Formula E Car Race Case
-
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్ : ఫార్ములా-ఈ రేసు కేసులో దర్యాప్తును అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ముమ్మరం చేసింది. తెలంగాణ మున్సిపల్ శాఖ, ఫార్ములా-ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్ఈవో)ల మధ్య జరిగిన ఒప్పందం, అందులో చోటు చేసుకున్న ఉల్లంఘనలపై అధ్యయనం చేస్తోంది.ఈ క్రమంలో గత నెలలో ఎఫ్ఈవో సీఈఓ ఆల్బర్టోకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ లండన్ నుండి వర్చువల్‌గా ఆల్బోర్టోను ఏసీబీ విచారిస్తోంది. విచారణలో భాగంగా సీజన్ 9 చెల్లింపులు , లెటర్ ఆఫ్ ఇంటెంట్, లాంగ్ ఫార్మ్ అగ్రిమెంట్ గురించి ఏసీబీ అధికారులు ఆల్బోర్టోను ప్రశ్నిస్తున్నారు. -
Formula E Car Race: ఎస్ఈవో కంపెనీకి ఏసీబీ నోటీసులు
-
ఫార్ములా కారు రేసు కేసులో ఏసీబీ దూకుడు.. నోటీసులు జారీ
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-కారు రేసు కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా ఎఫ్ఈవో కంపెనీకి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కారులో రేసులో భాగంగా రూ.55కోట్లను ఎఫ్ఈవోకు బదిలీ చేసిన హెచ్ఎండీఏ. ఈ క్రమంలో ఎఫ్ఈవో సంస్థ సీఈవో స్టేట్మెంట్ను ఏసీబీ రికార్డ్ చేయనుంది. ఈ నేపథ్యంలో విచారణ కోసం ఏసీబీని నాలుగు వారాల సమయం కోరారు ఎఫ్ఈవో సంస్థ సీఈవో. దీంతో, ఏసీబీ ఎలాంటి నిర్ణయం చెబుతుందో తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో నిందితులను మరోమారు విచారణకు పిలవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఏ–1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు ఏ–2.. ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, ఏ–3.. హెచ్ఎండీఏ మాజీ సీఈ బీఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇక, ఇప్పటికే ఈనెల 9న కేటీఆర్‌ను ఏడు గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం.. కార్ రేసు నిర్వహణలో స్పాన్సర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్‌జెన్, దాని అనుబంధ సంస్థ గ్రీన్కో ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌ను విచారించిన అధికారులు కీలక వివరాలు రాబట్టినట్టు తెలిసింది. రేస్ నిర్వహణ, అందుకు సంబంధించి జరిగిన ఆర్థిక లావాదేవీలు, రేస్ నుంచి సంస్థ తప్పుకోవడం.. అందుకు దారి తీసిన పరిస్థితులు ఇలా పలు కోణాల్లో ఆయన్ను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈసారి మరింత లోతుగా..చలమలశెట్టి ఇచ్చిన కీలక సమాచారం, గతంలో సేకరించిన పత్రాల ఆధారంగా మరోమారు కేటీఆర్‌ను లోతుగా ప్రశ్నించాలని ఏసీబీ భావిస్తున్నట్టు సమాచారం. అప్పటి మంత్రి ఆదేశాల మేరకు తాము కేవలం విధులు నిర్వర్తించామని అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలు తమ స్టేట్మెంట్లలో పేర్కొన్నారు. ఇక కేటీఆర్.. మంత్రిగా తానే ఆదేశాలు జారీ చేశానని, రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యానే తాను ఆదేశించానని, నిధుల చెల్లింపులలో నిబంధనలు పాటించడం అన్నది అధికారులకు సంబంధించిన అంశమని పలుమార్లు స్పష్టం చేశారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, మరోమారు కేటీఆర్, అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను విచారించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఈసారి కేటీఆర్ విచారణ సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. -
మరోసారి ఏసీబీ పిలుపులు?
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ కేసులో నిందితులను మరోమారు విచారణకు పిలవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఏ–1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు ఏ–2.. ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, ఏ–3.. హెచ్ఎండీఏ మాజీ సీఈ బీఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేటీఆర్‌కు రెండురోజుల్లోనే మరోమారు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇప్పటికే ఈనెల 9న కేటీఆర్‌ను ఏడు గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం.. కార్ రేసు నిర్వహణలో స్పాన్సర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్‌జెన్, దాని అనుబంధ సంస్థ గ్రీన్కో ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌ను విచారించిన అధికారులు కీలక వివరాలు రాబట్టినట్టు తెలిసింది. రేస్ నిర్వహణ, అందుకు సంబంధించి జరిగిన ఆర్థిక లావాదేవీలు, రేస్ నుంచి సంస్థ తప్పుకోవడం..అందుకు దారి తీసిన పరిస్థితులు ఇలా పలు కోణాల్లో ఆయన్ను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈసారి మరింత లోతుగా..: చలమలశెట్టి ఇచ్చిన కీలక సమాచారం, గతంలో సేకరించిన పత్రాల ఆధారంగా మరోమారు కేటీఆర్‌ను లోతుగా ప్రశ్నించాలని ఏసీబీ భావిస్తున్నట్టు సమాచారం. అప్పటి మంత్రి ఆదేశాల మేరకు తాము కేవలం విధులు నిర్వర్తించామని అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలు తమ స్టేట్మెంట్లలో పేర్కొన్నారు. ఇక కేటీఆర్..మంత్రిగా తానే ఆదేశాలు జారీ చేశానని, రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యానే తాను ఆదేశించానని, నిధుల చెల్లింపులలో నిబంధనలు పాటించడం అన్నది అధికారులకు సంబంధించిన అంశమని పలుమార్లు స్పష్టం చేశారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, మరోమారు కేటీఆర్, అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను విచారించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఈసారి కేటీఆర్ విచారణ సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. -
ఫార్ములా ఈ - కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు
-
నేడు ఏసీబీ విచారణకు ఏస్నెక్ట్స్జెన్కో, గ్రీన్కో ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కారు రేసు కేసు(Formula E Car Race Case) దర్యాప్తులో భాగంగా శనివారం ఏసీబీ(ACB) అధికారుల ఎదుట ఏస్‌నెక్ట్స్‌జెన్, గ్రీన్కో ప్రతినిధులు విచారణకు హాజరుకానున్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలు ఫార్ములా ఈ–ఆపరేషన్ లిమిటెడ్ (ఎఫ్ఈఓ), ఏస్ నెక్ట్స్‌జెన్ ప్రైవేటు లిమిటెడ్, పట్టణాభివృద్ధిశాఖ మధ్య జరిగాయి.ఇందులో సీజన్ 9కి ఏస్‌నెక్ట్స్‌జెన్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఏస్‌నెక్ట్స్‌జెన్ సంస్థకు మాతృ సంస్థ అయిన గ్రీన్కో నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కొన్ని లావాదేవీలు జరిగాయి.ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ రెండు సంస్థల కార్యాలయాల్లో ఇటీవల సోదాలు నిర్వహించారు. ఆ సందర్భంగా స్వాధీనం చేసుకున్న కొన్ని పత్రాలు, ఇప్పటి వరకు దర్యాప్తులో గుర్తించిన అంశాల ఆధారంగా మరింత సమాచారాన్ని ఈ సంస్థల ప్రతినిధుల నుంచి సేకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇదీ చదవండి: ఆరు రైల్వే లైన్లతో అనుసంధానం -
‘కేటీఆర్ అపరిచితుడిలా మాట్లాడుతున్నాడు’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చేయాల్సింది లై డిటెక్టర్ టెస్ట్ కాదు.. నార్కో అనాలసిస్ టెస్ట్ అంటూ కామెంట్స్ చేశారు సీఎల్పీ మధుసూదన్ రెడ్డి. తప్పు చేసింది మీరైతే.. విచారణకు ముఖ్యమంత్రిని ఎందుకు రమ్మంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన తప్పులు కేసీఆర్‌కు తెలుసు కాబట్టే బయటకు రావడం లేదని వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ మధుసూదన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ మాటల్లోనే డొల్లతనం బయటపడింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకముందు ఒకలా.. నమోదు చేశాక అపరిచితుడులా మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలోనే కేసు కొట్టేయాలంటూ కోర్టులకు వెళ్లి మరీ మొట్టికాయలు తిన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులలో క్యాష్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. నిన్న ఈడీ విచారణ సందర్బంగా నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.ఈడీ వాళ్లు.. ఏసీబీ అడిగిందే అడుగుతున్నారు అని చెప్పారు. నేరం ఒక్కటే అయినప్పుడు ఇంకేం అడుగుతారు. కేటీఆర్‌కు చేయాల్సింది.. లై డిటెక్టర్ టెస్ట్ కాదు.. నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలి. డ్రగ్స్ మత్తులో ఏదేదో మాట్లాడుతున్నాడు. తప్పు మీరు చేసి.. విచారణకు సీఎంను రమ్మని అడుగుతారా?. కేటీఆర్ చేసిన తప్పులు కేసీఆర్‌కు తెలుసు కాబట్టి.. బయటకు రావడం లేదు. మీ హయాంలో ప్రతిపక్షనేతల కేసులకు మీరు విచారణకు వెళ్ళారా?.కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసు, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్, కేసీఆర్ కాళేశ్వరం స్కామ్.. ఇలా ఫ్యామిలీ మొత్తం దోపిడీ చేసింది. మీ హయాంలో జరిగిన తప్పులు బయటకు వస్తున్నా నేపథ్యంలో విచక్షణ కోల్పోయి.. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా చేసిన తప్పులకు.. ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. -
కేటీఆర్ ఈడీ విచారణలో వాట్ నెక్స్ట్
-
హెచ్ఎండీఏ నిధులు ఎందుకు మళ్లించారు?... ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు
-
నిధులెందుకు మళ్లించారు?.. కేటీఆర్‌ను ప్రశ్నించిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: బ్రిటన్‌కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ) ఖాతాల్లోకి హెచ్ఎండీఏ నిధులు ఎందుకు మళ్లించారు?, రేస్ నిర్వహణ ఒప్పందాలను అతిక్రమించి ఎఫ్ఈఓకు డబ్బులు చెల్లించాలని మీరు ఎందుకు ఆదేశించారు?, ఆర్థిక శాఖ, కేబినెట్ అనుమతి లేకుండానే నిధులు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది?, మీరు చెబితేనే అధికారులు నగదు బదిలీకి పాల్పడ్డారా?, విదేశీ కంపెనీకి నగదు చెల్లింపులో ఆర్బీఐ నిబంధనలు ఎందుకు పట్టించుకోలేదు?, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు.. ఈసీ అనుమతి తీసుకోవాలని మీకు తెలియదా?, ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి చేకూరిన లబ్ధి ఏంటి?.. అంటూ మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. సుమారు ఏడు గంటలపాటు విచారణ కొనసాగింది. గురువారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన కేటీఆర్ 10.30 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన మొబైల్ ఫోన్‌ను అధికారులు సెక్యూరిటీ వద్ద డిపాజిట్ చేయించారు. అనంతరం మూడో అంతస్తులో జేడీ రోహిత్ ఆనంద్ ముందు ఓ న్యాయవాదితో కలిసి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం ఐదుగురు సభ్యుల బృందం ప్రశ్నించింది. మధ్యలో కాసేపు భోజన విరామం ఇచ్చారు. సాయంత్రం 5–30 గంటల వరకు విచారణ కొనసాగింది. రెండు డాక్యుమెంట్లు సమర్పించిన కేటీఆర్ఈ నెల 8, 9వ తేదీల్లో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, అప్పటి ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ అందజేసిన డాక్యుమెంట్ల ఆధారంగా కూడా ఈడీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. అవసరమైతే మరోమారు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని సూచించారు. వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్, ఆస్తుల వివరాలు ఆరా తీయగా, అన్నీ అందిస్తానని కేటీఆర్ తెలిపారు. అలాగే ఈడికి రెండు డాక్యుమెంట్లను (ఫార్ములా–ఈ పైన నీల్సన్ సంస్థ రూపొందించిన నివేదిక, తెలంగాణ ఈవీ పాలసీ –2020) ఇచ్చిన కేటీఆర్ అందుకు సంబంధించి వారి నుంచి రశీదు తీసుకున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారమే చెల్లింపులు చేసినట్లు వెల్లడివిశ్వసనీయ సమాచారం మేరకు.. కేటీఆర్ చాలా ప్రశ్నలకు విపులంగా సమాధానం ఇవ్వగా..నిధుల మళ్లింపు అంశం, నిబంధనలు ఎందుకు అతిక్రమించాల్సి వచ్చిందన్న ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానాలు దాటవేశారు. మరికొన్నింటికి ముక్తసరిగా జవాబులిచ్చారు. మంత్రిగా తనకు అన్ని విషయాలు తెలుసని చెప్పారు. బిజినెస్ రూల్స్, ఆర్బీఐ నిబంధనల ప్రకారమే ఎఫ్ఈఓకు చెల్లింపులు జరిగాయని స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కాకూడదనే ఎఫ్ఈవోకు చెల్లింపులు జరిపామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా హెచ్ఎండీఏ బోర్డు నుంచి మంజూరైన రూ.45.71 కోట్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేవని చెప్పారు. కేటీఆర్ చెప్పిన అంశాలన్నీ అధికారులు రికార్డ్ చేసినట్టు సమాచారం. ఎఫ్ఈఓ ప్రపోజల్స్ ఎవరు తీసుకొచ్చారు? కంపెనీనే నేరుగా సంప్రదించిందా? లేక ఇతర ప్రైవేట్ కంపెనీలు ఈ కార్ రేస్ ఫార్ములాను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాయా? అనే కోణంలో కూడా ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈవెంట్ నిర్వహణకు స్పాన్సర్‌గా అగ్రిమెంట్ చేసుకున్న ఏస్ నెక్సŠట్ జెన్ సంస్థ గురించి కూడా ఆరా తీసినట్లు సమాచారం. పటిష్ట బందోబస్తు .. ఉద్రిక్తతకేటీఆర్ ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఈడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీఆర్ ఈడీ కార్యాలయంలోకి వెళుతున్న సమయంలో పార్టీ శ్రేణులు పెద్దపెట్టున జై తెలంగాణ నినాదాలతో ఆయన వాహనం వైపు దూసుకొచ్చారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంతసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్, మన్నె క్రిశాంక్, సుమిత్రానంద్, పావని గౌడ్, కీర్తిలత గౌడ్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం 5–30 గంటలకు కేటీఆర్ తిరిగి వెళ్లే సమయంలోనూ కొందరు నాయకులు, కార్యకర్తలు అక్కడే ఉండి జై తెలంగాణ నినాదాలు చేశారు. -
ఏసీబీ దూకుడు.. ఫార్మూలా-ఈ కేసులో ఏఎస్ నెక్ట్స్ కంపెనీకి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఫార్మూలా-ఈ కార్ రేస్ కేసు(Formula-E race case)లో ఏఎస్ నెక్ట్స్ కంపెనీకి ఏసీబీ(ACB Notices) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్ బీఎల్ఎన్రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.. ఫార్ములా ఈ-కేసు ఒప్పందంపై ఏసీబీ విచారణ చేపట్టనుంది.ఫార్ములా ఈ–కార్ రేసు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఇవాళ కేటీఆర్ హాజరయ్యారు. ఈ-రేస్ కోసం విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఫెమా ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు.ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, హుడా మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డిలను ప్రశ్నించారు. నిధుల బదలాయింపునకు తానే ఆదేశించినట్లు కేటీఆర్ ఏసీబీ ముందు, బహిరంగంగా కూడా ప్రకటించారు. అయితే చెల్లింపులు ఏ విధంగా జరగాలి అనేది అధికారులు చూసుకుంటారని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్థిక శాఖ నుంచి కానీ కేబినెట్ ఆమోదం కానీ లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు మనీ లాండరింగ్ కిందకు వస్తుందన్నది ఈడీ వాదన.కేటీఆర్ గురువారం ఈడీ ముందు హాజరుకావడంతో.. పరిణామాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ముందుగానే కేటీఆర్‌కు ఏసీబీ చెప్పిన నేపథ్యంలో.. విచారణకు రావాలని నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండోసారి విచారణకు వస్తే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.ఇదీ చదవండి: ఫార్ములా కేసులో ఈడీ ముందుకు కేటీఆర్.. -
ఫార్ములా ఈ-రేస్ కేసులో కొనసాగుతున్న కేటీఆర్ ఈడీ విచారణ
-
రేవంత్.. నువ్వు జైలుకెళ్లావని మాపై కక్ష సాధింపా?: కౌశిక్‌రెడ్డి
సాక్షి, కరీంనగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth Reddy) జైలుకు వెళ్లాడు కాబట్టి.. అందర్నీ జైలుకు పంపాలని చూస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy). ప్రపంచం మొత్తం చూసి వచ్చిన వ్యక్తి కేటీఆర్(KTR). ఇదంతా రేవంత్‌కు ఏం తెలుసు? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఫార్ములా ఈ కారు రేసు కేసు అనే లొట్టపీసు కేసు అంటూ విమర్శించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ నేతల కుటుంబ సభ్యులను రేవంత్ వేధింపులకు చేస్తున్నాడు. గట్టిగా అడిగితే కేసులు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ ఒక్క రూపాయి రైతుభరోసా ఇవ్వలేదని అడిగినందుకు కేసులు పెడుతున్నారా?. రుణమాఫీ గురించి అడిగితే పెడుతున్నారా?. తులం బంగారం ఏమైందన్నందుకా కేసులు?. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నిలదీస్తే కేసులు పెడుతున్నారు.కారు రేసు అనేది ఓ లొట్టపీసు కేసు. ఈ రేసు కోసం రాష్ట్రాల మధ్య పోటీ ఉంటుంది. ఆ పోటీలో తెలంగాణకు తీసుకొస్తే.. దాన్ని కూడా రేవంత్ రద్దు చేశాడు. తెలంగాణకు రూ. 700 కోట్లు లాభం వచ్చినట్టు నెల్సన్ సర్వేనే చెప్పింది. టెస్లా కంపెనీని తీసుకురావాలనేది కేటీఆర్ లక్ష్యం. ఆ కంపెనీని తీసుకురావడానికే కేటీఆర్ కారు రేసు తీసుకొచ్చారు. దాన్ని రేవంత్ అడ్డుకున్నాడు. రేవంత్ జైలుకు వెళ్లాడు కాబట్టి.. అందర్నీ పంపించాలని అనుకుంటున్నాడు.కేటీఆర్ ప్రపంచం చూసి వచ్చిన వ్యక్తి. కేటీఆర్‌కు, రేవంత్ రెడ్డికి అదే డిఫరెన్స్. అవినీతే లేనప్పుడు ఏసీబీ ఎందుకు?. అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టలేదు?. ప్రొసీజర్ ల్యాప్స్ కేటీఆర్ తప్పు ఎందుకు అవుతుంది?. పాలసీ డిసీషన్ మాత్రమే కేటీఆర్ తీసుకుంటారు తప్ప ప్రొసీజర్‌తో ఆయనకేం సంబంధం?. కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు పోతే.. 60 లక్షల మంది కేసీఆర్‌లు తయారు అవుతారు. కేసీఆర్ ఇచ్చిన బీఫామ్ మీద గెలిచి బీఆర్ఎస్ను అంటే ఊరుకోవాలా?. కేసీఆర్ బొమ్మ లేకుండా సంజయ్ కనీసం వార్డ్ మెంబర్ కూడా గెలవలేడు.ఆర్డీవో మీద నేను ఒక్క మాటైనా మాట్లాడానా?. ఒక్కడితో నేను మాట్లాడితే ఆరుగురితో కేసులు పెట్టిస్తారా?. డీకే అరుణపై నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు కేసు పెట్టలేదే?. నాడు జూపల్లిపై ఇష్టారాజ్యంగా చేస్తే కేసీఆర్ కేసులు పెట్టలేదు కదా?. నీకో న్యాయం మాకో న్యాయమా?. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీతో దాడి చేయిస్తారా? ఖమ్మంలో హరీష్ రావుపై దాడి జరిగింది ఇదేం సంస్కృతి? అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
కేటీఆర్‌పై ఈడీ ప్రశ్నల వర్షం..
ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణదాదాపు 7 గంటల పాటు కేటీఆర్‌ను ప్రశ్నించిన ఈడీఫార్ములా- ఈ కేసులో కేటీఆర్‌ను ప్రశ్నించిన ఈడీ ఫార్ములా ఈ–కార్ రేసు కేసులో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుటకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్. కొనసాగుతున్న విచారణ.. ఈడీ ఆఫీసులో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. కేటీఆర్‌పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు రెండు గంటల పాటుగా విచారణ కొనసాగుతోందిమరోవైపు.. విచారణ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన నెలకొంది. ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..కేటీఆర్ విచారణ సందర్బంగా ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసు వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు.జై తెలంగాణ నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసులు వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసు వాహనాలల్లో వారిని తరలించారు. కేటీఆర్ విచారణ ప్రారంభం..ఈడీ ఆఫీసులో కేటీఆర్ విచారణ ప్రారంభమైంది. ఈడీ ఆఫీసులో విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ విచారణ కోసం ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఈడీ ఆపీసు వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. మరోవైపు, ఈడీ ఆఫీసు వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈడీ ఆఫీసుకు బయలుదేరిన కేటీఆర్గచ్చిబౌలి నివాసం నుంచి బయల్దేరిన కేటీఆర్మరికాసేపట్లో ఈడీ కార్యాలయానికి చేరుకునే అవకాశం!ఏసీబీ విచారణ ముందు.. నందినగర్ నివాసంలో కీలక నేతలతో నేతలు చర్చలు జరిపిన కేటీఆర్ఇవాళ్టి విచారణకు మాత్రం గచ్చిబౌలి నివాసం నుంచే ఈడీ ఆఫీస్‌కు..ఈడీ విచారణ వేళ ఎక్స్‌లో కేటీఆర్ ట్వీట్ఫార్ములా-ఈ ని తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా నేను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందిఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ- మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తడం జరిగిందిఎన్ని రకాల చిల్లర కేసులు, బురదజల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవుమంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాదును పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తానుఫార్ములా-ఈ రేసు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపింది...ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్, నిబద్ధత, హైదరాబాద్ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలిఅందుకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నానురాష్ట్ర ప్రభుత్వం పంపిన 46 కోట్ల రూపాయల డబ్బులు ఫార్ములా-ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగింది.కేవలం బ్యాంక్ లావాదేవీగా స్పష్టమైన రికార్డు ఉందిఒక్క రూపాయి కూడా వృధా కాలేదు, ప్రతినయా పైసాకు లెక్క ఉందిమరి అలాంటి అప్పుడు ఇందులో అవినీతి, మనీలాండరింగ్ ఎక్కడ ఉంది?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన రేసు రద్దు నిర్ణయం వల్లనే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందిఇలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసులు విచారణల పేరుతో ఈ అంశాన్ని లాగుతుందికచ్చితంగా ఈ అంశం లో నిజమే గెలుస్తుంది... ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు, కోర్టులు కూడా త్వరలో తెలుసుకుంటాయిఅప్పటిదాకా న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఒంటరిగానే..ఈడీ విచారణకు కేటీఆర్(KTR) లాయర్లకు అనుమతి నిరాకరణ కేటీఆర్ ఒక్కరే విచారణకు హాజరుఇంతకు ముందు ఏసీబీ విచారణ టైంలో లాయర్ రగడకోర్టు అనుమతితో చివరకు లాయర్‌ను ఏసీబీ విచారణకు వెంట తీసుకెళ్లిన కేటీఆర్గతంలో ఇచ్చినా..కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో.. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఫెమా(FEMA) ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై దర్యాప్తు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, హుడా మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డిల విచారణ పూర్తిగత వారమే కేటీఆర్‌ను విచారించాల్సి ఉండగా.. హైకోర్టు తీర్పు నేపథ్యంతో గడువు కోరిన కేటీఆర్దీంతో ఇవాళ(జనవరి 16న) విచారణకు రమ్మని పిలిచిన ఈడీతప్పని పరిస్థితిఈడీ అధికారుల ముందు ఎలాంటి వాదన వినిపించాలన్నది కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ప్రత్నించడం తప్ప.. తాను ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన వాదిస్తున్నారు. మంత్రిగా ఆదేశాలిచ్చింది తానే అయినా.. నియమ నిబంధనల మేరకు నిధుల బదలాయింపు ఎలా చేయాలన్న బాధ్యత అధికారులదేనని ఈడీ ముందు చెబుతారా? అనే అసక్తి నెలకొంది.మరోసారి ఏసీబీ నోటీసులు..కేటీఆర్ గురువారం ఈడీ ముందు హాజరైన తరువాత.. పరిణామాలను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ముందుగానే కేటీఆర్‌కు ఏసీబీ చెప్పిన నేపథ్యంలో.. విచారణకు రావాలని నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండోసారి విచారణకు వస్తే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. -
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కానున్న కేటీఆర్
-
ఈడీ విచారణకు వెళ్తున్నా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ–కార్ రేసు కేసులో గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు కానున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ప్రకటించారు. ఈ రేసు కోసం విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఫెమా ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు జరుపుతోంది. గురువారం ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు కేటీఆర్ తెలిపారు. గతంలో విచారణకు పిలిచినప్పుడు కొంత సమయం కావాలని కేటీఆర్ కోరిన విషయం తెలిసిందే. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, హుడా మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డిలను ప్రశ్నించారు. నిధుల బదలాయింపునకు తానే ఆదేశించినట్లు కేటీఆర్ ఏసీబీ ముందు, బహిరంగంగా కూడా ప్రకటించారు. అయితే చెల్లింపులు ఏ విధంగా జరగాలి అనేది అధికారులు చూసుకుంటారని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్థిక శాఖ నుంచి కానీ కేబినెట్ ఆమోదం కానీ లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు మనీ లాండరింగ్ కిందకు వస్తుందన్నది ఈడీ వాదన. విచారణకు హాజరుకాక తప్పని పరిస్థితిఈడీ అధికారుల ముందు ఎలాంటి వాదన వినిపించాలన్నది కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ప్రత్నించడం తప్ప.. తాను ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన వాదిస్తున్నారు. మంత్రిగా ఆదేశాలిచ్చింది తానే అయినా.. నియమ నిబంధనల మేరకు నిధుల బదలాయింపు ఎలా చేయాలన్న బాధ్యత అధికారులదేనని ఈడీ ముందు చెబుతారా? అనే అసక్తి నెలకొంది. ఏసీబీ కేసులో సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌ను కూడా వెనక్కు తీసుకోవాల్సి రావటంతో ఇక ఆయన విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. దీంతో ఈడీ విచారణపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.మరోసారి ఏసీబీ నోటీసులు..కేటీఆర్ గురువారం ఈడీ ముందు హాజరైన తరువాత.. పరిణామాలను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ముందుగానే కేటీఆర్‌కు ఏసీబీ చెప్పిన నేపథ్యంలో.. విచారణకు రావాలని నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండోసారి విచారణకు వస్తే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. -
రేపు ‘ఈడీ‘ ముందుకు కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr) గురువారం(జనవరి16) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా- ఈ రేసుల కేసు (Formula-e race case)లో జనవరి 16న విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఈడీ ఇప్పటికే నోటీసులిచ్చింది. ఈ నోటీసుల్లో కోరిన మేరకు కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్లనున్నారు. కేటీఆర్ గురువారం ఉదయం 10.30 గంటలకు కేటీఆర్ నందినగర్ నివాసం నుంచి ఈడీ(ED) విచారణకు వెళతారు. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న మాజీ మున్సిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ ఇంజినీర్ బిఎల్‌ఎన్‌రెడ్డిని ఈడీ ఇప్పటికే విచారించింది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేటీఆర్‌పై ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇదే కేసులో జనవరి మొదటి వారంలోనే ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. అయితే హైకోర్టులో తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్ తుదితీర్పు పెండింగ్‌లో ఉన్నందున విచారణకు రాలేనని తెలపడంతో ఈడీ కేటీఆర్‌కు సమయమిచ్చింది. అనంతరం క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఈడీ విచారణకు కేటీఆర్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బుధవారం(జనవరి 15) సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విషయంలో కేటీఆర్‌కు చుక్కెదురైంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం చెప్పడంతో కేటీఆర్ తన క్వాష్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. కాగా, ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే ఒకసారి ఏసీబీ విచారణకు కూడా హాజరయ్యారు. విచారణ కోసం కేటీఆర్‌కు ఏసీబీ మళ్లీ నోటీసులిచ్చే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి: సంజయ్‌ని నేనేం రాళ్లతో కొట్టలేదు: కౌశిక్‌రెడ్డి -
‘కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదు’
సాక్షి, న్యూఢిల్లీ: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీం కోర్టులోనూ చుక్కెదురైంది. ప్రభుత్వ వాదనలతో అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఆయన వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారణకు అనుమతించలేదు. దీంతో.. ఆయన తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.ఈ కేసులో తెలంగాణ హైకోర్టులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. దీంతో.. ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జనవరి 8వ తేదీన సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేశారు. అయితే అంతకు ముందే.. కేటీఆర్ గనుక సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలూ వినాలని తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ తరఫున కేవియట్ పిటిషన్ వేసింది. దీంతో.. ఆ పిటిషన్‌పై ఇవాళ జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం ఇరువైపులా వాదనలు వింది. కేటీఆర్ తరుఫున లాయర్ సుందరం వాదనలు ఇది కక్ష సాధింపుతో ప్రభుత్వం పెట్టిన కేసు. తెలంగాణలో ప్రభుత్వం మారిన వెంటనే ఈ కేసు పెట్టారు. ఇది ప్రభుత్వ ప్రాజెక్ట్ అని చెప్పారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదు. డబ్బు తీసుకున్నవారిని, హెచ్ఎండీఏను నిందితులుగా చేర్చలేదు అంటూ వాదనలు వినిపించారు.ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో దర్యాప్తు జరగాలి. 24 గంటల్లో కేసు కొట్టేయాలని పిటిషన్ వేశారు. ఈ కేసు దర్యాప్తునకు గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారు అని అన్నారు.ఇరువైపులా వాదనల అనంతరం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. ఈ స్టేజ్‌లో క్వాష్ పిటిషన్‌ను అనుమతించలేమని తెలిపింది. దీంతో, తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని లాయర్ సుందరం కోర్టుకు తెలిపారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదుతమ లీగల్ ఒపీనియన్ ప్రకారం కేసును విత్ డ్రా చేసుకున్నామని.. కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదని కేటీఆర్ తరఫు అడ్వకేట్ మోహిత్ రావు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఏ కోర్టులోనైనా అప్పిల్ చేసుకునేందుకు మాకు అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ కేసులో సుప్రీం కోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపింది. కేటీఆర్ క్యాష్ పిటిషన్‌పై ఆర్యమా సుందరం, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపించారు. ఈ కేసులో సెక్షన్ 13.1A పీసీ యాక్ట్ వర్తించదని వాదనలు వినిపించాం. ఏసీబీ FIRలో పేర్కొన్న అంశాలు ప్రొసీజర్‌లో ఉన్న ఇరెగ్యులారిటీకి సంబంధించిన అంశాలు అని మోహిత్ రావు పేర్కొన్నారు. -
హైడ్రాపై మరోసారి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఈ-కార్ రేస్‌లో కేటీఆర్‌కు తాను క్లీన్చిట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్‌కు ఇమేజ్ పెరిగిందని మాత్రమే చెప్పానని.. విచారణ జరిగేటప్పుడు కామెంట్ చేయడం సరికాదన్నారు. క్విడ్‌ప్రోకో జరిగిందా లేదా తేల్చాలి. హైడ్రా వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అయిందని మళ్లీ చెబుతున్నాను. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి. తాను ఫైటర్‌ను.. ఉప ఎన్నికకు భయపడేది లేదని దానం అన్నారు.‘‘నేను ఏది మాట్లాడినా కూడా సంచలనమే అవుతుంది. మూసీపై కంటి తుడుపు చర్యల్లాగా ఒక్కరోజు మూసీ నిద్ర చేశారని.. వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందే ఏసీలు పెట్టించుకుని పడుకున్నారు. వారి ఇళ్లల్లోనే చేసిన జొన్న రొట్టెలు తినకుండా.. కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారు. హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉందని ఇక్కడికి కొన్ని సంస్థలు వచ్చి స్థిరపడ్డాయి. హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ కాబట్టి ముంబయికి వెళ్ళే ఇన్వెస్టర్లు ఇక్కడికి వస్తున్నారు.’’ అని దానం నాగేందర్ చెప్పారు.‘‘పదేళ్ల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర బడ్జెట్ చూస్తే ఖాళీగా ఉంది. అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందుకెళ్తుంది. రుణమాఫీ, రైతు భరోసా అమలు జరుగుతున్నందున సీఎంకి పాలాభిషేకం చేయాలి’’ అంటూ దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్! -
ఫార్ములా కేసులో ఏం జరగబోతుందంటే?
-
ఏసీబీ విచారణకు హాజరైన BLN రెడ్డి
-
ఈనెల 16న ఈడీ ముందుకు కేటీఆర్
-
ముగిసిన బీఎల్ఎన్రెడ్డి ఏసీబీ విచారణ
సాక్షి,హైదరాబాద్ : ఫార్ములా ఈ-కార్ రేస్ (Formula E Race case) కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిని (bln reddy) ఇవాళ ఏసీబీ అధికారులు (acb) విచారించారు. హెచ్ఎండీఏ నిధులను ఎఫ్ఈవో కంపెనీకి బదిలీ చేయడంపై బీఎల్‌ఎన్‌రెడ్డిని ఏసీబీ ప్రశ్నించింది. ఆరు గంటలకు పైగా ఆయనను ఏసీబీ అధికారులు విచారించారు. బీఎల్ఎన్ని మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇదే కేసులో ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (ias arvind kumar) ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బీఎల్ఎన్రెడ్డిపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన అభియోగాల నేపథ్యంలో బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు బుధవారం ఎనిమిదిన్నర గంటలపాటు విచారించారు. ఈడీ విచారణ తర్వాత ఆయన ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.నిధుల మళ్లింపుపైనే ఈడీ ఫోకస్.. ఫార్ములా–ఈ కార్ రేస్ సీజన్–10 నిర్వహణకు సంబంధించి రాష్ట్ర మున్సిపల్ విభాగం (ఎంఏయూడీ), ఫార్ములా–ఈ రేసు నిర్వహణ సంస్థ ఎఫ్ఈవో (ఫార్ములా–ఈ ఆపరేషన్స్) సంయుక్తంగా సిద్ధమయ్యాయి. రేసు నిర్వహణకు సంబంధించి స్పాన్సర్ ఫీజు, పన్నులు కలిపి మొత్తం రూ.110 కోట్లు (90,00,000 బ్రిటన్ పౌండ్లు)ను ఎఫ్ఈవోకు చెల్లించేలా 2023 అక్టోబర్ 30న కొత్త ఒప్పందం చేసుకున్నారు.కానీ అంతకన్నా ముందే నిధులు చెల్లించాలంటూ సెప్టెంబర్ 25న తొలి వాయిదాగా 22,50,000 పౌండ్లు (మన కరెన్సీలో రూ.22,69,63,125), 29వ తేదీన రెండో వాయిదాగా 22,50,000 పౌండ్లు (అయితే పన్నులు, కమిషన్ కలిపి రూ.23,01,97,500) చెల్లించాలంటూ ఎఫ్ఈవో ఇన్వాయిస్లు పంపింది. దీనిపై అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ప్రొసీడింగ్స్‌ను పూర్తి చేశారు.అక్టోబర్ 3న మొదటి వాయిదా కింద రూ.22,69,63,125, అక్టోబర్ 11న రెండో వాయిదా కింద రూ.23,01,97,500 మంజూరు చేశారు. ఈ మొత్తం హెచ్ఎండీఏ బోర్డ్ ఖాతా నుంచే బ్రిటన్‌కు బదిలీ అయినట్టు ఈడీ గుర్తించింది. దీనిపై బీఎల్ఎన్ రెడ్డిని విచారించాలని నిర్ణయించింది. హెచ్ఎండీఏ బోర్డు నుంచి బదిలీ అయిన రూ.45.71 కోట్లు, పెనాల్టీగా ఐటీ శాఖకు చెల్లించిన రూ.8 కోట్లు కలిపి మొత్తం రూ.54.89 కోట్లకు సంబంధించిన వివరాలను రాబట్టనుంది.ఎవరి ఆదేశాలతో ఇది చేశారు?ఇందుకు సంబంధించిన పత్రాలు, హెచ్ఎండీఏ రికార్డులపై ఏసీబీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అదేవిధంగా అనుమతుల వ్యవహారాలు, అప్పటి మంత్రి కేటీఆర్ నుంచి వచ్చిన ఆదేశాలతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందన్న కోణంలో విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఏడు గంటల పాటు కేటీఆర్ ను విచారించిన ఏసీబీ
-
నిధుల మళ్లింపుపైనే ఈడీ దృష్టి
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా – ఈ కారు రేసు కేసు దర్యాప్తులో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సుదీర్ఘంగా విచారించారు. బ్రిటన్ కంపెనీకి హెచ్ఎండీఏ నుంచి నిధు ల మళ్లింపుపైనే ప్రధానంగా అర్వింద్‌కుమార్‌ను ఈడీ ప్రశ్నించినట్టు తెలిసింది. ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలు, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్రెడ్డి విచారణ సందర్భంగా సేకరించిన అంశాల ఆధారంగా అర్వింద్‌కుమార్‌ను ఈడీ అధికారు లు ప్రశ్నించారు.ఈడీ సమన్ల మేరకు గురువారం ఉదయం 11.15 గంటలకు ఆయన బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. అప్పటి నుంచి రాత్రి 7.30 గంటల వరకు దాదాపు 8 గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. హెచ్ఎండీఏకి చెందిన రూ.54.89 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా బ్రిటన్‌కు చెందిన ఫార్ములా –ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ) సంస్థకు ఎందుకు బదలాయించాల్సి వచ్చింది? హెచ్ఎండీఏ బోర్డు నిధుల ఖర్చు విషయంలో ఎలాంటి నిబంధనలు ఉంటాయి? ఫార్ములా–ఈ కారు రేసు సీజన్ 9,10 నిర్వహణ కోసం చేసుకున్న ఒప్పందాలు.. తదితర అంశాలపై విచారణ జరిపినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. విధి నిర్వహణలో భాగంగానే తాను అంతా చేసినట్టు అర్వింద్‌కుమార్ సమాధానమిచ్చినట్టు తెలిసింది. అవసరం అయితే మరోమారు విచారణకు రావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు అర్వింద్‌కుమార్‌కు సూచించినట్టు సమాచారం. -
రోజంతా ఉత్కంఠ!
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఏసీబీ విచారణకు హాజరు కావడం తీవ్ర ఉత్కంఠను రేపింది. ఆయన్ను అరెస్టు చేస్తారనే వార్తల నేపథ్యంలో..విచారణ అనంతరం ఆయన తిరిగి వచ్చేవరకు ఉత్కంఠ కొనసాగింది. ముఖ్య నేతలంతా పార్టీ కార్యాలయంలోనే ఉండి చర్చల్లో మునిగి తేలారు. గురువారం ఉదయం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఉదయాన్నే కొద్దిసేపు గృహ నిర్బంధంలో ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్సీ కవిత, పలువురు మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు కేటీఆర్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన తర్వాత నందినగర్ నుంచి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. సాయంత్రం కేటీఆర్ తిరిగి వచ్చేవరకు అక్కడే ఉన్న ఆయన.. పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. పార్టీ నేతలు విడతల వారీగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యకర్తలు, నాయకుల రాకతో తెలంగాణ భవన్లో హడావుడి నెలకొంది. సాయంత్రం తెలంగాణ భవన్‌కు వచ్చిన కేటీఆర్‌కు భారీ సంఖ్యలో నాయకులు స్వాగతం పలికారు. గుమ్మడికాయతో దిష్టితీసి, మంగళ హారతులు ఇచ్చారు. తర్వాత నందినగర్ నివాసానికి చేరుకున్న కేటీఆర్‌కు సతీమణి శైలిమ, సోదరి కవిత తిలకం దిద్ది స్వాగతం పలికారు. ఇలావుండగా ఏసీబీ కార్యాలయానికి దారితీసే రహదారుల్లో 8 చోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. సుమారుగా 400 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. మరోవైపు రెండురోజులుగా నందినగర్ నివాసంలోనే బస చేసిన కేటీఆర్.. న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో తన తరఫున వాదిస్తున్న వారితో ఏసీబీ, ఈడీ విచారణను ఎదుర్కోవాల్సిన తీరుపై చర్చించారు. -
వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటా
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బలవంతంగా పెట్టించిన కేసులో విషయం ఏమీ లేకపోవడంతో ఏసీబీ అధికారులు కూడా ఇబ్బందులు పడ్డారు. ‘పాడిందే పాడరా’ అన్నట్లు 82 ప్రశ్నలను తిప్పి తిప్పి అడిగారు. తెలంగాణ ఆరాధ్య దైవం, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో గడిచిన పదేళ్లుగా నిబద్ధతతో, పైసా అవినీతికి తావు లేకుండా పనిచేశా అని చెప్పా. ఏసీబీ మళ్లీ ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తా.ఇలాంటి కేసులు వంద పెట్టినా ఎదుర్కొంటా. ఏడాది కాలంగా లగచర్ల, హైడ్రా, విద్యుత్ చార్జీల పెంపు వంటి అనేక అంశాలపై కొట్లాడుతున్నాం. కేసులు పెట్టి మా కేడర్, ప్రజల దృష్టిని రేవంత్ మళ్లించలేరు. అవసరమైతే తెలంగాణ కోసం చస్తాను తప్ప ఇలాంటి కేసులకు తలవంచేది లేదు..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసులతో విచారణకు హాజరైన కేటీఆర్.. గురువారం సాయంత్రం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఉదయం విచారణకు వెళ్లే ముందు నందినగర్ నివాసం వద్ద కూడా ఆయన మాట్లాడారు.అణా పైసా అవినీతి లేదని చెప్పా‘తెలంగాణకు పెట్టుబడులు తేవడం, ఎలక్ట్రిక్ వాహనాలకు రాష్ట్రాన్ని హబ్‌గా మార్చాలనే దూరదృష్టితో, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచడంతో పాటు ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతోనే కష్టపడి ఫార్ములా ఈ రేస్‌ను తెచ్చానని చెప్పా. ఇందులో అణాపైసా అవినీతి లేదని స్పష్టం చేశా. అలాంటి గలీజు పనులు చేయడం రేవంత్‌కు అలవాటు అని కుండబద్ధలు కొట్టి చెప్పా. ఇక్కడ నుంచి డబ్బులు పంపాం.. డబ్బులు అందినట్లు ఎఫ్ఈఓ (ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్) వాళ్లు ధ్రువీకరించారు. ఇదే విషయాన్ని చెపితే ఏసీబీ అధికారులు నీళ్లు మింగుతున్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన రేవంత్ ఇతరులను కూడా పంపి పైశాచిక, శునకానందం పొందాలని చూస్తున్నాడు. రేవంత్ తరహాలో నేను లుచ్చా పనులు చేయలేదు. కేబినెట్లో ఉంటూ లాండ్ క్రూజర్లు కొనుగోలు చేయలేదు. బావ మరుదులకు కోట్లాది రూపాయల కాంట్రాక్టు ఇవ్వలేదు. రేవంత్ తరహాలో డబ్బు సంచులతో దొరకలేదు. పెట్టుబడులు తెచ్చేందుకు విదేశాలు తిరిగా. రేవంత్ పెట్టే కేసులకు భయపడేవారెవరూ తెలంగాణలో కానీ బీఆర్ఎస్లో కానీ లేరు..’ అని కేటీఆర్ అన్నారు.రేవంత్‌ను ఎవరూ సీఎంగా గుర్తించడం లేదు‘ఇదొక లొట్టపీసు కేసు.. ఆయనో లొట్టపీసు సీఎం. రాష్ట్రంలో రేవంత్‌ను ఎవరూ ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదు. తనను గుర్తించని వారిపై కేసులు పెట్టి లోపలేస్తున్నడు. ఏడాది తర్వాత కూడా ఆయనను ఎవరూ సీఎంగా గుర్తు పట్టకపోతే నేనేం చేయాలి. కేసులకు భయపడేది లేదు, బాధపడేది లేదు. లేని అవినీతిని పట్టుకుందామని ప్రయత్నిస్తే ఎక్కడ దొరుకుతుంది? ఏసీబీకి రేవంత్ మళ్లీ ప్రశ్నలు పంపితే తిరిగి పిలుస్తారేమో. న్యాయస్థానాల మీద విశ్వాసం ఉంది. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతా. కేసీఆర్ సైనికులుగా ఈ ఏడాదంతా రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలు, ఆరు గ్యారంటీల అమలుపై నిలదీస్తూనే ఉంటాం. ఎంత కొట్టినా రైతు భరోసా, రూ.4 వేల ఆసరా పెన్షన్, మహిళలకు ప్రతి నెలా రూ.2,500, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడుతాం. పార్టీ నాయకులు, కార్యకర్తలకు కష్టం వస్తే మేమున్నామంటూ వచ్చిన వారందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా..’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
అనుమతులు లేకుండా చెల్లింపులా?.. కేటీఆర్‌పై ఏసీబీ ప్రశ్నల వర్షం
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేసు నిర్వహణకు ఎలా బీజం పడింది?, నిబంధనలు ఎందుకు అతిక్రమించాల్సి వచ్చింది?, ఒప్పందాలతో పాటు నగదు చెల్లింపులకు సంబంధించిన ఫైళ్ల నిర్వ హణ ఎలా జరిగింది?, హెచ్ఎండీఏ పాలకమండలి అనుమతి లేకుండా, విదేశీ మారకద్రవ్య నిబంధనలు ఉల్లంఘించి ప్రైవేటు సంస్థకు పెద్దమొత్తం ఎలా చెల్లిస్తారు?, కేబినెట్, ఆర్థికశాఖ అనుమతి లేకుండా నిధుల మళ్లింపు ఎలా చేశారు?, ఫార్ములా–ఈ కార్ రేసు నిర్వహణతో రాష్ట్రానికి రూ.700 కోట్ల లాభం వచ్చినట్టు మీరు చెప్తున్నారు.. వాటి లెక్కలేవి?, రేసుకు సంబంధించిన ప్రకటనలతో ప్రభుత్వ సంస్థలకు ఏం లాభాలు వచ్చాయి?, టికెట్లు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం ఎంత?..తదితర అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావుపై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రిగా కేటీఆర్ తీసుకున్న నిర్ణయం, దాని తాలూకు కేబినెట్ ఆమోదం ఫైళ్ల సర్క్యులేషన్‌కు సంబంధించిన ప్రక్రియ, నిధుల బదిలీ..వంటి అంశాల కేంద్రంగా ఏసీబీ విచారణ కొనసాగినట్టు తెలిసింది. సుమారు 7 గంటల విచారణ సందర్భంగా అధికారులు పదేపదే ఒకే అంశంపై ప్రశ్నిస్తుండడంతో ‘మీరు ఎన్ని గంటలు ఈ కార్యాలయంలో కూర్చోమన్నా కూర్చుంటా..మీకు కావాలి అంటే బ్రేక్ తీసుకోండి.. కానీ అడిగిన ప్రశ్నలే పలు రకాలుగా అడగడం వలన లాభం లేదు. ప్రభుత్వం ఒకవేళ నన్ను అరెస్టు చేయమని మీకు ఆదేశాలు ఇస్తే..ఈ ప్రశ్నలు అడగడం అనే వృధా ప్రయాస మానేసి ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసుకోవచ్చు..’ అని కేటీఆర్ అన్నట్టు తెలిసింది. ఏసీబీ జేడీ ఆధ్వర్యంలో స్టేట్మెంట్ రికార్డ్ ఫార్ములా–ఈ కార్ రేసు నిర్వహణకు సంబంధించిన కేసులో ఏసీబీ అధికారులు నోటీసు ఇవ్వడంతో కేటీఆర్ గురువారం ఉదయం వారి ఎదుట విచారణకు హాజరయ్యారు. కోర్టు అనుమతి నేపథ్యంలో న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావుతో కలిసి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. కోర్టు ఆదేశం ప్రకారం..విచారణ సమయంలో న్యాయవాదికి కేటీఆర్ కనిపించేలా ఏర్పాటు చేశారు. జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ ఆధ్వర్యంలో మొత్తం ఐదుగురు సభ్యుల బృందం ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. బిజినెస్ రూల్స్ అధికారులు చూసుకుంటారు.. రేసు నిర్వహణ ఫైల్ కేబినెట్ ఆమోదానికి ఎందుకు పంపలేదు? అన్న అంశంపై ఏసీబీ అధికారులు పలుమార్లు ప్రశ్నించగా.. బిజినెస్ రూల్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులే చూసుకుంటారని కేటీఆర్ సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఏసీబీకి లేదని ఆయన పేర్కొన్నారు. రేసు కొనసాగించకపోవడం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వాటిల్లిందని.. ఒప్పందం రద్దుచేసి ప్రభుత్వానికి నష్టం చేకూర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఈ కేసులో ఎందుకు భాగస్వామిగా చేర్చలేదని కేటీఆర్ ప్రశ్నించినట్లు సమాచారం. రేసు నిర్వహణకు కేబినెట్ ఆమోదం గురించి ఏసీబీ ప్రశ్నించినప్పుడు.. కేబినెట్ ఆమోదం లేకుండా రేసు రద్దు చేసినందుకు ముఖ్యమంత్రిని కూడా బాధ్యుల్ని చేయాల్సి వస్తుందని కేటీఆర్ అన్నట్టు తెలిసింది. ఈ రేసుకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ, రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు తనకు ప్రభుత్వం కేటాయించిన అధికారిక ఈ–మెయిల్లో ఉన్నాయని.. ప్రస్తుతం ఆ అకౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్దనే ఉందని స్పష్టం చేశారు. మంత్రిగా విధానపరమైన నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వంలో భాగమైన తనకు ముమ్మాటికీ ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మీరు తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన జీవోను ఏమైనా ఇచ్చిందా? అని ప్రశ్నించినప్పుడు.. సచివాలయ బిజినెస్ రూల్స్ అన్నీ సీఎస్ పరిధిలో ఉంటాయని, ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వాన్నే అడగాలని కేటీఆర్ చెప్పినట్టు తెలిసింది. ఏస్ నెక్సŠట్ జెన్ సంస్థ మొదటిసారి రేసు నిర్వహించినప్పుడు పూర్తిగా డబ్బులు చెల్లించలేదంటూ.. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాల గురించి ప్రశ్నించినప్పుడు... ప్రైవేటు సంస్థ వివరాలు తనకు తెలియదని, ఆ అంశం తన పరిధిలోనిది కాదని కేటీఆర్ చెప్పినట్లు తెలిసింది. పత్రాలతో హాజరు..రేసుతో లబ్ధిపై వివరణ ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్.. ఏసీబీ ప్రశ్నించేందుకు అవకాశం ఉన్న పలు అంశాలకు సంబంధించిన కొన్ని పత్రాలను తన వెంట తెచ్చుకున్నారు. ముందు ఏసీబీ సీఐయూ డీఎస్పీ, ఈ కేసు దర్యాప్తు అధికారి మాజిద్ అలీని కలిసి, దర్యాప్తునకు సంబంధించి నోటీసులు తీసుకున్నారు. అప్పటికే కేటీఆర్‌ను విచారించేందుకు సిద్ధంగా ఉన్న ఏసీబీ జేడీ బృందం.. ప్రత్యేక గదిలో కేటీఆర్‌ను ప్రశ్నించింది. కాగా ఫార్ములా ఈ రేసు నిర్వహించడానికి గల కారణాలు..రేసు నిర్వహణతో రాష్ట్రానికి ఎలాంటి లబ్ధి జరిగిందన్న అంశాలను కేటీఆర్ వివరించినట్టు తెలిసింది. రేసు నిర్వహణతో రాష్ట్రానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగిన లబ్ధికి సంబంధించి కొన్ని పత్రాలు కూడా అందజేసినట్లు సమాచారం. విచారణ మధ్యలో కాసేపు భోజన విరామం ఇచ్చారు. ఒకవైపు కేటీఆర్‌ను ప్రశ్నిస్తూనే, మరోవైపు దర్యాప్తులో భాగంగా సేకరించిన అంశాలను ఏసీబీ అధికారులు పరిశీలించినట్టు తెలిసింది. సాయంత్రం 5 గంటల వరకు కేటీఆర్‌ను ప్రశ్నించిన అధికారులు, దర్యాప్తులో భాగంగా అవసరమైతే మళ్లీ హాజరుకావాల్సి ఉంటుందని సూచించినట్టు తెలిసింది. కాగా సాయంత్రం 5.06 గంటల సమయంలో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. అక్కడ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు: మీడియాతో కేటీఆర్ ‘ఏసీబీ పెట్టింది చెత్త కేసు..ఇందులో విషయమే లేదు. నాలుగైదు ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు. కొత్తగా అడిగిందేమీ లేదు. రేవంత్ రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలనే అటూ ఇటూ తిప్పి అడిగారు. నాపై కేసు పెట్టి రేవంత్‌రెడ్డి ఏదైనా సాధించాలనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. పైసలు పంపాను అని నేనే చెబుతున్నా. డబ్బులు వచ్చాయని వాళ్లు (ఎఫ్ఈఓ) చెబుతున్నారు. ఇందులో అవినీతి ఎక్కడుందని ప్రశ్నిస్తే అధికారుల దగ్గర సమాధానమే లేదు. వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు నాకున్న అవగాహన మేరకు సమాధానమిచ్చా. ఎన్నిసార్లు పిలిచినా తప్పక వస్తానని చెప్పా..’ అని కేటీఆర్ తెలిపారు. అభ్యంతరం తెలిపిన డీసీపీ కేటీఆర్ మీడియాతో మాట్లాడడంపై డీసీపీ విజయ్‌కుమార్ అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ‘ట్రాఫిక్ ఇబ్బంది అవుతోంది.. ఇది మీడియా పాయింట్ కాదు..ఇక్కడ మీడియా సమావేశం పెట్టొద్దు..’ అని డీసీపీ అనడంతో కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘నేను ఇక్కడ మాట్లాడితే ఏం నొచ్చింది. ఏం ఇబ్బంది అయ్యింది. మీడియాపై మీ దాడి ఏంది..? మీకు ఇంత భయం ఎందుకు?..’ అంటూ నిలదీశారు. అయితే మీడియా ప్రతినిధులను పోలీసులు పక్కకు నెట్టేయడంతో కేటీఆర్ అక్కడి నుంచి నిష్క్రమించారు. -
కుదరదు.. 15నే విచారణ చేపడతాం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసును కొట్టేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ కార్యనిర్వహాక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు(KTR)కు ఊరట దక్కలేదు. పిటిషన్‌ను తక్షణ విచారణకు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నిరాకరించింది. ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ.. కేటీఆర్ సుప్రీం కోర్టులో క్వాష్ వేశారు. అయితే ఈ పిటిషన్‌ను రేపు(శుక్రవారం) విచారణకు స్వీకరించాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరారు. అయితే.. అందుకు సీజే బెంచ్ నిరాకరించింది. ఈ నెల 15వ తేదీన విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఈ కేసులో కేటీఆర్ గనుక సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే వేస్తే తమ వాదనలు కూడా వినాలంటూ ఏసీబీ తరఫున తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక.. ఏసీబీ కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ ఇంతకుముందు హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఆయనకు చుక్కెదురైంది. ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోమని పేర్కొంటూ.. ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ సైతం ఇవ్వలేదు. -
ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ
ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసిందిఏడుగంటల పాటు కొనసాగిన విచారణమరోసారి విచారణకు రావాలని కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులుఏసీబీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ పైసలు పంపించానని చెబుతున్నా.. వాళ్లు పైసలు ఇక్కడే ఉన్నాయని చెప్పారు కరప్షన్ ఎక్కుడందని అడిగినా.. వాళ్ల నుంచి సమాధానం లేదుమీరు విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని ఏసీబీ అధికారులకు చెప్పాను రాజకీయ ఒత్తిడిలో పొలిటికల్ కేసు పెట్టి ఏదో చేయాలని చూస్తే అది సీఎం రేవంత్‌రెడ్డి మూర్ఖత్వమే అవుతుంది.పాపం వాళ్లు(ఏసీబీ అధికారులు) రేవంత్ రాసిచ్చిన నాలుగు ప్రశ్నల్ని అలా తిప్పి.. ఇలా తిప్పి నలబైసార్లు అడిగారుఇది అసంబద్ధమైన కేసు అని ఏసీబీ అధికారులకు చెప్పానునాకు తెలిసిన సమాచారం అంతా ఏసీబీకి ఇచ్చానువిచారణకు ఎప్పుడు పిలిచినా వస్తానుఎప్పుడు పిలిచినా సంతృప్తికర సమాధానం ఇస్తానువాళ్లు ఎప్పుడు విచారణకు పిలుస్తారో తెలియదుఏసీబీ ఆఫీస్‌లో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న అధికారులుఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ విచారణ. ఏసీబీ ఆఫీస్‌లో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న అధికారులుఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామంబీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్(KTR) విచారణఈ కేసులో ఏ1గా కేటీఆర్తెలంగాణ కోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరటహైకోర్టు తీర్పుతో.. కేటీఆర్ అరెస్ట్‌కు ఏసీబీకి తొలగిన అడ్డంకులు!ఏసీబీ తదుపరి చర్యలపై ఉత్కంఠ ప్రధాన అభియోగం ఇదే.. ఫార్ములా-ఈ ఆపరేషన్స్, ఎస్ నెక్ట్స్ జెన్, పురపాలకశాఖల మధ్య 9, 10, 11, 12వ సీజన్ల కార్ రేస్‌లు నిర్వహించేలా ఒప్పందం 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్‌రోడ్డులో తొమ్మిదో సీజన్ రేసింగ్ నిర్వహణ. అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదంతోనే కుదిరిన ఒప్పందం శాఖాధిపతిగా ఎంవోయూ చేసిన ఐఏఎస్ అర్వింద్ కుమార్ ఈ రేసు నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ నుంచి చెల్లింపులు HMDA బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా రూ.55 కోట్లు చెల్లింపుముఖ్యంగా రూ.46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం.ఆయన ఫిర్యాదుతోఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏ-1గా కేటీఆర్ పేరుఏ2గా ఐఏఎస్ అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి పుపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ ఫిర్యాదు మేరకు కదలిన వ్యవహారం గవర్నర్ అనుమతి.. ఆపై ఏసీబీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఫార్ములా రేసు పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ(HMDA) ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండా రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై ఏసీబీ దృష్టి కేటీఆర్ విచారణ.. పెరుగుతున్న ఉత్కంఠఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కొనసాగుతున్న విచారణKTR విచారణ పై గంట గంటకు కొనసాగుతున్న ఉత్కంఠ..KTR ఏసీబీ విచారణ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం పరిసరాల్లో భారీగా మొహరించిన BRS శ్రేణులుఆరు గంటలుగా కొనసాగుతున్న ఏసీబీ విచారణఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కొనసాగుతున్న విచారణIAS అరవింద్ కుమార్ ఇచ్చిన వాగ్మూలం ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీFEO తో ఒప్పందాలు నగదు,బదిలీ అంశాలపై ప్రశ్నిస్తున్న ఏసీబీకేబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు?ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణం ఏంటి?BRS పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్లపై ప్రశ్నిస్తున్న ఏసీబీఇప్పటికే సేకరించిన పత్రాలు ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీకేటీఆర్కు ఏసీబీ సంధించిన ప్రశ్నలు ఇవేనా?అసలు హైదరాబాద్‌లో ఫార్ములా రేస్ ప్రతిపాదన ఎవరిది? ఎవరు ఆమోదించారు?ఇక్కడే ఎందుకు నిర్వహించారు?ప్రభుత్వానికి ఏమైనా ప్రయోజనం కలిగిందా?నగదు బదిలీ చేస్తే ఇబ్బందులు వస్తాయని ఎవరైనా హెచ్చరించరా?అసలు నిబంధనలు పట్టించుకోకుండా ఎందుకు బదిలీ చేశారు?గ్రీన్కో ఎందుకు స్పాన్సర్షిప్ నుంచి వైదొలగిందినిధుల మళ్లింపు కేబినెట్ దృష్టికి ఎందుకు వెళ్లలేదు?లంచ్‌బ్రేక్ తర్వాత తిరిగి ప్రారంభమైన కేటీఆర్ విచారణకేటీఆర్ను తిరిగి విచారిస్తున్న ఏసీబీలంచ్ తర్వాత కేటీఆర్‌ను విచారిస్తున్న ఏసీబీకేటీఆర్ విచారణ.. లంచ్ బ్రేక్కేటీఆర్ ఏసీబీ విచారణకు లంచ్ బ్రేక్భోజన విరామం తర్వాత కొనసాగనున్న విచారణఇప్పటిదాకా.. మూడున్నర గంటలకు పైగా కొనసాగిన విచారణ రెండు గంటలుగా విచారణ ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న ఏసీబీ ప్రత్యేక బృందం రెండు గంటలుగా కొనసాగుతున్న విచారణకేటీఆర్ ఓ రూంలో.. ఆయన లాయర్ మరో రూంలోరేసు ఒప్పందాలు, నగదు బదిలీపైనే ప్రధానంగా కొనసాగుతున్న విచారణకేటీఆర్కు ప్రశ్నల వర్షంఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న అధికారులు ఓ గదిలో కేటీఆర్, పక్కనే లైబ్రరీలో ఆయన లాయర్ రామచందర్రావులాయర్కు కేటీఆర్ కనిపించేలా ఏర్పాట్లుకేటీఆర్పై ప్రశ్నల వర్షం గుప్పిస్తున్న ఏసీబీ అధికారుల బృందంHMDA నుంచి FEOకు రూ. 55 కోట్ల నగదు బదిలీపై ఆరారేసు ఒప్పందాల కోసం ఎవరిని కలిశారు? ఎప్పడెప్పుడు కలిశారు? ఎలాంటి చెల్లింపులు జరిగాయి? ఏదైనా వివాదాలు వస్తాయని ముందు జాగ్రత్తగా ఆర్బిట్రేషన్ పెట్టుకున్నారా?అని ప్రశ్నించే అవకాశం. ACB-KTR వాదనలు ఇలా.. ఏసీబీ: ఒప్పందం కుదరకముందే చెల్లింపులు జరిగాయిKTR: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకే రూ.55 కోట్ల ఖర్చుఏసీబీ: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ చెల్లింపులు జరిగాయిKTR: గ్రీన్కో సంస్థ వెళ్లిపోవడంతో డబ్బులు సర్దుబాటు చేశాంఏసీబీ: ఒప్పందంలో భాగం కాకపోయినా హెచ్ఎండీఏ ద్వారా చెల్లింపులుKTR: డబ్బులు ఇచ్చిన సంగతి హెచ్ఎండీఏకి తెలుసుఏసీబీ: రూ.54 కోట్ల 88 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగంKTR: ఈవెంట్ ద్వారా వచ్చిన ప్రయోజనం రూ.700 కోట్లుఏసీబీ: ఫార్ములా-ఈకి రెండు విడుతల్లో రూ.45 కోట్ల చెల్లింపులుKTR: కొన్ని సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయిఏసీబీ: తొలి విడతలో రూ.22 కోట్ల 69 లక్షల విడుదలKTR: బ్యాటరీ వెహికిల్స్ రీపర్పస్ చేసే విధంగా జీవో తెచ్చాంఏసీబీ: మలివిడతలో రూ.23 కోట్లు చెల్లించిన హెచ్ఎండీఏKTR: మరో సంస్థ రూ.1200 కోట్ల పెట్టుబడులు పెట్టిందిఏసీబీ: ఆర్బీఐ గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా విదేశీ కంపెనీకి చెల్లింపులుKTR: మొబిలిటీ వీక్ ద్వారా ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టాయిప్రత్యేక గదిలో కేటీఆర్ విచారణఏసీబీ కార్యాలయంలో కొనసాగుతున్న కేటీఆర్ విచారణఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులుజాయింట్ డైరెక్టర్, డీఎస్పీ, సీఐల సమక్షంలో కొనసాగుతున్న విచారణవిచారణకు కేటీఆర్ లాయర్, మాజీ ఏఏజీ రామచందర్రావును లోపలికి అనుమతించిన అధికారులుఅరవింద్కుమార్తో పాటు దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ విచారణ?బిజినెస్ రూల్స్ ఉల్లంఘనతో పాటు నిధుల దుర్వినియోగం అభియోగాలుకేబినెట్ అనుమతి లేకుండా ఒప్పందాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపుల అభియోగాలపై ప్రశ్నలుఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్ఏసీబీ ఆఫీస్‌కు చేరుకున్న కేటీఆర్నందినగర్ నివాసం నుంచి ఏసీబీ ఆఫీస్‌కు చేరుకున్న కేటీఆర్కేటీఆర్ వెంట ఆయన లాయర్, మాజీ ఏఏజీ రామచంద్రరావునిఖార్సైన తెలంగాణ బిడ్డను..: కేటీఆర్నందినగర్ నివాసం వద్ద మీడియాతో కేటీఆర్తెలంగాణ ప్రతిష్టను పెంచడానికే నేను ప్రయత్నించానుహైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ప్రయత్నించాంఈ క్రమంలోనే ఈ కార్ రేసు నిర్వహించాంమంత్రిగా తన బామర్దులకు కాంట్రాక్ట్ ఇప్పించే ప్రయత్నం నేనేం చేయలేదుఅరపైసా కూడా అవినీతి చేయలేదుఇంకా ఎన్ని కేసులైనా పెట్టుకో.. వాటిని ఎదుర్కొంటాం (సీఎం రేవంత్‌ను ఉద్దేశించి..)తెలంగాణ బిడ్డగా రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడిగా స్పష్టంగా చెప్తున్నారాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం ప్రపంచ స్థాయిలో ఎదిగేలా పని చేశా.. మేము కుటుంబం కోసం పని చేయలేదునేను 50 లక్షల డబ్బుతో ఎమ్మెల్యే లను కొని దొరికిన దొంగను కాదునిజం నిలకడ మీద తెలుస్తది మీ వైఫల్యాలపై పోరాడింది బీఆర్ఎస్.. అందుకే మా మీద కేసులు మీ డైవర్షన్ లకు లోనుకామునేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను.. ఏ తప్పు చేయలేదుఏ ప్రశ్నలు అడిగిన చెప్తం .. తెలంగాణ కోసం చస్తాను తప్ప తల వంచను ఎక్స్‌లో కేటీఆర్తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకేర్ములా ఈ కార్ రేసు నిర్వహించాంపెట్టుబడులను రప్పించేందుకు కోసం కృషి చేశాంవీటన్నింటిని ప్రజలు అర్థం చేసుకుంటారని విశ్వసిస్తున్నాఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుంది Worked tirelessly for bringing a prestigious event to India, to enhance the Brand image of Hyderabad & Telangana globallyAgenda was to make Hyderabad a pivotal hub for sustainable mobility as the world transitions towards it. Formula-E race was a part of the effort to realise… pic.twitter.com/JhqimVe9TI— KTR (@KTRBRS) January 9, 2025భారీ భద్రత ఏర్పాటుబంజారాహిల్స్లోని ఏసీబీ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తుకేటీఆర్ విచారణ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఏర్పాటుఏసీబీ ఆఫీస్‌కు ఇరువైపులా భారీ బారికేడ్లుమరోవైపు బీఆర్ఎస్ నేతల హౌజ్ అరెస్టులుకేటీఆర్ ఇంటికి బీఆర్ఎస్ నేతల క్యూ -
న్యాయవాది వెళ్లొచ్చు.. అయితే ఎలాంటి జోక్యం చేసుకోవద్దు!
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ల రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు హైకోర్టులో మరోసారి నిరాశే మిగిలింది. ఏసీబీ విచారణ సమయంలో తన వెంట న్యాయవాదిని అనుమతించాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం పాక్షికంగా అనుమతించింది. కేటీఆర్ వెంట న్యాయవాది రామచందర్‌రావు విచారణకు వెళ్లవచ్చని, కానీ కేటీఆర్ పక్కన కూర్చోవద్దని పేర్కొంది. పక్కనే ఉన్న మరో గదిలో నుంచి న్యాయవాది వీక్షించవచ్చని స్పష్టం చేసింది. పిటిషనర్ (కేటీఆర్)కు తన న్యాయవాది కనిపించకుంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. ఏసీబీ అధికారుల దర్యాప్తును ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ కోరగా.. దీనికి న్యాయస్థానం నిరాకరించింది. తనతోపాటు న్యాయవాదిని కూర్చోనివ్వాలంటూ.. గురువారం ఏసీబీ విచారణకు హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో... దర్యాప్తు అధికారులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని, తనతోపాటు కూర్చొనేందుకు న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ కేటీఆర్ బుధవారం హైకోర్టులో లంచ్ మోహన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 6న తాను విచారణకు హాజరయ్యేందుకు వెళ్లగా.. వెంట న్యాయవాదిని అనుమతించలేదని వివరించారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ మధ్యాహ్నం 2.15 సమయంలో విచారణ చేపట్టారు. న్యాయవాదిని అనుమతించేందుకు సర్కార్‌కు ఉన్న అభ్యంతరమేమిటో చెప్పాలని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) తేరా రజనీకాంత్‌రెడ్డిని అడిగారు. వివరాలు తెలుసుకుని చెప్పాలంటూ విచారణను సాయంత్రం 4.15కు వాయిదా వేశారు. సాయంత్రం మరోసారి విచారణ చేపట్టారు. కేటీఆర్ తరఫున న్యాయవాది ప్రభాకర్‌రావు వాదనలు వినిపిస్తూ.. కేటీఆర్ వెంట న్యాయవాదిని అనుమతించాలని, విచారించే సమయంలో ఏసీబీ అధికారులు ఆడియో, వీడియో రికార్డు చేసేలా ఆదేశించాలని న్యాయమూర్తిని కోరారు. న్యాయవాది లైబ్రరీ గది నుంచి వీక్షించొచ్చు.. వాదనలు విన్న న్యాయమూర్తి.. అత్యంత క్లిష్టమైన క్రిమినల్ నేరాల విచారణలో మాత్రమే ఆడియా, వీడియో రికార్డింగ్‌కు ఆదేశాలు ఇవ్వగలమని పేర్కొన్నారు. అయితే న్యాయవాదిని అనుమతించవద్దన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చారు. విచారణలో జోక్యం చేసుకోనప్పుడు న్యాయవాదిని అనుమతిస్తే వచ్చే నష్టమేమిటని ప్రశ్నించారు. అయితే విచారణ సమయంలో పిటిషనర్ (కేటీఆర్), దర్యాప్తు అధికారి మాత్రమే గదిలో ఉండాలని స్పష్టం చేశారు. విచారించే సమయంలో న్యాయవాదికి కనబడేలా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. ఏసీబీ ఆఫీస్ దర్యాప్తు గదిని ఆనుకుని ఉన్న లైబ్రరీ గది కిటికీ నుంచి విచారణను వీక్షించే వీలు ఉందని ఏఏజీ వివరించారు. దీనికి న్యాయమూర్తి అంగీకరించారు. ఆ లైబ్రరీ గదిలో న్యాయవాది కూర్చొని కిటికీలోంచి వీక్షించవచ్చని తెలిపారు. కేటీఆర్ వెంట న్యాయవాది రామచంద్రరావు పిటిషనర్ వెంట విచారణకు ఎవరు హాజరవుతారో ముగ్గురు న్యాయవాదుల పేర్లు ఇవ్వాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. అలా పిటిషనర్ (కేటీఆర్) ముగ్గురు న్యాయవాదుల పేర్లు ఇవ్వగా.. అందులో రామచందర్‌రావు ఏసీబీ ఆఫీసులోకి వెళ్లవచ్చని న్యాయమూర్తి తెలిపారు. అయితే సదరు న్యాయవాది ఆ విచారణలో ఎలాంటి జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు. ఆ సమయంలో విచారణాధికారులు వ్యవహరించే తీరును బట్టి మళ్లీ హైకోర్టుకు రావచ్చని తెలిపారు. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. -
సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
హేమంత్ సోరేన్లా పట్టం కడతారు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా ఈ కేసులో సీఎం రేవంత్‌రెడ్డిది రివేంజ్ అని ప్రజలు అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం(జనవరి 8) తెలంగాణభవన్‌లో జరిగిన కొత్త సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యాక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.‘ఇప్పుడుఉన్న పరిస్ధితుల్లో ఇబ్బంది ఏం లేదు.పార్టీ పెట్టినప్పుడున్న ఉన్న పరిస్ధితి, తెలంగాణ ఉద్యమకారులు పడిన ఇబ్బందులు, అమర వీరులు చేసిన త్యాగాలతో పొల్చితే ఇప్పుడున్న పరిస్ధితి ఇబ్బందేం కాదు.ఇప్పుడున్న కేసు లొట్టపీసు కేసు. రేవంత్ రెడ్డి ఒక్క లొట్టపీసు ముఖ్యమంత్రి. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తయారుచేసిన సైనికుడిని, కేసీఆర్ రక్తం పంచుకుని పుట్టిన కొడుకుని ఈ అక్రమ కేసుకు భయపడుతామా.జార్ఘండ్ సీఎం హేమంత్ సోరెన్ పైన కేంద్రం కక్ష కడితే ప్రజలకోసం,రాష్ట్రం కోసం పోరాటం చేసి శిబు సోరెన్ కొడుకు కాబట్టి ప్రజలు పట్టం కట్టారు. లగచర్ల రైతులు తమ భూమి గుంజుకోవద్దనందుకు…40 రోజులు జైల్లో అక్రమంగా పెట్టిన దానితో పొల్చితే మనకున్న పరిస్ధితి పెద్ద ఇబ్బందేం కాదు. మనం ఇబ్బందిలో ఉన్నామని అనుకోవద్దు.మనం చేయాల్సింది రైతన్నలను కాంగ్రెస్ మోసం చేస్తున్న తీరుపై ప్రజల్లో ఎండగట్టాలి.ప్రతి రైతుకి కాంగ్రెస్ ఎకరానికి రూ.17 వేలు బాకీ ఉందని చెప్పాలి. రైతు రుణమాఫీ,కౌలు రైతులకిచ్చిన కాంగ్రెస్ హమీలను ప్రశ్నించాలి.రానున్న సంవత్సరం మెత్తం రైతన్నలకు,తెలంగాణ ప్రజలకిచ్చిన హమీల అమలు,ప్రభుత్వ మోసంపైనే మాట్లాడుదాం.అంతేకానీ నాపై పెట్టిన అక్రమ కేసు గురించి అలోచించాల్సిన అవసరం లేదు. ఈ అక్రమ కేసుపైన నేను చట్టప్రకారం కొట్లాడుతా.తప్పు చేయనప్పుడు ఎవ్వరికి భయ పడేది లేదు. హైదరాబాద్ కోసం తెలంగాణ కోసం తీసుకున్న నిర్ణయాలే అన్నీ.కాంగ్రెస్ పార్టీ నేతలు డీల్లీలోనూ అబద్దాలు అడుతున్నారు.తెలంగాణలో మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తున్నామని అబద్ధాలు చెబుతున్నారు.తెలంగాణ కోసం మనం కలిసి నడుద్దాం.ఈ సంవత్సరాన్ని మెత్తంగా పోరాట నామ సంవత్సరంగా చేసి ప్రభుత్వంపైన పోరాటం చేద్దాం.ఒక్కొక్క పార్టీ కార్యకర్త ఒక్కో కేసీఆర్‌గా మారి పోరాటం చేయాలి.కాంగ్రెస్ చేస్తున్న అప్పుల తప్పులు,సాగునీటి ప్రాజెక్టులపైన చేస్తున్న దుప్ఫ్రచారంపైన మాట్లాడుదాం.రానున్న సంవత్సర కాలంలో నూతన కమీటీలు, సభ్యత్వ నమోదు, పార్టీ అద్యక్షుని ఎన్నిక వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తాం’అని కేటీఆర్ తెలిపారు. ఇదీ చదవండి: కేటీఆర్‌తో పాటు విచారణకు న్యాయవాది..హైకోర్టు షరతులు -
మరోసారి హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
-
ఏసీబీ విచారణకు వెళ్లండి: కేటీఆర్‌కు హైకోర్టు సూచన
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ కేసు(Formula-e race)లో ఏసీబీ విచారణకు న్యాయవాదిని అనుమతించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr) వేసిన లంచ్‌మోషన్ పిటిషన్ పిటిషన్‌పై హైకోర్టు బుధవారం(జనవరి 8) మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం నాలుగు గంటలకు మరోసారి విచారించింది. కేటీఆర్‌తో పాటు న్యాయవాది ఏసీబీ విచారణకు రావొచ్చు అని హైకోర్టు తెలిపింది. అయితే ఈ విషయంలో కోర్టు కొన్ని షరతులు విధించింది.కేటీఆర్‌తో పాటు రాంచందర్ అనే న్యాయవాది ఏసీబీ విచారణకు వచ్చేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. అయితే విచారణ గదిలోకి న్యాయవాది వెళ్లకూడదని ఆదేశించింది. విచారణ గదిలో మాత్రం కేటీఆర్‌తో పాటు ఏసీబీ అధికారులు మాత్రమే ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. విచారణ గది పక్కనే లైబ్రరీ గదిలో న్యాయవాది కూర్చోవచ్చని ఏసీబీ హైకోర్టు తెలిపింది. గురువారం(జనవరి 9) ఏసీబీ విచారణకు వెళ్లాలని కోర్టు కేటీఆర్‌కు సూచించింది. స్టేట్మెంట్ రికార్డులో ఏమైనా అనుమానాలుంటే తమను సంప్రదించవచ్చని కోర్టు తెలిపింది. విచారణను ఆడియో వీడియో రికార్డింగ్ చేయడానికి హైకోర్టు నో చెప్పింది. ఇప్పటికే ఒకసారి కేటీఆర్ తన లాయర్‌తో పాటు ఏసీబీ విచారణకు వెళితే ఏసీబీ అనుమతించని విషయం తెలిసిందే. దీంతో గురువారం(జనవరి 9) ఏసీబీ ఆఫీసులో జరగనున్న విచారణ కీలకంగా మారింది. ఫార్ములా ఈ కార్ రేసులో తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు ఇప్పటికే కొట్టేసిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు -
కేటీఆర్ అన్నట్టు... నిజంగానే లొట్టపీసు కేసా..? కాంగ్రెస్ తో ఉన్న ఆధారాలు
-
ఈడీ ముందుకు BLN రెడ్డి..
-
ఏసీబీ విచారణకు హాజరైన IAS అధికారి అరవింద్
-
న్యాయవాదుల సమక్షంలోనే విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించనున్న కేటీఆర్
-
ఏసీబీ విచారణ.. హైకోర్టులో కేటీఆర్ మరో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.. తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రేపటి ఏసీబీ విచారణలో భాగంగా తనతో న్యాయవాదిని అనుమతించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో పిటిషన్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పిటిషన్‌ను మధ్యాహ్నం హైకోర్టు విచారించనుంది. -
సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్
-
KSR Live Show: కేటీఆర్ అరెస్ట్ అవుతాడా?.. బీజేపీ రియాక్షన్ చూడండి..
-
KSR Live Show: కేటీఆర్ పై కేసు నిలబడదు.. లాజిక్ చెప్పిన బీఆర్ఎస్ నేత
-
కారు రేసు కేసు.. అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు
ED And ACB Investigation Formula Car Race Case Updates..👉తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు(Formula e-Car Race) కేసులో ఏసీబీ విచారణకు ఐపీఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణకు హాజరయ్యారు. 👉అలాగే, ఇదే కేసులో ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. 👉రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్ కుమార్ స్టేట్మెంట్ను ఏసీబీ రికార్డ్ చేయనుంది. 👉ఫార్ములా ఈ-కార్ రేసు అగ్రిమెంట్లో అరవింద్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. నిధుల దుర్వినయోగం కేసులో అరవింద్ కుమార్‌ను ఏసీబీ ఏ2గా చేర్చింది. 👉ఇక, ఇదే కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు.. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. ఇక, ఫార్ములా ఈ-కారు రేసులో కేటీఆర్.. రేపు ఏసీబీ విచారణను వెళ్లనున్నారు. అలాగే, ఈనెల 16వ తేదీన కేటీఆర్ ఈడీ విచారణకు హాజరుకానున్నట్టు తెలిపారు.👉మరోవైపు.. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్(KTR) క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో, సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. కక్ష సాధింపు కారణంగానే తనపై ఈ కేసు పెట్టినట్టు కేటీఆర్. ఇదే సమయంలో తాను రాజ్యాంగబద్దంగా ఉన్న హక్కులను వినియోగించుకుంటానని చెప్పారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉందని తెలిపారు. చివరకు న్యాయమే గెలుస్తుందని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: నాకు ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్ వాళ్లు ఫీలవుతున్నారు: కేటీఆర్ -
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఫైర్
-
దర్యాప్తు అడ్డుకోలేం.. ఏసీబీ కేసుపై హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావుకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. దర్యాప్తును అడ్డుకునేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అప్పీల్ చేసుకునేందుకు వీలుగా 10 రోజుల వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలిచ్చేందుకు నిరాకరించింది. కేసు దర్యాప్తునకు ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. కేటీఆర్‌ను అరెస్టు చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది. ఫార్ములా ఈ రేసును హైదరాబాద్‌లో నిర్వహించే నిమిత్తం హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకోవడం వెనుక నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక నష్టం వాటిల్లిందంటూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 20న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ గత నెల 20న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపి డిసెంబర్ 31న తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం..మంగళవారం ఉదయం 35 పేజీల తీర్పు వెలువరించింది. సాక్ష్యాల సేకరణకు అవకాశం ఇవ్వాలి ‘ఆర్థిక శాఖ అనుమతి లేకుండా రూ.54,88,87,043 నగదు రెండు దఫాలుగా విదేశీ కంపెనీకి చెల్లించాల్సిందిగా హెచ్ఎండీఏను నాటి మంత్రి కేటీఆర్ ఆదేశించారనేది ఆరోపణ. దురుద్దేశంతో నిధులు బదిలీ చేయమని ఆదేశించారా? తన లబ్ధి కోసం చెల్లించమన్నారా? మూడో పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారా? అనేది దర్యాప్తులో తేలుతుంది. హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, అనుమతి లేకుండా బదిలీ జరిగినట్టుగా ప్రాథమిక ఆధారాలు తెలియజేస్తున్నాయి. విచారణ జరిపేందుకు ఇవి సరిపోతాయి. ఆరోపణలపై నిజానిజాలు నిగ్గుతేలాలంటే దర్యాప్తు చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మరుసటి రోజే దాన్ని కొట్టివేయాలంటూ దాఖలైన ఇలాంటి పిటిషన్‌పై గతంలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దర్యాప్తు చేయడానికి అధికారులకు అవకాశం ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ రద్దు చేసిన హైకోర్టు తీరును తప్పుబట్టింది. ఈ కేసులో కూడా డిసెంబర్ 18న ఫిర్యాదు, 19న ఎఫ్ఐఆర్ దాఖలు చేయగా, 20న కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దర్యాప్తు సంస్థలు విచారణ చేయడానికి, సాక్ష్యాలను సేకరించడానికి సహేతుకమైన అవకాశం ఇవ్వాలి. అందుకే ఈ కేసు దర్యాప్తును తొందపడి అడ్డుకోవాలని ఈ కోర్టు అనుకోవడం లేదు. దురుద్దేశం, ఆరోపణలు, నిజాయితీ లేకుండా వ్యవహరించారా? లేదా? అనేది విచారణలో తేలుతుంది. ఇప్పుడు దర్యాప్తును అడ్డుకోవడం తొందరపాటు చర్యే అవుతుంది. ఈ దశలో కోర్టుల మినీ ట్రయల్ సరికాదు నేరం జరిగినట్లు ఎఫ్ఐఆర్లో వెల్లడించాల్సిన అవసరం లేదు. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగా కోర్టులు మినీ ట్రయల్ నిర్వహించడం సరికాదు. పిటిషనర్‌పై ఐపీసీ సెక్షన్ 409, అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(ఎ), 13(2) వంటి సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. బీఎన్ఎస్ సెక్షన్ 528 మేరకు ఎఫ్ఐఆర్ను రద్దు చేసేందుకు కోర్టుకున్న అధికారం పరిమితం. కేసు విచారణ ప్రక్రియ దుర్వినియోగం అవుతున్నప్పుడు, చట్ట దుర్వినియోగానికి దారితీసే సందర్భాల్లోనే చాలా అరుదుగా కోర్టుల జోక్యానికి వీలుంది. దర్యాప్తు అధికారాలను కోర్టులు తమ చేతుల్లోకి తీసుకోబోవు. ఈ కేసులో సెక్షన్ 528 కింద కోర్టు తన స్వాభావిక అధికారాన్ని వినియోగించి ఆరోపణలపై విచారణ చేపట్టబోదు. ఆలస్యం జరిగిందనే కారణంతో కొట్టివేత కుదరదు భజన్‌లాల్, నీహారిక ఇ¯న్ఫ్రాస్ట్రక్చర్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇక్కడి కేసుకు వర్తించవు. 14 నెలలు ఆలస్యంగా కేసు నమోదు అయ్యిందని చెప్పి ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరడానికి వీల్లేదు. మంత్రిగా చేసిన వాళ్లపై కేసు నమోదుకు వీల్లేదన్న పిటిషనర్ వాదన ఆమోదయోగ్యంగా లేదు. ఏసీబీ కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు పూర్తి కాకుండానే ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరడం చట్ట వ్యతిరేకం. ఎఫ్ఐఆర్ రద్దు చేయడానికి అర్హమైనదా, కాదా అనే అంశంలోకి వెళ్లే ముందు పిటిషనర్‌పై ఉన్న అభియోగాలపై దర్యాప్తు జరగాల్సి ఉంది. హెచ్ఎండీఏ అనేది ప్రత్యేక సంస్థ. ఆస్తులు ఉండటమే కాకుండా అభివృద్ధిలో భాగంగా పలు ఒప్పందాలు చేసుకోవడానికి అధికారమున్న సంస్థ. పురపాలక శాఖ పరిధిలోనే ఇది పని చేస్తుంది. ఆ శాఖ అప్పటి మంత్రిగా పిటిషనర్ అదీనంలోనే హెచ్ఎండీఏ విధులు నిర్వహించింది.. ఆదేశాలు పాటించింది. ఈ కేసులో ఫార్ములా ఈ రేసు నిర్వహించిన సంస్థ ఆర్థికంగా లబ్ధి పొందినా, ఆ సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదని పిటిషనర్ వాదించారు. అయితే ఇది ఏసీబీ దర్యాప్తులో తేలే అంశం. మొత్తంగా చూస్తే ఏసీబీ ఎఫ్ఐఆర్ను ప్రాథమిక దశలోనే కొట్టివేయలేం..’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేటీఆర్‌ను అరెస్టు చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పది రోజులపాటు పొడిగించాలన్న కేటీఆర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు అభ్యర్థనను తోసిపుచ్చింది. క్రిమినల్ కేసుల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నేరుగా సుప్రీంకోర్టులోనే సవాల్ చేయాల్సి ఉంటుంది. విచారణ జరిపే అధికారం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి ఉండదు. -
నాకు ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్ వాళ్లు ఫీలవుతున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-కారు రేసు(Formula E-car Race)లో తన క్వాష్ పిటిషన్ కొట్టివేసినందుకే ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్ వాళ్లు ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). ఇదే సమయంలో తనపై ఏసీబీ పెట్టింది అక్రమ కేసు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే, హైకోర్టు విచారణ చేసుకోండని చెప్పింది కానీ.. నేను నేరం చేశానని చెప్పలేదని అన్నారు.మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నాపై కక్ష సాధించాలనే లొట్టపీసు కేసు పెట్టారు. నాపై పెట్టింది అక్రమ కేసు. ఏసీబీ(Telangana ACB)ది తప్పుడు ఎఫ్ఐఆర్. అవినీతి లేదని తెలిసి కూడా నామీద కేసు పెట్టి శునకానందం పొందుతున్నారు. న్యాయ వ్యవస్థపై నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కొంత మంది మంత్రులైతే వాళ్లే న్యాయమూర్తులుగా మారిపోతున్నారు. వారే తీర్పులు చెబుతున్నారు. మంత్రులకు అంత ఉలికపాటు ఎందుకు?. క్వాష్ పిటిషన్ కొట్టివేసినందుకే నాకు ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్ వాళ్లు ఫీలవుతున్నారు. మీలాగా దివాళాకోరు పనిచేసే ఖర్మ నాకు పట్టలేదు. హైకోర్టు(telangana High Court) విచారణ చేసుకోండని చెప్పింది కానీ.. నేను నేరం చేశానని చెప్పలేదు. తెలంగాణ ఇమేజ్ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లేందుకు ఫార్ములా రేస్ నిర్ణయం తీసుకున్నాం. అసెంబ్లీలో చర్చ పెట్టమంటే రేవంత్ పారిపోయారు. రేవంత్ ఇంట్రెస్ట్ ఫార్ములా.. మా ఇంట్రెస్ట్ ఫార్మర్. ఇచ్చిన హామీలపై చిట్టి నాయుడు దృష్టి పెట్టాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు నిలదీస్తాం. అన్ని పార్టీలకు గ్రీన్కో ఎన్నికల బాండ్లు ఇచ్చింది. చట్టాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో లాయర్లతో విచారణకు వెళ్లాను. రాజ్యాంగపరంగా ప్రతీ హక్కును వినియోగించుకుంటాను. హైకోర్టు అనుమతి ఇస్తే లాయర్ల కలిసి విచారణకు తప్పకుండా వెళ్తాను. సుప్రీంకోర్టులో న్యాయపరంగా పోరాడుతాను. నేను ఏ తప్పూ చేయలేదు.. ఏ విచారణకైనా సిద్ధం. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. ఈనెల 16న ఈడీ విచారణకు కూడా హాజరు అవుతాను. అవినీతిలో పట్టుబడిన వారికి ప్రతీ విషయం అవినీతిలాగానే కనబడుతుంది. ఇది.. ఆరంభం మాత్రమే. చివరికి న్యాయమే గెలుస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు(Formula E Car Race Case)లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court)లో ఆయన సవాల్ చేశారు.ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ కేసును కొట్టేయాలని కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ దర్యాప్తులో మేం జోక్యం చేసుకోం అని తీర్పు సందర్భంగా పేర్కొంది. అయితే ఆ సమయంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరగా.. ఆ విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు.ఈ కేసులో తాజా పరిణామాలపై ఏసీబీ ఆఫీసులో అధికారులు భేటీ అయ్యారు. ఎఫ్ఈవో, హెచ్‌డీఏతో పాటు రెవెన్యూ అధికారుల పాత్రపై చర్చించడంతో పాటు సుప్రీం కోర్టును కేటీఆర్ ఆశ్రయించడంతో.. అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించారు.మరో వైపు.. అధికారులు అరవింద్‌కుమార్, బీఎల్ఎన్రెడ్డి నోటీసులపై చర్చతో పాటు, మొదటి రేసు తర్వాత తప్పుకున్న కంపెనీలపై కూడా చర్చించారు. ఏసీబీ ఉన్నతాధికారులతో బంజారాహిల్స్ ఏసీపీ,సీఐతో పాటు కొంతమంది సిబ్బంది సమావేశమయ్యారు. క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. కాగా, తమ వాదన కూడా వినాలని ప్రభుత్వం.. కేవీయట్ వేసింది.ఇదీ చదవండి: కేటీఆర్‌దే బాధ్యత.. ఎఫ్ఐఆర్ క్వాష్ అరుదైన నిర్ణయం: హైకోర్టు -
ఏసీబీ అధికారుల భేటీపై ఉత్కంఠ.. ఏం జరగబోతుంది?
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-రేస్ కేసులో తాజా పరిణామాలపై ఏసీబీ ఆఫీసులో అధికారులు భేటీ అయ్యారు. ఎఫ్ఈవో, హెచ్‌డీఏతో పాటు రెవెన్యూ అధికారుల పాత్రపై చర్చించడంతో పాటు సుప్రీం కోర్టును కేటీఆర్ ఆశ్రయిస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించారు.మరో వైపు.. అధికారులు అరవింద్‌కుమార్, బీఎల్ఎన్రెడ్డి నోటీసులపై చర్చతో పాటు, మొదటి రేసు తర్వాత తప్పుకున్న కంపెనీలపై కూడా చర్చించారు. ఏసీబీ ఉన్నతాధికారులతో బంజారాహిల్స్ ఏసీపీ,సీఐతో పాటు కొంతమంది సిబ్బంది సమావేశమయ్యారు. క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. కేటీఆర్ సుప్రీంను ఆశ్రయిస్తే తమ వాదన కూడా వినాలని ప్రభుత్వం.. కేవీయట్ వేసింది.కాగా, ఫార్ములా ఈ కార్ రేసు కేసులో శరవేగంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేటీఆర్ క్వాష్‌పై హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఏసీబీ దూకుడు ప్రదర్శించింది. ఈ కేసులో కీలకంగా ఉన్న గ్రీన్కో, దాని అనుబంధ సంస్థల్లో తనిఖీలు నిర్వహించింది. అదే సమయంలో ఈ కేసులో నిందితుల ఇళ్లపై సోదాలకు కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తెచ్చుకుంది.ఇదీ చదవండి: కేటీఆర్‌దే బాధ్యత.. ఎఫ్ఐఆర్ క్వాష్ అరుదైన నిర్ణయం: హైకోర్టుఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా.. కోర్టు అనుమతితో ఏ క్షణమైనా వీళ్ల నివాసాల్లో తనిఖీలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. గ్రీన్ కో కంపెనీ ద్వారా జరిగిన ఒప్పందం, లావాదేవీలపై వాళ్లను విచారించే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. హెచ్ఎండీ ద్వారా రేసు కోసం జరిగిన ఒప్పంద పత్రాలను సేకరించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పంచాయితీ సుప్రీం కోర్టుకు చేరింది. తెెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఫాార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ గనుక సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. తమ వాదనలు సైతం వినాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇక.. హైకోర్టులో చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం, బీఆర్ఎస్ కీలక నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసే అవకాశం ఉంది. -
కేటీఆర్‌దే బాధ్యత.. ఎఫ్ఐఆర్ క్వాష్ అరుదైన నిర్ణయం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ (KTR) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో ఆర్డర్ కాపీలో కీలక విషయాలను వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకు మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బాధ్యుడిగా ఉండాలి. హెచ్ఎండీఏ నిధులు సంబంధిత మంత్రి పర్యవేక్షణలోనే ఉంటాయని ప్రాధమికంగా తేలింది. అవి దుర్వినియోగం అయ్యాయా? లేదా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని వ్యాఖ్యలు చేసింది.కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత అనంతరం హైకోర్టు ఆర్డర్ కాపీ విడుదల చేసింది. 45అంశాలతో 35పేజీల ఆర్డర్ కాపీని విడుదల చేసింది. ఈ సందర్బంగా.. ఉన్నత న్యాయస్థానం (Telangana High Court) పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సంస్థల అధికారాలను కోర్టులు అడ్డుకోలేవు. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. హెచ్ఎండీఏ ఖాతాలోని డబ్బును నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చి ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలకు లబ్ధి చేకూర్చారని అభియోగాలున్నాయి. ఆరోపణల మేరకు ఏసీబీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అప్పటి ప్రభుత్వంలో పురపాలక మంత్రిగా ఉన్న కేటీఆర్ హెచ్ఎండీఏ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. ఎఫ్ఐఆర్ను కొట్టివేసే అధికారాన్ని కోర్టు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.పోలీసుల దర్యాప్తు అన్యాయంగా ఉంటేనే కోర్టు తన అధికారాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. పోలీసులకు ఉన్న అధికారాలను కోర్టు ఎప్పుడూ అన్యాయంగా తీసుకోదు. ఏసీబీ చేసిన ఆరోపణల్లోకి వెళ్లి దర్యాప్తు చేయాలని కోర్టు భావించడం లేదు. ఈ కేసులో నేరపూరిత కుట్ర జరిగిందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి బాధ్యత గల హోదాలో ఉన్నారు. మరో నిందితుడితో కలిసి కేటీఆర్ హెచ్ఎండీఏ(HMDA) నిధులను అక్రమంగా వినియోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి మండలి, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే పిటిషనర్ హెచ్ఎండీఏ నుంచి భారీ మొత్తంలో నగదు బదిలీ చేయించినట్లు ఆరోపణలున్నాయి. సొంత లబ్ధి కోసమా.. లేక మూడో వ్యక్తి ప్రయోజనం కోసం నగదు బదిలీ జరిగిందా.. అనేదానిపై దర్యాప్తు జరగాల్సి ఉంది.అయితే, నిధుల దుర్వినియోగం జరగలేదని పిటిషనర్ వాదించడాన్ని కోర్టు నమ్మడం లేదు. దర్యాప్తులో ఈ విషయాలన్నీ తేలాల్సి ఉంది. నేరం జరిగిందని చెప్పడానికి ప్రాథమిక ఆరోపణలు మాత్రమే ఎఫ్ఐఆర్(FIR)లో ఉంటాయి. పూర్తిస్థాయి వివరాలన్నీ ఎఫ్ఐఆర్లో పొందుపర్చాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 18న ఫిర్యాదు అందితే, 19న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 20న పిటిషనర్ క్వాష్ పిటిషన్ వేశారు. ఆధారాలు సేకరించాల్సిన సమయం దర్యాప్తు సంస్థలకు కావాలి. దర్యాప్తు విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోదల్చుకోలేదు’ అని ధర్మాసనం కామెంట్స్ చేసింది. ఇది కూడా చదవండి: ఏసీబీ దూకుడు.. ‘సుప్రీం’కు చేరిన ఈ-కార్ రేసు పంచాయితీ! -
హైకోర్టులో ఎదురుదెబ్బ..స్పందించిన కేటీఆర్
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా-ఈ కార్ రేసుల కేసులో తన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన తర్వాత కేటీఆర్ తొలిసారి స్పందించారు. ఈ విషయమై మంగళవారం(జనవరి 7) కేటీఆర్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ‘నా మాటలను నమ్మండి, ఈ ఎదురుదెబ్బ కంటే నా పునరాగమనం బలంగా ఉంటుంది.మీ అబద్ధాలు నన్ను విచ్ఛిన్నం చేయవు. నేటి అడ్డంకులు రేపటి విజయానికి దారి తీస్తాయి. సత్యం..కాలంతో పాటు ప్రకాశిస్తుంది.నేటి అడ్డంకులు రేపటి విజయానికి దారి తీస్తాయి.మన న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. న్యాయం గెలుస్తుందనే అచంచలమైన నమ్మకం నాకుంది. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది. ప్రపంచమే దీనికి సాక్ష్యంగా నిలుస్తుంది’అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.Mark my words, Our comeback will be stronger than this setback Your lies won't shatter meYour words won't diminish meYour actions won't obscure my visionThis cacophony won't silence me!Today's obstacles will give way to tomorrow's triumph.Truth will shine brighter with…— KTR (@KTRBRS) January 7, 2025మరోవైపు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంపై కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని సమాచారం. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఎలాంటి నిర్ణయం వెలువరించే ముందైనా తమ వాదన వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఇదీ చదవండి: కేటీఆర్‌కు మరోసారి ‘ఈడీ’ నోటీసులు -
BIG Update : ఫార్ములా ఈ-రేస్ కేసులో స్పీడ్ పెంచిన ఏసీబీ
-
కేటీఆర్‌కు మరోసారి ‘ఈడీ’ నోటీసులు
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా- ఈ కార్ రేసు కేసులో ఈ నెల 16న తమ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో ఈడీ కోరింది. నిజానికి కేటీఆర్ ఈడీ ఎదుట మంగళవారం(జనవరి 7)విచారణకు హాజరవ్వాల్సి ఉంది. అయితే క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో తీర్పు పెండింగ్‌లో ఉన్నందున విచారణకు వచ్చేందుకు సమయం కావాలని కేటీఆర్ ఈడీని కోరారు. దీంతో ఈడీ సమయమిచ్చింది. మరోవైపు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేయడంతో ఈడీ తాజాగా కేటీఆర్‌కు మళ్లీ నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.కాగా, గురువారం(జనవరి 9) విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఏసీబీ ఇప్పటికే నోటీసులిచ్చింది. అయితే తన క్వాష్ పిటిషన్ కొట్టి వేయడంపై కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళతారన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.కేటీఆర్ వేసిన పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఇదీ చదవండి: సుప్రీంకు ఫార్ములా ఈ కేసు పంచాయితీ -
సుప్రీం కోర్టుకు ఈ-కార్ రేసు పంచాయితీ!
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో శరవేగంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేటీఆర్ క్వాష్‌పై హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఏసీబీ దూకుడు ప్రదర్శించింది. ఈ కేసులో కీలకంగా ఉన్న గ్రీన్కో, దాని అనుబంధ సంస్థల్లో తనిఖీలు నిర్వహించింది. అదే సమయంలో ఈ కేసులో నిందితుల ఇళ్లపై సోదాలకు కోర్టు నుంచి సెర్చ్ వారెంట్(Search Warrant) తెచ్చుకుంది.ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా.. కోర్టు అనుమతితో ఏ క్షణమైనా వీళ్ల నివాసాల్లో తనిఖీలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. గ్రీన్ కో కంపెనీ ద్వారా జరిగిన ఒప్పందం, లావాదేవీలపై వాళ్లను విచారించే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. హెచ్ఎండీ ద్వారా రేసు కోసం జరిగిన ఒప్పంద పత్రాలను సేకరించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. ఫార్ములా ఈ కార్ రేసు(Formula E Car Race Case) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పంచాయితీ సుప్రీం కోర్టుకు చేరింది. తెెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఫాార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ గనుక సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. తమ వాదనలు సైతం వినాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇక.. హైకోర్టులో చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం, బీఆర్ఎస్(BRS Party) కీలక నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసే అవకాశం ఉంది. -
కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకొస్తారు: హరీష్‌రావు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేస్ కేసులో తనపై ఏసీబీ(ACB) దాఖలు చేసిన కేసును కొట్టేయాలన్న ఆయన అభ్యర్థనను ఉన్నతన్యాయస్థానం కొట్టేసింది. ఈ పరిణామంపై తెలంగాణ రాజకీయ వర్గాలు స్పందిస్తున్నాయి.హైకోర్టు తీర్పు అనంతరం నందినగర్‌లోని కేటీఆర్ నివాసం వద్ద బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్(Diversion Politics), కక్ష సాధింపు చర్యలు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ తరహా రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టారు. ఫార్ములా ఈ రేస్ కేసు వల్ల తెలంగాణకు మంచే జరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం కేటీఆర్ కష్టపడ్డారు. ఈ వ్యవహారంలో అవినీతికి ఆస్కారమే లేదు. న్యాయ స్థానాలు, చట్టంపై గౌరవం ఉంది. కేటీఆర్ ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే కేటీఆర్ విచారణకు సహకరిస్తానన్నారు. ఏసీబీ విచారణకు వెళ్తే.. 40 నిమిషాలు బయట నిల్చొబెట్టారు. అయినా ఆయన ఓపికగా వ్యవహరించారు. తిరిగి 9వ తేదీన విచారణకు రమ్మన్నారు. ఆ రోజు కూడా ఆయన విచారణకు హాజరవుతారు. ఇది కుట్రపూరితమైన కేసు. మేం సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకు వస్తారు. మా పార్టీ వాళ్లపై రేవంత్ రెడ్డి ఇంకా కేసులు పెట్టొచ్చు. కానీ, మేం అధైర్య పడం. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరఫున పోరాడతాం. రేవంత్ అక్రమాలకు ప్రశ్నిస్తూనే ఉంటాం.హైకోర్టు తీర్పు కాపీ ఇంకా అందలేదు. అది వచ్చాక ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటాం. సోషల్ మీడియాలో హైకోర్టు తీర్పుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్‌ను విచారణ జరపమని మాత్రమే హైకోర్టు చెప్పింది. అసలు విచారణే ప్రారంభం కానప్పుడు.. ఇది తప్పుడు కేసు ఎలా అవుతుంది. కేటీఆర్‌కు శిక్ష పడుతుందంటూ బోగస్ వార్తలు ప్రచురిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు అవి మానుకుంటే మంచిది’’ అని హరీష్ అన్నారు.👉కేటీఆర్ యాక్టింగ్ చూసి సినిమా వాల్లే ఆశ్చర్యపోతున్నారు. జైలు కు పోవడానికి సిద్దం అని..ఇప్పుడు ఈ దొంగ నాటకాలు ఎందుకు.ఈ ఫార్ములా కేసు ను లొట్టపీసు కేసు అన్నది కేటీఆర్ కాదా?. జైలు కు పోయి యోగా చేస్తా అన్నది కేటీఆర్ కాదా?. తప్పే చేయలేదు , సుద్దపూస అని ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ కు చట్టం తెలియదా? అడ్వకేట్ లతో ఏసీబీ ఆఫీస్ కు ఎలా వెళ్తారు?. కోర్టు పర్మిషన్ లేకుండా అడ్వకేట్ లను ఏసీబీ అనుమతించదని తెలియదా?:::బల్మూరి వెంకట్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ👉కేటీఆర్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఫార్ములా ఈ రేసు.. మనీ లాండరింగ్ కేసులాగా అనిపిస్తోంది. ప్రభుత్వంలో ఉంటే ఏ తప్పైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటే.:::వీహెచ్, మాజీ ఎంపీ -
కేటీఆర్‌కు బిగ్ షాక్.. వాట్ నెక్స్ట్?
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అరెస్ట్ నుంచి రక్షణ కోరగా.. ఆ విషయంలోనూ ఊరట ఇవ్వలేదు. దీంతో వాట్ నెక్స్ట్ అనే చర్చ తెరపైకి వచ్చింది. వాస్తవానికి క్వాష్ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు కేటీఆర్(KTR)కు ఊరట ఇచ్చింది. తీర్పు ఇచ్చేంతవరకు ఆయన్ని అరెస్ట్ చేయొద్దని కోర్టు దర్యాప్తు సంస్థలకు సూచించింది. దీంతో ఇవాళ్టి వరకు ఎలాంటి చర్యలకు అవి ఉపక్రమించలేదు. మరోవైపు.. ఈ కారణం చూపిస్తూనే ఆయన దర్యాప్తు సంస్థల నుంచి విచారణ విషయంలో ఊరట కోరారు. అయితే తాజా తీర్పు నేపథ్యంలో ఫార్ములా ఈ రేస్ కేసులో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ బీఆర్ఎస్(BRS Party) శ్రేణుల్లో నెలకొంది. మరోవైపు కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది.కోర్టు తీర్పు అనంతరం బంజారాహిల్స్ నందినగర్(Nandi Nagar)లోని కేటీఆర్ నివాసం వద్ద భారీ బందోబస్తు కనిపిస్తోంది. తీర్పు వేళ ఆయన సోదరి కవితతో పాటు హరీష్‌రావు, మాజీ మంత్రులు, పలువురు కీలక నేతలు అక్కడికి చేరుకుని కేటీఆర్‌తో మంతనాలు జరుపుతున్నారు. అయితే.. ఈ తీర్పును సవాల్ చేసే యోచనలో బీఆర్ఎస్ లీగల్ టీం ఉన్నట్లు సమాచారం. హైకోర్టు ఉత్తర్వుల కాపీ ఇంకా అందలేదు. సాయంత్రంలోపు అందే అవకాశం ఉంది. అవి అందాక తదుపరి చర్యలపై ఆలోచన చేస్తాం అని లీగల్ టీం ప్రకటించింది. మరోవైపు..ఏసీబీ(ACB) ఇప్పటికే ఆయన్ని 9వ తేదీన విచారణకు రావాలంటూ రెండోసారి నోటీసులు పంపింది. తన వెంట లాయర్‌ను అనుమతించకపోవడంతో సోమవారం ఆయన విచారణకు హాజరుకాకుండానే ఏసీబీ ఆఫీస్ నుంచి వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. విచారణ టైంలోనే కేటీఆర్‌ను అదుపులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు ఆయన్ని ఈ కేసులో ఈడీ సైతం విచారణ జరపాల్సి ఉంది. తాజాగా.. హైకోర్టు క్వాష్ కొట్టేయడంతో మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: కేటీఆర్ క్వాష్ కొట్టివేత, హైకోర్టు ఏం చెప్పిందంటే.. -
కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు చుక్కెదురైంది. ఏసీబీ కేసును కొట్టేయాలని వేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ దర్యాప్తులో మేం జోక్యం చేసుకోం అని తీర్పు సందర్భంగా పేర్కొంది. అయితే ఆ సమయంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరగా.. ఆ విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ పిటిషన్‌పై ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం(Bench).. డిసెంబర్ 31న వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని.. కావాలంటే విచారణ జరుపుకోవచ్చని దర్యాప్తు సంస్థలకు సూచించింది. మరోవైపు.. కోర్టు తీర్పు నేపథ్యంతోనే ఆయన ఇవాళ్టి ఈడీ విచారణ వాయిదా పడింది కూడా.ప్రభుత్వ వాదనలు ఇలా..ఏసీబీ తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘ఎఫ్ఐఆర్ నమోదు ప్రాథమిక అంశం మాత్రమే. అందులో పేర్కొన్న అంశాలే అంతిమం కాదు. దర్యాప్తులో తేలే విషయాల ఆధారంగా సెక్షన్లు చేరుస్తారు. రెండు నెలల క్రితమే కేసు నమోదుకు నిర్ణయించారు. కేసు నమోదు కోసం గవర్నర్ నిర్ణయానికి పంపారు. గవర్నర్ ఆమోదించాకే కేసు నమోదు చేశారు. ఫార్ములా సంస్థకు డబ్బు విదేశీ కరెన్సీలో చెల్లించారు. దీంతో హెచ్ఎండీఏపై అధిక భారం పడింది. విదేశీ కరెన్సీలో చెల్లింపు కోసం ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు. ఆర్థికశాఖ అనుమతి కూడా లేదు.(గవర్నర్ అనుమతి కాపీని కోర్టు అడగడంతో ఏజీ అందజేశారు.)చెల్లింపుల్లో కేటీఆర్ పాత్ర ఏంటని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. కేటీఆర్ పాత్ర ఏంటో దర్యాప్తులో తేలుతుందని ఏజీ తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు అనేది దర్యాప్తు కోసమేనని వివరించారు. కేసు పూర్తి వివరాలు అభియోగపత్రంలో ఉంటాయని, రూ.56 కోట్లకు పైగా చెల్లింపుల్లో నిబంధన ఉల్లంఘన జరిగిందని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు.దానకిశోర్ తరఫున సీనియర్ న్యాయవాది సీపీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పురపాలక శాఖ మంత్రి పర్యవేక్షణలోనే ఆ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తారన్నారు. రేసింగ్‌కు సంబంధించిన చెల్లింపుల దస్త్రాన్ని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదించారని కోర్టుకు తెలిపారు. రేసింగ్ వ్యవహారంలో అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.బీఆర్ఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్లు నమోదు చేసినట్లు చెప్పారు. కేటీఆర్ తరఫు వాదనలు..‘‘అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవు. ముఖ్యంగా 13(1)(a) సెక్షన్ ఈ కేసుకు వర్తించదు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అనేందుకు ఆధారాలు లేవు. ప్రొసీజర్ పాటించలేదనడం సరైంది కాదు. 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రాథమిక విచారణ కూడా లేకుండా కేసు పెట్టారు. కేవలం రాజకీయ కక్షసాధింపు కోసమే కేటీఆర్‌పై కేసు పెట్టారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయి. కార్ రేస్ నిర్వహణకు 2022 అక్టోబరు 25న ఒప్పందం జరిగింది. సీజన్ 10 నిర్వహణకు స్పాన్సర్ వెనక్కి తగ్గారు. రేస్ నిర్వహణలో ఇబ్బందుల నివారణకే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇబ్బందులు రాకూడదనే హెచ్ఎండీఏ చెల్లింపులు చేసింది.సీజన్-9 వల్ల దాదాపు రూ.700 కోట్ల లాభం వచ్చింది. ఆర్థికశాఖ అనుమతి లేదని ఏసీబీ అధికారులు అంటున్నారు. కార్ రేసింగ్ ఒప్పందాన్ని కొత్త ప్రభుత్వం ఉల్లంఘించింది. కొత్త ప్రభుత్వం డబ్బు చెల్లించకపోవడంతో ఒప్పందం రద్దయింది. ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యానికి కారణాలు చెప్పలేదు. సుప్రీం తీర్పుల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం తగదు. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ప్రాథమిక విచారణ అవసరమని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పులను ఏసీబీ అధికారులు పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధిపై కేసుకు ముందు ప్రాథమిక విచారణ చేయాలి. 18న ఫిర్యాదు అందగానే.. 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేటీఆర్ స్పెక్యులేషన్ చేసినట్టు ఎక్కడా పేర్కొనలేదు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదు. కానీ, అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టారు’’ అని కేటీఆర్ తరఫు న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు.ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. ఏసీబీ వాదనలనే పరిగణనలోకి తీసుకుని కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది. -
ఫార్ములా-ఈ రేసు కేసు..హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట దక్కేనా?
సాక్షి,హైదరాబాద్ : ఫార్ములా ఈ-కార్ రేసు (formula e car race case) నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ తనపై ఏసీబీ (acb) నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పును వెలువరించనుంది. ఉదయం 10.30 గంటలకు తీర్పు వెల్లడించనుంది. ఈ తరుణంలో ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ (ktr)కు ఊరట లభిస్తుందా అనే అంశంపై బీఆర్ఎస్ (brs) శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కోర్టులో కేసు విచారణ నేపథ్యంలో నల్గొండలో బీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాధర్నాను సైతం వాయిదా వేసింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ .. డిసెంబర్ 20న ఫార్ములా–ఈ వ్యవహారంలో కేటీఆర్, ఇద్దరు అధికారులను నిందితులుగా చేరుస్తూ.. ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసు ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు కేటీఆర్‌కు ఊరట కల్పించింది. డిసెంబర్ 30వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించించింది. అయితే కేసు దర్యాప్తును కొనసాగించవచ్చని పేర్కొంది. అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, వివరాలు అందజేసి దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్ (కేటీఆర్)కు సూచించింది. ఈ పిటిషన్‌పై పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్‌కు నోటీసులు జారీ చేసింది. ఇక కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఫార్ములా ఈ- కార్ రేసులో కేసులు నమోదు‘ఫార్ములా–ఈ’కార్ల రేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఏసీబీ పెట్టిన కేసు ఆధారంగా ‘ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)’ను నమోదు చేసింది. హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నుంచి విదేశీ కంపెనీకి నిధుల చెల్లింపు అంశంలో రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) కేసులు నమోదు చేశాయి. ‘ఫార్ములా–ఈ’కారు రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్ఎండీఏ నుంచి పలు దఫాల్లో రూ.45,71,60,625 సొమ్మును యూకేకు చెందిన ‘ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ)’కు బదిలీ చేశారని పేర్కొంటూ.. మాజీ మంత్రి కేటీఆర్, మరో ఇద్దరు అధికారులను అందులో నిందితులుగా చేర్చారు.ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా.. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో విచారణ కోసం ఈడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఈడీ హైదరాబాద్ జోనల్ జాయింట్ డైరెక్టర్ ఏసీబీ డీజీ విజయ్‌కుమార్‌కు లేఖ రాశారు. విదేశీ కంపెనీతో జరిగిన నగదు లావాదేవీలు, ఇతర వివరాలన్నీ తమకు ఇవ్వాలని కోరారు. ఏసీబీ నుంచి అందిన వివరాల ఆధారంగా.. మాజీ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈసీఐఆర్ నమోదు చేశారు. -
ఏసీబీ విచారణకు హాజరుకాకుండానే వెనక్కి..
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ల రేసు కేసులో సోమవారం ఏసీబీ కేంద్ర కార్యాలయం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీ రామారావు... ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నా రు. తన న్యాయవాదులను కూడా వెంటతీసుకుని వచ్చారు. కానీ ఏసీబీ కార్యాలయానికి సమీపంలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఏసీబీ నోటీసుల ప్రకారం.. న్యాయవాదులకు అనుమతి లేదని, ఒక్కరే విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. న్యాయవాదులు వెంట ఉంటే ఇబ్బంది ఏమిటని, వారిని అనుమతించాలని కేటీఆర్ పట్టుబట్టారు. దాదాపు 40 నిమిషాల పాటు ఏసీబీ కార్యాలయం సమీపంలో తన వాహనంలోనే వేచి ఉన్నారు. చివరికి ఏసీబీ అధికారులకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చి అక్కడి నుంచి వెనుదిరిగారు. న్యాయవాదులు ఉంటే ఇబ్బంది ఏమిటి? ⇒ ఫార్ములా–ఈ కారు రేసు కేసులో ఏసీబీ నోటీసుల ప్రకారం విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ సోమవారం ఉదయం 10 గంటలకు నందినగర్‌లోని తన నివాసం నుంచి బయలుదేరారు. పోలీసులు ఏసీబీ కార్యాలయం సమీపంలో బారికేడ్లు పెట్టి కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్నారు. కేవలం కేటీఆర్ ఒక్కరే ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లాలని పేర్కొన్నారు. దీంతో న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరైతే తప్పేమిటని.. న్యాయవాదులను తీసుకురావొద్దని ఏసీబీ అధికారులు కాకుండా పోలీసులు ఎందుకు చెబుతున్నారని కేటీఆర్ నిలదీశారు. అయినా పోలీసులు అనుమతించలేదు.కాసేపు ఏసీబీ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత కూడా న్యాయవాదులను అనుమతించేందుకు ససేమిరా అన్నారు. మరోవైపు కేటీఆర్ కూడా పట్టుబట్టి తన వాహనంలోనే కూర్చుని వేచిచూశారు. పలుమార్లు పోలీసులు, కేటీఆర్ మధ్య చర్చలు జరిగినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. ఇలా 40 నిమిషాల పాటు హైడ్రామా చోటు చేసుకుంది. చివరికి న్యాయవాదులు లేకుండా విచారణకు హాజరుకాబోనని, లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చి తిరిగి వెళ్లిపోతానని కేటీఆర్ తేల్చి చెప్పారు. దీనితో ఏసీబీ కేంద్ర కార్యాలయం నుంచి బయటికి వచ్చిన అడిషనల్ ఎస్పీ ఖాన్.. కేటీఆర్ నుంచి లిఖిత పూర్వక సమాధానం తీసుకున్నారు.వారిపై నమ్మకం లేదు.. అందుకే లాయర్లతో వచ్చా..: కేటీఆర్ఏసీబీ కార్యాలయం బయట వేచి ఉన్న సమయంలో కేటీఆర్ తన వాహనంలోనే ఉండి మీడియాతో మాట్లాడారు. ‘‘చట్టాన్ని గౌరవించే సాధారణ పౌరుడిగా ఏసీబీ కార్యాలయానికి వచ్చాను. కానీ ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నాకు ఉన్న హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోంది. తెలంగాణలో భారత రాజ్యాంగం నడుస్తోందా.. లేక రేవంత్ రాజ్యాంగం నడుస్తోందా? గతంలో మా పార్టీ నాయకుడు నరేందర్‌రెడ్డిని కూడా విచారణ పేరుతో పిలిచి ఆయన చెప్పని విషయాలను స్టేట్మెంట్లో నమోదు చేశారు. ఆయన నా పేరు చెప్పినట్టుగా అసత్యాలతో కూడిన ఒక స్టేట్మెంట్ను మీడియాకు వదిలారు. ఇప్పుడు నా విషయంలో కూడా అదే విధంగా చేసే అవకాశం ఉంది. పోలీసులపై నాకు విశ్వాసం లేదు. అందుకే న్యాయవాదులతో వచ్చాను. అయినా నా వెంట న్యాయవాదులు కూడా ఏసీబీ కార్యాలయంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సమస్య ఏమిటో చెప్పాలి. ఒక పౌరుడిగా నాకు న్యాయవాదుల సహకారం తీసుకునే హక్కు లేదా? అయితే ఆ విషయాన్ని రాతపూర్వకంగా రాసి ఇవ్వాలి..’’అని కేటీఆర్ డిమాండ్ చేశారుసోదాల పేరిట కుట్రకు పాల్పడే ప్రయత్నం ‘‘నేను ఏసీబీ విచారణకు హాజరయ్యే సమయంలోనే నా ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు సమాచారం ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ దాడుల్లో ఏవైనా చట్టవ్యతిరేకమైన వస్తువులు, పత్రాలు నా ఇంట్లో వాళ్లే పెట్టి.. అవి సోదాల్లో దొరికాయని చెప్పే కుట్ర కూడా జరుగుతోంది. మా ఇంట్లో ఈ రోజు (సోమ వార) మా మామగారి రెండో సంవత్సరీకం కార్యక్రమం ఉంది. అది జరుగుతుండగా సోదాలు చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం ఉంది. గతంలోనూ దీపావళి పండుగ చేసుకుంటే కూడా పోలీసులతో సోదాలు చేయించారు. డ్రగ్స్ పట్టుబడ్డా యని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెప్పారు. నేను ఈ రోజు విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదు. అయినా నేను ఏ తప్పూ చేయలేదు కాబట్టే ధైర్యంగా ఏసీబీ విచారణకు వచ్చాను..’’అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల దృష్టి మళ్లించే కుట్ర.. రేవంత్‌రెడ్డి రైతు భరోసాలో కోత విధించి రైతులకు చేసిన ద్రోహం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ కుట్రకు పాల్పడు తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ‘‘నేను సీఎంకు చెప్పేది ఒక్కటే.. ఎన్ని దాడులు చేసినా, ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టేది లేదు. ఏసీబీ అధికారులు విచారణ పేరిట నన్ను అడుగుతున్న సమాచారం మొత్తం ప్రభుత్వం వద్దే ఉంది. గతంలో మంత్రిగా నిర్ణయం తీసుకున్నాను. అలాంటప్పుడు ఇంకా నా దగ్గర ఏం సమాచారం ఉంటుంది?..’’అని ప్రశ్నించారు. ఏసీబీ అధికారులు అనుమతిస్తే కార్యాలయం లోపలికి వచ్చి ఇద్దామనుకున్న పత్రాన్ని ఇక్కడే ఇచ్చి వెళతానని.. మళ్లీ ఏసీబీ అధికారులు రమ్మంటే వస్తానని చెప్పారు. లాయర్లు లేకుండానే విచారణకు రావాలని పోలీసులు చెబుతున్నారని.. దర్శకుడు రాజమౌళిని మించిన టాలీవుడ్ కథలు అల్లుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఏసీబీ అధికారులకు ఇచ్చిన సమాధానంలో ఏముంది? ⇒ ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ డీఎస్పీ మాజిద్ఖాన్కు కేటీఆర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టులో సవాల్ చేశానని, డిసెంబర్ 31న ఈ అంశంలో తుది వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసిందని గుర్తు చేశారు. హైకోర్టులో ఏసీబీ ప్రతివాదిగా ఉందని, తన పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు కూడా వినిపించిందని వివరించారు. హైకోర్టు ఏ క్షణమైనా తీర్పు ప్రకటించే అవకాశం ఉన్న ఈ సందర్భంలో ఏసీబీ తనకు నోటీసు ఇచ్చిందని పేర్కొన్నారు. ‘‘సమాచారంతోపాటు డాక్యుమెంట్లు అందివ్వాలని ఏసీబీ నోటీసులలో ప్రస్తావించారు. ఏ అంశాలపై సమాచారం కావాలన్న విషయాన్ని నోటీసులలో స్పష్టంగా ప్రస్తావించలేదు. మీకు ఏ డాక్యుమెంట్లు కావాలో తెలియజేయడంతోపాటు తగిన సమయం ఇవ్వండి. నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిని. నాకు న్యాయబద్ధంగా ఉన్న హక్కులు కాపాడబడితేనే ఈ విషయంలో నేను మీకు పూర్తిగా సహకరిస్తాను. హైకోర్టు తుది తీర్పు తర్వాత ముందుకు వెళ్లాలని కోరుతున్నాను’’అని కేటీఆర్ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.ఎలక్టోరల్ బాండ్లపై చర్చకు సిద్ధం ‘‘పార్లమెంట్ ఆమోదించిన ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వడం అవినీతి అని ఎలా అంటారు? దేశవ్యాప్తంగా అన్ని పారీ్టలకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై మేం చర్చకు సిద్ధం. 2022లో గ్రీన్కో కంపెనీ ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది. 2023లో ఫార్ములా–ఈ రేసు జరిగింది. కాంగ్రెస్, బీజేపీలకు కూడా గ్రీన్కో ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది. ఫార్ములా–ఈ రేస్ కారణంగా నష్టపోవడంతో గ్రీన్కో ఒప్పందం నుంచి తప్పుకుంది. కాంగ్రెస్‌కు 340 కంపెనీలు రూ.1,351 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చాయి. తెలంగాణలో తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ వాళ్లు తమకు అందిన ఎలక్టోరల్ బాండ్లపై ఏమంటారు?’’అని కేటీఆర్ ప్రశ్నించారు. -
కేటీఆర్ పిటిషన్..రేపే హైకోర్టు తుది తీర్పు
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా-ఈ రేసుల కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం(జనవరి7) ఉదయం తుది తీర్పివ్వనుంది. ఈ కేసులో పూర్తి వాదనలు విన్న కోర్టు తీర్పు ఇప్పటికే రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. తుది తీర్పు వచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు కూడా కోర్టు జారీ చేసింది. ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. హైకోర్టు ఒకవేళ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేస్తే కేటీఆర్‌కు శాశ్వత ఊరట లభించినట్లవుతుంది.మరోవైపు ఈ కేసులో గురువారం(జనవరి9) విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఏసీబీ సోమవారం మళ్లీ నోటీసులిచ్చింది. సోమవారం కేసు విచారణ కోసం బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లారు. న్యాయవాదిని విచారణకు అనుమతించమని పోలీసులు చెప్పడంతో కేటీఆర్ అక్కడి నుంచి వెనుతిరిగి వచ్చేశారు. ఈడీ విచారణకు రాలేను.. సమయం కావాలి: కేటీఆర్ ఫార్ములా-ఈ కేసులో మంగళవారం(జనవరి7) విచారణకు రావాలని కేటీఆర్‌కు ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు రాలేనని, తనకు సమయం కావాలని ఈడీని కేటీఆర్ కోరారు.క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ అయినందున విచారణకు రాలేనని కేటీఆర్ సమాధానమిచ్చారు. ఇదీ చదవండి: రేవంత్ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా -
కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సోమవారం(జనవరి6) సాయంత్రం ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల తొమ్మిదో తేదిన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కోరింది. ఏసీబీ అధికారులు కేటీఆర్ ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. అంతకు ముందు ఏసీబీ కేటీఆర్ ఇంట్లో తనిఖీలు చేసింది. సోమవారం ఉదయమే కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణకు తనతో పాటు న్యాయవాదులను అనుమతించకపోవడంతో బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయం బయట నుంచే కేటీఆర్ విచారణకు వెనుదిరిగారు. తాను చెప్పాలనుకున్నది రాతపూర్వకంగా పోలీసులకు సమర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తాను లేనప్పుడు తన ఇంట్లో సోదాలు చేయాలని చూస్తోందని, సీఎం రేవంత్ ఆదేశాలతో కావాలని ఏదైనా పెట్టి నా ఇంట్లో దొరికినట్లు చూపించాలనుకుంటున్నారని చెప్పడం గమనార్హం. క్వాష్ పిటిషన్‌పై కోర్టు తీర్పు రిజర్వ్ అయిందని అయినా ఏసీబీ కావాలని తనను విచారణకు పిలుస్తోందని మండిపడ్డారు. కాగా, ఫార్ములా-ఈ కేసు ఎఫ్ఐఆర్లో ఏ1గా ఉన్న కేటీఆర్‌కు హైకోర్టులో ఇప్పటికే ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తుది తీర్పు ఇచ్చేవరకు అరెస్టు చేయవద్దని ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. క్వాష్ పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసింది. ఇదీ చదవండి: రేవంత్ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా -
ఫార్ములా ఈ- రేస్ కేసులో మరో ట్విస్ట్
-
రేవంత్ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా: జగదీష్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:ఎలక్టోరల్ బాండ్ల విషయం పాత చింతకాయ పచ్చడిలాగా ఉందని మాజీ మంత్రి,బీఆర్ఎస్ నేత జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం(జనవరి6) తెలంగాణభవన్‌లో జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల బాండ్లకు ఏసీబీకి ఏం సంబంధం అని జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా ఆడుతోందని విమర్శించారు.‘గ్రీన్ కో కంపెనీ దేశంలో 7,8 పార్టీలకు ఎలక్ట్రోలర్ బాండ్లు ఇచ్చింది.కేసు రూ. 55 కోట్లు ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించింది.ఇక్కడ గ్రీన్ కో కంపెనీకి ఎక్కడా లాభం జరగలేదు.ఏసీబీ కేసుకు ,గ్రీన్ కో కంపెనీకీ ఏం సంబంధం.రైతు భరోసా ఎగగ్గొట్టిన విషయం డైవర్ట్ చేయడానికే కేటీఆర్‌కు ఏసీబీ నుంచి నోటీసులు వచ్చాయన్నారు.ఈ డైవర్షన్ పాలిటిక్స్‌తో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేడు.గ్రీన్ కో కంపెనీ ఎలక్ట్రో బాండ్లు చట్టం ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి.ఇందులో దాపరికాలు ఏం లేవు.రేవంత్‌రెడ్డి ఇందులో కనిపెట్టింది ఏం లేదు. కేటీఆర్‌పై కుట్ర కేసులో ప్రభుత్వానికి ప్రతిసారి షాక్ తగులుతోంది.ప్రభుత్వం బొక్క బోర్లా పడుతోంది. కేటీఆర్‌పై పనికిమాలిన చెత్త కేసు పెట్టి,చిల్లర ప్రయత్నం చేసింది ప్రభుత్వం.ప్రభుత్వం వద్దే అన్ని ఫైల్స్ ఉన్నాయి.కేటీఆర్ ఇంటిపై ఏసీబీ సోదాలు చేసి ఏవో ఫైల్స్ దొరికాయని లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయాలని ఏసీబీ ప్రయత్నం చేస్తోంది.చట్టం,రాజ్యాంగం పట్ల గౌరవంతో కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. రేవంత్ కనుసన్నల్లో ఏసీబీ డ్రామా ఈ రోజు కుదరలేదు’అని జగదీష్‌రెడ్డి విమర్శించారు. ఇదీ చదవండి: ఇది రేవంత్ టీఎం చేస్తున్న దుష్ప్రచారం: కేటీఆర్ -
‘మీరెన్ని కేసులు పెట్టినా మేం భయపడం’
సాక్షి,హైదరాబాద్ : ప్రజల పక్షాన గళం విప్పే వారిపై రేవంత్‌రెడ్డి (revanth reddy) ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) ఆరోపించారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ (brs) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. విచారణ నిమిత్తం ఉదయం కేటీఆర్ తన లీగల్ టీంతో ఏసీబీ ఆఫీస్‌కు చేరుకున్నారు. అయితే తన న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవడంతో అక్కడ హైడ్రామా నడింది. ఈ తరుణంలో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవ్వడంపై కవిత స్పందించారు. ‘మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. మాపై పెట్టిన కేసులకు మేం భయపడం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద రూ. 15,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసింది. కానీ ఇప్పుడు ఆమొత్తాన్ని రూ.12,000 రూపాయలకు తగ్గించింది. ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా చెల్లించాలనే మా డిమాండ్’ అని కవిత అన్నారు. BRS MLC K Kavitha says "The Revanth Reddy Govt is filing illegal cases against those who raise their voices on behalf of the people. The government is acting vengefully against our party’s Working President KTR with false cases. We are not afraid of cases filed against us. Our… https://t.co/QPEa6zAEhC pic.twitter.com/bQTbdODpVF— ANI (@ANI) January 6, 2025 -
ఇది రేవంత్ టీం చేస్తున్న దుష్ప్రచారం: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. రేసుకు స్పాన్సర్షిప్ చేసిన గ్రీన్కో కంపెనీ నుంచి అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్(BRS)కు లబ్ధిచేకూరినట్లు తెలుస్తోంది. ఆ లావాదేవీలు చందాలు, ఎన్నికల బాండ్ల రూపంలో వెళ్లినట్లు సమాచారం.ఎన్నికల బాండ్ల రూపంలో గ్రీన్కో(Greenko), దాని అనుబంధ సంస్థల నుంచి బీఆర్ఎస్కు మొత్తం రూ.49 కోట్లు ముట్టాయి. ఇందులో 2022, 8 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10 మధ్య 41 సార్లు రూ.కోటి చొప్పున ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది. అలాగే.. రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుంచే ఈ కొనుగోలు వ్యహారం నడిచినట్లు తేలింది. ఈ మేరకు ఈ విషయాన్ని తాజాగా ప్రభుత్వం బయటపెట్టింది. ఇదిలా ఉంటే.. ఫార్ములా ఈ రేస్ కేసును అవినీతి కోణంలో తెలంగాణ ఏసీబీ, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.కేటీఆర్ స్పందనబీఆర్ఎస్కు గ్రీన్కో ఎన్నికల బాండ్ల అంశంపై కేటీఆర్ స్పందించారు. ‘‘గ్రీన్కో 2022లో ఎన్నికల బాండ్లు ఇచ్చింది. 2023లో ఫార్ములా-ఈ రేసు జరిగింది. కాంగ్రెస్, బీజేపీకి కూడా గ్రీన్కో బాండ్లు ఇచ్చింది. ఫార్ములా ఈ రేసు వల్ల గ్రీన్కో నష్టపోయింది. అందుకే మరుసటి ఏడాది స్పాన్సర్షిప్ నుంచి నుంచి తప్పుకుంది. అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది?. ఇది రేవంత్ టీం చేస్తున్న దుష్ప్రచారం. పార్లమెంట్ ఆమోదించిన బాండ్లు అవినీతి ఎలా అవుతుంది?. అన్ని పార్టీలకు వచ్చిన బాండ్లపై చర్చకు సిద్ధం. ’’ అని అన్నారాయన. హైదరాబాద్‌లో ఫార్ములాఈ రేస్ నిర్వహణకు సంబంధించి.. యూకేకు చెందిన ఫార్ములా ఈఆపరేషన్స్ (FEO)కు సుమారు రూ.45.71 కోట్లను తెలంగాణ మున్సిపల్ శాఖ(MAUD) తరఫున హెచ్ఎండీఏ చెల్లించింది. ఈ చెల్లింపుల్లో ఉల్లంఘనలు జరిగాయంటూ ఇటీవల ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫైనాన్స్ ఆమోదం పొందకుండానే.. హెచ్ఎండీఏ ఛైర్మన్ అయిన ముఖ్యమంత్రికి ఫైల్ పంపకుండానే.. ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే ఈ చెల్లింపులు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. లండన్‌లోని ఎఫ్ఈవో ఖాతాకు బ్రిటన్ పౌండ్ల రూపంలోకి మార్చి సొమ్ము బదిలీ చేసిన క్రమంలో ఆదాయపన్ను మినహాయించలేదని.. అందువల్ల ఆదాయపన్ను శాఖకు రూ.8.06 కోట్లను హెచ్ఎండీఏ చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనల వెనక ఏమైనా మతలబులున్నాయేమో తేల్చాలని కోరారు.ఈ ఘటనల్లో అప్పటి మంత్రి, ఎంఏయూడీ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ అప్పటి చీఫ్ ఇంజినీర్ల పాత్ర ఉండటంతో అవినీతి కోణంలో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. అలాగే.. విదేశీ సంస్థకు నిధుల బదిలీ వెనక ఫెమా ఉల్లంఘనలతో పాటు నిధుల అంతిమ లబ్ధిదారులెవరనే కోణంలో ఈడీ దర్యాప్తు ఆరంభించింది.ఇదీ చదవండి: ఫార్ములా ఈ రేస్.. ఇదో లొట్టపీసు కేసు! -
కేటీఆర్ ఆరోపణలపై స్పందించిన ఏసీబీ
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో తనను తన అడ్వొకేట్ల సమక్షంలోనే విచారించాలని పట్టుబట్టి.. చివరకు విచారణకు హాజరు కాకుండానే కేటీఆర్ వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే.. వెళ్లే క్రమంలో ఆయన తన లిఖితపూర్వక స్టేట్మెంట్ను ఏసీబీ డీఎస్పీకి అందజేసి వెనుదిరిగారు. అందులో ఏముందంటే..ఏసీబీ(ACB) తనపై నమోదు చేసిన కేసులో తాను తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే.. తనకు పంపిన నోటీసులు కేసుకు సంబంధించిన తన నుంచి సమాచారంతో పాటు సంబంధిత పత్రాలను ఏసీబీ కోరిందని పేర్కొన్నారాయన. అయితే.. అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇవ్వలేదన్నారు... అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇచ్చి.. తనకు కొంత సమయం ఇవ్వాలని కేటీఆర్(KTR) ఆ స్టేట్మెంట్ ద్వారా కోరారు. రాజ్యాంగం, చట్టం తనకు కల్పించిన హక్కులను వినియోగించుకుంటూనే.. కేసు దర్యాప్తునకు హాజరై సహకరిస్తానని తెలిపారారయన. అయితే హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్‌లో ఉందని, తీర్పు వచ్చేదాకా తనకు గడువు ఇచ్చే అంశం పరిశీలించాలని ఏసీబీ డీఎస్పీని కేటీఆర్ కోరారు. ఏసీబీ.. నెక్ట్స్ ఏంటి?విచారణకు హాజరు కాకపోవడంతో పాటు తీవ్ర ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చర్యలకు ఏసీబీ ఉపక్రమించబోతోంది. ఆయనకు మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వనుందని సమాచారం. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని కేటీఆర్ ప్రధానంగా ప్రస్తావిస్తూ.. తనను కుట్రపూరితంగానే విచారణకు పిలిచారంటూ మండిపడ్డారు. అయితే తాము తీర్పు ఇచ్చేంత వరకు విచారణ చేసుకోవచ్చని హైకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఏసీబీ ప్రస్తావించింది. అలాగే.. కేటీఆర్ చేసిన ఆరోపణలపైనా కోర్టులో మెమో వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక అడ్వొకేట్‌ను ఎందుకు అనుమతించలేదన్న విషయంపై ఏసీబీ అధికారులు స్పందించారు. కోర్టు ఆదేశాలు లేనందునే తాము కేటీఆర్ వెంట వచ్చిన లాయర్‌ను అనుమతించలేదని స్పష్టత ఇచ్చారు. -
నా ఇంటిపై ఏసీబీ దాడులు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన వేళ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారని, తన ఇంటిపై ఏసీబీతో దాడులు చేయించాలని రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారాయన.సోమవారం ఉదయం తన లీగల్ టీంతో ఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్ చేరుకున్నారు. అయితే తన న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవడంతో ఆయన పోలీసులను నిలదీశారు. అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడారు.‘‘పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే.. అందుకే లాయర్‌తో వచ్చా. నాతో పాటు లాయర్ వస్తే వాళ్లకేంటి(పోలీసులకు) ఇబ్బంది ఏంటి. పట్నం నరేందర్‌రెడ్డి విషయంలో జరిగిందే నా విషయంలో జరగబోతోంది. ఈ కేసులో నన్ను అసలు విచారణకు పిలవాల్సిన అవసరం లేదు. ఏసీబీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. నేను ఏ తప్పు చేయలేదు.. నిజాయితీగా ఉన్నా. అందుకే చట్టాన్ని గౌరవించి విచారణకు వచ్చా.రాష్ట్రంలో రేవంత్ రాజ్యాంగం నడుస్తోంది. నాపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారు. నన్ను విచారణకు పిలిచి.. నా ఇంటిపై ఏసీబీ దాడులు చేయబోతున్నారు. వాళ్లే నా ఇంట్లో ఏదో ఒకటి పెట్టాలని చూస్తున్నారు. నన్ను ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. తీర్పు రిజర్వ్‌లో ఉండగా ఎందుకీ డ్రామాలు(కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌లో ఉంది). అయినా నేను కేసులకు భయపడను. ప్రజాక్షేత్రంలో రేవంత్‌ను వదిలే ప్రసక్తే లేదు. 420 హామీలు అమలు చేసేంత వరకు పోరాడతాం’’ అని కేటీఆర్ అన్నారు. -
Watch Live: ACB ముందుకు కేటీఆర్
-
‘రాజమౌళి కంటే అద్భుతంగా కథలు’.. కేటీఆర్ ఏసీబీ విచారణలో హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విచారణ సందర్భంగా హైడ్రామా నడిచింది. విచారణకు తనతో పాటు తన లాయర్‌ను ఆఫీస్‌లోకి అనుమతించకపోవడంపై కేటీఆర్ నిరసన వ్యక్తం చేశారు. అధికారుల స్పందన కోసం 40 నిమిషాల పాటు ఏసీబీ ఆఫీస్ బయట ఎదురు చూసి చివరకు అనుమతి లభించకపోవడంతో వెనుదిరిగారు. వెళ్లే క్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పోలీసులను నేను నమ్మ. లాయర్లు ఉంటేనే నాకు రక్షణ. అందుకే లాయర్‌తో వచ్చా. నా లాయర్‌తో విచారణకు హాజరవుతానంటే వీళ్లకు ఇబ్బంది ఏంటి?. అడ్వొకేట్ల సమక్షంలో విచారిస్తామంటే చెప్పమనండి.. లోపలికి వెళ్తా. పోలీసులు రాజమౌళి(దర్శకుడు) కంటే అద్భుతంగా కథలు అల్లుతున్నారు. నా స్టేట్మెంట్ను ఏఎస్పీకి రాతపూర్వకంగా ఇచ్చాను’’ అంటూ అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్లిపోయారాయన. ఏసీబీ విచారణలో హైడ్రామా నడవడంతో లిఖితపూర్వక స్టేట్మెంట్ ఇచ్చి సరిపెట్టిన ఆయన.. రేపటి ఈడీ విచారణకు హాజరవుతారా? అనే ఉత్కంఠ నెలకొంది.ఇందులో తప్పేంటి?: కేటీఆర్అంతకు ముందు నందినగర్ నివాసం నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ ఆఫీస్‌కు తన లీగల్ టీంతో చేరుకున్నారాయన. ఆ టైంలో ఆయన లాయర్‌ను పోలీసులు లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ఆపై మీడియాతో మాట్లాడారు.ఫార్ములా ఈ రేసుపై మంత్రిగా నిర్ణయం తీసుకున్నా. ఏసీబీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. ప్రభుత్వం కావాలనే కక్షపూర్వకంగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో నన్ను అసలు విచారణకు పిలవాల్సిన అవసరం లేదు. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో జరిగిందే.. నా విషయంలోనూ జరిగే అవకాశం ఉంది. నరేందర్ రెడ్డి విషయంలో తప్పుడు స్టేట్మెంట్ సృష్టించారు. అలాగే నన్ను విచారణకు పిలిచి.. నా ఇంటిపై ఏసీబీతో దాడులు చేయించాలని చూస్తున్నారు. వాళ్లే నా ఇంట్లో ఏదో ఒకటి పెట్టి ఇరికించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒకరకంగా నాపై తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నారు. నా లాయర్ నాతో పాటే విచారణకు వస్తే తప్పేంటి?. నా లాయర్‌ను అనుమతిస్తారంటే విచారణకు హాజరవుతా’’ అని బయటే అరగంటపైగా ఎదురు చూశారు. అయితే ఏసీబీ అంగీకరించకపోవడంతో ఆయన వెనుదిరిగారు.ఏసీబీది తప్పే: కేటీఆర్ లాయర్కేటీఆర్ వెంట తనను లోపలికి అనుమతించకపోవడంపై ఆయన లాయర్ సోమ భరత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏసీబీ వైఖరిని తప్పుబట్టారాయన. లాయర్‌ను వెంట తీసుకెళ్లడం రాజ్యాంగబద్ధ హక్కు. చట్టాలన్నీ రాజ్యాంగానికి లోబడి ఉంటాయి. అని అన్నారాయన. నోటీసుల్లో.. కేటీఆర్‌కు ఏసీబీ పంపిన నోటీసుల కాపీ సాక్షి(Sakshi) సంపాదించింది. అందులో ఏసీబీ అధికారులు కీలక అంశాలను పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు సూచించారు. సెక్షన్ 13 (1),13(2) పీసీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ 409,120B సెక్షన్స్ కింద ఆయనకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు.. ఎఫ్ఐఆర్ కాపీలో ఏ1గా కేటీఆర్ పేరు ఉంది.బీఆర్ఎస్ నేతల సంఘీభావంఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు హాజరవ్వడానికి ముందు.. కేటీఆర్‌ను పలువురు బీఆర్ఎస్ నేతలు కలిసి సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి. ఇతర బీఆర్ఎస్ నేతలు నందినగర్‌లోని నివాసానికి వెళ్లి మాట్లాడారు. మరోవైపు.. ముందస్తు జాగ్రత్త పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.మరోవైపు కేటీఆర్‌ను విచారించాలని.. డీజీ విజయ్‌కుమార్, డైరెక్టర్ తరుణ్ ఉదయాన్నే ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.