Shivaji
-
22 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కాబోతున్న దేశ భక్తి సినిమా
కృష్ణవంశీ దర్శకత్వం వహించిన దేశ భక్తి సినిమా ఖడ్గం. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, రవితేజ, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2002లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రం థియేటర్స్‌లో సందడి చేయబోతుంది. అక్టోబర్ 18న ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ప్రెస్ మీట్ పెట్టి షూటింగ్ నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. దర్శకులు కృష్ణవంశీ మాట్లాడుతూ, “మాకు ఈ సినిమా తీయడం లో సహాయం చేసిన నిర్మాత మధు మురళి గారికి ధన్యవాదాలు. భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో ఈ సినిమా కి ఆ టైటిల్ పెట్టి సినిమా తీశాం.22 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నందుకు దర్శకులు కృష్ణవంశీ సంతోషంగా ఉన్నారు. ఈ సినిమా కి సహకరించిన నటీనటులందరికీ థాంక్స్.” అని చెప్పారు.హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, “జనరేషన్స్ మారినా పెట్రియేటిక్ ఫిల్మ్స్ అన్నిటిలో ఖడ్గం ఒక గొప్ప చిత్రం. అసలు ఖడ్గం సినిమా లో నిర్మాత మధు మురళి నన్ను వద్దు ఆన్నారు ముందు. కానీ వంశీ ధైర్యం చేసి ఆయన్ని ఒప్పించి నన్ను సినిమాలోకి తీసుకున్నారు. నా లైఫ్ లో ఈ సినిమా మర్చిపోలేను. ఈ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది.” అన్నారు. ‘షనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో చదివి ఏడేళ్లు వెయిట్ చేస్తున్న సమయం లో నాకు దొరికిన అవకాశం ఖడ్గం. ఈ సినిమా లో అవకాశం ఇచ్చి నా వనవాసం కి ఎండ్ చెప్పడానికి కారణమైన కృష్ణవంశీ గారికి కృతజ్ఞతలు’ అని షఫి అన్నారు. -
బాస్ మళ్లీ వస్తున్నాడు
మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు బాస్. రజనీకాంత్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘శివాజీ: ది బాస్’ ఈ నెల 20న రీ రిలీజ్‌కి ముస్తాబవుతోంది. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, శ్రియ జంటగా నటించిన చిత్రం ‘శివాజీ: ది బాస్’. ఈ సినిమాలో సుమన్ విలన్ పాత్ర చేశారు. ఎంఎస్ గుహన్, ఎం. శరవణన్ నిర్మించిన ఈ సినిమా 2007లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమా సూపర్ హిట్ అయింది.తమిళ సినిమా ఇండస్ట్రీ చరిత్రలో రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన తొలి చిత్రంగా ‘శివాజీ’ నిలిచింది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు ఇది నూరవ సినిమా కావడం విశేషం. సుమారు 17 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. 4కే వెర్షన్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే ఎంపిక చేసిన స్క్రీన్స్ లో ‘శివాజీ’ టికెట్ ధర రూ. 99 మాత్రమే ఉండనుంది. -
భారతీయ మేధా శిఖరం!
యాభై ఐదు సంవత్సరాల నాటి మాట. 1969 మేలో పూనా–బొంబాయి మధ్యగల లోనావాలా అనే హిల్ స్టేషన్లో లెస్లీ సాక్నీ ప్రజాస్వామ్య శిక్షణ శిబిరంలో ఓ పది, పధ్నాలుగు రోజులున్నాను. ఎమ్.ఆర్. మసానీ ఆ శిబిరానికి ప్రారంభోపన్యాసం చేశారు. బొంబాయి విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్ర ఆచార్యులు ఎస్.పి. అయ్యర్ ప్రిన్సి పాల్గా తరగతులు నిర్వహించారు. నానీ పాల్కీవాలా ఆ సంస్థ అధ్యక్షులు. సోలీ సొరాబ్జీ, రజనీ పటేల్, వి.బి. కార్నిక్, వి.వి. జీన్, అరవింద్ దేశ్‌పాండే, రాము పండిట్, ఫెడీ మెహతా, ఎస్.వి. రాజు వంటి వారు వివిధ అంశాలపై శిక్షణ గరిపారు.వారిలో ఎ.జి. నూరానీ కూడా ఉన్నారు. ఆయన అప్పటికే ఒక దశాబ్ద కాలంగా వివిధ అంశాలపై పూంఖానుపుంఖాలుగా వివిధ పత్రికలలో వ్యాసాలు రాసేవారు. ఇండి యన్ ఎక్స్‌ప్రెస్, హిందూ, స్టేట్స్‌మన్ వంటి స్వదేశీ పత్రికలకే గాక, పాకి స్తాన్‌లోని ‘డాన్’ పత్రికలో కూడా వారి రచనలు ప్రచురితమవుతుండేవి. ఆ తదుపరి ఫ్రంట్‌లైన్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ వంటి వాటికి కూడా రాసేవారు. జాకీర్ హుస్సేన్, బొంబాయి హైకోర్టులో మొట్టమొదటి భార తీయ వకీలు బద్రుద్దీన్ త్యాబ్జీ జీవిత చరిత్రలను ప్రచురించారు. కశ్మీర్ సమస్య, బాబ్రీ మసీదు, ఆర్టి కల్–370, లద్దాఖ్, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, గవర్నర్ పాత్ర, పౌరహక్కులు, భగత్ సింగ్‌పై విచారణ, సావర్కర్, హైదరాబాదు డిమాలిషన్ వంటి భిన్న విభిన్న అంశాలపై రచనలు చేశారు.తదాదిగా బొంబాయిలోగానీ, ఢిల్లీలోగానీ నూరానీని కలుసుకొనే అవకాశం దొరికేది. దక్షిణ బొంబాయిలో వీలు దొరికినప్పుడల్లా ఆయననను కలిసేవాడిని. ఎం.ఆర్. మసానీ అక్కడే బీచ్కాండీలో ఉండేవారు. నూరానీ నేపియన్ సీ అపార్టుమెంట్స్‌లో ఉండేవారు. అవి రెండూ మహాలక్ష్మి టెంపుల్ దగ్గర నుండేవి. దానితో మసానీ దగ్గరకెళ్లినప్పుడు విధిగా నూరానీని కూడా కలిసేవాడిని. నూరానీ బల్ల కుర్చీమీద కాకుండా, మంచంమీద కూర్చుని రాసేవారు. చుట్టూ అప్పడాలు ఆరబోసినట్లు లెక్కకు మించిన పుస్తకాలు తెరిచి, తిరగేసి ఉండేవి. ఏదైనా అంశంపై చర్చిస్తుండగా, ఎదురుగా ఉన్న పుస్తకాల్లో ఫలానా పుస్తకం తీసి ఫలానా చాప్టర్ చదవమనేవాడు.తాను చెప్పిన దానిని, వివరంగా అర్థం చేసుకోవడానికి ఉదయం చదివిన పత్రికలలో అవసరమయిన అంశాలను కత్తిరించి, అంశాల వారీగా ఫైల్ చేసేవారు. కొన్ని వందలు, వేల ఫైళ్ళు అలా ఉన్నాయి. ఏ అంశంమీద రాసినా, లోతైన పరిశోధన చేసేవారు. వాజ్‌పేయి–ముషారఫ్‌ల మధ్య ఆగ్రాలో జరిగిన చర్చలపై రాసే దానికి, పూర్తి సమాచారం రాబట్టడానికై, పనిగట్టుకొని ఇస్లామాబాద్ వెళ్లి పరిశోధన గావించారు. క్రీ.శ. 1775–1947ల మధ్య జరిగిన రాజకీయ ప్రేరిత విచారణలపై సమగ్ర పరిశోధన చేసి గ్రంథస్థం గావించారు. ‘జిన్నా–తిలక్ – కామ్రేడ్స్ ఆఫ్ ఫ్రీడం స్ట్రగుల్’ అనే పుస్తకాన్ని కూడా వెలువరించారు. అయితే ఏది ఎలా ఉన్నా ఎవరిమీదా వ్యక్తిగతంగా విమర్శ చేసేవారు కాదు. ‘రాజాజీ – అంకి తమైన, నిబద్ధతగల హిందువు, మహో న్నతమైన భారతీయుడు, అల్పసంఖ్యాక వర్గాల హక్కులకు అలు పెరుగని రక్షకుడు’ అని కొనియాడారు. షేక్ అబ్దుల్లా, కరుణానిధిల తరఫున సుప్రీంకోర్టు, బొంబాయి హైకోర్టులలో వకీలుగా తన వాదనలను వినిపించారు.నూరానీకి కొన్ని నిర్దిష్టమయిన, చిత్ర–విచిత్రమయిన అభిరుచులు ఉండేవి. ఢిల్లీ వస్తే ఇండియా ఇంటర్నేష నల్ సెంటర్లో 38వ నంబరు గదిలోనే మకాం. ఓల్డ్ ఢిల్లీ, నిజాముద్దీన్, కరోల్ బాగ్, జామా మసీదు వంటి చోటసందులు – గొందులలోని హోటళ్లలో కబాబ్–కుర్మా ఎక్కడ దొరుకు తుందోనని శోధించి, ఆస్వాదించేవారు. గత నెలాఖరులో తన 94వ ఏట కన్నుమూసిన అబ్దుల్ గఫూర్ మజీద్ నూరానీ సేకరించిన వేలాది పుస్తకాలు, పేపర్ క్లిప్పింగ్‌లు ఏమవుతాయో? ఏదైనా జాతీయ స్థాయిలో నున్న గ్రంథాలయం గానీ, పరిశోధనా సంస్థలు, లేక జాతీయ పత్రికలు భద్రపరిచి, సద్వినియోగం గావించడం అవసరం. అవి భావి తరాలకు ప్రజాసేవా రంగాలలో, పాత్రికేయ రంగంలోకి అడుగు పెట్టే యువతరానికి ఉపయుక్తం కాగలవు. – డా. యలమంచిలి శివాజీ, వ్యాసకర్త రాజ్యసభ మాజీ సభ్యులు, 98663 76735 -
మంచి కంటెంట్ ఉంటే చాలు..ఇండస్ట్రీలో నిలబడొచ్చు: శివాజీ
విశ్వంత్, శిల్ప మంజునాథ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం హైడ్ న్ సిక్. సహస్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నరేంద్ర బుచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బసిరెడ్డి రానా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్ని సీనియర్ హీరో శివాజీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైడ్ న్ సిక్ చిత్రంతో తెలుగు పరిశ్రమలు మరో ఫెంటాస్టిక్ డైరెక్టర్ పరిచయం అవుతున్నాడని బలంగా నమ్మున్ననని అన్నారు. ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ఈమధ్య ఎక్కువగా వస్తుంది అని, ఇది చాలా మంచి పరిణామం అని పేర్కొన్నారు. ఒకప్పటిలా కాదు ఇప్పుడు అవకాశం అందుకోవడం చాలా సులభతరం అయిందని.. మంచి కంటెంట్ ఉంటే చాలు ఇండస్ట్రీలో నిలబడొచ్చని నటుడు శివాజీ పేర్కొన్నారు. ‘ ఈ చిత్రం నుంచి ఎలాంటి కంటెంట్ వచ్చిన అది కచ్చితంగా బ్లాస్ట్ అయ్యేలా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిదీ చక్కగా ప్లాన్ చేస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమా అందరిని రంజింప చేస్తుందని ప్రామిస్ చేస్తున్నాను’అని డైరెక్టర్ బసిరెడ్డి రానా అన్నారు. -
ఛత్రపతి శివాజీ శౌర్యానికి మారుపేరని ఎందుకంటారు?
ఛత్రపతి శివాజీ భారతదేశాన్ని మొఘలుల బారి నుండి విముక్తి చేసి, మరాఠా సామ్రాజ్యానికి పునాది వేశాడు. మొఘలులకు వ్యతిరేకంగా యుద్ధానికి దిగిన శివాజీ శౌర్య పరాక్రమాలు చరిత్రలోని బంగారు పుటలలో నిక్షిప్తమయ్యాయి. భారతదేశంలో శివాజీ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. నేటికీ ఛత్రపతి శివాజీని శౌర్యానికి ప్రతీకగా చెబుతుంటారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ప్రతియేటా ఫిబ్రవరి 19 న జరుపుకుంటారు. శివాజీ 1630, ఫిబ్రవరి 19న శివనేరి కోటలోని మరాఠా కుటుంబంలో జన్మించాడు. శివాజీ పూర్తి పేరు శివాజీ భోంస్లే. అతని తండ్రి పేరు షాజీ భోంస్లే, తల్లి పేరు జిజియాబాయి. శివాజీ తండ్రి అహ్మద్‌నగర్ సుల్తానేట్‌లో పనిచేసేవారు. శివాజీ తల్లికి మతపరమైన గ్రంథాలపై అమితమైన ఆసక్తి ఉండేది. ఇదే శివాజీ జీవితంపై ప్రభావం చూపింది. మహారాజ్ శివాజీ జన్మించిన కాలంలో దేశంలో మొఘలుల దండయాత్ర కొనసాగుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన 15 ఏళ్ల వయసులో మొఘలులపై తన మొదటి దాడిని చేశాడు. హిందూ సామ్రాజ్య స్థాపన కోసమే ఈ దాడి జరిగింది. దీనినే గెరిల్లా వార్ఫేర్ విధానం అంటారు. శివాజీ ఈ కొత్త తరహా యుద్ధానికి ప్రాచుర్యం కల్పించారు. గెరిల్లా వార్ఫేర్ సూత్రం ‘హిట్ అండ్ రన్‌వే’. శివాజీ బీజాపూర్‌పై తన గెరిల్లా యుద్ధ నైపుణ్యంతో దాడిచేసి అక్కడి పాలకుడు ఆదిల్షాను ఓడించి, బీజాపూర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1674లో పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యానికి పునాది వేశాడు. ఈ సమయంలోనే శివాజీ అధికారికంగా మరాఠా సామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఛత్రపతి శివాజీని ‘మరాఠా గౌరవ్’ అని కూడా పిలిచేవారు. శివాజీ తీవ్ర అనారోగ్యంతో 1680 ఏప్రిల్ 3న కన్నుమూశాడు. అనంతరం ఆయన కుమారుడు శంభాజీ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. -
‘తొలిప్రేమ’లో పవన్ చెల్లెలు.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
నటి వాసుకి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కాని తొలిప్రేమ సినిమాలో పవన్ కల్యాణ్ చెల్లెలు బుజ్జి అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. ఆ సినిమాలో వాసుకి నటనకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పవన్-వాసుకిల మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతలా ప్రేక్షకుల మదిలోకి వెళ్లిపోయిన వాసుకి.. వన్ ఫిల్మ్ వండర్లా ఒక్క సినిమాకే పరిమితమైంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి.. అటు వెండితెరపై ఇటు వెబ్స్క్రీన్పై సందడి చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇటీవల రిలీజై సూపర్ హిట్ అయిన ’#90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌లో మిడిల్ క్లాస్ అమ్మగా అదరగొట్టేసింది. వాసుకి పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. ‘రమణి వర్సెస్ రమణి’, ‘మర్మదేశం’ అనే సీరియల్స్‌తో చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. ‘తొలిప్రేమ’ సూపర్ హిట్ కావడంతో తర్వాత సినీ అవకాశాలు వెల్లువలా వచ్చాయి. కానీ ఆమె నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కుటుంబ జీవితంపై దృష్టి పెట్టింది. ‘తొలిప్రేమ’లో పవన్ కల్యాణ్ చెల్లెలిగా నటించి తెలుగు ప్రేక్షకుల ప్రేమాభినాలను చూరగొంది. ఆ సమయంలోనే ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని ప్రేమ వివాహం చేసుకుంది. మళ్లీ రెండు దశాబ్దాల విరామం తర్వాత ’అన్నీ మంచి శకునములే’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతోన్న ’#90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్‌సిరీస్‌తో మిడిల్ క్లాస్ అమ్మగా ఆకట్టుకుంటోంది. ఇందులో కనిపించే వస్తువులు, చిన్నచిన్న ఆనందాలు, విషయాలు, పరిస్థితులు.. నైంటీస్ కిడ్స్‌కి బాగా రిలేట్ అవుతున్నాయి. ఇరవై మూడేళ్ళు సినిమాల్లో నటించనప్పటికీ ఆనంద్ వలన ఏదో ఒక సినిమా గురించి ఇంట్లో చర్చ జరుగుతూనే ఉండేది. అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాననే ఫీలింగ్ కలగలేదెప్పుడూ! – వాసుకి ఆనంద్ సాయి. View this post on Instagram A post shared by Sai Madhav Battula (@saimadhavbattula) -
‘కేరింత’ఫేమ్ పార్వతీశం హీరోగా 'మార్కెట్ మహాలక్ష్మి'
‘కేరింత’ఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రణీకాన్వికా హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ మూవీ 'టైటిల్ పోస్టర్'ని బిగ్ బాస్ ఫెమ్ హీరో 'శివాజీ' చేతుల మీదగా ఈ రోజు ఆవిష్కరణ జరగగా, ప్రొడ్యూజర్ బెక్కెం వేణుగోపాల్ అతిధి గా వచ్చి టీం ని విష్ చేశారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ‘నేను 27 ఏళ్ళ వయసులో యాక్టింగ్ మొదలు పెడితే దాదాపు 50 యేళ్ళకి నాకు గుర్తింపు వచ్చింది. ఏదో, ఒక రోజు గుర్తింపు అనేది వస్తుంది. కాకపోతే క్యారెక్టర్, హార్డ్ వర్క్, ఓపిక ఇంపార్టెంట్. 'కేరింత' మూవీతో కేరీర్ స్టార్ట్ చేసిన హీరో 'పార్వతీశం' కి తప్పకుండా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వస్తుంది అని నాకు బలమైన నమ్మకం ఉంది. ప్రొడ్యూసర్ 'అఖిలేష్ కలారు'కి మంచి లాభాలు చేకుర్చాలి. డైరెక్టర్ ' వియస్ ముఖేష్' కథ బాగా తీసి ఉంటారని నమ్ముతున్నాను’అన్నారు. 'మార్కెట్ మహాలక్ష్మి'చూసినప్పుడు నాకు శేఖర్ కమ్ముల గారి సినిమాలు గుర్తొచ్చాయి’అని బెక్కం వేణుగోపాల్ అన్నారు. -
' ఆయన చేసిందేమీ లేదు.. మీరు అనవసరంగా పైకెత్తకండి..'.. అమర్దీప్ కామెంట్స్!
ఉల్టా- పుల్టా అంటూ మొదలైన బిగ్‌బాస్ సీజన్-7కు ఆదివారం ఎండ్‌కార్డ్ పడింది. అందరూ అనుకున్నట్లుగానే సింపతీ వర్కవుటై రైతుబిడ్డ విన్నర్‌గా నిలిచాడు. ఈ సీజన్ రియాలిటీ షో రన్నరప్‌గా అమర్దీప్ స్థానం దక్కించుకున్నాడు. అయితే దాదాపు వంద రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ షో గ్రాండ్‌గా ముగిసింది. ఈ షో అనంతరం బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూ ఇవ్వడం కామన్. అందరిలాగే రన్నరప్ అమర్దీప్ సైతం ఇంటర్వ్యూకు హాజరైన ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో ఇంటిసభ్యుల గురించి అమర్దీప్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అమర్దీప్ మాట్లాడుతూ.. 'మొదటి 5 వారాలకే నా ఫర్మామెన్స్‌కు ఎలిమినేట్ అయిపోతానని డిసైడ్ అయిపోయా. రన్నరప్ అయినప్పటికీ నాకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. నేను ఎవరినైతే దేవుడిగా భావించానో ఆయనే కోట్ల ప్రజల ముందు ఒక అభిమానిగా నన్ను గుర్తించాడు. నా దృష్టిలో నేను గెలిచాను. శోభాశెట్టి, ప్రియాంక విషయాకొనిస్తే నాకు ఇద్దరు సమానమే. ఒకరు ఎక్కువ కాదు.. ఒకరు తక్కువ కాదు.' అని అన్నారు. ఆ తర్వాత శివాజీ హౌస్‌లో ఉండగానే ప్రశాంత్‌ను విన్నర్‌ను చేసే పోతానని చెప్పారు కదా.. దీనికి మీ సమాధానమేంటి? అని అమర్‌దీప్‌ను యాంకర్ ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. ' మీరు అలా చెప్పి అనవసరంగా ఆయన్ను పైకి లేపకండి'.. ఆయన గేమ్ ఆడుకుని బయటికి వెళ్లిపోయాడు. ప్రశాంత్ తన గేమ్ తాను ఆడుకున్నాడు. కప్ కొట్టాడు అంతే' అని చెప్పారు. ఆ తర్వాత శివాజీ హౌస్‌లో లేకపోతే యావర్, ప్రశాంత్‌ను మీరంతా ఎప్పుడో తొక్కేసేవాళ్లా? అని మరో ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.. 'నీ బలమేంటో తెలుసుకో.. పక్కోన్ని నమ్ముకో.. పక్కన పెట్టుకో.. ముందుకు రా..' అని సమాధానమిచ్చాడు. దీంతో ప్రోమో ముగిసింది. అయితే ఈ షో ముగిసిన తర్వాత అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. -
బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆ ముగ్గురిలో ఎవరు?
మరో నాలుగు రోజుల్లో బిగ్ బాస్ సీజన్-7 ముగియనుంది. చివరి వారంలో హౌస్‌లో ఇంకా ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. దీంతో వంద రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఈ షో విజేత ఎవరో ఆదివారం తేలిపోనుంది. ఈ నేపథ్యంలో చివరి వారంలో ఫైనలిస్టుల జర్నీ గురించి బిగ్‌బాస్ ఆడియన్స్‌కు పరిచయం చేస్తున్నారు. మొత్తంగా ఈ వారాన్ని ఎమోషనల్ ఎపిసోడ్‌గా మార్చేసిన బిగ్‌బాస్.. మొదటి రోజు అమర్, అర్జున్‌ని వీడియోలను చూపించిన ఏడిపించేశారు. రెండో రోజు శివాజీతో స్టార్ట్ చేసి.. చివరీకీ ప్రియాంక ఎమోషనల్ జర్నీతో ముగించాడు బిగ్‌బాస్. అలా ఫైనలిస్టులైన వారిలో ఇంకా పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ జర్నీ మూడో రోజు ఆడియన్స్‌కు చూపించనున్నారు. తాజాగా ప్రిన్స్ యావర్ జర్నీకి సంబంధించిన ప్రోమో రిలీజైంది. అయితే యావర్ పట్టుదల అద్భుతమని బిగ్‌బాస్ కొనియాడారు. దీంతో యావర్ ఫుల్ ఎమోషనలై కంటతడి పెట్టుకున్నాడు. మిడ్ వీక్‌లో ఎవరు అవుట్? అయితే ఈ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉన్న సంగతి తెలిసిందే. మరీ వారం మధ్యలో హౌస్ నుంచి ఎవరు బయటికొస్తారు? టాప్-5 లో ఎవరెవరు నిలుస్తారు అనే విషయంపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఆ ఒక్కరు ఎవరన్న విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇప్పటికైతే పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్దీప్ టాప్-5లో నిలుస్తారని తెలుస్తోంది. మరో వైపు అర్జున్, ప్రియాంక, ప్రిన్స్ యావర్‌లో ఎవరో ఒకరు బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరీ మిడ్ వీక్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. -
అతన్ని ఆ మాట అనకుండా ఉండాల్సింది: శోభా శెట్టి ఎమోషనల్
తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ చివరి ఘట్టానికి చేరుకుంది. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న షో మరో వారంలో ముగియనుంది. ఈ వారంలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండగా.. చివరి వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్‌లో ఉండనున్నారు. ఇప్పటికే ఈ వారంలో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో కూడా తెలిసిపోయింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ఏడుగురిలో శోభాశెట్టి బయటకు రానుంది. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో హోస్ట్‌గా నాగార్జున 14 వారాల్లో మీరు పశ్చాత్తాప పడిన సందర్భం ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు. దీనికి హౌస్మేట్స్ అందరూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. (ఇది చదవండి: నా సామిరంగ.. నిన్ను ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్లా!) మొదట అంబటి అర్జున్ మాట్లాడారు. కేవలం బలం ఉంటే సరిపోదు.. బలంతో పాటు జనాల ప్రేమ కూడా కావాలనేది ఆ వారంలో తెలిసింది సార్ అన్నాడు. ఆ తర్వాత శోభాశెట్టి మాట్లాడుతూ యావర్‌ను పిచ్చోడా అని అనేశాను. తాను ఆ మాట అనకుండా ఉండాల్సింది అన్నారు. ఆ తర్వాత యావర్ మాట్లాడుతూ 11 వారంలో ఫౌల్ జరిగింది.. కానీ నేను అది కావాలని చేయలేదు అన్నాడు. ఆ తర్వాత 14 వారంలో నేను వాడిన పదాలు నా వ్యక్తిగత అనుకున్నా.. కానీ అది ఇతరులకు టచ్ అవుతుందనేది మీరు చెప్పాక తెలిసిందని శివాజీ అన్నాడు. నేను అన్నది పొరపాటు అయిండొచ్చు.. నేను అన్న మాటల్లో ఆ పదం అనుకోకుండా దొర్లింది. నా కోసం నేను స్టాండ్ తీసుకున్నప్పుడు ఏది జరగలేదు అన్నారు. అయితే నాగార్జున శివాజీని ఉద్దేశించి బతుకు.. బతికించు అన్న పదం వాడావు.. అది నీ ఫీలాసఫీ అని నాకు అర్ధమైంది అన్నారు. దీంతో ప్రోమో ముగిసింది. మిగిలిన కంటెస్టెంట్స్ కూడా ఎక్కడ తప్పు చేశారో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. (ఇది చదవండి: ఒంటి మీద నూలు పోగు లేకుండా కనిపించి షాకిచ్చిన హీరో.. ఎందుకంటే?) -
హోస్లో పాము, ఊసరవెల్లి లాంటి వాళ్లు ఉన్నారు.. అశ్విని కామెంట్స్ వైరల్!
సెల్ఫ్ గోల్ వేసుకుని బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అశ్విని. డబుల్ ఎలిమినేషన్ ఉందని చెప్పినా.. తనకు తానే సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. దీంతో హోస్ నుంచి బయటకి వచ్చేసింది. తాజాగా బిగ్‌బాస్ ఎగ్జిట్ ఇంటర్వ్యూకు హాజరైన అశ్విని ఇంటి సభ్యుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. హౌస్‌లో రెండు గ్రూపులు ఉన్నాయి.. నాకు ఎవరితోనూ సెట్ కాలేదు.. దీనికంటే హౌస్ నుంచి వెళ్లిపోవడమే మేలని అనిపించిందని అశ్విని చెప్పుకొచ్చింది. సరైన కారణాలు కనిపించక సెల్ఫ్ నామినేట్ చేసుకున్నా. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సమయానికి అప్పటికే ఉన్నవాళ్లు మమ్మల్ని వాళ్లతో కలుపుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. బిగ్‌బాస్‌కు ఎందుకు వచ్చావో తెలియదు. ఏం చేస్తున్నావో తెలియదు.. అశ్విని నీ వల్ల బిగ్‌బాస్ ఫ్యాన్స్‌కు ఏం ఉపయోగం అంటూ ఓ అభిమాని చేసిన కామెంట్‌కు బిగ్‌బాస్ కంటెస్టెంట్ అశ్విని ఎమోషనల్ అయింది. నేను ఏం చేస్తే వాళ్లకేందుకుండి అంటూ బాధపడింది. ఇలాంటి ప్రశ్నలు అడిగితే వెళ్లిపోతానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. శోభ, ప్రియాంక, అమర్ ఒక గ్రూప్ కాగా.. శివాజీ, ప్రశాంత్, యావర్ ఒక గ్రూప్‌గా తయ్యారని తెలిపింది. నాతో మాట్లాడేందుకు ఎవరూ ఆసక్తి చూపేవారు కాదని.. ఆ సమయంలో మానసికంగా చాలా వేదన అనుభవించానని వెల్లడించింది. కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ.. ప్రియాంకను ఊసరవెళ్లితో పోల్చింది అశ్విని. పైకి ఒకలా కనిపిస్తుంది.. కానీ లోపల ఆమె వేరేలా ఉంటుందని చెప్పింది. ప్రశాంత్‌కు భజన చేశారా? అని ప్రశ్నించగా.. భజనేంటండి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. శివాజీ పాములాంటి వారని తెలిపింది. అందుకే హౌస్‌లో ఒక పెద్ద పాము ఉందని అనాల్సి వచ్చిందని పేర్కొంది. -
'మీ దోస్తాన్ మళ్లీ స్టార్ట్ చేసిర్రు'.. నా కళ్లు తెరుచుకున్నాయన్న రైతు బిడ్డ!
బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తోన్న రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-7 మరో వారం ముగిసింది. గతవారం ఎవరిని ఎలిమినేట్ చేయని బిగ్‌బాస్.. ఈ సారి ఏకంగా ఇద్దరిని ఇంటికి పంపించేశాడు. ఇప్పటివరకు హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ ముగియడంతో మళ్లీ నామినేషన్స్ పర్వం మొదలైంది. ఇప్పటి నుంచి టాప్-5 లో నిలిచేందుకు టఫ్ ఫైట్ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియలో వాదనలు వేరే లెవెల్లో జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. ప్రోమో ప్రారంభంలోనే యావర్‌ను నామినేట్ చేస్తూ శోభాశెట్టి.. గేమ్ ఓవర్ శెట్టి అని రాశావ్ అంటూ చెప్పింది. దీనికి నువ్వు చూశావా అని యావర్ అడగడంతో.. నేను చూడలేదంటూ సమాధానమిచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్‌ను అమర్ నామినేట్ చేశాడు. దీంతో రైతు బిడ్డ ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేశాడు. దీంతో అమర్.. పోరా కూర్చోపో.. ఎలిమినేట్ చేయను పో అన్నాడు. దీనికి అన్నా నిన్ను నమ్మినందుకు నేను బాధపడతున్నా అంటూ ప్రశాంత్ మాట్లాడారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వతా శివాజీని నామినేట్ చేస్తూ మధ్యలో ప్రశాంత్ టాపిక్ తీసుకొచ్చాడు గౌతమ్. నేను ఎప్పుడైనా యావర్, ప్రశాంత్‌కు సపోర్ట్ చేశానా? అని గౌతమ్‌ను ప్రశ్నించాడు. ఆ తర్వాత గౌతమ్‌ను అమర్ నామినేట్ చేశాడు. నాకు సపోర్ట్ చేస్తా అని మోసం చేశావ్ అన్నాడు. మధ్యలో శివాజీ ఎంటరయ్యాడు. వాంటెడ్‌గా చేస్తుంటే జనాలేమైనా పిచ్చోళ్లా ఇక్కడ ఉంచడానికి అని గౌతమ్ ఫైరయ్యాడు. ఆ తర్వాత ప్రశాంత్‌ను శోభా నామినేట్ చేస్తూ.. నువ్వు చాలా సేఫ్‌గా ఆడావు.. నీవల్లే అమర్ కెప్టెన్సీ పోయిందంటూ నామినేట్ చేసింది. దీనికి ఆశ్చర్యపోయిన ప్రశాంత్ అన్నా.. నా వల్లే కెప్టెన్సీ పోయిందా? అని అమర్‌ను అడిగాడు. దీనికి ప్రశాంత్‌పై ఓ రేంజ్లో ఫైర్ అయింది శోభా. దీనికి మీరు మళ్లీ దోస్తాన్ స్టార్ట్ చేసిర్రు.. నా కళ్లు ఇప్పడే తెరుచుకున్నాయి అన్నాడు ప్రశాంత్. దీనికి శోభా.. అవును బరాబర్ ఆ రోజు సేఫ్ గేమ్ ఆడింది పల్లవి ప్రశాంత్ అంటూ గట్టిగానే వాదించింది. దీంతో ప్రోమో ముగిసింది. ఎవరు, ఎవరినీ నామినేట్ చేశారనేది పూర్తి వివరాలు తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. -
శివాజీని చేతులెత్తి వేడుకున్న అమర్దీప్.. ఎందుకంటే?
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్ బాస్. ప్రస్తుతం సీజన్-7 12వ వారానికి చేరుకుంది. గతవారం ఎవరినీ ఎలిమినేట్ చేయని బిగ్‌బాస్.. ఈ వారంలో ఏకంగా డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని హింట్ ఇచ్చాడు. మరీ ఈ వారంలో ఎవరు బయటకు రానున్నారో తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే. అయితే ఈలోగా సేఫ్ అయ్యేందుకు ఉన్న అవకాశాల కోసం కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు. తాజా ఎపిసోడ్లో కెప్టెన్ కంటెండర్ పోటీని బిగ్ బాస్ నిర్వహించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. (ఇది చదవండి: స్టార్ హీరో వారసుడు తెరంగేట్రం.. డైరెక్టర్‌గా ఎవరంటే?) ప్రోమో చూస్తే అయితే ఈ పోటీలో చివరికీ అమర్, అర్జున్ మాత్రమే ఫైనల్‌గా కెప్టెన్ పోటీలో నిలిచినట్లు తెలుస్తోంది. గతవారంలో తృటిలో కెప్టెన్సీ కోల్పోయిన అమర్దీప్ బోరున ఏడ్చేసిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే తరహాలో హౌస్‌లో హంగామా చేశాడు. అమర్, అర్జున్ విషయంలో శివాజీ, శోభాశెట్టి తన అభిప్రాయాలు బిగ్‌బాస్‌కు వెల్లడించారు. కెప్టెన్సీ పోటీలో అర్జున్‌కు వ్యతిరేకంగా శోభాశెట్టి తన నిర్ణయాన్ని వెల్లడించింది. కెప్టెన్ అయ్యేందుకు నీకెంత అర్హత ఉందో.. అమర్‌కు అంతే ఉందని చెప్పింది. ఆ తర్వాత శివాజీ కెప్టెన్సీ పోటీలో అర్జున్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో అమర్దీప్, శివాజీని బతిమాలాడారు. ప్లీజ్ అన్న.. అర్థం చేసుకో.. ఇప్పుడు అవకాశం వచ్చింది.. పోగోట్టకన్నా.. నీకు దండం పెడతా అంటూ రెండు చేతులతో మొక్కాడు. నువ్వు కెప్టెన్ అవ్వడం కోసం ఏడుస్తున్నావేంట్రా? అని శివాజీ అన్నాడు. నేను కెప్టెన్ అవ్వాలన్నా అంటూ శివాజీని వేడుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు అమర్. కానీ చివరికీ నేను దేనికి పనికిరాను అంటూ అమర్ ఎమోషనలయ్యాడు. ఆ తర్వాత అమర్ ఫోటో మంటల్లో కాలిపోతూ ఉండగా ప్రోమో ముగిసింది. మరీ ఈ వారం కెప్టెన్సీ ఎవరినీ వరించిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. (ఇది చదవండి: ముసలి వెంట్రుక ఎంతపని చేసింది? వంకరబుద్ధి పోనిచ్చుకోని శివాజీ!) -
'నా లైఫ్‌లో ఎవ్వరూ ఇలా చేయలే'.. రైతు బిడ్డ ఎమోషనల్!
బిగ్ బాస్ సీజన్-7 పదకొండో వారానికి చేరుకుంది. ఇప్పటికే మొదటి రెండు రోజులు నామినేషన్ల ప్రక్రియతో హౌస్‌లో ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ వారం ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. రైతు బిడ్డ ప్రశాంత్ మాత్రమే నామినేట్ కాలేదు. ఇక నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బిగ్ బాస్ మరో కొత్త టాస్క్ ఇచ్చారు. కంటెస్టెంట్స్ మధ్య ర్యాంకుల పోటీ తీసుకొచ్చారు. మీలో మీరు కొట్టుకుని చావండి.. నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అన్నరీతిలో ర్యాంకింగ్ గొడవ తెచ్చారు. తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఆ ర్యాంకింగ్ పోటీ ఏ రేంజ్లో సాగిందో అర్థమవుతోంది. (ఇది చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి.. వీడియో వైరల్!) ప్రోమోలో పల్లవి ప్రశాంత్‌కు నంబర్‌వన్ ప్లేస్ ఇస్తానని శివాజీ చెప్పారు. దీంతో పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. నా లైఫ్‌లో ఎవ్వరు చేయలే.. అన్న చేసిండు.. పల్లవి ప్రశాంత్ సీజన్-7 ఫస్ట్ కెప్టెన్.. అంటూ గుండెలపై బాదుకున్నాడు. ఆ తర్వాత రతికా మాట్లాడుతూ.. ఫస్ట్ నాలుగు వారాలు నీ గేమ్ ఏమీ లేదు. నీకు ఒకరు హెల్ప్ చేస్తున్నది కనిపియట్లే. నీకు సొంతంగా ఆడుతున్నవో.. గ్రూపుగా ఆడుతున్నావో కనిపియట్లేదు అని అనడంతో.. అక్కా.. నువ్వు మా అమ్మ, బాపును తిట్టినవ్..గడ్డం గీకెస్తా అన్నావ్ అంటూ ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. ఇదేనా ఒక అమ్మాయికి ఇచ్చే మర్యాద అంటూ యావర్‌పై అశ్విని మండిపడింది. దీంతో వెంటనే అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు.. డోంట్ టీచ్ మీ దట్.. అని యావర్ అన్నాడు. ఆ తర్వాత మొదటి పది ర్యాంకుల్లో నిలిచిన వారికి బిగ్ బాస్ ఊహించని విధంగా షాకిచ్చాడు. ఈ సీజన్ ఉల్టా- పుల్టా అని మనకు తెలిసిందే. దీంతో ఆటలో వీకెస్ట్ అనిపించిన వారికే అంటే.. చివరి ఐదు స్థానాల్లో నిలిచిన వారికే ఎవిక్షన్ పాస్ పొందే అవకాశముందని ప్రకటించాడు. దీంతో ఎవిక్షన్ పాస్ కోసం ఐదుగురు కంటెస్టెంట్స్‌కు ఓ టాస్క్ ఇచ్చాడు. చివరి ఐదు స్థానాల్లో ఉన్న అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక పోటీపడ్డారు. మరీ ఈ గేమ్‌లో ఎవరు గెలిచారు? ఎవరినీ ఎవిక్షన్ పాస్ వరించిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే. (ఇది చదవండి: ఈ చిన్నారులిద్దరూ ఇప్పుడు హీరోహీరోయిన్స్.. గుర్తుపట్టారా?) -
అతను రైతుబిడ్డ.. నేను పాటబిడ్డ.. శివాజీని ఎప్పుడలా చూడలేదు!
బిగ్ బాస్ సీజన్-7 మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పదకొండో వారానికి చేరుకున్న తెలుగువారి రియాలిటీ షో ఈసారి మరింత సరికొత్తగా ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన భోలె షావలి పదో వారం ఎలిమినేట్ అయ్యారు. హోస్లో ఉన్నది కొద్ది వారాలే అయినా.. తన పంచ్‌లు, పాటలతో అందరినీ అలరించాడు. అయితే హౌస్‌లో ఉన్నన్ని రోజులు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌కు సపోర్ట్‌గా నిలిచాడనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన భోలె షావలి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పల్లవి ప్రశాంత్, శివాజీకి మద్దతుగా ఉన్నారన్న విషయంపై ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అదేంటో చూద్దాం. భోలె షావలి మాట్లాడుతూ..' నేను వైల్ట్ కార్డ్‌పై హౌస్‌లోకి వెళ్లా. కానీ నేను ప్రశాంత్ బిగ్ బాస్‌లోకి వెళ్లకముందే అతని వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నా. ఇది చూసిన ప్రశాంత్ క్లోజ్ ఫ్రెండ్ గన్ను అనే వ్యక్తి నన్ను అడిగాడు. సార్.. మీరు ఏంటి ఇలా పెట్టారని అడిగాడు. అవును.. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న నాకే ఆలాంటి ఐడియా రాలేదు. అలాంటిది అతను పోరాడుతుంటే ప్రోత్సహించడం నా ధర్మం అని చెప్పా. కట్ చేస్తే ఇద్దరం బిగ్‌బాస్‌లో ఉన్నాం. అతను రైతు బిడ్డ.. నేను పాట బిడ్డ అంతే. కానీ మీరు అలా అనుకుంటే నేను ఏం చేయలేను. శివాజీ, నేను ఇండస్ట్రీలో ఉన్నాం. ఆయన పెద్ద నటుడిగా ఉండి.. బిగ్ బాస్‌కు వెళ్లడమే గొప్ప. అంతే ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ వల్లే నేను అలా మారిపోయా. ఆయనను కంటెస్టెంట్‌గా ఎప్పుడూ చూడలేదు. శివాజీని ఒక హీరోలాగానే చూశాను. కానీ నేను హీరో అవుతానని మాత్రం ఎప్పుడు అనుకోలేదు.' అని అన్నారు. కాగా.. భోలె షావలి బిగ్‌బాస్‌లో తన మాటలు, పాటలతో ప్రేక్షకులను అలరించారు. -
'ఎవ్వరివీ అంత పెద్ద జాతకాలు కావు'.. రారా అంటూ ఊగిపోయిన అమర్!
ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి ఒక ఎత్తు అన్న మాటను అందరూ పాటిస్తున్నట్లు ఉన్నారు. బిగ్ బాస్ సీజన్-7లో పదకొండో వారం నామినేషన్స్ మొదలయ్యాయి. మొదటి రోజే బిగ్ బాస్ హౌస్‌ను గత వారంలో మహారాణుల పాత్ర పోషించిన నలుగురు హీటెక్కించేశారు. ఈసారి నామినేషన్ల పర్వంలో ఎప్పుడు లేనంతగా వాదనలు మొదలయ్యాయి. ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూ ప్రతి విమర్శలతో హాట్ హాట్‌గా సాగింది. రతికా, శోభా, ప్రియాంక, అశ్విని ఇలా వీరిలో ఎవరు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మరోవైపు రైతుబిడ్డ, అంబటి అర్జున్ మధ్య ఏకంగా చిన్నపాటి వార్ నడిచింది. ప్రస్తుతం పదిమంది కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్‌లో ఉండగా.. నామినేషన్ ప్రక్రియ రెండో రోజు కూడా కొనసాగనుంది. తాజాగా రెండో రోజుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవీ చూస్తే రెండో రోజు హౌస్ మరింత హాట్ హాట్‌గా సాగినట్లు కనిపిస్తోంది. నామినేషన్ సమయంలో అమర్దీప్, యావర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. యావర్‌ను నామినేట్ చేస్తూ.. గతం తవ్వుకుంటే ఎవ్వరివీ అంతా పెద్ద జాతకాలు కావు ఇక్కడ అని అమర్ అన్నాడు. వీరిద్దరి మధ్యలో రతికా ఎంటర్ కావడంతో అమర్ మరింత రెచ్చిపోయాడు. స్ప్రైట్ కోసం నామినేషన్ చేశావంటూ యావర్‌ను అమర్ అనడంతో.. నామినేషన్ కోసం అమర్ చెప్పే పాయింట్ రెండో, మూడో వారానిదా అని యావర్‌తో రతిక అన్నారు. దీంతో అమర్, యావర్ మధ్య ఫైట్ మొదలైంది. ఆ తర్వాత ఒకరినొకరు మీది మీదికి దూసుకొచ్చారు. రారా..నువ్వు రా.. అంటూ కొట్టుకున్నంత పనిచేశారు. దీంతో ఇద్దరి మధ్యలో శివాజీ ఎంటరై సర్ది చెప్పాలిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత అమర్ కావాలి.. అమర్ పోవాలి.. అంటూ గట్టిగా వెటకారంగా స్లోగాన్స్ ఇచ్చాడు అమర్. పాత విషయాన్ని గుర్తు చేసి.. నిజంగా వేయాలంటే.. నిన్ను అప్పుడే నామినేషన్స్‌లో వేసేసేవాడినని అమర్ అన్నారు. ఆ తర్వాత ఎమోషన్ ఇజ్ ది లూజ్ మోషన్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్.. ఆ ఫ్లోను మనం కంట్రోల్ చేయలేం అని గౌతమ్ అనగా.. అది కంట్రోల్ చేసుకోవాలిరా.. మంచిదిరా అని కెప్టెన్ శివాజీ అనడంతో ప్రోమో ముగిసింది. -
Bigg Boss 7 : అమ్మాయిలపై శివాజీ వెకిలి కూతలు.. ఇదేం పద్దతి బాసూ..?
బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్స్ ఏదైన తప్పు చేసిన.. తప్పుడు మాటలు మాట్లాడినా.. వీకెండ్లో హోస్ట్ నాగార్జున ఫుల్ క్లాస్ తీసుకుంటాడు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఎవరు నోరు జారినా.. సహించడు. అలాంటి నాగ్.. సీజన్ 7లో మాత్రం శివాజీ బూతు పదాలు వాడినా.. అబద్దాలు ఆడినా.. జస్ట్ లైట్ అంటూ పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. అతను చేసిన తప్పులను కూడా ధైర్యంగా చెప్పలేక..సున్నితంగా హెచ్చరిస్తున్నారు. అమ్మాయిలపై వెకిలి కూతలు బిగ్‌బాస్ హౌస్‌లో గేమ్ ఆడకుండా పదివారాల పాటు నెట్టుకొస్తున్న ఏకైక కంటెస్టెంట్స్ శివాజీ. ఇప్పటి వరకు హౌస్‌లో శివాజీ పొడిచిందేమి లేదు కానీ.. మాయ మాటలతో కంటెస్టెంట్స్‌ని బురుడి కొట్టిస్తూ నెట్టుకొస్తున్నాడు. చెప్పేవి శ్రీరంగ నీతులు..చేసేవి దొంగ పనులు అన్నట్లుగా శివాజీ ప్రవర్తన ఉటుంది. ఇతురులకేమో ఇలా మాట్లాడొద్దు.. అలా ఆడొద్దని చెబుతాడు..తన వరకు వస్తే మాత్రం వెంటనే మాట మారుస్తాడు. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో రాజమాతలుగా వ్యవహరించిన శోభ, రతిక, ప్రియాంక, అశ్వినిలను ఉద్దేశిస్తూ..బూతులు వ్యాఖ్యలు చేశాడు. తన మాటని వినకపోవడంతో ‘రాజ మాతలు..**** పగుల్తాయ్’ అంటూ అసభ్యకర పదాలు వాడాడు. అందంతా రికార్డు అయింది. దాన్ని శనివారం ఎపిసోడ్లో కూడా మళ్లీ ప్లే చేశారు. శివాజీ కాబట్టే.. అలాంటి బూతులు ఎవరైనా మాట్లాడితే.. నాగార్జున ఒంటికాలుపై లేస్తాడు. అమ్మాయిలను అలా అంటారా అంటూ రెచ్చిపోయి క్లాస్ పీకేవాడు. కానీ అక్కడ ఆ పిచ్చి కూతలు కూసింది శివాజీ కాబట్టి..సున్నితంగా హెచ్చరించి ముంగించేశాడు. ఇక మన నటరత్నం శివాజీ అయితే ఈజీగా మాట మార్చేస్తూ.. ‘నేనేదో సరదాగా అన్నాను బాబుగారు’ అంటూ కమల్ హాసన్ రేంజ్ ఫెర్పార్మెన్స్ ఇచ్చాడు. అది చూసి ఫిదా అయినా నాగ్..‘సరదాగానైనా సరే అలాంటి మాటాల్ని వాడకపోవడం మంచిది’అని సున్నితంగా హెచ్చరించి వదిలేశాడు. అయితే అక్కడే షో చూస్తున్న ఓ ప్రేక్షకుడు మాత్రం శివాజీ సరదాగా ఆ మాటలు అనలేదని, ఇప్పుడేదో వివరణ ఇచ్చుకునేందుకు అలా చెబుతున్నాడని, ఆయన కోపంతోనే అన్నట్లుగా వీడియో చూస్తే అర్థమవుతుందని చెప్పాడు. అతనొక్కడే కాదు.. షో చూస్తున్న ప్రేక్షకులందరికి శివాజీ మాటమార్చారనే విషయం అర్థం అయింది. కానీ నాగార్జున మాత్రం అతన్ని గట్టిగా హెచ్చరించలేకపోయాడు. ఇతరుకు మాస్ వార్నింగ్ ఇచ్చే నాగార్జున.. శివాజీకి మాత్రం ‘క్లాస్’ గా క్లాస్ తీసుకుంటున్నాడు. పోనీ..శివాజీ ఏమన్నా ఈ ఒక్కసారే అలా చేశాడా అంటే అదీ కాదు. గతంలో అనేకసార్లు ఇలాంటి బూతు వ్యాఖ్యలు చేశాడు. లెక్కలేనన్ని అబద్దాలు ఆడారు. గౌతమ్ కృష్ణ అప్పుడప్పుడు అతని నిజస్వరూపాన్ని బయటపెడతున్నాడు. కానీ శివాజీ మాత్రం తన నటనానుభవంతో తోటి కంటెస్టెంట్స్‌ని బురుడీ కొట్టిస్తున్నాడు. శివాజీ కోసమే ఆ టాస్క్? ఈ వారం కెప్టెన్సీ బరిలో శివాజీ, అర్జున్ ఉన్నారు. ఎలాంటి ఫిజికల్ టాస్క్ పెట్టిన అర్జున్ ఈజీగా గెలుస్తాడు. ఈ విషయం నాగార్జునతో పాటు బిగ్‌బాస్ నిర్వాహకులకు కూడా తెలుసు. అందుకే శివాజీని కెప్టెన్సీ చేయడం కోసం ఫిజికల్ టాస్క్ పెట్టకుండా హౌస్మేట్స్ నుంచి రహస్య అభిప్రాయ సేకరణ నిర్వహించారు. నిర్వాహకులు ఊహించినట్లే అంతా శివాజీకే ఓటు వేశారు. దీంతో వారనుకున్నట్లుగానే శివాజీని కెప్టెన్ అయ్యాడు. అయితే ఇక్కడ శివాజీ పొడిచిందేమి లేదనే విషయం షో చూస్తున్న ప్రేక్షకులందరికి తెలుస్తుంది. -
బిగ్ బాస్ సెంటిమెంట్ ప్లాన్.. ఆ కంటెస్టెంట్‌కు శాపమైందా?
బిగ్ బాస్ సీజన్-7 తొమ్మిది వారాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటి వరకు హాట్ హాట్‌గా సాగిన హౌస్.. ఈ వారం ఫుల్ ఎమోషనల్‌గా మార్చేశాడు బిగ్ బాస్. పదో వారంలో మొదటి రోజు నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన వెంటనే.. రెండో రోజు నుంచే కంటెస్టెంట్లకు సర్ప్రైజ్లు ఇచ్చారు. తొలిరోజే శివాజీ కుమారుడు, అర్జున్ భార్య, అశ్విని మదర్‌ను పంపి ఎమోషనల్ టచ్ ఇచ్చారు. ఆ తర్వాత రెండో రోజు గౌతమ్ తల్లి, ప్రియాంక ప్రియుడు శివ కుమార్, భోలే భార్యను హౌస్‌లో పంపి కంటెస్టెంట్స్‌ను ఏడిపించేశారు. (ఇది చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న హన్సిక మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?) అయితే మూడో రోజు కూడా హౌస్‌లో ఎమోషనల్ సీన్స్ మరింత పీక్స్‌కు చేరాయి. మూడో రోజు అమర్ భార్య, శోభాశెట్టి తల్లి, యావర్ బ్రదర్ వచ్చి కంటెస్టెంట్స్‌తో పాటు ఆడియన్స్‌ను సైతం కంటతడి పెట్టించారు. ముఖ్యంగా ప్రిన్స్ యావర్, తన బ్రదర్ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. అమ్మ ప్రేమను గుర్తు చేసుకుంటూ ఏడ్చేశారు. మొత్తానికి ఈ వారంలో టాస్కులు, గేమ్స్ లేకుండా పూర్తిగా ఫ్యామిలీ వీక్‌గా మార్చేశారు బిగ్ బాస్. ఇప్పటివరకు మిగిలింది ఇద్దరు కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. హౌస్‌లో ఉన్న రైతుబిడ్డ, రీ ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్ కుటుంబ సభ్యులు రావాల్సి ఉంది. వీరిద్దరికి సంబంధించి శుక్రవారం సర్ప్రైజ్ ఇచ్చే అవకాశముంది. అయితే ఫ్యామిలీ ఎమోషన్ పక్కన పెడితే.. అందరి దృష్టి ఈ వారం ఎలిమినేట్ ఎవ్వరనే దానిపైనే ఉంది. గతవారంలో చివరికీ దాకా వచ్చి రతికా రోజ్ సేఫ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వారం నామినేషన్స్‌లో శివాజీ, యావర్, గౌతమ్, రతికా, భోలె మాత్రమే ఉన్నారు. ఇక ఓటింగ్‌కు ఒక్క రోజు మాత్రమే సమయముంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీతో శివాజీ, యావర్, గౌతమ్, భోలెకు గ్రాఫ్ పెరగడంతో పాటు ఓటింగ్ శాతం మెరుగయ్యే అవకాశముంది. కానీ గతవారమే తృటిలో ఎలిమినేషన్ తప్పించుకున్న రతికా కుటుంబ సభ్యులు ఇంకా హౌస్‌లోకి రాలేదు. దీని ప్రభావం రతికా ఎలిమినేషన్‌పై పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శుక్రవారం రతికా కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వచ్చినా అంతగా వర్కవుట్ కాదు. ఎందుకంటే ఓటింగ్ సమయం రేపటితోనే ముగియనుంది. పల్లవి ప్రశాంత్ నామినేషన్స్‌లో లేడు కాబట్టి.. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడొచ్చినా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. దీంతో ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ వీక్ రతికాపైనే ఎక్కువ ప్రభావం చూపనుంది. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఆమె పేరే ముందుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీ సెంటిమెంట్‌తో కంటెస్టెంట్స్‌ను ఏడిపించిన బిగ్ బాస్.. ఎవరినీ బయటికి పంపిస్తాడో వేచి చూద్దాం. (ఇది చదవండి: తల్లి కాళ్ల మీద పడ్డ శోభ.. ఏడిపించేసిన ప్రిన్స్ యావర్ బ్రదర్స్..) -
హౌస్ ఫుల్ ఎమోషన్.. బిగ్ బాస్‌లో సీమంతం వేడుకలు!
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7లో మరో వారం మొదలైంది. ఇప్పటికీ తొమ్మిది వారాలు పూర్తి కాగా.. గత వారంలో టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యారు. సోమవారం రాగానే హౌస్‌లో నామినేషన్ల పర్వం మొదలవుుతంది. నామినేషన్ల మొదటి రోజే కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ సారి కాస్తా ప్రత్యేకంగా మహారాజ్యంలో జరుగుతాయని తెలిపారు. దీంతో నామినేషన్స్ ప్రక్రియ కాస్తా ఆసక్తిని పెంచింది. అలా ఈ వారంలో జరిగిన నామినేషన్స్‌లో ఏర్పాటు చేసిన రాజ్యంలో శోభ, ప్రియాంక, అశ్విని, రతికలను రాజమాతలుగా ప్రకటించాడు. శంఖారావం వచ్చిన ప్రతిసారి ఇద్దరు కంటెస్టెంట్లు కత్తులను బయటకు తీసి.. మిగిలిన వారిలో ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పాలి. ఆ ఇద్దరిలో ఎవరి నామినేషన్ సబబు అనిపిస్తే వారిని రాజమాతలు నేరుగా నామినేట్ చేస్తారు. అయితే ఈ వారంలో భోలె షావళి, శివాజీ, గౌతమ్, ప్రిన్స్ యావర్, రతిక రోజ్ నామినేషన్స్‌లో నిలిచారు. ఇక నామినేషన్స్ ప్రక్రియ పూర్తవడంతో బిగ్ బాస్ హౌస్‌ను ఫుల్ ఎమోషనల్‌గా మార్చేశారు. ఈ వారంలో కంటెస్టెంట్స్‌కు ఊహించని సర్ప్రైజ్లతో ముందుకొచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో శివాజీ కుమారుడిని డాక్టర్‌గా పంపించి హౌస్‌లో ఎమోషన్ పండించారు. శివాజీకి సర్ప్రైజ్ తాజాగా రిలీజైన ప్రోమోలో మరో కంటెస్టెంట్ అంబటి అర్జున్‌కు బిగ్ బాస్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన భార్య సురేఖ హౌస్‌లోకి తీసుకొచ్చారు. దీంతో తన భార్యను చూసిన అర్జున్ ఫుల్ ఎమోషనలయ్యాడు. భార్య, భర్తల అనుబంధం ఏంటనేది వీళ్లిద్దరి చూస్తే తెలిసిపోతుంది. హౌస్‌లో అడుగుపెట్టిన అర్జున్ భార్య.. భర్తకు గోరుముద్దలు తినిపించింది. నీ ఎమోషన్స్‌ను బయటపెట్టు.. నువ్వు సరిగా రియాక్ట్ అవ్వట్లేదంటూ తన భర్తకు సలహాలు కూడా ఇచ్చింది. ఇది చూసిన శివాజీ.. దిస్ ఇజ్ లైఫ్ అంటూ కొటేషన్ ఇచ్చేశాడు. అర్జున్ భార్యకు సీమంతం అయితే ప్రస్తుతం అర్జున్ భార్య గర్భంతో ఉన్నట్లు తెలుస్తోంది. హోస్లో అడుగుపెట్టిన ఆమెకు కంటెస్టెంట్స్ అందరూ కలిసి సీమంతం వేడుక నిర్వహించారు. హౌస్మేట్స్ ఎంతో సంతోషంగా ఆమెకు సీమంతం నిర్వహించడంతో అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నారు. భార్య సీమంతం చూసి చిన్న పిల్లాడిలా ఏడుస్తూ కనిపించారు. ఆ తర్వాత ఆమె హౌస్ నుంచి బయటకెళ్తుండగా ఫుల్ ఎమోషనలయ్యారు. ఈ ప్రోమోలు చూస్తే మొత్తానికి బిగ్ బాస్ హౌస్‌ను ఫుల్ ఎమోషనల్‌గా మార్చేశారు. View this post on Instagram A post shared by Nagarjuna Reddy Ambati (@ambati_arjun) -
Bigg Boss 7 : శివాజీ వారిని చెడగొడుతున్నాడు.. మానస్
బిగ్‌బాస్ సీజన్ 7 ఇప్పుడిప్పుడే కాస్త రసవత్తరంగా మారుతోంది. కంటెస్టెంట్స్ అంతా కాస్త సీరియస్‌గా గేమ్స్ ఆడుతున్నారు. పోటీలో గెలిచేందుకు వందశాతం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకే ఒక కంటెస్టెంట్ మాత్రం సీజన్ ప్రారంభం నుంచి గేమ్ ఆడట్లేదు. అతనే శివాజీ. ప్లేయర్‌గా హౌస్‌లోకి వెళి కోచ్‌గా అవతారమెత్తాడు. పోని అలా అయినా న్యాయంగా ఉంటున్నాడా అంటే.. ‘అబ్బే..మనవి మాటలే’ అంటున్నాడు. నీతి ముచ్చట్లు చెప్పడమే కానీ..పాటించడం మన హిస్టరీలోనే లేదంటున్నాడు. ఇతరులకు ఓ న్యాయం తనకో న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అయితే హౌస్‌లో అంతా అతని మాయ మాటలకు పడిపోతే.. గౌతమ్ కృష్ణ మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా శివాజీ నిజస్వరూపం బయటపెడుతున్నాడు. మరోవైపు అమర్దీప్ కూడా ఆ ప్రయత్నం చేస్తున్నాడు కానీ.. శివాజీ తెలివిగా వ్యవహరిస్తూ..అతన్ని బకరా చేస్తున్నారు. ఈ విషయం షో వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఈజీగా అర్థమవుతుంది. తాజాగా బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ మానస్ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. శివాజీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శివాజీ లాంటి కంటెస్టెంట్‌ని చూడలేదు: మానస్ బిగ్‌బాస్ షోలో అమర్దీప్, శివాజీల మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. ప్రతిసారి చిన్న చిన్న కారణాలు చెప్పి అమర్‌దీప్‌ని నామినేట్ చేస్తున్నాడు శివాజీ. అంతేకాదు తనకు నచ్చినవాళ్లు తప్పు చేస్తే సమర్థిస్తాడు.. అదే అమర్దీప్, గౌతమ్ కృష్ణ చిన్న మిస్టేక్ చేసినా..దాన్ని భూతద్దంలో పెట్టి ప్రచారం చేస్తాడు. పైగా తెలివిగా హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్స్‌కి కూడా తన అభిప్రాయాన్ని రుద్దే ప్రయత్న చేస్తాడు. తాజగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని మానస్ చెప్పాడు. ‘ప్రతీ సీజన్లో శివాజీ లాంటి విలన్స్ ఉంటారు. కానీ హీరో ఎవరనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. శివాజీ కేవలం ఇద్దరి పట్ల మాత్రమే వ్యక్తిగత ఇష్టం చూపిస్తున్నాడు. మిగిలిన కంటెస్టెంట్ల గేమ్ చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటివరకు నేను రకరకాల మైండ్ సెట్ ఉన్నవాళ్లను చూశాను. కానీ శివాజీ లాంటి కంటెస్టెంట్‌ను ఇప్పటివరకు చూడలేదు’అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. -
నీకిష్టమొచ్చినట్లు చేయాలంటే కుదరదు.. కెప్టెన్‌కు శివాజీ కౌంటర్!
బిగ్ బాస్ సీజన్- 7 తొమ్మిదో వారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే నామినేషన్స్‌లో ఉన్నవాళ్లకి ఎలిమినేషన్ టెన్షన్ మొదలైంది. ఈ వారం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అయితే ప్రస్తుతం హౌస్‌లో రెండు టీమ్స్ మధ్య ఛాలెంజ్‌ల పర్వం కొనసాగుతోంది. కెప్టెన్సీ కంటెండర్‌షిప్ టాస్క్ నడుస్తుండగా ఇరు జట్ల మధ్య వాదనలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. (ఇది చదవండి: రాహుల్ గురించి రతికనే చెప్పింది.. బిగ్ బాస్ విన్నర్ అతనే గ్యారెంటీ: దామిని) కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం బిగ్‌బాస్ బాల్స్ టాస్క్ ఇచ్చాడు. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. టాస్క్‌లో భాగంగా గౌతమ్ టీం బిగ్‌బాస్ ఓ స్పెషల్ పవర్ ఇచ్చాడు. గౌతమ్ టీం దగ్గర బాల్స్‌తో.. అవతలి టీం వద్ద ఉన్న బాల్స్‌ను మార్చుకోవచ్చని ఆఫర్ ఇచ్చాడు. దీంతో గౌతమ్ టీం సభ్యులు ఎగిరి గంతేశారు. అయితే బిగ్‌బాస్ నిర్ణయంపై శివాజీ కాస్తా అసహనం ప్రదర్శించారు. గోల్డెన్ బాల్ వాళ్లకే, అన్ని వాళ్లకేనా బిగ్ బాస్ అంటూ తనలో తాను మాట్లాడుకున్నారు. అయితే బాల్స్ మార్చుకునే సమయంలో శివాజీ, కెప్టెన్ గౌతమ్ మధ్య మాటల యుద్ధం తలెత్తింది. మీకు తగినట్లు రూల్స్ మార్చుకుంటే మీరే ఆడుకోండన్న అంటూ గౌతమ్ అనడంతో.. మధ్యలో నేను మాట్లాడతా అన్న కదా అంటూ ప్రియాంక చెప్పింది. ఆ తర్వాత నీకిష్టమొచ్చినట్లు చేయాలంటే ప్రతిసారి చేయం మేము.. ఏం చేయాలో బిగ్ బాస్ చెప్తాడు కదా.. అంతవరకు ఆగలేవా నువ్వు? నీకు అనుకూలంగా ఉన్నప్పుడేమో చాలా సైలెంట్‌గా ఉంటావ్.. అని శివాజీ ఫైరయ్యాడు. దీంతో నేను ఏం తప్పు చేశానో చెప్పండి అంటూ గౌతమ్ ప్రశ్నిస్తాడు. నీతో నేను మాట్లాడలేనమ్మా.. కావాలనే వాదన పెట్టుకుంటావా? అని శివాజీ అనడంతో.. ఇక్కడ ఎవరికీ అలాంటి అవసరం లేదన్న అని గౌతమ్ అనడంతో అక్కడితో ప్రోమో ముగుస్తుంది. బాల్స్ టాస్క్‌లో మాత్ర బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టులతో మరింత రసవత్తరంగా మారింది. హౌస్‌లో ఏం జరగనుందో ఇవాల్టి ఎపిసోడ్ చూస్తేనే క్లారిటీ వస్తుంది. (ఇది చదవండి: సినిమా రిలీజ్.. ఏడుస్తూ వీడియో షేర్ చేసిన హీరోయిన్!) -
శివాజీ మీద పైచేయి సాధించిన అమర్
బిగ్ బాస్ నామినేషన్స్ ఈ వారం చాలా ఫన్నీ రీజన్స్‌తో ముగిసింది. మంగళవారం జరిగిన నామినేషన్లో యావర్ మాస్టర్ ప్లాన్ వేసి అశ్వినిని నామినేషన్లోకి తీసుకొచ్చాడు. నామినేషన్లో పసలేని కారణాలతో రతికా రోజ్, అశ్వినిలు ఉన్నారని చెప్పవచ్చు. కానీ ఈ వారం నామినేషన్ ప్రక్రియలో శివాజీ మీద అమర్ పైచేయి సాధించాడు. ఆ కథేంటో మంగళవారం జరిగిన ఎపిసోడ్లో ఏం జరిగిందో Day 58 హైలెట్స్ ఇప్పుడు చూద్దాం. సోమవారం ఎపిసోడ్లో ప్రశాంత్ ,ప్రియాంక,అర్జున్ ,శివాజీ,రతిక, తేజ, భోలె నామినేషన్ ప్రక్రియలో పాల్గొని వారికి నచ్చని ఇద్దరి పేర్లు చెబుతూ ఎలిమినేషన్ లిస్ట్‌లో చేర్చారు. మంగళవారం ఎపిసోడ్లో మొదట శోభ నామినేషన్ విదానాన్ని ప్రారంభంచింది. శోభ సరైన కారణాలతో రతికా రోజ్‌ను నామినేట్ చేసినా వాటిని తిప్పకొట్టడంలో రతిక విఫలమైంది. లాజికల్ పాయింట్లు లేకుండా రతిక మాట్లాడిన మాటలు చిరాకు తెప్పించాయి. ఆడియన్స్‌కు బాగా దొరికి పోతున్నావని ఒకానొక సమయంలో తేజ కలుగచేసుకుని రతికా రోజ్‌ను హెచ్చరిస్తాడు. అయినా ఆమె వినకుండా మరింత రెచ్చిపోయి పసలేని కారణాలు శోభకు చెప్పి రతిక ప్రేక్షకులకు దొరికిపోయింది. ఆ తర్వాత యావర్‌ను సరైన కారణంతో శోభ నామినేషన్ చేయడంతో ఆయన ఎటువంటి మాటలు మాట్లడకుండా స్వీకరిస్తాడు. యావర్‌తో అశ్విని ఫైట్ యావర్ మొదటగా శోభను నామినేషన్లో చేర్చగా వారిద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదం జరగలేదు. దానికి ప్రధాన కారణం యావర్ చెప్పిన సరైన పాయింట్లకు ఆమె నుంచి ఎలాంటి సమాధానం లేకుండాపోయింది. ఆ తర్వాత అశ్విని పేరును యావర్ లేవనెత్తుతాడు. ఆటలో కన్ఫ్యూజ్ అవుతున్నావని హౌస్‌లో ఉండాలంటే ఆట తీరును ఆర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని ఇవేవి నీలో లేవని అశ్వినికి తెలిపి యావర్ నామినేషన్ చేస్తాడు. అందుకు ఉదాహరణగా గతంలో అమర్‌ను నామినేట్ చేస్తానని చెప్పి ఆ తర్వాత ఫ్లిప్ అయి అర్జున్ను నామినేషన్ చేయడం ఏంటని యావర్ ప్రశ్నించాడు. అలా యావర్ చెప్పిన ఐదు పాయింట్లలో నాలుగు సరైనవే అనేలా ఉన్నాయి. కానీ సందీప్ మాస్టర్‌కు ఒక టాస్క్‌లో అశ్విని వాటర్ పోస్తుంది. దానిని యావర్ తప్పుబడుతూ నామినేట్ చేస్తాడు. ఇందులో ఏ మాత్రం పసలేదని తెలుస్తోంది. వారిద్దరి మధ్య నామినేషన్ ప్రక్రియ చాలా ఫన్నీగా జరుగుతుంది. శివాజీ మీద పైచేయి అమర్ చేసిన నామినేషన్లలో ఈ వారం శివాజీపై పైచేయి సాధించాడని చెప్పవచ్చు. శివాజీని ఉద్దేశిస్తూ.. అన్నా మీకు నేను ఎందుకు నచ్చనో అలాగే మీరు కూడా నాకు నచ్చరు అని ఓపెన్‌గానే చెబుతాడు అమర్. ఆటలో నేను మాత్రమే అరుస్తున్నాని, కేకలు వేస్తున్నానని ప్రతిసారి నన్ను నామినేషన్ చేస్తున్నావ్.. అలాగే నీ పక్కన ఉన్నవారు కూడా నామినేషన్ సమయంలో కేకలు వేస్తున్నారు కదా వారిని ఎందుకు హెచ్చరించరని సరైన పాయింట్‌ను శివాజీకి అమర్ వేశాడు. అప్పుడు శివాజీ కూడా వాళ్లకు వార్నింగ్ ఇచ్చాను.. చెబుతున్నాను అంటాడు. అలా చెప్పడం కాదన్నా.. నాకు ఎలా చెప్పారో వాళ్లను కూడా నామినేషన్లో నిలబెట్టి చెప్పండి అని అమర్ తెలుపుతాడు. దీంతో ఇబ్బంది పడ్డ శివాజీ ఆన్సర్ చెప్పలేక సైడ్ అయిపోతాడు. అలాగే సందీప్ మాస్టర్‌ను ఇంటి నుంచి పంపించావ్ అని తేజను నామినేట్ చేస్తాడు శివాజీ.. మరి సందీప్ మాస్టర్‌ను ఎలిమినేషన్ లిస్ట్‌లో పెట్టిన యావర్‌ను మాత్రం ఒక మాట కూడా అనలేకపోయాడు శివాజీ. ఇలా ఈ వారంలో శివాజీ దొరికిపోయాడు. ఈ వారం నామినేషన్లో ఉండేది వీళ్లే 1. అమర్ దీప్ 2. రతికా రోజ్ 3. శోభ శెట్టి 4. ప్రియాంక జైన్ 5. అర్జున్ 6. టేస్టీ తేజ 7. భోలే షావలి 8. ప్రిన్స్ యావర్ -
శివాజీ ఎమోషనల్ వీడియో.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
తెలుగువారి రియాటిటీ షో బిగ్‌బాస్ సీజన్-7 ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే ఈ షో 54 రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా కొనసాగుతోంది. అయితే అందరూ పెద్దన్నగా అడుగుపెట్టిన శివాజీ అదే పాత్రను హౌస్‌లో చక్కగా పోషిస్తున్నారు. ఇప్పటివరకు పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్‌కు మద్దతుగా నిలుస్తున్నాడని నెటిజన్స్ కూడా చాలాసార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే ఈ షో మొదలై ఏడు వారాలు పూర్తి కాగ.. ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారంలో మరొక కంటెస్టెంట్ ఇంటిదారి పట్టేందుకు రెడీగా ఉన్నారు. (ఇది చదవండి: టైగర్-3 ట్రైలర్.. ఆ ఒక్క ఫైట్ సీన్‌కు అన్ని రోజులు పట్టిందా?) శివాజీ చేతికి గాయం అయితే గతంలో శివాజీ చేతికి గాయం కావడంతో చికిత్స అందించారు. కొన్ని రోజుల చికిత్స తర్వాత మళ్లీ హౌస్‌లో అడుగుపెట్టారు. అయితే ఆ సమయంలో శివాజీ మాట్లాడిన ఓ వీడియోను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తన అధికారిక ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో శివాజీ మాట్లాడుతూ ఫుల్ ఎమోషనలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో శివాజీ మాట్లాడుతూ.. 'ఎవరు లేకపోతే నేనే ఏడుస్తున్నా. ఎవరైనా ఉంటే నవ్వుతూ లోపల ఏడుస్తున్నా. వాళ్లందరి ముందు నేను ఏడవలేకపోతున్నా. ఎందుకంటే అది నాకు చాలా బరువుగా ఉంది.' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఇదంతా చూసిన నెటిజన్స్ కొందరు ఆయనకు మద్దతుగా కామెంట్స్ పెడితే.. మరికొందరేమో చాలా దారుణంగా ట్రోల్ చేశారు. ఓ నెటిజన్ రాస్తూ.. శివాజీ పెద్ద కన్నింగ్ ఫెలో అంటూ పోస్ట్ చేశారు. నిజంగానే శివాజీ అన్న పెద్ద యాక్టర్ అంటూ కామెంట్ చేశాడు. బయట జరుగుతున్నవి తెలిస్తే శివాజీ అన్న ఏమైపోతాడో అని మరో నెటిజన్ రాసుకొచ్చారు. సింపథీ స్టార్, కన్నింగ్ ఫెలో అని ఒకరంటే.. చాలు చాలు.. ఇక ఓవరాక్షన్ ఆపు అంటూ చాలా దారుణంగా ట్రోల్స్ చేశారు. కాగా.. ఈ వారంలో హౌస్‌లో నామినేట్ అయినవారిలో శివాజీ కూడా ఉన్నారు. అయితే తక్కువ ఓట్లు వచ్చిన శోభాశెట్టి, సందీప్ చివరి రెండుస్థానాల్లో నిలిచారు. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాల్సిందే. (ఇది చదవండి: ప్రశాంత్, శివాజీ ముందే ప్లాన్.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటరాజ్) View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel) -
శివాజీ ఆడట్లేదు.. అతడు క్యారెక్టర్ వదిలేశాడు!: పూజా
టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్లో మొదటి నుంచి మహిళా కంటెస్టెంట్స్‌ను ఎలిమినేట్ చేస్తూ వచ్చిన బిగ్ బాస్.. 2.0లోనూ అదే సాంప్రదాయం కొనసాగించారు. వరుసగా ఏడో వారంలోనూ లేడీ కంటెస్టెంట్ పూజా మూర్తిని ఎలిమినేట్ చేశారు. అయితే హౌస్ నుంచి బయటకొచ్చిన పూజా.. కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె చాలా విషయాలు పంచుకుంది. శివాజీ వల్లే ఆ ఇద్దరు ఆడుతున్నారా? అని యాంకర్ ప్రశ్నించగా.. పూజా ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చింది. (ఇది చదవండి: నాలుగు కోట్ల కారు కొన్న స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!) 'పల్లవి ప్రశాంత్, యావర్‌కు శివాజీ సపోర్ట్‌గా ఉన్నారు. అంటే వాళ్ల గేమ్ వాళ్లు ఆడుతున్నారు. మనం కేవలం కొంతవరకు పుష్ చేయగలం. కానీ శివాజీ మాత్రం కాస్త ఎక్కువే సపోర్ట్ చేస్తున్నారు. వారంతా కలిసి బ్యాలెన్స్డ్గానే ఉన్నారు. వీళ్లిద్దరికైతే అందరికంటే ఎక్కువ మద్దతు ఇస్తున్నారు. తను ఆడట్లేదు, కానీ ఆడిస్తున్నాడు. ఆడట్లేదని చెప్పి నామినేట్ చేస్తే మాత్రం అసలు ఒప్పుకోడు. ఇక అమర్దీప్ నాకు బయట కూడా బాగా తెలుసు. కానీ హౌస్‌లోకి వెళ్లాక పూర్తిగా మారిపోయాడు. తన ఒరిజినల్ క్యారెక్టర్‌ను వదిలేశాడు. నేను అందగాన్ని అంటూ రెచ్చిపోయే అమర్.. అక్కడ పూర్తిగా డీలా పడిపోయాడు. నేను అతనితో కలిసి పనిచేశా. నేను చూసిన అమర్.. లోపల కనిపిస్తున్న అమర్ వేరు. అతను తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు' అని తెలిపింది. (ఇది చదవండి: స్టార్ కమెడియన్ కూతురు బర్త్ డే.. హాజరైన అగ్ర హీరోలు!) -
బిగ్‌బాస్ నుంచి శివాజీ ఔట్.. మళ్లీ వచ్చే ఛాన్స్ ఉందా?
బిగ్‌బాస్ సీజన్ 7లో వివాదాస్పద కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన శివాజీ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు అనేకంటే పంపేశారు అని చెప్పడం కరెక్ట్. ఆదివారం ఎపిసోడ్ ముగిసిన తర్వాత చూపించిన ప్రోమోలో ఈ విషయం కనిపిస్తుంది. నయని పావని ఎలిమినేషన్ అయిన తర్వాత సడెన్‌గా శివాజీ కన్ఫెషన్ రూమ్‌లో కనిపించాడు. శివాజీ మిమ్మల్ని బయటికి తీసుకువెళ్లడం జరుగుతుందని ఆ సమయంలో బిగ్‌బాస్ చెప్పాడు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) దీంతో శివాజీ కూడా బయటికి వచ్చి అక్కడే ఉన్న హౌస్‌మెట్స్‌తో నేను బయటికి వెళ్తున్నాను అని చెప్తాడు. దీంతో కంటెస్టెంట్లు అందరూ శివాజీని వెళ్లొద్దని ఆపే ప్రయత్నం చేశారు. కానీ.. అదే సమయంలో డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఆ వెంటనే శివాజీ బయటికి వెళ్లిపోయాడు. గేట్స్ క్లోజ్ అయిపోయాయి. దీంతో ఆట నుంచి ఆయన బయటకు వచ్చేసినట్లే శివాజీ మళ్లీ వచ్చే ఛాన్స్ ఉందా ఐదో వారం కెప్టెన్సీ టాస్క్ లో బాగంగా వైర్స్ కింద నుంచి పాకుతూ వెళ్లే గేమ్‌లో శివాజీ గాయపడ్డాడు . దీని తర్వాత ఆయన పెద్దగా టాస్క్‌లలో పాల్గొనలేదు. భుజం చెయ్యి నొప్పి భరిస్తూనే హౌస్‌లో కొనసాగాడు. బిగ్‌బాస్‌లో ఎవరికైనా ఇలాంటి చిన్న ఇబ్బందికి గురైతే షో యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. గాయంతో ఇబ్బంది పడుతున్న శివాజీకి వైద్యులు సలహా మేరకే ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చి ఉంటారని తెలుస్తోంది. నేడు ఆయనకు వైద్యుల సమక్షంలో ఆయన చేతికి ఎక్స్‌రే వంటివి తీసి చికిత్స అందిస్తారని సమాచారం. వీలైతే ఆయన్ను సీక్రెట్ రూమ్‌లో మరో రెండురోజుల పాటు విశ్రాంతి కల్పించి మళ్లీ హౌస్‌లోకి తప్పకుండా వస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో బిగ్‌బాస్-3 సీజన్లో కూడా నూతన్ నాయుడు చేతికి గాయం అయితే రెండురోజులు విశ్రాంతి ఇచ్చి మళ్లీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సో ఈ లెక్కన శివాజీ బిగ్‌బాస్‌లోకి మంగళవారం లేదా బుధవారం తప్పకుండా రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని తెలుస్తోంది.