తమిళసినిమా: నటి జ్యోతిక నయనతారతో ఢీకొనడానికి సిద్ధం అవుతున్నారా? అవుననే అంటున్నారు చిత్ర వర్గాలు. ఒకప్పుడు అగ్రనాయకిగా వెలుగొంది వివాహానంతరం సినిమాలకు దూరమై కొంతకాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన నటి జ్యోతిక. ప్రస్తుతం అగ్రనాయకిగా రాణిస్తున్న నటి నయనతార. వీరిద్దరి మధ్య పోటీ నెలకొనబోతోంది. నటి జ్యోతిక 36 వయదినిలే చిత్రంతో సక్సెస్ అందుకుని తన జోరు పునరావృతం చేసుకున్నారు
. ప్రస్తుతం మగళీర్ మట్టుం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుం టోంది. కాగా జ్యోతిక మరో చిత్రం లోనూ నటించేస్తున్నారు. ఆ చిత్ర దర్శకుడు బాలా. దీనికి నాచనార్ అనే పేరు నిర్ణయించారు. ఇందులో జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికి 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందట. చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయట.
ఇదే తేదీన నయనతార నటిస్తున్న వేలైక్కారన్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాత ఆర్‌డీ.రాజా ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో శివకార్తికేయన్ కథా నాయకుడు. ఈయన నయనతారతో కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే. మోహన్‌రాజా దర్శకుడు. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మొత్తం మీద నయనతార, జ్యోతికల చిత్రాలు ఒకే రోజున తెరపై పోటీ పడనున్నాయన్నమాట
నయన్‌తో జ్యోతిక ఢీ
Published Thu, Jun 22 2017 4:13 AM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM
Advertisement
Advertisement