పిచ్చి పిచ్చి నామినేషన్స్‌ ప్రాసెస్‌ కాదిక్కడ?.. ఓ రేంజ్‌లో రతిక ఫైర్! | Bigg Boss Second Week Nominations Heat In House Season 7 - Sakshi
Sakshi News home page

Bigg Boss: పిచ్చి పిచ్చి నామినేషన్స్‌ ప్రాసెస్‌ కాదిక్కడ?.. ఓ రేంజ్‌లో రతిక ఫైర్!

Published Tue, Sep 12 2023 5:08 PM | Last Updated on Tue, Sep 12 2023 6:25 PM

Bigg Boss Second Week Nominations Heat In House Season 7 - Sakshi

తెలుగు ప్రేక్షుకులను అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఈ సీజన్‌లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హోస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా తొలిరోజు నుంచే ఆసక్తి నెలకొంది. అంతే కాకుండా బిగ్‌బాస్‌-7 సీజన్‌ ఈసారి ఉల్టా పల్టాగా ఉంటుందని ప్రకటించిన నాగార్జున ఈ షోపై మరింత హైప్ క్రియేట్ చేశారు. అయితే తొలివారం అంతంత మాత్రంగానే అలరించిన కంటెస్టెంట్స్.. రెండోవారం వచ్చేసరికి విమర్శలతో షోను రసవత్తరంగా మార్చేశారు. దీంతో రెండోవారం నామినేషన్స్ ప్రక్రియ హాట్‌ హాట్‌గా మారింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్స్‌ మధ్య రణరంగం మొదలైంది. తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే హౌస్‌లో పరిస్థితి అర్థమవుతోంది. 

వాడీవేడీగా నామినేషన్స్
  
రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్‌ ప్రక్రియ చాలా వాడీవేడీగా కొనసాగుతోంది. శక్తి అస్త్రాను సొంతం చేసుకున్న సందీప్‌ ఐదు వారాల పాటు సేవ్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. ఈ వారం ఒకరిని నేరుగా నామినేట్‌ చేసే అవకాశాన్ని సందీప్ సొంతం చేసుకున్నాడు.  ప్రిన్స్‌ యావర్‌ను సందీప్‌ అతడిని నామినేట్‌ చేశాడు. సందీప్‌.. ప్రిన్స్‌ యావర్‌ను నామినేట్‌ చేయడంతో మిగిలినవాళ్లు అతన్ని నామినేట్‌ చేసేందుకు వీల్లేదని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. 

పల్లవి ప్రశాంత్‌పై చర్చ

టేస్టీ తేజను శుభశ్రీ, రతికా రోజ్‌, పల్లవి ప్రశాంత్‌ నామినేట్‌ చేయగా.. శివాజీని అమర్‌దీప్‌, ప్రియాంకజైన్‌, షకీలా, శోభాశెట్టి, దామినిలు నామినేట్‌ చేశారు. నామినేషన్ సమయంలో వారి మధ్య తీవ్ర చర్చ జరిగింది. రైతు బిడ్డ అంటూ సింపథీ కోసం ప్రయత్నస్తున్నాడని పల్లవి ప్రశాంత్‌ని గౌతమ్‌ కృష్ణ, దామిని, టేస్టీ తేజ, ప్రియాంక జైన్‌, షకీలా, అమర్‌దీప్‌లు నామినేట్‌ చేశారు. పల్లవి ప్రశాంత్‌ నామినేషన్స్ సమయంలో రైతుబిడ్డ ఇష్యూపై పెద్ద చర్చే నడిచింది. అయితే నామినేషన్స్‌ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో మంగళవారం కూడా కొనసాగనుంది.

శివాజీతో గొడవ

నామినేషన్స్ ప్రక్రియ చూస్తే గౌతమ్‌, రతికా రోజ్‌ల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. పిచ్చి పిచ్చి నామినేషన్స్‌ ప్రాసెస్‌ కాదిక్కడ? అంటూ రతిక ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. మరోవైపు తనను నామినేట్‌ చేసినందుకు.. శోభాశెట్టిని శివాజీ నామినేట్‌ చేయడంతో వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. నువ్వు ఆర్టిస్ట్ కాబట్టే ఇంప్రెస్‌ చేశావు అంటూ  శివాజీ ఫైర్ కావడంతో.. ‘అలాంటి మాటలు మాట్లాడితే ఊరుకోను’ అని శోభ కౌంటరిచ్చింది. దీంతో మంగళవారం రిలీజైన ప్రోమో చూస్తే హౌస్‌లో ఎంత హీట్‌ ఉందో అర్థమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement