Nayanathara
-
నయనతార 'అమ్మోరు2'లో పూజా కార్యక్రమంలో రెజీనా,మీనా (ఫోటోలు)
-
నయనతార డాక్యుమెంటరీ.. ఎవరికీ ఉపయోగం లేదన్న ప్రముఖ రచయిత!
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ డాక్యుమెంటరీ విడుదల తర్వాత వివాదం మొదలైన సంగతి తెలిసిందే. తన సినిమాలో మూడు సెకన్ల క్లిప్‌ను అనుమతి లేకుండా వాడారని హీరో ధనుశ్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరగనుంది.ఇదిలా ఉండగా నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్ డాక్యుమెంటరీపై ప్రముఖ బాలీవుడ్ నవలా రచయిత్రి శోభా దే మండిపడ్డారు. తాను నయనతార డాక్యుమెంటరీని చూశానని.. కానీ అందులో స్ఫూర్తిదాయకమైన అంశాలు ఏమీ లేవన్నారు. ప్రోమోలు చూసే వరకు నయనతార గురించి నాకు పూర్తిగా తెలియదని.. అందుకే ధైర్యం చేసి 45 నిమిషాల డాక్యుమెంటరీ చూసినట్లు తెలిపారు.(ఇది చదవండి: నయన్- ధనుశ్ వివాదం.. ఆ విషయం తెలిసి షాకయ్యా: రాధిక శరత్ కుమార్)అయితే వివాహం లాంటి వ్యక్తిగత విషయాలను డబ్బుల కోసం ఇలా డాక్యుమెంటరీ రూపొందించడం సరికాదని ఆమె విమర్శించారు. ఇందులో ఎలాంటి సందేశం లేదని అన్నారు. ఆమెను చూసి మరికొందరు సినీ తారలు డబ్బుల కోసం ఇదే పద్ధతిని పాటిస్తారేమో అంటూ విమర్శలు చేశారు. అయితే కొంతమంది శోభా దే వ్యాఖ్యలను సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.కాగా.. నయనతార రూపొందించిన ఈ డాక్యుమెంటరీ కేవలం తన వ్యక్తిగత, కెరీర్, వివాహం ఆధారంగా తీసుకొచ్చారు. విఘ్నేష్ శివన్‌తో ఆమె వివాహం గురించి ప్రధానంగా చూపించారు. ఈ డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ ధాన్ సెట్స్ ఫుటేజీని ఉపయోగించినందుకు రూ.10 కోట్లు చెల్లించాలంటూ ధనుష్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Shobhaa De (@shobhaade) -
ధనుశ్- నయనతార వివాదం.. అప్పుడే పెళ్లిలో కలిశారు.. కానీ!
ప్రస్తుతం కోలీవుడ్‌ను కుదిపేస్తోన్న వివాదం ఏదైనా ఉందంటే అది ధనుశ్- నయనతారదే. ఇటీవల నయనతార లైఫ్ స్టోరీగా వచ్చిన డాక్యుమెంటరీ రిలీజైన తర్వాత ఈ వివాదం మొదలైంది. 2015లో ధనుశ్-నయన నటించిన నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్‌లో మరింత చర్చకు దారితీసింది.ఈ వివాదం మొదలైన తర్వాత కోలీవుడ్‌లో వీరిద్దరు ఒకరంటే ఒకరికీ అస్సలు పడటం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఈ కాంట్రవర్సీ కొనసాగుతున్న టైమ్‌లో ఊహించని విధంగా ఇద్దరూ ఓకే వేదికపై మెరిశారు. తమిళ నిర్మాతల్లో ఒకరైన ఆకాశ్ భాస్కరన్ పెళ్లికి హాజరయ్యారు. ఈ వేడుకలో పక్కపక్కనే ఉన్నప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు సరికదా.. కనీసం చూసుకోలేదు కూడా. ఈ పెళ్లికి నయన్ భర్త విఘ్నేశ్ శివన్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.కాగా.. నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. కేవలం మూడు సెకన్ల ఫుటేజీని ఉపయోగించినందుకు ధనుశ్ లీగల్ నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింత ముదిరింది.#Dhanush & #Nayanthara together at the recent wedding of Producer AakashBaskaran pic.twitter.com/ulZDckjak8— AmuthaBharathi (@CinemaWithAB) November 21, 2024 #Dhanush & #Nayanthara today at a Marriage Function pic.twitter.com/xHURf15YJ6— Arun Vijay (@AVinthehousee) November 21, 2024 -
ఓటీటీకి నయనతార హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన మలయాళ హారర్ థ్రిల్లర్ మాయనిజాల్. ఈ చిత్రంలో కుంచకోబోబన్ హీరోగా నటించాడు. 2021లో థియేటర్లలో రిలీజైన ఈ మలయాళం మూవీ దాదాపు మూడేళ్ల తర్వాత ఓటీటీకి వస్తోంది. ఈ నెల 30 నుంచి ఆహా తమిళంలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు అప్పు భట్టాత్రి దర్శకత్వం వహించారు.మర్డర్ నేపథ్యంలో..!అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దాదాపు 30 ఏళ్ల క్రితం జరిగిన ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఓ చిన్నపిల్లాడు ఈ మర్డర్ కేసును ఎలా కనిపెట్టాడనేదే అసలు కథ. ఇందులో నయనతార ఆ పిల్లాడికి తల్లిపాత్రలో నటించింది. కుంచకోబోబన్ న్యాయమూర్తి పాత్రలో మెప్పించారు. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ జానర్ చిత్రాలు ఇష్టపడేవారుంటే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఈ మూవీని ట్రై చేయొచ్చు. Ella unmayum innum rendu naal-la therinjidum😐😌#MayaNizhal premieres from August 30 #ahatamil #Nayanthara @Teamaventures @appubhattathiri @DivyaPrabhaa @Amudhavananoffl @prothiyagu @nizhalmovie @ThiPRCom pic.twitter.com/WfYfSAjKdO— aha Tamil (@ahatamil) August 28, 2024 -
ప్రైవేట్ జెట్, రూ.100 కోట్ల లగ్జరీ బంగ్లా, యాడ్స్‌తో కోట్లు, ఎవరీ ‘తార’
ఇతర రంగాలతో పోలిస్తే చిత్ర పరిశ్రమలో పురుషుల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. తెరమీద ఎలివేషన్లు, బీజీఏంలు హీరోల కున్నంతగా హీరోయిన్లకు ఉండవు. ఇక రెమ్యునరేషన్ల సంగతి సరే సరి. అయితే ఈ అడ్డుగోడల్ని బద్దలుకొట్టి చాలా కొద్దిమంది అయినా కథానాయకలుగా, డైరెక్టరులుగా తమ సత్తాచాటుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు, బాక్సాఫీసు వసూళ్లతో మేమూ సూపర్ స్టార్లమే అని నిరూపించుకుంటున్నారు. డైరెక్టర్లు, నిర్మాతల ఫేవరెట్స్‌గా అవత రిస్తున్నారు. అలాంటి వారిలో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటూ లేడి సూపర్ స్టార్‌గా పాపులర్ అయిన నయనతార ఒకరు. పార్ట్ టైమ్ మోడల్‌గా మొదలై, టెలివిజన్ ప్రెజెంటర్నుంచి స్టార్ హీరోయిన్గా ఎదిగిన తార నయనతార. స్టార్ హీరోలని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్, అంతకుమించిన క్రేజ్‌తో నయనతారనా మజాకానా అనిపించుకుంటోంది. కరియర్లో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా డిజాస్టర్స్ వెక్కిరించినా వరుస సినిమాలతో ప్రేక్షకులను మదిలో స్టార్ హీరోయిన్గా ముద్ర వేసుకుంది. తాజాగా నయన్ 50 సెకన్ల యాడ్‌కు రూ. 5 కోట్ల రూపాయల దాకా వసూలు చేసిందన్న వార్త హాట్ టాపిక్‌గా నిలిచింది. పలు మీడియా కథనాల ప్రకారం నయనతార 50 సెకన్ల ఒక కార్పొరేట్ ప్రకటన కోసం ఏకంగా రూ. 5 కోట్లు వసూలు చేసిందట. అంతేకాదు నయనతార ప్రతీ మూవీకి రూ. 10 కోట్లు వసూలు చేస్తుందనే ప్రచారం కూడా ఉంది. అంతేకాదు ముంబైలో లగ్జరీ బంగ్లాతో సహా 4 విలాసవంతమైన ఇళ్లున్నాయి. రూ 100 కోట్ల విలువైన లగ్జరీ బంగ్లాలో భర్త విఘ్నేష్‌తో, ఇద్దరు ప్లిలలతో నివస్తోంది. ఇంకా ఖరీదైన కార్ల కలెక్షన్, లగ్జరీ ప్రైవేట్ జెట్స్కూడా నయన్, విఘ్నేష్ సొంతం. ఇటీవల ఇద్దరూ విడిపో బోతున్నారన్న వార్తలను కూడా ఖండించారు ఈ స్వీట్ కపుల్. కాగా గత ఏడాది అట్లీ దర్శకత్వంలో వచ్చి జవాన్ మూవీతో షారుఖ్‌తో కలిసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. యాక్షన్-ప్యాక్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టేసింది. అయితే ఆమె నటించిన అన్నపూరణి చిత్రం మాత్రం వివాదంలోచిక్కుకుంది. ఈ వివాదంపై క్షమాపణలు చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది. -
హీరో లేకుండానే బ్లాక్ బ్లస్టర్: ఏకంగా 800 శాతం లాభాలు
ఏదైనా సినిమా విజయవంతం కావాలంటే దర్శక నిర్మాతలతో పాట ఎలా ఉన్నా హీరోదే కీలక పాత్ర అనేది చాలాకాలంగాకొనసాగుతున్న ట్రెండ్. ఈ ట్రెండ్‌కు భిన్నంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు బ్లాక్ బ్లస్టర్ హిట్స్ అవుతున్న సినిమాలకు కొదవలేదు. అయితే హీరో లేకుండానే కలెక్షన్ల సునామీ సృష్టించిన సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ వివరాలు మీ కోసం.. 2010ల మధ్యకాలంలో తమిళం , తెలుగు చలనచిత్ర పరిశ్రమలలో మహిళా ప్రధాన చిత్రాలు బాగా పెరిగాయని చెప్పొచ్చు. అనుష్క శెట్టి, నయనతార లాంటి హీరోయిన్లు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ నమోదు చేశారు. వీటిల్లోచాలావరకు హిందీతోపాటు, ఇతర భాషలలో కూడా రీమేక్ అయ్యాయి. అదే 2018 తమిళ సూపర్ హిట్ మూవీ ‘కొలమావు కోకిల’. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, తొమ్మిది రెట్లకుపైగా లాభాలను సంపాదించింది. నయనతార టైటిల్ రోల్లో నటించిన ‘కొలమావు కోకిల’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించగా యోగి బాబు, శరణ్య, శరవణన్, రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే తెలుగులో కోకోకోకిల పేరుతో రీమేక్ అయింది. కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారానే, ఈ చిత్రం విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయం సాధించింది. రూ. 8 కోట్ల బిడ్జెట్తో నిర్మితమై, ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 800 శాతం లాభపడిన చిత్రంగా రికార్డు దక్కించుకుంది. 2022లో, కొలమావు కోకిల సినిమాను హిందీలో నూతన దర్శకుడు సిద్ధార్థ్ సేన్ రీమేక్ చేశారు. పంజాబ్ నేపథ్యంలో తెరకెక్కిన గుడ్‌లక్ జెర్రీ చిత్రంలో జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో దీపక్ డోబ్రియాల్, మితా వశిష్ట్, నీరజ్ సూద్, సౌరభ్ సచ్‌దేవా తదితరులు నటించారు. ఈ చిత్రం థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో రిలీజ్ అయింది. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. కథ ఏంటంటే.. కోకిల (నయనతార) మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. తన తల్లి (శరణ్య)కు కాన్సర్ రావడంతో ఆపరేషన్ కు 15 లక్షలు కావాలి. మసాజ్ పార్లర్ లో ఉద్యోగం ద్వారా వచ్చే సొమ్ము సరిపోక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కోకిల, డ్రగ్స్ సరఫరా చేసే ఓ గ్యాంగ్ లో ట్రాన్స్ పోర్టర్ గా చేరుతుంది. ఈ క్రమంలో ఆమె అనుకోని కష్టాల్లో పడుతుంది. ఈ కష్టాల్లోంచి ఆమె బయట పడడానికి ఆమె ఎదుర్కొన్న సమస్యలేమిటి ? చివరికి తన తల్లిని కాపాడుకుందా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ. ఎప్పటిలాగానే కోకిల పాత్రలో నయనతార పెర్పార్మెన్స్ అదరిపోతుంది.భారీ ఫైట్స్, హోరెత్తించే బీజీఎంలు, ఎలివేషన్స్ ఉండవు కానీ తన అమాయకత్వంతోనే విలన్లకు చెక్ చెప్పడం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో నయన్‌ను ప్రేమించే వ్యక్తిగా కమెడియన్ యోగిబాబు వినోదం బాగా పండించాడు. వీరిద్దరిపై చిత్రించిన పాట యూట్యూబ్‌లో ట్రైండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. -
స్టార్ జంటకు కలిసిరాని కొత్త ఏడాది.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్!
లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తోన్న చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC). ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని తమిళంలో నయనతార భర్త శివన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ వివాదంలో చిక్కుకుంది. అసలు ఎందుకు సమస్య ఎక్కడ వచ్చింది? ఆ వివాదం ఎందుకు మొదలైందో తెలుసుకుందాం. ఈ చిత్రానికి ఎల్ఐసీ టైటిల్ పెట్టడంపై ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొషన్ ఆఫ్ ఇండియా (LIC) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమా టైటిల్ తమ సంస్థ పేరును గుర్తు చేసేలా ఉందంటూ వెల్లడించింది. ఈ మేరకు మూవీ టైటిల్ మార్చాలంటూ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌కు ఎల్ఐసీ లీగల్ నోటీసులు పంపినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అంతే కాకుండా.. ఎల్ఐసీ సినిమా టైటిల్‌ను ఏడు రోజుల్లోగా మార్చాలని.. లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. ఈ విషయంలో విఘ్నేశ్‌తో పాటు మూవీ నిర్మాణ సంస్థ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్‌కు నోటీసులు పంపినట్లు సమాచారం. పేరు మార్చకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని ఎల్ఐసీ హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయితే ఎల్ఐసీ పంపిన నోటీసులకు మూవీ టీమ్ నుంచి ఇంకా అధికారికంగా స్పందన రాలేదు. అయితే ఇప్పటికే నయనతార నటించిన అన్నపూరణి చిత్రం కూడా వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో హిందువులు మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా నయనతార భర్త సినిమా సైతం వివాదంలో చిక్కుకుంది. కాగా.. ఈ చిత్రం ప్రముఖ నటుడు ఎస్జే సూర్య కీలకపాత్ర చేస్తున్నారు. ప్రదీప్ సోదరి పాత్రలో ఈ చిత్రంలో నయనతార కూడా నటిస్తారని తెలుస్తోంది. చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. -
నయనతారపై పోలీసులకు ఫిర్యాదు.. ఎందుకంటే?
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం అన్నపూరణి. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఈ చిత్రంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మూవీ శ్రీరాముడిని కించపరిచేలా ఉందంటూ మాజీ శివసేన లీడర్ రమేశ్ సోలంకి ముంబై పోలీసులను ఆశ్రయించాడు. తమ మనోభావాలు దెబ్బతీసేలా చిత్ర నిర్మాతలు రాముడిని కించపరిచారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఫిర్యాదు చేసిన విషయాన్ని తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. (ఇది చదవండి: ఓటీటీకి రూ.300 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) అంతే కాకుండా ఈ చిత్రం లవ్ జిహాద్‌ను ప్రోత్సహించేలా ఉందంటూ ఆరోపించారు. సినిమా నిర్మాతలతో పాటు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియాపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను కోరాడు. ఈ సినిమా నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను అభ్యర్థించారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా సినిమాను నిర్మించారని.. అన్నపూరణి దర్శకుడు నీలేష్ కృష్ణ, నయనతార, నిర్మాతలతో పాటు నెట్‌ఫ్లిక్స్ ఇండియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. అయితే ఇప్పటివరకు ఈ ఫిర్యాదుపై చిత్ర నిర్మాతలు ఇంకా స్పందించలేదు. కాగా.. ఈ చిత్రం డిసెంబర్ 1, 2023న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో జై, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. I have filed complain against #AntiHinduZee and #AntiHinduNetflix At a time when the whole world is rejoicing in anticipation of the Pran Pratishtha of Bhagwan Shri Ram Mandir, this anti-Hindu film Annapoorani has been released on Netflix, produced by Zee Studios, Naad Sstudios… pic.twitter.com/zM0drX4LMR — Ramesh Solanki🇮🇳 (@Rajput_Ramesh) January 6, 2024 -
కవల పిల్లలతో నయన్.. భర్తతో కలిసి వేడుకల్లో అమలాపాల్!
►క్రిస్మస్ వేడుకల్లో కవల పిల్లలతో నయన్ ►పెళ్లి తర్వాత తొలిసారి భర్తతో క్రిస్మస్ జరుపుకున్న అమలాపాల్ ►పండుగ వేళ చిల్ అవుతోన్న రాశి ఖన్నా ►కుటుంబంతో కలిసి క్రిస్మస్ వేడుకలో హీరో సుశాంత్ ►తన ఇద్దరు పిల్లలతో లాస్య క్రిస్మస్ సెలబ్రేషన్స్ ►ఫెస్టివ్ మోడ్‌లో మాళవిక మోహనన్ ►క్రిస్మస్ వేడుకలో తారకరత్న ఫ్యామిలీ View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
పిల్లలూ తల్లులూ చల్లని వారే!
దృశ్యం:1 ప్రియాంక చోప్రా తన కూతురు మాల్తీ మేరీ జోనాస్ కోసం ఇంట్లో ‘ప్లే డేట్’ నిర్వహించింది. ఈ ఆటల కార్యక్రమానికి ప్రీతీ జింటా పిల్లలు జే, గియాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘ఇన్క్రెడిబుల్ వీకెండ్’ కాప్షన్‌తో ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ పిల్లల ఆటల ఫొటోలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. ‘మంచి ఐడియా దొరికింది. మా చిన్నారి కోసం ఇలాంటి కార్యక్రమం త్వరలో మా ఇంట్లో ఏర్పాటు చేయనున్నాను’ అని ఒక నెటిజన్ స్పందించారు. దృశ్యం: 2 అమ్మ గురించి చెప్పడానికి ఎన్నో మాటలు అక్కర్లేదు. ‘అమ్మా’ అనే పిలుపులోనే ఎన్నో వినిపిస్తాయి. తల్లి ఒమ్న కురియన్ పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే మై ఎవ్రీ థింగ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు తెలియజేసింది నయనతార. తన సర్వస్వం అయిన తల్లి గురించి ఎన్నో సందర్భాల్లో నయన్ చెప్పింది. ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగు పెట్టింది. తన కుమారులు ఉయిర్, ఉలాగ్‌లతో ఉన్న ఫస్ట్ పోస్ట్ 2.6 మిలియన్ల లైక్‌లను దక్కించుకుంది. -
ఆ సినిమా కోసం అనిరుధ్ మ్యూజిక్‌తో పాటు ఆరుగురు వరల్డ్ ఫేమస్ ఫైట్ మాస్టర్స్
ప్రపంచ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం జవాన్. షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించి తన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీ పతాకంపై నిర్మించిన చిత్రం ఇది. ఈయన ఇంతకు ముందు నటించిన పఠాన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించడంతో జవాన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో విశేషం ఏమిటంటే ఇందులో కోలీవుడ్ నటీనటులు, సాంకేతిక వర్గం ఎక్కువగా పని చేశారు. కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన ఇందులో నయనతార నాయకిగా, విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన జవాన్‌లో మరో విశేషం ఆరుగురు అంతర్జాతీయ స్థాయి ఫైట్ మాస్టర్స్ పని చేయడం. స్పిరో రజటొస్, యనిక్ బెన్, ట్రెయిన్ మాక్రే, కెచ్చా కంపాక్డీ, అనల్ అరసు మొదలగు ఆరుగురు ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన పోరాట దృశ్యాలు, బైక్, కారు ఛేజింగ్స్ జవాన్ చిత్రంలో హైలెట్ కానున్నాయని యూనిట్ సభ్యులు తెలిపాయి. (ఇదీ చదవండి: చిరంజీవిపై విషప్రయోగం.. 35 ఏళ్ల తర్వాత బయటపడ్డ నిజం!) జవాన్ చిత్రం ట్రైలర్ చూస్తేనే యాక్షన్ సన్నివేశాలు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. పాటలను భారీగా ఖర్చు చేసి బ్రహ్మాండంగా చిత్రీకరించారు. దీంతో జవాన్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 7వ తేదీన తెరపైకి రానుంది. -
వన్నె తరగని నయన తార బ్యూటీ రహస్యం ఇదే..ఆ క్రీమ్ లేకుండా..
దక్షిణాది అగ్రకథనాయికగా ఇప్పటికీ చెలమణి అవుతున్న మళయాళి కుట్టి నయనతార. ఆమె తెలుగు, తమిళ, కన్నడ అగ్రకథనాయకుల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో కుర్రాళ్ల కలల రాణిగా మంచి క్రేజీ స్టార్‌గా వెలుగొందుతోంది. అందంలోనూ, అభినయంలోనూ తనకు తానే సాటి అని పేరుతెచ్చుకుంది. ఆమె డైరెక్టర్ విఘ్నేశ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పైగా ఇద్దరు పిల్లలు(సరోగసి విధానం) తల్లి కూడా. నాలుగు పదుల వయసుకు దగ్గరవ్వుతున్న ఏమాత్రం వన్నెతరగని అందంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఆమె ఇప్పటికీ అందంగా ఉండటం వెనుక దాగున్న రహస్యం ఏంటీ?..ఆమె ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఇప్పుడూ చూద్దాం. ఆమె ఎక్కువగా ఆయుర్వేదిక్ బ్యూటీ ప్రొడక్ట్స్‌నే ప్రిఫర్ చేస్తుందట. బాడీ డ్రీహైడ్రేట్ అవ్వకుండా ఉండేందుకు ఎక్కువగా మచినీళ్లు తాగుతుందట. అలాగే బయటకు వెళ్లితే కంప్లసరి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకుంటుందట. అస్సలు అది లేకుండా గడప కూడా దాటనని చెబుతున్నారు నయన్. అంతేకాదు మాయిశ్చరైజర్‌ని తప్పనిసరిగా వాడతారు. అది ఆమె చర్మాన్ని అందంగా మృదువుగా ఉండేలా చేస్తుంది. ఆమె ఎప్పుడూ విటమిన్ సీ ఎక్కువగా ఉండే.. పండ్లు, పండ్ల రసాలు ప్రతిరోజూ మర్చిపోకుండా తీసుకుంటుందట. వాటి వల్ల.. ఆమె చర్మం మృదువుగా , అందంగా మెరిసేలా చేయడంలో సహాయం చేస్తుందని చెబుతోంది నయన తార. (చదవండి: కీర్తీ సురేష్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!) -
తమన్నా కోసం ఆ టాప్ హీరోయిన్ను టార్గెట్ చేసిన అజిత్
ఎవరైనా సక్సెస్ వెనుక పరిగెత్తం సాధారణ విషయమే. ఇక చిత్రాల విషయాని కొస్తే క్రేజ్ చాలా అవసరం. నటుడు అజిత్ కూడా ఈ పాలసీనే ఫాలో అవుతున్నారా..? అంటే అయ్యుండొచ్చు అనే కోలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈయన నటించిన తాజా చిత్రం తుణివు (తెగింపు) విడుదలై దాదాపు ఏడాది కావస్తోంది. ఇంతవరకు ఆయన తదుపరి చిత్రం ప్రారంభం కాలేదు. విడాముయిర్చి అనే చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించి చాలా కాలమే అయ్యింది. దీనికి ఆది నుంచి ఆటంకాలే ఎదురవుతున్నాయి. (ఇదీ చదవండి: జైలర్‌కు 'తెలుగు' సెంటిమెంట్.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు?) మొదట నయనతార భర్త విగ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. అందుకు సన్నహాలు కూడా చేసుకున్నారు. అలాంటి దశలో అనుహ్యంగా ఆయన్ని చిత్రం నుంచి తొలగించడం జరిగింది. ఈ విషయంలో అజిత్ ప్రమేయం ఉందనే ప్రచారం జరిగింది. వాస్తవం ఏమిటి అన్నది తెలియకపోయినా ఆ తరువాత విడాముయిర్చి చిత్ర యూనిట్ లోకి దర్శకుడు మగిళ్ తిరుమేణి వచ్చారు. దీంతో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభ పనులు వేగవంతం అవుతాయని అందరూ భావించారు. అయితే ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ఇంతకుముందే ఆగస్టు తొలి వారంలో విడాముయిర్చి సెట్స్ పైకి వెళుతుందని చెప్పారు. అయితే ఇది మరోసారి వాయిదా పడినట్టు, సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానున్నట్లు తాజా సమాచారం. అసలు ఈ చిత్రం విషయంలో ఏం జరుగుతుందనే గందరగోళ వాతావరణం అజిత్ అభిమానుల్లో నెలకొంది. ఇకపోతే ఈ చిత్రం షూటింగ్ పలుమార్లు వాయిదా పడటంతో ఇందులో నాయకిగా నటించాల్సిన త్రిష ఇతర చిత్రాలతో బిజీ అవ్వడం జరిగిపోయింది. (ఇదీ చదవండి: వాళ్లను చూస్తే నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది: చిరంజీవి) ఆమె అజిత్ చిత్రానికి కాల్ షీట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితి అనీ అయినప్పటికీ కాస్త ఆలస్యం అయినా ఎలాగో అలా విడాముయిర్చి చిత్రంలో నటిస్తానని త్రిష చెప్పినట్లు సమాచారం. అయితే నటుడు అజిత్ ఆమెకు అడ్డుపడుతున్నట్లు తాజాగా సామాజిక మాధ్యమాలలో వైరలవుతోంది. ఆయన దృష్టి ఇప్పుడు నటి తమన్నపై పడిందట. కారణం జైలర్ చిత్రంలోని కావాలా పాటతో ఫుల్ క్రేజ్ తెచ్చుకోవడమే అని టాక్. అజిత్ అంటేనే తమిళ పరిశ్రమలో పవర్ హౌస్ లాంటోడు. అలాంటిది మరోక హీరోయిన్‌కు వచ్చిన క్రేజ్‌ను సొంతం చేసుకోవాలనే మోజులో ఉండటం మంచిది కాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. త్రిష కూడా తమన్నా క్రేజ్‌కు ఏ మాత్రం తక్కువ కాదని వారు తెలుపుతున్నారు. కాగా అజిత్ చిత్రంలో నటించే నాయకి ఎవరన్నది చిత్రవర్గాలు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. -
నయనతార ఇంతే.. ఆమెను ఏం చేయలేం: విశాల్
నటీమణులు చిత్రాలు చేసినా, చేయకపోయినా ఎప్పుడు ట్రెండింగ్‌లోనే ఉంటారు. సంచలన నటి నయనతార వంటి వారైతే ఇక చెప్పనవసరం లేదు. పాత్రికేయుల దృష్టి నుంచి ఇలాంటివారు తప్పించుకోలేరు. ఇక అసలు విషయానికి వస్తే నటుడు విశాల్ తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం 'మార్క్ ఆంటోని'. నటి ప్రీతివర్మ నాయకిగా నటించిన ఇందులో ఎస్జే సూర్య ప్రతినాయకుడిగా నటించారు. దర్శకుడు సెల్వరాఘవన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని, ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్‌కుమార్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్రం వినాయకచవితికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. (ఇదీ చదవండి: హీరోయిన్ 'విమి' విషాద గాథ.. భర్తను కాదని ఆపై ప్రేమికుడి వల్ల వ్యభిచారం) ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న విశాల్‌ను నయనతార చిత్ర కార్యక్రమాల్లో పాల్గొన్న పోవడానికి కారణం ఏంటన్న విలేకరి ప్రశ్నకు ఆయన బదులిస్తూ నయనతార ఏ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని అది ఆమె వ్యక్తిగత హక్కు అని పేర్కొన్నారు. కచ్చితంగా పాల్గొనాలని ఆమెను నిర్బంధం చేయలేమన్నారు. తనకు ఇష్టం లేదని చెబితే ఆమెను మనం ఏమి చేయలేమన్నారు. అయితే ఆమె వస్తే బాగుంటుందన్నారు. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పేమి కాదని విశాల్ పేర్కొన్నారు. -
జవాన్‌లో ఊహించని ట్విస్ట్.. సౌత్ ఇండియా స్టార్ హీరోను గుర్తించారా?
'పఠాన్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లు కొల్లగొట్టిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుంచి వస్తున్న తాజా చిత్రం 'జవాన్'. దీనికి దర్శకత్వం అట్లీ. నయనతార, ప్రియమణి,దీపికా పదుకొణె ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ‘జవాన్’ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. విడుదలైన వెంటనే ఇంటర్నెట్లో ఇది తుఫానుగా మారింది. అనిరుద్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో దుమ్మురేపాడు. నయనతార భారీ యాక్షన్ స్టంట్స్ చూసి అభిమానులు ఫిదా అవడం ఖాయం. జవాన్ ట్రైలర్ చాలా రిచ్‌గా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. (ఇదీ చదవండి: అల్లర్ల మధ్య హోటల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన టాప్ హీరోయిన్!) రెండు నిమిషాల 12 సెకన్ల ప్రివ్యూ ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇందులో యాక్షన్ క్వీన్‌గా నయనతార టీజర్లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. జవాన్ ప్రీవ్యూలో లేడీ సూపర్‌స్టార్ సైనికురాలిగా గ్లింప్స్ చూపించారు. చాలా ఏళ్లుగా బాలీవుడ్లో ఎంట్రీ కోసం వెయిట్ చేసిన నయనతారకు జవాన్ మంచి క్రేజ్ తీసుకురావడం ఖాయం. జవాన్‌లో సౌత్ ఇండియన్ స్టార్ హీరో జవాన్ ట్రైలర్‌ను చూసిన అభిమానులు అందులో కోలీవుడ్ హీరో దళపతి విజయ్ను గుర్తించారు. ఇందులో అతను అతిధి పాత్రలో ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. కొంతమంది 'జవాన్' సినిమా ఫ్యాన్స్ తమ డేగ కళ్లతో విజయ్ను గుర్తించారు. అయితే ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా ధృవీకరించలేదు. ముఖం స్పష్టంగా లేనప్పటికీ, అతను విజయ్ కావచ్చునని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. (ఇదీ చదవండి: Prabhas Project-K: 'ప్రాజెక్ట్ కే' టైటిల్ ఇదేనా..?) ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తుండగా, సన్యా మల్హోత్రా కీలక పాత్రలో నటించింది. దీపికా పదుకొణె కూడా అతిధి పాత్రలో నటిస్తోంది. ప్రియామణి, సన్యా మల్హోత్రా, తమిళ నటుడు యోగి బాబు, సునీల్ గ్రోవర్ తదితరులు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. జవాన్‌ను షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ తమ హోమ్ బ్యానర్ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్పై నిర్మించారు. Is this #Thalapathy @actorvijay?#Leo | #Jawan | #JawanPrevue pic.twitter.com/AVFji2zVOs — ᴊᴜsᴛ sʀᴇᴇʀᴀᴍ (@sreeramhere_) July 10, 2023 View this post on Instagram A post shared by TeaKadai Raja (@teakadai_raja) -
నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేశ్ శివన్ బాబాయ్
దర్శకుడు విగ్నేష్ శివన్, నయనతారలపై ఆస్తి అపహరణ కేసు నమోదు అయ్యింది. ఆరేళ్ల క్రితం ప్రేమలో పడి, సహజీవనం చేస్తూ గత రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న సంచలన జంట నయనతార, విఘ్నేష్ శివన్. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో నయనతార నటిగా రానిస్తూ.. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉన్నా వ్యక్తిగతంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ జంట సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయిన విషయం కూడా వివాదంగా మారింది. (ఇదీ చదవండి; 'దేవర' తర్వాత జాన్వీని తమిళ్‌కు పరిచయం చేయనున్న టాప్ హీరో) తాజాగా వీళ్లకు మరో సమస్య ఎదురైంది. విఘ్నేశ్ శివన్ పూర్వీకం తిరుచ్చి జిల్లా, లాల్‌కుడి గ్రామం ఈయన తండ్రి పేరు శివకొళుదు. వీళ్లు తొమ్మిది మంది అన్నదమ్ములు. పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేసిన విఘ్నేష్ శివన్ తండ్రి శివకొళుదు ఇప్పుడు లేరు. అయితే ఈయన జీవించి ఉండగా తమ ఉమ్మడి ఆస్తిని అన్నదమ్ములకు తెలియకుండా మోసపూరితంగా అపహరించినట్లు ఆయన సోదరుడు మాణిక్యం కోయంబత్తూర్‌లో నివసిస్తున్న మరో సోదరుడు కుంచిత పాదం గురువారం తిరిచ్చి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. (ఇదీ చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక) అందులో మాణిక్యం పేర్కొంటూ తమ సోదరుడు విఘ్నేష్ శివన్ తండ్రి ఉమ్మడి ఆస్తిని తమకు తెలియకుండా వేరే వారికి విక్రయించి మోసానికి పాల్పడ్డాడని, తమ ఆస్తిని కొనుగోలు చేసిన వారికి డబ్బును తిరిగి ఇచ్చి, ఆస్తిని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా తమ సోదరుడు కుమారుడు విఘ్నేశ్ శివన్ అతని తల్లి మీనాకుమారి, సోదరి ఐశ్వర్య, భార్య నయనతారలపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తిరుచ్చి డీఎస్పీ ఈ కేసు దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది నటి నయనతారకు కూడా తలనొప్పిగా మారింది. -
12 ఏళ్ల నుంచి నా బెస్ట్ ఫ్రెండ్.. చాలా థ్రిల్లింగ్‌గా ఉంది: విఘ్నేశ్ శివన్
సౌత్ ఇండియా బ్యూటీఫుల్ కపుల్స్‌లో నయన్-విక్కీ జంట ఒకరు. దాదాపు కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట గతేడాది జూన్ 9న వివాహాబంధంతో ఒక్కటయ్యారు. మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ జంటకు పలువురు తారలు, ఫ్యాన్స్, సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఈ జంటకు సరోగసీ ద్వారా ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలు జన్మించారు. అయితే వీరి వివాహా వార్షికోత్సవం సందర్భంగా ఈ జంటకు విఘ్నేశ్ శివన్ చిన్ననాటి స్నేహితుడు సర్ప్రైజ్ ఇచ్చారు. (ఇది చదవండి: అలా ప్రేమలో.. వరుణ్, లావణ్య త్రిపాఠి లవ్‌స్టోరీకి ఐదేళ్లు) చెన్నైలోని వీరి నివాసంలో జరిగిన వార్షికోత్సవంలో ఫ్లూట్ వాయించి మరీ ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. బాల్య స్నేహితుడు ఇచ్చిన సర్ప్రైజ్కు నయన్- విఘ్నేశ్ ఎమోషనలయ్యారు. ఈ విషయాన్ని విక్కీ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. వీడియోనూ షేర్ చేస్తూ స్నేహితునిపై ప్రశంసలు కురిపించారు. విఘ్నేశ్ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ..'మాకు ఇవీ ప్రత్యేకమైన క్షణాలు. మా మొదటి వివాహా వార్షికోత్సవ వేడుక. నా 12 ఏళ్ల వయస్సు నుంచి నవీన్ బెస్ట్ ఫ్రెండ్. నీతో కలిసి ఒకే వేదికపై డ్రమ్స్ వాయించడం.. చాలాసార్లు నీతో వేదికను పంచుకున్నా. నా జీవితంలో నిన్ను చూస్తూనే ఎదిగా. కానీ ఈరోజు మర్చిపోలేనిది. అలాగే చాలా ప్రత్యేకమైనది కూడా. ఈ రోడు మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నువ్వు నా స్నేహితుడిగా ఉండటం నాకు గర్వంగా ఉంది.' అంటూ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: నయన్- విఘ్నేశ్ మ్యారేజ్ యానివర్సరీ.. బుడ్డోళ్ల సర్ప్రైజ్ అదిరిపోయిందిగా !) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
నయన్- విఘ్నేశ్ మ్యారేజ్ యానివర్సరీ.. బుడ్డోళ్ల సర్ప్రైజ్ అదిరిపోయిందిగా !
సౌత్ ఇండియా బ్యూటీఫుల్ కపుల్స్‌లో నయన్-విక్కీ జంట ఒకరు. దాదాపు కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట గతేడాది జూన్ 9న వివాహాబంధంతో ఒక్కటయ్యారు. మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ జంటకు పలువురు తారలు, ఫ్యాన్స్, సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఈ జంటకు ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలు జన్మించారు. అయితే ఈ శుభ సందర్భంలో అమ్మా-నాన్నకు సర్ప్రైజ్ ఇచ్చారు ట్విన్స్. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: పిల్లల ఫోటోలు రివీల్ చేసిన నయనతార.. ఈరోజే ఎందుకంటే?) నయన్- విఘ్నేశ్ ఇద్దరు పిల్లలు వివాహా వార్షికోత్సవానికి అమ్మా-నాన్నకు సర్ప్రైజ్ ఇచ్చారు. హ్యాపీ యానివర్శరీ అంటూ బెలూన్లతో అలంకరించిన ఫోటోను విక్కీ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. తన ఇద్దరు పిల్లల గురించి విక్కీ ఎమోషనలయ్యారు. ఈ విషయాన్ని విఘ్నేశ్ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. విఘ్నేష్ శివన్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'ధన్యవాదాలు బాయ్స్. ఇంత చక్కని వివాహ వార్షికోత్సవ వేడుకను మాకు అందించినందుకు లవ్ యూ టూ ఉయిర్, ఉలగం. ఇంత చిన్న వయసులో మాకోసం మీరిద్దరు ఎంతగా ఆలోచించారు. మేము మీ ఇద్దరినీ ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటాం'. అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన ఇద్దరు పిల్లల ఫోటోను షేర్ చేస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఇంత చిన్న వయసులోనే ఇంతలా డేకరేషన్ ఎలా చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో సూపర్బ్ అంటూ విషెష్ చెబుతున్నారు. కాగా.. జూన్ 9, 2022న మహాబలిపురంలో నయనతార- విఘ్నేశ్ శివన్ వివాహా ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి రజనీకాంత్, షారూఖ్ ఖాన్, అనిరుధ్ రవిచంద్రన్‌తో పాటు సినీ పరిశ్రమకు పలువురు తారలు, స్నేహితుల హాజరయ్యారు. అయితే పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసీ ద్వారా గతేడాది అక్టోబర్‌లో కవలలకు స్వాగతం పలికారు. (ఇది చదవండి: పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ నిర్మాత కుమార్తె.. తండ్రి ఎమోషనల్ పోస్ట్!) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
మూడు పెళ్లిళ్లు.. అందుకే విడాకులు నయనతార రమ్యక్రిష్ణ తో విబేదాలు
-
లేడీ ఓరియంటెడ్ సినిమాలపై హీరోయిన్ల స్పెషల్ ఫోకస్!
సాధారణంగా నాయకులు కథలను నడిపిస్తారు.. ఆ కథల్లో నాయికలు ఆటాపాటలకు పరిమితం అవుతారు. కొన్నిసార్లు నాయికలే కథలను నడిపిస్తారు. ఆ కథల్లో ఆటాపాటలు కాదు.. ఫైట్లు ఎక్కువ ఉంటాయి. నాయికలు పవర్‌ఫుల్‌గా కనిపిస్తారు. ఇప్పుడు కొందరు కథానాయికలు లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రాల గురించి తెలుసుకుందాం. లేడీ సూపర్ స్టార్ @ 75 స్టార్ హీరోల సరసన రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూ మరోవైపు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌తో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు నయనతార. ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలపైనే దృష్టి సారిస్తుంటారామె. అందులో భాగంగా ప్రస్తుతం నూతన దర్శకుడు నీలేష్ కృష్ణతో ఓ మూవీ చేస్తున్నారామె.నయనతార కెరీర్లో ఇది 75వ చిత్రం. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సాగే ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సందేశం కూడా ఇవ్వనుంది. ఇప్పటివరకూ నయనతార నటించిన చిత్రాల్లోకెల్లా భారీ బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. నాలుగు లీడ్ రోల్స్‌లో... తెలుగు, తమిళ భాషల్లో అరడజనుకుపైగా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు హన్సిక. వాటిల్లో నాలుగు చిత్రాల్లో లీడ్ రోల్స్ చేస్తున్నారీ బ్యూటీ. తెలుగులో ఆమె నటించిన ‘105 మినిట్స్’ (రాజు దుస్సా దర్శకుడు), ‘మై నేమ్ ఈజ్ శృతి’ (శ్రీనివాస్ ఓంకార్ డైరెక్టర్) సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అటు తమిళంలో జేఎం రాజా శరవణన్ దర్శకత్వంలో ‘రౌడీ బేబీ’, ఇగోర్ డైరెక్షన్లో ‘మాన్’ అనే సినిమాలు చేస్తున్నారు హన్సిక. నేనేనా.. హీరోయిన్ రెజీనా పురావస్తు శాస్త్రవేత్తగా లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘నేనేనా’. కార్తీక్ రాజు దర్శకత్వంలో రాజశేఖర్ వర్మ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ (తమిళంలో ‘సూర్పనగై’) భాషల్లో విడుదల కానుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో రెజీనా ఒక హత్య కేసు విచారణ చేస్తుండగా అది దాదాపు వందేళ్ల క్రితం జరిగిన ఘటన అని తెలుస్తుంది. 1920, ప్రస్తుతం.. ఇలా రెండు కాలాల్లో సాగే ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. రెండు చిత్రాల్లో.. ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తున్న కీర్తీ సురేశ్ మరోవైపు ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో ‘రఘు తాత’, ‘రివాల్వర్ రీటా’ అనే చిత్రాల్లో లీడ్ రోల్స్ చేస్తున్నారు. సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘రఘు తాత’ చిత్రంతో హోంబలే ఫిలింస్ (కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార) తమిళంలో అడుగుపెడుతోంది. ఈ చిత్రంలో విప్లవ భావాలున్న అమ్మాయి పాత్రలో కీర్తి నటిస్తున్నారు. అదే విధంగా కీర్తి లీడ్ రోల్ చేస్తున్న మరో చిత్రం ‘రివాల్వర్ రీటా’. కె. చంద్రు దర్శకత్వంలో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులోనూ విడుదలయ్యే చాన్స్ ఉంది. రెయిన్బోలో కొత్తగా... దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్న రష్మికా మందన్న తొలిసారి ‘రెయిన్బో’ అనే లేడీ ఓరియంటెండ్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మికకు జోడీగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఇందులో రష్మిక వినూత్న పాత్రలో కనిపిస్తారు. -
కమల్, నయన్ క్రేజీ కాంబో మూవీలో బోల్డ్ అండ్ బ్యూటీ..!
చెన్నై: నటుడు కమల్ హాసన్ సరసన నటించాలని కోరుకోని హీరోయిన్లు ఉండరనే చెప్పవచ్చు. కమల్ హాసన్‌కు జతగా నటిస్తే పాపులర్ అవ్వవచ్చునని చాలా మంది భావిస్తుంటారు కూడా. ఆయన చిత్రాల్లో లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని అలాంటి సన్నివేశాల వల్ల మరింత పబ్లిసిటీ పొందవచ్చు అని కొందరు భావిస్తుంటారు. కాగా కమలహాసన్‌తో లిప్ లాక్ సన్నివేశాలు నటించడం ఇష్టం లేక నయనతార ఇప్పటివరకు ఆయనకు జంటగా లభించలేదని ప్రచారం కూడా జరిగింది. తాజాగా కమల్ 234వ చిత్రంలో నటించడానికి నయన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనున్నారు. సుమారు 35 ఏళ్ల తర్వాత కమలహాసన్, దర్శకుడు మణిరత్నం కాంబోలో తెరకెక్కనున్న చిత్రం ఇది. తాజాగా రూపొందించిన పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రం ఈనెల 28వ తేదీన విడుదలకు ముస్తాబవుతుంది. తదుపరి ఆయన కమలహాసన్‌తో చేసే చిత్రంపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. కాగా ఇందులో నయనతారతో పాటు మరో నటి కూడా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఆమెనే నటి ఆండ్రియా. బోల్డ్ అండ్ బ్యూటీ ఎలాంటి పాత్రనైనా ఛాలెంజ్‌గా తీసుకొని నటిస్తుంది. ఈ బహుభాషా నటి ఇంతకుముందు కమలహాసన్ సరసన విశ్వరూపం, విశ్వరూపం– 2 చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆయన 234వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: ఇది నా జీవితం.. నిర్ణయం కూడా నేనే తీసుకుంటా.. విజయ్ సినిమాలో ఐటెం సాంగ్‌పై సిమ్రాన్ -
ఆ ప్రాజెక్ట్ నుంచి నయన్ అవుట్.. ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్ !
నయనతార పాత్రలో నటి రాశీఖన్నా నటించనున్నారా? కోలీవుడ్‌లో జరుగుతున్న తాజా ప్రచారం ఇదే. నయనతార పెళ్లి, సరోగసీ ద్వారా తల్లి కావడం వంటి కారణాల కారణంగా నటనకు చిన్న గ్యాప్ ఇచ్చారు. అయినప్పుటికీ షారూఖ్‌ఖాన్ సరసన నటిస్తున్న జవాన్ చిత్ర షూటింగ్లో పాల్గొంటూనే ఉన్నారు. కాగా మళ్లీ నటిగా బిజీ అయ్యారు. ఇప్పుడు 9 చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. అందులో వైనాట్ శశికాంత్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఒకటి. హీరోయిన్ ఓరియెంటెండ్ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఇందులో నటుడు మాధవ్, సిద్ధార్ధ్ ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు చిత్ర వర్గాలు ఇటీవలే ప్రకటించాయి. కాగా ఇప్పుడా చిత్రంలో అనివార్య కారణాల వల్ల నయనతార నటించడం లేదని, ఆమెకు బదులుగా రాశీఖన్నాను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. క్రికెట్ క్రీడ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ది టెస్ట్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. త్వరలోనే ఈ చిత్రం సెట్ పైకి వెళ్లనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా రాశీఖన్నా ఇటీవల నటుడు కార్తీ సరసన నటించిన సర్ధార్ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా హిందీ వెబ్‌సీరీస్ ఫర్జీ చిత్రంలోనూ నటించింది. తరచూ గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న రాశీ ఖన్నా ప్రస్తుతం తమిళంలో గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నారు. ఇందులో జీవా కథానాయకుడిగా నటిస్తుండగా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా వైనాట్ శశికాంత్ దర్శకత్వంలో నటించే లక్కీచాన్స్ వరించిందన్నది నిజంగా ఈ బ్యూటీకి లక్కే. -
ఐదు నిమిషాలు కూడా ఆగలేరా?.. నయనతార ఆగ్రహం!
లేడీ సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నయనతార. దక్షిణాది ఇండస్ట్రీలో అంతలా పేరు సంపాదించుకుంది కోలీవుడ్ భామ. గతేడాది దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను పెళ్లాడిన నయన్.. సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే తమ పిల్లల పూర్తి పేర్లను కూడా వెల్లడించారు. అయితే ఇటీవల కుంభకోణంలోని తమ ఇష్టదైవమైన ఆలయానికి వెళ్లిన దంపతులు పూజలు నిర్వహించారు. కానీ అదే సమయంలో అక్కడున్న భక్తులపై నయనతార ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలేం జరిగిందంటే.. ఏప్రిల్ 5న కుంభకోణం జిల్లాలోని ఆలయానికి వెళ్లారు నయన్, విఘ్నేశ్ దంపతులు. వీరు పూజలు చేస్తున్న సమయంలో కొందరు భక్తులు గొడవకు దిగారు. అంతే కాకుండా వారి ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. దీంతో నయనతార భక్తులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క ఐదు నిమిషాలు ఆగండి. మా పూజ పూర్తవుతుంది, మేము మీలాగే దేవుడి ఆశీస్సుల కోసమే వచ్చాం.' అని అన్నారు. కాగా.. నయనతార తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటించింది. ఆమె చివరిసారిగా దర్శకుడు అశ్విన్ శరవణన్ 'కనెక్ట్'లో కనిపించింది. త్వరలోనే షారుఖ్ ఖాన్ మూవీ జవాన్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. "5 நிமிஷம் ப்ளீஸ்" - பொதுமக்களிடம் பொறுமையாக இருக்கக் கோரிய நடிகை நயன்தாரா! #Nayanthara | #VigneshShivan | #WikkiNayan pic.twitter.com/lxGftqQVrI — PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) April 5, 2023 -
నయన తార వల్ల నా టైం వేస్ట్: మమత మోహన్ దాస్
మమత మోహన్ దాస్ టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. యమదొంగ సినిమాలో నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినప్పటికీ అప్పుడడప్పుడు వార్తల్లో నిలుస్తోంది. గతంలో క్యాన్సర్ బారిన పడిన కోలుకున్న మమత.. ఇటీవలే బొల్లి వ్యాధి సోకినట్లు సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మమత మోహన్ దాస్ సంచలన కామెంట్స్ చేసింది. లేడీ సూపర్ స్టార్‌గా పేరున్న నయనతారపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నయన్ చేసిన పనికి తాను చాలా బాధ పడ్డానని తెలిపింది. మరో హీరోయిన్ సెట్లో ఉంటే తాను షూట్‌కు రానని నయన్ చెప్పినట్లు తెలిసిందని మమత పేర్కొంది. ఆ సినిమా కోసం తాను నాలుగు రోజులు వృథా చేసుకున్నట్లు చెప్పారు. మమత మాట్లాడుతూ..' ఒకసారి రజినీకాంత్ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. అందులో ఓ పాట కోసం చిత్రబృందం నన్ను సంప్రదింది. ఆ సాంగ్ నాలుగు రోజులు షూట్ చేశాం. షూట్ చేస్తున్నప్పుడే ఆ ఫ్రేమ్‌లో నేను లేనని నాకర్థమైంది. తీరా ఫైనల్ కాపీ బయటకు వచ్చేసరికి నా షాట్స్ లేవు. కేవలం ఒకే ఒక్క షాట్లో నేను కనిపించా. నాకు చెప్పినవిధంగా ఆ పాటను చిత్రీకరించలేదు. అయితే ఆ చిత్రంలో హీరోయిన్ వల్లే అలా జరిగిందని నాకు తర్వాత తెలిసింది. ఆ పాటలో మరో హీరోయిన్ ఉందని తనకు చెప్పలేదంటూ.. షూట్‌కు రానని ఆమె చెప్పిందట నయనతార. అందుకే నా పార్ట్‌ను చిత్రీకరించలేదు. ఆ సినిమా కోసం 4 రోజులు వృథా కావడంతో చాలా బాధ అనిపించింది.' అని అన్నారు. కాగా.. రజనీకాంత్ - నయనతార జంటగా ‘కథానాయకుడు’లో నటించారు. 2008లో విడుదలైన ఈ సినిమాలో మమతా మోహన్‌దాస్ అతిథి పాత్రలో మెరిసింది. ఈ చిత్రంలోని దేవుడే స్వర్గం నుంచి అనే పాటలో కనిపించింది. తాజాగా మమత మోహన్ దాస్ కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె నయనతారను ఉద్దేశించే కామెంట్స్ చేశారని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. -
జవాన్‌లో బన్నీ.. అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..!
ఇటీవలే పఠాన్ మూవీ సక్సెస్ అందుకున్నారు బాలీవుడ్ బాద్షా. ఆ తర్వాత వెంటనే అట్లీ డైరెక్షన్లో జవాన్ షూటింగ్లో బిజీ అయిపోయారు. ఇటీవలే చెన్నై షెడ్యూల్లో పాల్గొన్న షారుక్ నయనతార ఇంటికి కూడా వెళ్లారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు చెందిన మరో క్రేజీ అప్ డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. జవాన్‌లో ఓ అతిథి పాత్ర కోసం బన్నీని చిత్రబృందం సంప్రదించినట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే అట్లీ ఈ సినిమాపై పెద్ద ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో కనిపిస్తే టాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలుస్తుందని ఆయన అభిప్రాయం. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు. దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా.. బన్నీ ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే వైజాగ్‌లో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా త్వరలోనే ఈ చిత్రబృందంతో కలవనుంది. -
స్టార్ హీరోకు ముద్దు పెట్టిన నయనతార..వీడియో వైరల్!
పఠాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. తన తదుపరి చిత్రం అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్ సరసన స్టార్ హీరోయిన్ నయనతార కనిపించనుంది. షూటింగ్ కోసం చెన్నై చేరుకున్న హీరో నయనతార ఇంటికి వెళ్లారు. అయితే షారుక్ ఖాన్ తిరిగి వెళ్తుండగా.. నయనతార అతనికి ముద్దు పెడుతూ వీడ్కోలు పలికింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ గుడ్ బై చెప్పేందుకు నయనతార ఇంటివద్ద అభిమానులు పెద్దఎత్తున గుమిగూడారు. ఇది చూసిన అభిమానులు సోషల్ మీడియా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. జవాన్ షూటింగ్లో పాల్గొన్న షారుక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం చివరి షెడ్యూల్లో నయనతార కూడా పాల్గొంటోంది. పఠాన్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఎస్ఆర్కే మళ్లీ షూటింగ్లో బిజీ అయిపోయారు. జవాన్‌లో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ స్థాయిలో తెరకెక్కిన జవాన్ జూన్ 2023లో థియేటర్లలో విడుదల కానుంది. The way Shah Rukh kissed Nayanthara goodbye @iamsrk you have my whole heart 😭❤️ #Nayanthara #Jawan pic.twitter.com/0zoBaBQGMP — Samina ✨ (@SRKsSamina_) February 11, 2023 1 more Exclusive Video: Welcome King 👑 @iamsrk in Namma #CHENNAI Nayanthara saying goodbye to SRK & King gave good bye kiss 🥹😭 Our #Chennai team reached to capture @iamsrk sir in our camera 📸 We clicked #ShahRukhKhan𓀠 while leaving at #Nayanthara’s apartment in #CHENNAI pic.twitter.com/7trHm571eW — ♡♔SRKCFC♔♡™ (@SRKCHENNAIFC) February 11, 2023 -
2022 నాకెంతో స్పెషల్.. విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్
సంచలన నటి నయనతార, దర్శకుడు విగ్నేశ్ శివన్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 2016 నుంచి సహజీవనం చేసిన జంట 2022 జూన్‌లో వివాహం చేసుకున్నారు. అయితే నయనతార విజయ్ సేతుపతి జంటగా నటించిన నానుమ్ రౌడీదాన్ చిత్రానికి విగ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. అప్పుడే నయనతార, విఘ్నేష్ శివన్‌ల మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఈ జంటకు సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. తాజాగా విఘ్నేశ్ శివన్ 2022కు గుడ్ బై చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. గతేడాదిలో జరిగి విషయాలను విఘ్నేశ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తనకు 2022 ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందన్నారు. నయనతారతో పెళ్లి, సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆశీస్సులు మరిచిపోలేనివని తెలిపారు. 2022లోనే ఇద్దరు పిల్లలు జన్మించడం దేవుడిచ్చిన వరమన్నారు విఘ్నేశ్. అలాగే 'కాతువాక్కుల రెండుకాదల్' మూవీ రిలీజ్, తమిళనాడు ప్రభుత్వం చెస్ ఒలిపింయాడ్ ఆహ్వానం, నయనతార 'కనెక్ట్' మూవీ, తన తదుపరి ప్రాజెక్ట్ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఏకే62 ఇందులో ప్రస్తావించారు. మధురమైన క్షణాలను మిగిల్చిన 2022కు గుడ్‌బై చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు శివన్. ఈ ఏడాది మరింత సంతోషంగా సాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
Nayanthara: చరిత్రలో నా పేరు ఉండాలనుకున్నా..
నయనతార.. ఈ పేరే ఒక సంచలనం.. తొలి నుంచి కూడా నయనతారది ఒక ప్రత్యేక శైలి. కోలీవుడ్లోకి అయ్యా చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ బ్యూటీ వృత్తిపరంగా, వ్యక్తిగతంగానూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది. మొదట్లో కొన్ని సినిమాల్లో సో సో గానే కనిపించిన నయనతార ఇప్పుడు హీరోలకు ధీటుగా లేడీ ఓరియంటెడ్ కథాచిత్రాల నాయకిగా ఖ్యాతి గడించారు. ఈమె చాలాకాలం క్రితమే అందులో చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననని తెగేసి చెప్పారు. అయితే ఈ మధ్య నిర్మాతగా కూడా మారిన నయనతార ప్రధాన పాత్రలో నటించి రౌడీపిక్చర్స్ పతాకంపై అశ్విని శరవణన్ దర్శకత్వం వహించిన కనెక్ట్ చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. చిత్ర ప్రచారాలకు దూరంగా ఉండే నయనతార ఈ చిత్రం కోసం స్పెషల్ ఇంటర్వూ్యలు ఇస్తోంది. ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ సినీ చరిత్రలో తన పేరు ఉండాలని ఆశించానని, అది భగవంతుడు నెరవేర్చారన్నారు. నటిగా పరిచయమైన 10 ఏళ్ల తరువాత తనకు కొన్ని కలలు ఉండేవన్నారు. ముఖ్యంగా హీరోయిన్ ప్రాముఖ్యత కలిగిన పాత్రల్లో నటించాలని కోరుకున్నానని, అప్పట్లో హీరోయిన్లకు ఆటలు, పాటలు మినహా నటనకు పెద్దగా అవకాశం ఉండేది కాదన్నారు. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాల్లో కూడా వేదికలపై హీరోయిన్లను ఒక మూలన కూర్చొపెట్టేవారన్నారు. దీంతో ఇకపై చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం మానేశారని చెప్పారు. ఇదేవిధంగా నటీమణులకు సమానత్వం ఉండాలని, హీరోయిన్ పాత్రలకు ప్రాముఖ్యత ఉండాలని ఆశించానని, అది ఇప్పుడు జరుగుతోందని చెప్పారు. అది తనకు గర్వంగా ఉందన్నారు. ఇకపోతే విజయ్ నటించిన శివకాశి, రజనీకాంత్ హీరోగా నటించిన శివాజీ చిత్రాల్లో సింగిల్ సాంగ్స్‌కు నటించడం గురించి ప్రశ్నించే వారన్నారు. ఇలా తొలి నుంచీ తనపై విమర్శలు చేస్తూనే ఉన్నారని, తాను సన్నబడినా, బరువు పెరిగినా ఇలా ఏదో ఒక విషయంపై విమర్శిస్తున్నారని చెప్పారు. -
ఉత్కంఠభరితంగా నయనతార కనెక్ట్ మూవీ.. అర్థరాత్రి ట్రైలర్ రిలీజ్
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన మరో హారర్ చిత్రం కనెక్ట్. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయన్ స్వయంగా నిర్మించింది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం అర్థరాత్రి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కరోనా లాక్డౌన్ సమంలో అందరూ ఇంటికే పరిమితం కావడం, ఇదే సమయంలో నయన్ ఆన్లైన్ మీటింగ్‌లో పాల్గొననగా వారికి దెయ్యం ఉన్నట్లు కొన్ని శబ్దాలు వినిపించడం వంటివి క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. 2.22 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 99 నిమిషాల నిడివితో ప్రయోగాత్మకంగా ఇంటర్వెల్ బ్రేక్ లేకుండా ఈ సినిమాను రిలీజ్ చేయబోతుండటం మరో విశేషం. పూర్తిగా హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌కు తగ్గట్లే సినిమాలోనూ సస్పెన్స్ క్రియేట్ చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
2023లో జయం రవి, నయనతారల ఇరైవన్
పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో తన సక్సెస్ పయనాన్ని కొనసాగిస్తున్న నటుడు జయం రవి. ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఆ వివరాలు చూస్తే జయం రవి కథానాయకుడిగా స్క్రీన్ సీన్ సంస్థ వరుసగా మూడు చిత్రాలను నిర్మించడం విశేషం. అందులో ఒకటి భూలోకం చిత్రం ఫేమ్ ఎన్ కళ్యాణ్ కృష్ణన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న అఖిలన్. ఇందులో జయం రవికి జంటగా నటి ప్రియభవానీ శంకర్, తాన్యా రవిచంద్రన్ నటిస్తున్నారు. హార్బర్ నేపథ్యంలో సాగే యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ చి త్రం షూటింగ్ పూర్తి చేసుకుని త్వర లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సంస్థ నిర్మిస్తున్న రెండో చిత్రానికి రాజేష్ దర్శక త్వం వస్తున్నారు. ఇందులో జయం రవి సరసన ప్రియాంక మోహన్ నటిస్తున్నా రు. ఇది జయంరవి నటిస్తున్న 30వ చిత్రం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీంతోపాటు నవ దర్శకుడు ఆంటోని దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి సైరన్ అని టైటిల్ నిర్ణయించారు. దీన్ని హోమ్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాత తన అత్తయ్య సుజాత విజయ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రంలో జయం రవి కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఇకపోతే ఇంతకుముందు నటుడు జయం రవి నయనతార జంటగా నటించిన తనీ ఒరువన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ సక్సెస్ఫుల్ జంట మరో చిత్రంలో నటించనున్నారు. దీనికి ఇరైవన్ అనే పేరు ఖరారు చేశారు. ఈ చిత్రానికి అహ్మద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని 2023లో ఇరైవన్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. -
సెలబ్రిటీ సరొగసీ రచ్చ!
సినీ ప్రముఖుల ప్రతి అంశమూ ఆసక్తికరమే, అనేకసార్లు సంచలనమే. నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దంపతులు తల్లితండ్రులైన వార్త అభిమానుల్లో ఆసక్తితో పాటు అనేక చర్చలకూ దారి తీసింది. పెళ్ళయిన 4నెలలకే తల్లితండ్రులైన ఈ దంపతులు బాహాటంగా ప్రకటించకున్నా, సరొగసీ (అద్దె గర్భం) ద్వారానే మగ కవలల్ని కన్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అద్దె గర్భం ప్రక్రియ ఓ వ్యాపారంగా సాగడాన్ని అడ్డుకొనేందుకు కేంద్రం నిరుడు తెచ్చిన చట్టాలు ఉల్లంఘనకు గురయ్యాయని కొందరి అనుమానం. నయన కవలపిల్లల వ్యవహారంలో చట్ట ఉల్లంఘనలు జరిగిందీ, లేనిదీ రాష్ట్ర వైద్యసేవల డైరెక్టరేట్ ద్వారా విచారణ జరుపుతామంటూ తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించడంతో కథ మరో మలుపు తిరిగింది. నయనతార దంపతులేమీ అధికారికంగా వివరణ ఇవ్వకపోవడంతో, వ్యక్తిగత వ్యవహారం కాస్తా సెలబ్రిటీ సరొగసీ రచ్చగా మారింది. సరొగసీపై 2021 డిసెంబర్లో భారత పార్లమెంట్ రెండు చట్టాలను ఆమోదించింది. అవి – సరొగసీ (నియంత్రణ) చట్టం, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ) నియంత్రణ చట్టం. మొదటి చట్టం దేశంలో సరొగసీ ప్రక్రియ, ఆచరణకు సంబంధించినది. రెండోది ఏఆర్టీ క్లినిక్‌లనూ, బ్యాంకు లనూ పర్యవేక్షించడానికీ, నియంత్రించడానికీ ఉద్దేశించినది. పిల్లలు లేనివాళ్ళు, నిర్ణీత వయస్కులు, అద్దెగర్భమే దిక్కయిన ఆరోగ్యపరిస్థితుల్లోని వారే ఈ చట్టాల కింద సరొగసీకి అర్హులు. గుజరాత్‌లోని ఆనంద్ సహా పలు ప్రాంతాలు అద్దెగర్భాల వ్యాపారానికి అడ్డా కావడంతో, అలాంటి అక్రమాలను ఈ చట్టాలు దేశంలో నిషేధించాయి. సరొగసీతో సంతానం పొందాలనుకొనే దంపతులకు సాయపడే అద్దె తల్లి వారికి రక్తసంబంధీకురాలై ఉండాలనీ పేర్కొన్నాయి. ఈ ఉద్దేశాలన్నీ మంచివే అయినా... సరొగసీ ద్వారా తండ్రి కావాలనుకున్న ఒంటరి మగాడి పట్ల, అలాగే ఒక బిడ్డ ఉన్నప్పటికీ అద్దెగర్భంతో కుటుంబాన్ని విస్తరించుకోవాలనుకొనే వివాహిత స్త్రీ పట్ల ఈ చట్టాలు దుర్విచక్షణతో ఉన్నాయనేది విమర్శ. దీనిపై ఢిల్లీ హైకోర్ట్‌లో ఓ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. అలాగే, ఈ చట్టాల్లోని కొన్ని అంశాలను సవాలు చేస్తూ ఓ డాక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీమ్ కోర్ట్ విచారిస్తోంది. నయన, శివన్ 2022 జూన్‌లో చెన్నైలో పెళ్ళి చేసుకొన్నారు. నాలుగు నెలలకే సంతానం కలగడం, నటనలో బిజీగా ఉన్న నయన గర్భవతిగా ఉన్న సూచనలేవీ బయట కనిపించకపోవడం, ఆంతరంగిక వర్గాల కథనం అది అద్దెగర్భమనే అనడంతో ఇంత చర్చా మొదలైంది. నటి కస్తూరి సహా కొందరు ప్రముఖులు, నెటిజన్లు కమర్షియల్ సరొగసీ నిషేధమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసరికి ఇంటికథ రచ్చకెక్కింది. నిజానికి, సంతానం కోసం సెలబ్రిటీలు సరొగసీని ఆశ్రయించడం మన దేశంలోనూ కొత్తేమీ కాదు. హీరో షారుఖ్ ఖాన్ 2013 మేలో తన మూడో బిడ్డ అబ్రామ్ కోసం సరోగసీని ఆశ్రయించినప్పటి నుంచి చర్చ రేగింది. ధనికులు తప్పుడు కారణాలతో అద్దెతల్లుల్ని పెట్టుకుంటున్నారనే వివాదం మొదలైంది. నటి మంచు లక్ష్మి, 2017 మార్చిలో నిర్మాత కరణ్ జోహార్ దాకా పలువురు బిడ్డల కోసం సరొగసీనే ఆశ్రయించారు. సినిమా సహా గ్లామర్ ప్రపంచంలో ఉన్నవారు తమ వృత్తి అవసరాల రీత్యా అద్దె తల్లుల్ని అరువు తెచ్చుకోవడం జరుగుతూనే ఉంది. నైతిక చర్చలు పక్కనపెడితే, అందులో న్యాయ విరుద్ధమేమీ లేదు. పెళ్ళికాక ముందే ఏడేళ్ళుగా 2015 నుంచి నయన, శివన్ రిలేషన్షిప్లో ఉన్నారు. సహ జీవనం సైతం చట్టబద్ధమని కోర్టులే తేల్చాయి. కాబట్టి, పెళ్ళయి అయిదేళ్ళయితేనే సరొగసీకి అర్హులనే చట్ట నిబంధనను వారు ఉల్లంఘించారనే వాదన నిలుస్తుందా? అలాగే, కొత్త సరొగసీ చట్టాలు ఈ ఏడాది జనవరి 25 నుంచి అమలులోకి వచ్చాయి. అప్పటికే అద్దె తల్లులుగా ఉన్నవారి క్షేమం కోసం పది నెలల గర్భధారణ కాలమూ ఇచ్చాయి. దాని ప్రకారం చూస్తే జనవరికి ముందే నయన దంపతులు సరొగసీని ఎంచుకొని ఉంటే, అదీ చట్టవిరుద్ధం అనలేం. కాబట్టి వారి సరొగసీ చట్టవిరుద్ధమనే వాదన చివరకు నిలబడకపోవచ్చు. విచారణలో వివరాలు బయటకొచ్చేదాకా, నయన దంపతులు పెదవి విప్పేదాకా జరిగిందేమిటో తెలియదు. తొందరపడి తీర్పులు చెప్పడమూ భావ్యం కాదు. నిజానికి, సరొగసీ దోపిడీని అరికట్టడానికి పెట్టిన చట్టాలు సైతం పేదలైన వేలాది అద్దెతల్లుల్ని మరింత దోపిడీకి గురి చేస్తున్నాయనే వాదన ఉంది. నయనతారతో పాటు వేలాది కేసుల్లో ఒకవేళ చట్ట ఉల్లంఘనలు జరిగాయనుకున్నా, ప్రతి కేసులో విచారణ అయ్యేపనీ కాదు. వైవాహిక అత్యాచారం సహా అనేకవాటిని నేరంగా తీర్మానించడానికి నిరాకరిస్తున్న మనం ఒక మహిళ తన బతుకుతెరువు కోసం తన దేహాన్ని వాణిజ్య సరొగసీకి వాడి, మరో స్త్రీకి సాయం చేస్తే తప్పేమిటనే వాదనకు జవాబు లేదు. సమాజంలో పెళ్ళికీ, మాతృత్వానికీ ఇచ్చిన అతి ప్రాధాన్యమూ సరొగసీపై చర్చోపచర్చలకు కారణమవుతోంది. అద్దె గర్భంతో బిడ్డను కంటే ఆ స్త్రీ ‘మంచి తల్లి’ కాదంటారా? అలాంటి తప్పుడు మూస ఆలోచన నుంచి మనం బయటపడేదెప్పుడు? నటి ప్రియాంకాచోప్రా, నిక్ జోన్స్ దంపతులు ఆ మధ్య సరొగసీతో సంతానం పొందినప్పుడూ వారిని అనరాని మాటలన్నారు. ఒక మహిళ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుని, తన హక్కును వినియో గించుకుంటే... ‘ఆడవాళ్ళంటే ఇలానే ఉండాలి, ఇలాగే అమ్మతనం పొందా’లంటూ పితృస్వామ్య భావజాలంతో ఒత్తిడి చేయడానికి ఎవరికి ఏం హక్కుంది? ఈ సెలబ్రిటీ సరొగసీ రచ్చతో చర్చకు వచ్చిన అనేక అంశాలను సావధానంగా ఆలోచించాల్సిందే! సమాజం సమాధానం చెప్పాల్సిందే! -
నయనతార ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్.. కవలలకు జన్మనిచ్చిన నటి
కోలీవుడ్ జంట నయనతార, విఘ్నేశ్ శివన్ అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. తాజాగా నయనతార ఇద్దరు మగ పిల్లలకు(ట్విన్స్) జన్మనిచ్చినట్లు ఆమె భర్త విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఫోటోలను షేర్ చేశారు. తమ పిల్లలను ఆశీర్వదించాలని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. దీంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు నయన్, విఘ్నేశ్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. నయనతార నటించిన గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయన్-విక్కీలు జూన్ 9న తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహ వేడుక మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది. ఇటీవలే అభిమానుల కోసం వీరిద్దరి పెళ్లి వేడుకను డాక్యుమెంటరీ రూపంలో తీసుకొస్తున్నట్లు సర్ప్రైజ్ ఇచ్చారు. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో ఓ డాక్యుమెంటరీ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల వీరి పెళ్లి డాక్యుమెంటరీకి సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ డాక్యుమెంటరీలో నయనతార చిన్నతనం నుంచి పెళ్లి వరకూ సాగే ప్రయాణాన్ని అభిమానులకు చూపించనున్నారు. త్వరలోనే వీళ్లిద్దరి లవ్ స్టోరీ, పెళ్లి వీడియో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా ప్రసారం కానుంది. అయితే నయనతార సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. Nayan & Me have become Amma & Appa❤️ We are blessed with twin baby Boys❤️❤️ All Our prayers,our ancestors’ blessings combined wit all the good manifestations made, have come 2gethr in the form Of 2 blessed babies for us❤️😇 Need all ur blessings for our Uyir😇❤️& Ulagam😇❤️ pic.twitter.com/G3NWvVTwo9 — Vignesh Shivan (@VigneshShivN) October 9, 2022 -
గాడ్ ఫాదర్ విజయానికి అదే కారణం: నయనతార
దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన చిరంజీవి గాడ్‌ఫాదర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అభిమానుల నుంచి విపరీతమైన స్పందన రావడంతో చిత్రబృందం సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. ఈ సినిమా విజయం పట్ల ప్రధానపాత్రలో నటించిన కోలీవుడ్ భామ నయనతార తాజాగా స్పందించింది. ఇంత గొప్ప విజయాన్ని అందించిన అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ నోట్ విడుదల చేసింది. నయనతార నోట్లో రాస్తూ.. 'గాడ్ ఫాదర్ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలిపినందుకు సినీ ప్రేమికులు, నా అభిమానులందరికీ ధన్యవాదాలు. ఈ విజయానికి కారణం అద్భుతమైన చిత్రబృందమే. మెగాస్టార్ చిరంజీవితో మరోసారి స్క్రీన్‌ను పంచుకోవడం ఆనందంగా ఉంది. ఆయన గొప్ప నటుడే కాదు గొప్ప వ్యక్తి కూడా. నాపై నమ్మకం ఉంచి మరో అవకాశమిచ్చిన దర్శకుడు మోహన్ రాజాకు కృతజ్ఞతలు. సల్మాన్ ఖాన్‌ను ప్రేక్షకులు ఎందుకు ఇష్టపడతారో ఈ సినిమా ద్వారా తెలిసింది. ఈ చిత్రం భారీ విజయం సాధించినందుకు ఆయనకు ధన్యవాదాలు'. అంటూ రాసుకొచ్చింది. మలయాళంలో మోహన్‌లాల్ చిత్రం లూసిఫర్ తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్. ఈ సినిమాలో సత్యదేవ్, డైరెక్టర్ పూరీ జగన్నాధ్, గంగవ్వ, సునీల్, బ్రహ్మాజీ, కీలక పాత్రల్లో నటించారు. HUMONGOUS BLOCKBUSTER #GodFather pic.twitter.com/FC1eiPBsnT — Nayanthara✨ (@NayantharaU) October 9, 2022 -
మీకు నయన్ సూపర్‌స్టార్ గానే తెలుసు..: విఘ్నేష్ శివన్
నటి నయనతారను ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ మరోసారి పొగడ్తల్లో ముంచేశారు. ఆయన నయనతారను పొగడటం కొత్త ఏమీ కాదుగా అంటారా..? అది నిజమే. అయితే ఈసారి సందర్భం ఏమిటంటే గత ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయనతార, విఘ్నేష్ శివన్‌ల జంట ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ 9న పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. వీరి వివాహ వేడుక అంతా దర్శకుడు గౌతమ్ మీనన్ ఆధ్వర్యంలోనే జరిగిందంటారు. సినిమా పరిశ్రమలోని ప్రముఖులందరూ హాజరై వధూవరులకు శుభాకాంక్షలు అందించారు. అయితే ఈ పెళ్లి తంతు ఖర్చు అంతా నెట్‌ఫ్లిక్స్ సంస్థ భరించినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా దీని ఓటీటీ ప్రచార హక్కుల కోసం ఆ సంస్థ భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కాగా నయనతార, విఘ్నేష్ శివన్‌లు పెళ్లి పంక్షన్‌ను బియాండ్ ద ఫెయిరీ టేల్ పేరుతో నెట్‌ప్లిక్స్ త్వరలో ప్రచారం చేయడానికి సిద్ధమైంది. అందులో నయనతార, విఘ్నేష్ శివన్‌ల ప్రేమ, పెళ్లి గురించి తమ భావాలను వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన ప్రోమో శనివారం విడుదల చేసింది. ఈ ప్రోమో ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. దీనిని విఘ్నేష్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందులో విఘ్నేష్ శివన్ పేర్కొంటూ నయనతార మీకు సూపర్‌స్టార్‌గానే తెలిసి ఉంటుందని, వ్యక్తిగతంగా తెలిసి ఉండదని పేర్కొన్నారు. తన అలవాట్లు అన్ని మార్చుకున్న అద్భుతమైన ప్రేమకథ ఉన్న మై బంగారం ఈ నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ త్వరలో నెట్‌ప్లిక్స్‌లో ప్రచారం కానుందన్నారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన నటి నయనతార అని, అయితే చేపట్టిన పనికి 100 శాతం శ్రమించాలని భావించే సాధారణ మహిళని తెలిపారు. ఆమె ఓ అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. -
నయన్-విఘ్నేశ్ లవ్ డాక్యుమెంటరీ.. టీజర్ చూసేయండి..
కోలీవుడ్ ప్రేమజంట నయనతార, విఘ్నేశ్ శివన్ గురించి అందరికి సుపరిచితమే. ఇటీవలే విఘ్నేశ్ శివన్ బర్త్‌డే వేడులకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమ, పెళ్లిపై 'నయనతార- బియాండ్ ది ఫెయిర్‌టేల్' పేరుతో డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఈ డాక్యుమెంటరీలో నయన్-విఘ్నేశ్ కలిసి సన్నివేశాలు ఉన్నాయి. అలాగే పలు ప్రశ్నలకు వీరిద్దరు సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. (చదవండి: ‘గాడ్ ఫాదర్’లో నయన్ రోల్ ఇదే.. ఆసక్తిగా ఫస్ట్‌లుక్ పోస్టర్) దాదాపు ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార-విఘ్నేశ్ శివన్ పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తమిళనాడు మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో జూన్ 9న వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు వివాహానికి హాజరయ్యారు. త్వరలోనే విడుదల ప్రేమజంట డాక్యుమెంటరీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదల చేయనున్నారు. కాగా, చిరంజీవి గాడ్‌ఫాదర్ సినిమాలో నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
యాక్టింగ్‌కు గుడ్‌బై!.. నయనతార అభిమానుల్లో టెన్షన్..
సాక్షి, చెన్నై: మాలీవుడ్ టూ టాలీవుడ్ వయా కోలీవుడ్ అంటూ తన నట జీవితాన్ని అందమైన ప్రయా ణంగా మార్చుకున్న నయనతార తాజాగా బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టారు. గ్లామరస్ పాత్రలతో కెరీర్ ను ప్రారంభించి పెర్ఫార్మెన్స్ పాత్ర ల వరకు శభాష్ అని ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటున్న తార ఈ నయనతార. తమిళం, తెలుగు, హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అంతేకాదు దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయకి ఈమెనే. ఇప్పుడు ఆమె అభిమానులను ఆందోళనకు గురి చేసే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నయనతార సినిమాల్లో సంపాదించినదంతా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతూ వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నారు. ప్రస్తుతం భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న నయనతార త్వరలో నటనకు గుడ్‌బై చెప్పబోతుందన్నదే అభిమానులను కలతకు గురి చేస్తున్న వార్త. ఆమె నటనకు స్వస్తి చెప్పి తన ఇతర వ్యాపారాల వ్యవహారాలు చూసుకుంటూ జీవితాన్ని గడపాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే నటనకు గుడ్‌బై చెప్పినా నిర్మాతగా మంచి చిత్రాలను నిర్మించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంత? అని తెలియాలంటే నయనతార, విఘ్నేష్ శివన్ స్పందించాల్సి ఉంది. వాళ్లు ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. చదవండి: ‘బ్రహ్మాస్త్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్: ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన తారక్ -
నయన్‌ను కించపరిచిన ప్రముఖ నిర్మాత.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్
స్టార్ హీరోయిన్ నయనతార ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన నటనతో తొలి సౌత్ లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగింది. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే ఆమెకు దక్షిణాన విపరీతమైన క్రేజ్ ఉంది. హీరోలకు సమానంగా పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమెదే మొదటి స్థానం. అలాంటి నయన్‌పై ప్రముఖ దర్శకుడు, నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. దీంతో సదరు నిర్మాతపై నయన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో రీసెంట్గా సమంత పాల్గొన్న సంగతి తెలిసిందే. చదవండి: జై బాలయ్య అంటూ ఈలలు వేస్తూ పెద్దావిడ రచ్చ, వీడియో వైరల్ ఈ సందర్భంగా సామ్‌ను ప్రస్తుతం సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా.. 'సౌత్‌లో బిగ్గెస్ట్ హీరోయిన్ అయిన నయనతారతో ఇటీవల నేను ఓ సినిమాను చేశాను. తనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ పరోక్షంగా నయనతార పేరు చెప్పంది సమంత. అయితే దీనికి కరణ్ ‘కానీ.. తను నా జాబితాలో లేదు’ అంటూ వ్యాఖ్యానించాడు. ఇక కరణ్ కామెంట్స్‌పై నయన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ లేడీ సూపర్ స్టార్ అయిన నయన్‌ను గుర్తించలేదనడం ఇది ఆమెను కించపరిచనట్లే అంటున్నారు. @Samanthaprabhu2 Is such a Sweetheart & Sharing her Lovable bond with #Nayanthara ❤️ @karanjohar She is not far in your list coz Your list is full of Nepo-Products which doesn’t deserve any arguements and discussions. #KoffeeWithKaran #LadySuperStar pic.twitter.com/TDUXGT871Z — A. (@ursavian) July 21, 2022 అంతేకాదు స్టుపిడ్ కాఫీ విత్ కరణ్ షోలో నయనతారు అవమానించే అర్హత ఆయనకు లేదు. తను సాధించిన విజయంలో కనీసం సగం కూడా నువ్వు సాధించేలేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండ తన సొంతగా స్టార్‌గా ఎదిగారు. మీలా నెపోటిజంతో ఎదగలేదు’, ‘ఇంతకి ఈ కరణ్ జోహార్ ఎవరూ?’ అంటూ కరణ్‌ను ఏకిపారేస్తున్నారు. అంతేకాదు ధర్మ ప్రొడక్ష్‌న్, కరణ్ జోహార్‌ను అసలు బ్యాన్ చేయాలంటూ ట్విటర్ వేదికగా కరణ్‌పై నయన్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. అయితే ప్రస్తుతం కరణ్ నిర్మిస్తున్న జాన్వీ కపూర్ మూవీ 'గుడ్ లక్ జెర్రీ'.. నయన్ నటించిన 'కొలమాను కోకిల' రీమేక్ అని మర్చిపోవద్దని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సౌత్ నటీనటులపై కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేసిన కరణ్.. మరోసారి నయన్ గురించి అలా అనడం హాట్ టాపిక్‌గా మారింది. Karan Johar doesnt have any right to shame #Nayanthara on his stupid Koffee show. You cannot even achieve half of what she has achieved. She is self made not like you Nepo bitch.#Samantha we love you for giving it right back to that Nepo crap and for being so lovely — VISHNU (@VishnuTweets2U) July 22, 2022 #KaranJohar 🤡 list doesn’t determine the number one actress. #nayanthara is lady super star and will always be the queen of South Indian cinema. Her movie and acting proves that. She doesn’t need to be in anyone’s list for that😏 — Funny Humans (@FunnyHumans1) July 21, 2022 Sorry, but karan johar who? #Nayanthara pic.twitter.com/T0NkBXrM8g — 𝐏 𝐫 𝐢 𝐲 𝐚 (@xxgoldenroses) July 21, 2022 🐍 @karanjohar is bullying outsiders to promote his nepo betis. But Thalaivi is sending love and motivating the very same nepo stars ❤️ That's queen for you 🥺 Don't even think about belittling this amazing human ~ #Ladysuperstar #Nayanthara ~#KoffeeWithKaran pic.twitter.com/eHLs5Rgt1b — Theladysuperstarclub (@Nayantharian) July 24, 2022 The way Kjo disrespected #Nayanthara breaks my heart💔 I mean how can someone be this cocky and disrespectful towards such an actor... Never liked him..but now, he's seriously a waste material and nothing else. — Parth (@ParthK_23) July 22, 2022 -
నేరుగా ఓటీటీకి నయనతార మూవీ, అప్పటి నుంచే స్ట్రీమింగ్
లేడీ సూపర్ స్టార్ నయన తార గ్యాప్ లేకుండా విభిన్న చిత్రాలతో అలరిస్తోంది. అనామిక, కర్తవ్యం వంటి హీరోయిన్ సింట్రిక్ పాత్రల్లో మెప్పించిన నయన్ ఇటీవల 'కణ్మనీ రాంబో ఖతీజా' మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఇప్పుడు ఆమె తాజాగా 'ఓ2' (O2) సినిమాతో ఆడియెన్స్‌ను థ్రిల్ చేసేందుకు రెడీ అయ్యింది. జీఎస్.విక్నేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. మే 17న ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ సిద్దమైంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది ఈ థ్రిల్లర్ డ్రామా. ఈ చిత్రంలో నయనతార ఎనిమిదేళ్ళ బాబుకు తల్లిగా నటించింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. చదవండి: మాజీ భర్త హృతిక్ గర్ల్‌ఫ్రెండ్ పోస్ట్‌పై సుసానే ఆసక్తికర కామెంట్ రిత్విక్, లీనా, మనోహర్, అడకులం మురుగదాస్ కీలకపాత్రల్లో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. కాగా ఇటీవల నయన్ తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ జూన్ 9న పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం రిలీజ్ అవుతున్న నయన్ తొలి సినిమా ఇదే కావడంలో దీనిపై ఆసక్తి నెలకొంది. ఈ విభిన్న కథలతో ప్రేక్షకుల అలరించిన నయన్ ఈ మూవీతో ఎంతమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. కాగా నయనతార ప్రస్తుతం చిరంజీవి 'గాడ్ ఫాదర్', 'గోల్డ్' తదితర చిత్రాల్లో నటిస్తోంది. చదవండి: ఆ నిర్మాత నన్ను నా ఫ్యామిలీని బెదిరించాడు: చాందిని చౌదరి -
గ్రాండ్‌గా నయన్-విఘ్నేశ్‌ల పెళ్లి.. హాజరైన రజనీ, షారుక్
కోలీవుడ్ లవ్‌బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్‌లు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గురువారం(జూన్ 9) తెల్లవారు జామున 2.22 గంటలకు నయన్-విఘ్నేశ్‌లు ఏడడుగులు వేశారు. మహాబలిపూరంలోని ఓ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా ఈ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు సైతం హజరైనట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్లు పెళ్లికి హజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. చదవండి: ఇకపై అధికారికంగా.. నయన్‌పై విఘ్నేశ్ ఎమోషనల్ పోస్ట్ రజనీకాంత్ కారు దిగి లోపలికి వెళుతున్న ఫొటోను ఒకటి బయటక రాగా.. పెళ్లిలో క్రిమ్ కలర్ షూట్, వైట్ షర్డ్ ధరించి షారుక్ స్టైలిష్ లుక్‌లో దర్శనం ఇచ్చాడు. ఈ ఫొటోను షారుక్ మేనేజర్ పూజా దద్దాని షేర్ చేసింది. షారుక్‌తో పాటు డైరెక్టర్ అట్లీ కూడా హజరయ్యాడు. అంతేకాదు కోలీవుడ్ చెందిన స్టార్ హీరోలు అజిత్, కార్తీ, విజయ్‌తో పాటు టాలీవుడ్, శాండల్‌వుడ్‌కి చెందిన సినీ సెలబ్రెటీలు సైతం పెళ్లికి హజరైనట్లు సమాచారం. కాగా పెళ్లికి కొద్ది క్షణాల ముందు విఘ్నేశ్ శివన్ నయన్‌పై ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. తను వధువుగా ముస్తాబై వివాహ వేదికపై నడుచుకుంటూ వస్తుంటే చూడాలని ఆతృతుగా ఎదురు చూస్తున్నానంటూ కాబోయో భార్య గురించి ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు విఘ్నేశ్. అంతేకాదు ఈ సందర్భంగా తన ఆనందాన్ని, ప్రేమను నయన్‌కు అంకితం ఇస్తున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు విఘ్నేశ్. చదవండి: 200 సినిమాలు చేశా.. నేను చేసిన బెస్ట్ తండ్రి పాత్ర ఇదే! View this post on Instagram A post shared by Atlee (@atlee47) View this post on Instagram A post shared by Pooja Dadlani Gurnani (@poojadadlani02) -
ఇకపై అధికారికంగా.. నయన్‌పై విఘ్నేశ్ ఎమోషనల్ పోస్ట్
ఎట్టకేలకు లవ్ బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్‌లు ఒక్కటి కాబోతున్నారు. అయిదేళ్లుగా రిలేషన్లో ఉన్న ప్రేమ జంట గురువారం ఏడడుగులు వేయబోతున్నారు. ఈ రోజు(జూన్ 9న) నయన్-విఘ్నెశ్ మహాబలిపురంలోని ఓ రీసార్ట్‌లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. భారీ భద్రత నడుమ అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో కొద్ది గంటలకు ముందు విఘ్నేశ్ కాబోయే భార్య(నయనతార) గురించి ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశాడు. చదవండి: నయనతార-విఘ్నేష్ శివన్ పెళ్లి ఆహ్వాన వీడియో.. నెట్టింట వైరల్ ‘ఈ రోజు జూన్ 9.. ఇది నయన్ లవ్. థ్యాంక్యూ గాడ్... నా జీవితంలోని అందమైన వ్యక్తులు, విశ్వం, సంకల్పానికి ధన్యవాదాలు !! ప్రతి మంచి ఆత్మ, ప్రతి మంచి క్షణం, ప్రతి మంచి యాదృచ్చికం, ప్రతి ఆశీర్వాదం, ప్రతిరోజూ షూటింగ్, ప్రార్థనలు నా జీవితాన్ని ఇంత అందంగా మార్చాయి. వీటిన్నింటికి నేను కృతజ్ఞతుడిని. ఇప్పుడు, ఇదంత నా జీవితంలోని ప్రేమకు(నయనతార) అంకితం. మరి కొద్ది గంటల్లో వధువుగా నిన్ను చూసేందుకు పరితపిస్తున్న తంగమై. మన కుటుంబం, స్నేహితుల ఆశీర్వాదంతో అధికారికంగా నీతో కొత్త జీవితం ఆరంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ రాసుకొచ్చాడు విఘ్నేశ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
నయనతార-విఘ్నేష్ శివన్ పెళ్లి ఆహ్వాన వీడియో.. నెట్టింట వైరల్
ఎప్పటినుంచో చక్కర్లు కొడుతున్న నయనతార-విఘ్నేష్ శివన్ పెళ్లి పుకార్లు ఎట్టకేలకు నిజమయ్యాయి. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా నయనతార, సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా విఘ్నేష్ శివన్ గుర్తింపు పొందిన వీరిద్దరి వివాహంపై అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం (జూన్ 7) వారిద్దరు జూన్ 9న మహాబలిపురంలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు విఘ్నేశ్ అధికారికంగా ప్రకటించాడు. అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుందని కూడా తెలిపాడు. తాజాగా ఈ నయన్-విఘ్నేష్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో నెట్టింట గింగిరాలు తిరుగుతోంది. ఈ యానిమేటేడ్ వీడియోలో వధువు, వరుడు తమిళ సాంప్రదాయ దుస్తులు ధరించి కలిసి నడుస్తున్నట్లుగా చూపించారు. ఇందులో నయనతార, విఘ్నేష్ తల్లిదండ్రుల పేర్లు, పెళ్లి తేది, జరిగే సమయం, వేదికను పొందుపర్చారు. ఇదిలా ఉంటే పెళ్లి జరిగే మహాబలిపురంలోని రిసార్ట్‌లో ఇప్పటికే భద్రత ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ వేడుకకు వచ్చే అతిథులందరూ ప్రత్యేక డ్రెస్ కోడ్‌లో హాజరుకానున్నట్లు తెలుస్తోంది. చదవండి: అయోమయంగా నయనతార.. నవ్వుతున్న పృథ్వీరాజ్ సుకుమారన్ View this post on Instagram A post shared by Hanoosh🧿❤Narin🧿 (@hanaz_worldmusic) -
ఒక్క ఏడాదిలో ఏకంగా 20 సినిమాలు ఒప్పుకున్న స్టార్ హీరో !
Prithviraj Sukumaran Nayanthara Gold First Look Poster Released: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ఎంత చెప్పిన తక్కువే. నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా విభిన్నమైన కథలతో అభిమానులను, సినీ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత వైవిధ్యం తప్పకుండా ఉంటుంది. అయ్యప్పనుమ్ కోషీయమ్, బ్రో డాడీ, జన గణ మన సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఒక్క ఏడాదిలోనే 20 సినిమాలు ఒప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఉండగా ఒక్కొక్కటి ఒక్కో ఫార్మాట్లో ఉండనుందని సమాచారం. ఇందులో భాగంగానే తాజాగా తన కొత్త చిత్రం 'గోల్డ్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ సినిమాలో హీరోయిన్గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. ఈ పోస్టర్లో చుట్టూ మనుషులతో మధ్యలో నయనతార అయోమయంగా చూస్తుంటే పృథ్వీరాజ్ సుకుమారన్ నవ్వుతూ ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం #GOLD An #AlphonsPuthran Film! 😊❤️ @puthrenalphonse @PrithvirajProd @magicframes2011 pic.twitter.com/6fROJlPkQD — Prithviraj Sukumaran (@PrithviOfficial) June 6, 2022 ఈ మూవీని పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, మ్యూజిక్ ఫ్రేమ్స్ బ్యానర్లపై సుప్రియా మీనన్, లిజిన్ స్టీఫెన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'ప్రేమమ్' మూవీ ఫేమ్ అల్ఫోన్స్ పుత్రెన్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు ఏడేళ్ల తర్వాత అల్ఫోన్స్ డైరెక్టర్‌గా తన మార్క్ చూపించనున్నారు. ఈ సినిమాను ఆగస్టు 19న విడుదల చేయనున్నారు. చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు -
సీఎంను కలిసిన నయనతార.. పెళ్లిపై లవ్‌బర్డ్స్ క్లారిటీ
Nayanthara Vignesh Wedding: సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా కీర్తి గడించింది నయనతార. ఆమె ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాదిన వీరిద్దరి పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ పెళ్లి వార్తలు నిజమేనని ఈ జంట తాజాగా స్పష్టం చేసింది. శుక్రవారం (జూన్ 3) సాయంత్రం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసిన ఈ లవ్ బర్డ్స్ తమ వెడ్డింగ్ ఇన్విటేషన్‌కు అందజేసింది. తమ వివాహానికి హాజరు కావల్సిందిగా కోరారు. వారిని అభినందించిన సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. స్టాలిన్‌తో పాటు ఆయన కుమారుడు హీరో, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేష్ శివన్‌ల నిశ్చితార్తం కుటుంబసభ్యుల సమక్షంలో గతేడాది జరిగింది. తాజాగా మహాబలిపురంలోని మహబ్ హోటల్లో జూన్ 9న వీరి పెళ్లి వేడుక జరగనుంది. ఈ వివాహానికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు గెస్ట్‌లకు 'డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డ్' పంపించినట్లు తెలుస్తోంది. కాగా వీరి పెళ్లి తిరుమలలో జరగుతుందని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో మహాబలిపురంలోని మహబ్ హోటల్లో హిందూ సాంప్రదాయాల ప్రకారం నయన్, విఘ్నేష్ వివాహం జరగనుంది. అయితే ఇదే వేదికపై జూన్ 8న సాయంత్రం సౌత్ ఇండియా సినీ పరిశ్రమలోని ప్రముఖులు, రాజకీయవేత్తల మధ్య రిసెప్షన్ గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ రిసెప్షన్‌కు రజనీ కాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, కార్తీ, శివకార్తికేయన్, విజయ్ సేతుపతికి ఆహ్వానం అందినట్లు టాక్. చదవండి: కాస్ట్లీ గిఫ్ట్‌తో సమంతను సర్ప్రైజ్ చేసిన నయనతార -
నయన్-విఘ్నేష్ ఆహ్వానం అదిరింది
హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ తమ పెళ్లి షాపింగ్, ఆహ్వానపత్రికలు పంపడం, పెళ్లి వేడుకలకు సంబంధించిన ప్లాన్స్‌తో బిజీ బిజీగా ఉంటున్నారు. జూన్ 9న ఈ ఇద్దరూ పెళ్లాడనున్నారు. బంధువులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. ఇప్పటికే కొందరు అతిథులకు ‘డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డ్’ని కూడా పంపించారట. ఆ వీడియో ఇన్విటేషన్ వైరల్‌గా మారింది. ఈ పత్రిక ప్రకారం నయన–విఘ్నేష్ తమిళనాడులోని మహాబలిపురంలో పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో పెళ్లి అని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహాబలిపురం అని ఇన్విటేషన్ స్పష్టం చేస్తోంది. ఓ రిసార్ట్‌లో ఈ వేడుక జరుగుతుందట. కాగా.. ఆకాశం, అందమైన ఇల్లు, చుట్టూ పచ్చని చెట్లతో డిజైన్ చేసిన డిజిటల్ ఇన్విటేషన్ కార్డ్ అదిరిందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. -
టాలీవుడ్లో ఎన్టీఆర్, సమంత టాప్..
Jr NTR Samantha Tollywood Most Popular Actors As Per Ormax Media 2022: వివిధ సినీ ఇండస్ట్రీల్లో మోస్ట్ పాపులర్ నటులు ఎవరనే విషయంలో ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఓర్మాక్స్ మీడియా' (Ormax Media) ఒక సర్వే నిర్వహించింది. అందులో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో మోస్ట్ పాపులర్, ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు ఎవరు అనే టాప్ 10 జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి మోస్ట్ పాపులర్ నటుడిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నటిగా స్టార్ హీరోయిన్ సమంత టాప్ 1 స్థానంలో నిలిచారు. తారక్ తర్వాత ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ ఉన్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. సామ్ తర్వాత కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్నా, తమన్నా, కీర్తి సురేశ్, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా ఉన్నారు. వీరితోపాటు బాలీవుడ్లో మోస్ట్ పాపులర్ హీరోగా అక్షయ్ కుమార్ మొదటి స్థానంలో నిలిచారు. తర్వాత షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఉండగా చివరగా 10వ స్థానంలో వరుణ్ ధావన్ ఉన్నాడు. మోస్ట్ పాపులర్ హిందీ హీరోయిన్గా అలియా భట్ నిలిచింది. తర్వాత దీపికా పదుకొణె, కత్రీనా కైఫ్, కృతి సనన్ ఉండగా, చివరిగా అనుష్క శర్మ చోటు దక్కించుకుంది. Ormax Stars India Loves: Most popular male Telugu film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/wxyhPygor6 — Ormax Media (@OrmaxMedia) May 15, 2022 Ormax Stars India Loves: Most popular female Telugu film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/ZWDBHowzxE — Ormax Media (@OrmaxMedia) May 15, 2022 Ormax Stars India Loves: Most popular male Hindi film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/NgFZDHnbcw — Ormax Media (@OrmaxMedia) May 12, 2022 Ormax Stars India Loves: Most popular female Hindi film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/OwerlKLNgo — Ormax Media (@OrmaxMedia) May 12, 2022 తమిళంలో మోస్ట్ పాపులర్ హీరోయిన్గా ఫస్ట్ ప్లేస్‌లో నయన తార నిలిచింది. తర్వాత సమంత, కీర్తి సురేశ్, త్రిశ, జ్యోతిక, ప్రియాంక మోహన్, తమన్నా, రష్మిక మందన్నా, అనుష్క శెట్టి, హంసిక ఉన్నారు. ఆరో స్థానంలో నిలిచిన ప్రియాంక మోహన్‌ను ఆల్‌టైమ్ హైయెస్ట్ ర్యాంక్‌గా ప్రకటించింది ఓర్మాక్స్ మీడియా. ఇక హీరోల విషయానికొస్తే మొదటి స్థానంలో విజయ్ ఉండగా తర్వాత అజిత్, సూర్య, విజయ్ సేతుపతి, ధనుష్, శివకార్తికేయన్, రజినీ కాంత్, విక్రమ్, కమల్ హాసన్, శింబు నిలిచారు. Ormax Stars India Loves: Most popular female Tamil film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/irsBaQz6K2 — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 All-time highest rank: Priyanka Mohan takes the no. 6 position, her best-ever rank on Ormax Stars India Loves #OrmaxSIL pic.twitter.com/DbTr9eQgIK — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 Ormax Stars India Loves: Most popular male Tamil film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/ZBwaSywyLB — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 హాలీవుడ్ హీరోయిన్లలో స్కార్లెట్ జాన్సన్, ఏంజిలీనా జోలీ, ఎమ్మా వాట్సన్, జెన్నిఫర్ లారెన్స్, గాల్ గాడోట్, ఎమ్మా స్టోన్, కేట్ విన్స్లెట్, ఎలిజబెత్ ఓల్సెన్, జెండయా, నటాలీ పోర్ట్మన్ వరుసగా ఉన్నారు. హీరోలలో టాప్ 1 ప్లేస్‌లో టామ్ క్రూజ్ ఉండగా, తర్వాతి స్థానాల్లో రాబర్ట్ డౌనీ జూనియర్, డ్వేన్ జాన్సన్, విల్ స్మిత్, టామ్ హోలాండ్, లియనార్డో డికాఫ్రియో, క్రిస్ హెమ్స్వోర్త్, విన్ డీసిల్, క్రిస్ ఇవాన్స్, జానీ డెప్ నిలిచారు. Ormax Stars India Loves: Most popular female Hollywood film stars in India (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/7SZQM9GxKE — Ormax Media (@OrmaxMedia) May 13, 2022 Ormax Stars India Loves: Most popular male Hollywood film stars in India (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/zxScetz4bj — Ormax Media (@OrmaxMedia) May 13, 2022 -
అంబులెన్స్‌లో బాలీవుడ్ కింగ్ ఖాన్, ఫొటో వైరల్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట హాల్చల్ చేస్తోంది. స్పెయిన్‌లో ‘పఠాన్’ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇటీవల షారుక్ ముంబైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంబైలో షూటింగ్లో పాల్గొన్న కింగ్ ఖాన్ ఫొటో ఒకటి లీకైంది. ఇందులో షారుక్ అంబులెన్స్‌లో కూర్చోని ఉండగా చూట్టూ సిబ్బంది ఉన్నారు. ఇందులో షారుక్ మొహం కవర్ చేసి ఉంది. దీంతో ఇది ఏ మూవీ షూటింగ్ అయ్యింటుందని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. అయితే దీనికి సంబంధించి క్లారిటీ లేదు. కానీ ఇది డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్ ఖాన్ ‘లయన్’ మూవీ సెట్‌లోనిది అయ్యింటుందని అభిప్రాయపడుతున్నారు. చదవండి: డైరెక్ట్ ఓటీటీకి రాబోతోన్న ఈ యంగ్ హీరో మూవీ?, ఎక్కడంటే! అంతేకాదు ఈ ఫొటోను షేర్ చేస్తూ అట్లీ, లయన్ పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. లయన్ మూవీలో షారుక్ సరసన సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది 2021లో ఈ మూవీ సెట్స్‌పైకి రాగా పలు సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్‌ను జరుపుకుంది. ఈ క్రమంలో షారుక్ పఠాన్ షూటింగ్, నయన తారా బిజీ షెడ్యుల్ కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే షారుక్ స్పెయిన్ నుంచి తిరిగి రావడం, హీరోయిన్ నయన తార ఏప్రిల్ 6న ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో ‘లయన్’ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పఠాన్ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇందులో షారుక్ సరసన దీపికా పదుకొనె నటించింది. Megastar #ShahRukhKhan on the sets of #Lion 🔥 Ufffffffff Full Bawal Look 🔥 pic.twitter.com/5cV5l9Fkt7 — Vishwajit Patil (@PatilVishwajit_) April 7, 2022 -
కాస్ట్లీ గిఫ్ట్‌తో సమంతను సర్ప్రైజ్ చేసిన నయనతార
స్టార్ హీరోయిన్ సమంత కోలీవుడ్‌లో కాతువాకుల రెండు కాదల్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ట్రయాంగిల్ ప్రేమకథతో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతపతి, నయనతార నటించారు. నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ద్వారా నయనతార, సమంతల మధ్యఫ్రెండ్షిప్ మరింత బలపడినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సమంత కోసం నయనతార ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించింది. 'డియర్ ఖతీజా.. విత్ లవ్.. కణ్మణి' అంటూ నయన్ సమంత కోసం కాస్ట్లీ గిఫ్ట్ పంపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. థ్యాంక్యూ డార్లింగ్ నయన్ అంటూ పోస్ట్ చేసింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కానుంది. కాగా ఈ చిత్రంతో పాటు శాకుంతలం, యశోద సినిమాలతో పాటు సామ్ హిందీలో ఓ వెబ్‌సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
షాకింగ్: నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్‌పై కేసు
లేడీ సూపర్ స్టార్ నయనతారా, ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌లపై కేసు నమోదైంది. రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థను బ్యాన్ చేసి దాని వ్యవస్థాపకులైన నయన తార, విఘ్నేశ్ శివన్‌లను అరెస్ట్ చేయాలని సాలిగ్రామానికి చెందిన సోషలిస్ట్ కణ్ణన్ అనే వ్యక్తి చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలాయంలో ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ సంఘటన కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే వీరిపై కేసు నమోదు చేయడం వెనక అసలు కారణాలు తెలియలేరాలేదు. చదవండి: తల్లి కాబోతోన్న నయనతార? కానీ పలు తమిళ, జాతీయ మీడియాల సమాచారం ప్రకారం.. తమిళ నాడు ప్రభుత్వం ప్రస్తుతం రౌడీల అణిచివేతకు ముందస్తు చర్యలు తీసుకుంటున్న తరుణంలో రౌడీలను మరింత ప్రోత్సహించేలా నయన తార, ఆమె కాబోయే భర్త విఘ్నేశ్ శివన్ తీరు ఉందని కణ్ణన్ ఆరోపించాడు. అంతేకాదు వారి నిర్మాణ రౌడీ పిక్చర్స్ అనే పేరుపై కూడా అతను అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే తమిళ స్టార్ హీరో అజిత్‌తో విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమాను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని రౌడీ పిక్చర్స్ బ్యానలర్లో విఘ్నేశ్, నయన్‌లు నిర్మిస్తున్నారు. చదవండి: కారులో ‘సీక్రెట్ ఫ్రెండ్’తో అడ్డంగా బుక్కైన స్టార్ హీరో కూతురు ఈ క్రమంలో అజిత్ మూవీని ప్రకటించిన సంతోషంలో విఘ్నేష్ శివన్ అతని రౌడీ పిక్చర్స్ టీమ్ కలిసి భారీ స్థాయిలో పటాకులు పేల్చిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రజలకు ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్న రౌడీ పిక్చర్స్ సంస్థ తీరుపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, తక్షణమే నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్‌పై నిషేధం విధించి నటి నయనతార, విఘ్నేష్ శివన్‌లపై కేసు నమోదు చేయాలని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కణ్ణన్ ఫిర్యాదు మేరకు పోలీసులు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సమాచారం. -
తల్లి కాబోతోన్న నయనతార?
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయన తార, కాబోయే భర్త విఘ్నేశ్ శివన్‌లకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. లాక్డౌన్లో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట రీసెంట్గా వివాహం కూడా చేసుకున్నారంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల నయన్, విఘ్నేశ్‌లు జంటగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వీడియోలో బయటకు రాగా అందులో నయన్ పాపిటన సింధూరం పెట్టుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక అప్పటి నుంచి నయన్, విఘ్నేశ్‌లు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. చదవండి: అభిరాం తీరుకు విసిగిపోయిన తేజ?, ఏం చేశాడంటే! ఈ క్రమంలో వీరికి సంబంధించిన మరో ఆసక్తికర వార్త హాట్‌టాపిక్‌గా నిలిచింది. నయన్, విఘ్నేశ్‌లు పిల్లల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారట. సరోగసి ద్వారా తల్లి కావాలని అనుకుంటుందట నయన్. దీనికి విఘ్నేశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సరోగసి(అద్దే గర్భం) ద్వారా తల్లిదండ్రులు అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో నయన్, విఘ్నేశ్‌లు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ఇప్పటికే తమిళ మీడియా, వెబ్సైట్లలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వరస ఆఫర్లతో నయన్ ఫుల్ బిజీగా ఉంది, అందుకే తల్లి కావడానికి సరోగసి మార్గాన్ని ఆమె ఎంచకుకున్నట్లు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. చదవండి: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌కి దూరంగా విజయేంద్ర ప్రసాద్.. అందుకేనా? ఇదిలా ఉంటే ఇప్పటి వరకు నయన్, విఘ్నేశ్‌ల పెళ్లి జరిగిందా? లేదా? అన్నది క్లారిటీ లేదు. కానీ వారు సరోగసి ద్వారా పిల్లలను పొందాలని అనుకుంటున్నారంటూ వస్తున్న ఈ వార్తలు కొందరు కొట్టిపారేస్తుండగా.. మరికొందరు.. ‘ఏమో ఇది నిజమై ఉండోచ్చు, సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారేమో’ అని అభిప్రాయ పడుతున్నారు. కాగా గత ఆరేళ్లుగా నయనతారా, విఘ్నేశ్ శివన్‌తో రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. విఘ్నేష్ దర్శకత్వం వహించిన 'నానుమ్ రౌడీ ధాన్' సినిమా సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో కొంతకాలం నుంచి సహజీవనం చేస్తున్న ఈ జంట లాక్డౌన్లో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించి.. పెళ్లి మాత్రం అందరి సమక్షంలో అంగరంగ వైభవం చేసుకుంటామని చెప్పిన సంగతి తెలిసిందే. -
షాకింగ్.. నయన్, విఘ్నేశ్‌ల పెళ్లి అయిపోయిందా? ఇదిగో ప్రూఫ్
Nayanthara And Vignesh Shivan Got Married?: సౌత్ లవ్‌బర్డ్స్ నయనతారా, విఘ్నేశ్ శివన్‌లకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ప్రస్తుతం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ‘నానూ రౌడీదాన్’ మూవీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట అప్పటి ప్రేమలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా సహజీవనం చేస్తున్న ఈ లవ్‌బర్డ్స్ లాక్డౌన్లో సీక్రెట్ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంగేజ్మెంట్ రహస్యం చేసుకున్నారు కదా.. మరి పెళ్లెప్పుడు అని అడగ్గా లాక్డౌన్ అనంతరం ఘనంగా చేసుకోవాలనుకుంటున్నామని సమాధానం ఇచ్చారు. చదవండి: ప్రభాస్‌పై పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇక పెళ్లి ఎప్పుడెప్పుడాని ఎదురు చేస్తున్న వీరి ఫ్యాన్స్, ఫాలోవర్స్‌కు షాకిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారంత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంతకి ఈ వీడియో ఏం ఉందంటే.. లాక్డౌన్ ఎత్తివేసినప్పటి నుంచి నయన్, విఘ్నేశ్‌లు జంటగా దేశంలోని ప్రముఖ దేవాలయాలన్ని చూట్టేస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో ఇటీవల తమిళనాడులోని ఓ అమ్మావారి ఆలయానికి వెళ్లారు. అయితే అక్కడ ఉన్న అభిమానులు తమ కెమెరాల్లో బంధించారు. చదవండి: పర్స్‌లు కొట్టేస్తూ పోలీసులకు చిక్కిన నటి, విచారణలో షాకింగ్ విషయాలు వీరి ఫోటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. అలా ఓ ఫ్యాన్ తీసిన వీడియోలో నయనతార నుదుటిపై కుంకుమ పెట్టుకొని కనిపించింది. అది చూసిన నెటిజన్లు నయనతారకు, విఘ్నేశ్‌కు పెళ్లి అయిపోయిందని, అయినా వీరిద్దరు బయటికి చెప్పడం లేదంటూ అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే ఈ జంట పెళ్లి చేసుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే ఈ జంట క్లారిటీ ఇచ్చేవరకు వేచి చూడాలి. కాగా ప్రస్తుతం వీరిద్దరూ కాతువాక్కుల రెండు కాదల్ మూవీతో బిజీగా ఉన్నారు. విఘ్నేశ్ దర్శకత్వంలో తెరకెక్కితున్న ఈ మూవీలో నయనతారా, సమంతవ, విజయ్ సేతుపతిలో లీడ్‌రోల్ పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝑵𝒂𝒚𝒂𝒏𝒕𝒉𝒂𝒓𝒂 (@nayanthara.kurian) -
మరోసారి వార్తల్లోకి నయనతార, విఘ్నేష్ శివన్
Vignesh Shivan and Nayanthara: ప్రేమజంట నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ మరోసారి వార్తల్లోకెక్కారు. నానూ రౌడీదాన్ చిత్ర షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట అప్పటి నుంచి సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరిలో ఏ ఒక్కరి పుట్టినరోజు గానీ, ఇతర పండగ రోజులు గానీ వేస్తే ఎంజాయ్ చేయడానికి చలో ఫారిన్ ట్రిప్ అంటారు. తాజాగా ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఎంజాయ్ చేయడానికి వీరు దుబాయ్ చేరుకున్నారు. అక్కడ బూర్జ్ ఖలీఫా ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు ట్రెండీగా మారాయి. కాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ జంట మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో 2021 తమకు సక్సెస్ ఫుల్ సంవత్సరంగా అమరిందని, తమ రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన కూళంగగల్ చిత్రం ఆస్కార్ అవార్డుల బరిలో నామినేట్ అవడం, తాము విడుదల చేసిన రాఖీ చిత్రం విజయవంతం కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. -
గాడ్ ఫాదర్ కోసం నయనతార షాకింగ్ రెమ్యునరేషన్!
Nayanthara Shcoking Remuneration For Chiranjeevi Godfather Movie: లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రస్తుతం టాలీవుడ్లో గాడ్ ఫాదర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరంజీవి సరసన నటించనుంది. ఇటీవలె నయన్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా కోసం నయనతార తీసుకుంటున్న రెమ్యునరేషన్‌పై ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం నయన్ సుమారు రూ.4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. పారితోషికం విషయంలో ఎప్పుడూ వార్తల్లో నిలిచే నయనతార మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా నయన్‌కి ఉన్న క్రేజ్‌ను బట్టి ఆమె అడిగినంత ఇచ్చేస్తున్నారు మేకర్స్. ఇక సైరా నరసింహారెడ్డి తర్వాత చిరంజీవితో నయనతారకు ఇది రెండో సినిమా. సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో కుష్బూ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. -
లేడీ సూపర్‌స్టార్ నయనతార బర్త్‌డే స్పెషల్ ఫోటోస్
-
కాత్తు వాక్కుల రెండు కాదల్: సమంత ఫస్ట్‌లుక్ చూశారా?
First Look Of Samantha In Kaathuvaakula Rendu Kaadhal Out: కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్ర ఫస్ట్ పోస్టర్‌ను నిర్మాతలు సోమవారం విడుదల చేశారు. విజయ్ సేతుపతి, నయనతార, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది. దీనికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. దీన్ని నయనతార, విఘ్నేష్ శివన్‌ల రౌడీ పిక్చర్స్ సంస్థ, లలిత్ కుమార్‌కు చెందిన 7 స్క్రీన్స్ స్టూడియోస్ సంస్థ సంయుక్తంగా నిర్మించారు. అనిరుద్ సంగీతాన్ని అందించిన చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలై సంగీత ప్రియుల ఆదరణ పొందుతున్నాయి. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ల విడుదలతో నిర్మాతలు ప్రచారం ప్రారంభించారు. విజయ్ సేతుపతి మూడు ముఖాలతో కూడిన ఒక పోస్టర్‌ను, నటి సమంత ఫొటోతో మరో పోస్టర్‌ను ఒకేసారి విడుదల చేసి చిత్రంపై ఆసక్తిని రేకెత్తించే యత్నం చేశారు. ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుందనే ప్రసారం ఇటీవల జోరుగా సాగింది. దానికి చెక్ పెట్టే విధంగా తమ చిత్రం థియేటర్లోనే విడుదలవుతుంది యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. -
నయనతార, విఘ్నేష్ శివన్ నిర్మాతలుగా మరో కొత్త సినిమా..
చెన్నై(తమిళనాడు): నటి నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సంస్థలో నిర్మించిన కూళాంగళ్, రాఖీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. తాజాగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు. దీనికి ఊర్ కురువి అనే టైటిల్ నిర్ణయించారు. ఇందులో బిగ్‌బాస్ ఫేమ్ కవిన్ కథానాయకుడిగా నటించనున్నారు. ఈయన హీరోగా నటించిన లిప్టు చిత్రం ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలై మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కాగా ఊర్ కురువి చిత్రం ద్వారా అరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్ర వివరాలను నిర్మాత విఘ్నేష్ శివన్ విజయదశమి సందర్భంగా మీడియాకు వెల్లడించారు. అరుణ్ తన వద్ద తానా సేంద కూట్టం చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశాడన్నారు. అతని ప్రతిభను గుర్తించి దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. -
నయనతారను ఆమె కాబోయే భర్త ఏమని పిలుస్తాడో తెలుసా?
నయనతారను ఆమెకు కాబోయే భర్త విఘ్నేష్ శివన్ ‘తంగమ్’ అని పిలుస్తారు. ‘తంగమ్’ అంటే బంగారం అని అర్థం. ఇప్పుడు నయనతార తన మాతృభాష మలయాళంలో చేయనున్న తాజా సినిమాకు ‘గోల్డ్’ (బంగారం) అనే టైటిల్ ఖరారైంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరో. ఇందులో నయనతారది బంగారం లాంటి క్యారెక్టర్ అట. ‘నిరమ్’ (2013), ‘ప్రేమమ్’ (2015) చిత్రాల తర్వాత అల్ఫోన్స్ పుత్రెన్ దర్శకత్వం వహించనున్న సినిమా ఇది. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఫస్ట్ షెడ్యూల్లోనే నయనతార ‘గోల్డ్’ సినిమా సెట్స్‌లో పాల్గొంటారని మాలీవుడ్ టాక్ చదవండి : మ్యూజిక్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోనున్న శ్రియా సరన్ పవన్ కళ్యాణ్‌కు పవర్ స్టార్ బిరుదును ఇచ్చింది ఎవరో తెలుసా..? -
నయనతార తండ్రికి అస్వస్థత.. ఐసీయూలో చికిత్స
ప్రముఖ హీరోయిన్ నయనతార తండ్రి కురియన్ కొడియట్టు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. నయనతార తండ్రి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియుడు విఘ్నేశ్ శివన్‌తో కలిసి నయనతార ఇటీవలి కాలంలో ప్రత్యేక విమానంలో కొచ్చికి వచ్చి వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక తన కూతురి పెళ్లిని కళ్లారా చూసుకోవాలని నయన్ తండ్రి ముచ్చటపడుతున్నారట. కొద్ది కాలంగా ఇదే విషయాన్ని నయన్తోనూ ప్రస్తావించారట. గత నాలుగేళ్లుగా విఘ్నేశ్‌తో ప్రేమలో ఉన్న నయనతార.. పెళ్లి విషయంపై మాత్రం కాస్త వెనకడుగు వేస్తుందట. కానీ ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక తమ పెళ్లి విషయాన్ని ఈ మధ్యే విఘ్నేశ్ శివన్ సైతం అధికారికంగా ప్రకటించారు. ఇన్‌స్టాలో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన ఆయన త్వరలోనే తమ పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వివాహం కూడుకున్నదని, అందుకు ఇప్పటినుంచే డబ్బులు సేవ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో అతి త్వరలోనే నయన్-విఘ్నేశ్ పెళ్లి పీటలెక్కనున్నారని తెలుస్తోంది. -
పెళ్లికి డబ్బులు కూడబెట్టుకుంటున్నాం!
కోలీవుడ్ లవ్‌బర్డ్స్ విఘ్నేశ్ శివన్, నయనతార ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? విఘ్నేశ్ ఫేవరెట్ హీరోయిన్ నయనతార కాదు.. మరి ఎవరు? నయనకు విఘ్నేశ్ ఇచ్చిన తొలి బహుమతి ఏంటి?... ఇలాంటి ఆసక్తికరమైన నెటిజన్ల ప్రశ్నలకు విఘ్నేశ్ శివన్ సరదాగా క్లారిటీ ఇచ్చారు. కాబోయే భార్య నయనతార గురించి విఘ్నేశ్ శివన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చదివేయండి. ♦నేనొక దర్శక నిర్మాత అయినప్పటికీ నెటిజన్లు ఎక్కువగా నా విషయాలను కాకుండా నయనతార గురించే ప్రస్తావించడం నాకు అసూయగా లేదు. నిజం చెప్పాలంటే చాలా గర్వంగా ఉంది. ♦నయనతారతో కలిసి నాకూ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోవాలనే ఉంది. కానీ ఈ విషయంలో తనవైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. ♦మా డిన్నర్‌ను కంప్లీట్ చేసిన తర్వాత రోజూ నయనతారే ఆ పాత్రలను శుభ్రపరుస్తుంది. ఘీ రైస్, చికెన్ కర్రీ బాగా వండుతుంది తను. ♦నయనతార నటించిన చిత్రాల్లో ‘రాజా–రాణి’ నా ఫేవరెట్ ♦నయనతో నేను కలిసి ఉన్న ప్రతీ ప్లేస్ నా ఫేవరెట్ స్పాటే. ♦నా ఫేవరెట్ హీరోయిన్ మోనికా బెల్లూచి (ఇటాలియన్ నటి). ♦నయనతార చాలా అందంగా ఉండటానికి ఆమె చేస్తున్న ప్రార్థనలే ముఖ్య కారణం ♦నయన నటించిన ‘నానుమ్ రౌడీదాన్’ చిత్రంలో ‘తంగమే’ (బంగారమే...) పాటకు లిరిక్స్ రాశాను. ఆమెకు నేను ఇచ్చిన తొలి బహుమతి ఈ పాట అని అనుకుంటాను. ♦పెళ్లంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకే డబ్బులు కూడబెడుతున్నాం. అలాగే కరోనా పరిస్థితులు పూర్తిగా సమసిపోయిన తర్వాత నేను, నయన వివాహం చేసుకోవాలనుకుంటున్నాం. ♦నా లైఫ్‌లో నయనతార తల్లి కురియన్ వన్నాఫ్ ది బెస్ట్ పర్సన్స్. ♦వెస్ట్రన్ డ్రెస్సింగ్ స్టైల్లో కన్నా నయనతార చీరకట్టులోనే చాలా బాగుంటుంది. ♦నేను దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమా ‘కాత్తువాక్కుల రెండు కాదల్’ షూటింగ్ ఇంకా 15 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. (ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు). చదవండి: (చూపు కోల్పోయిన కత్తి మహేశ్?) -
పెళ్లికి రెడీ అయిపోయిన లవ్ బర్డ్స్ నయన్-విఘ్నేష్
కోలీవుడ్ లవ్ కపుల్ నయనతార-విఘ్నేష్ శివన్‌లు దాదాపు నాలుగేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ జంట గురించి ఎప్పుడూ ఏదో ఓ వార్త హైలేట్ అవుతూనే ఉంటుంది. ఇటీవలె వీరి పెళ్లి టాపిక్ మరింత హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో నయన్-విఘ్నేష్‌ల పెళ్లి ఉంటుందని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. అయితే విఘ్నేశ్ మాత్రం ఆ వార్తలను కొట్టిపారేశాడు. ప్రస్తుతం తామిద్దరం ఎవరి సినిమాలతో వాళ్లు ఫుల్ బిజగా ఉన్నామని, కెరీర్‌పరంగా మేం సాధించాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా డేటింగ్ లైఫ్‌పై తమకు బోర్ కొట్టినప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తామంటూ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అయితే తాజాగా వీరి పెళ్లి విషయం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. త్వరలోనే నయన్-విఘ్నేష్‌లు దంపతులుగా మారనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. తాజాగా నెటిజన్లతో సంభాషించిన ఆయన వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.ఇందులో భాగంగా ఓ యూజర్..మీరు, నయన్ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? మీ పెళ్లి కోసం చాలా ఎదురుచూస్తున్నాం అని పేర్కొనగా..వివాహం ఖరీధైనదని, ఆ శుభ కార్యక్రమానికి డబ్బు ఆదా చేస్తున్నాను అని బదులిచ్చాడు. అంతేకాకుండా త్వరగా కరోనా వెళ్లిపోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీంతో పెళ్లికి తామిద్దరం సిద్ధంగానే ఉన్నామని, కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే పెళ్లి ఉంటుందని విఘ్నేష్ హింట్ ఇచ్చేశాడు. ఇదే నిజమైతే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది నయనతార వివాహం జరగనుంది. ఇంక మరో నెటిజన్ నయనతార వండే వంటకాల్లో మీకు ఏం ఇష్టం అని అడగ్గా..ఘీ రైస్, చికెన్ కర్రీ అని విఘ్నేష్ తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే నయనతార ప్రస్తుతం 'కాతు వాకులా రేండు కదల్' చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీలో సమంత కీలకపాత్రలో కనిపించనుంది. చదవండి : నయనతారలో నచ్చేది అదే : విఘ్నేష్ శివన్ రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసిన నయన్ -
రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసిన నయన్
ఇప్పటివరకు దక్షిణాది చిత్రాలకే పరిమితమైప నయనతార తొలిసారిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సినిమాలో జోడీ కట్టేందుకు రెడీ అవుతుంది ఈ లేడీ సూపర్ స్టార్. డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. గత పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ కెరీర్లో సౌత్‌లో టాప్ హీరోయిన్గా దూసుకెళ్తున్న నయనతార ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. అంతేకాకుండా రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసింది ఈ భామ. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3-5 కోట్ల వరకు తీసుకునే నయనతార ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ కోసం రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసింది. బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని రూ.6-8 కోట్ల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసిందట. కథలో దక్షిణాది నేపథ్యం ఉండటతో నయన్ తీసుకున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ మారేసరికి నయన్ రేటు పెంచడంతో నిర్మాతలు షాక్ అయ్యారట. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో నయన్ పేరు ముందుంటుంది. అలాంటిది ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ అనగానే పారితోషికాన్ని డబుల్ చేయడంతో ఇక చేసేదేం లేక అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. చదవండి : నయనతారలో నచ్చేది అదే : విఘ్నేష్ శివన్ -
నయనతార బాలీవుడ్ ఎంట్రీ..హీరో ఎవరంటే..
ప్రస్తుతం ‘పఠాన్’ సినిమాతో బిజీగా ఉన్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ త్వరలో దక్షిణాది దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అట్లీ చెప్పిన ఫైనల్ కథకు షారుక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో సినిమాలో ఇతర ప్రధాన తారాగణం ఎంపికపై ఫోకస్ పెట్టారని టాక్. ఈ ప్రక్రియలో భాగంగానే తన దర్శకత్వంలో వచ్చిన ‘రాజా– రాణి’ (2013), ‘బిగిల్’ (2019) చిత్రాల్లో హీరోయిన్గా నటించిన సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార పేరును పరిశీలిస్తున్నారట అట్లీ. ఆల్రెడీ నయనతారతో సంప్రదింపులు కూడా మొదలుపెట్టారనే టాక్ వినిపిస్తోంది. అయితే పదిహేనేళ్లుగా సౌత్‌లో అగ్ర కథనాయికగా రాణిస్తున్న నయనతార ఇంతవరకూ హిందీ సినిమా చేయలేదు. మరి.. షారుక్‌తో నయనతార జోడీ కడతారా? హిందీ సినిమాకు నయనతార సైన్ చేస్తారా? వేచి చూడాల్సిందే. చదవండి: నయనతారలో నచ్చేది అదే : విఘ్నేష్ శివన్ -
ఇప్పుడే పెళ్లికి సిద్ధంగా లేనని చెప్పిన నయనతార ?
కోలీవుడ్ లవ్ కపుల్ విఘ్నేష్ శివన్-నయనతారలకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త హైలైట్ అవుతూనే ఉంటుంది. ఈ జంట పెళ్లి చేసుకోరు. కనీసం ప్రేమించుకుంటున్నాం అని కూడా చెప్పరు. అయినా సహజీవనం చేస్తున్నారు. కలిసి ఏ దేశానికి విహారయాత్రలకు వెళ్లినా, పుట్టిన రోజు, రెండు రోజు వేడుకలను జరుపుకున్నా వెంటనే ఆ ఫొటోలను మీడియాకు విడుదల చేసి వార్తల్లో చర్చనీయాంశంగా మారుతుంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా లవ్కపుల్కి సంబంధించి మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. గత నాలుగేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంటకు త్వరలోనే పెళ్లిచేయాలని విఘ్నేష్ తల్లిదండ్రులు భావిస్తున్నారట. చాలాకాలంగా డేటింగ్ చేస్తున్న వీరిద్దరిని భార్యభర్తలు చేయాలని విఘ్నేష్ పేరేంట్స్ అనుకుంటున్నారట. పెళ్లికి నయన్ నో చెప్పిందట. ఇప్పుడే పెళ్లికి సిద్ధంగా లేనని, కరోనా పరిస్థితులు చక్కబడ్డాక వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని చెప్పిందట. ఇందుకు విఘ్నేష్ కూడా ఓకే చెప్పినట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో పెళ్లి నిర్ణయాన్ని వాయిదా వేశారని టాక్. ఇదే నిజమైతే వచ్చే ఏడాది నయనతార మిసెస్ నయనతార విఘ్నేష్‌గా మారనుంది. చదవండి : ప్రియుడితో నయనతార.. ప్రత్యేక విమానంలో ప్రియురాలిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక.. -
ప్రియుడితో నయనతార.. ప్రత్యేక విమానంలో
చెన్నై: కోలీవుడ్‌లో సంచలన జంట ఎవరంటే నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ అని ఠక్కున సమాధానం వస్తుంది. ఈ జంట పెళ్లి చేసుకోరు. కనీసం ప్రేమించుకుంటున్నాం అని కూడా చెప్పరు. అయినా సహజీవనం చేస్తున్నారు. కలిసి ఏ దేశానికి విహారయాత్రలకు వెళ్లినా, పుట్టిన రోజు, రెండు రోజు వేడుకలను జరుపుకున్నా వెంటనే ఆ ఫొటోలను మీడియాకు విడుదల చేసి వార్తల్లో చర్చనీయాంశంగా మారుతుంటారు. కాగా ప్రస్తుతం మరోసారి ఈ సంచలన జంట వార్తల్లోకెక్కారు. శనివారం చెన్నై నుంచి ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌లో కొచ్చిన్‌కి వెళ్లారు. ఆ ఫొటోలను దర్శకుడు విఘ్నేష్ శివన్ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రయాణానికి సంబంధించిన వీడియోను నయనతార తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఇదంతా ఇలా ప్రత్యేక విమానంలో వెళ్లడం రెండోసారి. గత ఏడాది ఓనం పండుగ వేడుకలను జరుపుకోవడానికి నయనతార చెన్నై నుంచి కొచ్చిన్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లారు. తాజాగా ఈ నెల 14వ తేదీన కొత్త సంవత్సరాన్ని కేరళీయులు విషు వేడుక పేరుతో ఘనంగా జరుపుకుంటారు. ఆ వేడుక జరుపుకోవడానికి నయనతార, విఘ్నేష్ శివన్ ప్రత్యేక విమానంలో వెళ్లారు. చదవండి: నీటి లోపల మెహరీన్ లవ్ ప్రపోజల్ -
‘స్టార్ మా’ లో నయనతార కొత్త వేషం..!
ఆదివారాలు పాజ్ బటన్‌తో వస్తే ఎంత బావుంటుంది అన్నాడో ఆంగ్లేయుడు. కానీ కాలాన్ని మనం ఎలాగూ ఆపలేం. అయితే సమయాన్ని మరపురానిదిగా మలుచుకోవడం మాత్రం మన చేతిలో ఉంటుంది. ‘స్టార్ మా’ ఆదివారాలు ఇదే ఫార్ములాని అనుసరిస్తోంది. ఈ ఆదివారం (7వ తేదీ) సాయంత్రం 6 గంటలకు నయనతార ప్రత్యేక పాత్రలో నటించిన "అమ్మోరు తల్లి" చిత్రాన్ని ప్రసారం చేస్తోంది. ఎన్నో మంచి చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నయనతార ముక్కుపుడక అమ్మవారిగా విభిన్నమైన హావభావాలతో కనువిందు చేయబోతోంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా "అమ్మోరు తల్లి" చిత్రం రాబోతోంది. వినోదానికి కొత్త అర్ధం చెబుతున్న ఈ సంచలన చిత్రం ఓ వినూత్నమైన అనుభూతిని ఇవ్వనుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు "స్టార్ట్ మ్యూజిక్ " షో తో సుమ చేస్తున్న హంగామా ఆదివారానికే ఓ ప్రత్యేకం. 1.30 గంటలకు "కామెడీ స్టార్స్" చేసే పంచులు కోలాహలం అద్భుతం. మధ్యాహ్నం అంతా మజా మజా గా సాగే వినోదం.. సాయంత్రం నయనతార నట విశ్వరూపం. స్టార్ మా ప్రేక్షకులకు ఈ ఆదివారం వెరీ వెరీ స్పెషల్. చదవండి: ఆన్లైన్ క్లాసులు: షాకైన అమ్మోరు తల్లి -
వాలంటైన్స్ డే: నయన్‌కు ప్రియుడి స్పెషల్ విషెస్
చెన్నై : కోలీవుడ్ లవ్ కపుల్ విఘ్నేష్ శివన్, నయనతార ప్రతీ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ సందడిని సోషల్ మీడియాలో పంచుకుంటారు. వేలంటైన్స్ డే సందర్భంగా ఈ ప్రేమజంట తీసుకున్న ఫొటోను షేర్ చేశారు విఘ్నేశ్. ‘‘నీతో ప్రేమలో ఉండటాన్ని ఎంతో ప్రేమిస్తుంటాను’’ అని ఈ ఫొటోకు క్యాప్షన్ చేశారు. ప్రస్తుతం విఘ్నేష్ దర్శకత్వంలో ‘కాదువాక్కుల్ రెండు కాదల్’ సినిమాలో ఓ హీరోయిన్గా నటిస్తున్నారామె. ఇక నయనతార, విఘ్నేశ్ శివన్ విడదీయలేని ప్రేమ బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్లుగా వీరు ప్రేమలో మునిగి తెలుతున్నారు. ప్రేమలో ఉన్నామని ప్రకటించకపోయినా వాళ్ల ప్రయాణాలు, సోషల్ మీడియా పోస్టులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటాయి. ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: ఒక్కటైన ‘లవ్ మాక్‌టైల్’ జంట గుడ్‌న్యూస్: ఓటీటీలోకి ఉప్పెన.. ఎప్పుడంటే View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
తమిళ చిత్రానికి అంతర్జాతీయ గౌరవం..
దర్శకుడు పీఎస్ వినోద్ రాజ్ తెరకెక్కించిన తమిళ చిత్రం కూజంగల్(గులకరాళ్లు) చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. 50వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ రోటర్‌డామ్‌లో(ఐఎఫ్ఆర్ఆర్) భాగంగా కూజంగల్ ‘టైగర్ అవార్డు’ను సొంతం చేసుకుంది. ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని పొందిన మొదటి తమిళ చిత్రం ఇదే. దీనిని కోలీవుడ్ కపుల్ నయనతార విఘ్నేష్ శివన్ కలిసి రౌడీ పిక్చర్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సందర్భంగా నెదర్లాండ్స్‌లోని ఐఎఫ్ఎఫ్ఆర్ కార్యక్రమంలో చిత్రయూనిట్‌తో కలిసి కూజంగల్ స్క్రీనింగ్‌లో విఘ్నేష్, నయనతార సందడి చేశారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కూజంగల్ చిత్రాన్ని గురువారం రోటర్‌డామ్ ఉత్సవంలో ప్రదర్శించారు. కాగా టైగర్ అవార్డును గెలుచుకున్న రెండవ భారతీయ చిత్రం కూజంగల్. మొదట 2017లో సనల్ కుమార్ ససిధరన్ తెరకెక్కించిన మలయాళ చిత్రం సెక్సీ దుర్గా ఈ అవార్డును గెలుచుకుంది. కాగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం రోటర్‌డామ్ విభిన్న ప్రయోగాతక చిత్రాలను గుర్తించడంలో ప్రసిద్ధి చెందింది. తాగుబోతు తండ్రికి, అతని కొడుక్కి మధ్య జరిగే కథనే కూజంగల్..ఇందులో నూతన నటులు కరుతదయ్యన్, చెల్లా పాండి నటించారు. ఇల్లు వదిలి వెళ్లిన తల్లిని తిరిగి తీసుకురావడానికి తండ్రీ, కొడుకులు చేసే ప్రయత్నమే ఈ సినిమా. వినోద్ రాజ్‌కు దర్శకుడిగా కూజంగల్ మొదటి చిత్రం. అవార్డు అందుకోవడంపై ఆయన స్పందిస్తూ.. గులకరాళ్లు సినిమా టైగర్ అవార్డు 2021గెలుచుకున్నందుకు ఆనందంగా ఉంది. సినిమా కోసం మేం పడిన కష్టానికి ఫలితం దక్కింది. సినిమాపై చూపిన ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. మరోవైపను దీనిపై విఘ్నేష్ స్పందిస్తూ.. టైగర్ అవార్డు గెలుచున్న మొదటి తమిళ చిత్రం కూజంగల్ అని పేర్కొన్నారు. ఈ సినిమా వెనుక దర్శకుడు వినోత్ కృషి ఎక్కువ ఉందన్నారు. ఈయన చేసిన మొదటి చిత్రానికే ఇంత పెద్ద గౌరవం లభించిందన్నారు. అవార్డు దక్కడం సంతోషంగా ఉందన్నాడు. చదవండి: నోరుపారేసుకున్న నెటిజన్.. అనసూయ గట్టి కౌంటర్ కేజీఎఫ్ 2 తర్వాతే రాధేశ్యామ్! -
సూపర్ స్టార్ సినిమా రిలీజ్‌కు డేట్ ఫిక్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'అన్నాత్తే' సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ ఏడాది దీపావళి సందర్భంగా అన్నాతే థియేటర్లలలో విడుదల కాబోతున్నట్లు సన్ పిక్చర్స్ వెల్లడించింది. నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్లో పోస్టు పెట్టింది. ‘నవంబర్ 4న అన్నాత్తే సినిమా విడుదల కాబోతుంది. సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది. కాగా శివ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్నఈ సినిమాలో రజనీకి జోడీగా నయనతార నటిస్తున్నారు. అలాగే కీర్తీ సురేశ్, మీనా, కుష్భూ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా తలైవా నటిస్తున్న 168వ సినిమా ఇది. ఇంతకముందు రజినీకాంత్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన దర్బార్ సినిమాలో నటించారు. చదవండి: డీఎంకేలోకి తలైవా టీం .. చెప్పే వచ్చాం.. కాగా అనారోగ్యం కారణంగా కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు రజనీ. హైదరాబాద్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక చెన్నై వెళ్ళి అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. నిజానికి ఈ సినిమా కొన్ని రోజుల పాటు ఆగిపోయిందని, ఇప్పట్లో విడుదల కూడా కాదని సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అన్నట్లుగానే సమ్మర్లో వస్తుందనుకున్న సినిమా కాస్తా ఏడాది చివర్లోకి వెళ్లిపోయింది.మరోవైపు అన్నాత్తేలో రజినీ ఇంట్రో సాంగ్ దివంగత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. గతేడాది సమ్మర్లోనే సంగీత దర్శకుడు ఇమాన్ అన్నాత్తే పాటల రికార్డింగ్ పూర్తి చేసాడు. అందులో మొదటి పాటను బాలుతో పాడించాడు. ఈ పాటను త్వరలోనే విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. #Annaatthe will be releasing on November 4th, 2021! Get ready for #AnnaattheDeepavali! @rajinikanth @directorsiva @KeerthyOfficial @immancomposer pic.twitter.com/NwdrvtVtSE — Sun Pictures (@sunpictures) January 25, 2021 -
వెల్కమ్ 2021
కొత్త ఏడాదిని ప్రేమతో స్వాగతించారు స్టార్స్. 2020కి గుడ్‌బై చెబుతూ, 2021కి స్వాగతం పలికారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు కొందరు. లేడీ సూపర్ స్టార్ నయనతార, తన బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్ శివన్‌తో దిగిన ఫోటో షేర్ చేశారు. కాజల్ అగర్వాల్, గౌతమ్ దంపతులు, నిఖిల్, పల్లవి వర్మ దంపతులు మంచు కొండల్లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు. సమంత–నాగచైతన్య గోవాలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. -
మూడోకన్ను
లేడీ సూపర్‌స్టార్ నయనతార ఇప్పటివరకూ పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించారు. తాజాగా ఓ థ్రిల్లర్‌తో ముందుకొస్తున్నారు. ‘గృహం’ ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వంలో ‘నెట్రిక్కన్’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు నయనతార. నెట్రిక్కన్ అంటే మూడో కన్ను అని అర్థం. ఈ సినిమాలో నయనతార అంధురాలిగా నటిస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని నయనతార బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్నారు. ఇది నయనతార కెరీర్లో 65వ సినిమా. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘ఫస్ట్ లుక్‌కి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సినిమాకి సంబంధించి త్వరలోనే మరిన్ని అప్డేట్స్తో వస్తాం’ అన్నారు విఘ్నేష్ శివన్. -
అంధురాలిగా నయన్.. ట్రెండింగ్‌లో ఫస్ట్‌లుక్
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం 'నెట్రికన్' (మూడో కన్ను). ఈ సినిమాలో నయన్ అంధురాలిగా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. అభిమానులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను గురువారం నయనతార ట్విటర్ ఫ్యాన్ పేజీలో అధికారికంగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఇంటర్నెట్లో ట్రెండింగ్‌లో ఉంది. ఇక ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమనేది అర్ధమవుతోంది. తల నుంచి రక్తం కారుతున్నా లెక్కచేయకుండా చేతిలో ఆయుధాన్ని ధరించి శత్రువుపై దాడికి సిద్ధమైనట్లుగా నయనతార కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు నటించిన చిత్రాలతో పోలిస్తే ఢిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న నయన్ లుక్ ఆసక్తిని పెంచుతోంది. చదవండి: ఆలయంలో నయన్-శివన్‌ల వివాహం! మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఓ ప్రమాదంలో కంటి చూపు కోల్పోయిన పోలీస్ అధికారిణిగా నయనతార నటిస్తున్నారు. ఈ సినిమాకు మిలింద్‌రావ్ దర్శకత్వం వహిస్తుండగా నయనతార ప్రియుడు విఘ్నేష్‌శివన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరో విషేషం ఏంటంలే ఈ చిత్రంతో దర్శకుడైన విఘ్నేష్ శివన్ నిర్మాతగా అవతారమెత్తుతున్నారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి మిలింద్ రౌ దర్శకుడు. గిరిష్ జి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా తమిళ సెలబ్రిటీలు చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్ ట్విట్టర్ ద్వారా చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: ఓటీటీలో గోపీచంద్-నయన్ చిత్రం? Thank you for launching our first look, @Nayanfandom https://t.co/9mXvoHnMy6 — Milind Rau (@Milind_Rau) October 22, 2020 -
మీ స్వరం అన్ని వేళలా తోడుగా ఉంది
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం యావత్ దేశాన్ని కదిలించింది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు బాలు మృతికి సంతాపం తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నయనతార బాలు మృతికి సంతాపం తెలిపారు. తమ జీవితాల్లో బాలు స్వరం తోడుగా ఉందని తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘దైవిక స్వరం ఇక లేదు. అన్ని రుతువుల.. అన్ని కారణాల స్వరం మీది. మీరు ఇక లేరని నమ్మడం ఎంతో కష్టంగా ఉంది. మా జీవితాల్లోని ముఖ్యమైన క్షణాల్లో మీ స్వరం మాకు తోడుగా ఉంది. ప్రతి తరంలోని వారు తమ భావోద్వేగాలన్నింటిని కనెక్ట్ అయ్యి ఉండే ఏకైక గాత్రం మీది మాత్రమే. మమ్మల్ని ఆహ్లాదపరిచే.. సేద దీర్చే ఆ గాత్రం ఇక లేదని నమ్మడం కష్టంగా ఉంది’ అన్నారు నయనతార. (చదవండి: బాలుపై అభిమానంతో ‘బామా’) ‘మీరు మీ స్వరంతో మాతో శాశ్వతంగా ఉంటారు. మా కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. ఇప్పుడు మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి మీకు కన్నీటి వీడ్కోలు ఇస్తున్నాము. మీ కుటుంబ సభ్యులకు, సహచరులకు, అభిమానులకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను’ అన్నారు నయనతార. కరోనా వైరస్ బారిన పడిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆగస్టు 5న ఆసుపత్రిలో చేరారు. అప్పట్నుంచి ఎక్మోతో పాటు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించారు. కానీ సెప్టెంబరు 24న ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించింది. చివరకు శుక్రవారం మధ్యాహ్నం కన్ను మూశారు. -
ఓటీటీలో గోపీచంద్-నయన్ చిత్రం?
మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలతో పాటు సినీ రంగాన్ని కూడా కుదిపేసింది. చాలా విరామం తర్వాత ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలవుతున్నాయి. అయితే థియేటర్లు తెరుచుకునే విషయంలో ఇప్పటికీ సందిగ్దత కొనసాగుతూనే ఉంది. దీంతో విడుదలకు సిద్దంగా ఉన్న చిత్రాలను ఓటీటీ (ఓవర్ ది టాప్ మీడియా సర్వీసెస్)లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వేదికగా విడుదల అయ్యాయి. అమృతరామమ్‌తో పాటు కీర్తి సురేష్, జ్యోతిక, అమితాబ్‌ల చిత్రాలు ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఇక షూటింగ్ పూర్తి చేసుకొని పలు కారణాలతో విడుదలకు నోచుకోని చిత్రాలు సైతం ఓటీటీలో విడుదల కాబోతున్నాయి. (ఆగస్ట్‌లో కబడ్డీ కబడ్డీ) తాజాగా గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రం కూడా డిజిటల్ బాట పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూడేళ్ల క్రితం గోపీచంద్, నయనతార జంటగా మాస్ డైరెక్టర్ బి. గోపాల్ తెరకెక్కించిన సినిమా 'ఆరడుగుల బుల్లెట్'. షూటింగ్ పూర్తయినా.. చిత్ర విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాత ప్రయత్నాలు మొదలు పెట్టారంటా. గోపిచంద్ క్రేజ్, నయనతరా గ్లామర్, గోపాల్ ఇమేజ్ కలగలపి ఈ చిత్రానికి ఓటీటీలో మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఓటీటీ నిర్వాహకులతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే గుడ్ న్యూస్ రానుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఓటీటీలో విడుదల అవుతున్న గోపీచంద్-నయనతార చిత్రం ఎలా వుంటుందో చూడాలనే ఆసక్తి అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. (ఐ వాన్న అన్‌ఫాలో యు) -
ఆలయంలో నయన్-శివన్‌ల వివాహం!
దాదాపు నాలుగేళ్లుగా ప్రేమ మైకంలో మునిగి తేలుతున్న రొమాంటిక్ జంట నయనతార- విఘ్నష్ శివన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన ఈ జంట గుడిలో పెళ్లి చేసుకుని దాంపత్య జీవితానికి స్వాగతం పలకాలని భావిస్తున్నట్లు వార్తలు షికారు చేస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలను సవరిస్తూ దేశవ్యాప్తంగా దేవాలయాలు ఈనెల 8 నుంచి తెరుచుకుంటాయని కేంద్రం ఇటీవల నూతన మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో తమిళనాడులోని ఓ ప్రముఖ ఆలయంలో వివాహం చేసుకోవాలని ఈ జంట ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కేవలం కొంతమంది అతిథుల సారథ్యంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక పెళ్లి వార్త తెలిసిన నయన్-శివన్ అభిమానులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు బెబుతున్నారు. అయితే వివాహ వార్తలపై ఈ జంట ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ‘నేనూ రౌడీనే’ మూవీ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల నుంచి ప్రేమాయణం నడుపుతున్న ఈ జంట.. వీలైనప్పుడల్లా వారి మధ్య ఉన్న బంధాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు చాలా రోజుల నుంచి నెట్టింట చక్కర్లు కొట్టాయి. కానీ ఆ పుకార్లకు మాత్రం ఈ జంట ఇప్పటి వరకు చెక్ పెట్టలేదు. -
కాబోయే తల్లికి శుభాకాంక్షలు!
తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్, నయనతార కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈ విషయాన్ని ఈ ఇద్దరూ ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. సోషల్ మీడియాలో పోస్ట్‌ల ద్వారా, కలసి చేసే ప్రయాణాల ద్వారా ఎప్పటికప్పుడు తమ ప్రేమను చెప్పకనే చెబుతున్నారు. ఆ మధ్య ఓ ఆడియో ఫంక్షన్ లో విఘ్నేష్ శివన్‌ని నయనతార హబ్బీ (భర్త) అని సంబోధించారు. తాజాగా మదర్స్ డే సందర్భంగా విఘ్నేష్ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నయనతార చిన్న పిల్లాడిని ఎత్తుకున్న ఫొటో అది. దానికి ఈ విధంగా క్యాప్షన్ చేశారు. ‘‘భవిష్యత్తులో నా పిల్లలకు తల్లి కాబోయే తనకి (నయనతారని ఉద్దేశిస్తూ) మదర్స్ డే శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు విఘ్నేష్. ఈ ఏడాది చివర్లో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలకు ఈ కామెంట్ మరింత బలాన్ని చేకూర్చింది. విఘ్నేష్ శివన్, నయనతార -
ఇన్ రాఘవన్
తమిళంలో టాప్ స్టార్స్ నుంచి యంగ్ హీరోస్ వరకు అందరితో యాక్ట్ చేశారు నయనతార. ఒక్క కమల్ హాసన్‌తో తప్ప. ఇప్పుడు ఈ కాంబినేషన్ కలవబోతోందని కోలీవుడ్ టాక్. దర్శకుడు గౌతమ్ మీనన్, కమల్ హాసన్ కాంబినేషన్లో 2006లో ‘వేట్టయాడు విలయాడు’ (తెలుగులో ‘రాఘవన్’గా విడుదలయింది) సినిమా వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ను రూపొందిస్తున్నారు గౌతమ్ మీనన్. ఇందులో హీరోయిన్గా అనుష్క నటిస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి.. నయన ఇన్ రాఘవన్ వార్త నిజమేనా? ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. -
హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో నయన
లేడీ సూపర్‌స్టార్ నయనతార చిత్రం అంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దర్బార్, బిగిల్ చిత్రాల సక్సెస్‌తో తన క్రేజ్‌ను ఇంకా పెంచుకుంది. మరోసారి సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో అన్నాత్తా చిత్రంలో నటిస్తోంది. ఇది కాకుండా కథానాయకికి ప్రాముఖ్యత కలిగిన మూక్కుత్తి అమ్మన్ అనే భక్తిరస కథా చిత్రంలోనూ నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. కాగా తన ప్రియుడు విఘ్నేశ్‌శివన్‌ను నిర్మాతగా రౌడీ పిక్చర్స్ పతాకంపై వెట్రికన్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం కావడం విశేషం. సాధారణంగా హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో హీరోయిన్లకు సపోర్టింగ్ ఒక హీరో ఉంటుంటాడు. అలా మాయ చిత్రంలో నయనతారతో నటుడు ఆరి నటించారు. అదేవిధంగా ఈ నెట్రికన్ చిత్రంలోనూ అజ్మల్ నటిస్తున్నాడు. అంజాదే, కో, ఇరవుక్కు ఆయిరం కన్గళ్ వంటి చిత్రాల్లో తనదైన స్టైల్లో నటించి మెప్పించారు. అంతే కాదు తెలుగులోనూ నటిస్తూ బహుభాషా నటుడిగా రాణిస్తున్నాడు. కాగా అజ్మల్ ఇప్పుడు నయనతారతో కలిసి నెట్రికన్ చిత్రంలో నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు తాజాగా వెల్లడించారు. ఈ చిత్రంలో అజ్మల్ పాత్ర కథను మలుపు తిప్పే చాలా కీలకంగా ఉంటుందట. సస్పెన్స్, థ్రిల్లర్‌తో కూడిన మిస్టరీ కథాంశంతో కూడిన చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం నెట్రికన్. అవళ్ వంటి హిట్ చిత్రాల దర్శకుడు మిలింద్‌రావ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తి అయ్యిందని చిత్ర వర్గాలు తెలిపారు. కాగా దీనికి గిరీశ్ సంగీతాన్ని, కార్తీక్ గణేశ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. నవీన్ సుందరమూర్తి మాటలను అందిస్తున్న ఈ చిత్రానికి కుబేద్రన్. వీకే సహ నిర్మాతగానూ, జీ.మురుగభూపతి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు చేరుకోవడంతో నయనతార త్వరలో ఆమె ప్రియుడు విఘ్నేశ్‌శివన్ దర్శకత్వం వహించనున్న కాత్తు వాక్కుల రెండు కాదల్ అనే ముక్కోణపు ప్రేమ కథా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతుందన్నమాట. విజయ్‌సేతుపతి హీరోగా నటించనున్న ఇందులో సమంత మరో నాయకిగా నటించనుంది. -
రూల్స్ పక్కన పెట్టేసిన సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్
-
గుడ్‌న్యూస్ చెబుతారా?
సమంత–నయనతార ఓ సినిమాలో కలసి నటించాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో నుంచి సమంత తప్పుకున్నారట. మరి.. గుడ్ న్యూస్ అన్నారేంటీ అనుకుంటున్నారా? సమంత ఓ గుడ్‌న్యూస్ చెప్పడానికే ఈ ప్రాజెక్ట్‌లో కొనసాగలేకపోతున్నారని టాక్. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్‌సేతుపతి హీరోగా ‘కాదు వాక్కుల రెండు కాదల్’ అనే సినిమా తెరకెక్కనుంది. ఇందులో సమంత, నయనతారలను హీరోయిన్లుగా అనుకున్నారు. అయితే తల్లి కాబోతున్నారనే కారణంగానే ఈ ప్రాజెక్ట్‌లో నుంచి సమంత తప్పుకోవాలనుకుంటున్నారన్నది తాజా సమాచారం. ఇదే నిజమైతే ఆ గుడ్‌న్యూస్‌ని ఎప్పుడు ప్రకటిస్తారో చూద్దాం. -
పెద్దన్నయ్య
రజనీకాంత్ సినిమాలంటే ఆ ఎనర్జీయే వేరు. ఆయన సినిమా ప్రకటించినప్పటి నుంచే హంగామా మొదలవుతుంది. ఇక టైటిల్ ప్రకటన తర్వాత ఆ హంగామా రెండింతలవుతుంది. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారాయన. ఈ సినిమాకు ‘అన్నాత్తే’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సోమవారం ప్రకటించారు. ‘అన్నాత్తే’ అంటే పెద్దన్నయ్య అని అర్థం. ఇందులో ఖుష్భూ, మీనా, నయనతార, కీర్తీ సురేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో రజనీ కుమార్తె పాత్రలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. నయనతార విలన్‌గా కనిపిస్తారని టాక్. ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారు. -
నయనతారకు ఇలాంటి ఆరోపణలు పెద్ద దెబ్బే
సంచలన హీరోయిన్ నయనతారపై వ్యతిరేకత ఎక్కువ అవుతోందా? ఆమెపై చర్యలకు నిర్మాతల సంఘం సిద్ధం అవుతోందా? అసలు ఇంతకీ నయనతార ఎదుర్కొంటున్న ఆరోపణలు ఏమిటి? ఈ విషయాలు చర్చించే ముందు నయనతార స్థాయి ఏమిటో చూద్దాం. అయ్యా చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన మాలీవుడ్ బ్యూటీ నయనతార.. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ గ్లామరస్ ఇమేజ్ నుంచి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల నటి స్థాయికి ఎదిగింది. అంతే కాదు దక్షిణాదిలోనే నంబర్‌వన్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అలా తన ఇమేజ్‌తో పాటు పారితోషికాన్ని పెంచుకుంటూపోయింది. అది ఎంత అంటే నిర్మాతలకు తడిసి మోపెడు అయ్యేంతగా. నయనతార ప్రస్తుతం రూ.6 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చదవండి: టీవీ యాంకర్ ఇంట్లో పేలిన కుక్కర్ ఇది కూడా పర్వాలేదు. ఎందుకంటే నిర్మాతలు అందుకు అంగీకరించే అంత భారీ పారితోషికాన్ని ముట్టజెపుతున్నారు. అయితే దానితో పాటు ఆమె ఇతర అవసరాల ఖర్చులే భారంగా మారాయంటున్నారు. నయనతారకు ప్రత్యేక కేరవాన్, బాడీగార్డ్స్ వేతనాలు, ఆమె ప్రత్యేక మేకప్‌మన్, హెయిర్డ్రస్సెర్, వ్యక్తిగత అసిస్టెంట్, కారు డ్రైవర్ వారందరికీ నిర్మాతనే వేతనాలు చెల్లించాల్సిన పరిస్థితి. వీటికి మాత్రమే రోజుకు రూ. 60 నుంచి 70 వేలు అవుతుంది. ఇవికాక నయనతార సొంత ఖర్చులకు కూడా నిర్మాతలపై మోపుతున్నట్లు, చివరికి తన వెంట వచ్చే ఆమె ప్రియుడు సరదాల ఖర్చు నిర్మాతలే భరించాల్సివస్తోందనే ఆరోపణలపై నిర్మాతల మండలిలో చర్చ జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఇదే విషయాన్ని ఇటీవల నిర్మాత రాజన్ ఒక వేదికపై నటి నయనతార పారితషికం గురించి మాట్లాడారు. దీంతో ఇకపై నయనతార వంటి స్టార్ హీరోయిన్లకు కేరవాన్ల వసతి, ఇతర ఖర్చులను వారి పారితోషికాల నుంచే పెట్టుకోవాలనే నిబంధనను విధించాలని ఒత్తిడి నిర్మాతల మండలిపై పెరుగుతున్నట్లు సమాచారం. దీంతో ఇతర నటీమణులు దిగ్బ్రాంతికి గురవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా నయనతారకు ఇలాంటి ఆరోపణలు పెద్ద దెబ్బేనంటున్నారు సినీ వర్గాలు. ఇప్పుటికే అవకాశాలు తగ్గాయని, ప్రస్తుతం చేతిలో ఒకటి రెండు చిత్రాలే ఉన్నాయని, కొత్త అవకాశాలు లేకపోవడంతో నిజంగా ఆమెపై వస్తున్న ఆరోపణలపై నిర్మాతల మండలి చర్యలు తీసుకుంటే కెరీర్ ఇంకా దారుణంగా తయారవుతుందని సినీ వర్గాల మాట. మరి దీని గురించి నయనతార ఎలా స్పందిస్తుందో చూడాలి. -
వసంత కాలం వస్తోంది
నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హారర్ చిత్రం ‘కొలయుతిర్ కాలమ్’. చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వసంత కాలం’ టైటిల్‌తో ఈ నెల 21న తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాత దామెర వి.యస్. యస్ శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘ఏకవీర, వేటాడు వెంటాడు’ వంటి సినిమాలను తెలుగులో విడుదల చేశాం. నయనతార నటన, గ్లామర్ ‘వసంత కాలం’ సినిమాకు హైలెట్. తెలుగులోనూ పెద్ద విజయం సాధిస్తుంది అనుకుంటున్నాం’’ అన్నారు. ప్రేమ వార్షికోత్సవం ‘‘నీతో కలసి ఉన్న ప్రతిరోజూ నాకు వేలంటైన్స్ డేనే. అప్పుడే 5 ఏళ్లయిపోయాయా? నమ్మబుద్ధి కావడం లేదు’’ అంటున్నారు దర్శకుడు విఘ్నేష్ శివన్. నయనతార, విఘ్నేష్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. 5 ఏళ్లుగా మేం రిలేషన్షిప్లో ఉన్నామని, 5 ఏళ్ల ప్రేమ వార్షికోత్సవం చేసుకుంటున్నాం అని విఘ్నేష్ పేర్కొన్నారు. ‘‘మా క్యూట్ స్టోరీకి ఐదేళ్లు అయింది. ఈ ఐదేళ్లు నీతో (నయన్) ప్రేమమయం అయిపోయింది’’ అని నయన్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశారు విఘ్నేష్. ప్రస్తుతం విఘ్నేష్ నిర్మాణంలో ‘నెట్రిక్కన్’ అనే సినిమా, దర్శకత్వంలో ‘కాదు వాక్కుల రెండు కాదల్’ సినిమా చేస్తున్నారు నయనతార. -
చికుబుకు చికుబుకు రైలే
హైదరాబాద్‌లోని ఓ రైల్వేస్టేషన్‌కు రాబోతున్నారు రజనీకాంత్. కానీ ఇది నిజమైన రైల్వేస్టేషన్ కాదండోయ్. సినిమా కోసం వేసిన సెట్ రైల్వేస్టేషన్ . రజనీకాంత్ హీరోగా శివ ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలు పోషిస్తు న్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరగనున్నట్లు సమాచారం. ట్రైన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ప్రకాష్‌రాజ్, సూరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. -
ప్రేమ పక్షులు.. ఏడడుగులేస్తారా?
ఇవాళ ప్రేమికుల దినోత్సవం. ప్రేమోత్సవం. ప్రేయసిని ఎలా సర్ప్రైజ్ చేయాలని ఒకరు, ఈరోజు ఎలా అయినా ప్రేమను చెప్పేయాలని ధైర్యం కూడదీసుకుంటూ ఇంకొకరు బిజీగా ఉంటారు. ఇలా ప్రేమలో పడ్డవాళ్లు, పడబోతున్నవాళ్లకు ఇది స్పెషల్ డే. ప్రస్తుతం కొందరు హీరోయిన్లు ప్రేమలో ఉన్నారు. ప్రేమ జల్లులో తడుస్తూ ఒక జంట, ప్రేమ వరదలో మునుగుతూ ఓ జంట, ప్రేమగాలిలో తేలుతూ ఒక జంట ఉన్నారు. విఘ్నేష్, నయనతార మరి వీళ్లంతా పెళ్లి ఒడ్డుకి చేరుకుంటారా? నేటి ప్రేమికులు రేపటి భార్యాభర్తలవుతారా? కాలమే చెప్పాలి. నయనతార కాదల్ (ప్రేమ) లో ఉన్నారు. విఘ్నేష్ శివన్ రాసే కథల్లో ఉన్నారు. లేడీ సూపర్‌స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ విడదీయలేని ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రేమలో ఉన్నాం అని ప్రకటించకపోయినా వాళ్ల ప్రయాణాలు, సోషల్ మీడియా పోస్టులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటాయి. విఘ్నేష్‌ని హబ్బీ అని కూడా అంటారు నయన్. మరి పెళ్లి ఎప్పుడు? అంటే ఈ ఏడాదిలో పక్కా అనే వార్త వినిపిస్తోంది. ఆలియా భట్– రణ్‌బీర్ కపూర్ దీపికా పదుకోన్ – రణ్వీర్, ప్రియాంక చోప్రా – నిక్‌ల తర్వాత బాలీవుడ్ ప్రేక్షకులంతా ఆసక్తిగా గమనిస్తున్న మరో లవ్‌స్టోరీ ఆలియా భట్– రణ్‌బీర్ కపూర్‌లది. ఆలియా, రణ్‌బీర్ ప్రస్తుతం లవ్‌లో ఉన్నారు. త్వరలోనే వీళ్ల ఇంట్లో వెడ్డింగ్ బెల్స్ మోగబోతున్నాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో యంగ్ బాలీవుడ్ కపుల్ టైగర్ ష్రాఫ్ – దిశా పటానీ. టైగర్‌తో లంచ్, డిన్నర్లో తరచూ కనిపిస్తుంటారు దిశా. టైగర్ ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కూడా మిస్ అవ్వకుండా కనిపిస్తారు. మరి పెళ్లి ఎప్పుడంటే నవ్వేస్తారామె. టైగర్ ష్రాఫ్ – దిశా పటానీ తాప్సీకి కొంతకాలంగా బ్యాడ్మింటన్ మీద ఆసక్తి పెరిగిందని సరదాగా జోక్ చేస్తుంటారు. కారణం బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోతో ప్రేమలో పడటమే. కానీ ఈ విషయాన్ని బయట ఎక్కువగా ప్రస్తావించరు. ‘ప్రేమకు వయసుతో సంబంధం లేదు’ అంటే అవును.. అవును అంటారు సీనియర్ హీరోయిన్లు మలైకా అరోరా, సుస్మితా సేన్. కారణం వాళ్ల కంటే వయసులో చిన్నవాళ్లతో ప్రేమలో ఉండటమే. అర్జున్ కపూర్ (34)– మలైకా అరోరా (46) ప్రేమలో ఉన్నారు. 44 ఏళ్ల సుస్మితా సేన్, 28 ఏళ్ల రోహ్మాన్ ప్రేమలో ఉన్నారు. వయసుది ఏముంది? ప్రేమ ముఖ్యం అంటారు వీళ్లు. మరి వచ్చే ఏడాది వేలంటైన్స్ డే లోపల ఈ జంటలన్నీ ఏడడుగులేస్తాయా? అంతదాకా వెళ్లకుండానే బ్రేకప్ అవుతారా? వేచి చూద్దాం. మథియాస్, తాప్సీ అర్జున్, మలైకా రోహ్మాన్, సుస్మిత -
సూపర్ కాంబినేషన్
లేడీ సూపర్‌స్టార్ నయనతార, సూపర్‌స్టార్ సమంత కలసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే వార్త కోలీవుడ్‌లో బాగా వినిపిస్తోంది. వీళ్లద్దరూ కలసి లేడీ ఓరియంటెడ్ సినిమా ఏమైనా చేస్తున్నారా? అంటే కాదు. విజయ్ సేతుపతి నటించనున్న తమిళ సినిమాలో సమంత, నయనతార హీరోయిన్లుగా నటిస్తారట. దర్శకుడు, నయనతార బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ‘కాదు వాక్కుల రెండు కాదల్’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను సెవన్ స్క్రీన్ బ్యానర్‌పై లలిత్ కుమార్ నిర్మించనున్నారట. సమంత, నయనతార కలసి నటించే వార్త నిజమైతే కచ్చితంగా ఇది సూపర్ కాంబినేషన్. -
నయన్ ఇన్
‘చంద్రముఖి’ (2005), ‘దర్బార్’ (2020) చిత్రాల్లో రజనీకాంత్, నయనతార జంటగా నటించారు. రజనీ శివాజీ (2007), ‘కుశేలన్ ’ (2008) (తెలుగులో ‘కథానాయకుడు’) చిత్రాలలో ఆయనతో కాలు కదిపారు నయనతార. ఇప్పుడు రజనీ, నయనతార మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఖుష్బూ, మీనా, కీర్తీ సురేష్, ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోకి నయనతారను తీసుకున్నారు. అయితే నయనతార రజనీకాంత్‌కు జోడిగా నటించనున్నారా? లేక ఏదైనా కీలక పాత్ర చేయబోతున్నారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. తర్వాతి షెడ్యూల్ చెన్నైలో ఈ నెల ప్రారంభం కానుందట. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. -
స్టార్ ఫార్ములాతో సక్సెస్: నయనతార
చెన్నై : సినిమాలో అవకాశాలు, విజయాలు వంటివేవైనా అల్టిమేట్‌గా సొమ్ము చేసుకోవడమే. ఆ తరువాత పేరు, హోదా ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఆపై వాటిని నిలుపుకుంటే చాలు. లైష్ హ్యాపీ. నటి నయనతార ఇప్పుడు ఇదే పాలసీని ఫాలో అవుతోందనిపిస్తోంది. ఆరంభం నుంచే ఈ బ్యూటీ లక్కీ అనే చెప్పాలి. అయ్యా చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత స్టార్ హీరోలు విజయ్, అజిత్, సూర్య, శింబు, విశాల్ వంటి వారితో జత కట్టింది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చంద్రముఖి చిత్రంతోనే బాగా పాపులర్ అయ్యింది. అలా స్టార్ హీరోలతో జత కట్టి క్రేజ్‌ను సంపాధించుకున్న నయనతార ఆ తరువాత విజయ్‌సేతుపతి, శివకార్తీకేయన్, ఆరి వంటి అప్ కమింగ్ హీరోలతో నటించింది. అలాంటి చిత్రాల విజయాలను తనకే ఎక్కువగా ఆపాధించుకోవడంతో హీరోయిన్ ఓరియన్‌టెడ్ కథా చిత్రాల్లో నటించే స్థాయికి చేరుకుంది. సినిమా, వ్యక్తిగత చర్చనీయాంశమైన ప్రేమ, సహజీవనం, వివాదాలు, విడిపోవడాలు వంటి సంఘటనలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటూ తన పాపులారిటీని మరింత పెంచుకుంటున్న నయనతార ఇప్పుడు సుమారు రూ.5 కోట్లు పారితోషికం డిమాండ్ చేసే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం కుర్ర హీరోలను పక్కన పెట్టేసి స్టార్ హీరోలతోనే నటించడం మొదలెట్టింది. ఇందుకో లాజిక్ ఉంది. కుర్రహీరోలతో నటించే చిత్రాల్లో నటించడానికి అవకాశం ఉంటుంది. అందుకు కాల్షీట్స్ అధికంగా కేటాయించాల్సి ఉంటుంది. అదే స్టార్ హీరోల చిత్రాల్లో పెద్దగా నటించాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు ఇటీవల నటించిన తెలుగు చిత్రం సైరా నరసింహారెడ్డి, తమిళంలో విజయ్‌తో నటించిన బిగిల్, రజనీకాంత్‌తో జత కట్టిన దర్బార్ చిత్రాలనే తీసుకుంటే వీటిలో నయనతార పాత్ర పరిధి చాలాతక్కువ. పారితోషికం మాత్రం రూ.4 కోట్లకు పైనే అనే ప్రచారం జరుగుతోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే తను ముందుగా కేటాయించిన కాల్షీట్స్ కంటే ఎక్కువ ఇవ్వదు. అదేవిధంగా తను నటించిన చిత్రాలు ఇతర భాషల్లోకి అనువాదం అయితే అందుకు మరికొంత పారితోషికం చెల్లించాలన్న నిబంధనలను విధిస్తోందని సమాచారం. ఇకపోతే షూటింగ్‌కు వచ్చానా, నటించినా అంతటితో తన పని అయిపోయ్యిందని, ఆ చిత్రం ఎలాంటి ప్రమోషన్‌కు రాననీ ముందుగానే ఒప్పందంలో కాస్ పెడుతోంది. మరో విషయం ఇటీవల స్టార్ హీరోలతోనే నటించాలని నిర్ణయించుకుందట. అందుకు కారణం తక్కువ కాల్షీట్స్తో ఎక్కువ పారితోషికం లభించడమే. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. హీరోతో రెండు పాటలో లెగ్ షేక్ చేయడం, మరో నాలుగు సన్నివేశాల్లో కనిపించడం (దర్బార్ చిత్రంలో అంతేగా) వంటివి చేస్తే చాలు. ఇక ఆ చిత్రాల విజయాలు ఎలాగూ తన ఖాతాలోనూ పడతాయి. ఇప్పుడు బిగిల్, దర్బార్ వంటి చిత్రాల విజయాలను తనూ షేర్ చేసుకుంటోంది. అందుకే స్టార్ హీరోల ఫార్ములా అన్ని విధాలుగా బాగుందని నయనతార భావిస్తోందట. ఇక హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలకు ఎలానూ తన ఆధిక్యం ఉంటుంది కాబట్టి ఆ తరహా చిత్రాలకూ ఓకే చెబుతోందట. ప్రస్తుతం అలాంటి రెండు చిత్రాల్లో నటిస్తోంది. -
దర్బార్: ట్విటర్లో ఏమంటున్నారంటే?
సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఏర్పడ్డాయి. అంతేకాకుండా చాలా కాలం తర్వాత తలైవా పోలీస్ గెటప్‌లో కనిపిస్తుండటంతో థియేటర్లో రచ్చరచ్చే అని ఫ్యాన్స్ ఆనందపడ్డారు. ఇక సంక్రాంతి కానుకగా నేడు(గురువారం) ‘దర్బార్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ‘దర్బార్’ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విటర్లో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. రజనీ వన్ మ్యాన్ షోతో అదరగొట్టారని.. ఈ సినిమాతో అలనాటి తలైవాను మళ్లీ చూశామని తమిళ తంబిలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అనిరుధ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో రచ్చరచ్చ చేశాడంట. అదేవిధంగా ఇంటర్వెల్ సీన్ అదిరిపోయిందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే రేసు గుర్రం పరిగెట్టినట్టు పరిగెత్తిందని అందరూ చెబుతున్న కామన్ పాయింట్. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టకుండా ఉందట. ఇక సెకండాఫ్‌లో డైరెక్టర్ తన క్రియేటివిటీని ప్రదర్శించాడని అంటున్నారు. దీంతో బొమ్మ బ్లాక్‌బస్టర్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘జెట్ స్పీడ్ స్క్రీన్ ప్లే, ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. కామెడీ, రొమాంటిక్, యాక్షన్స్ సీన్స్‌లో తలైవా అదరగొట్టాడు. విలన్ ఇంటర్వెల్‌కు ముందు రావడంతో అసల ఆట ఆరంభవుతుంది’అంటూ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘ఈ సినిమా రూ.400-500 కోట్లు వసూలు చేయకపోతే సినీ అభిమానులకు టేస్ట్ లేదని అర్థం’, ‘తలైవా వన్ మ్యాన్ షో. రజనీ ఎనర్జీ, స్టైల్, చరిష్మా అందరినీ ఇన్స్పైర్ చేసేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రజనీని చాలా కొత్తగా చూపించారు. ఘనవిజయాన్ని అందుకున్న ‘దర్బార్’ టీంకు శుభాకాంక్షలు’, ‘బొమ్మ బ్లాక్‌బస్టర్ హిట్’, అంటూ పలువురు నెటజన్లు ట్విటర్లో కామెంట్ చేస్తున్నారు. Hats off to Thalaivar and ARM. #Darbar Every minute enjoyable. No doubt , #Darbar going to be industrial hit and massive blockbuster. Only one super star and thalaivar. No one can stand in front of thalaivar. #DarbarThiruvizha#DarbarFDFS #DarbarThiruvizha — looking for good leader (@suchi2019) January 9, 2020 #Darbar 1st half - It's a complete Vishwaroopam of #SuperstarRajinikanth's charisma, energy & screen presence🙏👑 #Thalaivar pinni pedal edukaraaru. Ageless!#TharamMaaraSingle la avar panra dance, settai (enjoying Mahanadhi Kamal sir's kiss scene) etc vera ragam👌😎 Delightful — Kaushik LM (@LMKMovieManiac) January 9, 2020 -
ఆ అగ్రనటిపై దర్శకనిర్మాతలు గుర్రు!
దక్షిణాది అగ్రనటి నయనతారపై తాజాగా విమర్శల దాడి జరుగుతోంది. సంచలన నటి మాత్రమే కాకుండా, అగ్రకథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. అంతేకాదు దక్షిణాదిలోనే అత్యధిక పారితోíÙకం డిమాండ్ చేస్తున్న నటిగానూ ఈ అమ్మడికి పేరుంది. ఆ మధ్య యువ హీరోలతో జత కట్టిన నయనతార ఇప్పుడు వరుసగా స్టార్ హీరోలతోనే నటిస్తోంది. నటుడు విజయ్‌తో రొమాన్స్ చేసిన బిగిల్(తెలుగులో విజిల్) ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అదేవిధంగా చిరంజీవితో సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించింది. తాజా రజనీకాంత్‌తో జత కట్టిన దర్బార్ చిత్రం గురువారం తెరపైకి రానుంది. ప్రస్తుతం తన ప్రియుడిని నిర్మాతగా చేసి నెట్రికన్ అనే చిత్రంతో పాటు, ఆర్జే.బాలాజీ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న మూక్కుత్తి అమ్మన్ అనే భక్తిరస కథా చిత్రంలో నటిస్తోంది. ఈ రెండూ కథానాయకి పాత్రలకు ప్రాధ్యానత కలిగిన చిత్రాలే కావడం విశేషం. ఇలా నటిగా బిజీగా ఉన్న నయనతార ఇటీవల ఒక టీవీ చానల్ నిర్వహించిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది అనడం కంటే విమర్శలను కొని తెచ్చుకుందనే చెప్పాలి. కారణం లేకపోలేదు. నయనతార తాను నటించిన చిత్రాకు సంబంధించి ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గనదనే విషయం తెలిసిందే. చిత్రంలో నటించామా, అంతటితో తన పని అయిపోయ్యింది అని సరిపెట్టుకుంటోంది. ఈ వ్యవహారంలో నయనతారపై చాలా కాలంగా అసంతృప్తి దర్శక నిర్మాతల్లో రగులుతోంది. అయితే అదంతా లోలోనే మండుతోంది. కారణం తను అగ్ర నటిగా వెలుగొందడం కావచ్చు. కాగా ఇటీవల అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల పారితోషకం డిమాండ్ చేస్తూ నటిస్తున్న నయనతార ఆ చిత్రాల ప్రమోషన్‌కు మాత్రం రాదు గానీ, అవార్డుల అందుకోవడానికి మాత్రం రెడీ అవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. కోట్లలో పారితోషకం చెల్లిస్తున్న నిర్మాతల చిత్రాల వ్యాపారం కోసం చేసే కార్యక్రమాల్లో పాల్గొనవలసిన బాధ్యత నటీనటులకు ఉంటుందని, దాన్ని నయనతార విస్మయిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్, విజయ్ వంటి వారు కూడా తమ చిత్రాల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, అలాంటిది నయనతార వారి కంటే ఎక్కువా? అనే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం నడిగర్ సంఘం వరకూ వెళ్లిందని, ఆమె పారితోషికం విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి సంఘం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ విషయం ఇలా ఉంటే, నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌శివన్ సహజీవినం సాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వారి మధ్య ప్రేమకు బ్రేకప్ అయ్యిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనికి ఫుల్స్టాప్ పెట్టే విధంగా నటి నయనతార ఇటీవల అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి ధరించి వెళ్లిన చీరతోనే ప్రియుడు విఘ్నేశ్‌శివన్‌తో సెల్ఫీ దిగి ఆ ఫొటోను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడీ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు
‘‘రజనీకాంత్‌గారితో సినిమా చేయాలని 15 ఏళ్లగా అనుకుంటున్నా. కానీ కుదర్లేదు. ఫైనల్‌గా ఆయనతో సినిమాకి కాల్ వచ్చింది. ఆ న్యూస్ బయటకు వచ్చేసింది. నా మిత్రులందరూ ఫోన్ చేసి అభినందించారు. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. తుది నరేషన్‌లోనూ సినిమా కుదరకపోవచ్చు. అలా జరగకూడదనుకున్నాను. అందుకే ఏ మార్పు సూచించినా నాలుగైదు ఆపషన్స్ ఉండేట్టు కథ తయారు చేసుకుని రజనీసార్ దగ్గరకు వెళ్లాను’’ అని దర్శకుడు మురుగదాస్ అన్నారు. రజనీకాంత్, నయనతార జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్ తెలుగులో ఈ నెల 9న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మురుగదాస్ మీడియాతో మాట్లాడారు. ► చెన్నైకి 200 కిలోమీటర్ల దూరంలో మా స్వగ్రామం. అక్కడ కేవలం 2 థియేటర్స్ ఉండేవి. చిన్నప్పుడు అమ్మతో కలసి రజనీగారి సినిమా చూశాను. రజనీగారిది ఈ ఊరే. థియేటర్లో ఉంటారు అనుకునేవాణ్ణి. ఓసారి అక్క వాళ్ల ఇంటికి వెళ్తే ఆ ఊరి థియేటర్లోనూ ఉన్నారు. రజనీగారిది మన ఊరు కదా ఇక్కడికి ఎలా వచ్చారు అని నాకు డౌట్ వచ్చింది. అది సినిమా, ఆయన నటుడు అని వివరించి చెప్పారు మా అక్క. నా 5వ తరగతిలో చెన్నై టూర్ వెళ్లాను. చెన్నైలో రజనీసార్ ఎక్కడ అని చూస్తూ ఉండేవాణ్ణి. ఆ తర్వాత అసిస్టెంట్ దర్శకుడిగా ఉన్నప్పుడు రజనీగారిని దూరంగా చూశాను. ‘గజిని’ అప్పుడు డైరెక్ట్‌గా కలిసే అవకాశం వచ్చింది. ► తమిళ ‘గజిని’ రిలీజ్ అయ్యాక రజనీగారు ఫోన్ చేశారు. తమిళంలో మంచి సినిమా రిలీజ్ అయితే అభినందించడం ఆయనకు అలవాటు. ఆ టీమ్‌తో సంభాషిస్తారు. ‘గజని’ అప్పుడు నాకు ఆ అవకాçశం కలిగింది. ఆయన ‘శివాజీ’ చేస్తున్న సమయంలో మేం కలిసి సినిమా చేయాలనుకున్నాం. అప్పుడు ‘గజిని’ హిందీ రీమేక్‌తో నేను, ‘రోబో’తో ఆయన బిజీగా ఉన్నాం. ఏడాదిన్నర క్రితం మళ్లీ సినిమా చేయాలనుకున్నాం. ఈసారి అవకాశం మిస్ అవ్వకూడదు అనుకున్నాను. ► రజనీకాంత్ గారిని నేను ఎలా చూడాలనుకుంటున్నానో, ఆయన్ను స్క్రీన్ మీద చూసి ఎలా ఎంజాయ్ చేశానో అది ఈ జనరేషన్ వాళ్లకు కూడా కనెక్ట్ అయ్యేలా ‘దర్బార్’లో చూపించాను. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే పోలీస్ కథ ఇది. సమాజంలో జరిగే అన్యాయాలకు తనదైన శైలిలో న్యాయం చేసే పోలీస్ కథ. ఇందులో ఫ్యాన్స్ ఆయన్నుంచి ఆశించే మేనరిజమ్స్, స్టయిల్స్ అన్నీ ఉంటాయి. రజనీగారితో ఈ ప్రయాణంలో చాలా తెలుసుకున్నాను. దేవుడి గురించి ఆయన చాలా విషయాలు చెప్పారు. నాకో పుస్తకం కూడా ఇచ్చారు. ► సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా. సినిమా కేవలం వినోదంగానే ఉండకూడదని నా అభిప్రాయం. అందుకే సందేశం ఇవ్వాలనుకుంటాను. ఆ సందేశం వల్ల ఒక్క రాత్రిలో జనాలు మారిపోతారని కాదు. కానీ ఓ ఆలోచన కలుగుతుంది. మెల్లిగా తెలుసుకుంటారు. కమర్షియల్ సినిమాలో, పెద్ద హీరోల సినిమాల్లో సందేశం జోడిస్తే ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది. ► రజనీకాంత్‌గారు మేకప్ వేసుకొని కేరవేన్ నుంచి బయటకు వచ్చాక మళ్లీ లంచ్ బ్రేక్, షూటింగ్ ప్యాకప్ అప్పుడే లోపలికి వెళ్తారు. షూటింగ్ లేట్ అయినా సహకరిస్తారు. ► మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్‌గా ఎదిగిన అమ్మాయి నయనతార. ఆమె ఎదుగుదలను మనం గౌరవించాలి. చాలా గ్యాప్ తర్వాత నయనతార, రజనీసార్ కలసి యాక్ట్ చేశారు. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. ఎన్వీ ప్రసాద్‌గారితో ఎప్పటి నుంచో నాకు పరిచయం ఉంది. ఆయన నిర్మాతలా కాకుండా ఫ్యామిలీ మెంబర్లా ఉంటారు. నా తదుపరి చిత్రం గురించి నిర్ణయించుకోలేదు. ‘తుపాకీ’ సీక్వెల్ ఆలోచన ఉంది. ► ఈ సినిమాలో హీరో పాత్రకు ఓ పవర్ఫుల్ పేరు పెట్టాలి. ఏం పెట్టాలా అని ఆలోచించాను. షూటింగ్లో ఆలోచిద్దామనుకున్నా. హీరో వేసుకునే పోలీస్ యూనిఫామ్ మీద నేమ్‌ప్లేట్ తయారు చేయాలని ముందే అడిగేసరికి మా నాన్న పేరు (అరుణాచలం) మా అబ్బాయి (ఆదిత్య) పేర్లు కలిపి ఆదిత్యాఅరుణాచలం అని పెట్టా. ► ప్రస్తుతం కొత్త కొత్త దర్శకులు కొత్త కొత్త ఆలోచనలతో సినిమాలు తీస్తున్నారు. నా అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా డైరెక్టర్స్ అవుతున్నారు. నేను ఇచ్చిన కథతో శరవణన్ అనే అతను ‘రాంగీ’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో త్రిష కథానాయిక. ► తెలుగులో స్ట్రయిట్‌గా నేను తీసిన సినిమాలు సరిగ్గా ఆడలేదు. స్టార్‌డమ్‌ను అంచనా వేయడంలోనో ఇంకేదో విషయంలోనో మిస్ అయ్యాను. మహేశ్‌బాబు లాంటి సూపర్‌స్టార్, కష్టపడే హీరోకు హిట్ ఇవ్వలేదని బాధపడ్డాను. సినిమా రిలీజ్ అయిన 10 రోజుల తర్వాత కూడా నన్ను ప్రోత్సహించేలా మెసేజ్‌లు పంపారు మహేశ్‌గారు. ఆయన చర్మం రంగు కంటే ఆయన మనసు ఇంకా తెలుపు. సినిమాను ఇంతలా ప్రేమించే హీరోకు హిట్ ఇవ్వలేకపోయాననే బాధ ఎప్పటికీ ఉంటుంది. -
‘దర్బార్’ ప్రీ రిలీజ్ వేడుక
-
తక్కువగా ఆశ పడితే సంతోషంగా ఉంటాం
‘‘1976లో తెలుగులో నా ‘అంతులేని కథ’ సినిమా విడుదలైంది.. ఇçక్కడున్న వారిలో 99శాతం మంది అప్పుడు పుట్టి ఉండరు. తమిళ ప్రేక్షకులు నన్ను ఎంతగా ప్రేమిస్తారో తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ప్రేమించడం నా పూర్వజన్మ సుకృతం’’ అన్నారు రజనీకాంత్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్, నయనతార జంటగా రూపొందిన చిత్రం ‘దర్బార్’. ఎ. సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. ఈ నెల 9న ‘దర్బార్’ విడుదల కానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రజనీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఎన్వీ ప్రసాద్‌గారు నాకు 20ఏళ్లుగా తెలుసు.. సినిమా ఆడినా, ఆడకున్నా ఒకేలా ఉంటారాయన. మామూలుగా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌ను ఆయన కొంచెం లో ప్రొఫైల్‌లో చేసేవారు. కానీ ‘దర్బార్’ సినిమా హిట్ అని తెలిసిపోయినట్టుంది ఆయనకు.. అందుకే ఇంత భారీ వేడుక ప్లాన్ చేశారు. నా వయసు 70 ఏళ్లు.. ఇంకా నేను హీరోగా నటిస్తున్నానంటే ప్రేక్షకుల అభిమానం, ప్రోత్సాహమే కారణం.. అవే నా ఎనర్జీ. ఈ వయసులోనూ మీరు ఇంత సంతోషంగా, ఉత్సాహంగా ఎలా ఉన్నారని కొందరు అడుగుతారు.. నేను వారికి చెప్పేది ఒక్కటే. తక్కువగా ఆశ పడండి.. తక్కువ ఆలోచనలు పెట్టుకోండి.. తక్కువగా భోజనం చేయండి, తక్కువగా నిద్రపోండి.. తక్కువగా వ్యాయామాలు చేయండి.. ఇవన్నీ చేస్తే సంతోషంగా ఉంటాం (నవ్వుతూ). తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. ‘పెదరాయుడు, బాషా, నరసింహా, చంద్రముఖి, రోబో’ వంటి సినిమాలు రజనీ ఉన్నాడని బాగా ఆడలేదు.. ఆ సినిమాలు బాగున్నాయి.. వాటిల్లో రజనీ ఉన్నాడంతే. అందరూ సక్సెస్ఫుల్ సినిమా తీయాలి, బాగా ఆడాలని తీస్తారు. సినిమా తీసేటప్పుడు ఓ మ్యాజిక్ జరుగుతుంది, ఆ సినిమా బాగా వస్తుంది. అయితే అది మన చేతుల్లో ఉండదు. ‘దర్బార్’ చేసేటప్పుడు ఆ మ్యాజిక్ మాకు తెలిసిపోయింది. మురుగదాస్‌గారితో పని చేయాలని 15ఏళ్లుగా చూశాను కానీ కుదర్లేదు.. ఇప్పుడు కుదిరింది. సుభాస్కరన్‌గారు పెద్ద వ్యాపారవేత్త. సినిమాలంటే ఇష్టంతో తీస్తున్నారు.. ఇప్పుడు మన ‘బాహుబలి’లాగా ‘పొన్నియిన్ సెల్వన్’ అనే ప్యాన్ ఇండియన్ ఫిల్మ్ తీస్తున్నారు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ట్రైలర్ చివరలో రజనీసార్ నడుచుకుంటూ వచ్చే షాట్‌కి నేను ఫిదా అయిపోయా. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఇరగదీస్తున్న మురుగదాస్‌గారికి సెల్యూట్. రజనీ సార్ ‘జీవన పోరాటం’ సినిమా టైమ్‌లో నేను పిల్లాణ్ణి.. ఆ సినిమాలో ఆయన స్టైల్ చూసి, అలా చేయాలని ప్రయత్నించా. కానీ, రాలేదు’’ అన్నారు. మురుగదాస్ మాట్లాడుతూ–‘‘నా కెరీర్లో ఇది చాలా ముఖ్యమైన సినిమా.. ఎందుకంటే రజనీగారితో నేను చేసిన తొలి మూవీ. అలాగే నేను తీసిన తొలి పోలీస్ స్టోరీ. పదిహేనేళ్ల క్రితం రజనీగారిని ప్రేక్షకులు ఎలా చూశారో ఆ స్టైల్, ఆ మాస్ అంశాలన్నీ ‘దర్బార్’లో ఉన్నాయి. ఇలాంటి ప్యాన్ ఇండియన్ సినిమా చేయడానికి అవకాశం ఇచ్చిన సుభాస్కరన్ సార్‌కి ధన్యవాదాలు. సుభాస్కరన్‌గారు నిజమైన హీరో. భవిష్యత్‌లో ఆయన లైఫ్ స్టోరీ ఒక బయోపిక్‌గా రావొచ్చు. అంత మంచి లైఫ్ స్టోరీ ఆయనది. రజనీగారికి ప్రత్యర్థిగా ఉండే బలమైన పాత్రని సునీల్శెట్టిగారు బ్యాలెన్స్ చేశారు’’ అన్నారు. నివేదా థామస్ మాట్లాడుతూ– ‘‘ఇంత పెద్ద సినిమాలో ఈ పాత్రకి నేను సరిపోతానని అవకాశం ఇచ్చిన మురుగదాస్‌గారికి చాలా థ్యాంక్స్. షూటింగ్లో రజనీ సార్ ఎలా మాట్లాడుతున్నారు? ఎలా నటిస్తున్నారని చూస్తూనే ఉండేదాన్ని. విజయ్, అజిత్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, నాని.. ఇలా అందర్నీ మనం అభిమానిస్తాం. వాళ్లందరికీ కామన్‌గా నచ్చే ఒక యాక్టర్ రజనీ సార్’’ అన్నారు. పాటల రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్‌గారి ‘2.ఓ’కి ఓ పాట, ‘పేట’కి ఓ పాట రాసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ‘దర్బార్’లో రెండు పాటలు రాశా’’ అన్నారు. సంగీత దర్శకుడు అనిరుద్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా నాకు ప్రత్యేకం.. ఎందుకంటే నా మనసుకు బాగా దగ్గరైన చిత్రమిది. ఈ అవకాశం ఇచ్చిన రజనీసార్‌కి, తన కలల చిత్రంలో చాన్స్ ఇచ్చిన మురుగదాస్‌కి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘రజనీగారిని అందరూ సూపర్‌స్టార్ అని పిలుస్తారు. కానీ, నా వరకు ఆయన గాడ్ ఆఫ్ సినిమా. ఆయన నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చు. సెట్లో మురుగదాస్‌గారు మా అందరికీ గురువు’’ అన్నారు బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి. ‘‘రజనీకాంత్‌గారితో తొలిసారి ‘దళపతి’ సినిమాకు చేశాను. ఆయన ఎనర్జీలో మార్పు లేదు’’ అన్నారు కెమెరామేన్ సంతోష్ శివన్. ఈ వేడుకలో నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, కేకే రాధామోహన్, దర్శకులు వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, పాటల రచయిత కృష్ణకాంత్, గాయకుడు శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
డుమ్ డుమ్ డుమ్
‘డుమ్ డుమ్ డుమ్ గట్టి మేళం మోగేట్టు...’ అంటూ సాగే పెళ్లి పాటను ‘దర్బార్’ చిత్రబృందం గురువారం విడుదల చేసింది. రజనీకాంత్, నయనతార జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ సినిమాలోని రెండో పాట (డుమ్ డుమ్..)ను గురువారం రిలీజ్ చేశారు. కృష్ణకాంత్ రచించిన ఈ పాటను నకాష్ అజీజ్ పాడారు. అనిరుధ్ సంగీత దర్శకుడు. గేయరచయిత కృష్ణకాంత్ మాట్లాడుతూ – ‘‘రజనీకాంత్‌గారికి పాట రాసే అవకాశం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. ఇదంతా ఓ కలలా ఉంది. సినిమాలో ఓ యువ జంటకు పెళ్లయ్యే సందర్భంలో వచ్చే పెళ్లి పాట ఇది. భార్యాభర్తల అన్యోన్యతకు సంబంధించి చిన్న ఫిలాసఫీ ఉన్న పాట. ఈ అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: సంతోష్ శివన్. -
తీర్థ యాత్రలు
వీలు కుదిరితే విహారయాత్రలకు వెళ్తుంటారు కోలీవుడ్ ప్రేమజంట నయనతార, విఘ్నేష్ శివన్. అయితే ఈసారి తీర్థయాత్రలపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. ఈ మధ్యనే తిరుచెందూర్‌లో సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం, కన్యాకుమారిలో భగవతి అమ్మన్ దేవాలయాలను జంటగా సందర్శించారు. తాజాగా కన్యాకుమారిలోని స్వామితొప్పు అయ్యవాళి దేవాలయం, సుచింద్రంలోని స్థనుమాలం ఆలయాన్ని సందర్శించారు. ఇలా వరుసగా దేవాలయాలను సందర్శించడం వెనక కారణం ఏంటి? అంటే... ప్రస్తుతం నయనతార ‘మూకుత్తి అమ్మన్’ (ముక్కుపుడక అమ్మవారు) అనే భక్తి చిత్రం చేస్తున్నారు. ఇందులో నయనతార అమ్మవారి పాత్ర చేస్తున్నారు. షూటింగ్ పూర్తయ్యేవరకూ శాకాహారిగా మారారు. ఈ సినిమా కోసమే ఈ సందర్శనాలు అని భోగట్టా. ఈ ఇద్దరి పెళ్లికి సంబంధించిన మొక్కుబడులా? అనే టాక్ కూడా ఉంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో వీరు వివాహం చేసుకో బోతున్నారనేది మరో వార్త. -
నిర్మాతలపై నయనతార బిగ్ బాంబ్!
నయనతార హవా కొనసాగుతోందనడానికి మరో ఉదాహరణ ఇది. తెలుగులో సైరా, తమిళంలో బిగిల్ విజయాలతో కొత అవకాశాలు తలుపు తడుతున్నాయి. దీంతో ఈ అమ్మడు రెమ్యునరేషన్ పెంచిందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాలకు ఐదు కోట్ల వరకు పారితోషకం పుచ్చుకున్నట్లు టాక్. దాన్ని తాజాగా 8కి పెంచేసినట్లు సమాచారం. నయనతారకు ఉన్న క్రేజ్‌తో నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ఇలా తమ సినిమాల్లో నటించమని అడిగిన ప్రొడ్యూసర్లపై నయనతార భారీ పారితోషకమనే బిగ్ బాంబ్ వేసినట్లు తెలుస్తోంది. అయితే భారీగా పారితోషకం పెంచినప్పటికీ తమ సినిమాలో నయనతారే నటించాలని కొంతమంది దర్శక నిర్మాతలు పట్టుబడుతున్నారట. ఎందుకంటే నయనతారకు ఉన్న క్రేజ్ అటువంటిది. ప్రస్తుతం రజనీకాంత్‌కు జంటగా నటిస్తున్న దర్బార్ చిత్రాన్ని పూర్తి చేసిన నయనతార ప్రస్తుతం తన ప్రియుడు, దర్శకుడు విఘ్నశ్ శివన్‌ను నిర్మాతగా చేసి నెట్రికన్ అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా మరో చిత్రానికి పచ్చజెండా ఊపేసింది. ఆర్జే.బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ముక్కుత్తి అమ్మన్ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇది భక్తిరస కథా చిత్రంగా ఉంటుందని ఆర్కే.బాలాజీ ఇటీవల వెల్లడించారు. మరో విషయం ఏమిటంటే ఇందులో నయనతార అవకాశం అడిగి మరీ నటించనుందట. ఈ విషయాన్ని ఆర్జే.బాలాజీనే తెలిపారు. తన కథను రెడీ చేసుకుని కొందరు సినీ ప్రముఖులకు వినిపించారట. అందులో దర్శకుడు విఘ్నేశ్ శివన్ కూడా ఉన్నాడట. ఆయన ఈ కథ గురించి నయనతారకు చెప్పడంతో ఆమె వెంటనే ఆర్జే.బాలాజీకి ఫోన్ చేసి ఏమిటీ ఎవరెవరికో కథ వినిపిస్తున్నావట. నాకు చెప్పవా?అని అడిగారని బాలాజీ తెలిపారు. అలా కథను చెప్పించుకుని మరీ అవకాశాన్ని పొందిన నయనతార ఈ చిత్రానికి 8 కోట్లు పారితోషికాన్ని డిమాండ్ చేసిందనేది తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంత పారితోషకాన్ని ఆమెకు ముట్ట జెప్పడానికి చిత్ర నిర్మాత సమతించినట్లు సమాచారం. ఇంతకీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నది ఏవరో తెలుసా? వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ అధినేత ఐసరిగణేశ్. చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రియుడితో కలిసి న్యూయార్క్ చెక్కేసిన నయనతార తిరిగి రాగానే ముక్కుత్తి అమ్మన్ చిత్రంలో నటించనుంది. ఈ చిత్రం తరువాత కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించనున్న చిత్రంలోనూ నటించనున్నట్లు సమాచారం. -
లవ్ ఇన్ న్యూయార్క్
లేడీ సూపర్‌స్టార్ నయనతార నేడు 35వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆల్రెడీ న్యూయార్క్‌లో అడుగుపెట్టారామె. అయితే ఒంటరిగా కాదులెండి. తన బాయ్‌ఫ్రెండ్, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో కలిసి న్యూయార్క్ వీధుల్ని చుట్టేస్తున్నారు. వీలున్న ప్రతీ సంద ర్భాన్ని సంబరంగా సెలబ్రేట్ చేసుకుంటారు నయన్, విఘ్నేశ్. హాలిడేలను జాలిడేలుగా మార్చుకుని ట్రిప్స్ వేస్తుంటారు. ఈ మధ్యనే విఘ్నేశ్ బర్త్‌డేని ఘనంగా జరిపారు నయనతార. ఇప్పుడు నయన్ బర్త్‌డే కోసం విదేశాల్లో వాలారు. అక్కడ వాళ్లు చేస్తున్న సందడిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు విఘ్నేశ్. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనుందని టాక్. -
అమలా ఔట్?
ప్రముఖ దర్శకులు మణిరత్నం భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో ‘పొన్నియిన్ సెల్వమ్’ చిత్రం తెరకెక్కించనున్నారు. ఐశ్వర్యారాయ్, విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, నయనతార, కీర్తీ సురేశ్, అమలా పాల్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా నుంచి అమలా పాల్ తప్పుకున్నారనే వార్త బయటకు వచ్చింది. పీరియాడికల్ చిత్రం కావడంతో సినిమా షూటింగ్ ప్రారంభానికి అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం పడుతోంది. షూటింVŠ లేట్ కావడంతో యాక్ట్ర్స్ డేట్స్ సమస్య ఏర్పడుతోంది. ప్రస్తుతం అమలా పాల్కి కూడా ఇదే సమస్య అని తెలిసింది. డేట్స్ కారణంగానే అమల ఈ సినిమా నుంచి బయటకు వచ్చేశారట. ఇప్పుడు అమల స్థానంలో ఎవరు నటిస్తారో తెలియాలి. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రం డిసెంబర్లో షూటింగ్ ప్రారంభం కానుంది. -
డబ్బింగ్ షురూ
‘దర్బార్’లో ఆదిత్య అరుణాచలం మాటల తూటాలు పేలుతున్నాయి. మరి.. ఈ దర్బార్ డైలాగ్స్ ప్రేక్షకులకు ఎంత కిక్ ఇస్తాయో తెలిసేది మాత్రం సంక్రాంతి పండక్కే. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. ఇందులో నయతార కథానాయికగా నటించారు. నివేదాథామస్ కీలక పాత్రధారి. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ ఆదిత్య అరుణాచలం పాత్రలో నటించారు రజనీకాంత్. ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలైనట్లు గురువారం చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ వెల్లడించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘దర్బార్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
అరుణాచలం దర్బార్
రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘అరుణాచలం’ చిత్రం ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సుందర్ సి. దర్శకత్వంలో 1997లో విడుదలైన ఈ సినిమాలో అరుణాచలంగా అలరించిన రజినీ మరోసారి ‘దర్బార్’ చిత్రంలో అరుణాచలం పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ‘దర్బార్’ సినిమా తెలుగు మోషన్ పోస్టర్ని గురువారం హీరో మహేశ్‌బాబు విడుదల చేశారు. ‘‘రజనీకాంత్ సార్ నటించిన ‘దర్బార్’ మోషన్ పోస్టర్ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. మీపై ఈ ప్రేమ, అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. మురుగదాస్ సార్, చిత్రబృందానికి నా అభినందనలు’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మహేశ్‌బాబు. పవర్ఫుల్ పోలీసాఫీసర్ ఆదిత్య అరుణాచలంగా కొత్త లుక్‌లో రజనీని చూసి, ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘దర్బార్’ మోషన్ పోస్టర్ని తమిళ్లో కమల్‌హాసన్, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో మోహన్‌లాల్ విడుదల చేశారు. ‘‘అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందుతోంది. అన్ని రకాల వాణిజ్య హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే విడుదలైన రజనీ పోస్టర్స్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. 2020 సంక్రాంతి కానుకగా ‘దర్బార్’ సినిమా విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
లేడీ పోలీస్
ఈ ఏడాది కొరియన్ కథతో ‘ఓ బేబి’ (కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’కి తెలుగు రీమేక్) వంటి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు సమంత. లేడీ ఓరియంటెడ్ సినిమాగా సమంత కెరీర్లో పెద్ద హిట్ సినిమా అనిపించుకుంది ‘ఓ బేబి’. ఇప్పుడు నయనతార కూడా ఓ కొరియన్ కథలో నటించడానికి అంగీకరించారని తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ లేడీ ఓరియంటెడ్ సినిమా తెరకెక్కనుందట. ఈ చిత్రాన్ని హీరో రానా నిర్మిస్తారట. ఇందులో నయనతార పోలీస్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
నాకంటే అదృష్టవంతుడు ఎవరుంటారు?
‘‘ఇప్పటి వరకూ 150 సినిమాలు చేశాను. అవన్నీ ఒక ఎత్తయితే ‘సైరా నరసింహారెడ్డి’ ఒక ఎత్తని గతంలోనూ చెప్పా.. ఇప్పుడూ చెబుతున్నా. నా గత చిత్రాలన్నింటిలో ‘సైరా’ మొదటిస్థానంలో ఉంటుంది. దీన్ని మించిన సినిమా నా నుంచి వస్తే అంతకంటే ఆనందం ఇంకే కావాలి? నాకంటే అదృష్టవంతుడు ఎవరుంటారు?’’అని చిరంజీవి అన్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార జంటగా నటించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. కొణిదెల సురేఖ సమర్పణలో రామ్‌చరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న విడుదలైంది. ఈ సందర్భంగా ‘సైరా’ చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకరులతో సమావేశమయ్యారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు చిరంజీవి సమాధానమిస్తూ–‘‘సైరా’ చిత్రం కథ, కథనాలపై నమ్మకం ఉండటంతో బడ్జెట్‌కి కానీ, ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి వస్తుందని కానీ భయపడలేదు. ఈ సినిమాకి దాదాపు 285 కోట్లు బడ్జెట్ అయింది. అంత బడ్జెట్ రామ్‌చరణ్ పెట్టడానికి కారణం వాడి వెనుక నేను ఉన్నాననే భరోసా (నవ్వుతూ). ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ‘సైరా’ ని ఇంత గ్రాండ్‌గా నిర్మించిన చరణ్ ఇండస్ట్రీలో నంబర్ 1 నిర్మాత అయ్యాడు. ‘రంగస్థలం’ చిత్రంలో చరణ్ నటనకు జాతీయ అవార్డు రావాలి. నిర్మాతగా, నటుడిగా, కొడుకుగా వాడికి 100కి 100మార్కులు వేస్తా. ‘సైరా’ డబ్బింగ్ టైంలో ‘ఇది మామూలు సినిమా కాదు. భారతీయులకు గౌరవాన్ని తీసుకొచ్చే చిత్రం. ముందుగానే అభినందనలు’ అంటూ అమితాబ్ బచ్చన్‌గారి నుంచి వచ్చిన ప్రశంసని మరచిపోలేను. నేను, నాగార్జున కలిసి స్వయంగా సినిమా చూశాం. సినిమా పూర్తవగానే నన్ను గట్టిగా హత్తుకుని ‘సినిమా సూపర్.. చాలా బాగుంది’ అంటూ తన స్టయిల్లో అభినందించాడు. ఎంతోమంది నా తోటి నటీనటులు అభినందిస్తూ మెసేజ్‌లు, ట్వీట్స్ చేశారు. పలువురు దర్శకులు స్వయంగా నన్ను కలిసి అభినందనలు చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది.. తోటి నటులు నా నటన బాగుందంటూ అభినందిస్తుంటే ‘ఇంతకంటే ఇంకేం కావాలి? అనిపించింది. ‘సైరా’ తొలిరోజు 7గంటల వరకూ కూడా సినిమా గురించి ఎటువంటి ఫీడ్ బ్యాక్ రాలేదు. సినిమా విజయంపై నమ్మకం ఉంది. అయినా లోలోపల కొంచెం టెన్షన్ పడ్డాను. సినిమా సూపర్ అంటూ ‘బన్ని’ వాస్ చెప్పాడని బన్నీ (అల్లు అర్జున్) చెప్పాడు. మా ఇంట్లోవాడు కాబట్టి ఆ మాటలు అంత కిక్ ఇవ్వలేదు. ‘సినిమాకి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది’ అంటూ యూవీ క్రియేషన్స్ విక్రమ్ వాయిస్ మెసేజ్ పెట్టడంతో చాలా సంతోషంగా అనిపించి, నా టెన్షన్ పోయింది. నేను, చరణ్ కలిసి నటించే సినిమాపై కొన్ని గంటల్లో ప్రకటన వెలువడనుంది. చరణ్‌తో కలిసి నటించడం ఎంత సంతోషంగా ఉంటుందో నా తమ్ముడు పవన్ కల్యాణ్‌తో నటించడం కూడా అంతే సంతోషంగా మంచి కిక్ ఇస్తుంది. నాకు, కల్యాణ్‌కి సరిపడ మంచి కథలతో వస్తే కచ్చితంగా సినిమా చేస్తాం’’ అన్నారు. పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మాట్లాడుతూ – ‘‘సైరా’ సినిమా చూస్తుంటే యూనిట్ ఎంత కష్టపడ్డారో తెలుస్తోంది. చిరంజీవి ప్రాణం పెట్టి చేశాడు. ఆ పాత్రలో ఆయన్ని తప్ప ఎవర్నీ ఊహించలేం. ఆయన నటనకు హద్దుల్లేవ్. భారతదేశం అంతా చూడాల్సిన సినిమా ‘సైరా’. ప్రపంచంలో తెలుగు సినిమా తలెత్తుకునేలా చేసిన చిత్రమిది. ఇందులో నేను రాసిన పాటకి కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందనుకుంటున్నా’’ అన్నారు. ‘‘సైరా’ చిత్రంతో ఓ గొప్ప వీరుడి కథ చెప్పానని సంతోషంగా ఉంది. చిరంజీవిగారు ఏ రోజూ రెండో టేక్ తీసుకోలేదు. ఒక్క టేక్‌లోనే అద్భుతంగా నటించేవారాయన. అందుకే ఆయన అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ మెగాస్టార్’’ అని సురేందర్ రెడ్డి అన్నారు. ‘‘సైరా’ విడుదల తర్వాత అందరూ నన్ను సాయిచంద్ అనడం మానేసి సుబ్బయ్య అంటూ ఫోన్లు చేస్తూ, మెసేజ్‌లు చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో మంచి కిక్ ఇచ్చిన పాత్ర ఇది. తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి ఎవరెస్ట్ శిఖరం. అలాంటిది నా నటన బాగుందని ఆయన అభినందించడం నాకు ఆస్కార్ అవార్డు వచ్చినంత సంతో షం వేసింది’’ అన్నారు నటుడు సాయిచంద్. ‘‘రేసుగుర్రం’ టైమ్‌లో మెగాస్టార్‌గారి గురించి విన్నా. ‘సైరా’లో ఆయనతో పనిచేయడం నా అదృష్టం. అంతపెద్ద స్టార్ అయినా సింపుల్‌గా ఉంటారాయన’’ అన్నారు నటుడు రవికిషన్. -
అధికారం ఎప్పుడూ వాళ్లకేనా?
సినిమా ఇండస్ట్రీ మేల్ డామినేటెడ్ అంటారు కొందరు. పవర్ ఎప్పుడూ మగవాళ్ల దగ్గరే ఎందుకు ఉండాలి? అంటున్నారు నయనతార. ఒకవైపు టాప్ హీరోలతో యాక్ట్ చేస్తూ మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగారు నయనతార. తనకి సంబంధించిన పనులు తనకు నచ్చినట్టే జరగాలనుకుంటారట నయన. ఇండస్ట్రీలో అధికారం అనే టాపిక్ గురించి నయనతార మాట్లాడుతూ– ‘‘అధికారం ఎప్పుడూ మగవాళ్ల దగ్గరే ఎందుకు ఉండాలి? నేను సోలో హీరోయిన్గా చేసే సినిమాల్లో తుది నిర్ణయాలన్నీ నావే. సమస్య ఏంటంటే.. స్త్రీలు శాసించే స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఉండాల్సి నంత కాన్ఫిడెంట్‌గా ఉండరు. నాకు అది కావాలి, నేను ఇది చేస్తాను అని ధైర్యంగా నిలబడరు. నిలబడాలి. ఇది జెండర్‌తో సంబంధం లేనిది. నేను నీ మాట విన్నప్పుడు, నువ్వు కూడా నా మాట వినాలి కదా?’’ అన్నారు. -
ఆ కోరిక, కల అలాగే ఉండిపోయింది : చిరంజీవి
‘‘సెప్టెంబర్ 22 నా జీవితంలో అద్భుతమైనటువంటి ల్యాండ్ మార్క్. 1978 సెప్టెంబర్ 22న నా మొట్టమొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ విడుదలైన రోజు. ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఎగ్జయిట్మెంట్.. ఇలా రకరకాల అనుభూతులతోటి నేను నేలమీదలేనంటే ఒట్టు. ఇన్నేళ్ల తర్వాత అలాంటి అనుభూతి ఈరోజు భావిస్తున్నానన్నది వాస్తవం. దానికి కారణం ‘సైరా నరసింహారెడ్డి’’ అని చిరంజీవి అన్నారు. చిరంజీవి, నయనతార జంటగా అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి, రవికిషన్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఏ కథ అయినా అనుకుని అద్భుతంగా అల్లుకుని సెట్స్‌పైకి తీసుకెళతాం. కానీ, ‘సైరా’ అలాంటిది కాదు. దాదాపుగా ఒకటిన్నర దశాబ్దం నుంచి ఇది నా మదిలో మెదులుతూ ఉంది. దానికంటే 25 ఏళ్లకి ముందు ‘మీరు చేయాల్సిన పాత్రలేమైనా ఉన్నాయా?’ అని అడిగితే ఎప్పుడూ అంటుంటాను. స్వాతంత్య్ర సమరయోధుడి పాత్ర చేయాలి.. ప్రజల్లో శాశ్వితంగా నిలిచిపోయే పాత్ర అవ్వాలి.. నా కెరీర్‌కి అది బెస్ట్ పాత్ర అవ్వాలి అది భగత్‌సింగ్’ అంటూ నేను చెప్పుకుంటూ వచ్చేవాణ్ణి. కానీ ఎందుకో భగత్‌సింగ్ పాత్రని రచయితలు, దర్శకులు, నిర్మాతలు తీసుకురాలేదు.. దాంతో ఆ కోరిక, కల అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత, పుష్కరానికి ముందు పరుచూరి బ్రదర్స్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చెప్పారు. ఆయన గురించి కర్నూలుతో పాటు చుట్టుపక్కన ఉన్న జిల్లాల్లోని కొందరికి తప్ప ఆయన గురించి ఎవరికీ తెలియదు. ఆ టైమ్‌లో నాకూ పెద్దగా తెలియలేదు. నాకు తెలిసినవారిని అడిగినా మాకూ తెలియదన్నారు. ఆయనకు సంబంధించిన కొన్ని పేజీలు, బుర్ర కథలు, ఒగ్గు కథలున్నాయి తప్ప ఆయన గురించి పెద్దగా ప్రాచుర్యం ఏ ప్రాంతానికీ పాకలేదు. కానీ, కథ విన్నప్పుడు అద్భుతమైన కథ, ఓ గొప్ప యోధుడు అనిపించింది. తెరమరుగైపోయిన, తొలి స్వాతంత్య్ర సమరయోధుడు నరసింహారెడ్డి కథని అందరికీ తెలియజేయాలని సినిమా తీశాం. 1857లో సిపాయుల తిరుగుబాటు వచ్చినప్పుడు మంగళ్‌పాండే, ఝాన్సీ లక్ష్మీభాయ్ గురించి తెలుసు. ఆ తర్వాత ఆజాద్, భగత్‌సింగ్, నేతాజీ... ఇలా ఒక్కరేంటి.. మహాత్మాగాంధీ వరకూ ఎంతో మంది యోధులు, త్యాగమూర్తుల గురించి పుస్తకాల్లో చదివి తెలుసుకున్నాం. అయితే మన తెలుగువాడైన నరసింహారెడ్డివంటివారి కథ తెరమరుగైపోకూడదు అని మైండ్‌లో గట్టిగా ఉండిపోయింది. ఇలాంటి కథ కోసమే కదా ఇన్నాళ్లు ఎదురు చూస్తున్నాను.. మనం సినిమా చేస్తున్నాం అని పరుచూరి బ్రదర్స్‌కి చెప్పా. అయితే ఈ కథని తెరకెక్కించి న్యాయం చేయాలంటే బడ్జెట్ సమస్య అని మాకందరికీ అనిపించింది. పది–పదిహేనేళ్ల కిత్రం నాపై 30–40 కోట్లతో సినిమాలు తీసే రోజుల్లో ‘సైరా’ సినిమాకి 60–70 కోట్లపైన అవుతుంది. ఏ నిర్మాత ముందుకు రాలేడు.. చేయమని మనం అడగలేం. ఎందుకంటే నష్టపోయే పరిస్థితి. కానీ, చూద్దాం.. చేద్దాం.. రాజీపడలేం అనుకున్నాం. ఏ నిర్మాత ముందుకు రాకపోవడంతో ఆగిపోయింది. కానీ, నా 151వ సినిమాగా ‘సైరా’ చేస్తే ఎలా ఉంటుందన్న మా ఆలోచనకు శ్రీకారం చుట్టింది, ఇన్‌డైరెక్ట్‌గా సపోర్ట్ చేసింది దర్శకుడు రాజమౌళి. ఆయన ‘బాహుబలి’ తీసి ఉండకపోతే ఈరోజు ‘సైరా’ వచ్చుండేది కాదు.. మన తెలుగు సినిమాకి భారతదేశమంతా ఓ దారి వేశారాయన. ఇన్ని వందల కోట్లు మనం ఖర్చు పెట్టినా సంపాదించుకోవచ్చు.. నిర్మాతలకి నష్టం లేకుండా చూడొచ్చు అని భరోసా ఇచ్చాడు రాజమౌళి. శభాష్.. హ్యాట్సాఫ్ టు రాజమౌళి. ‘ఇంతఖర్చు పెట్టి రిస్క్ చేయమని ఎవరికైనా ఎందుకు మనం చెప్పాలి.. రాజీ పడకుండా మనమే చేద్దాం’ అని చరణ్ అనడంతో సై అన్నాను. ఈ కథని ఎవరు డైరెక్ట్ చేస్తారంటే.. నాపైన నమ్మకం ఉన్న పరుచూరి వెంకటేశ్వరావుగారు ‘మీరే చేయండి’ అన్నారు. నటిస్తూ దర్శకత్వం చేయడం కష్టం. దర్శకత్వం చేయలేక కాదు. దేన్నో ఓ దాన్ని వదిలేయాలి.. దేన్ని వదిలేయమంటారు? అడిగితే.. నరసింహారెడ్డిగా మిమ్మల్నే ఊహించుకున్నాం.. డైరెక్టర్ని వేరేవారిని పెట్టుకుందాం అన్నారు. సరే ఎవరు? అనుకుంటుంటే ‘ధృవ’ చేసిన అనుభవంతో మన సురేందర్ రెడ్డి అయితే బావుంటుంది అని చరణ్ అన్నాడు. సరే అన్నాను. ఈ విషయం సురేందర్‌కి చెబితే ఎగిరి గంతేస్తాడని అనుకుంటే ‘నాకు కొంచెం టైమ్ కావాలి సర్’ అన్నాడు. ఆ మాట మమ్మల్ని నిరుత్సాహానికి గురిచేసింది. వారం తర్వాత వచ్చి చేస్తాను సర్ అన్నాడు. కర్నూలుకు వెళ్లి నరసింహారెడ్డిగారి గురించి సమాచారం సేకరించి, మూడు వారాలు గోవాలో ఉండి స్టోరీ రెడీ చేసుకొచ్చాడు. వాస్తవ కథను ఎక్కడా వక్రీకరించకుండా కమర్షియలైజ్ చేసిన తనకు హ్యాట్సాఫ్. ఈ పాత్రలో ఎంతో కష్టం ఉంటుంది. నేనేమో డూప్‌ని ఒప్పుకోను. నా అభిమానులు అస్సలు ఒప్పుకోరు. ‘సైరా’ లో శారీరకంగా నన్ను ఎంతో హింస పెట్టి యాక్షన్ సీక్వెన్స్‌ని రాబట్టారు. ఒక్కసారి మేకప్ వేసుకుని, కత్తి చేతబట్టుకుని గుర్రం ఎక్కాక నా వొళ్లు మరచిపోతాను.. నా వయసూ మరచిపోతాను.. నాకు గుర్తొచ్చేది నా భిమానులు మాత్రమే. అక్కడ గుర్తొచ్చేది నా ఇమేజ్ మాత్రమే. 25ఏళ్ల కిత్రం జోష్ ఉండేది. ఆ ఉత్సాహాన్ని ఇచ్చేది ఒకటి ఆ పాత్ర.. రెండోది అభిమానులు. ‘సైరా’వంటి సినిమా చేయడం ఆ భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం.. మీకు చూపించడం ఎంతో పుణ్యం. ఇండస్ట్రీకి, తెలుగువారికి, ఆ సినిమా చేసిన వారికి గౌరవాన్ని తీసుకొచ్చే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంత గౌరవాన్ని తెచ్చిన సినిమా ‘శంకరాభరణం’. ఆ తర్వాత కొన్ని సినిమాలు గౌరవాన్ని తీసుకొచ్చినా తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళి ‘బాహుబలి’. మనమంతా తెలుగువాళ్లం అని గర్వంగా చెప్పుకుంటూ కాలర్ ఎగరేసేలా గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈరోజు ‘సైరా’ సినిమా కూడా అంత గౌరవాన్ని తెస్తుందనే ప్రగాఢ విశ్వాసం, నమ్మకం నాకుంది. నేను మాట్లాడేది గౌరవాన్ని గురించే.. విజయాన్ని గురించి ఇంకో సినిమాతో పోల్చట్లేదు.. ఇది గమనించాలి. పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ‘సైరా’ సినిమాకి ఎంతో ఉపయోగపడింది. ఈ చిత్రంలో పాటలు, స్టెప్స్ ఉండకపోవచ్చు కానీ, ప్రతి ఒక్క యువతకి కనెక్ట్ అయ్యే సినిమా. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా ‘సైరా’. మనమందరం భారతీయులుగా గర్వించాలి. ఇలాంటి సినిమాని నిర్మించినందుకు చరణ్‌ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.. ఓ కొడుకుగా కాదు.. ఓ నిర్మాతగా. సురేందర్ రెడ్డి అడిగినది ఏదీ కాదనకుండా, ధైర్యంగా ఖర్చుకు వెనకాడకుండా చేశాడు చరణ్. జార్జియాలో 45రోజుల పాటు పతాక సన్నివేశంలో వచ్చే యుద్ధం చేశాం. దానికి 75కోట్లు ఖర్చు అయింది. ‘ఎంత లాభాలు పొందామన్నది కాదు. రామ్‌చరణ్–సురేందర్ రెడ్డి ఎంత గొప్ప సినిమా తీశారన్నది కావాలి’ అన్నాడు. ఒక్క ఫోన్ చేయగానే నా గురువుపాత్ర చేసేందుకు ఒప్పుకున్న అమితాబ్‌గారికి కృతజ్ఞతలు. జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా.. ఇలా అందరూ ‘సైరా’ లో భాగమవ్వాలని నటించారు. ఈ సినిమాలో నేను ఇంత గ్లామర్‌గా ఉన్నానంటే ఆ క్రెడిట్ కెమెరామన్ రత్నవేలుగారిదే. అక్టోబర్ 2న గాంధీగారి 150వ జయంతి. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఆ రోజున సినిమాని విడుదల చేసేందుకు ముందుకు వెళుతున్నామంటే ఇందుకు దోహదం చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’అన్నారు. పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘సైరా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఒక అతిథిగా నన్ను పిలవడం నా అదృష్టం. బయట నా పేరు.. ఇమేజ్.. ఇవన్నీ నాకు తెలియదు కానీ అన్నయ్య దగ్గరకి వచ్చే సరికి నేను ఒక అభిమానిని. ఈ రోజు మీ(అభిమానులు) ముందు ఈ స్థాయిలో ఉండి మాట్లాడటానికి కారణం అన్నయ్య నేర్పించిన పాఠాలే. ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అన్నయ్య. నేను మద్రాసులో ఉన్నప్పుడు దేశం గర్వించే సినిమాలు అన్నయ్య చేయాలని కోరుకున్నాను. నాకు స్టార్డమ్ వచ్చినా అన్నయ్యతో సినిమా చేయలేకపోయాను. నా ముందు పెరిగిన రామ్‌చరణ్ స్వార్థం చూసుకోకుండా ఇలాంటి అద్భుతమైన సినిమా తీసినందుకు నా అభినందనలు. కళ అనేది అద్భుతమైనది. అనేక పరిస్థితుల్లో అది రకరకాలుగా ఉద్భవిస్తుంటుంది. భారతదేశం తాలూకు గొప్పదనం చెప్పే సినిమా ఇది. మన దేశం ఇతర దేశాలమీద దాడి చేయలేదు. ప్రపంచ దేశాలవారు మన దేశంపై దాడి చేశారు. మరి.. భారతదేశం అంటే ఏంటి? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి వ్యక్తుల సమూహం భారతదేశం. ఆయన ఎలా ఉండేవారో, ఎలా పోరాటం చేశారో పుస్తకం చదివితే అర్థం చేసుకోవచ్చు. కానీ కొన్ని కోట్ల మంది ఒక అనుభూతిలోకి రావాలి అంటే ఇలాంటి సినిమాలు రావాలి. భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, మహాత్మాగాంధీ, పటేల్, అంబేద్కర్ వంటి గొప్ప మహనీయుల త్యాగాలను మనం గుర్తు పెట్టుకోవాలి. ఉయ్యాలవాడ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఒక వినోదం కోసం మాత్రమే కాదు. ఇలాంటి ఒక చరిత్రను తెరకె క్కించడానికి చాలా కష్టపడాలి. రక్తాలు ధారపోసి, ప్రాణాలు అర్పించిన ఎందరో స్వాతంత్య్ర సమర యోధుల త్యాగఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం. అనుభవానికి నేను చాలా పెద్దపీట వేస్తాను. ఇది ఎప్పుడు నేర్చుకున్నాను అంటే... అన్నయ్య ‘ఖైదీ’ సినిమా విడుదలైన తర్వాత బలమైన స్టార్డమ్ స్టార్ట్ అయినప్పుడు.. ఒక తమ్ముడిగా మా అన్నయ్య పెద్ద హీరో అని అనుకుంటాం కదా. అలా అనుకున్నప్పుడు... ఎన్టీఆర్‌గారి సినిమారాగానే... ‘విశ్వామిత్ర’ అనుకుంటా... అది అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది. ఆ రోజు నాకు అర్థం అయ్యింది. ఒక వ్యక్తి తాలూకు అనుభవాన్ని ఎప్పుడూ తీసివేయలేం. అలాగే చిరంజీవిగారి అనుభవాన్ని... ఎంతమంది కొత్తవారు వచ్చినా కానీ, ఎంతమంది రికార్డులు బద్దలు కొట్టినా కానీ.. అంటే ఆయన అనుభవాన్ని మనం కొట్టేయలేం. అందుకే నాకు సీనియర్స్ అంటే చాలా గౌరవం. ‘సైరా:నరసింహారెడ్డి’ సినిమాను భారతదేశం గర్వించే చిత్రంగా చేయడం చాలా గర్వంగా ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగారు అంటే చిరంజీవిగారే గుర్తొచ్చారు. సురేందర్ రెడ్డిగారు చాలా బాగా తెరకెక్కించారు. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమా కోసం కలలు కన్నారు. నేను నటించకముందు ‘శుభలేఖ’ లో ఒక డైలాగ్‌కి డబ్బింగ్ చెప్పాను. ఆ తర్వాత మళ్లీ నా గళం ఇచ్చింది ‘సైరా’ చిత్రానికే. మన దేశం కోసం, ప్రజల కోసం తీసిన సినిమా ఇది. అందుకే నా గొంతను గర్వంగా, మనస్ఫూర్తిగా ఇచ్చాను. ‘సైరా’లాంటి సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు సంతోషంగా ఉంది. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళిగారు ఇక్కడి రావడం నిజంగా సంతోషం. ఎవరు ఎన్ని విజయాలు సాధించినా మాకు అసూయ కలగదు. ఇంకా ఆనందపడతాం. ఎందుకంటే పదిమంది బాగుండాలని కోరుకునేవాళ్లం మేము. రాజమౌళిగారు రికార్డులు బద్దలు కొడితే ఆనందంగా ఉంటుంది. సురేందర్‌రెడ్డిగారు కూడా రికార్డులు బద్దలుకొడితే ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మన సినిమా. మన జాతి. మన భారతజాతి. మన తెలుగుజాతి. మనం ఎక్కడికి వెళ్లినా.. ఇండియా అనేది బ్రిటిష్ వారు పెట్టిన పేరు. భారతదేశం అనేది మనది. భారతీయులుగా మనం గర్వించేలా సినిమా తీసిన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు ధన్యవాదాలు’’ అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఈ వేదికపై చాలా మంది గొప్పవారు ఉన్నారు. ఈ సినిమాలో పనిచేసిన వారు కాకుండా ఈ సినిమాను చూసిన మొట్టమొదటి ప్రేక్షకుడిని నేను. సూపర్‌హిట్ సినిమా. ఇన్ని రోజులు, ఇంత ఖర్చు పెట్టి తీశారు. సినిమా ఎలా వచ్చిందో అని చాలా భయంతో చూసి, చిరంజీవిగారిని కౌగిలించుకున్నాను. నాకు దుఃఖం వచ్చినంత పని అయ్యింది. ఇంత గొప్ప సినిమా తీసినందుకు చిరంజీవిగారి కన్నా... రామ్‌చరణ్‌పై ఓ ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది. చిరంజీవిగారితో ఇన్ని సినిమాలు తీసిన నేను, ఇలాంటి ఓ సినిమా తీయలేకపోయానే అనే ఒక బాధ కలిగింది. రెండో సినిమాతోనే చరణ్ గొప్ప సినిమా తీశాడు’’ అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ – ‘‘ఈ స్టేజ్‌పై నేను చెప్పే మాటలు నా లోని భావాలను తెలియజెప్పలేవు. ‘సైరా’ షూట్ చేసిన ప్రతిరోజు టీమ్‌కి థ్యాంక్స్ చెబుతూనే ఉన్నాను. అందరి సహకారం లేకపోతే నాన్నగారి ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ సాధ్యమయ్యేది కాదు. ఈ సినిమాలో నటించినవారికి, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘సైరా’ సినిమా కోసం 215 రోజులు ఓ కుటుంబంలా సాంకేతిక నిపుణలందరూ కష్టపడి పనిచేసినందుకు థ్యాంక్స్. చిరంజీవిగారి డ్రీమ్ ప్రాజెక్ట్‌ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు. నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చి సపోర్ట్‌గా ఉంటూ ఫ్రీడమ్ ఇచ్చి ముందుకు నడిపించిన రామ్‌చరణ్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ – ‘‘సైరా’ షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు రామ్‌చరణ్‌గారు కొన్ని రషెష్ చూపించారు. సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉండగానే అంత పాజిటివ్, అంత బ్లాక్‌బస్టర్ టాక్ ఈ ఒక్క సినిమాకే సాధ్యం. ఇలాంటి గొప్ప కావ్యమైన సినిమా తీసినందుకు సురేందర్‌రెడ్డిగారికి ఇది గొప్ప అవకాశం.. అదృష్టం. జనరల్‌గా తండ్రి నిర్మాత అయితే కొడుకు నటిస్తాడు.. ఇక్కడ మాత్రం కొడుకు నిర్మాత అయితే తండ్రి నటించడం చూడ్డానికే చాలా ఆనందంగా ఉంది. ‘సైరా’ సినిమా నిజంగా చాలా సంచలనం అవుతుంది’’ అన్నారు. ‘‘నా తొలి తెలుగు సినిమా చిరంజీవిసర్తో చేయడం సంతోషంగా ఉంది. రామ్‌చరణ్, సురేందర్ రెడ్డి సార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు నటుడు విజయ్ సేతుపతి. డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘ఇంతపెద్ద సినిమా, ఇంత చారిత్రాత్మక సినిమా వేడుక ఈ రోజు ఇక్కడ జరుగుతోందంటే మనం గుర్తించుకోవాల్సింది, అభినందించాల్సింది, కృతజ్ఞతలు చెప్పాల్సింది పరుచూరి బ్రదర్స్‌కి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని ఎన్నేళ్లు వారి గుండెల్లో, మనసుల్లో మోశారో సినిమా రంగంలోని వారందరికీ తెలుసు. బ్రిటీష్‌వారిపై తొలిసారి పోరాడింది ఓ తెలుగు వీరుడు.. ఇది అందరికీ తెలియాలని వాళ్లు చాలా ఏళ్లు వేచిచూశారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వాళ్ల కోరికని రామ్‌చరణ్ తీరుస్తున్నాడు. చరణ్.. ఇది మీ నాన్నగారికి ఇస్తున్న గిఫ్ట్ కాదు.. తెలుగువారందరికీ ఇస్తున్న గిఫ్ట్.. థ్యాంక్యూ. ఇలాంటి సినిమా తీయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ‘బాహుబలి’ లో 2300 వీఎఫ్ఎక్స్ షాట్లు ఉంటే ‘సైరా’ లో 3800 షాట్స్ ఉన్నాయి. అన్ని షాట్స్ మధ్యలో ఎమోషన్స్‌ని వదలకుండా, మరచిపోకుండా చేశారు. ‘సైరా’ ట్రైలర్ చూడగానే సినిమాపై అందరికీ నమ్మకం వచ్చింది. ‘మగధీర’ స్టోరీ సిట్టింగ్స్‌లో వారం పాటు చిరంజీవిగారు ఉత్సాహంగా పాల్గొని చాలా సలహాలు ఇచ్చారు. కొన్ని ఇలా చేస్తే బాగుంటుందంటూ నటించి చూపించారు. అప్పుడు నాకు అనిపించింది. ఈ కథలో హీరోగా చరణ్‌ని ఊహించుకోకుండా ఆయన్నే ఊహించుకుంటున్నాడని నాకు అనిపించింది. ‘మగధీర’ విడుదలయ్యాక చిరంజీవిగారు చెప్పారు.. ‘రాజమౌళిగారు.. నేను ఇన్ని సినిమాలు చేశాను కానీ, ‘మగధీర’ లాంటి సినిమా ఒక్కటి కూడా చేయలేదు’ అన్నారు. ఆ కోరికని ఇప్పుడు చరణ్ తీరుస్తున్నాడు’’ అన్నారు. కథా రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ –‘‘సైరా’ మా పదేళ్ల కల. ఈ కథని చాలామందికి చెప్పాం. చిరంజీవిగారు చేస్తాను అన్న తరవాత చాలా ఏళ్లు వెయిట్ చేశాం. న్యాయంగా చిరంజీవిగారి కోసమే చాలా మంది పెద్దవారు వదిలేసిన కథలా నేను భావిస్తుంటాను. నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవిగారు నటించడం మన అదృష్టం. రామ్‌చరణ్ అత్యద్భుతంగా ఈ సినిమా తీశారు. ఆర్టిస్టుల నుంచి మంచి నటనను రాబట్టుకోగలరు సురేందర్‌రెడ్డి. ‘సైరా’ చిత్రం సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు. మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ – ‘‘కృష్ణానగర్‌లో నేను అవకాశాల కోసం తిరుగుతుండేవాణ్ణి. ఓ రోజు అమ్మమ్మ ఫోన్ చేసి ‘అరేయ్.. చిరంజీవిని కలవరా.. ఆయన సినిమాకి ఒక్క డైలాగ్ అయినా రాయరా’ అనేది. ఆయన సినిమాకి మాటలు రాయడం ఏంటమ్మా.. అది జరిగేపనికాదు.. అలాంటి అవకాశాలు రావు.. ఆకాశాన్ని అందుకోమంటున్నావు అది జరిగేపని కాదు ఫోన్ పెట్టేయ్’ అని చెప్పేవాణ్ణి. అలాంటి నేను చిరంజీవిగారికి తొలిసారి ‘ఖైదీ నంబర్ 150’ సినిమాకి, ఇప్పుడు ‘సైరా’ కి మాటలు రాశా. అవకాశం ఇచ్చిన చిరంజీవి, రామ్‌చరణ్, సురేందర్ రెడ్డిగార్లకు థ్యాంక్స్’’ అన్నారు. డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా రారాజు మా అన్నయ్య మెగాస్టార్. ఈ సినిమా సూపర్‌హిట్ సాధించి చరణ్‌బాబు కలను, అన్నయ్యగారికి గొప్పగా గుర్తిండిపోయే సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. కొణిదెల సురేఖ, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, డి.సురేశ్‌బాబు, డీవీవీ దానయ్య, కిరణ్, హీరోలు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వాకాడ అప్పారావ్, వైవీ ప్రవీణ్ కుమార్, రామ్‌చరణ్ సతీమణి ఉపాసన, సోదరీమణులు సుశ్మిత, శ్రీజ, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, నటులు జగపతిబాబు, ‘థర్టీ ఇయర్స్’ పృథ్వీ, డైరెక్టర్ మెహర్ రమేశ్, కెమెరామన్ రత్నవేలు తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నయన్ ఎందుకలా చేసింది..?
సౌత్‌లో సూపర్‌స్టార్ రేంజ్‌ను అనుభవిస్తున్న హీరోయిన్ నయనతార. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తూనే.. మరోవైపు మాస్ ఎంటర్టైన్ మూవీల్లోనూ నటిస్తోంది. కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. అక్కడ పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండే.. నయన్ తన ప్రియుడు విఘ్నేశ్ శివన్‌తో అప్పుడప్పుడు బయటకు వెళ్తుంది. తాజాగా విఘ్నేష్ శివన్, నయన్‌లు కలిసి ఉన్న ఓ పిక్ వైరల్ అవుతోంది. ఈ సెల్ఫీలో విఘ్నేశ్ తన ప్రియురాలిని కూడా బంధించాలని చూస్తున్నా.. నయన్ మాత్రం తన చేతులతో మొహాన్ని దాచేసింది. అయితే సిగ్గుతో అలా చేసిందా?.. కొత్త సినిమా లుక్‌ను రివీల్ చేయద్దని చేతులు అడ్డు పెట్టావా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం నయనతార సైరా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేపనిలో పడింది యూనిట్. మరి ఈ ప్రమోషన్ ఈవెంట్లకైనా నయన్ వస్తుందో లేదో చూడాలి. -
లేడీ సూపర్‌స్టార్
స్క్రిప్ట్‌కి సరిపడినప్పుడు పాత సినిమా టైటిల్స్‌ని మళ్లీ వాడుతుంటారు. 1981లో రజనీకాంత్ నటించిన ‘వెట్రికన్’ టైటిల్‌ను ఇప్పుడు నయనతార సినిమాకు పెట్టారు. సూపర్‌స్టార్ టైటిల్‌ను ఏ సినిమాకైనా వాడేస్తే అభిమానుల్లో చిన్న నిరుత్సాహం ఉంటుంది. కానీ, రజనీ సూపర్‌స్టార్, నయనతార లేడీ సూపర్‌స్టార్. సొ.. నో ప్రాబ్లమ్ అనుకుంటున్నారు రజనీ ఫ్యాన్స్. ‘అవల్’ (తెలుగులో గృహం) తెరకెక్కించిన మిలింద్ రావ్ దర్శకత్వంలో నయన తార ముఖ్య పాత్రలో చేస్తున్న సినిమా ‘వెట్రికన్’(మూడో కన్ను అని అర్థం). నయనతార బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఈ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు. టైటిల్ బ్రెయిలీ లిపిలో రాసి ఉండటంతో సినిమాలో నయనతార అంధురాలిగా నటించనున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. -
హ్యాట్రిక్‌కి రెడీ
‘తేరి’(పోలీస్), ‘మెర్సల్’(అదిరింది) వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘బిగిల్’. నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఏజీయస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది దీపావళి సందర్భంగా తెలుగు, తమిళంలో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. ‘బిగిల్’ తెలుగు హక్కులను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్ కోనేరు మాట్లాడుతూ–‘‘స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా హక్కులు మాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందుకు కల్పాతి అఘోరమ్గారికి, విజయ్‌గారికి స్పెషల్ థ్యాంక్స్. ‘118’ చిత్రంతో మా బ్యానర్లో సూపర్‌హిట్ సాధించాం. ప్రస్తుతం జాతీయ ఉత్తమ నటి కీర్తీసురేశ్‌తో ‘మిస్ ఇండియా’ సినిమా నిర్మిస్తున్నాం. విజయ్, అట్లీ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘బిగిల్’ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. విజయ్‌గారి కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రమిది. త్వరలోనే తెలుగు టైటిల్‌ను ప్రకటిస్తాం’’ అన్నారు. -
ఓనమ్ వచ్చెను చూడు
కేరళలో సెప్టెంబర్ 10 నుంచి ‘ఓనమ్’పండుగ వేడుకలు జరుగుతున్నాయి. తెలుగువారికి సంక్రాంతి ఎలాగోమలయాళీలకు ఓనమ్ అలాగ. పూలు,ఫలాలు, పంటలు, పిండి వంటలు,పాటలు, ఆటలు, పోటీలు...ఇవన్నీ ఓనమ్ పండుగ సమయంలోకేరళ అంతటినీ కళకళలాడిస్తాయి.ఆ సినిమా తారలను కూడా. కేరళను ‘దేవుని సొంత భూమి’గా చెప్తారు. అయితే ఇది ఒకప్పుడు దేవుని వద్ద లేదు. దీని పాలకుడు అసురుడు. బలి చక్రవర్తి. అయితే అందమైన ఈ భూమి మీద దేవుడు మనసుపడ్డాడు. అందుకే వామనుడి రూపంలో బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి ‘మూడు అడుగుల నేల’ అడిగాడు. మొదటి రెండు అడుగులకే మూల్లోకాలు ఆక్రమితమయ్యాయి. ఇక మిగిలింది బలి చక్రవర్తి శిరస్సే. అమిత విష్ణుభక్తుడైన బలి వామనుడి మూడవ పాదాన్ని తన శిరస్సు మీదే పెట్టమని అంటాడు. ఆ తర్వాతి కథ ఏమైనా కేరళ వాసుల విశ్వాసం ప్రకారం బలి చక్రవర్తి భక్తికి విష్ణువు మెచ్చాడని, అందువల్ల ఒక వరం ప్రసాదించాడని, ఆ వరం ప్రకారం సంవత్సరానికి ఒకసారి బలి చక్రవర్తి సజీవుడైన తాను పాలించిన నేలకు (కేరళ) వచ్చి ఆ ప్రాంతాన్ని చూసుకుంటాడనీ. బలి వచ్చేవేళనే ఓనమ్ పండుగ వేళ. ఇది పురాణ కథ అయితే సాంస్కృతికంగా కేరళలో ఇది పంటలు ఇంటికి చేరే వేళ కనుక దీనిని విశేషంగా జరుపుకుంటారని విశ్లేషకులు అంటారు. కేరళ ప్రకృతి సౌందర్యానికే కాదు స్త్రీ సౌందర్యానికి కూడా పెట్టింది పేరు. అందుకే అక్కడి నుంచి కె.ఆర్.విజయ, పద్మినిలతో మొదలుపెట్టి నేటి అనుపమా పరమేశ్వరన్ వరకు ఎందరో హీరోయిన్లు దక్షణాది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తెలుగువారి హృదయాలను దోచారు. అక్కడి నుంచి వచ్చిన శోభన, వాణి విశ్వనాథ్ దాదాపు తెలుగు హీరోయిన్ల వలే లెక్కకు మించిన సినిమాల్లో పని చేశారు. రేవతి, ఊర్వశి, పూర్ణిమా భాగ్యరాజ్, లిజి, సితార, మీరా జాస్మిన్, అసిన్, నయన తార, ప్రియమణి, శ్వేతా మీనన్, కీర్తి సురేశ్, సాయి పల్లవి, నివేదా థామస్, అమలా పాల్... వీరంతా దాదాపు తెలుగవారి ఆడపడుచులు అయ్యారు. ఇక కేరళ మూలాలు ఉన్న సమంతా ఏకంగా అక్కినేని వారి ఇంటి కోడలు అయ్యింది.పండుగల్లో పురుషుల పాత్ర ఎలా ఉన్నా స్త్రీల వల్లే వాటికి అందం వస్తుంది. ఓనమ్ పండుగ నాడు సంప్రదాయ ఓనమ్ చీరను కట్టడం తప్పనిసరి అని భావిస్తారు కేరళ స్త్రీలు. అందుకు మన హీరోయిన్లు కూడా భిన్నం కాదు. ఓనం చీరకే అందం తెచ్చిన ఆ సౌందర్యాన్ని చూడండి. ఇరుగు పొరుగున మలయాళీలు ఉంటే ఓనమ్ శుభాకాంక్షలు తెలపండి. -
మరింత యవ్వనంగా..
వయసు పెరుగుతున్న కొద్దీ రజనీకాంత్‌లో ఎనర్జీ, స్టయిల్, చరిష్మా కూడా పెరుగుతున్నాయి. సినిమా సినిమాకు మరింత ఫ్రెష్ లుక్‌లోకి మారిపోతున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. నయనతార కథానాయిక. లైకా సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ సెకండ్ లుక్‌ను ఓనమ్ సందర్భంగా బుధవారం రిలీజ్ చేశారు. ఫైట్‌కు రెడీ అవుతున్నట్టు గుర్రుగా చూస్తున్నారు రజనీ. ‘మరింత యవ్వనంగా, అందంగా, తెలివిగా, కఠినంగా రజనీకాంత్‌ను చూపించబోతున్నాం’ అని మురుగదాస్ పేర్కొన్నారు. ఇందులో పోలీస్ అధికారి పాత్రలో రజనీ కనిపిస్తారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘దర్బార్’ రిలీజ్ కానుంది. -
రియల్ మెగాస్టార్‌ని కలిశా
చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై చిరంజీవి తనయుడు, హీరో రామ్‌చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలకానుంది. తండ్రితో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రామ్‌చరణ్ ‘‘సైరా’ చిత్రం కోసం నాన్నగారు చాలా పరివర్తన చెందటం అద్భుతం. ఆ కష్టంలో మంచి అనుభవం దాగి ఉంది. నాన్నగారి సినిమాలకు నిర్మాతగా మారిన తర్వాత నేను రియల్ మెగాస్టార్‌ని కలిశాననిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. ‘సైరా’ చిత్రంలో నయనతార కథా నాయికగా నటించారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా, జగపతి బాబు కీలక పాత్రధారులు. చిరంజీవి కమ్‌బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో రామ్‌చరణ్ తొలిసారిగా నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ‘సైరా’ చిత్రం చరణ్‌కు నిర్మాతగా రెండోది. -
వీడే సరైనోడు
జీవా, నయనతార జంటగా రూపొందిన తమిళ చిత్రం ‘తిరునాళ్’ తెలుగులో విడుదల కానుంది. కోకా శిరీష సమ్పణలో నోవా సినిమాస్ పతాకంపై నిర్మాత జక్కుల నాగేశ్వరరావు ‘వీడే సరైనోడు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఏడాదికి దాదాపుగా 150 చిన్న సినిమాలు విడుదల అవుతుంటాయి. అందులో 30 వరకు డబ్బింగ్ సినిమాలు వస్తుంటాయి. ఈ డబ్బింగ్ చిత్రాలు పెద్ద చిత్రాలకు పునాదులు లాగా ఉంటాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి’’ అన్నారు నిర్మాత ప్రసన్నకుమార్. ‘‘సినిమా విడుదలకు మంచి డేట్ కుదిరింది. నయనతార, జీవా నటన చిత్రానికి అదనపు ఆకర్షణ’’ అన్నారు నిర్మాత మోహన్ వడ్లపట్ల. ‘‘మంచి కథాంశంతో రూపొందిన చిత్రం ఇది’’ అని చిత్రనిర్మాత జక్కుల నాగేశ్వరరావు అన్నారు. -
మళ్లీ ముంబై
జైపూర్‌లో పని పూర్తి చేసుకొచ్చారు ఆఫీసర్ రజనీకాంత్. మకాం మళ్లీ ముంబైకి షిఫ్ట్ అయిందని తెలిసింది. ఇంకొన్ని రోజులైతే ఆపరేషన్ పూర్తయిపోతుందట. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దర్బార్’. నయనతార కథానాయిక. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. 25 ఏళ్ల తర్వాత మళ్లీ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు రజనీకాంత్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అంతకుముందు ముంబైలో భారీ షెడ్యూల్ జరిగింది. ప్రస్తుతం జరుగుతున్నది చివరి షెడ్యూల్ అని సమాచారం. ఇటీవలే జైపూర్‌లో ఓ గ్రాండ్ సాంగ్‌ను రజనీ, నయనతారపై చిత్రీకరించారట. షూటింగ్ లొకేషన్లో ఓ స్టిల్ ఇటీవలే రిలీజ్ అయింది. సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా విలన్లుగా నటించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే రజనీ సోదరుడు సత్యనారాయణ రావ్ మోకాలికి ఆపరేషన్ జరిగింది. ‘దర్బార్’ షూటింగ్ నుంచి కొన్ని గంటలు బ్రేక్ తీసుకుని, ఆస్పత్రికి వెళ్లి అన్నయ్యను పరామర్శించారు రజనీ. -
ఇండియాలో ఆయనే మెగాస్టార్
‘‘సైరా: నరసింహారెడ్డి’ చరిత్ర మరచిపోయిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీసిన సినిమా. దేశంలోని ప్రజలందరూ ఇలాంటి వీరుడి కథ తెలుసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. బడ్జెట్ పరిమితుల కారణంగా ఒకటిన్నర దశాబ్దంగా ‘సైరా’ వాయిదా పడుతూనే ఉంది. సురేందర్‌రెడ్డి, చరణ్ ‘సైరా’ చిత్రం చేయడానికి ముందుకు రావడంతో నా కల నెరవేరింది’’ అన్నారు చిరంజీవి. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్ చేశారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో నయనతార కథానాయికగా నటించారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, రవికిషన్, తమన్నా కీలక పాత్రధారులు. ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదల చేయాలనుకుంటున్నారు. హిందీ వెర్షన్‌ను ఫర్హాన్ అక్తర్, రితీష్ అద్వానీ విడుదల చేస్తున్నారు. గురువారం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమా టీజర్‌ను మంగళవారం ముంబైలో విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నలకు చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఆజ్కా గూండారాజ్’ (1992) సినిమా తర్వాత బాలీవుడ్లో నాకు ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలియడం లేదు. సరైన కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ రాలేదు. ఆ కారణంగానే కొంత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి వెళ్లాను. మళ్లీ 2016లో సినిమాల్లోకి వచ్చాను. ఆ సమయంలో కొత్త వాతావరణం కనపడింది. మళ్లీ బాలీవుడ్‌కి రావాలన్నప్పుడు ‘సైరా’ సినిమా అయితే సరిపోతుందనిపించింది. అమితాబ్‌గారు నా రియల్ లైఫ్ మెంటర్. నాకు తెలిసి ఇండియాలో మెగాస్టార్ అంటే అమితాబ్ బచ్చన్‌గారే. ఆయన దగ్గరకు ఎవరూ రీచ్ కాలేరు. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం. సినిమాలో నా గురువుగారి పాత్రలో చేయాలని అమితాబ్‌ని కోరినప్పుడు ఆయన వెంటనే అంగీకరించారు. ఆయనకు రుణపడి ఉంటాను’’ అని అన్నారు. సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చేయడం చాలెంజింగ్గానే అనిపించింది. అమితాబ్‌గారు, చిరంజీవిగారు నాకు కంఫర్ట్ జోన్‌ను క్రియేట్ చేశారు. నా వెనక చిరంజీవిగారు, చరణ్‌గారు ఉండటంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సినిమాను పూర్తి చేయగలిగాను’’ అన్నారు. ‘‘అమితాబ్ బచ్చన్, చిరంజీవి వంటి గొప్ప స్టార్స్‌తో కలిసి నటించడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు విజయ్ సేతుపతి. ‘‘అద్భుతమైన నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని గొప్ప వరంగా భావిస్తున్నా. ప్రతిసారీ ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం రాదు. వచ్చినప్పుడు కాదనుకుండా చేయడమే’’ అన్నారు సుదీప్. ‘‘మెగాస్టార్ చిరంజీవిగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన దగ్గర్నుంచి చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు రవికిషన్. ‘‘దక్షిణాది భాష అర్థం కావడమే కష్టం. కానీ సంగీతానికి భాష లేదు. దర్శకుడు, రైటర్స్ నా పనిని సులభం చేశారు’’ అన్నారు సంగీత దర్శకుడు అమిత్ త్రివేది. ‘‘నాన్నగారు ఇంట్లో ఒకలా, మేకప్ వేసుకున్నప్పుడు ఒకలా ఉంటారు. ఈజీగా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతారు’’ అన్నారు రామ్‌చరణ్. ‘‘చిరంజీవిగారితో కలిసి నటించాలనే నా కల నెరవేరింది’’ అన్నారు తమన్నా. ‘‘సినిమాకు భాష లేదు. ‘సైరా’ ఒక గొప్ప చిత్రం. ‘వార్’ (హృతిక్ రోషన్–టైగర్ ష్రాఫ్ నటిస్తున్న హిందీ సినిమా), ‘సైరా’ (ఈ రెండు సినిమాలు అక్టోబరు 2న విడుదల అవుతున్నాయి) రెండు వేర్వేరు సినిమాలు. ప్రేక్షకులు రెండు సినిమాలను చూడొచ్చు’’ అన్నారు ఫర్హాన్ అక్తర్. ‘‘సైరా’ గురించి రామ్‌చరణ్ చెప్పగానే నేను టీజర్ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. మరికొన్ని రషెస్ చూశాను. దాంతో హిందీలో సినిమాను రిలీజ్ చేయాలనుకున్నాం’’ అన్నారు రితీష్ అద్వాని. నా కమ్ బ్యాక్ మూవీ అనుకుంటా ‘జంజీర్’ (2013... తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం) తర్వాత బాలీవుడ్లో మరో సినిమా ఎందుకు చేయలేదు? అన్న ప్రశ్నకు రామ్‌చరణ్ బదులు చెబుతూ – ‘‘ఎంత పెద్ద నటుడికైనా కంటెంట్ ఉన్న సినిమా కుదరాలి. వచ్చే ఏడాది రాజమౌళిగారి ‘ఆర్ఆర్ఆర్’తో మీ ముందుకు (హిందీ ప్రేక్షకులను ఉద్దేశిస్తూ) రాబోతున్నాను. బాలీవుడ్లో నా కమ్ బ్యాక్ మూవీ ఇది. రామ్‌చరణ్, చిరంజీవి, ప్రభాస్ ‘సైరా’తో ‘సాహో’! ‘సైరా: నరసింహారెడ్డి’ టీజర్ విడుదల వేడుక మంగళవారం ముంబైలో జరిగింది. ‘సాహో’ మూవీ ప్రమోషన్లో భాగంగా ప్రభాస్ కూడా ముంబైలోనే ఉన్నారు. ఇలా చిరంజీవి, రామ్‌చరణ్, ప్రభాస్ కలిసి ఓ ఫొటోకు ఫోజు ఇచ్చి, అభిమానుల దిల్ ఖుషీ చేశారు. ఫర్హాన్ అక్తర్, రితేష్ అద్వానీ, రామ్‌చరణ్, తమన్నా, చిరంజీవి, సురేందర్ రెడ్డి, సుదీప్ -
చలో జైపూర్
కేసులు, నేరస్థులు, తుపాకులు, పరిశోధనలు.. వీటికి బ్రేక్ ఇచ్చారు రజనీకాంత్. కాస్త రిలీఫ్ కోసం ప్రేయసితో కలిసి డ్యూయెట్ పాడటానికి రెడీ అయిపోయారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ‘దర్బార్’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జైపూర్‌లో ఆరంభం కానుంది. ఈ కొత్త షెడ్యూల్ ఆదివారం ప్రారంభం అవుతుంది. ఇందుకోసం నయనతార, రజనీ తదితరులు జైపూర్ ప్రయాణమయ్యారు. ఈ చిత్రంలో రజనీ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. ఇప్పటివరకు జరిపిన షెడ్యూల్స్‌లో పరిశోధనలు, ఫైట్లు.. వీటికి సంబంధించిన సీన్స్ తీశారు. జైపూర్‌లో సాంగ్‌తో పాటు, కీలక సన్నివేశాల చిత్రీకరణకు ప్లాన్ చేశారు. -
స్వాతంత్య్రానికి సైరా
నేడు స్వాతంత్య్ర దినోత్సవం. మనం ఆనందిస్తున్న ఈ ఫ్రీడమ్‌ను మనకు అందించడం కోసం ఎందరో పోరాడారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన వాళ్లలో తొలి తరం యోధుల్లో తెలుగు వీరుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ఒకరు. ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగా ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రం తెరకెక్కుతుంది. చిరంజీవి లీడ్ రోల్లో ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సుమారు 250 కోట్ల బడ్జెట్‌తో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మించారు. దాదాపు 225 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. ఈ పీరియాడికల్ చిత్రాన్ని తెర మీదకు తీసుకురావడానికి చిత్రబృందం పడిన శ్రమ, మేకింగ్ ఆఫ్ ‘సైరా’ గురించి కొన్ని విశేషాలు మీకోసం. మేకింగ్ ఆఫ్ ‘సైరా’ రాజ్య వ్యవస్థలను, రాజులను ఆంగ్లేయులు తమ ఆధీనంలోకి తీసుకొని తమ అదుపులో ఉన్న ప్రాంతాలకు ‘పాలెగాళ్ల’ను ఏర్పాటు చేసేవాళ్లు. అలాంటి ఓ పాలెగాడు నరసింహారెడ్డి. ఆంగ్లేయులపై ఎలా ఎదురుతిరిగాడు? ఈ ఉద్యమంలో ఎవరెవరిని తనతో కలుపుకుంటూ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాడు అనేది చిత్రకథ అని సమాచారం. ఈ చిత్రంలో అనుష్క ఝాన్సీ రాణిగా కనిపిస్తారు. సినిమా అనుష్క వాయిస్ ఓవర్‌తోనే మొదలవుతుందని తెలిసింది. చిరంజీవి గురువు పాత్రలో అమితాబ్ నటించారు. రాజ నర్తకి పాత్రలో తమన్నా, నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మగా నయనతార నటించారు. నరసింహారెడ్డికి మద్దతుగా తమిళనాడు నుంచి వచ్చే దళ నాయకుడిగా విజయ్ సేతుపతి కనిపిస్తారు. ఎవరి పాత్రేంటి? చిరంజీవి – ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నయనతార – సిద్ధమ్మ అమితాబ్ బచ్చన్ – గోసాయి వెంకన్న జగపతి బాబు – వీరారెడ్డి ‘కిచ్చ’ సుదీప్ – అవుకు రాజు విజయ్ సేతుపతి – రాజా పాండీ తమన్నా – లక్షి అనుష్క – ఝాన్సీ లక్ష్మీభాయ్ సైరా బృందం రచన : పరుచూరి బ్రదర్స్ దర్శకుడు : సురేందర్ రెడ్డి నిర్మాత : రామ్‌చరణ్ ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవన్ కెమెరా మేన్ : రత్నవేలు యాక్షన్ కొరియోగ్రాఫర్స్ : గ్రెగ్ పోవెల్, రామ్ లక్ష్మణ్, లీ వైట్కర్ కాస్ట్యూమ్ డిజైనర్ : అంజూ మోడీ, సుష్మితా కొణిదెల, ఉత్తరా మీనన్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ : కమల్ కణ్ణన్ సంగీతం : అమిత్ త్రివేది రాజస్తాన్ స్పెషల్ కత్తి యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 150కు పైగా వివిధ రకాలైన కత్తులను తయారు చేయించారట. ప్రధానంగా చిరంజీవి రెండు కత్తులు వాడారని సమాచారం. ఒక కత్తిని ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి తెప్పించారట. ఇక్కడ డిజైన్ చేసి, రాజస్తాన్ పంపించి, ఆ కత్తిని తయారు చేయించారు. మరో కత్తిని హైదరాబాద్‌లోనే తయారు చేయించారు. ఇంకా మిగతా కత్తులను ఇక్కడ డిజైన్ చేసి, చెన్నైలో తయారు చేయించారు. రెండు భారీ యుద్ధాలు! ‘సైరా’ సినిమాలో రెండు భారీ యుద్ధాలు ఉంటాయని తెలిసింది. ఈ యుద్ధ సన్నివేశాల్లో ఒకటి జార్జియా దేశంలో, మరొకటి హైదరాబాద్‌లోని కోకాపేట్ సెట్లో షూట్ చేశారు. జార్జియాలో నెల రోజుల పాటు ఈ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించగా, కోకాపేట్లో దాదాపు 35 రోజులుపైగా నైట్ షూట్ చేశారట. సినిమాలో వచ్చే ఈ మేజర్ వార్ సీన్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయని తెలిసింది. ఇంకా ఇవి కాకుండా పోరాట దృశ్యాలు మరిన్ని ఉంటాయి. వాటిలో నీటి లోపల తీసిన అండర్ వాటర్ ఎపిసోడ్ ఓ హైలైట్ అని తెలిసింది. ఈ ఎపిసోడ్‌ను ముంబైలో వారం రోజులు షూట్ చేశారు. పదిహేను సెట్లు ‘సైరా’ చారిత్రాత్మక చిత్రం. స్క్రీన్ మీద ఆ కాలాన్ని ప్రతిబింబించాలంటే సెట్లు కచ్చితంగా నిర్మించాల్సిందే. ‘సైరా’ చిత్రాన్ని ఎక్కువ శాతం సెట్లోనే షూట్ చేశారు. దాని కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో రెండు సెట్లు, ఆర్ఎఫ్సీలో రెండు సెట్లు, కోకాపేటలో మూడు సెట్లు (టెంపుల్ సెట్, ప్యాలెస్ సెట్‌తో పాటు మరోటి), ఇంకా హైదరాబాద్‌లోనే రెండు సెట్లు, పాండిచెరీలో ఒకటి, మైసూర్, తమిళనాడులో హోగెనకల్లో ఒకటి, కేరళలో ఒకటి, రెండు సెట్లను రూపొందించారు. ఇలా 15కు పైగా భారీ సెట్లను ఈ సినిమా కోసం రూపొందించారు ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ ఆధ్వర్యంలో అద్భుతమైన సెట్లు తయారు చేశారు. నయనతార గెరిల్లా ఫైట్ నరసింహారెడ్డి ఆంగ్లేయులతో తలపడిన విధానాల్లో గెరిల్లా ఒక పద్ధతి. శత్రువుల్లో కలిసిపోయి అనూహ్యంగా దాడి చేయడం ఈ యుద్ధ విద్య విశేషం. సినిమాలో ఓ పాటలో ఈ గెరిల్లా పోరాటాన్ని చూపించనున్నారట చిత్రబృందం. పాట బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఆ ఫైట్‌లో చిత్రకథానాయకుడు చిరంజీవితో పాటు దాదాపు 500మంది పాల్గొన్నారు. కాస్ట్యూమ్స్ ఇందులో చిరంజీవి సుమారు 50 కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తారని సమాచారం. చిరంజీవి కాస్ట్యూమ్స్‌ను ఆయన కుమార్తె సుష్మితా కొణిదెల డిజైన్ చేశారు. తమన్నా నర్తకి పాత్రలో కనిపించనున్నారు. ఆమె కూడా ఓ 25 కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తారట. నయనతారకి 20 డ్రస్ చేంజ్‌లు ఉంటాయని తెలిసింది. సినిమాలో ఎక్కువ కాస్ట్యూమ్స్ ఈ మూడు పాత్రలకే ఉంటాయి. అంజూ మోడీ, ఉత్తరా మీనన్‌లు కూడా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. తమన్నా ‘‘సైరా’లో నా పాత్ర రెండు నిమిషాలు కూడా ఉండదు. కానీ మేకింగ్ వీడియోలో నా విజువల్స్ కూడా వేశారు చరణ్ (రామ్ చరణ్) అన్న. అది చాలా స్వీట్ అనిపించింది. అన్న స్టైలే అది. ఇలాంటి చిన్న చిన్న విషయాలతో మా అందర్నీ హ్యాపీగా ఉంచుతాడు. ఇది రక్షాబంధన్‌కి అడ్వాన్స్‌గా ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నాను’’ అని తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు నిహారిక. ఇందులో నిహారిక కాసేపు కనిపిస్తారు. నిహారిక -
సరైనోడు వీడే
జీవా, నయనతార జంటగా తమిళంలో రూపొంది, ఘన విజయం సాధించిన ఓ చిత్రాన్ని ‘వీడే సరైనోడు‘ పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. కోకా శిరీష సమర్పణలో నోవా సినిమాస్ పతాకంపై జక్కుల నాగేశ్వరావు ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేస్తున్నారు. జక్కుల నాగేశ్వరావు మాట్లాడుతూ – ‘‘గ్రామీణ, నగర నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమిది. జీవా నటన, నయనతార గ్లామర్ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ప్రస్తుతం సెన్సార్ పూర్తయింది. ఈనెల 8న పాటలు విడుదల చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్ దేవా, సహ నిర్మాతలు: మాస్టర్ కోకా లోహితా„Š – మాస్టర్ కోకా నిశ్చల్ సాయికృష్ణ. -
నక్సలిజమ్ బ్యాక్‌డ్రాప్?
చిరంజీవి ‘సైరా: నరసింహారెడ్డి’ అక్టోబర్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయనున్నారు. కొరటాల గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా సోషల్ డ్రామాగా తెరకెక్కనుంది. ప్రచారంలో ఉన్న ప్రకారం ఈ చిత్రం నక్సలిజమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోందని తెలిసింది. ఇందులో చిరంజీవి డ్యూయెల్ రోల్లో కనిపించనున్నారు. ఒక పాత్ర నక్సలిజమ్ చుట్టూ తిరుగుతుందని, ఆ పాత్ర కోసం చిరంజీవి సాల్ట్ అండ్ పెప్పర్ (అక్కడక్కడా నెరిసిన జుట్టు) లుక్‌లో కనిపిస్తారని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మించనున్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా ఎంపిక అయ్యారట. చిరంజీవి పుట్టిన రోజున (ఆగస్ట్ 22) ఈ సినిమా ప్రారంభం కానుందని తెలిసింది. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారట. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. -
భారీ అయినా సారీ!
రెండు మూడు సినిమాలకు తీసుకునే పారితోషికం ఒకే సినిమాకి వస్తే? లాటరీ తగిలినట్లే. అలాంటి అవకాశాన్ని దాదాపు ఎవరూ వదులుకోరు. కానీ నయనతారలాంటి కొందరు మాత్రం ‘నో’ అనేస్తారు. ఇంతకీ నయనతార వదులుకున్న ఆ ఆఫర్ ఎంతో తెలుసా? పది కోట్ల రూపాయలు. ఇంత భారీ ఆఫర్‌కి సింపుల్‌గా సారీ చెప్పేశారా? అని ఆశ్చర్యం కలగక మానదు. అయితే సినిమాల ఎంపిక విషయంలో ఈ మధ్య ఆచితూచి అడుగులేస్తున్న నయనతార బాగా ఆలోచించుకుని ఈ ఆఫర్‌ని కాదన్నారట. తమిళంలో శరవణన్ అనే నూతన హీరోతో ఓ సినిమాకి ప్లాన్ జరుగుతోంది. ఇందులో శరవణన్‌కు జోడీగా నయనతారను నటింపజేయాలనుకున్నారట. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్‌తో దూసుకెళుతున్న నయనతార కొత్త హీరోతో సినిమా అంటే ఓకే చెబుతారా? చెప్పరు కదా. అందుకే పది కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తామంటూ ఆఫర్ అందించారు. అయినప్పటికీ ఆమె అంగీకరించలేదు. శరవణన్ కొత్త నటుడు కావడంతోనే అంగీకరించలేదని కొందరు అంటే పాత్ర çనచ్చక తిరస్కరించారని మరికొందరు అంటున్నారు. అసలు కారణం ఏంటో నయనతారకే తెలియాలి. -
సెల్యూట్ ఆఫీసర్
‘దర్బార్’లో రజనీకాంత్ రాజసం మామూలుగా లేదు. ఇక్కడున్న ఫొటో చూశారుగా.. ఐపీఎస్ ఆఫీసర్‌గా రజనీ ఎలా ఉన్నారో! మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు రజనీకాంత్. ముంబై నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ముంబైలో ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుందని టాక్. ఆగస్టు చివరికల్లా షూట్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు మురుగదాస్. తాజాగా ఈ సినిమాలోని రజనీ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇదివరకు కూడా ఈ సినిమా స్టిల్స్ లీక్ అయినప్పటికీ ఖాకీడ్రెస్‌లో రజనీ ఉన్న లుక్ బయటకు రావడం ఇదే తొలిసారి. ఇందులో బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ విలన్లుగా నటిస్తున్నారు. నివేదా థామస్, యోగిబాబు కీలకపాత్రలు చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
మిస్ ఫిజియో
ఫిజియోథెరపీ క్లాసులకు రెగ్యులర్‌గా వెళ్తున్నారు నయనతార. షూటింగ్లో స్టంట్స్ చేస్తూ గాయపడి ఫిజియో వద్దకు వెళ్తున్నారని ఊహించేసుకోవద్దు. ఫిజియో క్లాసులకు వెళ్లేది పేషెంట్‌గా కాదట.. స్టూడెంట్‌గా అని సమాచారం. నయనతార హీరోయిన్గా విజయ్‌తో కలసి నటిస్తున్న చిత్రం ‘బిగిల్’. (విజిల్ అని అర్థం) అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయన ఫిజియోథెరపీ స్టూడెంట్‌లా కనిపిస్తారట. విజయ్ ఫుట్‌బాల్ కోచ్‌లా నటిస్తున్నారు. స్పోర్ట్స్ ఆడే సమయంలో ఆటగాళ్లతోనే ఫిజియోథెరపిస్ట్‌లు ఉండే సంగతి తెలిసింది. ఈ విధంగా మిస్టర్ కోచ్‌కి, మిస్ ఫిజియోకి లవ్ ట్రాక్‌ని దర్శకుడు కలిపారని ఊహించవచ్చు. ఈ చిత్రాన్ని దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
బిగిల్ కొట్టు
ఫుట్‌బాల్ గ్రౌండ్లో ప్రత్యర్థులను హడలెత్తించేలా ఆడారు తమిళ నటుడు విజయ్. ఈ ఆట ఈ ఏడాది దీపావళికి వెండితెరపైకి వస్తుంది. అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందుతున్న సినిమాకు ‘బిగిల్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అలాగే శనివారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, సెకండ్ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్స్ చూస్తుంటే విజయ్ క్యారెక్టర్లో మూడు నాలుగు షేడ్స్ ఉంటాయని అర్థం అవుతోంది. ఇక్కడున్న ఫస్ట్ లుక్ పోస్టర్లో ఒక గెటప్‌లో యంగ్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపిస్తున్న విజయ్, ఇంకో లుక్‌లో కత్తి పట్టుకుని మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి సినిమా విడుదల కానుంది. అన్నట్లు.. ‘బిగిల్’ అంటే విజిల్ అని అర్థం. -
తలైవాతో తలపడుతున్నారు
అవును తలైవా (నాయకుడు) రజనీకాంత్‌తో తలపడుతున్నారట యోగ్రాజ్ సింగ్. ఇంతకీ ఎవరీ యోగ్రాజ్ సింగ్? అంటే క్రికెట్‌ను ఫాలో అయ్యేవాళ్లకు ఈ పేరు సుపరిచితమే. ఇండియన్ క్రికెట్ టీమ్ తరపున కొన్ని మ్యాచులు ఆడటంతో పాటు యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ అని చాలామందికి తెలుసు. క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత పంజాబీ ఇండస్ట్రీలో యాక్టర్‌గా సినిమాలు చేస్తున్నారాయన. ఇప్పుడు రజనీకాంత్ తాజా చిత్రంలో నటిస్తున్నారని తెలిసింది. మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ చేస్తున్న చిత్రం ‘దర్బార్’. నయనతార కథానాయిక. 25 ఏళ్ల తర్వాత ఈ చిత్రంలో రజనీ పోలీస్ పాత్ర చేస్తున్నారు. ఇందులో యోగ్రాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. సినిమాలో వచ్చే ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్‌లో రజనీ, యోగ్రాజ్ తలపడనున్నారని తెలిసింది. యోగ్రాజ్ ఇది వరకు ‘సింగ్ ఈజ్ కింగ్, భాగ్ మిల్కా భాగ్’ వంటి బాలీవుడ్ సినిమాల్లో కనిపించారు. ‘దర్బార్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
ఆగస్ట్‌లో గుమ్మడికాయ
ఓ అమ్మాయితో కలిసి రైల్వేస్టేషన్లో వెయిట్ చేస్తున్నారు ఓ పోలీసాఫీసర్. ఆ పోలీసాఫీసర్ ఎవరంటే రజనీకాంత్. అమ్మాయేమో నివేథా థామస్. రజనీకాంత్ హీరోగా ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దర్బార్’లో నివేథా కీలకపాత్ర చేస్తున్నారు. ఇందులో నయనతార కథా నాయికగా నటిస్తున్నారు. సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ నటిస్తున్నారు. చెన్నైలో వేసిన రైల్వేస్టేషన్ సెట్లో ఇటీవల రజనీకాంత్, నివేదాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ జూలైకల్లా పూర్తవుతుందనే ప్రచారం జరిగింది. ఈ వార్తను మురుగదాస్ ఖండించారు. ‘దర్బార్’ షూటింగ్ ఆగస్టు వరకు జరుగుతుందని వెల్లడించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
కలల తీరం
వీలైనప్పుడల్లా ప్రేమ యాత్రలకు పయనమవుతారు లవ్‌బర్డ్స్ నయనతార, విఘ్నేష్ శివన్. ఈ ప్రేమజంట తాజాగా గ్రీస్‌లోని శాండోరిని దీవుల్లో ఫుల్‌గా హాలిడే టైమ్‌ని స్పెండ్ చేస్తున్నారు. ఈ వెకేషన్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు విఘ్నేష్. ‘‘ఎప్పటినుంచో ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం. ఇప్పటికి కుదిరింది. డ్రీమ్ డెస్టినేషన్’’ అని పేర్కొన్నారు విఘ్నేష్. ఇక సినిమాల విషయానికి వస్తే... రజనీకాంత్ ‘దర్బార్’, విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. అలాగే తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాలో హీరోయిన్గా నటించారు నయన్. ఇక ఎప్పటిలాగానే తన ఉమెన్‌సెంట్రిక్ ఫిల్మ్స్‌లో నటించడం ఆపలేదు ఈ లేడీ సూపర్‌స్టార్. శివకార్తికేయన్ హీరోగా ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు విఘ్నేష్ శివన్. -
జర్నీ ఎండ్!
సుదీర్ఘ ‘సైరా’ ప్రయాణం క్లైమాక్స్‌కు వచ్చింది. ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ దాదాపుగా పూర్తయిందని తెలిసింది. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా’. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. రామ్‌చరణ్ నిర్మాత. నయనతార, తమన్నా కథానాయికలు. ఇటీవలే చిరంజీవి, తమన్నాలపై ఓ సాంగ్‌ను షూట్‌ను పూర్తి చేశారు. ఈ నెలాఖరులో అనుష్కతో రెండు రోజులు సీన్స్ చిత్రీకరించనున్నారు. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయిందట. వీఎఫెక్స్ వర్క్స్ కూడా అనుకున్న సమయానికి జరిగితే సినిమాను గాంధీ జయంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: రత్నవేలు. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా రజనీ
ముంబైలోని మాఫియాను గడగడలాడించడానికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా మారారు రజనీకాంత్. ప్రజలను భయపెడుతున్న గ్యాంగ్‌స్టర్స్‌కు తూటాతో సమాధానం చెబుతున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత రజనీకాంత్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అందులోనూ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించబోతున్నారట రజనీ. అలాగే ఈ సినిమాలో ఆయన రెండు పాత్రలు చేస్తున్నారని ప్రచారం జరగుతోంది. ఇటీవల ముంబైలో మొదలైన ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. ముఖ్యంగా ముంబైలోని ఓ కాలేజీలో వేసిన పోలీస్ ఇన్వెస్టిగేషన్ రూమ్ సెట్లో రజనీకాంత్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారని తెలిసింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ 29న స్టార్ట్ చెన్నైలో మొదలవుతుందని తెలిసింది. బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ ‘దర్బార్’లో ఓ విలన్‌గా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. -
కన్నడంలో విశ్వాసం
తమిళంలో పొంగల్‌కు విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘విశ్వాసం’. అజిత్, నయనతార నటించిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా కన్నడంలో రీమేక్ కానుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ రీమేక్‌లో హీరోగా నటించనున్నారు. తమిళంలో ‘విశ్వాసం’ చిత్రాన్ని నిర్మించిన సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థే ఈ రీమేక్‌నూ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ గురించి శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ – ‘‘విశ్వాసం’ రీమేక్ సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అనౌన్స్ చేస్తాం’’ అన్నారు. విశేషమేంటంటే ‘విశ్వాసం’ సినిమా ‘జగ మల్లా’ టైటిల్‌తో కన్నడంలో అనువాదం అయింది. -
గాంధీ జయంతికి సైరా
దాదాపు రెండేళ్లుగా సాగుతున్న వెండితెర ‘సైరా: నరసింహారెడ్డి’ ప్రయాణం తుది దశకు చేరుకుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో హీరో రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈనెల 14న ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ స్టూడియోలో ఓ పాటను చిత్రీకరించనున్నారు. అలాగే ఈ నెల చివరలో హీరోయిన్ అనుష్కపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇక్కడితో ఈ సినిమా చిత్రీకరణ ఆల్మోస్ట్ పూర్తయిపోతుందని సమాచారం. అనుష్క పాత్రతోనే థియేటర్లో ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమా ఆరంభం అవుతుందని తాజా సమాచారం. ఈ ఏడాది గాంధీ జయంతి రోజున (అక్టోబర్ 2) ‘సైరా’ చిత్రాన్ని విడుదల చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు, తమన్నా కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. -
బంపర్ ఆఫర్
అవునా.. అమలాపాల్ బంపర్ ఆఫర్ కొట్టేశారా? అని కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. మరి.. మణిలాంటి దర్శకుడి సినిమాలో అంటే రత్నంలాంటి అవకాశమే కదా. యస్.. మీరు ఊహిస్తున్నది నిజమే. మణిరత్నం తీయబోతున్న భారీ మల్టీస్టారర్‌లో అమలా పాల్ నటించనున్నారట. మణిరత్నం సినిమాల్లో ఎంతమంది స్టార్స్ ఉన్నప్పటికీ ఎవరి పాత్రకు ఉండాల్సిన ప్రాముఖ్యత వాళ్లకు ఉంటుంది. గత ఏడాది అరవింద్‌సామి, శింబు, విజయ్ సేతుపతి, జ్యోతికలతో ‘చెక్క›చివంద వానమ్’ (తెలుగులో ‘నవాబ్’) తీశారు. లేటెస్ట్గా ఆయన తమిళ ఫేమస్ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ను తెరకెక్కించాలనుకుంటున్నారు. ఇందులో విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, కీర్తీ సురేశ్, నయనతార నటించనున్నారని సమాచారం. ఈ భారీ మల్టీస్టారర్‌లో ఓ కీలక పాత్ర కోసం అమలా పాల్ అయితే బావుంటుందని చిత్రబృందం భావించిందట. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతోందట. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తొలుత లైకా ప్రొడక్షన్స్ నిర్మించాలి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ను రిలయన్స్ సంస్థ నిర్మించనుందని తెలిసింది. ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
అది చెత్త నిర్ణయం
‘ఎక్స్ పిచ్చి వై పిచ్చి ఏదో పిచ్చి... ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి...’ అంటూ ‘గజిని’ సినిమాలో యూత్‌ని హీటెక్కించారు నయనతార. ఇప్పటికీ ఆ పాట ఎక్కడ విన్నా, చూసినా కాలు కదపకుండా ఉండలేరు. సూర్య హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 2005లో వచ్చిన ఆ సినిమాలో చిత్ర పాత్రలో ప్రేక్షకులను అలరించారు నయనతార. ఆ సినిమా తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. ఇప్పుడీ సినిమా గురించి ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అంటే.. ‘గజిని’ సినిమా చేయడం తన జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయం అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నయనతార పేర్కొన్నారు. కెరీర్ ప్రారంభంలో ఆమె చేసిన తమిళ చిత్రాలు ‘చంద్రముఖి, గజిని’ ప్రేక్ష కుల్లో మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ‘గజిని’ చేయడం గురించి ఇటీవల ఆమె మాట్లాడుతూ– ‘‘గజిని’ కథ చెబుతున్నప్పుడు నా పాత్ర వేరు.. తెరపై కనిపించింది వేరు. చిత్ర పాత్రను అంతలా తగ్గించేశారు. ఆ సినిమా చేయాలనుకోవడం నేను తీసుకున్న చెత్త నిర్ణయం. ‘చంద్రముఖి’ సినిమాలో కూడా నాది చిన్న పాత్రే. అయితే ఆ సినిమా మాత్రం నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ‘గజిని’ తర్వాత పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తపడ్డా’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం నయనతార తెలుగులో ‘సైరా’తో పాటు తమిళంలో ‘మిస్టర్ లోకల్, దళపతి 63, దర్బార్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
దర్బార్‌పై రాళ్లు
ఏదో సినిమాలో హీరో అంటాడు ‘అభిమానాన్ని ఆపలేం సార్’ అని. నిజమే. అభిమానాన్ని ఆపితే వచ్చేది ఆగ్రహమే. ఇప్పుడు అలాంటి ఆగ్రహానికే గురవుతున్నారు ‘దర్బార్’ చిత్రబృందం. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దర్బార్’. నయనతార కథానాయిక. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. 25 ఏళ్ల తర్వాత మళ్లీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు రజనీకాంత్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఓ కళాశాలలో జరుగుతోంది. రజనీకాంత్ సినిమా అంటే ఆసక్తి చూపనివారు ఎవరుంటారు? దాంతో అత్యుత్సాహంతో రజనీ ఫోటోలు తీసి ఆన్లైన్లో షేర్ చేస్తున్నారు కొందరు. దీంతో షూటింగ్‌స్పాట్‌లో ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నాయి. ఇది చిత్రబృందానికి ఇబ్బందిగా మారింది. దాంతో సూపర్ స్టార్‌ని చూడ్డానికి లొకేషన్‌కి వస్తున్న స్టూడెంట్స్‌ను దూరంగా ఉంచాలని భావించింది చిత్రబృందం. మా అభిమానాన్నే అడ్డుకుంటారా? అని ఆగ్రహించిన స్టూడెంట్స్ సెట్‌పై రాళ్లు విసిరారు. ఈ సంఘటన తర్వాత షూటింగ్ లొకేషన్ మార్చాలనే ఆలోచనలో ఉందట టీమ్. -
దర్బార్‌లోకి ఎంట్రీ
‘దర్బార్’లో ప్లేస్ కన్ఫార్మ్ చేసుకున్నారు హీరోయిన్ నివేదా థామస్. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఐపీఎస్ పోలీసాఫీసర్ పాత్రలో రజనీకాంత్ నటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా షూట్‌లోకి జాయిన్ అయ్యారు నయనతార. ఆమెతోపాటు నివేదా థామస్, కమెడియన్ యోగిబాబు కూడా ఈ ముంబై సెట్లో జాయిన్ అయ్యారు. లొకేషన్లో రజనీకాంత్, నివేదా, యోగిబాబు ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో రజనీకాంత్ కూతురి పాత్రలో నివేదా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ‘పాపనాశనం’ సినిమాలో కమల్‌హాసన్ కూతురిగా నటించారు నివేదా. ‘దర్బార్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
1 వర్సెస్ 100
నయనతార.. సౌతిండియా లేడీ సూపర్‌స్టార్. కమర్షియల్ సినిమాలు, లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ బ్యాలెన్స్ చేయడంలో ఎక్స్పర్ట్. ఎన్ని సినిమాలు చేసినా ప్రమోషన్స్‌కు, టీవీ ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటారు. సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే కనిపించడానికి ఆసక్తి చూపిస్తారామె. అయితే విచిత్రంగా నయనతార తమిళంలో ఓ టీవీ షో హోస్ట్ చేయబోతున్నారని తెలిసింది. కోలీవుడ్‌లో ఇదివరకూ ఖుష్బూ, రమ్యకృష్ణ తదితరులు టీవీషోలు హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్‌లోకి లేట్ అయినా లేటేస్ట్‌గా ఎంట్రీ ఇస్తున్నారు నయన్. ‘1 వర్సెస్ 100’ అనే అమెరికన్ టీవీ షో తమిళ వెర్షన్‌కు హోస్ట్‌గా నయనతార కనిపిస్తారు. ఇన్ని సంవత్సరాలు ప్రమోషన్స్, టీవీలకు దూరంగా ఉన్న నయన్ ఈ షో అంగీకరించారంటే షోలో ఖచ్చితంగా ఏదో స్పెషాల్టీ ఉండి ఉంటుందేమో. షో స్పెషల్‌గా ఉండటంతో పాటు నయనతారకు భారీ పారితోషికం ఆఫర్ చేశారట. త్వరలోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కానుందట. ప్రస్తుతం చిరంజీవితో ‘సైరా’, రజనీతో ‘దర్బార్’, విజయ్‌తో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు నయనతార. త్వరలో దర్శకుడు శివ, సూర్య కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్గా నటిస్తారట. -
కేరళలో ఖేల్ ఖతమ్
‘సైరా’ ప్రయాణం పూర్తి కావస్తోంది. షూటింగ్ ఖేల్ ఖతమ్ చేయడానికి కేరళ అడవుల్లో షూటింగ్ చేస్తోంది చిత్రబృందం. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కానుందని సమాచారం. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీత దర్శకుడు. అక్టోబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
దర్బార్ విలన్
‘దర్బార్’లో రజనీకాంత్‌కు విలన్ పాత్రలో సవాల్ విసరడానికి సిద్ధం అవుతున్నారు బాలీవుడ్ యాక్టర్ ప్రతీక్ బబ్బర్. ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘దర్బార్’. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. ఈ చిత్రంలో నటించడం గురించి ప్రతీక్ మాట్లాడుతూ – ‘‘రజనీసార్ లాంటి లెజెండ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో విలన్‌గా నటించబోతున్నాను. ఈ చాన్స్‌ని వినియోగించుకోవడం కోసం 200 శాతం కష్టపడతాను. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు జీవితంలో ఎప్పుడూ రావు’’ అన్నారు. ఈ సినిమాలో మెయిన్ విలన్ కొడుకు పాత్రలో ప్రతీక్ కనిపిస్తారట. -
బ్యాలెన్స్ చేయాలి
తమిళ కొత్త సంవత్సరాన్ని కుటుంబ సమేతంగా ఆహ్వానించారు నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్. వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరాన్ని విఘ్నేశ్ తన కుటుంబ సభ్యులందరితో కలసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను ఆయన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసి – ‘‘అందరికీ తమిళ నూతన సంవత్సరం, అలాగే విషు (మలయా సంవత్సరాది) శుభాకాంక్షలు. అమ్మ, చెల్లి, కాబోయే వాళ్లు (అంటే నయనతార)... కుటుంబమే సర్వస్వం. బ్యాలెన్స్ చేయడమే లైఫ్. పాజిటివ్‌నెస్‌ను నింపడమే లైఫ్’’ అని పేర్కొన్నారు. విజయ్, రజనీకాంత్ సినిమాల్లో హీరోయిన్గా నయనతార, శివకార్తికేయన్ సినిమా రూపొందించే పనిలో విఘ్నేశ్ బిజీ బిజీగా ఉన్నారు. -
నేనెందుకు క్షమాపణ చెప్పాలి?
‘‘నేనెప్పుడూ ఎవర్నీ క్షమించమని అడగలేదు. అది మా రక్తంలోనే లేదు. అయినా నేనెందుకు క్షమాపణ అడగాలి. నేనేమైనా హత్య చేశానా’’ అని విరుచుకుపడ్డారు రాధారవి. నయనతారపై ఆ మధ్య ‘కొలైయుదిర్ కాలమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాధారవి అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ విషయంలో చాలామంది రాధారవిని తప్పు పట్టారు. ఆ తర్వాత మూడు నాలుగు రోజులకు ‘‘ఒకవేళ నేను చేసిన వ్యాఖ్యలు వాళ్లను (నయనతార) బాధపెట్టి ఉంటే పశ్చాత్తాపపడుతున్నా’’ అని పేర్కొన్నారు రాధారవి. అయితే ఇటీవల ఓ ఈవెంట్లో రాధారవి మాట్లాడుతూ – ‘‘ఒకవేళ ఆరోజు నేను మాట్లాడింది తప్పయితే అక్కడున్నవాళ్లు సపోర్ట్ చేసేవాళ్లు కాదు. ఇప్పుడు నా నుంచి క్షమాపణ ఎదురు చూస్తే చెప్పడానికి రెడీగా లేను. నటుడిగా నాకు అవకాశాలు రావంటున్నారు. అయితే నన్నెవరూ ఆపలేరు. సినిమాలు కాకపోతే నాటకల్లో నటిస్తాను’’ అన్నారు. -
డబుల్ రజనీ
ఆరుపదులు దాటినా రజనీకాంత్ స్టైల్, వర్కింగ్ స్టైల్లో ఏ మాత్రం తేడా కనిపించడం లేదు. ‘పేట’ చిత్రాన్ని అనుకున్న సమయానికంటే ముందే పూర్తిచేసి అందర్నీ ఆశ్చర్యపరచారు రజనీకాంత్. ఇప్పుడు మండే ఎండల్లో కొత్త షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అయ్యారు. మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఏప్రిల్ 10న మొదలుపెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారట చిత్ర బృందం. ఏప్రిల్ అంటే ఫుల్‌గా ఎండలు ఉంటాయి కదా అంటే నిజమే... కానీ రజనీకి అవేం పట్టవు. అనుకుంటే ముందుకెళ్లాల్సిందే. అలాగే ఈ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. సామాజికవేత్తగా, పోలీసాఫీసర్‌గా కనిపిస్తారట. ఇక ఈ చిత్రంలో నయనతార, కీర్తీసురేశ్ కథానాయిక పాత్రలు పోషించనున్నారని తెలిసింది. ఈ సినిమా కథ ముంబై నేపథ్యంలో సాగుతుందని, అందుకు తగ్గ సెట్‌వర్క్ ఆల్రెడీ పూర్తయిందని కోడంబాక్కమ్ వర్గాల టాక్. ఈ సినిమాకు అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తారు. సంతోష్ శివన్ కెమెరామ్యాన్. ఇంకా సెట్స్ పైకి వెళ్లని ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుందనే ప్రచారం జరుగుతోంది. -
టికెట్లు పంపిస్తాం... సినిమా చూడండి!
‘‘ఇప్పుడు ఎవరు పడితే వాళ్లు దెయ్యం పాత్రలూ చేస్తున్నారు. వాళ్లే సీతపాత్రలూ చేస్తున్నారు. నయనతారను చూస్తే దెయ్యాలు పారిపోతాయి’’... ఇలా ఇటీవల తమిళ చిత్రం ‘కొలైయుదిర్ కాలమ్’కి సంబంధించిన వేడుకలో నటుడు రాధారవి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నయనతారకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా చాలామంది సినీప్రముఖులు తమ గళం వినిపించారు. వారిలో సమంత కూడా ఉన్నారు. ‘‘మీరు బాధలో ఉన్న వ్యక్తి. మిమ్మల్ని చూస్తుంటే మాకు బాధగా ఉంది. మీ ఆత్మ లేక దాని తాలూకు ఏమైనా మీలో మిగిలి ఉంటే దానికి ప్రశాంతత కావాలి. నయనతార నెక్ట్స్ సూపర్‌హిట్ ఫిల్మ్ సినిమా టికెట్లు మీకు పంపిస్తాం. పాప్‌కార్న్ తింటూ చూసి ఆస్వాదించండి’’ అని కాస్త చమత్కరిస్తూనే తనదైన శైలిలో విమర్శిస్తూ సమంత ట్వీట్ చేశారు. సమంత ట్వీట్‌కు నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు. -
అది మగతనం కాదు!
‘కొలైయుదిర్ కాలమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తమిళ నటుడు రాధారవి (ప్రముఖ తమిళ నటుడు ఎం.ఆర్ రాధా తనయుడు) నయనతారపై అగౌరవమైన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలకు తమిళ ఇండస్ట్రీ మండిపడుతోంది. పలువురు నటులు, నటీమణులు, దర్శక–నిర్మాతలు ఈ కామెంట్స్‌ను తిప్పి కొట్టారు. ‘డీఎంకే’ పార్టీ రాధారవిని సస్పెండ్ చేసింది. తనపై రాధారవి చేసిన వ్యాఖ్యలకు నయనతార ఓ లేఖ ద్వారా స్పందించారు. ఆ లేఖ సారాంశం ఈ విధంగా... ‘‘మన పని మాత్రమే మాట్లాడాలనే పాలసీని నమ్మే వ్యక్తిని నేను. కానీ ప్రస్తుతం ఏర్పడ్డ పరిస్థితుల వల్ల ఈ ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇండస్ట్రీలో నా స్టాండ్ గురించి, అసభ్యకర కామెంట్స్ పాస్ చేసేవాళ్ల ప్రవర్తనతో బాధపడుతున్న స్త్రీల తరఫున మాట్లాడుతున్నాను. ముందుగా రాధారవి స్పీచ్‌పై వెంటనే చర్య తీసుకున్న ‘డీఎంకే పార్టీ అధినేత’ ఎం.కే స్టాలిన్‌గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాధారవికి, ఆయనలా ఆలోచించే అందరికీ నేను గుర్తు చేయాలనుకుంటున్నది ఒక్కటే. మీ అందరికీ జన్మనిచ్చింది ఓ స్త్రీ అనే సంగతి మరువకండి. స్త్రీలను కించపరచడం, కామెంట్స్ చేయడం, అగౌరవపరచడాన్ని ఇలాంటి మతిస్థిమితం సరిగ్గా లేని మగవాళ్లు మగతనంగా భావిస్తున్నారు. వారి ప్రవర్తన నాకు చాలా బాధ కలిగిస్తోంది. అలాగే ఇలా కామెంట్ చేయడం గొప్ప అని భావించే మగవాళ్ల కుటుంబంలో ఉంటున్న స్త్రీలందరి పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఒక సీనియర్ నటుడైన రాధారవి తర్వాతి జనరేషన్‌కు రోల్ మోడల్‌గా ఉండాలనుకోకుండా స్త్రీ విద్వేషకుడిగా మిగిలిపోవాలనుకున్నారు. అన్ని రంగాల్లో స్త్రీలు తమ ప్రతిభను చాటుతూ, ప్రస్తుతం ఉన్న పోటీలో తమ స్థానాన్ని నిరూపించుకుంటున్నారు. బిజినెస్‌లో వెనకబడిపోయిన రాధారవి లాంటి వాళ్లు ఇలాంటి తక్కువ స్థాయి మాటలు మాట్లాడి వార్తల్లో నిలవాలనుకుంటున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. స్త్రీలను తక్కువ చేసే వ్యాఖ్యలకు కొందరు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడం. ప్రేక్షకులు ఇలాంటి కామెంట్స్‌ను ప్రోత్సహించినంత వరకూ రాధారవి లాంటి వాళ్లు స్త్రీలను తక్కువ చేయడం, చీప్ జోక్స్ వేయడం చేస్తూనే ఉంటారు. నా అభిమానులు, సక్రమంగా నడుచుకునే సిటిజెన్స్ అందరూ ఇలాంటి చర్యలను దయచేసి ప్రోత్సహించవద్దు. ఈ లేఖ ద్వారా రాధారవి చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నాను. అదృష్టవశాత్తు దేవుడు నాకు అద్భుతమైన అవకాశాలు, ప్రేమను పంచే ప్రేక్షకులను ఇచ్చాడు. ఈ నెగటివ్ కామెంట్స్‌ని పట్టించుకోకుండా ఎప్పటిలా సీతలా, దెయ్యంలా, గాళ్‌ఫ్రెండ్‌లా, లవర్‌లా, భార్యలా.. ఇలా అన్ని పాత్రల్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నిరంతరం కృషిచేస్తాను. చివరిగా నడిగర్ సంఘా (నటీనటుల సంఘం)నికి నాదో ప్రశ్న. సుప్రీమ్ కోర్ట్ ఆదేశించినట్టు ‘ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ’ ని ఎప్పుడు నియమిస్తారు? విశాఖ గైడ్‌లెన్స్‌ను అనుసరిస్తూ ఇంటర్నల్ ఎంక్వైరీ ఎప్పుడు చేస్తారు? ఈ సమయంలో నాతో నిలబడిన అందరికీ ధన్యవాదాలు ’’.‘కొలైయుదిర్ కాలమ్’ ఈవెంట్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన రాధారవి సోమవారం అపరాదభావం వ్యక్తం చేశారు. ఓ తమిళ పత్రికతో మాట్లాడుతూ – ‘‘ఒకవేళ నేను చేసిన వ్యాఖ్యలు వాళ్లను బాధపెట్టి ఉంటే, నేను పశ్చాత్తాపపడుతున్నాను. ఒకవేళ నా చర్యల వల్ల డీఎంకే పార్టీకి నష్టం జరుగుతుంది అనుకుంటే పార్టీ నుంచి తప్పుకోవడానికైనా నేను సిద్ధమే’’ అని పేర్కొన్నారు రాధారవి. నయనతారను అందరూ సపోర్ట్ చేస్తుంటే నటుడు సిద్ధార్థ్ మాత్రం ‘మనకు ఏదైనా జరిగినప్పుడు మాత్రమే ఎదురు తిరిగితే ధైర్యవంతులు అవ్వం’ అని ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ని ఉద్దేశించి నయనతార బాయ్‌ఫ్రెండ్, దర్శకుడు విఘ్నేష్ శివన్ ‘‘మీటూ’ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ఉదృతంగా ఉంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో. సోషల్ మీడియాలో మీటూ గురించి స్పందించకుండా సైలెంట్‌గా ఉన్నంత మాత్రాన ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నట్లు కాదు. నయనతార స్త్రీ సంక్షేమం కోసం ఎప్పుడూ నిలబడతారు. ‘మీటూ’ బాధితులకు ఆర్థికంగా, నైతికంగా నిలబడ్డారు. తన సినిమాల్లో అవకాశాలు కూడా కల్పించారు. కానీ వీటిని సోషల్ మీడియాలో చెప్పుకోలేదు. చేసిన మంచిని బయటకు చెప్పుకోకుండా మౌనంగా ఉన్నవారి గురించి కామెంట్ చేయడం బాధాకరం’’ అని సమాధానమిచ్చారు. ఆ తర్వాత సిద్దార్థ్ ‘నేను చెప్పాలనుకున్న విషయం సరిగ్గా చెప్పలేకపోయాను. గౌరవప్రదంగా ఆ ట్వీట్స్‌ను డిలీట్ చేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. రాధారవిగారు మీరు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఈ రోజు నుంచి కేవలం రవి అని పిలిపించుకోండి. ఎందుకంటే మీ పేరులో కూడా ఒక స్త్రీ పేరు ఉంది. – విశాల్, నటుడు, ‘నడిగర్ సంఘం’ జనరల్ సెక్రటరీ ఒక అద్భుతమైన నటి (నయనతార) గురించి రాధారవి చేసిన కామెంట్స్ విన్నాను. సార్ మీరు చేసిన కామెంట్స్ మీ అసభ్యకరమైన గుణాన్ని, ఆ నటి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. యాక్టింగ్ కమ్యూనిటీ సిగ్గుపడేలా చేశారు. – రానా, నటుడు -
నయనతారను చూస్తే దెయ్యాలే పారిపోతాయి
‘‘యంజీఆర్, శివాజీ గణేశన్’ మరణం లేని ఇమేజ్ పొందినవాళ్లు. అలాంటి గొప్పవాళ్లతో నయనతారను పోలుస్తున్నారు. నాకు బాధగా ఉంది. నయనతార స్టారే. లేడీ సూపర్‌స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న మాట వాస్తవమే. కానీ వాళ్లతో పోలికేంటి?’’ అని నయనతార గురించి తమిళ నటుడు రాధారవి కామెంట్ చేశారు. నయనతార ముఖ్య పాత్రలో చక్రి తోలేటి తెరకెక్కించిన చిత్రం ‘కొలైయుదిర్ కాలమ్’. కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చే శారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాధారవి మాట్లాడుతూ– ‘‘నయనతార మంచి నటే. నేనొప్పుకుంటాను. ఇండస్ట్రీలో చాలా కాలంగా కొనసాగుతున్నారు. తన మీద పలు ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా టాప్‌లోనే కొనసాగుతున్నారు. తమిళ ప్రజలు ఏ విషయాన్నయినా నాలుగైదు రోజుల్లో మరచిపోతారు. తను ప్రస్తుతం ఫేమస్ కావచ్చు. తనే సీత పాత్ర చేస్తోంది, దెయ్యం పాత్రలూ చేస్తోంది. ఇంతకుముందు దేవుళ్ల పాత్రలో నటించాలంటే కేఆర్ విజయగారి వద్దకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు? ఎవరైనా చేయొచ్చు. గౌరవప్రదమైన వాళ్లనైనా నటింపజేయొచ్చు, ఎవరెవరితో తిరిగేవాళ్లనైనా నటింపజేయొచ్చు. ఈ మధ్య హారర్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు నయనతార. తనని మామూలుగా చూస్తే దెయ్యాలే పారిపోతాయి’’ అని నయనతారపై కామెంట్ చేశారు. అలాగే ‘మీటూ’ ఉద్యమం మీద కూడా కామెంట్ చేశారు రాధారవి. ‘‘సినిమా ప్రమోషన్లలో పాల్గొనమని నటీనటుల మధ్య అగ్రిమెంట్ కుదుర్చుకోమని మది (‘కొలైయుదిర్ కాలమ్’ చిత్రనిర్మాత, రాధారవి అల్లుడు) కి చెప్పాను. అలాగే షూటింగ్లో భాగంగా హీరోయిన్ను హీరో ఎక్కడైనా తాకుతాడు. ఆ విషయంలో మళ్లీ సినిమా తర్వాత గొడవ చేయకూడదు అనే అగ్రిమెంట్ కూడా ఉండాలి’’ అని పేర్కొన్నారు. ఈ సంచలన వ్యాఖ్యలను పలువురు తమిళ నటీనటులు, దర్శకులు వ్యతిరేకించారు. తమ అభిప్రాయాలను ట్వీటర్లో షేర్ చేశారు. ‘‘రాధారవిగారి ప్రవర్తన విసుగు పుట్టించింది. ఆయనలా స్త్రీలను తక్కువ చేసేవాళ్లను నా సినిమాల్లో తీసుకోకూడదని పర్సనల్‌గా స్టాండ్ తీసుకుంటున్నాను. – మిలింద్ రావ్, దర్శకుడు ఒక గొప్ప కుటుంబం (రాధారవి తండ్రి ప్రముఖ నటుడు ఎం.ఆర్. రాధ) నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇంత అసభ్యకరంగా మాట్లాడినప్పుడు తనని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సపోర్ట్ చేయరు, ఎటువంటి యాక్షన్ తీసుకోరు. ఆయన స్పీచ్‌కు ప్రేక్షకులు కూడా నవ్వుతూ, చప్పట్లు కొట్టడం బాధగా ఉంది. నాకు తెలిసి ఈ సినిమాను మొదలుపెట్టిన దర్శకులు, నిర్మాతలు ఈ సినిమాను సగంలోనే వదిలిపెట్టారు. ఇలాంటి ఒక ఈవెంట్ జరుగుతుందని మాకు తెలియదు. అనవసరమైన ఈవెంట్ నిర్వహించి, అందులో ఇలాంటి అనవసరమైన వాళ్లను కూర్చోబెట్టి సినిమాను ప్రమోట్ చేయడం కంటే అలాంటి ఈవెంట్స్‌కు దూరంగా ఉండటమే మంచిది. ఇలాంటి ఈవెంట్స్ ద్వారా ఇలాంటి పనికిమాలిన వారి వ్యర్థమైన భావాలను బయటకు చెప్పడానికి ప్రోత్సహించడమే అవుతుంది. నడిగర్ సంఘం, ఇంకేదో సంఘం నుంచి ఎవ్వరూ ఎలాంటి యాక్షన్ తీసుకోరు. బాధాకరం’’ – విఘ్నేశ్ శివన్, దర్శకుడు స్త్రీల మీద అసభ్యకర జోక్స్ వేయడం (అది అసభ్యకరం కాదని వాళ్లు అనుకోవడం), తక్కువ చేయడం, స్త్రీలను కేవలం ఐ క్యాండీల్లా చూడటం ఇండస్ట్రీలో భాగం అయిపోయింది. ఇదంతా ఓకే అనుకుని ఇప్పటివరకూ మాట్లాడని స్త్రీ, పురుషులకు థ్యాంక్స్ (వ్యంగ్య ధోరణిలో). అదీ మన పరిస్థితి. ఇలాంటి అనుభవం మీకు ఎదురైతేనే ఈ విషయం అర్థం అవుతుంది. అప్పుడు కనువిప్పు కలుగుతుంది. చిన్మయి, నేను, ఇంకెందరో స్త్రీలు ‘మీటూ’ అంటూ పోరాటం చేస్తున్న సమయంలో ఇండస్ట్రీలో ఉన్న ఉమెన్ మాతో నిలబడి ఉంటే.. ఏమో పరిస్థితుల్లో కొంచెమైనా మార్పు వచ్చేదేమో? మౌనం మనల్ని ఎక్కడికీ తీసుకెళ్లదు. ఈ సంఘాలన్నీ నడిపేది కూడా మగ అహంకారులే. ఈ విషయాలపై ఎటువంటి చర్యలు తీసుకోరు. కానీ స్త్రీలను సపోర్ట్ చేస్తున్నాం అని యాక్షన్ మాత్రం చేస్తుంటారు. – వరలక్ష్మీ శరత్‌కుమార్, హీరోయిన్ ఒక సక్సెస్ఫుల్ ఫిమేల్ యాక్టర్‌ను స్టేజ్ మీద తిట్టేస్తున్నారు రాధారవి. వేరే యూనియన్స్ వాళ్ల విషయాల్లో ఇన్వాల్వ్ కాకూడదని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, నడిఘర్ సంఘం ఎటువంటి చర్య తీసుకోవడం లేదు’’ – చిన్మయి, గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ రాధారవి సోదరి, ప్రముఖ నటి రాధిక కూడా సోదరుడి కామెంట్స్‌ను సపోర్ట్ చేయలేదు. ‘మనకున్న డెడికేటెడ్ నటుల్లో నయనతార ఒకరు. తను నాకు తెలుసు. తనతో పని చేశాను కూడా. తను చాలా మంచి మనిషి. రాధారవి మాట్లాడిన వీడియో మొత్తం చూడలేదు. రవిని ఇవాళ కలిశాను. తను మాట్లాడింది కరెక్ట్ కాదని చెప్పాను’’ అని ట్వీట్ చేశారు రాధిక. ఐరా..నయనతార నయనతార కథానాయికగా నటించిన లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘ఐరా’. గంగా ఎంటర్టైన్మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కేఎమ్ సర్జున్ దర్శకత్వం వహించారు. నయనతార తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది. ‘‘ఎమోషనల్ ఫ్యామిలీ హారర్‌గా రూపొందింది. భవాని, యమున పాత్రల్లో నయనతార కనిపిస్తారు. ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. భావోద్వేగాల సన్నివేశాల్లో నయనతార నటన హైలైట్’’ అని సర్జున్ అన్నారు. కళైయరసి, యోగిబాబు, ఎం.ఎస్. భాస్కర్, వంశీకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి కె.ఎస్. సుందరమూర్తి సంగీతం అందించారు. -
చైనాలో నైరా
‘సైరా’ చిత్రానికి గుమ్మడికాయ కొట్టే సమయం వచ్చేసిందట. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందని సమాచారం. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘సైరా : నరసింహారెడ్డి’. రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. తమన్నా, అనుష్క కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉందని, ఏప్రిల్ మొదటి వారంతో చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తి అయిపోతుందని తెలిసింది. ఈ చిత్రం చైనాలో చిత్రీకరణ జరగుతుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదట. చైనాలో ‘నైరా’ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉందని టాక్. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: రత్నవేలు. -
ఫారిన్ కోచ్
బాలీవుడ్ నటులు తమిళంలో నటించడం కొత్తేం కాదు. ‘తుపాకీ’ సినిమాలో విద్యుత్ జమాల్ విలన్‌గా నటించారు. అజిత్ ‘వివేగమ్’ సినిమాలో వివేక్ ఒబెరాయ్ నటించారు. ‘2.ఓ’లో అక్షయ్‌కుమార్ నటించారు. రీసెంట్గా అమితాబ్ బచ్చన్ ‘ఉయంర్ద మణిదన్’(తమిళం, హిందీ) అనే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా విజయ్ సినిమాలో జాకీ ష్రాఫ్ నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఫుట్‌బాల్ స్పోర్ట్స్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో ఫారిన్ ఫుట్‌బాల్ టీమ్ కోచ్‌గా కనిపిస్తారట జాకీ ష్రాఫ్. ఇదివరకు ఆయన పలు తమిళ చిత్రాల్లో నటించారు. కాగా తాజా చిత్రంలో ఫుట్‌బాల్ ప్లేయర్ కమ్ కోచ్ మైఖేల్ పాత్రలో విజయ్ నటిస్తారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో వేసిన ఆరు కోట్ల భారీ సెట్లో జరుగుతోంది. -
ఫొటోషూట్ రెడీ
కొత్త లుక్‌లోకి మారిపోవడానికి రెడీ అవుతున్నారు చిరంజీవి. ఎందుకంటే ఆయన తర్వాతి చిత్రం కోసం. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తాయి. ఈ సినిమా పనులు ఊపందుకున్నాయి. ఇటీవల చిరంజీవిపై ఓ ఫొటోషూట్ జరిగిందని సమాచారం. త్వరలో చిత్రీకరణ స్టార్ట్ కానుంది. ఈ చిత్రంలోని పాత్ర కోసం చిరంజీవి బరువు కూడా తగ్గుతారని తెలిసింది. ఇందులో కథానాయికగా తమన్నా, నయనతార, శ్రుతీహాసన్ పేర్లు వినిపించాయి. వీరిలో ఎవరో ఒకరు చిరంజీవికి జోడీగా నటిస్తారా? లేక వేరే హీరోయిన్ ఎవరైనా ట్రాక్‌లోకి వస్తారా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్ నిర్మాత. నయనతార కథానాయికగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి తదితర భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దసరా పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
దీపావళికి పక్కా
తమిళ నటుడు విజయ్ హీరోగా నటించిన ‘మెర్సెల్, సర్కార్’ చిత్రాలు వరుసగా 2017, 2018 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే లభించింది. తాజాగా విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాను కూడా దీపావళికే విడుదల చేయనున్నట్లు తొలుత చిత్రబృందం ప్రకటించింది. కానీ షూటింగ్ స్లోగా జరుగుతోందని, దీపావళికి బొమ్మ థియేటర్స్‌లోకి రాదనే వార్తలు వినిపించాయి. ‘‘ఈ దీపావళికి పక్కా వస్తాం. అవాస్తవమైన వార్తలను నమ్మొద్దు’’ అని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ స్పష్టం చేసింది. ‘తేరీ, మెర్సెల్’ తర్వాత విజయ్–అట్లీ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి. -
సంతోషంగా ఇంటికి వెళ్తారు
‘‘తమిళంలో ‘ఇమ్మైక్కా నొడిగల్’ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెండేళ్లు పట్టింది. సినిమా సక్సెస్ అయ్యాక ఆ కష్టాన్ని మర్చిపోయాం. తెలుగులోనూ అదే రేంజ్ సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు. నయనతార లీడ్ రోల్లో రాశీఖన్నా, విజయ్‌సేతుపతి ముఖ్య పాత్రల్లో దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన తమిళ చిత్రం ‘ఇమ్మైక్కా నొడిగల్’. ‘అంజలి సీబీఐ’ టైటిల్‌తో సి.హెచ్. రాంబాబు, ఆచంట గోపీనాథ్ ఈ నెల 22న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్ర ఆడియో లాంచ్ జరిగింది. మిలింద్ రావ్ సీడీ విడుదల చేసి తుమ్మల ప్రసన్నకుమార్‌కు అందించారు. ‘‘ఇమ్మైకా నొడిగల్’ చూడగానే నచ్చి, ఫ్యాన్సీ రేట్‌తో హక్కులను తీసుకున్నాం’’ అన్నారు సిహెచ్ రాంబాబు. ‘‘రజనీకాంత్ కెరీర్లో ‘బాషా’ చిత్రంలా నయనతారకు ‘అంజలి సీబీఐ’ అలా నిలిచిపోతుంది. ప్రతి సీన్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. టికెట్ కొని సినిమాకు వచ్చే ప్రేక్షకుడి డబ్బులు వృథా కావు. సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఇకపై వరుసగా సినిమాలు చేస్తాం’’ అన్నారు ఆచంట గోపీనాథ్. అమ్మిరాజు, శ్రీరామకృష్ణ పాల్గొన్నారు. ∙అమ్మిరాజు, గోపీనాథ్, ప్రసన్న కుమార్, అజయ్ జ్ఞానముత్తు -
జోడీ రిపీట్?
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జోడీ కట్టే హీరోయిన్ ఎవరో తెలిసిపోయిందోచ్ అంటున్నాయి చెన్నై కోడంబాక్కం వర్గాలు. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొన్ని రోజులుగా పలువురి పేర్లను పరిశీలించింది చిత్రబృందం. ఇటీవల కీర్తీ సురేష్, కాజల్ అగర్వాల్ పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా నయనతార పేరు వినిపిస్తోంది. ఆల్రెడీ నయనతారకు కథ వినిపించారట మురుగదాస్. కథానాయిక నయనే అని కోలీవుడ్ అంటోంది. నయనతార ఈ చిత్రానికి ఊ కొడితే ‘చంద్రముఖి’ చిత్రం తర్వాత రజనీకాంత్, నయనతార జోడీగా మళ్లీ వెండితెరపై కనిపిస్తారు. అంటే.. 14 ఏళ్ల తర్వాత జంటగా నటించనున్నారన్న మాట. రజనీ ‘శివాజీ’లో ఓ స్పెషల్ సాంగ్, ‘కథానాయకుడు’లో ఓ స్పెషల్ సాంగ్ చేశారు నయనతార. రజనీ తాజా చిత్రం షూటింగ్ మార్చిలో ఆరంభం కానుంది. రజనీ, నయన జోడీ రిపీట్ అవుతుందో లేదో వచ్చే నెలలో తెలిసిపోతుంది. -
ఫియాన్సీ కాస్తా ప్రొడ్యూసర్ ఆయెనే!
నయనతార, విఘ్నేశ్ శివన్ లవ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే. ప్రేమను అధికారికంగా ప్రకటించకపోయినా పండగలు చేసుకోవడాలు, కలిసి టూర్‌కి వెళ్లడాలతో వ్యక్తపరుస్తుంటారు. ఓ అవార్డ్ ఫంక్షన్లో విఘ్నేశ్‌ను నయనతార ఫియాన్సీ (కాబోయే భర్త) అని సంబోధించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఫియాన్సీ ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా మారబోతున్నారట. ఇటీవల దర్శకుల్లో ఎక్కువ శాతం మంది నిర్మాణంలో భాగం అవ్వాలనుకుంటున్నారు. తాజాగా విఘ్నేశ్ కూడా ఓ సినిమా నిర్మించాలనుకుంటున్నారట. నయనతార ప్రధాన పాత్రలో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. సిద్ధార్థ్, ఆండ్రియా హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘అవళ్’ (తెలుగులో గృహం) దర్శకుడు మిలింద్ రాజు ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించనున్నారు. శివ కార్తికేయన్‌తో చేస్తున్న ‘మిస్టర్ లోకల్’ షూటింగ్ పూర్తి చేశాక విజయ్ సరసన కమిట్ అయిన కొత్త షూటింగ్లో జాయిన్ అవ్వనున్నారు నయనతార. ఆ తర్వాత తన ఫియాన్సీ నిర్మించనున్న సినిమాను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. -
అంజలి.. చాలా పవర్ఫుల్
నయనతార లీడ్ రోల్లో తెరకెక్కిన చిత్రం ‘ఇమైక్క నొడిగల్’. అథర్వ, రాశీఖన్నా కీలక పాత్రల్లో నటించగా, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా నటించారు. నయనతార భర్త విక్రమాదిత్యగా అతిథి పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. ఆర్. అజయ్‌జ్ఞానముత్తు దర్శకత్వంలో క్యామియో ఫిల్మ్స్ పతాకంపై సీజే జయకుమార్ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది తమిళంలో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని విశ్వశాంతి క్రియేషన్స్ బ్యానర్‌పై సీహెచ్ రాంబాబు, ఆచంట గోపీనాథ్‌లు ‘అంజలి సీబీఐ ఆఫీసర్’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. పవర్ఫుల్ సీబీఐ ఆఫీసర్‌గా నయనతార టైటిల్ రోల్లో చాలా బాగా నటించారు. ప్రస్తుతం అనువాదకార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 22న ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. రమేష్ తిలక్, దేవన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, కెమెరా: ఆర్.డి. రాజశేఖర్. -
‘సైరా’లో అనుష్క స్పెషల్ అపియరెన్స్
2006లో చిరంజీవి ‘స్టాలిన్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు అనుష్క. మళ్లీ పదమూడేళ్ల తర్వాత అలాంటి స్పెషల్ అపియరెన్సే ‘సైరా’ సినిమాలో ఇవ్వబోతున్నారట. అయితే అప్పుడు పాటకు మాత్రమే పరిమితమైతే ఇప్పుడు సీన్స్‌లో కూడా కనిపిస్తారట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘సైరా : నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర సమరయోధుడు నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోంది. రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, తమన్నా హీరోయిన్లు. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్‌సేతుపతి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. లేటెస్ట్గా ఈ సినిమాలోకి అనుష్క కూడా జాయిన్ అవ్వనున్నారట. ఓ స్పెషల్ రోల్లో కొన్ని నిమిషాల పాటు ఈ సినిమాలో కనిపించనున్నారట అనుష్క. ప్రస్తుతం పాండిచ్చేరీ దగ్గర షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరాకు రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: రత్నవేలు. -
లవ్ ఇన్ లాస్ ఏంజిల్స్
తీరక లేకుండా పని చెయ్.. ఆ తర్వాత తీరిగ్గా ప్రేమించెయ్ అనే పాలసీని ఫాలో అవుతుంటారు కోలీవుడ్ లవ్ కపుల్స్ విఘ్నేష్ శివన్, నయనతార. షూటింగ్స్‌తో నయనతార, కథలు తయారు చేస్తూ. డైరెక్షన్ చేస్తూ విఘ్నేష్ బిజీబిజీగా గడుపుతారు. ఏ కొంచెం విరామం దొరికినా సరే విదేశాలకు వెళ్లిపోతుంటారు. ప్రేమ యాత్రలకు లాస్ ఏంజిల్స్, లండన్లు నందనవనమూ ఆయనే అంటూ పాడుకుంటుందీ జంట. తాజాగా లాస్ ఏంజిల్స్ వెళ్లారు. ఏ ట్రిప్‌కు వెళ్లినా ఈ ఇద్దరూ దిగిన ఫొటోలను అభిమానుల కోసం విఘ్నేష్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. న్యూ ఇయర్‌ను కూడా ఈ జంట లాస్ ఏంజల్స్లోనే సెలబ్రేట్ చేసుకున్నారనే సంగతి తెలిసిందే. ఇలా కలసి హాలిడేయింగ్ చేసుకుంటూ, లవ్వింగ్ చేసుకుంటున్నా ‘మేం రిలేషన్’లో ఉన్నాం అని మాత్రం బాహాటంగా ఎప్పుడూ అంగీకరించలేదు. చెప్పినా చెప్పకపోయినా పెళ్లి ఎప్పుడో చెప్పండి అని తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ప్రతీకారం తీరిందా?
మోహన్‌లాల్, నయనతార, ముఖేష్ ముఖ్య తారలుగా రూపొందిన మలయాళ చిత్రం ‘విస్మయతుంబతు’. నాగార్జునతో ‘కిల్లర్’ మూవీ తెరకెక్కించిన ఫాజిల్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాని ఓం శ్రీ నమో లలితాంబ క్రియేషన్స్‌పై కె.కస్తూరి (లవ్లీ), సి.హెచ్. సరోజ గంగారామ్ తెలుగులో ‘మహాతంత్రం’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ‘‘మనుషుల్లో ఉన్న రాక్షసత్వాన్ని పోగొట్టడానికి, తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి, ప్రియురాలిని కాపాడటం కోసం ఓ వ్యక్తి ఎలాంటి తంత్రం ఉపయోగించాడన్న కథతో తెరకెక్కిన చిత్రమిది. మలయాళంలో సూపర్ హిట్ అయినట్లుగానే తెలుగులోనూ మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఫిబ్రవరిలో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి నిర్వహణ: కె.ఐశ్వర్య, చిరంజీవి, సమర్పణ: వర్మ.