
టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాశ్, సినిమా నటుడు శొంఠినేని శివాజీ
హైదరాబాద్: సినిమా నటుడు శొంఠినేని శివాజీ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే. తనపై సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ ద్వారా విన్నవించారు. పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని పిటీషన్‌లో కోరారు. ఈ పిటీషన్‌ను హైకోర్టు బుధవారం విచారించింది. ప్రస్తుతం ఈ కేసులో రవిప్రకాశ్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌లో ఉన్న కారణంగా ప్రభుత్వం గడువు కోరింది. ఇప్పటి వరకు శివాజీకి మూడు సార్లు నోటీసులు జారీ చేసినా పోలీసు విచారణకు హాజరు కాలేదని ప్రభుత్వం హైకోర్టుకి తెలిపింది.
దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. టీవీ-9లో అక్రమాలకు పాల్పడినట్లు కొత్త యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ కేసుతో సంబంధమున్న శొంఠినేని శివాజీ అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment