మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై హేమా కమిటీ నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు మలయాళ సినీ ప్రముఖులపై కేసులు నమోదు అయ్యాయి. అలాగే పలువురు నటీమణులు తమకు ఎదురైన ఇబ్బందుల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. తాజాగా మలయాళ నటి మాలా పార్వతి స్పందించారు. ‘‘2010లో నేనొక సినిమా చేశాను. సినిమాలో నా కూతురు న్యాన్సీ (నిత్యామీనన్) నా చుట్టూ తిరుగుతూ సరదాగా ఆడుకునే సీన్ అది. ఆ సమయంలో నా భర్త పాత్రధారి న్యాన్సీని ఆ΄్యాయంగా టచ్ చేయాలి. అయితే ఆ వ్యక్తి ఓ చేత్తో న్యాన్సీని టచ్ చేసి, మరో చేత్తో అన వసరం అయినప్పటికీ నన్ను బలంగా తాకాడు. నాకు నొప్పిగా అనిపించింది.
ఆ తర్వాత దర్శకుడు శిబీ మలైయిల్ టచ్ లేకుండా ఈ సీన్‌ని రీ టేక్ చేశారు. కానీ అదే వ్యక్తితో ఒకరి పక్కన మరొకరు కూర్చోవడం, హత్తుకోవడం వంటి సన్నివేశాలు ఉన్నాయి. చె΄్పాలంటే నాకు ఆ సినిమా ఓ టార్చర్‌లా అనిపించింది. నాకు కంఫర్ట్‌గా అనిపించక΄ోవడంతో ఆ సినిమాలో నేను సరిగ్గా నటించలేకపోయాను కూడా. మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడ్డాను’’ అని ఓ ఆంగ్ల మీడియాతో మాలా పార్వతి చె΄్పారు. అలాగే ఆమె జీవితంలోని మరో ఘటనను కూడా పంచుకున్నారు. ఆ ఘటన గురించి మాట్లాడుతూ– ‘‘2019లో ‘హ్యాపీ సర్దార్’ అనే సినిమా చేశాను. నా కోసం నేను నా ఖర్చుతో క్యారవేన్ పెట్టుకున్నాను. అయితే క్యారవేన్‌కు నేనెలా అర్హురాలినంటూ ఓ సీనియర్ నటుడు నన్ను ప్రశ్నించాడు. నా సొంత ఖర్చులతో నేను పెట్టుకున్నానని చెప్పినా అతని వైఖరి మారలేదు.
నా క్యారవేన్‌ను కొందరు నటీమణులు కూడా వినియోగించుకున్నారు. అయితే ఓ రోజు నా క్యారవేన్ దగ్గర రాత్రివేళ అనుకోని ఘటనలు జరుగుతున్నాయని నాకో ఫోన్‌కాల్ వచ్చింది. నేను హడావిడిగా వెళ్లాను. నా క్యారవేన్ కనిపించలేదు. దగ్గర్లో ఓ చెట్టు కింద పార్క్ చేసి ఉందని గమనించాను. నేను అక్కడికి వెళ్తుంటే ఇద్దరు బౌన్సర్స్ నన్ను చూసి పారి΄ోయారు. అక్కడే ఉన్న అమ్మాయిలను నేను తీసుకువచ్చాను. ఈ భయంకరమైన ఘటన గురించి ఓ సీనియర్ మలయాళ నటుడికి ఫిర్యాదు చేస్తే... ‘‘నువ్వు సామాజిక కార్యకర్తలా వచ్చావా? లేక నటించడానికి వచ్చావా? అని ప్రశ్నించాడు. ఇలాంటివారి వల్లే సినిమాల్లో మహిళలకు భద్రత లేకుండాపోయిందని చాలా బాధ కలిగింది.
‘హ్యాపీ సర్దార్’ సినిమా నా నట జీవితాన్ని మార్చేసింది. నా గొంతును న్యాయం కోసం వినిపించినందు వల్లే నాకు అవకాశాలు తగ్గి΄ోయాయి’’ అన్నారు మాలా పార్వతి. ఇదిలా ఉంటే... 2010లో మాలా పార్వతి చేసిన చిత్రాల్లో ‘అపూర్వ రాగం’లో నిత్యా మీనన్ ఆమె కూతురి పాత్ర చేశారు. సో... ఈ సినిమాలో నటించిన ఓ నటుడి గురించే ఆమె పేర్కొని ఉంటారని ఊహించవచ్చు. ఇక ప్రస్తుత పరిణామాల రీత్యా ఇప్పటికే ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) అధినేత మోహన్‌లాల్‌తో పాటు ΄్యానల్ సభ్యులందరూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment