ఫార్ములా కారు రేసు కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. | Big Shocking Twist In ED Investigation In Formula E-Car Race, More Details Inside | Sakshi
Sakshi News home page

ఫార్ములా కారు రేసు కేసులో బిగ్‌ ట్విస్ట్‌..

Published Fri, Jan 3 2025 9:04 AM | Last Updated on Fri, Jan 3 2025 10:37 AM

E Formula Car Race Big Twist In ED investigation

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసులో పలు ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యేందుకు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి మరింత సమయం కోరారు. దీంతో, ఈనెల 8, 9 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు.

ఫార్ములా ఈ-కారు రేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో నిన్న బీఎల్‌ఎన్‌ రెడ్డి, నేడు అరవింద్‌ కుమార్‌ను ఈడీ విచారించాల్సి ఉండగా.. హాజరయ్యేందుకు సమయం కావాలని వీరిద్దరూ కోరారు. మూడు వారాల సమయం కావాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు. దీంతో, స్పందించిన ఈడీ.. రెండు వారాల సమయం కుదరదని చెప్పింది. ఈనెల 8వ తేదీన విచారణకు రావాలని బీఎల్‌ఎన్‌ రెడ్డికి మరోసారి ఈడీ.. నోటీసులు జారీ చేసింది. అలాగే, ఈనెల 9న అరవింద్‌ కుమార్‌ హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. దీంతో, వీరిద్దరూ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తకరంగా మారింది.

ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కారు రేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌ను ఈనెల 7వ తేదీన ఈడీ అధికారులు విచారించనున్నారు. అయితే, కేటీఆర్‌.. ఈడీ వెళ్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక, కారు రేసులో విదేశీ కంపెనీకి నిధులు మళ్ళించడంపై ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ స్టేట్‌మెంట్‌ను కూడా ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. ఈ స్టేట్‌మెంట్‌ ఆధారంగానే కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు.

ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ కంటే ముందే ఏ2, ఏ3 అయిన అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. కానీ, అనూహ్యంగా వారిద్దరూ తమకు సమయం కావాలని కోరారు. దీంతో, ఈడీ అధికారులు ముందుగా కేటీఆర్‌నే విచారించాల్సి వస్తోంది.

ఫార్ములా కారు రేసు కేసులో బిగ్ ట్విస్ట్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement