కేటీఆర్ ఈడీ విచారణ.. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్:
ఫార్ములా ఈ–కార్ రేసు కేసులో నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుటకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్.
ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..
కేటీఆర్ విచారణ సందర్బంగా ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసు వద్దకు భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు.
జై తెలంగాణ నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో, పోలీసులు వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించారు.
ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసు వాహనాలల్లో వారిని తరలించారు.
కేటీఆర్ విచారణ ప్రారంభం..
ఈడీ ఆఫీసులో కేటీఆర్ విచారణ ప్రారంభమైంది.
ఈడీ ఆఫీసులో విచారణకు కేటీఆర్ హాజరయ్యారు.
కేటీఆర్ విచారణ కోసం ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు.
ఈడీ ఆపీసు వద్దకు బీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి.
మరోవైపు, ఈడీ ఆఫీసు వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.
ఈడీ ఆఫీసుకు బయలుదేరిన కేటీఆర్
గచ్చిబౌలి నివాసం నుంచి బయల్దేరిన కేటీఆర్
మరికాసేపట్లో ఈడీ కార్యాలయానికి చేరుకునే అవకాశం!
ఏసీబీ విచారణ ముందు.. నందినగర్ నివాసంలో కీలక నేతలతో నేతలు చర్చలు జరిపిన కేటీఆర్
- ఇవాళ్టి విచారణకు మాత్రం గచ్చిబౌలి నివాసం నుంచే ఈడీ ఆఫీస్‌కు..
ఈడీ విచారణ వేళ ఎక్స్‌లో కేటీఆర్ ట్వీట్
- ఫార్ములా-ఈ ని తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా నేను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుంది
- ఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ- మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తడం జరిగింది
- ఎన్ని రకాల చిల్లర కేసులు, బురదజల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవు
- మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాదును పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తాను
- ఫార్ములా-ఈ రేసు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపింది...
- ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్, నిబద్ధత, హైదరాబాద్ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలి
- అందుకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాను
- రాష్ట్ర ప్రభుత్వం పంపిన 46 కోట్ల రూపాయల డబ్బులు ఫార్ములా-ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగింది.
- కేవలం బ్యాంక్ లావాదేవీగా స్పష్టమైన రికార్డు ఉంది
- ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు, ప్రతినయా పైసాకు లెక్క ఉంది
- మరి అలాంటి అప్పుడు ఇందులో అవినీతి, మనీలాండరింగ్ ఎక్కడ ఉంది?
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన రేసు రద్దు నిర్ణయం వల్లనే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లింది
- ఇలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసులు విచారణల పేరుతో ఈ అంశాన్ని లాగుతుంది
- కచ్చితంగా ఈ అంశం లో నిజమే గెలుస్తుంది... ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు, కోర్టులు కూడా త్వరలో తెలుసుకుంటాయి
- అప్పటిదాకా న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది
ఒంటరిగానే..
ఈడీ విచారణకు కేటీఆర్(KTR) లాయర్లకు అనుమతి నిరాకరణ
కేటీఆర్ ఒక్కరే విచారణకు హాజరు
ఇంతకు ముందు ఏసీబీ విచారణ టైంలో లాయర్ రగడ
కోర్టు అనుమతితో చివరకు లాయర్‌ను ఏసీబీ విచారణకు వెంట తీసుకెళ్లిన కేటీఆర్
గతంలో ఇచ్చినా..
కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో.. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఫెమా(FEMA) ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై దర్యాప్తు.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, హుడా మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డిల విచారణ పూర్తి
గత వారమే కేటీఆర్‌ను విచారించాల్సి ఉండగా.. హైకోర్టు తీర్పు నేపథ్యంతో గడువు కోరిన కేటీఆర్
దీంతో ఇవాళ(జనవరి 16న) విచారణకు రమ్మని పిలిచిన ఈడీ
తప్పని పరిస్థితి
ఈడీ అధికారుల ముందు ఎలాంటి వాదన వినిపించాలన్నది కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడానికి ప్రత్నించడం తప్ప.. తాను ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన వాదిస్తున్నారు. మంత్రిగా ఆదేశాలిచ్చింది తానే అయినా.. నియమ నిబంధనల మేరకు నిధుల బదలాయింపు ఎలా చేయాలన్న బాధ్యత అధికారులదేనని ఈడీ ముందు చెబుతారా? అనే అసక్తి నెలకొంది.
మరోసారి ఏసీబీ నోటీసులు..
కేటీఆర్ గురువారం ఈడీ ముందు హాజరైన తరువాత.. పరిణామాలను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ముందుగానే కేటీఆర్‌కు ఏసీబీ చెప్పిన నేపథ్యంలో.. విచారణకు రావాలని నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండోసారి విచారణకు వస్తే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment