![Hyderabad Man Arrested In Chhattisgarh Over Supplying Blasting substances To Maoists - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/24/AAAA.jpg.webp?itok=UY8siAhd)
రాయ్‌పూర్ : మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తుండగా నక్కా వెంకట్‌రావు అనే వ్యక్తిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ వాసి అయిన వెంకట్‌రావు అర్బన్ నక్సలిజం వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాడని... అతడిని అరెస్టు చేయడం ద్వారా అర్బన్ నక్సల్స్ నెట్‌వర్క్‌ను బ్రేక్ చేశామని ఛత్తీస్‌గఢ్ ఐజీ ఎస్పీ సింగ్ తెలిపారు. ఎన్‌జీఆర్‌ఐలో ఉద్యోగం చేస్తున్న నక్కా వెంకట్‌రావు 2016, 2017లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశం అయినట్లు తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు నక్కా పనిచేశాడని ఐజీ వెల్లడించారు. కాగా వెంకట్‌రావు సోదరుడు పౌరహక్కుల సంఘం కార్యకర్తగా పనిచేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment