
Telangana Assembly session Updates..
👉తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. తెలంగాణ వార్షిక బడ్జెట్‌పై చర్చ..
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కామెంట్స్..
👉బడ్జెట్‌లో మూల ధన వ్యయం తగ్గిస్తున్నారు. బడ్జెట్‌లో సూక్తి ముక్తావళి చాలా ఉంది. కానీ, వాస్తవం చూస్తుంటే కమీషన్ల ప్రభుత్వంలా కనిపిస్తుంది. నిధులు లేక వ్యవస్థలు కూనరిల్లుతున్నాయి. సచివాలయంలో ధర్నాలు ఎన్నడూ చూడలేదు. తెలంగాణ నమూనా ఏంటో అర్థం కావడం లేదు. కూల్చివేతల్లోనా, కమీషన్లలోనా అర్థం కావడం లేదు. భూసేకరణ పేరుతో పేద, గిరిజన రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. 15 నెలల్లోనే లక్షా 63వేల కోట్లు అప్పులు చేశారు. కేంద్రం నుంచి పొందిన సాయాన్ని గుర్తుచేస్తే బాగుండేది. ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించక పోవడం బాధాకరం.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిట్ చాట్..
- బడ్జెట్‌పై హరీష్ రావు స్పీచ్ పొలిటికల్ విమర్శలే ఉన్నాయి.
- బడ్జెట్‌పై హరీష్ రావు సబ్జెక్టు మాట్లాడలేదు.
- హరీష్ రావు సబ్జెక్టు మాట్లాడుతారు అని చూసాం కానీ మాట్లాడలేదు.
- మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం కాబట్టే అంత సమయం ఇచ్చాం.
- మాకు ఎలాంటి రాగద్వేషాలు లేవు.
- హరీష్ రావు.. ఆర్‌ఆర్ టాక్స్ వ్యాఖ్యలకు సరైన సమయంలో స్పందన ఉంటుంది.
- బీఆర్‌ఎస్ వ్యాఖ్యలకు ఎప్పుడు ఎలా కౌంటర్ ఇవ్వాలో మాకు తెలుసు.
మంత్రి శ్రీధర్ బాబు చిట్ చాట్..
పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ తయారు కాబోతోంది.
సెంట్రల్ హాల్ తయారు చేయాలని ఆలోచన జరుగుతుంది.
కౌన్సిల్ రెడీ అవ్వగానే మధ్యలో హాల్ రెడీ అవుతుంది.
అందరికీ కూర్చునే విధంగా హాల్స్ రెడీ చేస్తాం.
👉సభలో బడ్జెట్‌పై ప్రసంగాన్ని ప్రారంభించిన హరీష్ రావు.
కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపించిన హరీష్ రావు
- కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో కేవలం 6000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు.
- మిగతా ఉద్యోగాలు అన్ని బిఆర్ఎస్ పాలనలో ఇచ్చినవి.
- 56000 ఉద్యోగాలు ఇచ్చాము అని అసత్యపు ప్రచారాలు ప్రభుత్వం చేస్తుంది.
- కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో కేవలం 6000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు.
- మిగతా ఉద్యోగాలు అన్ని బిఆర్ఎస్ పాలనలో ఇచ్చినవి.
- 56000 ఉద్యోగాలు ఇచ్చాము అని అసత్యపు ప్రచారాలు ప్రభుత్వం చేస్తుంది.
- భట్టి బడ్జెట్ మీద నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
- మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నరు మొండి చెయ్యి చూపారు.
- ఈ ఏడాదైనా ఇవ్వకపోతారా అని ఎదురు చూసిన వారి ఆశల మీద భట్టి బకెట్ల కొద్దీ నీళ్లు చల్లారు.
- ఎన్నికల ముందు రేవంత్ నుంచి రాహుల్ గాంధీ దాకా అశోక్ నగర్ చుట్టూ అంగ ప్రదక్షిణం గావించారు.
- ఊరూరు బస్సు యాత్రలు చేసి రెచ్చగొట్టారు.
- నిరుద్యోగులను మీ పార్టీ కార్యకర్తలుగా మార్చుకొని ఇల్లిల్లూ తిప్పారు.
- నాడు నమ్మించారు, నేడు నిండ ముంచారు.
- ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని దుష్ర్పచారం చేసారు.
- తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు నిధులు, నీళ్లు, నియామకాలు నెరవేర్చిన ప్రభుత్వం మాది.
- తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చింది. ముల్కీ రూల్స్ నుంచి 610 దాకా తెలంగాణ పోరాడింది దేని కోసం?
- స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని. మా ఉద్యోగాలు మాకు కావాలని. అదే చేసిండు కేసీఆర్
- 60-80శాతం మాత్రమే ఉండే స్థానిక రిజర్వేషన్ ను 95శాతానికి పెంచిండు.
- అందుకోసం రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించిండు.
- ఇవాళ అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేసింది కేసీఆర్
- తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో అక్షరాల లక్షా 62వేల ఉద్యోగాలు భర్తీ చేసినం.
- ఈ మాటకు నేను కట్టుబడి ఉన్నా. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదనే మీ ప్రచారం విష ప్రచారం.
- అబద్దమే మీ ఆత్మ. అబద్దమే మీ పరమాత్మ.
- ఇదే కాదు నీ జాబ్ క్యాలెండర్ సంగతి, నీ నిరుద్యోగ భృతి సంగతి, నువ్వు చెబుతున్న 57 వేల ఉద్యోగాల తప్పుడు లెక్కల సంగతి తేలిపోయింది.
- జాబుల్లేని క్యాలెండర్ విడుదల చేసి జాబ్ క్యాలెండర్ అంటారా?
- మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఏడాదిన్నరగా పంచుతున్నవు తప్ప, నువ్వు వెలగబెట్టింది ఏమి లేదు.
- మీరు చెప్పుకుంటున్న 57వేల ఉద్యోగాల్లో మేం ఇచ్చినవే 50వేలు. ఆరు వేల పోస్టులు కూడా ఇవ్వలేదు.
- 15నెలల పాలనలో మీరు నోటిఫికేషన్లు ఇచ్చి, భర్తీ చేసిన పోస్టులు ఎన్ని?
- గ్రామపంచాయతీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
- పంచాయతీలకు నిధులు విడుదల చేయడం లేదు.
ప్రభుత్వానికి అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
- భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గమైనా? సిద్దిపేట నియోజకవర్గమైనా?
- పూర్తిగా 100% రుణమాఫీ అయిందని నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్తాను.
- కృష్ణ జలాలపై ప్రభుత్వం పోరాటం చేయాలి.
- 575 టీఎంసీలను తెలంగాణకు తీసుకురావాలి.
- కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ సెక్షన్స్-3 తీసుకొచ్చారు.
- గతంలో నేను కేసీఆర్ సంతకాలు పెట్టినట్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.
- అక్కడ ఆదిత్య నాథ్, తెలంగాణ నుంచి ఎస్కే జోషి మాత్రమే సంతకాలు చేశారు.
- కృష్ణా జలాలపై బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తుంది.
- కృష్ణా జలాలపై ప్రత్యేక చర్చ పెట్టాలి. చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం.
- ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అనే ప్రజలకు తెలుస్తుంది.
హరీష్ కామెంట్స్..
- మెగా డీఎస్సీ పేరుతో మోసం చేశారు. సంక్షేమ హాస్టల్స్‌లో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాలపై నమ్మకం పోయింది. ఫీజు రియింబర్స్‌మెంట్‌పై గొప్పలు చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.
శ్రీధర్ బాబు కామెంట్స్..
- నీటి వాటాలపై ప్రత్యేకమైన చర్చ పెడదాం.
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే నీళ్ల వాటాల గురించి స్పష్టమైనటువంటి వైఖరిని తెలిపారు.
శాసన మండలిలో జూపల్లి కామెంట్స్..
- బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉంది..
- తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షకు అనుగుణంగా పాలన జరగలేదు.
- మంత్రి జూపల్లి వాఖ్యల పట్ల బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం..
- సభలో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ సభ్యులు..
హరీష్ రావు కామెంట్స్..
👉బడ్జెట్‌పై మాట్లాడుతుంటే అధికారపక్షం నేతలు అడ్డుకుంటున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండిపోతున్నాయి. రైతులకు రుణమాఫీ చేయడం లేదు. కాంగ్రెస్ పాలనలో రైతులది ఒడవని దుఖం. ఒక్క సిద్దిపేటలోని రూ.2లక్షల రుణమాఫీ కాని వారు 10వేల మంది ఉన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతుబంధు విషయంలో రికార్డు సృష్టించాం. పన్నులు లేకుండా సాగు నీళ్లు ఇవ్వండి. రుణమాఫీ కాని రైతులందరికీ విడుదల చేయాలని కోరుతున్నాం. సంపూర్ణ రుణమాఫీ జరిగితే నేను బహిరంగ క్షమాపణలకు సిద్ధం.
హరీష్ రావు కామెంట్స్..
- మహాలక్ష్మి 2500, పెన్షన్ పెంపు, వితంతువు పెన్షన్
- ముఖ్యమంత్రి మంచి కళాకారుడు, వక్త.
- ఆరు గ్యారెంటీలను బడ్జెట్లో మరిచిపోయారు.
- పెన్షన్ 4000 రూపాయలు ఎప్పుడు ఇస్తారా అని వృద్ధులు కాలం చేస్తున్నారు.
- కొత్త పెన్షన్స్ లేవు, 4000 పెంపు లేదు, కోత మాత్రం లక్ష మందికి చేశారు.
- తెలంగాణలో కోటి మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు లబ్ధిదారులు ఉన్నారు.
- లక్ష మందికి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.
👉హరీష్ రావు బుద్ధి మాన్యం అనే పదాన్ని అభ్యక్షన్ చేసిన స్పీకర్
👉బుద్ధిమాన్యం తప్పేమీ కాదని నిండు సభలో బట్టలూడదీసి కొడతా అని సీఎం అనడం కరెక్టా అంటూ హరీష్ వాదన.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్..
- బుద్ధి మాన్యం అనే వ్యాఖ్యను ఖండిస్తున్నాం.
- స్పీకర్ అభ్యంతరం చెప్పినప్పుడు ఏకీభవించాలి.
- జగదీష్ రెడ్డి తరహాలో హరీష్ రావు ప్రవర్తిస్తున్నారు.
- స్పీకర్ అభ్యంతరానికి హరీష్ రావు అభ్యంతరం చెప్పడం కరెక్ట్ కాదు.
- బడ్జెట్ పరిధి దాటి అడ్డగోలు వ్యాఖ్యలు హరీష్ రావు చేస్తున్నారు.
మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..
- సభ్యుల సంఖ్య ప్రకారం అందరికీ అవకాశాలు ఇస్తున్నాం.
- కాంగ్రెస్ 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 30 నిమిషాలు ఉంటుంది.
- బీఆర్ఎస్ సభ్యుల ప్రకారం 19 నిమిషాలు.
- బిజెపికి ఏడు నిమిషాలు, ఎంఐఎంకి ఐదు నిమిషాలు.
హరీష్ రావు కామెంట్స్..
- నన్ను మాట్లాడమంటే మాట్లాడతా లేదంటే వెళ్ళిపోతాను.
- ప్రతి చిన్న విషయానికి ఇంట్రప్షన్ చేస్తే కుదరదు.
👉హరీష్ వ్యాఖ్యలు..
భూములను అమ్మడం, తాకట్టు పెట్టడం ద్వారా రూ.50వేల కోట్లు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అనుముల వారి పాలనలో ఎన్నికల భూములు అమ్ముతారో చెప్పాలి. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని అబద్ధాలు చెబుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఆర్థిక మాంద్యం తెలంగాణలో ఉందంటున్నారు. అంచనాలకు అనుగుణంగా రీచ్ అవుతున్నాయి. ఆర్థిక మాంద్యం ప్రపంచంలో కాదు.. ప్రభుత్వ పెద్దల బుద్ధిలో ఉంది. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. స్టాంప్, రిజిస్ట్రేషన్ ఆదాయం తెలంగాణలో తగ్గింది. తెలంగాణ రైజింగ్ అంటూ ముఖ్యమంత్రి నినాదం ఇస్తున్నారు. తెలంగాణ రైజింగ్ ఎక్కడ ఉంది?.
👉కాగ్ రిపోర్టు ప్రకారం రాష్ట్ర బుద్ధి రేటు 5.5% ఉంటే బడ్జెట్లో 20% ఉంది అన్నట్లు చెప్పారు. ఆర్థిక మాంద్యం దేశమంతా ఉంటే కర్ణాటకలో ఎందుకు లేదు?. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జీఎస్టీ వృద్ధిరేటు దేశం కంటే ఏనాడు తక్కువ లేదు కాంగ్రెస్ పాలనలో తగ్గింది. గత బీఆర్ఎస్ పాలన కంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో ఆదాయం తగ్గింది. కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ఆదాయం తగ్గింది. బీఆర్‌ఎస్ పాలనలో అన్ని ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ రాగానే అన్ని ఎందుకు తగ్గిపోయాయి?. రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్‌లతో ఆర్థిక మాంద్యం అల్లకల్లోలం అయింది. హైడ్రాతో భయపెట్టారు, ఎయిర్‌పోర్టుకు మెట్రో రద్దు అన్నారు, మూసీ ప్రక్షాళన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పెట్టుబడులు రాకుండా పోయాయి అని కామెంట్స్ చేశారు.
👉హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆందోళన..
హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేసిన విప్‌లు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్..
వైఎస్సార్ హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వేశారు.
ఎన్నికలకు రెండు మాసాల ముందు ఔటర్ రింగ్ రోడ్డును కమీషన్లకు కకుర్తిపడి అమ్ముకున్నారు
బీఆర్‌ఎస్ కోకాపేటా యాక్షన్ అంతా మాకు తెలుసు.
బీఆర్‌ఎస్ నాయకుల బినామీలు వంద కోట్లకు కొనుగోళ్లను ఎవ్వరూ మర్చిపోలేదు.
రోడ్డును ఎవరైనా అమ్ముకుంటారా?
చరిత్ర మర్చిపోయి ఎవ్వరూ మర్చిపోలేదు
👉మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కామెంట్స్..
అధికారంలో ఉన్న వాళ్లకు ఓపిక ఉండాలి.
ప్రభుత్వం ఏదైనా చెప్పాలి అనుకుంటే ఎల్ఏ మినిస్టర్ ఉన్నారు.
హరీష్ రావు మాట్లాడేటప్పుడు ప్రతిసారి అడ్డుకోవద్దు.
👉ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు కామెంట్స్..
- శ్రీనివాస్ యాదవ్ నీతులు మాకు కాదు వాళ్ల పార్టీ వాళ్లకు చెప్పుకోవాలి.
- ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలి.
- వాస్తవాలకు దూరంగా మాట్లాడినప్పుడు స్లోగన్స్ ఇవ్వడం తప్పేమీ కాదు.
- అడ్డగోలుగా మాట్లాడతాము అంటే మౌనంగా ఉండలేం.
- హరీష్ రావుకు ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం.
👉హారీష్‌రావు కామెంట్స్..
గత బడ్జెట్‌లో భట్టి విక్రమార్క చెప్పిన విషయాలను ప్రస్తావించిన హరీష్. గత సంవత్సరం బడ్జెట్‌ను సమీక్షించుకుందాం. ఫార్మాసిటీ భూములపై నాడు పోరాటం చేశారు. ఇప్పుడు బలవంతంగా రైతుల నుంచి లాక్కుంటున్నారు. అలాగే, రుణమాఫీకి 31వేల కోట్లు సిద్ధం చేశామని గత బడ్జెట్‌లో చెప్పారు. ఇప్పుడు 21వేల కోట్లు రుణమాఫీ చేశామని అంటున్నారు. చేతగాని వాళ్లు ఎవరో ప్రజలకు అర్థమైంది.
👉ఏడాదిలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. నిరుద్యోగులను మోసం చేశారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎన్నికల హామీలను నెరవేర్చలేదు. రైతు భరోసా 15వేలు ఇస్తామన్నారు. వానాకాలంలో ఎగబెట్టారు. యాసంగిలో 12వేలు అన్నారు. అది కూడా సరిగా అందలేదు. కౌలు రైతులకు 12వేలు ఇస్తామన్నారు. ఇప్పడు, రైతులు, కౌలు రైతులే తేల్చుకోవాలంటున్నారు. కౌలు రైతులకు అన్యాయం జరిగింది. జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్‌గా క్యాలెండర్‌గా మారింది. రివైజ్డ్ ఎస్టిమేషన్స్‌లో 27వేల కోట్లు తక్కువ చేసి చూపారు.
👉హెచ్‌ఎండీఏ ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తెస్తామంటున్నారు. హౌసింగ్ బోర్డు భూముల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. గతంలో ప్రభుత్వ భూములు అమ్మవద్దన్న వారే అప్పుడు అమ్మకానికి పెట్టారు. ప్రభుత్వ భూములు అమ్మితే ఆనాడు విమర్శించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇవ్వనందుకు క్షమాపణ చెప్పాలి. బడ్జెట్‌లో ప్రజలను మాయచేసే ప్రయత్నం చేశారు.
👉జాబ్ క్యాలెండర్‌పై నిలదీస్తే నిరుద్యోగులను అశోక్‌నగర్‌లో అరెస్ట్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్నారు?.. ఉద్యోగాలు ఇచ్చారా?. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా?. ఆర్‌ఆర్‌ఆర్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరమైనా భూసేకరణ చేసిందా?. ఎన్నికల ముందు నో ఎల్‌ఆర్‌ఎస్.. నో బీఆర్‌ఎస్ అన్నారు.. ఇప్పుడు ముక్కు పిండి ఎల్‌ఆర్‌ఎస్ వసూలు చేస్తున్నారు. ఇవి అవాస్తవిక అంచానాలని ఆనాడే చెప్పాను.
👉ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు అసెంబ్లీ, కౌన్సిల్‌లో బడ్జెట్ పై చర్చ జరగనుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు.
👉అలాగే, సివిల్ సప్లై కార్పొరేషన్ వార్షిక నివేదికను సభకు సమర్పించనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
👉లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వార్షిక నివేదికను సభకు సమర్పించనున్న మంత్రి శ్రీధర్ బాబు.
Comments
Please login to add a commentAdd a comment