
సాక్షి,హైదరాబాద్ : ‘మొదటి సారి ఎన్నికల్లో గెలవడం గొప్పకాదు.. రెండో సారి గెలవడం గొప్ప’అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్ధేశం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై సీఎల్పీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవి. 15 నెలల్లో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశాల్లో అవకాశం ఉంది. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలి. సభ్యులు ఖచ్చితంగా సభకు రావాల్సిందే. సమావేశాల్లో సభ్యులంతా సమన్వయంతో ముందుకెళ్లాలి. ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశం అవుతా.
వచ్చే నెల 6 నుండి జిల్లాల వారిగా జిల్లా ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు,ఎంపీలు ,ఇతర ప్రజాప్రతినిధులతో లంచ్ మీటింగ్‌లు పెట్టుకుందాం. స్థానిక సమస్యలు, ఇతర అంశాలపై చర్చిద్దాం. మంత్రుల నియోజవర్గాలకు ఎక్కువ నిధులు వెళ్తున్నాయి అనే భావన చాలా మందిలో ఉంది. ఈ బడ్జెట్ సమావేశం లో అలా జరగదు.ఎమ్మెల్యేలందరికీ సమానంగా నిధులు ఇస్తాం.మొదటి సారి గెలవడం పెద్ద విషయం కాదు.రెండవసారి గెలవడం గొప్ప విషయం.మంత్రులు తప్పనిసరిగా హౌస్‌లో ఉండాలి.మొక్కుబడిగా హాజరుకావడం మంచిది కాదు’అని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment