
దాదాపు 150 సినిమాలకుపైగా ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేసి, 5 నంది అవార్డ్స్ గెలుచుకున్న అశోక్ కుమార్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘మౌనమే ఇష్టం’. రామ్ కార్తీక్ హీరోగా, పార్వతి అరుణ్, రీతూవర్మ హీరోయిన్లుగా నటించారు. ఏకే మూవీస్ పతాకంపై ఆశా అశోక్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ – ‘‘మంచి స్టోరీ కుదిరితే దర్శకత్వం చేయాలని 15 సంవత్సరాలుగా ఆలోచిస్తూనే ఉన్నాను. ‘మౌనమే ఇష్టం’ కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. క్యూట్ జెండర్ లవ్ స్టోరీ. ప్రేమని ఎలా వ్యక్తపరచాలన్నదే ఈ సినిమాలో మెయిన్ పాయింట్. సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది.
తప్పకుండా అందరూ చూడండి’’ అన్నారు. ‘‘అశోక్ కుమార్‌గారు ఈ సినిమాను యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ప్రతి ప్రేమకు ప్రపోజల్ ఎంతో ముఖ్యమైనది. అలాంటిది ప్రేమకు ప్రపోజల్ ఇబ్బంది అయితే ఆ ప్రేమికుడు పడే బాధ ఏంటి? అనేది ఈ సినిమాలో చూపించాం. ఇలాంటి మంచి ప్రాజెక్టులో నాకు అవకాశం ఇచ్చిన అశోక్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు సాయి కార్తీక్. ‘‘ఈ సినిమా తప్పుకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. కార్తీక్‌కి ఈ చిత్రం ద్వారా నటుడిగా మంచి పేరు వస్తుంది’’ అన్నారు రీతూవర్మ. కథా రచయిత సురేష్, నటి ప్రియాంక, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్ నాయర్, కెమెరామేన్ రామ్ తులసి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ మహాదేవా.
Comments
Please login to add a commentAdd a comment