quash petition
-
పట్నం నరేందర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్:లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటనలో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను వికారాబాద్ కోర్టు వాయిదా వేసింది. కొడంగల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉండడంతో బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్లు వికారాబాద్ కోర్టు తెలిపింది.తదుపరి విచారణను వికారాబాద్ కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.నరేందర్‌రెడ్డిని 7 రోజుల పాటు తమ కస్టడీ కి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ జరగనుంది.ఈ పిటిషన్‌పై కోర్టు వాదనలు విననుంది.మరోవైపు కొడంగల్ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను క్వాష్ చేయాలని నరేందర్‌రెడ్డి వేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. -
పట్నం కోసం రంగంలోకి బీఆర్ఎస్ లీగల్ టీమ్.. పిటిషన్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటన కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు.. నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ బీఆర్ఎస్ లీగల్ టీమ్ కోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.తెలంగాణ హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు రిమాండ్ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని ఆయన కోరారు. నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పట్నం నరేందర్ రెడ్డి. అయితే, ఈరోజు హైకోర్టుకు సెలవు కావటంతో సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.మరోవైపు.. నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ బీఆర్ఎస్ లీగల్ టీమ్ నేడు హౌజ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు. నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. జైలులో ఐదుగురు నేరస్థులతో కలిపి మాజీ ఎమ్మెల్యేను ఉంచారని బీఆర్ఎస్ లీగల్ టీమ్ చెబుతోంది. ఈ క్రమంలోనే ఆయనను స్పెషల్ బ్యారక్‌లో ఉంచాలని కోర్టును కోరనుంది. ఇదిలా ఉండగా.. లగచర్ల ఘటనలో మరో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్యంగా ఓ ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు పోలీసులు. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. మరో కొంత మంది నిందితుల కోసం గాలిస్తున్నారు. -
నాపై లైంగిక వేధింపుల కేసును కొట్టేయండి
సాక్షి, అమరావతి: అత్యాచారం ఆరోపణలపై తనపై తిరుపతి తూర్పు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టకుండా ఆరోపణల్లో సత్యాలను శోధించకుండా తనపై కేసు నమోదు చేయడం సరికాదని పిటిషన్లో పేర్కొన్నారు.పోలీసులు తనపై నమోదు చేసిన కేసు సెక్షన్ 173(1)కి విరుద్ధమన్నారు. ఈ మొత్తం ఘటన ‘హనీ ట్రాప్’ గా ఆయన ఆభివర్ణించారు. జూలై, ఆగస్ట్‌ల్లో ఘటన జరిగిందని వరలక్ష్మి చెబుతున్నారని, అయితే ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేసిందో మాత్రం చెప్పడం లేదన్నారు. బెయిల్ మంజూరు చేయండి : మాజీ ఎంపీ నందిగం సురేష్ టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి ఘటన కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ఎంపీ నందిగం సురేష్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. రాజకీయ కక్షతోనే తనను ఈ కేసులో ఇరికించారని తెలిపారు. 2021లో ఘటన జరిగితే రెండేళ్ల తరువాత తనపై కేసు నమోదు చేశారన్నారు. ప్రస్తుతం తాను జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నానని తెలిపారు. తనపై నమోదు చేసిన కేసులో దర్యాప్తు కూడా పూర్తయిందన్నారు. తనపై ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. తాను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని, బెయిల్ మంజూరు సందర్భంగా ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటానని తెలిపారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపే అవకాశం ఉంది. కాగా ఇదే కేసులో జైలులో ఉన్న వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు అవుతు శ్రీనివాస్‌రెడ్డి కూడా బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులురాష్ట్రానికి ప్రత్యేక హోదానిచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, నీతి ఆయోగ్ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీ సులిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. -
సీఐడీకి స్వేచ్ఛ !..చంద్రబాబు గుండెల్లో రైళ్లు
-
రుజువైతే స్కిల్ కేసులో జీవిత ఖైదు తప్పదు
-
క్వాష్ పిటిషన్ రద్దు..షర్మిల ఎఫెక్ట్ ?
-
బాబుకు ఇది భారీ భంగపాటే!
ఢిల్లీ, సాక్షి: స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఊరట కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. సర్వోన్నత న్యాయస్థానంలో చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. 17-ఏ విషయంలో భిన్నాభిప్రాయాలు మాత్రమే వ్యక్తం చేస్తూ సీజేఐకి పిటిషన్‌ను బదిలీ చేశారు ఇద్దరు న్యాయమూర్తులు. ఈ క్రమంలో ACB కోర్టు అంటే ట్రయల్ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను పూర్తిగా సమర్థించారు. ఇది ఏరకంగా చూసినా చంద్రబాబుకు భారీ భంగపాటే అంటున్నారు న్యాయ నిపుణులు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు నుంచి తప్పించుకోవడం అసాధ్యం అని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చూస్తే ఎవరికైనా అర్థమవుతుందంటున్నారు న్యాయ నిపుణులు. తీర్పు విషయంలో జడ్జిలు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ చంద్రబాబు రిమాండ్ విషయంలో జోక్యం చేసుకోబోమని ఇద్దరు కూడా స్పష్టం చేయడం గమనార్హం. అరెస్ట్ అక్రమమన్న చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే వాదనను తోసిపుచ్చారు. అలాగే.. ఈ కేసులో చంద్రబాబుకి ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ చెల్లుతుందని, దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపారు. దీంతో ఈ కేసు విచారణ ముందుకు సాగేందుకు దర్యాప్తు సంస్థ సీఐడీకి మార్గం సుగమం అయ్యింది. క్వాష్ చేసేదే లే.. ఈ కేసును మొదటి నుంచి రాజకీయ కక్ష వ్యవహారంగా ప్రొజెక్ట్ చేసే యత్నం చేశారు చంద్రబాబు లాయర్లు. కానీ, కోర్టు మాత్రం ఆ వాదనతో ఏకీభవించలేదు. దీనిని రాజకీయాలకు ముడిపెట్టలేమని, ఈ కేసుకు రాజకీయ కక్షలకు సంబంధం లేదని తేల్చేసింది. ఈ కేసులో నేరం జరిగింది, నిధుల మళ్లింపు జరిగింది, విశ్వాస ఘాతుకం చోటు చేసుకుందన్న సీఐడీ వాదనను సమర్థించింది. అరెస్ట్‌పై అభ్యంతరాన్ని లేవనెత్తుతూ బాబు లాయర్లు కేసును క్వాష్ చేయాలన్న వాదన అసమంజసంగా తేల్చేసింది సుప్రీంకోర్టు. ఇదీ చదవండి: రిమాండ్ సబబే.. క్వాష్ చేయలేం యావజ్జీవం తప్పదా? మొత్తమ్మీద ఈ కేసులో చంద్రబాబుకు ఎలాంటి ఊరట దక్కలేదు. పైగా.. ఇప్పుడయినా గవర్నర్ అనుమతి తీసుకోవచ్చన్న సుప్రీంకోర్టు సూచనపై న్యాయనిపుణులు ఏం చెబుతున్నారంటే.. ‘‘నేరం జరిగింది, దర్యాప్తును కూడా పక్కాగా చేయమని మాత్రమే సుప్రీంకోర్టు చెబుతున్న విషయం స్పష్టమవుతోంది. ఈ కేసులో సెక్షన్ 409 కొనసాగుతుంది, నేరం రుజువయితే యావజ్జీవ ఖైదు చంద్రబాబుకు తప్పదు. అలాగే ఈ కేసులో 120B కూడా కొనసాగుతుంది. అంటే ఈ కేసులో IPC మరియు PC act (అవినీతి నిరోధక చట్టం) రెండూ కొనసాగుతాయి. బయటపడేందుకు నానా రకాల యత్నాలు చేశారు: ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు నాయుడు సాంకేతిక కోణాలు వెతికినా లాభం లేకపోయిందని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటున్నారు. "సుప్రీంకోర్టులో ఇవాళ్టి పరిణామాలను స్వాగతిస్తున్నాం. చంద్రబాబు పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఎక్కడా అనుమతించలేదు. తనను అరెస్ట్ చేస్తారా? అంటూ ఊగిపోయారు. అసలు చంద్రబాబు మీద కేసేంటీ అని ఎల్లో మీడియా ఉదరగొట్టింది. రాజకీయ కక్ష అంటూ చంద్రబాబు చేసిన వాదనను సుప్రీంకోర్టు తీసిపుచ్చింది. నేరం బయటపడేసరికి గవర్నర్ అనుమతి అంటూ సాంకేతిక కోణాలు వెతికారు. కొన్ని అబద్దాలను ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్రచారం చేయించారు. ఇన్నాళ్లు చేసిన విష ప్రచారం తప్పని తేలిపోయింది, గోబెల్స్ ప్రచారానికి అడ్డుకట్ట పడింది" అని ఏఏజీ పొన్నవోలు అన్నారు. స్కిల్ స్కాంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చంద్రబాబు అరెస్టు, రిమాండ్ విషయంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు అవినీతి నిరోధక కేసుల్లో గవర్నర్ అనుమతి అవసరం అన్న జస్టిస్ అనిరుద్ధ బోస్ అయితే ఐపీసీ సెక్షన్ల నమోదు చేసిన అభియోగాలు కొనసాగుతాయని స్పష్టం చేసిన జస్టిస్ బోస్ గవర్నర్ అనుమతి తీసుకొని అవినీతి నిరోధక చట్టం కూడా అమలు చేయవచ్చన్న జస్టిస్ బోస్ జస్టిస్ అనిరుద్ధ బోస్ అభిప్రాయంతో విభేధించిన జస్టిస్ బేలా త్రివేది చంద్రబాబు కేసులో 17ఏ అవసరం లేదు, అది వర్తించదన్న జస్టిస్ బేలా త్రివేది స్కిల్ స్కాంలో చంద్రబాబును ఐపీసీ, పీసీ యాక్ట్ రెండింటి ప్రకారం విచారించాల్సిందే అన్న జస్టిస్ బేలా త్రివేది భిన్న అభిప్రాయాల నేపధ్యంలో కేవలం 17ఏ వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని తేల్చడానికి… సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు నివేదన చంద్రబాబు అరెస్టు, రిమాండ్ సమర్ధించిన ఇద్దరు న్యాయమూర్తులు… చంద్రబాబుకు ఊరట ఇవ్వడానికి నిరాకణ చంద్రబాబు అరెస్టు విషయంలో సీఐడీ తీసుకున్న నిర్ణయాలను సమర్ధించిన ఇద్దరు న్యాయమూర్తులు రిమాండ్ విషయంలో ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని పూర్తిగా సమర్ధించిన ఇద్దరు న్యాయమూర్తులు చంద్రబాబు అరెస్టు విషయంలో ఎలాంటి రాజకీయ కక్ష్య సాధింపు లేదని స్పష్టం చేసిన ఇద్దరు న్యాయమూర్తులు చంద్రబాబు అరెస్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదని ఇద్దరు న్యాయమూర్తుల స్పష్టీకరణ స్కిల్ స్కాం కేసులో సీఏం హోదాలో చంద్రబాబు అవినీతి, నమ్మక ద్రోహం పాల్పడినట్లు తీవ్రమైన అభియోగాలున్నాయన్న ఇద్దరు న్యాయమూర్తులు చంద్రబాబు అరెస్టు, రిమాండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం చట్ట ప్రకారమే ఉందన్న ఇద్దరు న్యాయమూర్తులు 17ఏ వర్తింపు విషయంలో ఒక న్యాయమూర్తి అనుకూలంగా మరో న్యాయమూర్తి వ్యతిరేకమైన అభిప్రాయం చంద్రబాబుపై ఉన్న అభియోగాలను కొట్టేసేందుకు నిరాకరించిన ఇద్దరు న్యాయమూర్తులు గవర్నర్ అనుమతి తీసుకుని పీసీ యాక్ట్‌లో సైతం విచారణ చేయవచ్చన్న జస్టిస్ అనిరుద్ధ బోస్ రాజకీయ కక్ష్య సాధింపు అని చంద్రబాబు చేసిన ఆరోపణలను కొట్టి పారేసిన ఇద్దరు న్యాయమూర్తులు ఎలాంటి ఆధారాలు లేవన్న చంద్రబాబు వాదనను తొసిపుచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు స్కిల్ స్కాంలో సెక్షన్ 409 ప్రకారం చంద్రబాబును విచారించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ సెక్షన్ 409 ప్రకారం నేరం రుజువైతే చంద్రబాబుకు జీవితఖైదు శిక్షపడే అవకాశం సెక్షన్ 409ను కొట్టేయాలని చంద్రబాబు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు సెక్షన్ 120బీ కొనసాగుతుందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు సెక్షన్ 10బీ ప్రకారం నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని చంద్రబాబుపై పెట్టిన అభియోగాలను కొట్టేయడానికి నిరాకరించిన ఇద్దరు న్యాయమూర్తులు చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేసేందుకు నిరాకరించిన ఇద్దరు న్యాయమూర్తులు చంద్రబాబును విచారించేందుకు పూర్తి ఆధారాలున్నాయని అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు స్కిల్ స్కాంలో చంద్రబాబును విచారించేందుకు ఏసీబీ కోర్టుకు విచారణ పరిధి ఉందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించడం సబబే అన్న ఇద్దరు న్యాయమూర్తులు -
స్కిల్ కేసులో సుప్రీంలో ఎదురుదెబ్బ.. జైలుకు చంద్రబాబు.. అప్పుడు జరిగింది ఇదే (ఫొటోలు)
-
CBN: రిమాండ్ సబబే.. కేసు కొట్టేయలేం
ఢిల్లీ, సాక్షి: స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరిచింది. ఈ క్రమంలో.. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బాబు క్వాష్ పిటిషన్‌ను బదిలీ చేసింది. అయితే ఇద్దరు న్యాయమూర్తులు కూడా రిమాండ్ కొట్టేయలేమని చెప్పడం చంద్రబాబుకు భారీ షాక్ లాంటిది. రిమాండ్ విధించే అధికారం ట్రయల్ కోర్టు అంటే విజయవాడలోని ACB కోర్టుకు పూర్తిగా ఉందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. తీర్పు ఎలా వెలువరించారంటే.. తీర్పులో 17-ఏ వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్ 17-ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధబోస్ తీర్పు ఇవ్వగా.. 17-ఏ వర్తించదని జస్టిస్ బేలా ఎం.త్రివేది తీర్పు ప్రకటించారు. ముందుగా జస్టిస్ బోస్ తీర్పు చదువుతూ.. "ఈ కేసులో 17ఏ వర్తిస్తుంది. చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్‌కు వర్తింపజేయరాదు. అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్‌ను కొట్టేయలేం. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదు." అని జస్టిస్ బోసు తీర్పు ఇచ్చారు. జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. ‘‘ఈ కేసులో చంద్రబాబుకు 17-ఏ వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17ఏను ముడిపెట్టలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్యసాధింపుకు గురి కావద్దని మాత్రమే’’ అని జస్టిస్ త్రివేది తీర్పు ఇచ్చారు. మొదటి తీర్పు : జస్టిస్ బోస్ ఏమన్నారంటే.. ఈ కేసులో 17ఏ వర్తిస్తుంది చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్‌కు వర్తింపజేయరాదు చంద్రబాబు కేసులో 13(1)(c), 13(1)(d), 13(2) వర్తించవు అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్‌ను కొట్టేయలేం కేవలం అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదు రిమాండ్ రిపోర్ట్‌ను కొట్టేయాలని గానీ, చెల్లుబాటు కాదని గానీ చెప్పలేం, రిమాండ్ చెల్లుతుంది, కొనసాగుతుంది రెండో తీర్పు : జస్టిస్ బేలా త్రివేది ఏమన్నారంటే.. అసలు ఈ కేసులో చంద్రబాబు పిటిషన్‌కు ఏ రకంగా 17ఏ వర్తించదు 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం పాత కేసులకు 17ఏ వర్తించదు, సవరణ వచ్చిన తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే సెక్షన్ వర్తిస్తుంది.. కానీ చంద్రబాబు కేసుకు వర్తించదు 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే అవినీతి నిరోధక చట్టం కింద నమోదయిన ఈ కేసును 17ఏకి ముడిపెట్టి ఊరట ఇవ్వలేం అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్యసాధింపుకు గురి కావద్దని మాత్రమే గవర్నర్ అనుమతి లేదనే కారణంతో FIRను క్వాష్ చేయడం కుదరదు ట్రయల్ కోర్టు (ACB కోర్టు, విజయవాడ) ఇచ్చిన రిమాండ్ పూర్తిగా సబబే దర్యాప్తు కొనసాగించవచ్చు, ఛార్జ్‌షీట్ దాఖలు చేయవచ్చు, న్యాయప్రక్రియ కంటిన్యూ అవుతుంది ఇలాంటి కేసుల్లో 17ఏను అంగీకరిస్తే.. మొత్తం న్యాయప్రక్రియ అపహస్యం అవుతుంది పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులకు ఇదే వర్తిస్తుందన్న వాదన మొదలవుతుంది అసలు 17ఏ వర్తించాలన్న వాదనే సరికాదు, దీని పర్యవసానాలు ఊహించనంత ఇబ్బందికర పరిస్థితులు తీసుకువస్తాయి దర్యాప్తు అధికారులకు పూర్తి అధికారాలున్నాయి, అవినీతి నిరోధక చట్టం కింద విచారణ కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు నిజాయితీపరుల రక్షణ కోసమే ఈ సవరణ తీసుకొచ్చామన్నది పార్లమెంట్ చర్చల సారాంశం ఇప్పటి వరకు సుప్రీం కోర్టులో ఎప్పుడెప్పుడు ఏం జరిగిందంటే..! సెప్టెంబర్ 22వ తేదీన ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత.. సెప్టెంబర్ 23వ తేదీన సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సెప్టెంబర్ 25వ తేదీన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందుకు బాబు క్వాష్ పిటిషన్ 26న సంబంధిత న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం విచారణలో ఉన్నందున మరుసటి రోజుకి వాయిదా జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్ల ధర్మాసనం ముందుకు సెప్టెంబర్ 27వ తేదీన బాబు క్వాష్ పిటిషన్ ధర్మాసనం నుంచి వైదొలగిన జస్టిస్ భట్ మరోసారి సీజేఐ చంద్రచూడ్ ముందుకు పిటిషన్ అక్టోబర్ 3న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు బాబు పిటిషన్ అక్టోబర్ 9,10,13వ తేదీల్లో వాడీవేడిగా సాగిన వాదనలు అక్టోబర్ 13వ స్కిల్ పిటిషన్‌కు తోడైన ఫైబర్ గ్రిడ్ కేసు పిటిషన్ స్కిల్, ఫైబర్ గ్రిడ్ పిటిషన్లను అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం బెంచ్ అక్టోబర్ 17వ తేదీన పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ నవంబర్ 9వ తేదీన ఫైబర్ గ్రిడ్ పిటిషన్‌పై విచారణ చేస్తామని చెబుతూ.. అంతకు ముందే స్కిల్ కేసు తీర్పు వెల్లడిస్తామన్న బెంచ్ దసరా, దీపావళి సెలవుల దృష్ట్యా విచారణ వాయిదా అక్టోబర్ 31వ తేదీన షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మీద బయటకు మొత్తం 52 రోజులపాటు జైల్లో చంద్రబాబు.. మధ్యలో సీఐడీ కస్టడీ విచారణ నవంబర్ 20వ తేదీన క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ అదే తేదీన పలు షరతులతో బాబుకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు ఇవాళ వెలువడ్డ రెండు తీర్పులు -
జడ్జిమెంట్ డే: స్కిల్ కేసులో ఏం జరగబోతోంది?
సాక్షి, ఢిల్లీ: ఏపీ రాజకీయ వర్గాలు స్కిల్ కేసులో నేటి సుప్రీం కోర్టు తీర్పు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తాను తప్పు చేయలేదని చెప్పలేకపోతున్న చంద్రబాబు.. తన అరెస్ట్ చెల్లదని, తనపై సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేయాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాడీవేడిగా వాదనలు జరిగిన ఈ క్వాష్ పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నాం తీర్పు వెలువడనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ కేసును కొట్టేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. అదే సమయంలో ఆయనపై ఫైబర్‌నెట్ కేసు నమోదు కాగా ఈ కేసులోనూ సుప్రీంను ఆశ్రయించారు ఆయన తరఫు లాయర్లు. అయితే.. స్కిల్ కేసు క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెల్లడించిన తర్వాతే.. ఫైబర్‌నెట్ కేసు పిటిషన్ విచారణ చేపడతామని బెంచ్ చంద్రబాబు లాయర్లకు స్పష్టం చేసింది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు కూడా పెండింగ్‌లో ఉంది. ఈ రెండు కేసుల విచారణ ఈ నెల 17, 19వ తేదీల్లో విచారణకు రానున్నాయి. దీంతో.. ఇవాళే 17-ఏ పిటిషన్‌పై తీర్పును సర్వోన్నత న్యాయస్థానం వెలువరించనుంది. వాడీవేడీ వాదనలు ఇవే.. స్కిల్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కోర్టుల్లో వరుసగా ఆయనకు ఎదురు దెబ్బలు తగులుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు తన క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో ఆ మరుసటిరోజు సెప్టెంబర్ 23వ తేదీన సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ఈ కేసులో తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ అభ్యర్థించారాయన. అక్కడ సుదీర్ఘమైన వాదనలే జరిగాయి. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ(అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం) వర్తిస్తుందని ఆయన తరఫు లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా, అభిషేక్ మను సింఘ్వీలు వాదించారు. ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇది రాజకీయ కక్ష చర్యగా వాదించారు. అయితే.. స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదని, పైగా నిజాయితీగల ప్రజాప్రతినిధులకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుందని.. చంద్రబాబుకి ఈ సెక్షన్ వర్తించదని ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ, రంజిత్‌కుమార్‌లు వాదించారు. ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య అని, కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదని సీఐడీ తరఫున వాదించారు . ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరఫు లాయర్ల విజ్ఞప్తులు.. వరుస సెలవుల నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తున్న తీర్పును ఇవాళ వెల్లడించనున్నారు. ఏపీ సీఐడీ అభియోగాలు.. అరెస్ట్.. రిలీజ్ టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట కుట్రపూరితంగా భారీ అవినీతికి పాల్పడినట్లు చంద్రబాబుపై అభియోగాలు నమోదు చేసింది నేర పరిశోధన విభాగం(CID). చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ ఘరానా మోసానికి పాల్పడ్డారని, షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనేది సీఐడీ అభియోగం. డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి రాగా, 2017-2018లో నకిలీ ఇన్వాయిస్లతో అవినీతి బాగోతం బయటపడింది. అయితే అప్పటికే జీఎస్టీ అధికారులు అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోలేదు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. మరోవైపు ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురిని అరెస్ట్ చేసింది కూడా. ఈ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది. చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు అయ్యాయి. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని అవినీతి నిరోధక న్యాయస్థానం(ఏసీబీ కోర్టు) కోర్టులో ప్రవేశపెట్టాగా.. జ్యూడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు పలుమార్లు పొడిగించుకుంటూ వెళ్లింది. చివరకు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకి కంటి సర్జరీ, చికిత్స లాంటి కారణాల విజ్ఞప్తి దృష్ట్యా.. మానవతా దృక్ఫథంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆపై.. హైకోర్టులోనే రెగ్యులర్ బెయిల్ మంజూరు అయ్యింది. -
టీడీపీ-జనసేన శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ రాజకీయాల్లో రోజుకో మలుపు చోటుచేసుకుంటోంది. ఇక పొత్తులో ఉన్న టీడీపీ జనసేన శ్రేణులు రేపటి కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై మంగళవారం జడ్జిమెంట్ రానుంది. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం మధ్యాహ్నాం తీర్పు వెల్లడించనుంది. స్కిల్ స్కామ్‌లో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నెల 16న(రేపు) తీర్పు వెలువరించనుంది. ఈ క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెల్లడించిన తర్వాతే.. ఫైబర్‌నెట్ కేసు పిటిషన్ విచారణ చేపడతామని బెంచ్ చంద్రబాబు లాయర్లకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు కూడా పెండింగ్‌లో ఉంది. ఈ రెండు కేసుల విచారణ ఈ నెల 17, 19వ తేదీల్లో విచారణకు రానుంది. దీంతో.. ఈలోపే 17-ఏ పిటిషన్‌పై తీర్పును సర్వోన్నత న్యాయస్థానం వెలువరించనుంది. అంత త్వరగా క్వాష్ కోరడమా? ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట కుట్రపూరితంగా భారీ అవినీతికి పాల్పడినట్లు చంద్రబాబుపై అభియోగాలు నమోదు చేసింది నేర పరిశోధన విభాగం(CID). ఈ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది. విజయవాడలోని అవినీతి నిరోధక న్యాయస్థానం(ఏసీబీ కోర్టు) కోర్టులో ప్రవేశపెట్టాగా.. జ్యూడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు పలుమార్లు పొడిగించుకుంటూ వెళ్లింది. చివరకు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకి కంటి సర్జరీ, చికిత్స లాంటి కారణాల విజ్ఞప్తి దృష్ట్యా.. మానవతా దృక్ఫథంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆపై.. హైకోర్టులోనే రెగ్యులర్ బెయిల్ మంజూరు అయ్యింది. అయితే.. ఈ మధ్యలో స్కిల్ కేసులో తనపై సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ, జస్టిస్ శ్రీనివాసరెడ్డి పిటిషన్ కొట్టేయడంతో బాబుకు ఉన్నతన్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆ వెంటనే చంద్రబాబు ఆలస్యం చేయకుండా వెంటనే సుప్రీం కోర్టులో తన లాయర్లతో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయించారు. తన అరెస్ట్ అక్రమమని, సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని క్వాష్ పిటిషన్ ద్వారా సుప్రీంను అభ్యర్థించారాయన. అక్కడ సుదీర్ఘమైన వాదనలే జరిగాయి. ఇదీ చదవండి: స్కిల్ స్కాం.. అంతా బాబుగారి కనికట్టు చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ(అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం) వర్తిస్తుందని ఆయన తరఫు లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా, అభిషేక్ మను సింఘ్వీలు వాదించారు. ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇది రాజకీయ కక్ష చర్యగా వాదించారు వాళ్లంతా. అయితే.. స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదని, పైగా నిజాయితీగల ప్రజాప్రతినిధులకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుందని.. చంద్రబాబుకి ఈ సెక్షన్ వర్తించదని ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ, రంజిత్‌కుమార్‌లు వాదించారు. ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య అని, కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదని సీఐడీ తరఫున వాదించారు . క్వాష్ పిటిషన్.. ఎప్పుడేం జరిగిందంటే.. సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు.. ఆపై ఐదుసార్లు రిమాండ్ పొడిగింపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహా బ్లాక్‌లో ఖైదీ నంబర్ 7691గా చంద్రబాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ సెప్టెంబర్ 13వ తేదీ విచారణకు స్వీకరించిన హైకోర్టు సెప్టెంబర్ 19వ తేదీన వాదనలు వినిపించిన బాబు లాయర్లు హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా.. సీఐడీ తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ సెప్టెంబర్ 22వ తేదీన.. స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన ఏపీ హైకోర్టు క్వాష్‌పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సెప్టెంబర్ 23వ తేదీన సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సెప్టెంబర్ 25వ తేదీన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందుకు బాబు క్వాష్ పిటిషన్.. మర్నాడు మెన్షన్ చేయాలన్న సీజేఐ 26న సంబంధిత న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం విచారణలో ఉన్నందున మరుసటి రోజుకి వాయిదా జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్ల ధర్మాసనం ముందుకు సెప్టెంబర్ 27వ తేదీన బాబు క్వాష్ పిటిషన్ ట్విస్ట్ ఇస్తూ.. ధర్మాసనం నుంచి వైదొలగిన జస్టిస్ భట్ మరోసారి సీజేఐ చంద్రచూడ్ ముందుకు అత్యవసరంగా తీసుకెళ్లిన బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా అక్టోబర్ 3వ తేదీకి చంద్రబాబు క్వాష్ పిటిషన్ వాయిదా అక్టోబర్ 3వ తేదీన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు బాబు పిటిషన్ అక్టోబర్ 9,10,13వ తేదీల్లో వాడీవేడిగా సాగిన వాదనలు అక్టోబర్ 13వ స్కిల్ పిటిషన్‌కు తోడైన ఫైబర్ గ్రిడ్ కేసు పిటిషన్ స్కిల్, ఫైబర్ గ్రిడ్ పిటిషన్లను అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం బెంచ్ అక్టోబర్ 17వ తేదీన పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం బెంచ్ నవంబర్ 9వ తేదీన ఫైబర్ గ్రిడ్ పిటిషన్‌పై విచారణ చేస్తామని చెబుతూ.. అంతకు ముందే స్కిల్ కేసు తీర్పు వెల్లడిస్తామని దసరా, దీపావళి సెలవుల దృష్ట్యా విచారణ వాయిదా అక్టోబర్ 31వ తేదీన షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మీద బయటకు మొత్తం 52 రోజులపాటు జైల్లో చంద్రబాబు.. మధ్యలో సీఐడీ కస్టడీ విచారణ నవంబర్ 20వ తేదీన క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం బెంచ్ అదే తేదీన పలు షరతులతో బాబుకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు శీతాకాల సెలవుల వల్ల వాయిదా పడుతూ వచ్చిన స్కిల్ కేసు తీర్పు ఎట్టకేలకు ఈనెల 16న వెలువడనున్న తీర్పు జరిగింది ఇదే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ ఘరానా మోసానికి పాల్పడ్డారని, షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి రాగా, 2017-2018లో నకిలీ ఇన్వాయిస్లతో అవినీతి బాగోతం బయటపడింది. అయితే అప్పటికే జీఎస్టీ అధికారులు అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోలేదు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. మరోవైపు ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురిని అరెస్ట్ చేసింది కూడా. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడి ఉన్నారు. చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు అయ్యాయి. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. -
స్కిల్ స్కాం కేసులో నేడు అత్యంత కీలకం?!
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ స్కిల్‌డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో నేడు అత్యంత కీలక పరిణామం చోటు చేసుకోనుందా?. ఈ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులోనే చంద్రబాబును ఏపీ నేర దర్యాప్తు విభాగం (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్-సీఐడీ) అరెస్ట్ చేసింది. సెప్టెంబర్ 09వ తేదీ నుంచి 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చివరకు.. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఏపీ హైకోర్టు ఈ కేసులో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఈ కేసులో తనపై సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని చంద్రబాబు తొలుత ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ ఆయనకు చుక్కెదురైంది. ఆ వెంటనే చంద్రబాబు ఆలస్యం చేయకుండా వెంటనే సుప్రీం కోర్టులో తన లాయర్లతో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయించారు. తన అరెస్ట్ అక్రమమని, సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని క్వాష్ పిటిషన్ ద్వారా సుప్రీంను అభ్యర్థించారాయన. అయితే అప్పటికే స్కిల్ కేసు కీలక దర్యాప్తు దశలో ఉండడంతో.. ఆ పిటిషన్‌ను సుప్రీం విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. చివరకు ఉత్కంఠకు తెర దించుతూ ఆ పిటిషన్‌ను విచారణకు చేపట్టింది ద్విసభ్య ధర్మాసనం. క్వాష్ పిటిషన్‌పై విచారణ సమయంలో.. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ(అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం) వర్తిస్తుందని ఆయన తరఫు లాయర్లు వాదించారు. ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇది రాజకీయ కక్ష చర్యగా వాదించారాయన. అయితే.. స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదని, పైగా నిజాయితీగల ప్రజాప్రతినిధులకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుందని.. చంద్రబాబుకి ఈ సెక్షన్ వర్తించదని ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య అని, కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదని రోహత్గీ వాదించారు. ఇదీ చదవండి: స్కిల్ స్కాం.. అంతా బాబుగారి కనికట్టు ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. నవంబర్ 20వ తేదీన క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు పేర్కొంది. అదే సమయంలో స్కిల్ కేసులో చంద్రబాబు వయసు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మధ్యంతర బెయిల్ కోరారు చంద్రబాబు లాయర్లు. మరోవైపు ఫైబర్‌నెట్ కేసులో ఇదే బెంచ్ ముందు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే.. స్కిల్ స్కాంలో క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెల్లడించిన తర్వాతే ఫైబర్‌నెట్ కేసు పిటిషన్ విచారణ చేపడతామని బెంచ్ చంద్రబాబు లాయర్లకు స్పష్టం చేసింది. ఫైబర్‌నెట్ పిటిషన్‌ను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసిన కోర్టు.. అదే రోజున స్కిల్ స్కాం పిటిషన్ తీర్పు వెల్లడిస్తామని చెప్పింది. ఈలోపు చంద్రబాబు లాయర్ల విజ్ఞప్తితో నవంబర్ 09కి ఫైబర్‌నెట్ కేసు విచారణ వాయిదా వేసిన ధర్మాసనం.. నవంబర్ 8వ తేదీన(రేపు) చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెల్లడిస్తామని ఇరుపక్షాలకు తెలిపింది. స్కిల్ స్కాంలో.. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ ఘరానా మోసానికి పాల్పడ్డారని, షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి రాగా, 2017-2018లో నకిలీ ఇన్వాయిస్లతో అవినీతి బాగోతం బయటపడింది. అయితే అప్పటికే జీఎస్టీ అధికారులు అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోలేదు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పింర్పించింది కూడా. మరోవైపు ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురిని అరెస్ట్ చేసింది కూడా. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడి పేరు నమోదు అయ్యింది. చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు అయ్యాయి. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెఓంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసింది.ఆపై ఏసీబీ కోర్టు ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించగా.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు ఉన్నారు. అయితే కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. -
చంద్రబాబుకి కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు
సాక్షి, ఢిల్లీ/విజయవాడ: అవినీతి కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఈ శుక్రవారమూ కలిసి రాలేదు. న్యాయస్థానాల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అటు సుప్రీంకోర్టులో.. ఇటు విజయవాడలోని ఏసీబీ కోర్టులోనూ శుక్రవారం ఆయనకు ఎలాంటి ఊరటా లభించలేదు. దీంతో టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి. ఫైబర్‌నెట్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు వేసిన పిటిషన్‌ను విచారణ అనంతరం సుప్రీం కోర్టు శుక్రవారం వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు. సిద్ధార్థ లూథ్రా వాదనలు పిటిషనర్‌పై మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి.. ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయ్యింది ఫైబర్‌నెట్ కేసులో అరెస్ట్ చేయవద్దని ఇప్పటికే కోర్టు చెప్పింది ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్ వాదనలు ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోంది.. ఈ అంశాన్ని కౌంటర్ అఫిడవిట్లో తెలిపాం వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం విచారణను నవంబర్ ఎనిమిదవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తీర్పు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని చంద్రబాబు తరఫు లాయర్లకు గుర్తు చేసిన ధర్మాసనం ఆ క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెలువడిన తర్వాతనే ఫైబర్‌నెట్ కేసును పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. క్వాష్ పిటిషన్‌పై తీర్పును నవంబర్ ఎనిమిదవ తేదీన వెల్లడిస్తామంది ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. అయితే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ ఎనిమిదవ తేదీకి కాకుండా.. తొమ్మిదవ తేదీకి వాయిదా వేయాలని చంద్రబాబు లాయర్ లూథ్రా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత ఇబ్బంది రీత్యా తదుపరి విచారణను ఒక్కరోజు ముందుకు జరపాలని కోరారు. ధర్మాసనం ఆ విజ్ఞప్తిని మన్నించి.. నవంబర్ తొమ్మిదివ తేదీనే విచారణ చేపడతామని తెలిపింది. అంతవరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని.. పీటీ వారెంట్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఇప్పటికే పక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. సెక్షన్17-ఏ మీదనే వాడివేడి వాదనలు జరిగాయి. వాదనలు ముగిసే సమయంలో చంద్రబాబు తరఫు లాయర్ హరీశ్ సాల్వే మధ్యంతర బెయిల్ కోసం విజ్ఞప్తి చేశారు. కానీ, కేసులో ప్రధాన వాదనలు విన్నామని.. ఈ సమయంలో మధ్యంతర బెయిల్ ప్రస్తావన ఉండబోదని.. నేరుగా తుది తీర్పే ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తీర్పు ఎలా ఉండబోతుందా? అనే ఉత్కంఠత సర్వత్రా ఏర్పడింది. ఇదీ చదవండి: అవినీతిపరులకు ‘17ఏ’ రక్షణ కవచం కాదు మరోవైపు ఫైబర్ నెట్ కేసు పిటిషన్‌ను వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం తాలూకూ ప్రభావం శుక్రవారం ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్ జరిగే విచారణపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ సీఐడీ చంద్రబాబును విచారించేందుకు పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. చంద్రబాబును కోర్టులో హాజరు పర్చాలని కూడా ఆదేశించింది. కానీ, సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండడంతో.. అది వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం జరగాల్సిన విచారణ సైతం వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబును కోర్టులో హాజరుపరచాల్సి వస్తే.. అరెస్ట్ చేస్తారేమోననే ఆందోళనలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. ఏసీబీ కోర్టులోనూ.. లీగల్ ములాఖత్‌ల సంఖ్య పెంచాలని చంద్రబాబు తరఫు లాయర్లు వేసిన పిటిషన్‌ను శుక్రవారం అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం కొట్టేసింది. ములాఖత్‌ల సంఖ్య పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని, ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని చంద్రబాబు లాయర్లు గురువారం కోరారు. చంద్రబాబు కేసుల విచారణ వివిధ కోర్టుల్లో ఉన్నందున ములాఖత్‌ల సంఖ్య మూడుకు పెంచాలని పిటిషన్లో అభ్యర్థించారు. అయితే.. అలా చేయడం సాధ్యం కాదని కోర్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ సీఐడీని ఆదేశించింది. తాజాగా శుక్రవారం ఈ పిటిషన్ ఏసీబీ కోర్టు ముందుకు రాగా.. కోర్టు కొట్టేసింది. ప్రతివాదుల్ని చేర్చకపోవడంతో ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని తిరస్కరిస్తూ.. సరైన లీగల్ ఫార్మట్‌లో దాఖలు చేయాలంటూ చంద్రబాబు తరపు లాయర్లకు సూచించింది. ►కాల్ డేటా రికార్డింగ్స్ పిటిషన్ కోరుతూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్‌ను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని కోర్టు ఆదేశించగా.. ఈ నెల 26వ తేదీ వరకు సమయం కావాలని కోరారు. ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని పిటిషన్‌ను వాయిదా వేసింది ఏసీబీ కోర్టు -
స్కిల్ స్కాం పిటిషన్ పై తీర్పు దసరా తర్వాతే..!
-
బాబుకు నో రిలీఫ్
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయి, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకి మధ్యంతర బెయిలు మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులోనూ మధ్యంతర బెయిలు ఇవ్వాలన్న చంద్రబాబు విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు విచారణ శుక్రవారం చేపడతామని పేర్కొంది. అప్పటి వరకూ చంద్రబాబును అరెస్టు చేయొద్దని చెప్పింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఇరుపక్షాల వాదనలు పీసీ చట్టం సెక్షన్ 17ఏ పైనే జరిగాయి. సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, రంజిత్‌కుమార్, నిరంజన్‌రెడ్డి వాదించగా, చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్దార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. తొలుత సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ సెక్షన్ 17ఏ ఈ కేసుకు వర్తించదని చెప్పారు. ఇది 2018 కన్నా ముందు జరిగిన నేరమని, ఆ సమయంలో ఉనికిలోనే లేని చట్టం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. 2018 జూన్‌లోనే విచారణ ప్రారంభించామని తెలిపారు. ఎఫ్ఐఆర్లో కాగ్నిజబుల్ నేరాలు ఉన్నాయా.. లేదా.. అనేది చూడాలని చెప్పారు. సెక్షన్ 17ఏ నిజాయితీపరులకే తప్ప అవినీతిపరులకు రక్షణ కవచం కాకూడదని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అవినీతి జరిగిందని స్పష్టంగా కనిపిస్తోందని, అటువంటప్పుడు సెక్షన్ 17ఏ అసలు వర్తించదని చెప్పారు. రూ. వందల కోట్ల కుంభకోణం దర్యాప్తును అడ్డుకోవడానికి ఈ సెక్షన్‌ను ఉపయోగించరాదని అన్నారు. 2015–16లో చట్టంలో లేనివి వర్తించవని చెప్పారు. సెక్షన్ 17ఏ భవిష్యత్తుకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. పీసీ చట్టానికి సంబంధం లేని అభియోగాలపై విచారించే పరిధి ప్రత్యేక కోర్టుకు ఉందని పలు కోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ గట్టిగా వాదనలు వినిపించారు. ఒక వ్యక్తి పీసీ చట్టం, ఐపీసీ సెక్షన్ల ప్రకారం నిందితుడు అయితే.. ఏదైనా కారణాలతో పీసీ చట్టం నేరాలను దాని నుంచి తొలగించినప్పటికీ, ప్రత్యేక న్యాయమూర్తి మిగిలిన ఐపీసీ కింద సెక్షన్లపై చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం విచారణ చేయొచ్చని తెలిపారు. ఈ కేసులో ప్రత్యేక కోర్టు నిందితుడి విడుదలకు నిరాకరించిందని తెలిపారు. ప్రస్తుత కేసులో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నామని, డిశ్చార్జి ఉందా లేదా అనేది పక్కనపెడితే.. పోలీసుల దర్యాప్తులో పీసీ లేదా పీసీయేతర అభియోగాల మధ్య తేడా లేనప్పుడు ఎఫ్ఐఆర్ను ఎలా క్వాష్ చేస్తారని ప్రశ్నించారు. ఇది రాజకీయ కక్ష కాదని, కేంద్ర దర్యాప్తు సంస్థల ఆరోపణలపైనా దర్యాప్తు జరిగిందని తెలిపారు. ఒకవేళ సెక్షన్ 482 విచక్షణ ప్రకారం రిలీఫ్ ఇవ్వాలంటే దానికి కొన్ని ప్రిన్సిపుల్స్ ఉన్నాయన్నారు. ఈ కేసుకు ఆ అర్హత కూడా లేదని కౌంటర్ అఫిడవిట్‌ను పరిశీలిస్తే అర్థం అవుతుందని తెలిపారు. సుప్రీంకోర్టే ప్రాథమిక విచారణ చేయాలనుకోవడం సరికాదన్నారు. ఈ సందర్భంగా తన వాదనలను సమర్థించే వేర్వేరు తీర్పులను ధర్మాసనం ముందుంచారు. 40 రోజులుగా జైల్లో ఉన్నారు బెయల్ ఇవ్వండి చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ.. రాజకీయ కక్ష సాధింపులు నిరోధించేందుకే 17ఏ ఉందని, ఇది చట్టం కల్పించిన రక్షణ అని చెప్పారు. రాష్ట్ర వాదన చూస్తుంటే.. సెక్షన్ 17ఏ అమాయకులైన వారికే వర్తిస్తుందన్నట్లుందని చెప్పారు. నిర్దోషులని నిర్ధారించడానికి నిర్దోషిత్వంపై ముందుగా విచారణ నిర్వహించాలంటూ ప్రొవిజన్ తలక్రిందులు చేస్తున్నారని ఆరోపించారు. జీఎస్టీ చెల్లింపులకు, ప్రభుత్వానికి ముడిపెడుతున్నారన్నారు. 2021లో విచారణ ప్రారంభించి ఆధారాల కోసం మళ్లీ వెదుకుతున్నారని ఆరోపించారు. ఈ కేసులో సెక్షన్ 17ఏ వర్తిస్తుందని చెప్పారు. 40 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారని, మద్యంతర బెయిలు ఇవ్వాలని సాల్వే అభ్యర్థించారు. సాల్వే వాదనలను లూథ్రా సమర్థించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణను 19కి వాయిదా వేసిన హైకోర్టు చంద్రబాబు న్యాయవాదుల అభ్యర్థన మేరకు హైకోర్టు ఉత్తర్వులు సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్లో తదుపరి విచారణను నెల 19వ తేదీకి వాయిదా పడింది. చంద్రబాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ ఏసీబీ కోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా, చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాయిదా వేయాలని కోరారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
స్కిల్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్‌కు నిరాకరణ
సాక్షి, ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సుప్రీం కోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేస్తూ.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే వాదనలు ముగిసే సమయంలో ఆయన తరపు లాయర్లు మధ్యంతర బెయిల్ కోసం అభ్యర్థించగా.. కోర్టు అందుకు నిరాకరించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట మంగళవారం వాడీవేడిగా వాదనలు సాగాయి. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. అయితే వాదనల సమయంలో ప్రత్యేక కోర్టుల విచారణ అధికారం గురించి రోహత్గీ ప్రస్తావించారు. అయితే వాదనలు ముగియడంతో శుక్రవారానికి పిటిషన్‌ను వాయిదా వేసింది ధర్మాసనం. శుక్రవారం ఇరుపక్షాల లాయర్లు లిఖిత పూర్వక వాదనలు అందజేయనున్నారు. అయితే ఈ నెల 23 నుంచి 28 దాకా కోర్టుకి దసరా సెలవులు ఉన్నాయి. దీంతో.. దసరా తర్వాతే చంద్రబాబు పిటిషన్‌పై తీర్పు వెల్లడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోహత్గీ సుదీర్ఘ వాదనలు ‘‘ఈ కేసులో 17ఏ సెక్షన్ వర్తించదు. పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు. 17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ సెక్షన్ అవినీతిపరులకు రక్షణ ఛత్రం కాకూడదు. ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఇబ్బందిపడకూడదనే ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ కేసులో ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే’’ అని రోహత్గీ వాదించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినప్పుడు ఐపీసీ సెక్షన్ ప్రకారం కూడా విచారించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉంటుంది. అవినీతి కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. అవినీతి నిరోధం కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి.. అందుకే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. న్యాయపరిధికి సంబంధించి వివాదం లేదు.. ప్రత్యేక కోర్టుకు సంపూర్ణ న్యాయపరిధి ఉంది. రూ.వందల కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నప్పుడు సెక్షన్ 422 సీఆర్పీసీ కింద క్వాష్ చేయలేం. ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్ష కూడా వేయవచ్చు’’ అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయపరిధి ఉంటుందన్నారు. ఈ కేసులో జీఎస్టీ, ఆదాయపన్ను దర్యాప్తులు ఉన్నాయన్నారు. జీఎస్టీ, ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయని తెలిపారు. ‘‘నేరం జరిగిందా లేదా? ఎఫ్ఐఆర్ నమోదైందా? లేదా? అంతవరకే పరిమితం కావాలి. అవినీతి నిరోధక, సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు. ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ను ఎలా క్వాష్ చేస్తారు.మీరు అవినీతి ఆరోపణలు వర్తించవంటున్నారు.. మరి ఐపీసీ కింద పెట్టిన కేసులు ఎక్కడికి పోతాయి’’ అని రోహత్గీ వాదించారు. ‘‘మీరు కేసు పెట్టే నాటికి చట్టం అమల్లోకి వచ్చింది.. చట్టం అమల్లోకి వచ్చాక కేసు నమోదైంది. ఈ పరిస్థితుల్లో పాత నేరమంటూ కొత్తగా కేసులు పెట్టడానికి అవకాశం ఎలా ఉటుంది?’’ జస్టిస్ బోస్ ప్రశ్నించారు. ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు.. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని రోహత్గీ కోరారు. వర్చువల్‌గా హరీష్ సాల్వే వాదనలు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వర్చువల్‌గా వాదనలు వినిపించారు. చట్టసవరణను ముందు నుంచి వర్తింపజేసే అంశంపై పలు తీర్పులను ఉటంకిస్తూ వాదనలు వినిపించారు. ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుంది. రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకు 17ఏ ఉంది. సెక్షన్ 17ఏ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుంది. ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదు. రిమాండ్ రిపోర్టు, కౌంటరు అఫిడవిట్లు మొత్తం ఆరోపణలతో నిండి ఉన్నాయి. విపక్ష నేతలను విచారించడం తమ హక్కుగా ప్రభుత్వం భావిస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా 17ఏ వర్తిస్తుంది అని వాదించారు. మధ్యంతర బెయిల్‌కు నిరాకరణ 73 ఏళ్ల వయస్సు ఉన్న చంద్రబాబు 40 రోజులుగా జైలులో ఉన్నారు. కోర్టు సెలవుల దృష్ట్యా దయ చేసి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలించండి. కోర్టుకు అవసరమైతే లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తాం అని సాల్వే కోరారు. ఈ క్రమంలో మరో లాయర్ సిద్ధార్థ లూథ్రా సైతం న్యాయమూర్తులకు అదే విజ్ఞప్తి చేశారు. అయితే మధ్యంతర బెయిల్ ప్రస్తావన లేదన్న జస్టిస్ అనిరుద్ధ బోస్.. ప్రధాన కేసులో వాదనలు విన్నామని, తీర్పు వెలువరిస్తామని స్పష్టం చేశారు. -
Oct 17th 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Updates.. 08:45PM, అక్టోబర్ 17, 2023 చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల ►నేటి చంద్రబాబు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసిన రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ►స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై.. 38 రోజులుగా రిమాండ్ ఖైదీ 7691 నెంబర్‌తో ఉన్న చంద్రబాబు ►జైల్లో స్నేహా బ్యారక్‌లో ప్రత్యేక గదిలో చంద్రబాబు ►ప్రతిరోజూ మూడుసార్లు వైద్య పరీక్షలు ►కోర్టు ఆదేశాల మేరకే ఇంటి భోజనానికి అనుమతి ►నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం ►బాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణుల అనవసర రాద్ధాంతం ►బరువు తగ్గారని కుటుంబ సభ్యుల తప్పుడు ప్రచారం ►ప్రతిరోజు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్న జైలు అధికారులు ►స్కిల్ ఎలర్జీ.. ఆపై కోర్టు ఆదేశాలతో బాబు కోసం టవర్ ఏసీ ఏర్పాటు ► ఇవాళ్టి హెల్త్ బులిటెన్లోనూ పూర్తి వివరాలు వెల్లడి 08:23PM, అక్టోబర్ 17, 2023 ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో మెమో దాఖలు ►ఫైబర్‌నెట్ కేసులో పీటీ వారెంట్‌పై రేపు చంద్రబాబును ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టాల్సి ఉంది ►అయితే.. సుప్రీం కోర్టు ఫైబర్ నెట్‌పై దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా వేసింది ►విచారణ జరిగే శుక్రవారం దాకా అరెస్ట్ చేయొద్దని సీఐడీ తరపు న్యాయవాది రోహత్గీకి ఇవాళ సూచించింది ►అదే అంశాన్ని మెమో ద్వారా ఏసీబీ కోర్టుకు తెలిపిన సీఐడీ ►మళ్లీ ఎపుడు హాజరుపర్చాల్సిందీ ఏసీబీ కోర్టు రేపు నిర్ణయించే అవకాశం 07:55PM, అక్టోబర్ 17, 2023 టీడీపీ శ్రేణుల్లో కొత్త గుబులు ►చంద్రబాబు అరెస్ట్‌పై.. టీడీపీ శ్రేణుల్లో కొత్త టెన్షన్ ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ ►స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ కుదరదన్న ధర్మాసనం.. నేరుగా తీర్పు ఇస్తామని వెల్లడి ►శుక్రవారానికి విచారణ వాయిదా ►కానీ, శుక్రవారం లిఖిత పూర్వక వాదనలు సమర్పించనున్న ఇరుపక్షాల న్యాయమూర్తుల ►ఈ నెల 23 నుంచి 28 దాకా దసరా సెలవులు ►తీర్పు ఆలస్యం అవుతుందేమోనన్న ఆందోళనలో టీడీపీ శ్రేణులు 07:30PM, అక్టోబర్ 17, 2023 ఆ ఐడియా లోకేష్దేనట! ►హక్కుల కోసం పోరాడే పేదలను అణిచివేయాలని చూసినప్పుడు ‘స్వేచ్ఛకు బేడీలు’ వేస్తారా? అని, పౌర సంఘాలు నిరసన తెలపడం చూశాం. ►చంద్రబాబు గారు అనే అవినీతి తిమింగలాన్ని సాక్ష్యాధారాలతో అరెస్టు చేస్తే చేతులకు తాళ్లు, గొలుసులతో ప్రదర్శన చేసి పచ్చ పార్టీ పరువు తీసుకుంది. ►ఈ ఫోటో షూట్ ఐడియా లోకేశ్ దేనని టీడీపీ వర్గాల బోగట్టా! ట్విటర్లో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హక్కుల కోసం పోరాడే పేదలను అణిచివేయాలని చూసినప్పుడు ‘స్వేచ్ఛకు బేడీలు’ వేస్తారా అని, పౌర సంఘాలు నిరసన తెలపడం చూశాం. చంద్రబాబు గారు అనే అవినీతి తిమింగలాన్ని సాక్ష్యాధారాలతో అరెస్టు చేస్తే చేతులకు తాళ్లు, గొలుసులతో ప్రదర్శన చేసి పచ్చ పార్టీ పరువు తీసుకుంది. ఈ ఫోటో షూట్ ఐడియా లోకేశ్… — Vijayasai Reddy V (@VSReddy_MP) October 17, 2023 06:45PM, అక్టోబర్ 17, 2023 ములాఖత్ తగ్గిస్తే చంద్రబాబుకే మంచిది ►చంద్రబాబు పై ఆయన పార్టీ నాయకులే కుట్ర చేస్తున్నట్లు అనుమానం ►అచ్చెన్నాయుడు,యనమల రామకృష్ణుడు కుట్ర పన్నుతున్నారు ►చంద్రబాబు ఇంకా కుర్రాడినే అనే విధంగా గతంలో జరిగిన మీటింగ్ లో చెప్పాడు ►కానీ, ముసలోడు, అనేక జబ్బులు ఉన్నాయి.. ఎందుకూ పనికిరాడంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు ►కొంతమంది రెండు పూట్ల హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని చెప్పడం దారుణం ►రోగి యొక్క వివరాలు చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు ►అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడుతో కలిసి చంద్రబాబు పై లోకేష్ కుట్ర పన్నుతున్నారు ►చంద్రబాబు పై కుట్ర పన్నేది కేవలం లోకేష్,ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలే ►చంద్రబాబు రాజకీయాలకు పనికిరాడని ఆయన కుటుంబ సభ్యులే చెబుతున్నారు ►చంద్రబాబు రాజకీయాలకు పనికిరాకపోతే రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్నాయుడు గద్దె ఎక్కాలనుకుంటున్నారు ►చంద్రబాబుకి జైల్లో ఉన్నాను అనే బాధ కంటే.. రాజకీయాలకు పనికిరాడనే ప్రచారం ఎక్కువ బాధిస్తోంది ►టీడీపీని నాశనం చేయడానికి ఒక్క లోకేష్ చాలు ►కేసు కొట్టేయాలని చంద్రబాబు లాయర్ లు కోరడం విడ్డురంగా ఉంది ►చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసాడు కాబట్టి ప్రజా ధనం లూటీ చేసే హాక్కు ఉంటుందా? ►జైల్లో చంద్రబాబుకి ములాఖత్ తగ్గించడం అనేది సాధారణం ►ములాఖత్ తగ్గిస్తే చంద్రబాబుకే మంచిదేమో! :::మంత్రి సీదిరి అప్పలరాజు 06:37PM, అక్టోబర్ 17, 2023 ఇంకెన్నాళ్లు సాగదీస్తాం? ►జనసేన కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ పవన్ కల్యాణ్ భేటీ ►రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితులు, ఐదో దశ వారాహి యాత్రపై చర్చ ►జనసేన- టీడీపీ సమన్వయ కమిటీ ఉమ్మడి భేటీ నిర్వహణపై చర్చ ►ఎన్ని స్థానాలకు జనసేన పోటీ చేయాలి? ►ఈసారి పవన్ కళ్యాణ్ కు అత్యంత సురక్షితమైన నియోజకవర్గం ఏది? ►ఒక చోట పోటీ చేయాలా? లేకుంటే రెండు చోట్ల నిలబడాలా ? ►వైజాగ్ విడిచి పెట్టి పవన్ అనంతపురం వెళ్తే ఎలా ఉంటుంది? ►ఇంకెన్నాళ్లు నియోజకవర్గ విషయంలో స్పష్టత ఇవ్వకుండా సాగదీస్తాం? ►అసలు టీడీపీ ఎన్ని నియోజకవర్గాలకు ఒప్పుకుంటుంది? ►ఎన్ని చోట్ల మనకు అభ్యర్థులు ఉన్నారు? ►దీర్ఘంగా చర్చలు జరిపిన పవన్-నాదెండ్ల మనోహర్ 05:44PM, అక్టోబర్ 17, 2023 పిటిషన్లు వేయడం బాగా అలవాటైంది ►చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రిమాండ్ ఖైదీ ►జైలు నిబంధనల ప్రకారం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ►ఏది కావాలన్నా కోర్టుల్లో పిటిషన్ వేయటం టీడీపీకి అలవాటైపోయింది ►దేశంలో అత్యంత ఖరీదైన లాయర్లు ఒక రిమాండ్ ఖైదీ కోసం పని చేస్తున్నారంటే అది ఒక చంద్రబాబు విషయంలోనే కావచ్చు... ►చంద్రబాబు తప్పు చేశాడన్న ఆధారాలు ఉండబట్టే జైల్లో ఉన్నాడు ►బాబు కోసం తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్ని ఆందోళనలు చేసిన ప్రజాస్పందన కనిపించడం లేదు :::తూర్పుగోదావరిలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ 04:37PM, అక్టోబర్ 17, 2023 బాబు హెల్త్‌బులిటెన్ పిటిషన్‌పై రేపు విచారణ ►చంద్రబాబు హెల్త్ బులెటెన్ విషయంలో పిటిషన్ ►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తరపు లాయర్ల పిటిషన్ ►విజయవాడ ఏసీబీ కోర్టులో బాబు లాయర్ల పిటిషన్ ►కౌంటర్ వేయాలని సీఐడీని ఆదేశించిన కోర్టు ►సాయంత్రం దాఖలు చేసిన సీఐడీ తరపు న్యాయవాదులు ►రేపు విచారణ జరిగే అవకాశం 04:11PM, అక్టోబర్ 17, 2023 క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ ►చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా ►తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసిన కోర్టు ►క్వాష్ పిటిషన్‌పై ఇరువైపులా నుంచి ముగిసిన వాదనలు ►తీర్పు రిజర్వ్ చేసిన ద్విసభ్య ధర్మాసనం ►అదే రోజు ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►క్వాష్ పిటిషన్ విచారణలో ఇవాళ.. 17ఏ వర్తించదని వాదనలు వినిపించిన సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ ► వర్తిస్తుందని వాదించిన చంద్రబాబు తరపు లాయర్ హరీష్ సాల్వే ►మధ్యంతర బెయిల్ ప్రస్తావన లేదన్న సుప్రీంకోర్టు ►వాదనలు ముగియడంతో.. FIR క్వాష్ చేయాలా? వద్దా? అనేదానిపైనే నేరుగా తదుపరి విచారణలో ఆదేశాలివ్వనున్న బెంచ్ 04:00PM, అక్టోబర్ 17, 2023 మధ్యంతర బెయిల్ కుదరదు: సుప్రీం కోర్టు ►చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరిన లాయర్ హరీష్ సాల్వే ►సెక్షన్ 17a వర్తిస్తే అన్ని అభియోగాలు తొలగినట్టే! ►లేదంటే మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా ►చంద్రబాబు 40రోజులు జైల్లో ఉన్నారు ►73 ఏళ్ల వయసున్న వ్యక్తి కాబట్టి బెయిల్ ఇవ్వండి ►మరో లాయర్ సిద్ధార్థ లూథ్రా సైతం ఇదే అభ్యర్థన ►ససేమీరా అనేసిన జస్టిస్ అనిరుద్ధబోస్ ►వాదనలన్నీ విన్నాం.. తీర్పు వెల్లడిస్తామని స్పష్టీకరణ 03:55PM, అక్టోబర్ 17, 2023 హరీష్ సాల్వే వాదనలు ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఇవాళ ముగిసిన వాదనలు ►సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ తర్వాత కౌంటర్ వాదనలు వినిపించిన హరీష్ సాల్వే ►17A రెట్రో యాక్టిివ్ గా వర్తిస్తుంది ►17A కింద బాబుకి రక్షణ కల్పించాలి ►17A కింద ఖచ్చితంగా అనుమతి తప్పనిసరి ►ఎన్నికలు వస్తున్నాయని, ఫిక్స్ చేస్తున్నారు ►రాజకీయ ప్రత్యర్థులైనందు వల్లే తప్పుడు కేసులు ►17ఏ గనుక లేకుంటే పబ్లిక్ సర్వెంట్స్ అందరూ పోతారు ►అయితే, ఎవరూ కూడా దీనిని ఛాలెంజ్ చేయలేదు కదా ? అని ప్రశ్నించిన జస్టిస్ బేలా త్రివేది ►17ఏ రెట్రాస్పెక్తివ్ గా ఉండదని ప్రభుత్వం అంటోంది కదా ? : జస్టిస్ అనిరుధ్ బోస్ ►అన్ని అంశాలు లిఖిత పూర్వకంగా ఇస్తాం 03:49PM, అక్టోబర్ 17, 2023 చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుంది: సాల్వే ►17ఏ కింద చంద్రబాబుపై కేసు నమోదులో గవర్నర్ అనుమతి తప్పనిసరి ►17ఏ వర్తిస్తుందంటూ పలు జడ్జిమెంట్లను వివరిస్తున్న సాల్వే 03:40PM, అక్టోబర్ 17, 2023 వాదనలు వినిపిస్తున్న బాబు లాయర్ హరీష్ సాల్వే ►ఈ కేసులో 17ఏ వర్తించదన్న సీఐడీ తరపు న్యాయవాది రోహత్గీ వాదనలకు.. కౌంటర్ వాదనలు వినిపిస్తున్న సాల్వే ►17ఏ అనేది పాత కేసులకు కూడా వర్తిస్తుంది: హరీష్ సాల్వే ►రోహత్గి తన వాదనలో 17ఏ పాత కేసులకు వర్తించదని.. కోర్టు తీర్పును ప్రస్తావించారు: జస్టిస్ అనిరుద్ధబోస్ ►రోహత్గి చెప్పిన కోర్టు తీర్పు మీరు(సాల్వేను ఉద్దేశించి..) వాదిస్తున్న దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది: జస్టిస్ అనిరుద్ధబోస్ 03:30PM, అక్టోబర్ 17, 2023 క్వాష్ పిటిషన్‌పై కౌంటర్ ఆర్గ్యూమెంట్స్ ►క్వాష్ పిటిషన్‌పై రోహత్గీ వాదనలకు కౌంటర్ వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే ►వర్చువల్‌గా వాదిస్తున్న హరీష్ సాల్వే ►హక్కులు పౌరులకు సంబంధించినవి: సాల్వే ►కొత్త చట్టాలు వస్తే అవి హక్కుగా పౌరులకు వర్తిస్తాయి: సాల్వే ►ప్రతీ ప్రజాప్రతినిధికి హక్కుగా 17ఏ చట్టం వర్తిస్తుంది: సాల్వే 03:20PM, అక్టోబర్ 17, 2023 రోహత్గీ వాదనలు కొనసాగిస్తూ.. ►ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్షకూడా వేయవచ్చు. ►ఆరోపణలపైనే అన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతామా? ►అవినీతి కేసుల కిందకు వస్తుందంటే పరిగణించండి ఇప్పుడు మనం మాట్లాడుతుంది..17 ఏ వర్తిస్తుందా..లేదా అనేదే కదా? కేసులు నమోదు, ఛార్జిషీట్, విచారణ అన్ని కేసుల్లోనూ జరిగేదే: జస్టిస్ అనిరుద్దబోస్ ►అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుంది. ►ఈ కేసులో జీఎస్టీ, ఆదాయపన్ను దర్యాప్తులు ఉన్నాయి ►జీఎస్టీ,ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయి ►నేరం జరిగిందా లేదా..ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా.. అంతవరకే పరిమితం కావాలి ►అవినీతి నిరోధక,సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు ►ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారు? ►మీరు అవినీతి ఆరోపణలు వర్తించవంటున్నారు.. మరి ఐపీసీ కింద పెట్టిన కేసులు ఎక్కడికి పోతాయి జస్టిస్ అనిరుద్ధబోస్ : మీరు కేసు పెట్టేనాటికి చట్టం అమలులోకి వచ్చింది, చట్టం అమలులోకి వచ్చాక కేసు నమోదైంది ►ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. 17ఏ అనేది హైబ్రిడ్ సెక్షన్..అవినీతిపరులకు ఇది రక్షణ కాకూడదన్నదే నేను చెప్పేది: రోహత్గీ ఈలోపు చంద్రబాబు తరపు లాయర్ హరిష్ సాల్వే జోక్యం చేసుకుంటూ.. ఇప్పటికే గంటసేపు నుంచి రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు... ఇంకా ఎంతసేపు వాదనలు వినిపిస్తారు. రోహత్గీ తన వాదనలు కొనసాగిస్తూ.. ►రాఫేల్ కేసులో వేసిన రివ్యూ పిటిషన్‌ను బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులు డిస్మిస్ చేశారు ►కాని మరో జడ్జ్ తీర్పును అంగీకరిస్తూనే 17ఏ కీలక వ్యాఖ్యలు చేశారు ►రాఫెల్ కేసులో 17ఏపై జస్టిస్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి ►కోర్టు విచారణకు ఆదేశించిన కేసుల్లో 17ఏ అనేది వర్తించదు. 03:05PM, అక్టోబర్ 17, 2023 ఫైబర్‌నెట్ కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా ►ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ శుక్రవారానికి(అక్టోబర్ 20) వాయిదా ►స్కిల్ స్కామ్ క్వాష్తో పాటు ఫైబర్‌నెట్ కేసులో సుప్రీం కోర్టులో విడిగా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన బాబు తరపు లాయర్లు ► విచారణ శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీం కోర్టు ► ఒకవైపు స్కిల్ స్కామ్ కేసులో 17ఏపై వాదనలు కొనసాగుతుండడంతో వాయిదా వేసిన కోర్టు ►శుక్రవారం వరకు ఫైబర్‌నెట్ కేసులో బాబును అరెస్ట్ చేయొద్దని రోహత్గికి సూచించిన సుప్రీం కోర్టు 02:59PM, అక్టోబర్ 17, 2023 ఇది చాలా తీవ్రమైన ఆర్థిక నేరం: సీనియర్ లాయర్ రోహత్గీ ►ఈ కేసులో 17ఏ వర్తించినా.. మిగిలిన ఐపీసీ సెక్షన్లపై విచారించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉంది ►ఎఫ్ఐఆర్లో కాగ్నిజబుల్ అఫెన్సెస్‌కు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయా? లేదా? అనేది ముఖ్యం ►ఈ విషయాన్ని మాత్రమే కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి ►ఈ కేసులో ఎఫ్ఐఆర్ కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు ►స్కిల్ స్కామ్ కేసులో వందల కోట్ల అవినీతి జరిగింది ►పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికారు ►ఇప్పటికే ఈ కేసులో ఈడీ, ఇన్‌కమ్‌ట్యాక్స్ సంస్థలు విచారణ చేస్తున్నాయి ►ఇన్ని విచారణ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నప్పుడు ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుంది? ►ఈ కేసులో ఫొరెన్సిక్ నివేదిక చూస్తే షాక్‌కు గురవుతారు ►రూ. 371కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము ను లూటీ చేశారు ►అధికారులు వద్దని వారించినా.. ఇచ్చేయండి ఇచ్చేయండంటూ ఆదేశాలు జారీచేశారు ►మొత్తంగా ఈ కేసు 482సెక్షన్ కింద క్వాష్ చేయాలా? వద్దా? అనే నిర్ణయాధికారం తీసుకునే కేసు ►ఇది ఏదో ఇద్దరు గల్లా పట్టుకుని కొట్టుకున్న కేసు కాదు ►ఇది చాలా తీవ్రమైన ఆర్ధికనేరానికి సంబంధించి కేసు ►నేరం జరిగిందనే ప్రాథమిక ఆధారాలు ఉన్న కేసుల్లో... సెక్షన్ 482 కింద క్వాష్ చేయకూడదని ఎంఆర్ షా తీర్పు ఉంది ఈ కేసులో అసలు విచారణ చేయాలా? వద్దా? అనేది 17ఏపై ఆధారపడి ఉంది కదా!: కోర్టు రోహత్గీ వాదనలు కొనసాగిస్తూ.. ►సెక్షన్ 482కింద క్వాష్ అనేది చాలా అరుదైన కేసుల్లో మాత్రమే వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి ►17ఏ అనేది ఈ కేసులో వర్తించదు ► 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది ►2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది ►2018 జులై కంటే ముందు నేరం జరిగింది కాబట్టి 17ఏ అనేది ఈ కేసులో వర్తించదు ►2015-16లో లేని చట్టం అనేది అప్పుడు జరిగిన నేరానికి ఎలా వర్తిస్తుంది? ►స్కిల్ స్కామ్ కేసులో మరింత దర్యాప్తు అవసరం ►ఒక వ్యక్తి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదయింది:రోహత్గీ ►ఒక వేళ కోర్టు ఆ సెక్షన్లు తొలగించాలనుకుంటే.. మిగతా సెక్షన్ల కింద కేసు కొనసాగుతుంది:రోహత్గీ ►గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఇది: రోహత్గీ 👇 ►రోహత్గీ : శాసనవ్యవస్థ ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేసు ఇది. అందుకే సెక్షన్ 44 PMLA పెట్టారు ►జస్టిస్ బోస్ : ACB కోర్టుకున్న పరిధి ఏంటీ? ►జస్టిస్ త్రివేదీ : కేవలం IPC కేసులే కదా.? ►రోహత్గీ : ACB కోర్టుకు (ప్రత్యేక కోర్టు)కు కచ్చితమైన పరిధి ఉంది. ఎప్పుడయితే వేర్వేరు సెక్షన్ల కింద నమోదయిన నేరాలన్నీ ఒక అంశంలో నమోదయి ఉంటే.. ప్రత్యేక కోర్టుకు అధికారం ఉంటుంది. ►జస్టిస్ త్రివేదీ : ఒక వేళ అవినీతి నిరోధక చట్టం ఉపసంహరిస్తే ఏమవుతుంది? ►రోహత్గీ : పదేళ్ల తర్వాత మీరు వెనక్కి వెళ్లలేరు 02:38PM, అక్టోబర్ 17, 2023 స్పెషల్ కోర్టుకు ఆ అధికారం ఉంది ►వాదనలు వింటున్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేది ►ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే: ముకుల్ రోహత్గీ ►విచారణ అనేది ఛార్జెస్ ఫ్రేమింగ్ తర్వాతనే ప్రారంభం అవుతుంది కదా?: కోర్టు ►ముందుగా పీసీ యాక్ట్ పెట్టిన తర్వాత మళ్లీ దానిని తీసేస్తే స్పెషల్ జడ్జికి విచారణాధికారం ఉండదు కదా?: కోర్టు ►పీసీ యాక్ట్ వర్తించకపోయినా.. మిగిలిన సెక్షన్లపై విచారించొచ్చు: రోహత్గీ ►ఈ కేసులో మరింత మంది ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు: రోహత్గీ ►చంద్రబాబు కూడా ప్రభుత్వ ప్రతినిధే కదా?: కోర్టు ►పీసీ యాక్ట్ లేకపోయినా.. విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది: రోహత్గి ►సగం సెక్షన్లకు ఒక కోర్టులో విచారణ, మరో సగం సెక్షన్లకు మరో కోర్టులో విచారణ అనడం లా కాదు ►ఇలా భావిస్తే.. వ్యవస్థ అపహస్యం అవుతుంది ►ఇది తీవ్రమైన నేరం...విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది ►పీసీ యాక్ట్ ప్రకారం స్పెషల్ కోర్టుకు ఉన్న విచారణ పరిధి ఏంటి?: జస్టిస్ అనిరుధ్ బోస్ ప్రశ్న ►జిల్లా జడ్జికి ఉండే అధికారాలూ స్పెషల్ జడ్జికి కూడా ఉంటాయి: రోహత్గి 02:30PM, అక్టోబర్ 17, 2023 ►వర్చువల్‌గా వాదనలు వింటున్న చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే ►కాసేపు ఆగి వస్తానంటూ బయటకు వెళ్లిపోయిన బాబు మరో లాయర్ సిద్ధార్థ లూథ్రా 02:26PM, అక్టోబర్ 17, 2023 క్వాష్ వేయడం అత్యంత తొందరపాటు చర్య ►17ఏ సెక్షన్ అనేది నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకే వర్తిస్తుంది: రోహత్గి ►17ఏ సెక్షన్ చంద్రబాబుకి వర్తించదు ►ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి ►పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు ►స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదు:రోహత్గి ►17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది ►అవినీతి పరులకు ఈ సెక్షన్ రక్షణ కవచం కాకూడదు:రోహత్గి ►అవినీతి నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడానికే ఈ సెక్షన్ తెచ్చారు:రోహత్గి ►నిజాయితీ గల ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకునే సమయంలో భయం లేకుండా ఉండేందుకు 17-ఏ తెచ్చారు:రోహత్గి ►ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే 17-ఏ కాపాడుతుందనేది చట్టం ఉద్దేశం:రోహత్గి ►అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య:రోహత్గి ►విచారణ చేస్తున్న అధికారులకు కనీసం సమయం ఇవ్వకపోవడం కూడా సరికాదు:రోహత్గి ►సెక్షన్ 482 ప్రకారం క్వాష్ చేడయం అనేది.. అత్యంత అరుదైన కేసుల్లోనే తీసుకునే నిర్ణయం:రోహత్గి ►కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదు:రోహత్గి ►గతంలో కొన్ని కేసుల్లో పీసీయాక్ట్ కొట్టేసినా సెక్షన్ 4 ప్రకారం.. ఐపీసీ సెక్షన్లపై స్పెషల్ ట్రయల్ కోర్టు విచారణ కొనసాగించవచ్చు:రోహత్గి 02:08PM, అక్టోబర్ 17, 2023 సుప్రీంలో బాబు పిటిషన్‌పై విచారణ ప్రారంభం ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం ►వాదనలు వినిపిస్తోన్న సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి ►సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న రోహత్గి ►సెక్షన్ 17 ఏ చుట్టూరానే కొనసాగుతున్న వాదనలు ►ఇవాళ క్వాష్ పిటిషన్‌పై వాదనలు ముగిసే అవకాశం? 01:38PM, అక్టోబర్ 17, 2023 టీడీపీపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ ►తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లలో పోటీ చేయదట ►క్యాండిడేట్లు దొరకడంలేదని అనుకోవాలా? ►87 సీట్లలో మాత్రమే అభ్యర్థులను నిలబెడతామని అక్కడి పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు ►తెలంగాణ ప్రాంతానికి కూడా చంద్రబాబు గారు తొమ్మిదేళ్లు సిఎంగా ఉన్నారు ►ఏపీలో పచ్చ పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది అంటూ ట్వీట్ తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లలో పోటీ చేయదట. క్యాండిడేట్లు దొరకడంలేదని అనుకోవాలా? 87 సీట్లలో మాత్రమే అభ్యర్థులను నిలబెడతామని అక్కడి పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. తెలంగాణ ప్రాంతానికి కూడా చంద్రబాబు గారు తొమ్మిదేళ్లు సిఎంగా ఉన్నారు. ఏపీలో పచ్చ పార్టీ పరిస్థితి… — Vijayasai Reddy V (@VSReddy_MP) October 17, 2023 12:50PM, అక్టోబర్ 17, 2023 చంద్రబాబు హెల్త్ బులిటెన్‌పై పిటిషన్ ►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తరపు లాయర్ల పిటిషన్ ►విచారణ చేపట్టిన విజయవాడ ఏసీబీ కోర్టు ►పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు ఆదేశం. 12:32PM, అక్టోబర్ 17, 2023 ►స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ►విచారణను ఎల్లుండికి వాయిదా వేసిన కోర్టు ►స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పై విచారణ వాయిదా ►విచారణను గురువారానికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ►చంద్రబాబు లాయర్ల అభ్యర్థన మేరకు విచారణ వాయిదా 12:10PM, అక్టోబర్ 17, 2023 ►మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో జీజే రెడ్డి వారసులకు షేర్స్ ఉన్నాయి: అడ్వొకేట్ శివరాంరెడ్డి ►మార్గదర్శిలో జీజేరెడ్డికి షేర్స్ ఉన్నట్లు 2014 లో వెలుగులోకి వచ్చింది ►జీజే రెడ్డి మార్గదర్శి డైరెక్టర్ గా, ప్రమోటర్ గా పనిచేశారు ►జీజే రెడ్డి వారసులతో బలవంతంగా సంతకాలు పెట్టించి షేర్స్ బదిలీ చేయించుకున్నారు ►యూరిరెడ్డి ప్రమేయం లేకుండానే షేర్స్ మార్గదర్శికి బదిలీ చేశారు ►యూరిరెడ్డి కి చెందిన షేర్లను బలవంతంగా లాక్కున్నారు ►యూరిరెడ్డి షేర్లు శైలజా కిరణ్ కు బదిలీ చేసినట్లు లెక్కల్లో చూపించారు ► నా తండ్రి జీజే రెడ్డి.. రామోజీకి 1962 లో రూ. 5 వేలు ఇచ్చారు: యూరిరెడ్డి ►నా తండ్రి పేరు మీద షేర్స్ ఉన్నాయి ►మమల్ని బెదిరించడంతో సంతకం చేశారు. ►మా షేర్స్‌ను బలవంతంగా శైలజా పేరు మీదకు బదలాయించారు. 12:05PM, అక్టోబర్ 17, 2023 ►సీఐడీ విచారణకు హాజరుకాని కిలారు రాజేష్ ►ఇవాళ డాక్యుమెంట్లు తీసుకురావాల్సిందిగా రాజేష్‌కు తెలిపిన సీఐడీ అధికారులు ►సీఐడీ అడిగిన డాక్యుమెంట్లు అందుబాటులో లేవని మెయిల్ ద్వారా తెలిపిన కిలారు రాజేష్ ►దసరా తర్వాత డాక్యుమెంట్లు తీసుకుని వస్తానని సీఐడీకి మెయిల్ చేసిన కిలారు రాజేష్ 11:05AM, అక్టోబర్ 17, 2023 ►న్యూఢిల్లీ: చంద్రబాబు ఫైబర్ నెట్ స్కామ్ కేసుపై విచారణ మధ్యాహ్నానికి వాయిదా ► స్కిల్ స్కామ్ కేసు, ఫైబర్ నెట్ స్కామ్ కేసు.. రెండూ ఒకేసారి విచారణ చేస్తామన్న జస్టిస్ అనిరుధ్ బోస్ 10:25AM, అక్టోబర్ 17, 2023 ►ఇవాళ చంద్రబాబుతో వర్చువల్ గా మాట్లాడనున్న ఏసీబీ న్యాయమూర్తి ►మధ్యాహ్నం చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ 09:25AM, అక్టోబర్ 17, 2023 ఓటు దొంగలు వాళ్లు: తెలంగాణ మంత్రి హరీష్‌రావు ►చంద్ర బాబు డైరక్షన్ లో నాడు రేవంత్‌రెడ్డి నోటుకు ఓటు విషయంలో ప్రసిద్ధి ►నేడు అదే విధంగా కాంగ్రెస్ నోట్లకు సీట్లను అమ్ముకుంటోందని గాందీభవన్‌లో మాట్లాడుతున్నారు ►ఇలాంటి వాళ్లకు అధికారం అప్ప గిస్తే రాష్ట్రాన్ని కూడా అమ్ముతారు 09:20AM, అక్టోబర్ 17, 2023 న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు టిడిపి కొత్త వ్యూహం ► ఏపీ టుమారో పేరిట సంతకాల సేకరణ ► 36 లక్షల డిజిటల్ సంతకాలు సేకరించామంటూ ప్రచారం ► చంద్రబాబు బయటకు రావాలంటూ డిమాండ్లు ► ఢిల్లీకి వెళ్లి సీజేఐ ఆఫీస్ లో డిజిటల్ సంతకాలు పత్రాలు అందజేత ► చంద్రబాబు బయటకు రావాలంటే ఇదేనా మీకు తెలిసిన పద్ధతి? ► కోర్టులపై ఒత్తిడి తెచ్చి కేసు నుంచి బయటపడాలనుకుంటున్నారా? ► సంతకాలు తేగానే చేసిన నేరం పోతుందా? ► చంద్రబాబు అనుభవం ఏపీకి అవసరమని చెబుతున్న వాళ్లు చంద్రబాబు చేసిన తప్పుల గురించి మాట్లాడరా? ► చంద్రబాబు తప్పు చేయలేదని కోర్టుల్లో సీనియర్ లాయర్లు ఎందుకు చెప్పడం లేదు? ► కేవలం అరెస్ట్ చేసిన విధానాన్ని మాత్రమే చూపి కేసు కొట్టేయమని ఎందుకు అడుగుతున్నారు? ► రేపు కేసు బెంచ్ మీదకు వస్తున్న సమయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కార్యాలయంలో సంతకాలు ఎలా ఇస్తారు? ► అసలు మీరు ఇచ్చిన సంతకాలకు ఎంత విశ్వసనీయత ఉంది? ► రేపు ఇంకొకరు కోటి సంతకాలు తెస్తే.. తప్పును ఒప్పు అంటారా? 09:18AM, 09:20AM, అక్టోబర్ 17, 2023 నందమూరి, నారా ఒకే లైన్లో ఉన్నారా? ► చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాల మధ్య బేధాబిప్రాయాలొచ్చాయా? ► బావ చంద్రబాబు జైల్లో ఉంటే, బాలయ్య సినిమా ఫంక్షన్లో బిజీ బిజీగా ఎందుకుంటున్నారు? ► బ్రాహ్మణిని సొంత కుటుంబ సభ్యులు కనీస మాత్రం పట్టించుకోవడం లేదా? ► సినిమా ఫంక్షన్లకు హాజరయి జోకులు వేసే మోక్షజ్ఞ... అక్క బ్రాహ్మణీకి సంఘీభావం ఎందుకు తెలపలేదు? ► ఇన్నాళ్లు రాజమండ్రిలో బ్రాహ్మణీ ఉంటే కనీసం పరామర్శించలేదెందుకు? ► ఏపీ రాజకీయాల్లో బాలకృష్ణను తలదూర్చొద్దని చంద్రబాబు చెప్పడమే కారణమా? ► కేవలం తెలంగాణ రాజకీయాలకు మాత్రమే బాలకృష్ణను పరిమితం కావాలన్న బాబు సూచన నచ్చలేదా? ► నిరసన కార్యక్రమాల్లో బాలకృష్ణ భార్య వసుంధర ఎందుకు కనిపించడం లేదు? ► గతంలో హిందూపురం ఎన్నికల్లో ప్రచారంలో యాక్టివ్ గా కనిపించిన వసుంధర ఇప్పుడు నారా కుటుంబంపై కినుక వహించారా? ► ఇప్పుడెందుకు వదిన భువనేశ్వరీ పక్కన వసుంధర కనిపించడం లేదు? ► క్యాండిళ్ల ర్యాలీ, సంకెళ్ల ర్యాలీలో భువనేశ్వరీకి సొంత కుటుంబం నుంచి అంతగా మద్ధతెందుకు రాలేదు? ► హఠాత్తుగా బాబు కుటుంబ సభ్యులంతా రాజమండ్రి నుంచి వెళ్లిపోయారెందుకు? 09:10AM, అక్టోబర్ 17, 2023 స్కిల్ కేసుపై నేడు హైకోర్టులో విచారణ ►చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో కీలక వాదనలు ►బెయిల్ పిటిషషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు లాయర్లు ►నేడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదుల పిటిషన్ పై విచారణ ►చంద్రబాబు ఆరోగ్యం పై దాఖలైన పిటిషన్ పై విచారణ 09:02AM, అక్టోబర్ 17, 2023 ఇన్నర్‌రింగ్ రోడ్ కేసులో నేడు ఏపీ హైకోర్టు విచారణ ►ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన మాజీమంత్రి నారాయణ బావమరిది మునిశంకర్ ►మునిశంకర్ను నిందితుడిగా చేర్చిన సీఐడీ ►నేడు మునిశంకర్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ►ఇన్నర్‌రింగ్ రోడ్ కేసులో A-17గా అవుల మునిశంకర్ 9:00AM, అక్టోబర్ 17, 2023 నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కిల్ స్కాం కేసు విచారణ ►మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ చేయనున్న ధర్మాసనం ►కేసు విచారిస్తున్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేది ►సెక్షన్ 17- A చంద్రబాబుకు వర్తింపజేయాలని వాదిస్తున్న ఆయన తరపు న్యాయవాదులు ►2015లోనే స్కిల్ స్కాంలో నేరం జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చిన ఏపీ ప్రభుత్వం ►2018 జూన్ లోనే ఈ అంశంపై విచారణ ప్రారంభమైందని న్యాయస్థానానికి వెల్లడించిన ప్రభుత్వం ►2018 జులై నెలలో సెక్షన్ 17ఏ తీసుకొచ్చారని, కనుక ఈ చట్టం బాబుకు వర్తించదని స్పష్టం చేస్తున్న ప్రభుత్వం 8:30AM, అక్టోబర్ 17, 2023 ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 38వ రోజు రిమాండ్ ఖైదీగా అయితే చంద్రబాబు ►జైల్లో నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం ►ప్రతిరోజు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్న జైలు అధికారులు ►స్నేహ బ్యారక్ లో చంద్రబాబుకు టవర్ ఏసి ఏర్పాటు ►ప్రతిరోజు మూడుసార్లు వైద్య పరీక్షలు 08:18AM, అక్టోబర్ 17, 2023 తాడేపల్లి: ►నేడు రెండోరోజు సిట్ విచారణకు టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ ►సోమవారం ఉదయం పదిన్నర నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన విచారణ ►మొత్తం 25 ప్రశ్నలు అడిగిన సీఐడీ అధికారులు ►మనోజ్ వాసుదేవ్ పార్ధసానితో సంబంధాల గురించి ప్రశ్నంచగా ఆయన ఎవరో తనకు తెలియదన్న కిలారి ►పార్ధసానితో వాట్సప్ చాటింగ్, నగదు ట్రాన్సాక్షన్ వివరాలను రాజేష్ ముందు పెట్టిన అధికారులు ►సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలిన రాజేష్ ►నారా లోకేష్ తో పరిచయం, వ్యాపారాల గురించి అడిగిన ప్రశ్నలకూ సైలెంట్ గా ఉన్న కిలారు ►స్కిల్ స్కాం పై ప్రశ్నలకు తెలీదు, గుర్తులేదు అంటూ సమాధానం దాట వేసిన రాజేష్ ►నేడు రెండోరోజు సిట్ విచారణకు టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ ►సోమవారం ఉదయం పదిన్నర నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన విచారణ ►మొత్తం 25 ప్రశ్నలు అడిగిన సీఐడీ అధికారులు ►మనోజ్ వాసుదేవ్ పార్ధసానితో సంబంధాల గురించి ప్రశ్నంచగా ఆయన ఎవరో తనకు తెలియదన్న కిలారి ►పార్ధసానితో వాట్సప్ చాటింగ్, నగదు ట్రాన్సాక్షన్ వివరాలను రాజేష్ ముందు పెట్టిన అధికారులు ►సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలిన రాజేష్ ►నారా లోకేష్ తో పరిచయం, వ్యాపారాల గురించి అడిగిన ప్రశ్నలకూ సైలెంట్ గా ఉన్న కిలారు ►స్కిల్ స్కాం పై ప్రశ్నలకు తెలీదు, గుర్తులేదు అంటూ సమాధానం దాట వేసిన రాజేష్ 7:00 AM, అక్టోబర్ 17, 2023 సుప్రీంలో నేడు ఫైబర్ నెట్ స్కామ్ కేసు విచారణ ►స్కిల్ స్కాంలో 17A వర్తింప చేయాలని పిటిషన్‌తోపాటు.. ఫైబర్ నెట్ స్కామ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ ►స్కిల్ స్కాంలో చంద్రబాబుకు 17A వర్తించదన్న రోహత్గీ ►17A వర్తింప చేయాలని వాదించిన చంద్రబాబు లాయర్లు ►విచారణ చేయనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►కోర్టు నెంబర్ 6 లో ఐటం నెంబర్ 3గా లిస్టు అయిన చంద్రబాబు కేసు ►ఈ కేసులో ఇప్పటికే ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు చంద్రబాబు అరెస్టుపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కామెంట్స్... ►చంద్రబాబు తప్పు చేయలేదని తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్పడం లేదు ►కేవలం సాంకేతిక అంశాలు చూపించి మాత్రమే కేసు కొట్టేయాలంటున్నారు ►చంద్రబాబు జనం నుంచి వచ్చిన నాయకుడు కాదు ►నాయకుడు జనం నుండి వస్తే ప్రజల స్పందన వేరేగా ఉంటుంది ►చంద్రబాబు అరెస్టై 37 రోజులు గడుస్తున్నా ప్రజల వద్ద నుంచి ఎటువంటి స్పందన లేదు ►టిడిపి నాయకులు కూడా కొన్ని రోజులు ఆందోళన చేసినట్టు తూతూ మంత్రంగా చేసి సర్దేసుకున్నారు ►ప్రజల మనసును గెలుచుకున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇదీ చదవండి: కిలారు రాజేష్ సైలెన్స్.. మళ్లీ విచారణ -
బెయిల్, క్వాష్ పిటిషన్లపై నేడే విచారణ
-
ఏమీ తెలియదంటూ.. 17ఏ రక్షణ కావాలంటే ఎలా?
సాక్షి, నూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం గురించి తనకేమీ తెలియదన్నప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ద్వారా రక్షణ కావాలని చంద్రబాబు ఎలా అడుగుతారని ఏపీ ప్రభుత్వ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ప్రశ్నించారు. అలా కోరడంలో అర్థం లేదన్నారు. ‘అధికార విధులు నిర్వర్తించడమంటే అవినీతికి పాల్పడడం కాదు కదా? చట్టాల్లో నిజాయితీపరులకే రక్షణ కల్పించారు. సెక్షన్ 17ఏ కూడా అలాంటివారి కోసమే’ అంటూ దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన పలు రూలింగ్‌లను ప్రస్తావించారు. ‘స్కిల్ డెవలప్మెంట్’ స్కామ్‌లో గవర్నరు అనుమతి లేకుండా తనను అరెస్టు చేశారు కనక... మొత్తం కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. నేరం జరిగిందా? లేదా? అన్న అంశంపై కాకుండా టెక్నికల్‌గా చంద్రబాబు అరెస్టు చెల్లదు కాబట్టి కేసును కొట్టేయాలంటూ ఆయన లాయర్లు కోరటంతో శుక్రవారం కూడా ఈ విషయంపైనే వాదనలు కొనసాగాయి. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఎదుట... చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీశ్‌సాల్వే, సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. మరోవైపు ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ కూడా ఇదే ధర్మాసనం ముందుకు వచ్చింది. రెండు కేసుల విచారణను మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది. సవరణకు ముందు జరిగిన ఘటనకు పాత చట్టమే... ‘రద్దు చేసిన సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చా అని ఈ ధర్మాసనం ఇదివరకు అడిగింది. సరిగ్గా ఇదే పాయింట్‌పై ఓ తీర్పు ఉంది’ అంటూ ఎంసీ గుప్తా కేసును ముకుల్ రోహత్గీ ప్రస్తావించారు. 1947లో చట్టం రద్దు చేశాక దాంట్లోని నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయజాలరని ఎంసీ గుప్తా కేసులో పిటిషనర్ వాదించారన్నారు. కానీ కొత్త చట్టం అమల్లోకి రాకముందే నేరం జరిగిన విషయాన్ని కోర్టు గుర్తించిందని... చట్టాన్ని రద్దు చేసినా, వెనక్కి తీసుకున్నా నేరం జరిగే నాటికి ఉన్న చట్టమే వర్తిస్తుందని తీర్పునిచ్చిందని చెప్పారు. సరిగ్గా చంద్రబాబు కేసులోనూ అంతే జరిగిందన్నారు. చంద్రబాబుపై సెక్షన్ 13 (సీ),(డీ) కింద అభియోగాలు మోపారని, వాటిని తర్వాత రద్దు చేసినప్పటికీ, రద్దుకు ముందు నేరం జరిగిందని రోహత్గీ వివరించారు. ‘చట్ట సవరణలు సాధారణం. పాత చట్టాల్లో కొంత భాగం పోతుంది. కానీ సవరణకు ముందు జరిగిన ఘటనలకు మాత్రం ఆ పాత చట్టమే వర్తిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ కేసుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్షన్ 17ఏ వర్తించదని రోహత్గీ తేల్చి చెప్పారు. ‘సెక్షన్ 17ఏ జూలై 2018లో అమలులోకి వచ్చింది. నేరం 2015–2016 మధ్య జరిగింది. ఆ సమయంలో చట్టంలో సెక్షన్ 17ఏ లేదు’ అని రోహత్గీ తెలిపారు. చట్ట సవరణకు ముందు కేసు కాబట్టి 17ఏ వర్తించదన్నారు. సుప్రీంకోర్టులో ఎన్నడూ ఇలా జరగలేదు... దర్యాప్తు ప్రారంభించిన ఐదు–పది రోజుల్లోనే విచారణను అడ్డుకోవడానికి కోర్టు అంగీకరించే అవకాశం లేదని ముకుల్ రోహత్గీ చెప్పారు. హైకోర్టులో కస్టడీని వ్యతిరేకిస్తూ వాదించి, అదే రోజున సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం తాను ఎన్నడూ చూడలేదన్నారు. విచారణ ప్రారంభమైందనడానికి 2018 మే, జూన్ నెలల డాక్యుమెంట్లున్నాయని, వీటిని హైకోర్టుకు కూడా ఇచ్చామని, తమ వాదనలతో కోర్టు ఏకీభవించిందని చెప్పారు. బాబుకు డబ్బు అందినట్లు ఎలా గుర్తించారు? చంద్రబాబు అనుకున్నది జరిగితే దర్యాప్తు ప్రాథమిక దశలోనే నిలిచిపోతుందని, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా ఎన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేశాయో చూడాలని రోహత్గీ కోరారు. ‘ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండు సంస్థలతో ఒప్పందం చేసుకోవడం కోసం ప్రారంభమైంది. ఎలాంటి టెండర్ లేదు. సంస్థలు 90 శాతం పెట్టుబడి పెడతాయన్నది ఆలోచన’ అని రోహత్గీ చెబుతుండగా.. ఈ నిర్ణయం ఏ స్థాయిలో తీసుకున్నారని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకున్నారని రోహత్గీ తెలిపారు. చంద్రబాబుకు సొమ్ములు అందాయని ఎలా గుర్తించారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. సొమ్ములు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు, ఆయన పార్టీ ఖాతాలకు చేరాయని, అది ప్రజాధనమని, దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని రోహత్గీ తెలిపారు. దీంతో మరో రోజు విచారణ చేపడతామని జస్టిస్ బోస్ పేర్కొంటూ మంగళవారానికి వాయిదా వేశారు. అరెస్ట్ భయం ఉంది... అనంతరం ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిలు పిటిషన్‌పై లూథ్రా వాదనలు ప్రారంభించారు. ఒక కేసులో అరెస్టు చేశాక... పలు కేసులు తెరపైకి తెచ్చారన్నారు. 2021లో ఎఫ్ఐఆర్ నమోదైందని, తర్వాత ఏమీ జరగకున్నా.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టయ్యాక సెప్టెంబరు 19న ఫైబర్‌నెట్ కేసులో నిందితుడిగా చేర్చి కోర్టు ముందు హాజరు కావాలని అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేశారన్నారు. పీటీ వారెంట్‌ను ఏసీబీ కోర్టు అనుమతించిందని, ఇప్పుడు అరెస్టు చేస్తారేమో అని లూథ్రా ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ పూర్తి చేశామంటున్నారని, ఇక్కడ కూడా సెక్షన్ 17ఏ వర్తిస్తుందని, అయినప్పటికీ అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని లూథ్రా చెప్పారు. ఈ కేసులో ముగ్గురు ఇప్పటికే ముందస్తు బెయిలుపై బయట ఉన్నారని, మరో ముగ్గురు రెగ్యులర్ బెయిలుపై ఉన్నారని చెప్పారు. ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేయాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయన్నారు. ఈ కేసులోనూ సెక్షన్ 17ఏ వర్తిస్తుందా అని జస్టిస్ బోస్ ప్రశ్నిస్తూ.. షార్ట్ నోటీసు ఇచ్చి మంగళవారం విచారణ చేపడతామన్నారు. -
ఫైబర్ నెట్ పీటీ వారెంట్‌పై 18 వరకు నిర్ణయం వాయిదా - ఏసీబీ కోర్టు
విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ 18కి వాయిదా పడింది. ఫైబర్ నెట్ పీటీ వారెంట్‌పై ఎప్పుడు కోర్టు ముందు హాజరుపరచాలో 18 తర్వాత నిర్ణయిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. కావున సోమవారం కోర్టుకి హాజరుపరచాల్సిన అవసరం లేదు. విచారణ సందర్బంగా చంద్రబాబుని 18 వరకు కస్టడీకి తీసుకోకూడదని సీఐడీని ఆదేశించింది. అంతే కాకుండా ఆ లోపల కోర్టు ముందు హాజరుపరచవద్దని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తీర్పు ఆధారంగా 18 తర్వాతే చంద్రబాబు పిటి వారెంట్‌పై నిర్ణయం తీసుకోనుంది. -
సుప్రీంలో చంద్రబాబు రెండు పిటిషన్ల విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. స్కిల్‌డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో క్వాష్ పిటిషన్‌తో పాటు ఫైబర్ నెట్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వేర్వేరు పిటిషన్లు వేశారాయన. ఈ క్రమంలో ఇవాళ రెండు పిటిషన్లు విచారణకు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తనపై సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ.. జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వాదనలు వినిపించారు. ‘‘ఐదేళ్ల కిందట జరిగిన నేరానికి కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు చట్టం అనుమతిస్తుంది. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారనేది ముఖ్యం కాదు. నేరం జరిగిన సమయంలో ఉన్న చట్టం ఆధారంగానే విచారణ జరగాలి. కొన్ని చట్టాలను సవరించిన ఆ చట్టంలోని మిగిలిన భాగం అలాగే కొనసాగుతుంది. 17ఏ చట్టం తర్వాత జరిగిన కేసులకే వర్తిస్తుందని.. సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అవినీతి అనేది ఎప్పుడు ఉద్యోగ బాధ్యత కిందకు రాదు. 17ఏ చట్టంం ప్రాథమిక విచారణకే వ్యతిరేకం అయినప్పుడు.. కేసులు ఎలా విచారిస్తారు. 17ఏ విషయంపై నాలుగు హైకోర్టులు చెప్పిన తీర్పులు చంద్రబాబుకి వ్యతిరేకంగానే ఉన్నాయి. నేరం జరిగిన సమయానికి 17ఏ లేదు కాబట్టి.. ఇది బాబుకి వర్తించదు. ఈ కేసులో నేరం జరిగినట్లు స్పష్టమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఇది ఎక్కడా ఉద్యోగ బాధ్యతగా కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 17ఏ చంద్రబాబుకు వర్తించదు. ఈ కేసులో నేరం జరిగినట్లు స్పష్టమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ప్రాథమిక ఆధారాల ప్రకారం.. ఇది ఎక్కడా ఉద్యోగ బాధ్యతగా కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 17ఏ చంద్రబాబుకు వర్తించదు.. ఇది అవినీతికి సంబంధించిన చట్టం. అవినీతి పరుల్ని కాపాడే చట్టం కాదు. చంద్రబాబు కేసు ఉద్యోగ బాధ్యత కిందకు రాదు కాబట్టి 17ఏ వర్తించదు. గతంలో నేరం జరిగి.. ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసినా 17ఏ వర్తించదు. చంద్రబాబుది సాక్ష్యాలు తారుమారు చేయడం.. ప్రజాధనం లూటీ చేసిన కేసు. అరెస్ట్ చేసిన వెంటనే సెక్షన్ 482 కింద క్వాష్ అడగడం ఎంత వరకు కరెక్టో కోర్టు నిర్ణయించాలి. పోలీసులకు కనీసం విచారణ చేసే అవకాశం ఇవ్వకుండా క్వాష్ కోరడం ఎంత వరకు సబబు. స్కిల్ స్కాం కేసు విచారణ ప్రాథమిక దశలో ఉంది. ఈ సమయంలో చంద్రబాబు క్వాష్ సరికాదు. 17ఏ చట్టం రాకముందు జరిగిన నేరాలకు.. 17ఏ వర్తించదని నాలుగు హైకోర్టులు తీర్పు ఇచ్చాయి. 17ఏ వర్తిస్తుందని ఏమైనా తీర్పులున్నాయా? అని ప్రశ్నించిన బెంచ్ అలా తీర్పులు వచ్చినట్లు నా దృష్టికి రాలేదు.. రోహత్గీ 17ఏ వర్తిస్తుందని తీర్పులు ఉన్నాయి.. చంద్రబాబు తరపు న్యాయవాది లాయర్ లూథ్రా రోహత్గీ వాదనలు కొనసాగిస్తూ.. ‘‘కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు.. విచారణను అడ్డుకోవద్దని సుప్రీం కోర్టు పలుమార్లు తీర్పు ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయాలతో తనకు సంబంధం లేదని చంద్రబాబు చెబుతున్నారు. మరి నిర్ణయాలతో సంబంధం లేకుంటే.. 17ఏ ఎలా వర్తిస్తుంది?. 17ఏ అనేది కేవలం అధికార బాధ్యతలకు సంబంధించిన సెక్షన్. నేనే ఈ నిర్ణయాలకు బాధ్యుడిని అని చంద్రబాబు అంటేనే సెక్షన్ 17ఏ వర్తిస్తుంది. ఈ కేసులో 2018 జూన్ 5వ తేదీన జీఎస్టీ డీజీ రాసిన లేఖ చాలా కీలకం. విచారణ 2018లోనే ప్రారంభమైంది అని చెప్పడానికి ఇది తిరుగులేని సాక్ష్యం. జీఎస్టీ డీజీ రాసిన లేఖపై హైకోర్టులోనూ వాదనలు జరిగాయి. జీఎస్టీ రాసిన సమయంలో చంద్రబాబే సీఎంగా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరుగుతోందని.. 2017లోనే ఒక విజిల్ బ్లోయర్ లేఖ రాశారు. విజిల్ బ్లోయర్ పేరు చెప్పకుండా ఉండే చట్టం.. ఇంకా అమల్లో ఉందా? అని రోహత్గీని అడిగిన సుప్రీం కోర్టు విజిల్ బ్లోయర్తన గుర్తింపును చెప్పకుండా ఉండే హక్కు ఉంది: రోహత్గీ ..14మే 2017లో మరోసారి విజిల్ బ్లోయర్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరుగుతోందని పుణే జీఎస్టీకి లేఖ రాశారు. ఢిల్లీ ప్రత్యేక చట్టానికి సవరణ 6ఏను గతంలో సుప్రీం కోర్టు కొట్టేసింది. విచారణ సంస్థలను విచారణ నుంచి అడ్డుకునేందుకు సవరణ చేయలేదు’’ అని రోహత్గీ వాదించారు. దాదాపు గంటన్నరపాటు సాగిన వాదనల అనంతరం పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది ధర్మాసనం. చంద్రబాబుని అరెస్ట్ చేస్తారేమో? ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. చంద్రబాబు పిటిషన్ పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వాయిదా వేసింది. అయితే.. పీటీ వారెంట్ ప్రకారం చంద్రబాబుని సోమవారం ఏసీబీ కోర్టులో హాజరుపర్చాల్సి ఉందని, ఆ రోజు హాజరుపరిస్తే గనుక ఈ కేసులో అరెస్ట్ చేస్తారని చంద్రబాబు లాయర్ లూథ్రా విచారణ వాయిదాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ రోజు హాజరుపరిస్తే అరెస్టు చేస్తారని, అప్పుడు ఈ పిటిషన్ నిరర్థకం అవుతుందని లూథ్రా ధర్మాసనానికి వివరించారు. ఆ దశలో సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్గి జోక్యం చేసుకుని.. ‘‘సోమవారం అరెస్టు ఉండద’’ని సీఐడీ తరఫున హామీ ఇచ్చారు. -
అవినీతిని కాపాడటానికా సెక్షన్ 17ఏ?
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. గవర్నరుకు సమాచారమివ్వకుండా తనను అరెస్టు చెయ్యటం చెల్లదు కనుక ఈ కేసును కొట్టేయాలంటూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో మంగళవారం కూడా ఎలాంటి ఉపశమనం లభించలేదు. మంగళవారమే దీన్ని ముగించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులుపట్టుబట్టినప్పటికీ.. దర్మాసనం ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. విశేషమేంటంటే తాను స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి పాల్పడలేదని కానీ... షెల్ కంపెనీల ద్వారా నిధులను కొల్లగొట్టడం జరగలేదని కానీ మొదటి నుంచీ ఒక్క ముక్క కూడా చెప్పని చంద్రబాబు... తాజా విచారణలో సైతం అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద తన అరెస్టు చెల్లదని, కాబట్టి కేసును కొట్టేయాలనే సాంకేతిక అంశాలనే సుప్రీంకోర్టు ధర్మాసనానికి వినిపించారు. నిజానికి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ)ను 2018లో సవరించారు. కొన్ని పదవుల్లో ఉన్నవారికి అరెస్టు విషయంలో రక్షణ ఉండేలా... తగిన అనుమతితో అరెస్టు చేసేలా ఈ సవరణ చేశారు. కాకపోతే స్కిల్ కుంభకోణం 2018కి ముందే జరగటం... ఈ కేసులో పలు ఐపీసీ సెక్షన్లు కూడా ఉండటం వల్ల సెక్షన్ 17ఏ వర్తించదని ప్రతి కోర్టులోనూ చెబుతున్నా... సుప్రీంకోర్టులో సైతం ఇదే విషయంపై చంద్రబాబు లాయర్లు వాదనలు వినిపించటం గమనార్హం. సెక్షన్ 17ఏ అవినీతి కేసుల నుంచి కాపాడటానికా? అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ అనేది అవినీతి కేసుల నుంచి కాపాడటానికి కాదని మంగళవారం నాటి వాదనల్లో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి చెప్పారు. మంగళవారం జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీతో కూడిన ధర్మాసనం ఎదుట ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ నేరం కొన్నేళ్ల తర్వాత బయట పడితే అప్పటి చట్టాలకు లోబడే దర్యాప్తు జరుగుతుందని రోహత్గి ధర్మాసనానికి చెప్పారు. ‘‘చంద్రబాబు నాయుడి కేసు విషయానికొస్తే ఈ చట్ట సవరణ 2018లో జరిగింది. కానీ నేరం 2018 కంటే ముందు జరిగింది. మరి అప్పట్లో జరిగిన నేరాన్ని అప్పటి చట్టాల ప్రకారమే దర్యాప్తు చేస్తారు కదా? 17ఏ అనేది ఈ కేసులో ఒక భాగం మాత్రమే’’ అని వివరించారు. దర్యాప్తు అధికారి వద్ద ఉన్న సాక్ష్యాలు, ఆధారాలను బట్టి కోర్టు నిర్ణయం తీసుకోవాలని చెప్పారాయన. ఈ సందర్భంగా ఇరు పక్షాలనూ ధర్మాసనం పలు ప్రశ్నలు వేసింది. ప్రధానంగా ఈ కేసుకు సెక్షన్ 17ఏ వర్తించడంపై ఇరు పక్షాల న్యాయవాదులనూ తీసింది. తొలుత చంద్రబాబు నాయుడి తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే సోమవారం నాటి వాదనలను కొనసాగించారు. తనకు మరో గంట సమయమివ్వాలని ధర్మాసనాన్ని కోరగా అనుమతించింది. మూడు రోజులుగా వేచి చూస్తున్నామని ఇది ఇప్పటికే కొట్టేయాల్సిన కేసు అని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనానికి తెలిపారు. అసలు నోటీసులివ్వకుండా మరోసారి వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వకూడదన్నారు. క్రిమినల్ కేసులకు కౌంటరు అఫిడవిట్ అక్కర్లేదని హరీష్ సాల్వే పేర్కొనగా... ముకుల్ రోహత్గి విబేదించారు. కోర్టు ప్రొసీజర్‌ను అనుసరించాలని కోరారు. నిందితుడికి రక్షణ కల్పించే అంశాలు కోర్టుకు వివరిస్తానని, గంట సేపు వాదనలకు అవకాశం ఇవ్వాలని సాల్వే మరోసారి కోరగా ధర్మాసనం అనుమతించింది. గవర్నరు అనుమతి లేకుండా అరెస్టు చేశారు: సాల్వే సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా దర్యాప్తు చేయడం సరికాదని సాల్వే తెలిపారు. ముందుగా అనుమతి తీసుకున్నాకే చర్యలు చేపట్టాలన్నారు. సెక్షన్ 17ఏ దుర్వినియోగం కాకుండా ఉండాలనే తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కేసులో యశ్వంత్ సిన్హాపై దాఖలైన కేసుతో సహా మూడు కేసుల్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దర్యాప్తు అనేది హక్కు కాదని అవినీతి నిరోధక చట్టం చెబుతోందంటూ... ఆర్టికల్ 20(1)కి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కూడా సాల్వే ఉదహరించారు. సాల్వే ఇలా పలు తీర్పులను ప్రస్తావిస్తుండగా... జస్టిస్ బోస్ వారించారు. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి ఉండాలని చెప్పడమే తన ఉద్దేశమని సాల్వే వ్యాఖ్యానించారు. దీంతో అసలు ఎఫ్ఐఆర్లో ఉన్న అభియోగాలేంటని జస్టిస్ బేలా ఎం త్రివేదీ ఆరా తీశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కుట్రకు పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం అని సాల్వే తెలిపారు. ఐపీసీ సెక్షన్ 120బీ, సెక్షన్ 420, సెక్షన్ 465 , అవినీతి నిరోధక (పీసీ) చట్టం సెక్షన్ 12, సెక్షన్ 13 వంటివి ఈ కేసులో ఉన్నాయన్నారు. ‘‘ఈ కేసు పూర్తిగా అవినీతి నిరోధక చట్టం కిందనే ఉంది. ఆ చట్టం లేకపోతే మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాల్సి వచ్చేది’’ అన్నారు. అయితే ఈ అభియోగాలన్నీ మేజిస్ట్రేట్ ముందు విచారణ చేయతగిన అభియోగాలేనా? అని జస్టిస్ బోస్ ప్రశ్నించారు. పీసీ చట్టం మినహాయిస్తే ఇవన్నీ మేజిస్ట్రేట్ పరిధిలోవేనని సాల్వే తెలిపారు. మధ్యప్రదేశ్‌లో కొన్ని అంశాల్లో సెషన్స్ కోర్టు వెళ్లిన ధాఖలాలున్నాయని చంద్రబాబు తరఫు మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూత్రా చెప్పగా... జస్టిస్ త్రివేది జోక్యం చేసుకొని దేశమంతా ఒకే విధంగా ఉంటందని, మేజిస్ట్రేట్ పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో చంద్రబాబు తరఫున వాదనలు ముగించారు. సవరణల పేరుతో కేసు కొట్టేయమంటే ఎలా?: రోహత్గి ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి... చంద్రబాబుపై నమోదైన కేసులో ఎలాంటి రాజకీయ కక్షా లేదని మరోసారి స్పష్టం చేశారు. ‘‘‘ఎఫ్ఐఆర్ 2021లో నమోదయింది. 2023లో చంద్రబాబును నిందితుడిగా చేర్చారు’’ అంటూ సెపె్టంబరు 8 నుంచీ జరిగిన పరిణామాలు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘‘చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసు పీసీ చట్టంలోని సెక్షన్ 17ఏకు లోబడే ఉందని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అయినా అరెస్టయిన వెంటనే బెయిలు గురించో, రిమాండ్ వద్దనో కాకుండా నేరుగా పూర్తి కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారంటే చంద్రబాబు ఏంటో అర్థం చేసుకోవాలి. రెండు రోజుల్లోనే హైకోర్టు ముందుకు క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చిందంటే నిందితుడి ఉద్దేశాలను కోర్టు ఆలోచించాలి. కాకపోతే హైకోర్టు ఈ క్వాష్ పిటిషన్ కొట్టేసింది’’ అని రోహత్గీ వివరించారు. ఒకే కేసులో అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్లు ఉన్నప్పుడు ఏం చేయాలనే దానిపై కోర్టుకు రోహత్గి వివరణ ఇచ్చారు. చేసిన నేరానికి రెండు సెక్షన్లు వర్తింపజేసినప్పుడు ఏసీబీ కోర్టుకి రెండింటినీ విచారించే పరిధి ఉంటుందన్నారు. అయితే, సాల్వే చెప్పినట్లుగా అవినీతి నిరోధక చట్టాన్ని తొలగిస్తే.. సీఆర్పీసీ సెక్షన్ 3 కింద పేర్కొన్న నేరంతోపాటు ఇతర అభియోగాలు కూడా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పరిశీలించవచ్చునని చెప్పారు. ఈ దశలో జస్టిస్ త్రివేది జోక్యం చేసుకొని అవినీతి నిరోధక చట్టం తొలగించినప్పుడు సెక్షన్ 4(3) కూడా వర్తించదు కదా? అని ప్రశ్నించారు. అందుకే ఒకే కేసులో వేర్వేరు అభియోగాలుంటే ఏం చేయాలనే దానిపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చిందని రోహత్గీ చెప్పారు. చంద్రబాబు కేసులో పీసీ చట్టాన్ని తొలగించినా మిగతా అభియోగాలపై ప్రత్యేక కోర్టు దర్యాప్తు చేయొచ్చని వివరించారు. ‘‘చంద్రబాబు న్యాయవాది సాల్వే ప్రకారం ఈ కేసులో పీసీ చట్టం అభియోగాలు తొలగిస్తే.. సెక్షన్ 4(3) అభియోగాలకు అర్హత లేదు. అప్పుడు ప్రత్యేక కోర్టు పరిధి... ఆ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు సంగతేంటి’’ అని జస్టిస్ త్రివేదీ ప్రశ్నించారు. సెక్షన్ 420 కింద అభియోగాలు ఉంటే వాటిని తొలగించలేమని, అదే విధంగా ఈ కేసులో పీసీ చట్టాన్ని కూడా తొలగించలేమని రోహత్గీ చెప్పారు. ‘‘ఒక వ్యక్తి మరో వ్యక్తిని కొడితే ఆ కేసులో ఉద్దేశపూర్వకంగా కొట్టడంతో పాటు స్వచ్ఛందంగా హాని కలిగించడానికి సంబంధించిన సెక్షన్ 323 కూడా ఉంటుంది. ఆ సెక్షన్‌ను గనక తొలగిస్తే అభియోగాలు పోతాయా? చట్ట ప్రకారం సదరు వ్యక్తికి శిక్ష పడాలి కదా? సవరణల ద్వారా వచ్చిన కొత్త సెక్షన్లు చట్టానికి బలం చేకూర్చాలి తప్ప సవరణ పేరుతో కేసును కొట్టేయమంటే ఎలా?’’ అని రోహత్గి ప్రశ్నించారు. ఎప్పటి నేరాలకు అప్పటి సెక్షన్లు... 2018 కన్నా ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17ఏ వర్తించదని రోహత్గీ చెప్పారు. ‘‘సెక్షన్ 17ఏ వల్ల దర్యాప్తునకు కొన్ని మినహాయింపులు వచ్చాయి. అంతే!. 2018లో పీసీ చట్టంలో కొన్ని సెక్షన్లు తొలగించారు. కానీ అంతకు ముందు జరిగిన నేరాలకు తొలగించిన సెక్షన్లు కూడా వర్తిస్తాయి. బాబు కేసు కూడా అంతే. చంద్రబాబుపై పీసీ చట్టం సెక్షన్ 13(1), (సీ), (డీ) అభియోగాలు ఉన్నాయి’’ అన్నారు. ఆ సెక్షన్లను చట్టం నుంచి తొలగించారుగా? అని జస్టిస్ త్రివేదీ ప్రశ్నించగా... ఇంతకు ముందు తాను చెప్పిన అంశం ఇదేనని, సవరణకు ముందు జరిగిన నేరాలకు తొలగించిన సెక్షన్లు వర్తిస్తాయని రోహత్గీ వివరించారు. చంద్రబాబు నిర్ణయాలు, అక్రమాల వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చిందన్నారు. ఈ అంశాలు దర్యాప్తు సంస్థ ఎప్పుడు గుర్తించిందో తెలపాలని జస్టిస్ త్రివేదీ కోరారు. ట్రయల్ దశలోనే గుర్తించారని రోహత్గి తెలిపారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ కొత్త విషయాలు తెరపైకి వచ్చాయని, భారీ స్థాయిలో అవినీతి జరిగినప్పుడు ప్రాథమికంగానే కేసు కొట్టేయాలని కోరడం సరికాదని రోహత్గి తెలిపారు. చట్ట సవరణ ఎప్పుడు చేయాలి? దాన్ని ఎప్పటి నుంచి అమలులోకి తేవాలి? అనేది పార్లమెంటు అధికారమని, అయితే ఈ కేసులో 2018 కన్నా ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17ఏ ప్రకారం ముందస్తు అనుమతులు తీసుకోవాలని సవరణలో ఎక్కడా లేదని రోహత్గీ వివరించారు. ‘‘తప్పు చేసిన వారంతా సెక్షన్ 17ఏను చూపించి అనుమతులు తీసుకురమ్మంటే ఎలా? ఇలాగైతే దర్యాప్తు చేయడానికి అధికారులు ముందుకొస్తారా? మన పార్లమెంటు విధానమే అవినీతి రహిత దేశం... ఇందులో భాగంగానే చట్టాలు, సవరణలు వచ్చాయి. కాబట్టి అవినీతికి పాల్పడే వారికి సెక్షన్ 17ఏ అండ కాకూడదు. అది ఉన్నది నిజాయితీ పరులకు మద్దతు ఇవ్వటానికి’’ అని రోహత్గీ వివరించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు కనక ఈ దశలో మెరిట్స్‌లోకి వెళ్లకూడదని ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. అధికారిక విధులంటే ఏంటి? సిఫార్సులు అంటే ఏంటి? నిర్ణయాలంటే ఏంటి? ఇవన్నీ సాక్ష్యాల మీద ఆధారపడి ఉంటాయని, మౌఖికంగా వాదించేది కాదని రోహత్గి తెలిపారు. సెక్షన్ 17ఏ రక్షణ కల్పిస్తుందా అని జస్టిస్ బోస్ ప్రశ్నించగా.. గతంలో జరిగిన వాటికి రక్షణగా ఉండదని, కానీ పిటిషనర్ అదే కోరుకుంటున్నారని రోహత్గి తెలిపారు. ఎప్పుడైనా కేసు నమోదు చేయొచ్చు... ఈ దశలో జస్టిస్ త్రివేదీ జోక్యం చేసుకొని సవరణ తర్వాత సదరు చట్టంనుంచి సెక్షన్‌ను తొలగిస్తే.. ఆ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చా? అని ప్రశ్నించారు. దానికి వెసులుబాటు ఉందని రోహత్గి చెప్పారు. ‘‘ఫలానా నేరానికి ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడని ఏ చట్టమూ చెప్పలేదు. కాబట్టి సెక్షన్ తొలగించారని అనడం సరికాదు’’ అన్నారు. దీన్ని వివరించాలని జస్టిస్ త్రివేది కోరగా... ‘‘ఆర్టికల్ 20(1) ప్రకారం ఓ వ్యక్తి నేరం చేసిన విషయం కొన్నేళ్ల తర్వాత తెలిసినా కూడా కేసు నమోదు చేయొచ్చని చట్టం చెబుతోంది. దీనికి కొన్ని పరిధులు ఉండొచ్చు కానీ కేసు నమోదుకు ఆటంకమేమీ ఉండదు. మూడేళ్లకు మించి శిక్ష పడే కేసులకు ఏదో ఒక దశలో ఎఫ్ఐఆర్ ఉండాలని సీఆర్పీసీ సెక్షన్ 468 చెబుతోంది‘‘ అంటూ సీఆర్పీసీ సెక్షన్ 6 గురించి రోహత్గి చెప్పబోతుండగా.. విచారణ అవసరం లేదంటోందిగా?! అని జస్టిస్ త్రివేది అడిగారు. ‘‘అవును నిజమే. కానీ ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదయిందా లేదా అనేది ముఖ్యం’’ అని రోహత్గి చెప్పారు. భోజన విరామ అనంతరం మధ్యాహ్నాం వేరే కేసులు ఉన్నాయని విచారణను శుక్రవారం మధ్యాహా్ననికి వాయిదా వేస్తామని ధర్మాసనం పేర్కొంది. అయితే వాదనలు మంగళవారమే ముగించాలని లూత్రా కోరగా ధర్మాసనం నిరాకరించింది. -
చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. సీఐడీ తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. శుక్రవారానికి(13వ తేదీ) మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ‘‘17A.. అవినీతి పరులను కాపాడుకోవడం కోసం కాదు. నిజాయితీ పరులను కాపాడుకోవడం కోసమే. చంద్రబాబుకు 17ఏ వర్తించదని’’ ముకుల్ రోహత్గీ వాదించారు. యశ్వంత్ సిన్హా కేసును ప్రస్తావన.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే 17ఎ సెక్షన్‌కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను ప్రస్తావించారు. రఫేల్ కొనుగోళ్లపై యశ్వంత్ సిన్హా వేసిన పిటిషన్, అనంతరం దాఖలైన పలు కేసులపై వచ్చిన తీర్పులను ఆయన ఉదహరించారు. రఫేల్ కేసులో జస్టిస్ కేఎం జోసెఫ్ ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. రఫేల్ కేసు ఆరోపణలు 2016కు సంబంధించినవి. 2019లో యశ్వంత్ సిన్హా పిటిషన్లపై తీర్పులు వచ్చాయి. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకునే 2019లో కేసు కొట్టేశారు. ‘1988 అవినీతి నిరోధక చట్టం’ ప్రకారం పోలీసులకు ఇన్వెస్టిగేషన్ జరిపే హక్కు ఉండదు. ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసుల బాధ్యత మాత్రమే. అన్నిరకాల విధుల్లోని ప్రభుత్వ అధికారులకు సెక్షన్ 17ఎతో రక్షణ లభించింది’’అని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులను ఈ సందర్భంగా సాల్వే ప్రస్తావించారు. పూర్వ అంశాలకు కూడా వర్తించేలా ఆర్టికల్ 20(1)పై వచ్చిన తీర్పును ఆయన ఉదహరించారు. స్పందించిన జస్టిస్ అనిరుద్ధ బోస్.. సుప్రీంకోర్టులో తీర్పులు ఉన్నప్పుడు మిగిలిన హైకోర్టుల తీర్పుల ప్రస్తావన అవసరం లేదన్నారు. చంద్రబాబుకి వర్తించదు: రోహత్గీ 2018కి ముందు విచారణ కొంతవరకు జరిగి నిలిచిపోయిందని.. అంతమాత్రాన విచారణ జరగనట్లు కాదని సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. ‘‘2018 మేలో మెమో దాఖలు చేశారు. అందులో తగిన వివరాలు ఉన్నాయి. మెమోకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ బెంచ్ ముందు ఉంచుతున్నాం. విచారణ ముగిశాక పత్రాలు ఇచ్చామన్న దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాదనలు జరుగుతున్నప్పుడు 400 పేజీల బండిల్‌ను హైకోర్టు బెంచ్ ముందుంచారు. మేం కూడా అదేరోజు అవసరమైన డాక్యుమెంట్లను కోర్టు ముందుంచాం. 2018 చట్టసవరణ తర్వాత చంద్రబాబును ఎఫ్ఐఆర్లో చేర్చినప్పటికీ దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదు. ఆయనపై తగినన్ని ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేశారు. కేసులో చంద్రబాబును ఎప్పుడు చేర్చినప్పటికీ విచారణ కొనసాగుతున్నట్లుగానే పరిగణించాలి. చట్టసవరణకు ముందున్న ఆరోపణలకు అంతకుముందున్న చట్టమే వర్తిస్తుంది. చట్టసవరణకు ముందున్న నేరం కాబట్టి 17ఎ వర్తించదు. 2014-15 మధ్య ఈ స్కాం జరిగింది. 2018 లో 17A రాకముందే నేరం జరిగింది. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు కాదు. 2021లోనే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినా, 2023లో బాబు అరెస్ట్ జరిగింది. జిఎస్టీ పుణె ఫిర్యాదు ఆధారంగా కేసు ప్రారంభమైంది. దీని రిఫరెన్స్ రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. 17-A తెచ్చింది నిందితుల రక్షణ కోసం కాదు, నిజాయితీ కల అధికారుల రక్షణ కోసమే. 17-A గొడుగు కింద అవినీతి పరులు తప్పించుకోలేరు, నిజాయితీ పరులకు ఇది సహాయపడుతుంది. ప్రభుత్వ విధుల్లో దుర్వినియోగం చేశారా ? లేదా అన్నది విచారణలోనే తేలుతుంది ’’ అని రోహత్గీ తన వాదనలు వినిపించారు. ఈ క్రమంలో వాదనలు సుదీర్ఘంగా కొనసాగగా.. సమయం సరిపోదని, మిగతా వాదనలు వచ్చే విచారణలో వింటామని తెలిపింది. ఇక.. తదుపరి విచారణకు హరీష్ సాల్వే వర్చువల్‌గా హాజరు కానున్నట్లు తెలిపారు. సాక్షి వాట్సాప్ ఛానెల్‌తో ముఖ్యమైన వార్తల కోసం క్లిక్ చేయండి -
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు
-
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రెండో రోజు విచారణ