
మమత మోహన్ దాస్ టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. యమదొంగ సినిమాలో నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినప్పటికీ అప్పుడడప్పుడు వార్తల్లో నిలుస్తోంది. గతంలో క్యాన్సర్ బారిన పడిన కోలుకున్న మమత.. ఇటీవలే బొల్లి వ్యాధి సోకినట్లు సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మమత మోహన్ దాస్ సంచలన కామెంట్స్ చేసింది. లేడీ సూపర్ స్టార్‌గా పేరున్న నయనతారపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నయన్ చేసిన పనికి తాను చాలా బాధ పడ్డానని తెలిపింది. మరో హీరోయిన్ సెట్‌లో ఉంటే తాను షూట్‌కు రానని నయన్ చెప్పినట్లు తెలిసిందని మమత పేర్కొంది. ఆ సినిమా కోసం తాను నాలుగు రోజులు వృథా చేసుకున్నట్లు చెప్పారు.
మమత మాట్లాడుతూ..' ఒకసారి రజినీకాంత్ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. అందులో ఓ పాట కోసం చిత్రబృందం నన్ను సంప్రదింది. ఆ సాంగ్ నాలుగు రోజులు షూట్ చేశాం. షూట్ చేస్తున్నప్పుడే ఆ ఫ్రేమ్‌లో నేను లేనని నాకర్థమైంది. తీరా ఫైనల్ కాపీ బయటకు వచ్చేసరికి నా షాట్స్ లేవు. కేవలం ఒకే ఒక్క షాట్‌లో నేను కనిపించా. నాకు చెప్పినవిధంగా ఆ పాటను చిత్రీకరించలేదు. అయితే ఆ చిత్రంలో హీరోయిన్ వల్లే అలా జరిగిందని నాకు తర్వాత తెలిసింది. ఆ పాటలో మరో హీరోయిన్ ఉందని తనకు చెప్పలేదంటూ.. షూట్‌కు రానని ఆమె చెప్పిందట నయనతార. అందుకే నా పార్ట్‌ను చిత్రీకరించలేదు. ఆ సినిమా కోసం 4 రోజులు వృథా కావడంతో చాలా బాధ అనిపించింది.' అని అన్నారు.
కాగా.. రజనీకాంత్ - నయనతార జంటగా ‘కథానాయకుడు’లో నటించారు. 2008లో విడుదలైన ఈ సినిమాలో మమతా మోహన్‌దాస్ అతిథి పాత్రలో మెరిసింది. ఈ చిత్రంలోని దేవుడే స్వర్గం నుంచి అనే పాటలో కనిపించింది. తాజాగా మమత మోహన్ దాస్ కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె నయనతారను ఉద్దేశించే కామెంట్స్ చేశారని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment