తెలంగాణ అసెంబ్లీ: మార్షల్స్‌తో బీజేపీ ఎమ్మెల్యేల వాగ్వాదం | Telangana Assembly Session Mar 24th Live Updates | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. అప్‌డేట్స్‌

Published Mon, Mar 24 2025 10:22 AM | Last Updated on Mon, Mar 24 2025 1:42 PM

Telangana Assembly Session Mar 24th Live Updates

Telangana Assembly Session Updates..

అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం..

  • లాబీలో ఎదురుపడిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వివేక్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌.
  • అరగంట పాటు వివేక్‌, సుమన్‌ మధ్య చర్చలు.
  • వారిద్దరినీ చూసి షాకైన కేటీఆర్‌. 
     

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్‌..

  • ప్రతిపక్షాలు విమర్శలు తప్ప.. సూచనలు చేయడం లేదు.
  • పెట్టుబడిదారులను బెదిరించే విధంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మాత్రమే సీఎం అన్నారు..
  • సీఎం వ్యాఖ్యలను బీఆర్ఎస్ సభ్యులు వక్రీకరించి మాట్లాడుతున్నారు.

జగదీశ్ రెడ్డి ఎమ్మెల్యే చిట్ చాట్..

  • ఇప్పటి వరకు సస్పెండ్‌పై బులెటిన్ ఇవ్వలేదు.
  • రావద్దు అనడానికి ఎలాంటి పరిమితి ఉంది అంటూ ఆగ్రహం
  • బులెటిన్ ఇస్తే నేను రాను
  • ఏ కారణంతో నన్ను సస్పెండ్ చేశారు.
  • వారం నుంచి బులెటిన్ విడుదల చేయలేదు.
  • ఇష్టారాజ్యంగా అసెంబ్లీ నడుస్తుంది
  • పద్దతి ప్రకారం అసెంబ్లీ నడవటం లేదు
  • రాజ్యాంగ విలువలు, నిబంధనలు లేకుండా అసెంబ్లీ నడుస్తుంది
  • సస్పెండ్ చేశారో లేదో ఇప్పటికీ ఆధారాలు లేవు.
  • మంద బలంతో సభ నడుపుతాం అంటే కుదరదు.
  • ఇప్పుడు బులిటెన్ ఇస్తారో చూస్తా.. లేదంటే స్పీకర్‌ను కలుస్తాను.
  • స్పీకర్ ను మళ్ళీ అడుగుతున్నా బులిటెన్ ఇవ్వాలి.
  • వారం రోజుల నుండి రోజు అడుగుతున్నాను.
  • కోర్టుకు పోతాం అనే భయంతోనే నాకు బులిటెన్ ఇవ్వడం లేదు
  • సస్పెండ్ చేసిన వెంటనే బులిటెన్ ఇవ్వాలి.
  • వారం గడిచినా ఎందుకు ఇవ్వడం లేదు. ఆధారాలు లేకనే సస్పెన్షన్ బులిటెన్ ఇవ్వడం లేదు.
  • హెలికాప్టర్లలో తిరుగుతున్నారు మా నల్గొండ జిల్లా మంత్రులు
  • గంట ప్రయాణానికి కూడా హెలికాప్టర్‌లో వెళ్తున్నారు.
  • నిన్న జాన్ పాడ్‌లో జానారెడ్డి దావత్‌కు కూడా హెలికాప్టర్ లో వచ్చారు.
  • ప్రశ్నలకు సమాధానం చెప్పలేక క్వశ్చన్ అవర్ రద్దు చేస్తున్నారు.
  • ప్రజల సమస్యలు శాసన సభలో లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు లేదు.

మార్షల్స్‌తో బీజేపీ సభ్యుల వాగ్వాదం.. 

  • అసెంబ్లీ  ఆవరణలో  బీజేపీ  ఎమ్మెల్యేలకు, మార్షల్స్‌కి మధ్య వాగ్వాదం.
  • అకాల వర్షంతో నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌.
  • మొక్కజొన్న కంకులు, మామిడి కాయలతో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు.
  • అసెంబ్లీ లోపలికి అనుమతించని మార్షల్స్ ..
  • కంకులు, మామిడి కాయలతో ఎమ్మెల్యేలను మీడియా పాయింట్ వద్దకు కూడా అనుమతి ఇవ్వని మార్షల్స్.
  • అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ ఎమ్యెల్యేల  డిమాండ్
  • రైతులను ఆదుకోవాలని సభలో బీజేపీ సభ్యులు నిరసన.

అసెంబ్లీలో SLBCపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్

  • నెల రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు..
  • ఇంకా కానరాని ఏడుగురి కార్మికుల ఆచూకీ
  • టన్నెల్‌ వద్ద పనుల పురోగతి.. తదుపరి చర్యలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న సంబంధిత అధికారులు
  • కార్మికుల ఆచూకీపై కీలక ప్రకటన చేయనున్న ప్రభుత్వం.

నల్లబ్యాడ్జీలతో బీఆర్‌ఎస్‌ నేతలు.. 

  • రుణమాఫీపై నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న బీఆర్ఎస్ శాసనసభ సభ్యులు...
  • రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయాలి...
  • మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం..
  • రుణమాఫీ బూటకం .. కాంగ్రెస్ నాటకం .. అంటూ నినాదాలు
  • అసెంబ్లీకి హాజరైన బీఆర్‌ఎస్‌ సభ్యులు.
  • రెండు లక్షల రుణమాఫీపై మాట తిప్పిన కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు..

అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి..

  • అసెంబ్లీకి రావద్దని జగదీష్ రెడ్డికి సూచించిన చీఫ్ మార్షల్.
  • తనను రావద్దని స్పీకర్ ఇచ్చిన బులిటన్ చూపించాలని డిమాండ్ చేసిన జగదీష్ రెడ్డి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement