
Telangana Budget Live Updates..
👉తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.. తెలంగాణ బడ్జెట్ రూ.3.4లక్షల కోట్లు
- 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.3,04,965 కోట్లు.
- రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు.
- మూలధన వ్యయం రూ.36,504 కోట్లు.
బడ్జెట్ కేటాయింపులు..
- పౌరసరఫరాల శాఖ- 5734 కోట్లు
- విద్య - 23,108కోట్లు
- పంచాయతీ &రూరల్ డెవలప్‌మెంట్ -31605 కోట్లు
- రైతు భరోసా- 18,000 కోట్లు.
- వ్యవసాయ రంగానికి -24,439 కోట్ల రూపాయలు
- పశుసంవర్ధక శాఖకు -1,674 కోట్లు.
- పౌరసరఫరాల శాఖకు -5,734 కోట్లు.
- మహిళా, శిశు సంక్షేమం -2,862 కోట్లు
- ఎస్సీ అభివృద్ధి -40,232 కోట్లు
- ఎస్టీ అభివృద్ధి-17,169 కోట్లు
- బీసీ అభివృద్ధి-11,405కోట్లు
- చేనేత రంగానికి-371
- మైనారిటీ-3,591కోట్లు
- విద్యాశాఖకు-23,108 కోట్లు
- కార్మిక ఉపాధి కల్పన-900 కోట్లు
- పంచాయతీరాజ్ శాఖకు-31,605 కోట్లు
- మహిళా శిశు సంక్షేమశాఖ-2,862 కోట్లు.
- షెడ్యూల్ కులాలు-40,232 కోట్లు
- షెడ్యూల్ తెగలు-17,169 కోట్లు.
- వెనుకబడిన తరగతుల సంక్షేమానికి-11,405 కోట్లు.
- ఐటీ శాఖకు-774 కోట్లు
- విద్యుత్ శాఖకు-21,221 కోట్లు
- మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు-17,677 కోట్లు
- నీటి పారుదల శాఖకు-23,373 కోట్లు
- రోడ్డు భవనాలు శాఖకు-5907 కోట్లు
- పర్యాటక శాఖకు-775 కోట్లు
- క్రీడా శాఖకు-465 కోట్లు.
- అడవులు, పర్యావరణ శాఖకు-1023 కోట్లు
- దేవాదాయ శాఖకు-190 కోట్లు
- హోంశాఖకు- 10,188 కోట్లు
- మహాలక్ష్మి పథకానికి రూ.4305 కోట్లు
- గృహజోత్యి పథకానికి రూ.2080 కోట్లు.
- సన్న బియ్యం బోనస్‌కు రూ.1800 కోట్లు.
- రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1143 కోట్లు.
బడ్జెట్ పూర్తి కాపీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
భట్టి ప్రసంగం..
- అంబేద్కర్ స్పూర్తితో ప్రజాపాలన కొనసాగిస్తున్నాం. దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం.
- తెలంగాణ తాత్కాలిక, దీర్థకాలిక ప్రయోజనాలే ముఖ్యం. మాపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేస్తున్నారు.
- అబద్ధపు వార్తలతో ప్రజలు మోసం చేస్తున్నారు. అబద్దపు విమర్శలను తిప్పి కొడుతూ వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం మా బాధ్యత.
- అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు అంశాలు మా నినాదం.
- తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రణాళికతో సీఎం పాలనను ముందుకు నడిపిస్తున్నారు.
- నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిణామం 200 బిలియన్ డాలర్లు. రాబోయే ఐదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చేసి 1000 బిలియన్ డాలర్లు ఉండేలా కార్యాచరణ.
- ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి రూ.11,600కోట్లు.
- 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్.
- AI సిటీగా 200 ఎకరాల్లో ప్రత్యేక టెక్ హబ్.
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- సన్న వడ్లకు క్వింటాల్‌కు 500 రూపాయలు బోనస్..
- 40 లక్షల ఎకరాల్లో సన్న వడ్లసాగు విస్తరణ.
- ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 8,332కు పెంపు.
- ఆయిల్ ఫామ్ సాగుకు టన్నుకు 2000 అదనపు సబ్సిడీ.
- వడ్ల బోనస్ కింద రైతులకు 1,206 కోట్లు చెల్లింపు.
- తెలంగాణలో నిరుద్యోగ రేటు 22.9 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గింపు.
- 57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రం పునరుద్ధరణ.
- రాజీవ్ యువ వికాస పథకానికి రూ.6000 కోట్లు.
- బీఎఫ్ఎస్ఐ రంగంలో విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు
- ప్రతీ నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు.
- స్కూల్స్‌లో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్‌తో పాటు ఉచిత వసతులు.
- గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంపు.
- విద్యార్థులకు ఉచితంగా సాయంత్రం స్నాక్స్ పథకం.
- కొత్తగా 1,835 వైద్య చికిత్సలు ఆరోగ్య శ్రీలో చేరిక.. 90 లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్య శ్రీ లబ్ధి..
- ఆరోగ్య శ్రీ ప్యాకేజీల ఖర్చు 20 శాతం పెంపు..
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు వేగంగా వస్తున్న మార్పుల ప్రభావాన్ని తెలంగాణ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.
- తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధుని సాధిస్తుంది.
- 24-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం 16,12,579 కోట్లు.
- గత ఏడాదితో పోల్చితే వృద్ధి రేటు 10.1శాతంగా నమోదైంది.
- బడ్జెట్ ప్రసంగం చదువుతున్న భట్టి విక్రమార్క. ఆర్థిక మంత్రిగా భట్టి మూడోసారి బడ్జెట్ ప్రసంగం..
👉బడ్జెట్ ప్రసంగం సందర్భంగా బీఆర్‌ఎస్ నేతల నినాదాలు.. కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలు..
👉బడ్జెట్ ప్రతులను స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేసిన భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు.
అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ నేతల నిరసన..
- అసెంబ్లీ మీడియా పాయింట్ కేటీఆర్ కామెంట్స్..
- ఎండిన పంటలు, రైతులకు సంఘీభావంగా నిరసన చేస్తున్నాం.
- 11 నెలలుగా మేము ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నాం.
- వర్షాలు సమృద్ధిగా పడ్డాయి.. రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదు.
- ప్రాజెక్టుల్లో నీళ్ళు ఉన్నా రైతులకు నీళ్లు ఇవ్వడం లేదు.
- తెలంగాణలో నాలుగు వందలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
- కేసీఆర్ పై కోపంతో మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఇసుక దోపిడి చేస్తున్నారు.
- కేసీఆర్ పాలనలో 36శాతం కృష్ణా జలాలను వాడుకొని రైతులకు నీళ్లు ఇచ్చాం.
- కాంగ్రెస్ పాలనలో కిందికి నీళ్లు వదిలి.. పంటలు ఎండబెట్టారు.
- కాలం తెచ్చిన కరువు కాదు.. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు.
- రేవంత్ రెడ్డి ముందు చూపులేని ప్రభుత్వం వల్ల పంటలు ఎండుతున్నాయి.
- రేవంత్ రెడ్డి గుడ్డి చూపు, చేతగాని, తెలివితక్కువ తనం వల్ల రైతులకు సమస్యలు.
- ఎండిన పంటలకు ఎకరానికి 25వేల పంట నష్టం ఈ బడ్జెట్ లో కేటాయించాలి
- పంటలు ఎండిపోవడానికి చెక్ డ్యామ్ లు, చెరువులు నిలపకపోవడం వల్లే నష్టం జరిగింది.
- త్వరలో ఎండిన పంటలు ఉన్న ప్రాంతాల్లో పర్యటన చేస్తాం
👉తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
👉అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం
కేబినెట్ భేటీ..
- అసెంబ్లీ హాల్‌లో బడ్జెట్ మీద కేబినెట్ భేటీ
- బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న మంత్రి మండలి
- 11.14కు తెలంగాణ బడ్జెట్
- శాసన సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి
- మండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌బాబు
- బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
- ఘనస్వాగతం పలికిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి,
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, శాసనసభ సెక్రటరీ నరసింహచార్యులు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు.
- ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన భట్టి విక్రమార్క.
- అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరగనున్న కేబినెట్ సమావేశానికి హాజరు కానున్న భట్టి.
👉నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.
👉వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) గాను రూ.3.05 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నట్టు తెలిసింది.
👉2024–25లో ప్రతిపాదించిన రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌కు ఇది సుమారు 5 శాతం అదనం.
👉ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో భేటీ కానున్న రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనుంది. అనంతరం 11:14 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. శాసనమండలిలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.
గ్యారంటీలకు తోడుగా!
👉తాజా బడ్జెట్‌లో ఎప్పటిలాగే వ్యవసాయం, వైద్యం, సాగునీరు, విద్య, గ్రామీణాభివృద్ధి శాఖల పద్దులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆరు గ్యారంటీల అమలుతోపాటు అభివృద్ధి, సంక్షేమం సమన్వయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రతిపాదనలు ఉంటాయని పేర్కొంటున్నాయి.
👉ఆరు గ్యారంటీల్లో ఒకటైన సామాజిక పింఛన్ల పెంపు ద్వారా ఏటా రూ.3,500 కోట్ల మేర అదనపు భారం పడుతుందని, ఈ మేరకు పింఛన్ల బడ్జెట్ పెంచుతారని సమాచారం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాల కొనసాగింపునకు అవసరమైన మేర నిధులు కేటాయించనున్నారు.
👉రైతు భరోసాకు రూ.18వేల కోట్లు, పంటల బీమా ప్రీమియం కోసం రూ. 5 వేల కోట్లను ప్రతిపాదించే అవకాశం ఉంది. రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ, మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ పథకాలకు సంబంధించి రాష్ట్రం భరించాల్సిన మొత్తాన్ని కూడా బడ్జెట్లో చూపించనున్నారు.
👉గతంలో చేసిన అప్పులు తీర్చేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 36వేల కోట్ల వరకు ప్రతిపాదించగా.. ఈసారి దీన్ని రూ.65 వేల కోట్లవరకు ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రూ.లక్ష కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల దాకా..!
👉తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు 12 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో 2014–15 సంవత్సరానికి గాను 10 నెలల కాలానికి బడ్జెట్ పెట్టగా.. 2024–25లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్‌తో పాటు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2014–15లో నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్ర తొలి బడ్జెట్‌ను రూ.లక్ష కోట్లతో ప్రవేశపెట్టారు. తర్వాతి నాలుగేళ్లలో బడ్జెట్ పరిమాణం రూ.1.75 లక్షల కోట్ల వరకు చేరింది.
👉2019–20లో కరోనా ప్రభావంతో బడ్జెట్‌ను తగ్గించి రూ.1.46లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. తర్వాతి రెండేళ్లలోనే ఏకంగా రూ.85 వేల కోట్ల మేర బడ్జెట్ పెరిగి రూ.2.30లక్షల కోట్లకు చేరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2.90లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్ 2024–25లో రూ.2.91లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ (2024–25) బడ్జెట్‌లో అంచనా వ్యయాన్ని రూ. 2.75 లక్షల కోట్లుగానే ప్రతిపాదించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment