ప్రముఖ డ్యాన్స్‌ షోలో ప్రమాదం..కంటెస్టెంట్‌కు తీవ్ర గాయం! | Dhee Contestant Got Head Injury On Sets Photos Viral In Social Media | Sakshi
Sakshi News home page

ప్రముఖ డ్యాన్స్‌ షోలో ప్రమాదం..కంటెస్టెంట్‌కు తీవ్ర గాయం!

Published Thu, Apr 8 2021 7:44 PM | Last Updated on Fri, Apr 9 2021 7:59 AM

Dhee Contestant Got Head Injury On Sets Photos Viral In Social Media - Sakshi

ప్రముఖ డ్యాన్స్‌ షో ఢీ తెలుగునాట సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది డ్యాన్సర్లు సినిమాల్లో స్టార్‌ కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు. అంతేకాక కంటెస్టెంట్లు సైతం సినిమాల్లో పలు పాటలకు చిందేస్తున్నారు. ఇప్పటివరకు పన్నెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఢీ.. ప్రస్తుతం 13వ సీజన్‌ను నిర్వహిస్తుంది. అయితే తాజాగా షోలో డ్యాన్స్‌ చేస్తూ ఓ లేడీ కంటెస్టెంట్‌ ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవలె విడుదలైంది.

ఇందులో..డ్యాన్స్‌ చేస్తూ ఓ కంటెస్టెంట్‌ ప్రమాదవశాత్తూ స్టేజ్‌ కింద పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయం అయ్యింది. దీనికి సంబంధించిన విజువల్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ప్రమాదం జరిగిందని స్పష్టమవుతోంది. డ్యాన్స్‌ చేస్తూ కిందకు దూకే ఓ షాట్‌లో కంటెస్టెంట్‌ ప్రమాదవశాత్తూ కింద పడిపోవడంతో తలకు తీవ్రంగా దెబ్బ తగిలి రక్తస్రావమైంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఇది నిజంగానే ప్రమాదమా లేక పబ్లిసిటీ స్టంటా అన్నది తెలియాలంటే మాత్రం వచ్చే వారం ఏప్రిల్‌14న విడుదలయ్యే ఫుల్‌ ఎపిసోడ్‌ చూడాల్సి ఉంది. 

చదవండి : ఈ బుల్లితెర జంట విడిపోనుందా?
చూస్తుండగానే మోనాల్‌కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్‌!‌‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement