జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ నటి మమతా మోహన్‌దాస్. ఇటీవలే చాలా రోజుల తర్వాత మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. జగపతిబాబు నటించిన రుద్రంగి సినిమాతో టాలీవుడ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. 2005లోనే మయూకం మలయాళ మూవీతో తెరంగేట్రం చేసిన ఈ మలయాళీ భామ ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో సత్తాచాటారు.
(ఇది చదవండి: మరోసారి ఇలాంటి పని చేస్తే చెంప పగలగొడతా.. నటుడికి వార్నింగ్ ఇచ్చిన యాంకర్)
దాదాపు 18 ఏళ్ల పాటు కథానాయకిగా కొనసాగుతున్న ఈ బహుభాషా నటి తన సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. ఆమె క్యాన్సర్ బారిన పడి.. ఆ మహమ్మారిని జయించడంతో పాటు మళ్లీ నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే క్యాన్సర్ వ్యాధిని జయించడం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ సమయంలో అవగాహన ఉండటం చాలా ముఖ్యమని తెలిపారు.
ఆ వ్యాధిపై అవగాహన ఉంటే దాని నుంచి బయటపడడం సాధ్యమేనని మమతా మోహన్‌దాస్ పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సానుభూతి చాలా లభిస్తుందన్నారు. కానీ సానుభూతి ఆశిస్తే కలిగే నష్టాలే ఎక్కువ అన్నారు. అలాంటి సానుభూతి తనకు అక్కరలేదని తెలిపారు. ఆ సమయంలో తాను ఉన్న ఊరిని వదిలేశానని, సినిమాలను కూడా పక్కన పెట్టానని చెప్పుకొచ్చింది. ఆసుపత్రిలోనే ఉండే చికిత్స పొందినట్లు తెలిపారు.
(ఇది చదవండి: నమ్రతా బాటలోనే మహేశ్ బాబు హీరోయిన్.. ఏంటా నిర్ణయం!)
ఆ సమయంలో తాను కేవలం తల్లిదండ్రుల ఆదరాభిమానాలను మాత్రమే ఆశించానని చెప్పారు. క్యాన్సర్ వ్యాధిని జయించే వరకు కేరళ దరిదాపుల్లోకి కూడా రాలేదన్నారు. అయితే ఈ వ్యాధి నుంచి బయటపడ్డ అంతకుముందు రూపం మళ్లీ రాదని.. ఈ విషయాన్ని గ్రహించాలని మమతా చెప్పారు. కాగా ప్రస్తుతం మమతా మోహన్‌దాస్ మలయాళంలో మూడు చిత్రాలు.. తమిళంలో విజయ్ సేతుపతికి జంటగా మహరాజా చిత్రంతో పాటు ఊమై విళిగల్ అనే మరో సినిమాలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment