
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
- 11 రోజులు సభ జరిగింది.
- 97 గంటల 32 నిమిషాలు సాగింది.
- శాసనసభలో 12 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది.
- 11 రోజుల శాసనసభలో 146 మంది సభ్యులు మాట్లాడారు.
- 16 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు
- శాసనసభలో కాంగ్రెస్ పార్టీ 65, టిఆర్ఎస్ 38, బిజెపి 8, ఎంఐఎం 7, సిపిఐ ఒక సభ్యులు ఉన్నట్లు ప్రకటించిన స్పీకర్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క @అసెంబ్లీ
- వాస్తవరూపిణ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టాం.
- ఏ శాఖలకు కేటాయించిన బడ్జెట్ను ఆ శాఖలకు దాదాపు 70% పైగా ఖర్చు చేస్తాం.
- గత ప్రభుత్వం శాఖలకు కేటాయించిన బడ్జెట్ను పూర్తిగా ఖర్చు చేయలేదు.
- ఎస్సీ వెల్ఫేర్ కు 42 వేల కోట్లు, బీసీ వెల్ఫేర్కు 15000 కోట్లు ఖర్చు చేయలేదు.
- అన్ని శాఖలకు కలిపి 70 వేల కోట్లకు పైగా ఖర్చు చేయకుండా వదిలేశారు
- గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వం చేసింది.
- గత ప్రభుత్వం లెక్క 20 శాతం పెంచకుండా జాగ్రత్తగా బడ్జెట్ తయారు చేశాం.
- బడ్జెట్ పై కాకుండా సొంత రాజకీయ వ్యాఖ్యలు సభలు చేస్తున్నారు.
- నేను ఆషామాషీగా రాజకీయాల్లోకి రాలేదు.
- యాదృచ్ఛికంగా రాజకీయాల్లోకి రాలేదు.
- నేను యాక్టింగ్, యాక్సిడెంటల్ పొలిటిషన్ కాదు.
- ఫ్యూడల్ వ్యవస్థలో అణిచివేతలను దాటుకుంటూ రాజకీయాల్లోకి వచ్చాను.
- కంఫర్ట్ లెవెల్స్ నాకు లేవు... నా లెక్క ఎవ్వరూ బాధపడొద్దు అనే ఆలోచన కలిగిన వ్యక్తిని నేను.
- దోపిడి చెయ్యడానికి రాజకీయాల్లోకి రాలేదు.
- సమాజానికి మంచి చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన.
- నేను అడ్డగోలుగా ఎదిపడితే అది మాట్లాడొచ్చు కానీ చెయ్యను.
- జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావం రోజున రాజీవ్ యువ వికాసం సాంక్షన్ లెటర్లు ఇస్తాం.
ఏలేటి మహేశ్వర్‌రెడ్డి BJLP ఫ్లోర్ లీడర్ @అసెంబ్లీ
- తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వలేదంటూ అవాస్తవాలు మాట్లాడొద్దు.
- కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు BRS ప్రయత్నిస్తోంది.
- డీలిమిటేషన్‌తో అన్యాయం అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు.
- కుటుంబ పార్టీలే బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి.
- రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది.
- అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన స్థితిలో ప్రభుత్వం ఉంది.
- ఆటో డ్రైవర్లకు 12 వేలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలి.
- రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అప్పుల అప్పారావు, రొటేషన్ చక్రవర్తి వలే ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి
- మా ప్రభుత్వం ఎవరి పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడలేదు.
- 500 ఫైన్ వేసే డ్రోన్ కేసులో నన్ను చర్లపల్లి జైలులో వేశారు.
- నక్సలైట్లు, దేశ ద్రోహులు ఉండే డిటెన్షన్ సెల్‌లో నన్ను వేశారు
- నేను పడుకోకుండా రాత్రి కూడా లైట్లు వేసే వారు.
- 16 రోజులు నిద్రపోకుండా చేశారు
- నా బిడ్డ లగ్గానికి రాకుండా ఢిల్లీ నుంచి అడ్వకేట్లను తీసుకొచ్చారు.
- జైలు నుంచి ఫంక్షన్ హాల్‌కు వచ్చి...మళ్ళీ జైలుకు పోయా.
- నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే... కేసీఆర్ కుటుంబంలో ఏం జరగాలో అది జరిగింది.
- కక్ష్య సాదింపు ఎవరు చేశారు.
- నేను కక్ష్య సాదింపు దిగితే... కేసీఆర్ కుటుంబం జైలులో ఉండేది.
- కేసీఆర్ కుటుంబం జైలులో పెడతా అని ఎన్నికల హామీ ఇచ్చా...కానీ ఆ హామీని నెరవేర్చలేదు.
- మేం నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే… వాళ్లు అక్కడ కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదు
- చంచలగూడ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనో మమ్మల్ని పెట్టినచోటే ఉండేవారు.
- డ్రోన్ ఎగరేస్తే రూ. 500 ఫైన్ వేస్తారు.. కానీ అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారు
- 16 రోజులు నన్ను డిటెన్షన్ సెల్లో ఒక మనిషి కూడా కనిపించకుండా మమ్మల్ని నిర్బంధించిన ఆ కోపాన్ని బిగపట్టుకున్నాం తప్ప కక్ష సాధింపునకు పాల్పడలేదు
- లైట్లు ఆన్ లోనే పెట్టి ఒక్క రాత్రి కూడా పడుకోకుండా జైల్లో గడిపేలా చేశారు
- కరుడు గట్టిన నేరస్తున్ని బంధించినట్లు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నన్ను బంధించారు
- వాళ్ల తప్పులను దేవుడు చూస్తాడు..అంతకు అంత అనుభవిస్తారు అనుకుని ఊరుకున్నా
- నా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిపాలు చేశాడు
- చర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారు
- రాజకీయ కక్ష సాధింపులంటే మీవి కదా
- అయినా నేను కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదు
- నిజంగానే నేను కక్ష సాధించాలనుకుంటే మీ కుటుంబమంతా చర్లపల్లి జైల్లో ఉండేవారు
- కానీ ఆ పని నేను చేయలేదు.. మేం విజ్ఞత ప్రదర్శించాం..
- ప్రజలు అధికారం ఇచ్చింది నా కక్ష తీర్చుకోవడానికి కాదని నేను విజ్ఞత ప్రదర్శించా
- సొంతపార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా… చెంపలు వాయించే శక్తి ఉన్నా నేను సంయమనం పాటించా
- ఎవరివి కక్ష సాధింపు చర్యలో
- తెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోంది..
కేటీఆర్
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్.
- తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా రుణమాఫీ కాలేదు.
- కొడంగల్ అయినా సిరిసిల్ల అయిన వెళ్దాం 100శాతం రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా
- నేను తలచుకుంటే ఎవ్వరూ మిగలరని సీఎం అంటున్నారు.. ఎవరు తలచుకున్న ఏం ఫరక్ పడదు.
- మీ ఇండ్లపై డ్రోన్లు ఎగరవేసి మీ భార్య, బిడ్డల ఫోటోలు తీస్తే ఊరుకుంటారా?
- నేను జైలుకు వెళ్లాను తెలంగాణ కోసం కొట్లాడి జైలుకు వెళ్లాను.
- రేవంత్ రెడ్డి ఎవరికోసం జైలుకు వెళ్లారు ఎందుకోసమే వెళ్లారు?
- తమ వరకు వచ్చేసరికి భార్యా పిల్లలు గుర్తుకు వస్తారా ఇతరులకు భార్యా పిల్లలు ఉండరా?
- లేని రంగులు అంటగడితే అప్పుడు మాకు బాధ వేయడం ఈరోజు మీరు బాధపడితే ఎలా?
డీలిమిటేషన్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. - రేవంత్ కామెంట్స్..
- జనాభా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు.
- పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు.
- జనాభా నియంత్రణ శాపంగా మారకూడదు.
- రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని నియోజకవర్గ పునర్విభజన చేయాలి.
- కేంద్రం నిర్ణయంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది
- అన్ని పార్టీలతో సంప్రదింపులు జరపాలి.
- ఆ తర్వాతే లోక్‌సభ సీట్ల పునర్విభజన జరగాలి.
- డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలే తీసుకోలేదు.
- ఎందుకు ఈ హడావిడి అని కేంద్రమంత్రులు మాట్లాడుతున్నారు.
- జనాభా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది..
- జనాభా నియంత్రణను దక్షిణ భారత దేశం పాటిస్తే..
- ఉత్తరాది రాష్ట్రాలు నియంత్రణ చేయకపోవడంతో జనాభా పెరిగింది
- 2026 తర్వాత జనాభా లెక్కించి.. దాని ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉండటంతో ఇది చర్చనీయాంశమైంది.
- 1971 జనాభా లెక్కల తర్వాత కేంద్రం.. జనాభా నియంత్రణ విధివిధానాలను తీసుకువచ్చింది.
- ఇందిరాగాంధీ, వాజ్‌పేయి.. 25ఏళ్ల పాటు నియోజకవర్గాల పునర్విభజనను వాయిదా వేశారు.
- డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్.
- ప్రస్తుత జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలి.
- ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ చేయలేదు.
- కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను నిరసిస్తూ.. అసెంబ్లీలో తీర్మానం పెట్టాం.
- సౌత్‌కు అన్యాయం జరుగుతుందని ఇందిరాగాంధీ గతంలోనే గుర్తించారు.
- 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్ము కశ్మీర్, సిక్కిం అసెంబ్లీలలో సీట్లు పెంచారు.
- డీలిమిటేషన్‌తో 24 శాతం ఉన్న దక్షిణాది ఎంపీల సంఖ్య 19 శాతానికి తగ్గిపోతుంది.

హరీష్ రావు కామెంట్స్..
- ఈ సెషన్‌లో ఒక్కరోజు మాత్రమే క్వశ్చన్ అవర్ పెట్టారు..
- క్వశ్చన్ అవర్ లేకపోవడంతో సభ్యుల అనుమానాలు నివృత్తి కావడం లేదు..
- ఇకనైనా వీలైనన్ని రోజులు క్వశ్చన్ అవర్‌తో పాటు జీరో అవర్ పెట్టాలి.
శ్రీధర్ బాబు కామెంట్స్..
- అర్ధరాత్రి వరకు సభ నడుపుతున్నాం.
- ప్రతీ సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇస్తున్నాం..
- సభ్యులు అడిగిన ప్రతీ ప్రశ్నకు లేఖ ద్వారా సమాధానం తెలియజేస్తాం.
తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి.
- 2023-24 ఏడాది కాలంతో కలిపి గత ఐదేళ్లలో 4లక్షల 3వేల 664 కోట్ల అప్పులు చేసినట్లు తెలిపిన కాగ్.
- 2023-24 ఏడాదిలో పబ్లిక్ మార్కెట్ నుంచి 49,618 కోట్ల అప్పులు తెచ్చిన ప్రభుత్వం.
- గత ఏడాది కాలంలో 200 శాతం FRBM పరిధి పెరిగినట్లు తెలిపిన కాగ్
- 2023-24లో తెలంగాణ రెవెన్యూ సర్ ప్లస్ 779 కోట్లుగా పేర్కొన్న కాగ్.
- 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్ పై నివేదిక
- 2023-24 బడ్జెట్ అంచనా 2,77,690 కోట్లు, చేసిన వ్యయం 2,19,307 కోట్లు
- బడ్జెట్ అంచనాలో 79 శాతం వ్యయం
- జీఎస్డీపీలో వ్యయం అంచనా 15 శాతం
- ఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాల్లో 33 శాతం 1,11,477 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం
- 349 రోజుల పాటు 10,156 కోట్లు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సదుపాయాన్ని వినియోగించుకున్న ప్రభుత్వం
- 35,425 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని 145 రోజుల పాటు వినియోగించుకున్న ప్రభుత్వం
- 2023-24లో వడ్డీల చెల్లింపుల కోసం 24,347 కోట్ల వ్యయం
- వేతనాలకు 26,981 కోట్లు ఖర్చు
- ఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.83 శాతం నిధులు
- 2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ల మొత్తం కేవలం 9934 కోట్లు
- రెవెన్యూ రాబడుల్లో 45 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్‌లకే ఖర్చు
- 2023-24లో రెవెన్యూ మిగులు 779 కోట్లు
- రెవెన్యూ లోటు 49,977 కోట్లు,
- జీఎస్డీపీలో రెవెన్యూ లోటు శాతం 3.33
- 2023-24 ముగిసే వరకు రుణాల మొత్తం 4,03,664 కోట్లు, జీఎస్డీపీలో అప్పుల శాతం 27
- 2023-24 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మొత్తం 2,20,607 కోట్లు
- 2023-24 లో తీసుకున్న 50,528 కోట్లలో 43,918 కోట్లను మూలధనం వ్యయం పై ఖర్చు చేసిన ప్రభుత్వం
- 2023-24 లో స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు 76,773 కోట్లు, 11 శాతం పెరుగుదల
శాసన మండలి ఆవరణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల నిరసన
- రైతు రుణమాఫీ చేయాలని శాసనమండలి ఆవరణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల నిరసన
- ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్సీలు
- రైతు రుణమాఫీ బోగస్ అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల నినాదాలు
- కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.
- నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.
- సభలో కాగ్ రిపోర్ట్ పెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలుపనున్న అసెంబ్లీ
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కామెంట్స్..
ఎమ్మెల్యే కేపీ వివేకానంద..
- బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ అని మొదటి నుండి చెబుతున్నాం..
- నిన్న అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పొత్తు అర్థం అయ్యింది..
- అసెంబ్లీ సమావేశంలో మా హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేక.. బీజేపీ ఎమ్మెల్యేలతో స్క్రిప్ట్ రాసి చదివిపిస్తుంది కాంగ్రెస్..
- కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ నే బీజేపీ ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు చదువుతున్నారు..
- నిన్న సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద సమాధానం లేక బీజేపీ ఎమ్మెల్యేలకు ఇచ్చి మాట్లాడించారు..
- అన్ని అనుమతులతో కాళేశ్వరం కట్టాము..
- అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీనే..
- మరి కేంద్రంలో బీజేపీ పార్టీ సమర్థవంతంగా పని చేయడం లేదా అని ప్రశ్నిస్తున్నాము..
- కాంగ్రెస్ తరపున మాట్లాడడం కంటే.. నేరుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటే సరిపోతుంది..
- ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలపై ఏర్పడిన ప్రభుత్వం..
- తమ హామీలు, తమ బాధ్యతలు విస్మరిస్తూ పరిపాలన చేస్తున్నారు..
- అధికారంలో రాక ముందు పీఆర్సీ, డీఏ లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు..
- ఈ రోజు మా పార్టీ తరపున సభలో వాయిదా తీర్మానం పెడుతున్నాం..
- తప్పకుండా ఉద్యోగులకు ప్రకటించిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం..
ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్..
- మోడీ దేశంలో కాంగ్రెస్ హఠావో అంటున్నారు..
- తెలంగాణలో బీజేపీ నేతలు కాంగ్రెస్ బచావ్ అంటున్నారు..
- బీజేపీ నేతలు రేవంత్ రెడ్డితో డీలింగ్ చేసుకుంటున్నారు..
- భట్టి అంటే మాకు గౌరవం ఉండేది..
- ఇప్పుడు భట్టి అహంకారంతో మాట్లాడుతున్నారు..
- గత అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మొహం ఎక్కడ పెట్టుకుంటారని అన్నారు..
- నిన్న ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని భట్టి అన్నారు..
- 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు..
- మా దగ్గర కమిషన్ తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు..
- దేశంలో ఎక్కడా లేని విధంగా సెక్రటేరియట్ లో కాంట్రాక్టర్లు ధర్నా చేశారు..
- నిన్న భట్టి మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలి..
- భట్టి రోజు రోజుకి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు..
- భట్టి తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి..
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..
- సభలో శాంతి భద్రతలపై మాట్లాడితే మైక్ కట్ చేశారు
- నా ఇంటిపై ఎమ్మెల్యే గాంధీతో పాటు రౌడీలు నా ఇంటిపై దాడి చేశారు
- నన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారు
- సైబరాబాద్ డీసీపీ, మాదాపూర్ ఏసీపీ స్వయంగా రౌడీ షీటర్లను తీసుకొచ్చి హత్య ప్రయత్నం చేశారు
- ఇప్పటికే ఏడాది గడుస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు
- శాసన సభ్యుడుగా నాకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?.
- సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా సైబరాబాద్ డీసీపీ మాదాపూర్ ఏసీపీని సస్పెండ్ చేయాలి
- నన్ను హత్య చేసేందుకు వచ్చిన గాంధీపై త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేశారు
- ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు
- రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా?
- నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని కంప్లైంట్ చేస్తే ఉల్టా నా పైనే కేసు పెట్టి బలవంతంగా మా ఇంటి డోర్లు పగలగొట్టి తీసుకెళ్లారు
- పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నిన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
- కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఉప ఎన్నికలు రావని ప్రకటన చేశారు
- దీనిపై ఏప్రిల్ 2న సీఎం వ్యాఖ్యలపై సుప్రీం దృష్టికి తీసుకెళ్తాం
- పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవు
- ప్రభుత్వ నిర్లక్ష్యంతో నా నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి
- మంత్రి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్ స్ట్రక్షన్ కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టాలి
- సుంకేశాల కన్ స్ట్రక్షన్ చేసిన కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలి
- కాళేశ్వరం ప్రాజెక్టు తో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు కేసీఆర్
- చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు.. వెంటనే వారికి బిల్లు చెల్లించాలి