప్రస్తావించారు. ట్రాక్ ఏర్పాటు కోసం గోపన్‌పల్లిలో మొత్తం 580 ఎకరాల భూ సేకరణకు గతంలో రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ప్రభుత్వం మారడంతో ట్రాక్ ఏర్పాటు ప్రతిపాదనలు వెనక్కి పోగా రైతులు తమ భూమి కోసం నేటికీ న్యాయ పోరాటం చేస్తున్నారు..’ అని కేటీఆర్ వివరించారు.రేవంత్.. నా వెంట్రుక కూడా పీకలేవు ఫార్ములా–ఈ రేసులో కేసు పెట్టాల్సింది సీఎం రేవంత్ రెడ్డిపైనే అని కేటీఆర్ అన్నారు. అంతటి ప్రఖ్యాత రేసింగ్ దేశానికి రాకపోవడానికి రేవంతే కారణమని చెప్పారు. ‘రేవంత్.. ఏం చేసుకుంటావో చేసుకో.. నా వెంట్రుక కూడా పీకలేవు. నేను ఏ తప్పూ చేయలేదు. అందుకే నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ..’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అదానీతో అనుబంధంపై మీ సీఎంను ప్రశ్నిస్తారా?రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖఅదానీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉన్న అనుబంధంపై ప్రశ్నిస్తారా? లేక ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడేందుకు మౌనంగా ఉంటారా? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీకి వ్యతిరేకంగా నిరసనల పేరిట కాంగ్రెస్ పార్టీ రాజకీయ డ్రామా చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం రాహుల్‌గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు.జాతీయ స్థాయిలో అదానీపై వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న కాంగ్రెస్, తెలంగాణలో మాత్రం రేవంత్ నాయకత్వంలో అనుకూలంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూనే, తెలంగాణలో అదానీ గ్రూప్‌నకు రేవంత్ ఎర్ర తివాచీ పరచడం విడ్డూరంగా ఉందన్నారు. గౌతమ్ అదానీ సీఎం రేవంత్‌కు ఇచ్చిన రూ.100 కోట్ల విరాళం పరస్పర ప్రయోజనాలకు ఉదాహరణ అని స్పష్టం చేశారు. ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం లేదు‘ఫార్ములా–ఈ రేసు ఆరోపణల్లో విషయమే లేనప్పుడు ముందే నేను కోర్టులకు వెళ్లి ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆరోపణలు పరిశీలిస్తే ఏ జడ్జి అయినా వెంటనే కేసు కొట్టేస్తారనే నమ్మకం ఉంది. కేబినెట్ అంటే గాసిప్ బ్యాచ్‌లాగా తయారైంది’ అని అసెంబ్లీ లాబీల్లో కేటీఆర్ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. -
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ FIR నమోదు
-
ఫార్ములా-ఈ కేసులో ఏ1గా కేటీఆర్.. ఏసీబీ కేసు నమోదు
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేసు నిధుల గోల్మాల్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఏసీబీకి ఇప్పటికే లేఖ రాశారు.ఈ క్రమంలో తాజాగా గురువారం(డిసెంబర్ 19) ఈ-కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా, అప్పటి మునిసిపల్ శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను ఏ2గా చేరుస్తూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ3గా అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బిఎల్‌ఎన్‌రెడ్డిని ఏసీబీ చేర్చింది. కేటీఆర్‌పై అవినీతి నిరోధక చట్టం(పీసీ యాక్టు) 13(1)ఏ, 13(2)తో పాటు బీఎన్ఎస్ చట్టంలోని పలు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.ఫార్ములా ఈ-కార్ రేసుల కోసం ఓ విదేశీ కంపెనీకి అప్పటి మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతో కేబినెట్ అనుమతి లేకుండానే రూ.45 కోట్ల ఇండియన్ కరెన్సీ చెల్లించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇందుకు ఆర్బీఐ రూ.8 కోట్లు ఫైన్ వేయగా తమ ప్రభుత్వం జరిమానా చెల్లించిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఫార్ములా ఈ కార్ రేసులు నిర్వహించారు. ఈ రేసులకు అప్పటి మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ నిబంధనలు పాటించకుండా ప్రైవేటు సంస్థలకు నేరుగా నిధులు మంజూరు చేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. మాజీ మంత్రి అయిన కేటీఆర్‌పై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ అనుమతి కూడా తీసుకోవడం గమనార్హం. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే యోచనలో కేటీఆర్తనపై నమోదైన ఫార్ములా ఈ కార్ల కేసులో క్వాష్ పిటిషన్ వేసే యోచనలో కేటీఆర్ రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఎఫ్ఐఆర్ నమోదైనందున క్వాష్ పిటిషన్ వేసేందుకు అవకాశం న్యాయ నిపుణులతో ఇప్పటికే కేటీఆర్ చర్చలు ప్రభుత్వం అబద్ధాలు చెప్తూ కేసు పెట్టింది: హరీశ్‌రావు రాష్ట్రం కోసం పనిచేసిన కేటీఆర్‌పై కేసు పెట్టారుప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలు ఫార్ములా ఈ కేసుపై అసెంబ్లీలో చర్చించండి -
సీఎం రేవంత్ రెడ్డికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ
-
కేటీఆర్‌పై ‘ఫార్ములా’ అస్త్రం!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావుపై ‘ఫార్ములా–ఈ’ అస్త్రం ప్రయోగించేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణ ప్రారంభించాలని సోమవారం సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకుంది. దీనిపై తక్షణమే ఏసీబీకి లేఖరాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించినట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్‌ను తక్షణమే అరెస్టు చేస్తారా? అన్న అంశంపై తీవ్రస్థాయిలో ఊహాగానాలు జరుగుతున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ మంత్రివర్గ భేటీ తర్వాత కొందరు మంత్రులు వ్యాఖ్యలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. నిజానికి రాష్ట్రంలో రాజకీయ బాంబులు పేలుతాయని గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించిన సమయంలోనే.. ‘ఫార్ములా–ఈ’ రేసు వ్యవహారంలో కేటీఆర్‌ను అరెస్టు చేయవచ్చంటూ ప్రచారం జరిగింది. గవర్నర్ అనుమతితో ముందుకు.. సోమవారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. ‘ఫార్ములా–ఈ’ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై విచారణ చేపట్టేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఏసీబీ విచారణ ప్రారంభించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ అంశంపై సూటిగా స్పందించేందుకు ప్రభుత్వ వర్గాలు నిరాకరించాయి. విదేశీ సంస్థలకు నేరుగా నిధులు ఎలా చెల్లిస్తారు? ‘విదేశీ కంపెనీలైన ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ), ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు నేరుగా ప్రభుత్వ నిధులను చెల్లించే విషయంలో నిర్ణయాధికారం నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌కు ఉందా? రిజర్వు బ్యాంకు అనుమతి లేకుండా విదేశీ కంపెనీలకు నేరుగా ప్రభుత్వ నిధులను చెల్లించవచ్చా? ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా? అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ ఒప్పందం ఎలా చేసుకుంటారు?’ అనే అంశాలపై ఏసీబీ విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. భారీగా డబ్బులు చేతులు మారాయని.. ఫార్ములా–ఈ కార్ల రేసులో అవకతవకలు జరిగాయని.. భారీగా డబ్బులు చేతులు మారాయని మంత్రివర్గం అనుమానాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ క్రీడల నిర్వహణతో రాష్ట్రానికి రూ.7 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఇటీవల కేటీఆర్ పేర్కొన్న నేపథ్యంలో... ఈ విషయాలను ఆయన ఏసీబీకి చెప్పుకోవాలని కీలక మంత్రి ఒకరు పేర్కొన్నారు. కేటీఆర్ అరెస్టు భయంతోనే ఇంటి దగ్గర కాపలా పెట్టుకున్నారని, కేంద్రంలోని పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. ఎవరినో అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందా?, బీఆర్ఎస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. అధికారులు కూడా విచారణ ఎదుర్కోవాల్సిందే! ‘ఫార్ములా–ఈ’ కారు రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌తోపాటు ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్, ఇతర అధికారులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని కీలక మంత్రి ఒకరు పేర్కొన్నారు. అరవింద్‌కుమార్ విచారణకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీఓపీటీ) అనుమతి అవసరం లేదని.. సీఎస్ అనుమతిస్తే సరిపోతుందని తెలిపారు. అధికారిపై నేరారోపణలు నమోదు చేసే సమయంలోనే డీఓపీటీ అనుమతి అవసరమని వెల్లడించారు. ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ), ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలపై సైతం ఏసీబీ విచారణ చేపడుతుందని, వాటికి కూడా నోటీసులు ఇస్తుందని పేర్కొన్నారు. కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే ఆ రెండు కంపెనీలకు నిధులు చెల్లించినట్టు అరవింద్‌కుమార్ ఇప్పటికే తెలిపారని గుర్తు చేశారు. కీలక నిర్ణయాలు.. అసెంబ్లీలోనే ప్రకటన సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నా అధికారికంగా వెల్లడించలేదు. వీటిపై అసెంబ్లీలోనే ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో అవకతవకలపై వేసిన జస్టిస్ మదన్ బి.లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికపై మంత్రివర్గం చర్చించి ఆమోదించినట్టు సమాచారం. ఈ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి విస్తృతంగా చర్చించాలని నిర్ణయించినట్టు తెలిసింది. రెవెన్యూ శాఖ ప్రక్షాళన కోసం కొత్తగా తెచ్చిన రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్ఓఆర్) బిల్లుతోపాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల బిల్లులు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులను కూడా కేబినెట్ ఆమోదించినట్టు సమాచారం. ఇక ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీల మేరకు రైతు భరోసా కింద భూమి లేని రైతుకూలీలకు డిసెంబర్ 28 నుంచి రూ.12 వేల ఆర్థిక సాయం చెల్లింపు, కొత్త రేషన్ కార్డుల జారీపైనా చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. నేడో, రేపో వీటిపై అసెంబ్లీ ప్రకటన చేయనుంది. -
‘గవర్నర్ అనుమతి’తో బీఆర్ఎస్ అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీ రామారావుపై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారన్న వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం కేటీఆర్‌కు త్వరలో నోటీసులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. సోమవారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఏసీబీ నోటీసులు, విచారణ తంతు జరిగే అవకాశం ఉందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఏసీబీ నుంచి నోటీసులు అందే పక్షంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ లీగల్ సెల్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఫార్ములా–ఈ రేస్ అంశంలో తీసుకున్న నిర్ణయాలకు గతంలో మంత్రిగా పూర్తిగా తనదే బాధ్యత అని కేటీఆర్ ప్రకటించారు. మరోవైపు లగచర్ల ఘటనకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ఉండటంతో ఆయనను అరెస్టు చేయవచ్చని అప్పట్లోనే ఊహాగానాలు వచ్చాయి. తనను ఏదో ఒక కేసులో అరెస్టు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నవంబర్‌లో కేటీఆర్ ప్రకటించారు కూడా. అందులో భాగంగానే ‘ఫార్ములా–ఈ రేస్’ అంశాన్ని తాజాగా తెరమీదకు తెస్తున్నారని పార్టీ నేతల వద్ద కేటీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది.అసెంబ్లీని స్తంభింపజేసే యోచనదర్యాప్తు సంస్థల నుంచి అందే నోటీసులకు సమాధానాలిస్తూ, విచారణలకు హాజరవుతూనే ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేలా ఎలాంటి కార్యాచరణ అనుసరించాలనే కోణంలో పార్టీ నేతలు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో నోటీసులిస్తే సభలోనే చర్చకు పట్టుబట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కేటీఆర్ అరెస్టు జరిగితే అసెంబ్లీని స్తంభింపజేసేలా పార్టీ కార్యాచరణ ఉంటుందని, అవసరమైతే సమావేశాలను బహిష్కరించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. రేవంత్ ప్రభుత్వం ఫార్ములా–ఈ రేస్‌ను రద్దు చేయడంతో రాష్ట్ర ఖజానాకు రూ.800 కోట్లు నష్టం జరిగిందని బీఆర్ఎస్ వాదిస్తోంది. మరోవైపు హెచ్ఎండీఏ బోర్డు నుంచి నిధులు చెల్లించడానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని పేర్కొంటోంది.కక్ష సాధింపు రాజకీయాలను నిలదీద్దాంరాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్.. ఈ అంశాన్ని మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి కోరడం, మాజీ మంత్రి హరీశ్‌రావుపై కేసులు పెట్టడం ద్వారా పార్టీ ముఖ్య నేతలను ఆత్మరక్షణలోకి నెట్టాలనే వ్యూహాన్ని రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేటీఆర్ లక్ష్యంగా కేసులు, అరెస్టులు జరిగితే క్షేత్రస్థాయిలో ఉద్యమకాలం నాటి తరహా ఆందోళనలు చేపడతామని పేర్కొంటున్నారు.బీజేపీ సహకరిస్తుందనే విమర్శలతో..ఫార్ములా–ఈ రేస్‌లో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతివ్వడం వెనుక రాజకీయ కోణం ఉందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ నేతలతో అంటకాగుతున్నారని, అందులోభాగంగానే గవర్నర్ అనుమతి అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. సీఎం రేవంత్ ఇటీవలి ఢిల్లీ పర్యటన, వరుసగా కేంద్ర మంత్రులతో భేటీలు వంటివి కూడా బీఆర్ఎస్ను ఇరుకున పెట్టడం లక్ష్యంగా సాగినట్టు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. -
ఫార్ములా–ఈ కేసులో కేటీఆర్‌కు త్వరలో నోటీసులు!
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ రేస్ కోసం విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రూ.46 కోట్లు బదలాయించారన్న కేసు దర్యాప్తులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకోసం గవర్నర్ నుంచి అనుమతి లభించినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌పై కేసు నమోదుకు ప్రభుత్వం అనుమతివ్వడం తెలిసిందే. హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ–రేస్ కోసం విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ నుంచి బోర్డు అనుమతి లేకుండానే రూ.46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో పురపాలక శాఖ ఈ అంశంలో ఏసీబీ దర్యాప్తు చేయించాలని ప్రభుత్వానికి లేఖ రాయడం, దానిని ఏసీబీకి అప్పగించడం తెలిసిందే. నాడు కేటీఆర్ ఆదేశాల మేరకే తాను ఆ నిధులు చెల్లించానని అప్పుడు హెచ్ఎండీఏ కమిషనర్‌గా ఉన్న అర్వింద్‌కుమార్ ప్రభుత్వానికి ఇదివరకే స్పష్టం చేశారు. కేటీఆర్‌పై కేసు నమోదు చేసి, విచారణ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో గత నెలలో ప్రభుత్వం అనుమతి కోరింది. దీనిపై న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ.. కేసు నమోదుచేసి విచారణ జరిపేందుకు అనుమతిచి్చనట్లు తెలిసింది. -
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్ : ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నుంచి ఆమోదం లభించిందని, సంబంధిత ఫైల్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం.ఫార్ములా–ఈ రేసులో ఏం జరిగింది? హైదరాబాద్‌లో నాలుగు సంవత్సరాలపాటు ఫార్ములా–ఈ రేసు నిర్వహణకు సంబంధించి ఎఫ్ఈవో, ఏస్ నెక్ట్స్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహించిన మొదటి ఫార్ములా–ఈ కార్ల రేస్ (సెషన్–9)కు దేశవ్యాప్తంగా అభిమానులు వచ్చినా.. ప్రమోటర్ ఏస్ నెక్ట్స్‌జెన్ సంస్థ ఆశించిన మేరకు ఆదాయం సమకూరలేదు. దీనితో ప్రమోటర్ తప్పుకొన్నారు.2024 ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన రెండో దఫా (సెషన్–10) ఈ–కార్ రేసు నుంచి హైదరాబాద్ పేరును ఎఫ్ఈవో తొలగించింది. కానీ అప్పటి మంత్రి కేటీఆర్ ఫార్ములా–ఈ నిర్వహణ హైదరాబాద్‌కు తలమానికంగా ఉంటుందని.. 2024 ఫిబ్రవరిలో కూడా హైదరాబాద్‌లోనే కార్ రేస్‌ను నిర్వహించాలని కోరారు. ప్రమోటర్ నిర్వహించే బాధ్యతలను నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండీఏ చూసుకుంటుందని ఎఫ్ఈవోకు స్పష్టం చేశారు.ఈ మేరకు రెండో దఫా ఈ కార్ రేస్ కోసం 2023 అక్టోబర్‌లో ఎఫ్ఈవోతో పురపాలక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రేస్ నిర్వహణకోసం రూ.100 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం హెచ్ఎండీఏ రూ.55 కోట్లను ఎఫ్ఈవోకు చెల్లించింది.ఉల్లంఘన అంటూ రేసు రద్దు చేసి.. డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా–ఈ రేసుపై ఆరా తీసింది. పురపాలక శాఖ ఒప్పందంలోని అంశాలను ఉల్లంఘించిందంటూ ఎఫ్ఈవో సెషన్–10ను రద్దు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆర్థికశాఖ అనుమతి లేకుండా రూ.55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ ద్వారా చెల్లింపులు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో అర్వింద్‌కుమార్‌ను పురపాలక శాఖ నుంచి బదిలీ చేసింది. నిధుల చెల్లింపుల్లో జరిగిన ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలంటూ ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మెమో జారీ చేశారు.ఆ మెమోకు అర్వింద్‌కుమార్ వివరణ ఇస్తూ.. తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, అప్పటి మంత్రి కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే చెల్లింపులు చేశామని పేర్కొన్నట్టు తెలిసింది. తర్వాత ప్రభుత్వం అనుమతినిస్తుందని చెప్పడంతోనే ఎఫ్ఈవోకు నిధులు విడుదల చేసినట్టుగా వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఫార్ములా–ఈ రేసుకు సంబంధించి ఏసీబీ విచారణ చేయాలంటూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్ లేఖ రాయగా.. ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలోని అధికారులు ఫార్ములా–ఈ రేసు అంశాన్ని తిరగదోడుతున్నారు.అందులో భాగంగానే అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, అప్పటి చీఫ్ ఇంజినీరుతోపాటు గత ప్రభుత్వంలో పురపాలక-పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతివ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రూపంలో విన్నవించింది. ఈ మేరకు ఇద్దరు అధికారులపై విచారణకు అనుమతిచ్చిన ప్రభుత్వం... ప్రజాప్రతినిధి అయిన కేటీఆర్‌పై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు గత నెలలోనే లేఖ రాసింది. ఈ అంశంపై న్యాయ సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ అనుమతిచ్చినట్లు సమాచారం. -
కేసు పెడితే పెట్టుకో.. దేనికైనా రెడీ!: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి నన్ను అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. కేసు పెడితే పెట్టుకో. రెండు నెలలు లోపల వేసి పైశాచిక ఆనందం పొందుతానంటే, జైలులో మంచిగా యోగా చేసి ట్రిమ్గా వస్తా. ఆ తర్వాత పాదయాత్ర చేస్తా. ఉడుత ఊపులకు బెదరం. రాజ్‌భవన్‌లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ను ఎలా ఖతం చేయాలని అనుకున్న మాట వాస్తవం. నా అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం ఆయన విచక్షణకు సంబంధించిన అంశం. ఏ విచారణకైనా సిద్ధం. దేనికైనా రెడీగా ఉన్నా. ప్రజల తరఫున పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ప్రజల దృష్టిని మళ్లించే ఆటలతో ఎక్కువ రోజులు తప్పించుకోలేవు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ దెబ్బతీయకు. గాసిప్ పక్కన పెట్టి గవర్నెన్స్ మీద దృష్టి పెట్టు..’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యలు చేశారు. ‘ఫార్ములా ఈ రేస్‌లో ఏం జరిగిందనే విషయాన్ని నా బాధ్యతగా ప్రజలకు వివరించాలని అనుకుంటున్నా. హైదరాబాద్, తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నాం. ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు. నాకు ఏసీబీ నుంచి ఎలాంటి నోటీసు అందలేదు..’అని కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విలేకరుల ప్రశ్నలకు జవాబిచ్చారు. రూ.55 కోట్ల ఫైల్‌పై సంతకం నేనే చేశా... ‘ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు నిర్వహణ సంస్థ ఎఫ్ఐఏ, హెచ్ఎండీఏ, స్పాన్సరర్ అయిన గ్రీన్ కో నడుమ త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. తమకు లాభం రాలేదనే కారణంతో రెండో విడత రేస్ నుంచి గ్రీన్కో తప్పుకోవడంతో రేస్ నిర్వహణ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెంచేందుకు ప్రభుత్వం తరఫున రూ.55 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో అప్పటి హెచ్ఎండీఏ కార్యదర్శి అర్వింద్‌కుమార్ తప్పేమీ లేదు. ఫైల్‌పై నేనే సంతకం చేశా. రూ.55 కోట్లు చెల్లించమని నేనే చెప్పినందున నాదే బాధ్యత. కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతులు అక్కర్లేదు పురపాలక శాఖలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ నడుమ అంతర్గతంగా డబ్బు సర్దుబాటు చేసుకోవచ్చు. సర్వ స్వతంత్ర సంస్థ హెచ్ఎండీఏకు సీఎం చైర్మన్‌గా, పురపాలక శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా, కమిషనర్ సభ్య కార్యదర్శిగా ఉంటారు. హెచ్ఎండీఏ నిర్ణయాలు దేనికీ కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతులు అవసరం లేదు. రేవంత్ సీఎం పదవి చేపట్టిన వెంటనే నా మీద ఉన్న కోపంతో ఫార్ములా ఈ ఒప్పందాన్ని రద్దు చేశారు. దీంతో జాగ్వార్, నిస్సాన్ వంటి కంపెనీలు సిగ్గుచేటు అని ప్రకటించగా, ప్రపంచం ముందు హైదరాబాద్ పరువు పోయింది. ఈ రేస్ రాకుండా రేవంత్ తీసుకున్న నిర్ణయంతో రూ.700 కోట్ల నష్టం వచ్చింది. హైదరాబాద్ ఇమేజీని దెబ్బతీసి నష్టం చేసినందుకు రేవంత్ పైనే కేసు పెట్టాలి. సీఎం రేవంత్ మొగోడైతే మేఘా కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి మీద కేసు పెట్టాలి. రూ.55 కోట్ల చుట్టూ రాజకీయం చేస్తున్న రేవంత్ రూ.లక్షల కోట్లు ఖర్చయ్యే ఒలింపిక్స్ నిర్వహిస్తారట..’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మొబిలిటీ రాజధానిగా మార్చేందుకే.. ‘హైదరాబాద్‌లో ‘ఎఫ్ వన్’కార్ల రేసును నిర్వహించేందుకు 2003లో ప్రయత్నించి ప్రత్యేకమైన ట్రాక్ కోసం గోపన్‌పల్లిలోని 400 ఎకరాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇందులోని 129 సర్వే నంబర్లో సీఎం రేవంత్‌కు చెందిన 31 ఎకరాల భూమి కూడా ఉంది. అయితే రైతుల అభ్యంతరాలతో భూ సేకరణపై హైకోర్టులో కేసు నడుస్తోంది. మేం కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెంచి ఎలక్ట్రిక్ వాహన రంగానికి నగరాన్ని ‘భారత్‌లో మొబిలిటీ రాజధాని’గా మార్చాలని అనుకున్నాం. ప్రపంచంలోని గొప్ప నగరాల జాబితాలో హైదరాబాద్‌ను చేర్చాలనే తపనతో సియోల్, జోహెన్నస్‌బర్గ్ వంటి నగరాలతో పోటీ పడి హైదరాబాద్‌కు ‘ఫార్ములా ఈ’ని రప్పించాం. తొలి దశ రేసింగ్ తర్వాత రాష్ట్రానికి రూ.700 కోట్ల మేర లబ్ధి జరిగింది. ఫార్ములా ఈ రేస్, మొబిలిటీ ప్రోగ్రామ్‌తో రూ.2,500 కోట్ల పెట్టుబడులు తెచ్చాం. ఇతర సంస్థలు కూడా తెలంగాణ ఈవీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాయి..’అని కేటీఆర్ వివరించారు. -
కేటీఆర్‌పై కేసుకు అనుమతినివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా– ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీ రామారావుపై కేసు నమోదు, విచారణకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు లేఖ రాసింది. ఈ లేఖ ప్రస్తుతం గవర్నర్ పరిశీలనలో ఉంది. దీనిపై ఆయన తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. ఈ–కార్ రేస్ వ్యవహారంపై ‘కేటీఆర్ చుట్టూ ‘ఫార్ములా–ఈ’ ఉచ్చు’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. కాగా 2024 ఫిబ్రవరిలో ఈ కార్ రేస్ నిర్వహణ కోసం ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో)కు జరిపిన రూ.55 కోట్ల చెల్లింపులపై విచారించడానికి 2018 అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17(ఏ) కింద అనుమతి కోరింది. ఈ చెల్లింపులకు అప్పటి హెచ్ఎండీఏ పాలకమండలి అమోదం కూడా లేదని, అంతేకాక ఈ నిధులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా విదేశీ మారకం రూపంలో చెల్లించినట్లు ప్రభుత్వం గవర్నర్‌కు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ చెల్లింపులకు అనుమతినిచ్చినందున ఇప్పుడు ఆయన విచారణకు గవర్నర్ అనుమతి తప్పనిసరైంది. కేటీఆర్ ఆదేశాల మేరకు అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ కూడా అయిన అర్వింద్‌కుమార్ చెల్లింపులు చేశారు. గవర్నర్‌తో రేవంత్ భేటీలోనూ ‘విచారణ’ ప్రస్తావన! ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ సందర్భంగా కూడా కేటీఆర్ విచారణ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ప్రభుత్వం రాసిన లేఖపై గవర్నర్ త్వరగానే ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారవర్గాల సమాచారం. గురువారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఫార్ములా–ఈకి రూ.55 కోట్లు చెల్లింపునకు సంబంధించిన బాధ్యత పూర్తిగా తనదేనంటూ ప్రకటించగా, ఖమ్మంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే ఆటం బాబు పేలబోతుందంటూ వ్యాఖ్యానించడం.. రాష్ట్రంలో రాజకీయ సంచలనానికి సంకేతాలనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. అర్వింద్‌కుమార్ ప్రాసిక్యూషన్‌కు డీవోపీటీ అనుమతి తప్పనిసరి! ఫార్ములా–ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి అర్వింద్‌కుమార్‌తో పాటు సంబంధిత ఇంజనీర్లపై విచారణకు ప్రభుత్వం ఇదివరకే అనుమతి ఇచ్చిన విషయం విదితమే. కాగా విచారణ అనంతరం ఐఏఎస్ అధికారిని ప్రాసిక్యూషన్ చేయడానికి మాత్రం కేంద్ర సిబ్బంది శిక్షణా విభాగం (డీవోపీటీ) అనుమతి తప్పనిసరి అని చెబుతున్నారు. డీవోపీటీకి మాత్రమే ఐఏఎస్‌ను ఉద్యోగం నుంచి తొలగించే అధికారం ఉన్నందున వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల శాఖ కమిషనర్‌గా పనిచేసిన బీపీ ఆచార్య ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన వ్యవహారంలోనూ ముందస్తు అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన విషయం విదితమే. ఏమిటీ సెక్షన్ 17(ఏ).. ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు తీసుకున్న నిర్ణయాల్లో అవినీతి జరిగిదంటూ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు నమోదు చేసి విచారణ చేసేందుకు అవకాశం ఉండడంతో.. ఆ కక్ష సాధింపును నివారించేందుకు 2018లో కేంద్ర ప్రభుత్వం అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17(ఏ)ను కొత్తగా చేర్చింది. ముఖ్యమంత్రి, మంత్రులను తొలగించే అధికారం గవర్నర్‌కే ఉన్నందున, వారు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై, వారు మాజీలైన తర్వాత కేసులు నమోదు చేయాలన్నా గవర్నర్ అనుమతి తప్పనిసరి. కాగా 2018లో చట్ట సవరణ తర్వాత నమోదు చేసే కేసులకు మాత్రమే ఇది వర్తిస్తుందని పార్లమెంట్లో కేంద్రం స్పష్టం చేసింది. -
కేటీఆర్ చుట్టూ.. ‘ఫార్ములా–ఈ’ ఉచ్చు!
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’ కార్ల రేసింగ్ అంశంలో పురపాలక శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు చుట్టూ ఉచ్చుబిగిస్తున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ–కార్ల రేస్ నిర్వహణ సంస్థ ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో)కు కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.55 కోట్లు చెల్లించారన్న అంశాన్ని ఆధారంగా చేసుకుని.. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల సియోల్ పర్యటన సందర్భంగా రాజకీయ బాంబులు పేలబోతున్నాయంటూ చేసిన కామెంట్లు.. తాజాగా అర్వింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు.. కేటీఆర్ బావమరిది జన్వాడ నివాసంలో దాడులు.. కేటీఆర్ లక్ష్యంగా ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లు వంటి పరిణామాలన్నీ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న దిశగా వస్తున్న సంకేతాలే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫార్ములా–ఈ రేసుకు సంబంధించి ఏసీబీ విచారణ చేయాలంటూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్ లేఖ రాయగా.. ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలోని అధికారులు ఫార్ములా–ఈ రేసు అంశాన్ని తిరగదోడుతున్నారు. అందులో భాగంగానే అర్వింద్ కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ విచారణలో ఆయన వెల్లడించే అంశాలే కీలకంగా మారనున్నాయి. రంగంలోకి ఈడీ? ఫార్ములా–ఈ రేసు అంశంలో విదేశీ సంస్థకు నిధులు బదిలీ అయిన నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు కూడా ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఏసీబీ కేసు రిజిస్టర్ చేసిన నేపథ్యంలో ఈడీ కూడా విచారణ చేపట్టవచ్చని భావిస్తున్నారు. ఫార్ములా–ఈ రేసులో ఏం జరిగింది? హైదరాబాద్‌లో నాలుగు సంవత్సరాలపాటు ఫార్ములా–ఈ రేసు నిర్వహణకు సంబంధించి ఎఫ్ఈవో, ఏస్ నెక్ట్స్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహించిన మొదటి ఫార్ములా–ఈ కార్ల రేస్ (సెషన్–9)కు దేశవ్యాప్తంగా అభిమానులు వచ్చినా.. ప్రమోటర్ ఏస్ నెక్ట్స్‌జెన్ సంస్థ ఆశించిన మేరకు ఆదాయం సమకూరలేదు. దీనితో ప్రమోటర్ తప్పుకొన్నారు. 2024 ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన రెండో దఫా (సెషన్–10) ఈ–కార్ రేసు నుంచి హైదరాబాద్ పేరును ఎఫ్ఈవో తొలగించింది. కానీ అప్పటి మంత్రి కేటీఆర్ ఫార్ములా–ఈ నిర్వహణ హైదరాబాద్‌కు తలమానికంగా ఉంటుందని.. 2024 ఫిబ్రవరిలో కూడా హైదరాబాద్‌లోనే కార్ రేస్‌ను నిర్వహించాలని కోరారు. ప్రమోటర్ నిర్వహించే బాధ్యతలను నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండీఏ చూసుకుంటుందని ఎఫ్ఈవోకు స్పష్టం చేశారు. ఈ మేరకు రెండో దఫా ఈ కార్ రేస్ కోసం 2023 అక్టోబర్‌లో ఎఫ్ఈవోతో పురపాలక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రేస్ నిర్వహణకోసం రూ.100 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం హెచ్ఎండీఏ రూ.55 కోట్లను ఎఫ్ఈవోకు చెల్లించింది. ఉల్లంఘన అంటూ రేసు రద్దు చేసి.. డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా–ఈ రేసుపై ఆరా తీసింది. పురపాలక శాఖ ఒప్పందంలోని అంశాలను ఉల్లంఘించిందంటూ ఎఫ్ఈవో సెషన్–10ను రద్దు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆర్థికశాఖ అనుమతి లేకుండా రూ.55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ ద్వారా చెల్లింపులు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో అర్వింద్‌కుమార్‌ను పురపాలక శాఖ నుంచి బదిలీ చేసింది. నిధుల చెల్లింపుల్లో జరిగిన ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలంటూ ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మెమో జారీ చేశారు. ఆ మెమోకు అర్వింద్‌కుమార్ వివరణ ఇస్తూ.. తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, అప్పటి మంత్రి కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే చెల్లింపులు చేశామని పేర్కొన్నట్టు తెలిసింది. తర్వాత ప్రభుత్వం అనుమతినిస్తుందని చెప్పడంతోనే ఎఫ్ఈవోకు నిధులు విడుదల చేసినట్టుగా వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ.. పురపాలక శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌కు నోటీసులు జారీ చేసింది. -
మళ్ళీ తెర పైకి ఈ-కార్ రేస్
-
తమిళనాడు చరిత్రలో మరో మైలురాయి.. ఫార్ములా రేస్
సాక్షి, చెన్నై: తమిళనాడు చరిత్రలో ఫార్ములా కార్ రేసు –4 మరోమైలు రాయి అని క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఫార్ములా కార్ రేసు పోటీలు చెన్నైలో విజయవంతంగా జరిగాయి. బహుమతుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. వివరాలు.. తమిళనాడు క్రీడలశాఖ, తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సహకారంతో ప్రొమోటర్ ఆఫ్ ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఆర్పీపీఎల్) నేతృత్వంలో చెన్నై వేదికగా భారతదేశంలోనే ప్రపథమంగా నైట్ స్ట్రీట్ సర్క్యూట్ పందేంగా శని, ఆదివారాలలో ఫార్ములా కార్ రేస్ – 4 పోటీలు జరిగాయి. చెన్నై ఐల్యాండ్ గ్రౌండ్ మైదానం చుట్టూ ఉన్న 3.5 కి.మీ దూరంలోని అన్నాసాలై, శివానందసాలై, నేప్పియర్ వంతెన మీదుగా పోటీలు హోరెత్తాయి. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, గోవా తదితర నగరాలకు చెందిన జట్టులకు చెందిన 24 మంది క్రీడాకారులు కార్ రేసింగ్‌లో దూసుకెళ్లారు. ఇందులో ఆరుగురు మహిళా డ్రైవర్లు సైతం ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు పోటీలు ఉత్కంఠ భరితంగా జరిగాయి. వినోదం, సాహసంతో కూడిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నగర వాసులు ఈ పోటీలను తిలకించేందుకు వీలుగా అనేక చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. తుది పోటీలు ఇండియన్ చాంపియన్ షిప్, ఇండియన్ రేసింగ్ లీగ్ కేటగిరీలలో పోటాపోటీగా జరిగాయి. జేకే టైర్ జూనియర్ జాతీయ పోటీలు, సాహస కార్యక్రమాలు నిర్వహించారు. విజయవంతంగా.. ఫార్ములా రేస్ విజయవంతమైంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో విజేతలకు క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో పాటు, నిర్వాహకులు, సినీ సెలబ్రటీలు బహుమతులను ప్రదానం చేశారు. ఫారుమలా – 4 ఛాంపియన్ షిప్లో ఆ్రస్టేలియాకు చెందిన కొచ్చి టీం క్రీడాకారుడు హగ్ బర్టర్, బెంగాళ్ జట్టుకు చెందిన భారత క్రీడాకారుడు రుహాన్ అల్వ, బెంగళూరు జట్టుకు చెందిన భారత క్రీడాకారుడు అభయ్ మోహన్ తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. రేస్ –2లో విజేతలుగా హైదరాబాద్ జట్టుకు చెందిన దక్షిణాఫ్రికా క్రీడాకారుడు అకిల్ అలీబాయ్, అహ్మదా బాద్ జట్టుకు చెందిన భారత డ్రైవర్ దివ్య నందన్, బెంగళూరు జట్టుకు చెందిన భారత డ్రైవర్ జడిన్ పరియట్ తొలి మూడుస్థానాలను దక్కించుకున్నారు. ఇండియన్ రేసింగ్ లీగ్, జేకే టైర్ జూనియర్ పోటీలలోనూ విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ పోటీల విజయవంతం గురించి క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ సోమవారం ఉదయం సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. చెన్నైలో ఈ పోటీలు విజయవంతంగా జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నిర్వాహకులు, అధికారులు, మద్దతు ఇచ్చిన చెన్నై నగర ప్రజలు, క్రీడాభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ పోటీలు తమిళనాడు చరిత్రలో మరో మైలురాయిగా నిలిచి పోతాయని అభిప్రాయపడ్డారు. ఈ పోటీలను ఇక్కడ నిర్వహించేందుకు తోడ్పాటు అందించిన సీఎం స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ పోటీలలో విజేతలు, కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికీ సీఎం స్టాలిన్ సైతం అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.The best video to come out of #Formula4Chennai with 🐐BGM! Top class…👌💥P.C : dinesh _dharmendra_17 (IG) 🙌 pic.twitter.com/DJLQlfU8ci— Chennai Updates (@UpdatesChennai) September 2, 2024 -
చెన్నైలో 'రేస్' అదరహో.. సెలబ్రిటీల సందడి
సాక్షి, చెన్నై: ఫార్ములా కార్ రేస్ ఆదివారం అదరహో అనిపించే విధంగా జరిగింది. వినోదంతో కూడిన సాహసాలు హోరెత్తాయి. సినీ సెలబ్రిటీలు సందడి చేశారు. చెన్నై ఐలాండ్ గ్రౌండ్ వేదికగా ఫార్ములా కార్ రేస్ –4 శనివారం మొదలైన విషయం తెలిసిందే. తొలిరోజు అర్హత పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. రెండవ రోజు ఆదివారం ఉదయం నుంచి ట్రయల్ రన్ పేరిట పోటీలు హోరెత్తాయి. అలాగే, నగర వాసులు, ప్రేక్షకులను ఆకర్షించే దిశగా వినోద కార్యక్రమాలు, సాహసాలతో కూడిన కార్ రేసులు సాగాయి. జేకే టైర్ కార్ రేస్ ప్రత్యేక ఆకర్షణగా దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు తుది పోటీలు ఇండియన్ చాంపియన్‌షిప్, ఇండియన్ రేసింగ్ లీగ్ కేటగిరిలలో జరిగాయి. అత్యంత పోటాపోటీగా ఉత్కంఠ భరితంగా గాల్లో 200 కి.మీకి పైగా వేగంతో కార్లు దూసుకెళ్లాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు పోటీలలో విజయాన్ని కైవశం చేసుకునే దిశగా రేసులో దూసుకెళ్లారు.చివరి రోజు పోటీలను వీక్షించేందుక ప్రత్యేక ఆకర్షణగా త్రిష వంటి సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. అలాగే, భారత మాజీ క్రికెటర్ గంగూలి, బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్, జాన్అబ్రహం, నిర్మాత బోనికపూర్‌తో పాటు పలువురు నటీ నటులు హాజరయ్యారు. కోలీవుడ్‌కు చెందిన అనేక మంది స్టార్లు తరలి వచ్చారు.సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే, టాలీవుడ్ స్టార్ నాగచైతన్య ఈ ఫార్ములాకు మరింత ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. అర్ధరాత్రి జరిగిన విజయోత్సవంలో మరెందరో సినీ, క్రీడా సెలబ్రిటీలు సందడి చేశారు. శునకాల కోసం వేట కార్ రేస్‌కు శునకాలు పెద్ద సమస్యగా మారాయి. ఈ రేస్ జరిగే పరిసరాలలో కూవం నదీ తీరంలోని కొన్ని మురికి వాడలు ఉన్నాయి. ఇక్కడ శునకాలు ఎక్కవ. శనివారం రేస్ సమయంలో ఓ శునకం ట్రాక్‌లోకి దూసుకు రావడంతో రైడర్లు అలర్ట్ అయ్యారు. ఆ శునకం ట్రాక్‌ను రేస్ కారు వేగంతో దాటేయడంతో పెనుప్రమాదం తప్పినట్టైంది. దీంతో ఆదివారం రేసుకు శునకాల రూపంలో ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తలు పడ్డారు. ఆదివారం ఉదయం నుంచి ఆ పరిసరాలలో శునకాల కోసం కార్పొరేషన్ సిబ్బంది తీవ్ర వేట సాగించారు. పదికి పైగా శునకాలను పట్టేశారు. రాత్రి జరిగిన ఫైనల్స్‌లోకి శునకాలు ట్రాక్ వైపుగా దూసుకు రాకుండా డేగ కళ్లతో కార్పొరేషన్ సిబ్బంది నిఘా వేయాల్సి వచ్చింది. Lovely! Normal Traffic on the left lane! Races on the right lane..👌🏎️#Formula4Chennai pic.twitter.com/2fqMd5KDSY— Chennai Updates (@UpdatesChennai) September 1, 2024 -
ఈ–రేస్‌పై చర్యలు తీసుకుంటాం
సాక్షి, హైదరాబాద్: సచివాలయ బిజినెస్ రూల్స్‌కి విరుద్ధంగా, ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఫార్ములా ఈ–రేస్ ఒప్పందం, నిర్వహణపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఏ విధమైన విధి విధానాలు పాటించకుండా, వ్యాపార సూత్రాలకు విరుద్ధంగా నెక్స్ జెన్ అనే కంపెనీకి లబ్ధి చేకూర్చడం కోసమే గతేడాది హైదరాబాద్‌లో ‘ఫార్ములా ఈ–రేస్’ నిర్వహించారని ఆరోపించారు. వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సి ఉన్న ఈవెంట్ నిర్వహణ కోసం నాటి మంత్రి వర్గం, సంబంధిత శాఖ మంత్రి అనుమతి లేకుండా ఇటీవల బదిలీ అయిన పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రూ.55 కోట్లను ప్రైవేటు కంపెనీకి చెల్లించారని భట్టి తెలిపారు. ఈవెంట్ నిర్వహణకు రూ.110 కోట్లతో ఒప్పందం జరగగా, మిగిలిన రూ. 55 కోట్లను చెల్లించాలని సదరు కంపెనీ నోటీసు పంపిందన్నారు. గత పాలకులు వారి కోరికలు తీర్చు కోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక ‘ఫార్ములా ఈ–రేసు’ను రద్దు చేయడంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి కేటీఆర్‌పై మండిపడ్డారు. మంగళవారం సచివాలయ మీడియా సెంటర్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ రేస్ వల్ల రాష్ట్రానికి ఏం ఆదాయం వచ్చింది కేటీఆర్? ఫార్మలా ఈ–రేసు రద్దుతో హైదరాబాద్ అభివృద్ధికి నష్టం జరిగిందని సోషల్ మీడియా ‘ఎక్స్’వేదికగా కేటీఆర్ చేసిన ఆరోపణలను ఖండించారు. గతేడాది నిర్వహించిన ఫార్ములా ఈ–రేస్‌తో హైదరాబాద్‌కు ఎలాంటి లాభం జరగలేదని, పైగా ప్రభుత్వ నిధులను అప్పనంగా ఒక ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టారని విమర్శించారు. తమ ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయని, ప్రతిపైసా ప్రజల అవసరాల కోసం మాత్రమే తాము ఖర్చు చేస్తామన్నారు. వాళ్లు ఎవరో హైదరాబాద్‌కు వచ్చి వెళ్లడానికి రూ.100 కోట్లు కట్టాలా? అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణతో రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం ఉండదని స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో రోజూ నన్ను కలవచ్చు ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి చిన్న సంఘటన లేకుండా చాలా పకడ్బందీగా నిర్వహించామని భట్టి తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో ఇప్పటి వరకు 6.50 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసి లబ్ధి పొందారన్నారు. ప్రజా భవన్లో ఎవరైనా తనను ప్రతి రోజూ ఉదయం 8.30 నుంచి 9.30 వరకు కలవవచ్చుని స్పష్టం చేశారు. విడతల వారీగా రైతుబంధు నిధులు రోజు వారీగా రైతు బంధు నిధులను విడుదల చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఒక ఎకరం ఉన్న రైతులకు ఇప్పటికే రైతు బంధు నిధులు చెల్లించామని, రెండు ఎకరాలున్న రైతులకు చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. విడతల వారీగా రైతులకు రైతుబంధు నిధులు ఇస్తామన్నారు.