ఆ కంటెస్టెంట్స్‌కు బిగ్‌ బాస్‌ బిగ్‌ షాక్‌.. అదేంటో తెలుసా? | Bigg Boss Telugu Season 7 Latest Promo Released Goes Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu Promo: 'మనం బాగుపడకపోయినా ఫర్వాలేదు'.. శివాజీపై శోభాశెట్టి ఫైర్!

Oct 3 2023 1:47 PM | Updated on Oct 4 2023 11:03 AM

Bigg Boss Telugu Season Latest Promo Released Goes Viral - Sakshi

ఇప్పటికే బిగ్ బాస్‌ తెలుగు సీజన్‌-7 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి కాగా.. నలుగురు కంటెస్టెంట్స్ హౌస్‌ నుంచి బయటకొచ్చేశారు. ఇక ఐదోవారం మొదలవ్వగానే బిగ్‌ బాస్ కంటెస్టెంట్స్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు పవర్ అస్త్రను సొంతం చేసుకున్న కంటెస్టెంట్స్ నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు. అయితే ఐదోవారం మొదటి రోజే పవరాస్త్రాలను బిగ్ బాస్‌ వెనక్కి తీసుకున్నారు. దీంతో హౌస్‌లో ఈ వారంలో నామినేషన్స్ మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ఇప్పటికే ఈ రోజుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రోమోలో పవరాస్త్రాలను వెనక్కి తీసుకున్న తర్వాత కంటెస్టెంట్స్ రియాక్షన్‌ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.

(ఇది చదవండి: 'బిగ్‌బాస్'కే నీతులు చెబుతున్న శివాజీ.. హౌస్‌లో ఇకపై కష్టమే!)

ప్రోమో ప్రారంభంలోనే శుభశ్రీ, గౌతమ్‌ మధ్య రొమాంటిక్ సీన్స్‌తో మొదలైంది. నేను మాట్లాడికే ఇష్టం లేదా అంటూ గౌతమ్‌ను ప్రశ్నిస్తుంది శుభశ్రీ. దీనికి గౌతమ్ లాయల్టీ ఉంది కాబట్టి భరిస్తున్నా అంటాడు.  ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ.. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. కాఫీ కూడా ఇవ్వలేని బతుకా నాది అనిపిస్తుంది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్‌గా మారిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్‌ పవరాస్త్రాలను తిరిగివ్వాలని ఆదేశిస్తాడు. దీంతో ఆట సందీప్, పల్లవి ప్రశాంత్, శోభాశెట్టి తమ పవరాస్త్రాలను బిగ్ బాస్‌ చెప్పిన విధంగానే ఓ పెట్టెలో భద్రపరుస్తారు.

దీంతో ఆ ముగ్గురి పవరాస్త్రాలు పోవడంతో శివాజీ అవహేళనగా మాట్లాడతాడు. శివాజీ హేళన చేయడం శోభాశెట్టికి ఆగ్రహం తెప్పిస్తుంది. కొందరు ఉంటారు.. మనం బాగుపడకపోయినా ఫరవాలేదు.. పక్కవాడు మాత్రం అస్సలు బాగుపడకూడదు అనేవాళ్లు అంటూ శివాజీని ఉద్దేశించి మాట్లాడింది. అయితే ఇప్పటికే శివాజీ తన పవర్‌ అస్త్రను కోల్పోయిన సంగతి తెలిసిందే.  ఈ ప్రోమో చూస్తే ఇక ఈ వారంలో ఇప్పటికే నామినేషన్స్‌ మొదలవగా.. దీంతో మిగిలిన కంటెస్టెంట్స్‌ను కూడా నామినేట్ చేసే అవకాశం వచ్చింది. మరీ ఈ వారంలో ఎవరూ సేఫ్ అవుతారో.. ఎవరెవరు నామినేషన్స్‌లో నిలుస్తారో వేచి చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement