సాక్షి,హైదరాబాద్:ఫార్ములా-ఈ రేసుల కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం(జనవరి7) ఉదయం తుది తీర్పివ్వనుంది. ఈ కేసులో పూర్తి వాదనలు విన్న కోర్టు తీర్పు ఇప్పటికే రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. తుది తీర్పు వచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు కూడా కోర్టు జారీ చేసింది. ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
ఈ కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. హైకోర్టు ఒకవేళ ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేస్తే కేటీఆర్‌కు శాశ్వత ఊరట లభించినట్లవుతుంది.మరోవైపు ఈ కేసులో గురువారం(జనవరి9) విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఏసీబీ సోమవారం మళ్లీ నోటీసులిచ్చింది. సోమవారం కేసు విచారణ కోసం బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లారు. న్యాయవాదిని విచారణకు అనుమతించమని పోలీసులు చెప్పడంతో కేటీఆర్ అక్కడి నుంచి వెనుతిరిగి వచ్చేశారు.
ఈడీ విచారణకు రాలేను.. సమయం కావాలి: కేటీఆర్
ఫార్ములా-ఈ కేసులో మంగళవారం(జనవరి7) విచారణకు రావాలని కేటీఆర్‌కు ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు రాలేనని, తనకు సమయం కావాలని ఈడీని కేటీఆర్ కోరారు.క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ అయినందున విచారణకు రాలేనని కేటీఆర్ సమాధానమిచ్చారు.
ఇదీ చదవండి: రేవంత్ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా
Comments
Please login to add a commentAdd a comment