Promo
-
'అన్‌స్టాపబుల్' షోలో వెంకటేశ్.. ప్రోమో రిలీజ్
అన్‌స్టాపబుల్ (Unstoppable with NBK) ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తోంది. ఇదివరకే ఆరు ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి. ఇప్పుడు కొత్త ఎపిసోడ్ కోసం విక్టరీ వెంకటేశ్ (Venkatesh) వచ్చారు. ఈయన లేటెస్ట్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunam). ఈ మూవీ సంగతులతో పాటు బోలెడన్ని విషయాల్ని పంచుకున్నారు. హోస్ట్ బాలకృష్ణతో కలిసి వెంకీ ఫుల్ సందడి చేశారు. వెంకీతో పాటు ఈయన అన్నయ్య సురేశ్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి కూడా ఇదే ఎపిసోడ్లో పాల్గొన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే టాప్ సిరీస్.. రెండో సీజన్ చూసేందుకు సిద్ధమా?)లేటెస్ట్గా రిలీజైన ప్రోమోలో వెంకీ, బాలకృష్ణ ఒకరి సినిమాకు మరొకరు హైప్ ఇచ్చుకున్నారు. వెంకటేష్ 'డాకు మహారాజ్' (Daaku Maharaj) అని హైప్ ఇవ్వగా, బాలకృష్ణ అందుకొని 'నా మనసులో నువ్వే మహారాజ్' అని డైలాగ్ వేశారు. ఆ తర్వాత గతాన్ని గుర్తు తెచ్చుకుని మాట్లాడుకున్నారు. 'రాముడు మంచి బాలుడు' అనే డైలాగ్ చెప్పి బాలయ్య సిగ్గుపడుతుంటే.. వెంకటేష్ అందుకుని 'హలో కొంపతీసి నువ్వా రాముడు?' అని సెటైర్ వేశారు. ఆ వెంటనే బాలయ్య.. 'అలా భయపెట్టిస్తే ఎలా' అని పంచ్ వేశారు.ఇదే షోలో వెంకటేశ్.. నాగచైతన్య, రానాతో తనకున్న బాండింగ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. సోదరుడు సురేశ్ బాబు కూడా షోకి వచ్చారు. వెంకటేష్ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం చెబుతూ ఎమోషనల్ అయ్యారు. డిసెంబర్ 27న రాత్రి 7 గంటలకు పూర్తి ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. (ఇదీ చదవండి: సినిమాల్ని వదిలేద్దాం అనుకుంటున్నా: డైరెక్టర్ సుకుమార్) -
జగన్ ఈజ్ ఏ ఫైటర్..
-
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. హ్యాపీ లైఫ్‌కి మైక్రో మంత్ర!
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది.ఇప్పటికే రిలీజైన గేమ్ ఛేంజర్ సాంగ్స్, టీజర్‌కు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో మేకర్స్ మరో అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రంలోని హ్యాపీ లైఫ్‌కు మైక్రో మంత్ర అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఫుల్ సాంగ్ ఈనెల 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా రిలీజైన ప్రోమో ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. తమన్ సంగీతమందించారు.కాగా.. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో అభిమానుల్లో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల యూఎస్ ప్రీమియర్స్‌కు సంబంధించి టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. -
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే ప్రోమో
-
ప్రేరణకు బిగ్‌బాస్ సర్ప్రైజ్.. హౌస్‌లోకి ఎవరొచ్చారంటే?
ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఎమోషనల్ వీక్ నడుస్తోంది. కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని పంపిస్తూ ఫుల్ ఎమోషనల్ వీక్‌గా మార్చేశారు. తాజాగా మరో కంటెస్టెంట్ కుటుంబ సభ్యుడు బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేశాడు. హౌస్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ప్రేరణ భర్త ఇవాళ హౌస్‌లో అడుగుపెట్టాడు. తన భర్తను చూసి ఆనందంలో గంతులేసింది ప్రేరణ.(ఇది చదవండి: 40 రోజులుగా బ్లీడింగ్.. నేను చేసిన తప్పు ఎవరూ చేయకండి: స్రవంతి)ఆ తర్వాత చాలా బాగా అడుతున్నావంటూ ప్రేరణను మరింత ఎంకరేజ్ చేశాడు ఆమె భర్త. నువ్వు విన్నర్‌గా తిరిగి రావాలంటూ భార్యకు సలహా ఇచ్చాడు. ఆ తర్వాత ఈ జంట హౌస్‌లో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత ఇంటి సభ్యులందరితో సరదాగా మాట్లాడారు. చివర్లో భార్య, భర్తలిద్దరితో గేమ్ ఆడించాడు బిగ్‌బాస్. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇవాళ హౌస్‌లో ఏం జరిగిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. -
రోహిణికి సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్‌బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న టేస్టీ తేజ!
తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. మరో నెల రోజుల్లోపే బిగ్ గేమ్ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. గత రెండు నెలలుగా బుల్లితెర ప్రియులను ఎంటర్టైన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సీజన్ 11వ వారానికి చేరుకుంది. గతవారంలో వెల్డ్ కార్డ్ కంటెస్టెంట్ హరితేజ ఎలిమినేట్ అయింది. ఇక మరోవారం మొదలైందంటే చాలు నామినేషన్ల గొడవే. ఆ రోజంతా ఒకరిపై ఒకరు చిన్నపాటి యుద్ధం చేయాల్సి ఉంటుంది. అలా ఈ వారంలో గౌతమ్, తేజ, పృథ్వీ, అవినాష్, విష్ణుప్రియ, యష్మీ నామినేషన్స్‌లో నిలిచారు.ఇవాల్టి ఎపిసోడ్లో హౌస్‌ను కాస్తా ఎమోషనల్‌గా మార్చేశాడు బిగ్‌బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రారంభంలోనే టేస్టీ తేజ ఫుల్ ఎమోషనల్‌గా కనిపించాడు. నేను ఏడిస్తే మా అమ్మకు నచ్చదు అంటూ ఆమెను తలచుకుని ఏడుస్తూ.. కన్నీళ్లు తుడుచుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారు.ఆ తర్వాత కంటస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపించారు. రోహిణికి సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఆమె కుమారుడితో పాటు రోహిణి వాళ్ల అమ్మను హౌస్‌లోకి పంపించారు. అక్కడికెళ్లిన రోహిణి కుమారుడితో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అందరూ సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన తాజా ప్రోమోను రిలీజ్ చేశారు. 💖 An Adorable Surprise for Rohini! 💖Bigg Boss house fills with warmth as Rohini receives an unforgettable, adorable surprise! Watch her heart-melting reaction to this sweet moment! ❤️#BiggBossTelugu8 #StarMaa #Nagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/ay1nLZdkdA— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 12, 2024 -
'ఇక ఆపేద్దామన్న హరితేజ.. నా మీదే ఎందుకంత కోపం'
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ ప్రస్తుతం తొమ్మిదో వారం నడుస్తోంది. గతవారంలో నయని పావని హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సోమవారం వచ్చిందంటే హౌస్‌లో మాటల యుద్ధమే. ఎందుకంటే నామినేషన్స్ ప్రక్రియ మొదలయ్యేది ఆ రోజు నుంచే. అయితే ఈసారి బిగ్‌బాస్ ఓ చిన్న కండీషన్ పెట్టాడు. ఎప్పుడూ ఇద్దర్ని నామినేట్ చేయాలని చెప్పే బిగ్‌బాస్ ఈసారి మాత్రం ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలన్నాడు.అలా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. పలు కారణాలతో ఈ వారం యష్మి, ప్రేరణ, గౌతమ్, నిఖిల్, హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ నామినేట్ అయ్యారు. అయితే ఒక్క రోజులోనే ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. మంగళవారం కూడా నామినేషన్స్ కొనసాగాయి. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ రోజు నామినేషన్స్ ప్రక్రియలో హరితేజ, ప్రేరణ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇప్పటివరకు జరిగిందంతా చాలు.. ఇక నుంచి ఆపేద్దాం.. నోరు బాగుంటే ఊరు బాగుంటది' అంటూ ప్రేరణను అడిగింది హరితేజ. ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ ఉంటే నామినేట్ చేసుకుందాం. అంతేకానీ మనిద్దరికీ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మాటలకు హరితేజను అభినందిస్తూ మాట్లాడింది ప్రేరణ. ఆ తర్వాత మళ్లీ హరితేజను ఫేక్ అని ప్రేరణ అనడంతో మరింత మాటల యుద్ధం నడిచింది. ప్రతిసారి ఫేక్ అనొద్దు.. మాటలు ముందు సక్కగా మాట్లాడు అంటూ హరితేజ వాదించింది. దీంతో వీరిద్దర మధ్య జరిగిన వార్ పూర్తిగా తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. -
'ఓవర్ యాక్టింగ్ ఆపమన్న నిఖిల్'.. వార్‌ను తలపించిన బిగ్‌బాస్ హౌస్!
వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత బిగ్‌బాస్ షో కాస్తా రసవత్తరంగానే సాగుతోంది. కొత్త, పాత నీరు కలవడంతో పోటాపోటీగా హౌస్‌లో హల్చల్ చేస్తున్నారు. ఇక నామినేషన్స్ టైమ్‌లో అయితే కంటెస్టెంట్స్ ఓ రేంజ్లో ఫైరవుతున్నారు. గతవారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మెహబూబ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం వచ్చిందంటే చాలు నామినేషన్స్ గొడవ మొదలైనట్లే. అలా ఈ వారంలో గౌతమ్, నయని, హరితేజ, యష్మి, తేజ నామినేషన్స్‌లో ఉన్నారు.ఇక నామినేషన్స్ గోల ముగియడంతో ఈ రోజు టాస్క్‌ల గోల మొదలైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో పానిపట్టు యుద్ధం అంటూ హౌస్‌మేట్స్‌కు సరికొత్త పోటీ పెట్టాడు బిగ్‌బాస్. నీళ్ల ట్యాంకుల టాస్క్ ఇవ్వడంతో హౌస్మేట్స్ పోటాపోటీగా పాల్గొన్నారు. ఇక టాస్క్‌లో భాగంగా నిఖిల్ రెచ్చిపోయాడు. యష్మితోపాటు ఇద్దరి చేతులను పట్టుకుని లాగాడు. దీంతో గౌతమ్ నీకసలు బుద్ది ఉందా? అంటూ నిఖిల్‌ను హెచ్చరించాడు. సంచాలక్‌కు రెస్పెక్ట్ ఇవ్వరా? అంటూ యష్మి మండిపడింది.టాస్క్ కాస్తా దారి మళ్లీ గౌతమ్, నిఖిల్ మధ్య తీవ్ర గొడవకు దారితీసింది. నీకసలు సెన్స్ ఉందా? అంటూ గౌతమ్ అనడంతో నిఖిల్ మరింత ఫైరయ్యాడు. ఆపు నీ ఓవర్ యాక్టింగ్ అని నిఖిల్ చెప్పడంతో.. నీది ఓవర్ యాక్టింగ్ గౌతమ్ మీదికి దూసుకెళ్లాడు. ఈ గొడవ ఇద్దరు చివరికీ కొట్టుకునే దాకా వెళ్లడంతో అవినాశ్, పృథ్వీ వారిని నిలువరించారు. ఈ టాస్క్ గోల పూర్తిగా తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. -
కన్నీళ్లు ఆపుకోలేకపోయిన టేస్టీ తేజ.. అమ్మలా ఓదార్చిన గంగవ్వ!
తెలుగు బుల్లితెర రియారిటీ షో బిగ్‌బాస్ సినీ ప్రియులను అలరిస్తోంది. ఈ సారి దీపావళి ఫెస్టివల్ కావడంతో సన్డే ఎపిసోడ్‌ను కాస్తా ఫన్డే మార్చేశారు. ఇంటి సభ్యులతో సరదా పంచులు, డైలాగ్స్‌తో సందడి చేశారు. ఇవాల్టి ఎపిసోడ్లో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గెస్ట్‌గా వచ్చాడు. హౌస్‌మేట్స్‌పై తనదైన స్టైల్లో పంచులు వేస్తూ అలరించాడు. విష్ణు ప్రియ, టేస్టీతేజ, ముక్కు అవినాశ్, రోహిణితో సహా పలువురిపై పంచ్ డైలాగ్స్ వేశాడు.తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే హౌస్‌మేట్స్‌కు ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. హౌస్‌ను ఫుల్ ఎమోషనల్‌గా మార్చేశాడు. ఇద్దరు హౌస్‌మేట్స్‌ను పిలిచి వారి కుటుంబ సభ్యుల ఫోటోలను చూపించాడు. వారిలో ఒక్కరికి మాత్రమే తన ఫ్యామిలీ సభ్యులు పంపిన మేసేజ్ చూసే అవకాశముందని నాగార్జున చెప్పాడు. దీంతో గంగవ్వ, టేస్టీ తేజకు మీలో ఎవరో ఒకరే తేల్చుకోవాలంటూ ఆదేశించాడు.దీంతో గంగవ్వ, టేస్టీ తేజ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. గంగవ్వను పట్టుకుని ఏడ్చేశాడు. టేస్టీ తేజను సైతం గంగవ్వ ఓదారుస్తూ కనిపించింది. ఫుల్ ఫన్ ఎపిసోడ్ అంటూ చివరికీ వచ్చేసరికి హౌస్‌మేట్స్‌ను ఏడ్పించేశాడు బిగ్‌బాస్. చివరికీ ఏ హౌస్‌మేట్ తన కుటుంబ సభ్యులు పంపిన సందేశం చదివారో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే. ఇప్పుడైతే ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి. -
బిగ్‌బాస్ హౌస్‌లో దెయ్యం.. భయంతో వణికిపోయిన హౌస్మేట్స్!
తెలుగులో బిగ్‌బాస్ ప్రస్తుతం ఎనిమిదో వారం నడుస్తోంది. గతవారంలోనే మణికంఠ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇకపోతే సోమ, మంగళ వారాల్లో నామినేషన్స్ గొడవలతో ఓ రేంజ్లో సాగింది. ఈ వారంలో ఈ వారం నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజైంది. నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో ఇక టాస్కుల గోల మొదలు కానుంది. అయితే ఈ సారి హౌస్‌లో ఊహించని సంఘటన జరిగింది. హౌస్‌మేట్స్‌ను నిద్రపోకుండా చేసేలా పెద్ద స్కెచ్ వేశారు. ముగ్గురు కలిసి హౌస్‌మేట్స్‌ను వణికించేశారు. అదేంటో తెలుసుకుందాం.హౌస్‌లో ఉన్న గంగవ్వ అర్ధరాత్రి కేకలు వేస్తూ కనిపించింది. దీంతో అందరూ ఒక్కసారిగా లేచి బయటకు పరిగెత్తారు. ఇంతకీ ఏం జరుగుతోంది అంటూ అంతా భయపడిపోయారు. గంగవ్వను చూసిన హౌస్మేట్స్ ఓ రేంజ్లో వణికిపోయారు. ఆ తర్వాత అవ్వను ధైర్యంతో మెల్లగా గదిలోకి తీసుకెళ్లిన టేస్టీ తేజ తన బెడ్‌పై నిద్రపుచ్చారు. ఆ తర్వాత అంతా కలిసి దెయ్యం పట్టిందేమో అంటూ చర్చ మొదలెట్టేశారు. నాకైతే నిద్ర కూడా రావడం లేదంటూ రోహిణి, హరితేజ తెగ చర్చించుకున్నారు.అయితే ఆ తర్వాత ఫ్రాంక్ అని తెలిసిపోయింది. టేస్టీ తేజ, ముక్కు అవినాశ్, గంగవ్వ ముగ్గురు కలిసి మాట్లాడుకుని ఫ్రాంక్ చేశారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా వీళ్లు ముగ్గురు కలిసి ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. ఇంకా హౌస్‌లో ఏం జరిగిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే. -
అవినాష్ సరదా.. నిజంగానే డోర్ తెరిచిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ హౌసులో ఎనిమిదో వారం నామినేషన్ పూర్తయ్యాయి. మొత్తంగా ఆరుగురు నామినేట్ అయ్యారు. మెహబూబ్, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, నయని పావని లిస్టులో ఉన్నారు. హరితేజ కూడా నామినేట్ అయింది. కాకపోతే మెగాచీఫ్ గౌతమ్.. సూపర్ పవర్ ఉపయోగించిన ఆమెని తప్పించాడు. ఈ వారానికి సంబంధించి కీలక ఘట్టం ముగియడంతో కంటెస్టెంట్స్ ఎంటర్టైన్మెంట్ మొదలుపెట్టారు.(ఇదీ చదవండి: ఉదయనిధి స్టాలిన్ రూ. 25 కోట్లు చెల్లించాల్సిందే.. కోర్టుకెళ్లిన నిర్మాత)పృథ్వీ మెడలోని బంగారు గొలుసు గురించి తేజ అడగ్గా.. 'గోల్డ్, గోల్డ్ వేసుకుని తిరగడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా' అని విష్ణుప్రియ మధ్యలో దూరి కామెంట్ చేసింది. అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతాం అని సరదాగా కామెంట్ చేశారు. అయితే అవినాష్ అన్నప్పుడు బిగ్‌బాస్ నిజంగానే డోర్ తెరిచాడు. దీంతో అందరూ అతడిని పట్టుకుని మరీ బయటకు తోసేయడానికి ప్రయత్నించారు. ఇదంతా కూడా ఫన్నీగా సాగింది.దీని తర్వాత అవినాష్ జిమ్ ట్రైనర్‌గా మారి, ఇంటి సభ్యులు వర్కౌట్స్ ఎలా చేయాలో చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఆ తర్వాత టేస్టీ తేజతో వర్కౌట్స్ చేయించాడు. ఇదంతా కూడా ఫన్నీగా సాగేసరికి మిగిలిన హౌస్మేట్స్ అందరూ పగలబడి నవ్వారు. పదేపదే అవినాష్, రోహిణి, టేస్టీ తేజతో తప్పితే మిగిలిన వాళ్ల నుంచి ఎంటర్టైన్మెంట్ అనేది రావట్లేదు. బుధవారం కూడా అవినాష్ తన కామెడీతో నవ్విస్తాడని అనిపిస్తోంది.(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. చిన్నప్పటి ఫొటోలతో ప్రభాస్ చెల్లి) -
'నువ్వు ఎవరూ చెప్పడానికి?'.. విష్ణు ప్రియకు ప్రేరణ వార్నింగ్!
తెలుగులో బిగ్‌బాస్ ప్రస్తుతం ఎనిమిదో వారం నడుస్తోంది. గతవారం మణికంఠ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. ఇక సోమవారం మొదలవగానే నామినేషన్స్ గొడవ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రక్రియ హౌస్‌లో ఓ చిన్నపాటి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఇక ఇవాళ నామినేషన్స్ ప్రక్రియ ఓ రేంజ్లో జరిగినట్లు తాజా ప్రోమో చూస్తేనే తెలుస్తోంది. ఆ వివారాలేంటో చూసేద్దాం.ఇకపోతే మంగళవారం ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ మరింత హాట్‌హాట్‌గా సాగింది. విష్ణు ప్రియ, యష్మి గౌడ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఏడు వారాలైనా నీ సొంత గేమ్ ఎక్కడ కనిపించట్లేదు.. కొన్ని మాటలు కూడా చాలా హార్ష్‌గా ఉంటాయని విష్ణుప్రియను యష్మి నామినేట్ చేసింది. వీరి మధ్యలో అనుకోకుండా ప్రేరణ ఎంట్రీ ఇచ్చింది. దీంతో విష్ణుప్రియతో గొడవ తారాస్థాయికి చేరింది. నా పేరు తీయకుండా మాట్లాడాలని ప్రేరణ అనడంతో..అలా అయితే హౌస్ నుంచి వెళ్లిపో అంటూ విష్ణుప్రియ వాదించింది. దీంతో నువ్వు ఎవరూ చెప్పడానికి.. నా గురించి మాట్లాడకు అంటూ ప్రేరణ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.ఆ తర్వాత మెహబూబ్‌ను నిఖిల్, యష్మి పలు కారణాలు చెప్పి నామినేట్ చేశారు. ఆ తర్వాత పృథ్వీని ముక్కు అవినాశ్ నామినేట్ చేశాడు. బిగ్‌బాస్ రావడానికి మనీ తీసుకుంటావ్.. కానీ బిగ్‌బాస్ ఇస్తే తీసుకోవు అంటూ అవినాశ్ ప్రశ్నించాడు. ఆ తర్వాత మ్యాటర్ కాస్తా పృథ్వీ గడ్డం మీదకు వెళ్లింది. యాభై వేలు ఇచ్చినా నా గడ్డం తీయను బ్రో అంటూ పృథ్వీ గట్టిగానే అరిచేశాడు. మీరేందుకు యాభై వేలకు ఓకే చెప్పారంటూ అవినాశ్‌ను పృథ్వీ అడిగాడు. అది నా ఇష్టమని అవినాశ్ అనడంతో.. ఇది నా ఇష్టం అంటూ పృథ్వీ వాదించడంతో ప్రోమో ముగిసింది. హౌస్‌లో మరెంత హాట్‌హాట్‌గా సాగిందో తెలియాలంటే ఇవాల్టి ఫుల్ ఎపిసోడ్ చూసేయండి. కాగా.. ఈ వారం నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని, హరితేజ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. -
హౌస్‌లో గొడవపడ్డ కంటెస్టెంట్స్.. కొట్టుకునేలా ఉన్నారుగా!
ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను బిగ్‌బాస్ సీజన్-8 అలరిస్తోంది. తెలుగులో బిగ్‌బాస్- 8 ఏడో వారం కొనసాగుతోంది. వెల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఈ రియాలిటీ షో మరింత రసవత్తరంగా మారింది. పాత, కొత్త కంటెస్టెంట్స్ అంతా కలిసి హౌస్‌ను హాట్‌హాట్‌గా మార్చేశారు. ఇప్పటికే రెండు టీమ్‌లుగా రాయల్, ఓజీగా విడిపోయిన కంటెస్టెంట్స్ టాస్కుల్లో ఒకరిని మించి ఒకరు పోటీపడుతున్నారు. అయితే హౌస్‌లో మెగా చీఫ్ కంటెండర్‌గా గంగవ్వ ఛాన్స్ కొట్టేసింది.బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న రాయల్ టీమ్‌ను ఓవర్ స్మార్ట్ఫోన్లుగా, ఓజీ టీమ్‌ను ఓవర్ స్మార్ట్ చార్జర్లుగా విభజించారు. హౌస్ అంతా రాయల్ టీమ్ ఆధీనంలో, గార్డెన్ ఏరియా ఓజీ టీమ్ ఆధీనంలో ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. కిచెన్, బెడ్రూమ్, వాష్‌రూమ్ వంటి వసతులు అందిస్తూ ఛార్జింగ్ పొందవచ్చని తెలిపాడు. ఆ సంగతి అలా ఉంచితే ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన తాజా ప్రోమో విడుదలైంది. ఇందులో హౌస్మేట్స్ అంతా సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. అయితే ఓవర్ స్మార్ట్ చార్జర్స్ టీమ్‌లో ఉన్న మణికంఠ, పృథ్వీ ఓ విషయంలో గొడవపడ్డారు. మాటమాట పెరిగి ఒకరి మీదికి ఒకరు దూసుకెళ్లారు. నీ యాటిట్యూడ్ తగ్గించుకో అని మణికంఠ అనడంతో పృథ్వీకి మరింత కోపమొచ్చింది. ఆ గొడవ మరింత ముదరడంతో చివరికీ హౌస్మేట్స్ అంతా కలిసి వారిద్దరిని నిలువరించారు. ఈ ప్రోమో ఫుల్ ఎపిసోడ్ ఇవాళ రాత్రి ప్రసారం కానుంది. -
సినీ చరిత్రలోనే తొలిసారి... ఓకేసారి మూడు వర్షన్స్
ఆర్జీవీ సమర్పణలో తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం శారీ. ఈ సినిమాలో కోలీవుడ్ భామ ఆరాధ్యదేవి లీడ్ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం ఈ బోల్డ్ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ పంచుకున్నాడు రాంగోపాల్ వర్మ. ఈ చిత్రంలోని సాంగ్‌కు సంబంధించిన టీజర్‌ను ఆర్జీవీ రిలీజ్ చేశారు. కేవలం టీజర్‌తోనే సాంగ్‌పై అంచనాలను మరింత పెంచేశాడు. ఈ సినిమాలోని ఐ వాంట్ లవ్ అనే పాటకు సంబంధించిన మూడు వర్షన్ల ప్రోమోను ఆర్జీవీ తన ట్విటర్ ద్వారా విడుదల చేశారు. సినిమా చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ మూవీలోని సాంగ్ టీజర్ చూస్తుంటే కుర్రకారుకు హీటు పుట్టించేలా ఉంది. పూర్తి పాటను అక్టోబర్ 17న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఆర్జీవీ వెల్లడించారు.సినీ చరిత్రలో ఏఐ ద్వారా రూపొందించిన ఒకే పాటకు మూడు వర్షన్స్ రిలీజ్ చేయడం విశేషం. కాగా.. ఈ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ సమర్పణలో.. గిరీశ్ కృష్ణ కమల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సాంగ్‌లో ఆరాధ్యదేవి తన అందాల ఆరబోత ఖాయంగా కనిపిస్తోంది.Here’s a sneak peak teaser reel of I WANT LOVE AI song ONE (Crazy ) from SAAREE film featuring https://t.co/4vViOc25qQ Full song releasing Oct 17 th 5 pm #SaareeSongsAI #RGVsSAAREE pic.twitter.com/RgNnwHGdx6— Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2024 -
అవినాష్ భార్యపై పృథ్వీ చీప్ కామెంట్స్.. మరీ ఇలానా?
బిగ్‌బాస్ 8 షో మరీ హద్దులు దాటేస్తున్నట్లు కనిపిస్తుంది. మాట్లాడుకోవడం, తన్నుకోవడం అనేది గేమ్స్ వరకు అయితే పర్లేదు. కానీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లడం మాత్రం కరెక్ట్ కాదు. మంగళవారం ఎపిసోడ్లో అలాంటి గొడవే జరిగింది. నామినేషన్ సందర్భంగా అవినాష్ భార్య గురించి పృథ్వీ చీప్ కామెంట్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఫ్రెండ్షిప్ అనే పదాన్ని తీసి మరీ తనని బాధపెట్టారని యష్మి ఏడ్చింది. దీంతో ప్రేరణ ఆమెని ఓదార్చే ప్రయత్నం చేసింది. ఇక గ్రూప్‌గా ఫామ్ అయిన నిఖిల్.. నబీల్, పృథ్వీ, మణికంఠతో మాట్లాడుతూ తేజని ఎలాగైనా సరే టార్గెట్ చేయాలని అన్నాడు. గుర్రం సౌండ్ వినిపించగానే యష్మి టోపీ లాగేసుకుని ప్రేరణకి ఇచ్చింది. పోడియంపై నిలబడ్డ విష్ణుప్రియ.. రివేంజ్ పేరుతో నయని పావనిని నామినేట్ చేయాలనుకుంది. కానీ రివేంజ్ అనేది ఇక్కడ కుదరదని బిగ్‌బాస్ అల్టిమేటం ఇచ్చేశాడు. ఇదంతా చూసిన తేజ.. ఓజీ క్లాన్ బండారాన్ని బయటపెట్టాడు. తనని కావాలనే టార్గెట్ చేస్తున్నారని.. ఓజీ vs తేజ చేసేస్తున్నారని, ఇక మీ ఆట మీరు ఆడండి, నా ఆట నేను ఆడతా అని తేజ.. వాళ్లకు సవాలు విసిరాడు.(ఇదీ చదవండి: బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక.. ప్రభుత్వంతో కలిసి)తర్వాత వచ్చిన పృథ్వీ.. ప్రోమో చూసి తను టాస్క్‌లు ఆడుతున్నానని చెప్పడం అస్సలు నచ్చలేదని అవినాష్‌ని నామినేట్ చేశాడు. దీంత ఇద్దరి మధ్య తగువు మొదలైంది. 'నేను చూసిన ఎపిసోడ్స్‌లో రెండు మూడు టాస్క్‌లు తప్పితే ఎక్కడా కనిపించలేదు. మా వైఫ్ చూసింది' అని అవినాష్ అనగానే.. మరి అలాంటిప్పుడు మీ భార్యనే బిగ్‌బాస్‌కి రావాల్సింది, మీరెందుకు వచ్చారు అని పృథ్వీ నోరు జారాడు. వైఫ్ టాపిక్ తీయకు అని అవినాష్ సీరియస్ అయ్యాడు.సోఫాలు కూర్చోవడం తప్పితే ఇంకేం చేయవ్ అని అవినాష్ అనేసరికి.. కామెడీ తప్ప ఇంకేం చేశావ్ నువ్వు అని పృథ్వీ అన్నాడు. పోయిన వారం నేను ఏ పాయింట్ చెప్పానో, ఈ వారం కూడా గంగవ్వ అదే పాయింట్ చెప్పిందని అవినాష్ అనేసరికి.. 'గంగవ్వ పేరు ఎందుకు చెబుతావ్ రా' అని పృథ్వీ మరోసారి నోరు జారాడు. 'రేయ్ రా అనకు' అని అవినాష్ వేలు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చాడు. 'ఇది నీ సంస్కారం. బిగ్‌బాస్‌కి వచ్చావ్ కదా నేర్చుకో' అవినాష్-పృథ్వీ ఒకరిపై ఒకరు వెళ్లారు.(ఇదీ చదవండి: 'సిటాడెల్' ట్రైలర్.. ఫైట్స్ అదరగొట్టేసిన సమంత) -
కమెడియన్లని అవమానించిన గౌతమ్? రెచ్చిపోయిన అవినాష్
బిగ్‌బాస్ షోలో మిగతా వాటి సంగతి పక్కనబెడితే కాస్తంత కామెడీ ఉంటేనే జనాలు చూస్తారు. ఈసారి అది లేకపోవడం వల్లే గత సీజన్లలో పాల్గొన్న పలువురిని వైల్డ్ కార్డ్స్ పేరిట మళ్లీ తీసుకొచ్చారు. ఉన్నంతలో రోహిణి, అవినాష్ కాస్త ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు గౌతమ్ వాళ్లిద్దరినీ అవమానించేలా కామెంట్స్ చేశాడు. ఇదేం కామెడీ షో కాదు అని చెబుతూనే గొడవ చేశాడు. దీంతో అవినాష్ రెచ్చిపోయాడు.గతవారం ఫన్ టాస్క్ సందర్భంగా గౌతమ్‌ని ఇమిటేట్ చేసిన అవినాష్. అశ్వద్ధామ 2.0 అని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ గౌతమ్ అది ఇబ్బందిగా అనిపించింది. దీంతో మైక్ తీసి నేలకేసి కొట్టాడు. అయితే అప్పుడు మైక్ తీసి పడేయడం తనకు నచ్చలేదని కారణం చెప్పిన రోహిణి.. గౌతమ్‌ని ఈ వారం నామినేట్ చేసింది. కామెడీ, మరేదైనా గానీ బుల్లీయింగ్ (పరోక్షంగా బాధపెట్టడం) లాంటిదని గౌతమ్ నోరు జారాడు. ఇది చాలా పెద్ద మాట అని హౌస్మేట్స్ అందరూ సీరియస్ అయ్యారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: ఆ కల నెరవేరలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సీత)బుల్లీయింగ్ అంటే ఓ మనిషికి నచ్చని విషయాన్ని మళ్లీ మళ్లీ గుచ్చి గుచ్చి చెబుతారా అని గౌతమ్ ఆవేశపడిపోయాడు. పక్కనే ఉన్న అవినాష్ ఇక తట్టుకోలేకపోయాడు. మాకు తెలీదు తెలీదు తెలీదు అని ఫైర్ అయ్యాడు. మేం కావాలని చెయ్యలేదు, వేలు పెట్టి కెలకలేదు అన్నాడు. దీంతో ఇదేం కామెడీ షో కాదు, మనం వచ్చింది బిగ్‌బాస్ షోకి అని గౌతమ్ మరోసారి మాట తూలాడు. ఫలితంగా అవినాష్ రెచ్చిపోయాడు.'కామెడీ తీసుకోలేనప్పుడు డబ్బులు తీసుకోకండి. షోకు రాకండి. కామెడీ అంటే ఏమనుకుంటున్నారో' అని అవినాష్ తన జాకెట్ విసేరేశాడు. గౌతమ్‌ని అశ్వద్ధామ 2.0 అనకండ్రా, మీకు దండం పెడతాను అని కెమెరా చూస్తూ అతడి ఫ్యాన్స్‌కి చెప్పాడు. పక్కనే ఉన్న గౌతమ్‌కి క్షమాపణలు కూడా చెబుతూనే సారీ భయ్యా, నాకు తెలీదు అని అన్నాడు. ఇదంతా చూస్తుంటే కామెడీ చేయడం ఏమో గౌతమ్‌కి తీరా చేస్తేనేమో తీసుకోలేకపోతున్నాడు. చూస్తుంటే ఈ గొడవే సోమవారం ఎపిసోడ్ అంతా ఉండేలా కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు) -
'నేనేమన్నా యుద్ధానికి పోతున్నానా?'.. మొదటి రోజే బుక్కైన అవినాశ్!
బిగ్‌బాస్ సీజన్ ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఈ రియాలిటీ షో మొదలై ఇన్ని రోజులవుతున్నా ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఒక్క విష్ణు ప్రియ మినహాయిస్తే అంతా కొత్త వాళ్లే కావడంతో షో చప్పచప్పగా సాగిపోతోంది. అందుకే బిగ్‌బాస్ సరికొత్త ఐడియాతో ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టేశాడు.అందులో భాగంగానే గతంలో బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్స్‌గా అలరించిన వారిని ఏరికోరి మరీ సెలెక్ట్ చేసుకున్నారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీల్లో మాత్రం కొత్తవాళ్లకు చోటివ్వలేదు. బుల్లితెర ఇండస్ట్రీలో బాగా ఫేమ్ ఉన్నవాళ్లనే పట్టుకొచ్చారు. హరితేజ, టేస్టీ తేజ, గంగవ్వ, ముక్కు అవినాష్, గౌతమ్, నయని పావని, మెహబూబ్, రోహిణి లాంటి హౌస్‌లోకి తోసేశారు. ఇక నుంచైనా అభిమానులను ఆకట్టుకునేందుకు బిగ్‌బాస్ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.(ఇది చదవండి: Bigg Boss 8: ఏడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ముక్కు అవినాష్)వైల్డ్ కార్డ్ ద్వారా ఎనిమిది మంది హౌస్‌లో అడుగుపెట్టాక మొదటి ప్రోమో విడుదలైంది. ఇందులో గంగవ్వ హౌస్‌లో నవ్వులు పూయించారు. రోహిణి- గంగవ్వ మధ్య ఫన్నీ సంభాషణ నడించింది. ఇక తొలిరోజే ముక్కు అవినాశ్ అడ్డంగా బుక్కయ్యాడు. మొదటి రోజే పాత్రలు క్లీన్ చేసే పనికి పూనుకున్నాడు. నేనేదో యుద్ధానికి పోతున్నట్లు అందరూ క్లాప్స్ కొడుతున్నారంటూ కామెడీ పండించాడు. ఈ ప్రోమో చూస్తే కొత్త, పాత వాళ్లతో కలిసి బిగ్‌బాస్ హౌస్ కళకళలాడుతోంది. ఇక నామినేషన్స్ ప్రక్రియ మొదలైతే అసలు కథ స్టార్ట్ అవుతుంది. -
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈరోజే.. వారిద్దరి ఎంట్రీ ఖాయం!
నెల రోజులకు పైగా బిగ్‌బాస్ సీజన్-8 టాలీవుడ్ సినీ ప్రియులను అలరిస్తోంది. అయితే ఈ ఆదివారం ఈ షోపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ఎందుకంటే ఇప్పటికే హౌస్ నుంచి ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో హోస్లో కాస్తా ఎంటర్టైన్మెంట్ తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీజన్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఎప్పటిలాగే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వీరిలో గతంలో హౌస్‌లోకి వచ్చినా వాళ్లు కూడా ఉన్నారు.తాజాగా ఈరోజు జరిగే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. కొత్త కంటెస్టెంట్స్‌పై హౌస్ సభ్యులందరినీ నాగార్జున అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. వారిని త్వరగా ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ హౌస్మేట్స్ అంతా సరదాగా మాట్లాడారు. అంతేకాకుండా మూవీ ప్రమోషన్లలో భాగంగా స్వాగ్ టీమ్, జనక అయితే గనక, మా నాన్న సూపర్ హీరో టీమ్స్ సందడి చేశాయి.(ఇది చదవండి: Bigg Boss 8 : మాజీలతో మసాలా వర్కౌట్ అయ్యేనా?)వారిపైనే ఆసక్తి?అయితే అందరి దృష్టి వారిపైనే ఉంది. ఇంతకీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరు ఎంట్రీ ఇస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరిగింది. ప్రోమో చూస్తే కొందరి పేర్లు కనిపెట్టేలా హింట్స్ కూడా ఇచ్చారు. ఈ రోజు హౌస్‌లోకి గతంలో మధ్యలోనే బయటికెళ్లిన గంగవ్వ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాకుండా యాంకర్ హరితేజ కూడా హౌస్‌లో అడుగుపెట్టనుంది. వీరితో పాటు మరికొంత ప్రముఖులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా రిలీజైన ప్రోమోను చూస్తే మీకు మరింత క్లారిటీ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి. -
మణికంఠ గాలి తీసేసిన నాగార్జున.. స్ట్రాటజీలన్నీ బయటపెట్టేసి
బిగ్‌బాస్ 8లో ఐదో వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ఇప్పటికే మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరిట ఆదిత్యని ఇంటికి పంపించేశారు. ఆదివారం ఎవరిని పంపిస్తారో చూడాలి. మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీల పేరిట దాదాపు ఎనిమిది హౌసులోకి రాబోతున్నారు. ఇలా సందడిగా ఉంది. శనివారం కావడంతో నాగార్జున వచ్చేశాడు. హౌస్‌మేట్స్‌కి ఓ వైపు ప్రశంసలు, మరోవైపు వార్నింగ్‌లు ఇచ్చాడు. మణికంఠని అయితే పూర్తిగా గాలి తీసేశాడని చెప్పాలి.తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో భాగంగా సీత, నైనిక తప్పుల గురించి హోస్ట్ నాగార్జున మాట్లాడాడు. వీళ్ల తర్వాత మణికంఠతో ముచ్చటించాడు. సీత బాడీ లాంగ్వేజ్‌లో నీకు సమస్య ఏంటి? అని అడగ్గా.. తను వెక్కిరించినట్లు అనిపించిందని మణికంఠ అన్నాడు. మధ్యలో మాట్లాడిన సీత.. మణినే తమందరినీ కార్నర్ చేస్తున్నాడనిపిస్తోందని చెప్పింది. దీని తర్వాత నాగార్జు, మణికంఠని యాక్షన్ రూమ్‌లోకి రమ్మన్నాడు.(ఇదీ చదవండి: నాలుగో పెళ్లి పేరుతో అందరినీ ఫూల్ చేసిన నటి వనిత)మణికంఠ.. నీకు 8 నిమిషాలు టైమ్ ఇస్తున్నాను, నువ్వు ఎంత ఏడవాలనుకుంటున్నావో అంత ఏడ్చేసేయ్ అని నాగ్ చెప్పాడు. ఆల్మోస్ట్ అయిపోయింది సర్ అని మణి ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఇంతలో మాట్లాడిన నాగ్.. ఒకవేళ కన్నా నా దగ్గరికి రావొద్దు, అక్కడే ఉండిపో అని ప్రియ చెప్పిందనుకో అని నాగ్ అనగానే.. నాకు భయమేస్తుంది సర్ అని భార్య గుర్తొచ్చి మణికంఠ ఏడుపు మొదలుపెట్టాడు.నీకు చెప్పాల్సిన విషయం ఇంకోటి కూడా ఉందని నాగ్ బాంబు పేల్చాడు. ఏడవటం నీ స్ట్రాటజీ అయితే అది పనికిరాదు. హౌస్ అందరికీ తెలుసు అని మణికంఠ గాలి మొత్తం తీసేశాడు. ఒకరకంగా చెప్పాలంటే ఎమోషన్ చూపిస్తూ, ఏడుస్తూ హౌస్‌లో ఉండిపోవాలనేది మణికంఠ ప్లాన్. దీన్నే ఇప్పుడు నాగార్జున బయటపెట్టాడా అనిపించింది. అలానే ఇకపై ఏడిస్తే కుదరదు అని స్మూత్ వార్నింగ్ ఇచ్చినట్లు అనిపించింది.(ఇదీ చదవండి: మీ రుణాన్ని వడ్డీతో సహా తీర్చుకుంటా.. అభిమానులపై ఎన్టీఆర్) -
Bigg Boss 8: అంతా ఫేక్.. నామినేషన్స్‌లో మణికంఠ vs యష్మి
సోమవారం వచ్చేసింది. అంటే బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ అందరూ మాటలతో కొట్టేసుకునే రోజు. అందుకు తగ్గట్లే ఈ వారం కూడా ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో పేరు, కారణం చెప్పి వాళ్ల తలపై చెత్త పోసే కార్యక్రమం పెట్టాడు బిగ్ బాస్. దీంతో ఒకరిపై ఒకరు రెచ్చిపోయి మరీ అరిచేసుకున్నారు.తొలుత సీత.. యష్మి, పృథ్వీని నామినేట్ చేసింది. ఏ టాస్క్ జరిగినా సరే యష్మిది డామినేటింగ్ వాయిస్‌లా అనిపించిందని కారణం చెప్పింది. అలానే గేమ్‌లో ప్రవర్తించిన తీరుపై సీత-పృథ్వీ మధ్య మాటల యుద్ధమే సాగింది.(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు)మణికంఠ.. యష్మి, పృథ్వీని నామినేట్ చేశాడు. అయితే యష్మితో పెద్ద గొడవే పెట్టేసుకున్నాడు. మణికంఠ మాట్లాడుతున్నప్పుడు యష్మి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయగా.. నేను మాట్లాడుతున్నప్పుడు వినడం నేర్చుకో లేడీ అని వేలు చూపించి మరీ మణికంఠ సీరియస్ అయ్యాడు. దీంతో యష్మి రెచ్చిపోయింది. 'ఫ్రెండ్‌గా నా దగ్గరికొచ్చి నువ్వు డ్రామాలు చేస్తావ్ చూడు. అన్నీ ఫేక్' అని రివర్స్ కౌంటర్ ఇచ్చింది.అలానే తన పాయింట్ ఆఫ్ వ్యూని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నావ్ అని మణికంఠ చెప్పగా.. నీకు దమ్ము లేదా అని యష్మి రెచ్చిపోయింది. ఇక చివర్లో విష్ణుప్రియ.. ప్రేరణని నామినేట్ చేసింది. ప్రోమో చూస్తుంటేనే హోరాహోరీగా ఉంది. ఇక ఫుల్ ఎపిసోడ్ ఇంకేలా ఉంటుందో ఏంటో?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: శేఖర్ భాషా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?) -
అందమైన అమ్మాయిలతో నాగార్జున డ్యాన్స్.. బిగ్‌బాస్ ప్రోమో చూశారా?
టాలీవుడ్ బుల్లితెర ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో ఎనిమిదో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సీజన్లోనూ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా అలరించనున్నారు. తాజాగా బిగ్‌బాస్-8కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున అందమైన అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు.ఈ ప్రోమోలో బిగ్‌బాస్ సీజన్-8లో ఎంటర్టైన్మెంట్, ఫన్, టర్న్‌లు, ట్విస్ట్‌లకు లిమిటే లేదు అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ హైలెట్‌గా ఉంది. ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధంకండి అంటూ ఈ సీజన్ సరికొత్తగా అలరించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సీజన్ మిమ్మల్ని అలరించేందుకు వచ్చేస్తోంది. కాగా.. గత సీజన్లో బిగ్‌బాస్ విన్నర్‌గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. Eesari entertainment ki, fun ki, twists & turns ki limit ee ledu! In continuation to the Bigg Boss season 8 teaser, here is the promo!!Meeru ready ah?https://t.co/A6q4zx9AfJBigg Boss Season 8 is COMING SOON!#BiggBossTelugu8 @StarMaa @DisneyPlusHSTel— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 11, 2024 -
రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్'.. ఆటో ఎక్కిన హీరో, హీరోయిన్!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని- పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఆ మూవీకి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో రామ్ సరసన ముంబయి భామ కావ్య థాపర్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15 థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. దీనిలో భాగంగా గెటప్ శ్రీనుతో రామ్ పోతినేని, కావ్య థాపర్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఆటోలో వచ్చిన గెటప్ శ్రీను.. హీరోయిన్, హీరోతో కలిసి సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ ట్విటర్లో పంచుకున్నారు. డబుల్ ఇస్మార్ట్- డబుల్ డోస్ రైడ్ అంటూ ప్రోమోను రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోను బుధవారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'.. మరో అప్డేట్ వచ్చేసింది!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశాపటానీ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.కల్కి విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఇందులో బుజ్జిని దేశవ్యాప్తంగా పలు నగరాల్లో తిప్పుతున్నారు. ప్రస్తుతం బుజ్జి రాజస్థాన్‌లోని జైపూర్‌లో సందడి చేయనుంది. ఈనెల 15,16 తేదీల్లో బుజ్జి టూర్‌కి సిద్ధమైంది. అంతే కాకుండా ఈ నెల 15న కల్కి ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ సింగర్ దిల్జీత్ దోసాంజ్ ఈ సాంగ్‌ను పాడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పోస్టర్‌ను ట్విటర్లో పంచుకున్నారు.𝐈𝐧𝐝𝐢𝐚'𝐬 𝐌𝐨𝐬𝐭 𝐂𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐞𝐝 𝐒𝐢𝐧𝐠𝐞𝐫 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐢𝐚'𝐬 𝐌𝐨𝐬𝐭 𝐂𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐞𝐝 𝐀𝐜𝐭𝐨𝐫 🎶❤️🔥#Prabhas X @diljitdosanjh#Kalki2898AD First Single Promo Out Tomorrow.@SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani… pic.twitter.com/XPqk5mozFr— Kalki 2898 AD (@Kalki2898AD) June 14, 2024Hello Jaipur! 🩷Meet our #Bujji at Pathrika Gate on June 15th & Jal Mahal on June 16th.#Kalki2898AD pic.twitter.com/jaFZtXM02k— Kalki 2898 AD (@Kalki2898AD) June 14, 2024 -
సంగీత ప్రియులను అలరించే షో.. ప్రోమో అదుర్స్!
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన హిట్షో ఇండియన్ ఐడల్. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత రెండు సీజన్లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరోసారి సంగీత ప్రియులను అలరించేందుకు వస్తోంది. ఇండియన్ ఐడల్ మరో సీజన్ ఈనెల 14 నుంచి ప్రారంభ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రోమోను రిలీజ్ చేశారు.తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్- 3 లాంఛ్ ప్రోమో వచ్చేసింది. ఈసారి జడ్జీలుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్స్ గీతామాధురి, శ్రీరామచంద్ర, కార్తీక్ వ్యవహరించనున్నారు. కొత్త సీజన్లో కంటెస్టెంట్ల ఎమోషన్స్ ఫుల్‌గా ఉండబోతున్నట్లు ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది. ఈ షో మూడోసారి ఆహా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. ప్రతి శుక్ర, శనివారాల్లో రాత్రి 7 గంటలకు ఈ షో స్ట్రీమింగ్ కానుంది. దీంతో వారం ముందుగానే ప్రోమోను ఆడియన్స్‌కు పరిచయం చేశారు మేకర్స్. Ultimate musical journey ki muhurtham set ayindi 🎙️🗓️.Kotha swarala madya competition, Judges iche entertainment tho Indian Idol resound India antha vinapadutundi.✨.Telugu Indian Idol Season 3 Launch Promo Out▶️https://t.co/6b5B1VURT9🎤🎶 Catch #TeluguIndianIdolS3 starting… pic.twitter.com/Pl33SKG5No— ahavideoin (@ahavideoIN) June 6, 2024 -
Indian 2 Paaraa Song Promo: కమల్ హాసన్ ఇండియన్-2.. ప్రోమో వచ్చేసింది!
కమల్ హాసన్, శంకర్ డైరెక్షన్లో వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీస్థాయిలో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి పారా అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.కాగా.. గతంలో శంకర్ డైరెక్షన్లో 1996లో వచ్చిన ఇండియన్ (భారతీయుడు) సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నారు.An Indian rides forth with courage & valor! 🔥 Here's a promo of the 1st single #PAARAA from INDIAN-2. 🇮🇳 Full song is dropping Tomorrow at 5️⃣ PM. 🤩🥁Rockstar @anirudhofficial musical 🎹Lyrics @poetpaavijay ✍🏻Vocals @anirudhofficial #ShruthikaSamudhrala 🎙️#Indian2 🇮🇳… pic.twitter.com/dz2JeTiqP8— Lyca Productions (@LycaProductions) May 21, 2024