dhee
-
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం
టాలీవుడ్ లీడింగ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం నెలకొంది. తోడబుట్టిన తమ్ముడు కన్నుమూశారు. ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ తన ఇన్ స్టా హ్యాండిల్ ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రముఖ యాంకర్ అనసూయ తన సంతాపాన్ని తెలియజేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో శేఖర్ మాస్టర్ వదిన చనిపోయారు.(ఇదీ చదవండి: బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్‌పై కేసు నమోదు..?)'నిన్ను మిస్ అవుతున్నాం సుధా. ఎక్కడికెళ్లినా ఏం చేసినా నువ్వే గుర్తొస్తావ్. నువ్వు చనిపోయావనే చేదు నిజాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. ఎక్కడో ఓ చోట నువ్వు ఆనందంగా ఉంటావని అనుకుంటున్నాను. ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావ్. మిస్ యూ రా తమ్ముడు' అని శేఖర్ మాస్టర్ పోస్ట్ పెట్టి ఎమోషనల్ అయ్యాడు.'ఢీ' డ్యాన్స్ షోతో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్.. తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి లాంటి స్టార్స్‌తో కలిసి పనిచేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డ్యాన్స్ మాస్టరగా కొనసాగుతున్నాడు.(ఇదీ చదవండి: నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయి.. లావణ్య అబార్షన్‌పై రాజ్ తరుణ్ రియాక్షన్) View this post on Instagram A post shared by Sekhar Vulli Vj (@sekharmaster) -
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం
టాలీవుడ్ ప్రస్తుత జనరేషన్ కొరియోగ్రాఫర్స్ లో శేఖర్ మాస్టర్ ఒకరు. టీవీ షోలతో కెరీర్ ప్రారంభించిన ఇతడు.. తర్వాత తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. స్టార్ హీరోలతో కలిసి పనిచేశాడు. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్న ఇతడి ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది. తన వదిన చనిపోయారని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్.. తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. (ఇదీ చదవండి: ఐటమ్ సాంగ్ కి సాయిపల్లవి ఊరమాస్ డ్యాన్స్.. వీడియో వైరల్) 'వదిన మిస్ యూ. ఎంతో బాధని అనుభవించావు. అయినా ఎంతో ధైర్యంగా నిలబడ్డావ్. నువ్వే నాకు ధైర్యాన్నిచ్చావ్. పాజిటివిటీని పెంచావ్. నువ్వు లేవనే వార్తని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. ఇప్పుడైనా స్వర్గంలో ఉంటావ్ అని ఆశిస్తున్నాను. నువ్వెప్పుడు మాతోనే ఉంటావ్. నీ ఆత్మకు శాంతి చేకూరాలి' అని శేఖర్ మాస్టర్ రాసుకొచ్చాడు. శేఖర్ మాస్టర్ వదిన అని చెప్పిన ఈమె.. తన భార్యకు అక్క అని తెలుస్తోంది. అయితే ఈమె చనిపోవడానికి గల కారణం ఏంటనేది మాత్రం బయటపెట్టలేదు. ప్రస్తుతానికైతే శేఖర్ మాస్టర్.. డ్యాన్స్ షోలో పెద్దగా కనిపించట్లేదు. (ఇదీ చదవండి: మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!) View this post on Instagram A post shared by Sekhar Vulli Vj (@sekharmaster) -
ఢీ షోకి వెళ్లాక రూ. 6 లక్షల దాకా డబ్బులిచ్చాను: చైతన్య తల్లి
కొరియోగ్రాఫర్ చైతన్య ఏప్రిల్ 30న ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతోనే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. జబర్దస్త్‌లో కన్నా ఢీలో తక్కువ పారితోషికం ఇస్తారని, ఇక్కడ పేరు మాత్రమే వస్తుందని ఆయన వాపోయాడు. అయితే ఆయన కుటుంబసభ్యులు మాత్రం చైతన్యకు అప్పులుండే అవకాశమే లేదని చెప్తూ వస్తున్నారు. తాజాగా చైతన్య తల్లి లక్ష్మి రాయ్ ఓ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 'కాస్ట్యూమ్స్‌కు డబ్బులు కావాలంటూ రెండు, మూడు వేలు నా దగ్గర తీసుకునేవాడు. మీకు తెలియని ఇంకో విషయమేంటంటే.. ఢీ ఫైనల్ కోసం రూ.3,50,000 అడిగాడు. మా ఆయన్ని అడిగితే ఒప్పుకోలేదు. వాడిని చెడగొడుతున్నావు, డబ్బులివ్వను అన్నాడు. ఒక రోజంతా అలిగి కూర్చుంటే ఆ డబ్బంతా తెచ్చి ఇచ్చాడు. అమ్మ, నేను గెలిస్తే రూ.7,50,000 వస్తాయి. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అన్నాడు. కానీ ఫైనల్ దాకా వచ్చి ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడో తెలియలేదు. ఇలా రెండుసార్లు జరిగింది. ఢీ షోకి వెళ్లిన తర్వాత దాదాపు రూ.6 లక్షల దాకా ఇచ్చాను. ఇంత చేసినదాన్ని ఏదైనా అప్పులున్నాయంటే తీర్చకపోయేదాన్నా? అప్పుల వల్ల చనిపోయాడనే మరక ఉండకూడదనే నా బాధ. ఢీ షోలో పేమెంట్స్ ఎలా ఇస్తున్నారో నాకు తెలియదు. కానీ ఢీ లేకపోతే మా అబ్బాయి లేడు. వాడికి ఇంత గుర్తింపు ఢీ వల్లే వచ్చింది' అని చెప్పుకొచ్చింది చైతన్య తల్లి. చదవండి: క్రికెట్ జట్టు కొనుగోలు చేయనున్న రామ్‌చరణ్ నావల్ల హీరోయిన్ ఆత్మహత్య చేసుకుందన్నారు: నవదీప్ -
ఢీలా పడుతున్నారా?
-
నేను బతుకుతున్నదే నా బిడ్డ కోసం.. చైతన్య తల్లి ఎమోషనల్
నెల్లూరు(క్రైమ్): ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య మృతదేహానికి నెల్లూరు ప్రభుత్వ వైద్యులు సోమవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించగా స్వగ్రామానికి తరలించారు. వివరాలు.. లింగసముద్రం మండలం ముత్తంవారిపాళెం గ్రామానికి చెందిన సి.చైతన్య(32)కు చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం. అమ్మ, నాన్న, చెల్లెలితో హైదరాబాద్‌లో ఉంటూ పలు టీవీ చానళ్లలో ప్రసారమయ్యే రియాల్టీ షోల్లో కొరియోగాఫర్గా వ్యవహరిస్తున్నాడు. ఐదేళ్లుగా ఢీ షోలో ఓ బృందానికి కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. దీని ద్వారా వచ్చే రెమ్యునరేషన్ తన మెయింటినెన్స్, తనను నమ్ముకున్న డ్యాన్సర్లకు సరిపోయేది కాదు. దీంతో అప్పుల పాలయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన నెల్లూరు క్లబ్‌లోని ఓ గదిలో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనపై మృతుడి బాబాయి మాల్యాద్రి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. చైతన్య తల్లిదండ్రులు హుటాహుటిన నెల్లూరుకు చేరుకున్నారు. చైతన్య సెల్ఫీ వీడియో ప్రసార, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆయన అభిమానులు, స్నేహితులు, డ్యాన్సర్లు పదుల సంఖ్యలో సోమవారం నెల్లూరు జీజీహెచ్‌లోని మార్చురీ వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రభుత్వ వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. డ్యాన్స్‌లో మెళుకువలు నేర్పడంతోపాటు తమను నడిపించిన మాస్టర్ చైతన్య భౌతికకాయాన్ని చూసి పలువురు డ్యాన్సర్లు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. బంధువులు, డ్యాన్సర్లు, స్నేహితుల అశ్రునయనాల నడుమ చైతన్య మృతదేహాన్ని కుటుంబసభ్యులు తమ స్వగ్రామానికి తరలించారు. నేను బతుకుతున్నదే నా బిడ్డ కోసం నేను బతుకుతున్నదే నా బిడ్డ కోసం. ఇలా చేస్తాడని అనుకోలేదు. నన్ను మోసం చేసి వెళ్లిపోయాడు. అప్పుల కోసం చనిపోతాడని ఊహించలేదు. ఆత్మహత్య చేసుకునే 15 నిమిషాల ముందు నాతో ఫోన్లో మాట్లాడాడు. సన్మాన కార్యక్రమంలో డల్‌గా ఉన్నావు నవ్వూతూ ఉండమని చెబితే సరే అన్నాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్ కట్ చేయక ముందు జామాయిల్ చెట్లు అమ్మాను.. రూ.4 లక్షలు వస్తున్నాయని చెప్పాను. అప్పుడు కూడా ఏమీ చెప్పలేదు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఇప్పటికీ అర్థం కావడం లేదు. నేను వాడి వద్ద ఏది దాచేదాన్ని కాదు. డబ్బులదేముంది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చని చెప్పేవాడు. ఓ సారి ఫోన్ చేసి నీవు ఇంటికి రాలేదంటే నేను చచ్చిపోతా అంటే.. నువ్వు చచ్చిపోతే నన్నెవరు చూస్తారమ్మా.. నీ పక్కన నాక్కూడా బెర్త్ కన్ఫామ్ చేయమ్మా అన్నాడు. ఇప్పుడేమో ఒక్కడే వెళ్లిపోయాడు. నేను చచ్చిపోతున్నా.. నువ్వు కూడా రా అమ్మ అంటే.. నేను కూడా వెళ్లేదాన్ని కదా. – చైతన్య తల్లి లక్ష్మీరాజ్యం పదేళ్ల ప్రయాణం మా ఇద్దరిది పదేళ్ల ప్రయాణం. చైతన్య చాలా సెన్సిటివ్ మనస్తత్వం. తన పక్కనుండే వారూ బాగుండాలని కోరుకుంటాడు. ఎవరికి ఇబ్బంది వచ్చినా అండగా ఉండేవాడు. రెండు రోజుల క్రితం తనతో మాట్లాడాను. ఎప్పుడూ అప్పులున్నాయని చెప్పలేదు. – చిట్టి, డ్యాన్స్‌మాస్టర్ చైతన్య లేడని ఊహించలేను ఇద్దరం పక్కపక్క సీట్లలోనే ఉండేవాళ్లం. ఎంతో సన్నిహితంగా ఉండేవాడు. అప్పులున్నాయని ఎప్పుడూ చెప్పలేదు. ఆత్మహత్య చేసుకుంటాడని ఊహించలేదు. మాటలు రావడం లేదు. – పండు, డ్యాన్స్‌మాస్టర్ -
కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్‌పై స్పందించిన యాంకర్ రష్మీ
ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే!అప్పులబాధ తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఢీ షో వల్ల మంచి పేరు వచ్చింది, కానీ తగినంత సంపాదన రాలేదని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. చదవండి: ఢీ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు స్వయంగా వెల్లడించాడు. ఇక చైతన్య మాస్టర్ మరణంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ క్రమంలో అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా తాజాగా ఆయన మరణంపై ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ స్పందించింది. నీ సమస్యకు ఇది పరిష్కారం కాదు చైతన్య. నీ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా. నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఇన్‌స్టా స్టోరీలో పేర్కొంది. చదవండి: వెక్కి వెక్కి ఏడ్చా.. చైతన్య మాస్టర్ మరణంపై శ్రద్ధాదాస్ ఎమోషనల్ పోస్ట్ -
కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో
-
కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్
-
సంచలనంగా మారిన డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య
-
ఢీ షో డాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య
-
అన్నయ్య, ఎందుకింత పని చేశావు?: కండక్టర్ ఝాన్సీ ఎమోషనల్
ఢీ డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులబాధ తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఢీ షో వల్ల మంచి పేరు వచ్చింది, కానీ తగినంత సంపాదన రాలేదని ఆయన వాపోయారు. తాజాగా ఆయన మరణంపై డ్యాన్సర్ ఝాన్సీ స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. 'చైతన్య అన్నయ్య తీసుకున్న నిర్ణయం వల్ల తన కుటుంబం బాధపడుతోంది. తను డబ్బులు ఇవ్వాల్సిన కళాకారులతో కూర్చుని మాట్లాడాల్సింది. ఎందుకంటే.. అందరూ తనతో కలిసి ప్రయాణం చేసినవాళ్లే! నా పరిస్థితి ఇలా ఉంది, చచ్చిపోవాలనిపిస్తోందని చెప్పుంటే ప్రతి ఒక్క డ్యాన్సర్ కరిగిపోయేవాళ్లు. మా కళాకారులు డబ్బులు ఇవ్వమని వేధించేంత కఠినమైనవాళ్లు కాదు. అన్నయ్య.. ఎందుకింత పని చేశావో అర్థం కావడం లేదు. మీరెంత మంచివాళ్లంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా తోటివారికి సాయం చేసేవాళ్లు. ఇటీవల జరిగిన ఓ ప్రోగ్రామ్‌లో అన్నయ్యకు కొంత డబ్బు రావాల్సి ఉంది. కొంతమంది ఆర్టిస్టులు వచ్చారు. కానీ మిగతా కొంతమంది ఆర్టిస్టులు అన్నయ్యకు హ్యాండిచ్చారు. దీంతో కమిటీ వాళ్లు రూ.6-7 లక్షలు పేమెంట్ ఇవ్వకుండా ఆపేశారు. అక్కడికి వచ్చిన ఆర్టిస్టులు తమకు డబ్బులివ్వకపోతే ఊరుకోరు కాబట్టి చైతన్య అన్నయ్య వేరే దగ్గర అప్పు తెచ్చి వాళ్లకు డబ్బులిచ్చారు. కళాకారులకు అన్యాయం చేయకూడదన్న మనస్తత్వం ఆయనది. ఇలా పేమెంట్ సర్దే క్రమంలో అప్పు మీద అప్పు చేస్తూ తను ఇబ్బందిపడ్డారు. నాలుగైదు రోజుల క్రితమే ఆయన్ని కలిశాను. నాకు ఢీ షోలో కనిపించాలనుంది, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్తే నెక్స్ట్ సీజన్లో ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చారు. ఆయన ఎంత ఎత్తులో ఉన్నా తన కింద ఉన్న కళాకారులకు ఎంతో మర్యాద ఇస్తారు' అని చెప్తూ భావోద్వేగానికి లోనైంది కండక్టర్ ఝాన్సీ. చదవండి: దుబాయ్‌లో లగ్జరీ విల్లా కొన్న మహేశ్‌బాబు డీ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ ఆత్మహత్య -
ఢీ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ చేసుకున్నారు. ఢీ డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న చైతన్య అప్పుల బాధ తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెల్లూరు క్లబ్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆత్మహత్యకు సంబంధించిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం ఇదే.. మోసం చేసిన సూపర్ స్టార్ ఎవరు?) 'మమ్మీ, డాడీ, చెల్లి నన్ను బాగా చూసుకున్నారు. ఏ కష్టం రానీయలేదు. చెల్లి ఫీల్ అవ్వొద్దు. లవ్ యూ అమ్మా. నా సహచరులందరికీ సారీ. నేను చాలామందిని ఇబ్బంది పెట్టేశా. మీ అందరికీ సారీ. డబ్బు విషయంలో నా మంచితనాన్ని కోల్పోయా. అప్పులు చేయడమే కాదు.. తీర్చే సత్తా ఉండాలి. సత్తా ఉంది.. కానీ నా వల్ల అవ్వట్లేదు. ప్రస్తుతం నెల్లూరులో ఉన్నా. ఇది నా లాస్ట్ డే. అప్పుల బాధను తట్టుకోలేకపోతున్నా. నా వల్ల ఇబ్బంది పడిన వారందరికీ సారీ. డ్యాన్స్ షోతో నాకు పేరు వచ్చింది. కానీ తగినంత సంపాదన రాలేదు.' అంటూ సెల్ఫీ వీడియోను షేర్ చేశారు. (ఇది చదవండి: మీకు హీరోలను అడిగే ధైర్యం ఉందా?.. శ్రియా కామెంట్స్ వైరల్) View this post on Instagram A post shared by ROCK N ROLL DANCE STUDIO (@team_rds_1) -
‘చమ్కీల అంగీలేసి..’ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ చిన్నదెవరో తెలుసా?
‘చమ్కీల అంగీలేసి ఓ వదినే.. చాకు లెక్కుండేటోడే ఓ వదినే.. కండ్లకు ఐనా బెట్టి.. కత్తోలే కన్నెట్ల కొడ్తుండెనే..’ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. అచ్చమైన తెలంగాణలో యాసలో సాగే ఈ పాట నాని హీరోగా నటించిన ‘దసరా’ సినిమాలోనిది. అయితే అందరి దృష్టి ఈ పాటలోని లిరిక్స్, మ్యూజిక్ కంటే.. అది ఆలపించిన ఫీమేల్ సింగర్పైనే ఎక్కువ పడింది. ఇటీవల విడుదలైన లిరికల్ వీడియోలో ఆమె తన గొంతుతో పాటు.. హావ భావాలతో అందరికి ఆకర్షించింది. ఇంత చక్కగా ఆలపించిన ఆ ఫీమేల్ సింగర్ ఎవరబ్బా అని నెటిజన్స్ వెతకడం ప్రారంభించారు. అయితే ఆమె పక్కా తెలుగమ్మాయి అనుకున్నారంతా.. కానీ ఈ పాట పాడింది ఓ తమిళ అమ్మాయి. ఆమె పేరు దీక్షిత అలియాస్ ధీ. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ముద్దుల కూతురే ఈ ధీ. ఆస్ట్రేలియాలో చదువుకున్న ధీ..సంగీతంపై ఉన్న మక్కువతో 14 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చేసింది. View this post on Instagram A post shared by D H E E (@dhee___) సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన అనేక సినిమాల్లో ధీ పాటలు పాడింది. ముఖ్యంగా తమిళంలో ఆమె ఆలపించిన పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగులో ‘గురు’లోని ‘ఓ సక్కనోడా..’, మారి 2లోని రౌడీ బేబీ, ఆకాశమే హద్దురాలోని కాటుక కనులే’ సాంగ్స్ బాగా ఫేమస్ అయ్యాయి. అయితే ఇన్నాళ్లు ఆమె ఆలపించిన పాటలు అందరికి తెలుసు కానీ. ధీ గురించి మాత్రం ఎవరికి తెలియదు. కానీ ‘చమ్కీల అంగీలేసి..’పాటతో ధీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఓ రకంగా చెప్పాలంటే ఓవర్‌నైట్ స్టార్ అయింది. -
ఢీ– 13 విన్నర్‌గా లారీ డ్రైవర్ కూతురు.. మనమ్మాయే!..
సాక్షి, తాండూరు టౌన్(వికారాబాద్): తాండూరు పట్టణానికి చెందిన కావ్యశ్రీ ఓ టీవీ ఛానల్లో ప్రసారమైన ఢీ– 13 డ్యాన్స్ పోటీల్లో టైటిల్ విన్నర్‌గా నిలిచింది. బుధవారం రాత్రి జరిగిన ఫైనల్ పోటీల్లో కార్తీక్‌ను ఓడించి టైటిల్ దక్కించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ హీరో అల్లు అర్జున్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకుంది. పట్టణంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన లారీ డ్రైవర్ మహేశ్, పద్మావతి దంపతుల కూతురు దువచర్ల కావ్యశ్రీ, స్థానిక భాష్యం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. చిన్ననాటి నుంచి డ్యాన్స్‌పై మక్కువ పెంచుకున్న ఆమెకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా ఢీ– 13లోఅవకాశం దక్కింది. ప్రతీ రౌండ్లో సత్తా చాటుతూ పోటీదారులకు సవాలు విసిరింది. ఫైనల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన ద్వారా విజేతగా నిలిచింది. కావ్యశ్రీ విజయంపై భాష్యం కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, అధ్యాపకులు, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, పట్టణ వాసులు ఆనందం వ్యక్తంచేశారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మంచి కొరియోగ్రాఫర్‌గా ఎదగాలనేదే తన లక్ష్యమని కావ్యశ్రీ తెలిపింది. చదవండి: కపిల్ దేవ్ బయోపిక్కు షాక్, నిర్మాతలపై చీటింగ్ కేసు చదవండి: బిగ్‌బాస్‌పై యాంకర్ రవి తల్లి షాకింగ్ కామెంట్స్ -
సోషల్ మీడియాలో దుమ్మురేపే ‘నృత్య సందేశం’
దక్షిణ భారతదేశం నుంచి రెండు జంటలు ఇప్పుడు వార్తల్లో ఉన్నాయి. ఒకటి తమిళనాడు నుంచి ధీ–అరివు జంట. రెండు కేరళ నుంచి జానకి– నవీన్ రజాక్ జంట. ధీ–ఇరువి చేసిన సింగిల్ వీడియో ‘ఎంజాయ్ ఎంజామి’ ఈ దేశం మూలవాసులను, పూర్వికుల సామరస్య జీవనాన్ని గుర్తు చేసే సందేశం ఇస్తూ సంచలన విజయం నమోదు చేసింది. ఇక కేరళ జంట చేసిన ‘రస్పుటిన్’ నృత్యం అనివార్యంగా ద్వేషానికి ప్రతిఘటనగా మలచబడింది. కొంతమంది కుర్రవాళ్లు ముందు యుగం దూతలు అన్నాడు శ్రీశ్రీ. ప్రేమను, సామరస్యాన్ని సందేశంగా ఇవ్వడానికి ఈ కాలపు అమ్మాయిలు, అబ్బాయిలు ముందుకు రావడం అవసరం అనే ఎక్కువ మంది భావిస్తున్నారు. 1978 నాటి డిస్కో గీతం ‘రస్పుటిన్’ ఎంత మందికి గుర్తుందో కాని సడన్‌గా ఆ పాట ఇప్పుడు మళ్లీ కేరళ అంతా మార్మోగుతోంది. డిస్కో గ్రూప్ ‘బోని ఎం’ తయారు చేసి పాడిన ఆ పాట ఆ రోజుల్లో చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈ పాటలోని ‘రస్పుటిన్’ అనే పేరు 20 శతాబ్దంలో రష్యా జార్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఒక మత పెద్దది. ‘పొలిటికల్ మేనిపులేటర్’గా ఖ్యాతి గడించిన రస్పుటిన్ను ఈ పాట తిట్టిందో పొగిడిందో తెలియనివారు ఉన్నారు. ఏమైనా దాని బీట్‌కు మంచి ఊపు ఉంది. అందుకే త్రిశూర్ మెడికల్ కాలేజీలోని ఇద్దరు మెడికోలు దానికి 30 సెకన్ల స్టెప్పు వేసి ‘ఇన్స్టాగ్రామ్’లో పోస్ట్ చేశారు. తాము చదువుతున్న మెడికల్ కాలేజీ టాప్ ఫ్లోర్లో ఉండే హౌస్ సర్జన్స్ క్వార్టర్స్ కారిడార్‌లో దీని తోటి విద్యార్థి షూట్ చేయగా డాన్స్ చేసి పోస్ట్ చేశారు. ఆ ఇద్దరి పేర్లు జానకి ఓమ్కుమార్, నవీన్ రజాక్. వీళ్లిద్దరి డాన్స్ ముఖ్యంగా కాళ్ల కదలిక, ఉత్సాహం నెటిజన్స్‌కు ఎంత నచ్చాయంటే రాత్రికి రాత్రి వాళ్లు స్టార్లైపోయారు. కాలు కదిపిన మెడికో జంట కరోనా వ్యాప్తి వైద్యరంగంపై ఎంత వొత్తిడి పెంచిందో అందరికీ తెలుసు. వైద్య విద్యార్థులు కూడా ఇందుకు అతీతం కాదు. స్ట్రెస్ నుంచి బయట పడటానికి డాక్టర్లు కూడా ఐసియులలో డాన్స్ చేసి వీడియోలు పోస్ట్ చేయడం చూశాం. అలానే కేరళ త్రిశూర్ మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న నవీన్ రజాక్, థర్డ్ ఇయర్ చదువుతున్న జానకి ఓమ్ కుమార్ కూడా నాటి డిస్కో గీతం ‘రస్పుటిన్’కు స్టెప్పులేసి పోస్ట్ చేశారు. వారిద్దరి ఆనంద తాండవం క్షణాల్లో వైరల్‌గా మారింది. కేరళతో పాటు గల్ఫ్ దేశాలకు కూడా పాకిపోయింది. అందరూ వారి డాన్స్‌ను మెచ్చుకున్నారు. జానకి తల్లి డాక్టర్, తండ్రి సైంటిస్ట్. నవీన్ రజాక్ తండ్రి వ్యాపారి. అతని కుటుంబీకులు హైదరాబాద్‌లో సివిలింజనీరింగ్ లో ఉన్నారు. త్రిశూర్ మెడికల్ కాలేజీలో ‘వైకింగ్స్’ పేరుతో 13 మంది సభ్యుల డాన్స్ బృందం ఉంది. అందులో నవీన్, జానకి ఇద్దరూ సభ్యులు. ఇద్దరూ అద్భుతమైన డాన్సర్లు. అందుకే డ్యూటీ మధ్యలో ఆటవిడుపుగా ఈ డాన్స్ షూట్ చేసి పోస్ట్ చేశారు. చాలా పొగడ్త.. వివాదం.. పొగడ్తలు వచ్చి పడ్డ ఈ జంటను ఇప్పటి కేరళ సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఒకరిద్దరు ‘మత వ్యాఖ్యానం’ చేయడానికి చూశారు. ఒక అడ్వకేట్ దీనిని ‘డాన్స్ జిహాద్’గా వ్యాఖ్యానిస్తూ ఫేస్బుక్ పోస్ట్ పెట్టడంతో అతనికి విపరీతమైన ఎదురు సమాధానాలు వచ్చాయి. ప్రతి దాన్ని మతంతో ముడిపెట్టడంపై మండిపడ్డ మెడికోలు, విద్యార్థి సంఘ నాయకులు ‘హేట్ రెసిస్ట్’ హ్యాష్స్టాగ్తో అదే పాటకు బోలెడన్ని వీడియోలు చేస్తూ తిరిగి పోస్ట్ చేయసాగారు. బాగా డాన్స్ చేసే జంటకు 5 వేల రూపాయల క్యాష్ అవార్డు కూడా ప్రకటించారు. ఇన్స్టాగ్రామ్ లో 30 సెకన్ల వీడియోకు అనుమతి ఉండటం వల్ల నిడివి అంతలోనే ఉండాలని షరతు పెట్టారు. దాంతో మా నృత్యం ద్వేషానికి ప్రతిఘటనగా అభివర్ణిస్తూ అక్కడ చాలా మంది డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ విమర్శలు ఎలా ఉన్నా ఈ జంటను మీరు మళ్లీ మళ్లీ ఇలా డాన్స్ చేయండి అని కోరుతున్నవారే ఎక్కువ. ఈ మట్టి సామరస్యమైనది మరోవైపు గత నెల రోజులుగా ఇండి పాప్‌లో ‘ఎంజాయ్ ఎంజామి’ పాట దుమారం రేపుతోంది. దీనిని పాడింది తమిళ గాయకుడు అరివు. గాయని ధీ (దీక్షిత). ఇద్దరికీ శ్రీలంకకు వలస వెళ్లిన తమిళ కుటుంబాల మూలాలు ఉన్నాయి. గాయకుడు అరివును అతని నానమ్మ ‘నా తండ్రీ’ (ఎంజామి) అని పిలిచేదట. ‘ఎంజాయ్ నా తండ్రీ’ అర్థంలో ‘ఎంజాయ్ ఎంజామి‘ పేరుతో అతడు పాట రాసి సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వంలో పాడి వీడియో విడుదల చేశాడు. ధీ దీనికి గొంతు ఇచ్చింది. ‘ఈ మట్టి మన తాతలు తండ్రులు కాపాడి మనకు ఇచ్చారు. వారు నదుల వెంట నాగరికతను కలలు కన్నారు. వారు ఎంతో సామరస్యాన్ని పాటించారు. అందరూ దగ్గరగా రండి. అందరూ దగ్గరగా కూడండి. అందరూ ఎంజాయ్ చేయండి. కలిసి ఎంజాయ్ చేయండి’ అనే అర్థాన్ని ఇస్తూ ప్రకృతిని తలపోస్తూ ‘ఎంజాయ్ ఎంజామి’ పాట సాగుతుంది. పాట చివరలో తన నానమ్మను చూపిస్తాడు కూడా. అరివు కనీసం రేడియోకు కూడా స్థోమత లేని కుటుంబంలో పెరిగాడు. దర్శకుడు పా రంజిత్‌కు రాక్ బ్యాండ్ ‘ది క్యాస్ట్‌లెస్ కలెక్టివ్’లో సభ్యుడయ్యాడు. దళిత స్పృహతో పాటలు రాసే ఇతడికి రంజిత్ అవకాశం ఇచ్చాడు. తమిళంలో ఎన్నో పాటలు రాసి పాడుతున్నాడు. ధీ కూడా సామాజిక సందేశాన్నిచ్చే పాప్ గీతాలను విడుదల చేస్తోంది. ఆమె గానానికి ఒక విశిష్ట తత్త్వం ఉంటుందని అంటారు. ఆమె గొంతు వినాలంటే వెంకటేశ్ ‘గురు’లో ‘ఓ సక్కనోడా’... పాట వినాలి. సంగీతం, నృత్యంలో కొత్తతరం సందేశాన్ని ఇమిడ్చే ప్రయత్నం చేస్తుంది. పూర్వం మంచి బుద్ధులు పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు పిల్లలు చెప్పే కాలం వచ్చింది. పిల్లల చేత చెప్పించుకునే స్థితిలో సమాజం ఎందుకుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. – సాక్షి ఫ్యామిలీ -
ప్రముఖ డ్యాన్స్ షోలో ప్రమాదం..కంటెస్టెంట్‌కు తీవ్ర గాయం!
ప్రముఖ డ్యాన్స్ షో ఢీ తెలుగునాట సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది డ్యాన్సర్లు సినిమాల్లో స్టార్ కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు. అంతేకాక కంటెస్టెంట్లు సైతం సినిమాల్లో పలు పాటలకు చిందేస్తున్నారు. ఇప్పటివరకు పన్నెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఢీ.. ప్రస్తుతం 13వ సీజన్‌ను నిర్వహిస్తుంది. అయితే తాజాగా షోలో డ్యాన్స్ చేస్తూ ఓ లేడీ కంటెస్టెంట్ ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవలె విడుదలైంది. ఇందులో..డ్యాన్స్ చేస్తూ ఓ కంటెస్టెంట్ ప్రమాదవశాత్తూ స్టేజ్ కింద పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయం అయ్యింది. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ప్రమాదం జరిగిందని స్పష్టమవుతోంది. డ్యాన్స్ చేస్తూ కిందకు దూకే ఓ షాట్లో కంటెస్టెంట్ ప్రమాదవశాత్తూ కింద పడిపోవడంతో తలకు తీవ్రంగా దెబ్బ తగిలి రక్తస్రావమైంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఇది నిజంగానే ప్రమాదమా లేక పబ్లిసిటీ స్టంటా అన్నది తెలియాలంటే మాత్రం వచ్చే వారం ఏప్రిల్14న విడుదలయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సి ఉంది. చదవండి : ఈ బుల్లితెర జంట విడిపోనుందా? చూస్తుండగానే మోనాల్‌కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్! -
ఈ బుల్లితెర జంట విడిపోనుందా?
ప్రముఖ డ్యాన్స్ షో ఢీతో ఎంతో మంది డ్యాన్సర్లు సినిమాల్లో స్టార్ కోరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు. అంతేగాక ఈ షోలో అదరగొట్టె స్టేప్పులతో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. అందులో అక్సా ఖాన్ కూడా ఉంది. ఢీ 10 కంటెస్టెంట్‌గా వచ్చిన అక్సా ఛాంపియన్ కాలేనప్పటికి ఈ సీజన్‌కు ప్రత్యేకంగా నిలిచింది. స్టేజ్‌పై స్వింగ్ జర స్వింగ్ జర అనే పాటకు తనదైన శైలిలో డ్యాన్స్ చేసి ప్రేక్షకులను, షో జడ్జ్‌లను మంత్రముగ్ధులను చేసింది. మరి ముఖ్యంగా తన డ్యాన్స్, ఆటిట్యూడ్‌తో శేఖర్ మాస్టర్‌ను కట్టిపడేసేది ఈ ముద్దుగుమ్మ. చివరి వరకు పోటీ ఇచ్చిన అక్సా ఫైనల్‌కు ముందే ఎలిమినేట్ అయ్యి ఇంటిదారి పట్టింది. అయినప్పటికి ఫైనల్లో అక్సాతో స్పెషల్ పర్ఫామెన్స్ కింద శేఖర్ మాస్టర్ డ్యాన్స్ చేయించాడు. ముఖ్య అతిథిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆమె స్వింగ్ జర పాటకు కాలు కదిపింది. దీంతో సెలబ్రెటీ అయిపోయన అక్సా పలు ఇంటర్వ్యూలో హీరోయిన్ అవ్వాలనేది తన కల అంటూ చెప్పుకొచ్చెది. ఇదిలా ఉండగా ఇదే షోలోని మరో డ్యాన్సర్, బుల్లితెర మైకల్ జాక్సన్ పండుకు అక్సాకు మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎందుకంటే పండును చాంపియన్స్ నుంచి ఎలిమినేట్ చేయడం అక్సాఖాన్‌ను బాధించింది. దీంతో ఆమె పండు కోసం శేఖర్ మాస్టర్‌తో వాదనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన అప్పట్లో సోషల్ మీడియాల్లో తీవ్ర దుమారం రేపింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ టాక్. అది తెలిసి ఢీ ప్రేక్షకులు, అభిమానులు పండు, అక్సాలు ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పండగ చేసుకున్నారు. అంతేగాక పలు కార్యక్రమాల్లో వీరిద్దరూ జంట డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇవ్వడంతో ఇక వీరద్దరిని జోడిగా పిక్సైయిపోయారు. అంతేగాక ఈ జంట త్వరలోనే ఓ డ్యాన్స్ అకాడమిని స్థాపించి సెటిల్ అయిపోయి పెళ్లి చేసుకొవాలనే యోచనలో ఉన్నట్లు కూడా ఇటీవల గుసగుసలు వినిపించాయి. ఇక అక్సా ప్రసుతం ఆర్జీవీ అనే మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు పండు కూడా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాడు. పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫుల్ బిజీ అయిపోయాడు. అంతా బాగా సాగుతున్న క్రమంలో ఈ మధ్య పండు, అక్సాల మధ్య మాటలు తగ్గినట్లుగా కనిపిస్తోదంట. వీరిమధ్య ఏవో అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు వినికిడి. కారణమేంటో తెలియదు గానీ పండు తనను దూరం పెడుతున్నాడని, తన ప్రవర్తన నచ్చడం లేదంటూ అక్సా తన సన్నిహితులతో వాపోయిందట. దీంతో ఈ జంట తమ ప్రేమయాణానికి బ్రేకప్ చెప్పుకునేలా ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చదవండి: ఈ వార్త నిజమైతే.. ఫ్యాన్స్‌కు పండగే! ఫోన్ నెంబర్ లీక్ చేసిన రాజ్ తరుణ్! -
డోస్ రెండింతలు
మంచు విష్ణు కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘ఢీ’. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. సోమవారం విష్ణు పుట్టినరోజు సందర్భంగా ‘ఢీ’ చిత్రానికి సీక్వెల్‌గా ‘డి–డి’ని ప్రకటించారు చిత్రనిర్మాత, హీరో మంచు విష్ణు, దర్శకుడు శ్రీను వైట్ల. 24 ఫ్యాక్టరీ ఫిలింస్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. సంకెళ్ల మధ్య రెండు ‘డి’ అక్షరాలను డిజైన్ చేశారు. ‘ఢీ’లో ఉన్న కామెడీ, యాక్షన్ ఈ సీక్వెల్లో రెట్టింపు ఉంటాయనే ఉద్దేశంతో ‘డబుల్ డోస్’ అని ట్యాగ్‌లైన్ పెట్టారు. గోపీమోహన్, కిషోర్ గోపులు రచయితలుగా చేస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: అవ్రామ్ భక్త మంచు, సంగీతం: మహతి స్వరసాగర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్. -
డేరింగ్ అండ్ డ్యాషింగ్
మంచు విష్ణుని డేరింగ్ అండ్ డ్యాషింగ్‌గా చూపించడానికి రెడీ అవుతున్నారట శ్రీను వైట్ల. 13 ఏళ్ల క్రితం విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన సూపర్‌హిట్ మూవీ ‘ఢీ’ గుర్తుండే ఉంటుంది. అందులో ఉన్న ‘నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు’ డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ‘ఢీ’కి సీక్వెల్ చేయడానికి విష్ణు–శ్రీను వైట్ల రెడీ అవుతున్నారని టాక్. కథ కూడా రెడీ అయిందట. ‘ఢీ2’ (డేరింగ్ అండ్ డ్యాషింగ్) టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో ఫస్ట్ పార్ట్ కన్నా మరింత కామెడీతో పాటు ఫుల్ యాక్షన్ కూడా ఉంటుందని తెలిసింది. ఇందులో విష్ణు హీరోగా నటించడమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారట. ఈ ఏడాది చివరిలో షూటింగ్ మొదలుపెట్టాలను కుంటున్నారని తెలిసింది. -
శ్రీను వైట్లకు మరో చాన్స్!
కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లతో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల తరువాత వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో పడ్డాడు. ఆగడు నుంచి మొదలైన శ్రీనువైట్ల ఫ్లాప్‌ల పరంపర అమర్ అక్బర్ ఆంటొని వరకు సాగింది. దీంతో శ్రీనువైట్లకు చాన్స్ ఇచ్చే హీరోలే కరువయ్యారు. ఇంకా ఈ దర్శకుడి కెరీర్ ముగిసినట్టే అనుకుంటున్న తరుణంలో మరో చాన్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు మంచు విష్ణు. శ్రీనువైట్ల, మంచు విష్ణు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. తాజాగా విష్ణు ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు. 12 ఏళ్ల తరువాత శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించబోతున్నట్టుగా వెల్లడించారు. అయితే ఈ సినిమా వీరి కాంబినేషన్లో సూపర్ హిట్ అయిన ఢీ మూవీకి సీక్వల్ అన్న ప్రచారం జరుగుతున్నా విష్ణు మాత్రం సీక్వల్ అన్న విషయం ప్రకటించలేదు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ మూవీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
నయన్‌తో జ్యోతిక ఢీ
తమిళసినిమా: నటి జ్యోతిక నయనతారతో ఢీకొనడానికి సిద్ధం అవుతున్నారా? అవుననే అంటున్నారు చిత్ర వర్గాలు. ఒకప్పుడు అగ్రనాయకిగా వెలుగొంది వివాహానంతరం సినిమాలకు దూరమై కొంతకాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన నటి జ్యోతిక. ప్రస్తుతం అగ్రనాయకిగా రాణిస్తున్న నటి నయనతార. వీరిద్దరి మధ్య పోటీ నెలకొనబోతోంది. నటి జ్యోతిక 36 వయదినిలే చిత్రంతో సక్సెస్ అందుకుని తన జోరు పునరావృతం చేసుకున్నారు . ప్రస్తుతం మగళీర్ మట్టుం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుం టోంది. కాగా జ్యోతిక మరో చిత్రం లోనూ నటించేస్తున్నారు. ఆ చిత్ర దర్శకుడు బాలా. దీనికి నాచనార్ అనే పేరు నిర్ణయించారు. ఇందులో జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికి 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందట. చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయట. ఇదే తేదీన నయనతార నటిస్తున్న వేలైక్కారన్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాత ఆర్డీ.రాజా ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో శివకార్తికేయన్ కథా నాయకుడు. ఈయన నయనతారతో కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే. మోహన్‌రాజా దర్శకుడు. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మొత్తం మీద నయనతార, జ్యోతికల చిత్రాలు ఒకే రోజున తెరపై పోటీ పడనున్నాయన్నమాట