Mamta Mohandas
-
రజనీకాంత్ సినిమాలో అనవసరంగా నటించా: హీరోయిన్
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించడానికి చాలా మంది నటులు ఆసక్తి చూపిస్తుంటారు. ఆయన సినిమాలో చిన్న పాత్ర అయినా సరే చేస్తామని చాలామంది హీరోయిన్లు ఎదురుచూస్తున్నారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం రజనీ సినిమాలో అనవసరంగా నటించానని బాధపడుతోంది. ఆమే మమతా మోహన్‌దాస్.యమగొంగ సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరైంది ఈ మలయాళ భామ. ఆ సినిమా తర్వాత ఒకటి రెండు తెలుగు సినిమాల్లో నటిస్తూనే..మరోవైపు సింగర్‌గాను ఆకట్టుకుంది. క్యాన్సర్ బారిన పడడంతో కొన్నాళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉంది. చాలా కాలం తర్వాత ‘మహారాజా’తో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల విడుదలైన ఈ తమిళ్ చిత్రం..తెలుగులోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న మమతా.. తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది.రజనీకాంత్ హీరోగా నటించిన కుసేలన్(తెలుగులో కథానాయకుడు)లో మమతా ఓ సాంగ్‌లో నటించింది. ఈ పాట కోసం రెండు రోజుల పాటు షూటింగ్‌కి వెళ్లిందట. అయితే ఈ సినిమా ఎడిటింగ్‌లో ఆమె పార్ట్ మొత్తం డిలీట్ చేసి.. కేవలం ఒక సెకను మాత్రం తెరపై చూపించారట. రిలీజ్ తర్వాత ఆ పాటను చూసి తెగ ఫీలయిందట. అనవసరంగా రజనీకాంత్ సినిమాలో నటించానని బాధపడిందట. ప్రస్తుతం మమతా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నయన్ వల్లేనా?రజనీకాంత్ కుసేలన్(2008)లో నయనతార హీరోయిన్గా నటించింది. మమతా స్పెషల్ సాంగ్ చేస్తుందని ముందుగా నయన్‌కు తెలియదట. విషయం తెలిసిన తర్వాత ఆ పాట షూటింగ్‌కి తాను రాలేనని నయన్ చెప్పేసిందట. వేరే హీరోయిన్ నటిస్తుందని ముందే ఎందుకు చెప్పలేదని డైరెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం..మమతా పార్ట్‌ని కట్ని చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో కూడా మమతా ఇదే విషయాన్ని చెప్పింది. -
స్టార్ హీరోతో మమతా మోహన్ దాస్.. డేటింగ్‌పై ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్లో యమదొంగ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ మమతా మోహన్‌దాస్. మలయాళంతో పాటు తెలుగులోనూ నటించింది. వెంకటేశ్ సరసన చింతకాయల రవి చిత్రంలోనూ మెరిసింది. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడిన మమతా సినిమాలకు దూరమైంది. చాలా ఏళ్లపాటు క్యాన్సర్‌తో పోరాడి కోలుకుంది. గతేడాది రుద్రంగి సినిమాతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం కోలీవుడ్‌లో మహారాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వూలో ఆమె మాట్లాడారు. తన వ్యక్తిగత జీవితంపై గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెను తన పెళ్లి గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందించారు.మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ.. "నాకు మలయాళ చిత్ర పరిశ్రమలో వచ్చిన గుర్తింపుతో చాలా సంతోషంగా ఉన్నా. తాను నటించిన చిత్రాలకు ప్రశంసలు కూడా దక్కాయి. అందువల్లే తమిళం, తెలుగు సినిమాలు చేసే అవకాశం వచ్చింది. మలయాళ ప్రేక్షకులు నాకు అండగా ఉన్నారు. బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి, గౌరీ ఖాన్ నాపై ప్రశంసలు కురిపించారు.' అని అన్నారు.డేటింగ్ గురించి మాట్లాడుతూ..'గతంలో లాస్ఎంజిల్స్లో ఉన్నప్పుడు ఒకరితో డేటింగ్లో ఉన్నా. కానీ ఆ రిలేషన్ ఎక్కువకాలం నిలవలేదు. లైఫ్‌లో రిలేషన్ అనేది ఉండాలి. కానీ దానివల్ల వచ్చే ఒత్తిడిని నేను కోరుకోవడం లేదు. అయితే జీవితంలో రిలేషన్ అనేది కచ్చితంగా అవసరమని నేను అనుకోవడం లేదు. ఎవరితోనైనా డేటింగ్లో ఉన్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నా. నా లైఫ్ భవిష్యత్తులో ఎలా ఉండనుందో చూద్దాం. ప్రస్తుతం అయితే పార్ట్నర్ కోసం వెతుకుతున్నా. కాలంతో పాటే అన్ని విషయాలు ఎప్పుడో ఒకసారి బయటపడాల్సిందే' అని అన్నారు. మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా.. ప్రస్తుతం మమతా నటించిన మహారాజా చిత్రంలో అనురాగ్ కశ్యప్, నట్టి నటరాజ్ కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జూన్ 14న థియేటర్లలో విడుదల కానుంది. -
కొత్త స్పోర్ట్స్ కారు కొన్న యమదొంగ నటి, ఖరీదు లక్షల్లో కాదు!
మమతా మోహన్‌దాస్.. ఈమె పేరు చెప్పగానే చాలామందికి యమదొంగ సినిమా టక్కున గుర్తొస్తుంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్‌ను ముప్పుతిప్పలు పెట్టే ధనలక్ష్మిగా అందరినీ నవ్విస్తుంది. తర్వాత.. కృష్ణార్జున, విక్టరీ, చింతకాయల రవి, కింగ్, కేడి ఇలా అనేక సినిమాలు చేసింది. కానీ మమతా మోహన్‌కు యమదొంగతో వచ్చినంత క్రేజ్ మరే చిత్రానికీ రాలేదు. అటు తమిళ, కన్నడ భాషల్లో యాక్ట్ చేసినా ఎక్కువగా మలయాళంలోనే గుర్తింపు తెచ్చుకుంది. అక్కడే ఎక్కువ సినిమాలు చేసింది. నటి, సింగర్.. ఆ మధ్య ఈ హీరోయిన్ క్యాన్సర్ బారిన పడింది. అయితే ధైర్యంగా పోరాడి ఆ ప్రాణాంతక వ్యాధినే జయించింది. తిరిగి మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఈమె గాయకురాలు కూడా! 'రాఖీ రాఖీ రాఖీ.. నా కవ్వసాఖీ', 'ఆకలేస్తే అన్నం పెడతా..' ఇలా అనేక పాటలు పాడింది. కొత్త కారు తాజాగా ఈ బ్యూటీ కొత్త కారు కొనుగోలు చేసింది. బీఎమ్‌డబ్ల్యూ Z4 M40i స్పోర్ట్స్ కారు ఇంటికి తెచ్చేసుకుంది. దీని ధర దాదాపు కోటి రూపాయలు ఉండవచ్చని తెలుస్తోంది. కొత్త కారు వీడియోను మమతా మోహన్‌దాస్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఇకపోతే పదేళ్లకు పైగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మమతా మోహన్‌దాస్ ఇటీవలే రుద్రంగి చిత్రంతో ఇక్కడ రీఎంట్రీ ఇచ్చింది. View this post on Instagram A post shared by BMW EVM Autokraft (@bmwevmautokraft) చదవండి: ఓటీటీకి వచ్చేసిన ఆ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
మమతా మోహన్‌దాస్‌పై తప్పుడు కథనం.. ఫైర్ అయిన నటి
సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిన తరువాత అవాస్తవాలు, దుష్ప్రచారాలు అధికం అవుతున్నాయి. ఇలాంటి ఆకృత్యాలు చాలా మందిని మనస్తాపానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలను టార్గెట్‌గా కొందరు కావాలనే దుష్ప్రచారాలు చేస్తున్నారు. సమీపకాలంలో నటి రష్మికపై సభ్యసమాజం సిగ్గు పడేలా అసభ్యకర చర్యలకు పాల్పడ్డారు. ఇక నటి మమతా మోహన్ దాస్ పరిస్థితి వేరేలా ఉంది. పలు చిత్రాల్లో కథానాయకిగా నటించిన ఈ మలయాళ భామలో మంచి గాయని కూడా. శివన్ చిత్రం ద్వారా విశాల్‌కు జంటగా కోలీవుడ్‌లో మొదట ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలకు పాటలు పాడిన ఈ బ్యూటీ యమదొంగ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన నటించి మెప్పించింది అలా తెలుగు, కన్నడం తదితర భాషల్లోనూ నటించి పాపులర్ అయింది. అలాంటి మమతా మోహన్ దాస్ అనూహ్యంగా క్యాన్సర్ వ్యాధికి గురై ఆ మహమ్మారితో పోరాడి గెలిచిన మమతా మోహన్ దాస్ మళ్లీ నటనపై దృష్టి సారించారు. ప్రస్తుతం మలయాళం, తమిళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా గీతం నాయర్ అనే మహిళ ఒక కథనాన్ని రాసి ఇన్ స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. 'ఇక బతకలేను, చావుకు లొంగిపోతున్నాను, నటి మమతా మోహన్‌దాస్‌ది ఇదే దుర్భర జీవితం' అనే టైటిల్‌తో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ వార్త గీతు నాయర్ యొక్క నకిలీ ప్రొఫైల్ ద్వారా షేర్ చేయబడింది. ఇందులో నటి మమతా మోహన్ దాస్‌ను కించపరిచే విధంగా పేర్కొంది. అది ఒక్కసారిగా కోలీవుడ్‌తో పాటు మలయాళ పరిశ్రమలో భారీగా వైరల్ అయింది. దీనిపై మమతా మోహన్ దాస్ ఘాటుగా స్పందించింది. ప్రచారం కోసమే, ఇతరుల దృష్టిని తనపై రుద్దాలనే అసత్యాలు రాయడం సరికాదన్నారు. అసలు నువ్వు ఎవరు? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీ పేజీపై అందరి దృష్టిని ఆకర్షించడానికి నేను ఏదైనా చెప్పాలా? ఇలాంటి నకిలీ పేజీలను అనుసరించకుండా జాగ్రత్త వహించండి. ఇలాంటి వారిని ఎవరూ ఎంకరేజ్ చేయరాదని మమతా మోహన్ దాస్ పేర్కొన్నారు. -
ఆ సమయంలో ఉన్న ఊరినే వదిలేసి వెళ్లా: యమదొంగ హీరోయిన్
జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ నటి మమతా మోహన్‌దాస్. ఇటీవలే చాలా రోజుల తర్వాత మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. జగపతిబాబు నటించిన రుద్రంగి సినిమాతో టాలీవుడ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. 2005లోనే మయూకం మలయాళ మూవీతో తెరంగేట్రం చేసిన ఈ మలయాళీ భామ ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో సత్తాచాటారు. (ఇది చదవండి: మరోసారి ఇలాంటి పని చేస్తే చెంప పగలగొడతా.. నటుడికి వార్నింగ్ ఇచ్చిన యాంకర్) దాదాపు 18 ఏళ్ల పాటు కథానాయకిగా కొనసాగుతున్న ఈ బహుభాషా నటి తన సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. ఆమె క్యాన్సర్ బారిన పడి.. ఆ మహమ్మారిని జయించడంతో పాటు మళ్లీ నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే క్యాన్సర్ వ్యాధిని జయించడం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ సమయంలో అవగాహన ఉండటం చాలా ముఖ్యమని తెలిపారు. ఆ వ్యాధిపై అవగాహన ఉంటే దాని నుంచి బయటపడడం సాధ్యమేనని మమతా మోహన్‌దాస్ పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సానుభూతి చాలా లభిస్తుందన్నారు. కానీ సానుభూతి ఆశిస్తే కలిగే నష్టాలే ఎక్కువ అన్నారు. అలాంటి సానుభూతి తనకు అక్కరలేదని తెలిపారు. ఆ సమయంలో తాను ఉన్న ఊరిని వదిలేశానని, సినిమాలను కూడా పక్కన పెట్టానని చెప్పుకొచ్చింది. ఆసుపత్రిలోనే ఉండే చికిత్స పొందినట్లు తెలిపారు. (ఇది చదవండి: నమ్రతా బాటలోనే మహేశ్ బాబు హీరోయిన్.. ఏంటా నిర్ణయం!) ఆ సమయంలో తాను కేవలం తల్లిదండ్రుల ఆదరాభిమానాలను మాత్రమే ఆశించానని చెప్పారు. క్యాన్సర్ వ్యాధిని జయించే వరకు కేరళ దరిదాపుల్లోకి కూడా రాలేదన్నారు. అయితే ఈ వ్యాధి నుంచి బయటపడ్డ అంతకుముందు రూపం మళ్లీ రాదని.. ఈ విషయాన్ని గ్రహించాలని మమతా చెప్పారు. కాగా ప్రస్తుతం మమతా మోహన్‌దాస్ మలయాళంలో మూడు చిత్రాలు.. తమిళంలో విజయ్ సేతుపతికి జంటగా మహరాజా చిత్రంతో పాటు ఊమై విళిగల్ అనే మరో సినిమాలో నటిస్తున్నారు. -
మహారాజా రెడీ
విజయ్ సేతుపతి కెరీర్లో 50వ మైలురాయిగా తెరకెక్కిన చిత్రం ‘మహారాజా’. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నట్టి నటరాజ్ కీలక పాత్రలు పోషించారు. ప్యాషన్ స్టూడియోస్ సుధన్ సుందరం, ది రూట్–థింక్ స్టూడియోస్ జగదీష్ పళనిసామి సమర్పణలో రూపొందిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
విజయ్ సేతుపతి 50వ సినిమా, హీరోయిన్ ఎవరంటే?
బహుభాషా నటుడు విజయ్ సేతుపతి ఇప్పుడు అర్ధ సెంచరీని టచ్ చేశారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ అంటూ అన్ని భాషల్లో నటిస్తూ ఇండియన్ సినీ నటుడిగా పేరు గడించిన విజయ్‌సేతుపతి తాజాగా నటిస్తున్న చిత్రానికి మహరాజా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీన్ని ఫ్యాషన్ స్టూడియోస్, సుదన్ సుందరం సంస్థలు నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియన్ చిత్రంగా రూపొందుతున్న ఇందులో బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్, నటి మమతా మోహన్‌దాస్, నట్టి నటరాజ్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. కాగా నటి మమతామోహన్‌దాస్ చాలా గ్యాప్ తరువాత తమిళంలో నటిస్తున్న చిత్రం ఇది. దీనికి అజినీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని, ధినేశ్ పురుషోత్తమన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని నిర్మాతలు తెలిపారు. చిత్ర ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు వారు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. విజయ్‌సేతుపతి నటిస్తున్న 50వ చిత్రం కావడంతో మహారాజాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. View this post on Instagram A post shared by Vijay Sethupathi (@actorvijaysethupathi) చదవండి: ఎక్కువమంది చూసిన ఆల్‌టైం బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ఏదో తెలుసా? -
'యమదొంగ తర్వాత ఆమెకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదన్నారు'
'యమదొంగ’ సినిమాలో మమతా మోహన్ దాస్‌గారి నటనంటే నాకు ఇష్టం. ఆమె క్యాన్సర్ నుంచి కోలుకోవడంతో ‘రుద్రంగి’లో నటించమని కోరాను. ‘పదేళ్ల నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు.. నన్ను సంప్రదించినందుకు థ్యాంక్స్’ అన్నారామె' అని డైరెక్టర్ అజయ్ సామ్రాట్ అన్నారు. జగపతిబాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్, గానవి లక్ష్మణ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో అజయ్ సామ్రాట్ మాట్లాడుతూ– 'బాహుబలి, రాజన్న’ సినిమాలకు డైలాగ్ రైటర్‌గా చేశాను. ఇక నా బాల్యంలో విన్న కథలు, చూసిన పరిస్థితులు, చదివిన చరిత్ర నుంచి ‘రుద్రంగి’ కథ రాసుకున్నాను. తెలంగాణలో దొరల అణ చివేతల మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ‘రుద్రంగి’ని పూర్తి భిన్నంగా ఫ్యామిలీ ఎమోషనల్, సోషల్ డ్రామాగా తీశాను. రసమయిగారికి సినిమా తీయాలనే తపన ఎక్కువగా ఉంది.. నిర్మాతగా ఆయన ఏం చేయగలడో అన్నీ చేశారు. సినిమా బాగుంటే జనాలు చూస్తారు. ‘కాంతారా’కి ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు. కానీ, జనాలు విపరీతంగా చూశారు. మా ‘రుద్రంగి’ కూడా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
నయన తార వల్ల నా టైం వేస్ట్: మమత మోహన్ దాస్
మమత మోహన్ దాస్ టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. యమదొంగ సినిమాలో నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినప్పటికీ అప్పుడడప్పుడు వార్తల్లో నిలుస్తోంది. గతంలో క్యాన్సర్ బారిన పడిన కోలుకున్న మమత.. ఇటీవలే బొల్లి వ్యాధి సోకినట్లు సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మమత మోహన్ దాస్ సంచలన కామెంట్స్ చేసింది. లేడీ సూపర్ స్టార్‌గా పేరున్న నయనతారపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నయన్ చేసిన పనికి తాను చాలా బాధ పడ్డానని తెలిపింది. మరో హీరోయిన్ సెట్లో ఉంటే తాను షూట్‌కు రానని నయన్ చెప్పినట్లు తెలిసిందని మమత పేర్కొంది. ఆ సినిమా కోసం తాను నాలుగు రోజులు వృథా చేసుకున్నట్లు చెప్పారు. మమత మాట్లాడుతూ..' ఒకసారి రజినీకాంత్ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. అందులో ఓ పాట కోసం చిత్రబృందం నన్ను సంప్రదింది. ఆ సాంగ్ నాలుగు రోజులు షూట్ చేశాం. షూట్ చేస్తున్నప్పుడే ఆ ఫ్రేమ్‌లో నేను లేనని నాకర్థమైంది. తీరా ఫైనల్ కాపీ బయటకు వచ్చేసరికి నా షాట్స్ లేవు. కేవలం ఒకే ఒక్క షాట్లో నేను కనిపించా. నాకు చెప్పినవిధంగా ఆ పాటను చిత్రీకరించలేదు. అయితే ఆ చిత్రంలో హీరోయిన్ వల్లే అలా జరిగిందని నాకు తర్వాత తెలిసింది. ఆ పాటలో మరో హీరోయిన్ ఉందని తనకు చెప్పలేదంటూ.. షూట్‌కు రానని ఆమె చెప్పిందట నయనతార. అందుకే నా పార్ట్‌ను చిత్రీకరించలేదు. ఆ సినిమా కోసం 4 రోజులు వృథా కావడంతో చాలా బాధ అనిపించింది.' అని అన్నారు. కాగా.. రజనీకాంత్ - నయనతార జంటగా ‘కథానాయకుడు’లో నటించారు. 2008లో విడుదలైన ఈ సినిమాలో మమతా మోహన్‌దాస్ అతిథి పాత్రలో మెరిసింది. ఈ చిత్రంలోని దేవుడే స్వర్గం నుంచి అనే పాటలో కనిపించింది. తాజాగా మమత మోహన్ దాస్ కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె నయనతారను ఉద్దేశించే కామెంట్స్ చేశారని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. -
రాజమౌళి అలా అనడంతో నా గుండె పగిలింది: హీరోయిన్
తెలుగులో తొలి చిత్రం 'యమదొంగ'తో బాగా పాపులర్ అయిన హీరోయిన్ మమతా మోహన్‌దాస్ 2010, 13లో రెండు సార్లు క్యాన్సర్ బారిన పడింది. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకుని కోలుకుంది. ఇటీవలే చర్మం రంగు మారడం అనే విటిలిగో వ్యాధి బారిన పడగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఓపక్క అనారోగ్యంతో పోరాడుతూనే మరోపక్క సినిమాలు చేస్తూ కెరీర్ బ్యాలెన్స్ చేసుకుంటోంది. కాగా గతంలో మమత సూపర్ హిట్ మూవీ 'అరుంధతి'ని చేజార్చుకున్న విషయం తెలిసిందే! తాజాగా తాను చేసిన పొరపాటు గురించి ఓ ఇంటర్వ్యూలో మరోసారి మాట్లాడిందీ నటి. 'రాజమౌళి సర్ నాకు ఫోన్ చేసి యమదొంగ చేయమని అడిగారు. దానికంటే ముందే శ్యామ్ ప్రసాద్ అరుంధతి ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాకు సంతకం చేశాను. కానీ ఆ ప్రొడక్షన్ మంచిది కాదని మేనేజర్ చెప్పారు. నాకు తెలుగు ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదు కాబట్టి వెనకడుగు వేశాను. శ్యామ్ ప్రసాద్ గారు రెండు, మూడు నెలలపాటు అడిగారు.. కానీ నేను మాత్రం కుదరదన్నాను. దీని గురించి రాజమౌళి సర్ మాట్లాడుతూ.. అరుంధతి సినిమా నువ్వు చేయాల్సింది. వదిలేసి చాలా పెద్ద తప్పు చేశావన్నారు. ఆయన అలా అనడంతో నా గుండె పగిలిపోయినట్లయింది. అప్పటికి ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు' అని చెప్పుకొచ్చింది మమతా మోహన్‌దాస్. చదవండి: మరణానికి ముందు శ్రీదేవి ఎలా ఉందంటే? చివరి ఫోటో వైరల్ -
ఒంటిరితనాన్ని భరించలేకపోయాను.. చనిపోతాననుకున్నా : హీరోయిన్
యమదొంగ సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ తర్వాత హోమం, కృష్ణార్జున , కింగ్, చింతకాయల రవి వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడింది. ఒక్కసారి కాదు రెండుసార్లు క్యాన్సర్ బారిన పడి పోరాడి గెలిచింది. ఆరోగ్యం పూర్తిగా కోలుకొని తిరిగి సినిమాల్లో నటిస్తున్న సమయంలో ‘విటిలిగో’ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. ప్రస్తుతం దాన్నుంచి కోలుకుంటుంది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను అనుభవించిన మానసిక క్షోభను బయటపెట్టింది. నాకు క్యాన్సర్ సోకినప్పుడు నా ఫ్రెండ్స్, సన్నిహితులతో సమస్య గురించి చెప్పుకున్నాను. వారు చాలా ధైర్యం ఇచ్చారు. కానీ నాకు 'విటిలిగో' అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడ్డానని తెలియగానే ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని. ఎప్పుడూ కెమెరా ముందు ఉండే నేను ఇంటరితనాన్ని భరించలేకపోయాను. చనిపోతానేమో అని భయమేసింది. అందుకే ఈ సమస్యను అందరికీ తెలిసేలా చేశాను. దీంతో కాస్త రిలీఫ్ అనిపించింది. ఎవరైనా నా శరీరంపై ఆ మచ్చలేంటని అడిగితే నా ఇన్‌స్టా చూడమని నిర్మొహమాటంగా చెబుతున్నా అంటూ చెప్పుకొచ్చింది. -
‘విటిలిగో’ వ్యాధితో బాధపడుతున్న మమతా మోహన్‌దాస్..లక్షణాలు ఇవే!
తెరపై అందంగా కనిపించి అందరిని అలరించే హీరోయిన్లు.. తెరవెనుక ఎన్నో సమస్యలతో బాధపడుతుంటారు. కొందరికి ఆర్థిక, మానసిక సమస్యలు అయితే మరికొందరికి అనారోగ్య ఇబ్బందులు. అయినా కూడా వినోదాన్ని అందించడంలో మాత్రం వారు వెనుకడుగు వేయడం లేదు. అరుదైన రోగాలను సైతం ధైర్యంగా ఎదుర్కొని చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రెండు సార్లు(2010, 2013) కేన్సర్ బారిన.. ధైర్యంగా,ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకొని కోలుకున్న మమతా మోహన్‌దాస్.. తాజాగా మరో అరుదైన చర్మ వ్యాధి బారిన పడ్డారు. తాను ‘విటిలిగో(బొల్లి)’ వ్యాధి బారిన పడినట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? లక్షణాలు ఏంటో చూద్దాం. ‘విటిలిగో’ ఎందుకు వస్తుంది? చర్మం లోని మెలనిన్ కణాలు మృతి చెందడం వల్ల కాని, చర్మానికి హాని జరగడం వల్ల కాని ఈ వ్యాధి వస్తుంది. బొల్లి వల్ల చర్మం మీద తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. రంగు కాస్త తక్కువగా ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వారికి సోకే అవకాశం ఉంది. మానసిక కుంగుబాటు, రసాయన ప్రభావాలకు గురి కావడం, ఎండకు అధికంగా ఎక్స్ పోజ్ కావడం వల్ల కూడా బొల్లి వ్యాధి రావొచ్చు. ఇది ప్రమాదమేమీ కాదు. ప్రాణాపాయం కూడా కాదు. లక్షణాలు ఏంటి? ఈ వ్యాధి సోకిన వారి చేతులు, ముఖం, జననేంద్రియాల చుట్టూ తెల్లని పాచెస్ కనిపిస్తాయి. తల, వెంట్రుకలు, కనుబొమ్మలు, గడ్డం మీద జుట్టు తెల్లబడుతుంది. నోరు, ముక్కు లోపలి భాగంలో కణజాలాలలో రంగు మారుతంది. చికిత్స ఏంటి? ఈ వ్యాధికి శాశ్వత నివారణ లేదు. కానీ బొల్లి వ్యాప్తిని ఆపడానికి మాత్రం చికిత్స ఉంది. బొల్లి లక్షణాలను కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. తెల్లని మచ్చలు నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్న సమయంలోనే చికిత్స అందించాలి. యూవీ థెరపీ, స్టెరాయిడ్ క్రీమ్స్, ఫోటో కీమో థెరపీ ద్వారా తెల్లటి మచ్చలను తగ్గించొచ్చు. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే శాశ్వత నివారణ సాధ్యం కాకపోవచ్చు. గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్య నిపుణులు, పలు అధ్యాయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే సరైన నిర్ణయం. View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) -
అయ్యో పాపం.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు ఇంత దారుణ పరిస్థితేంటీ?
మమతా మోహన్ దాస్. ఈ పేరు మీకు గుర్తుందా? ఏంటీ అప్పుడే మర్చిపోయారా? మన యంగ్ టైగర్ సినిమాతో టాలీవుడ్లో ఏంట్రీ ఇచ్చింది. ఇంకా గుర్తుకు రాలేదా? రాదుగా మరీ.. ఎందుకంటే అలా వెండితెరపై మెరిసి.. ఇలా చటుక్కున్న మాయమైన హీరోయిన్లలో మమతా ఒకరు. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ యమదొంగతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళ కుట్టి పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నటించిన హోమం, కృష్ణార్జున సినిమాల్లోనూ పెద్దగా గుర్తింపు రాలేదు. మమతా మోహన్ దాస్‌ను దర్శకధీరుడు రాజమౌళి తెలుగు తెరకు పరిచయం చేశారు. మమతా మలయాళ చిత్రాలతో పాటు తమిళ, తెలుగు సినిమాల్లోనూ నటించింది. గతంలో క్యాన్సర్ బారిన పడిన నటి ఆ తర్వాత కోలుకుంది. మరో సారి లింఫోమా అనే వ్యాధితో పోరాడి కోలుకున్నారు. రెండు భయంకరమైన వ్యాధులను జయించిన నటికి తాజాగా మరో వ్యాధి సోకింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా వేదికగా మమతా మోహన్ దాస్ వెల్లడించింది. తాను ప్రస్తుతం బొల్లి వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. తనకు బొల్లి వ్యాధి సోకిందని.. ఇది తన చర్మం రంగును కోల్పోయేలా చేస్తోందని చెబుతోంది మలయాళ ముద్దుగుమ్మ. క్రానిక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఫోటోను షేర్ చేస్తూ పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్‌ను చూసిన స్నేహితులు, అభిమానులు స్పందించారు. నువ్వు ఒక ఫైటర్ అంటూ ధైర్యం చెబుతున్నారు. క్యాన్సర్ జయించినట్లే ఇప్పుడు కూడా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. మమతా మోహన్‌దాస్ చివరిసారిగా 2022 మలయాళ చిత్రం జన గణ మనలో కనిపించింది. View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) -
జ్వాలాబాయిగా మమతా మోహన్ దాస్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
ఎం.ఎల్.ఏ, రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో నిర్మిస్తున్న సినిమా 'రుద్రంగి'. రాజన్న, బాహుబలి, బాహుబలి2, ఆర్. ఆర్.ఆర్, అఖండ చిత్రాలకు రైటర్‌గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన ప్రీ- అనౌన్సెమెంట్ పోస్టర్, జగపతి బాబు లుక్ కు మంచి స్పందన వస్తోంది. ఆయన ఈ చిత్రంలో 'భీమ్ రావ్ దొర' గా కనిపించనున్నారు. ఇక తాజాగా 'రుద్రంగి' సినిమా నుంచి మమతా మోహన్ దాస్ నటిస్తున్న జ్వాలాబాయి దొరసాని పాత్రను ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు.ఈ మోషన్ పోస్టర్ లో జ్వాలాబాయి దొరసాని పాత్రలో మమతా మోహన్ దాస్ చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. 'నువ్వు దొర అయితే నేను దొరసానిని తగలబెడతా, ఛల్ హట్' అంటూ ఆమె చెప్పిన డైలాగ్స్ మాస్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి. జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, సదానందం తదితరులు కీలకపాత్రల్లో కనిపించన్నునారు. సంతోష్ శనమోని సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ మరియు నాఫల్ రాజా ఐఏఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారు. -
చివరిగా మమతా మోహన్ దాస్‌ను ఎంపిక చేశాం: డైరెక్టర్
Mamta Mohandas Plays As Kanmani In Thangar Bachan Film: భారతీరాజా, యోగిబాబు, గౌతం మీనన్ ప్రముఖ పాత్రలతో తంగర బచ్చాన్ దర్శకత్వం ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ నెల 25 నుంచి కుంభకోణంలో షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'కరుమేగంగల్ కలైకిండ్రన్' అనే టైటిల్‌ను నిర్ణయించారు. చెన్నై, రామేశ్వరం ప్రాంతాల్లో షూటింగ్‌ను నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇంతకు ముందు ఎప్పుడూ తెరపై చూడనటువంటి వైవిధ్యభరిత అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడా రాజీ పడకుండా సహజత్వానికి దగ్గరగా ఈ చిత్రం ఉంటుందన్నారు. కణ్మణి అనే పాత్ర కోసం ఇండియాలోని పలు నటీమణులతో ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించిన చివరికి నటి మమతా మోహన్‌దాస్‌ను ఎంపిక చేసినట్టు తెలిపారు. అలాగే ఈ చిత్రంలో నటించడం గర్వంగా ఉందని మమతా మోహన్‌దాస్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇందులో దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్, ఆర్వీ ఉదయ్‌కుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని శుక్రవారం (జులై 29) మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు వెల్లడించారు. -
వ్యవస్థల తీరుపై ప్రశ్నల వర్షం.. 'జన గణ మన' రివ్యూ
టైటిల్: జన గణ మన (2022) నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడ్, మమతామోహన్ దాస్, జీఎమ్ సుందర్ తదితరులు కథ: షరీస్ మహమ్మద్ దర్శకత్వం: డిజో జోస్ ఆంటోని సంగీతం: జేక్స్ బిజోయ్ నిర్మాతలు: పృథ్వీరాజ్ సుకుమారన్, లిస్టిన్ స్టీఫెన్ ఓటీటీ విడుదల తేది: జూన్ 2, 2022 (నెట్‌ఫ్లిక్స్) విభిన్నమైన కథా కథనాలతో ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది మలయాళ సినీ ఇండస్ట్రీ. అందులోనూ పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాల ఎంపికను మెచ్చుకోక తప్పదు. నటుడిగా అయ్యప్పనుమ్ కోషియుమ్, డైరెక్టర్‌గా లూసీఫర్ తదితర చిత్రాలతో అలరించిన ఆయన తాజాగా 'జన గణ మన' సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదలైనప్పటికీ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో సందడి చేస్తున్న ఈ సినిమా నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్న 'జన గణ మన' ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ సబా మరియం (మమతా మోహన్ దాస్)ను రేప్ చేసి శరీరాన్ని కాల్చి చంపేశారని మీడియాలో నేషనల్ హైడ్‌లైన్ అవుతుంది. తమ ప్రొఫెసర్‌కు న్యాయం చేయాలని నిరసనకు దిగుతారు ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్. దీంతో ఆ కేసును చేధించమని ఏసీపీ సజ్జన్ కుమార్ (సూరజ్ వెంజరమూడ్)ను ఆదేశిస్తుంది ప్రభుత్వం. మరీ రంగంలోకి దిగిన ఆ ఏసీపీ ఏం చేశాడు ? ఆమెను హత్య చేయడానికి కారణమేంటి ? కారకులెవరు ? వారిని ఏ విధంగా శిక్షించాలని సమాజం కోరుకుంది ? తర్వాత ఏసీపీ ఎదుర్కొన్న పరిణామాలేమిటి ? కోర్టులో లాయర్ అరవింద్ స్వామినాథన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) సంధించిన ప్రశ్నలు ఏంటి ? తదితర ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసుకోవాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: సత్యమేవ జయతే.. సత్యానికి అబద్ధం ఎన్నిసార్లు అడ్డుగా నిలుచున్నా, చివరిగా కటిక చీకట్లో ఉన్న సత్యం వెలుగులోకి రాక తప్పదు అని 'జన గణ మన' సినిమా ద్వారా తెలియజేశారు. ఇది పేరుకు సినిమా అయినా ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితులకు 2 గంటల 41 నిమిషాల నిదర్శనం. విద్య, న్యాయ, పోలీసు, మీడియా, రాజకీయ వ్యవస్థ ఇలా ప్రతీ అంశాన్ని తడిమారు. ఈ వ్యవస్థల ఉనికి, విశ్వసనీయతను సూటిగా ప్రశ్నించారు. సమాజంలో అవి ఎలాంటి పరిస్థితులో ఉన్నాయి, వర్ణ, కుల, మత, జాతి విబేధాలు ఏ స్థాయిలో ఉన్నాయో కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రభుత్వాలు తమ గెలుపు కోసం పరిస్థితులను ఎలా మార్చుకుంటాయి ? అందుకోసం ఏం చేస్తాయి? విద్యార్థులను ఏ విధంగా వాడుకుంటాయి? వంటి విషయాలను తెరపై చూపించి వాటన్నింటి గురించి ఆలోచింపజేసేలా సినిమా ఉంది. ఏది అబద్ధం, ఏది నిజం అనేది సమాజం ఎలా నిర్ణయిస్తుందో, ఏ దృక్కోణంతో ఆలోచిస్తుందో, ఎలా ప్రభావితమవుతుందో సమాజానికి చూపించారు. ఎవరెలా చేశారంటే ? సమాజంలో నెలకొన్న పరిస్థితులు, ప్రతి ఒక్క అంశాన్ని ధైర్యంగా చూపించిన డైరెక్టర్ డిజో జోస్ ఆంటోనికి, ఈ సినిమా నిర్మించిన పృథ్వీరాజ్ సుకుమారన్‌కు హాట్సాఫ్ చెప్పాల్సిందే. కథ అందించిన షరీస్ మహమ్మద్‌కు, జేక్స్ బిజోయ్ సంగీతానికి ప్రశంసలు దక్కాల్సిందే. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వాళ్ల నటనతో అదరగొట్టారు. ఫస్టాఫ్‌లో సూరజ్ తనవైపు దృష్టిని ఆకర్షిస్తే, సెకండాఫ్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రేక్షకులను నిజాలతో కట్టిపడేస్తాడు. ప్రొఫెసర్ సబా మరియంగా మమత మోహన్ దాస్ సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చింది. కోర్టు సీన్లో వచ్చే సన్నివేశాలు, సినిమాలోని డైలాగ్‌లు హైలెట్‌గా నిలిచాయి. చివరిగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా మాత్రమే కాదు, సమాజానికి ఓ కనువిప్పు ఈ 'జన గణ మన'. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
'అరుంధతి' ఛాన్స్ ముందు ఏ హీరోయిన్‌కు వచ్చిందంటే?
అనుష్కను స్టార్ హీరోయిన్గా నిలబెట్టిన చిత్రాల్లో అరుంధతి సినిమాది అగ్రస్థానం. అప్పటివరకు అందాల ప్రదర్శనకే ప్రాధాన్యమిచ్చిన ఈ హీరోయిన్ అరుంధతిలో నటవిశ్వరూపం చూపించింది. సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా ఆమె జీవితాన్నే మార్చేసింది. అరుంధతి అంటే అనుష్క.. అనుష్క అంటే అరుంధతి అని ప్రేక్షకుల మనసులో బలంగా ముద్రపడిపోయింది. టాప్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2009లో సంక్రాంతి కానుకగా జనవరి 16న విడుదలై సెన్సేషనల్ హిట్ అందుకుంది. మల్లెమాల ఎంంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్యామ్‌ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రిలీజై నేటికి పదమూడేళ్లు పూర్తైంది. నిజానికి ఈ సినిమా ఛాన్స్ మొదట అనుష్కకు రాలేదట! మలయాళ కుట్టి మమతా మోహన్‌దాస్‌ను అరుంధతి సినిమా కోసం సంప్రదించారట. కానీ అప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమెకు ఎలాంటి కథలు ఎంచుకోవాలో పెద్దగా తెలిసేది కాదని, దానివల్లే అరుంధతిని వదులుకున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అప్పటికే ఇతర ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉండటంతో విముఖత వ్యక్తం చేసిందట. ఈ ఆఫర్ వచ్చిన రెండు నెలలకే క్యాన్సర్ ఉన్నట్లు తేలడంతో అరుంధతి కంటే బతికి ఉంటే చాలన్న భావనతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నానని పేర్కొంది. అలా ఈ సినిమా అనుష్క దగ్గరకు రావడం, ఆమె ఓకే చెప్పేయడంతో చకచకా షూటింగ్ జరిపేశారు. సినిమా రిలీజయ్యాక జేజమ్మగా అనుష్కకు జనాలు నీరాజనాలు పట్టారు. -
ఖరీదైన కారు కొన్న హీరోయిన్.. ధర తెలిస్తే షాకే
Mamta Mohandas buys Porsche 911 Carrera Car: మలయాళీ ముద్దుగుమ్మ మమతా మోహన్ దాస్‌కు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. 'యమదొంగ' సినిమాతో తెలుగువారికి దగ్గరైన ఈ భామ కృష్ణార్జున,హోమం సినిమాలతో నటిగా గుర్తింపు పొందింది. తాజాగా ఓ ఖరీదైన స్పోర్ట్స్ కారును కొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. 'నా కల నిజమైంది. దీని కోసం దశాబ్దం పాటు ఎదురుచూశాను. ఫైనల్లీ ఇప్పుడు దీన్ని సొంతం చేసుకున్నా. నా కుటుంబంలో కొత్త సభ్యుడిని ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉంది' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తన తల్లిదండ్రులతో కలిసి మమతా మోహన్ దాస్ ఈ కారును కొనుగోలు చేసింది. 'ఫోర్ష్911 కారెర్రా' మోడల్‌కు చెందిన ఈ కారుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 3.0-లీటర్ ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 450 బీహెచ్పీ పవర్ కలిగి ఉంది. వీటితో పాటు మరెన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ కారు ధర అక్షరాల రూ.1.80 కోట్లు. ప్రస్తుతం మమతా మోహన్ దాస్ కొత్త కారు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) -
‘అందులో ఆడవారి తప్పు కూడా ఉంటుంది’
‘డబ్య్లూసీసీ’ (వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్) అవకాశాల పేరుతో ఆడవారిని మోసం చేసేవారికి వ్యతిరేకంగా, బాధితులకు అండగా నిలబడటం కోసం ఏర్పాటు చేసిన సంస్థ. దాదాపు ప్రతి ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు ఇందుకు మద్దతు తెలుపుతుండగా మమతా మోహన్‌దాస్ మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా స్పందించారు. ‘మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే, అందులో స్త్రీలకు కూడా వాటా ఉంటుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ దినపత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో మమతా మహిళల పట్ల వేధింపుల గురించి స్పందిస్తూ ‘ఎవరైనా మన పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నా, లైంగికంగా వేధించిన లేదా అలాంటి పనులు చేయడానికి సిద్ధపడుతున్నారంటే అందులో ఎంతో కొంత మన (ఆడవారి) తప్పు కూడా ఉంటుంది. అంటే ఒకరు మనతో అలా తప్పుగా ప్రవర్తించే అవకాశం స్వయంగా మనమే వారికి ఇచ్చి ఉంటాము. అందుకే వారు ఇలాంటి పనులు చేసే ధైర్యం చేయగలుగుతున్నార’న్నారు. ఆ తర్వాత మమతా వెంటనే తన వ్యాఖ్యలపై స్పష్టతనిస్తూ ‘ఎవరో కొందరినే దృష్టిలో పెట్టుకుని నేను ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. నా మాటలు అందరికి వర్తిస్తాయ’న్నారు. అంతేకాక ‘డబ్య్లూసీసీ గురించి మీ అభిప్రాయం చెప్పండ’ని అడగ్గా ‘అది ఏర్పాటైన సమయంలో నేను ఇక్కడ లేను. నేను ఇందులో భాగస్వామిని అవుతానా అని అడిగితే మాత్రం లేదనే చేప్తాను. ఎందుకంటే డబ్య్లూసీసీ గురించి నాకు ఎటువంటి అభిప్రాయం లేదన్నా’రు. నటీమణులకు ఎదురవుతున్న వేధింపులు గురించి ప్రశ్నించగా.. ‘ఇలాంటి విషయాల గురించి చర్చించాల్సింది వేధింపులు జరిగాక కాదు. అసలు ఇలాంటి సంఘటనలు జరగకముందే వీటి గురించి చర్చించాలి. ఏది ఏమైనా వేధింపులకు గురి చేసిన వారిని మాత్రం వదిలిపెట్టకూడద’న్నారు. అయితే మమతా వ్యాఖ్యలను నటి రీమా కళంగళ్ ఖండించారు. మమతను ఉద్దేశిస్తూ రీమా తన ఫేస్బుక్లో ‘ప్రియమైన మమత మోహన్ దాస్‌కు, నా సోదర సోదరీమణులకు.. మన సమాజం ఎలా తయారయ్యిందంటే వేధింపులు, అత్యాచారాలు, అపహరణ, హింస వంటి నేరాలను చాలా సాధరణంగా పరిగణిస్తుంది. అలాంటి నేరాలకు పాల్పడే వారిని రక్షిస్తోంది. అందుకే తప్పు చేసిన వారు దర్జాగా తిరుగుతున్నారు. బాధితులు మాత్రం అవమానాలను ఎదుర్కొంటున్నారు. కానీ ఈ నేరాలన్నింటికి బాధ్యత వహించాల్సింది నిందుతులు.. బాధితులు ఎంత మాత్రం కాదు. మనకు జరిగిన అన్యాయం గురించి ధైర్యంగా మాట్లాడదాం. ఒకరి కోసం ఒకరం మద్దతుగా నిలుద్దాం. ఇప్పటికైనా నిశ్శబ్దం అనే గోడను బద్దలుకొడదాం’ అంటూ పోస్ట్ చేశారు. -
మూడోసారి
మలయాళ హీరో పృథ్వీరాజ్ ప్రొడక్షన్లో ఆయనే హీరోగా రూపొందుతోన్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘9’. ‘100 డేస్ ఆఫ్ లవ్’ ఫేమ్ జీనస్ మొహమద్ దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్గా వామికా గబ్బి నటిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కి మమతా మోహన్‌దాస్ కూడా యాడ్ అయ్యారు. ‘అన్నీ’ అనే కీలక పాత్రలో మమతా మోహన్‌దాస్ ఈ చిత్రంలో కనిపించనున్నారు. పృథ్వీరాజ్‌తో మమత యాక్ట్ చేయడం ఇది మూడోసారి. ఆల్రెడీ ‘అన్వర్, సెల్యులాయిడ్’ సినిమాల్లో వీళ్లిద్దరూ కలిసి యాక్ట్ చేశారు. ప్రస్తుతం హిమాలయాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. -
అసాధ్యాలను సుసాధ్యం చేసుకోగలం!
‘‘ఏదీ అసాధ్యం కాదు. ఒకవేళ సుసాధ్యం అని బలంగా ఫిక్స్ అయ్యారనుకోండి.. సాధించడం పెద్ద కష్టమేం కాదు. సంకల్పం ఉంటే అసాధ్యాలను సుసాధ్యం చేసుకోగలం! నేను బయటపడిన ప్రతిసారీ ఒకటే అనుకుంటా. ఇంకా కొత్త కొత్తవి సాధించే అవకాశం మనకు దక్కింది అని’’ అన్నారు మమతా మోహన్‌దాస్. ఆత్మవిశ్వాసం లేనివారిలో విశ్వాసం పెంచుతాయి ఆమె మాటలు. మమతాకి కేన్సర్ వ్యాధి సోకిన విషయం తెలి సిందే. ఆ వార్త తెలియగానే ఆమె షాక్ అవ్వలేదు. ధైర్యంగా చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత సినిమాలు చేయడం కూడా మొదలుపెట్టారు. కానీ, ఆమె ఆత్మస్థయిర్యానికి పరీక్షలా ఆ మధ్య వ్యాధి తిరగబెట్టింది. ఈసారి కూడా మమతా ధైర్యం కోల్పోలేదు. గత కొన్ని నెలలుగా ఆమె చికిత్స చేయించుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సందర్భంగా ఆమె ఓ సోషల్ నెట్వర్క్ తన స్పందనలు తెలిపారు. ప్రస్తుతం మమతా ఓ మలయాళ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. ‘టు నూరా విత్ లవ్’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి బాబు దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. -
ఇప్పుడు నేను మునుపటికన్నా స్ట్రాంగ్!
సందర్భం మమతా మోహన్‌దాస్ బర్త్‌డే మమతా మోహన్‌దాస్ మంచి అందగత్తె... చక్కటి నటి... గొప్ప సింగర్... ఇవన్నీ కాదు. తనొక నడిచే నిలువెత్తు ఆత్మవిశ్వాసం. జీవితమంటే చీకటి వెలుగుల రంగేళి అని తనకు బాగా తెలుసు. గ్లామర్ ప్రపంచంలో ఎంతో ఎత్తుకి ఎదిగిన మమత, జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. ఓ పక్క కేన్సర్ వ్యాధి దేహాన్ని కబళిస్తుంటే ధైర్యంగా ఎదుర్కొని విజేతగా నిలిచారామె. నేడు మమత పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫోన్లో ఆమెతో జరిపిన సంభాషణ. చాలా గ్యాప్ తర్వాత ‘భాయ్’ సినిమాలో ఓ పాట పాడారు. ఇక, గాయనిగా కొనసాగుతారా? పాటలు పాడటం నాకు చాలా ఇష్టం. వీలు కుదిరినంత వరకూ వచ్చిన ప్రతి పాటా పాడటానికే ట్రై చేస్తున్నాను. పాటలు పాడినప్పుడు తెలియకుండా నాలో ఏదో శక్తి పెరుగుతుంది. చెన్నయ్‌లో చికిత్స చేయించుకుంటూ, మధ్య మధ్యలో ‘భాయ్’ పాట రికార్డింగ్‌లో పాల్గొనడం చాలా రిలీఫ్ అనిపించింది. పైగా, దేవిశ్రీ ప్రసాద్‌లాంటి డైనమైట్‌తో వర్క్ చేయడం అంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది. చెన్నయ్‌లో చికిత్స అంటున్నారు.. ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? కేన్సర్ వ్యాధి తిరగబెట్టిన తర్వాత చికిత్స చేయించుకున్నాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. అంతా ఓకే కదా..! నేను సేఫ్ జోన్లోనే ఉన్నాను. భవిష్యత్తులో కూడా చాలా సేఫ్‌గా ఉంటాను. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. జీవితంలో ఎదురైన అనుభవాల వల్లే ఇది తెలిసింది. అలాగే, నా కోసం తమ జీవితాలనే త్యాగం చేసే నా తల్లిదండ్రుల వల్ల కూడా జీవితం అంటే తెలిసింది. హఠాత్తుగా మీ ఆరోగ్య స్థితిలో వచ్చిన మార్పు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందా లేక మనోస్థయిర్యాన్ని కోల్పోయేలా చేసిందా? ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఇప్పుడు నేను మునుపటికన్నా స్ట్రాంగ్. జీవితంలో మనకు తగిలే ప్రతి దెబ్బ మనల్ని ఇంకా బలంగా తయారు చేస్తుంది. ఆ దెబ్బలు మన గురించి మనకు చాలా విషయాలను తెలియజేస్తాయి. అలాగే, ఇతరుల గురించీ తెలియజేస్తాయి. కేన్సర్ తిరగబెట్టిందనగానే చాలామందిలా నేనూ చాలా భయపడ్డాను, బాధపడ్డాను. నేను మామూలు మనిషిని కాబట్టి అలా జరగడం సహజం. కానీ, కొన్ని నెలల్లోనే మానసికంగా నేను ధృడంగా తయారయ్యాను. ఇప్పుడు చెన్నయ్‌లో ఎందుకు ఉంటున్నారు? వైద్య సౌకర్యం నిమిత్తం ఇక్కడ ఉంటున్నాను. చెన్నయ్ నాకు చాలా ఇష్టం కాబట్టి, ఇక్కడ ఉండటం ఆనందంగానే ఉంది. కేన్సర్ రోగులకు మీరిచ్చే సలహా? ఆశావహ దృక్పథం కలిగించే వాతావరణంలో ఉండటం చాలా అవసరం. అలాగే, చుట్టూ ఉన్న మనుషులు కూడా పాజిటివ్ యాటిట్యుడ్ ఉన్నవాళ్లే ఉండాలి. నమ్మకం ఉండాలి. ఇవేవీ లేకపోతే ఆరోగ్యం త్వరగా క్షీణిస్తుంది. మీకు మీరు చాలా ముఖ్యం. అందుకని, ఏ కారణాలవల్లనో ఎవరో వల్లో క్రుంగిపోవద్దు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అప్పుడే మీరు దేన్నయినా జయించగలుగుతారు. కేన్సర్ కూడా ఓ మామూలు వ్యాధి అనే తరంలో ఉన్నాం మనం. ఈ వ్యాధికి సంబంధించి ఇంకా మెరుగైన వైద్యం అందుబాటులోకి రావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుందాం. కేన్సర్ తిరగబెట్టినా... భయపడకండి. నన్ను నమ్మండి. మీరు కచ్చితంగా జయించగలుగుతారు. ఒకవేళ మీరు చివరి దశలో ఉండి, డాక్టర్లు కూడా చేతులెత్తేస్తే, దానర్థం మందులు ఏమీ పని చేయవని. కానీ, నిజం ఏంటంటే, మీకోసం మీరు చాలా చేయగలుగుతారు. ఓకే.. మళ్లీ సినిమాల్లో నటించాలనుకుంటున్నారా? కొన్ని కథలు వింటున్నాను. ప్రధానంగా మలయాళ సినిమాలపై దృష్టి పెట్టాను. ఎందుకంటే, అక్కడే సహజత్వానికి దగ్గరగా ఉన్న పాత్రలు వస్తాయనే నమ్మకం కుదిరింది. నన్ను సహజమైన పాత్రల్లో మలయాళ ప్రేక్షకులు అంగీకరించారు. నా సినిమాలు ఘనవిజయం సాధించాయి. ఒకవేళ కమర్షియల్ సినిమాల్లో ‘స్ట్రాంగ్ రోల్స్’ వస్తే చేస్తాను. మలయాళంలో నేను చేసిన పాత్రలు మహిళలు లేక సమాజం గురించి ఏదో ఒక సందేశం ఇచ్చే విధంగానే ఉన్నాయి. భవిష్యత్తులో కూడా అలాంటి పాత్రలకే నా ప్రాధాన్యం. మీ భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మీ మానసిక స్థితి ఎలా ఉంది? చాలా బలంగా ఉంది. మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? రాంగ్ టైమ్‌లో రాంగ్ క్వశ్చన్ అడిగారు. ప్రస్తుతం నన్ను నేను పెళ్లి చేసుకున్నాను. ప్రస్తుతం మీ జీవితం ఎలా ఉంది? చాలా రిలాక్సింగ్‌గా ఉంది. నా గురించి నేను చాలా ప్రశాంతంగా కేర్ తీసుకుంటున్నాను. ఈరోజు మీ పుట్టినరోజు కదా.. ఏం ప్లాన్ చేశారు? ఇప్పటివరకు ఒకటి, రెండు మినహా నా బర్త్డేలన్నీ నా ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్ సమక్షంలో ఇంట్లోనే జరిగాయి. ఈసారి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని నేను వాళ్లకే వదిలేశాను. వాళ్లేం చేసినా కాదనను. నేను మాత్రం ‘కీర్’ తయారు చేసుకుని, సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. వాస్తవానికి నేను ప్రతి రోజూ మళ్లీ పుట్టినట్లుగా భావిస్తున్నాను. అందుకే ప్రతి రోజుకీ నా ధన్యవాదాలు. గత ఏడాదికీ ఈ ఏడాది పుట్టినరోజుకీ వచ్చిన మార్పు? ఒక్క ఏడాదిలో ఎంతో మార్పు వచ్చింది. వయసు పరంగా ఓ అంకె పెరిగింది. అయితే, వివేకం పరంగా చాలా ఏళ్లు పెరిగాను. - డి.జి.భవాని -
మమతను వీడని క్యాన్సర్
మమతామోహన్‌దాస్‌ను క్యాన్సర్ వ్యాధి మళ్లీ బాధిస్తోంది. మమతామోహన్‌దాస్, మనీషా కోయిరాలా క్యాన్సర్ బారినపడ్డవారే. విదేశాల్లో చికిత్స పొంది ఈ మధ్యే తిరిగొచ్చారు. ఆత్మవిశ్వా సంతోనే క్యాన్సర్‌ను జయించానని మమత పేర్కొంది. అయితే క్యాన్సర్ ఆమెను మళ్లీ బాధిస్తోంది. ప్రస్తుతం ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గర్భాశయ క్యాన్సర్ బారినపడ్డ మనీషా కోయిరాలా అమెరికాలో చికిత్స పొందింది. రెండు నెలల క్రితమే ముంబయికి తిరిగొచ్చింది. ప్రస్తుతం ఆమె పచ్చకామెర్ల వ్యాధితో ఇబ్బంది పడుతోంది. మనీషా నేపాల్‌లోని తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. చికిత్స కోసం నవంబర్ 20న న్యూయూర్క్ వెళ్లనుంది. ఇది చాలా గడ్డుకాలం మళ్లీ మాయాజాలం మొదలైందని మనీషా తన ట్విట్టర్లో పేర్కొంది.