ashok kumar
-
KSR Live Show: కరెంట్ చార్జీలు పెంచి కప్పిపుచ్చే కుట్ర.. డైవెర్షన్ లో బాబు సిద్ధహస్తుడు
-
మంత్రికి, ఆయన తండ్రికి రుణపడి ఉంటా
రామచంద్రపురం: స్థానిక సీఐ కడియాల అశోక్‌కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామచంద్రపురం పట్టణంలోని టౌను హాలులో గురువారం జరిగిన శెట్టిబలిజ సామాజికవర్గ వనసమారాధనకు ఆయన పోలీసు యూనిఫాంతో వెళ్లడమే కాకుండా.. ‘‘నేను ఇక్కడకు (రామచంద్రపురం సీఐగా) రావడానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు, ఆయన తండ్రి సత్యానికి నేను, నా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటాం’’ అని బహిరంగంగా చెప్పారు. అంతేకాకుండా ‘‘భవిష్యత్ అంతా మనదే. ఎందుకంటే పోలీసు శాఖతో పాటుగా ఇతర శాఖల్లోనూ మనవారున్నారు’’ అని అన్నారు. ఆయన మాట్లాడిన వీడియో వైరల్ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై నియోజకవర్గానికి చెందిన కొంత మంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు సీఐ అశోక్‌ను వీఆర్‌కు పంపిస్తూ చర్య తీసుకున్నారు. కోనసీమ జిల్లాలో ప్రస్తుతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ విషయమై కలెక్టర్‌కు నివేదిక కూడా సమరి్పంచారు. ఆది నుంచీ వివాదాస్పదమే.. సీఐ అశోక్ కుమార్ వ్యవహార శైలి ఆది నుంచీ వివాదాస్పదంగానే ఉంది. గత ఆగస్ట్ 7న ఆయన రామచంద్రపురం సీఐగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచీ అధికార పార్టీకి చెందిన వారిలో ఒక వర్గానికి పూర్తిగా కొమ్ము కాస్తున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు. గతంలో జగనన్న కాలనీల్లో టీడీపీకి చెందిన కొంత మంది ఇసుకను బహిరంగంగానే దొంగిలించుకుపోగా, వారి పక్షాన ఉంటూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అనంతరం రామచంద్రపురం మండలం తాళ్లపొలం గ్రామంలో జరిగిన ఒక సివిల్ వివాదంలో తలదూర్చి, టీడీపీ వారికి వత్తాసు పలికి, సివిల్ కేసును మరింత వివాదంగా మార్చారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అంతే కాకుండా ప్రతి విషయంలోనూ టీడీపీకి చెందిన ఒక రౌడీషిటర్కు మంత్రి సహాయ సహకారాలతో కొమ్ముకాస్తూ, ఆయన చేసిన ఘనకార్యాలకు వత్తాసు పలికారంటూ నియోజకవర్గ వాసులతో పాటు శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన కొంత మంది కూడా వ్యతిరేకించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. గతంలో రామచంద్రపురం ఎస్సైగా సీఐ అశోక్ కుమార్ బంధువైన పాటి వాసు బాధ్యతలు స్వీకరించారు. తరువాత రామచంద్రపురం సీఐగా అశోక్ ఇక్కడకు వచ్చారు. అనంతరం వారం రోజుల్లోనే ఎస్సై వాసు కూడా వీఆర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆ సందర్భంలో స్థానికంగా ఉన్న రా్ర‹Ù్టర మంత్రి వాసంశెట్టి సుభాష్ తిరిగి వాసును ఉంచే ప్రయత్నం చేయలేదంటూ అదే పారీ్టకి చెందిన వారు అలక వహించినట్లు అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి. తాజాగా సీఐ అశోక్‌ను కూడా వీఆర్ నుంచి తప్పించడంలో మంత్రి చేతులెత్తేశారని సమాచారం. ఏరి కోరి తెచ్చుకున్న సీఐ ఇలా వివాదాల్లో ఇరుక్కోవడం మంత్రికి తలనొప్పిగా మారినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. -
BSF: 150 మంది ఉగ్రవాదులు కాచుక్కూర్చున్నారు..
శ్రీనగర్: శీతాకాలం సమీపిస్తున్నండగా కశ్మీర్ లోయలో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి 150 మంది వరకు ఉగ్రవాదులు మన భూభాగంలోకి దొంగచాటుగా ప్రవేశించేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని బీఎస్ఎఫ్(సరిహద్దు భద్రతా దళం) తెలిపింది. చొరబాటుదారులు చేసే ఎలాంటి ప్రయత్నాలనైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ‘చొరబాటు యత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ నిఘా విభాగాల నుంచి అందుతున్న సమాచారం ఆధారంగా ఆర్మీతో సమన్వయం చేసుకుంటూ సరిహద్దుల్లో భద్రతపై అప్రమత్తంగా ఉన్నాం’అని బీఎస్ఎఫ్ ఐజీ(కశ్మీర్) అశోక్ యాదవ్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ‘పాక్ వైపు సరిహద్దులకు సమీపంలోని స్థావరాల్లో ఉండే ముష్కరుల గురించిన అంచనాలను బట్టి, చొరబాటుయత్నాలను తిప్పికొట్టి, వారిపై పైచేయి సాధించేలా మా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాం’అని యాదవ్ వివరించారు. ‘ఎల్వోసీకి సమీపంలోని స్థావరాల్లో కాచుకుని ఉండే ఉగ్రవాదుల సంఖ్య 130–150 మధ్య మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇంతకంటే కాస్త ఎక్కువమందే ఉండొచ్చు’అని తెలిపారు. అంతర్జాతీయ పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఎల్వోసీ వెంట ఉన్న తంగ్ధర్, కెరన్ సెక్టార్ల పరిధిలో డ్రగ్స్ అక్రమ రవాణాకు అవకాశాలున్నాయంటూ ఆయన..వీటిని అడ్డుకునేందుకు మొబైల్ బంకర్లు, మహిళా ట్రూపర్లను రంగంలోకి దించామని వెల్లడించారు. స్మగ్లర్లు డ్రగ్స్ కొరియర్లుగా మహిళలను వాడుకుంటున్నారని ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. -
తిరుమలకు చంద్రబాబు కళంకం తెచ్చారు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): సీఎం చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం పవిత్రమైన తిరుమలకు కళంకం తెచ్చారని హైందవ, పౌర సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీ జరిగిందంటూ నిందలు మోపిన చంద్రబాబు తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో తిరుమల లడ్డూ వివాదంపై ఆచార్య రామానుజ సమితి రూపొందించిన సత్యశోధన నివేదిక విడుదల చేశారు. నెయ్యి కల్తీ జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని, చంద్రబాబు ప్రభుత్వం గుజరాత్ ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్ పైనే అనుమానాలు ఉన్నాయని ఈ నివేదికలో తేల్చారు. ఎంతో కీలకమైన ఈ అంశంలో నెయ్యి శాంపిల్స్ ఒకే ల్యాబ్‌కు పంపడం, పంపే ముందు టీటీడీ ఈవో ఎన్డీడీబీ ప్రతినిధులతో సమావేశం కావడం అనుమానాలకు తావిస్తోందని నివేదికలో పేర్కొన్నారు. ఎవరూ చేయనంత అపచారమిదిఈ సందర్భంగా ఆచార్య రామానుజ సంక్షేమ సమితి చైర్మన్ డీఎస్ఎన్వీ ప్రసాదబాబు మాట్లాడుతూ.. తిరుమల చరిత్రలో ఎవరూ చేయనంత అపచారం సీఎం చంద్రబాబు చేశారన్నారు. శ్రీవారి ప్రసాదానికి కళంకం ఆపాదించారని మండిపడ్డారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ ఈవో శ్యామలరావును దుష్ట్రతయంగా అభివర్ణించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఆ వివాదంలో రాజ్యాంగ ఉల్లంఘనలకు కూడా పాల్పడ్డారని ఆరోపించారు. తిరుమల పరువు మంటగలిపారుగీతా విజన్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పొక్కులూరి సుబ్బారావు మాట్లాడుతూ.. తమ అధ్యయనంలో నెయ్యి శాంపిల్స్‌లో జంతువుల కొవ్వు కలిసినట్టు ఆధారాలు లభించలేదన్నారు. ఆధారాలు లేకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీం పవన్‌కళ్యాణ్ ఆరోపణలు చేసి తిరుమల పరువు మంటగలిపారని మండిపడ్డారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు క్షుద్ర రాజకీయాలను చూసి క్షుద్ర దేవతలు కూడా సిగ్గుపడతారన్నారు.లడ్డూ వివాదంలో చంద్రబాబు అనేక తప్పిదాలు చేశారని, ఫలితంగా తిరుమల పవిత్రతకు భంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తన పాలనలో పగ ప్రతీకారాలకే ప్రాధాన్యమిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ దురుద్దేశంతో తన ప్రతి వైఫల్యాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తోసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. లడ్డూ విషయంలో చంద్రబాబు, ఈవో శ్యామలరావు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసి అడ్డంగా దొరికిపోయారన్నారు. సుప్రీం వ్యాఖ్యలు చెప్పు దెబ్బలాంటివిఆంధ్రా అడ్వకేట్స్ ఫోరం కన్వీనర్ బి.ఆశోక్‌కుమార్ మాట్లాడుతూ.. లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు, పవన్, ఈవో శ్యామలరావుకు చెప్పు దెబ్బలాంటివన్నారు. నీతి, నిజాయితీ ఉన్న నాయకులు ఎవరైనా సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు రాజీనామా చేసి ఉండేవారన్నారు. పవన్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఓవరాక్షన్ చేస్తున్నారని, దాని కారణంగా సనాతన ధర్మం నవ్వుల పాలవుతోందని ఎద్దేవా చేశారు. సత్యశోధన నివేదికను పరిశీలిస్తే లడ్డూ ప్రసాదం విషయంలో కుట్రకోణం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో సామాజిక కార్యకర్త వంగ శోభన్‌బాబు పాల్గొన్నారు. -
ఎన్నికలే లక్ష్యంగా మావోయిస్టుల కుట్ర
ములుగు/వాజేడు: రానున్న ఎన్నికలే లక్ష్యంగా మావోయిస్టులు చేస్తున్న కుట్రను గ్రే హౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు తిప్పికొట్టారని బుధవారం ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఓఎస్డీ అశోక్‌కుమార్ తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు కర్రె గుట్టల్లో 30 నుంచి 40 మంది సాయుధ మావోయిస్టులు పెద్ద నాయకులతో కలసి ఉన్నట్లు సమాచారం వచ్చిందని చెప్పారు. సాంబయ్య అలియాస్ గోపన్న, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్, ఎగోలపు మల్లయ్య, భద్రు అలియాస్ పాపన్న, ముచ్చకి ఉంగల్ అలియాస్ రఘు, మడకం మంగ అలియాస్ మాసా ఇతర దళ సభ్యులు కర్రె గుట్ట ప్రాంతంలో ఉన్నారని.. తెలంగాణలో భారీ విధ్వంసానికి పాల్పడేందుకు పథకం వేస్తున్నారని సమాచారం రాగా బుధవారం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు చెప్పారు. ఆ సమయంలో మావోయిస్టులు పోలీసు పార్టీలను చూసి తమ వస్తువులను అక్కడే వదిలి దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లి తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. వారిని వెంబడించినప్పటికీ దొరకలేదని, అనంతరం ఆ ప్రాంతాన్ని పరిశీలించగా కిట్ బ్యాగుల్లో ఆలివ్‌రంగు డ్రెస్‌లు, ఇతర వస్తువులు, సుతిలి బాంబు, రేడియోలు, సోలార్ ప్లేట్లు, ఇతర ఎల్రక్టానిక్ వస్తువులు, పాత్రలు, కిరాణా వస్తువులు, దోమ తెరలు, మావోయిస్టు సాహిత్యం, మందులు, నీటి డబ్బాలు, సీసాలు, గొడుగులు, కూరగాయలు, తాళ్లు దొరికాయని తెలిపారు. కర్రె గుట్ట ప్రాంతంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. -
అడ్డంగా దొరికిపోయి.. జడ్జిలపై నిందలా!
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): ‘అడ్డగోలుగా తప్పులు చేసి సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయి.. ఆ కేసుల్లో తీర్పు చెప్పిన జడ్జిలపై నిందలు వేస్తారా’ అంటూ టీడీపీ నాయకులు, ఆ పార్టీ అనుకూల మీడియాను పలువురు వక్తలు ప్రశ్నించారు. విజయవాడలోని ఐలాపురం హోటల్లో ఆంధ్రా అడ్వకేట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ‘కోర్టు తీర్పులపై రాజకీయాలు–వక్ర భాష్యాలు’ అనే అంశంపై శనివారం సదస్సు జరిగింది. ఫోరం కన్వినర్ బి.అశోక్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో న్యాయవాదులు, న్యాయ నిపుణులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, మేధావులు పాల్గొన్నారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించిన నాటి నుంచి టీడీపీ నాయకులు, అనుకూల మీడియా న్యాయవ్యవస్థపై, జడ్జిలపై విమర్శలు చేయడాన్ని వక్తలు ఖండించారు. జడ్జిలపై వ్యక్తిత్వ హననం చేసేలా ఉన్న వ్యాఖ్యలను కోర్టులు సుమోటోగా తీసుకోవాలన్నారు. తీర్పులు తమకు అనుకూలంగా వస్తే ఒక విధంగా, వ్యతిరేకంగా వస్తే మరో విధంగా జడ్జిలపై నిందలు వేస్తూ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కోర్టు సాక్ష్యాధారాలు చూస్తుందని, చంద్రబాబు కేసులో పూర్తి సాక్ష్యా«ధారాలు చూపినందు వల్లే కోర్టు ఆయనకు రిమాండ్ విధించిందన్నారు. సదస్సు అనంతరం న్యాయవ్యవస్థపై నిర్వహించిన క్విజ్ పోటీలలో గెలుపొందిన పాఠశాలల విద్యార్థులకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేశారు. సదస్సులో వివిధ సంఘాల ప్రతినిధులు ఎం శ్రీనివాసరెడ్డి, బడేజానీ, హృదయరాజు, ఎం.కోటేశ్వరరావు, వలిపర్తి బసవరాజు తదితరులు పాల్గొన్నారు. న్యాయస్థానం సుమోటోగా తీసుకోవాలి రాష్ట్రంలో ప్రధాన మీడియా తీర్పులు చెప్పిన జడ్జిల వ్యక్తిత్వ హననానికి తెగబడుతోంది. తీర్పులపై చర్చలు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఇది కచి్చతంగా కోర్టు ధిక్కారం అవుతుంది. హైకోర్టు, సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకోవాలి. జైలర్ సెలవుపై పుంఖాను పుంఖాలుగా కథనాలు రాశారు. చివరికి అతని భార్య చనిపోతే ఆ వార్త కూడా కనిపించకుండా చేశారు. – విజయబాబు, అధ్యక్షుడు, అధికార భాషా సంఘం కేసు పూర్వాపరాలు చూసే రిమాండ్ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు సాక్ష్యా«ధారాలతో దొరికిపోయారు. జడ్జి పూర్వాపరాలు పరిశీలించిన మీదటే రిమాండ్ విధించారు. బెయిల్ పిటిషన్ వేయకుండా రిమాండ్ విధించడమే తప్పు అన్న వాదన తెచ్చారు. చంద్రబాబు తాను తప్పు చేయకపోతే నిర్థోíÙత్వం నిరూపించుకోవాలి. జడ్జిలను తప్పుబట్టడం, న్యాయస్థానాలను తప్పుబట్టడం సరికాదు. – పి.గౌతంరెడ్డి, చైర్మన్, ఏపీ ఫైబర్ నెట్ జడ్జిల వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు కేసులు విచారణలో ఉండగా వాటిపై చర్చలు పెట్టడం, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. అక్రమ అరెస్ట్, రిమాండ్ అక్రమం, నిర్బంధం అక్రమమంటూ చెబుతున్నారు. వాస్తవానికి అది చెప్పాల్సింది కోర్టులు. కోర్టులు చెప్పాల్సిన అంశాలను మీడియా చానల్స్ చెప్పడం దురదృష్టకరం. – వీవీఆర్ కృష్ణంరాజు, ఎడిటర్స్ అసోసియేషన్ చంద్రబాబు బొక్క బోర్లా పడ్డాడు స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడం చరిత్రాత్మక తీర్పు. ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న చంద్రబాబు చట్టం ముందు బొక్క బోర్లా పడ్డాడు. లూథ్రాను ఆంధ్ర న్యాయవాదులు తిప్పికొట్టారు. – ఎం.గురునాథం, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్డీఎఫ్ ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదు చంద్రబాబు కేసులో నిష్పక్ష తీర్పు వచ్చింది. చంద్రబాబుకు జైల్లోనూ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. తనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. జడ్జిలపై విమర్శలు చేస్తూ ఏవేవో ఆపాదిస్తూ నిందలు వేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. – విఠల్ రావు, సీనియర్ న్యాయవాది సూత్రధారులకు శిక్ష తప్పదు ఏ కేసులోనైనా నేరం చేసిన వాడిది ఎంత తప్పో, నేరానికి ప్రేరేపించిన వాడిది అంతే తప్పు. కేసులో సాక్ష్యాధారాలు ఉంటేనే కోర్టు రిమాండ్ విధిస్తుంది. చంద్రబాబు కేసులో అదే జరిగింది. న్యాయవ్యవస్థపై, జడ్జిలపై నిందలు మోపొద్దు. – జయరాజ్, మాజీ పీపీ తీర్పులకు వక్రభాష్యం తగదు తవ్వేకొద్దీ చంద్రబాబు స్కామ్‌లు బయటకు వస్తున్నాయి. ఇన్నాళ్లు కొందరు వ్యక్తులను అడ్డుపెట్టుకుని వ్యవస్థలను అనుకూలంగా మార్చుకున్నారు. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు రిమాండ్ విధిస్తే జడ్జి తీర్పులపై వక్రభాష్యం చెబుతున్నారు. కోర్టు తీర్పులపై మీడియా తప్పుడు ప్రచారం చేయడం సరికాదు. – ఎం.వెంకటేశ్వరరెడ్డి, హోటల్స్ అసోసియేషన్ -
కొనసాగిన ఎస్సై దేహదారుఢ్య పరీక్షలు
ఏలూరుని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఎస్సై అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. మొత్తం 538 మంది మహిళా అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా, 260 మంది మాత్రమే హాజరయ్యారు. వీరికి ఫిజికల్ ఎఫీషియెన్సీ పరీక్షల్లో భాగంగా 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ తదితర పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఇప్పటివరకు నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలకు 4,581 మంది పురుష అభ్యర్థులు హాజరు కాగా, 3,233 మంది, 1177 మంది మహిళ అభ్యర్థులు హాజరు కాగా, 607 మంది అర్హత సాధించారని చెప్పారు. పరీక్షలను ఎస్పీ డి.మేరి ప్రశాంతి, ఏఎస్పీ ఎంజేవీ భాస్కరరావు పరిశీలించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
నవ్వులే నవ్వులు
అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే, పవన్ రమేష్, భరత్ రెడ్డి కీలక పాత్రల్లో అశోక్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మహానటులు’. ఏబీఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఏబీఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై అనిల్ బోధిరెడ్డి, తిరుపతి ఆర్. యర్రంరెడ్డి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అశోక్ కుమార్ మాట్లాడుతూ– ‘‘నేను ఇప్పటి వరకూ కామెడీ జానర్ టచ్ చేయలేదు. ‘జాతిరత్నాలు’ సినిమా తరహాలో పూర్తి ఫన్, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్తో తీసిన మూవీ ‘మహానటులు’. నలుగురు టీమ్‌గా మారి మహానటులు అనే యూట్యూబ్ చానల్‌ను ఎలా అభివృద్ధి చేశారు? అనేది ఈ చిత్ర కథ’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధం నరేష్, సంగీతం: మార్కస్ ఎం. -
తలకోన: ప్రకృతికి విరుద్ధంగా వెళితే...
అప్సరా రాణి ప్రధాన పాత్రలో, అశోక్ కుమార్, అజయ్ ఘోష్, ‘ఉగ్రం’ మంజు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘తలకోన’. నగేష్ నారదాసి దర్శకత్వంలో స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ఇది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘హీరోయిన్, ఆమె స్నేహితులు కలిసి తలకోన ఫారెస్ట్‌కి వెళ్లినప్పుడు ఏం జరిగింది? అనేది కథాంశం. ప్రకృతికి విరుద్ధంగా వెళితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం’’ అన్నారు నగేష్ నారదాసి. -
ప్రియమైన థ్రిల్
అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్స్ హీరో హీరోయిన్గా ఏజే. సుజిత్ దర్శకత్వం వహించిన సైకో థ్రిల్లర్ ‘ప్రియమైన ప్రియ’. గోల్డెన్ గ్లోరి బ్యానర్ పై సీతారామ్ యాదవ్ నిర్మాణ నిర్వహణ సారథ్యంలో సుజిత్, బాబు నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఆడియో, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ వేదికపై హీరో అశోక్ మాట్లాడుతూ– ‘‘మంచి సైకో థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో నేనే హీరో, నేనే సైకో. యాక్టర్‌గా నన్ను నేను ప్రూవ్ చేసుకునే చిత్రమిది’’ అన్నారు. ‘‘మ్యూజిక్ డైరెక్టర్‌గా నా కెరీర్లో వందో చిత్రం ఇది’’ అన్నారు శ్రీకాంత్ దేవా. నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఎల్ దామోదర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: షా, సహ–నిర్మాత: కె. లక్ష్మీకాంత్. -
నా ఇద్దరు కూతుర్లు ఇప్పటికీ నిత్యానంద దగ్గరే ఉన్నారు: నటుడు
గురువును మించిన శిష్యులు, బుద్ధిమంతులు.. వంటి సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించారు సీనియర్ నటుడు అశోక్ కుమార్. ఆరడుగుల ఎత్తుతో అందగాడిగా పేరు తెచ్చుకున్న ఆయన సడన్‌గా చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పారు. నచ్చని పెళ్లితో మొదట్లో తిప్పలు పడ్డ ఆయన తర్వాత భార్యను అక్కున చేర్చుకున్నారు. కానీ వారి సంతానమే తనకు తలవంపులు తెచ్చిందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇష్టం లేని పెళ్లి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అశోక్ కుమార్ మాట్లాడుతూ.. 'మొదట నేను పోలీసాఫీసర్‌గా పని చేశాను. కానీ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌లో ఓ హోటల్ నడిపాను. అందులో నష్టాలు రావడంతో అక్కడికి వెళ్లడమే మానేశాను. అది ఇంకా దివాలా తీయడంతో మా బావగారు వచ్చి ఆ హోటల్ చూసుకున్నారు. ఖాళీగా ఎందుకు ఉండటమని మద్రాసు వెళ్లాను. విలన్‌గా, సహాయ నటుడిగా సినిమాలు చేశాను. రామానాయుడు నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా అన్నారు. అందుకే సినిమాలు మానేశా.. చివరకు అక్కినేని నాగేశ్వరరావు ఇచ్చిన సలహా వల్ల నన్ను తీసేసి జగ్గయ్యను హీరోగా పెట్టారు. ఇలా కొన్ని సంఘటనలు జరగడంతో నా ఆత్మాభిమానం దెబ్బతింది. ఇలాంటి ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా? ఇక్కడికి వచ్చి తప్పు చేశానేనని ఫీలయ్యాను. ఈ సినీ ఇండస్ట్రీకి నేను పనికి రాను అని అర్థమైంది. అందుకే సినిమాలు మానేశాను' అని చెప్పుకొచ్చారు. ముగ్గురికి పెళ్లి చేశా.. ఇద్దరికి విడాకులు తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. 'నా కుటుంబమే నాకు శత్రువు. అమ్మాయిని చూడకుండానే పెళ్లి చేసుకున్నాను. తీరా మండపంలో చూశాక ఆమె నాకు నచ్చలేదు. కానీ చేసేదేం లేక మనసొప్పకపోయినా పెళ్లి చేసుకున్నాను. ఈ కారణం వల్లే ఉద్యోగానికి రాజీనామా చేశాను. కొన్నాళ్లకు తప్పు తెలుసుకున్నాను. నా వల్ల అమ్మాయిని బాధపడుతోందని తనను నాతోపాటే మద్రాసుకు తీసుకొచ్చాను. మాకు ముగ్గురు ఆడపిల్లలు.. పెద్ద చదువులు చదివించాను. ముగ్గురికీ పెళ్లి చేశా.. ఇద్దరికి విడాకులయ్యాయి. నిత్యానంద మాయలో పడి ఇప్పటికీ అతడితోనే! రెండో అమ్మాయి రంజితకు స్వామి నిత్యానందతో పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి. నాకది నిజమో, కాదో తెలియదు. వాళ్లిద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫోటోలయితే ఉన్నాయి. ఒక్కటైతే నిజం.. నిత్యానంద వల్లే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి విడాకులిచ్చింది. కోపంతో నేనోసారి నిత్యానంద దగ్గరకు వెళ్లి.. నీకు సిగ్గు అనిపించడం లేదా? నా కూతుర్ని నీ ఆశ్రమం నుంచి వెనక్కు పంపించు అని అడిగాను. నా కోపాన్ని, బాధను అర్థం చేసుకునేవాళ్లే లేరు. నిత్యానంద మాయలో పడి నా ఇద్దరు కూతుళ్లు అతడి వెంటే వెళ్లారు. ఇప్పటికీ అతడితోనే ఉన్నారు. ఇదంతా భరించలేక నా భార్య అనారోగ్యానికి గురై మరణించింది. నా మూడో కూతురే నన్ను చూసుకుంటోంది. మిగతా ఇద్దరూ ఇంతవరకు నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు' అని ఎమోషనలయ్యారు అశోక్ కుమార్. చదవండి: హోటల్లో విగతజీవిగా కనిపించిన నటుడు -
సీఈఐఆర్‌తో 2,43,875 మొబైల్ ఫోన్లు గుర్తించాం
సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: చోరీకి గురైన, కనిపించకుండా పోయిన మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు అమల్లోకి తెచ్చిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,43,875 మొబైల్ ఫోన్లను గుర్తించినట్టు టెలికాం స్పెషల్ డైరెక్టర్ జనరల్ అశోక్‌కుమార్ తెలిపారు. ప్రపంచ టెలీ కమ్యూనికేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నుంచి సంచార్ సాథీ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని సీటీఓ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ పోర్టల్‌లోని టాప్‌కాఫ్ (టీఏఎఫ్‌సీఓపీ) మాడ్యుల్ ద్వారా ఒక ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్‌కార్డులు వాడుతున్నారనేది తెలుస్తుందని చెప్పారు. దీనివల్ల మన గుర్తింపు కార్డుతో ఎవరైనా సిమ్‌లు వాడుతుంటే గుర్తించవచ్చన్నారు. అదే పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసి, సిమ్‌లను బ్లాక్ చేయవచ్చని చెప్పారు. టాప్‌కాఫ్‌ను ఏపీఎల్‌ఎస్‌ఏ విజయవాడ బ్రాంచ్ తయారు చేయగా ఏడాదిన్నరగా ఉపయోగిస్తున్నామని ఇప్పుడు జాతీయ స్థాయిలో అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 40.87లక్షల అనుమానాస్పద కనెక్షన్లను గుర్తించి, అందులో 36.61 కనెక్షన్లు రద్దుచేసినట్లు చెప్పారు. సైబర్‌క్రైమ్, బ్యాంకింగ్ మోసాలను నిరోధించేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని చెప్పారు. -
లెజెండరీ బాలీవుడ్ నటుడి కుమార్తె మృతి
ప్రముఖ లెజెండరీ బాలీవుడ్ నటుడు అశోక్ కుమార్ కూతురు, నటి భారతి జాఫ్రీ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె అల్లుడు, నటుడు కమల్జీత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే ఆమె దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన తెలిపారు. భారతీ జాఫ్రీ 'హజార్ చౌరాసి కి మా', 'సాన్స్', 'దమన్' వంటి చిత్రాలతో ఫేమస్ అయ్యారు. భారతి సయీద్ జాఫ్రీ సోదరుడు హమీద్ జాఫ్రీని వివాహం చేసుకున్నారు. (చదవండి: Raju Srivastava Death: విషాదం.. ప్రముఖ స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ మృతి) భారతి మరణవార్త తెలుసుకున్న ప్రముఖ నటి, కొరియోగ్రాఫర్ నందితా దాస్ ఆమెతో కలిసి ఉన్న మధురమైన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'నేను ఆమెను చాలా మిస్ అవుతున్నా. భారతీ జాఫ్రీ ఒక మంచి వ్యక్తి. ఆమెను కోల్పోవడం బాధాకరం. భారతి ఆలోచనా విధానం చాలా గొప్పది. చాలా ప్రతిభావంతురాలైన నటి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా." అని అన్నారు. భారతి అల్లుడు కన్వల్ జీత్ సింగ్ అత్తను తలుచుకుంటూ తీవ్ర భావోద్వేగానకి లోనయ్యారు. 'మాకు అన్నీ తానై ముందుకు నడిపించారు. ఇప్పుడు ఆమె మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. బుధవారం ఆమె అంతిమక్రియలు చెంబూర్ క్యాంపులో నిర్వహిస్తాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా' అంటూ సంతాపం ప్రకటించారు. View this post on Instagram A post shared by Kanwaljit Singh (@kanwaljit19) -
ఏడాది చివరకు కాలుష్యరహిత యమున
న్యూఢిల్లీ: రాబోయే డిసెంబర్ చివరకు యమునా నదిలోకి ఎలాంటి మురికి నీరు చేరదని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ చెప్పారు. నదిలోకి దారితీసే అన్ని మురుగుకాల్వలను అప్పటికల్లా మూసివేస్తారన్నారు. 1,300కిలోమీటర్ల పొడవున ప్రవహించే యమునా నది దేశంలోని అత్యంత కలుషిత నదుల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ నది నుంచి దేశరాజధానికి మంచినీటి సరఫరా జరుగుతోంది. ఢిల్లీలో నది 22 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది. కానీ నదిలోని 98 శాతం కలుషితమంతా ఇక్కడనుంచే వస్తోంది. నదిలోకి మురుగునీరు వదిలే 18 డ్రెయిన్స్ ఉన్నాయని, వీటిని మూసివేసి, మురుగునీటిని సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు మళ్లించే పనులు చేపడతామని అశోక్ చెప్పారు. ప్లాంట్లలో శుద్ధి చేసిన నీటిని నదిలోకి వదులుతారని, దీంతో నదిలో పరిశుభ్రమైన నీరు మాత్రమే ప్రవహిస్తుందని వివరించారు. యమునా నదిని శుభ్రపరిచేందుకు ఎన్‌జీయోధా(నమామి గంగే యమునా ఆఫ్ ఢిల్లీ ఏరియా)ను ప్రారంభిస్తామన్నారు. -
‘పెద్దింటి’కి సినీ స్వర్ణ కమలం అవార్డు
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ కథకుడు, సినీరచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌కు సినీ స్వర్ణ కమలం అవార్డు లభించింది. సినిమా రంగంలో ప్రతిభావంతులకు ఇచ్చే ఈ అవార్డును ఉత్తమ రచయిత విభాగంలో 2020 సంవత్సరానికిగాను పెద్దింటి అశోక్‌కుమార్‌కు ఇస్తున్నట్లు అవార్డు కమిటీ సభ్యులు సీవీఎల్ నరసింహరావు ప్రకటించారు. కథకుడిగా తెలంగాణ భాష, యాసలపై పట్టుకున్న ‘పెద్దింటి’ పది సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు. ఆయన మాటలు, పాటలు రాసిన ‘మల్లేశం’ సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రస్తుతం అశోక్‌కుమార్ ముగ్గురు ప్రముఖ అగ్రహీరోల సినిమాలకు మాటల రచయితగా పనిచేస్తున్నారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటకు చెందిన అశోక్‌కుమార్ రాసిన జిగిరి నవల ఆధారంగా హాలీవుడ్ హంగులతో సిని మాగా రూపొందుతుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ప్రస్తుతం సిరిసిల్లలో స్థిరపడిన అశోక్‌కుమార్‌కు సినీ స్వర్ణకమలం అవార్డు రావడంపై పలువురు ఆయన్ని అభినందించారు. -
పక్కా కార్యాచరణతో ముందుకు
సాక్షి, అమరావతి: దేవాలయాల్లో విధ్వంసాలకు పాల్పడే అసాంఘిక శక్తుల గుట్టు రట్టు చేసేందుకు, లోతైన విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యరంగంలోకి దిగింది. శనివారం విజయవాడలో సిట్ చీఫ్ జీవీజీ అశోక్‌కుమార్ నేతృత్వంలో తొలి భేటీ జరిగింది. అందుబాటులో ఉన్న సిట్ సభ్యులు ఈ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరుకాగా, విశాఖపట్నం, ఇతర ప్రాంతాలకు చెందిన ఐదుగురు సభ్యులతో జూమ్ ద్వారా అశోక్‌కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో గతేడాది సెప్టెంబర్ నుంచి జరిగిన దేవాలయాల ఘటనలను ప్రాథమికంగా సమీక్షించారు. రాష్ట్రంలో ఎన్ని ఘటనలు జరిగాయి, వాటికి సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంతమంది అరెస్టు అయ్యారు, తదితర అన్ని వివరాలను పోలీసుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. దేవాలయ ఘటనలకు సంబంధించిన కేసుల ప్రాథమిక సమాచార నివేదిక(ఎఫ్ఐఆర్), కేస్ డైరీ (సీడీ ఫైల్స్)లను తీసుకుని పరిశీలించనున్నారు. అన్ని కేసులను లోతుగా పరిశీలించి, వాటికి సంబంధించిన ఆధారాలు, వివరాలను సేకరించాలని సభ్యులకు అశోక్‌కుమార్ తెలిపారు. సిట్ టీమ్ అంతా అంకితభావంతో పనిచేయాలని, ఆలయ ఘటనల్లో మూలాలను వెతికి పట్టుకుని అసలైన దోషులను శిక్షించేలా గట్టి ప్రయత్నాలు చేయాలని అశోక్‌కుమార్ సూచించారు. సోమ, మంగళవారాల్లో మరోసారి సమావేశమవ్వాలని సిట్ నిర్ణయం తీసుకుంది. సిట్ టీమ్ సూపర్ ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసి రాష్ట్రంలో మతపరమైన అలజడులు రేపేందుకు జరుగుతున్న కుట్రను ఛేదించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న గట్టి చర్యలకు సిట్ ఏర్పాటు అద్దంపడుతోందని వివిధ వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం కూర్పు సూపర్‌గా ఉందని పేర్కొంటున్నారు. హైందవ సంప్రదాయాలు తెలిసిన వాళ్లను, నేర పరిశోధనలో దిట్ట అయిన వారిని ప్రభుత్వం ఎంపిక చేసిందని చెబుతున్నారు. ఏసీబీ అడిషనల్ డైరెక్టర్, సిట్ చీఫ్ అశోక్‌కుమార్ గతంలో తిరుమల తిరుపతి దేవస్థానములు(టీటీడీ) చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీవీఎస్వో)గా మూడున్నరేళ్లు పనిచేశారు. విజయవాడ డీసీపీగా ఉన్న సమయంలో దుర్గ గుడిలో తాంత్రిక పూజలపైన ఆరా తీశారు. ఆలయాల భద్రత, నేర పరిశోధనలో పట్టున్న అధికారిగా ఆయనకు పేరుంది. టీమ్‌లో సభ్యులంతా నేరపరిశోధనలో మంచి అనుభవం ఉన్న వారే కావడం గమనార్హం. కుట్ర కోణం బయటపడుతుందని ఆశిస్తున్నా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన తీరు బాగుంది. ఇందులో ఉన్న అధికారులు ఎంతటి సమర్థులో నాకు తెలుసు. రాష్ట్రంలో మత సామరస్యానికి తూట్లు పొడిచేలా కొందరు ఆలయాల ఘటనలను ప్రోత్సహిస్తున్నారు. ఒక పథకం ప్రకారం ఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కులమతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర కోణాన్ని ఈ సిట్ వెలికితీస్తుందని ఆశిస్తున్నాను. –వి.రాజగోపాల్, రిటైర్డ్ డీఎస్పీ, రాజమహేంద్రవరం సిట్ ఏర్పాటు మంచి పరిణామం ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేసే ఘటనలను నిగ్గు తేల్చేలా సిట్ ఏర్పాటు చేయడం మంచి పరిణామం. అంతర్వేది నుంచి రామతీర్థం వరకు ఒక పథకం ప్రకారం ఘటనలు జరుగుతున్నట్టు తేటతెల్లమవుతోంది. సంఘ విద్రోహ శక్తుల పట్ల ప్రభుత్వం అప్రమత్తమై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఘటనల్లో కుట్ర కోణం బయటకు తీయాలి. – పూరిళ్ల శ్రీనివాస్, న్యాయవాది, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా -
ఒక్క దొంగ ఓటు పడినా రీపోలింగ్
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడైనా ఒక్క దొంగ ఓటు పడినా రీపోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ వెల్లడించారు. టెండర్ ఓటింగ్ (చాలెంజ్ ఓటు) 0.1 శాతం కంటే ఎక్కువ ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రిటర్నింగ్ అధికారులకు చెప్పామని, వారి నివేదిక ఆధారంగా రీపోలింగ్‌పై కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో పోలింగ్ నాడు వేతనంతో కూడిన సెలవు ఉంటుందని, వీటి పరిధిలో ఏవైనా ఐటీ సంస్థలు ఉన్నా లోకల్ హాలిడే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మున్సిపల్ ఓటర్లు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తుంటే ఓటు వేసేందుకు 2, 3 గంటల పర్మిషన్ ఇవ్వాల్సిందిగా యాజమాన్యాలను కోరామన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ పట్టణాల్లో పోలింగ్ శాతం తగ్గిపోతున్నందున, ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించామని, స్వచ్ఛంద సంస్థల ద్వారా చేసిన ప్రచారంతో పోలింగ్‌శాతం 75 శాతానికి పెరుగుతుందనే ఆశాభావంతో ఉన్నట్టు చెప్పారు. బ్యాలెట్ పత్రాల ముద్రణలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, 21న నిశితంగా వాటిని పరిశీలించాకే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్‌బూత్‌లకు తీసుకు వెళ్లేలా చూస్తున్నామన్నారు. ఈ నెల 22న 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్ఈసీ చేసిన ఏర్పాట్లపై కార్యదర్శి అశోక్‌కుమార్‌తో ‘సాక్షి’ ప్రతినిధి ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు... ఎన్నికల ఏర్పాట్లు... దాదాపుగా పూర్తయ్యాయి. మెటీరియల్ సార్టింగ్, బ్యాలెట్ పత్రాలు సిద్ధమయ్యాయి. 20న అన్ని మున్సిపాలిటీల్లో తుది ఏర్పాట్లను పరిశీలిస్తాం. ఫర్నిచర్, మంచినీరు ఇతర కనీస సదుపాయాల పరిశీలన. 21న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ బృందాలు, రిటర్నింగ్, పోలింగ్ అధికారులు ఖరారై, మెటీరియల్‌తో సహా ఆ రోజు మధ్యాహ్నం నుంచే కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళతారు. పోలింగ్ కేంద్రాలు, ఓటర్లు.. ఎన్నికలు జరగనున్న మొత్తం వార్డుల్లో 7,961 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. పోలింగ్ సిబ్బంది 52,757 మందికి ర్యాండమైజ్ చేసి శిక్షణనిచ్చాం. వారిలో 40 వేల మంది విధులు నిర్వహిస్తారు. కౌంటింగ్‌కు 5 వేల మంది ఉంటారు. ఎన్నికలు జరిగే ప్రాంతంలో ఇద్దరేసి పోలీ సులుంటారు. మొత్తం 53,55,942 ఓటర్లున్నారు. డబ్బు జప్తుపై... డబ్బు జప్తు విషయంలో పోలీసులు, ఇతర అధికారులు సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా తనిఖీలు చేయాలని ఆదేశించాం. పెళ్లిళ్లు, వైద్య ఖర్చులు, పంట అమ్మిన మొత్తం, వ్యాపారంలో వచ్చిన సొమ్ము ఇలా తగిన కారణాలు చూపితే అటువంటి వారిని ఇబ్బంది పెట్టొద్దని సూచించాం. వెబ్‌కాస్టింగ్... వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తాం. కచ్చితంగా 30% పోలింగ్ స్టేషన్లు కవరవుతాయి. సున్నిత, అతిసున్నితమైన పోలింగ్ బూత్‌ల్లో తప్పనిసరిగా ఉంటుంది. వ్యయపరిమితి పెంచే యోచన.. అభ్యర్థుల వ్యయ పరిమితి ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో రూ.5 లక్షలు, ఇతర కార్పొరేషన్లలో రూ.లక్షన్నర, మున్సిపాలిటీల్లో రూ.లక్ష ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల కంటే ఈ మొత్తం ఎక్కువగానే ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకల్లా సమీక్షించి అక్కడ పరిమితి పెంచే అవకాశాలున్నాయి. కౌంటింగ్ కేంద్రాలు... అందుబాటులో ఉన్న స్థలం, సౌకర్యాల ప్రాతిపదికన సంబంధిత జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీల కౌంటింగ్ కేంద్రాలను రెవెన్యూ డివిజన్ హెడ్క్వార్టర్లు, జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసుకుంటారు. -
అయ్యప్ప కటాక్షంతో...
సుమన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’. ఎ. జ్యోతి, రమాప్రభ, ఆకెళ్ల, చలపతి, మాస్టర్ హరీంద్ర, అశోక్ కుమార్ ముఖ్యపాత్రధారులు. రుద్రాభట్ల వేణుగోపాల్ దర్శకత్వం వహించారు. నటుడు సుమన్ కెరీర్లో ఇది నూరవ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు కథ,స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు అందించిన వి.యస్.పి. తెన్నేటి, టి.ఎస్. బద్రీష్ రామ్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘ఒక సినిమా పూర్తి కావాలంటే అద్భుతాలు జరగాలంటుంటారు. అలాంటివి ఈ సినిమాకు జరిగాయి. అయ్యప్పకటాక్షం వల్లే ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేస్తున్నామనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఇరవై ఏళ్లకు పైగా అయ్యప్ప దీక్ష చేస్తున్నాను. అయ్యప్ప దీక్ష ఎలా చేయాలి? అయ్యప్ప దీక్ష చేసేవారు నలుపు రంగు దుస్తులే ఎందుకు వేసుకోవాలి? కాషాయ రంగు వస్త్రాలు ధరించి కూడా దీక్ష చేయవచ్చా? ఎలా క్రమశిక్షణగా ఉండాలి? అనే ఇలాంటి చాలా అంశాలకు ఈ సినిమాలో వివరణలు ఇచ్చాం’’ అన్నారు వి.యస్. పి. తెన్నేటి. -
13గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అడిషనల్ సీపీ అనిల్ కుమార్ తెలిపారు. బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 20 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని తెలిపారు. 11వ రోజున బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు 18కిలోమీటర్ల మేర శోభయాత్ర కొనసాగుతుందని తెలిపారు. 17 ప్రధాన రహదారుల మీదుగా శోభయాత్ర కొనసాగనుందని.. 10వేల లారీలు దీనిలో పాల్గొంటాయన్నారు. అలిబాద్, నాగులచింత, చార్మినార్, మదీన, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా శోభయాత్ర కొనసాగుతుందని దీనికి అనుగుణంగా ట్రాఫిక్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. నిమజ్జనం చూడ్డానికి విదేశాల నుంచి కూడా జనాలు వస్తున్నారని తెలిపారు. శోభయాత్రలో ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదన్నారు. ప్రతి ఒక్కరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఉపయోగించుకోవాలని కోరారు. ఖైరతాబాద్ జంక్షన్, ఆనంద్ నగ్ కాలనీ, గోసేవ సధన్, కట్టమైసమ్మ టెంపుల్, నిజాం కాలేజ్, ఎంఎంటీఎస్ ఖైరతాబాద్ స్టేషన్, బుద్ధ భవన్ వెనుక, లోయర్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ స్టేడియం, పబ్లిక్ గార్డెన్ వంటి పది చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 6గంటల నుంచే ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదని తెలిపారు. మొత్తం 13 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెళ్లేవారు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న రోడ్లపై కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఎమర్జెన్సీ వాహనాలు, 108లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామన్నారు. -
తుపాకీ మిస్ ఫైర్.. ఆర్మీ జవాన్ మృతి
అర్ధవీడు: తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ప్రకాశం జిల్లాకు చెందిన ఆర్మీ జవాను మృతి చెందాడు. ఈ మేరకు అతని తల్లిదండ్రులకు సోమవారం అధికారుల నుంచి సమాచారం అందింది. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లెకు చెందిన తమ్మినేని అశోక్‌కుమార్ (21) రెండేళ్ల కిందట ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం జమ్ముకాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం విధుల్లో ఉండగా తుపాకీ మిస్ ఫైర్ కావడంతో అశోక్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తల్లిదండ్రులు నరసింహారావు, కాశమ్మలకు సమాచారం అందింది. భౌతికకాయాన్ని స్వగ్రామమైన పాపినేనిపల్లెకు తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తల్లిదండ్రులు చెప్పారు. మృతుడికి ఒక సోదరుడున్నాడు. -
పోలింగ్ బూత్‌లో ఫొటోలు తీస్తే చర్యలు
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌లలో ఫొటోలు తీసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. కొంతమంది పోలింగ్ సిబ్బంది, ఓటర్లు పోలింగ్ సందర్భంగా ఓటు వేస్తున్న ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇలా ఫొటోలు తీసే వారికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 2 వేల వరకు జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. -
సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ నెల 4 వరకు ఎలాంటి రుసుము లేకుండా ఫీజు చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 26న బిట్‌శాట్, 27న జేఈఈ ఉన్నందున విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ పునఃపరిశీలించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా తేదీలు నిర్ణయిస్తామని చెప్పారు. -
మే 8లోగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్..!
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల అవకతవకలపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. విద్యార్థుల రీ వాల్యుయేషన్‌పై ఇంటర్‌బోర్డు తమ నిర్ణయాన్ని కోర్టుకు తెలిపింది. ఇప్పటికే ఫెయిలైన మూడు లక్షల 20వేలమంది విద్యార్థులకు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ జరుపుతామమని బోర్డు హైకోర్టుకు నివేదించింది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ను మే 8లోగా పూర్తి చేసి.. వివరాలు తమకు సమర్పించాలని ఇంటర్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. బోర్డు ఇచ్చిన వివరాలు చూసిన తర్వాత 8వ తేదీ మధ్యాహ్నం ఫిటిషన్‌పై మరోసారి విచారణ జరుపుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు తదుపరి విచారణను మే 8వ తేదీకి వాయిదా వేసింది. కాగా, చనిపోయిన విద్యార్థులకు 50లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలంటూ మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. -
విచారణ కమిటీ ముందుకు అశోక్‌కుమార్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ తన విచారణను ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఇంటర్ బోర్డు కార్యాలమంలో త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. కమిటీ విచారణకు వచ్చిన సమయంలో హైకోర్టు విచారణ నిమిత్తం ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. హైకోర్టు విచారణ ముగియడంతో అశోక్‌కుమార్ బోర్డు కార్యాలయానికి చేరుకొని విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి కారణం ఏమిటి? ఎలాంటి అవకతవకలు జరిగాయో? అవకతవకలు, నిర్లక్ష్యం, అక్రమాలకు బాధ్యులెవరు? అన్న కోణంలో కమిటీ అశోక్‌కుమార్ నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. వెనుక గేటు నుంచి విచారణకు గ్లోబరీనా సీఈవో! ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతున్న నేపథ్యంలో.. గ్లోబరీనా సంస్థ సీఈవో రాజు ఇంటర్ బోర్డు కార్యాలయానికి వచ్చారు. కార్యాలయం ప్రధాన గేటు నుంచి త్రిసభ్య కమిటీ సభ్యులు లోపలికి వెళ్లగా.. గ్లోబరీనా సీఈవో రాజు మాత్రం వెనుక ఉన్న ఓ చిన్న గేటు నుంచి కార్యాలయం లోపలికి వెళ్లారు. ప్రస్తుతం బోర్డు కార్యాలయంలో సాగుతున్న కమిటీ విచారణలో ఆయన పాల్గొన్నట్టు తెలిసింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళానికి గ్లోబరీనా సంస్థనే కారణమని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ తీవ్రమైన నిర్లక్ష్యం.. నేడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడేలా చేసింది. డీపీఆర్పీ ప్రాజెక్టులో భాగంగా గ్లోబరీనా సంస్థ పలుదశల్లో సాంకేతిక సేవలను ఇంటర్మీడియట్ బోర్డుకు అందించాలి. దీనికి అవసరమైన సమాచారాన్ని బోర్డు నుంచి సేకరించి.. కంప్యూటరీకరించడం, విశ్లేషించడం తదితర పనులు సమయానుగుణంగా చేయాలి. కానీ.. ఈ విషయంలో కనీసస్థాయిలో కూడా అనుభవంలేని గ్లోబరీనా సంస్థ టెండరు దక్కించుకున్నప్పటినుంచీ.. బోర్డుతో సమన్వయం చేసుకోవడంలో దారుణంగా విఫలమైంది. దీంతో ప్రాజెక్టు ఆసాంతం తీవ్ర గందరగోళంగా తయారైంది. ఇంటర్ ఫలితాల వెల్లడిలో అవకతవకలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఇంటర్ బోర్డు కార్యాలయంలో విచారణ చేపట్టింది. ఇంటర్ ఫలితాల్లో చోటుచేసుకున్న గందరగోళంపై కమిటీ వివరాలు సేకరించింది. త్రిసభ్య కమిటీ విచారణ నిమిత్తం బోర్డు కార్యాలయానికి చేరుకున్న సమయంలో.. అశోక్‌కుమార్ అక్కడ లేరు. బాలల హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో.. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. ఆయన లేని సమయంలోనే త్రిసభ్య కమిటీ కార్యాలయంలో విచారణ చేపట్టడం గమనార్హం. ఇంటర్ బోర్డు వద్ద పోలీసుల దిగజారుడు ప్రవర్తన ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద పోలీసులు దిగజారి ప్రవర్తించడం.. తీవ్ర విమర్శలకు తావిచ్చింది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో బోర్డు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కే నాగేశ్వర్‌ను కార్యాలయంలోకి వెళ్లకుండానే పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని మాత్రం వెంటబెట్టుకొని మరి బోర్డు కార్యాలయం లోపలికి పోలీసులు తీసుకెళ్లారు. అది కూడా కార్యాలయంలో త్రిసభ్య కమిటీ విచారణ జరుగుతున్న సమయంలో పోలీసులు ఇలా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. దీనిపై పోలీసులను మీడియా ప్రశ్నించడంతో సదరు టీఆర్ఎస్ నేతను బయటకు తీసుకొచ్చారు. మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఏబీవీపీ ఆందోళన ఇంటర్ ఫలితాల్లో అవకతవకల నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఏబీవీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం స్పందించాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్‌కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. రీ వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ ఉచితంగా చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నాయి. -
అందుకే నవ్యకు 99కు బదులు సున్నా వచ్చింది
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల వెల్లడిలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ అంగీకరించారు. ఇంటర్ బోర్డు పరీక్షా పత్రాలను పారదర్శకంగా, నాణ్యత కూడిన మూల్యాంకనం చేపట్టిందని, దాదాపు అంతా సక్రమంగా జరిగిందని ఆయన చెప్పారు. ఇంటర్ పరీక్షా ఫలితాల వెల్లడిలో అవకతవకలు, ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాల నేపథ్యంలో సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు, పలు పార్టీల శ్రేణులు ఇంటర్ బోర్డు ముందు పెద్ద ఎత్తున ధర్నా, నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దీంతో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో అక్కడక్కడ కొన్ని తప్పిదాలు, పొరపాట్లు జరిగాయని, ముఖ్యంగా ముగ్గురు విద్యార్థుల పరీక్షా పత్రాలకు సంబంధించి మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయని చెప్పారు. అందుకే నవ్యకు సున్నా! తెలుగులో సున్నా మార్కులు వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన విద్యార్థిని జి. నవ్య అంశంపై అశోక్‌కుమార్ స్పందించారు. ఓఎమ్మార్ షీట్లో మార్కుల విభాగంలో బబ్లింగ్ చేయడంలో ఎగ్జామినర్ చేసిన తప్పిదం వల్లే నవ్యకు సున్నా వచ్చిందని ఆయన తెలిపారు. నవ్యకు 99 మార్కులకు బదులు ఎగ్జామినర్ జీరో బబ్లింగ్ చేశాడని, ఓఎమ్మార్ షీట్లో 9,9 అంకెల కిందనే సున్నా, సున్నా అంకెలు ఉంటాయని, 9-9 అంకెలను బబ్లింగ్ చేయడానికి బదులు పొరపాటున 0,0ను బబ్లింగ్ చేశారని, స్కూటినైజర్ కూడా సరిగ్గా పరిశీలించకుండా సున్నా, సున్నానే బబ్లింగ్ చేయడంతో నవ్యకు అలా మార్కులు వచ్చాయని తెలిపారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో వెంటనే స్పందించి.. వెరీఫై చేసి.. ఆ విద్యార్థినికి న్యాయం చేశామన్నారు. ఈ విధంగా మూల్యాంకనంలో తప్పులు, పొరపాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్షా పత్రాల మూల్యాంకనంలో పొరపాటు చేసిన వారిని ఇప్పటికే వివరణ అడిగామని, వారికి చార్జ్‌మెమో కూడా ఇస్తామని స్పష్టం చేశారు. 99కి బదులు సున్నా మార్కులు వేయడం చాలా పెద్ద తప్పిదమని, దీనిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నవ్య ఓఎమ్మార్ షీట్ మీడియాకు చూపించారు. ఆ వదంతులు అవాస్తవం.. ఇంటర్ పరీక్షా పత్రాలు గల్లంతైనట్టు వస్తున్న వదంతులు, ఆరోపణలు అవాస్తవమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌బోర్డుకు 12 క్యాంప్ ఆఫీసులు ఉన్నాయని, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ కార్యాలయాల్లోనే పరీక్షా పత్రాల మూల్యంకనం చేపడతామని తెలిపారు. పరీక్షా పత్రాలన్నీ తమ వద్ద భద్రంగా ఉన్నాయని, ఏ ఒక్క పరీక్షా పత్రం మిస్ కాలేదని చెప్పారు. ఆబ్సెంట్ అయిన విద్యార్థిని కూడా పాస్ చేశారని వచ్చిన వాదనలు అపోహ మాత్రమేనని, కొందరు విద్యార్థులకు పరీక్షా కేంద్రాల విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో రెండు సెంటర్లు కేటాయించామని, అందులో వారు ఒక సెంటర్లో ఆబ్సెంట్ అయి.. మరో సెంటర్లో పరీక్ష రాశారని, అందువల్ల వారికి ఏ-పీ (ఆబ్సెంట్-పాస్) అనే కోడ్ వచ్చిందని, రెండు సెంటర్లు వచ్చినవారిలో కొందరు ఫెయిల్ కావడంతో ఏ-ఎఫ్ వచ్చిందని వివరణ ఇచ్చారు. పూర్తిగా ఆబ్సెంట్ అయిన వాళ్లను పాస్ చేయడం కానీ, పాస్ అయిన వాళ్లను ఫెయిల్ చేయడం కానీ జరగలేదని తెలిపారు. 15 ఏళ్లుగా మన్టెక్ ఇన్ఫో సంస్థ సాంకేతిక సేవలు అందిస్తోందని, 15 ఏళ్లుగా ఒకే సంస్థ ఇస్తుండటంతో మార్చాలని టెండర్లు పిలువగా.. గ్లోబరెనా సంస్థ నుంచి టెండర్ వచ్చిందని, నిబంధనలకు అనుగుణంగానే ఆ సంస్థకు టెండర్ కేటాయించామని, ఆ సంస్థ మూడేళ్లు మాత్రమే ఇంటర్ బోర్డుకు సేవలు అందిస్తుందని, ఆ తర్వాత పూర్తిగా ఇంటర్ బోర్డే ఔట్ సోర్సింగ్ లేకుండా సొంతంగా సాంకేతిక సేవలను సమకూర్చుకుంటుందని అశోక్‌కుమార్ వివరించారు. రీ వాల్యుయేషన్ గడువును పెంచే అంశాన్ని పరిశీలిస్తామని, రీవాల్యుయేషన్లో మారిన మార్కులను విద్యార్థుల ఈమెయిల్‌కు పంపుతామని తెలిపారు. అశోక్‌కుమార్‌ను నిలదీసిన నిరసనకారులు మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా అశోక్‌కుమార్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులు నిలదీశారు. ఇంటర్ బోర్డు తప్పిదాలకు విద్యార్థులకు ఎందుకు బలి కావాలని, 99 మార్కులకు బదులు సున్నా మార్కులు వచ్చిన విద్యార్థిని.. కలత చెంది.. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యంకనంలో టెక్నికల్ తప్పిదాలు దొర్లాయని సాక్షాత్తూ విద్యామంత్రి జగదీశ్‌రెడ్డే చెప్తున్నారని, అలాంటప్పుడు మీ తప్పిదాలకు విద్యార్థులు నష్టపోవాలా? అని నిలదీశారు. ఒకవైపు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇంత పెద్ద పొరపాట్లు, తప్పిదాలా? అని ప్రశ్నించారు. నిరసనకారుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో అశోక్‌కుమార్ తడబడ్డారు. చదవండి : నవ్యకు తెలుగులో 99 మార్కులు -
ఐటీ గ్రిడ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
-
ఐటీ గ్రిడ్ కేసు.. దర్యాప్తు వేగవంతం చేసిన సిట్
సాక్షి, హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్ డేటా చోరీ కేసుపై సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ డేటా చోరీపై ఇప్పటికే ఆధార్ అథారిటీ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసుపై ఆధార్ అధికారులు కూడా మాదాపూర్‌లో ఫిర్యాదు చేశారు. రెండు రాష్ట్రాల కి చెందిన ఆధార్ డేటా చోరీ అయ్యిందని అందులో ఫిర్యాదు చేశారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులను సిట్ అధికారులు ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. ఎఫ్ఎస్ఎల్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా చర్యలు చేపట్టేందుకు సిట్ అధికారులు సిద్దమయ్యారు. ఇప్పటికే దాదాపు 40 హార్డ్ డిస్క్‌లను ఎఫ్ఎస్ఎల్ విశ్లేషించింది. ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే మూడు సార్లు నోటిసులు ఇచ్చామన్నారు. అశోక్‌తో పాటు మరికొంత మందిని అరెస్ట్చేసేందుకు రంగం సిద్దం చేసింది. -
ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం
-
ప్రేమని వ్యక్తపరచడం ఎలా?
దాదాపు 150 సినిమాలకుపైగా ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేసి, 5 నంది అవార్డ్స్ గెలుచుకున్న అశోక్ కుమార్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘మౌనమే ఇష్టం’. రామ్ కార్తీక్ హీరోగా, పార్వతి అరుణ్, రీతూవర్మ హీరోయిన్లుగా నటించారు. ఏకే మూవీస్ పతాకంపై ఆశా అశోక్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ – ‘‘మంచి స్టోరీ కుదిరితే దర్శకత్వం చేయాలని 15 సంవత్సరాలుగా ఆలోచిస్తూనే ఉన్నాను. ‘మౌనమే ఇష్టం’ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్యూట్ జెండర్ లవ్ స్టోరీ. ప్రేమని ఎలా వ్యక్తపరచాలన్నదే ఈ సినిమాలో మెయిన్ పాయింట్. సినిమా ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా అందరూ చూడండి’’ అన్నారు. ‘‘అశోక్ కుమార్‌గారు ఈ సినిమాను యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ప్రతి ప్రేమకు ప్రపోజల్ ఎంతో ముఖ్యమైనది. అలాంటిది ప్రేమకు ప్రపోజల్ ఇబ్బంది అయితే ఆ ప్రేమికుడు పడే బాధ ఏంటి? అనేది ఈ సినిమాలో చూపించాం. ఇలాంటి మంచి ప్రాజెక్టులో నాకు అవకాశం ఇచ్చిన అశోక్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు సాయి కార్తీక్. ‘‘ఈ సినిమా తప్పుకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. కార్తీక్‌కి ఈ చిత్రం ద్వారా నటుడిగా మంచి పేరు వస్తుంది’’ అన్నారు రీతూవర్మ. కథా రచయిత సురేష్, నటి ప్రియాంక, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్ నాయర్, కెమెరామేన్ రామ్ తులసి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ మహాదేవా. -
మధ్య వేలికి సిరా గుర్తు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలికి సిరా చుక్కతో గుర్తు పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల్లో ఒకసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారు మళ్లీ ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వస్తే గుర్తించి నిలువరించేందుకు ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలికి సిరా చుక్కతో గుర్తు పెట్టాలని ఎన్నికల నిబంధనలు పేర్కొంటున్నాయి. చట్ట సభలకు ఎన్నికలు నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ విషయంలో ఒకే తరహా పద్ధతిని అనుసరిస్తున్నాయి. అయితే, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలుకు పెట్టిన సిరా గుర్తులు ఇంకా చెరిగిపోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు మళ్లీ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చినపుడు ఎడమ చేతి చూపుడు వేలికి ఉన్న చెరగని సిరా గుర్తు సమస్యలను తెచ్చిపెట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చే వారి ఎడమ చేతి మధ్య వేలికి సిరా చుక్కతో గుర్తు పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మనసు చదివేస్తాడు
‘విక్రమార్కుడు’ సినిమాలో ప్రతినాయకుడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు అజయ్. పలు చిత్రాల్లో హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా నటిస్తున్న ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘స్పెషల్’. వాస్తవ్ దర్శకత్వంలో నందలాల్ క్రియేషన్స్ పతాకంపై నందమ్ శ్రీవాస్తవ్ నిర్మించారు. వాస్తవ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక మైండ్ రీడర్ స్టోరీ. ఓ వ్యక్తిని ఒక అమ్మాయి లవ్ చేసి వదిలేస్తుంది. ఆ అమ్మాయి అతన్ని మోసం చేయడానికి కారణమైన వాళ్ల మీద ఈ మైండ్ రీడర్ పగ తీర్చుకుంటాడు. మనుషుల్ని టచ్ చేసి, వాళ్ల మైండ్ రీడ్ చేసే ఒక పారాసైకాలజీ స్కిల్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. హాలీవుడ్ తరహా కథాంశంతో తీసిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ఇది. అజయ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు’’ అన్నారు. ‘‘ఫ్యాంటసీ లవ్ యాక్షన్ షేడ్స్‌తో నడిచే చిత్రమిది. కథ, కథనం, ట్విస్టులు ఈ చిత్రానికి ప్రధాన బలం. ఇందులోని డైలాగ్స్ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్‌ని ఇస్తాయి. ఈనెల 29న టీజర్‌ను, నవంబర్ చివరి వారంలో సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని శ్రీవాస్తవ్ అన్నారు. రంగ, అక్షత, సంతోష, అశోక్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎన్వీఎస్ మన్యం, కెమెరా: బి అమర్ కుమార్. -
విధి నిర్వహణలో తేడాలొస్తే..సహించం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : వరుస రైల్వే చోరీలు.. క్షేత్ర స్థాయిలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కొందరు సీఐలు.. ఈ పరిణామాల మధ్య కొత్త ఎస్ఐలకు పోలీసు శాఖ ఎలాంటి దిశానిర్దేశం చేస్తోంది. రోడ్డు ప్రమాదాలను నియంత్రించగలిగారా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ శాంతి భద్రతల పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? పోలీసుశాఖ వద్ద ఉన్న ప్రణాళిక ఏంటి? తదితర అంశాలపై జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌తో ‘సాక్షి’ ముఖాముఖి. సాక్షి: రైల్వే దొంగతనాలు తీవ్ర చర్చనీయాంశంగా ఉన్నాయి? అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అశోక్: నెలరోజుల్లో ఏడు దొంగతనాలు జరగడాన్ని తీవ్రంగా పరిగణించాం. కేసులను సీరియస్‌గా తీసుకున్నాం. షోలాపూర్‌కు ప్రత్యేక బృందాలను పంపాం. దొంగతనాల నివారణకు ఇక్కడ సిగ్నల్ ఫోర్స్‌తో పాటు పెట్రోలింగ్ పెంచాం. కర్నూలు, అనంతపురం, జీఆర్పీ, ఆర్పీఎఫ్ సంయుక్తంగా శ్రమిస్తున్నాం. ప్రస్తుతానికి చోరీలు ఆగాయి. సాక్షి: షోలాపూర్ గ్యాంగే దొంగతనాలు చేసిందని ఎలా నిర్ధారణకు వచ్చారు? అశోక్: 2016లో గార్లదిన్నె, తాటిచెర్లలో ఇక్కడ దొంగతనాలు జరిగాయి. అప్పుడు ఓ ముఠా పట్టుబడింది. వారు షోలాపూర్ గ్యాంగ్. అందులో కొందరు పట్టుబడ్డారు. ఇంకొందరు తప్పించుకున్నారు. ఆ ఘటన ఆధారంగా గుర్తించాం. వారు పార్థిగ్యాంగ్ అనే భావిస్తున్నాం. వీరు అన్ని రకాల దొంగతనాలు చేస్తారు. రైళ్లలో పోలీసులు లేకపోతే ఎక్కువగా చైన్‌స్నాచింగ్ చేస్తారు. బ్యాగులు, పర్సులు కొట్టేస్తారు. రైలును ఆపిన తర్వాత తక్కువ టైంలోనే దిగిపోతున్నారు. చోరీలతో పాటు ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీన్ని సీరియస్‌గానే తీసుకున్నాం. సాక్షి: కొంతమంది సీఐలు అధికారపార్టీకి పూర్తి సానుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి? దీనివల్ల సామాన్యులు, ప్రతిపక్షపార్టీల సానుభూతి పరులు ఇబ్బంది పడుతున్నారు? అశోక్: పెద్ద ఎత్తున ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే అంశాలు నా దృష్టికి రాలేదు. వచ్చిన అంశాలను ఎప్పటికప్పుడు గుర్తించి వారితో మాట్లాడి సరి చేస్తున్నాం. అలాంటి ఘటనలుంటే వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి నిస్పక్షపాతంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. సాక్షి: కొందరు సీఐలు, సీనియర్ ఎస్ఐలు ఇలా వ్యవహరించే తీరు.. కొత్తగా విధుల్లోకి వచ్చిన ఎస్ఐలపై ప్రభావం చూపే అవకాశం ఉండదంటారా? అశోక్: క్రైం మీటింగ్‌ల్లో డీఎస్పీలు, సీఐలతో మాట్లాడుతుంటాం. ఇప్పుడు ఎస్ఐలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. ఇప్పటికే రెండు బ్యాచ్‌లను పిలిపించి మాట్లాడాం. పోలీసులు ఎలా పనిచేయాలి? ప్రజలతో ఎలా నడుచుకోవాలి? మహిళలపై జరిగే దాడులు, రోడ్డు ప్రమాదాలు, టెక్నాలజీ వాడుకోవడంపై మాట్లాడుతున్నా. నాతో పాటు సీనియర్ ప్రొఫెసర్లు, జువైనల్ యాక్టు, సాంకేతిక నిపుణులను పిలిపించి విభాగాల వారీగా అవగాహన కల్పిస్తున్నాం. సాక్షి: ఎన్నికలు రాబోతున్నాయి? సమస్యాత్మక గ్రామాలు గుర్తించారా? అశోక్: సమస్మాత్మక, అతి సమస్యాత్మక, ఫ్యాక్షన్ గ్రామాలను గుర్తించాం. రెండు గ్రూపులతో మాట్లాడి, గొడవలు తగ్గుముఖం పట్టే చర్యలకు ఉపక్రమిస్తున్నాం. వారి డేటా కూడా స్టేషన్లలో ఉండేలా చూస్తున్నాం. సాక్షి: గతంతో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గినట్లున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అశోక్: నిజమే. గతంతో పోలిస్తే ఈ ఏడాది తగ్గాయి. రోడ్డు ప్రమాదాల నివారణలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నాం. హైవేలు, పట్టణ ప్రాంతాలతో పాటు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశాం. ట్రాఫిక్‌పై అవగాహన కల్పించేందుకు కటౌట్లు, ఇండికేటర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం. హెల్మెట్ వాడకం కూడా పెరిగింది. 60–70శాతం మంది వాడుతున్నారు. ఇది మంచి పరిణామం. దీన్ని వందశాతానికి తీసుకెళ్లాలి. తనిఖీలు తగ్గించి అవగాహన కార్యక్రమాలు పెంచాలనుకుంటున్నాం. సాక్షి: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఎలా సాగుతున్నాయి? అశోక్: రోడ్డు ప్రమాదాలు తగ్గడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఎంతో ఉపయోగకరం. రెగ్యులర్‌గా వీటిని కొనసాగిస్తున్నాం. అయితే సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ల కొరత ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే కచ్చితంగా కోర్టుకు హాజరుపర్చాల్సి ఉంది. దీంతో కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మెజిస్ట్రేట్లు పూర్తిస్థాయిలో వచ్చిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేసే బృందాలను పెంచుతాం. సాక్షి: పోలీసుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అశోక్: పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. పోలీసు సంఘాల ప్రతినిధులు రెగ్యులర్‌గా మాతో మాట్లాడుతున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా.. పోలీసు సిబ్బందికి అండగా ఉంటున్నాం. -
ఏసీబీ అడిషనల్ ఎస్పీ అశోక్‌కుమార్‌పై వేటు
-
పురుషోత్తం రెడ్డి కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ పురుషోత్తం రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పురుషోత్తం రెడ్డికి సహకరించారన్న కారణంగా ఏసీబీ అడిషనల్ ఎస్పీ అశోక్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బిల్డింగ్ సూపర్ వైజర్ చేరిన పురుషోత్తం రెడ్డి అనంతర కాలంలో హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అయితే ఆయన భారీ అవినీతికి పాల్పడుతున్నాడని 2009 నుంచే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో రూ.వందల కోట్లు అవినీతి సొమ్ము కూడబెట్టుకున్నారన్న ఆరోపణలతో ఈ ఫిబ్రవరిలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు పురుషోత్తం ఇల్లు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. దీంతో తొలుత పురుషోత్తం పరారు కాగా, అతని బినామీలు యాదవరెడ్డి, నిషాంత్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో పురుషోత్తంరెడ్డి ఫిబ్రవరి 16న ఏసీబీ కోర్టులో లొంగిపోగా చంచల్ గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. పూర్తిస్థాయిలో అధికారులు విచారణ చేపట్టగా హెచ్ఎండీఏ అధికారి పురుషోత్తం రెడ్డి అక్రమాలు, అవినీతికి ఏసీబీ అడిషనల్ ఎస్పీ అశోక్‌కుమార్ సహకరించారని తేలింది. కాగా, ఈ కేసులో ఏసీబీ రూ.50 కోట్లకుపైగా బినామీ పెట్టుబడులను గుర్తించింది. నాలుగు కమర్షియల్ కాంపెక్సులు, వ్యవసాయ భూమికి సంబంధించి రూ.20 కోట్ల మేర ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకుంది. పురుషోత్తం అల్లుడు చేపట్టిన విల్లాల నిర్మాణానికి సంబంధించి రూ.30 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు ఆధారాలు సేకరించారు. కూతురికి ఇచ్చిన ఆభరణాలు, గిఫ్ట్‌గా ఇచ్చిన ఆస్తుల విలువ మరో రూ.10 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. -
పల్లెటూరి ప్రేమకథ
ప్రముఖ దర్శకులు రాజమౌళి వద్ద ‘మగధీర’ చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేసిన సాయికృష్ణ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘అనగనగా ఒక ఊళ్ళో’. అశోక్ కుమార్, ప్రియాంక శర్మ జంటగా చంద్ర బాలాజీ ఫిల్మ్స్ పతాకంపై కె.చంద్రరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. సాయికృష్ణ మాట్లాడుతూ –‘‘రాజమౌళిగారి స్ఫూర్తితో దర్శకునిగా మారా. అశోక్ కుమార్ కొత్తవాడైనా అనుభవం ఉన్నవాడిలా తన పాత్రలో జీవించాడు. సినిమా విడుదల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు మరో యువ హీరో వచ్చాడని అంటారు. నాకు దర్శకునిగా అవకాశమిచ్చిన చంద్రరావుకు జీవితాంతం రుణపడి ఉంటా’’ అన్నారు. ‘‘ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ఇది. పల్లెటూరి నేపథ్యంలో ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయి’’ అన్నారు అశోక్ కుమార్. ఈ చిత్రానికి కెమెరా: రాజశేఖర్ యస్, సంగీతం: యాజమాన్య, సహనిర్మాత: శ్రీతేజ్ మనోజ్ పాలిక. -
పల్లెటూరి ప్రేమ
అశోక్ కుమార్, ప్రియాంక శర్మ జంటగా కేవీ సాయికృష్ణ దర్శకత్వంలో చంద్రరావు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక ఊళ్లో’. పల్లెటూరికి వినోద యాత్ర అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ఆడియోను శ్రీకాంత్ రిలీజ్ చేశారు. ‘‘రాజమౌళి దగ్గర పని చేసిన సాయికృష్ణ ఈ సినిమాను చక్కగా తీశాడు. మంచి లొకేషన్స్‌లో చిత్రీకరించాం. సంగీతం బాగా కుదిరింది’’ అన్నారు ^è ంద్రరావు. ‘‘రాజమౌళి గారి దగ్గర వర్క్ చేస్తూ చాలా నేర్చుకున్నాను. పాటలు బావున్నాయని అందరూ అభినందిస్తున్నారు. సినిమా కూడా ఆకట్టుకుంటుంది’’ అన్నారు సాయికృష్ణ. ‘‘చాన్స్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్. మంచి ఫీల్ కలిగించే సినిమా అవుతుంది’’ అన్నారు హీరో విజయ్. ఈ సినిమాకు సహనిర్మాతలు: శ్రీతేజ్ మనోజ్ పాలిక, బాలాజి గెద్దాడ కమల్ వీవీ, సంగీతం: యాజమాన్య. -
అంతర్జాతీయ స్మగ్లర్ అరెస్ట్
సాక్షి, కడప : దశాబ్దాల కాలంగా పోలీసులకు కంటిమీద నిద్ర లేకుండా చేసి తప్పించుకుతిరుగుతున్న అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అశోక్ కుమార్ అగర్వాల్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. వైఎస్ఆర్ జిల్లాలో గత కొన్నేళ్లుగా పోలీసుల కన్నుకప్పి కోట్లాది రూపాయల విలువ చేసే ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నాడు. పలుసార్లు దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు. ఈసారి మాత్రం పోలీసులకు దొరికిపోయాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అశోక్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి సుమారు నాలుగు కోట్లు విలువ చేసే 3 టన్నుల ఎర్రచందనం దుంగలు, వాటితో తయారు చేసిన బొమ్మలను స్వాధీన పరుచుకున్నారు. అగర్వాల్ ఇప్పటి వరకు 1000 టన్నుల ఎర్రచందనం అక్రమ రవాణా చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈమేరకు జిల్లాఎస్పీ బాబూజీ అట్టడా వివరాలు వెల్లడించారు. -
విదేశాలకు పారిపోయిన సినీ నిర్మాత..?
సాక్షి, చెన్నై: ప్రముఖ సినీ ఫైనాన్షియర్, నిర్మాత అన్బుచెళియన్ విదేశాలకు పారిపోయినట్లు పోలీసులకు ఆధారాలు దొరికినట్టు సమాచారం. ఇటీవల నటుడు శశికుమార్ అత్త కొడుకు, సహ నిర్మాత అశోక్‌కుమార్ రుణభారంతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ముందు అశోక్‌కుమార్ రాసిన లేఖలో అన్బుచెళియన్ ఒత్తిడి, ఆయన అనుచరులతో బెదిరించడమే తన మరణానికి కారణం అని పేర్కొనడం తీవ్ర కలకలానికి దారితీసింది. ఈ వ్యవహారంపై నటుడు శశికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్బుచెళియన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్బు చెళియన్ చిత్ర నిర్మాణ సంస్థ గోపురం ఫిలింస్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి కొన్ని కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన మేనేజర్ సాధిక్‌బాషా, వ్యక్తిగత కార్యనిర్వాహకుడు మురుసుకుమార్ను అరెస్ట్ చేసి విచారించారు. అయితే వారి నుంచి సరైన ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులు హైదరాబాద్, బెంగళూర్ వెళ్లి విచారణ చేపట్టారు. కాగా అన్బుచెళియన్ దేశం విడిచి అండమాన్ నుంచి కుటుంబం సహా పారిపోయారనే సమాచరం పోలీసులకు అందింది. అయితే అన్బుచెళియన్ విమానం ద్వారా విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుక్అవుట్ పోస్టర్లను విమానాశ్రయాల్లో అంటించారు. దీంతో ఆయన చెన్నై నౌకాశ్రయం ద్వారా అండమాన్‌కు పారిపోయినట్లు సమాచారం. అక్కడి నుంచి కోల్‌కతా.. అటు నుంచి దుబాయ్ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం అందిందని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. కాగా అన్బుచెళియన్ 18 రోజులుగా అచూకీ తెలియకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. -
కోలీవుడ్ కష్టాలకు కారణం వీళ్లేనా?
తమిళసినిమా: కోలీవుడ్‌లో అప్పుల బాధలు, ఆత్మహత్యలు అధికం అవుతున్నాయి. ఇలాంటి దుస్సంఘటనలు ఇంతకు ముందు లేవా అనే ప్రశ్న తలెత్తవచ్చు. ఉన్నాయి అయితే ఈ పరిస్థితి ఇప్పుడు అధికమించిందని చెప్పడం అతిశయోక్తి కాదు. గత 21వ తేదీన నటుడు శశికుమార్ అత్తకొడుకు, సహ నిర్మాత అశోక్‌కుమార్‌కు ఆత్మహత్యకు ప్రధాన కారణం అప్పుల భారమే. అందుకు ఫైనాన్సియర్ అన్బుచెళియన్ ఒత్తిళ్లు, బెదిరింపులు, అసభ్య దూషణలు ఒక కారణం కావచ్చు. అయితే ఫైనాన్సియర్ అన్బుచెళియన్ను కోలీవుడ్‌లో ఒక వర్గం తప్పు పడుతున్నా, మరో వర్గం ఆయనకు మద్దతు పలకడం గమనార్హం. మొన్నటి వరకూ ఫైనాన్సియర్ అన్బుచెళియన్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన వారు ఇవాళ ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. దర్శక నిర్మాత సీవీ.కుమార్ అయితే అన్బుచెళియన్పై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసి సోమవారం ఆ కేసును వెనక్కి తీసుకున్నారు. అదే విధంగా పరారీలో ఉన్న అన్బుచెళియన్ ఆచూకీని పోలీసులు ఇంకా కనిపెట్టలేదు. ఆయన ఒక సీనియర్ మంత్రికి చెందిన వారి అండదండలున్నాయని, అందుకుగాను ఆయన్ని పోలీసులు కాపాడే ప్రయత్రం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే అశోక్‌కుమార్ బంధువు శశికుమార్‌ను మాత్రం పోలీసులు విచారిస్తున్నారు. అసలేం జరుగుతోంది? నిజంగా నిర్మాతల ఆత్మహత్యలకు కారణం కందువడ్డీలతో వేధిస్తున్న ఫైనాన్సియర్లేనా? వేరే కారణాలేమైనా ఉన్నాయా? సంక్షోభానికి కారణం దర్శకులు, నటీనటులు కూడావేరే కారణాలు ఉన్నాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు. అసలు చిత్ర పరిశ్రమ క్షీణించడానికి దర్శకులే కారణం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.చిత్ర నిర్మాణానికి సరైన ప్రణాళికలేని దర్శకులు, కోట్లలో పారితోషికాలు డిమాండ్ చేసే నటీనటులు కారణం అనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. నిర్మాత కేఎస్.శ్రీనివాసన్ పస్తుత పరిస్థితులపై స్పందిస్తూ, అశోక్‌కుమార్ ఆత్మహత్యకు ఫైనాన్స్ సమస్య మాత్రమే కాదన్నారు.మూడేళ్ల క్రితం తాను నిర్మించిన నిమిర్నుదు నిల్ చిత్రం కలిగించిన నష్టం నుంచి ఇప్పటికీ బయట పడలేకపోయానన్నారు. ఇంతకు ముందు దర్శకుడు ఎస్పీ.ముత్తురామన్ లాంటి వాళ్ల నిర్మాతల పరిస్థితులనడిగి ప్రణాళిక ప్రకారం చిత్రాలను పూర్తి చేసేవాళ్లని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు చాలా ఘోరంగా తయారయ్యాయన్నారు. షూటింగ్ చేయడం చాలా సులభం అని, షూటింగ్‌కు ముందు నటీనటులకు, సాంకేతికవర్గానికి కోట్ల రూపాయల్లో పారితోషికాలు చెల్లించి వెళ్లడం చాలా కష్టంగా మారిందని అన్నారు. రూ.కోటి అప్పు చేస్తే అది మూడు నెలలకు వడ్డీతో కలిసి రూ.1.70 కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఆత్మాభిమానానికి బాధ్యతకు మధ్య పోరాటంలో ఆత్మాభిమానం ఎక్కువ అయినప్పుడు ఆత్మహత్యలే శరణ్యం అవుతాయని అన్నారు. ఈ పరిస్థితి మారాలని, సినిమారంగంలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనాలంటే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద సహ నిర్మాత అశోక్‌కుమార్ ఆత్మహత్య కోలీవుడ్‌ను కుదిపేస్తోంది. -
అలాంటి వ్యక్తి సినిమాలోనే ఉండకూడదు!
తమిళసినిమా: అలాంటి వ్యక్తి సినీరంగంలోనే ఉండకూడదు. ఇలా ఎవరిని ఎవరు అన్నారో తెలుసా? సహ నిర్మాత అశోక్‌కుమార్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.అతని మరణానికి కందువడ్డీతో వేధించిన ఫైనాన్సియర్, నిర్మాత అన్భుచెళియన్ అంటూ కొందరు ఆయన్ని దూషిస్తుంటే మరి కొందరు ఆయనకు మద్దతు పలుకుతున్నారు. ఇలా కోలీవుడ్‌లో గరంగరం వాతావరణ నెలకొంది. అశోక్‌కుమార్ సహ నిర్మాణంలో తెరకెక్కుతున్న కొడివీరన్ చిత్రంలో శశికుమార్‌కు జంటగా నటించిన ముగ్గురు హీరోయిన్లలో ఒకరైన నటి పూర్ణ అశోక్‌కుమార్ మరణించిన వార్త తెలిసిన వెంటనే స్పందిస్తూ అశోక్‌కుమార్ మీరు ఉత్తముల్లోనే ఉత్తములని మాకు తెలుసు, మంచి మనసున్న మనిషి మీరు. మీరెక్కడికీ వెళ్లిపోలేరు. మాతోనే ఉంటారు. అని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అనంతరం అన్భుచెళియన్ లాంటి వాళ్లు సినిమారంగంలోనే ఉండకూడదు.అశోక్‌కుమార్ మరణించినా మనమంతా ఒకటి మాత్రం చేయగలం. అశోక్‌కుమార్ మరణానికి కారణమైన అన్బుచెళియన్‌కు కఠిన శిక్ష పడేలా చేయవచ్చు. అందుకు మనం అంతా చేయి కలపాలి అని మరో ట్వీట్ చేసింది. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను, దర్శకుడు సుందర్. సీ,నటి దేవయాని, మనోబాలా, శీనూరామస్మామి వంటి పలువురు శుక్రవారం పత్రికా సమావేశం నిర్వహించి మరీ అన్బుచెళియన్‌కు బాసటగా నిలిస్తే, నటి పూర్ణమాత్రం ధైర్యంగా ఆన్బుచెళియన్‌కు వ్యతిరేకంగా గళమెత్తడంతో పాటు ఘాటు పదాలతో దూషంచడం చర్చనీయాంశంగా మారింది. -
‘అలాంటి వ్యక్తి సినిమాల్లోనే ఉండకూడదు’
తమిళసినిమా: అలాంటి వ్యక్తి సినీరంగంలోనే ఉండకూడదు..! ఇలా ఎవరిని ఎవరు అన్నారో తెలుసా? సహ నిర్మాత అశోక్‌కుమార్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతని మరణానికి కందువడ్డీతో వేధించిన ఫైనాన్షియర్, నిర్మాత అన్బుచెళియన్ అంటూ కొందరు ఆయన్ని దూషిస్తుంటే మరి కొందరు ఆయనికి మద్దతు పలుకుతున్నారు. ఇలా కోలీవుడ్‌లో గరం గరం వాతావరణ నెలకొంది. కాగా అశోక్‌కుమార్ సహ నిర్మాణంలో తెరకెక్కుతున్న కొడివీరన్ చిత్రంలో శశికుమార్‌కు జంటగా నటించిన ముగ్గురు హీరోయిన్లలో ఒకరైన నటి పూర్ణ అశోక్‌కుమార్ మరణించిన వార్త తెలిసిన వెంటనే స్పందించింది. ‘అశోక్‌కుమార్ మీరు ఉత్తముల్లోనే ఉత్తములని మాకు తెలుసు, మంచి మనసున్న మనిషి మీరు. మీరెక్కడికీ వెళ్లిపోలేరు. మాతోనే ఉంటారు’. అని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అనంతరం ‘అన్బుచెళియన్ లాంటి వాళ్లు సినిమా రంగంలోనే ఉండకూడదు. అశోక్‌కుమార్ మరణించినా మనమంతా ఒకటి మాత్రం చేయగలం. అశోక్‌కుమార్ మరణానికి కారణం అయిన అన్బుచెళియన్‌కు కఠిన శిక్ష పడేలా చేయవచ్చు. అందుకు మనం అంతా చేయి కలపాలి..’ అని మరో ట్వీట్ చేసింది. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.ధాను, దర్శకుడు సుందర్.సి, నటి దేవయాని, మనోబాలా, శీనూరామస్వామి వంటి పలువురు శుక్రవారం పత్రికా సమావేశం నిర్వహించి మరీ అన్బుచెళియన్‌కు బాసటగా నిలిస్తే, నటి పూర్ణ మాత్రం ధైర్యంగా ఆన్బుచెళియన్‌కు వ్యతిరేకంగా గళమెత్తడంతో పాటు ఘాటు పదాలతో దూషించడం చర్చనీయాంశంగా మారింది. -
దర్శక, నిర్మాత ఆత్మహత్య వెనుక...
సాక్షి, చెన్నై: ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తమిళనాడులోనూ ‘కాల్‌మనీ’ భూతం బుసలు కొడుతోంది. ఏపీలో ఇప్పటికే ఈ రక్కసి బారిన పడి ఎంతో మంది మానప్రాణాలు పోగొట్టుకోగా, తాజాగా పొరుగు రాష్ట్రానికి ఇది పాకింది. కాల్‌మనీ వ్యవహారం కోలీవుడ్ దర్శక నిర్మాత బి.అశోక్ కుమార్ బలవన్మరణానికి కారణమైంది. నటుడు శశికుమార్ సోదరుడైన ఆయన మంగళవారం చెన్నైలో ఆత్మహత్య చేసుకోవటం సినిమా వర్గాలను నివ్వెరపోయేలా చేసింది. ఫైనాన్షియర్లు, కాల్‌మనీ దారుల నుండి గత కొంతకాలంగా బెదిరింపులు వస్తుండటంతో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని సూసైడ్ లెటర్లో అశోక్ కుమార్ వివరించటం చిత్రసీమను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో కోలీవుడ్ కాల్‌మనీ దందాకు వ్యతిరేకంగా కదంతొక్కింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేసింది. అశోక్ కుమార్‌ను బెదిరించిన వారిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోవడంతో కందువడ్డీ, కాల్‌మనీ వ్యవహారంలో ప్రమేయమున్న పైనాన్షియర్లపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. గతంలో కాల్‌మనీ వ్యవహారంలో ఓ కుటుంబం తిరునెల్వేలి కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విదారక ఉదంతాన్ని మరువక ముందే కాల్‌మనీకి సినీ నిర్మాత అశోక్ కుమార్ బలి కావడం తమిళనాట తీవ్ర కలకలం రేపింది. -
ప్రముఖ దర్శక,నిర్మాత ఆత్మహత్య
ప్రముఖ తమిళ దర్శక, నిర్మాత బి.అశోక్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డారు. చెన్నైలోని అళ్వార్ తిరునగర్ లోని తన నివాసంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. గత ఏడేళ్లుగా ఆయన సినిమాలకు ఫైనాన్సియర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తులు తమ డబ్బులు తిరిగివ్వాల్సిందిగా బెదిరిస్తుండటమే ఈ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. అశోక్ కుమార్ ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత శశికుమార్ కు బంధువు. శశికుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ఇసన్, పొరలి సినిమాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. వీరి నిర్మాణంలో తెరకెక్కిన కోడి వీరం రిలీజ్ సిద్ధంగా ఉంది. మరోవైపు అశోక్ కుమార్ మృతి పట్ల పలువురు తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పదించిన హీరో సిద్ధార్థ్ ' ఫైనాన్సియర్ ఒత్తిడి కారణంగా ఓ యువ కళాకారుడు మరణించటం బాధ కలిగించింది. తమిళ సినీరంగంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ ప్రపంచం కేవలం పేరు, సక్సెస్ లను మాత్రమే గుర్తిస్తుంది. మొత్తం వ్యవస్థనే మార్చాల్సిన సమయం వచ్చింది. రైతైనా, దర్శకుడైనా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి రావటం దారుణం'. అంటూ ట్వీట్ చేశారు. Very painful to hear of a young man's death because of financial pressure. Tamil Cinema is full of such debt, but all the world sees are the lies of success and fame. The entire system needs overhaul. Farmer or film maker, suicide is a curse. Condolences to Sasikumar and family. — Siddharth (@Actor_Siddharth) 22 November 2017 -
బీసీ స్టడీసర్కిల్‌లో సామాజిక కోటా
సాక్షి, హైదరాబాద్: సామాజిక కోటా కింద తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్లో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా బీసీలకు 75శాతం, ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 10శాతం సీట్లు ఇవ్వాలని పేర్కొంది. -
ప్రశాంత వాతావరణం అవసరం
పోలీసుశాఖ ప్రతిష్ట దిగజారిస్తే ఉపేక్షించను – ప్రజా సమస్యల పరిష్కారానికి ‘క్విక్ రెస్పాన్స్ టీం’ – నేర సమీక్షలో ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ అనంతపురం సెంట్రల్ : పారిశ్రామికంగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న జిల్లాలో ప్రశాంత వాతావరణం, భద్రత కల్పించాల్ని బాధ్యత పోలీసుశాఖపై ఉందని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ అభిప్రాయపడ్డారు. శనివారం నగరంలోని పోలీసు కాన్ఫరెన్స్‌హాలులో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ కరువు జిల్లా అభివృద్ధికి తోడ్పడుతూ ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థలకు ప్రజల తరుఫున భరోసా ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఎట్టి పరిస్థితులలో శాంతి భద్రతలు అదుపులో ఉండాల్సిందేనన్నారు. జిల్లాకు చెడ్డపేరు తెస్తున్న ఫ్యాక్షన్, గ్రూపు తగాదాల కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాలను పక్కాగా నియంత్రించాలన్నారు. బాధితుల సమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు త్వరలోనే ‘క్విక్ రెస్పాన్స్ టీమ్’లను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని నిర్ణయించారు. కదిరి, హిందూపురం లాంటి పట్టణాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా అన్ని వర్గాల ప్రజలతో సఖ్యతగా వ్యవహరించాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ చాలా ముఖ్యమని హితవు పలికారు. సామాజిక సేవా కార్యక్రమాల సందర్భంగా యువత భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగించి పోలీసులపై విశ్వాసం పెంపొందించేలా కృషి చేయాలని తెలిపారు. పోలీసు శాఖ ప్రతిష్ట పెంచే విధంగా ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలన్నారు. అంతేగానీ దిగజార్చే విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, రోడ్డు ప్రమాదాల నివారించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. -
డిన్నర్ ఆలస్యమైందని కాల్చి చంపాడు
ఘజియాబాద్: క్షణికావేశంలో తనతో దాదాపు 35 ఏళ్లకు పైగా కాపురం చేస్తున్న భార్యను ఓ భర్త చంపేశాడు. రాత్రి భోజనం త్వరగా సిద్ధం చేయనందుకు గొడవపెట్టుకొని ఇంట్లో తుపాకీతో తలపై కాల్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కవీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మానససరోవర్ పార్క్ కాలనీలో సునయన(55), అశోక్‌కుమార్(60) అనే దంపతులు ఉంటున్నారు. వారికి టింకు (28), రింకు (32)అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరికి ఒక మినీ ట్రక్ ఉంది. అయితే, శనివారం రాత్రి బయటకు వెళ్లి బాగా మద్యం తాగి వచ్చిన అశోక్ కుమార్ ఇంకా వంట సిద్ధం చేయలేదా అని గొడవకు దిగాడు. చేస్తాను అని చెప్తుండగానే ఇప్పటి వరకు ఏం చేశావంటూ అనకూడని మాటలు అంటూ తాగిన మైకంలో పోట్లాటకు దిగాడు. ఈలోగా రింకు అతడి భార్య సోనీ జోక్యం చేసుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మరింత ఆగ్రహంతో అశోక్ కుమార్ తమ ఇంట్లోని తుపాకీతో కాల్పులు జరిపాడు. దాంతో ఓ బుల్లెట్ కాస్త సునయనకు తగలడంతో ఆమె కుప్పకూలింది. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణం పోయింది. దారి మధ్యలోనే ప్రాణం పోయిందని వైద్యులు స్పష్టం చేశారు. -
‘అనంత’ ఎస్పీగా అశోక్‌కుమార్
– రాజశేఖరబాబు చిత్తూరు ఎస్పీగా బదిలీ – గతంలో జిల్లాలో డీఎస్పీగా పనిచేసిన అశోక్‌కుమార్ (సాక్షిప్రతినిధి, అనంతపురం) : అనంతపురం నూతన ఎస్పీగా జీవీజీ అశోక్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఎస్పీ రాజశేఖర్‌బాబును చిత్తూరు ఎస్పీగా బదిలీ చేశారు. గ్రూపు–1కు చెందిన అశోక్‌కుమార్ గతంలో అనంతపురం డీఎస్పీగా పనిచేశారు. మూడేళ్లు పాటు ఇక్కడ పనిచేశారు. ఆ తర్వాత ఏఎస్పీగా పదోన్నతిపై గుంటూరు జిల్లా గురజాల ఓస్డీగా వెళ్లారు. ఆపై హైదరాబాద్ ఇంటెలిజెన్స్‌కు బదిలీ అయ్యారు. 2004 తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పీఎస్ఓ (పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్)గా పనిచేశారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ డీసీపీగా పనిచేసి అక్కడి నుంచి తిరుపతి విజిలెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఇక్కడ కూడా సమర్థ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆపై కడప ఎస్పీగా పనిచేశారు. తర్వాత విజయవాడ డీసీపీగా వెళ్లారు. తాజాగా అనంతపురం ఎస్పీగా నియమితులయ్యారు. అశోక్‌కుమార్ విధినిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా పేరుంది. అనంతపురంలో డీఎస్పీగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం, కడప ఎస్పీగా పనిచేయడంతో రాయలసీమలోని శాంతిభద్రతలపై స్పష్టమైన అవగాహన ఉంది. పక్షపాత పాలన ఎస్పీ రాజశేఖరబాబు 2014 జూలై 22న బాధ్యతలు స్వీకరించారు. దాదాపు మూడేళ్లపాటు పనిచేసిన ఈయన మొదట్లో నిక్కచ్చిగానే వ్యవహరించారు. ఆపై పట్టుసడలించారు. దీంతో పోలీసుశాఖలో క్రమశిక్షణ గాడితప్పింది. ఎవరికివారు ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తించారు. దీంతోపాటు అధికారపార్టీ, ప్రతిపక్షపార్టీలపై పక్షపాత ధోరణితో వ్యవహరించారని, అధికారపార్టీకే మద్దతుగా నిలిచారనే విమర్శలు రాజశేఖరబాబుపై ఉన్నాయి. దీనికి తోడు ఓ ‘మిడిల్బాస్’ తప్పిదాలు చేస్తున్నారని, నిత్యం పంచాయితీలు, సెటిల్మెంట్లు చేస్తున్నారని తెలిసినా, లిఖిత పూర్వకంగా పలువురు ఫిర్యాదు చేసినా అదుపు చేయకుండా వెనుకేసుకొచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రాజశేఖరబాబు ప్రవేశపెట్టిన ‘ఒకదొంగ– ఒక పోలీసు’ పూర్తి వైఫల్యం చెందింది. పోలీసు సంక్షేమం కోసం రాజశేఖరబాబు కృషి చేశారు. -
మతపరమైన రిజర్వేషన్లు సరైనవి కాదు
రాజాపూర్: రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్లు ప్రకటించడం సరైనది కాదని బీజేపీ మండల అధ్యక్షుడు అశోక్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పాల్గొనేందుకు అధికసంఖ్యలో కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో లేని మతపరమైన రిజర్వేషన్లను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మైనార్టీల ఓట్లకోసం సీఎం ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ప్రకటించారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం కులాలమధ్య చిచ్చు పెట్టేలా చూస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు విజయ్, కన్నా లక్ష్మీనారాయణ, సురేష్, శేఖర్‌గౌడ్, రాజేష్, హతిరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తిగత కక్షతో జంట హత్యలు
కాకినాడ సిటీ(తూర్పుగోదావరి): తనకు వ్యతిరేకంగా యజమానికి ఫిర్యాదు చేశాడనే కోపంతో ఓ వ్యక్తి ఇద్దరిని దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. పెదపూడి మండలం రామేశ్వరానికి చెందిన బడుగు బాలగంగాధర తిలక్ (48) కాకినాడ రామారావుపేటలో కర్రీ పాయింట్ నడుపుతున్నాడు. ఈ కర్రీ పాయింట్‌కు సమీపంలోనే ఉన్న సుబ్బయ్య హోటల్లో జగన్నాథపురానికి చెందిన అడ్లబోయిన అశోక్‌కుమార్ అనే వ్యక్తి వ్యాన్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. తిలక్ కారణంగానే తన యజమాని తనపై ఆగ్రహంగా ఉన్నాడని అశోక్‌కుమార్ భావించాడు. దీంతో అతడిని చంపేందుకు కుట్ర పన్నాడు. తిలక్‌తోపాటు అతడి స్నేహితుడు జగడం రామస్వామి బుధవారం అర్థరాత్రి తమ ద్విచక్రవాహనాలపై వస్తుండటం గమనించిన అశోక్‌కుమార్ తన వ్యాన్‌తో వారిని వెంబడించి ముందుగా తిలక్ వాహనాన్ని ఢీకొట్టాడు. వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో గాయపడిన తిలక్‌ను, అడ్డురాబోయిన రామస్వామిని విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో వారు అక్కడే చనిపోయారు. ఈ ఘటనలో అశోక్‌కుమార్ ఒక్కడే పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నా, వాస్తవానికి నలుగురైదుగురు ప్రమేయం ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. -
వర్గీకరణ అడ్డుకునేందుకు సిద్ధం కావాలి
మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అశోక్‌కుమార్ పిఠాపురం టౌన్ : ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో, వీటిని అడ్డుకునేందుకు సిద్ధం కావాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ పిలుపు ఇచ్చారు. స్థానిక చెలికాని భావనరావు సభాసదన్‌లో బు««దlవారం నిర్వహించిన మాలమహానాడు పునర్ నిర్మాణసభలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ కన్వీనర్ కొంగు నూకరాజు అధ్యక్షత జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ 2004లో పీవీ రావు నాయకత్వంలో అప్పటి అధికార పార్టీలకు బుద్ధి చెప్పిన మాదిరిగా ఇప్పుడూ చెప్పాలని కోరారు. బలమైన కమిటీలను ఏర్పాటు చేసి పోరాటానికి సిద్ధం కావాలని, దళితులకు ఎటువంటి అన్యాయం జరిగినా ఎదిరించడానికి సన్నద్ధం కావాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అధికార పార్టీ కార్యకర్తలకు కాకుండా నిజమైన పేద దళితులకు అందాలని డిమాండ్ చేశారు. మాలమహానాడు పేరుతో కొంతమంది చేస్తున్న దందాలు, సెటిల్మెంట్లు.. పీపీ రావు స్థాపించిన మాలమహానాడుకు ఎటువంటి సంబంధం లేదన్నారు. అలాంటివారితో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షుడు జి.సూర్యప్రకాష్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల కోసం ఎస్సీ వర్గీకరణకు తీసుకువచ్చిన జీఓను తక్షణం రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ బ్యాగ్‌లాగ్ పోస్టులను భర్తీచేయాలని, చంద్రబాబు అధికారం చేపట్టి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఒక్క ఉద్యోగం కూడ భర్తీ చేయలేదని విమర్శించారు. మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు మారెల్ల సోమరాజు, నాయకులు పి.పరశురాముడు, మహిళా విభాగం కన్వీనర్ ఎం.సుశీల, బత్తిన శామ్యూల్, కె.చంద్రశేఖర్, మాతా అబ్బులు, ఎడ్ల లక్ష్మీపతి, ఎద్దు నానిబాబు, ఇజ్జిన చలపతిరావు, దారా ప్రభాకరరావు, బొండాడ వీరరాఘవులు, బందిలి నాగేశ్వరరావు మాట్లాడారు. నియోజకవర్గ కమిటీతో పాటు పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోలు, మండలాల కమిటీలను ఎంపిక చేశారు. -
ఆ చిన్న రైతు కొడుకులిద్దరూ దేశం కోసమే..
రగ్దు తోలా(అరా): కన్నబిడ్డలు తాను బతికుండగానే చనిపోతే ఆ తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. ఆ కడుపుకోత కడవరకు అంటిపెట్టుకుని ఉంటుంది. పలు సందర్భాలు ఆ విషయం కడుపులో పొర్లి ఉక్కిరిబిక్కిరి చేసి కన్నీరుగా బయటకొస్తుంది. ఒక్కోసారి గుండె ఆగిపోయేంత పనిచేస్తుంది. అయితే, అదే దుఃఖానికి కొంత గర్వం తోడవ్వాలంటే.. ఆ చనిపోయిన బిడ్డ ప్రాణాలు ఒక త్యాగం కోసం అయి పోయి ఉండాలి. అచ్చం ఇలాంటి పరిస్థితే బిహార్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన చిన్న రైతుకు ఎదురైంది. తన కుమారుడు చనిపోయాడన్న గుండెకోత ఓ పక్కన.. దేశం కోసం త్యాగం చేశాడనే గర్వం మరోపక్క. అవును ఆయన కుమారుడు ఓ సైనికుడు. ఈ ఒక్క కుమారుడే కాదు. ఆయన పెద్ద కుమారుడు కూడా సైనికుడే.. ఆ కుమారుడు కూడా దేశం కోసం ప్రాణాలు కోల్పోయాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరూ కూడా సైనికులే. బిహార్ లోని రగ్దు తోలా అనే గ్రామంలో జయనారాయణ్ సింగ్ కు ఇద్దరు కుమారులు. ఒకరు కమతా సింగ్ కాగా మరొకరు అశోక్ కుమార్ సింగ్. వీరిద్దరు ఆర్మీలోనే చేరారు. వీరిలో కమతా సింగ్ 1986లో రాజస్థాన్‌లో జరిగిన మిలటరీ ఆపరేషన్‌లో ఉగ్రవాదుల దాడిలో వీర మరణం పొందగా తాజాగా.. యూరీ సెక్టార్ లో పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో హవాల్ దార్ అశోక్ కుమార్ సింగ్(50) ప్రాణాలుకోల్పోయాడు. ఈ సందర్భంగా అశోక్ సింగ్ భార్య కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. పాశవికంగా జరిపిన ఈ దాడికి దేశం బదులుతీర్చుకోవాల్సిందేనని చెప్పింది. మరో విశేషమేమిటంటే అశోక్ పెద్ద కుమారుడు కూడా ఆర్మీలోనే చేరాడంట. -
కాపు ఉద్యమాన్ని నీరుగార్చేందుకే కేసులు
– తుని ఘటనతో కరుణాకరరెడ్డికి సంబంధమేమిటి? – కాపునాడు రాష్ట్ర నాయకుడు పోకల అశోక్‌కుమార్ తిరుపతి మంగళం: కాపులను బీసీల్లో చేర్చాలని చేపడుతున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకే మద్దతు తెలిపిన వారిపై కేసులు బనాయిస్తున్నారని కాపునాడు రాష్ట్ర నాయకుడు పోకల అశోక్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే కాపులను బీసీల్లో చేర్చుతానని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా పట్టించుకోకపోవడంతో కాపు రాష్ట్ర నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఉద్యమిస్తున్నట్టు తెలిపారు. కాపు ఉద్యమానికి మద్దతు తెలిపిన వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డిపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఉద్యమానికి ముందు మద్దతు తెలిపిన కరుణాకరరెడ్డికి, తుని ఘటనకు సంబంధమేమిటని ప్రశ్నించారు. అనంతరం కాపు నాయకుడు దుద్దేల బాబు మాట్లాడుతూ అధికార పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉందన్న విషయం కూడా టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్యకు తెలియకపోవడం బాధాకరమన్నారు. అందులో భాగంగానే కరుణాకరరెడ్డి కాపులకు మద్దతు తెలిపారే తప్ప విధ్వంసాలు చేయించలేదన్నారు. కాపు ఉద్యమాలను నీరుగార్చేందుకు చంద్రబాబే టీడీపీ నాయకులతో తగలబెట్టించారని ఆరోపించారు. అనంతరం కాపు నగర అధ్యక్షుడు ముద్రనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తున్న కరుణాకరరెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. కేసులకు, విచారణకు కరుణాకరరెడ్డి భయపడే వ్యక్తి కాదన్నారు. కాపులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చకపోతే అసలైన ఉద్యమాలను చూడాల్సి వస్తుందని కాపు నాయకులు బాలిశెట్టి కిషోర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో కాపు నాయకులు బండ్ల లక్ష్మీపతి, రామూర్తిరాయల్, శివరాయల్, రమేష్ పాల్గొన్నారు. -
విద్యుత్ తీగ తగిలి యువకుడి మృతి
* నష్టపరిహారం ఇవ్వాలని బంధువుల రాస్తారోకో * అధికారుల హామీతో రాస్తారోకో విరమణ ఈలకొలను (రంగంపేట): విద్యుత్తీగ తగిలి ఈలకొలనులో ఒక యువకుడు అక్కడికక్కడే మరణించాడు. స్థానిక పెరుమాళ్ల దుకాణం ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభం వద్ద మూత్ర విసర్జనకు శుక్రవారం ఉదయం వెళ్లిన గ్రామానికి చెందిన తానింకి అశోక్‌కుమార్(19) కాలికి విద్యుత్ స్తంభం ఎర్త్‌వైర్ తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. అతన్ని రక్షిద్దామని ప్రయత్నించిన వరుసకు సోదరుడైన తానింకి మణిరాజు కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆ విషయం గమనించిన స్థానికులు కర్రతో తీగలను తొలగించి అతన్ని రక్షించగలిగారు. స్వల్ప అస్వస్థతకు గురైన మణిరాజును రాయవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ తీగలు, విద్యుత్ డబ్బా ట్రాన్స్ఫార్మర్ స్తంభానికి కింది భాగాన ఉండడంతో అశోక్ మరణించాడంటూ అతని కుటుంబ సభ్యులు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ విషయం తెలుసుకున్న జగ్గంపేట విద్యుత్‌శాఖ ఏడీఏ మీనకేతనరావు, రంగంపేట విద్యుత్ శాఖ ఏఈ భరతరావు అక్కడకు చేరుకున్నారు. అశోక్‌కుమార్ కుటుంబసభ్యులతోను, రంగంపేట ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ నీలపాల త్రిమూర్తులు, గ్రామ సర్పంచ్ కడిమి సాయిబాబులతో వారు చర్చలు జరిపారు. బాధిత కుటుంబానికి విద్యుత్ శాఖపరంగా నష్టపరిహారం చెల్లించడానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతామని హామీ ఇవ్వడంతో ఆకుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. అశోక్ తండ్రి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంపేట ఏఎస్సై వి.సూర్యప్రసాద్ కేసు నమోదు చేసి, పంచనామా నిర్వహించి, పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం అశోక్ మృత దేహాన్ని పంపారు. వైఎస్సార్ సీపీ రైతువిభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లంక చంద్రన్న, జెడ్పీ వైస్ చైర్మన్ పెండ్యాల నళినీకాంత్, మాలమహానాడు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి తిరగటి శివ, జిల్లా మాలమహానాడు సహాయ కార్యదర్శి పోతుల చెల్లయ్య తదితరులు అశోక్ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అశోక్ అకాల మృతితో అతని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తానింకి కృష్ణకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్దకుమారుడైన అశోక్ ఇంటర్ చదివాడు. డిగ్రీ చదివే ప్రయత్నాల్లో వున్నాడు. అశోక్ మరణంతో అతని కుటుంబ సభ్యుల్లో ఒకరికి విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పించాలని కుటుంబ సభ్యులు సత్యనారాయణ, చిట్టిబాబు కోరారు. -
'డబుల్' ఇళ్ల నిర్మాణంలో కొత్త పరిజ్ఞానం
జగదేవ్‌పూర్(మెదక్): డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వినియోగించుకోనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ముఖ్య కార్యదర్శి అశోక్‌కుమార్ తెలిపారు. బుధవారం సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలోడబుల్‌బెడ్ రూం ఇళ్లను ఆయన పరిశీలించారు. నమూనా కోసం పూర్తి చేసిన రెండు ఇళ్లలో కలియ తిరిగి వసతులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్‌బెడ్ రూం ఇళ్లు చాలా అద్భుతంగా ఉన్నాయని అన్నారు. ఎర్రవల్లిలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణ వ్యయం రూ.5.04లక్షల కంటే ఎక్కువ అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ కూడా రూ. 5 లక్షల వ్యయంతోనే డబుల్‌బెడ్ రూం ఇళ్లు నిర్మించాలని సూచించినట్లు చెప్పారు. దీని కోసం ఇళ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీపై ముఖ్య అధికారులు, ఇంజనీర్లతో వర్క్‌షాపు కొనసాగిందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే రూ. ఐదు లక్షలతోనే ఇళ్లను నిర్మించే విధంగా చర్చలు జరిగినట్లు చెప్పారు. గత ఏడాది 70 వేల డబుల్‌బెడ్ రూం ఇళ్లు మంజూరు కాగా ఈ ఏడాది రెండు లక్షల ఇళ్లు మంజూరు అయినట్లు వివరించారు. ప్రస్తుతం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలతో పాటు వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయినట్లు తెలిపారు. -
వైద్యురాలిని ‘బ్లాగు’కీడ్చాడు!
వేధిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు సిటీబ్యూరో: కొంతకాలంగా వైద్యురాలి వెంటపడి వేధిస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ చివరకు బ్లాగుల్లోకి ఎక్కి రాద్దాంతం చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం నిం దితుడిని అరెస్టు చేశారు. పోలీసుల కథ నం ప్రకారం... మహబూబ్‌నగర్‌కు చెందిన అశోక్‌కుమార్ నగరంలోని నారాయణగూడలో నివసిస్తున్నాడు. లండన్‌లో ఎమ్మెస్ చేసి సాఫ్ట్వేర్ ఇంజి నీర్‌గా పని చేస్తున్న ఇతనికి కొంతకా లం క్రితం మాట్రిమోనియల్ సైట్ ద్వా రా అమెరికాలో వైద్య విధ్యనభ్యసిం చిన వచ్చిన అంబర్‌పేటకు చెందిన ఓ వైద్యురాలితో పరిచయం ఏర్పడింది. ఒకరినొకరు ఇష్టపడటంతో కొంతకాలం పాటు సంప్రదింపులు జరిపారు. అని వార్య కారణాల వల్ల కొన్నాళ్లగా ఆమె అశోక్‌కు దూరంగా ఉంటోంది. దీన్ని జీర్ణించుకోలేకపోయిన అతను వెంట పడి వేధించడం ప్రారంభించాడు. దీం తో ఆమె గతంలోనే అంబర్‌పేట ఠాణా తో పాటు సీసీఎస్‌లో ఫిర్యా దు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఇటీవల మరింత బరితెగించిన అశోక్ కొన్ని బ్లాగుల్లో ఆ వైద్యురాలిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన పోస్టులు చేయడం మొదలెట్టాడు. దీం తో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ పి.రాజు సాంకేతిక ఆధారాలను బట్టి అశోక్‌కుమార్‌ను నిందితుడిగా గుర్తిం చారు. నారాయణగూడలో శుక్రవారం అతడిని అరెస్టు చేశారు. -
సహ చట్టం కదిలిస్తుంది
సహకార సంఘాలలో సహకారం తక్కువ. అవినీతి, ప్రతీకారాలెక్కువ. ప్రతి సొసైటీలో రెండు లేదా అంతకు మించి వర్గాలు ఉంటాయి. వారు ఒకరి మీద ఒకరు కారాలూ మిరియాలూ నూరుతుంటారు. సహకార సంఘాల రిజిస్ట్రార్ ఈ సంఘాల కార్యక లాపాలను నియంత్రించాలి. వచ్చిన ఫిర్యాదులు విని తగిన చర్యలు తీసుకోవాలి. కాని వారి కష్టాలు వారివి. తగిన సిబ్బంది ఉండరు. అక్కడా అవినీతి, అసమర్థత, నిష్క్రియ కనిపిస్తాయి. ఏంచేసినా పని చేయబోమనే వైఖరి. ఈ సంఘాల పనిపట్టాలనీ, సర్కారు శాఖతో పనిచేయించాలని అనుకునే వారికి దొరికిన సాధనం ఆర్టీఐ. ఇప్పుడు విరివిగా పడు తున్న ఆర్టీఐ ప్రశ్నల పరంపరతో సర్కారు వారి సహకార శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. చర్య తీసుకోక తప్పని పరిస్థితి. పాపం, ఒక సహకార గృహ నిర్మాణ సంఘ కార్యదర్శి బెహల్ 65 సంవత్సరాల వయసులో రెండేళ్ల నుంచి రిజిస్ట్రార్ చుట్టూ తిరుగుతున్నారు. సభ్యుడు కాని ఒక వ్యక్తి అన్యాయంగా ఫ్లాట్‌ను ఆక్రమించినందుకు ఆరు లక్షల రూపాయలు వసూలు చేయాలన్న ఉత్తర్వును ఆర్సీఎస్ (రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్) ఎందుకు అమలు చేయడం లేదని, ఎప్పుడు వసూలు చేస్తారని ఆర్టీఐ కింద అడిగారు. సొసైటీకి ఎన్ని ఉత్తరాలు రాసినా దిక్కులేదు. ఆర్టీఐ దరఖాస్తు గతీ అంతే. మొదటి అప్పీలు అధికారి సమాచారం ఇవ్వాలని ఆదేశించినా అతీ గతీ లేదు. సీపీఐఓ కనీసం కేసు విచారణ నోటీసుకు కూడా ప్రతిస్పం దించలేదు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా రాలేదు. షోకాజ్ నోటీసుకు జవాబేలేదు. సమాచారం ఇవ్వాలన్న కమిషనర్ ఉత్తర్వులూ పాటించలేదు. మరో నోటీసు, మరి కొంత గడువు ఇచ్చినా ప్రయోజనం లేదు. కొత్తగా సీపీఐఓ (సమాచార అధికారి) పదవిని స్వీకరించిన అశోక్ కుమార్ తనకు ఫైలు దొరకలే దని, అయినా అదనపు గడువు ఇస్తే, విషయం తెలు సుకుని తగిన సమాచారం ఇస్తానని హామీ ఇచ్చారు. మరోసారి విఫలమైతే జరిమానా విధించ డానికి చర్యలు తీసుకోవలసి ఉంటుందని రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కమిషన్ హెచ్చరించింది. సెక్షన్ 20 కింద తప్పుచేసిన అధికారిపైన జరిమానా విధించే అధికారం సమాచార కమిషనర్‌కు ఉంది. రోజుకు రూ.250 చొప్పున, గరిష్టం రూ. 25 వేల దాకా జరిమానా విధిస్తూ క్రమశిక్షణ చర్య తీసుకోవాలని సిఫార్సుకూడా చేయవచ్చు. ఈ అధికారాన్ని ఏ విధంగా వినియోగించాలో, పద్ధతి ప్రక్రియలు ఏమిటో న్యాయస్థానాలు అనేక తీర్పులలో వివరిం చాయి. తమ ఉత్తర్వును తాము అమలు చేసుకునే బలం, శక్తి ట్రిబ్యునల్స్‌కు ఉంటాయని జి. బసవరాజు వర్సెస్ శ్రీమతి అరుంధతి కేసులో (సీసీసీ నంబర్ 525, 2008 సివిల్ (తేదీ 27.1.2009) కర్ణాటక హైకోర్టు వివరించింది. సమగ్రమైన ఆర్టీఐ చట్టంలో సెక్షన్ 20 ద్వారా, సమాచార కమిషన్ తన ఉత్తర్వులను తానే అమలు చేయించుకునే వీలుందని హైకోర్టు నిర్ధారించింది. ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా, ఇటువంటి అధికారాలు ట్రిబ్యునల్స్‌కు ఉంటాయని స్పష్టం చేసింది. మాజీ సమాచార అధికారి జవాబులు ఇవ్వక పోవడం, సీఐసీ ఆదేశాలు పాటించకపోవడం, కమిషన్ విచారణకు హాజరు కాకపోవడంవంటి తప్పులకు పాల్పడ్డారు. ఆఫీసులో ఫైలు ఉన్నప్పటికీ దొరకడం లేదని బుకాయిస్తున్నారని, కమిషన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని, మొత్తానికి ఆర్సీఎస్ కార్యాలయంలో కొందరికి సమాచారం ఇవ్వాలనే లేదని బెహల్ వాదించారు. దాదాపు రెండేళ్ల నుంచి తిరుగుతున్నా, వినతిపత్రాలు ఇస్తున్నా ఎవరూ చర్య తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సంఘానికి కార్యదర్శి అయి ఉండి కూడా నివాస గృహాన్ని ఆక్రమించుకున్న వ్యక్తి నుంచి పరిహారం వసూలు చేయలేకపోవడం పట్ల బెహల్ కలత చెందారు. తనకు సర్కారు శాఖ ఏ మాత్రం సహకరించడం లేదని విమర్శించారు. తన తప్పు ఏమీ లేదని, కేవలం రిజిస్ట్రార్ విభాగం వారు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని అన్నారు. పీఐఓ కృష్ణకుమార్ అసలు పట్టించుకోని అంశాలు, పాటించని ఆదేశాలు ఇవి. 1. ఆర్‌సీఎస్‌కు బెహల్ చేసిన ఫిర్యాదు, 2. ఆర్టీఐ దరఖాస్తు, 3. మొదటి అప్పీలు అధికారి ఆదేశాలు, 4. కేంద్ర సమాచార కమిషన్ కేసు విచారణ నోటీసు, 5. కమిషన్ షోకాజ్ నోటీసు, 6. సమాచారం ఇవ్వాలని కమిషన్ జారీ చేసిన ఆదేశాలు. ఇందువల్ల బెహల్ అనవసరంగా వేధింపులకు గురైనాడు. ఆయనకు పదివేల రూపాయల నష్టపరి హారం చెల్లించాలని కమిషన్ సహకార సంఘాల రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. మరొక రెండు సార్లు పెంచిన గడువులో కూడా సమాధానం చెప్పనం దుకు పీఐఓ కృష్ణమూర్తికి రూ. 25 వేలు జరిమా నాను కమిషన్ విధించింది. పిడుగులు పడినా పనిచేయని అధికారుల చేత పని చేయించే కొరడా సమాచార హక్కు. కొందరు అధికారులు జరిమానా విధించినా చలించరు. వారిపైన చర్య తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వ సంస్థల పైన ఉంటుంది. లేకపోతే వారు బాధితుడికి నష్టపరిహారం చెల్లించవలసి వస్తుంది. ఈ కేసులో పనిచేయని అధికారి పాతిక వేలు జరిమానా కమి షన్‌కు చెల్లిస్తే, అటువంటి అధికారులపైన ఏ చర్యా తీసుకోనందుకు ఆర్సీఎస్ వారు బెహల్‌కు పదివేలు పరిహారం చెల్లించాలి. జరిమానాలు, పరిహారాల ద్వారా సహ చట్టం పనిచేయిస్తుంది. (ఆర్ ఎల్ బెహల్ వర్సెస్ ఆర్సీఎస్, ఇఐఇఅఅ 2015000224 కేసులో ఫిబ్రవరి 1న ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ - మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
ఒలింపిక్స్ లో భారత రెఫరీ..
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది బ్రెజిల్ లోని జరుగనున్న రియో ఒలింపిక్స్ లో భారత్ కు చెందిన అశోక్ కుమర్ రిఫరీగా ఎంపికయ్యాడు. దీంతో అశోక్ కుమార్ ఒలింపిక్స్ కు ఎంపికైన తొలి భారతీయ రెజ్లింగ్ రిఫరీగా స్థానం సంపాదించాడు. యునైటెట్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్యూడబ్యూ) మ్యాచ్ ల నిర్వహణలో భాగంగా సూపర్ వైజర్లు, సలహాదారులను కలుపుకుని మొత్తంగా 50 మందిని ఎంపిక చేసింది. వీరిలో తొమ్మిది మందికి ఆసియానుంచి చోటు లభించగా, వారిలో అశోక్ కుమార్ ఒకరు. ప్రస్తుతం అశోక్ కుమార్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వారెంట్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. ఈ ఏడాది లాస్ వేగాస్‌లో జరిగిన ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పనితీరును పరిగణనలోకి తీసుకుని రిఫరీల ఎంపిక జరిగింది. -
హిందీ బాణీ తెలుగు పాట...
నాస్టాల్జియా సంగీతానికి కులం లేదు మతం లేదు తెలుగు హిందీ అనే భాషాభేదం లేదు. హిట్ అయిన పాట ఎక్కడైనా హిట్ అవుతుంది. అయ్యింది. కాలం కూడా అదే నిరూపించింది. అశోక్ కుమార్ ‘కిస్మత్’ (1943)లో అందరూ మెచ్చిన ఆ పాట ‘మేరా బుల్బుల్ సో రహా హై’... తెలుగులో అంతే అందంగా నలుగురినీ ఆకర్షించలేదా? ‘దొంగ రాముడు’ (1955)లో ‘నిదురపోయే రామచిలుక ఎగిరిపోతుంది... కల చెదిరిపోతుంది’... అంటే మనమందరం సద్దు చేయకుండా శ్రద్ధగా వినలేదా? మంచి పాటను డబ్బింగ్ కూడా ఆపలేదని ‘ఆహ్’ నిరూపించింది. ‘రాజా కి ఆయేగీ బారాత్‘ అని అక్కడ లతా మంగేష్కర్ పాడితే తెలుగులో ‘కనువిందవుతున్నాది’ అని జిక్కీ జవాబు చెప్పలేదా? ఇవాళ్టికీ పందిళ్లు వేసిన పెళ్లి ఇళ్లలో ఈ పాట వినిపిస్తూనే ఉండటం లేదా? మంచి హిందీ పాటకు పరవశించని తెలుగు సంగీత దర్శకుడు లేడు. సాలూరి కావచ్చు, పెండ్యాల కావచ్చు చివరకు నేటి మేటి సంగీత దర్శకులు కూడా కావచ్చు. కాని అందరి కంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివింది మాత్రం సత్యం. హిందీ పాటలను తెలుగులో చాలా సృజనాత్మకంగా సత్యం ప్రవేశపెట్టాడు. కన్నడంలో ఈ బాధ్యతను రాజన్-నాగేంద్ర తీసుకున్నారు. ఫిరోజ్ ఖాన్ 1975లో ‘ధర్మాత్మ’ తీశాడు. ‘గాడ్ ఫాదర్’ను ఇండియనైజ్ చేసే మొదటి ప్రయత్నం అది. కల్యాణ్‌జీ- ఆనంద్జీ సంగీతం. ముకేశ్- కంచన్ పాడిన ‘క్యా ఖూబ్ లగ్తీ బడి సుందర్ దిఖ్తీ హో’... పాట పెద్ద హిట్ అయ్యింది. ఇది మన తెలుగు ఇండస్ట్రీని కూడా తాకింది. 1977లో వచ్చిన రెండు సినిమాల్లో ఈ పాట వినిపించింది. ఎన్టీఆర్ తీసిన ‘చాణక్య చంద్రగుప్త’లో అందరికీ గుర్తుండే ఉండాలి... ‘చిరునవ్వుల తొలకరిలో’ పెద్ద హిట్. అదే సంవత్సరం వచ్చిన కృష్ణంరాజు ‘శివమెత్తిన సత్యం’లో ‘గీతా ఓ గీతా డార్లింగ్ మై డార్లింగ్’ పాట కూడా పెద్ద హిట్టే. ఏసుదాస్- వాణి జయరాం పాడిన ఈ పాటకు జె.వి.రాఘవులు సంగీతం. ఇక సత్యం ఒకే హిందీ బాణీని అనేకసార్లు ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. నౌషాద్ మహానుభావుడు. తమిళ సూపర్‌హిట్ ‘పాలుమ్-పాజుమమ్’ను హిందీలో ‘సాథీ’ (1968) పేరుతో రీమేక్ చేస్తుంటే ఆయన తన ట్రెడిషనల్ బాణీకి కాస్త పక్కకు జరిగి మంచి మోడరన్ మెలోడీ ఇచ్చాడు. ‘మేరా ప్యార్ భి తూ హై ఏ బహార్ భి తూ హై’... ముకేశ్- లతా పాడిన ఈ డ్యూయెట్లో రాజేంద్రకుమార్, వైజయంతిమాలా అందంగా అలరిస్తారు. ఈ పాట బహుశా సత్యంను వెంటాడింది. ఆయన ‘బుల్లెమ్మ బుల్లోడు’ (1972)లో దీనిని ‘కురిసింది వానా నా గుండెలోన’గా ఇన్‌స్పయిర్ అయ్యి చేశాడు. అంతటితో ఆగలేదు. ‘పుట్టినిల్లు మెట్టినిల్లు’ (1973) ‘సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు’ పాటగా చేశాడు. రెండూ పెద్ద హిట్ అయ్యాయి. అందరం అభిమానించే సాలూరి కూడా ఇలాంటి ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు. ‘హరేరామ హరేకృష్ణ’ (1971) కోసం ఆర్.డి.బర్మన్ చాలామంచి మెలోడీ ఒకటి చేశాడు. ‘ఫూలోంకా తారోంకా సబ్ కా కెహనా హై’... లతా పాడిన ఈ పాట ఇప్పటికీ హిట్టే. ఇది ఆయన మనసులో పడి ఉండాలి. ‘రాధాకృష్ణ’ (1978)కు సంగీతం అందించేటప్పుడు ఈ పాటను ‘నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల’గా... చేశారు. సుశీల, బాలూ పాడిన ఈ పాట మంచి ఆహ్లాదంగా ఉంటుంది. పాటలో శోభన్‌బాబు పక్కన హైదరాబాద్ స్టార్ రూప కూడా. ఏమైనా ఈ కథ అనంతం. ఈ పాటల తీపికి లేదు అంతం. గొంతుతో గెలిచిన నటుడు... రాజ్‌కుమార్‌ను అందరూ ఇష్టపడరు. కాని ఇష్టపడేవాళ్లు మాత్రం విపరీతంగా ఇష్టపడతారు. పరిమితమైన శరీర కదలికలతో గంభీరమైన గొంతుతో ఒక ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో పేరు తెచ్చుకున్న నటుడాయన. కశ్మిర్ పండిట్ కుటుంబాల నుంచి వచ్చి బాలీవుడ్లో నిలదొక్కుకున్న తొలితరంవారిలో ఆయన ఒకడు. దిల్ ఏక్ మందిర్, వక్త్, హమ్రాజ్, నీల్ కమల్, హీర్ రాంజా... వంటి హిట్స్ ఈయన ఖాతాలో ఉన్నాయి. దిలీప్ కుమార్‌తో ఎందుకనో వైరం వచ్చింది. ఇద్దరూ కలిసి ‘పైగామ్’లో నటించారు. ఆ తర్వాత 32 ఏళ్లకు సుభాష్ ఘాయ్ ‘సౌదాగర్’లో నటించారు. రాజ్‌కుమార్ అసలు రూపం ఎవరూ చూడలేదు. ఆయన ఎప్పుడూ విగ్లో ఉండేవాడు. నిజ జీవితంలో కూడా విగ్ వాడిన మొదటి నటుడు బహుశా ఆయనే కావచ్చు. ఎవరినీ కలవకుండా రిజర్వ్డ్గా ఉండటానికి ఇష్టపడిన రాజ్‌కుమార్ తను చనిపోయేముందు కుటుంబానికి స్పష్టమైన సూచనలు ఇచ్చాడు. అంతిమ సంస్కారాలు ముగిశాకే తన మరణవార్త లోకానికి తెలియచేయమన్నాడు. కుటుంబ సభ్యులు ఆయన కోరిక నెరవేర్చారు. అందువల్ల ఆయన అంతిమయాత్రలో పాల్గొనే సంగతి దేవుడెరుగు కనీసం చివరి చూపులు కూడా ఆయన అభిమానులకు దక్కలేదు. రాజ్ కుమార్ అనగానే ‘పాకీజా’లో డైలాగ్ గుర్తుకు వస్తుంది. గుర్తుంది కదా... ‘ఆప్ కే పావ్ దేఖా. బహూత్ హసీన్ హై. ఇన్ హే జమీన్ పర్ మత్ ఉతారియేగా. మైలే హోజాయేంగే’... ( మీ పాదాలు చూశాను. చాలా అందంగా ఉన్నాయి. నేల మీద దించకండి. మాసిపోతాయి’)... ఆమె.... అతడూ... ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నా లేకపోయినా ప్రతి స్త్రీ పరాజయం వెనుక మాత్రం చాలామంది పురుషులు ఉంటారు. మీనాకుమారి జీవితం చూస్తే అదే అనిపిస్తుంది. కటిక పేదరికం, దారుణమైన పరిస్థితులు ఆమెను సినిమా రంగంలో బలవంతంగా ప్రవేశపెట్టాయి. ఆమె తండ్రికి ఆమె సంపాదన తప్ప వేరే మార్గం లేదు. సరే సినిమాల్లో నటించింది.. రాణించింది... స్టార్ అయ్యింది. ఆ తర్వాత ఆమె కంటే పదిహేనేళ్ల పెద్దవాడైన దర్శకుడు కమాల్ అమ్రోహి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు పరిణితి లేకపోయినా ఆయనకైనా ఉండి ఉంటే ఆ పెళ్లి ఎంత దాకా వెళ్లగలిగేదో ఊహించి ఉండేవాడు. అలాగే అయ్యింది. 1960ల నాటికి ఇద్దరూ విడివిడిగా ఉండాల్సి వచ్చింది. ఆ సందర్భంలోనే కవి గుల్జార్ కొన్నాళ్లు ఆమెకు దగ్గరయ్యాడు. అంతకంటే ఎక్కువగా హీరో ధర్మేంద్ర. సినిమా రంగంలో ఎటువంటి సంబంధం గాని మంచి చదువుగాని లేకుండా కేవలం కండలని నమ్ముకుని ముంబై చేరుకున్న ఈ హీమేన్ మొదటిసారిగా ‘పూర్ణిమ’ అనే సినిమాలో మీనాకుమారి పక్కన నటించాల్సి వచ్చింది. అప్పటికే ఆమె సూపర్‌స్టార్ కనుక ఇతడికి ఆమె ముందు చేయీ కాలూ ఆడలేదు. నోట మాట రాలేదు. కాని మీనా కుమారి ఎంత మంచి కోస్టార్ అంటే అతడి అనీజీని గమనించి చనువుగా చెవి మెలివేసిందట. దాని వల్ల చెవి ఎర్రగా అయ్యే సరికి ‘భడవా... ఎంత రంగు ఉన్నావ్’ అని పెద్దగా నవ్విందట. దాంతో భయం పోయి ధర్మేంద్ర హాయిగా నటించగలిగాడట. ఈ విషయాన్ని ధర్మేంద్రే చెప్పుకున్నాడు. మీనా కుమారి దాదాపుగా ధర్మేంద్రకు గురుస్థానంలో వెళ్లి అతడికి యాక్టింగ్లోని మెలకువలన్నీ నేర్పింది. నువ్వు పెద్ద హీరోవి అవుతావు అని జోస్యం చెప్పింది. అదే నిజమయ్యింది కూడా. కాని మీనా కుమారితో ధర్మేంద్ర స్నేహం రేయింబవళ్లు ధర్మేంద్ర ఆమె ఇంట్లోనే ఉండటం ఇద్దరూ కలిసి తాగడం ఇవన్నీ పెద్ద గొడవలకు దారి తీశాయి. ధర్మేంద్ర భార్య దాదాపు యుద్ధం ప్రకటించింది. మీనా కుమారి అక్కను పెళ్లి చేసుకున్న కమెడియన్ మెహమూద్ కూడా ఈ గొడవను సర్దుబాటు చేయాల్సి వచ్చింది. మొత్తం మీద వారిద్దరినీ విడదీయగలిగినా తాగుడుకు బానిసైన మీనా కుమారిని చూడ్డానికి వచ్చినప్పుడల్లా ధర్మేంద్ర ఆమె పరిస్థితి చూడలేక రోదిస్తూ బయటకు వచ్చేవాడట. మీనా కుమారి 1972లో తన 39వ ఏట మరణించింది. ఆమె పుట్టినప్పుడు తల్లిదండ్రుల దగ్గర హాస్పిటల్ బిల్లులకు డబ్బు లేదు. చనిపోయినప్పుడు కూడా అదే పరిస్థితి. విషాద నాయిక విషాదకరమైన ముగింపు అది. టున్ టున్ టున్ టున్ అంటే అర్థం ఏమిటో ఎవరికీ తెలియదు. కాని దానిని పెట్టింది మాత్రం దిలీప్ కుమార్. టున్ టున్ దిలీప్ కుమార్‌కు మంచి ఫ్రెండ్. మ్యూజిక్ డెరైక్టర్ నౌషాద్కు క్లోజ్ ఫ్రెండ్. పదమూడేళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి నౌషాద్ ఇంటి తలుపు తడితే గాయనిగా ఆయనే అవకాశం ఇచ్చాడు. అవును. టున్ టున్ తన అసలు పేరు ఉమా దేవి పేరుతో చాలా హిట్ పాటలు పాడింది. వాటిలో అందరికీ తెలిసిన ‘అఫ్సానా లిఖ్ రహీ హూ దిలే బేకరార్కా’ వంటి హిట్స్ ఉన్నాయి. కాని ఎక్కువ రోజులు సింగర్‌గా కెరీర్ కొనసాగించలేకపోతే దిలీప్ కుమార్ ఆమెను నటిని చేశాడు. లావుగా ఉండే ఆమె ఆకారాన్ని బట్టి కమెడియన్‌గా రాణిస్తావ్ అన్నాడు. చాలా సినిమాల్లో హీరోకు లైన్ వేసే లట్టు అమ్మాయిగా టున్ టున్ కనిపిస్తుంది. ఎనభై ఏళ్లు జీవించి 2003లో మరణించినా తెలుగులో గయ్యాళులకు సూర్యకాంతం అనే పేరు ఎలా పడిందో ఉత్తరాదిన లావుగా ఉన్న ఆడవాళ్లకు టున్ టున్ అనే పేరు మిగిల్చి వెళ్లింది. -
పదేళ్లు అధికారానికి దూరమైనా చంద్రబాబుకు బుద్ధి రాలేదు
దొడ్డిదారిన వర్గీకరణకు ప్రయత్నాలు జీవో 25ను రద్దు చేయాలి పీవీరావు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అశోక్ కుమార్ గాంధీనగర్ : దొడ్డిదారిన ఎస్సీ వర్గీకరణ చేపట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని పీవీరావు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పి.అశోక్‌కుమార్ దుయ్యబట్టారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసేందుకే జీవో 25 జారీ చేశారన్నారు. తక్షణమే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా ‘మాలల పంతం-చంద్రబాబు అంతం’ నినాదంతో వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు. పదేళ్లు అధికారానికి దూరమైనా చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదన్నారు. జీవో 25ను రద్దు చేయకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమం చేపడతామన్నారు. వర్గీకరణ ఏ రూపంలో చేపట్టినా తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఏకపక్షంగా వర్గీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే చంద్రబాబుకు మళ్లీ బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వ రంగంలో నియామకాలు నిలిచిపోయినందున ప్రైవేటు రంగంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గుజరాత్లో రిజర్వేషన్ల ఉద్యమంలో భాగంగా హార్ధిక్ పటేల్ చేసిన వ్యాఖ్యలను పీవీరావు మాలమహానాడు ఖండించింది. తమకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే అసలు రిజర్వేషన్ వ్యవస్థనే రద్దు చేయాలని కోరడం సమంజసం కాదన్నారు. గుజరాత్ ఉద్యమం పూర్తిగా ఆర్ఎస్ఎస్ అండదండలతో నడుస్తోందన్నారు. పీవీరావు ఆశయ సాధనకోసమే ‘పీవీరావు మాలమహానాడు’ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. త్వరలో రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అడ్హాక్ కమిటీ సభ్యులు పళ్లం ప్రసాద్, పి.పరశురాముడు, కె.లక్ష్మీనారాయణ, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ యర్ర నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ఎన్నికల కార్యదర్శిగా అశోక్ కుమార్
హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా రెవెన్యూ విభా గం స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అశోక్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం సెక్రటరీగా ఉన్న స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కె.ధర్మారెడ్డి సేవలను తక్షణం విరమించుకుంటున్నట్లు పేర్కొంది. ధర్మారెడ్డికి రంగారెడ్డి జిల్లా డీఆర్వోగా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాల సమాచారం. -
ఇక రైల్ టికెట్ తీసుకోవడం ఈజీ : డీఆర్ఎం
కృష్ణా(విజయవాడ): రైల్వేలో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో అన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేశామని డీఆర్ఎం అశోక్‌కుమార్ తెలిపారు. విజయవాడ రైల్వేస్టేషన్లో మెయిన్ బుకింగ్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ ఇక నుంచి అన్ రిజర్వుడ్, ఫ్లాట్‌ఫాం టికెట్లను వెండింగ్మిషన్ ద్వారా సులభంగా పొందొచ్చని సూచించారు. ఈ మిషన్లలో ఏప్రాంతానికైనా టికెట్ పొందే అవకాశం ఉంటుందని దీని పేర్కొన్నారు. డివిజన్లో 17 ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్లును ఏర్పాటు చేశామని తెలిపారు. విజయవాడలో 8, తెనాలి, నెల్లూరు, రాజమండ్రి, కొవ్వురులో మిగిలినవి ఏర్పాటుచేశామని వివరించారు. విజయవాడ మెయిన్ బుకింగ్ కార్యాలయం వద్ద నాలుగు, తూర్పు, దక్షిణ ప్రవేశ ద్వారాల వద్ద రెండేసి మెషిన్లను ఏర్పాటుచేశామని వివరించారు. ప్రయాణికులు రూ.50 చెల్లించి స్మార్ట్ కార్డు కూడా పొందొచ్చన్నారు. ఈ కార్డు ఏడాది పాటు వినియోగంలో ఉంటుందని, దాని సాయంతో దక్షిణ మధ్య రైల్వేలో అన్ రిజర్వుడు టికెట్లను ఏప్రాంతానికైనా తీసుకోవచ్చని సూచించారు. ఈ కార్డును రూ.50 నుంచి రూ.5 వేల వరకూ రీచార్జిచేసుకోవచ్చని తెలిపారు. -
త్వరలోనే విజయవాడ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్
నరసాపురం అర్బన్(గుంటూరు): విజయవాడ-న్యూఢిల్లీ మధ్య త్వరలోనే ఏపీ ఎక్స్‌ప్రెస్ నడపడానికి చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం (విజయవాడ) అశోక్‌కుమార్ వెల్లడించారు. బుధవారం నరసాపురం ైరె ల్వేస్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ నుంచి ఢిల్లీకి కొత్తగా ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలని తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభ తేదీని ప్రకటిస్తామన్నారు. భీమవరం-విజయవాడ మధ్య చేపట్టిన రైల్వే లైన్ డబ్లింగ్ పనులు మూడేళ్లలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే, గోదావరి పుష్కరాల సందర్భంగా 12 రోజులపాటు విజయవాడ జోన్ పరిధిలో ప్రత్యేక రైళ్లు వేసి, 400 ట్రిప్పులను అదనంగా నడపాలని నిర్ణయించామన్నారు. -
‘పాస్‌పోర్ట్ ప్రతి పౌరుడి హక్కు’
దర్శి (ప్రకాశం): ప్రతి భారతీయుడు పాస్‌పోర్టును హక్కుగా భావించి దాన్ని కలిగి ఉండాలని రీజనల్ పాస్‌పోర్టు డెరైక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి ఆర్అండ్బీ అతిథి గృహంలో సోమవారం పాస్‌పోర్టు మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. దళారి వ్యవస్థలను రూపుమాపడానికే నేరుగా గ్రామ స్థాయిలో ఈ పాస్‌పోర్టు మేళా నిర్వహించామని తెలిపారు. డీఎస్పీ వి.శ్రీరాంబాబు మాట్లాడుతూ పాస్‌పోర్టు తీసుకునే వారు విచారణ కోసం సిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు పూర్తి వివరాలు అందించాలని సూచించారు. -
పెన్షనర్ల మార్గదర్శకాలపై వివరణ
జగిత్యాల అర్బన్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహా గణకుల కార్యాలయం ఇటీవల జారీ చేసిన పెన్షనర్ల మార్గదర్శకాలు ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ పెన్షనర్లకే వర్తిస్తాయని, తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ పెన్షనర్లకు వర్తించవని వివరణలో స్పష్టం చేసినట్లు పెన్షనర్స్ అసోసియేషన్ జగిత్యాల డివిజన్ అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014 డిసెంబర్ 15న జారీ చేసిన జీవో 87 మేరకు 1998 కంటే ముందు రిటైర్డ్ అయిన ఆంధ్ర ప్రాంత పెన్షనర్ల పింఛన్లను సవరించినట్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఈ ప్రాంత పింఛనర్ల పెన్షన్లు సవరించబడతాయని మహా గణకుల కార్యాలయ అధికారులు స్పష్టం చేసినట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
అప్పుల హద్దులు వద్దు
ఎఫ్ఆర్బీఎం నిబంధనలు సడలించండి నీతి ఆయోగ్ బృందాన్ని కోరిన సీఎం కేసీఆర్ 6 జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కోరిన ప్రభుత్వం మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌కు నిధులివ్వాలని విజ్ఞప్తి గోదావరి పుష్కరాల నిర్వహణకు రూ. 300 కోట్లకు వినతి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక వనరుల వృద్ధికి అప్పులు తెచ్చుకునేందుకు వీలుగా ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి నిబంధనలను సడలించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నీతి ఆయోగ్ బృందాన్ని కోరారు. అలాగే రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.సారస్వత్, సలహాదారు అశోక్‌కుమార్ జైన్లు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతోపాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డిని కలుసుకున్నారు. వివిధ ముఖ్య శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అనంతరం నీతి ఆయోగ్ బృందంలోని సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారితో మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం తెలంగాణను రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ప్రకటించటంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు భారీగా గండి పడిందని ఆందోళన వెలిబుచ్చారు. ‘కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రాలకు రావాల్సిన నిధులు భారీగా తగ్గిపోయాయి. రెవెన్యూ మిగులు రాష్ట్రం కావటంతో కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటా తగ్గిపోయింది. ఐసీడీఎస్‌కు కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు సగానికిపైగా తగ్గిపోయింది. దీంతో రాష్ట్రంపై అదనపు భారం పడింది’ అన్నారు. వీటన్నింటి దృష్ట్యా ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి నిబంధనలను సడలించాల్సిన అవసరం ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం జీడీపీలో 3.9 శాతం ద్రవ్యలోటుగా చూపిస్తూ రాష్ట్రాలకు 3 శాతం ద్రవ్యలోటును పరిమితం చేయటం విచిత్రంగా ఉందన్నారు. కేంద్రం తరహాలోనే తెలంగాణకు వెసులుబాటు కల్పించాలని కోరారు. రుణ సేకరణకు వెసులుబాటు కల్పిస్తే మౌలిక వసతులకు పెట్టుబడులు సమకూరుతాయని, ఇది రాష్ట్రాలు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు దోహదపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఉన్నతాధికారులతో భేటీలో రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్న నీతి ఆయోగ్ బృంద సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమాలను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు సిఫారసు చేస్తామన్నారు. ప్రభుత్వ సలహాదారులు జీఆర్ రెడ్డి, పాపారావు, ఏకే గోయల్, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, వాటర్‌గ్రిడ్ ఎండీ రేమండ్ పీటర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు ఈ భేటీలో పాల్గొన్నారు. నేడు రెండు జిల్లాల్లో నీతి ఆయోగ్ బృందం పర్యటన... నీతి ఆయోగ్ బృందం శుక్రవారం మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించనుంది. సిద్దిపేట, గజ్వేల్ మండలాల్లో మిషన్ కాకతీయ కింద చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ పనులు, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు, స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా చేపట్టిన పనులు, సిద్దిపేటలో తాగు నీటి ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌ను బృంద సభ్యులు పరిశీలించనున్నారు. అలాగే కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌లో మిషన్ కాకతీయ పనులు, నుస్తులాపూర్‌లో స్వచ్ఛభారత్, తాగునీటి సరఫరాను పరిశీలిస్తారు. బీఆర్జీఎఫ్ నిధులివ్వండి.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బీఆర్జీఎఫ్ నిధులు మంజూరు చేయాలని అధికారులు నీతి ఆయోగ్ బృందాన్ని సీఎం కేసీఆర్ కోరారు. వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. విభాగాల వారీగా కార్యక్రమాలు, నిధులకు సంబంధించిన అభ్యర్థనలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, గతంలో పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థికశాఖ సలహాదారు జీఆర్ రెడ్డి కోరారు. స్పందించిన నీతి ఆయోగ్ బృందం సభ్యులు.. జిల్లాలు మొత్తంగా కాకుండా అక్కడ చేపట్టే కార్యక్రమాలకు నిర్దిష్ట ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని సూచించారు. దీంతో ఆరు జిల్లాల్లో అమలు చేస్తున్న వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ కార్యక్రమాలకు కేంద్రం నుంచి నిధులు ఆశిస్తున్నామని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపిస్తామని అధికారులు బదులిచ్చారు. జూలైలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు రూ.300 కోట్లు కేటాయించాలని కోరారు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్ : అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. హైదరాబాద్ నగరం అంబర్‌పేట్‌లోని శంకర్ నగర్‌కు చెందిన పి. అశోక్ కుమార్(57) అనే వ్యక్తి శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అశోక్ కుమార్‌కు సుమారు రూ.40 లక్షలు అప్పు ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అంబర్ పేట పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
మృత్యువులోనూ వీడని బంధం
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం హైదరాబాద్(బాలానగర్): రోడ్డు ప్రమాదం ఇద్దరి భార్యాభర్తలను బలిగొన్న సంఘటన శుక్రవారం ఉదయం బాలానగర్ మండల పరిధిలోని పెద్దాయపల్లి గ్రామ ఎక్స్‌రోడ్డు వద్ద గల జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... కేరళ రాష్ట్రం పాలఖడ్ తాలుకా, కాలపత్తి గ్రామానికి చెందిన రిటైర్డు సీఐఎస్ఎఫ్, రిటైర్డు మిలిటరి అధికారి అయిన విశ్వనాథం (60) అతని భార్య శ్యామల (54) మనుమరాలు ప్రియలు కలిసి బెంగుళూర్ నుంచి తన షిప్టుకారులో హైదరాబాద్‌లో నివసిస్తున్న తమ కూతుళ్లు దివ్య, ధన్యల వద్దకు బయలుదేరారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున బాలానగర్ మండల శివారులోని పెద్దాయపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిని వద్ద ఎలాంటి సిగ్నల్స్ పాటించకుండా ఓ లారి కుడివైపు ఉడిత్యాలవైపు యుటర్న్ మల్లుతుండగా వీరు ప్రయాణిస్తున్న కారు లారీని బలంగా ఢీకొంది. దీంతో కారులో ముందు భాగంలో ఉన్న భార్యభర్తలు ఇద్దరు కారులోనే ఇరుక్కుని దుర్మరణం చెందారు. వెనుక సీట్లో కూర్చున్న మనుమరాలు ప్రియ (5)కు తీవ్రగాయాలపాలైంది. విషయం తెలుసుకున్న బాలానగర్ ఎస్ఐ అశోక్‌కుమార్ తన సిబ్బందితో హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కున భార్యభర్తల మృతదే హాలను బయటకు తీసి తీవ్రంగా గాయపడిన ప్రియను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన విశ్వనాథం అనంతపురం జిల్లా కోడికొండవద్ద గల జీఎంఆర్ రక్షక్ ట్రేనింగ్ సెంటర్లో రక్షక్ ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుల వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా వారి కూతుళ్లకు సమాచారం అందించి మృతదేహాలను షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
తెలంగాణ జనజీవన కథకుడు
గత రెండు దశాబ్దాలలో తెలంగాణ వచ్చిన పరిణామ క్రమాలు తెలియాలంటే పెద్ద పెద్ద పరిశోధన పత్రాలు అక్కర్లేదు. పెద్దింటి అశోక్‌కుమార్ కథలు చదివితే చాలు. తెలంగాణ గ్రామీణ జీవితాన్ని సూక్ష్మదర్శినిలో చిత్రించడం అతడి ప్రత్యేకత. గత పదహారు సంవత్సరాలుగా నూట ఇరవై కథలు, ఐదు నవలలు, ఒక వ్యాస సంపుటి వెలువరించి అటు వాసిలోనూ ఇటు రాసిలోనూ ప్రసిద్ధి చెందిన రచయిత పెద్దింటి అశోక్‌కుమార్. ఊటబాయి, వలస బతుకులు, మా ఊరి భాగోతం, భూమడు, మాయిముంత... ఈ పుస్తకాలన్నీ తెలుగు సాహిత్యంలో తమదైన ముద్ర వేసేలా సృజనా శక్తిని ప్రదర్శించిన రచయిత పెద్దింటి అశోక్‌కుమార్. డెబ్బైల తర్వాతి తెలంగాణ గ్రామీణ సమాజాన్ని, అక్కడ ఉద్యమం తీసుకొచ్చిన పెను మార్పుని అల్లం రాజయ్య బలంగా అక్షరబద్ధం చేస్తే గత రెండు దశాబ్దాల తెలంగాణ ప్రాంత ఒడిదుడుకుల్ని, విధ్వంసాన్ని అంతే విస్తృతంగా అక్షరీకరించినవాడు అశోక్‌కుమార్. అతడి అన్ని కథలూ ఏదో ఒక సమస్యనూ దాని మూలాన్నీ దాని వల్ల జరుగుతున్న మానవ విలువల పతనాన్ని చూపుతాయి. తెలంగాణ ప్రాంతంలో కరువు విశ్వరూపం (తండ్లాట), సంప్రదాయ సేద్యాన్ని మింగేస్తున్న కార్పొరేట్ సేద్యం నీచత్వం (కీలుబొమ్మలు), రైతుల్ని కుదేలు చేసి వారిని విత్తనాలకు దూరం చేసే దళారీల దగుల్బాజీతనం (అదృశ్యరూపాలు), పేద రైతులని కూడా చూడకుండా వాళ్ల రక్తం పీల్చేసే ఆర్.ఎం.పిలు, వాళ్ల పంటను మింగే ఎరువుల వ్యాపారుల దుర్మార్గం (చెడుగులు), ఇవన్నీ భరించలేక తుదకు మనిషిని నమ్ముకోవడం కంటే పశువును నమ్ముకుందామనుకునే దీనత్వం (మాయిముంత).. ఇవన్నీ అశోక్ కుమార్ తన కథలలో చూపడంతో తెలంగాణ జన జీవితాల్లోకి పాఠకుడు చొచ్చుకుపోతాడు. ఆ మట్టిలో జీవించిన అనుభూతికి లోనవుతాడు. అలాగని తక్కిన జీవితాన్ని వదిలిపెట్టలేదు అశోక్‌కుమార్. కులవృత్తుల పరిణామక్రమాన్ని, పతనాన్ని ‘వలస పక్షి’, ‘తెగిన బంధాలు’, ‘కాగుబొత్త’ వంటి కథల్లో చాలా శక్తిమంతంగా చూపుతాడు. ఇక సాంప్రదాయిక కులవృత్తుల్లో భాగంగా ఎలుగుబంట్లను ఆడించేవారిపై ఇతడు రాసిన ‘జిగిరీ’ నవల బహుశా భారతీయ సాహిత్యంలో ఒక ముఖ్యమైన నవలగా నిలబడిపోతుంది. ఇవన్నీ చెప్పడానికి అశోక్‌కుమార్ దగ్గర ఉన్న ఆయుధం ఏమిటి? అతడి భాషే. కరీంనగర్ జిల్లా సిరిసిల్లా ప్రాంత మారుమూల గ్రామాల యాస అశోక్‌కుమార్‌కు అందివచ్చిన సంపద. అతడి కథల్లోని సంభాషణల్లో ఒక వేదన ఉంటుంది. గొప్ప కరుణ ఉంటుంది. ఒక దైన్యం వెంటాడుతూనే ఒక తెగువ రాజుకుంటూ ఉంటుంది. తెలంగాణ మాండలిక సొగసును ఒడుపుగా వినసొంపుగా ధ్వనింపజేసి కథకు గొప్ప ఆత్మను అందించినవాడు పెద్దింటి అశోక్‌కుమార్.ఇంత రాయడం, ఇంతలా రాయడం సామాన్యమేమి కాదు.అశోక్‌కుమార్ మరిన్ని అడుగులు ముందుకు వేయడానికే ఈ నాలుగు మాటలైనా. - కాట్రగడ్డ దయానంద్ 9490218383 జనవరి 3న అనకాపల్లిలో అజో-విభో- కందాళం ఫౌండేషన్ విశిష్ట నవలా పురస్కారాన్ని అందుకుంటున్న సందర్భంగా -
రంగస్థలంపై టెలికం రారాజు
రసరమ్య నటనతో జనరంజక నటుడిగా ఎదిగిన అశోక్‌కుమార్ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ హైస్కూల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. 1974లో బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగిగా చేరారు. హైదరాబాద్‌లో తర్వాత తిరుపతిలో కొన్నాళ్లు పని చేశారు. సికింద్రాబాద్‌లోని రీజినల్ టెలికం ట్రైనింగ్ సెంటర్లో పనిచేశారు. చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తి ఉన్న అశోక్‌కుమార్ తరచూ రంగస్థలంపై తన ప్రతిభ చాటుకుంటూ వచ్చారు. అసుర సంధ్య, వరుడు కావాలి, ఫర్‌సేల్, గుండెలు మార్చబడును వంటి నాటకాల్లో నటించారు. పలు పాఠశాలల వార్షికోత్సవాలకు నృత్యాలను కంపోజ్ చేసేవారు. సాంఘికం.. పౌరాణికం.. చింతామణి వంటి సాంఘిక నాటకాలే కాదు పౌరాణిక నాటకాల్లో కూడా అశోక్‌కుమార్ అద్భుతః అనిపించుకున్నారు. కృష్ణతులాభారం, పాండవోద్యోగ విజయం వంటి పౌరాణిక పద్యనాటకాల్లో కూడా ఆయన మెప్పించారు. ఏటా నాచారంలోని లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవాల్లో మోహినీభస్మాసుర, మహిషాసుర వంటి నాటకాలు క్రమం తప్పకుండా ప్రదర్శిస్తుంటారు. లష్కర్ బోనాల సందర్భంగా పోతురాజు వేషం కట్టి అందరినీ అలరించారు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ప్రదర్శనలిచ్చారు. 2006 జనవరి 24న తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన నంది నాటకోత్సవంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతల మీదుగా ప్రశంసాపత్రాన్ని కూడా అందుకున్నారు. జీవితమే నాటక రంగం.. ‘జీవితమే ఒక నాటక రంగం. చిన్నతనం నుంచి ఉన్న ఇష్టంతోనే నాటకాల వైపు వచ్చాను. ఏ పాత్ర అయినా ఇట్టే డైలాగులు చెప్పే వాడిని. అప్పట్లో ఉన్నంత ఆదరణ నేడు నాటకాలకు లేదు. అయినా ఎందరో కళాకారులు ఈ రంగాన్ని బతికించుకునేందుకు తాపత్రయపడుతున్నారు. ఈ కళ అంతరించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ తరంపై ఉంది’ అని చెబుతారు అశోక్‌కుమార్. - అబ్దుల్ రెహమాన్ -
ఓఎల్ఎక్స్.... తోసేయండి...
నెల్లూరు : ఏదైనా అమ్ముకోవచ్చు' ఇది ఓఎల్ఎక్స్ అనే ఉచిత ఆన్లైన్ ప్రకటనల వెబ్సైట్ ప్రచార నినాదం. అదే ఓ వ్యక్తి కొంప ముంచింది. ఓఎల్ఎక్స్ వెబ్సైట్లో కారు అమ్మకానికి పెట్టిన అతగాడికి చేదు అనుభవం ఎదురైంది. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన అశోక్ కుమార్... వెబ్సైట్లో తన కారును అమ్మకానికి పెట్టాడు. ఆ ప్రకటన చూసిన ఇద్దరు వ్యక్తులు కారు కొనేందుకు ముందుకు వచ్చారు. టెస్ట్ డ్రైవింగ్ చేద్దామంటూ ఆ ఇద్దరు...కారుతో బయల్దేరారు. కొంతదూరం వెళ్లిన తర్వాత కారులో ఉన్న అశోక్ కుమార్‌ను వారిద్దరూ బలవంతంగా బయటకు తోసేసి...వాహనంతో పరారయ్యారు. బాధితుడు లబోదిబోమంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. -
అన్నం కోసం అల్లాడిపోతున్నాం
అంట్లు తోమిస్తున్నారు మెనూ అమలు చేయడంలేదు కన్నీళ్లెట్టుకున్న హాస్టల్ విద్యార్థులు సిబ్బందిపై డీడీ ఆగ్రహం అవనిగడ్డ : ‘‘చదువుకునేందుకు వచ్చిన మాతో అంట్లు తోమిస్తున్నారు.. కడుపునిండా అన్నం పెట్టడం లేదు... మెనూ అమలు చేసిన పాపానపోలేదు’’ ఇదీ స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహం-1 విద్యార్థుల ఆవేదన. ఆదివారం ఎంపీపీ బండె నాగవెంకట కనకదుర్గ, జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరు వెంకటేశ్వరరావు (బుల్కి) వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా వెలుగులోకి వచ్చిన సమస్యలపై విచారణ నిర్వహించేందుకు సోమవారం రాత్రి డీడీ మధుసూదనరావు వసతి గృహానికి వచ్చారు. విద్యార్థులను అడిగి ఆయన వివరాలు తెలుసుకున్నారు. రాగిమాల్ట్ సక్రమంగా ఇవ్వడం లేదని, స్నాక్స్కింద ఇచ్చే బిస్కెట్ప్యాకెట్ను ముగ్గురికి పంచుతున్నారని, అన్నం సరిగా ఉడకడం లేదని, బాత్రూమ్లు సక్రమంగా లేవని, వసతి గృహంలో ఫ్యాన్లు, విద్యుత్ సౌకర్యం పూర్తిస్థాయిలో లేదని కన్నీటి పర్యంతమవుతూ వివరించారు. దీనిపై ఆగ్రహించిన డీడీ మధుసూదనరావు కమాటీ రవిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థులతో అంటులు తోమించడమేంటి, మెనూ సక్రమంగా అమలు చేయనందుకు నిన్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం నుంచి ఒంట్లో బాగోని కారణంగా పిల్లలతో ఈ పనులు చేయిస్తున్నానని సమాధానం ఇవ్వగా... మాతో రోజూ ఇదే పని చేయించుకుంటున్నారని విద్యార్థులు డీడీకి వివరించారు. వారిపేర్లు డీడీ నమోదు చేసుకున్నారు. విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని సూచించారు. పదోతరగతి విద్యార్థులు తామెదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ సాయంత్రం 5.30గంటల సమయంలో ప్రైవేటుకు వెళ్లేముందు అన్నం పెడుతున్నారని, రాత్రి 10గంటల సమయంలో తిరిగి వస్తామని, అప్పుడు ఆకలివేస్తున్నా హాస్టల్లో తినేందుకు ఏమీ పెట్టడం లేదని డీడీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రైవేటుకు వెళ్లేముందు స్నాక్స్, రాగిమాల్ట్ ఇవ్వాలని, విద్యార్థులు ప్రైవేటు నుంచి వచ్చిన తర్వాత వారికి భోజనం పెట్టాలని డీడీ ఆదేశాలు జారీచేశారు. వసతి గృహాన్ని ఆయన సమగ్రంగా పరిశీలించి బాత్రూమ్లు అపరిశుభ్రంగా ఉండడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ విచారణలో ఏఎస్‌డబ్ల్యువో జీ అశోక్‌కుమార్ పాల్గొన్నారు. -
మరో విద్యార్థి బలవన్మరణం
పునాదిపాడు పరిధిలోని కార్పొరేట్ కాలేజీలో ఘటన మృతుడి స్వస్థలం చిత్తూరు జిల్లా పీలేరు సహచరులు పరీక్ష రాస్తుండగా గదికి వచ్చి ఆత్మహత్య కంకిపాడు : మండలంలోని పునాదిపాడు పరిధిలోగల ఓ కార్పొరేట్ కళాశాల హాస్టల్లో గురువారం ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు కారణాలు తెలియలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన తరికొండ అశోక్‌కుమార్(17) పునాదిపాడు పరిధిలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇదే సంస్థకు చెందిన గొల్లపూడి శాఖలో జూని యర్ ఇంటర్ చదివి, రెండో సంవత్సరం ఇక్కడకు వచ్చాడు. కళాశాల ప్రాంగణంలోని హాస్టల్లో ఉంటున్నాడు. రోజూ మాదిరి గానే అశోక్ నిద్ర లేచాక స్నానాదికాలు ముగించుకుని రూమ్మేట్స్తో కలిసి బయటకు వచ్చాడు. కొంతసేపటి తరువాత రూమ్‌కు తిరిగి వచ్చాడు. అతడి రూమ్మేట్స్ కళాశాలలో జరి గే వారాంతపు పరీక్షకు హాజరయ్యారు. అశోక్ దీనికి హాజరు కా లేదు. దీంతో అధ్యాపకులు, సహచర విద్యార్థులకు అనుమానం వచ్చి ప్రాంగణంలో వెదికారు. రూమ్‌కు వచ్చి చూడగా.. దుప్పటితో సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయి ఉన్నాడు. డీన్ రవీంద్రకుమార్ అందజేసిన సమాచారం తో కంకిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్.జె.రవికుమార్, ఎస్ఐ జి.శ్రీనివాస్ సిబ్బందితో వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. అశోక్‌కుమార్‌తో కలిసి రూమ్‌లో ఉం టున్న ఐదుగురు విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. అశోక్ తండ్రి మల్లికార్జున్‌కు సమాచారం అందించారు. కన్నీరు మున్నీరైన సోదరి అశోక్ చదువుతున్న కళాశాలకు సమీపంలోని మరో శాఖలో అతడి అక్క లీలావతి ఎంసెట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది. కళాశాల సిబ్బంది ఈ ఘటన గురించి ఆమెకు తెలియజేసి, ఘటనాస్థలికి తీసుకువచ్చారు. తమ్ముడి మృతదేహాన్ని చూసి ఆమె గుండెలవిసేలా రోదించింది. తమ్ముడి బలవన్మరణంతో లీలావతి పడుతున్న వేదన చూపరుల కంటతడి పెట్టించింది. ఘటనాస్థలిని పరిశీలించిన ఏసీపీ అశోక్ ఆత్మహత్య చేసుకున్న గదిని ఈస్ట్‌జోన్ ఏసీపీ ఉమామహేశ్వరరాజు పరిశీలించారు. కాలేజీ సిబ్బంది నుంచి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గదిలో ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకుని సమగ్ర పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. చదువులో ఒత్తిడి భరించలేకేనా? అశోక్ ఆత్మహత్య వెనుక కారణాలు తెలియడం లేదు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 400 మార్కులు సాధించాడు. చదువులో విపరీతమైన ఒత్తిడి ఆత్మహత్యకు కారణమై ఉంటుందా? అనే అనుమానం ప్రధానంగా వ్యక్తమవుతోంది. లేక ఇంకేదైనా కారణం ఉందా? అని కూడా అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో ఓ పెన్ను, నలిపి వేసిన పేపర్ పడి ఉన్నాయి. అయితే అందు లో ఏమీ రాయలేదు. ఆత్మహత్యకు కార ణం పుస్తకాల్లో రాసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ రవికుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఆత్మహత్యకు కారణాలపై విచారణ చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించామని తెలిపారు. -
టీటీడీ సీవీఎస్వో పోస్టు భర్తీ అయ్యేనా?
సాక్షి, తిరుమల: తిరుమలలో భద్రత చర్యలపరంగా అత్యంత కీలకమైన టీటీడీ సీవీఎస్వో పోస్టు ఖాళీగానే ఉంది. ఈనెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా నెలన్నర నుంచి ఖాళీగా ఉన్న ఈ పోస్టును భర్తీ చేయడంపై ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీవీఎస్వో) పోస్టు నెలన్నర రోజులుగా ఖాళీగా ఉంది. ఇక్కడ ఉన్న సీవీఎస్వో ఘట్టమనేని శ్రీనివాస్‌ను చిత్తూరు ఎస్పీగా జూలై 16వ తేదీన బదిలీ చేశారు. టీటీడీకి మాత్రం కొత్త అధికారిని నియమించలేదు. ప్రస్తుతం బదిలీ అయిన ఘట్టమనేని శ్రీనివాస్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా ఇక్కడ సీవీఎస్వోగా పనిచేసిన జీవీజీ అశోక్‌కుమార్ వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆ తర్వాత సుమారు నాలుగు నెలలపాటు ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఖాళీగానే ఉంచారు. తీవ్ర విమర్శలు రావడంతో వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీగా పగ్గాలు చేపట్టిన జీవీజీ అశోక్కుమార్కే అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆ తర్వాత తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖరబాబుకు ఇన్చార్జిగా అప్పగించారు. ఇలా ఐపీఎస్ అధికారులు మారిన ప్రతి సందర్భంలోనూ టీటీడీ సీవీఎస్వో పోస్టు ఖాళీగా ఉంచటం, ఇన్చార్జిల పాలనలో అదనపు బాధ్యతలు చూస్తుండటం సంప్రదాయంగా మారింది. దీనివల్ల భద్రతా పరమైన పరిపాలన కుంటుపడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈనెల 26 నుంచి అక్టోబరు 4 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భద్రతను పర్యవేక్షించే అధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో విజిలెన్స్ విభాగం పాలన నత్తనడకన సాగుతోంది. తిరుమల భద్రత పట్టదా? దేశంలో ఉగ్రవాద దుశ్చర్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తిరుమలలోని ఆలయ భద్రతపై కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాల తీవ్ర హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఆలయంతోపాటు రోజుకు దాదాపుగా లక్ష మంది దాకా వచ్చే భక్తులకు పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం టీటీడీపై ఉంది. గత ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా గొడుగుల ఊరేగింపు సందర్భంగా తిరుపతికి 35 కిలోమీటర్ల దూరంలోని పుత్తూరు వద్ద కరుడుగట్టిన ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకున్న విషయం తెలిసిందే. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన తిరుమల ఆలయ భద్రత, పర్యవేక్షణ, పరిపాలన సంబంధిత విషయాలను ఎప్పటికప్పడు పర్యవేక్షించేందుకు ఎస్పీ స్థాయి కలిగిన భద్రతాధికారి అవసరం. అయితే, ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు బాస్‌లు పట్టీపట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. -
'డబ్బులు దండుకుంటున్న కృష్ణా జిల్లా మంత్రి'
విశాఖపట్నం: రాష్ట్రంలో సినిమా థియేటర్ల సర్వీస్ ట్యాక్స్ బకాయిలు రూ.500 కోట్లు రద్దు చేయిస్తామని చెబుతూ టీడీపీ ప్రభుత్వంలోని ఓ మంత్రి, ఆ పార్టీకి అండగా ఉండే ఏపీ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి అశోక్‌కుమార్‌తోపాటు పలువురు చాంబర్ ప్రతినిధులు డబ్బులు దండుకుంటున్నారని సినీ నిర్మాత నట్టికుమార్ ఆరోపించారు. ఒక్కో థియేటర్ యజమాని నుంచి రూ.50 వేల చొప్పున కమీషన్లు వసూలు చేస్తున్నారని, ఈ విధంగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోనే రూ.12కోట్లు వసూలు చేశారన్నారు. విశాఖపట్నంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.... కృష్ణా జిల్లాకు చెందిన ఆ మంత్రి ప్రణాళిక ప్రకారమే థియేటర్ యజమానులు నుంచి అక్రమంగా వసూళ్లు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఉంది కాబట్టి తాము చెప్పినట్లు వినాల్సిందేనని, లేక పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ గ్యాంగ్ థియేటర్ల యజమానులను బెదిరిస్తోందన్నారు. వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ ప్రతినిధి వీర్రాజు, మోహినీ ఫిలిమ్స్ చిన్ని, జనార్దన, ఏపీ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ కార్యదర్శి రాజాం మాణిక్యం కలిసి థియేటర్ యజమానుల నుంచి రూ.12 కోట్లు వసూలు చేశారని చెప్పారు. -
ఏజెన్సీ ఉద్రిక్తం
నేటి నుంచి పీఎల్జీఏ వారోత్సవాలు అడ్డుకోవడానికి పోలీసుల ప్రయత్నం మారుమూల గూడేలను జల్లెడపడుతున్న బలగాలు అయినా ఎస్ఆర్ పైపులైన్‌ను ధ్వంసం చేసిన దళసభ్యులు మన్యమంతటా భయాందోళనలు పీఎల్జీఏ వారోత్సవాలతో ఏవోబీ వేడెక్కింది. పోలీసులు,మావోయిస్టుల సవాళ్లు,ప్రతిసవాళ్లతో యుద్ధవాతావరణం నెలకొంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే వారోత్సవాలను ఘనంగా నిర్వహించడంతోపాటు మిలీషియా, గ్రామ కమిటీల బలోపేతానికి దళసభ్యులు యోచిస్తున్నారు. అమరవీరుల స్తూపాల నిర్మాణాలను అడ్డుకోవడానికి పోలీసులు యత్నిస్తున్నారు. అనుమానితులపై నిఘా పెంచారు. ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. వెరశి మన్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాడేరు/సీలేరు/పెదబయలు: మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మావోయిస్టులకు పట్టున్న ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లో ఇప్పటికే ముమ్మరంగా గాలిస్తున్నాయి. కొ య్యూరు, జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని మారుమూల గూడేలను స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్, బీఎస్స్ఎఫ్ బలగాలు జల్లెడపడుతున్నాయి. దళసభ్యులకు సహకరిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ పోలీసులు ఇప్పటికే ప్రభావిత గ్రామాల్లో గిరిజనులతో సమావేశాలు నిర్వహించారు. స్తూపాల నిర్మాణాలకు ఎటువంటి సాయం అందకుండా పోలీసుశాఖ కఠినంగానే వ్యవహరిస్తోంది. కాగా ఏవోబీలో అమర వీరులకు నివాళులర్పించేందుకు దళసభ్యులు వారం రోజుల క్రితం నుంచే పెదబయలు, ముంచంగిపుట్టు, ఒడిశా సరిహద్దుల్లో స్తూపాల నిర్మాణం చేపడుతున్నారు. మిలీషియా, గ్రామ క మిటీలు బలోపేతం పనిలో నిమగ్నమయ్యారు. రాత్రిళ్లు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వారోత్సవాల్లో ఎక్కువ మందిని పితూరి సేనలో చేర్పించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. మారుమూల గూడేల్లో ఉద్యోగుల సేవలపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలిసింది. విధులకు డుమ్మాకొట్టే ఉపాధ్యాయులు, వీఆర్వోల వివరాలు సేకరిస్తున్నట్టు భోగట్టా. దీంతో మారుమూల గూడేలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆయా గ్రామాల గిరిజనులు ఎక్కడికి వెళ్లలేని దుస్థితి. ఒడిశా చిత్రకొండ ప్రాంతంలో శుక్రవారం ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరిని దళసభ్యులు కాల్చి చంపడంతో ఇరు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. వారోత్సవాలకు ముందే రక్తం చిందించడంతో ఏవోబీలో రెడ్అలెర్ట్ ప్రకటించారు. పోలీసు బలగాలు పెద్ద ఎత్తున గాలింపు చేపడుతున్నప్పటికీ శనివారం రాత్రి ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కోరుకొండ-బలపం సమీపంలో ఎస్ఆర్ పైపులైన్‌ను ధ్వంసం చేసి మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో మైదానానికి వెళ్లాలంటూ హిట్‌లిస్టులో ఉన్న ప్రజాప్రతినిధులకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. పోలీసుస్టేషన్ల సమీపంలోని గ్రామాల్లో తనిఖీలు చేపడుతున్నారు. మారుమూల ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేటు వాహనాలు కూడా సోమవారం నుంచి నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. పెదవలస, జర్రెల, కోరుకొండ, మద్దిగరువు, బూసిపుట్టు ప్రాంతాలకు వాహనాలను నడపరాదని ప్రైవేటు ఆపరేటర్లు నిర్ణయించుకున్నారు. పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశా. అనుమానితుల కదలికలపై నిఘా అధికమైంది. వారోత్సవాల్లో మున్ముందు ఎటువంటి సంఘటనలను చూడాల్సి వస్తుందోనని ఈ ప్రాంత గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. దీంతో ఏవోబీలో యుద్ధ వాతావరణం నెలకొంది. వారోత్సవాలను అడ్డుకుంటాం డీఎస్పీ అశోక్‌కుమార్ చింతపల్లిరూరల్: మావోయిస్టు వారోత్సవాలను అడ్డుకుంటామని డీఎస్పీ ఇ.జి.అశోక్‌కుమార్ అన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే వారోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఏవోబీతో పాటు మన్యంలో గ్రేహాండ్స్, కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నామన్నారు. మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకోవడానికే పలు ప్రాంతాల్లో దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికే వారి కార్యకలాపాలతో విసిగిన మావోయిస్టు సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు స్వచ్ఛంధంగా లొంగిపోతున్నారన్నారు. సంస్మరణ వారోత్సవాల సభలు, నిర్వహణకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలన్నింటినీ గుర్తించి ఆయా ప్రాంతాలలో బలగాల గస్తీ పెంచామన్నారు. గిరిజనులు సైతం మావోయిస్టు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, గ్రామాలలో అనుమానితులెవరైనా సంచరించినా తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. -
కలెక్టర్‌కు స్వాగతం
కడప కల్చరల్ : జిల్లాకు కొత్త కలెక్టర్‌గా వచ్చిన కేవీ రమణకు స్వాగతం.. జిల్లా నుంచి బదిలీ అయిన ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌కు వీడ్కోలు చెబుతూ శనివారం కడప నగరంలోని ఆఫీసర్స్ క్లబ్లో ప్రత్యేక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు, జిల్లా అధికారులు ఎస్పీ అశోక్‌కుమార్ సేవలను కొనియాడారు. జిల్లా అభివృద్ధిలో కొత్త కలెక్టర్ రమణకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. కలెక్టర్ కేవీ రమణ మాట్లాడుతూ ఉద్యోగులందరి సహకారముంటే జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 9 నెలల తన ఉద్యోగ జీవితాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించానని, అందుకు సహకరించిన తమ శాఖతోపాటు రెవెన్యూ శాఖ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో రూ.6లక్షలతో తలపెట్టిన శాశ్వత వేదిక త్వరలో పూర్తవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలను క్లబ్ సభ్యులు, జిల్లా అధికారులు, నగర ప్రముఖులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, ఓఎస్డీ చంద్రశేఖర్‌రెడ్డి, క్లబ్ జిల్లా కార్యదర్శి మనోహర్‌రెడ్డి, సహాయ కార్యదర్శి నాగరాజు, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాతో అనుబంధం మరువలేను
‘ఎస్పీగా జిల్లాలో విధులు నిర్వర్తించడం నాకె ంతో సంతోషాన్నిచ్చింది. జిల్లాతో అనుబంధం మరువలేను. స్వర్గీయ ఉమేష్‌చంద్ర, అరవిందరావు, గోవింద్‌సింగ్, ఠాకూర్ లాంటి పోలీసు ఉన్నతాధికారులు పనిచేసిన జిల్లాలో విధులు నిర్వర్తించడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని బదిలీపై వెళ్తున్న జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ తన మనసులోని మాటలను సిబ్బందితో పంచుకున్నారు. కడప అర్బన్ : ఎస్పీగా జిల్లాలో విధులు నిర్వర్తించడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని, జిల్లాతో అనుబంధాన్ని మరువలేనని, బదిలీపై వెళుతున్న ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం నగరంలోని ఉమేష్‌చంద్ర స్మారక కల్యాణమండపంలో పోలీసు అధికారులు ఎస్పీ అశోక్‌కుమార్‌కు వీడ్కోలు సమావేశం ఏర్పాటుచేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమలోని అన్ని జిల్లాలతో తనకు అనుబంధముందన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పోలీసు అధికారులు, సిబ్బంది పనిచేయాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌కు దాదాపు 80 నుంచి 100 మంది బాధితులు వచ్చి తనను కలిసేవారని, వారందరికీ న్యాయం జరిగేలా చూశానన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలను నేరుగా కలవాలని, వారి సమస్యలను సావధానంగా వినాలని సూచించారు. పోలీసు శాఖ ప్రతిష్టను పెంచే మరిన్ని కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. స్వర్గీయ ఉమేష్‌చంద్ర, అరవిందరావు, గోవింద్‌సింగ్, ఠాకూర్ లాంటి పోలీసు ఉన్నతాధికారులు పనిచేసిన జిల్లాలో విధులు నిర్వర్తించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తనకు సహకరించిన అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. వీడ్కోలు సమావేశానికి అధ్యక్షత వహించిన ఏఎస్పీ అడ్మిన్ టి.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఎస్పీ అశోక్‌కుమార్ బాధ్యతలను ఛాలెంజ్‌గా తీసుకొని విధులు నిర్వర్తించారన్నారు. జమ్మలమడుగు ఏఎస్పీ వెంకట అప్పలనాయుడు మాట్లాడుతూ విధి నిర్వహణతోపాటు కుటుంబానికి దగ్గరగా ఉండాలనిఎస్పీ అశోక్‌కుమార్ చెప్పేవారని గుర్తు చేశారు. పొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఉద్యమాలు, వరుస ఎన్నికల నేపథ్యంలో బాధ్యతలు చేపట్టి విజయవంతంగా విధులు నిర్వర్తించారన్నారు. ఏఆర్ డీఎస్పీ చిన్నిక్రిష్ణ, కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి,కడప అర్బన్ సీఐ శ్రీనివాసులు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అగ్రహారం శ్రీనివాసశర్మ తదితరులు మాట్లాడుతూ ఒకవైపు శాంతి భద్రతలు పరిరక్షిస్తూ మరోవైపు పోలీసు సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు. -
ఎస్పీ అశోక్‌కుమార్ బదిలీ
కడప అర్బన్ : జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న జీవీజీ అశోక్‌కుమార్‌ను విజయవాడ అడ్మిన్ డీసీపీగా బదిలీ చేశారు. రాజకీయ కారణాలతో ఎనిమిదిన్నర నెలలకే ఆయనపై బదిలీవేటు పడింది. గత సంవత్సరం అక్టోబరు 30న బాధ్యతలు చేపట్టిన ఎస్పీ అశోక్‌కుమార్ తనదైన ముద్ర వేశారు. గత సంవత్సరం నుంచి సమైక్యాంధ్ర ఉద్యమం, స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టి ప్రశంసలు అందుకున్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం యోగా, ధ్యానం, ఆరోగ్య భద్రతలపై పోలీసు దర్బార్‌ను నిర్వహించారు. గీవెన్సెల్ను నిర్వహించి తన దగ్గరికి వచ్చే వారి బాధలను ఓపికగా విచారించి సంబంధిత అదికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేవారు. ఓబులవారిపల్లె మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన అగంతకుడు వెంకట రమణను అరెస్టు చేయడంలో ప్రత్యేక బృందాలతో అహర్నిశలు శ్రమించారు. ఇటీవల కాలంలో ఆరుగురిపై పీడీ యాక్టులను నమోదు చేసి పేరుమోసిన అంతర్జాతీయ, జాతీయ స్థాయి స్మగ్లర్లను రాజమండ్రికి తరలింపజేశారు. పోలీసుల సంక్షేమంలో భాగంగా పోలీసు పెరేడ్ గ్రౌండ్లో అమర వీరుల స్థూపం నిర్మాణం, ప్రతి పోలీసుస్టేషన్ కంప్యూటరీకరణ చేయించడంలో కీలకపాత్ర వహించారు. డయల్ 100తోపాటు పీసీఆర్‌ను అనుసంధానం చేసి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఫిర్యాదును స్వీకరించేలా చర్యలు తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ‘శభాష్’ అనిపించుకున్నారు. అలాంటి ఎస్పీ బాధితులు చేపట్టిన ఎనిమిదిన్నర నెలలకే బదిలీ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. జిల్లా ఎస్పీగా నవీన్ గులాఠి వైఎస్సార్ జిల్లా ఎస్పీగా నవీన్ గులాఠి నియమితులయ్యారు. ఈయన 2008 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ విజయవాడ అడ్మిన్ డీసీపీగా బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఎస్పీగా బదిలీ అయ్యారు. రెండు, మూడు రోజుల్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
జనాభా స్థిరీకరణపై దృష్టి
కర్నూలు(హాస్పిటల్): జనాభా స్థిరీకరణపై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్ సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి శ్రీ కృష్ణదేవరాయ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏజేసీ మాట్లాడుతూ జనాభా స్థిరీకరణ కోసం తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంభించాలన్నారు. అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ యు. రాజాసుబ్బారావు మాట్లాడుతూ అధిక జనాభా వల్ల ఇటు కుటుంబం, అటు దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమవుతుందన్నారు. ఆడ, మగ ఎవరైనా సరే ఇద్దరు పిల్లలకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని దేశ సౌభాగ్యానికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో పీసీపీఎన్డీటీ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ ధనుంజయ, డెమో రమాదేవి, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ స్కూల్ విద్యార్థినిలు పాల్గొన్నారు. -
ముసుగు తీసేశారు..!
* వైఎస్సార్సీపీకి చైర్మన్‌గిరీ దక్కకుండా గిరిగీసుకున్న అధికారులు * ఎన్నికల కమిషన్ ఆదే శాలు తుంగలోకి.. * ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై టీడీపీ దాడి * ఈసీ పరిధిలోకి జమ్మలమడుగు వ్యవహారం సాక్షి ప్రతినిధి, కడప: ప్రభుత్వ అధికారులనే ముసుగు తొలగించారు. పచ్చ కండువా కప్పుకోకుండానే అధికార పార్టీ మత్తులో జోగుతున్నారు. తెలుగుదేశం పార్టీకి చైర్మన్‌గిరీ చేజారిపోకుండా రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం లోపల టీడీపీ కౌన్సిలర్లు, వెలుపుల తెలుగుతమ్ముళ్లు యథేచ్ఛగా వీరంగం సృష్టించారు. పోలీసుల్ని సైతం లెక్కచేయకుండా దాడులకు తెగబడ్డారు. నిబంధనల మేరకు చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ ఆదేశించినా, అప్పటి వరకూ బేషుగ్గా ఉన్న ప్రిసైడింగ్ అధికారికి రఘునాథరెడ్డికి అనారోగ్య సమస్య తెరపైకి వచ్చింది. ఈలోగా శాంతిభద్రతలు అదుపు తప్పనున్నాయని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ లేఖ రాశారు. వైఎస్సార్ జిల్లాలో జమ్మలమడుగులో అధికార యంత్రాంగం ఏకపక్ష ధోరణిలో పయనిస్తోంది. గురువారం కౌన్సిలర్ కిడ్నాప్ డ్రామాను తెరకెక్కించిన టీడీపీ నేతలు, శుక్రవారం అధికారుల అండతో శాంతిభద్రతల సమస్యను తెరకెక్కించారు. నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు: జమ్మలమడుగు 1వవార్డు కౌన్సిలర్ మహమ్మద్‌జానీ తననెవ్వరూ కిడ్నాప్ చేయలేదంటూ గురువారం సాయంత్రమే ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీవో రఘునాథరెడ్డికి స్వయంగా ఫోన్ చేశారు. శుక్రవారం ఎలక్ట్రానిక్ మీడియాలో సైతం మాట్లాడారు. రాజకీయాలపై విరక్తితో వచ్చానని, ఆరోగ్యం బాగా లేకపోతే చూపించుకునేందుకు వెళ్లానని తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని, పోలీసు అధికారులు సైతం సంప్రదించలేదని వివరించారు. ఆమేరకు స్పందించిన ఎన్నికల సంఘం 22మంది సభ్యులకు గాను, 21మంది హాజరైన నేపథ్యంలో జమ్మలమడుగు చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతోందనుకున్న తరుణంలో ఆర్డీఓ రఘునాథరెడ్డి కర్ఛీఫ్తో ముఖం తుడుచుకుంటూ ప్రస్తుతం ఆరోగ్యం సహకరించడం లేదని ఎన్నికలు నిర్వహించలేనని మొండికేశారు. రెండు గంటలు కథ నడించారు. ఆలోగా శాంతిభద్రతలు అదుపు తప్పే అవకాశం ఉందని చైర్మన్ ఎన్నికల్ని వాయిదా వేయాలంటూ జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఆర్డీవోకు లేఖ పంపారు. అంతవరకూ అనారోగ్యం నటించిన ఆర్డీవో ఆలేఖను హుషారుగా చదివి సభ్యులకు వినిపించారు. అధికారుల వైఖరిని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ దృష్టికి తీసుకెళ్లారు. 21 మంది సభ్యుల మధ్య చైర్మన్ ఎన్నికలు నిర్వహించలేరా? అని ఆయన విస్మయం ప్రకటించినట్లు సమాచారం. టీడీపీ దౌర్జన్యం తెలుగుదేశం పార్టీ నేతలు జమ్మలమడుగులో రెండురోజులు యథేచ్ఛగా దౌర్జన్యం కొనసాగించారు. పోలీసుల్ని సైతం లెక్కచేయకుండా ప్రభుత్వ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ వందలాదిగా కార్యకర్తలతో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి హల్చల్ చేశారు. చైర్మన్ ఎన్నికలు నిర్వహిస్తారని తెలుసుకోగానే టీడీపీ కౌన్సిలర్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై కారంపొడి చల్లారు. అంటే కౌన్సిలర్లను పోలీసులు ఏమేరకు తనిఖీలు చేశారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జమ్మలమడుగు పురవీధుల్లో తెలుగుదేశం కార్యకర్తలు వీరంగం సృష్టించారు. యధేచ్ఛగా రాళ్ల వర్షం కురింపిం చారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమౌతుందని ఎస్పీ లేఖను ఎన్నికల సంఘం దృష్టికి జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తీసుకెళ్లారు. -
అనవసరంగా భూతద్దంలో చూపెట్టొద్దు
‘‘నాకు డబ్బు కాదు ముఖ్యం. పేరు ప్రఖ్యాతులు ముఖ్యం. దర్శకురాలు అవుదామని ఈ రంగంలోకొచ్చాను. అనుకోకుండా కథానాయిక అయ్యాను. ప్రస్తుతం నటిగా నా ముందున్న లక్ష్యం ఒక్కటే... మా నాన్న పేరును నిలబెట్టడం. డబ్బు కోసం అడ్డమైన పాత్రలూ పోషించను. నాన్న ఖ్యాతికి మచ్చ తెచ్చేలా స్కిన్‌షో చేయను’’... కెరీర్ తొలినాళ్లలో సోనమ్ కపూర్ చెప్పిన మాటలు ఇవన్నీ. అయితే... వాటిని నిలబెట్టుకునే పరిస్థితి ప్రస్తుతం సోనమ్‌కి కనిపించడం లేదు. విజయాలు ఆలస్యంగా వరించడంతో నిదానంగా స్కిన్‌షో చేయడం మొదలుపెట్టారామె. బాలీవుడ్‌లోని టాప్‌హీరోయిన్లకు తీసిపోని స్థాయిలో గ్లామర్‌ని ఒలకబోస్తూ, ఎట్టకేలకు విజయాలు అందుకుంటున్నారు సోనమ్. రాన్‌జానా, బాగ్ మిల్కా బాగ్ చిత్రాలు ఆమెకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ‘ఖూబ్సూరత్’ చిత్రంలో నటిస్తున్నారు సోనమ్. 1980లో అశోక్‌కుమార్, రేఖ నటించిన ‘ఖూబ్సూరత్’ చిత్రానికి ఇది రీమేక్. రేఖ పోషించిన పాత్రను ఇప్పుడు సోనమ్ పోషిస్తున్నారు. ఇక అసలు విషయానికొద్దాం... ఈ చిత్రంలోని సోనమ్ స్టిల్స్‌ని ఇటీవలే విడుదల చేశారు. వీటిల్లో సోనమ్ మరీ స్పైసీగా కనిపించడం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ఒంటిపై ఆచ్ఛాదనను చాలావరకు తప్పించి, పోర్న్‌స్టార్‌లా రెచ్చిపోయారు సోనమ్. ఈ సినిమా నిర్మాతల్లో సోనమ్ తండ్రి అనిల్‌కపూర్ కూడా ఒకరు కావడంతో బాలీవుడ్లో విమర్శలు పోటెత్తాయి. ఆ స్టిల్స్‌తో మీడియా కథనాలు కూడా ప్రసారం చేయడం మొదలుపెట్టింది. దాంతో సోనమ్‌కు వివరణ ఇవ్వక తప్పలేదు. ‘‘వృత్తి ధర్మాన్ని బట్టి మనిషి నడుచుకోవాలనేది నా సిద్ధాంతం. నాన్న నాకు చిన్నప్పట్నుంచీ నేర్పింది అదే. స్కిన్‌షో చేయాలని ఏ స్త్రీ కోరుకోదు. నేను నటిని. పాత్రను బట్టి నడుచుకోవాలి. అందుకే అలా నటించాల్సి వచ్చింది. నాన్న నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రంలో నేను అలా నటించానంటే, దానికి ఎంత బలమైన కారణం ఉండి ఉండాలో అర్థం చేసుకోండి. దాన్ని అనవసరంగా భూతద్దంలో చూపెట్టొద్దు’’ అని వాపోయారు సోనమ్. -
సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కు తీవ్ర అస్వస్థత!
'అభినందన' చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు అశోక్ కుమార్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అశోక్ కుమార్ ను చికిత్స కోసం చెన్నైలోని ఎస్ఆర్ఎమ్ ఆస్పత్రిలో చేర్పించినట్టు ఆయన కుమారుడు అకాశ్ అశోక్ కుమార్ మీడియాకు వెల్లడించారు. అనారోగ్యానికి సంబంధించిన అంశాలను వైద్యులు వెల్లడించడానికి వైద్యులు నిరాకరించారు. అయితే అశోక్ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పలు భాషల్లో 100 పైగా చిత్రాలకు ఫోటోగ్రఫిని అశోక్ కుమార్ అందించారు. 'నెంజాతాయ్ కిల్లతే' చిత్రానికి 1980లో అశోక్ కుమార్ కు జాతీయ అవార్డు లభించింది. హిందీలో సచ్చాప్యార్, బ్యాక్ వాటర్ అనే ఆంగ్ల చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. అశోక్ కుమార్ దర్శకత్వం వహించిన అభినందన (తెలుగు), ఆంద్రూ పీతా మజాయిల్ (తమిళ), కామగ్ని (హిందీ) మంచి పేరును తెచ్చిపెట్టడమే కాకుండా అవార్డులను సంపాదించిపెట్టాయి. -
స్మగ్లర్లపై ఉక్కుపాదం
రైల్వేకోడూరు రూరల్, న్యూస్‌లైన్: ఎర్రచందనం అక్రమ రవాణా చేసే స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపి పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. స్థానిక ఎర్రచందనం పార్కులో రాజంపేట, తిరుపతి డివిజన ఫారెస్టు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం ఆయన విలే కరులతో మాట్లాడుతూ రాజంపేట డివిజన్ ఫారెస్టు వైఎస్సార్ జిల్లా పరిధిలోకి వస్తుందని, బాలుపల్లె ఫారెస్టు డివిజన్ చిత్తూరు జిల్లా పరిధిలోకి వస్తుందన్నారు. దీంతో కొంత సమన్వయ లోపం ఉందన్నారు. ఇకపై సమన్వయంతో పనిచేసి ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ఫారెస్టు అధికారులు మాట్లాడుతూ బాలుపల్లె చెక్‌పోస్టు వద్ద సీసీ కెమెరాలు అమర్చుతామన్నారు. ఇకపై ప్రతి చెక్ పోస్టు పరిధిలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల కోడూరులో తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ ప్రవర్తించిన తీరుపై తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సమావేశానికి రాజంపేట డీఎస్పీ జీవీ రమణ, స్క్వాడ్ డీఎఫ్ఓ పవన్ కుమార్, తిరుపతి డీఎఫ్ఓ నాగరాజు, రాజంపేట డీఎఫ్ఓ నాగార్జునరెడ్డి, ఏఆర్ డీఎస్పీ చిన్నిక్రిష్ణ, ఇతర అధికారులు హాజరయ్యారు. -
క్రికెట్ బెట్టింగ్‌పై ఎస్పీ సీరియస్
అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రధాన బుకీలు ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరులో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్‌పై జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ సీరియస్ అయ్యారు. ఆదివారం సాక్షి దినపత్రికలో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్న తీరుపై ‘ఆడిందే ఆట, పాడిందే పందెం’ అనే కథనం ప్రచురితమైంది. దీనిపై ఎస్పీ స్థానిక పోలీసు అధికారులపై సీరియస్ అయినట్లు తెలిసింది. పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతుంటే ఏమి చేస్తున్నారని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సాక్షిలో కథనాన్ని చూసి ప్రొద్దుటూరు పోలీసుల్లో చలనం వచ్చినట్లు కనిపించింది. పట్టణంలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ఆదివారం సాయంత్రం నుంచి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. శనివారం సాయంత్రం వరకు స్థానికంగా ఉన్న ప్రధాన బుకీలు ఆదివారం ఉదయం నుంచి రహస్య స్థావరాలకు వెళ్లిపోయారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండటంతో ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు పోలీసులు పట్టణంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ప్రధాన బుకీలతోపాటు సబ్ బుకీలు కూడా జాగ్రత్త పడటంతో పోలీసులకు ఎవరూ దొరకలేదు. -
కరెంట్‌కు కటకట
హామీలు నెరవేర్చలేదని విద్యుత్ ఉద్యోగుల సమ్మె చాలా చోట్ల పగలంతా పవర్ కట్ ఫ్యూజులు పోయినా పట్టించుకునేవారు లేరు కరెంట్‌లేక ప్రజల అవస్థలు తిరుపతి, న్యూస్‌లైన్: తమ డిమాండ్ల సాధనకోసం విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో ప్రజలకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. ట్రాన్స్‌కో, జెన్ కో సంస్థల సిబ్బంది ఆదివారం నుంచి సమ్మెకు దిగడంతో గ్రామీణ ప్రాంతాల్లో అసలే అంతంత మాత్రంగా ఉన్న కరెంట్ సరఫరా మరింతగా దిగజారింది. ఫలితంగా గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లలో తలెత్తే సాంకేతిక సమస్యలను సరిచేసే వారు లేకపోవడంతో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సిబ్బంది సమ్మె కారణంగా మదనపల్లెలో ఆదివారం ఉదయం నుంచి కరెంట్ సరఫరా లేదు. సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చింది. సోమవారం ఉదయం 9 గంటలకు సరఫరా ఆగిపోయి, సాయంత్రం 5 గంటల వరకు కూడా రాలేదు. పుంగనూరులో ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తె లియని పరిస్థితి. అరగంట సరఫరా ఉంటే మూడు గంటలు ఉండ టం లేదని ప్రజలు వాపోతున్నారు. పీలేరులోఆదివారం ఉదయం పోయిన కరెంట్ రాత్రి వచ్చింది. సోమవారం ఉదయం 7.30 గంటలకు పోయి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చింది. పలమనేరులోనూ అదే పరిస్థితి. తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు పట్టణాల్లో మాత్రం కరెంట్ కోత వేళలను యథావిధిగా అమలు చేస్తున్నారు. మొత్తం మీద విద్యుత్ సిబ్బంది సమ్మె ప్రభావం ఇప్పుడిప్పుడే ప్రజలపై పడుతోంది. సమ్మె ఇలాగే కొనసాగితే పల్లె ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తప్పవు. డిస్కం కార్యాలయం వద్ద ధర్నా గతంలో అంగీకరించిన మేరకు జీతాలను సవరించి చెల్లించేందుకు ప్రభుత్వం ససేమిరా అనడంతో అనివార్యంగా సమ్మెకు దిగాల్సి వచ్చిందని విద్యుత్ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ పీ.అశోక్‌కుమార్ తెలిపారు. సమ్మెలో భాగంగా తిరుపతిలో డిస్కం కార్పొరేట్ కార్యాలయం(విద్యుత్ నిలయం) ప్రధాన ద్వారం వద్ద ఉద్యోగులు సోమవారం ధర్నాచేసి తమ డిమాండ్లను నినదించారు. సిబ్బంది సమ్మెకారణంగా డిస్కం కార్యాలయంతో బాటు సర్కిల్, డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభించాయి. ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ తమ డిమాండ్లపై ట్రాన్స్‌కో యాజమాన్యం విద్యుత్ ఉద్యోగుల సంఘాలతో పలు దఫాలు చర్చలు జరిపి అంగీకరించిన మేరకు ఈనెల 21న అగ్రిమెంట్ పై సంతకాలు చేయాల్సి ఉందన్నారు. అయితే యాజమాన్యం మాట మార్చి ఇప్పుడు కుదరదని చెప్పడంతో తాము సమ్మెకు దిగామన్నారు. జేఏసీ కన్వీనర్ మునిశంకరయ్య మాట్లాడుతూ ప్రతి నాలుగేళ్లకోసారి చేయాల్సిన వేతన సవరణ చేయకుండా యాజమాన్యం మొండి వైఖరిని అవలంబించడం దురదృష్టకరమన్నారు. ధర్నాలో డిస్కం జేఏసీ ప్రచార కార్యదర్శి ఎల్.చలపతి, కో-కన్వీనర్లు ధర్మజ్ఞాని, బాలచంద్రబాబు, ర మేష్‌బాబు, పీ.మాధవరావ్, బీ.వాలాజీ పాల్గొన్నారు. -
అందరి కృషితోనే ఎన్నికలు ప్రశాంతం
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: హోంగార్డు నుంచి డీఎస్పీ వరకు ప్రతి ఒక్కరూ కష్టపడటం వల్లే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించగలిగామని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. స్థానిక ఎస్కేవీ కల్యాణ మండపంలో బుధవారం రాత్రి నిర్వహించిన పోలీసుల గెట్ టు గెదర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్లి గ్రామసభ లు, అవగాహన సదస్సులు లాంటివి నిర్వహించడం వల్ల పోలింగ్ శాతం పెరగడమేగాక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నా రు. ఒకేసారి మూడు ఎన్నికలు రావడం దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేదన్నారు. అందరూ బాగా శ్రమించి కడప జిల్లా పోలీసు ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా ఇనుమడింపచేశారని కొని యాడారు. ఇదే తరహాలో ఇక నుంచి రోజు వారి విధులు నిర్వహించాలని సూచించా రు. ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్న మట్కా, క్రికెట్ బెట్టింగ్‌తోపాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపాలన్నారు. ఓఎస్డీ చంద్రశేఖర్ మాట్లాడుతూ మున్సిపల్, పరిషత్, సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కరు కష్టపడటం వల్లే చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రశాతంగా ఎన్నికలు జరిగాయన్నారు. జమ్మలమడుగు ఏఎస్పీ అప్పలనాయుడు మాట్లాడుతూ తనకు ట్రైనింగ్ అయిపోయిన రెండు నెలలకే ఎన్నికలు వచ్చాయన్నారు. ముందుగా ఎన్నికలు అంటే భయపడ్డానని, ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిసిన తర్వాత భయం అనేది లేకుండా పోయిందన్నారు. ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ 20 ఏళ్ల కాలంలో పోలీసు శాఖ తరపున గెట్ టు గెదర్కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు దారెడ్డి భాస్కర్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, టీవీ సత్యనారాయణ, ఎస్ఐలు మహేష్, వెంకటేశ్వర్లు, చలపతి, జీఎం బాషా, నారాయణ యాదవ్, రెడ్డిశేఖర్‌రెడ్డి, లక్ష్మినారాయణ, మస్తాన్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
‘సెయిల్’ సార్లొస్తున్నారు..
* బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అధ్యయన కమిటీ రాక *నేడు జిల్లా ఉన్నతాధికారులతో భేటీ రేపు క్షేత్ర సందర్శన * రూ. 30 వేల కోట్ల వ్యయం * 2,500 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదన * సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వనున్న కమిటీ సాక్షి ప్రతినిధి, ఖమ్మం: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) నిపుణుల బృందం నేడు జిల్లాకు రానుంది. బయ్యారంలో స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాల ను పరిశీలించేందుకు వస్తున్న ఎనిమిది మంది సభ్యుల బృందం రెండు రోజుల పాటు జిల్లాలోనే ఉంటుంది. సెయిల్ నిపుణుడు అశోక్‌కుమార్ ఝా నేతృత్వంలోని ఈ బృందం తొలిరోజు జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమై పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను చర్చించనుంది. రెండో రోజున జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ నేతృత్వంలో బయ్యారం వెళ్లి క్షేత్ర సందర్శన చేస్తుంది. అనంతరం ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనే భారీ ప్రాజెక్టు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో స్టీలు పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన వచ్చింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో స్టీలు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, ఈ మేరకు ఆరునెలల్లోపు కమిటీ అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇస్తుందని పునర్వ్యవస్థీకరణ చట్టంలో కూడా పేర్కొన్నారు. ఈ మేరకు కమిటీ ప్రతి నిధులు రాష్ట్రానికి వచ్చారు. మంగళవారం వీరంతా పరిశ్రమల శాఖ కార్యదర్శి, కమిషనర్లను కలిసి ఫ్యాక్టరీ ప్రతిపాదనలను తెలుసుకున్నారు. మొత్తం రూ.30 వేల కోట్ల వ్యయంతో, 2,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్టు పరిశ్రమల అధికారులు తెలియజేశారు. అయితే, ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు గాను అవసరమైన భూసేకరణ, నీటి వసతి, రవాణా(రోడ్డు, రైలు మార్గాలు), విద్యుత్ తదితర సౌకర్యాలపై ఈ కమిటీ జిల్లా ఉన్నతాధికారులతో బుధవారం చర్చించనుంది. కాగా, పరిశ్రమ కు అవసరమయ్యే ముడి ఖనిజాలైన డోల మైట్, ఇనుము, బొగ్గు జిల్లాలోనే అందుబాటులోనే ఉన్నాయి. వీటితో పాటు అవసరమ య్యే సున్నపురాయి (లైమ్‌స్టోన్) నిక్షేపాలు మాత్రం అందుబాటులో లేవు. ఈ నేపథ్యం లో పక్కనే ఉన్న నల్లగొండ జిల్లా మిర్యాల గూడ పరిసరాల నుంచి లైమ్‌స్టోన్‌ను తెచ్చుకోవాలని జిల్లా అధికారులు యోచిస్తున్నా రు. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై చర్చించి పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సెయి ల్ ప్రతినిధి బృందం కేంద్రానికి నివేదిక ఇస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. -
ప్రశాంతంగా కౌంటింగ్
కడప అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలో మార్చి 30న జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా నిర్వహించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ ఆదేశించారు. సోమవారం నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఆదివారం జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా బందోబస్తు విధులకు వచ్చిన పోలీసు అధికారులను, సిబ్బందినుద్దేశించి జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్ సూచనల మేరకు ప్రతి పోలీసు అధికారి నడుచుకొని ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా బందోబస్తు విధులు నిర్వర్తించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రత చేపట్టాలన్నారు. రెండు పారా మిలటరీ ప్లటూన్ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. అనంతరం కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి బందోబస్తు విధులకు సంబంధించి పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. అభ్యర్థితోపాటు ఒక్క కౌంటింగ్ ఏజెంట్‌ను మాత్రమే అనుమతిస్తామన్నారు. అలాగే ఎవరూ కూడా సెల్‌ఫోన్‌ను కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకురాకూడదన్నారు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల మేరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంద న్నారు. అలాగే పోలీస్-30 యాక్ట్ అమలులో ఉన్నందున కడప కార్పొరేషన్‌తోపాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటిల పరిధిలో ఊరేగింపులు, బాణాసంచా కాల్చడం లాంటివి నిషిద్ధమని హెచ్చరించారు. -
కాంగ్రెస్‌కు చావుదెబ్బ
కడప అగ్రిలక్చర్, న్యూస్‌లైన్: కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు చావు దెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్ , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మాకం అశోక్‌కుమార్ వైఎస్సార్సీపీలో చేరారు. వీరితో పాటు యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి బొమ్మన సుబ్బరాయుడు,కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకుడు మట్లి వేణుభాస్కరరెడ్డి కూడా చేరారు. గురువారం కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ ప్రచారంలో ఉన్న అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్ , మాకం అశోక్‌కుమార్, బొమ్మన సుబ్బరాయుడు, మట్లి వేణుభాస్కరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీలో అద్దె మనుషులకే విలువ ఉందన్నారు. నిజాయితీగా, వాస్తవంగా పనిచేసే నాయకులకు స్థానం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారన్నారు. దీంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడైన జగన్మోహన్రెడ్డి నాయకత్వం నచ్చినందునే వైఎస్సార్సీపీలో చేరామన్నారు. మాట కోసం, తండ్రి ఆశయాల సాధన కోసం ఎందాకైనా నిలిచే మొండిమనిషి జగన్ అని అన్నారు. మాట తప్పని నైజం తండ్రి నుంచి అలవరచుకున్న జగన్ నాయకత్వం నూతన రాష్ట్రానికి చాలా అవసరమన్నారు. పార్టీ మేనిఫెస్టో ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతోందని అన్నారు. టీడీపీ-బిజేపీలు రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యాయని, వాటిని నమ్మితే ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. -
గుజరాత్ కంటే అగ్రభాగాన తమిళనాడు
నరేంద్రమోడీ విమర్శలపై స్పందించిన జయలలిత హొసూరు, న్యూస్‌లైన్ : గుజరాత్ కంటే తమిళనాడు రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. కృష్ణగిరిలో గురువారం మధ్యాహ్నం కృష్ణగిరి అన్నాడీఎంకే అభ్యర్థి అశోక్‌కుమార్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. తమిళనాడు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కుంటుపడిందని, ఉద్యోగవకాశాలు కోల్పోయారని, విద్యుత్‌కోత ఉందని, బుధవారం కృష్ణగిరిలో జరిగన ఎన్నికల ప్రచారసభలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడి విమర్శించడంపై జయ తీవ్రంగా స్పందించారు. అన్ని రంగాల్లో గుజరాత్ కంటే తమిళనాడే ముందుందని వివరాలను వెల్లడించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు అధికార మార్పు కోసం జరుగుతున్నవి కాదని, విదేశీ శక్తుల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు ఈ ఎన్నికలలో తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరారు. కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం మీరిచ్చే తీర్పు ఆధారపడి ఉందన్నారు. కాంగ్రెస్, డీఎంకే పార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తారా అని జయలలిత అడగడంతో ప్రజలు సానుకూలంగా స్పందించారు. యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా మంత్రి పదవులు పొందిన డీఎంకే వారు తమిళనాడు రాష్ట్రం తలదించుకునే విధంగా 2జీ స్పెక్ట్రం కుంభకోణం చేశారని ఆరోపించారు. తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ఏం చేశాయని జయలలిత ప్రశ్నించారు. హొగేనకల్ పథకంపై స్టాలిన్ తప్పుడు ప్రచారం హొగేనకల్ తాగునీటి పథకంపై స్టాలిన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని జయలలిత ఆరోపించారు. డీఎంకే హయాంలో హొగేనకల్ పనులు 18 శాతం మాత్రమే పూర్తిచేశారని, అన్నాడీఎంకే అధికారం చేపట్టిన తర్వాత పనులు పూర్తిచేసి, 2013మే నెలలో హొగేనకల్ పథకాన్ని ప్రారంభించి తాగునీరందిస్తున్నామన్నారు. స్టాలిన్ హొగేనకల్ పనులను మూలన పడేశారని పచ్చి అపద్ధాలు చెపుతున్నారని విమర్శించారు. అన్నాడీఎంకే పాలనలో చేపట్టిన కృష్ణగిరి జిల్లాలో అభివృద్ది పనులను ముఖ్యమంత్రి వివరించారు. కేంద్రంలో సహకారం అందించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అన్నాడీఎంకే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కృష్ణగిరి జిల్లా ప్రజల చిరకాలవాంఛ అయిన హొసూరు-జోలార్‌పేట రైలు మార్గాన్ని సాధించుకుందామని హర్షాధ్వానాల మధ్య జయలలిత ప్రకటించారు. నదుల అనుసంధానానికి మోడీ హామీ ఇవ్వగలరా వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు దేశంలో నదుల అనుసంధానం కోసం కృషి చేశారని కృష్ణగిరి, సేలం బహిరంగ సభల్లో నరేంద్రమోడీ చెప్పారని, అయితే ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదని జయ ప్రశ్నించారు. తమిళనాడులో నదుల అనుసంధానానికి బీజేపీ హామీ ఇస్తుందా అని, ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అన్నాడీఎంకేలో చేరిక కృష్ణగిరి జిల్లాలో వివిధ పార్టీల నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తళి మాజీ ఎమ్మెల్యే దివంగత వేణుగోపాల్ తనయుడు వి.వెంకటేశ్, జూజువాడి మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ శ్రీధర్, హొసూరు మున్సిపల్ డీఎంకే కౌన్సిలర్ కుమార్, మూకొండపల్లి కౌన్సిలర్ వెంకటరెడ్డి, మరికొంతమంది కౌన్సిలర్లు అన్నాడీఎంకే పార్టీలో చేరారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే.పి.మునిస్వామి, బర్గూరు ఎమ్మెల్యే కే.ఈ.కృష్ణమూర్తి, ఊతంగెరె ఎమ్మెల్యే మనోరంజితం, హొసూరు మున్సిపల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, యూనియన్ చైర్పర్సన్ పుష్పాసర్వేష్, కృష్ణగిరి మున్సిపల్ చైర్మన్ తంగముత్తు పాల్గొన్నారు. బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
తెల్లారిన బతుకులు
గన్నవరం / అమలాపురం, పూర్తిగా తెల్లవారకుండానే వారి బతుకులు తెల్లారిపోయాయి. వ్యాపారరీత్యా గుంటూరు జిల్లా బాపట్లకు వెళ్లిన ఆక్వా రైతు తన కారులో స్వగ్రామానికి వస్తుండగా, పి.గన్నవరం అక్విడెక్టుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ ప్రమాదంలో అతడి కారు డ్రైవర్ కూడా చనిపోయాడు. పి.గన్నవరం అక్విడెక్టుపై శుక్రవారం తెల్లవారుజామున క్వారీ లారీ, కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీకి చెం దిన ఆక్వా రైతు అల్లూరి వెంకట్రాజు(చంటిరాజు)(48), కారు డ్రైవర్ పంపన అశోక్‌కుమార్(25) అక్కడికక్కడే మరణిం చారు. పోలీసుల కథనం ప్రకారం.. వెంకట్రాజు ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలోని తన చెరువులకు అవసరమైన రొయ్య సీడు కోసం బయలుదేరాడు. అమలాపురం వేంకటేశ్వర స్వామి గుడి ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ పంపన అశోక్‌కుమార్‌తో కలిసి కారులో గురువారం సాయంత్రం గుం టూరు జిల్లా బాపట్లకు పయనమయ్యారు. అక్కడ సీడు కొనుగోలు చేసి, లారీలో ఎగుమతి చేయించి అమలాపురం పంపిం చారు. అనంతరం కారులో అమలాపురానికి తిరుగు ప్రయాణమయ్యారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న కారు పి.గన్నవరం అక్విడెక్టుపైకి చేరుకుంది. రాజమండ్రి నుంచి రాజోలు గ్రావెల్ లోడుతో వెళుతున్న క్వారీ లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారు ముందు భాగం పూర్తిగా లారీ కింద ఇరుక్కుంది. కారులో ఇరుక్కుపోయిన వెంకట్రాజు, డ్రైవర్ అశోక్‌కుమార్ అందులోనే చనిపోయారు. పోలీసులు ట్రాక్టర్ సాయంతో లారీ నుంచి కారును వేరు చేశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జి.హరీష్‌కుమార్ చెప్పారు. ప్రమాదం జరిగిన తీరు, మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడం చూసిన స్థానికులు చలించిపోయారు. వెంకట్రాజుకు భార్య సంధ్యారాణి, కుమారులు అనిరుధ్ వర్మ, వివేక్ వర్మ ఉన్నారు. వెంకట్రాజు స్వగ్రామం మలికిపురం మండలం లక్కవరం గ్రామం కాగా, వ్యాపారరీత్యా అమలాపురంలో దుకాణం ఏర్పాటు చేసుకుని, ఇక్కడే నివసిస్తున్నారు. ఐటీఐ చదివిన అశోక్‌కుమార్ డ్రైవింగ్‌పై ఉన్న ఆసక్తితో ఏడాదిగా వెంకట్రాజు వద్ద కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి ఇంకా పెళ్లి కాలేదు. గురువారం ఉదయం అశోక్‌కుమార్ తన తల్లి రమాదేవికి బాపట్ల వెళుతున్నానని చెప్పి, ఇంటి నుంచి బయలుదేరాడు. శుక్రవారం ఉదయం కొడుకు మరణవార్త విని రమాదేవి గుండెలవిసేలా రోదించింది. వెంకట్రాజు కుటుంబీకులు, బంధువులు ప్రమాద స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ఆక్వా రంగంలో రాణిస్తున్న ఆయన ఆకస్మిక మరణం కోనసీమ ఆక్వా రైతులను కూడా విషాదం నింపింది. పావుగంట గడిస్తే... ప్రాణాలు దక్కేవి సుమారు 250 కిలోమీటర్లు కారులో ప్రయాణించిన వీరు మరో పావు గంటలో ఇళ్లకు చేరుకోవాల్సి ఉంది. ఇంతలోనే మృత్యువు లారీ రూపంలో వచ్చి వారిద్దరినీ కబళించింది. ఆక్వా రైతు అల్లూరి వెంకట్రాజు, డ్రైవర్ అశోక్‌కుమార్ మరణించిన సంఘటనతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. వారు నివసించే హౌసింగ్‌బోర్డు కాలనీ, వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంతాల్లోని విషాదం అలముకుంది. ఆక్వా సీడు కోసం వెంకట్రాజు, డ్రైవర్ అశోక్‌కుమార్‌తో కలిసి ఇతర జిల్లాలకు వెళ్లడం, రాత్రికిరాత్రే ఇళ్లకు చేరుకోవడం జరుగుతోంది. ఎప్పటిలాగే సీడు కోసం వెళ్లిన వారు.. ఇంటిముఖం పడుతూ శుక్రవారం తెల్లవారకుండానే వారి జీవితాలు కడతేరిపోయాయి. లక్కవరంలో విషాదం మలికిపురం : రోడ్డు ప్రమాదంలో వెంకట్రాజు మరణించడంతో అతడి స్వగ్రామమైన లక్కవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోస్ట్‌మార్టం అనంతరం వెంకట్రాజు మృతదేహాన్ని లక్కవరానికి తరలించారు. మృతదేహాన్ని చూసి బంధువుల రోదనలు మిన్నంటా యి. శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. -
కిడ్నాప్ సుఖాంతం
కడప అర్బన్/వేంపల్లె, న్యూస్‌లైన్: కడప నగరంలోని ఓ పూల వ్యాపారిని కిడ్నాప్ చేసి డబ్బులు రాబట్టాలని నిందితులు నేరానికి పాల్పడగా, ఆ ఘటనను కేవలం 24 గంటల్లోపే పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ చేసిన వారి ఆట కట్టించారు. వారు బాధితుని నుంచి బలవంతంగా రాయించుకున్న ప్రామిసరి నోట్లు, అగ్రిమెంట్లను సీజ్ చేశారు. డయల్ 100కు ఫోన్ రాగానే వెంటనే స్పందించిన ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించి నిందితులను అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఒన్‌టౌన్ సర్కిల్ కార్యాలయంలో కడప డీ ఎస్పీ సి.రాజేశ్వర్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎర్రముక్కపల్లెలోని బాలవికాస్ స్కూల్ సమీపంలో పూల వ్యాపారి ఏనుగటి క్రిష్ణ అలియాస్ పూలక్రిష్ణ(55) నివసిస్తున్నాడన్నారు. ఆయన నగరంలోని పాత బస్టాండు వద్ద పూల అంగడితో పాటు పాత సీసాలు, పాత ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం చేసేవారన్నారు. నాగరాజుపేటకు చెందిన నామాల శ్రీనివాసులు పూల క్రిష్ణ వద్ద పదేళ్లుగా గుమాస్తాగా పని చేసేవాడన్నారు. అతని ప్రవ ర్తన సరిగా లేకపోవడంతో శ్రీనివాసులును క్రిష్ణ ఉద్యోగం నుంచి తొలగించాడని డీఎస్పీ తెలిపారు. తన భాగానికి రూ.40 లక్షలు వస్తాయని శ్రీనివాసులు ఎస్పీకి ఫిర్యాదు చేయగా ఒన్‌టౌన్ పోలీసులు విచారించగా తప్పుడు ఫిర్యాదుగా విచారణలో తేలిందన్నారు. పూల క్రిష్ణ వద్ద నుంచి రూ.40 లక్షలు రాబట్టుకునేందుకు శ్రీనివాసులు పులివెందులకు చెందిన లక్ష్మినారాయణరెడ్డిను సంప్రదించి కిడ్నాప్ పథకం రచించారన్నారు. ఈ నెల 27వ తేదీ రాత్రి 9.20 గంటలకు ఎర్రముక్కపల్లె సర్కిల్ వద్ద ఎక్సెల్ వాహనంలో ఇంటికి వెళుతున్న క్రిష్ణను నామాల శ్రీనివాసులు (45), బత్తల శ్రీనివాసులు(29), బొర్రె వంశీ రాం (21), డొడ్డోడు సురేష్ (23), రామాంజి (24), లక్ష్మినారాయణరెడ్డి, మహేష్, బాషాలు స్కార్పియోలో కిడ్నాప్ చేశారన్నారు. వేంపల్లె వద్ద పూల క్రిష్ణను బెదిరించి, 4 ఖాళీ బాండ్ పేపర్లు, 5 ప్రామిసరి నోట్లపై సంతకాలు చేయించుకున్నారన్నారు. అనంతరం వేంపల్లె బస్టాండులో వదిలేశారన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పూల క్రిష్ణ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారన్నారు. ఒన్‌టౌన్ సీఐ ఎస్.మహబూబ్‌బాష, అర్బన్ సీఐ శ్రీనివాసులు, ఒన్‌టౌన్ ఎస్ఐలు రంగనాయకులు, మైనుద్దీన్‌లు సిబ్బంది ప్రసాద్, వెంకటేశ్వర్లు ఐదుగురు నిందితులను శిల్పారామం వద్ద అరెస్ట్ చేశారని డీఎస్పీ వివరించారు. -
రేపటి నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
తిరుపతి, న్యూస్‌లైన్: పీఆర్సీ ఏర్పాటులో యాజమాన్య నిరంకుశ వైఖరిని నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. ఇప్పటికే దశలవారీగా ఉద్యమం చేపట్టి వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినా యాజ మాన్యం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్) పరిధిలోని ఆరు జిల్లాల్లో పనిచేసే దాదాపు 10 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. సంస్థలోని 16 ఉద్యోగ సంఘాలు ఏకమై ఏపీ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం వర్క్ టు రూల్ పాటించి తిరుపతిలోని డిస్కం కార్పొరేట్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు ప్రారంభించారు. తమ జీత భత్యాల సవరణ కోసం ఒక పీఆర్సీని వేయమని తాము కోరితే యాజమాన్యం మూడు కమిటీలు వేసి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని జేఏసీ చైర్మన్ అశోక్‌కుమార్, కన్వీనర్ మునిశంకరయ్య ఆరోపించారు. పీఆర్సీతో పాటు కాంట్రాక్ ్ట సిబ్బంది సర్వీసులను క్రమబద్ధం చేయాలని, సంస్థలో ప్రైవేటీకరణకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. తొలి రోజు బుధవారం చేపట్టిన నిరాహార దీక్షలో పీ.బాలాజీ, నంజుండేశ్వర్, పీ.శ్రీధరన్, టీ.సుబ్రమణ్యం నాయుడు, జే. నాగరాజన్, ఎస్.భాస్కర్ పాల్గొన్నారు. వీరికి జేఏసీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. -
ప్రతి ఒక్కరూ పాటించేలా చేస్తాం
కడప అర్బన్, న్యూస్‌లైన్ : ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అల వాటు చేస్తామని ఎస్పీ అశోక్‌కుమార్ ధీమా వ్యక్తంచేశారు. బుధవారం సాయంత్రం కడప ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ కార్పొరేషన్, ఆర్అండ్బీ, ఆర్టీఏ అధికారులతో తాము సమావేశమై ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించే అంశాలన్నింటిపై చర్చలు జరిపామన్నారు. రాబోయే ఆరు నెలల్లో కడపతోపాటు ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు పట్టణాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తామన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వారు కూడళ్లలో సిగ్నల్స్ ఏర్పాటు చేయడంతోపాటు సీసీ టీవీలను కూడా ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారన్నారు. అలాగే కడపలో కూడా సీసీ టీవీలు పెట్టాలని ప్రతిపాదనలు పంపించామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ యు.సదాశివయ్య, వన్‌టౌన్ సీఐ మహబూబ్‌బాష, అర్బన్ సీఐ శ్రీనివాసులు, రూరల్ సీఐ రాజగోపాల్‌రెడ్డి, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. -
అంతర్ రాష్ర్ట ‘ఎర్ర’ దొంగల ముఠా అరెస్ట్
పట్టుబడిన వారందరూ కర్ణాటక, కడప ప్రాంత వాసులే ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడి కడప అర్బన్(వైఎస్ఆర్ జిల్లా),న్యూస్‌లైన్ :ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను కడప పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వారి నుంచి రూ.12.70 లక్షల నగదు, 31 దుంగలు, టవేరాకారు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. మరో ఇద్దరు దొంగలు తప్పించుకున్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఆయన పట్టుబడిన ఎర్రచందనం దుంగలను విలేకరుల ఎదుట హాజరుపరిచారు. దొరికింది ఇలా.. ఎర్రచందనం అక్రమ రవాణాపై కడప అర్బన్ సర్కిల్ పోలీసులతో పాటుు అటవీ శాఖ అధికారులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో ఉదయం 6.30 గంటలకు కడప సాయిపేట చెరువు కట్ట సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన టవేరా కారును ఆపారు. అయితే కారును ఆపకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే వెంటబడి పట్టుకున్నారు. అందులో పది మంది ఉన్నారు. వారందరూ కర్ణాటకతో పాటు కడపకు చెందిన వారు ఉన్నారు. అరెస్టైన వారిలో కర్ణాటక రాష్ట్రం మంగుళూరుకు చెందిన డ్రైవర్ షర్ఫుద్దీన్(32), అబ్దుల్ మజీద్(29), బద్రుద్దీన్(22)తో పాటు కడపకు చెందిన వడుగూరి రవికుమార్ అలియాస్ సతీష్(25), గుంట అనిల్‌బాబు(25), ఖాదర్‌ఖాన్ కొట్టాలకు చెందిన వ్యాన్ డ్రైవర్ చాగలమర్రి మల్లికార్జున(25), మరో వ్యాన్ డ్రైవర్ మారే రవి(23), పులివెందులకు చెందిన వేబ్రిడ్జి మేనేజర్ వల్లెపు వెంకటరమణ(54), డ్రైవర్ ఖాదర్‌బాషా(30), సిద్ధవటానికి చెందిన మెడికల్ రెప్రజంటేటివ్ నిమ్మకాయల గంగిరెడ్డి(30) ఉన్నారన్నారు. నిందితుల నేపథ్యం : కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన మొదటి నిందితుడు షర్ఫుద్దీన్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతను అదే రాష్ట్రం హోసకోటే తాలూకా మాలూరు రోడ్డులోని కాటేగానహల్లికి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ షబ్బీర్ అలియాస్ రహమత్(45)తో పరిచయం ఏర్పరచుకున్నాడు. రెండేళ్లుగా కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లతో షర్పుద్దీన్ సంబంధాలు పెట్టుకొని యథేచ్చగా ఎర్రచందనం దుంగలను తరలించేవాడు. దుంగలను కాటేగానహల్లికి చెందిన షబ్బీర్‌కు కిలో రూ.1500 చొప్పున విక్రయిస్తూ తాను కమీషన్ తీసుకునేవాడు. వాటిని షబ్బీర్ చెన్నై, ముంబై, ఢిల్లీలో తనకు తెలిసిన స్మగ్లర్లకు అమ్మేవాడని ఎస్పీ వివరించారు. ప్రస్తుతం పట్టుబడిన ముఠా సభ్యులంతా గత నెల 21న ఈచర్ వ్యాన్(ఏపీ 02 డబ్ల్యూ 5000) షబ్బీర్‌కు ఎర్రచందనం దుంగలు అమ్మి, దారిలో వస్తూ హసనకోటలోని చింతామణి రస్తాలో పోలీసుల తనిఖీలను గమనించి వ్యాన్‌ను అక్కడే వదిలేసి పరారయ్యారని చెప్పారు. -
మద్యం మహమ్మారిని తరిమికొడదాం
ఖిల్లాఘనపురం, న్యూస్‌లైన్: గ్రామాల్లోని మహిళలు, యువకు లు, ఎక్సైజ్ అధికారులతో కలిసి మద్యం మహమ్మారిని తరిమికొడదామని ఎన్ఫోర్స్మెంట్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ అశోక్‌కుమార్ అన్నారు. నాలుగు రోజు లుగా ఖిల్లాఘనపురం మండలం ఉప్పరిపల్లిలో నాటుసారా, మద్యం బెల్టుషాపులను తొలగించాలని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఫిర్యాదుల దినోత్సవం సం దర్భంగా మహబూబ్‌నగర్‌లో కలెక్టర్ గిరిజాశంకర్‌ను కలిసి విన్నవించారు. ఆయన ఆదేశాల మేరకు మంగళవారం గ్రామంలో ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మహిళలతో కలిసి దాడులు నిర్వహించారు. అనంతరం గ్రామపంచా యతీ వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో కొందరు వ్యక్తులు నాటుసారా, మద్యం బెల్టు షాపులను యథేచ్ఛ గా నిర్వహిస్తున్నారన్నారు. తాగేందుకు డబ్బులు లేని సమయంలో తమ భర్తలు ఇంట్లో ఉన్న సామగ్రి సైతం అమ్ముకుం టున్నారని వాపోయారు. ఒకవైపు తా ము నిరసన కార్యక్రమాలు చేపడుతుం టే మరోవైపు రాత్రివేళ తమ భర్తలకు మద్యం తాగించి ఇంటికి పంపడంతో గొడవ పెట్టుకుని తీవ్రంగా కొడుతున్నారన్నారు. సోమవారం రాత్రి ఊషన్న ఫుల్‌గా తాగి భార్యాపిల్లలను కొట్టడంతో వారు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మద్యం అమ్మకుండా తగు చర్యలు తీసుకోవాల ని కోరారు. దీనికి ఏసీ బదులిస్తూ మహిళల్లో చైతన్యం రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇక నుంచి గ్రామంలో ఎవరైనా నాటుసారా, మద్యం విక్రయిస్తున్నట్లు తెలిస్తే తమకు ఫోనోలో సమాచారమివ్వాలన్నారు. అనంతరం ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామంలో రాత్రివేళ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. తాగి ఎవరైనా గొడవ చేస్తే వెంట నే సమాచారమివ్వాలని సూచించారు. కార్యక్రమంలో గద్వాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ జనార్దన్‌రెడ్డి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ జానయ్య, సీఐ నారాయణ, ఎస్ఐలు రాములు, సాయన్న, మైమూద్‌ఖాన్ పాల్గొన్నారు. మహిళా సంఘాల సభ్యులతో కమిటీ మద్యం మహమ్మారిని అరికట్టేందుకు గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షురాలిగా సత్యమ్మ, ఉపాధ్యక్షురాలిగా సాయమ్మ, ప్రధాన కార్యదర్శిగా అలి వేల, కార్యదర్శులుగా వెంకటమ్మ, సుక్కమ్మను ఎన్నుకున్నారు. -
రాజంపేట చోరీపై ఐజీ ఆరా
రాజంపేట, న్యూస్‌లైన్: రాజంపేట ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో జరిగిన చోరీ ఘటనపై రాయలసీమ రేంజ్ ఐజీ రాజీవ్త్రన్ ఆరా తీశారు. హ మేరకు శుక్రవారం రాజంపేట సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి చోరీ సంఘటనపై వివరాలు అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంకు చోరీపై దృష్టి పెట్టి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను వెంటనే పూర్తి చేయాలన్నారు. సబ్‌డివిజన్ పరిధిలోని శాఖ పరమైన పురోగతిపై సమీక్షించారు. సబ్‌డివిజన్ పరిధిలో పోలీసు శాఖకు సంబంధించి నివాస గృహాలు దెబ్బతిని ఉంటే వాటికి మరమ్మతులు చేయించాలని, నివాస గృహాల విషయమై నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆ యనతో పాటు కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, రాజంపేట డీఎస్పీ అన్యోన్య, పట్టణసీఐ వెంకటరమణ తదితర పోలీసు అధికారులు ఉన్నారు. -
ధ్యాన్‌చంద్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి
న్యూఢిల్లీ: భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్‌కు ‘భారతరత్న’ పురస్కారం ఇవ్వాలని కోరుతూ పలువురు అలనాటి మేటి క్రీడాకారులు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వరకు మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. భారత హాకీకి పర్యాయపదంలాంటి దిగ్గజానికి అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వాలని అక్కడికి వెళ్లి వినతి పత్రం ఇచ్చారు. ధ్యాన్‌చంద్ కుమారుడు, మాజీ హాకీ ఆటగాడు అశోక్ కుమార్ నేతృత్వంలో బారాఖంబా రోడ్ నుంచి మొదలైన మార్చ్‌పాస్ట్ పీఎంఓ కార్యాలయం వరకు సాగింది. ఇందులో నాటి దిగ్గజాలు జఫర్ ఇక్బాల్, దినేశ్ చోప్రా, రాజేశ్ చౌహాన్, మాజీ కోచ్ హరేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. హాకీ ఆటకు వన్నెతెచ్చిన కె.ఆర్ముగమ్, అశోక్లిద్దరు పీఎంఓ కార్యాలయంలో విజ్ఞాపన పత్రం అంజేశారు. భారతరత్న అర్హుల జాబితాలో క్రీడాకారులను చేర్చిన తర్వాత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు తొలిసారి ఈ అత్యున్నత పౌరపురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దివంగత లెజెండ్కూ ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. -
సంపూర్ణ తెలంగాణ ఇవ్వాలి
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : సంపూర్ణ, సామాజిక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని ఆర్ట్స్ అండ్ సైన్స్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మంద అశోక్‌కుమార్ డిమాండ్ చేశారు. టీజేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో చేపట్టిన దీక్షకు సంఘీభావంగా మంగళవారం హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సామాజిక తెలంగాణ బీసీ జేఏసీ నాయకులు మౌన దీక్ష చేశారు. దీక్షలను ప్రొఫెసర్ మంద అశోక్‌కుమార్ ప్రారంభించి మాట్లాడుతూ ఉద్యమ ఫలితంగానే కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆయన సూచించారు. సామాజిక తెలంగాణ బీసీ జేఏసీ వ్యవస్థాపక కన్వీనర్ తిరునహరి శేషు మాట్లాడుతూ రాష్ట్రపతి పంపిన తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్, తీర్మానం ఉండదన్నారు. చర్చ జరుగకుండా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. సామాజిక తెలంగాణ బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ బొంగు రాజుయాదవ్, నాయకులు నకిరెకంటి శీనయ్య, తంగెళ్ల పూర్ణేందర్, మల్లోజు సత్యనారాయణచారి, గంగాపురం వేణుమాధవ్, బొంత రామకృష్ణ, చిన్నాల యశ్వంత్‌యాదవ్, ఎర్రబొజ్జు రమేష్, కాటి రఘు, నల్లెల్ల వేణుగోపాల్, ఎల్లావుల సతీష్, రాధాకృష్ణ, ఎండ్ల రాంబాబు, దామెరుప్పుల సతీష్, నెమలిపురి రఘు, రాఘుల శ్రీనివాస్, సాయి, డానియల్, అ మినిశెట్టి రాజేంద్ర, తిరునగరి హరికృష్ణ, రాజ్‌కుమార్, చా గంటి మధుకృష్ణ, కిరణ్, శ్రీనివాస్, కత్తుల దేవరాజు, ఓర్సు రామకృష్ణ, ఎం.రాజు, కె.భరత్ కూర్చున్నారు. -
వేయి నుంచి ‘నూరు కాళ్లు’
సాక్షి, తిరుమల: తిరుమలలో కూల్చివేసిన వేయికాళ్ల మండపాన్ని తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉన్న శ్రీనివాసమంగాపురంలో నూరుకాళ్లతో నిర్మించేందుకు టీటీడీ సిద్ధమైంది. శ్రీవారి ఆలయం ముందున్న వేయికాళ్ల మండపాన్ని తిరుమల మాస్టర్ప్లాన్కింద 2003లో కూల్చివేసిన విషయం తెలిసిందే. పదేళ్లుగా నలుగుతున్న ఈ మండ పం వివాదాన్ని పరిష్కరించే దిశగా టీటీడీ చర్యలు చేపట్టింది. మండపం తిరుమలలో వద్దంటున్న భద్రతా కమిటీ కూల్చివేసిన వేయికాళ్ల మండపం స్థానంలో నూరుకాళ్ల మండపం నిర్మించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ మేరకు కూల్చివేసిన రాతి స్తంభాలతోనే 2009లో ప్రారంభమైనా పనులు పునాదులకే పరిమితమయ్యాయి. కోర్టు ఉత్తర్వులతో గత ఏడాది రాష్ట్ర పోలీసు, టీటీడీ అధికారులు ఆరుగురితో టీటీడీ ధర్మకర్తల మండలి కమిటీ వేసింది. టీటీడీ సీవీఎస్వో జీవీజీ అశోక్‌కుమార్ నేతృత్వంలో తిరుమల జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు, రాష్ర్ట ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ వింగ్ ఐజీ మహేష్ భగవత్, అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ, ఎస్బీ డీఐజీ వీసీ సజ్జనార్, టీటీడీ చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖరరెడ్డితో కూడిన కమిటీ వేశారు. సోమవారం కమిటీ సభ్యులు ఆరుగురూ కూల్చివే సిన మండపాన్ని, ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఆలయం వద్దే నిర్మించడం వల్ల తీవ్రమైన భద్రతా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని భావిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా నూరుకాళ్ల మండపాన్ని పాపవినాశనం వెళ్లే మార్గంలోని పారువేట మండపం పక్కనే నిర్మించాలన్న ప్రతిపాదన కూడా సరైనది కాదనే అభిప్రాయంతో కమిటీ ఉంది. అక్కడ నిర్మించటం వల్ల సరైన పర్యవేక్షణ లేక మండపం శిధిల స్థితికి చేరుకోవడంతో పాటు భద్రతా సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉందని క్షేత్రస్థాయి పరిశీలనలో నిర్ధారించారు. వేయికాళ్ల మండపాన్ని తిరుపతికి సమీపంలోని శ్రీనివాసమంగాపురం కల్యాణవేంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద నిర్మించాలని టీటీడీ సిద్ధమవుతోంది.. కూల్చివేసిన చోటే మండపాన్ని నిర్మించాలని చినజీయరు స్వామి కోరుతుంటే.. అలా చేస్తే భద్రతా పరమైన ఇబ్బందులు తప్పవని నిఘా, భద్రతా అధికారులు తేల్చిచెప్పారు. దీంతో చినజీయరు స్వామిని కూడా ప్రసన్నం చేసుకోడానికి శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పురావస్తుశాఖ ఆధీనంలో ఉన్న కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తిరుమలలోని పురాతన మండపాన్ని పునరుద్ధరించేందుకు ఎలాంటి అవరోధాలు ఉండవనే భావనతో టీటీడీ ఉంది. స్థలం పరిశీలిస్తున్నాం : జేఈవో వేయికాళ్ల మండపం స్థానంలో నిర్మించాలని తలపెట్టిన నూరుకాళ్ల మండపం కోసం స్థలాన్ని పరిశీలిస్తున్నామని తిరుమల జేఈవో కేఎస్. శ్రీనివాసరాజు వెల్లడించారు. ఇందుకోసం బోర్డు నియమించిన సిక్స్‌మెన్ కమిటీ సోమవారం ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించిందన్నారు. సున్నితమైన ఈ అంశంపై మరో మారు చర్చించి సిఫారసులను టీటీడీ ధర్మకర్తల మండలికి అందజేస్తామన్నారు. వీటితోపాటు మరో మూడు నెలల్లో ఇన్నర్ సెక్యూరిటీ కార్డాన్లోని తూర్పుమాడ వీధి పనులు పూర్తి చేసేలా కమిటీ నిర్ణయించిందన్నారు. అలాగే, ఔటర్ సెక్యూరిటీ కార్డాన్ పనులు కూడా మూడో దశలో ఉన్నాయని అన్నారు. -
మాకం రాజీనామా ఓకే
సాక్షి, కడప : జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు మాకం అశోక్‌కుమార్ రాజీనామాను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం ఆమోదించారు. సీడబ్ల్యుసీ తెలంగాణాపై నిర్ణయం ప్రకటించడంతో అందుకు నిరసనగా మాకం రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామాను పీసీసీ పెండింగ్‌లో ఉంచింది. ఇటీవల బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి గురవడంతో మూడు రోజుల క్రితం ఆయనను పరామర్శించేందుకు మాకం వెళ్లారు. తన రాజీనామాను ఆమోదించాలని బొత్సను కోరారు. రాజీనామాను ఆమోదించనని, కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మాకంకు బొత్స సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్యవాదాన్ని పూర్తిగా భుజానెత్తుకున్నారని, ఇలాంటి క్రమంలో ఆయన సొంత జిల్లాలో కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షునిగా పార్టీని బలోపేతం చేయడం తన వల్ల కాదని మాకం స్పష్టంచేశారు. కాంగ్రెస్‌పార్టీ సమైక్యవాదాన్ని ప్రకటించాలని, లేకుంటే తన రాజీనామాను ఆమోదించాలని బొత్సకు తేల్చి చెప్పారు. దీంతో కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన శనివారం మాకం అశోక్‌కుమార్ రాజీనామాను బొత్స ఆమోదించారు. ఇదిలా ఉండగా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సమైక్యానికి కట్టుబడి రాజీనామాలు ప్రకటించారు. అయితే వీరెవరి రాజీనామాలను ఇంకా ఆమోదించలేదు. మాకం రాజీనామాను ఆమోదించడం చర్చనీయాంశమైంది. -
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి
చక్రాయపేట, న్యూస్‌లైన్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. చక్రాయపేట పోలీసు స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. పోలీసు క్వార్టర్స్‌తో పాటు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రికార్డులను చూశారు. మండలంలోని సమస్యాత్మక గ్రామాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతానికి జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. చక్రాయపేట స్టేషన్లో సిబ్బంది కొరతను తీరుస్తామన్నారు. కొండవాండ్లపల్లెకు చెందిన మహేష్‌పై జరిగిన హత్యాయత్నంపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపీరు. అనంతరం మండలంలో ఫ్యాక్షన్ గ్రామంగా గుర్తింపు పొందిన గండి కొవ్వూరును సందర్శించారు. పులివెందుల డీఎస్పీ హరినాథ్‌బాబు, లక్కిరెడ్డిపల్లె సీఐ వినయ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐ సునీల్ కుమార్ ఆయన వెంట ఉన్నారు. -
భారీగా ‘ఎర్ర’ దుంగలు స్వాధీనం
=ఇద్దరు తిరుపతి కూలీల అరెస్ట్ =వాహనాలు, దుంగల విలువ రూ.38 లక్షలు చంద్రగిరి, న్యూస్‌లైన్: మండలంలో గురువారం 71 ఎర్రచందనం దుంగలను, రెండు టాటా వింగర్ వాహనాలను టాస్క్‌ఫోర్స్, ఫారెస్ట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నా రు. రెండు టన్నుల బరువున్న ఈ దుంగ లు సుమారు రూ.20 లక్షలు, వాహనాలు రూ.18 లక్షలు చేస్తాయని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాద్ అంచనా వేశారు. చంద్రగిరి సీఐ నాగభూషనం వివరాల మేరకు... ఎస్టీఎఫ్ సీఐ అశోక్‌కుమార్ తన సిబ్బందితో కలిసి గురువారం తెల్లవారుజామున తొండవాడ ప్రాంతంలో తనిఖీలు చేశారు. ముళ్ల చెట్లల్లో టాటావింగర్ (కేఏ 03డీ 7309) వాహనంలో దుంగలు లోడ్ చేయడాన్ని గుర్తించారు. వెంటనే టాస్క్‌ఫోర్స్ సిబ్బంది చుట్టిముట్టి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 41 దుంగలున్న వాహనాన్ని అదుపులోకి తీసుకుని చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో సురేష్ అనే వ్యక్తిది తిరుపతిలోని కేశవాయనగుంట, ఉదయ్‌కుమార్‌ది ఎమ్మార్‌పల్లె అని విచారణలో తెలిసింది. వీరి నుంచి పోలీసులు ప్రధాన స్మగ్లర్ వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. సీఐతోపాటు ఎస్ఐ జాన్‌కెనడి, సుబ్రమణ్యం దుంగలను పరిశీలించారు. అలాగే భాకరాపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాద్, డీఆర్వో బాలాజి గురువారం ఉదయం చెర్లోపల్లె నుంచి అలిపిరి వెళ్లే మార్గంలో దాడులు నిర్వహించారు. ఈ మార్గంలో ని మచాని గార్డెన్స్ వెనుక ఉన్న ఫారెస్ట్ లో తనిఖీలు చేశారు. టాటావింగర్ వా హనంలో దుండగులు ఎర్రచందనం దుంగలను లోడ్ చేయడాన్ని గుర్తించా రు. పోలీసులను చూడగానే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. అధికారులు వాహనాన్ని అందులోని 30 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. -
జిల్లాలో పోలీస్-30 యాక్ట్ అమలు
కడప అర్బన్, న్యూస్‌లైన్ : జీఓఎం తుది సమావేశం, కేంద్ర కేబినెట్ భేటీ నేపథ్యంలో జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో సెక్షన్-30 పోలీస్ యాక్ట్‌ను అమలులోకి తెచ్చినట్లు జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించాలన్నా సంబంధిత పోలీస్ సబ్ డివిజన్ అధికారి నుంచి వ్రాతపూర్వకంగా అనుమతి తీసుకోవాలన్నారు. ఆయా సభలు, సమావేశాలకు తగిన బందోబస్తు చర్యలు చేపట్టేందుకు వీలుగా దీన్ని అమలులోకి తెచ్చామని ఎస్పీ వివరించారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం వచ్చినా ప్రజలు ఆందోళనలను శాంతియుతంగా నిర్వహించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసినట్లయితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలోని రాజకీయ పార్టీలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, జాయింట్ యాక్షన్ కమిటీలు, పోలీసులతో సహకరించి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ఆచూకీ తెలిపితే రూ. లక్ష
కడప అర్బన్, న్యూస్‌లైన్ : ఓబులవారిపల్లె మండలం జీవీ పురంలో వరుస హత్యలకు పాల్పడుతున్న తోట వెంకట రమణ ఆచూకీ తెలిపితే రూ. లక్ష అందజేస్తామని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. అలాగే బెంగుళూరులోని ఏటీఎంలో మహిళపై దాడి చేసిన వ్యక్తి ఆచూకీ తెలిపితే రూ. 2 లక్షల రివార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. నేరాలకు పాల్పడుతున్న వీరి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచి అరెస్టు చేసిన తర్వాత రివార్డులను అందజేస్తామన్నారు.తమ నెంబరు 94407 96900 లేదా రాజంపేట డీఎస్పీ, రైల్వేకోడూరు సీఐల ఫోన్ నెంబర్లకు స్వయంగాగానీ, ఫోన్ ద్వారాగానీ సమాచారం ఇవ్వచ్చన్నారు. -
'తెలంగాణపై ముందుకెళ్తే మెరుపు సమ్మె'
కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు వెల్లడించారు. శుక్రవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రక్రియపై ముందుకెళ్తే మెరుపు సమ్మె చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పారు. అవసరమైతే చట్టాన్ని కూడా చేతుల్లోకి తీసుకునేందుకు వెనకాడబోమని ఆయన పునరుద్ఘాటించారు. విభజనను నిరసిస్తు 66 రోజులు సమ్మె చేశామని ఆయన గుర్తు చశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన యూపీఏ సర్కార్‌ను డిమాండ్ చేశారు. విభజనతో సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతున్న ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులను తమ పదవులను వీడకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర మంత్రుల అనుసరిస్తున్న వైఖరి సిగ్గు చేటు అని అశోక్ బాబు వ్యాఖ్యానించారు. -
టీటీడీలో ఇన్‌చార్జ్‌ల పాలన
=సీవీఎస్వో నియామకానికి ఐపీఎస్‌ల కొరత! =కుంభకోణాల నేపథ్యంలో ముందుకు రాని అధికారులు సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ఇన్‌చార్జ్‌ల పాలన కొనసాగుతోంది. పదవీ విరమణ చేసినా, అధికారులు బదిలీ అయినా, కొత్త వారిని నియమించడంలో జాప్యం జరుగుతోంది. టీటీడీలోని పలు శాఖల్లో ఇన్‌చార్జీలే పెత్తనం చేస్త్తున్నారు. ఆ కోవలోకి టీటీడీ భద్రతా వ్యవస్థా చేరింది. టీటీడీ చీఫ్‌విజిలెన్స్, సెక్యూరిటీ అధికారి (సీవీఎస్వో)గా గత నెల 28వ తేదీ వరకు బాధ్యతలు చేపట్టిన అశోక్ కుమార్‌ను వైఎస్సార్ జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా పనిచేస్తున్న చంద్రశేఖర్‌ను నియమించారు. అశోక్‌కుమార్ గత నెల 29వ తేదీన వైఎస్సార్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అయితే చంద్రశేఖర్ సీవీఎస్వోగా ఇంత వరకు బాధ్యతలు చేపట్టలేదు. దీనిపై టీటీడీ పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా బాధ్యతలు చేపట్టేందుకు ఆయన అంగీకరించలేదు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని నేషనల్ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్నట్టు తెలిసింది. దీంతో ఇన్చార్జ్ సీవీఎస్వోగా అశోక్‌కుమారే ఉండాల్సిందిగా టీటీడీ కోరినట్టు తెలిసింది. ఆయన ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాలో ఎక్కువ కాలం గడుపుతున్నారు. బోర్డు సమావేశాలు, అత్యవసర సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే టీటీడీ కార్యాలయానికి వస్తున్నారు. పూర్తి స్థాయి అధికారి ఉంటేనే తిరుమలలో భద్రత అంతంత మాత్రం. ఇక ఇన్చార్జ్ పాలనలో ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఆయన టీటీడీ బాధ్యతలను పూర్తి స్థాయిలో చూసేందుకు వీలు కాని పక్షంలో ఉన్నారని తెలిసింది. ఇప్పటికే తిరుమల ఆలయానికి తీవ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు హెచ్చరికలు అందిన విషయం తెలిసిందే. పుత్తూరులో తీవ్రవాదులు పట్టుబడడం, తిరుపతి పరిసరాల్లో తీవ్రవాదుల జాడలు కనిపించడం లాంటి అంశాలు ఇటీవల జరిగాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి భద్రతా అధికారి లేకపోవడం తిరుమల ఎంతవరకు సురక్షితమని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీలోని విద్యాశాఖాధికారి, డెప్యూటీ ఈవో సర్వీసెస్, వేద విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్, ఎస్వీ డెయిరీ ఫారం, అన్నమాచార్య ప్రాజెక్టుతో పాటు ఇంకా పలు విభాగాలు ఇన్చార్జీల ఆధీనంలోనే ఉన్నాయి. ఇదిలావుండగా టీటీడీ సీవీఎస్వో బాధ్యతలు చేపట్టేందుకు చంద్రశేఖర్ ఎందుకు ముందుకు రావడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తన పిల్లల విద్యకు సంబంధించి హైదరాబాద్ వదిలి రాలేనని ఆయన అంటున్నట్లు సమాచారం. టీటీడీలో అధికారిగా పదవి చేపట్టడానికి అధికారులు ఉత్సాహం చూపిస్తారు. ఇటీవల కుంభకోణాల నేపథ్యంలో ఇక్కడ పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇన్చార్జి సీవీఎస్వోగా ఉన్న అశోక్ కుమార్ కూడా టీటీడీ నుంచి ఎప్పుడు బయట పడతామా.. అని తొందరపడినట్లు తెలిసింది. టీటీడీ వ్యవస్థలో 60 కోట్ల రూపాయలతో సీసీ టీవీల ఏర్పాటు చేయడాన్నీ జాప్యం చేస్తూ వచ్చినట్లు తెలిసింది. అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకోవడంలో వివాదాలు లాంటి అంశాలు సమస్యాత్మకంగా ఆయన భావించినట్టు సమాచారం. దీంతో ఇది వరకు ఉన్న సీవీఎస్వో తన పదవిని ముళ్లకంచెలా భావించారని సమాచారం. దీనిపై ఇన్చార్జి సీవీఎస్వో అశోక్ కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ బదిలీ అయినందున తాను రిలీవ్ అయ్యి వచ్చేశానని, అయితే టీటీడీ కోరిక మేరకు ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నానని అన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి ఎందుకు రాలేదో తనకు తెలియదని చెప్పారు. కడప నుంచి ఏ విధంగా టీటీడీ సీవీఎస్వోగా బాధ్యతలు చేపడుతున్నారనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరించారు. -
ఎక్సైజ్ కొరడా
మల్దకల్, న్యూస్‌లైన్: ఎక్సైజ్‌శాఖ అధికారులు కొరడా ఝళిపించారు. మంగళవారం సాయంత్రం మండలంలోని నీలిపల్లి గ్రామంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి సుమారు రూ.10 లక్షలు విలువ చేసే సీహెచ్(క్లోరల్ హైడ్రేట్)ను పట్టుకున్నారు. గద్వాల పట్టణానికి చెందిన అన్వర్ అనే రైతుకు నీలిపల్లి గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో పత్తిపంటను సాగుచేస్తున్నాడు. పొలంలో వేసిన షెడ్డులో సీహెచ్‌ను భద్రపర్చి కల్లు వ్యాపారులకు సరఫరా చేస్తున్నాడు. అయిజ, మల్దకల్, గట్టు, అలంపూర్ తదితర ప్రాంతాల్లోని కల్లు వ్యాపారులకు ఈ సీహెచ్‌ను సరఫరా చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. షెడ్డులో ఉంచిన 20.40 క్వింటాళ్ల సీహెచ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ మొత్తం 70 బస్తాలు ఉన్నాయి. ఒక్కోబస్తాలో 30 కేజీల సీహెచ్ ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.10 లక్షలకు పైగానే ఉంటుందని అధికారులు వివరించారు. దీనిద్వారా కృత్రిమకల్లును తయారుచేస్తారని పేర్కొన్నారు. దాడిచేసిన సమయంలో పొలం వద్ద ఉన్న రైతు అన్వర్ పరారైనట్లు తెలిపారు. అన్వర్‌పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ అశోక్‌కుమార్ చెప్పారు. ఈ దాడుల్లో ఏఎస్ వివేక్, ఎక్సైజ్ సీఐలు నాగార్జునరెడ్డి, రాధాకృష్ణ, రాకేష్, మధుబాబు, ఎస్ఐ జ్ఞానయ్య, సిబ్బంది నాతానియల్, రాజేందర్, వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ బాబు పాల్గొన్నారు. నాటుసారా బట్టీలపై మెరుపుదాడులు గోపాల్పేట, న్యూస్‌లైన్: మండలంలోని పలు గిరిజన తండాల్లో మంగళవారం ఎక్సైజ్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్ఐ షాకీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎక్సైజ్, ఈఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి భారీగా బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నాటుసారా ను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. అ ముడాలకుంట తండాలో దాడి చేసి నాలుగువేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి 90 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే ధర్మ్యాతండాలో 18 వందల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసంచేసి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చెన్నూరు తం డాలో 700 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసంచేసి ఒకరిపై కేసునమోదుచేశారు. ఏదులలో 630 నాటుసారా ప్యాకెట్లను స్వా ధీనం చేసుకుని ముగ్గురి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ హెడ్‌కానిస్టేబుల్ కృష్ణుడు, సిబ్బంది భగవంత్‌గౌడ్, బాల య్య, సాధిక్, వసురాం, ఈఎస్పీఎఫ్ సిబ్బంది ప్రకా ష్, వీరకుమార్, సత్యనారాయణగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, దూద్యనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
చాటింగ్ గీతాలు
అభినయ్‌కృష్ణ, సునీత జంటగా.. టీఎస్ కమల్ దర్శకత్వంలో లావణ్య చంద్రశేఖర్ నిర్మిస్తున్న చిత్రం ‘చాటింగ్’. జయంత్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నాగబాబు ఆడియో సీడీని ఆవిష్కరించి, మంత్రి రుద్రరాజు పద్మరాజుకి అందించారు. సినిమా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. హీరో అభినయ్ ఈ సినిమాకోసం ఎన్నో సాహసాలు చేశాడని దర్శకుడు అభినందించారు. ఇంకా నిర్మాత అశోక్‌కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
శాంతి భద్రతలు పరిరక్షిస్తా..
కడప అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ సంక్షేమానికి చర్యలు తీసుకుంటానని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం 4.20 గంటలకు ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వెళ్తున్న ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హా తన బాధ్యతలను అశోక్‌కుమార్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. తొలుత జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.తాను ఎస్పీగా మొదట కడపకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు, ఇతర సమస్యలపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్తానన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీసుల సంక్షేమానికి ఎస్పీ మనీశ్‌కుమార్ సిన్హా తీసుకున్న చర్యలను కొనసాగిస్తానని చెప్పారు. కానిస్టేబుల్ స్థాయినుంచి అధికారి స్థాయి వరకు అహర్నిశలు పనిచేస్తూ తమ ఆరోగ్యాన్ని సక్రమంగా పట్టించుకునే పరిస్థితుల్లో ఉండరన్నారు. అందువల్ల పోలీసు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని తెలిపారు. సమావేశంలో ఎస్పీతోపాటు ఓఎస్డీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎస్పీ అశోక్ ప్రస్థానం : సివిల్ ఇంజినీరుగా కోర్సు పూర్తి చేశాక స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో పీజీ చేశారు. 1996లో డీఎస్పీగా పోలీసు శాఖలో అడుగు పెట్టారు. తొలుత నల్గొండలో శిక్షణ పూర్తి చేసుకుని అనంతపురంలో డీఎస్పీగా నాలుగేళ్లపాటు విధులు నిర్వహించారు. అనంతరం అక్కడే ఇన్చార్జ్ ఏఎస్పీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఓఎస్టీగా పనిచేశారు. తర్వాత కౌంటర్ ఇంటెలిజెన్సీ విభాగంలో ఏఎస్పీగా పనిచేశారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు సూడాన్‌లో ఏడాది పాటు పనిచేశారు. తర్వాత హైదరాబాదులో ట్రాఫిక్ డీసీపీగా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే ఐపీఎస్ హోదా వచ్చింది. తిరుమల-తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఏడాదిన్నరపాటు విధులు నిర్వహించారు. తర్వాత జిల్లా ఎస్పీగా బదిలీపై వచ్చారు. -
భక్తజనోత్సవం
= భక్తజన సందోహం నడుమ శ్రీవారి గరుడసేవ = కిక్కిరిసిన గ్యాలరీలు = మార్మోగిన గోవింద నామస్మరణ = ఆలయం చుట్టూ భారీ భద్రత = సీసీ కెమెరాలతో నిఘా = వీఐపీలు, భక్తుల మధ్య తోపులాట లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణల మధ్య తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి తనకు అత్యంత ఇష్టమైన గరుడ వాహనంపై బుధవారం నాలుగు మాడ వీధుల్లో విహరించా రు. చిన్నపాటి తోపులాటలు మినహా వాహన సేవ ప్రశాంతంగానే ముగిసింది. సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పటికీ భక్తులు రెండు లక్షల మందికి పైగా హాజరయ్యారు. వాహన సేవల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నాలుగు వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. సాక్షి, తిరుమల: లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణ మధ్య తిరుమల శ్రీవేంకటేశ్వరుడు తనకు అత్యంత ఇష్టమైన గరుడ వాహనంపై బుధవారం నాలుగు మాడ వీధుల్లో విహరిం చారు. చిన్నపాటి తోపులాటలు మినహా వాహన సేవ ప్రశాంతంగా ముగిసింది. రాత్రి 7.50 గంటలకే వాహన సేవ గరుడ వాహన సేవను చూడడానికి ప్రతియేటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఈసారి సీమాంధ్రలో బంద్, ఉద్యోగుల సమ్మె ఉన్నప్పటికీ బుధవారం ఉదయం నుంచే భక్తుల రాక కనిపించింది. ఉదయం మోహినీ అవతారం ఊరేగింపులోనే నాలుగు మాడ వీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సాయంత్రం6 గంటలకు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న గ్యాలరీలు నిండిపోయాయి. వాహన సేవను రాత్రి 8 గంటలకే ప్రారంభించాలని టీటీడీ అధికారులు ముందుగా నిర్ణయించారు. 7.40 గంటలకే స్వామివారి ముందున్న తెరను తొలగించి జీయర్ స్వాములు, అర్చకులు, వీఐపీలకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి 7.50 గంటలకు వాహన సేవను ప్రారంభించారు. ఉత్సవమూర్తిని ప్రతి భక్తుడూ దర్శించుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సుమారు రెండు లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు టీటీడీ ప్రకటించింది. వీఐపీల హడావిడి వాహన సేవలో వీఐపీల హడావిడి, తోపులాట ఎక్కువగా కనిపించింది. పాలకమండలి, అధికారవర్గాలు సకుటుంబ సపరివార సమేతంగా తరలిరావడంతో వాహన సేవకు ముందు వీరే అధికంగా కనిపించారు. భక్తుల మధ్య తోపులాట శ్రీవారి గరుడ వాహన సేవలో భక్తుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. గ్యాలరీలో ఉంటూ ప్రశాంతంగా స్వామి వారిని దర్శించుకున్న భక్తులు తిరిగి వెళ్లేందుకు దారి తెలియక తికమకపడ్డారు. వీరికి సరైన మార్గం చూపించడంలో పోలీసులు విఫలమయ్యారు. మాడ వీధుల్లో భక్తుల మధ్య తోపులాట జరిగింది. పలువురు గాయపడ్డారు. భద్రత కట్టుదిట్టం టీటీడీ సీవీఎస్వో జీవీజీ.అశోక్‌కుమార్, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు, ఏఎస్పీ ఉమామహేశ్వర్ శర్మ స్వయంగా బందోబస్తును పర్యవేక్షించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి 4 వేల మంది పోలీసు సిబ్బందిని మోహరిం చారు. జనం కదలికలపై సీసీ కెమెరాలతో నిఘా వేశారు. మెటల్ డిటెక్టర్లు, వ్యక్తిగత తనిఖీ అనంతరమే భక్తులను మాడ వీధుల్లోకి అనుమతించారు. ముందు జాగ్రత్త చర్యగా బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, క్విక్ రియాక్షన్ టీంలను రంగంలోకి దించారు. వందలాది మంది పోలీ సులు మఫ్టీలో నిఘా వేశారు. ఆక్టోపస్ కమాండో సిబ్బంది కూడా అప్రమత్తంగా వ్యవహరించింది. భక్తులకు ప్రయాణ కష్టాలు సీమాంధ్ర బంద్ ప్రభావం వల్ల తిరుమలకు కేవలం 99 ఆర్టీసీ సర్వీసులు మాత్రమే నడిపారు. వాటికోసం ప్రయత్నించిన భక్తులు తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ ట్యాక్సీలు, జీపులపై ఆధారపడాల్సి వచ్చింది. తిరుపతి నుంచి తిరుమలకు రూ.150 నుంచి రూ.200 వరకు టికెట్టు వసూలు చేశారు. మిగిలిన వారు సొంత వాహనాల్లో తిరుమలకు చేరుకున్నారు. వాహనాల రద్దీ పెరగడంతో తిరుపతిలోని అలిపిరి వద్ద నామమాత్రంగా తనిఖీలు జరిగాయి. గరుడ సేవ వైభవంగా సాగింది: ఈవో, జేఈవో శ్రీవారి గరుడ వాహనసేవ అశేష జనం మధ్య వైభవంగా సాగిందని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు ప్రకటించారు. ఏ చిన్న సమస్యా లేకుండా ప్రతి భక్తుడూ వాహనాన్ని దర్శించుకునే భాగ్యం కల్పించామని వెల్లడించారు. భక్తులకు మంచినీరు, అన్నప్రసాదాలు అంద జేసినట్లు చెప్పారు. -
రాష్ట్రంపై ఐఏఎస్‌ల కినుక !
మూడేళ్లలో కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయిన 30 మంది ఐఏఎస్‌లు రాజకీయ అనిశ్చితి, అభద్రతా భావమే కారణం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై ఐఏఎస్ అధికారులు కినుక వహిస్తున్నారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా భారీ సంఖ్యలో కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నారు. గత మూడేళ్లలోనే రాష్ట్ర కేడర్‌కు చెందిన 30 మందికి పైగా ఐఏఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం, రాజకీయ క్రీడలో ఐఏఎస్‌లను పావులుగా వాడుకోవడమే దీనికి కారణమని మెజారిటీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు బనాయించడంలో భాగంగా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు ఐఏఎస్‌లను బాధ్యులను చేయడాన్ని వారు తీవ్రంగా తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉంటే అనవసరమైన వివాదాల్లో ఇరుక్కోవాల్సి వస్తుందనే భావనతోనే వారు రాష్ట్రం నుంచి తరలిపోతున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవంగల ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి స్థాయి అధికారులు కూడా రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోవడం గమనార్హం. గత మూడేళ్లలో శేషాద్రి, సందీప్‌కుమార్ సుల్తానియా, అశోక్‌కుమార్, అరవింద్‌కుమార్, సుమిత్రా దావ్రా, కాటమనేని భాస్కర్, చిత్రారామచంద్రన్, పుష్పా సుబ్రమణ్యం, రెడ్డి సుబ్రమణ్యం, ప్రవీణ్ ప్రకాశ్, కె.దమయంతి, శశాంక్ గోయల్, రజిత్ భార్గవ, వసుధా మిశ్రా, రాజీవ్ రంజన్ మిశ్రా, సతీష్ చంద్ర, అజయ్ త్రిపాఠి, నర్సింగరావు, దినేశ్ కుమార్, సి.బి.వెంకటరమణ, సత్యనారాయణ మహంతి, ఆర్.భట్టాచార్య, ఆర్.పి.వట్టల్, ఇంద్రజిత్ పాల్, జె.సత్యనారాయణ తదితరులు రాష్ట్రం వీడి కేంద్ర సర్వీసులకో, శిక్షణ పేరుతోనో వెళ్లిపోయారు. ఫలితంగా రాష్ట్రంలో విద్య, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, సంక్షేమం, రెవెన్యూ వంటి కీలక శాఖలకు అనుభవం గల ఐఏఎస్‌లు లేక డీలా పడ్డాయి. చివరికి ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న వినయ్‌కుమార్ కూడా కేంద్ర సర్వీసుకు వెళ్లిపోతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన రాష్ట్ర సర్వీసు నుంచి రిలీవ్ కానున్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి రాష్ట్రం వీడి కేంద్ర సర్వీసుకు వెళ్లిపోవడం ఆశ్చర్యమేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంతేకాదు.. రాష్ట్రం నుంచి అనేక విషయాల్లో లబ్ధిపొందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా రాష్ట్రానికి సేవలు అవƒ సరమైన సమయంలో కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నారు. మంచి పోస్టింగ్ దొరకనివారు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతుంటారని.. కానీ, రాష్ట్రంలో మంచి పోస్టింగ్‌లో ఉన్న ఐఏఎస్‌లు కూడా వెళ్లిపోవడం ఆశ్చర్యకరమని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రాష్ర్టంలో 300 మంది ఐఏఎస్ అధికారులున్నారు. వారందరూ కూడా ఆరు స్థాయిల్లో సీనియారిటీ ప్రకారం వివిధ శాఖలకు సేవలందిస్తారు. కానీ, ఇటీవల ఐఏఎస్‌ల్లో కూడా ఉత్తరాది, దక్షిణాది, స్థానిక అనే గ్రూపిజం పెరిగిపోతోందనే ఆరోపణలున్నాయి. పోస్టింగ్‌లు ఇచ్చే వారిని ప్రభావితం చేయగల స్థానంలో ఏ ప్రాంతం వారు ఉంటే... ఆ ప్రాంతం వారికి కీలక పోస్టింగ్‌లు ఇస్తున్నారనే వాదన ఇటీవల ఐఏఎస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. -
తగ్గిన మావోయిస్టుల ప్రభావం
గూడెం కొత్తవీధి, న్యూస్‌లైన్: ఏజెన్సీ ప్రాంతం లో మావోయిస్టుల ప్రభావం తగ్గుముఖం పట్టిందని చింతపల్లి డీఎస్పీ అశోక్‌కుమార్ తెలి పారు. జి.కె.వీధి పోలీస్‌స్టేషన్‌ను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీసు యంత్రాంగం కట్టుదిట్టంగా వ్యవ హరి స్తుండడంతో మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. గ్రామాల నుంచి మిలీషియా సభ్యులు, సానుభూతిపరులు లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకే కరపత్రాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లను రాజీనామా చేయాలంటూ హెచ్చరిస్తున్నారని చెప్పారు. ప్రజాప్రతినిధులకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని, మావోయిస్టులకు హెచ్చరికలకు భయపడాల్సిన పనిలేదన్నారు. మండలంలోని కుంకుంపూడి, దారాలబయలు, కొంగపాకలు గ్రామాలను దత్తత గ్రామాలుగా ఎంపిక చేసినట్టు తెలిపారు. ఆయా గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. రంగురాళ్ల క్వారీల్లో అటవీ, రెవెన్యూ, పోలీస్‌శాఖలు సంయుక్తంగా బేస్‌క్యాంపులు ఏర్పాటు చేసి పికెట్లు, 144 సెక్షన్ అమలు చేస్తామని తెలిపారు. రంగురాళ్ల వ్యాపారులపై ఇప్పటికే కేసులు నమోదు చేశామన్నారు. వ్యాపారులు పూర్తిగా రంగురాళ్ల తవ్వకాలు మానుకోవాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గిరిజన యువతీ యువకులకు విద్యతో పాటు క్రీడల్లో నైపుణ్యం కోసం ఆటల పోటీలు నిర్వహిస్తామన్నారు. జి.కె.వీధి పరిసర గ్రామాల ప్రజలతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు లో ఆయన మాట్లాడారు. ప్రజలు, పోలీసులు మమేకమైతే అన్నివిధాలా అభివృద్ధి సాధించగలమన్నారు. సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలపకుండా అభివృద్ధికి పాటుపడాలని కోరా రు. ఈ కార్యక్రమంలో సీఐ రామకృష్ణారావు, ఎస్ఐ విజయ్‌కుమార్, ట్రైనీ ఎస్ఐ అరుణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఒడిశాలో పేలిన మందుపాతర
సాలూరు(విజయనగరం), న్యూస్‌లైన్/కొరాపుట్(ఒడిశా): ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మంగళవారం మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతిచెందగా, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 161వ బీఎస్ఎఫ్ బెటాలియన్‌కు చెందిన 18 మంది జవాన్లు మల్కన్‌గిరి నుంచి విశాఖపట్నానికి మూడు వాహనాల్లో బయలుదేరారు. ఉదయం 9.30కు కొరాపుట్-సాలూరు జాతీయ రహదారి సమీపంలోని సకిరాయి గ్రామం దగ్గరకు వాహనాలు వచ్చాయి. మొదటి వాహనం అక్కడి క ల్వర్టు దాటింది. రెండో వాహనం దాటుతుండగా కల్వర్టు కింద అమర్చిన మందుపాతరను మావోయిస్టులు పేల్చారు. పేలుడు ధాటికి వాహనం తునాతునకలైంది. అందులోని జవాన్లలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తర్వాత మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు ఎన్కౌంటర్లు చింతూరు, న్యూస్‌లైన్:ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. లోండిగూడ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్టీఎఫ్, డీఎఫ్ బలగాలు సోమవారం సాయంత్రం సమీప అడవుల్లో కూంబింగ్ చేపడుతుండగా మర్దాపాల్ గ్రామం వద్ద మావోయిస్టులు తారసపడ్డారు. అప్పుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోలు మృతి చెందారు.