ఏజెన్సీ ప్రాంతం లో మావోయిస్టుల ప్రభావం తగ్గుముఖం పట్టిందని చింతపల్లి డీఎస్పీ అశోక్‌కుమార్ తెలి పారు. జి.కె.వీధి పోలీస్‌స్టేషన్‌ను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గూడెం కొత్తవీధి, న్యూస్‌లైన్: ఏజెన్సీ ప్రాంతం లో మావోయిస్టుల ప్రభావం తగ్గుముఖం పట్టిందని చింతపల్లి డీఎస్పీ అశోక్‌కుమార్ తెలి పారు. జి.కె.వీధి పోలీస్‌స్టేషన్‌ను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీసు యంత్రాంగం కట్టుదిట్టంగా వ్యవ హరి స్తుండడంతో మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. గ్రామాల నుంచి మిలీషియా సభ్యులు, సానుభూతిపరులు లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకే కరపత్రాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లను రాజీనామా చేయాలంటూ హెచ్చరిస్తున్నారని చెప్పారు. ప్రజాప్రతినిధులకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని, మావోయిస్టులకు హెచ్చరికలకు భయపడాల్సిన పనిలేదన్నారు. మండలంలోని కుంకుంపూడి, దారాలబయలు, కొంగపాకలు గ్రామాలను దత్తత గ్రామాలుగా ఎంపిక చేసినట్టు తెలిపారు. ఆయా గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
రంగురాళ్ల క్వారీల్లో అటవీ, రెవెన్యూ, పోలీస్‌శాఖలు సంయుక్తంగా బేస్‌క్యాంపులు ఏర్పాటు చేసి పికెట్లు, 144 సెక్షన్ అమలు చేస్తామని తెలిపారు. రంగురాళ్ల వ్యాపారులపై ఇప్పటికే కేసులు నమోదు చేశామన్నారు. వ్యాపారులు పూర్తిగా రంగురాళ్ల తవ్వకాలు మానుకోవాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గిరిజన యువతీ యువకులకు విద్యతో పాటు క్రీడల్లో నైపుణ్యం కోసం ఆటల పోటీలు నిర్వహిస్తామన్నారు.
జి.కె.వీధి పరిసర గ్రామాల ప్రజలతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు లో ఆయన మాట్లాడారు. ప్రజలు, పోలీసులు మమేకమైతే అన్నివిధాలా అభివృద్ధి సాధించగలమన్నారు. సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలపకుండా అభివృద్ధికి పాటుపడాలని కోరా రు. ఈ కార్యక్రమంలో సీఐ రామకృష్ణారావు, ఎస్‌ఐ విజయ్‌కుమార్, ట్రైనీ ఎస్‌ఐ అరుణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.