Parvathi
-
సీన్‌కి అనవసరమైనప్పటికీ నన్ను తాకాడు: మలయాళ నటి మాలా పార్వతి
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై హేమా కమిటీ నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు మలయాళ సినీ ప్రముఖులపై కేసులు నమోదు అయ్యాయి. అలాగే పలువురు నటీమణులు తమకు ఎదురైన ఇబ్బందుల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. తాజాగా మలయాళ నటి మాలా పార్వతి స్పందించారు. ‘‘2010లో నేనొక సినిమా చేశాను. సినిమాలో నా కూతురు న్యాన్సీ (నిత్యామీనన్) నా చుట్టూ తిరుగుతూ సరదాగా ఆడుకునే సీన్ అది. ఆ సమయంలో నా భర్త పాత్రధారి న్యాన్సీని ఆ΄్యాయంగా టచ్ చేయాలి. అయితే ఆ వ్యక్తి ఓ చేత్తో న్యాన్సీని టచ్ చేసి, మరో చేత్తో అన వసరం అయినప్పటికీ నన్ను బలంగా తాకాడు. నాకు నొప్పిగా అనిపించింది.ఆ తర్వాత దర్శకుడు శిబీ మలైయిల్ టచ్ లేకుండా ఈ సీన్‌ని రీ టేక్ చేశారు. కానీ అదే వ్యక్తితో ఒకరి పక్కన మరొకరు కూర్చోవడం, హత్తుకోవడం వంటి సన్నివేశాలు ఉన్నాయి. చె΄్పాలంటే నాకు ఆ సినిమా ఓ టార్చర్లా అనిపించింది. నాకు కంఫర్ట్‌గా అనిపించక΄ోవడంతో ఆ సినిమాలో నేను సరిగ్గా నటించలేకపోయాను కూడా. మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడ్డాను’’ అని ఓ ఆంగ్ల మీడియాతో మాలా పార్వతి చె΄్పారు. అలాగే ఆమె జీవితంలోని మరో ఘటనను కూడా పంచుకున్నారు. ఆ ఘటన గురించి మాట్లాడుతూ– ‘‘2019లో ‘హ్యాపీ సర్దార్’ అనే సినిమా చేశాను. నా కోసం నేను నా ఖర్చుతో క్యారవేన్ పెట్టుకున్నాను. అయితే క్యారవేన్కు నేనెలా అర్హురాలినంటూ ఓ సీనియర్ నటుడు నన్ను ప్రశ్నించాడు. నా సొంత ఖర్చులతో నేను పెట్టుకున్నానని చెప్పినా అతని వైఖరి మారలేదు. నా క్యారవేన్ను కొందరు నటీమణులు కూడా వినియోగించుకున్నారు. అయితే ఓ రోజు నా క్యారవేన్ దగ్గర రాత్రివేళ అనుకోని ఘటనలు జరుగుతున్నాయని నాకో ఫోన్‌కాల్ వచ్చింది. నేను హడావిడిగా వెళ్లాను. నా క్యారవేన్ కనిపించలేదు. దగ్గర్లో ఓ చెట్టు కింద పార్క్ చేసి ఉందని గమనించాను. నేను అక్కడికి వెళ్తుంటే ఇద్దరు బౌన్సర్స్ నన్ను చూసి పారి΄ోయారు. అక్కడే ఉన్న అమ్మాయిలను నేను తీసుకువచ్చాను. ఈ భయంకరమైన ఘటన గురించి ఓ సీనియర్ మలయాళ నటుడికి ఫిర్యాదు చేస్తే... ‘‘నువ్వు సామాజిక కార్యకర్తలా వచ్చావా? లేక నటించడానికి వచ్చావా? అని ప్రశ్నించాడు. ఇలాంటివారి వల్లే సినిమాల్లో మహిళలకు భద్రత లేకుండాపోయిందని చాలా బాధ కలిగింది.‘హ్యాపీ సర్దార్’ సినిమా నా నట జీవితాన్ని మార్చేసింది. నా గొంతును న్యాయం కోసం వినిపించినందు వల్లే నాకు అవకాశాలు తగ్గి΄ోయాయి’’ అన్నారు మాలా పార్వతి. ఇదిలా ఉంటే... 2010లో మాలా పార్వతి చేసిన చిత్రాల్లో ‘అపూర్వ రాగం’లో నిత్యా మీనన్ ఆమె కూతురి పాత్ర చేశారు. సో... ఈ సినిమాలో నటించిన ఓ నటుడి గురించే ఆమె పేర్కొని ఉంటారని ఊహించవచ్చు. ఇక ప్రస్తుత పరిణామాల రీత్యా ఇప్పటికే ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) అధినేత మోహన్‌లాల్‌తో పాటు ΄్యానల్ సభ్యులందరూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
కొడుకుని కత్తితో పొడిచాడని.. భర్తపై భార్య ఘాతుకం!
పశ్చిమగోదావరి: భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో భర్త మృత్యువాత పడగా, కుమారుడు కత్తిపోటు గాయానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాడేపల్లిగూడెంకు చెందిన గుల్లంకి వెంకట్ (44), ఉండ్రాజవరం గ్రామానికి చెందిన పార్వతికి 20 ఏళ్ల క్రితం వివాహం కాగా, వారికి కొడుకు, కూతురు ఉన్నారు. అయితే పది ఏళ్లుగా భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. వెంకట్ తన స్వగ్రామం తాడేపల్లిగూడెంలో ఉంటుండగా, పార్వతి తన ఇద్దరు పిల్లలతో ఉండ్రాజవరంలో ఉంటోంది. వెంకట్ అప్పుడప్పుడూ వచ్చి పార్వతిని తనతో వచ్చేయమని గొడవ పడుతుండేవాడు. ఇటీవల కుమార్తె పెళ్లి కారణంగా వచ్చిన వెంకట్ పది రోజుల నుంచి ఉండ్రాజవరంలోనే ఉంటున్నాడు. బుధవారం రాత్రి పార్వతిని తనతో వచ్చేయాలంటూ మళ్లీ గొడవకు దిగాడు. దీంతో భార్య పార్వతి, కొడుకు కృష్ణవంశీతో తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కృష్ణవంశీని వెంకట్ కత్తితో పొడిచాడు. కొడుకు కత్తిపోటుకు గురికావడంతో చలించిన పార్వతి ఒక్కసారిగా భర్తపై ఇటుకతో దాడికి పాల్పడింది. వెంకట్ దాడిని ప్రతిఘటించే క్రమంలో తల్లీకొడుకు ఇద్దరూ కలిసి ఇటుకలతో వెంకట్ తలపై కొట్టడంతో వెంకట్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే తేరుకున్న పార్వతి గాయపడిన భర్త, కొడుకును తణుకు ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా వెంకట్ పరిస్థితి విషమంగా ఉండటంతో తణుకు నుంచి ఏలూరు, అక్కడ నుంచి విజయవాడకు తరలించారు. గురువారం తెల్లవారుజామున వెంకట్ ఆసుపత్రిలో మృతి చెందాడు. కొడుకు కృష్ణవంశీ ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉండ్రాజవరం ఎస్సై వి.అప్పలరాజు కేసు నమోదు చేయగా, నిడదవోలు సీఐ కె.వెంకటేశ్వరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇవి చదవండి: వివాహానికి హాజరై తిరిగొస్తుండగా.. -
బెస్ట్ గిఫ్ట్
‘తంగలాన్’ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు హీరోయిన్ మాళవికా మోహనన్. విక్రమ్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘తంగలాన్’. ఈ చిత్రంలో పార్వతి, మాళవికా మోహనన్ హీరోయిన్లు. కేజీ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శుక్రవారం (ఆగస్టు 4) మాళవికా మోహనన్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘తంగలాన్’లోని ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘బెస్ట్ బర్త్ డే గిఫ్ట్’ అని ఈ పోస్టర్ని ఉద్దేశించి మాళవిక ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో గిరిజన యువతిగా ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలన కొనసాగుతున్నప్పుడు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వద్ద ఆక్రమణలకు ఎదురు నిలిచిన ఓ గిరిజన తెగ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. -
Singer Parvathy: నా అదృష్టం.. సినిమాల్లో పాడే అవకాశాలూ వస్తున్నాయి: పార్వతి
వసంతకాలం అనగానే విరబూసిన పూలు, లేలేత మావి చిగుళ్లు కోయిలమ్మల రాగాలు మదిలో మెదులుతాయి. అలాగే, ఈ సీజన్లో తమ గానామృతంతో మనల్ని అలరిస్తూ సందడి చేస్తున్నారు దాసరి పార్వతి, దివ్యజ్యోతి, దుర్గవ్వలు. టాలెంట్ ఉంటే ఏ మూలన ఉన్నా అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి అనే మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. పని కష్టం మర్చిపోవడానికి నోటినుండి వెలువడే పదాలే పాటలుగా ఆకట్టుకుంటాయి. అవే జానపదాలై గ్రామీణుల గొంతుల్లో విరాజిల్లుతాయి. అలా మట్టిపరిమళం నుంచి వచ్చిన గొంతుక దుర్గవ్వది. తను పాట పాడితే వెన్నెల చల్లదనమంతా కురుస్తుందా అనిపించే గొంతుక పార్వతిది. అలసిన వేళ పాటే తోడు అంటూ విరిసిన గొంతుక జ్యోతి ది. తెలుగువారి హృదయాలను గెలుచుకున్న ఈ కోయిలమ్మలు తమ కమ్మటి రాగాల వెనక దాగి ఉన్న కష్టాన్ని, తమ పాట తమను నిలబెట్టిన తీరును సాక్షితో పంచుకున్నారు. ఊరంతా వెన్నెల... పార్వతి ఓ టీవీ కార్యక్రమంలో ‘ఊరంతా వెన్నెల మనసంతా చీకటి...’ పాటతో యావత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది దాసరి పార్వతి. తమ ఊరికి బస్సు రావాలని కోరిన ఆమె మంచి మనసుకు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. తెలుగునాట నెట్టింట పార్వతి పాడిన పాటను సెర్చ్ చేయని వాళ్లు లేరు అనేంతగా గుర్తింపు పొందింది. పార్వతి స్వస్థలం కర్నూల్ జిల్లా, లక్కసాగర గ్రామం. వ్యవసాయ కుటుంబం. ‘చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుండేదాన్ని. ఊళ్లో అందరూ గొంతు కోయిలలా ఉందని మెచ్చుకుంటుండేవారు. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా నా పాట ఉండేది. చదువుకుంటూనే పొలం పనులకు వెళ్లేదాన్ని. పొలం పనులకు వచ్చేవాళ్లు కూడా నా చేత పాటలు పాడించుకునేవారు. ఇంటర్మీడియెట్ తర్వాత ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు మా అన్నయ్యల స్నేహితులు మ్యూజిక్ కాలేజీలో చేరమన్నారు. అలా ఇప్పుడు తిరుపతి మ్యూజిక్ కాలేజీలో ఎం.ఎ చేస్తున్నాను. టీవీ ప్రోగ్రామ్ వాళ్లు పెట్టిన ఆడిషన్స్‌లో సెలక్ట్ అయ్యాను. ఆ సందర్భంగా పాడిన పాటకు మంచి గుర్తింపు వచ్చింది. ఎంతో మంది ప్రశంసిస్తున్నారు. సినిమాల్లో పాడే అవకాశాలూ వస్తున్నాయి. ఇంత గుర్తింపు రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అలనాటి జ్ఞాపకాలను ఆనందంగా పంచుకుంది పార్వతి. మట్టిగొంతుక... దుర్గవ్వ పల్లె పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గవ్వ. కూలిపనులు చేసుకుని, జీవనం సాగించే దుర్గవ్వకు ఇటీవల ఓ స్టార్ హీరో సినిమాలో పాట పాడే అవకాశం దక్కింది. ఆమె పాడిన ‘అడవి తల్లి..’ పాట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్మోగింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. పల్లె పాటను ప్రాణం పెట్టి పాడిన ఈ సింగర్ కోసం నెటిజన్లు తీవ్రంగా వెతుకుతున్నారు. దుర్గవ్వ పాటకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. కొడుకు, కూతురు ఉన్న దుర్గవ్వ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. కాయకష్టంలో వచ్చే పల్లె పదాలు ఎన్నో. ‘‘చిన్నతనం నుంచి పాటెన్నడూ నన్ను వీడలేదు. ఓ రోజు నా బిడ్డ నా చేత నాలుగు పాటలు పాడించి చానళ్లలో పెట్టింది. ముందు వద్దన్న. కానీ, పిల్లలు వినలేదు. ఆ పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో మా దగ్గర కొంతమంది జానపద కళాకారులు నా చేత ఇంకొన్ని పాటలు పాడించారు. అక్కడి నుంచి సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఎక్కడో కూలి చేసుకుని బతికే నేను ఇలా అందరి ముందు పాటలు పాడటం, పేరు రావడం ఆనందంగా ఉంది’ అని వివరిస్తుంది దుర్గవ్వ. ప్రైవేట్ ఆల్బమ్‌లలో దుర్గవ్వ పాడిన పాటల్లో ‘సిరిసిల్ల చిన్నది..’, ‘నాయితల్లే.., ఉంగురమే.. రంగైనా రాములాల టుంగూరమే’ అనే పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. ఊరటనిచ్చిన పాట.. అనుకోకుండా ఎగిసిన గొంతుకలా నెట్టింట వైరల్ అయ్యింది దివ్యజ్యోతి. కరీంనగర్ జిల్లా నర్సింగపురం నుంచి పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్ చేరిన కుటుంబం జ్యోతిది. భర్త కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. జ్యోతి ప్రైవేట్ కంపెనీలలో హౌస్ కీపర్‌గా ఉద్యోగం చేస్తుంది. ఇద్దరు కూతుళ్లు చదువుకుంటున్నారు. యాక్సిడెంట్ అయ్యి భర్త కాలు తీసేయడంతో కుటుబానికి జ్యోతి సంపాదనే ఆదరవు అవుతోంది. ‘‘కష్టంలో నాతో పాటు ఎప్పుడూ తోడుండేది పాటనే. ఆనందమేసినా నోటికొచ్చిన పాటలు పాడుకునేదాన్ని. చాలాసార్లు మాటలే పాటలవుతుంటాయి. నేను పనిచేసే చోట నాగవల్లి మేడం నాచేత పాట పాడించింది. ఆ పాటను సోషల్ మీడియాలో పెట్టడంతో నా గొంతుకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్‌లలో పాటలు పాడుతున్నాను. ఉదయం పూట డ్యూటీ చేస్తున్నాను. రాత్రిపూట పాటలు ప్రాక్టీస్ చేసుకుంటున్నా. నీ గొంతు చాలా బాగుంది. సినిమాల్లోనూ నీ చేత పాటలు పాడిస్తామని పెద్దోళ్లు చెబుతున్నరు’’ అని ఆనందంగా వివరిస్తుంది జ్యోతి. మనసు పెట్టి వినాలే కానీ, మన ఇరుగు పొరుగు, మనతోపాటు పని చేసేవారి గొంతుకలలో గమకాలు పలుకుతుంటాయి. గుర్తించి ఆస్వాదించాలి. పదిమందికీ వినిపించాలి. అప్పుడే పాటకు పట్టాభిషేకం జరుగుతుంది. – నిర్మలారెడ్డి -
Singer Parvathi: ఒక్క పాటతో కదిలిన యంత్రాంగం.. వెంటనే ఊరికి బస్సు తీసుకొచ్చింది
సంగీతానికి రాళ్లనైనా కరిగించే శక్తి ఉంటుంది అంటారు. కానీ తన పాటతో ఏకంగా ఊరికి ఆర్టీసీ బస్సు తీసుకొచ్చేలా చేసింది ఓ అమ్మాయి. ఏళ్ల తరబడి ఊరికి బస్సు కావాలని అధికారులకు మొర పెట్టుకున్న జరగని పనిని ఒక్కపాటతో కదిలించింది. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరానికి చెందిన దాసరి పార్వతీ తన గొంతులో జీ- సరిగమపలో పాడే అవకాశం దక్కించుకొని ప్రతిభకు అందంతో పని లేదని నిరూపించింది. సరిగమప కొత్త సీజన్లో కంటెస్టెంట్‌గా వచ్చిన సింగర్ పార్వతి తన పాటతో అందరి మనసులు గెలుచుకుంది. ఊరికి బస్సు సౌకర్యాన్ని రప్పించింది. పార్వతి గురించి పూర్తి వివరాలు.. కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు, మీనాక్షమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. తమకున్న ఐదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి చిన్న కుమార్తె దాసరి పార్వతి బాల్యం నుంచే పాటలు పాడడంపై ఆసక్తి పెంచుకున్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో పాటలు పాడే విధానాన్ని గమనించి ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. సాధన చేస్తే భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగవచ్చని చెప్పడంతో తల్లిదండ్రులు అడ్డుచెప్పలేదు. ఇంటర్ పూర్త య్యాక తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో చేర్పించారు. చదవండి: 62 ఏళ్ల బామ్మ పర్వత శ్రేణి ట్రెక్కింగ్! ఫిదా అవుతున్న నెటిజన్లు అక్కడ ప్రిన్సిపాల్ సుధాకర్, గురువు వల్లూరి సురేష్‌బాబు వద్ద శిక్షణ తీసు కుంటూ పార్వతి టీటీడీ చానల్ ‘అదిగో అల్లదిగో’ కార్యక్రమానికి ఎంపికయ్యారు. పలు పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల జీ తెలుగు చానల్లో పార్వతికి పాట పాడే అవకాశం వచ్చింది. ‘ఊరంతా వెన్నెల.. మనసంతా చీకటి’ అనే పాట పాడడంతో కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రశంసలు కురిపించారు. పార్వతిని ఏమి కావాలో కోరుకోమని అడగగా.. తాను పడ్డ కష్టాలు తమ గ్రామస్తులు పడకూడదని, తన గ్రామానికి బస్సు తిప్పాలని కోరారు. దీంతో అక్కడి వారంతా ఒక్కసారిగా లేచి నిలబడి పార్వతికి ధన్యవాదాలు తెలియజేశారు. పల్లెకు పరుగులు తీసిన పల్లె వెలుగు పార్వతి పాడిన పాట సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. లక్షలాది వీక్షకులు తమ మొబైల్ ఫోన్ల నుంచి ఈ పాటను షేర్ చేశారు. పార్వతి విన్నపానికి డోన్ ఆర్టీసీ అధికారులు స్పందించారు. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. డోన్ నుంచి దేవనకొండకు వెళ్లే బస్సును లక్కసాగరం మీదుగా తిప్పుతున్నారు. అభినందన సభ తన పాటతో గ్రామానికి బస్సు వచ్చే విధంగా చేసిన పార్వతికి ఆదివారం లక్కసాగరంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగర్ స్మితతో పాటు గ్రామ పెద్దలు లక్ష్మిరెడ్డి, రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. స్వార్థం లేకుండా పార్వతి తన ఊరికి బస్సు కావాలని కోరడం అభినందనీయమన్నారు. అనంతరం బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. తన పాటకు అధికారులు స్పందించి బస్సు సర్వీస్ ఏర్పాటు చేయడంతో సంతోషంగా ఉందని దాసరి పార్వతి తెలిపారు. కర్నూలు నుంచి బండపల్లె గ్రామానికి బస్సు వస్తోందని, దానిని తమ గ్రామం వరకు పొడిగించాలని కోరారు. తనకు పాటలంటే చిన్నప్పటి నుంచి ప్రాణమని తెలిపారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మంచి గాయనిగా స్థిరపడి, పేద పిల్లలకు తన వంతు సాయం చేస్తానని చెప్పారు. This promo ❤#SaReGaMaPa pic.twitter.com/0ALFWDGv0m — Varshini reddy (@iriseye_here) February 16, 2022 -
విధి వక్రించి భర్త, తండ్రి మృతి.. చంటితో సహజీవనం.. అంతలోనే..
సాక్షి, విజయనగరం: కొమరాడ మండలంలోని చినఖేర్జిల పంచాయతీ లింగదొరవలస గ్రామానికి చెందిన మీసాల పార్వతి(29) అనూమనాస్పద స్థితిలో సోమవారం మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గ్రామస్తులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. కుమ్మరిగుంట పంచాయతీ కందివలస గ్రామానికి చెందిన మీసాల పోలీస్తో పార్వతికి వివాహం జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు. అయితే ఏడాదిన్నర క్రితం మీసాల పోలీస్ ఆనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పార్వతి ఆడపిల్లలను తీసుకుని కన్నవారింటికి వచ్చేసింది. విధి వక్రించి నాలుగు నెలల క్రితం ఆమె తండ్రి కూడా మృతి చెందాడు. చదవండి: (పోలీసుల అదుపులో 44 మంది మహిళలు.. కువైట్ వెళ్తుండగా..) అనంతరం ఆమె గుమడ పంచాయతీ సీతామాంబపురం గ్రామానికి చెందిన జన్ని శ్రీకాంత్(చంటి)తో సహజీవనం కొనసాగిస్తోంది. ఇద్దరూ భార్యాభర్తల్లా కొనసాగుతున్నారు. అయితే పార్వతి దగ్గర గల నగదు, బంగారు అభరణాలను తనకు ఇచ్చేయలని శ్రీకాంత్ హింసిస్తుండేవాడని, ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగిన అనంతరం ఉరివేసుకుందా? లేదా శ్రీకాంత్ ఆమెను హత్యను చేసిన ఆత్మహత్యగా చిత్రీకరించాడా? అన్న అనుమానాలు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (Banjarahills: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. కేబుల్ టెక్నిషియన్ నిర్వాకం) గ్రామస్తుల ఫిర్యాడు మేరకు సీఐ ఎన్‌ఎచ్‌ఏవీ విజయానంద్, ఎస్సై ప్రయోగ మూర్తి సంఘటన స్థలానికి చేరుకుని శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు లేక అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలు ఆనాథలు కావడంతో బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
అనుచిత వ్యాఖ్యలు : హీరోయిన్ గుడ్‌బై
ప్రముఖ మలయాళ నటి పార్వతి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మా)కు సోమవారం రాజీనామా చేశారు. అమ్మా ప్రధాన కార్యదర్శి ఎడావెలా బాబు నటి భావనపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలకు నిరసనగా తాను సంస్థనుంచి వైదొలగుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అంతేకాదు ఎడవెలా బాబు తక్షణమే రాజీనామా చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. మనస్సాక్షి గల ఇతర సభ్యులు కూడా ఇదే డిమాండ్ చేస్తారని ఆశిస్తున్నానన్నారు. 2018లో తన స్నేహితులు అమ్మాకి రాజీనామా చేసినప్పుడు, కనీసం కొంతమందైనా పనిచేయడం కొనసాగించాలని, సంస్కరణ జరగాలని తాను భావించానన్నారు. ఆ వైపుగా కృషి చేస్తూనే ఉన్నానని పార్వతి చెప్పారు. కానీ అమ్మా సెక్రటరీ తాజా వ్యాఖ్యలతో ఆ ఆశ తుడిచి పెట్టుకుపోయిందని పార్వతి వ్యాఖ్యానించారు. భావనపై బాబు అసహ్యకరమైన వ్యాఖ్యలు తనను తీవ్ర నిరాశకు గురి చేశాయన్నారు. అందుకే సంఘానికి రాజీనామా చేస్తున్నట్టు ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. కాగా సంక్షోభంలో ఉన్నమలయాళం సినిమా పరిశ్రమను ఆదుకునేందుకు ఓవర్ టాప్(ఓటీటీ)ప్లాట్‌ఫాంను ప్రారంభించాలని అమ్మా భావిస్తోంది. అలాగే భవన నిర్మాణానికి అవసరమైన నిధులను సేకరించేందుకు ప్రముఖ నటులతో మూవీ తీయాలని ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలపై ఇచ్చిన ఇంటర్య్వూలో బాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీలో భావన నటిస్తున్నారా అని ప్రశ్నించినపుడు భావన అమ్మలో లేదు. చచ్చిపోయిన వాళ్లను మళ్లీ తిరిగి తీసుకురాలేమంటూ సమాధానం ఇవ్వడం వివాదం రేపుతోంది. 2018లో 20 పేరుతో నిర్మించిన చిత్రంలో భావన ప్రముఖ పాత్ర పోషించారు. నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సూపర్‌స్టార్ దిలీప్ కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నారా లేదా అనే అంశంలో పలు ఊహాగానాలున్నాయి. -
‘ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది’
ముంబై : సినిమాటోగ్రాఫర్ నదీమ్‌ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన భార్య, గాయని పార్వతి తెలిపారు. ప్రస్తుతం నదీమ్ వెంటిలేటర్‌పై ఉన్నారని, ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని ఆమె తెలిపారు. నదీమ్ ఖాన్ సోమవారం సాయంత్రం ఇంట్లో మెట్ల మీద నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. దీంతో తల, భుజం, ఛాతికి దెబ్బలు తగలడంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. మంగళవారం ఉదయం అతనికి బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. కాగా నదీమ్ ఖాన్ ప్రముఖ హిందీ కథారచయిత రాహి మసూమ్ రాజా కుమారుడు. నదీమ్ ఖాన్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య మాట్లాడుతూ.. ‘ఆయన ఐసీయులో వెంటిలేటర్‌పై ఉన్నారు. అతను స్పృహలో లేరు. ఆయన స్పందించడానికి 48 నుంచి 72 గంటలు పడుతుందని వైద్యులు తెలిపారు. అతను ఎప్పుడు స్పందిస్తారని వేచి చూస్తున్నాం. నదీమ్ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు’. అని పార్వతి తెలిపారు. (‘అది తప్పే నిజాయితీగా ఒప్పుకుంటున్నా’) ‘మేము ఆస్పత్రికి వచ్చినప్పుడు నదీమ్‌కు చిన్న చిన్న గాయలు మాత్రమే అయ్యాయి. అయితే ఇప్పుడవి సీరియస్‌గా మారాయి. ఆసుపత్రిలో అతన్ని ఐసీయూలో కోవిడ్-19 బాధితులతో ఉంచారు. రెండు నెలలుగా అతను లాక్‌డౌన్‌లోనే ఉన్నారు. ఎవరినీ కలవలేదు. వైద్యులు నదీమ్‌కు ర్యాపిడ్ పరీక్షలు, అత్యవసర సర్జరీలు చేశారు. అయితే ఈ ప్రక్రియను నిర్వహించడంలో వైద్యులు ఆలస్యం చేశారు. ఆసుపత్రిలో కరోనా ప్రభావం ఉండటం వల్ల ఇలా జరిగిందని నేను అనుకుంటున్నాను. కానీ నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. కేవలం అతను త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.’’ అని పార్వతి భావోద్వేగానికి లోనయ్యారు. కాగా నదీమ్ ఖాన్.. డిస్కో డాన్సర్, జమానా, ఆంధీ-తూఫాన్, ఆగ్ హాయ్ ఆగ్, కింగ్ అంకుల్, గునాహ్ వంటి 40 చిత్రాలకు పైగా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అలాగే చంకీ పాండే, ఇందర్ కుమార్, మోనికా బేడి నటించిన తిర్చి తోపివాలే (1998) సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. (రియాజ్..ఇక నరకంలో హాయిగా నిద్రపో’ ) -
యాక్టర్ టు డైరెక్టర్
పార్వతి.. ప్రస్తుతం ఉన్న మలయాళ యాక్టర్స్‌లో వన్నాఫ్ ది బెస్ట్ ఆర్టిస్ట్స్. పోషించే పాత్రలను సహజంగా ఉండేలా చూసుకుంటారామె. ‘బెంగుళూర్ డేస్, ఉయిరే’ వంటి సినిమాలు అందుకు ఉదాహరణ. ఈ ఏడాది పార్వతి యాక్టర్ నుంచి డైరెక్టర్‌గా మారబోతున్నారని తెలిసింది. ఆర్టిస్ట్‌గా అంగీకరించిన సినిమాలన్నీ ఈ ఏడాది చివర్లోగా పూర్తి చేసి, తాను దర్శకత్వం వహించే సినిమా ప్రీ– ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టనున్నారు పార్వతి. 2021లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా కథకు ఆమె ఒక రచయితగానూ వ్యవహరించనున్నారు. -
దేవదాసు.. పార్వతి
దేవదాసుది సంపన్న కుటుంబం. తండ్రి పెద్ద జమిందారు. అయినప్పటికి దేవదాసు తన ఇంటి పక్కనే ఉండే పేద కుటుంబానికి చెందిన పార్వతితో చిన్నప్పటినుంచి స్నేహంగా ఉంటాడు. ఆ తర్వాత అతడు పైచదువుల నిమిత్తం లండన్ వెళతాడు. చదువు పూర్తవగానే ఇంటికి తిరిగివస్తాడు. తిరిగి వచ్చిన తరువాత దేవదాసు, పార్వతిల మధ్య ఉన్న స్నేహం.. ప్రేమగా మొగ్గతొడుగుతుంది. పెద్దవాళ్ల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పార్వతి తండ్రి పెళ్లి విషయం మాట్లాడటానికి దేవదాసు తండ్రి దగ్గరకు వెళతాడు. అక్కడ అయితే పేదవాడైన పార్వతి తండ్రిని దేవదాసు తండ్రి తీవ్రంగా అవమానించి పంపుతాడు. విషయం తెలుసుకున్న దేవదాసు.. తండ్రిని నిలదీస్తాడు. తండ్రి రివాల్వర్ తీసి దేవదాసు చేతిలో పెట్టి, తనను చంపేసి ఆ పార్వతిని పెళ్లి చేసుకొమ్మని బెదిరిస్తాడు. దీంతో దేవదాసు మనసు ముక్కలవుతుంది. తండ్రి మాట జవదాటలేక, అక్కడ ఉండలేక పట్నం వెళ్లిపోతాడు. పార్వతి తండ్రి పంతాలకు పోయి ముసలివాడైన జమీందారుతో పార్వతి పెళ్లి జరిపిస్తాడు. పట్నంలో ఉన్న దేవదాసు పార్వతి లేకపోతే బతకలేనని తెలుసుకుని, తిరిగి పల్లెకు వస్తాడు. అప్పటికే పార్వతికి పెళ్లి అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోయి ఉంటుంది. భగ్నహృదయుడైన దేవదాసు తిరిగి పట్నం వెళ్లి పోతాడు. అక్కడ పార్వతిని మరువలేక తాగుడుకు అలవాటుపడతాడు. సాని కొంపలో నృత్యంచేసే చంద్రముఖి అనే అమ్మాయితో కాలం గడుపుతుంటాడు. చంద్రముఖి కూడా మనస్ఫూర్తిగా దేవదాసును ప్రేమిస్తుంది. ఆస్తిపోయి, అనారోగ్యం పాలైన దేవదాసు కడసారి పార్వతిని చూడటానికి ఆమె ఉండే పల్లెకు వెళతాడు. అయితే పార్వతిని చూడడానికిముందే ఆమె ఇంటిముందర పడి అతడు చనిపోతాడు. తమ ఇంటి ముందు చనిపోయింది దేవదాసని పార్వతికి తెలుస్తుంది. అతడ్ని చూడాలని ఎంతో ప్రయత్నిస్తుంది. కానీ, దేవదాసును చూడకుండానే పార్వతి కూడా మరణిస్తుంది. నిజానికి దేవదాసు, పార్వతిల ప్రేమ కథ ఓ కల్పితం. అయినప్పటికి వాస్తవానికి ఏమాత్రం తీసిపోని ఆర్థ్రత ఈ కథ సొంతం. ప్రముఖ బెంగాల్ రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ్ రాసిన ‘దేవదాస్’ నవల ఆధారంగా పలు భాషల్లో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. కథ విషాదాంతమైనా.. మరిచిపోలేని ఓ ప్రేమ కావ్యంలా అందరి మనసులలో చెరిగిపోని ముద్ర వేసుకున్నాయి. ఇప్పటికీ దేవదాస్ పార్వతిల ప్రేమ కథ సినిమాలా కాకుండా ఓ నిజజీవితంలా కళ్లముందు కదలాడుతుంది. -
ప్రేమని వ్యక్తపరచడం ఎలా?
దాదాపు 150 సినిమాలకుపైగా ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేసి, 5 నంది అవార్డ్స్ గెలుచుకున్న అశోక్ కుమార్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘మౌనమే ఇష్టం’. రామ్ కార్తీక్ హీరోగా, పార్వతి అరుణ్, రీతూవర్మ హీరోయిన్లుగా నటించారు. ఏకే మూవీస్ పతాకంపై ఆశా అశోక్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ – ‘‘మంచి స్టోరీ కుదిరితే దర్శకత్వం చేయాలని 15 సంవత్సరాలుగా ఆలోచిస్తూనే ఉన్నాను. ‘మౌనమే ఇష్టం’ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్యూట్ జెండర్ లవ్ స్టోరీ. ప్రేమని ఎలా వ్యక్తపరచాలన్నదే ఈ సినిమాలో మెయిన్ పాయింట్. సినిమా ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా అందరూ చూడండి’’ అన్నారు. ‘‘అశోక్ కుమార్‌గారు ఈ సినిమాను యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ప్రతి ప్రేమకు ప్రపోజల్ ఎంతో ముఖ్యమైనది. అలాంటిది ప్రేమకు ప్రపోజల్ ఇబ్బంది అయితే ఆ ప్రేమికుడు పడే బాధ ఏంటి? అనేది ఈ సినిమాలో చూపించాం. ఇలాంటి మంచి ప్రాజెక్టులో నాకు అవకాశం ఇచ్చిన అశోక్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు సాయి కార్తీక్. ‘‘ఈ సినిమా తప్పుకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. కార్తీక్‌కి ఈ చిత్రం ద్వారా నటుడిగా మంచి పేరు వస్తుంది’’ అన్నారు రీతూవర్మ. కథా రచయిత సురేష్, నటి ప్రియాంక, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్ నాయర్, కెమెరామేన్ రామ్ తులసి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ మహాదేవా. -
వివాహిత అదృశ్యం
విశాఖపట్నం , మునగపాక : మండలంలోని ఒంపోలుపేటకు చెందిన వివాహిత కొంత పార్వతి(21) అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ కుమారస్వామి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఒంపోలుపేటకు చెందిన కొంతం పార్వతి జనవరి 30న పరవాడలోని ఫార్మాసిటీలో పనిచేస్తున్న తన భర్త వెంకట సత్యనారాయణకు భోజనం క్యారేజి కట్టింది. భర్త అదేరోజు మధ్యాహ్నం 2గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి పార్వతి కనిపించలేదు. బంధువులు, స్వేహితుల ఇళ్ల వద్ద గాలించినా ఆచూకీ కనిపించలేదు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 5న పార్వతి ఇంటికి వచ్చింది. అదేరోజు మళ్లీ ఇంటినుంచి వెళ్లిపోయింది. దీంతో భర్త సత్యనారాయణ పోలీసులను ఆశ్రయించారు. 18 రోజుల పాటు వెతికినా పార్వతి కనిపించకపోవడంతో ఆమె భర్త సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం ఎస్ఐ కుమారస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానంతో ఉసురు తీశాడు
ప్రకాశం , మార్కాపురం: అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. తాళికట్టిన భార్యను కిరాతకంగా గొడ్డలితో నరకటంతో అక్కడికక్కడే చనిపోయింది. సంక్రాంతి పండుగ రోజున ఆ కుటుంబంలో తీరని విషాదం మిగిలింది. పోలీసుల కథనం మేరకు.. మార్కాపురంలోని కంభం రోడ్డులో శ్రీనివాస థియేటర్ పక్కన వీధిలో నివాసం ఉంటున్న ఎన్.శరభయ్య తన భార్య పార్వతి (30)ని బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లో గొడ్డలితో నరికి పరారయ్యాడు. ఈ సంఘటనలో పార్వతి అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు జ్ఞానేశ్వర్ (10), వైశాలి(8) ఉన్నారు. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీధర్‌రెడ్డి, పెద్దారవీడు ఎస్సై ముక్కంటి పరిశీలించి మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పార్వతి పిల్లలు, పార్వతి మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ శ్రీధర్‌రెడ్డి వివరాలు పట్టణంలో నివాసం ఉండే బలభద్రుని రంగయ్య, లక్ష్మీదేవిల మూడో కుమార్తె పార్వతిని కంభం రోడ్డులో నివాసం ఉండే శరభయ్యకు ఇచ్చి పదేళ్ల కింద ట వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. పార్వతి ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుండగా, శరభయ్య ముఠా కూలీగా ఉన్నాడు. ఇటీవల కాలంలో భార్యపై అనుమానం పెంచుకుని తరచుగా వేధించసాగాడు. మద్యానికి అలవాటు పడి భార్యను కొట్టేవాడు. విషయం పార్వతి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు వచ్చి కూతురు, అల్లుడితో మాట్లాడి కలిసి ఉండాలని సర్ది చెప్పారు. బుధవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన శరభయ్య గొడ్డలితో పార్వతి తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన స్థలం నుంచి శరభయ్య పరారయ్యాడు. విలపించిన తల్లిదండ్రులు: సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు లక్ష్మీదేవి, రంగయ్యలు కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. పార్వతిని గొడ్డలితో కొట్టడంతో రక్తం ధారలా ప్రవహించింది. పార్వతి పిల్లలు ఇద్దరూ తల్లి మృతదేహాన్ని చూసి రోదించారు. తల్లిని పట్టుకుని లేమ్మా అంటూ పిలవటం అక్కడ ఉన్న వారి కంట కన్నీరు తెప్పించింది. వృద్ధాప్యంలో తమకు కడుపు కోత మిగిల్చి పోయిందని పార్వతి తల్లిదండ్రులు విలపించారు. మృతదేహాన్ని చూసేందుకు ఆ ప్రాంత ప్రజలు తరలివచ్చారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ ఆ ప్రాంత పిల్లలకు ట్యూషన్ చెబుతూ ఉండే పార్వతి చని పోవడం చూసి మహిళలు ఆవేదనకు గురయ్యారు. -
బుడతల్లారా.. ఉడతల్లారా!
స్కూలు వదలగానే నాలుగో తరగతి చదువుతున్న అభిరామ్, భాస్వంత్‌లు కొందరు స్నేహితులతో కలిసి పక్కనే ఉన్న పార్కుకి వెళ్లి జారుడు బల్ల, ఉయ్యాల, దాగుడు మూతలు.. ఎంతో సంబరంగా అడుకున్నారు. తర్వాత ఇసుకలో దూదుం పుల్ల ఆడుతున్నారు. వారి ఆటలకు సంబరపడుతూ నింగినుంచి మహాకవి శ్రీశ్రీ కిందికి దిగారు. ఆ చిన్నారులను దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఆయనకు తను రాసిన కవిత్వం స్ఫురించింది.‘‘మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకసమున హరివిల్లు విరిస్తేఅవి మీకే అని ఆనందించే కూనల్లారా... ఈలలు వేస్తూ ఎగురుతు పోయే పిల్లల్లారా పిల్లల్లారాగరిక పచ్చ మైదానాల్లోనూ తామరపూవుల కోనేరులలోపంట చేలలో బొమ్మరిళ్లలో తండ్రి పందిటా తల్లి కౌగిటానోళుల వ్రేళులు, పాలబుగ్గలూ ఎక్కడ చూస్తే అక్కడ మీరైవిశ్వరూపమున విహరిస్తుండే పరమాత్మలు ఓ చిరుతల్లారాఉడుతల్లారా బుడతల్లారా ఇది నా గీతం... వింటారా...’’ అంటూ శైశవగీతి వినిపించాడు.పాట వింటున్న బుడతలు, ‘తాతా! మాకు హరివిల్లు ఎలా ఉంటుందో తెలియదు, గరికపచ్చ మైదానాలు, తామర కొలనులు ఏవీ తెలియవు. అవన్నీ ఎక్కడ ఉంటాయి’ అని అమాయకంగా ప్రశ్నించారు. శ్రీశ్రీ నోట మాట రాలేదు. ఆ పసికూనలకు ఎక్కడ ఎలా చూపించాలో తెలియలేదు.‘మీ స్కూల్ టీచర్లు ఇవేవీ చూపించలేదా, మీ అమ్మానాన్నలు వీటి గురించి చెప్పలేదా’ అని అడిగాడు. అందుకు ఆ చిన్నారులు, ‘లేదు తాతా!’’ అన్నారు. వారి స్థితికి చింతిస్తూ, బరువెక్కిన గుండెతో మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు శ్రీశ్రీ.అంతలోనే యశోదమ్మ వచ్చింది, ‘ఓయమ్మ మీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగ మననీడమ్మా, పోయెదమెచ్చటికైనను మాయన్నుల సురభులాన మంజులవాణీ’ అని చదివాడు కాస్త తెలుగు తెలిసిన పెద్ద బుడతడు. ఆ మాటలు చెవిన పడ్డాయో లేదో యశోదలోని మాతృత్వం బయటకు వచ్చింది, ‘ఏం నాయనా! ఇలా నా కుమారుడి మీద నేరాలు చెబుతున్నారు’ అని అడిగింది. ‘అవ్వా! మీ అబ్బాయి ఇంత అల్లరి చేస్తే నువ్వు ఎన్నడూ కొట్టలేదా’ అని అడిగారు. ‘కొట్టలేదురా పిల్లలూ! మీలాంటి చిట్టిచిట్టి పిల్లలు అల్లరి చేస్తేనే సరదాగా ఉంటుంది. ఇరుగుపొరుగమ్మలు నేరాలు చెప్పినా, చిన్నారి కృష్ణుడు ఏం చేశాడో తెలుసుకుని, అది పెద్ద తప్పయితే, నెమ్మదిగా మందలించేదాన్ని. చిన్నపిల్లలు దేవుడితో సమానం, అందుకే పిల్లలు అల్లరి చేసినా దేవుడి చేష్టగానే భావించేదాన్ని’’ అని చెప్పి వెళ్లిపోయింది యశోద. చిన్నారులకు ఆ యశోదమ్మ పిల్లవాడిని కొట్టలేదన్న విషయం అర్థమైంది. ‘శ్రీశ్రీ తాతయ్య, యశోద అమ్మమ్మ మాటలు వింటుంటే నాకు కూడా తాతయ్య ఇంటికి వెళ్లాలనుంది’ అన్నాడు ఒక చిన్నారి.‘నాకూ వెళ్లాలనే ఉంది. కాని స్కూల్‌కి సెలవులు ఉండవుగా. ఒకవేళ ఇచ్చినా, ఏవో ఒకటి నేర్చుకోమంటుంది అమ్మ’ అంటూ దిగాలుగా అన్నాడు మరో చిన్నారి. వీళ్ల మాటలు వింటున్న దశరథుడు వారి దగ్గరగా వచ్చి, ‘నాయనలారా! ఎందుకురా ఇలా డీలాపడుతున్నారు’ అని ప్రశ్నించాడు. ‘తాతా! రాముడు ఒకసారి చందమామ కావాలి అని ఏడుస్తుంటే, నువ్వు అద్దం తీసుకువచ్చి ఆ అద్దంలో చందమామను చూపించావు. చందమామ కోసం పేచీ పెట్టాడని కొట్టలేదు కదా! కాని మా అమ్మనాన్నలు నేను ఏది అడిగినా తెచ్చివ్వకపోగా గట్టిగా కోప్పడతారు. అంతేనా ఒకసారి నేను పార్కుకి తీసుకెళ్లమని అడిగినందుకు నన్ను హాస్టల్లో చేర్పించేశారు’’ అంటూ ముఖం చిన్నబుచ్చుకున్నాడు. దశరథుడి పితృహృదయం పరితపించింది. నా రామచంద్రుడు అరణ్యాలకు వెళ్లినందుకేగా నేను విలపించి విలపించి మరణించాను. మరి నేటి తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నారు అనుకున్నాడు. చిన్నారులకు కొద్దిసేపు ఒడిలోకి తీసుకుని, సముదాయించి, బుజ్జగించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆటల సమయం మించిపోవడంతో ఆ చిన్నారులంతా ఇంటికి వెళ్లిపోయారు. ఆ రాత్రంతా వారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. వారి ఆనందానికి అవధులు లేవు. అందమైనది బాల్యంరాముడు, కృష్ణుడు, వివేకానందుడు.. ఎందరో మహానుభావులు బాల్యాన్ని అందంగా అనుభవించారు. విశాలమైన ఆటస్థలంలో ఆడుకున్నారు. అమ్మనాన్నల ప్రేమను సంపూర్ణంగా ఆస్వాదించారు. సెలవులకి తాతయ్యల ఇళ్లకు వెళ్లి వారి దగ్గర కథలు విన్నారు, వారు పెట్టే సున్నుండలు తిన్నారు, ఎండల్లో మామిడిచెట్లు ఎక్కారు, వానలో పడవలు వేశారు, చలిలో చలి మంటలు వేసుకున్నారు. గాలిలో గాలిపటాలు ఎగురవేశారు... పంచభూతాలతో చెట్టపట్టాలేసుకుని ఆడుకున్నారు. వారి జీవితం నిజమైన శైశవగీతి అయ్యింది. – డా. వైజయంతి పురాణపండ -
నేనూ బాధితురాలినే
‘మీటూ’ ఉద్యమం వల్ల చాలామంది స్త్రీలు తమకు జరిగిన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. మరికొందరు తమను వేధించిన వాళ్ల పేర్లను కూడా బయటపెడుతున్నారు. తాజాగా మలయాళ నటి పార్వతి ఈ విషయం గురించి మాట్లాడారు. ‘నేనూ ఓ బాధితురాలినే అంటూ తనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని ఓ కార్యక్రమంలో పంచుకున్నారు. ‘‘ఈ సంఘటన నాకు నాలుగేళ్ల వయసులో జరిగింది. అది తప్పు అని తెలుసుకోవడానికి నాకు సుమారు 17ఏళ్లు పట్టింది. మళ్లీ దాని గురించి మాట్లాడటానికి మరో పదేళ్లు పట్టింది. ఆ సంఘటన నుంచి బయటపడాలని అనుకుంటుంటాను. కానీ ఒక్కసారి ఇలాంటి లైంగిక దాడి జరిగిన తర్వాత మళ్లీ మనం మామూలుగా ఉండలేం. గతం తాలూకు ఆ ఆలోచనలు మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. నా పేరెంట్స్, స్నేహితులు మెల్లిగా నా స్థితికి అలవాటు పడుతున్నారు. బాధితురాలిగా ఉండటం కేవలం శారీరక గాయంగా మాత్రమే చూడొద్దు. ప్రతిరోజూ పడే మానసిక క్షోభ అది. దాన్ని దాటుకొని బయటకు రావాలంటే ఎంతో మానసిక ధైర్యం కావాలి’’ అని పేర్కొన్నారు పార్వతి. -
వెండితెరకు వైరస్
ఈ సంవత్సరం స్టార్టింగ్‌లో నిఫా వైరస్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కేరళ రాష్ట్రాన్ని. అందర్నీ గడగడలాడించిన ఈ భయంకరమైన వైరస్‌ని బేస్ చేసుకొని మలయాళ దర్శకుడు ఆషిక్ అబు ఓ చిత్రాన్ని రూపొందించడానికి రెడీ అయ్యారు. ‘వైరస్’ పేరుతో తెరకెక్కబోయే ఈ రియలిస్టిక్ డ్రామాలో భారీ తారాగణం కనిపించబోతున్నారు. రేవతి, రీమా కళ్లింగల్, పార్వతీ, టావినో థామస్, రమ్యా నంబీసన్, చెంబు వినోద్ వంటి నటీనటులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆల్రెడీ మలయాళంలో రియలిస్టిక్ సంఘటనలతో తెరకెక్కించిన ‘టేకాఫ్’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. మరి.. ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ కానున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో స్టార్ట్ కానుంది. -
ప్రియురాలి హత్య కేసులో నిందితుడికి రిమాండ్
యడ్లపాడు: ప్రియురాలిని హత్య చేసిన కేసులో నిందితుడిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. చిలకలూరిపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ యు. శోభన్‌బాబు వివరాలు వెల్లడించారు. గుంటూరు సంగడిగుంటకు చెందిన పిల్లి పార్వతి(45)తో అదే ప్రాంతానికి చెందిన రాడ్ బెండింగ్ పనులు చేసుకునే యర్రా శ్రీనివాసరావుకి వివాహేతర సంబంధం ఏర్పడింది. పార్వతికి రూ.25 వేలను కూడా శ్రీనివాసరావు అప్పుగా ఇచ్చాడు. పార్వతి నడవడికపై అనుమానం వచ్చిన అతడు నిలదీయడంతో ఇద్దరి మధ్యా గొడవులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాను ఇచ్చిన డబ్బు వేలు ఇవ్వాలంటూ అడగడంతో వివాదం మరింత ఘర్షణకు దారితీసింది. దీంతో మార్చి 30 యడ్లపాడు మండలం బోయపాలెం డైట్ కళాశాల వెనుక పొలాల్లోకి పార్వతిని తీసుకువెళ్లి చీరతో ఉరివేసి హత్య చేశాడు. శుక్రవారం చిలకలూరిపేటలోని ఏఎంజీ వద్ద నిందితుడిని పట్టుకుని కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ వివరించారు. -
నాంపల్లి కోర్టుకు గజల్ శ్రీనివాస్
-
నాంపల్లి కోర్టుకు గజల్ శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: యువతిపై వేధింపులకు పాల్పడిన కేసులో ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్‌కు విధించిన జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈనెల 25 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఆయనను శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. తనకు బెయిల్ ఇవ్వాలని మరోసారి ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈనెల 18న కోర్టు విచారణ జరపనుంది. అంతకుముందు ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో మరోసారి అర్జీ పెట్టుకున్నారు. ‘సేవ్ టెంపుల్స్’ సంస్థలో పనిచేస్తున్న సహచర ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈ నెల 2న గజల్ శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. పార్వతి ముందస్తు బెయిల్ పిటిషన్ కాగా, ఈ కేసులో రెండో నిందితురాలిగా ఉన్న ‘సేవ్ టెంపుల్స్’ ఉద్యోగిని పార్వతి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గజల్ శ్రీనివాస్ అరెస్టైనప్పటి నుంచి ఆమె పరారీలో ఉన్నారు. గజల్ శ్రీనివాస్ వేధింపులకు సహకరించారని, చెప్పినట్లుగా వినాలని బాధితురాలిపై ఆమె ఒత్తిడి తీసుకువచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
లైంగిక వేధింపుల కేసు: పార్వతి పరార్!
సాక్షి, హైదరాబాద్: గాయకుడు గజల్ శ్రీనివాస్ ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో రెండో నిందితురాలిగా ఉన్న పార్వతి పరారీలో ఉంది. ఆమెకు నోటీసులు జారీ చేయడానికి పంజాగుట్ట పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు సహకరించిన పార్వతి.. శ్రీనివాస్ చెప్పినట్లుగా వినాలని బాధితురాలిపై ఒత్తిడి తీసుకువచ్చిందని ప్రధాన ఆరోపణ. మంగళవారం ఉదయం పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్టు చేయగా.. ఆ రోజు సాయంత్రం వరకు కూడా పార్వతి సేవ్ టెంపుల్స్ సంస్థ కార్యాలయం వద్ద ఉంది. గజల్ శ్రీనివాస్ తనకు తండ్రిలాంటి వాడని, 20 ఏళ్లుగా తాను అక్కడే పనిచేస్తున్నా ఎలాంటి ఇబ్బందులు రాలేదని మీడియాకు చెప్పింది. బాధితురాలు ఎందుకు ఫిర్యాదు చేసిందో అర్థం కావడం లేదనీ పేర్కొంది. కానీ బాధితురాలు చేసిన స్టింగ్ ఆపరేషన్ వీడియోలు మంగళవారం సాయంత్రం బయటకు వచ్చాయి. అందులో పార్వతి, గజల్ శ్రీనివాస్‌ల రాసలీలలు స్పష్టంగా కనిపించాయి. ఆ తర్వాతి నుంచి పార్వతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు పంజాగుట్ట పోలీసులు ప్రయత్నించినా ఆచూకీ దొరకలేదు. ఆమె సెల్‌ఫోన్ సైతం స్విచాఫ్ చేసి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పార్వతి ఆచూకీ కోసం సేవ్ టెంపుల్స్ కార్యాలయం, ఆమె ఇల్లు, స్నేహితుల వద్ద ఆరా తీస్తున్నారు. కస్టడీపై నేడు నిర్ణయం విచారణ నిమిత్తం గజల్ శ్రీనివాస్‌ను తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం వాదనలు ముగిశాయి. న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించనుంది. ఇక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన గజల్ శ్రీనివాస్‌పై సేవ్ టెంపుల్స్ సంస్థ వేటు వేసింది. ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించినట్లు సంస్థ అధ్యక్షుడు ప్రకాశ్‌రావు వెలగపూడి ఓ ప్రకటన విడుదల చేశారు. తమ సంస్థ కార్యాలయాలను దేవాలయాలుగా పరిగణిస్తామని, అక్కడ పనిచేసే మహిళల్ని తాము గౌరవంగా చూసుకుంటామని పేర్కొన్నారు. బాధితురాలి సాహసంపై సోషల్ మీడియాలో ప్రశంసలు గజల్ శ్రీనివాస్‌కున్న పెద్దమనిషి ముసుగు తొలగించడానికి, ఆయన నిజ స్వరూపం బయటపెట్టడానికి స్టింగ్ ఆపరేషన్ చేసిన బాధితురాలిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. అంతటి సాహసం చేసిన ఆమెకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటూ అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. కాగా.. ‘సాక్షి’తో మాట్లాడిన బాధితురాలు.. తనకు ఎదురైన చేదు అనుభవాలు వివరించారు. వెంటనే స్పందించిన పోలీసులు తనకు ఎంతో ధైర్యం ఇచ్చారంటూ ధన్యవాదాలు తెలిపారు. -
గతి తప్పిన ‘గజల్’
సాక్షి, హైదరాబాద్ ఆధ్యాత్మిక, దేశభక్తి, మహిళల భద్రత.. ఇలా ఎన్నో అంశాలపై గజల్స్ రాసి ఆలపిస్తున్న కేసిరాజు శ్రీనివాస్ అలియాస్ గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యాడు. తాను బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న సంస్థలోని ఉద్యోగినినే వేధించి అడ్డంగా బుక్కయ్యాడు. బాధితురాలు పక్కా సాక్ష్యాలతో పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన బాగోతం బయటపడింది. ఈ కేసులో పార్వతి అనే మహిళను కూడా నిందితురాలిగా చేర్చినట్టు ఇన్స్పెక్టర్ ఎస్.రవీందర్ మంగళవారం వెల్లడించారు. నాంపల్లి కోర్టులో నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లు బుధవారానికి వాయిదా పడ్డాయి. దీంతో గజల్ శ్రీనివాస్‌కు జ్యుడీషియల్ రిమాండ్ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆఫీసులో మసాజ్ చేయాలంటూ.. : పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన బాధిత మహిళ బీకాం, బ్యూటీషియన్ కోర్సులు పూర్తి చేయడంతో పాటు ప్రవచనాలు, వేదాలు అధ్యయనం చేసింది. ఈమెకు 2014లో వివాహమైనా మూడు నెలలకే విడాకులు తీసుకుంది. గతేడాది జూన్ నుంచి పంజగుట్ట పరిధిలోని సప్తగిరి బిల్డింగ్‌లో ఉన్న సేవ్ టెంపుల్ సంస్థలో నెలకు రూ.13 వేల జీతానికి పని చేస్తోంది. ఆ సంస్థ నిర్వహించే వెబ్ రేడియో ఆలయవాణికి ఇన్చార్జ్గా విధులు నిర్వర్తిస్తోంది. వెలగపూడి ప్రకాశ్‌రావు నేతృత్వంలోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయం మూడేళ్లుగా సప్తగిరి బిల్డింగ్‌లోని త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో నడుస్తోంది. ఈ సంస్థకు గజల్ శ్రీనివాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి బాధితురాలు ఈ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకే విధులు నిర్వర్తించాల్సి ఉంది. అయితే గజల్ శ్రీనివాస్ తరచూ ఆ కార్యాలయానికి వెళ్లి అర్ధరాత్రి వరకు గడిపేవాడు. బాధితురాలిని కూడా ఆ సమయం వరకు ఉండాల్సిందిగా ఒత్తిడి చేసేవాడు. ఇందుకు ఆమె గతంలోనే అనేకసార్లు సున్నితంగా తిరస్కరించింది. సేవ్ టెంపుల్ సంస్థలో బాధితురాలితో పాటు వీడియో ఎడిటర్, సహాయకుడు, పని మనిషి పార్వతి మాత్రమే ఉద్యోగులుగా ఉన్నారు. కార్యాలయానికి సంబంధించిన మూడు బెడ్రూమ్స్లో ఒకదాన్ని గజల్ శ్రీనివాస్ తన అనైతిక కార్యకలాపాలకు వినియోగించేవాడు. వేళకాని వేళల్లో పని మనిషి పార్వతితో కాళ్లు నొక్కించుకోవడం, మసాజ్ చేయించుకోవడంతోపాటు ఇతర అనైతిక కార్యకలాపాలకు పాల్పడేవాడు. బెదిరింపులు.. వేధింపులు పార్వతి మాదిరే తనకు ‘సహకరించాలంటూ’ శ్రీనివాస్ బాధితురాలిపై ఒత్తిడి చేసేవాడు. లేదంటే ఉద్యోగం నుంచి తీసేస్తానని, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతోపాటు మరెక్కడా ఉద్యోగం రాకుండా చేస్తానని బెదిరించేవాడు. పార్వతి సైతం గజల్ శ్రీనివాస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ బాధితురాలిపై అనేకసార్లు ఒత్తిడి తీసుకువచ్చింది. ‘‘నేను చేస్తున్నట్లే సార్‌కు చెయ్యి. అప్పుడే మంచి జీతంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తాడు. ఆయన చాలా పెద్దోడు. నాకు చేసినట్లే నీకు పెళ్లి కూడా చేస్తాడు’’ అని చెప్పేది. ఈ వేధింపులు తారస్థాయికి చేయడంతో అనేకసార్లు తిరస్కరించిన బాధితురాలు.. కొన్ని సందర్భాల్లో పార్వతితో కలిసి రెండుమూడు గంటల పాటు గజల్ శ్రీనివాస్ కాళ్లు నొక్కేది. దీంతో మరింత రెచ్చిపోయిన గజల్ శ్రీనివాస్ ఆ గదిలో నగ్నంగా/అర్ధనగ్నంగా ఉండి బాధితురాలిని పార్వతి ద్వారా పిలిపించేవాడు. ఆమెను బలవంతంగా ఆలింగనం చేసుకోవడం, చేతులతో అభ్యంతరకరంగా తడమటం చేసేవాడు. వీటిని భరించలేకపోయిన బాధితురాలు హెచ్చరిస్తే... బెదిరింపులకు దిగేవాడు. ఫోన్ ద్వారా, వాట్సాప్ చాటింగ్స్ ద్వారానూ హింసించేవాడు. బాధితురాలి స్టింగ్ ఆపరేషన్ గజల్ శ్రీనివాస్ వేధింపులు శృతిమించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధితురాలు భావించింది. అయితే పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం, కేవలం ఫిర్యాదు మాత్రమే చేస్తే ఎవరూ నమ్మరనే ఉద్దేశంతో స్వయంగా స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది. సేవ్ టెంపుల్ కార్యాలయంలో శ్రీనివాస్ వినియోగిస్తున్న బెడ్రూమ్లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇందులో గజల్ శ్రీనివాస్, పార్వతి రాసలీలలతోపాటు పార్వతితో కలిసి బాధితులురాలు శ్రీనివాస్ కాళ్లు నొక్కుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. వీటి ఆధారంగా గత శుక్రవారం (డిసెంబర్ 29) పంజగుట్ట పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. వీడియో రికార్డులతోపాటు వాయిస్ రికార్డులు, ఫొటోలు పోలీసులకు అందించింది. దీంతో ఐపీసీ 354, 354 (ఏ), 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విషయం గోప్యంగా ఉంచి ప్రాథమిక దర్యాప్తు చేశారు. అన్ని ఆధారాలు సేకరించి మంగళవారం ఉదయం ఆనంద్‌నగర్ కాలనీలోని తన నివాసంలో గజల్ శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. ఠాణాలో టేబుల్‌పై దరువేస్తూ.. గజల్ శ్రీనివాస్‌ను పోలీసుస్టేషన్‌కు తరలించి డాక్యుమెంటేషన్ పూర్తయ్యే వరకు దాదాపు రెండు గంటల పాటు ఠాణాలోని ఇంటర్వ్యూ రూమ్‌లో ఉంచారు. ఈ సమయంలోనూ ఎలాంటి పశ్చాత్తాప ఛాయలు లేని గజల్ శ్రీనివాస్ అక్కడి టేబుల్‌పై దరువేస్తూ కనిపించారు. ఈ దృశ్యాలను అక్కడున్న మీడియా ప్రతినిధులు రికార్డు చేశారు. అనంతరం గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానంలో శ్రీనివాస్ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే గజల్ శ్రీనివాస్ పలుకుబడి ఉన్న వ్యక్తని, బెయిల్‌పై బయటకు వస్తే కేసులో ఫిర్యాదిగా ఉన్న బాధితురాలిని బెదిరించడం, సేవ్ టెంపుల్ సంస్థ కార్యాలయంలో ఉన్న సీసీకెమెరా ఫుటేజ్‌లతోపాటు ఇతర సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారంటూ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన్ను రెండు వారాల పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరారు. రెండు పిటిషన్లపై వాదనలను విన్న న్యాయస్థానం.. శ్రీనివాస్‌కు ఈ నెల 12 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. దీంతో పోలీసులు ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో పార్వతిని రెండో నిందితురాలిగా చేర్చామని, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కేసును తీవ్రంగా పరిగణిస్తాం: ఏసీపీ విజయ్‌కుమార్ లైంగిక వేధింపుల కేసును తీవ్రంగా పరిగణిస్తామని పంజగుట్ట ఏసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వారి కార్యాలయంలో కూడా విచారించి, వీడియోలు, ఆడియోలు, ఫోటోలు అన్ని ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఏ–1గా శ్రీనివాస్, ఏ–2గా పనిమనిషి పార్వతిని చేర్చినట్లు తెలిపారు. శ్రీనివాస్ గత రెండ్రోజులుగా నగరంలో లేడని, మంగళవారం ఉదయం వచ్చినట్టు తెలియగానే అరెస్టు చేసినట్లు తెలిపారు. వద్దన్నా ఫిజియోథెరపీ చేసింది ఆమెను (బాధితురాలు) నేను ఓ కుమార్తెలా చూసుకున్నా. గతంలో జరిగిన ఓ యాక్సిడెంట్లో నా చేతికి గాయమైంది. వైద్యుల సలహా మేరకు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నా. ఆ రోజు ఫిజియోథెరపిస్ట్ రాలేదు. దీంతో తనకు అనుభవం ఉందని, తానే చేస్తానంటూ ఆమె ముందుకు వచ్చింది. నేను వద్దని వారించినా ఫిజియో«థెరపీ చేసింది. ఇప్పుడు ఇలా ఎందుకు ఫిర్యాదు చేసిందో అర్థం కావడం లేదు. – మీడియాతో గజల్ శ్రీనివాస్ పచ్చి మోసగాడు.. గజల్ శ్రీనివాస్ పెద్ద మనిషి ముసుగు వేసుకుని ఉన్న పచ్చి మోసగాడు. ఆయన లైంగిక వేధింపులను పలుమార్లు సంస్థ నిర్వాహకులతో పాటు ఆయన కుటుంబ సభ్యుల దృష్టికి కూడా తీసుకువెళ్లా. వారెవరూ పట్టించుకోకపోవడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశా. శ్రీనివాస్ కోరినట్లు ఉండాలంటూ పార్వతి నాపై అనేకసార్లు ఒత్తిడి చేసింది. ఆమె కూడా మంచిది కాదు. రెండు నెలలుగా నాపై వేధింపులు పెరిగాయి. – మీడియాతో బాధితురాలు -
నాలాగా మరో యువతి బాధపడకూడదనే
-
గజల్ శ్రీనివాస్ పచ్చి మోసగాడు..
సాక్షి, హైదరాబాద్ : పెద్దమనిషి ముసుగులో చెలామణి అవుతున్న గజల్ శ్రీనివాస్ పచ్చి మోసగాడు అని లైంగిక వేధింపులు ఎదుర్కొన్న యువతి ఆరోపించింది. లైంగిక వేధింపుల విషయాన్ని గజల్ శ్రీనివాస్ భార్య దృష్టికి కూడా తీసుకు వెళ్లినట్లు ఆమె తెలిపింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ..‘ వేధింపులపై గజల్ శ్రీనివాస్ కుటుంబసభ్యులు స్పందించలేదు. గత రెండు నెలలుగా వేధింపులు ఎక్కువ అయ్యాయి. వాటిని తట్టుకోలేకే సాక్ష్యాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశా. ఆయన వద్ద పనిచేసే చేసే పార్వతి మంచిది కాదు. ఆమె నన్ను ప్రలోభపెట్టేందుకు చాలా ప్రయత్నించింది. సార్ మాట వింటే మంచి లైఫ్ ఉంటుందని చెప్పుకొచ్చేది. నేను ఒక్కదాన్నే కాదు...ఆఫీస్‌లో చాలామంది వేధింపులకు గురయ్యారు. అంతేకాకుండా గజల్ శ్రీనివాస్ చాలా విచిత్రంగా ప్రవర్తించేవాడు. త్వరలో నేను గవర్నర్ అవుతా. నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తా. ఒకవేళ నా మాట వినకపోతే నీకు బయట ఎక్కడా జాబ్ దొరకకుండా చేస్తా అని బెదిరించేవాడు. చాలామంది అమ్మాయిలందరినీ అదే విధంగా బెదిరించేవాడు. గదిలోకి పిలిచి లైంగికంగా వేధించేవాడు. అయితే నాకులా మరో యువతి బాధపడకూడదనే ఉద్దేశ్యంతో ధైర్యంగా ముందుకు వచ్చాను. పోలీసులు కూడా నా ఫిర్యాదుకు స్పందించారు. అందుకే పక్కా సాక్ష్యాలను పోలీసులు అందించా. గజల్ శ్రీనివాస్‌కు జీవితాంతం జైల్లోనే ఉండాలి. అతడికి జైలు శిక్ష కూడా సరిపోదు. అలాంటి వాడిని తేలికగా వదలకూడదు. కఠినంగా శిక్షించాలి.’ అని డిమాండ్ చేసింది. వెలుగు చూస్తున్న ‘గజల్’ అకృత్యాలు గజల్ శ్రీనివాస్ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మసాజ్ పేరుతో తన వద్ద పనిచేసే యువతులను వేధింపులకు గురి చేయడమే కాకుండా, తన మాట వినకపోతే సిబ్బందితో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడని తెలుస్తోంది. యువతులతో మసాజ్ చేయించుకున్న దృశ్యాలు మీడియాకు చిక్కాయి. ఆ వీడియోల్లో గజల్ శ్రీనివాస్...అమ్మాయిలతో కలిసి ఉన్న దృశ్యాలు ఉండగా, గత కొన్నేళ్లుగా చాలామంది సిబ్బందితో అతడు ఇదే తరహాలో జల్సాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా తనవద్ద పనిచేసే యువతుల పేదరికాన్ని ఆసరా చేసుకుని గజల్ శ్రీనివాస్ ఈ అకృత్యాలకు పాల్పడుతుండేవాడని, అతడికి పనిమనిషి పార్వతి సహకరించేదని తెలుస్తోంది. మరోవైపు తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని గజల్ శ్రీనివాస్ అన్నారు. వేధింపుల కేసులో అరెస్ట్ అనంతరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ..ఆమెను తన బిడ్డలా చూసుకున్నానని, ఎప్పుడూ అసభ్యంగా తాను ప్రవర్తించలేదని అన్నారు. అసలు ఆమె పట్ల తనకెలాంటి చెడు అభిప్రాయం లేదని గజల్ శ్రీనివాస్ అన్నారు. -
‘గజల్’ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్ : లైంగికి వేధింపులకు పాల్పడ్డి జైలు పాలైన గజల్ శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసుకు సంబంధించి నిందితులుగా గజల్ శ్రీనివాస్‌ను ఏ1గా, పనిమనిషి పార్వతిని ఏ2గా చేర్చారు. మహిళల పట్ల గజల్ శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తించేవాడని, అభ్యంతరకరమైన ప్రాంతాల్లో మసాజ్ చేయాలని బెదరించేవాడని వేధింపులు ఎదుర్కొన్న యువతి పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి స్టింగ్ ఆపరేషన్ వీడియోలను బాధితురాలు పోలీసులకు అందచేసింది. గజల్ శ్రీనివాస్ తండ్రిలాంటివారు.. రేడియో జాకీని లైంగికంగా వేధించిన కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న పార్వతి మాట్లాడుతూ.. గజల్ శ్రీనివాస్ తనకు తండ్రి లాంటి వాడని తెలిపింది. ఆయన దగ్గర తాను చాలాకాలంగా పని చేస్తున్నానని, మహిళలను వేధించే వ్యక్తి కాదని చెప్పింది. ఆరోపణలు చేసిన ఆమె... తనకు తానుగా మసాజ్ చేస్తానని ముందుకొచ్చిందని పార్వతి ఆరోపిస్తోంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇంత స్థాయికి ఎదిగిన వ్యక్తి...ఓ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడంటే నమ్మేలా లేదని శ్రీనివాస్ ఫ్యామిలి ఫ్రెండ్ జ్యోతిర్మయి అన్నారు. ఖైదీ నెంబర్ 1327 లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన మేజిస్ట్రేట్ గజల్ శ్రీనివాస్ కు ఈ నెల 12 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైలు అధికారులు... గజల్ శ్రీనివాస్‌కు 1327 నెంబర్ ను కేటాయించారు. మరోవైపు న్యాయమూర్తి రిమాండ్ ప్రకటించిన వెంటనే గజల్ శ్రీనివాస్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై కోర్టులో వాదోపవాదనలు జరిగిన అనంతరం బెయిల్ పిటిషన్ ను న్యాయమూర్తి రద్దు చేశారు. అలాగే గజల్ శ్రీనివాస్ ను రెండు వారాల కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటీషన పై విచారణ రేపటికి వాయిదా పడింది. -
గజల్ శ్రీనివాస్ తండ్రిలాంటివారు..
-
ఒంటరి జీవితాల్లో లవ్ వెలుతురు కరీబ్ కరీబ్ సింగిల్
ఒంటరి మగవాళ్ల గురించి లోకం ఆలోచించదు. ఎక్కడో తింటాడు. ఎక్కడో నిద్రపోతాడు. సరే. ఒంటరి ఆడవాళ్ల గురించి లోకం ఆలోచిస్తుందా? భర్త చనిపోయి ఉండవచ్చు. లేదా విడాకులు తీసుకుని ఉండవచ్చు. లేదా పెళ్లి ఆలస్యమై ఉండవచ్చు. వారి మనసులో ఏముంది? వారి శరీరం ఏమంటోంది? వారు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు? వారు ఏమని మాట్లాడాలనుకుంటున్నారు? ఎవరికి పట్టింది... పద్ధతిగా ఉంటూ సంఘానికి ప్రమాదం తెచ్చిపెట్టకుండా మర్యాదకరంగా జీవించాలనే అగోచర హద్దు గీసి లోకం తన పనుల్లో తాను బిజీగా ఉంటుంది. మరి వారి గోడు? ఈ సినిమాలో హీరోయిన్ విడో. భర్త మిలటరీలో మరణించి ఉంటాడు. గతం గతః అనుకోలేకపోతోంది. వయసు 35. చక్కటి రూపం. ఆరోగ్యవంతమైన దేహం. కాని సింగిల్‌గా ఉంటోంది. తమ్ముడు ఎక్కడో అమెరికాలో చదువుకుంటున్నాడు. తల్లి ఏదో ఊళ్లో ఉంది. తను ముంబైలో. మంచి ఉద్యోగమే. మంచి ఇల్లే. మంచి కారే. సరా? తనకు కావలసినవన్నీ ఉన్నట్టేనా? ఒంటరితనం ఆమెను బాధిస్తూ ఉంది. కాని భర్త జ్ఞాపకాల పట్ల లాయల్‌గా ఉండాలన్న సగటు భారతీయ అభిప్రాయం ఆమెలో ఉంది. గతం తాలూకు లగేజ్ ఆమెను వదల్లేదు. అలాంటి హీరోయిన్ ఒక డేటింగ్ సైట్లో తన వివరాలు పోస్ట్ చేస్తే ఇర్ఫాన్ ఖాన్ పరిచయం అవుతాడు. హీరోయిన్ వాలకం గమనిస్తాడు. ‘మీ అరేంజ్డ్ మేరేజ్ వాళ్లంతా ఇంతే. భర్తలకు అవసరానికి మించి ప్రాధాన్యం ఇస్తారు’ అంటాడు. ‘ప్రేమలో అలా కాదు. ప్రేమ ఒక కవిత్వం’ అంటాడు. తనకు ముగ్గురు మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారని వాళ్లంతా తనను తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంటారని చెబుతాడు. హీరోయిన్ ‘నీ మొహం’ అన్నట్టు చూస్తుంది. తన మాట నిరూపించుకోవడానికి ఆమెను ఆ ముగ్గురూ ఉన్న మూడు ఊర్లు– డెహరాడూన్, జైపూర్, గాంగ్టక్ తీసుకువెళతాడు. ఆ ప్రయాణమే ఈ కథ. సినిమాలో ఇర్ఫాన్ చాలా భోళామనిషి. వాగుడుకాయ. మనసులో అనిపించింది చెప్పి, అనుకున్నది చేసేయాలనుకునే రకం. కాని ఆడవాళ్లంటే గౌరవం. ‘ఈ క్షణంలో ఈ నిమిషంలో జీవితాన్ని ఎలా ఉంటే అలా ఎంజాయ్ చేయ్’ అనేది అతడి ఫిలాసఫీ. అందుకే మొదటి ట్రిప్పులోనే ఆమెను ఫ్లయిట్ ఎక్కించి, తను ఫ్లయిట్ మిస్సయినా హాయిగా తర్వాతి ఫ్లయిట్లో వస్తాడు. ఆమె మాత్రం టెన్షన్‌తో చస్తుంది. ఢిల్లీలో కూడా అంతే. జైపూర్ ట్రైన్ ఎక్కించి, తను పొరపాటున వేరే ట్రైన్ ఎక్కేస్తాడు. ఆమెకు మళ్లీ టెన్షన్. అతను మాత్రం ఏ ట్రైన్లో ఎక్కాడో ఆ ట్రైన్లో హాయిగా పేకాటలో కూర్చుంటాడు. ఇది ఆమెకు నచ్చదు. కాని ఇది ఆమెకు బాగుంది కూడా. నిజానికి ముందు ట్రిప్పు ముగిసే టైముకే ఆమె అతడి ప్రేమలో పడుతుంది. రెండో ట్రిప్పులో అతడు రెండో మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను కలవాలని అనుకున్నప్పుడు అసూయతో రగిలి నానా గోల చేస్తుంది. మూడో ట్రిప్‌లో అసలు అతడి గర్ల్‌ఫ్రెండ్‌నే చూడదు. అతణ్ణి ఉడికించాలని తనకో మాజీ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడంటూ ఎవరినో చూడటానికి వెళుతుంది. కాని ఆశ్చర్యం ఏమిటంటే అతడు కూడా తన మూడో మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడు. ఎందుకంటే అప్పటికే హీరోయిన్ ప్రేమలో మునిగిపోయాడు కాబట్టి. ఈ మూడు ప్రయాణాల్లో వాళ్లు ఒకరినొకరు తెలసుకుంటారు. తమను తాము తెలుసుకుంటారు. పాత బ్యాగేజ్ వదిలించుకుని పరస్పరం కొత్త గమ్యం వైపు అడుగు వేయడానికి నిశ్చయించుకుంటారు. కథ అందంగా ముగుస్తుంది. మెచ్యూర్ లవ్ స్టోరీలు సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే నీరసంగా ఉంటాయి. కాని ఈ సినిమా మొదలైనప్పటి నుంచి పెదాల మీద నవ్వులతో హాయిగా సాగిపోతుంది. ‘జీవితం ఆగిపోవడానికి కాదు. ముందుకు సాగిపోవడానికే. గతంలో ఏవో జరుగుతాయి. వర్తమానంలో ఏవో జరుగుతుంటాయి. ఎన్ని జరిగినా ముందుకు నడవాల్సిందే’ అని ఈ సినిమా చెబుతుంది. ఇర్ఫాన్ గతంలో ప్రేమించిన ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ వాళ్ల వాళ్ల జీవితాల్లో స్థిరపడి ఉంటారు. ఆగిపోలేదు. అలా ఆగిపోయి ఉంటారనుకోవడం, ఆగిపోయి ఉండాలనుకోవడం తప్పు అని ఈ సినిమా చెబుతుంది. అంతేనా? మన చుట్టూ ఉండేవాళ్లలో సింగిల్‌గా ఉంటున్న వాళ్లను అలాగే ఆపకుండా ఆపేయకుండా వాళ్ల జీవితాల్లో ‘ప్రేమ’, ‘బంధం’ అవసరాన్ని గ్రహించమని మనకు హితబోధ చేస్తుంది. ఇర్ఫాన్ సంగతి తెలిసిందే కాని ఇందులో హీరోయిన్గా చేసిన మలయాళ నటి పార్వతి కూడా చాలా బాగా చేసింది. డైలాగ్స్ చాలా క్యాజువల్‌గా, విట్టీగా ఉంటాయి. జోక్ మీద జోక్ పడుతుంటుంది. హిందీ తెలిస్తే మజా. సినిమాలో ఒకసారి ఫ్లయిట్ ఒకసారి ట్రైన్ మిస్సయిన ఇర్ఫాన్ హీరోయిన్‌తో తాను ప్రేమలో పడ్డానని రూఢీ చేసుకున్నాక ఆమె ఉన్న రోప్ వేను మాత్రం మిస్ కాకుండా పట్టుకుంటాడు. అంతవరకూ తన వాటర్ బాటిల్‌ను అతడితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడని ఆమె క్లయిమాక్స్‌లో అతడి వాటర్ బాటిల్‌ను పెదాలకు అంటించుకుని తాగుతుంది. చిన్న సజెషన్. ప్రేక్షకులకు మాత్రం వాళ్ల ప్రేమ కన్ఫర్మ్ అయినందుకు సంతోషం వేస్తుంది. ఉమన్ డైరెక్టర్ తనూజా చంద్ర తీసిన ఈ సినిమా చక్కటి ముచ్చటైన సినిమా. చూడటం ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’లో వేడి వేడి పకోడి తినడం లాంటిది. ఈ రిఫరెన్స్ ఏమిటో తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే. – కె -
తెలుగులో మంచి ఆఫర్ వస్తే...
పార్వతి... కేరాఫ్ కొచ్చి! పేరు చూస్తే తెలుగమ్మాయిలా ఉంది కదూ... కానీ కాదులెండి! మలయాళీ ముద్దుగుమ్మ. ఆల్రెడీ మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో సినిమాలు చేశారీమె. ‘బెంగళూరు డేస్’లో రేడియో జాకీగా నటించిన సారా అంటే వెంటనే గుర్తుపడతారు. అందం, అభినయం... రెండిటిలోనూ పార్వతికి సౌతిండియన్ (తెలుగు తప్ప) ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. మరిప్పుడు ట్రెండ్ ఏంటి? కీర్తీ సురేశ్, నివేథా థామస్, అనుపమా పరమేశ్వరన్, అనూ ఇమ్మాన్యుయేల్... ఈ మలయాళీ ముద్దుగుమ్మలు అందరూ తెలుగు తెరపైకి వస్తున్నారు. పార్వతి ఎందుకు రావడం లేదు. తెలుగులో మీరెప్పుడు నటిస్తారు? అని పార్వతిని అడిగితే... ‘‘తెలుగులో మంచి కథలేవీ నా దగ్గరకు రాలేదు. అందువల్ల, ఇప్పటివరకూ తెలుగు సినిమా చేయలేదు. ఒకవేళ తెలుగులో నాకు మంచి ఆఫర్ వస్తే... నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఐ లవ్ టు డూ తెలుగు ఫిల్మ్స్’’ అన్నారు. అన్నట్టు... మన దర్శక, నిర్మాతలు పార్వతి పలుకులు వింటున్నారో? లేదో? వెయిట్ అండ్ సీ!! -
ఆడబిడ్డ పుట్టిందని..
9 నెలల చిన్నారిని గొంతు నులిమి చంపిన తండ్రి ఆత్మకూర్: తొమ్మిది నెలల పసికందును కర్కశంగా గొంతునులిమి చంపాడు ఓ తండ్రి. ఈ ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. కర్నూల్ జిల్లా దేవరబండ కు చెందిన గిద్దయ్య బతుకుదెరువు కోసం 15 ఏళ్ల కిందట ఆత్మకూర్‌కు వలస వచ్చాడు. తన కుమారుడు ఈశ్వర్‌కు అయిజ మండలం కిష్టాపూర్‌కి చెందిన పార్వతితో మూడేళ్ల కిందట వివాహం జరిపించాడు. తొమ్మిది నెలల క్రితం పార్వతి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈశ్వర్ కూతురును చూడటానికి కూడా వెళ్లలేదు. 20 రోజుల కిందట పంచాయితీ పెట్టి తల్లిబిడ్డలను భర్తకు అప్పగించారు. అప్పటి నుంచి తనకు కూతురు వద్దని, ఎందుకు కన్నావని భార్యను వేధించసాగాడు. మంగళవారం సాయంత్రం బైక్‌పై కూతురును బయటికి తీసుకెళ్లి కొద్దిసేపటి తర్వాత ఇంటికి తీసుకువచ్చి పాప చనిపోయిందని చెప్పాడు. ఎలా చనిపోయిందని తల్లి ప్రశ్నించడంతో బైక్‌పై నుంచి జారిపడిందని బుకాయించాడు. పార్వతి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలపడంతో వారు ఆత్మకూర్‌కు చేరుకున్నారు. ఈశ్వర్‌ను ఈ సంఘటనపై నిలదీయడంతో బైక్‌పై నుంచి జారిపడిందని మళ్లీ బుకాయించాడు. అనుమానం వచ్చిన పార్వతి తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్సై సీహెచ్ రాజు బృందం ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అనంతరం పాపను గొంతునులిమి తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
బకెట్లో పడి చిన్నారి మృతి
దుగ్గిరాల: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ బకెట్లో పడి మృతి చెందింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపుడి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన దాసరి మహేష్, రోజా కుమారి దంపతులు వ్యవసాయ కూలీలు. ఈ క్రమంలో తమ రెండేళ్ల చిన్నారి పార్వతిని అమ్మమ్మ వద్ద వదిలి వాళ్లు పనికి వెళ్లారు. ఆమ్మమ్మ ఇంట్లో పనిచేసుకుంటూ ఉండగా ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు బకెట్లో పడింది. అది గుర్తించేలోపల చిన్నారి మృతిచెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
చిట్టీల పేరుతో రూ.60 లక్షలు టోకరా
చాగల్లు (తూర్పుగోదావరి): ఒక మహిళ చిట్టీల పేరుతో జనాన్ని నమ్మించి సుమారు రూ.60 లక్షలకు టోకరా వేసింది. ఈ సంఘటన పశ్చిమ గొదావరి జిల్లా చాగల్లులో సోమవారం వెలుగుచూసింది. దీంతో సోమ్ములు పోయిన బాదితులు ఆ మహిళ ఇంటి వద్దకు చేరి ఆందోళన చేశారు.ఈ ఘటనకు సంబంధించి బాదితులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వడ్లమూడి పార్వతి సుమారు 15 ఏళ్ల నుంచి చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. సుమారు 60 మందికి పైగా ఆమె వలలో మోసపోయిన బాధితులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం నుంచి పార్వతి ఇంటికి తాళాలు వేసి ఉండటంతో బాధితులు ఆమె కోసం బంధువుల ఇళ్ల వద్దకు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. పార్వతి కుటుంబ సభ్యులు తమకు సంబంధం లేదని చెబుతున్నారని బాధితులు పేర్కొన్నారు. -
ఇంటి నుంచే తెలుగులో పాఠాలు
గుంటూరు: ఇంటి నుంచే దృశ్య, శ్రవణ విధానంలో దూరవిద్యను అభ్యసించే సదుపాయం త్వరలోనే చేరువ కానుందని ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ పార్వతి తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన వర్చువల్ ఓపెన్ స్కూలింగ్ సదస్సుకు హాజరై వచ్చిన ఆమె మంగళవారం సాక్షి ప్రతినిధితో విశేషాలు పంచుకున్నారు. వివిధ పనుల్లో ఉన్నవారు తరగతులకు హాజరుకాలేని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జాతీయ సార్వత్రిక విద్యా పీఠం (ఎన్ఐఓఎస్) ఆన్లైన్లో పాఠాలను ఉంచి నెట్ ద్వారా చదువుకునే వీలు కల్పించాలని నిర్ణయించినట్టు పార్వతి తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్లో పాఠాలు పెట్టినప్పటికీ అవి ఆంగ్లంలో ఉండడం వల్ల అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. దీన్ని గుర్తించిన ఎన్ఐఓఎస్ ప్రాంతీయ భాషల్లోనూ పాఠాలు రూపొందించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. తెలుగులో పాఠాలు చదువుకునే విధంగా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించే పనులు జరుగుతున్నాయని తెలిపారు. -
పోతిరెడ్డిపాలెంలో దోపిడీ
యలమంచిలి : యలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం హైవే జంక్షన్లో ఆదివారంరాత్రి 1.20 గంటలకు ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో దోపిడీ జరిగింది. ఈ ప్రాంతంలో ఇది తీవ్ర సంచలనమైంది. గుర్తు తెలియని ఐదుగురు ప్రధాన ద్వారాన్ని పగులగొట్టి దూసుకొచ్చారు. కేకలు పెడితే చంపేస్తామని ఇంటిలోనివారిని బెదిరించారు. భయపెట్టి బీరువాలు, సూట్‌కేసులు తెరిపించి డబ్బు, బంగారం లాక్కున్నారు. దాదాపు అరగంటసేపు నిశిరాత్రి వేళ దొంగలు స్వైరవిహారం చేశారు. మీరెవరు బాబూ... అని ప్రశ్నించిన పాపానికి వృద్ధురాలి తలపై ఇనుపరాడ్డుతో మోది కుటుంబ సభ్యులందరినీ వంటగదిలో నిర్బంధించి దొరబాబుళ్లా దర్జాగా వెళ్లిపోయారు. 2006లోనూ ఇదే ఇంట్లో ఈ తరహాలోనే దోపిడీ జరిగింది. బాధిత కుటుంబం, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. యలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం జాతీయ రహదారికి ఆనుకుని రిటైర్డు ఉపాధ్యాయుడు శేఖరమంత్రి పట్నాయక్ కుటుంబం నివసిస్తోంది. అతని కుమార్తె రాధ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి ఇంట్లో పట్నాయక్ మాస్టార్ భార్య పార్వతి, కుమార్తె రాధ, అల్లుడు నాగుమంత్రి సుధాకర్, ఇద్దరు పిల్లలు గాఢనిద్రలో ఉండగా సుమారు 1.20 గంటల సమయంలో ఐదుగురు వచ్చి తలుపుకొట్టారు. అనుమానం వచ్చిన పట్నాయక్ మాస్టార్ అల్లుడు సుధాకర్ కిటికీలోనుంచి చూసి గట్టిగా అరిచారు. ఆ మరుక్షణమే దొంగలు తలుపులు పగులగొట్టుకుని ఇంట్లోకి ప్రవేశించారు. వారిలో ఒకరు ఆరు అడుగుల ఎత్తు ఉండి, సైనికుడిలా కనిపించాడని, మిగిలిన వారంతా 25ఏళ్లు వయసు ఉన్న యువకులేనని బాధితులు విలేకరులకు చెప్పారు. మాట్లాడినా, కేకలు పెట్టినా ప్రాణాలు తీసేస్తామంటూ బెదిరించి, వారిచేతనే ఇంటిలోని బీరువాలు, పెట్టెలు, లాకర్లు తెరిపించారు. బీరువాలో ఉన్న రూ.30వేలు నగదు, ఆరు తులాల బంగారు ఆభరణాలు, 3 సెల్ఫోన్లు పట్టుకుపోయారు. ఆ సమయంలో మీరెవరని ప్రశ్నించిన వృద్ధురాలు పార్వతి తలపై ఇనుపరాడ్డుతో మోదడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. ఆమె మెడలోని బంగారు పుస్తెలు తాడును లాగేసుకున్నారు. దొంగల స్వైరవిహారమంతా కేవలం 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. వైద్యం కోసం అప్పుగా తెచ్చిన రూ.30వేలూ పట్టుకుపోయారంటూ బాధితులు విలేకరుల వద్ద వాపోయారు. ఇంట్లోకి చొరబడిన దొంగల్లో ఒక వ్యక్తి మంకీ క్యాప్ ధరించగా, మరొకడు తువ్వాలు ముఖానికి చుట్టుకున్నాడని, మిగిలిన వారు కర్రలు, స్క్రూడైవర్లు, ఇనుపరాడ్లు తమ వెంట తీసుకొచ్చారని బాధితులు చెప్పారు. ఇంట్లో ఉన్నంతసేపు వారు తమతో తెలుగులో మాట్లాడుతూ వారిలోవారు తమిళంలో మాట్లాడుకోవడం గమనించినట్టు తెలిపారు. ఇంట్లో చోరీ అనంతరం సమీపంలో రైల్వేట్రాక్ వైపు నడుచుకుని వెళ్లిపోయారని తెలిపారు. హైవే సమీపంలో ఉన్న ఇంటిలో దోపిడీతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. -
శివుడు.. పార్వతి.. ఓ జోగిని