Maoist Activity
-
మావోయిస్టుల లేఖ.. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
రాయ్‌పూర్: మావోయిస్టులతో చర్చలకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ. ఈ క్రమంలో షరతులు లేకుండా చర్చలు తమ ప్రభుత్వ్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. స్పష్టమైన ప్రతిపాదనలతో మావోయిస్టులు ముందుకు రావాలని సూచించారు.మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదల చేసిన శాంతి చర్చల లేఖపై డిప్యూటీ సీఎం, హోం మంత్రి విజయ్ శర్మ స్పందించారు. ఈ సందర్బంగా విజయ్ శర్మ మాట్లాడుతూ.. మావోయిస్టులతో చర్చలకు ద్వారాలు తెరిచే ఉన్నాయి. వారితో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. రాష్ట్రంలో మావోయిస్టుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. షరతులు లేకుండా అర్థవంతమైన చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం.మావోయిస్టులు నిజంగా తిరిగి రావాలనుకుంటే వారు తమ ప్రతినిధులను, చర్చల నిబంధనలను స్పష్టం చేయాలి. ఎవరైనా చర్చించాలనుకుంటే భారత రాజ్యాంగం ప్రకారం నిర్ణయాలను అంగీకరించాలి. గతంలో మావోయిస్టుల కంచుకోటలుగా పేరొందిన 40 గ్రామాల్లో ఏడాదిన్నర కాలంలో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాం. మావోయిస్టులు చర్చల పట్ల సీరియస్‌గా ఉంటే చర్చల కోసం వారే స్వయంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాను. స్పష్టమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలి’ అని తెలిపారు. -
‘వంద మంది అమిత్ షాలు వచ్చినా ఉద్యమాలు ఆగవు’
సాక్షి, హన్మకొండ: ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టులను అంతం చేయలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ నాయకుడు చాడా వెంకట్‌రెడ్డి. ప్రజాకవి గద్దర్‌పై చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కమ్యూనిజం అంతం చేయడం ఎవరితరమూ కాదని చెప్పుకొచ్చారు.చాడా వెంకట్‌రెడ్డి తాజాగా హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టులను అణచివేయాలని చూస్తున్నారు. ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టులను అంతం చేయలేరు. కమ్యూనిజం అంతం చేయడం ఎవరితరం కాదు. నక్సలిజాన్ని సామాజిక, ఆర్థిక సమస్యగా చూడాలి. మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడాలి.గద్దర్‌కు అవార్డు ఇవ్వడం తప్పు అనేది సరైంది కాదు. గద్దర్‌పై చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. దేశాన్ని రాచరికం ఏలుతున్న రోజుల్లో కమ్యూనిజం పుట్టింది. భారత సంపూర్ణ స్వాతంత్య్రానికి పిలుపునిచ్చింది సీపీఐ పార్టీనే. ఎన్నో నిర్భంధాలను కమ్యూనిస్ట్ పార్టీ ఎదుర్కొంది. నవాళి కళ్యాణానికి బీజం వేసింది భారత కమ్యూనిస్టు పార్టీ. దీన్ని అంతం చేస్తామని కొందరు చెబుతున్నారు. కమ్యూనిజం అంతం చేయడం ఎవరితరమూ కాదు అంటూ కామెంట్స్ చేశారు.మరోవైపు.. తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మావోయిస్టులపై వరుస ఎన్కౌంటర్ల విషయమై స్పందించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ..‘వంద మంది అమిత్ షాలు వచ్చినా ఉద్యమాలు ఆగవు. ఎన్కౌంటర్ల వల్ల ఉద్యమాలకు చెక్ పెట్టే పరిస్థితి లేదు. ఇలాంటి ఎన్కౌంటర్లు గతంలో చాలా జరిగాయి.. ఉద్యమాలు మళ్ళీ మొదలు అయ్యాయి. ఎన్కౌంటర్ల వల్ల కొంతమంది మరణం మాత్రమే జరుగుతుంది. కొంత మందిని మాత్రమే చంపగలరు. ఉద్యమాన్ని ఆపలేరు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
దంతెవాడలో బలగాల ఆపరేషన్ సక్సెస్.. మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ!
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 31 మంది నక్సలైట్లు మృతిచెందారు. దాదాపు 48 గంటల పాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ కమాండర్లు కమలేశ్ అలియాస్ ఆర్కే, నీతి అలియాస్ ఊర్మిళ మరణించినట్లు సమాచారం.వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎన్కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు ఘటనా స్థలం నుంచి ఇప్పటివరకు 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీ ఎత్తున కూంబింగ్ కొనసాగుతోంది. దాదాపు 1,500 మంది భద్రత సిబ్బందితో 48 గంటలపాటు ఆపరేషన్ సాగినట్లు అధికారుల వెల్లడించారు. పొలాలు, చిత్తడి దారుల గుండా 10 కిలోమీటర్లు ప్రయాణించి, అక్కడినుంచి 12 కిలోమీటర్ల మేర కొండలు ఎక్కి ఎన్కౌంటర్ ప్రాంతానికి బలగాలలు చేరుకున్నాయి.ఇక, ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. ఎన్కౌంటర్లో మృతిచెందిన వారిలో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కమలేష్ అలియాస్ ఆర్కె, నీతి అలియాస్ ఊర్మిళ మరణించినట్లు సమాచారం. ఊర్మిళ బీజాపూర్ జిల్లా గంగలూరు ప్రాంతానికి చెందినవారు కాగా, కమలేశ్ ఏపీలోని విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.మరోవైపు.. ఎన్‌కౌంటర్‌పై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి స్పందించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం అంతమై శాంతి నెలకొంటుంది. మన బలగాలు గొప్ప విజయాన్ని సాధించాయి. 31 మంది నక్సల్స్‌ను హతమార్చారు. మన సైనికులు గత రికార్డును బద్దలు కొట్టారు. ఎన్కౌంటర్ విషయంలో మా సైనికులను అభినందిస్తున్నాము. వారి ధైర్యానికి వందనం. ఈ ఘటన మావోయిస్టులు అణిచివేతకు మార్గం చూపించింది అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘాల నేతలు స్పందించారు. మృతుల ఫొటోలు, వివరాలను పోలీసులు వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే, ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: బెంగాల్లో మరో దారుణం -
మాములోడు కాదు.. ఎస్ఐ డేంజర్ ప్లాన్ తెలిసి పోలీసు శాఖ అలర్ట్!
సాక్షి ప్రతినిధి, వరంగల్: మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపడుతుండగా.. అదేశాఖలో పనిచేసే ఓ అధికారి మావోయిస్టుల తరహాలో దళాన్ని ఏర్పాటు చేసేందుకు పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చింది. తాడ్వాయి అడవుల్లో ట్రయల్ కూడా నిర్వహించినట్లు సమాచారం. సదరు వ్యక్తులు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే.. వరంగల్‌లో ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపించి మావోయిస్టులు ఉన్నారనే భ్రమ కల్పించాలని పక్కా స్కెచ్ వేసినట్లు సమాచారం. ఈ కుట్ర వెనుక ములుగు జిల్లాలో పనిచేసే ఓ ఏఆర్ ఎస్ఐ కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. పకడ్బందీగా జరిగిన ఈ కుట్రకోణాన్ని పసిగట్టిన హైదరాబాద్‌లోని పోలీస్ నిఘా విభాగం.. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆధారాలతో కూడిన కొన్ని వివరాలు సేకరించినట్లు సమాచారం. ఈ మేరకు ములుగు పోలీస్ అధికారుల సహకారంతో రంగంలోకి దిగిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ బృందం.. సదరు ఏఆర్ ఎస్ఐతో పాటు మరో ఇద్దరిని రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. ఈ విచారణలో సాయుధ దళం ఏర్పాటుతోపాటు వరంగల్‌లో హెడ్‌కానిస్టేబుల్ హత్యకు సంబంధించిన వివరాలను సేకరించి.. సదరు హెడ్‌కానిస్టేబుల్‌ను సైతం అప్రమత్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలాఉండగా ఈ కుట్రకోణం వెనుక భారీ ప్రణాళిక దాగి ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. సాయుధ దళం ఏర్పాటు చేసి.. ఆ సభ్యులతో యాక్షన్లు చేయించి.. తిరిగి వారిని ఎన్కౌంటర్ పేరిట హతమార్చి పోలీస్‌శాఖలోనూ పేరు తెచ్చుకోవాలన్న మరో కోణం దాగి ఉన్నట్లు కూడా ప్రచారంలో ఉంది. వరంగల్‌లో హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపే యాక్షన్‌టీమ్ తనను కలిసేందుకు ములుగు ప్రాంతానికి వచ్చే క్రమంలో ఎన్కౌంటర్ చేయాలన్న కుట్ర పన్నినట్లు సమాచారం. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు.. ఇటు హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపి మావోయిస్టులు ఉన్నట్లు భ్రమలు కల్పించడంతోపాటు మరోవైపు ఎన్కౌంటర్ చేసి పోలీసు అధికారులు మెప్పు పొందవచ్చని భావించి ఈ కుట్రకు తెర లేపినట్లు సమాచారం. ముందే ఈ వివరాలన్నీ సేకరించి విచారిస్తున్న ప్రత్యేక నిఘా విభాగం.. వీటన్నింటిపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. -
ఆదిలాబాద్ జిల్లాలో హైటెన్షన్.. కొనసాగుతున్న పోలీసుల వేట
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. దీంతో జిల్లాలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు ప్రభాత్, భాస్కర్, వర్గీస్, రాము, అనిత సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. బోథ్ మండలంలోని కైలాస్ టేకిడి ప్రాంతంలో పోలీసు బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ కూంబింగ్‌లో మావోలకు సంబంధించిన గ్రెనేడ్ లభ్యమైంది. అయితే దీనిని పోలీసులు ధ్రువీకరించడం లేదు. గోప్యంగా ఉంచుతున్నారు. కానీ మావోల కోసం భారీగా బలగాలతో కూంబింగ్ కొనసాగిస్తున్నారు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: (పాండు నరేటి మృతిపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం) -
నెల్లూరులో ఎన్ఐఏ సోదాలు
నెల్లూరు(క్రైమ్): మావోయిస్టులకు నిధులు సమకూరుస్తున్న కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు శనివారం నెల్లూరు నగరంలో తనిఖీలు నిర్వహించారు. మావోలకు నిధులు సమకూరుస్తున్నారంటూ బిహార్‌లో ఇటీవల కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ శనివారం ఏకకాలంలో బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఏపీలో సోదాలు చేపట్టింది. అందులో భాగంగా శనివారం రాంజీనగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్న కాంట్రాక్టర్ పెంచలయ్యనాయుడి ఇంటికి శనివారం ఎన్ఐఏ అధికారులు చేరుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేసి మూడు గంటల పాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఈ సోదాల విషయాలు బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. గతేడాదీ నెల్లూరు అరవిందానగర్లోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. -
Maoist Encounter: ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి
సాక్షి, ఖమ్మం: తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతం దంతెవాడ జిల్లా మరోసారి కాల్పులతో ప్రతిధ్వనించింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. గొండెరాస్ అటవీప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని గొండెరాస్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, డీఆర్జీ జవాన్ల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. సెర్చ్ ఆపరేషన్‌లో ఘటనా స్థలం నుంచి ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టు హిద్మే కొహ్రామే ఏరియా కమిటీ సభ్యురాలు మల్లంజర్ ఏరియా కమిటీ, దర్భా డివిజన్. ఆమపై రూ. 5లక్షల రివార్డు ఉంది. పొజ్జె, సీఎన్ఎం ఇన్ఛార్జ్ మల్లెంజర్ ఏరియా కమిటీకి చెందిన నీల్లవాయ ఏరియా, దర్భ డివిజన్. ఈమెపై లక్ష రూపాయల రివార్డు ఉంది. సంఘటనా స్థలం నుంచ రైఫిళ్లు, మందుగుండు సామాగ్రి, కమ్యూనికేషన్ పరికరాలు, పేలుడు పదార్థాలు, క్యాంపింగ్ మెటీరియల్స్ మొదలైనవి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. తప్పించుకున్నవారిలో మావోయిస్టు అగ్రనేతలున్నారని సమాచారం. -
మావోయిస్టులపై ఐదు రాష్ట్రాల పోలీస్ శాఖల కన్ను..!
సాక్షి, హైదరాబాద్: వరుస ఎదురుదెబ్బలతో కుదేలవుతున్న మావోయిస్టు పార్టీని మరింత నియంత్రించేందుకు ఐదు రాష్ట్రాల పోలీస్ శాఖలు వ్యూహాత్మక కార్యాచరణ అమలు చేస్తున్నాయి. బేస్ క్యాంపులు దట్టమైన అటవీ ప్రాంతంలో ఎంత లోపలికి చేరుకుంటే మావోయిస్టుల నియంత్రణ అంత సులువుగా మారుతుందని కేంద్ర హోంశాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు ప్రతి 10 కిలోమీటర్లకు ఒకటి చొప్పున బేస్ క్యాంపులు ఏర్పాటు చేయగా.. తాజాగా 3 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తూ దట్టమైన అటవీ ప్రాంతాల్లోకి బలగాలు విస్తరించేలా పోలీస్ శాఖలు ఎత్తులు వేస్తున్నాయి. ఈ విధంగా ఒక్కో రాష్ట్రం నుంచి మొదలైన బేస్ క్యాంపుల ఏర్పాటు పొరుగు రాష్ట్రాల సరిహద్దులకు చేరుకుంది. సీఆర్పీఎఫ్, ఇతర సాయుధ బలగాలతో కూడిన బేస్ క్యాంపుల విస్తరణ దాదాపుగా పూర్తి కావస్తోందని పోలీస్ నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. మహారాష్ట్ర– ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో ఇప్పటికే 45కు పైగా బేస్ క్యాంపులు ఏర్పాటు చేసినట్టు తెలి పాయి. శనివారం జరిగిన భారీ ఎన్కౌంటర్ ఇంద్రావతి నది ఒడ్డున, మహారాష్ట్ర– ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే జరగడం బేస్ క్యాంపుల విస్తృతానికి ఉదాహరణగా పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో.. ప్రస్తుతం తెలంగాణలోని దుమ్ముగూడెం మండలంలోని గౌరారం, చర్ల మండలంలోని కలివేరు, తోగ్గుడెం, తిప్పాపురం, చలిమెలలో ప్రధాన బేస్ క్యాంపులుండగా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వైపునకు 8 ఔట్ పోస్టు బేస్ క్యాంపులను ఏర్పాటు చేసినట్టు తెలిసింది. అదే విధంగా మహారాష్ట్ర వైపు నుంచి ఛత్తీస్‌గఢ్– తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఏటపల్లి, కోర్చి, బామ్రా గఢ్, వడ్పా, ధనోరా, గడ్చిరోలి, వెంటాపుర్, సిరోంచా, ఐరి, చమరోచి, ఆర్మోరిల్లో బేస్ క్యాంపులు నడుస్తుండగా వీటికి తోడు మరో 12 ఔట్ పోస్టు బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఇక ఏపీలో ఎటపాక వద్ద ప్రధాన బేస్ క్యాంపు ఉన్నట్టు తెలిసింది. ఒడిశా–ఆంధ్రప్రదేశ్ మధ్య 6 ప్రధాన బేస్ క్యాంపులతో పాటు 8 ఔట్ పోస్టు క్యాంపులను ఏర్పాటు చేసినట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. దీనితో తెలంగాణ వైపునకు మావోయిస్టులు రాకుండా నియంత్రించడం సులభమైనట్టు రాష్ట్ర నిఘా వర్గాలు తెలిపాయి. అదే విధంగా మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి ఛత్తీస్‌గఢ్ రాయిపూర్ వరకు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు 18కి పైగా బేస్ క్యాంపులు రెండు రాష్ట్రాల సరిహద్దుల వరకు ఏర్పాటు చేసినట్టు తెలిసింది. దీని వల్ల ప్రతి వ్యక్తి కదలికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం సులభమైనట్టు పోలీస్ అధికారులు చెబుతున్నారు. అటు ఛత్తీస్‌గఢ్– ఒడిశా– ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోనూ 26కు పైగా బేస్ క్యాంపులు పూర్తి స్థాయిలో పటిష్టంగా పనిచేస్తున్నట్టు తెలిసింది. కోవర్టు ఆపరేషన్లతో దూకుడు! బేస్ క్యాంపుల ఏర్పాటుతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్రలోని మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న దట్టమైన అటవీ ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగాలు, ఆయా రాష్ట్రాల పోలీసులు పాగా వేసినట్టు తెలుస్తోంది. మూడేళ్ల ముందు వరకు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో సాగిన కూంబింగ్ అంతా ఒక ఎత్తు అయితే, తెలుగు రాష్ట్రాలు అవలంభించిన కోవర్టు, ఇన్ఫార్మర్ల వ్యవస్థను అందిపుచ్చుకుని చేసిన ఆపరేషన్లు మరో ఎత్తు అని ఆయా రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. మావో యిస్టు పార్టీకి నిత్యావసరాలతో పాటు ఆయుధాలు, మందులు, డబ్బులు.. ఇతరత్రా వస్తువులను తీసుకెళ్లే కొరియర్లను ఆయా రాష్ట్రాల పోలీస్ శాఖలు కోవర్టుగా మార్చుకున్నట్టు మావోయిస్టు పార్టీయే అనేక సార్లు ఆరోపించింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితిలో కొన్నిసార్లు భారీ స్థాయిలో దళ సభ్యులను కోల్పోవడంపై ప్లీనరీలో కూడా చర్చించింది. ఇలా కోవర్టు ఆపరేషన్లతో దూకుడు మీదున్న సీఆర్పీఎఫ్– పోలీస్ బలగాలు బేస్ క్యాంపుల నుంచి అన్ని రాష్ట్రాల సరిహద్దులను జల్లెడ పడుతూ భారీ స్థాయిలో మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలేలా చేస్తున్నాయి. మరోవైపు సీనియర్ల మృతి, వ్యూహాత్మక నిర్ణయాల లోటు, కొంతమంది లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి తీరని నష్టం చేకూర్చాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీలక నేతల మృతి వెనుకా.. ఛత్తీస్‌గఢ్, ఏవోబీతో పాటు గెరిల్లా స్క్వాడ్లలో కీలకంగా వ్యవహరించే కొంతమంది నేతల మృతి వెనుక కూడా కోవర్టు ఆపరేషన్లు ఉన్నట్టు మావోయిస్టు పార్టీ అనుమానిస్తోంది. తినే ఆహారంలో విషం కలిపినట్టు కూడా అనుమానిస్తున్నట్టు తెలిసింది. చివరకు శనివారం నాటి ఎన్కౌంటర్లో చనిపోయిన అగ్రనేత మిలింద్ గురించిన కీలక సమాచారం కూడా కోవర్టుల ద్వారానే పోలీస్ బలగాలను సేకరించినట్టు తెలిసింది. శనివారం గడ్చిరోలిలోని గ్యారపట్టిలో జరిగిన ఎన్కౌంటర్లో మిలింద్ సహా 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
మావోయిస్టు విస్తరణకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మావోయిస్టు పార్టీ విస్తరణను గడ్చిరోలి భారీ ఎన్కౌంటర్ పెద్ద దెబ్బతీసింది. దక్షిణాదిలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కుదేలైన పార్టీని ఆదుకునేందుకు కేంద్ర కమిటీ నియమించిన విస్తరణ కమిటీ హెడ్, కేంద్ర కమిటీ సభ్యుడు దిలీప్ తేల్తుంబ్డే అలియాస్ మిలింద్ ఈ ఎన్కౌంటర్ మరణించి నట్లు గడ్చిరోలి పోలీసులు స్పష్టంచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ ఏడాది సెప్టెంబర్ 26న ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమావేశం జరిగింది. ఆ తర్వాత ఇదే అతి పెద్ద తొలి ఎన్కౌంటర్. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ భారీ స్థాయిలో నియామకంపై దృష్టి పెట్టాయి. అయితే ఆర్కే అనారోగ్యం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా ఫలితం రాలేదు. అంతేకాదు తెలంగాణలో నియామకానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కమిటీ ప్రత్యక్ష కార్యకలాపాలు పెద్దగా లేకపోవడం ప్రతికూల ఫలితాలే ఇచ్చాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ విస్తరణ హెడ్‌గా ఉన్న మిలింద్ నేరుగా రంగంలోకి దిగారు. నాగ్‌పూర్‌తో పాటు కొన్ని ప్రాంతాలు తిరిగి నియామక ప్రక్రియపై అనుసరించాల్సి వ్యూహాలను రచించినట్లు తెలిసింది. అయితే డయాబెటిక్ సమస్యతో పాటు స్పాండలైటిస్ సమస్య, నడుస్తూనే సృహ తప్పిపడిపోయే వ్యాధితో మిలింద్ బాధపడుతున్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. రిక్రూట్మెంట్తో పాటు కమిటీలను బలోపేతం చేసే దిశగా గడ్చిరోలి కమిటీతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కోర్చి పరిధిలోని మర్దిన్‌తోలా అటవుల్లో 48మందితో మిలింద్ సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. కోవర్టుల ద్వారా ఇది తెలుసుకున్న పోలీసులు, సీఆర్పీఎఫ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిసింది. ఈ భేటీలో మిలింద్ కీలక సూచనలు చేసే సమయంలోనే తుపాకుల మోత ప్రారంభమైనట్లు సమాచారం. నలుగురు తెలుగువారు.. గడ్చిరోలి కమిటీ భేటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు నేతలు నలుగురు, ఒడిశాకు చెందిన ముగ్గురు ఉన్నట్లు రాష్ట్ర నిఘా వర్గాల సమాచారం. మృతదేహాలను గుర్తిస్తే గానీ, ఆ నలుగురు ఎవరన్నది చెప్పలేమని వారు పేర్కొంటున్నారు. కాగా, కేంద్ర కమిటీలోని 21 మందిలో అనారోగ్య కారణాలతో ముగ్గురు మృతిచెందగా, మరో నలుగురు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరో ముగ్గురు గడిచిన ఏడాదిలో లొంగిపోయారు. దీనితో పార్టీలో యాక్టివ్‌గా ఉన్న వారి సంఖ్య సగానికిపైగా తగ్గింది. వరుస ఎదురుదెబ్బలు... దేశంలో మావోయిస్టు పార్టీకి ప్రస్తుతం అత్యంత గడ్డు రోజులు నడుస్తున్నాయి. కరోనా మొదటివేవ్, లాక్డౌన్ కాలంలో అనూహ్యంగా తెలంగాణలో ప్రాబల్యం చాటుకునే యత్నం చేసిన మావోలు.. రెండోవేవ్‌లో తమను తాము వైరస్ బారినుంచి, భద్రతా బలగాల నుంచి కాపాడుకులేకపోతున్నారు. పెరిగిన టెక్నాలజీ, దండకారణ్యంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వరుసగా మావోయిస్టు అగ్రనేతలను కోల్పోవడంతో పార్టీకి ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు దీపక్, డీవీసీ కార్యదర్శి సుఖ్లాల్ ఉన్నట్లు తెలిసింది. వీరిలో దీపక్‌పై రూ.25 లక్షల రివార్డు ఉంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు జార్ఖండ్‌లో జరిగిన ఓ ప్రమాదంలో కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందాడు. ఈ రెండు ఘటనలు మావోయిస్టు పార్టీకి ఊహించని విధంగా నష్టం కలిగించాయి. -
ఈశాన్యానికి లాంగ్‌మార్చ్?
సాక్షి, హైదరాబాద్: కీలక నేతల మరణాలు, లొంగుబాట్ల నేపథ్యంలో ఉనికి కోసం మావోయిస్టు పార్టీ వ్యూహం మారుస్తోందా? కేడర్‌ను కాపాడుకు నేందుకు ఈశాన్య రాష్ట్రాలకు ‘మార్చ్’ చేస్తోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కొన్నాళ్ల పాటు ఛత్తీస్‌గఢ్, ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతాలను వదిలేయాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమబెంగాల్ ద్వారా నాగాలాండ్ చేరువ వ్వాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. కార్యకలాపాల నిర్వహణకు ఏమాత్రం అను కూలంగా లేని వాతావరణం కావడంతో ఉన్న నేత లను, కేడర్‌ను కాపాడుకునే పనిలో మావోయిస్టు పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఏవోబీలో ఉన్న ఆరు కమిటీలను రెండు కమిటీలుగా, ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న 4 కమిటీలను రెండు కమిటీలుగా మార్చేసిన మావో యిస్టు పార్టీ.. కేడర్‌ను కాపాడే పనిలో నిమగ్న మైంది. ఆర్కే మరణం, హిడ్మా ఆరోగ్య పరిస్థితి, పెద్దగా కార్యకలాపాలు లేని తెలంగాణ కమిటీ.. ఇలా అన్ని కమి టీలు దీనావస్థలో ఉండటంతో కేవలం ఆత్మరక్షణ కోసమే కార్యాచరణ రూపొందిం చుకున్నట్టు తెలిసింది. బలంగా ఉన్న అబూజ్మడ్ (ఛత్తీస్‌గఢ్)ను సైతం వదిలి వెళ్లక తప్పదనే కేంద్ర కమిటీ సూచనతో ఆత్మరక్షణ చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. ఎందుకీ పరిస్థితి.. ఛత్తీస్‌గఢ్, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీలపై బలగాలు రెండేళ్లుగా ప్రత్యేక దృష్టి సారించాయి. కేంద్ర హోంశాఖతోపాటు ఆయా రాష్ట్రాల పోలీస్ విభాగాలు సంయుక్తంగా ప్రతీ వ్యక్తి కదలికలపై నిఘా పెట్టాయి. ఆయా ప్రాంతాల్లో బేస్ క్యాంపులను పెంచుకొని ప్రత్యేక శాటిలైట్ ద్వారా కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. దీంతో మావోయిస్టు పార్టీకి చేరాల్సిన ఆహార పదార్థాలు, నిత్యావసరాలు, మందులు, డబ్బులు, ఆయుధాలు.. ఇలా ప్రతీ వ్యవహారంసైనా కదలికలను బేస్ క్యాంపుల ద్వారా పసిగట్టి నియంత్రించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండానే ఇన్ఫార్మర్లు/కొరియర్లుగా వ్యవహరిస్తున్న వారిని నియంత్రించి సక్సెస్ అయ్యారు. మావో అగ్రనేత ఆర్కే మరణం కూడా ఇందులోభాగమే అని ఆ పార్టీ బహిరంగంగానే ఆరోపించింది. మందులు, ఇతర నిత్యావసరాలను అడ్డుకొని ఆరోగ్యం క్షీణించేలా చేశారని ఆర్కే భార్య కూడా ఆరోపించింది. వారసంతలపైనా నిఘా అబూజ్మడ్తోపాటు ఏవోబీలోని వారసంతలపైనా బలగాలు నిఘా పటిష్టం చేశాయి. ప్రతీ కుటుంబం ప్రతీ వారం కొనుగోలు చేసే వస్తువులపై నిఘా పెట్టింది. మునుపటి వారం కన్నా ఎక్కువ కొనుగోలు చేస్తే ఇంట్లో ఏదైనా శుభకార్యముందా? లేక మావోయిస్టు పార్టీకి అందించేందుకు కొనుగోలు చేశారా అన్నంత లోతుగా ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నాయి. సర్జరీ ఆధారిత మందులు, పెయిన్ కిల్లర్లు, కరోనా మెడిసిన్స్.. ఇలా ఆయా ఏరియాల్లోని మందుల షాపుల్లో కొనుగోలు చేసే వ్యక్తులను గుర్తించి కౌన్సెలింగ్ సైతం చేసింది. కొనుగోలుదారుల కదలికలను పసిగట్టి కొరియర్లను తమవైపు తిప్పుకోవడంలో కేంద్ర బలగాలతోపాటు రాష్ట్ర బలగాలు సక్సెస్ అయినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టంచేశాయి. దీనివల్లే అనారోగ్యం బారిన పడిన సీనియర్ నేతల మరణాలు జరిగినట్టు చెప్తున్నాయి. ఇదేకాకుండా రెండేళ్ల నుంచి జరిగిన రాష్ట్ర, కేంద్ర కమిటీ కీలక నేతల లొంగుబాట్లు ఆ పార్టీని మరింత అఘాతంలోకి నెట్టాయని భావిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర కమిటీలు అవలంబించే విధానాలు, వ్యూహాత్మక చర్యలను పసిగట్టి నిలువరించడంలో బలగాలు సఫలీకృతమైనట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కొన్నాళ్లపాటు ఈ రెండు ప్రాంతాలను వదిలి వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడినట్టు బలంగా వినిపిస్తోంది. ఎనిమిది నెలలుగా ఒక్క నియామకం లేదు... ఒకవైపు కీలక నేతల మరణాలు, మరోవైపు లొంగుబాట్లతో అతలాకుతలం అవుతున్న మావోయిస్టు పార్టీని కొత్త రక్తం లేక మరింత చీకట్లోకి నెట్టింది. ఛత్తీస్‌గఢ్, ఏవోబీ, తెలంగాణ, మహారాష్ట్రలో కొత్త నియామకాలు ఏమాత్రం జరగలేదు. ఎనిమిది నెలలుగా అంటే ఈ ఏడాదిలో దాదాపుగా రిక్రూట్మెంట్ లేకుండా చేయడంలో పోలీసులు పైచేయి సాధించారు. నియామకాలు జరగకపోవడంపై ఒక్క ఉదాహరణ మావోయిస్టు పార్టీ నుంచే వినిపిస్తోంది. ఆర్కే తీవ్ర అనారోగ్యానికి గురైన సందర్భంలో ఒక ప్లాటూన్ కేవలం ఆయన రక్షణ కోసమే పనిచేసింది. మంచానికే పరిమితమైన ఆర్కేను కంటికి రెప్పలా కాపాడేందుకు ఆయన చుట్టూ ఉన్న ప్లాటూన్ రక్షణ దళానికి కాపలాగా లోకల్ గెరిల్లా టీమ్ రక్షణ కవచంగా నిలిచింది. ఇలా మూడు నెలల పాటు ఎలాంటి కార్యకలాపాలు లేకుండా ఏవోబీ జోనల్ కమిటీ ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆర్కే కీలక సూచనలు చేసినట్టు తెలిసింది. కేవలం తన కోసం రెండు వ్యవస్థలు కార్యకలాపాలు చేయకుండా ఉండిపోవడం పార్టీకి నష్టాన్ని కల్గిస్తుందని, కొంతమంది మినహా మిగతా బృందాలు కార్యకలాపాల్లో నిమగ్నమవ్వాలని సూచించారని తెలిసింది. నియామకాలను విస్తృతం చేయడంపై దృష్టి పెట్టాలని పదేపదే చెప్పినట్టు సమాచారం. కొద్దిరోజులు దూరంగా..! ప్రస్తుత కీలక పరిణామాలతో ఈ రెండు ప్రాంతాల నుంచి కొద్దిరోజులపాటు దూరంగా ఉండటం మంచిదని, అందుకు ఈశాన్య రాష్ట్రాలకు వలస వెళ్లకతప్పదని కేంద్ర కమిటీ భావిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. ఛత్తీస్‌గఢ్, ఏవోబీలో ఉన్న కీలక నేతలు, ముఖ్య కేడర్‌ను పశ్చిమబెంగాల్ మీదుగా నాగాలాండ్‌కు చేరుకోవాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చినట్టు పార్టీలోనూ చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీ ఉనికికే ప్రమాదం అన్న పరిస్థితుల్లో ఈ ప్రాంతాల్లో కార్యకలాపాలకు బ్రేక్ ఇచ్చి నాగాలాండ్ రావాల్సినట్టుగా ఆదేశాలున్నట్టు కూడా చర్చ జరుగుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో కార్యకలాపాల విస్తృతికి అక్కడి నుంచే పనిచేయాలన్న ఆలోచనలో కేంద్ర కమిటీ ఉన్నట్టు తెలుస్తోంది. -
మావోయిస్టుల బెదిరింపులు: కట్టుబట్టలతో నడిరోడ్డుపై..
ముంచంగిపుట్టు: ఏజెన్సీలో గిరిజనుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. మావోయిస్టులు, పోలీసుల మధ్య వారు నలిగిపోతున్నారు. పోలీసు ఇన్ఫార్మర్ అన్న అనుమానం వస్తే చాలు మావోయిస్టులు కక్ష కడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్టే హతం చేస్తున్నారు. వారి వేధింపులు భరించలేక ప్రాణభయంతో గిరిజనులు సొంత ఊరిని వదిలి వేరే చోట తలదాచుకుంటున్నారు. ఇలా రంగబయలు, లక్ష్మీపురం, భూసిపుట్టు పంచాయతీలకు చెందిన 13 గ్రామాల నుంచి 41 కుటుంబాలు ముంచంగిపుట్టు మండల కేంద్రానికి వచ్చి బిక్కుబిక్కుమని బతుకీడుస్తున్నాయి. తాజాగా రంగబయలు పంచాయతీ గోబరపడా గ్రామంలో గత నెల 30వ తేదీన జరిగిన ఘటన మన్యవాసుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఏకంగా 10మంది సాయుధ మావోయిస్టులు, 30మంది మిలీíÙయా సభ్యులు ఇంటిని చుట్టుముట్టడంతో వంతాల రామచందర్ ఇంటి వెనక నుంచి అడవిలోకి పారిపోయాడు. దీంతో మావోయిస్టులు తనను నిర్దాక్షిణ్యంగా కొట్టారని, తన ఇంటిని, వస్తువులను ధ్వంసం చేశారని రామచందర్ భార్య సొంబరి తెలిపింది. పోలీసు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్న రామచందర్‌ను హతమారుస్తామని, తక్షణమే ఊరు నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఆమె ముగ్గురు పిల్లలతో రాత్రి పూట అడవిలో నడుచుకొని తనకు తెలిసిన వారి దగ్గర మూడు రోజులు తలదాచుకుంది. భర్త ఆచూకీ తెలియక ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్లో శనివారం సాయంత్రం ఆమె ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు సమీప గ్రామాల్లో వెతికి రామచందర్‌ను గుర్తించి సొంబరికి అప్పజెప్పారు. నిరసన వెల్లువ మావోయిస్టుల చర్యకు నిరసనగా బాధిత కుటుంబంతోపాటు గిరిజనులు భారీ సంఖ్యంలో ఆదివారం ముంచంగిపుట్టులో నిరసనకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని స్థానిక వెటర్నరీ హాస్పిటల్ నుంచి పోలీసు స్టేషన్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. “మావోయిస్టులారా.. ఇంకా ఎంతమందిని మా గ్రామాల నుంచి తరిమేస్తారు.. గిరిజన ఆడపిల్లలపై దాడులు చేస్తూ మా బాగు కోసం అంటే ఎలా నమ్మేది.. మా అడవి నుంచి వెళ్తారా, తరిమి కొట్టాలా.. అంటూ నినాదాలు చేశారు. మా గ్రామాలపై మీ పెత్తనం ఏమిటి... మీ స్వార్ధంతో మా బతుకులు పాడు చేయొద్దు.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు పలువురు మాట్లాడుతూ సొంత గ్రామాల్లో సుఖంగా బతుకుతున్న తమపై లేనిపోని నిందలు వేసి గ్రామాల నుంచి తరిమేశారని, తమ కళ్ల ముందే భర్తలను దారుణంగా చంపేశారని ఆవేదన చెందారు. తమ ఇళ్లు, భూములు వదులుకొని కూలి పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతకాలం తమను వేధిస్తారని ప్రశ్నించారు. తమ పిల్లల భవిష్యత్‌ను అంధకారంలో పెట్టవద్దని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబాలు, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. చేతిలో సామాన్ల మూటలతో దీనంగా ఉన్న రామచందర్ కుటుంబం పరిస్థితి చూపరులకు ఆవేదన కలిగించింది. -
రేపు ఏవోబీ బంద్
సీలేరు/పాడేరు: విశాఖ ఏజెన్సీలోని ఆంధ్రా– ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఉద్రిక్త పరిసితులు నెలకొన్నాయి. ఇటీవల కొయ్యూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందుకు నిరసనగా మావోయిస్టులు జూలై 1న ఏవోబీ బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ అంతటా బాంబ్, డాగ్ స్క్వాడ్లతో ముమ్మరంగా తనిఖీలు చేస్తూ అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టుల కదలికల కోసం సమాచారం సేకరిస్తున్నారు. బంద్ నేపథ్యంలో మావోయిస్టులు దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వ ఆస్తులకు భద్రత కల్పిస్తున్నారు. హిట్‌లిస్టులో ఉన్న నేతలకు నోటీసులు అందించారు. బంద్‌ను భగ్నం చేసేందుకు అడవుల్లో కూంబింగ్‌కు బలగాలు చేరుకున్నాయి. కాగా.. ఈ బంద్ ఏవోబీకి మాత్రమే పరిమితమని ఓఎస్డీ సతీష్‌కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. కాగా, విశాఖ ఏజెన్సీలో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రష్మీ శుక్లా, ఆ శాఖ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. జవాన్లంతా నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. -
గడ్డం మధుకర్‌ను పోలీసులే హత్య చేశారు: సమత
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ అలియాస్ శోభారాయ్‌ని పోలీసులు హత్య చేశారని మంగళవారం ఆ పార్టీ దక్షిణ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత ఆరోపించారు. అనారోగ్యం కారణంగా చికిత్స కోసం వెళ్లిన శోభారాయ్‌ని జూన్ 1న స్పెషల్ బ్రాంచి పోలీసులు అరెస్టు చేశారని, ఈ విషయాన్ని పోలీసులే ప్రకటించారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పి, ఆఖరికి 6వ తేదీన మరణించారని మీడియాకు ప్రకటన ఇచ్చారని ఆరోపించారు. వాస్తవానికి మధుకర్‌ను జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు చికిత్స అందించకుండా తీవ్రంగా హింసించారని ఆరోపించారు. 15 రోజుల కింద పీఎల్జీఏ ప్లటూన్ కమాండర్ గంగాల్‌ను కూడా ఇదే తరహాలో హత్య చేశారని తెలిపారు. పోలీసు అధికారులు తమ చేతికి చిక్కినవారిని హత్య చేస్తూనే కరోనాను సాకుగా చూపుతూ సరెండర్ కావాలని, సరెండర్ అయిన వారికి మెరుగైన వైద్య సౌకర్యం అందిస్తామని ప్రలోభపెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాల అబద్ధపు ప్రచారాన్ని ఏ మాత్రం నమ్మవద్దని సూచించారు. హాని తలపెట్టం, చికిత్స అందిస్తాం ప్రస్తుతం మావోయిస్టు దళాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. వారి కోసం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో మందులను సేకరిస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. కరోనా పాజిటివ్ ఉన్న సభ్యులెవరైనా లొంగిపోవాలని కోరుతున్నాం. వారికి ఎలాంటి హానీ తలపెట్టం. కావాల్సిన చికిత్స అందజేస్తాం. – అభిషేక్, దంతెవాడ ఎస్పీ చదవండి: కరోనా చికిత్స కోసం వచ్చి.. పోలీసులకు చిక్కాడు! -
కాల్పుల విరమణ దిశగా మావోలు?
సాక్షి, హైదరాబాద్: అడవిలో కరోనా కలకలం పుట్టిస్తోంది. ఇంతకాలం ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఉండి పోరాడిన మావోయిస్టులను మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఓ వైపు తమ కోసం దండకారణ్యంలో భద్రతా బలగాల వేట కొనసాగుతుండగా, మరోవైపు కంటికి కనిపించని వైరస్ దళంలో ఒక్కొక్కరిని బలి తీసుకుంటోంది. ఈ వ్యాధి తీవ్రత నేపథ్యంలో కొంతకాలం కాల్పుల విరమణ చేయాలన్న అంశం మావోయిస్టు పార్టీలో చర్చకు వచ్చిందని, కరోనా బారినపడ్డ పలువురు మావోలు ఈ దిశగా ఆలోచిస్తున్నారని సమాచారం. అయితే, దీనిపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు మాత్రం బేషరతుగా లొంగిపోతే మంచి వైద్యం అందిస్తామని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన దండకారణ్య స్పెషల్ జోన్ డివిజినల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ అలియాస్ మోహన్ అలియాస్ శోబ్రాయ్ పోస్ట్ కోవిడ్ లక్షణాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో మిగిలిన వారి ఆరోగ్యంపై ఆందోళన మొదలైంది. కరోనా బారినపడ్డ మధుకర్‌ను జూన్ 2న ఛత్తీస్‌గఢ్ నుంచి హన్మకొండకు వస్తుండగా వరంగల్ పోలీసులు పట్టుకుని చికిత్స అందించారు. తీవ్రమైన డయేరియా, కరోనా కారణంగా ఆయన శరీరంలో అనేక మార్పులు వచ్చాయని వాటి కారణంగానే మరణించినట్లు వైద్యులు చెప్పారని వరంగల్ సీపీ తరుణ్‌జోషి ‘సాక్షి’కి వెల్లడించారు. తనతోపాటు కరోనాబారిన పడ్డ మరో 12 మంది సీనియర్ల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉందని మధుకర్ పోలీసులకు చెప్పాడు. లోపల ఉండలేరు, బయటికి రాలేరు.. ఆందోళనకర పరిస్థితి ఉన్న ఆ 12 మంది మావోయిస్టులు పార్టీలో చాలా సీనియర్లు. వారంతా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ సమయంలో వారిని కోవిడ్ చుట్టుముట్టడంతో శారీరక సమస్యలు రెట్టింపయ్యాయి. కొరియర్ల సాయంతో తెలంగాణ నుంచి మందులు సేకరించినా, ఛత్తీస్‌గఢ్‌లో గ్రామస్తుల రూపంలో వ్యాక్సిన్ వేయించుకున్నా.. అది కింద కేడర్‌కే వీలవుతుంది. సీనియర్ల తలలపై రివార్డు ఉన్న నేపథ్యంలో వారు బయటికి వచ్చే పరిస్థితి లేదు. బయటికి వచ్చి చికిత్స చేయించుకుందామనుకున్నా.. మావోయిస్టు పార్టీ అనుమతించడం లేదు. ఆందోళనకరంగా ఉన్న 12 మంది వీరే.. 1. కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, 2. తిప్పరి తిరుతి ఆలియాస్ దేవుజీ, 3.యాప నారాయణ అలియాస్ హరిభూషణ్, 4. బడే చొక్కారావు అలియాస్ దామోదర్, 5. కటకం రాజిరెడ్డి అలియాస్ ధర్మన్న, 6. కట్టా రాంచందర్ రెడ్డి అలియాస్ వికల్స్, 7. ములా దేవేందర్ రెడ్డి అలియాస్ మాస దడ, 8. కున్‌కటి వెంకటయ్య అలియాస్ వికాస్, 9. ముచ్చకి ఉజల్ అలి యాస్ రఘు, 10. కొడి మంజుల అలియాస్ నిర్మల, 11. పూసం పద్మ 12. కాకర్ల సునీత అలియాస్ బుర్రా. మరణాలకు కారణాలివే.. దండకారణ్యంలో సంచరించే మావోల్లో వ్యాపిస్తోన్న కరోనా స్ట్రెయిన్ చాలా ప్రమాదకరమైనదని సమాచారం. అయితే అది ఏంటన్నది ఇంతవరకూ గుర్తించలేదు. దళంలో ఆస్తమా, బీపీ, షుగర్, గుండె జబ్బులు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వారిలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. మహారాష్ట్ర, తెలంగాణలో లాక్డౌన్ కారణంగా కొరియర్లు, సానుభూతిపరుల నుంచి మందులు సకాలంలో అందడం లేదు. దళంలో కరోనా పాజిటివ్ ఉన్నవారిలో కొందరికి మాత్రలతో వ్యాధి అదుపులోకి రావడంలేదు. అది తీవ్రరూపం దాల్చి ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది. వేసవి కావడంతో అడవుల్లో తాగునీటి కొరత ఏర్పడింది. డెంగీ, మలేరియా, డయేరియా లక్షణాలకు.. కరోనా లక్షణాలకు పెద్దగా తేడా లేకపోవడంతో వ్యాధి నిర్ధారణలో జాప్యం జరుగుతోంది. తాజాగా మధుకర్ కూడా డయేరియాతో బాధపడుతూ మరణించడం గమనార్హం. చదవండి: జూలై నుంచి కాళేశ్వరం ఎత్తిపోత! -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్: మహిళా మావోయిస్టు మృతి
దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌లో కాల్పుల మోత మోగింది. దంతెవాడ జిల్లా గుమల్నార్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందారు. ఘటనాస్థలంలో 2 కిలోల పేలుడు పదార్ధాలు, 2 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం 6.30 గంటలకు గీదాం పోలీసు స్టేషన్ పరిధిలో జిల్లా రిజర్వ్ గార్డు( డీఆర్జీ) పోలీసుల బృందం నక్సల్స్ ఏరివేత ఆపరేషన్‌ను చేపట్టినట్లు పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ పల్లవ తెలిపారు. దీంతో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన మావోయిస్టు వైకో పెక్కో(24) అని పోలీసులు గుర్తించారు. ఈ ఎన్కౌంటర్ ఘటన రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 400 కిలో మిటర్ల దూరంలో చోటు చేసుకుంది. చదవండి: భూవివాదం.. యువకుడిని కొట్టి చంపిన దుండగులు -
ఆంధ్రాలో మావోలకు ఎర్ర జెండా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు ఉద్యమ విస్తరణకు ఎర్ర జెండా పడింది. గత రెండేళ్లుగా గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉద్యమ విస్తరణపై తీవ్ర ప్రభావం చూపించాయి. ప్రభుత్వ పథకాలతో ఆర్థికంగా బలపడుతున్న గిరిజనులు సామాజిక చైతన్యంతో మావోయిస్టుల దరికి చేరడం లేదు. ప్రధానంగా ఆంధ్రా–ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లో రిక్రూట్మెంట్ నిలిచిపోవడం, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఉద్యమ పరిధి తగ్గిపోయింది. ఏవోబీలోని మావోయిస్టు పార్టీ దళాల్లో చేరేందుకు స్థానిక ఆదివాసీ యువత ఆసక్తి చూపడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులపై స్థానిక ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో మావోయిస్టులు తిరిగే వ్యూహాత్మక ఉద్యమ ప్రాంతాలు కుచించుకుపోతున్నాయి. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా రోడ్లు, సెల్ టవర్ల నిర్మాణంతో మైదాన ప్రాంతాలకు రాకపోకలు పెరగడంతో గిరిజనులు చైతన్యవంతులవుతున్నారు. ఏజెన్సీలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ గ్రామ స్థాయి సంఘాలు.. ఆదివాసీ విప్లవ రైతు కూలీ సంఘాలు (ఏవీఆర్‌సీఎస్), ఆదివాసీ విప్లవ మహిళా సంఘాలు (ఏవీఎంఎస్), విప్లవ ప్రజా కమిటీలు (ఆర్పీసీ), మిలీషియా కమిటీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల ఆదివాసీ ప్రజల్లో పోలీసులు, ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరి పెరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు మారుమూల ప్రాంతాలకు సైతం చేరడంతో మావోయిస్టులకు గిరిజనులు దూరమవుతున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కుచించుకుపోతున్న కమిటీలు.. ఏవోబీ ప్రాంతంలో ఏపీ నుంచి మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్, ఒడిశా వైపు విస్తరించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కటాఫ్ ఏరియాను ప్రస్తుతం మావోయిస్టు అగ్రనేతలు అక్కిరాజు హరగోపాల్ (ఆర్కే), వివేక్‌లు పర్యవేక్షిస్తున్నారు. ఏవోబీలో రెండేళ్ల క్రితం మావోయిస్టులకు చెందిన ఎనిమిది ఏరియా కమిటీలు ఉంటే ఇప్పుడవి నాలుగుకు పరిమితమయ్యాయి. వాటిలో కలిమెల, నారాయణపట్నం, నందాపూర్, కాఫీదళం ఏరియా కమిటీలు కనుమరుగయ్యాయి. గాలికొండ, పెద్దబయలు, గుమ్మ, బోయపెరుగువాడ ఏరియా కమిటీలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఏవోబీలో రెండు డివిజన్ కమిటీలు పూర్తిగా కనుమరుగయ్యాయి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) కంపెనీలు రెండు ఉండగా ఇప్పుడు ఒక్కటి మాత్రమే మిగిలింది. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి ఎనిమిది ఎదురు కాల్పులు జరగ్గా ఒక డివిజన్ కమిటీ సభ్యుడు, ఒక ఏరియా కమిటీ సభ్యుడితోపాటు మరో ఆరుగురు హతమయ్యారు. ఒక సెంట్రల్ జోన్ కమిటీ సభ్యుడు, ఒక డివిజన్ కమిటీ సభ్యుడు, ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు, ఇద్దరు పార్టీ సభ్యులు కలిపి మొత్తం ఆరుగురు అరెస్టు అయ్యారు. మొత్తం 31 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో స్టేట్ కమిటీకి చెందిన 11 మంది, ఏవోబీ ఎస్‌జెడ్‌సీకి చెందిన 20 మంది ఉన్నారు. -
వైద్య సిబ్బందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
సాక్షి, చర్ల: సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ముగ్గురు వైద్య సిబ్బందిని కిడ్నాప్ చేశారు. గంగుళూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కామకనార్ గ్రామంలో గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు మాస్టర్ ట్రైనర్ శారద వచ్చారు. ఈ క్రమంలో గురువారం రాత్రి హెల్త్ వర్కర్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మావోయిస్టులు అక్కడికి వచ్చారు. శారద, మరో ఇద్దరు హెల్త్ వర్కర్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఎస్పీ కమలోచన్ కాశ్యప్ ధ్రువీకరించారు. కాగా, వైద్య సిబ్బంది కిడ్నాప్‌తో బీజాపూర్‌లో కలకలం రేగింది. మావోయిస్టులను అరెస్టు చేయలేదు చర్ల: మావోయిస్టులను అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని బస్తర్ రేంజ్ ఐజీ సౌందర్‌రాజ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎదురుకాల్పుల తర్వాత కొందరు గ్రామస్తులు పోలీసులతో కలసి బేస్ క్యాంపు వరకు వచ్చారని, ఆ తర్వాత వారందరినీ వెంటనే తిరిగి వారి ఇళ్లకు పంపించామని తెలిపారు. ఎటువంటి ఆధారం లేకుండా ఇటువంటి తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. చదవండి: రాకేశ్వర్ సింగ్ విడుదల అంత ఆషామాషీగా జరగలేదు -
గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్
-
భారీ ఎన్కౌంటర్: ఐదుగురు మావోయిస్టులు మృతి
ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఖురుకేడ తాలుక కొబ్రామెండ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలి జిల్లా ఎస్పీ తెలిపారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని చెప్పారు. పోలీసులు అదనపు బలగాలతో కూంబీంగ్ ఆపరేషన్ చేపట్టారని, తప్పించుకున్న వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. నక్సల్స్‌ను మొత్తం ఏరివేసేవరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. చదవండి: హోటల్లోకి దూసుకెళ్లిన ట్రక్కు: ఎనిమిది మంది దుర్మరణం -
అడవిలో అన్నలకు అనారోగ్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించకుండా కొంతకాలంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలు మావోయిస్టులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ను ఆసరాగా చేసుకుని తిరిగి నెట్వర్క్ ను విస్తరిద్దామన్న ఆలోచనతో రాష్ట్రంలోకి అడుగుపెట్టిన నక్సల్స్‌కు పోలీసుల ప్రతి వ్యూహంతో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్ర అడవుల్లో పోలీసులు నిరంతరం కూంబింగ్ చేపడుతూ మావోయిస్టులను తిరిగి ఛత్తీస్‌గఢ్ వైపు తరుముతున్నారు. దీంతో అన్నలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ముఖ్యంగా కొంతకాలంగా మావోయిస్టుల్లో చాలామంది అనారోగ్యం బారినపడ్డారని తెలిసింది. లాక్డౌన్ కాలంలో చందాల వసూళ్లు, రిక్రూట్మెంట్, మందులు, ఇతర నిత్యావసరాలు సమకూర్చుకున్నారు. కానీ, పోలీసులు రాష్ట్రంలోకి వచ్చిన మావోయిస్టులను తిరిగి ఛత్తీస్‌గఢ్‌కు తరిమికొట్టే ఆపరేషన్ ప్రారంభించడంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో గాలింపు, నిరంతర కూంబింగ్, నదీపరీవాహక ప్రాంతాలపై నిఘా చర్యలతో మావోయిస్టు కొరియర్ వ్యవస్థ స్తంభించింది. లాక్డౌన్ అనంతరం జరిగిన 11 ఎన్కౌంటర్లలో, 11 మంది మరణించారు. 135 మంది లొంగిపోయారు. వీరిలో ఇద్దరు రాష్ట్ర సెక్రటరీలు, నలుగురు జిల్లా కమిటీ, నలుగురు ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. దీంతో మైదాన ప్రాంతాలకు వచ్చి మందులు, నిత్యావసరాలను అడవుల్లోకి తీసుకెళ్లే కొరియర్ వ్యవస్థకు విఘాతం కలిగింది. ఫలితంగా సకాలంలో మందులు అందక, చిన్న జ్వరాలు, రోగాలు అనారోగ్యానికి దారితీస్తున్నాయి. అగ్రనేతలు రంగంలోకి దిగినా.. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, బడే చొక్కారావు అలియాస్ భాస్కర్, అగ్రనేత హరిభూషణ్ సెంట్రల్ కమిటీ ఆదేశాలతో రాష్ట్రంలో లాక్డౌన్ తరువాత పలు ప్రాంతా ల్లో సంచరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రిక్రూట్మెంట్ కోసం తీవ్రంగా శ్రమించినా అనుకున్న మేరకు సఫలీకృతం కాలేకపోయారు. వీరిలో హరిభూషణ్ సంచారంపై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ, అడెల్లు భాస్కర్ రెండు సార్లు, ద్వితీయ శ్రేణి నాయకుడు కంకణాల రాజిరెడ్డి ఒకసారి పోలీసులకు తారసపడ్డారు. వీరిద్దరూ పోలీసుల కాల్పుల్లో త్రుటిలో తప్పించుకున్నారు. ఎలా తెలిసిందంటే... మావోయిస్టు పార్టీ సభ్యులు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ లేఖ ద్వారా వెల్లడైంది. ‘భిక్షపతి అలియాస్ విజేందర్ 2018లో దళంలో చేరాడు. ఏటూరునాగారం–మహదేవ్పూర్ ఏరియా కమిటీలో పనిచేశాడు. కొంతకాలం క్రితం అనారోగ్యం బారినపడ్డాడు. పోలీసుల అష్టదిగ్బంధనం కారణంగా చికిత్స అందకపోవడంతో ఈనెల 18వ తేదీన మరణించాడు’ అని గురువారం విడుదల చేసిన లేఖలో జగన్ ఆరోపించారు. ఈ లేఖ వెలుగులోకి రావడంతో మావోయిస్టు పార్టీ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నారని, చికిత్స తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం వెలుగుచూసింది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో పారాసిటమాల్ టాబ్లెట్లు కొనుగోలు చేసేవారిపై పోలీసులు దృష్టి సారించారు. మావోయిస్టులు అప్పుడు కొనుగోలు చేసిన మందులు జనవరి నాటికి దాదాపుగా అయిపోయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఫలితంగా టాబ్లెట్లు దొరక్క.. బయటకు వచ్చే అవకాశం లేక మావోయిస్టులు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సమాచారం. భిక్షపతి ఇంటి వద్ద విలపిస్తున్న తల్లిదండ్రులు,(ఇన్సెట్) భిక్షపతి (ఫైల్) మా కొడుకు తిరిగొస్తాడనుకున్నాం చిట్యాల: అజ్ఞాతంలోకి వెళ్లిన తమ కుమారుడు భిక్షపతి తిరిగి వస్తాడనుకుంటే కానరాని లోకానికి వెళ్లిపోయాడని ఆయన తల్లిదండ్రులు సమ్మక్క–ముత్తయ్య కన్నీటిపర్యంతమవుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన మ్యాదరి సమ్మక్క–ముత్తయ్య దంపతులకు నలుగురు సంతానం. పెద్దకుమారుడు భిక్షపతి డిగ్రీ చదివాడు. 2018లో ఉద్యమంలో చేరాడు. చదవండి: సెల్యూట్ పోలీస్.. 7 నిమిషాల్లో రక్షించారు కేసీఆర్ కాళ్లు బరాబర్ మొక్కుతా: మంత్రి -
మావోయిస్టు పార్టీ: పట్టుకోసం ప్రయత్నాలు!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ అనుబంధ పీఎల్జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) ఏర్పాటై 20 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఏటా నిర్వహించే వారోత్సవాలకు పార్టీ నాయకత్వం సిద్ధమవుతోంది. డిసెంబర్ 2 నుంచి 8 వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. 2000లో సీపీఐ (ఎంఎల్), పీపుల్స్‌వార్ తదితర విప్లవ పార్టీలన్నీ కలసి ఒకే గూటికిందకొచ్చి సీపీఐ మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఇలా కలసిపోయిన అన్ని పార్టీల్లోని సాయుధ దళాలన్నిటిని కలిపి పీఎల్‌జీఏగా ఏర్పాటు చేశారు. ఇటీవల తెలంగాణలోని ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వరుసగా చోటుచేసుకున్న ఐదు ఎన్కౌంటర్లలో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడం, కొత్తవారిని చేర్చుకోవడానికి పీఎల్జీఏ వారోత్సవాలను తెలంగాణ జిల్లాల్లో నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. గత జూలైలో తెలంగాణలో కొత్తగా రాష్ట్ర కమిటీతోపాటు 12 డివిజన్, ఏరియా కమిటీలు వేశాక వారోత్సవాలు జరుగుతుండటంతో రిక్రూట్మెంట్లపై మావోయిస్టు పార్టీ గట్టిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొత్త కమిటీలన్నీ చురుగ్గా పని చేస్తున్నాయి. పార్టీ అగ్రనేతలు సైతం ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ సైతం ఏవోబీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆయా రాష్ట్రాలు, కేంద్ర బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల ఎస్పీలు ఆయా జిల్లాల్లోని అన్ని పోలీస్స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఏజె న్సీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాలు నిరంతరం నిఘా పెట్టి తనిఖీలు చేస్తున్నాయి. మావోయిస్టు పార్టీ కొరియర్లు, సానుభూతిపరులపై కూడా మరింత నిఘా పెట్టారు. రాష్ట్రంలోనూ హత్యలు గత అక్టోబర్ 10న ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధాపురంలో టీఆర్ఎస్ నాయకుడు మడూరి భీమేశ్వరరావును మావోలు హతమార్చారు. అలాగే అక్టోబర్ 26న ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన నాయకులపు ఈశ్వర్ అనే వ్యక్తిని మావోయిస్టులు పోలీసు ఇన్ఫార్మర్ అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో హతమార్చారు. అలాగే 2019, జూలై 8న చర్ల మండలం బెస్తకొత్తూరు టీఆర్ఎస్ ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావును అపహరించిన మావోయిస్టులు అదేనెల 12వ తేదీన హత్య చేశారు. పట్టుకోసం ప్రయత్నాలు.. మూడేళ్లుగా మావోయిస్టులు సరిహద్దు ఏజెన్సీలో తిరిగి పట్టు సాధించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పలుచోట్ల భారీగా మందుపాతరలు, ప్రెషర్‌బాంబులు అమర్చారు. మరోవైపు మావోల యాక్షన్ టీమ్‌లు పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి. పోలీసు బలగాలతో ఎదురుకాల్పులు నిత్యకృత్యమయ్యాయి. మరో పక్క ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీ ప్రజా కోర్టులు ఏర్పాటు చేసి తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పలువురిని హతమార్చింది. గత నెలలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లోని రెండు గ్రామాలకు చెందిన 25 మందిని అపహరించిన మావోలు ప్రజా కోర్టులు ఏర్పాటు చేసి వారిని హతమార్చారు. -
ఏవోబీలో భారీ మావోయిస్ట్ డంప్ స్వాధీనం
భీమారం: ఆంధ్రప్రదేశ్- ఒడిశా సరిహద్దులోని స్వాభిమాన్ అంచల్‌లోని పేపర్‌మెట్ల పోలీసులు భీమారం రిజర్వ్ ఫారెస్ట్‌లో మావోయిస్టుల భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు.. భీమారం అటవీ సమీపంలోని గుణమాముడి గ్రామ సమీపంలో బుధవారం భద్రతా బలగాలు నక్సల్స్ కోసం ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలో మావోయిస్టులకు పోలీసులు తారపడడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. సంఘటనా స్థలం నుంచి నక్సల్స్ తప్పించుకున్నారు. గురువారం సంఘటనా స్థలంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. పేలుడుకి వినియోగించే ఐఈడీలు, 7.62 మిమీ ఎస్ఎల్ఆర్ లైవ్ రౌండ్లు 11, నాలుగు 7.62 మిమీ ఏకే రౌండ్లు, ఒక 5.56 మిమీ ఇన్సాస్ రౌండ్లు, ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్, 32 డిటోనేటర్లు, ఒక ఫ్లాష్ కెమెరా, రేడియో, 11 కిట్ బ్యాగులు, మూడు మావోయిస్టు యూనిఫాంలు, విప్లవ సాహిత్యంతో పాటు రోజు వారి అవసరాలకు వినియోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: మావోయిస్ట్ గడ్డపై తిరుగుబాటు) పోలీసులే లక్ష్యంగా దాడులకు దిగి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇంతకు ముందు సోమవారం భద్రతా దళాలు స్వాభిమాన్ అంచల్‌లోని జోడాంబో పోలీస్‌స్టేషన్ పరిదిలోని గురాసేటు, బీజింగ్, జంప్లూర్, పర్లుబంధ గ్రామాల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు. -
ములుగు జిల్లాలో ఎన్కౌంటర్
ములుగు: ములుగు జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మంగపేట మండలం నరసింహసాగర్ సమీపంలో ఉన్న ముసలమ్మగుట్ట, తిమ్మాపూర్ పరిధి కొప్పుగుట్ట మధ్య మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్ దళాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరు పక్షాలమధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ పాటిల్ ప్రకటన విడుదల చేశారు. వారిని మణుగూరు ఏరియా దళ సభ్యులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరిలో దళకమాండర్ సుధీర్ అలియాస్ రాము ఉన్నాడు. ఈ ఘటనతో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా శనివారం ఏటూరునాగారం సబ్‌డివిజన్ పోలీసులు వెంకటాపురం(కె) మండలంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో మిలీషియా సభ్యుడు మిడియం చిన్న లక్ష్మయ్యను అరెస్టు చేశారు. అతని నుంచి సేకరించిన సమాచారం మేరకు మావోయిస్టుల స్థావరాన్ని గుర్తించి దాడి చేసినట్లు తెలుస్తోంది. -
రెండవ సారి ఏజెన్సీ ప్రాంతాల్లో తెలంగాణ డీజీపీ పర్యటన
-
మావోయిస్టులకు ఎదురు దెబ్బ.. కామేష్ అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టులకు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలోని గాలికొండ ఏరియా కమిటీ సభ్యుడు గమ్మెల కామేష్ అలియాస్ హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గాలికొండ ఏరియా కమిటీలో హరి కీలకంగా వ్యవహరించేవారు. దీంతో హరిపై 50కి పైగా కేసులు నమోదై ఉన్నాయి. అదే విధంగా అతనిపై రూ. 4లక్షల రివార్డును కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మాజీ మావోయిస్టు తాంబేలు లంబయ్య హత్య కేసులో హరి ప్రధాన నిందితుడు. హరి అరెస్ట్ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు మాట్లాడుతూ.. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుతాయని పేర్కొన్నారు. ముగిసిన వారోత్సవాలు ఖమ్మం(చర్ల): మావోయిస్టు వారోత్సవాలు, బంద్ పిలుపుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో సుమారు రెండు వారాల పాటు ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగింది. వారోత్సవాలు ముగియడంతో కూంబింగ్ ఆపరేషన్‌ను ముగించుకొని బలగాలు వెనుదిరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణాకు చెందిన గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు పలు ధపాలుగా దండకారణ్యంలోకి వెళ్లాయి. మావోయిస్టుల చర్యలను కట్టడి చేసేందుకు బలగాలు రేయింబవళ్లు తీవ్రంగా శ్రమించాయి. వారోత్సవాలు ముగిసినందున అడవులను విడిచి బలగాలు వస్తున్నాయనే సమాచారంతో సరిహద్దు ప్రజలు ఊపిరి పీల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒక పక్క మావోయిస్టులు, మరో పక్క బలగాలతో సరిహద్దులోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలు.. తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని మారుమూల గ్రామాలు అట్టుడికాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి సరిహద్దులో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గుండాల మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు, చర్ల మండలంలోని పూసుగుప్ప సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు, చెన్నాపురం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందడంతో పాటు పోలీసులు మందు పాతరలను వెలికి తీయడం.. వాటిని నిర్వీర్యం చేయడం, మావోయిస్టులు మందుపాతరలను ఏర్పాటు చేసి రహదార్లను పేల్చివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీస్ బలగాల్లో గ్రేహౌండ్స్ విభాగానికి చెందిన ఓ సబ్ఇన్స్పెక్టర్ తుపాకీ మిస్‌ఫైర్ అయ్యి.. తూటాలు శరీరంలోకి దూసుకెళ్లి మృతి చెందాడు. -
మావోయిస్టుల జాడ కోసం డ్రోన్ నిఘా!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ కోసం పోలీసు బలగాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. ఆయుధాలు, బలగాల పరంగా చూస్తే ఇప్పటివరకు మావోయిస్టులపై పోలీసులదే పైచేయిగా నిలిచింది. అయితే సరిహద్దు దండకారణ్యంలో సంచరించడంలో మాత్రం మావోయిస్టులకే ఎక్కువగా పట్టు ఉంది. దీంతో ఆ సమస్యను అధిగమించేందుకు పోలీసులు అత్యాధునిక డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. తద్వారా మావోయిస్టుల కదలికలపై వీడియోలు, ఫొటోలు తీస్తున్నారు. ఇలా సేకరించిన సమాచారాన్ని కేంద్ర, సరిహద్దు రాష్ట్రాల బలగాలకు సైతం ఇస్తున్నారు. దీంతో సరిహద్దు రాష్ట్రాల పోలీసులు పక్కాగా సమన్వయం చేసుకుంటూ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, దంతెవాడ, మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఏపీలోని తూర్పుగోదావరి, విశాఖ, ఒడిశాలోని మల్కనగిరి, కోరాపుట్ జిల్లాల్లో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులు ఉన్నాయి. ఈ జిల్లాలకు సరిహద్దుగా ఉన్న తెలంగాణలోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లోనూ పలుచోట్ల సీఆర్పీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ బేస్ క్యాంపుల నుంచి పోలీసులు దండకారణ్యంపై డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మార్గదర్శకాల మేరకు వీటిని వాడుతున్నారు. బలగాల వద్ద 250 గ్రాముల బరువు గల నానో డ్రోన్, 250 గ్రాముల నుంచి 2 కిలోల బరువు ఉండే మైక్రో డ్రోన్లు, 2 కిలోల నుంచి 25 కిలోల బరువు కలిగిన స్మాల్ డ్రోన్లు, 150 కిలోల లోపు ఉండే మీడియం డ్రోన్లు, 150 కిలోలకు పైగా బరువు కలిగిన లార్జ్ డ్రోన్లు ఉన్నాయి. వీటిలో నానో, మైక్రో డ్రోన్లను పోలీసులు ఉపయోగిస్తున్నారు. ఇవి 250 మీటర్ల నుంచి 400 మీటర్ల ఎత్తుతోపాటు దూరం వెళ్లగలుగుతాయి. పక్షులు ఎగురుతున్నట్టుగానే శబ్ధం రాకుండా పనిచేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీ డ్రోన్లను వాడుతున్నారు. ఇవి పూర్తిస్థాయి నియంత్రణతో ఉండడంతోపాటు ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు బేస్‌క్యాంపుల నుంచి అనుసంధానం చేసి ఉన్నాయి. -
25 మంది కిడ్నాప్!: నలుగురి హత్య
సాక్షి, చర్ల: సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రెండు గ్రామాలకు చెందిన 25 మందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి నలుగురిని హత్య చేశారు. ఈ ఘటన బీజాపూర్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గల కుర్చేలి, మోటాపాల్ గ్రామాలకు చెందిన 25 మంది గ్రామస్తులను మావోయిస్టులు మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వారిని ప్రజాకోర్టులో విచారించి అనంతరం రెండు గ్రామాలకు చెందిన నలుగురిని ప్రజాకోర్టులోనే గొంతుకోసి దారుణంగా హతమార్చినట్లు సమాచారం. అనంతరం ఐదుగురిని విడిచిపెట్టినట్లు తెలుస్తుండగా.. మిగిలిన 16 మందిని వారి అదుపులోనే ఉంచుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కాగా.. ఈ విషయంపై పోలీసు అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. (ఆ 300 మంది మావోయిస్టులు ఎక్కడ?) ఇన్ఫార్మర్ నెపంతో ఒకరి హత్య ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో సోమ వారం రాత్రి మావోయిస్టులు ఓ గ్రామస్తుడిని హత్య చేశారు. బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుటాకేల్ గ్రామానికి సుమారు 20 మంది మావోయిస్టులు దసార్ రమణ ఇంటికి వచ్చారు. నిద్రిస్తున్న అతడిని లేపారు. మాట్లాడే పని ఉందని చెప్పి బయటకు రమ్మని పిలవడంతో.. అతడు నిరాకరించాడు. కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే మాట్లాడాలంటూ పట్టుబట్టారు. దీంతో మావోయిస్టులు అతడిని బలవంతంగా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఇంటి ఎదుటే ఇనుప రాడ్లతో కొట్టడంతోపాటు రమణను కత్తులతో దారుణంగా పొడిచి చంపారు.ఇన్ఫార్మర్ నెపంతో ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. -
విశాఖ మన్యంలో హైఅలర్ట్
సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా విశాఖ మన్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే క్రమంలో దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో యాక్షన్ టీమ్‌లు కూడా సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో మన్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో అరకు, పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు మండల కేంద్రాల్లో ప్రతి ఇంటిని సోదా చేశారు. కొన్ని ప్రాంతాల్లో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. వారం రోజులపాటు కొనసాగే ఈ వారోత్సవాల్లో కొంత అలజడి చేసుకునే అవకాశాలు ఉన్నట్టు మన్యం ప్రజలు భయపడుతున్నారు. (పచ్చని అడవికి నెత్తుటి మరకలు) -
పచ్చని అడవికి నెత్తుటి మరకలు
సాక్షి, మంచిర్యాల: పోలీసు, మావోయిస్టుల మధ్య అనేక ఎన్కౌంటర్లకు ఉమ్మడి జిల్లా అడవులు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి రాష్ట్రంలోనే మావోయిస్టులకు గట్టి పట్టున్న ప్రాంతం కావడంతో పదేళ్ల క్రితం వరకూ ఇక్కడి అడవుల్లో తుపాకుల మోతలు వినిపించేవి. అప్పటి పీపుల్స్‌వార్ గ్రూప్ నుంచి నేటి మావోయిస్టు పార్టీ వరకు ఎన్నో ఎన్కౌంటర్లు జరిగాయి. యాక్షన్ టీం మెంబర్ల నుంచి కేంద్ర కమిటీ సభ్యుల వంటి అగ్రనేతలపై పోలీసు తుటాలు పేలాయి. ఈ ఆధిపత్య పోరులో ఒక్కోసారి దళ సభ్యులది.. ఎక్కవసార్లు పోలీసు బలగాలది పైచేయిగా మారింది. దళ సభ్యుల క్యాంపులపై బలగాలు విరుచుకుపడిన ఘటనలు ఉండగా.. పక్కా సమాచారంతో మాటువేసి దాడులు చేసుకున్న ఘటనలూ ఉన్నాయి. కొన్నిసార్లు రోజులకొద్దీ కాల్పులు సాగాయి. దశాబ్దం తర్వాత మళ్లీ కదంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఉమ్మడి జిల్లాలో గతంలో పేలిన తూటాల చప్పుళ్లను గుర్తుచేసింది. చదవండి: (ఆ 300 మంది మావోయిస్టులు ఎక్కడ?) సంచలనం రేపిన ఆజాద్ ఎన్కౌంటర్ 2010లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ కాగజ్‌నగర్ మండలం జోగాపూర్ అటవీప్రాంతంలో ఎన్కౌంటర్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో సీనియర్ జర్నలిస్టు హేమచంద్ర కూడా చనిపోయారు. ఈ ఎన్కౌంటర్ బూటకమంటూ ఆజాద్ భార్య పద్మ కోర్టులో కేసు వేశారు. దీంతో ఎన్కౌంటర్లో పాల్గొన్న 20 మంది పోలీసులపై కేసు నమోదు చేయాలంటూ ఆదిలాబాద్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. చదవండి:(19 ఏళ్లకే దళంలోకి.. మూడు నెలలకే ఎన్కౌంటర్) మావోయిస్టులకు భారీ దెబ్బ తగిలిన సంఘటనలు 2001లో జన్నారం, దండేపల్లి అడవుల్లో జిల్లా కమిటీ సెక్రటరీ సూర్యం ఎన్కౌంటర్ అయ్యాడు. కీలక సభ్యుడి మరణంతో పార్టీకి పెద్ద నష్టం వాటిల్లింది. 2003 డీసీఎస్ (జిల్లా కమిటీ సెక్రటరీ)గా ఉన్న ఎల్లంకి అరుణ అలియాస్ లలితక్కను ప్రస్తుత కుమురంభీం జిల్లా.. అప్పటి బెజ్జూరు మండలం అగర్గూడలోని కొండ ప్రాంతంలో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళా సభ్యులు చనిపోయారు. 2003లో ప్రస్తుత మంచిర్యాల జిల్లా దేవాపూర్‌లో రాష్ట్ర కమిటీ మెంబర్‌గా ఉన్న సుదర్శన్‌రెడ్డి అలియాస్ రామక్రిష్ణ ఎన్‌కౌంటర్‌తో పార్టీకి పెద్ద నష్టం జరిగింది. 2006లో కాగజ్‌నగర్ మండలం మానిక్‌పటార్‌లో వరుసగా మూడు రోజులపాటు కాల్పులు జరగగా.. ఓ దళ కమాండర్ సహా ముగ్గరు మావోలు చనిపోయారు. అంతకుముందు 1989లో ప్రస్తుత నిర్మల్ జిల్లా పెంబి మండలం తులసి పేట అడవుల్లో జిల్లా కమిటీ సభ్యుడు సుగుణాకర్, 1992లో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం చింతలబోరి వద్ద ఎన్కౌంటర్లో బోథ్ దళ కమాండర్‌తోపాటు ఐదుగురు దళ సభ్యులు చనిపోయారు. 1993లో ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం డెడ్రా అడవుల్లో బోథ్ దళ కమాండర్‌తోపాటు ముగ్గురు దళ సభ్యులు మరణించారు. ఇవేకాకుండా కెరమెరి, సిర్పూర్(టి), ఖానాపూర్, చెన్నూరు ప్రాంతాల్లోనూ ఎన్కౌంటర్లు జరిగాయి. మావోయిస్టుల ప్రతీకార దాడులు 1985లో ప్రస్తుత కుమురం భీం జిల్లా పాత బెజ్జూరు మండలం లోడ్పల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా దహెగాం మండలం బీబ్రా ఎస్సై లక్ష్మణరావును కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం క్వార్టర్లో ఉండగా ఉదయం ఏడు గంటలకు బయటకు పిలిచి కాల్చి చంపారు. 1989లో ప్రస్తుత పెంచికల్‌పేట మండలం చేడ్వాయి గుట్ట వద్ద ల్యాండ్‌మైన్ పేల్చి ఐదుగురు పోలీసులను హతమార్చారు. 1991లో నెల వ్యవధిలోనే రెండుసార్లు కౌటాల పోలీసు స్టేషన్‌పై దాడులు జరిగాయి. 1997లో ప్రస్తుత కుమురంభీం జిల్లా సిర్పూర్ (యూ) పోలీస్‌స్టేషన్‌ను బాంబులతో పేల్చివేయగా 11 మంది పోలీసులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు సాధారణ వ్యక్తులున్నారు. 1998లో కాగజ్‌నగర్ డీఎస్పీ కార్యాలయంపై దాడి చేయగా ముగ్గురు గన్మెన్లు మృత్యువాత పడ్డారు. 1999 బెజ్జూరు ఫారెస్టు రేంజర్ కొండల్‌రావును పిస్తోల్‌తో కాల్చి చంపారు. గోలేటీ సీఐఎస్ఎఫ్ క్యాంపుపై దాడితోపాటు అనేక ప్రతీకార దాడులు జరిగాయి. కోల్‌బెల్టు ప్రాంతంలో ‘సికాస’ ఉమ్మడి జిల్లా పశ్చిమ ప్రాంత పరిధిలో అటవీ, గిరిజన ప్రాంతాల్లో పీపుల్స్ వార్ ఎన్కౌంటర్లు, ప్రతీకార దాడులు జరుగుతుండగా.. అదే సమయంలో తూర్పు ప్రాంతంగా ఉన్న ప్రస్తుత మంచిర్యాల జిల్లాలో పీపుల్స్‌వార్ గ్రూప్ అనుబంధ కార్మిక సంఘమైన సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) మిలిటెంట్ దళాల నియంత్రణకు పోలీసు బలగాలు అనేక ఎన్కౌంటర్లు జరిపాయి. 1996లో జిల్లా కార్యదర్శిగా ఉన్న మాదిరెడ్డి సమ్మిరెడ్డి అలియాస్ రమాకాంత్ ఎన్కౌంటర్ ‘సికాస’ చరిత్రలో ప్రముఖమైంది. మంచిర్యాల జిల్లా నస్పూర్ స్లాబ్క్వార్టర్ల ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో సమ్మిరెడ్డితోపాటు అప్పటి చెన్నూరు సీఐ చక్రపాణి, కానిస్టేబుల్ అశోక్ మరణించారు. ముఖ్యమైన ఎన్కౌంటర్లు చూస్తే 1991లో శ్రీరాంపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు, 1993లో రామక్రిష్ణాపూర్‌లో ఇద్దరు, 1996లో బెల్లంపల్లి మండలం చిన్నబుదలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు, 1998లో మాదారంలో, 1999లో నస్పూర్‌లో సికాస సభ్యులు ఎన్కౌంటర్లో మరణించారు. 2002లో బెల్లంపల్లిలోని గాంధీనగర్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సికాస సభ్యులు మరణించారు. అప్పటి ఆఫీసర్లే ఇప్పుడు సారథ్యం ఉమ్మడి జిల్లాలో అనేక ఎన్కౌంటర్లలో దూకుడుగా ఉన్న అప్పటి ఎస్సైలే ఇప్పుడు ఉన్నతస్థాయిలో ఉన్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో అప్పటి యువ అధికారులే ప్రస్తుతం కీలక ప్రాంతాల్లో ఉన్నతాధికారులుగా వచ్చారు. వారి ఆధ్వర్యంలోనే ‘మావోయిస్టు ఆపరేషన్’ కొనసాగుతోంది. భాస్కర్ వేటలో భారీ కూంబింగ్ వేమనపల్లి: రెండు రోజులుగా తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో పోలీసులు కూంబింగ్ కొనసాగుతోంది. పొరుగున ఉన్న ఆసిఫాబాద్‌కొమురంభీం జిల్లా కదంబా ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెల్సిందే. అయితే కాల్పుల నుంచి తప్పించుకున్న రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, మరో ఇద్దరు మావోయిస్టుల కోసం ప్రాణహిత తీరం వెంట డేగ కళ్లతో నిఘా ఏర్పాటు చేశారు. కల్లెంపల్లి ఫెర్రీ పాయింట్‌ను పరిశీలిస్తున్న డీసీపీ, ఏసీపీ వేమనపల్లి మండలం కల్లెంపల్లి, ముక్కిడిగూడెం అడవులను పోలీసుబలగాలు జల్లెడ పడుతున్నాయి. పెద్దపల్లి డీసీపీ రవీందర్, జైపూర్ ఏసీపీ నరేందర్, రూరల్ సీఐ నాగరాజు సోమవారం కూంబింగ్ బలగాల వద్దకు వెళ్లి దిశానిర్దేశం చేశారు. కల్లెంపల్లి, ముక్కిడిగూడం గ్రామస్తులతో సమావేశమయ్యారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో జనం ముందుకు వస్తున్న మావోయిస్టులకు ఇప్పటికే ఎవరూ సహకరించడం లేదని, వారి మాటలు నమ్మవద్దని సూచించారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సహకరించొద్దని, కదలికలు ఉన్నట్లు గమనిస్తే 100కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని అన్నారు. రాకపోకల నిలిపివేత కదంబా ఎదురుకాల్పుల నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న ప్రాణహిత నదిపై రాకపోకలు నిలిపివేసినట్లు డీసీపీ, ఏసీపీ తెలిపారు. మండలంలోని ప్రాణహిత ఫెర్రీ పాయింట్లను సందర్శించారు. మావోయిస్టులు నది మీద రాకపోకలు సాగించే వీలున్నందున కోటపల్లి మండలం వెంచపల్లితోపాటు రాచర్ల, రేగుంట, వేమనపల్లి, కళ్లెంపల్లి ఫెర్రీ పాయింట్ల వద్ద తాత్కాలికంగా పడవలను నిలిపివేశామన్నారు. నది అవతలి వైపు ఉన్న సిరోంచ, బామిని, రేగుంట, వెంకటాపూర్ పోలీస్స్టేషన్ల సహకారం తీసుకుని ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామన్నారు. ఆసిఫాబాద్ కొమురంభీం, మంచిర్యాల జిల్లాలోని తీరం వెంట ఉన్న పోలీస్స్టేషన్లను అప్రమత్తం చేశామని, 10 గ్రేహౌండ్స్ బృందాలకు చెందిన 400 మంది పోలీసులతో కూంబింగ్ కొనసాగుతోందన్నారు. తప్పిపోయిన మావోయిస్టులకు లొంగిపోవడమే శరణ్యమని, లేకుంటే ఏ క్షణంలోనైనా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అర్ధరాత్రి బాదిరావు అంత్యక్రియలు నేరడిగొండ: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కదంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జుగ్నక్ బాదిరావు మృతిచెందిన విషయం విదితమే. ఆదివారం అర్ధరాత్రి ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు చేపట్టారు. నేరడిగొండ పోలీసులు మృతుడి తల్లితోపాటు సర్పంచ్ సీతారాం, పలువురు గ్రామస్తులను ఆదివారం ఉదయం ఆసిఫాబాద్ జిల్లాకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అదే అర్ధరాత్రి మృతదేహాన్ని ఇచ్చోడ సీఐ కంప రవీందర్, నేరడిగొండ ఎస్సై భరత్‌సుమన్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు అద్దాల తిమ్మాపూర్‌కు తీసుకొచ్చారు. అనంతరం అంత్యక్రియలు చేపట్టారు. రోధిస్తున్న మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు దీంతో బంధువులు, ఆయా గ్రామాలకు చెందిన ఆదివాసీలు సోమవారం మృతుడి ఇంటికి చేరుకున్నారు. ఆయన తల్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. జుగ్నక్ బాదిరావు కొంతకాలం నేరడిగొండలో లారీ క్లీనర్‌గా పనిచేశాడు. నాలుగైదు నెలల క్రితం నిర్మల్‌లో క్లీనర్‌గా పనిచేశాడు. ఇటీవల ఇంటికి వచ్చి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు కంటతడి పెడుతూ తెలిపారు. నిర్మల్‌లోని లారీ యజమానిని అడగగా 20రోజులుగా పనికి రాలేదని తెలిపినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. చేతికొచ్చిన కొడుకు ఇలా ఎన్కౌంటర్లో మృతిచెందడంతో ఆ కుటుంబం రోధనలు మిన్నంటాయి. -
ఆ 300 మంది మావోయిస్టులు ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఉత్తరాన ఉరికి వస్తున్న భాస్కర్ దళం.. ఈశాన్యం నుంచి చొచ్చుకొస్తున్న మావోయిస్టులు.. వెరసి పోలీసులకు కంటి మీద కునుకు కరువైంది. రాష్ట్రంలోకి చొరబడాలని మావోయిస్టులు, వెనక్కి తరిమికొట్టాలని గ్రేహౌండ్స్ బలగాలు చూస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భారీగా మావోయిస్టులు కాచుకుని ఉన్నారన్న సమాచారంతో సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్ దళాలు అప్రమత్తమయ్యాయి. వీరు చొరబడితే విధ్వంసాలకు దిగుతారన్న ముందస్తు సమాచారంతో దండకారణ్యంలో జల్లెడ పడుతున్నాయి. తెలంగాణ నుంచి దాదాపు 50 కి.మీ.దూరం ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా ఇంజారం గ్రామం వద్దే వారిని నిలువరించేందుకు సీఆర్పీఎఫ్ కోబ్రా, గ్రేహౌండ్స్ దళాలు డ్రోన్ కెమెరాలతో మైదానాలు, వాగులు, వంకలపై నిఘా పెంచారు. సీఆర్పీఎఫ్ వద్ద ఉన్న డ్రోన్ కెమెరాలు చాలా ప్రత్యేకమైనవి. భూమి మీద చీమనైనా గుర్తించగలిగే శక్తి వీటి ప్రత్యేకత. పైగా వేల మీటర్ల ఎత్తున ఎగిరే వీటిని భూమి మీద నుంచి గుర్తించడం సాధ్యం కాదు. దండకారణ్యం జల్లెడ: ఈ నెల 13వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలో దాదాపు 300 మంది మావోయిస్టులు వాగు దాటుతున్న దృశ్యాలు సీఆర్పీఎఫ్ డ్రోన్‌కు చిక్కాయి. వీరు సమీపంలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి చేసేందుకు భారీగా తరలిరావడం గమనార్హం. వీరంతా సుకుమా జిల్లాకు సమీపంలోని ఇంజారం గ్రామం దాకా వచ్చారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు ద్వారా తెలంగాణలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి వారిని వెనక్కివెళ్లేలా చేయడంలో దాదాపు వేయిమందికిపైగా కోబ్రా–గ్రేహౌండ్స్ పోలీసులు సఫలీకృతమయ్యారు. అయినా, వదలని పోలీసు బలగాలు వీరిని దండకారణ్యం వైపు తరిమికొట్టే వ్యూహంతో కూంబింగ్ చేస్తున్నాయి. వీరిని తెలంగాణ సరిహద్దు నుంచి వీలైనంత వరకు దూరంగా పంపాలన్న ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో వీరు సాయుధ బలగాలను ఏమార్చి ఇతర మార్గాల్లో రాష్ట్రంలోకి రాకుండా.. సరిహద్దు వెంబడి సైతం పటిష్ట నిఘా ఉంచారు. -
తప్పించుకున్న భాస్కర్?
-
తప్పించుకున్న భాస్కర్?
సాక్షి, మంచిర్యాల: మన్యంలో తుపాకీ మోత మోగింది. జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం కదంబా అడవుల్లో ఎన్కౌంటర్ ఉలిక్కిపడేలా చేసింది. శనివారం రాత్రి పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు మృతిచెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొద్ది రోజులుగా జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రాణహిత సరిహద్దు మీదుగా ప్రత్యేక బలగాలతో కూంబింగ్ కొనసాగుతోంది. రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా అనువణువు గాలిస్తున్న పోలీసులు కాగజ్‌నగర్ మండలంలోని కదంబా అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసువర్గాలు అనుమానిస్తున్నాయి. కేబీఎం (కుమురం భీం, మంచిర్యాల) డివిజన్ కమిటీకి సారథ్యం వహిస్తున్న, మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతోనే.. జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ముఖ్యంగా కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని మండలాలు, ప్రాణహిత నది తీరం వెంట డీఎస్పీ స్వామి ఆధ్వర్యంలో 8 గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. నేరుగా డీఎస్పీ స్వామి మారుమూల గ్రామాల్లో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిఘా ఉంచిన పోలీసులు కదంబా అడవుల్లో మావోయిస్టులు తిరుగుతుండగా ప్రణాళికతో ముందుకు సాగినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మాత్రమే చనిపోగా మరికొందరు తప్పించుకున్నట్లు సమాచారం. తప్పించుకున్న వారిలో భాస్కర్‌తో పాటు లింగయ్య, వర్గీస్, ప్రభాత్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా జిల్లాలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం నెలకొంది. గురువారం రాత్రి ఆసిఫాబాద్ మండలం చిలాటిగూడను పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. అక్కడ దళ సభ్యులు తృటిలో తప్పించుకున్నారు. దీంతో పోలీసులు అనుమానిత ప్రాంతాలను తనిఖీ చేశారు. శుక్రవారం సైతం సమీప అటవీ ప్రాంతాలతో పాటు పత్తి చేలు, ఆసిఫాబాద్ ప్రధాన రోడ్డుపై గస్తీ కొనసాగింది. దళ సభ్యులు కదంబా అడవుల వైపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నిఘా పెట్టిన పోలీసులు పక్కా ప్రణాళికతో ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం. తప్పించుకున్న భాస్కర్? కదంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కేబీఎం(కుమురం భీం, మంచిర్యాల) డివిజన్ కమిటీకి సారథ్యం వహిస్తున్న మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. భాస్కర్ నేతృత్వంలోని ఆరుగురు దళ సభ్యులు ఉమ్మడి జిల్లాలో కొద్దికాలంగా సంచరిస్తున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయంలో వలస కూలీల రూపంలో జిల్లాలోకి చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాలు, ప్రాణహిత తీరం వెంట సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అందుకనుగుణంగానే తిర్యాణి మండలం టోక్కిగూడ అడవుల్లో రెండుసార్లు తృటిలో తప్పించుకున్నారు. అప్పటి నుంచి నిఘా పెట్టిన పోలీసు బలగాలు మావోల సంచారంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు అనుమానం కలిగిన ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మావోయిస్టులకు భోజనం పెట్టిన తిర్యాణి మండలానికి చెందిన ఓ వ్యక్తిని సైతం అరెస్టు చేసి ఆదిలాబాద్ జైల్లో ఉంచారు. రెండుసార్లు డీజీపీ పర్యటన.. కొద్ది రోజులుగా దళ సభ్యుల సంచరిస్తున్నారనే సమాచారం ఉన్న ప్రతిచోటా గస్తీని విస్తృతం చేస్తున్నారు. ఇటీవల దళ సభ్యుల నియంత్రణలో భాగంగా డీజీపీ మహేందర్ రెడ్డి జిల్లాలో రెండుసార్లు పర్యటించారు. ఆగస్టులో ఓసారి పర్యటించగా, ఈనెల రెండో తేదీన ఆసిఫాబాద్‌కు వచ్చిన ఆయన నాలుగు రోజులు మకాం వేశారు. క్షేత్రస్థాయిలో పలు విషయాలు తెలుసుకుని మావోల సంచారం నేపథ్యంలో అనుసరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. కదంబా అడవుల్లో జరిగిన తాజా ఎన్‌కౌంటర్‌తో జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎప్పుడు ఎక్కడ తుపాకీ చప్పుళ్లు వినాల్సి వస్తుందోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. -
మావోయిస్ట్ గడ్డపై తిరుగుబాటు
సాక్షి, విశాఖపట్నం : మావోయిస్ట్ కంచుకోటగా వెలుగొందిన ప్రాంతాల్లో ఆ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పోలీసులు వరుస కూబింగ్‌లతో పాటు ఎన్కౌంటర్లు సైతం కోలుకోలేని దెబ్బకొడుతున్నాయి. అయినప్పటికీ పట్టు కోసం పారాడుతున్న మావోయిస్టులకు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన గ్రామాలు అండగా ఉంటున్నాయి. అయితే ఏళ్ల తరబడి అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంటున్న ఆదివాసీలు సైతం మావోయిస్టులపై తిరుగబడుతున్నారు. తమ వెనుకబాటుకు కారణం మీరే అంటూ మావోలపై తిరుగుబాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రా-ఒరిస్సా (ఏవోబీ) సరిహద్దుల్లో గిరిజన ప్రజలు భారీ ర్యాలీని నిర్వహించారు. సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి కావాలని నినాదంతో 6 గ్రామాల గిరిజనులు భారీ ర్యాలీ చేపట్టారు. మావోయిస్టుల కంచుకోటలో వ్యతిరేక నినాదాలు చేశారు. రోడ్లు, ఆసుపత్రులు, సెల్ టవర్ నిర్మించాలి అంటూ గిరిజనులు నినాదాలు చేశారు. (ఆసిఫాబాద్‌లో మావోల కదలికలు) మరోవైపు తెలంగాణలోనూ మావోయిస్టుల జాడ కోసం పోలీసులు కూంబింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పోలీసు యంత్రాంగం వారి కదలికలపై నిత్యం అప్రమత్తంగా ఉంటోంది. దళ సభ్యుల సంచారం అనుమానం ఉన్న ప్రతి ప్రాంతాన్నీ జల్లెడ పడుతున్నారు. గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆసిఫాబాద్ మండలం చిలాటిగూడను పోలీసు బలగాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయితే వారికి దళ సభ్యులు కంటపడకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అనుమానిత ప్రాంతాలను తనిఖీలు చేశారు. శుక్రవారం సైతం సమీప అటవీ ప్రాంతాలతోపాటు పత్తి చేలు, ఆసిఫాబాద్ ప్రధాన రోడ్డుపై పోలీసుల గస్తీ కొనసాగింది. దీంతో సమీప గ్రామాల ప్రజల్లో తెలియని ఆందోళన మొదలైంది. పోలీసుల బందోబస్తుతో ఆయా ప్రాంతాల్లో హైఅలర్ట్ నెలకొంది. పోలీసులు అన్ని వైపులా నిఘా మరింత పెంచారు. -
ఏజెన్సీలో ఏం జరుగుతోంది..?
సాక్షి, ఇల్లెందు: భ్రద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీలో పోలీసులు మోహరించారు. మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు, కమాండర్ దూది దేవాలు అలియాస్ శంకర్‌ను పోలీసులు ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపారని ఆరోపిస్తూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన బంద్ ఇల్లెందు ఏరియాలో ఆదివారం కనిపించలేదు. జిల్లా వ్యాప్తంగా ఇల్లెందు, గుండాల, మణుగూరు భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, బయ్యారం, టేకులపల్లి, ఆళ్లపల్లి, కరకగూడెం, పినపాక లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా బంద్ ప్రభావం కనిపించలేదు. దుకాణాలు, షాపులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు పని చేశాయి. గుండాల, కరకగూడెం లాంటి మారుమూల గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్ సర్వీసులను ముందస్తుగా నిలిపి వేశారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రధాన రహదారుల మీద దృష్టి కేంద్రీకరించిన పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. మావోయిస్టు బంద్ దృష్ట్యా ఏజెన్సీలో ప్రత్యేక బలగాలను మోహరింపజేసి కూంబింగ్ చేపట్టారు. స్పెషల్ పార్టీ బలగాలతో పాటు ఈ దఫా గ్రేహౌండ్స్ దళాలతో సరిహద్దు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ నెల 3వ తేదీన తెల్లారుజామున భద్రాద్రి కొత్తగూడెం– ములుగు, మహబూబాబాద్ జిల్లాల సరిహద్దు దేవాళ్లగూడెం– దుబ్బగూడెం మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన దూది దేవాలు అలియాస్ శంకర్ ఏరియా కమిటీ సభ్యుడు, కమాండర్ స్థాయిలో ఉన్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. సుమారు ఏడేళ్ల క్రితం పార్టీలోకి వచ్చిన శంకర్ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా హరిభూషణ్ అలియాస్ జగన్‌కు అంగరక్షకుడుగా కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఏరియా కమిటీ సభ్యుడుగా, దళ నేత శంకర్ బయటకు రావటం, పోలీసులకు చిక్కి ఎన్కౌంటర్లో హతమవ్వటం మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకునేందుకు దుశ్చర్యకు పాల్పడే అవకాశం ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బలగాలరె పెద్ద ఎత్తున మోహరించి కూంబింగ్‌ను ఉధృతం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని అధికార పార్టీ నేతలను, ప్రజా ప్రతినిధులను అలర్ట్ చేశారు. ఊహించినట్లే మావోయిస్టు బంద్ ప్రభావం లేకపోవటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బంద్ దృష్ట్యా ముందస్తుగా ఏజెన్సీని జల్లెడ పడుతుండటంతో ఎక్కడ ఏం జరుగుతుందోనని గిరిజన గూడెంలలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఎన్కౌంటర్లో కీలక నేతను కోల్పోయిన మావోయిస్టులు జాగ్రత్తలతో ఉంటారని, పక్కా సమాచారంతోనే పోలీసులకు దొరికే చాన్స్ ఉంటుందని కొంతమంది అంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అడవులు దట్టంగా పెరగటం, అంతటా నీరు లభిస్తుండటం మావోయిస్టులు సునాయసంగా తప్పించుకునే అవకాశం ఉంటుందని ఇతర విప్లవ గ్రూపులు పేర్కొంటున్నాయి. ఇదే క్రమంలో ఆదివారం తెల్లారుజామున గుండాల మండలం శంభునిగూడెం ఏరియాలో ఎనిమిది రౌండ్ల వరకు కాల్పుల శబ్ధాలు వినిపించినట్లు ప్రచారం జరిగింది. కానీ అక్కడి గ్రామాల ప్రజలు, పోలీసులు కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపడేశారు. దూది దేవాలు 2013లో మావోయిస్టు పార్టీలో చేరాడని మావోయిస్టు పార్టీ ప్రకటించగా వైద్యం కోసం వెళ్లి దొరికినట్లు వెల్లడించిన మావోయిస్టులు ఏ పట్టణానికి వెళ్లింది, ఎక్కడ పోలీసులకు చిక్కింది వెల్లడించలేదు. అయితే మునుపెన్నడూ లేనంతగా మావోయిస్టు కమిటీల పేరుతో ప్రకటనలు గుప్పించి బంద్‌కు పిలుపునిచ్చిందని, ఉనికిని చాటుకునే యత్నం చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
మావోయిస్టుల మందుపాతరకు ఇద్దరు మృతి
పెదబయలు(అరకులోయ): తప్పిపోయిన పశువుల కోసం వెళ్లి ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు మండలంలో చింతలవీధికి చెందిన ఇద్దరు గిరిజనులు బలవడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. 60 కుటుంబాలు నివసిస్తున్న ఆ గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మృతులిద్దరూ వరుసకు అన్నదమ్ములు. వారంరోజులకిందట తప్పినపోయిన రెండు పశువులను వెతికేందుకు జామిగుడ పంచాయతీ చింతలవీధి గ్రామానికి చెందిన మొండిపల్లి మోహన్‌రావు(30),మొండిపల్లి అజయ్‌కుమార్(20) ఆదివారంఉదయం బయలుదేరారు. మూడు కిలోమీటర్ల దూరంలో గల ఇంజరి పంచాయతీ కోండ్రు అటవీ ప్రాంతానికి మధ్యాహ్నం 12 గంటల సమయంలో వెళ్లారు. అక్కడ మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై కాలు పెట్టడంతో అది ఒక్కసారిగా పేలి వారిని బలితీసుకుంది. మోహన్‌రావుకు నడుము నుంచి కింద భాగం శరీరం పూర్తిగా తునాతునకలైంది. అజయ్‌కుమార్‌కు కుడి చెయ్యి పూర్తిగా తెలిపోగ, ఎడమ చేయి, తలపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ శబ్దం విన్న స్థానికులు.. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నట్టు భావించి అటవీ ప్రాంతానికి వెళ్లేందుకు భయపడ్డారు. పశువులు వెతకడానికి వెళ్లిన అన్నదమ్ములు తిరిగిరాకపోవడంతో ధైర్యం చేసి గ్రామస్తులు అక్కడికి వెళ్లారు. అటవీ ప్రాంతంలో వీరి మృతదేహాలు పడి ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. మోహన్‌రావుకు భార్య కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విజయ్‌కుమార్‌కు పెళ్లి కాలేదు.తల్లిదండ్రులు ఉన్నారు. మృతదేహాలను అటవీ ప్రాంతం నుంచి చింతలవీధి గ్రామానికి కుటుంబ సభ్యులు తరలించారు. ఈ ప్రాంతంలో మందుపాతరకు గిరిజనులు బలికావడం ఇదే ప్రథమం. గతంలో కూడా ఈప్రాంతంలో మావోయిస్టులు మందుపాతరలు పెట్టారు. మావోయిస్టు అమరుల సంస్మరణ వారోత్సవాలు ప్రశాతంగా ముగుస్తున్న తరుణంలో ఈ సంఘటన జరగడంతో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. మందుపాతర పేలి మృత్యువాత పడిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఇంజరి పంచాయతీలోని కోండ్రు అటవీ ప్రాంతం గిరిజనులకు ప్రాణ సంకటం పాడేరు: అడవుల్లో సంచరించే పోలీసు పార్టీలను మట్టుబెట్టాలనే వ్యూహంతో మావోయిస్టులు భారీగా ఏర్పాటు చేస్తున్న మందు పాతరలను గిరిజనులకు ప్రాణ సంకటంగా మారాయి. రెండేళ్ల కిందట పెదబయలు మండలం ఇంజరి పంచాయతీలోని కోండ్రుం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందు పాతరలను పోలీసు బలగాలు ముందుగానే గుర్తించి నిర్వీర్యం చేయడంతోపాటు వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసు పార్టీలు త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాయి. అయితే ఇలాంటి మందు పాతరలు ఏవోబీ వ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు భారీగా ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది. ఈ మందుపాతరల ఉనికిని పోలీసులు పసిగడుతున్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు మాత్రం గుర్తించక ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. గిరిజనులకు అటవీ ప్రాంతాల్లో సంచరించి పశువుల కాపల, అటవీ ఉత్పత్తులు సేకరిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో మందు పాతరలను గిరిజనులు గుర్తించలేకపోతున్నారు. ఫలించిన పోలీసుల వ్యూహం పాడేరు/ముంగింపుట్టు: మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను భగ్నం చేసేందుకు పోలీసు యంత్రాంగం ముందస్తుగానే వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టింది. గత నెల 28 నుంచి ఈ నెల 3 వరకు వారోత్సవాల నిర్వహణకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. అయితే అంతకు ముందే ఒడిశా పోలీసు బలగాలతో పాటు విశాఖ ఏజెన్సీ పోలీసు పారీ్టలు కూడా ఏవోబీ వ్యాప్తంగా కూంబింగ్ చర్యలను విస్తృతం చేయడంతో వారిని కట్టడి చేయగలిగారు. ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు, సంస్మరణల వా రోత్సవాల చివరి రోజున మందుపాతర పేలి ఇద్దురు గిరిజనులు మృతి చెందారు. ఒడిశాలోని ముకుడుపల్లి, ఏజెన్సీలోని పెదబయలు మండలం లండులు అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకోగా గాయాలతో మావోయిస్టులు త్రుటిలో తప్పించుకున్నారు. జి.మాడుగుల మండలం కిల్లంకోట, మల్కన్‌గిరి జిల్లా పరిధిలోని గుజ్జెడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. మిగిలిన మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారు. తర్వాత వారోత్సవాలను మావోయిస్టులు ప్రారంభించినప్పటికీ ఈ ఏడాది పెద్దగా ప్రభావం చూపలేదు. ఒడిశాలోని కటాఫ్ ఏరియాలో గతనెల 28న కొద్దిపాటి గిరిజనులతో అమరవీరుల వారోత్సవాలను మావోయిస్టులు నిర్వహించారు. ఆ తర్వాత ఎక్క డా భారీ స్థాయిలో వారోత్సవాలను నిర్వహించిన దాఖలా లు లేవు. మావోయిస్టులంతా ఏవోబీలో సురక్షిత ప్రాంతా లకే పరిమితమయ్యారనే ప్రచారం జరిగింది. మావోయిస్టులను ఎదుర్కొనేందుకు ఏవోబీ వ్యాప్తంగా భారీగా పోలీసు బలగాలు అటవీ ప్రాంతాల్లో మోహరించి జల్లెడ పట్టాయి. మరోవైపు వర్షాలు కూడా విస్తారంగా కురవడంతో మా వోయిస్టుల వారోత్సవాలకు ఆటంకం కలిగినట్టు తెలుస్తుంది. భారీ వ్యూహాంతో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం అమరవీరుల వారోత్సవాలను కట్టడి చేసి మావోయిస్టులపై పైచేయి సాధించింది. -
ఏఓబీలో కలకలం..
మక్కువ: ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో (ఏఓబీ) మళ్లీ కలకలం మొదలైంది. ప్రత్యేక బలగాల బూట్ల శబ్ధంతో ఏజెన్సీ అదురుతోంది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏఓబీ సరిహద్దు ప్రాంతంలో రెండు రోజులుగా యుద్ధ వాతవరణం నెలకొంది. ఈ నెల 28 నుంచి వచ్చేనెల 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు ఏఓబీకి సరిహద్దు గ్రామాలైన ఎర్రసామతవలస, దుగ్గేరు, మూలవలస, బాగుజోల, చిలకమెండంగి, మెండంగి, గుంటబద్ర, తదితర గ్రామాల్లో బుధవారం ముమ్మర కూంబింగ్ చేపట్టారు. దీంతో ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో పోలీసుల బూట్ల చప్పళ్లు వినిపించాయి. వారంరోజుల పాటు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల కిందట ఒడిశా రాష్ట్రం మల్కనగిరి, విశాఖ ఏజెన్సీ పెదబయలు మండల అటవీ ప్రాంతాలలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దీంతో మావోయిస్టులు పోలీసుల నుంచి తప్పించుకొని ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోకి ప్రవేశించి ఉంటారన్న అనుమానంతో పోలీసులు విస్తృత కూంబింగ్ చేపడుతున్నారు. అలాగే మంగళవారం నుంచి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించడంతో పాటు మంగళవారం రాత్రి ప్రభుత్వ కార్యాలయాల వద్ద నాకాబందీ నిర్వహించారు. సంస్మరణ వారోత్సవాలు నిర్వహించిన సందర్భంగా గతంలో మక్కువ మండలంలో పలుమార్లు తమ ఉనికి చాటుకునేందుకు మావోయిస్టులు బ్యానర్లు, వాల్‌పోస్టర్లు అతికించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 28 నుంచి వచ్చేనెల 3 వరకు నిర్వహిస్తున్న అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మక్కువ మండలం ఏఓబీ సరిహద్దులో ఉన్నందున మావోయిస్టులు ఎదో ఒక రూపంలో వారి ఉనికిని చాటుకునే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన సంఘటనల్లో కొన్ని.. 2011 మే 15న మక్కువ మండలం ఎర్రసామంతవలస, దుగ్గేరు గ్రామాలలో ఏఓబీ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని.. గ్రీన్‌హంట్‌ను తిప్పికొట్టాలని అప్పట్లో బ్యానర్లు కట్టి కలకలం రేపారు. అదే ఏడాది జూలై 28న ఎర్రసామంతవలసలో మరో బ్యానర్ కట్టి వారి ఉనికిని మరోమారు చాటుకునే ప్రయత్నం చేశారు. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా అప్పట్లో మావోయిస్టులు (సీపీఐ)పేరిట బ్యానర్‌ను కట్టి మన్యంలో కలకలం సృష్టించారు. 2011 ఏప్రిల్ 24న చెక్కవలస రిజర్వ్ ఫారెస్ట్‌లో భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2012 ఫిబ్రవరి 17న దుగ్గేరులోని రామమందిరం వద్ద శ్రీకాకుళం–కొరాపుట్ డివిజనల్ కమిటీ పేరుతో గోడపత్రికను అతికించారు. అలాగే ఎర్రసామంతవలసలో బీఎస్ఎన్ఎల్ టవర్‌ను కాల్చి వేశారు. అలాగే పనసబద్ర గ్రామంలో కరువుదాడి జరిగిన సంఘటనలున్నాయి. ఏవోబీకి మక్కువ మండలం అతిసమీపంలో ఉన్నందున మావోయిస్టులు ఉనికి చాటుకునేందుకు ప్రయత్నం చేయడం.. పోలీసులు పట్టు సాధించేందుకు ప్రయత్నించడం పరిపాటిగా మారుతోంది. -
ఇవాళ్టి నుంచి మావోయిస్టుల వారోత్సవాలు
-
ఏవోబీలో మళ్లీ పేలిన తుపాకులు
పెదబయలు/పాడేరు: మన్యం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఒక వైపు మావో యిస్టులు అమరవీరుల వారోత్సవాల నిర్వహణకు పిలుపు నివ్వగా.. మరోవైపు అడ్డుకునేందుకు సాయుధ దళాలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో మన్యంలో అప్రకటిత రెడ్ అలెర్ట్ కొనసాగుతోంది. ఆంధ్రఒడిశా సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఏవోబీలో శనివారం సాయంత్రం మళ్లీ తుపాకుల మోత మోగింది. దీంతో ఏవోబీలో వాతారణం ఒక్క సారిగా వేడిడెక్కింది. మారుమూల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తొమ్మిది రోజుల వ్యవధిలో మూడు సార్లు ఎదురు కాల్పులు జరగడంతో గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మావోయిస్టుల కదలికలను కనిపెడుతూ, వారిని వెంటాడుతూ పోలీసులు పైచేయి సాధిస్తున్నారు. ఈ నెల 16న మల్కన్‌గిరి జిల్లా జోడం పంచాయతీ ముక్కుడుపల్లి అటవీ ప్రాంతంలో ఒడిశా పోలీసు బలగాలు–మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆ సమయంలో మావోయిస్టులు తప్పించుకున్నారు. ఒడిశా కటాఫ్ ఏరియా నుంచి ఆంధ్ర ప్రాంతంలోకి మావోయిస్టులు ప్రవేశించారని సమాచారం తెలియడంతో ఆంధ్ర పోలీసు బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఈ నెల 19న పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ లండూలు, మెట్టగుడ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో మరోమారు ఎదురుకాల్పులు జరిగాయి. ఆ సమయంలో మావోయిస్టు అగ్రనేతలు గాయాలతో బయటపడినట్టు, వారి నుంచి కిట్ బ్యాగులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలు, లభ్యమైన సామగ్రి ఆధారంగా మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో పోలీస్ బలగాలు కూబింగ్‌ను ఉధృతం చేశాయి. తాజాగా ఒడిశా రాళ్లగెడ్డ పంచాయతీ గజ్జెడిపుట్టు,దిగుడుపల్లి అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఎదురుకాల్పులు జరిగాయి. దయా అనే మావోయిస్టు మృతి చెందాడు. ఏవోబీలో వరుస ఎదురు కాల్పులతో యుద్ధవాతావరణం నెలకొంది. మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్టు సమాచారం. వారోత్సవాలు భగ్నమే లక్ష్యంగా .. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలను ఏటా జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహిస్తారు. ఒడిశా కటాఫ్ ఏరియాలో ఏడు పోలీసుల అవుట్ పోస్టులు ఏర్పాటు చేసి, ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఆంధ్ర ప్రాంతంలోఉన్న ముంచంగిపుట్టు మండలం భూషిపుట్టు, బుంగాపుట్టు పంచాయతీలు, పెదబయలు మండలం ఇంజరి,గిన్నెలకోట ,జామిగుడ పంచాయతీల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయన్న సమాచారంతో ఆంధ్ర గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. మావోయిస్టుల అమర వీరుల వారోత్సవాలు భగ్నం చేయాలని పోలీసులు,ఎలాగైన వారోత్సవాలు జరపాలని మావోయిస్టుల పట్టుదలతో ఉన్నారు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
ఏవోబీలో ఎన్కౌంటర్.. మావోయిస్టు మృతి
సీలేరు (పాడేరు): విశాఖ ఏజెన్సీ ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. విశాఖ గ్రేహౌండ్స్, ఒడిశా ఎస్‌వోజీ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో చిత్రకొండ పోలీస్‌స్టేషను పరిధి రాళ్లగెడ్డ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలంలో 303 తుపాకీ, మూడు కిట్ బ్యాగులు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన మావోయిస్టు జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామానికి చెందిన దయాగా గుర్తించారు. 2016లో జరిగిన రామ్‌గుడ ఎన్కౌంటర్లో మృతి చెందిన పాంగి దొసో తమ్ముడు దయా. అప్పట్లో దొసో చనిపోవడంతో ఉద్యమంలో చేరాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
మావోల తలలకు వెల..!
సాక్షి, మంచిర్యాల: మావోయిస్టుల తలలకు పోలీస్ శాఖ వెల కట్టింది. సమాచారం అందించిన వారికి బహుమతి ఇస్తామని వాల్‌పోస్టర్ల ద్వారా పోలీస్ అధికారులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలాంటి తతంగం గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సర్వసాధారణంగా ఉండేది. పదేళ్ల అనంతరం మావోయిస్టుల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ మావోల అలజడి మొదలైంది. ఇటీవల ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అటవీ ప్రాంతంలో రెండుసార్లు ఎదురుకాల్పులు కూడా జరిగాయి. దీంతో డీజీపీ మహేందర్‌రెడ్డి రంగంలోకి దిగి అటవీ ప్రాంతాల్లో పర్యవేక్షించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మావోల ఏరివేతనా..? తరిమికొట్టడమా..? అంశంపై చర్చించారు. అదే సమయంలో మావోయిస్టులు పార్టీ పునర్మిర్మాణం చేసినట్లు రాష్ట్ర, జిల్లా, మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి జాబితాను ఇటీవల విడుదల చేయడం గమనార్హం. మావోల అణచివేతకు పోలీస్ యంత్రాంగం స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్, సివిల్ పోలీసులు వందలాది మందితో 24 గంటలపాటు అడవులను జల్లెడ పడుతున్నారు. పైగా ఉమ్మడి జిల్లా ఓఎస్డీగా మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి జిల్లాలో నక్సల్స్ ప్రస్థానం నక్సల్ ఉద్యమం ఉమ్మడి జిల్లాల్లో నాలుగు దశాబ్దాలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఉద్య మం పుట్టింది శ్రీకాకుళంలోనే అయినా ఉద్యమానికి ఊపిరిపోసింది మాత్రం ఇక్కడే. బడిపంతులైన కొండపల్లి సీతరామయ్య ఆధ్వర్యంలో జన్నారం మండలం తపాలపూర్‌కు చెందిన పితంబర్రావు దొరగడిపై జరిగిన దాడులు.. వారి సోదరుల హత్యతో భీతిల్లి గుండెపోటుతో మరణించినప్పటి నుంచి ఉద్యమం ఇక్కడి అడవుల్లో వేళ్లూనుకుపోయింది. తరచూ పోలీస్, పీపుల్స్ మధ్య వార్ కొనసాగేది. అదే తరహాలో మవోయిజం తెరమీదికి వచ్చింది. సమాచారం మాకు.. బహుమతి మీకు.. మావోయిస్టుల సమాచారం ఇచ్చి సహకరించాలని, సమాచారం ఇచ్చినవారికి తగిన పారితోషికం అందిస్తామని ఓఎస్డీ ఆరుగురు మావోయిస్టుల ఫొటొలతో కూడిన వా ల్ పోస్టర్‌ను విడుదల చేశారు. వీరి తలలకు గతంలోనే వెల కట్టినా.. తాజాగా విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని వెల్లడించారు. ఆదిలాబాద్ ఎస్పీ 944079500, నిర్మల్ ఎస్పీ 8332811100, ఆసిఫాబాద్ ఎస్పీ 8332801100, మంచిర్యాల డీసీపీ 9440795003, ఆసిఫాబాద్ అదనపు ఎస్పీ 8333986921కు సమాచారం ఇవ్వాలన్నారు. -
పట్టుదలతో మావోలు.. పంతంతో పోలీసులు
సాక్షి, బెల్లంపల్లి : వ్యూహ ప్రతి వ్యూహాలతో మావోయిస్టులు, పోలీసులు ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పటి పట్టుకోసం మావోలు ప్రయత్నాలు చేస్తుండగా ఆ వ్యూహాన్ని ఆదిలోనే తిప్పికొట్టేందుకు బహుముఖ వ్యూహాలతో పోలీసులు పథక రచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మావోయిస్టుల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు పోలీసు యంత్రాంగం అన్నిరకాలా సంసిద్ధమవుతోంది. ఆసిఫాబాద్ జిల్లా పరిధి తిర్యాణి అటవీప్రాంతం తొక్కిగూడ వద్ద ఇటీవల జరిగిన పరస్పర ఎదురు కాల్పుల ఘటనతో అటవీప్రాంతం అట్టుడుకుతోంది. మావోయిస్టులు తారసపడినట్లే పడి తృటిలో తప్పించుకోవడాన్ని పోలీసులు జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది. ఐదుగురు సభ్యులతో కూడిన దళం క్షణాల్లో తప్పించుకోవడం సంచలనమైంది. ఈ చర్యతో ఇరువర్గాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రవెల్లిలో మావోల కుటుంబీకులను పరామర్శిస్తున్న ఏసీపీ (ఫైల్) గిరిజన యువతను ఆకట్టుకుని పట్టుసాధించాలనే తలంపులో మావోలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, ఎలాగైనా అడ్డుకుని మావోలపై పైచేయి సాధించాలనే కృత నిశ్చయంతో పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తోంది. ఎదురు కాల్పుల ఘటన తర్వాత మావో లు కొత్తగా ఏర్పాటు చేసిన ఏరియా కమిటీలు ఒక్కసారిగా తెరమీదకు రావడం, పత్రికల్లో ప్రకటనలు రావడం మారిన పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఇదే క్రమంలో విప్లవ కవి వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాలను జైలులో నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న మావోయిస్టుపార్టీ రాష్ట్రబంద్‌కు పిలుపునివ్వడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈక్రమంలో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో బంద్ ప్రభావం ఏమేరకు ఉంటుందనేది చర్చనీయాంశమైంది. -
తెలంగాణలోకి ప్రవేశించిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్
-
మన్యంలో అలజడి..
సాక్షి, ఆసిఫాబాద్: ఏజెన్సీలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. కొంతకాలంగా కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం గుండాల అటవీ ప్రాంతంలో దళ సభ్యులు సంచరిస్తున్నారనే సమాచారంతో విస్తృతంగా పోలీసు ప్రత్యేక బలగాలు తనిఖీలు చేస్తున్నాయి. తిర్యాణి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న క్రమంలో మావోయిస్టుల జాడ కనుగొన్నారు. వెంటనే అప్రమత్తమైన దళ సభ్యులు పోలీసు బలగాల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ విషయం కుమురం భీం జిల్లా ఇన్చార్జి ఎస్పీ విష్ణువారియర్ ధ్రువీకరించారు. (జేజే ఆస్పత్రికి వరవరరావు తరలింపు) తప్పించుకున్న వారిలో సీపీఐ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు మైలవరపు అడెల్లు అలియాస్ భాస్కర్, కేబీఎం (కుమురం భీం మంచిర్యాల ఏరియా) సభ్యుడు వర్గేష్ కోయ అలియాస్ మంగులుతో పాటు మరో ముగ్గురు సభ్యులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కూంబింగ్‌లో విప్లవ సాహిత్యం, మావోయిస్టు యూనిఫాంలు, ఎలక్ట్రానిక్ పరికాలు, డిటోనేటర్లు, కార్డెక్స్ వైర్లు, పాలిథిన్ కార్పెట్స్ లభ్యమయ్యాయి. రూ.20లక్షల రివార్డు ఉన్న మైలారపు అడెల్లు స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర గ్రామం కాగా, వర్గేష్ ది చత్తీస్ఘడ్ ప్రాంతం. ఈయనపై రూ.5లక్షల రివార్డు ఉంది. పక్కా సమాచారంతో దాడులు.. గత రెండు నెలలుగా కుమురం భీం జిల్లా పరిధిలోని ఆసిఫాబాద్, తిర్యాణి అటవీ ప్రాంతంలో కేబీఎం దళ సభ్యులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం పోలీసు శాఖకు అందింది. దీంతో స్పెషల్ పార్టీతో పాటు స్థానిక పోలీసులతో రాత్రింబవళ్లు అడవుల్లో జల్లెడ పడుతున్నా రు. గత నెల 28న దళ సభ్యులకు అన్నం పెట్టివస్తున్న ఓ వ్యక్తిని ఆసిఫాబాద్ మండలం మోవాడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానిక ఆదివాసీల గూడాలపై, సానుభూతి పరులపై మరింత దృష్టి సారించి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తిర్యాణి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీసు బలగాల రాకను పసిగట్టి అక్కడి నుంచి మావోలు తప్పించుకున్నారని పోలీసులు చెబుతున్నారు. మంగీ, గుండాల, ఉట్ల పరిసర ప్రాంతాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి వారు వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. అడవుల్లోనే మకాం.. కరోనా సంక్షోభంలో పోలీసు యంత్రాంగం బిజీగా ఉన్న సమయంలో మహారాష్ట్ర సరిహద్దుల నుంచి జిల్లాలోకి మా వోలు అడుగుపెట్టినట్లు పోలీసులకు సమాచారం ఉంది. ఇన్నాళ్లు చత్తీస్‌గడ్‌లోని దండాకారణ్యంలో ఉన్న దళం మళ్లీ స్థానికంగా పట్టుపెంచుకునేందుకే వచ్చినట్లు పోలీసు వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక యువతను ఉద్యమబాట పట్టించేందుకు సిద్ధమవుతున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. పట్టుపెంచుకునేందుకేనా..? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మిలిటెంట్ దాడులకు ప్రసిద్ధిగాంచిన మంగీ దళం పూర్తిగా కనుమరుగైంది. 2016లో దళ సభ్యుడు ఆత్రం శోభన్ అలియాస్ చార్లెస్ పోలీసు ఎన్కౌంటర్లో మృతి చెందిన తర్వాత ఇక్కడ మావోల అలజడి కనిపించలేదు. జిల్లా పునర్విభన తర్వాత మంచిర్యాల కుమురం భీం ఏరియా (కేబీఎం)కి సారథ్యం వహిస్తూ.. స్థానికంగా పట్టున్న మైలరపు అడెల్లు అలియాస్ భాస్కర్‌తో పాటు మరో ముఖ్యమైన వ్యక్తి బండి ప్రకాశ్, అలియాస్ ప్రభాత్‌తో పాటు మరో ఐదుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తమ ఉనికిని చాటేందుకు మావోలు ఓ దాడికి కూడా యత్నించినట్లు సమాచారం. ఇటీవలే గిరిజన ప్రాంతంలో యువతీ యువకులు అదృశ్యమైన సంఘటనలు పోలీసుల దృష్టికి వస్తున్నాయి. వీరంతా ఉద్యమబాట పట్టారా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. -
ఏవోబీలో అలర్ట్
పాడేరు: ఏవోబీలో మావోయిస్టు నేతలు, యాక్షన్ టీమ్ సభ్యులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఒడిశా ప్రాంతానికి దగ్గరగా ఉన్న సీలేరు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, అరకులోయ పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అరకు సంతబయలు ప్రాంతంలో మావోయిస్టు యాక్షన్ టీమ్ సభ్యులు వచ్చి రెక్కీ నిర్వహించినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో వారి కదలికలపై నిఘా పెంచారు. ఇదీ పరిస్థితి... లాక్‌డౌన్‌తో మావోయిస్టులు కూడా తమ కార్యకలపాలకు విరామం ప్రకటిస్తున్నట్టు గత నెలలోనే ప్రకటన చేశారు. పోలీసులు కూడా అడవుల్లో కూంబింగ్ నిలిపివేశారు. అయితే మావోయిస్టులు జనావాసాల్లో సంచరిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో ఏవోబీలో నిఘాను పెంచింది. ఇటీవల చింతపల్లి ఏఎస్పీ సతీష్‌కుమార్ మావోయిస్టు యాక్షన్ టీమ్‌ల సంచారంపై ప్రకటన చేశారు. మావోయిస్టు పార్టీలోని కీలక నేతలు, యాక్షన్ టీమ్ సభ్యుల ఫొటోలతో కూడిన పోస్టర్లను పోలీసుశాఖ విడుదల చేసింది. వారి సమాచారం తెలిపిన వారికి రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకం అందజేస్తామని పేర్కొంది. -
మావోయిస్టు పార్టీలో కీలక మార్పులు
-
మావోయిస్టు కొత్త కమిటీ.. తెలంగాణకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఉద్యమ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి మావోయిస్టు పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే మంగళవారం నూతన కేంద్ర కమిటీని ఎన్నుకుంది. 21 మందితో మావోయిస్టు కేంద్ర కమిటీ జాబితా సిద్ధం చేసింది. నూతన కేంద్ర కమిటీలో తెలంగాణ నుంచి 10 మందికి స్థానం లభించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరి చొప్పున చోటు దక్కింది. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీగా పార్టీ సీనియర్ నేత నంబాల కేశవరావును (69) అలియాస్ బస్వరాజ్‌ను ప్రధాన కార్యదర్శిగా పార్టీ నియమించింది. -
మళ్లీ మావోయిస్టుల కదలికలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దులో మళ్లీ మావోయిస్టుల కదలికలు ఉన్నాయా? అంటే పోలీసు వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది. జూలై, ఆగస్టు మాసాల్లో గోదావరి పరీవాహక ప్రాం తంలో పలు ఘటనలకు పాల్పడిన మావోలు 4 నెలలుగా స్తబ్దతగా ఉన్నారు. వచ్చే ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర జరగనున్న నేపథ్యంలో మళ్లీ ఛత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టులు పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలు.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోకి చేరినట్లు సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. 2013 మే 25న సుకుమా జిల్లాలో సల్వాజుడుం అధినేత మహేంద్రకర్మతో పాటు పలువురిని చంపిన కేసులో ‘మోస్ట్ వాంటెడ్’గా మావోల జాబితాను విడుదల చేశారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన మావోల ఫొటోలు, పేర్లు, రివార్డులతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 3 రాష్ట్రాల సరిహద్దు ల్లో వాల్‌పోస్టర్లు వేసింది. తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా గోదావరి పరీవాహక ప్రాంతాల పోలీసులను అప్రమత్తం చేశాయి. దీంతో 3 రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు 3 రోజుల కిందట సమావేశమైనట్లు సమాచారం. మనోళ్ల డైరెక్షన్.. ఛత్తీస్‌గఢ్ కేడర్ యాక్షన్ ఛత్తీస్‌గఢ్, లాల్‌గఢ్ ప్రాంతాలలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన మావో యిస్టు పార్టీ నాయకులు, కేడర్‌తో పాటు.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 100 మంది వరకు సాయుధ నక్సల్స్ 3 గ్రూపులుగా తెలంగాణ సరిహద్దుల్లో ప్రవేశించి నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే విషయమై వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో గోదావరి పరీవాహక ప్రాంతాల పోలీసులను నిఘా వర్గాలు అప్రమత్తం చేసినట్లు తెలిసింది. మూడు రోజుల కిందట మావోల అణచివేత కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించిన ఓ సీనియర్ పోలీసు అధికారి ఈ ప్రాంతంలో పర్యటించి పలువురు పోలీసులతో మాట్లాడినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన మావోల్లో అత్యధికంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నట్లు వెల్లడించినట్లు తెలిసింది. అందులో 22 మంది వరకు తెలంగాణ ప్రాంతం కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు చెబుతున్నారు. 2016లో జిల్లాల పునర్ విభజన తర్వాత కేకేడబ్ల్యూ(ఖమ్మం – కరీంనగర్ – వరంగల్) కమిటీని ఎత్తివేసి దాని స్థానంలో మూడు డివిజన్ కమిటీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా యాప నారాయణ అలియాస్ లక్మా అలియాస్ హరిభూషణ్ వ్యవహరిస్తుండగా, బండి ప్రకాశ్ అలియాస్ క్రాంతి, బడే దామోదర్, మైలారపు భాస్కర్ సభ్యులుగా ఉన్నారు. మొత్తం సాయుధ బలగాలకు వీరే సారథ్యం వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయా నాయకుల సూచనల మేరకు దాడులు, కార్యక్రమాలకు పాల్పడుతారని గుర్తించిన ఇంటెలిజెన్స్ వర్గాలు... పోలీసులను అప్రమత్తం చేయడం చర్చనీయాంశమైంది. -
అయ్య బాంబోయ్..! టిఫిన్ బాక్స్ బాంబులు
జయపురం: నవరంగపూర్ జిల్లా రాయిఘర్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం సరగుడి డీఎన్‌కె గ్రామం రహదారిలో రెండు టిఫిన్ బాక్సులలో బాంబులు కనిపించడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. టిఫిన్ బాక్స్ బాంబులై ఉండవచ్చని ఆ ప్రాంత ప్రజలు అనుమానించి పోలీసులకు తెలియజేశారు. సోమవారం సాయంత్రం ఒక బాలుడు రోడ్డుపై ఆడుకుంటున్న సమయంలో కోళ్ల ఫారం సమీపంలో రెండు టిఫిన్ బాక్సులు కనిపించగా ఆ విషయం గ్రామస్తులకు తెలిపాడు. దీంతో గ్రామస్తులు వాటిని టిఫిన్‌బాక్స్ బాంబులని అనుమానించి పోలీసులకు తెలియజేశారు. సమాచారం మేరకు వెంటనే రాయిఘర్ పోలీసులు వచ్చి పరిశీలించి బాంబు డిస్పోజల్ టీమ్‌ను రప్పించారు. వారు వచ్చి ఒక బాంబును నిర్వీర్యం చేశారు. రెండో దానిని పేలకుండా చేసేందుకు ప్రయత్నిçస్తున్నారు. ఈ వార్త రాసే సమయానికి ఇంకా ఆ బాంబును నిర్వీర్యం చేయనట్లు సమాచారం. అయితే ఆ టిఫిన్ బాక్స్ బాంబులు ఆదివారం సాయంత్రం నుంచి ఆ ప్రాంతంలో పడి ఉన్నాయని సోమవారం వాటిని చూసిన తరువాత గ్రామస్తులు పోలీసులకు తెలియజేసినట్లు సమాచారం. ఆ టిఫిన్ బాక్స్‌లో బాంబులు ఎవరు పెట్టారు? ఎవరిని టార్గెట్ చేసి పెట్టారన్నది తెలియడం లేదు. రాయిఘర్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పాటు వారి కార్యకలాపాలు జోరుగా సాగుతున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దులో ఉంది. గత కార్యకలాపాలతో తీవ్ర భయాందోళన గతంలో రాయిఘర్ సమితిలోని అనేక ప్రాంతాలలో మావోయిస్టులు దాడులకు పాల్పడ్డారు. అంతే కాకుండా పలువురు వక్తులను ఇన్ఫార్మర్ల పేరిట హత్య చేసిన సంఘటనలు ఉన్నాయి. గతంలో ఉమ్మరకోట్ ఎంఎల్ఏ జగబంధు మఝిని కూడా మావోయిస్టులు హత్య చేశారు. అయితే రాయిఘర్ ప్రాంతంలో కొంత కాలంగా మావోయిస్టుల సంఘటనలు అంతగా జరిగినట్లు సమాచారం లేదు. తాజాగా రెండు టిఫిన్ బాక్స్ బాంబులు కనిపించడంతో ప్రజలు, పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మావోయిస్టులు ఎవరిని టార్గెట్ చేశారోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. సహజంగా మావోయిస్టులే టిఫిన్ బాక్స్‌లలో బాంబులు పెట్టి జవాన్లను గానీ మరెవరినైనా టార్గెట్ చేస్తారని అందరి అనుమానం. పోలీసుల దర్యాప్తులో ఈ విషయం తేలవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఆ ప్రాంతంలో మరేమైనా టిఫిన్ బాక్సు బాంబులు ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు అణువణువు పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
జార్ఖండ్: హేమంత్ సొరేన్ ముందున్న సవాళ్లు
రాంచీ: జార్ఖండ్‌లోని అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడటంతో.. అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వానికి పెనుసవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. నిరుద్యోగం, పేదరికం, పెట్రేగుతున్న మావోయిస్టు కార్యకలాపాలు, వేధిస్తున్న ఆహార కొరత, రాష్ట్రం పేరిట ఇప్పటికే ఉన్న రుణభారంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపే బాధ్యత కాబోయే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్‌పై ఉంది. దేశవ్యాప్తంగా ఆసక్తిరేపిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీల కూటమి మెజారిటీ సాధించడంతో ఈ నెల 27న ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పెను సవాళ్లతో సతమతం అవుతున్న జార్ఖండ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి, ప్రజల అంచనాలను అందుకుంటారా అనేది వేచిచూడాల్సి ఉంది. రూ. 85 వేల కోట్ల రుణభారం: జార్ఖండ్ ప్రభుత్వంపై ఇప్పటికే రూ. 85 వేల కోట్ల రుణభారం ఉంది. గతంలో రఘుబర్‌దాస్ ప్రభుత్వం కొలువుదీరక(2014) ముందు రూ. 37,593 కొట్ల అప్పు ఉండేది. అయితే రఘుబర్‌దాస్ ప్రభుత్వం హయాంలో అదికాస్త గణనీయంగా పెరిగింది. దీంతో రుణభారం తగ్గించే పని హేమంత్ సొరేన్ భుజ స్కంధాలపై పడింది. కాగా రాష్ట్రంలోని రైతులు సుమారు రూ. 6వేల కోట్లకు పైగా రుణం తీసుకున్నారు. కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం రైతుల పేరిట ఉన్న రుణాన్ని మాఫీ చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ పేరు తప్పిస్తారా? దేశంలో పేద రాష్ట్రంగా ముద్ర పడిపోయిన 'బిహార్'.. ఆ ట్యాగ్‌ను 2000 సంవత్సరం నుంచి తొలగించుకొంది. తరువాత నుంచి ఛత్తీస్‌గఢ్ 'పేద రాష్ట్రం'గా కొనసాగుతుంది. పేదరికం నుంచి కాస్త మెరుగుపడుతున్నా.. బీద రాష్ట్రానికి ఏమాత్రం తీసిపోని జార్ఖండ్ రాష్ట్ర జనాభాలో 36.96 శాతం మంది ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. జార్ఖండ్‌కు ఉన్న 'బీద' రాష్ట్రమనే పేరును తప్పించడం కూడా హేమంత్ సొరేన్ ముందున్న సవాలు. ఆహార కొరత: ఆకలి చావుల కారణంగా జార్ఖండ్ రాష్ట్రం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. 2017లో ఇదే రాష్ట్రంలోని సిమ్దేగా జిల్లాలో సంతోషి అనే 11 ఏళ్ల అమ్మాయి ఆకలితో మరణించడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జార్ఖండ్‌కు ప్రతియేటా సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు అవసరమవుతాయి. కానీ అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. దీంతో 10 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఖాళీని పూరించడం హేమంత్ సొరేన్ ముందున్న మరో సవాలు. మావోయిస్టుల కట్టడి, శాంతి భద్రతలు: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమైన జార్ఖండ్‌లో ఇప్పటికే మావోయిస్టులను అదుపు చేస్తున్నా.. ఇంకా 13 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉన్నాయి. అందులో ఖుంతి, లాతేహర్, రాంచీ, గుమ్లా, గిరిదిహ్, పలాము, గర్హ్వా, సిమ్దేగా, డుమ్కా, లోహర్దగా, బోకారో, ఛత్రా జిల్లాలు ఉన్నాయి. వీటిని మావోయిస్టు రహితంగా మలచడం హేమంత్ సోరెన్‌కు కత్తి మీద సామే. మూకదాడులతో రాష్ట్రానికి మచ్చ: పెరుగుతున్న మూకదాడుల కారణంగా జార్ఖండ్ రాష్ట్రం అపకీర్తిని మూట కట్టుకుంది. ఇక ఆ మచ్చను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిరుద్యోగ సమస్యను అధిగమిస్తారా? దేశంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాలలో జార్ఖండ్ ఒకటి. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రతి అయిదుగురిలో ఒకరు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ డెవలప్మెంట్ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో 46 శాతానికి పైగా పోస్టుగ్రాడ్యుయేట్లు, 49 శాతానికి పైగా గ్రాడ్యుయేట్లు ఎటువంటి ఉపాధి లేకుండా ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నారు. 2018-19లో నిర్వహించిన ఎకనమిక్ సర్వే ప్రకారం, సుమారు లక్షమందికి పైగా యువతకు ప్రభుత్వం ఉపాధి పథకాల కింద శిక్షణ ఇచ్చినా.. ప్రతి పదిమంది యువతలో ఎనిమిది మంది ఉద్యోగం కోసం వెతుకులాటలో ఉన్నారు. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయిన తరువాత నిరుద్యోగం అనే కష్టతరమైన సవాలును ఎదుర్కొని రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. వాగ్దానాలను నిలబెట్టుకుంటారా? 'రాష్ట్రంలో నిరుద్యోగమనేది దీర్ఘకాలిక వ్యాధి, మహమ్మారిలా వ్యాపించి మితిమీరుతుంది' అని హేమంత్ తన ఫేసుబుక్‌లో చెప్పుకొచ్చారు. 'దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం రేటు 7.2 శాతం ఉండగా, జార్ఖండ్ రాష్ట్రంలో మాత్రం 9.4 శాతంగా ఉంది. రఘుబర్‌దాస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి కల్పన పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిందని, సుమారు నాలుగు లక్షలకు పైగా నిరుద్యోగులు అధికారికంగా నమోదైనట్లు పేర్కొన్నారు. ఒకవేళ తమ ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే.. వంద శాతం నిరుద్యోగ యువతకు రాష్ట్రంలోనే ఉపాధి కల్పిస్తామని వాగ్దానం చేశారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి లభించేవరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. -
కలవరపెడుతున్న కరపత్రాలు
సాక్షి, ములుగు : జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో వరుసగా జరుగుతున్న మావోయిస్టు కరపత్రాల విడుదల జిల్లా యంత్రాంగానికి తలనొప్పిని తెచ్చిపెడుతోంది. ఈ నెల 17న, 24న వేర్వేరుగా రెండు కరపత్రాలు విడుదల కావడంతో కలకలాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ, బీజేపి నాయకులు, ఆదివాసీ సంఘాలు, అధికారులను టార్గెట్ చేస్తూ విడుదల కావడంతో ఆందోళనకు గురి చేస్తుంది. జిల్లాలోని ఏటూరునాగారం, వెంకటాపురం(కె), మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లోని అధికార పార్టీ నాయకులు, అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తిప్పి కొట్టిన ప్రజాప్రతినిధులు.. గడచిన వారం రోజుల్లో జిల్లాలో నాలుగు సార్లు కరపత్రాలు విడుదల కావడంతో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు, అధికారుల్లో గుబులు మొదలయ్యింది. తాము చేయని తప్పుకు తలదించాల్సిన అవసరం లేదని కొంతమంది ధైర్యంగా మావోయిస్టుల హెచ్చరికలను తప్పికొట్టారు. మరికొంత మంది ఆందోళన చెందుతున్నారు. మావోయిస్టులు విడుదల చేసిన కరపత్రాలపై ఈ నెల 18న జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఘాటుగా స్పందించారు. భూ ఆక్రమణలకు, అవినీతి అక్రమాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేటతెల్లం చేశారు. అలాగే ఈ విషయంపై స్పందించిన ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య ములుగులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మావోయిస్టుల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు కరపత్రాల విషయంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. ఈ మేరకు కరపత్రాల్లో పేర్కొన్న ప్రధాన అంశాలను పరిశీలిస్తుంది. ఇందులో భాగంగా గత మూడు రోజుల క్రితం ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు, అధికారులను ఏటూరునాగారం స్టేషన్‌కి పిలిపించి తగిన వివరాలను సేకరించారు. స్థానికంగా ఉండకుండా పట్టణ ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లిన సమయంలో ముందస్తు సమాచారం అందించాలని సూచించారు. దీంతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధుల కదలికలపై ఆరా తీస్తున్నారు. మొదటి కరపత్రంలో ఇలా.. లంచగొండి అధికారులు, రాజకీయ నాయకులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఈ నెల 17న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఏటూరునాగారం–మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సబిత పేరుతో విడుదలైంది. ఇందులో ఏటూరునాగారంలోని కొంత మంది నాయకులు ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్, ఉమ్మడి భూపాలపల్లి, ములుగు జిల్లాల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రియల్ ఎస్టేట్ దందాలు, భూ ఆక్రమాలు, గుండాయిజం, అవినీతి అక్రమాలు, పైరవీల పెత్తనాలు చేస్తూ 34 ఎకరాల భూమిని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అందులో ఆరోపించారు. అలాగే ఏటూరునాగారం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి వైద్యుల కారణంగానే సామాన్య గిరిజనులు వైద్యసేవలో ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేటును ఆశ్రయించి వేలాది రూపాయలను ఖర్చు చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కొట్లాది రూపాయలను వెచ్చించినా వాటిని గిరిజనుల అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చుచేయలేదని ఐటీడీఏ పీఓ, ఏపీఓల వైఖరిని తప్పుబట్టారు. రెండో కరపత్రంలో.. జిల్లాలోని వెంకటాపురం(కె) మండలంలోని టీఆర్ఎస్ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని భూ దందాలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడి ప్రశ్నించిన వారిని పోలీసుల ప్రోత్భలంతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని భారత కమ్యునిస్టు పార్టీ (మావోయిస్టు) వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ ఈ నెల 24న ఓ కరపత్రంలో పేర్కొన్నారు. మండలంలోని సుడిబాక గ్రామానికి చెందిన 56 మంది రైతుల 150 ఎకరాల భూములను కొంత మంది నాయకులు కబ్జా చేశారని కరపత్రంలో తెలిపారు. జీఎస్పీ, ఏవీఎస్పీ సంఘాలకు చెందిన వారు కూడా వత్తాసు పలుకుతూ లబ్ధిపొందుతున్నారని ఆరోపించారు. లక్ష్మీనగరం, దానవాయిపేట గ్రామాల ఆదివాసీలకు చెందిన 27 ఎకరాల భూమిని ఆక్రమించి పట్టాలు చేసుకున్నారని, అమాయక ఆదివాసీలు నిత్యం అధికారులు, కోర్టుల చుట్టూ న్యాయం కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నారన్నారు. రైతుల నుంచి ఆక్రమించిన భూమిని వెంటనే వారికి అప్పగించాలని, లేనిపక్షంలో ప్రజల చేతుల్లో శిక్షతప్పదని కరపత్రంలో హెచ్చరించారు. -
మావోల హింస వల్లే అత్యధిక ప్రాణనష్టం
సాక్షి, అమరావతి: దేశంలోని అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో విస్తరించేందుకు మావోయిస్టు పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోందని, ఈ క్రమంలోనే హింసాత్మక ఘటనలకు పాల్పడుతోందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన ఏడాది కాలంలో జరిగిన మొత్తం హింసాత్మక ఘటనల్లో 88 శాతం కంటే ఎక్కువ మరణాలకు మావోయిస్టులే పేర్కొంది. దేశవ్యాప్తంగా శాంతిభద్రతల పరిస్థితిపై (2018–2019 మార్చి వరకు) కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దేశంలో వివిద వామపక్ష తీవ్రవాద సంస్థల్లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు) అత్యంత శకిమంతంగా ఉందని నివేదికలో స్పష్టం చేసింది. తీవ్రవాద ప్రభావిత 10 రాష్ట్రాల్లో మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడటంతో గడిచిన తొమ్మిదేళ్లలో 3,749 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 2010 నుంచి 2018 వరకు మొత్తం 10,660 ఘటనలు చోటుచేసుకోగా, వాటిలో 3,749 మంది మరణించారు. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించేలా ప్రజలతో పోలీసులు మమేకం కావాలని హోం శాఖ నివేదికలో సూచించింది. మావోయిస్టుల ప్రభావం ఉన్నచోట ప్రజల భద్రతతోపాటు ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక(యాక్షన్ ప్లాన్) అమలు చేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వివరించింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పలు పథకాల ద్వారా నిధులు విడుదల చేసి, మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలియజేసింది. మరోవైపు మావోయిస్టులను కట్టడి చేయడానికి పోలీసు బలగాల సంఖ్యను పెంచడంతోపాటు భద్రతా సిబ్బందికి అధునాతన ఆయుధాలు, హెలికాఫ్టర్లు తదితర అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నట్టు పేర్కొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తక్కువే.. మావోయిస్టుల హింసాత్మక ఘటనలు ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే తక్కువ. మావోయిస్టుల హింసాత్మక ఘటనల విషయంలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్రలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఉనికి తగ్గిపోతోందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2013లో 10 రాష్ట్రాల్లో 76 జిల్లాల్లోని 330 పోలీస్ స్టేషన్ల పరిధిలో మావోయిస్టుల ప్రభావం ఉండేది. 2018 నాటికి 8 రాష్ట్రాల్లోని 60 జిల్లాల పరిధిలో 251 పోలీస్ స్టేషన్ల పరిధిలోనే వీరి ప్రభావం కనిపించింది. ఏపీలో మావోల హింసాత్మక ఘటనలు.. మృతులు ఏడాది ఘటనలు మృతులు 2010 100 24 2011 54 9 2012 67 13 2013 28 7 2014 18 4 2015 35 8 2016 17 6 2017 26 7 2018 12 3 -
ఘణపురంలో మావోయిస్టుల కరపత్రాలు
సాక్షి, ములుగు: జిల్లాలోని వాజేడు మండలం ఘణపురం గ్రామ శివారులో గురువారం మావోయిస్టుల కరపత్రాలు కలకలం సృష్టించాయి. ఈ నెల 21 నుంచి నవంబర్ 8 వరకు మావోయిస్టుల 15వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని మావోలు విడుదల చేసిన కరపత్రాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కరపత్రాలు సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో వెలిశాయి. -
అబూజ్‌మాడ్‌లో అగ్రనేతలు
పెద్దపల్లి: కాకులు దూరని కారడవులు.. ఎత్తయిన కొండలు.. దట్టమైన దండకారణ్యం. గౌతమి, ఇంద్రావతి, శబరి, లాహిరీ నదుల పరిసరాలను విస్తరించిన అబుజ్‌మాడ్‌పై క్రమంగా పోలీసులు పట్టు సాధిస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో దండకారణ్యంలో జరిగిన నాలుగు ఎన్కౌంటర్ సంఘటనలో రెండు అబూజ్మాడ్ కొండల్లోనే సాగడం ఇందుకు నిదర్శనం. మోస్ట్ వాంటెడ్ నేతలంతా మాడ్ ప్రాంతంలోనే ఉన్నట్లు భావిస్తున్న కేంద్ర బలగాలు.. ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా అబూజ్మాడ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. వందలాది ఎన్కౌంటర్లతో నష్టపోతున్న మావోయిస్టు పార్టీకి ఇప్పటికీ అబూజ్మాడ్ ప్రాంతంలో పటిష్టమైన నాయకత్వంతో జనతన సర్కార్‌ను నడుపుత్నునారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర ప్రాంతాలను ఆనుకుని ఉన్న నారాయణపూర్ ఖాంకేర్, రాజ్‌నంద్‌గామ్, జిల్లాల్లో విస్తరించిన అబూజ్మాడ్ ప్రాంతంలోని కొండలను స్థావరాలుగా ఏర్పాటు చేసుకున్న మావోయిస్టు పార్టీ 38 ఏళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లో పోటీ ప్రభుత్వాన్ని నడుపుతోంది. వేల మైళ్ల అడవులతోపాటు నైబేరడీ గౌతమినదీ, పర్లకోటనదీ, ఇంద్రావతి, శబరి, లాహిరీ లాంటి నదులు పార్టీ దళాలకు దారి చూపే మార్గాలుగా ఉన్నాయి. తెలంగాణ, జార్ఖండ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్ట పోయినా ఇంకా 14 రాష్ట్రాల్లో ప్రాబల్యం ఉంది. అయితే అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆ పార్టీకి అబూజ్మాడ్ ప్రాంతం గుండెకాయలాంటింది. ఆయుధాల తయారీ సహా పార్టీకి చెందిన దళాలకు రాజకీయ శిక్షణ, సైనిక శిక్షణ అంతా అబూజ్‌మాడ్‌లోనే జరుగుతున్నాయి. అబూజ్‌మాడ్‌ను గుర్తించడానికి వందలసార్లు హెలీకాప్టర్లతో సర్వేలు నిర్వహించిన పోలీసు బలగాలు క్రమంగా చొచ్చుకెళ్తున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన కమెండోలు, కోబ్రా దళాలు, ఆక్వా ఫోర్స్, ఆదివాసీలకు చెందిన స్పెషల్ ఆఫీసర్ (ఎస్పీఓ)లు మావో దళాల కోసం నిత్యం అబూజ్మాడ్ ప్రాంతాన్ని గాలిస్తూ, తమ ఆ«దీనంలో తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే దశబ్దా కాలంగా పోలీసులు అబూజ్‌మాడ్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నించి వడ్స, బాంమ్రాఘడ్, చింతల్‌నాల్ లాంటి ప్రాంతాల్లో సైన్యం దెబ్బతిన్నది. చింతల్‌నాల్, మస్పూర్, ఖాంకేర్‌లలో మూడు సంఘటనలోనే వంద మందికిపైగా పోలీసులు మరణించారు. రాష్ట్రాల్లోని మావోయిస్టు కమిటీలలో మాడ్ డివిజన్ కమిటీ కీలకమైంది. ఆ కమిటీ అదీనంలోనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కీలక నేతలు ఉంటారని ప్రచారం. మోస్ట్ వాంటెడ్ మావోల స్థావరంగా అబూజ్‌మాడ్‌ను గుర్తించారు. -
ఏజెన్సీలో బూట్ల చప్పుళ్లు!
విశాఖపట్నం,అరకులోయ/పెదబయలు: మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాలు ఏవోబీలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ మావోయిస్టులు అధికంగా సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జోరువానలో తడుస్తూనే గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కూంబింగ్‌తో అడవిని జల్లెడ పడుతున్నారు. దీంతో పోలీసులు, మావోయిస్టుల బూట్ల చప్పుళ్లతో అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్లకే గిరిజనులు పరిమితం మావోయిస్టులు తలపెట్టిన అమరవీరుల వారోత్సవాలు ముగిసేంత వరకు గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాల పరిధిలోని గిరిజన ప్రజలతో పాటు ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, చింతపల్లి, జి.కె.వీధి మండలాల పరిధిలోని మావోయిస్టుపభావిత గ్రామాల గిరిజనులంతా తమ ఊర్లకే పరిమితమయ్యారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. బలిమెల రిజర్వాయర్ కటాప్ ఏరియాలోని గిరిజనులు రిజర్వాయర్‌లో లాంచీల ప్రయాణాన్ని మానుకున్నారు. ఏవోబీలోని గిరిజనులకు ప్రధాన మార్కెట్ ప్రాంతమైన ఒనకఢిల్లీకి గిరిజనుల రాకపోకలు తగ్గాయి. నిలిచిపోయిన బస్సులు : ఏజెన్సీలోని మారుమూల గ్రామాలు, సరిహద్దు ఒడిశాలోని గ్రామాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. పాడేరు డిపో నుంచి పెదబయలు, ముంచంగిపుట్టు మండల కేంద్రాల వరకు ఆర్టీసీ బస్సులు నడుపుతుండగా, మారుమూల గ్రామాల సర్వీసులను రద్దు చేశారు. ప్రైవేటు వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ముంచంగిపుట్టు మండలం కుమడ నుంచి ఒడిశాలోని కటాప్ ఏరియాతో రవాణా సంబంధాలు నిలిచాయి. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో మావోయిస్టుల అమరవీరుల స్థూపాలు అధికంగా ఉండడంతో గిరిజనులు మరింత భయపడుతున్నారు. మన్యంలో ఉద్రిక్తత : అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టులు ప్రచారం చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారోత్సవాలను భగ్నం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. పైచేయి కోసం పోలీసులు, మావోయిస్టులు ఎవరికివారే ప్రయత్నం చేస్తుండడంతో విశాఖ మన్యంతో పాటు ఏవోబీలో ఉద్రిక్తత నెలకొంది. ఏవోబీలో ప్రత్యేక పోలీసు బలగాలు కూడా కూంబింగ్ చర్యలను చేపడుతున్నాయి. కటాప్ ఏరియాలో మల్కన్‌గిరి, కోరాపుట్ పోలీసు పార్టీలు, ఏజెన్సీ మారుమూల అటవీ ప్రాంతాలలో విశాఖ జిల్లా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మందుపాతరలపై పోలీసుల నిఘా మావోయిస్టులు ఏజెన్సీతో పాటు సరిహద్దులోని ఒడిశా రోడ్లలో మందుపాతరలు అమర్చి ఉంటారనే అనుమానాలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కూంబింగ్ పార్టీలతోపాటు బాంబు తనిఖీ బృందాలు కూడా సంచరిస్తున్నాయి. మందుపాతరలు, ఇతర పేలుడు సామగ్రిని గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపడుతున్నారు. ఆదివారం ముంచంగిపుట్టు నుంచి జోలాపుట్టు, ఒడిశాకు పోయే ప్రధాన రోడ్లలో బాంబు, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఏజెన్సీలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలు జరుగుతున్నాయి. అన్ని వాహనాలను తనిఖీ చేసి,అనుమానిత వ్యక్తుల లగేజీ బ్యాగ్‌లను క్షుణంగా సోదా చేస్తున్నారు.ఒడిశా నుంచి అరకు ప్రధాన రోడ్డులో కూడా పోలీసుల తనిఖీలు మమ్మురమయ్యాయి. పాడేరు, ముంచంగిపుట్టు మండలాల నుంచి వచ్చే వాహనాలను స్థానిక ఎస్సై రాజారావు ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. -
టీఆర్ఎస్ శ్రేణుల్లో గుబులు..
సాక్షి, ఏటూరునాగారం: మావోయిస్టు అమరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీలోని టీఆర్ఎస్ నాయకుల్లో గుబులు పుట్టింది. మావోయిస్టు నక్సల్స్ టీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఒక్కసారిగా టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న టీఆర్ఎస్ నాయకులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కే) మండలాలకు చెందిన అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులను సురిక్షత ప్రాంతాలకు తరలివెళ్లాలని పోలీసులు ఆదేశాలు ఇవ్వడంతో సేఫ్ జోన్లోకి వెళ్లినట్లు సమాచారం. చిట్యాల, రేగొండ, టేకుమట్ల, పలిమల వంటి ప్రాంతాల్లోని టీఆర్ఎస్ నాయకులతోపాటు టార్గెట్‌లో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా గ్రామాల్లో ఉండొద్దని రాష్ట్ర స్థాయి పోలీసు అధికారులను స్థానిక అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో పోలీసులు వారికి సెల్‌ఫోన్, మేసేజ్‌తోపాటు, లిఖిత పూర్వకంగా కూడా ముందస్తు హెచ్చరికలను అందజేశారు. పూర్వపు ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో పోలీసులు నాయకులను, టార్గెట్లను అప్రమత్తం చేస్తూ వారికి రక్షణ కల్పిస్తున్నారు. జూలై 12న కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని బేస్తకొత్తూరుకు చెందిన పెదమిడిసిలేరు ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును ఈనెల 8న మావోయిస్టులు అపహరించుకు తీసుకెళ్లారన్నారు. ఈనెల 12న ఛత్తీస్‌గఢ్‌లోని పుట్టపాడుకు వెళ్లే మార్గంలో శ్రీనివాసరావు మృతదేహాన్ని ఆయన బైక్‌ను వదిలిపెట్టి వెళ్లారు. అక్కడే అతడిని హతమార్చారు. అయన టీఆర్ఎస్ పార్టీ కావడంతో తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి వాటిని ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సవాల్‌గా తీసుకొని ప్రత్యేక చర్యలను ముమ్మరం చేశారు. అడవుల్లో కూంబింగ్‌తోపాటు అనుమానితులను అదుపులోకి తీసుకోవడం, గొత్తికోయగూడెంల్లో ఆకస్మిక తనికీలు, కార్డెన్ సెర్చ్ కార్యక్రమాలను చేపడుతున్నారు. అంతర్రాష్ట్ర ప్రధాన రోడ్డు అయిన ఛత్తీస్‌గఢ్– హైదరాబాద్ ప్రాంతాల మధ్యలోని ఏటూరునాగారం వై జంక్షన్, ముల్లకట్ట బ్రిడ్జి వద్ద పోలీసులు గట్టి నిఘా వేసి తనిఖీలను తీవ్ర స్థాయిలో చేపడుతున్నారు. ఏజెన్సీలో పోలీసుల తనిఖీలు, మావోయిస్టుల కదలికలతో ప్రజలు భయాందోళనలో గడుపుతున్నారు. -
ఉలిక్కిపడిన మన్యం
సాక్షి, భామిని–సీతంపేట: ఏజెన్సీ ఉలిక్కిపడింది. ప్రశాంతంగా ఉన్న సరిహద్దులో మావోయిస్టు డంప్ లభించడం అలజడి రేపింది. ఈ నెల 28 నుంచి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఓబీలోని దోనుబాయి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు డంప్ లభ్యమైంది. కూంబింగ్‌కు వెళ్తున్న పోలీసులను లక్ష్యంగా చేసుకునే ఈ డంప్ ఇక్కడ పెట్టారని పోలీసు అధికారులు ప్రకటించడం గమనార్హం. సీతంపేటలో వాలీబాల్ టోర్నమెంట్‌కు హాజరయ్యేందుకు ఎస్పీ అమ్మిరెడ్డి వచ్చిన తరుణంలో కూంబింగ్‌కు వెళ్లిన సాయుధ బలగాలకు డంప్ దొరకడంతో మావోల ఉనికిపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. గతంలోనూ ఇదే ఏజెన్సీలోని తివ్వాకొండ పరిసరాల్లో మావోల డంప్‌లు దొరికాయి. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే మాటిమాటికీ డంప్‌లు దొరుకుతున్నా యి. తివ్వాకొండలను మావోయిస్టులు తమ సేఫ్టీ జోన్‌గా భావిస్తారు. పోలీసులకూ ఈ సమాచారం ఉంది. ఈ విషయాన్ని బలపరుస్తూ ఈ కొండ చుట్టూనే డంప్‌లు పలుమార్లు లభ్యమయ్యాయి. డంప్ లభ్యం సీతంపేట మండలం దోనుబాయి సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉంచిన డంప్‌ను పోలీసులు గుర్తించినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు. దోనుబాయి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా డంప్ లభించినట్లు వివరించారు. వాటిలో ఆరు ల్యాండ్మైన్లు ఉన్నట్లు గుర్తించామని, సాంకేతిక నిపుణుల సాయంతో నిర్వీర్యం చేసి బయటకు తీశామని తెలిపారు. ల్యాండ్‌మైన్స్‌తో పాటు ఆరు డిటోనేటర్లు కూడా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఓ నాటు తుపాకీ, టార్చిలైట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లభ్యమైన నాటు తుపాకీ పనిచేసే స్థితిలో ఉండడాన్ని చూస్తే ఏడెనిమిదేళ్ల కిందట ఈ డంప్‌ను భూమిలో పాతిపెట్టి ఉండవచ్చని ఎస్పీ అభిప్రాయపడ్డారు. వీటిని గుర్తించిన సిబ్బందికి రివార్డులు ఇస్తామన్నారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీలు కృష్ణవర్మ, శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రివార్డుల ప్రకటనతో.. కొన్నేళ్లుగా ఏఓబీలో ప్రశాంత వాతావరణం నెలకొంది. హింసాత్మక ఘటనలు జరగలేదు. అయితే ఇటీవల ఆంధ్రా ఒడిశా సరిహద్దులోనే పోలీసు ఇన్ఫార్మర్లనే నెపంతో గిరిజనులను హతమార్చిన ఘటనలు వెలుగు చూశాయి. అంతలోనే పోలీసులు కూంబింగ్ నిర్వహించడం, వారికి డంప్ దొరకడంతో ఇక్కడ మావోయిస్టుల కదలికలపై అనుమానాలు బలపడుతున్నాయి. దీనికి తోడు ఇటీవల భామినిలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని నేరుగా నిషేధిత మావోయిస్టుల వివరాలను ప్రకటించారు. వారిని పట్టిస్తే రివార్డులు కూడా అందిస్తామని చెప్పారు. మావోల కదలికలపై అంతర్గతంగా ఇంటెలిజెన్స్ ఇచ్చిన హెచ్చరికలతోనే పోలీసులు వ్యూహాత్మకంగా ఈ అడుగులు వేశారనే వాదన వినిపిస్తోంది. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ తరుణంలో ప్రతీకార చర్యలకు దిగడం కూడా మావోలకు ఆనవాయితీ. ఈ తరుణంలోనే పోలీసులకు డంప్ దొరికింది. దీంతో అక్కడక్కడా ఉన్న మావో సానుభూతిపరులపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఓయూ విద్యార్థి అరెస్ట్ !
భీమదేవరపల్లి: ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ చదువుతున్న వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌కు చెందిన ఉగ్గె భరత్‌ను ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్‌లో పోలీసులు గురువారం అరెస్ట్ చేసినట్లు తెలిసింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో వారు పథకం ప్రకారం అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లా శాతావాహన యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు స్టడీ టూర్ పేరిట ఛత్తీస్‌ఘడ్‌కు వెళ్లి మావోయిస్టులను కలిసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ స్టడీ టూర్లో భరత్ సైతం ఉన్నట్లు పోలీసులు అనుమానించి అతడిపై నిఘా పెంచినట్లు తెలుస్తోంది. భరత్ ఇటీవలే జీవిత ఖైదు అనుభవించి జైలు నుంచి విడుదలైన మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు ఉగ్గె చంద్రమౌళి ఉరఫ్ మదన్‌లాల్ సోదరుడు ఉగ్గె శేఖర్ కుమారుడు కావడం చర్చనీయాంశంగా మారింది. భరత్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోలీసులు తీసుకెళ్లారా.. లేక ఛత్తీస్‌ఘడ్‌లోనే అరెస్ట్ చేశారా అనేది తెలియరాలేదు. ఇదిలా ఉండగా.. తమ కుమారుడికి మావోయిస్టులతో ఎలాంటి సంబంధం లేదని.. అనవసరంగా పోలీసులు తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని భరత్ తండ్రి శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
మన్యంలో యాక్షన్ టీం?
సాక్షి, మహబూబాబాద్: కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో చాలా రోజుల తరువాత మావోలు వచ్చారనే చర్చ సాగుతోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం విస్తరించి ఉండటం, చత్తీస్ఘడ్ అటవీ ప్రాంతం నుంచి నేరుగా జిల్లాలోకి వచ్చే అవకాశాలు ఉండటంతో మావోయిస్టు యాక్షన్ టీం వచ్చినట్లు చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే యాక్షన్ టీం సభ్యులు మండలాల్లో సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మండలంతో సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఇక్కడి ఆర్ఎంపీ డాక్టర్ వద్ద చికిత్స చేయించుకున్నారని సమాచారం. యాక్షన్ టీంలు వస్తే ఎందుకు వచ్చారు? ఇన్ఫార్మర్లుగా పనిచేసే వారిని గాని, అధికార పార్టీ నాయకులను గానీ టార్గెట్ చేసేందుకు వచ్చారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. టార్గెట్‌గా ఉన్న రాజకీయ నాయకులను, ఇన్ఫార్మర్లను కొద్ది రోజుల పాటు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌ఘడ్ నుంచి మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, భద్రన్న, ధర్నన్న తదితరులతో కూడిన యాక్షన్ టీం కొత్తగూడ, గంగారం మండలాల్లో సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దశలో రెండు రోజులుగా పోలీసులు మావోయిస్టు సానుభూతి పరులు, మద్దతు దారులను, అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు విచారించి, వివరాలు సేకరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో మావోల కదలికలతో కలకలం కొనసాగుతోంది. హరిభూషణ్ వచ్చాడా.. గంగారం మండలంలోని మడగూడ గ్రామానికి చెందిన మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ ఆలియాస్ హరిభూషణ్, భద్ర న్న, ధర్మన్నలు వారి యాక్షన్ టీంతో జిల్లాలోకి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. గంగారం మండలంలోని మడగూడెం గ్రామానికి చెందిన మావోయిస్ట్ అగ్ర నాయకుడు యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ 40మంది మావోలతో కలసి కోమట్లగూడెం, జంగాలపల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతానికి వచ్చినట్లు చర్చ సాగుతోంది. ఈ ప్రాంతంలో స్వగ్రామమైన మడగూడెం వస్తున్నాడని, వచ్చి వెళ్లారని రక రకాల వాదనలు వినిపిస్తున్నాయి.10సంవత్సరాల క్రితం గ ట్టి నిర్భందం సమయంలో పెద్దఎల్లాపూర్ గ్రామంలో ఒక భూ వివాదాన్ని పరిష్కరించడానికి రాష్ట్ర కార్యదర్శి హోదాలో 200మంది మావోలతో గ్రా మాన్ని చుట్టుముట్టి హరిభూషణ్ సమస్యపై ప్రజా దర్భార్ నిర్వహించి సంచలనం సృష్టించారు. కేంద్ర కమిటీ నాయకుడిగా ఎదిగిన హరిభూషణ్ కొత్తగూడకు వచ్చే అవకాశాలు తక్కువనే మరో చర్చ కొనసాగుతోంది. ఈ చర్చ ఎంత వరకు వాస్తవం అనేది తేలాల్సి ఉంది. ఒక వేళ హరిభూషణ్ వస్తే ఎందుకు, ఏ విషయంపై వచ్చాడని, సాధారణంగా అతడు ఈ ప్రాంతానికి రాడు అని సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. కొత్త రిక్రూమెంట్ కోసమేనా..? తెలుగు రాష్ట్రాలలో గతంలో జరిగిన వరుస ఎన్కౌంటర్లు, వరుస లొంగుబాట్లు మావోయిస్టు పార్టీకి నష్టం చేకూర్చాయి. ప్రపంచీకరణంతో పాటు, పోలీసుల నిఘా పెరగటం, తదితర కారణాలతో గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు రిక్రూమెంట్ ఆగిపోయింది. దీంతో పార్టీ బలహీనంగా మారి, మావోయిస్టు ప్రభావం తగ్గిపోయింది. ఈ దశలో తిరిగి నూతన రిక్రూట్మెంట్ కోసం మావోయిస్టు యాక్షన్ టీం తిరిగి జిల్లాలోకి ప్రవేశించిందా..? లేకపోతే గత కొద్ది రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో పోడు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఖరీఫ్ సాగు ప్రారంభం కావటం, పోడు సాగు చేయకుండా అధికారులు అడ్డుకుంటున్నా రు. ఈ దశలో ఏజెన్సీ ప్రాంతంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా మావోలు మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించుకునేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫారెస్ట్ దాడుల్లో భూములు కోల్పోయిన వారిని దళంలో చేర్చుకుని బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో మావోలు ఉన్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం. ఇదే రిక్రూట్మెంట్కు మంచి సమయం అని మావోయిస్టు యాక్షన్ టీం ఏజెన్సీ గ్రామాల్లోకి ప్రవేశించిందని పోలీసులు భావిస్తున్నారు. డేగ కన్నులతో.. యాక్షన్ టీం జిల్లాలో ప్రవేశించిందనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రెండు రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు. గతంలో పార్టీలో పనిచేసిన వారు, సానూభూతి పరులను విచారిస్తున్నారు. వారి పై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. ఈ దశలో ఏ క్షణంలో ఏమి జరుగునోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సాధారణ తనిఖీలు చేస్తున్నాం ఏజెన్సీ మండలాల్లో మావోయిస్టు యాక్షన్ టీం ప్రవేశించినట్లు ఎటువంటి సమాచారం లేదు. అలాంటివి అన్ని ఊహాగానాలే. నెల రోజులుగా ఏజెన్సీలో సాధారణ తనిఖీలు చేపడుతున్నాం. అనుమానాస్పద వ్యక్తుల సంచారం ఉంటే మీ దగ్గరిలోని పోలీసులకు సమాచారం అందించండి. –నంద్యాల కోటిరెడ్డి, ఎస్పీ -
తెలంగాణకు ఛత్తీస్‌గఢ్ ‘మావో’లు!
పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఛత్తీస్‌గఢ్ మావోయిస్టులు వస్తున్నారా..? పోలీసులు మాత్రం వచ్చారనే అంటున్నారు. ఈ మేరకు పలుచోట్ల ఛత్తీస్‌గఢ్ మావోయిస్టులను పట్టుకుంటే రూ.5 లక్షల చొప్పున రివార్డులు ఇస్తామని పోస్టర్లు వేస్తున్నారు. మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసిన యాక్షన్ టీంలో ఉన్న భద్రు, లింగు, గంగాబీ, పాండు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారే. వారి కదలికలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఆదివాసీ ప్రాంతానికి చెందిన యువకులకు ధైర్యసాహసాలు ఎక్కువ ఉంటాయి. అలాంటివారే మావోయిస్టులో చేరుతుంటారు. ప్రస్తుతం ఆదివాసీ తెగకు చెందినవారే మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ ఉత్తర తెలంగాణ కార్యకలాపాల విస్తరణ కోసం వచ్చినట్లు భావిస్తున్నారు. వారిని పట్టుకునేందుకు పోస్టర్ల ప్రచారం ప్రారంభించారు. గతంలో ఇటు నుంచి అటు గతంలో ఉమ్మడి జిల్లాకు చెందిన అనేక మంది నక్సలైట్లు, మావోయిస్టులపై వివిధ రాష్ట్రాల్లో నగదు రివార్డులు ఉన్నాయి. మన వాళ్లను ఆయ రాష్ట్రాల్లో పట్టుకుంటే రూ.లక్ష నుంచి పాతిక లక్షల మేరకు ఖరీదులు ఉన్నాయి. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టుపార్టీ యాక్షన్ టీం దళం ఒకటి ఖమ్మం, వరంగల్, భూపాలపల్లి మీదుగా రాష్ట్రంలో ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. దీని కోసం ఆరుగురు సభ్యులతో కూడిన యాక్షన్ టీంను పట్టుకున్న సమాచారం అందించిన ఒక్కొక్కరిపై రూ.5 లక్షల మేర రివార్డును అందిస్తామని పోలీస్ యంత్రాంగం రైల్వేస్టేషన్లు, బస్టాండ్ ప్రధాన కూడళ్ల వద్ద పోస్టర్లను అంటించారు. పోలీసులు ప్రకటించిన ఆరుగురు యాక్షన్ టీం సభ్యుల్లో ఐదుగురు మాడవీకాయ అలియాస్ రవి మినహాయిస్తే ఐదుగురు సభ్యులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారే. కోయ, గొత్తికోయల జాతి వారు.. అటవీ ప్రాంతాల్లో ఉండే కోయ, గొత్తికోయ, కొండజాతికి చెందినవారు పెద్దఎత్తున మావోయిస్టుపార్టీలో చేరారు. ఒకనాడు తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్లినవారే అక్కడంతా నక్సలైట్ల దళాలలో సభ్యుల నుంచి కీలక నాయకుల వరకు పనిచేశారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చాలా దళాలకు ఆదివాసీలే నాయకులుగా కొనసాగుతున్నారు. ఆదివాసీ జాతుల్లో సాహసమైన జాతీయులు గొత్తికోయలు. దాడుల్లో ధైర్యాన్ని ప్రదర్శించే గొత్తి కోయలు ప్రస్తుతం ఈ ప్రాంతానికి వచ్చినట్లు అనుమానిస్తున్న ఐదుగురు యాక్షన్ టీం సభ్యుల్లో ముగ్గురు ఉన్నట్లు తెలిసింది. వారిలో కురుసం మంగు అలియాస్ భద్రు బీజాపూర్ జిల్లా, లింగ్ అలియాస్ రాజేశ్, మడకంగూడ కుంట తాలూకా. కోవాసి గంగాధి సుకుమ జిల్లా మంగతూది ఛత్తీస్‌గఢ్, పాండు మంగులుది బీజాపూర్ జిల్లా.. ప్రస్తుతం సుకుమ బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్ జిల్లాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ రిక్రూట్మెంట్ అయిన వారిని తెలంగాణ ప్రాంతానికి పంపించేందుకు ముందుగా కురుసం మంగు నాయకత్వంలో వ్యూహాత్మకంగా ఓ దళాన్ని మావోయిస్టు పార్టీ ఈ ప్రాంతానికి నియమించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమై అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతూనే నాయకులకు అదనపు భద్రత కల్పిస్తున్నారు. -
మావోయిస్టులకు సహకరిస్తున్న హోంగార్డులు
సాక్షి, తూర్పు గోదావరి: సీలేరు జెన్కోలో పనిచేస్తున్న ఇద్దరు హోంగార్డులు మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు తెలిసింది. కిలో బాబురావు, మరిగల నాగేశ్వరరావు అనే ఇద్దరు హోంగార్డులు గత కొంతకాలంగా మావోయిస్టులకు సమాచారం అందిస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిపై నిఘా ఉంచిన పోలీసులు మండలంలోని లంకపాకల వద్ద మావోయిస్టులకు కలిసి వస్తుంటే వారిద్దరి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిద్దరూ మావోయిస్టు నేతలు చలపతిరావు, అరుణకు సహరిస్తున్నట్లు తేలిందని చింతపల్లి ఓఎస్డీ వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇది పోలింగ్ బూతే
నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ అత్యంత కష్టతరమైన పని. అందులోనూ అత్యంత వెనుకబడిన, కనీస రవాణా సదుపాయాలు లేని ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ అతి కష్టం. అలాంటి కోవలోదే జార్ఖండ్‌లోని హజారీబాగ్. హజారీబాగ్ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ఆదివాసీలతో ఓట్లు వేయించేందుకు స్థానిక ఎన్నికల నిర్వహణాధికారులు ముçప్పుతిప్పలు పడుతున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని ప్రజలు వారు. అభివృద్ధి వారి గూడేల్లోకి అడుగిడే పరిస్థితులే లేవు సరికదా జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మావోయి స్టుల ప్రాబల్యం ప్రబలంగా ఉంది. ఎలాగైనా పోలింగ్ శాతాన్ని పెంచడం కోసం ఆదివాసీలను ఆకట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టారు ఎన్నికల నిర్వాహకులు. కొండకోనల్లో ఉండే గిరిజనులను రప్పించేందుకు ఓ సరికొత్త ఎత్తుగడ వేశారు. గతంలో స్థానిక ఆదివాసీ ప్రజల్లో అత్యధిక మంది రైలు ఎక్కడం కాదు కనీసం చూడను కూడా చూసి ఉండర ని తెలిసుకున్నారు. అంతే రైలు బోగీ ఆకారంలో పోలింగ్ బూత్‌ని ఏర్పాటు చేసి, దానికి 140 నంబర్ ఇచ్చారు. దానికి తోడు రైలు బూత్ గురించి గిరిజన గూడేల్లో విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల అధికారులు ఊహించినట్టుగానే నిజమైన రైలుని చూడని ఆదివాసీలు రైలు బూత్‌ని చూడ్డం కోసం వచ్చి, ఎంచక్కా రైలెక్కి తమ ప్రజాస్వామిక హక్కు అయిన ఓటు హక్కుని వినియోగించుకుని వెళ్ళిపోయారు. టికెట్టు లేకుండా రైలెక్కినట్టూ అయ్యింది. అధికారులకు ఆశించిన ఓటుని వినియోగించుకోవడమూ జరిగింది. బూత్‌నంబర్ 140 జార్ఖండ్‌లోని హజారీబాగ్ నియోజకవర్గం పరిధిలోని రామ్‌గఢ్ బ్లాక్లోనిది. -
గడ్చిరోలి–హెలికాప్టర్ పైలెట్లకు ప్రత్యేక శిక్షణ
సాక్షి, ముంబై: రాష్ట్రంలో రోజురోజు తీవ్ర రూపం దాలుస్తున్న మావోయిస్టుల కార్యకలాపాలకు చమరగీతం పాడేందుకు ఫ్రెంచ్ తయారి ‘హెచ్–145’ అత్య«ధునిక హెలికాప్టర్ కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా ఈ అత్య«ధునిక హెలికాప్టర్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వ విమానయాన డైరెక్టర్‌కు చెందిన ముగ్గురు సీనియర్ పైలెట్లను శిక్షణ నిమిత్తం జర్మనీకి పంపించనుంది. జర్మనీలోని డోనవర్థ్–మాన్‌చింగ్‌లో ఈ ముగ్గురు పైలెట్లకు 75 రోజుల పాటు కఠోర శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా నక్సలైట్ల ప్రాబల్యమున్న అలాగే అటవి ప్రాంతాల్లో హెలికాప్టర్‌ను ఎలా నడపాలనే దానిపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కేవలం శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.7.30 లక్షలు ఖర్చు చేయనుంది. శిక్షణ కోసం విదేశాలకు వెళ్లే ముగ్గురిలో చీఫ్ పైలెట్ క్యాప్టన్ సంజయ్ కర్వే, సీనియర్ పైలెట్ క్యాప్టన్ మహేంద్ర దల్వీ, అసిస్టెంటెంట్ పైలెట్ క్యాప్టన్ మోహిత్ శర్మ ఉన్నారు. వీరంత జూన్ ఐదో తేదీన జర్మనికి బయలుదేరుతారు. అక్కడ 75 రోజులపాటు కఠోర శిక్షణ తీసుకున్న తరువాత ఆగస్టు 14వ తేదీ తరువాత తిరిగి స్వరాష్ట్రానికి చేరుకుంటారు. కేవలం అత్యధునిక హెలికాప్టర్ కొనుగోలు చేయగానే సరిపోదు. దాన్ని నడిపే సత్తా ఉండాలనే ఉద్ధేశ్యంతో ముగ్గురు పైలెట్లను ఎంపిక చేసి శిక్షణ కోసం జర్మనీకి పంపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నక్సలైట్ల కార్యకలాపాలను అంతమొందించేందుకు చేపట్టే గాలింపు చర్యల పనుల కోసం గత ఎనిమిదేళ్లుగా పవన్ హంస్ కంపెనీకి చెందిన హెలికాప్టర్లను ప్రభుత్వం అద్దెకు తీసుకుంటుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.25 కోట్లు చెల్లిస్తుంది. దీంతో సొంతంగా ఒక అత్యధునిక హెచ్–145 మోడల్ హెలికాప్టర్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని ఎయిర్ బస్ హెలికాప్టర్ కంపెనీ నుంచి రూ.72.43 కోట్లకు కొనుగోలు చేయనుంది. ఇందులో ఇద్దరు పైలెట్లు, పది మంది ప్రయాణించే సామర్ధ్యం ఉంటుంది. మావోలను ఏరివేయడంతోపాటు ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు సాయం అందించేందుకు కూడా దీన్ని వినియోగించవచ్చు. అందుకు ప్రధాన కారణం ఇందులో స్ట్రేచర్‌తోపాటు బాధితులకు అందజేసే రకరకాల మందులు, ఇతర వైద్య సామాగ్రి నిల్వచేసే సౌకర్యం ఉంది. గగనతలం నుంచి దృష్టి సారించేందుకు రాష్ట్రంలో నక్సలైట్ల కార్యకలాపాలు రోజు రోజుకు విస్తరిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇటీవల జరిగిన దాడిని బట్టి మావోలు క్రియశీలకంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దాడులకు, పోలీసును అంతమొందించేందుకు కొత్త కొత్త విధానాలను ఎంచుకుంటున్నారు. కారడవిలో దట్టమైన చెట్ల మధ్య మావోలను గుర్తించాలంటే పోలీసులకు దారి లభించదు. ఇలాంటి సందర్భంలో గగనతలంలోంచి దృష్టి సారించడానికి ఈ హెలికాప్టర్ ఎంతో దోహదపడనుంది. -
మావోయిస్టు దళ సభ్యురాలి అరెస్టు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా పోలీసులు సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన, మావోయిస్టు అనుబంధ సంఘాలలో పని చేస్తున్న ఆత్మకూరు అనూషను పెదబయలు పోలీస్ స్టేషన్ కేసులలో అరెస్టు చేశారు. ఈ మేరకు పాడేరు డీఎస్పీ పి.బి.రాజ్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేసారు. పాత కేసులలో అరెస్టు కాబడి ఈరోజు బెయిల్‌పై విశాఖపట్నం సెంట్రల్ జైలు నుండి విడుదలకాగా, పాడేరు పోలీసులు ఇతర కేసుల నిమిత్తం అరెస్టు చేసి స్పెషల్ ఏజేఎఫ్సీఎం కోర్టుకు తరలించగా ఈనెల 20 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఆత్మకూరు అనూష(24) తండ్రి రమణయ్య చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తూ , సీపీఐ మావోయిస్టు పార్టీలో దళ మెంబర్‌గా కొనసాగుతోంది. ఈమెకు పెదబయలుపోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులతో సంబంధం ఉన్నట్టు విచారణలో తేలినందున అరెస్టు చేసినట్టు సమాచారం. గత ఏడాది ఏప్రి ల్ నెలలో ఈమె సీపీఐ మావోయిస్టులు అక్కిరాజు హరగోపాల్,ఉదయ్, చలపతి మరికొంత మంది మావోయిస్టు సభ్యులు గ్రామంలో స్థానిక గిరిజనులుతో బెదిరించి బలవంతంగా ప్రజాకోర్టు నిర్వహించారు. అలాగే జుండాం అటవీ ప్రాంతంలో పోలీసులు వస్తున్నారని ముందస్తు సమాచారంతో మందుపాత్రలు అమర్చిన సంఘటనలో మావోయిస్టులతో కలిసిప్రత్యక్షంగా పాల్గొంది. -
ఈ మల్లన్న.. ఎవరన్నా?
సాక్షి, హైదరాబాద్: అది రాజీవ్ రహదారి. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే ప్రధాన మార్గం. సిద్దిపేట జిల్లాకు అత్యంత దగ్గరగా ఉన్న ఓ మండల అధికారి కారులో తన ఆఫీస్ నుంచి వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్లగానే నలుగురు వ్యక్తులు కారు ఆపారు. లిఫ్ట్ కావాలని కారెక్కారు. వారిలో ఓ వ్యక్తి.. మల్లన్న మిమ్మల్ని తీసుకురమ్మన్నాడని చెప్పాడు. దీంతో మల్లన్న ఎవరు.. ఎక్కడుంటాడు.. అసలు ఆయనెవరో చెప్పాలని ఆ అధికారి పేర్కొన్నారు. అవన్నీ తర్వాత చెప్తామని, ముందు తాము చెప్పినట్లు వెళ్లాలని గట్టిగా చెప్పారు. ఓ 20 కిలోమీటర్లు వెళ్లగానే ఓ వ్యక్తికి ఫోన్ వచ్చింది. మల్లన్న బిజీగా ఉన్నాడు.. ఆ కారు దిగి వచ్చేయండి అని ఫోన్లో వ్యక్తి చెప్పడంతో కారు దిగి వెళ్లిపోయారు. ఇదంతా మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగింది. ఇప్పటికీ ఆ అధికారి షాక్‌లోనే ఉన్నాడు. అక్కడి నుంచి ఆఫీస్‌కు వెళ్లిపోయాడు. సాయంత్రం సినిమా చూపించారు.. సాయంత్రం 5 గంటలు కావస్తోంది. విధులు ముగించుకొని సంబంధిత అధికారి కారులో ఇంటికి చేరుకున్నాడు. అక్కడే అధికారికి షాక్ తగిలింది. తనతో మధ్యాహ్నం మల్లన్న విషయం చెప్పిన నలుగురు ఆ అధికారి ఇంటి వద్ద ఉన్నారు. వారిలో ఒకరు గేటు వద్ద కాపలా ఉండగా, మిగిలిన వారు అధికారి ఇంట్లో కూర్చున్నారు. అధికారి ఇంట్లోకి వెళ్లగానే ‘మల్లన్న రూ.10 లక్షలు ఇవ్వమన్నాడు. త్వరగా డబ్బులిస్తే వెళ్లిపోతాం’అని సంబంధిత వ్యక్తులన్నారు. ‘అసలు మల్లన్న ఎవరు? నేనెందుకు డబ్బులివ్వాలి? ఎవరు మీరు అని’ అధికారి ఎదురు ప్రశ్నించాడు. దీంతో వారు అధికారి తలపై గన్ పెట్టి డబ్బులు ఇవ్వకపోతే అధికారితో పాటు ఆయన భార్యను కూడా చంపేస్తామని బెదిరించారు. తమది మల్లన్న మిలిటెంట్ దళం అని, డబ్బులివ్వకపోతే ప్రాణాలు పోతాయని బెదిరించడంతో అంత డబ్బు లేదని, రూ.50 వేలు ఉన్నాయని అధికారి చెప్పారు. ఆ డబ్బు తీసుకుని మిగిలిన మొత్తంపై అన్నతో మాట్లాడి చెప్తామని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని అధికారి ఎక్కడా చెప్పలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు.. చేస్తే ఎక్కడ తన కుటుంబాన్ని టార్గెట్ చేసి చంపుతారేమోనని భయపడ్డారు. తెల్లారే కాంట్రాక్టర్‌ను.. ఆ మరుసటి రోజే మెదక్ జిల్లాలో రోడ్ల నిర్మాణం చేస్తున్న ఓ బడా కాంట్రాక్టర్‌కు మల్లన్న మిలిటెంట్ దళం అంటూ ఫోన్ చేసి బెదిరించారు. రేపు వస్తామని, రూ.10 లక్షలు రెడీ చేసుకోవాలని, లేకపోతే చంపేస్తామంటూ హెచ్చరించారు. సదరు వ్యక్తుల నంబర్లను తెలిసిన పోలీస్ అధి కారి ద్వారా కాంట్రా క్టర్ ఆరా తీయించాడు. దీంతో ఈ వ్యక్తులతో పాటు ఓ మండల ఎంపీపీ, అతడి అనుచరుడిగా ఉన్న ఓ ఎంపీటీసీ భర్త నంబర్లు ఉండటం సంచలనం రేపుతోంది. టీఆర్ఎస్లో ఉన్న ఈ ఎంపీపీకి, ఎంపీటీసీ భర్తకు, మల్లన్న మిలిటెంట్ గ్యాంగ్‌కు సంబంధం ఏంటన్న దానిపై చర్చ జరుగుతోంది. అతడి నేతృత్వంలోనే దళం.. ప్రస్తుతం సిద్దిపేట, మెదక్ ఈ రెండు జిల్లాల్లో మావోయిస్టు ప్రాబల్యమే లేదు. పాత జనశక్తి దళాల్లో ఉన్న ఎవరూ కూడా యాక్టివ్ లో లేరు. అలాంటప్పుడు ఈ దళం ఎక్కడినుంచి వచ్చిందన్న దానిపై చర్చ జరుగుతోంది. ఎంపీపీకి గతంలో నకిలీ నోట్ల చెలామణి చేసిన వ్యక్తి, పోలీసులపై కాల్పులు జరిపి ఇద్దరిని హతమార్చిన నిందితుడికి సంబంధం ఉండటం అనుమానాలకు తావిస్తోంది. శామీర్‌పేట పరిసరాల్లో నకిలీ నోట్లు చెలామణి చేస్తూ దొరికినప్పుడు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయిన వ్యక్తే ఈ దళానికి నాయకత్వం వహిస్తున్నాడన్న మాటలు వినిపిస్తున్నాయి. పోలీసుల నిఘా వైఫల్యం.. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో తుపాకులతో సంచరిస్తూ దళాల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నా అక్కడి పోలీసులకు ఈ విషయం తెలియకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో నయీం లాంటి వ్యక్తి దళాల పేరుతో సంచరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. బెదిరింపులకు గురైన కాంట్రాక్టర్ నేరుగా డీజీపీ లేదా ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులను కలసి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు జిల్లాల పోలీసులపై నమ్మకం లేదన్న ఉద్దేశంతోనే ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. పైగా ఆ దళం ఇన్చార్జి ఓ జాతీయ పార్టీ నేతతో తిరుగుతుండటం సంచలనం రేపుతోంది. గతంలో ఇద్దరు పోలీసులను తుపాకీతో హతమార్చిన వ్యవహారంలోనూ ఇదే నేత సహాయం చేసి బయటపడేలా చేసినట్లు ఆరోపణలున్నాయి. -
మావో వేడుకలపై చైనా ఉక్కుపాదం
బీజింగ్: స్వతంత్ర చైనా తొలి చైర్మన్ మావో జెండాంగ్ 125వ జయంతి వేడుకలపై షీ జిన్‌పింగ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. మావో జయంతి వేడుకలు జరిపేందుకు సిద్ధమైన పెకింగ్ విశ్వవిద్యాలయం విద్యార్థి, వర్సిటీ మార్క్సిస్ట్ సొసైటీ చీఫ్ క్వీ హంక్సువాన్ను అరెస్ట్ చేసింది. పెకింగ్ విశ్వవిద్యాలయం ప్రవేశద్వారం వద్దకు సాధారణ దుస్తుల్లో వచ్చిన 8మంది పోలీసులు నల్లటికారులో క్వీని బలవంతంగా ఎక్కించారు. ఈ సందర్భంగా అతను ‘నేను క్వీ హాంక్సువాన్ను. నేను చట్టాన్ని ఉల్లంఘించలేదు. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు’ అని అధికారులతో పెనుగులాడాడు. చైనాలో 1989లో తియానన్మెన్ కూడలిలో ఉవ్వెత్తున ఎగిసి ప్రజాస్వామ్య ఉద్యమంలో పెకింగ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు కీలకపాత్ర పోషించారు. అయితే కొన్నేళ్ల క్రితం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షీ జిన్‌పింగ్, చైనా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాలు, వాటి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. తాజాగా క్వీ అరెస్టుపై చైనా ప్రభుత్వం, పెకింగ్ విశ్వవిద్యాలయం ఇంకా స్పందించలేదు. -
అర్బన్ అలజడి
సాక్షి,సిటీబ్యూరో: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంలో చాలా ఏళ్ల తర్వాత ‘మావోయిస్టు’ జాడలు కలకలం రేపుతున్నాయి. నగరంలో వరుసగా వెలుగు చూస్తున్న మావోయిస్టు సంబంధాల నేపథ్యంలో రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. కొన్నేళ్లుగా తెలంగాణలో నిషేధిత మావోయిస్టుల కార్యకలాపాలేవీ లేనప్పటికీ.. నగర శివార్లను షెల్టర్ జోన్‌గా ఉపయోగిస్తూ దేశంలో వివిధ ప్రాంతాల్లో హింసకు కుట్ర పన్నుతున్నారన్న కారణాలతో ఎన్జీఆర్ఐలో పనిచేస్తున్న నక్కా వెంకట్రావుతో పాటు మౌలాలీ హౌసింగ్ బోర్డులో నివాసముంటున్న ఆత్మకూరి భవాని, అన్నపూర్ణ, అనూషలను విశాఖ పోలీసులు అరెస్ట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మౌలాలీ హౌసింగ్ బోర్డులో ఉంటూ తెలంగాణ ప్రజాఫ్రంట్, కుల నిర్మూలన సమితిలో పనిచేస్తున్న ఆత్మకూరి రమణయ్య దంపతుల కూతుళ్లు భవాని (అమవీరుల బంధుమిత్రుల కమిటీ), అన్నపూర్ణ (చైతన్య మహిళా సంఘం), అనూష(చైతన్య మహిళా సంఘం) ఆయా సంఘాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిలో అనూష 2017 డిసెంబర్ నుంచి విశాఖ ‘మావో’ దళసభ్యురాలిగా నియమితమై పలుమార్లు ప్రాంతాల్లో కాల్పులతో పాటు, మందుపాతరలను పేల్చిన ఘటనల్లో పాల్గొన్నట్లు విశాఖ పోలీసులు అభియోగం మోపారు. చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్న అన్నపూర్ణ గాలికొండ దళంతో టచ్‌లో ఉన్నారని, భవాని తెలంగాణ, ఏపీ అమరవీరుల బంధుమిత్రుల కమిటీ జాయింట్ సెక్రటరీగా పలు విధ్వంస కార్యక్రమాలకు రెక్కీ నిర్వహించారన్నది అభియోగం. ఇదిలా ఉంటే భవాని, అన్నపూర్ణలు ఇటీవల తెలంగాణ ఎన్నికల్లోనూ విస్తృతంగా ప్రజాచైతన్య యాత్రలు నిర్వహించారు. ఏపీ స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరోకు చిక్కిన మావోయిస్టు కామేశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు అనూష ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పోలీసులకు చిక్కారు. ఆమెతో పాటు ఆమె ఇద్దరు అక్కలను కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే నగర శివారు ప్రాంతాల్లో తలదాచుకుంటూ వివిధ సంఘాల పేరుతో పనిచేస్తున్న విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక సంఘాలపై మరింత నిఘా పెంచే యోచనలో నగర పోలీసులు ఉన్నారు. నగరంలో విధ్వంసకర కార్యకలాపాలేవీ చేయకున్నా నిషేధిత సంస్థల ప్రతినిధులు నగరాన్ని షెల్డర్ జోన్‌గా వాడుకోవడాన్ని వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. హక్కుల సంఘాల ఖండన పౌర హక్కులను, ప్రజా సంఘాలను అణిచివేసే క్రమంలోనే విప్లవ రచయిత వరవరావు మొదలుకుని, నక్కా వెంకట్రావు, తాజాగా మౌలాలిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లను అరెస్ట్ చేశారని పౌరహక్కుల సంఘం పేర్కొంది. ఏ ఆధారం లేకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం దారుణమని అరెస్ట్ అయినవారి తండ్రి ఆత్మకూరి రమణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. -
ఛత్తీస్‌గఢ్‌లో హైదరాబాద్ వాసి అరెస్టు
-
ఛత్తీస్‌గఢ్‌లో హైదరాబాద్ వాసి అరెస్టు
రాయ్‌పూర్ : మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తుండగా నక్కా వెంకట్రావు అనే వ్యక్తిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ వాసి అయిన వెంకట్రావు అర్బన్ నక్సలిజం వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాడని... అతడిని అరెస్టు చేయడం ద్వారా అర్బన్ నక్సల్స్ నెట్‌వర్క్‌ను బ్రేక్ చేశామని ఛత్తీస్‌గఢ్ ఐజీ ఎస్పీ సింగ్ తెలిపారు. ఎన్జీఆర్ఐలో ఉద్యోగం చేస్తున్న నక్కా వెంకట్రావు 2016, 2017లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశం అయినట్లు తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు నక్కా పనిచేశాడని ఐజీ వెల్లడించారు. కాగా వెంకట్రావు సోదరుడు పౌరహక్కుల సంఘం కార్యకర్తగా పనిచేస్తున్నట్లు సమాచారం. -
ప్రశాంతంగా ఓటు వేయండి...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశామని ఎన్నికల నోడల్ అధికారి, శాంతి భద్రతల అదనపు డీజీపీ జితేందర్ స్పష్టంచేశారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. శుక్రవారం జరగనున్న పోలింగుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. మొత్తంగా 6వేల సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్టు తెలిపారు.సుమారు ఆరు జిల్లాల్లో ఈ తరహా ప్రాంతాలను గుర్తించామని, వీటిలో కొడంగల్ కూడా ఒకటని జితేందర్ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ, ఐటీ విభాగం సంయుక్తంగా రూ.125కోట్ల నగదు, ఎక్సైజ్ శాఖతో కలసి 4 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రూ.6 కోట్ల విలువైన ప్లాటినం, బంగారం, వెండి, రూ. 60 లక్షల విలువ గల గంజా యి, రూ.1.6 కోట్ల విలువైన బహుమతులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. 90,238 మందిని బైండోవర్ చేయగా, 8,482 లైసెన్స్డ్ ఆయుధాలు డిపాజిట్ చేసుకున్నట్టు తెలిపారు. 11,862 నాన్‌బెయిలబుల్ వారంట్లను అమలు చేసినట్టు తెలిపారు. కోడ్ ఉల్లం ఘన కింద 1,501 కేసులు నమోదు చేశామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న 13నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని, ముందస్తుగా సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేసినట్టు తెలిపారు. ఛత్తీస్గడ్, మహరాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్టు వివరించారు. నగదు పట్టుబడ్డ చోట్ల విచారణ జరిపి సంబంధిత నేతలపై కేసులు నమోదు చేసినట్టు జితేందర్ తెలిపారు. ఏపీ టీడీపీ నేత జూపూడి ప్రభాకర్‌రావు, పోటీలో ఉన్న అభ్యర్థులు సర్వే సత్యనారాయణ, మల్లారెడ్డి, జగ్గారెడ్డి, ఆనంద్‌ప్రసాద్ తదితరులపై సెక్షన్ 171 కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పట్టుబడ్డ హవాలా నగదుపై ఐటీ, ఈడీ అధికారులు దర్యాప్తు జరుపుతారని జితేందర్ వెల్లడించారు. ఈ డబ్బు పొందేందుకు యత్నించిన పలువురి నేతలపై కూడా విచారణ జరిపే అవకాశం ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని నేతలు హైదరాబాద్‌లో ఉండాల్సి వస్తే సంబంధిత ప్రాంతంలోని రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టంచేశారు. నిబంధనలు ఉల్లంఘించి వివిధ ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ అధికారులపై పలు పార్టీలు, అభ్యర్థులు చేసిన ఫిర్యాదులు, ఆరోపణలపై విచారణ చేస్తున్నామని, రెండు కేసుల్లో అధికారులపై చర్యలు తీసుకున్నట్టు జితేందర్ స్పష్టంచేశారు. -
గడ్చిరోలిలో మావోయిస్టుల బ్యానర్లను తగులబెట్టి..
సాక్షి, కాళేశ్వరం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకాలోని తాడుగుడ, పెండ్రీ గ్రామాల్లో మావోయిస్టుల ఎరుపురంగు బ్యానర్లు వెలిశాయి. ఆదివారం తెల్లవారు జామున మావోయిస్టులు ఆయా గ్రామాల్లో డిసెంబర్ 2 నుంచి 8 వరకు పీఎల్జీఏ వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఆ ఎరుపురంగు బ్యానర్లలో తెలిపారు. దీంతో స్థానికులు తమ గ్రామాలకు మావోయిస్టులు రావద్దని, అభివృద్ధి నిరోధకులని ఆ బ్యానర్లను స్థానికులు తీసు నాలుగు కూడళ్ల వద్ద నిప్పంటించి తగులబెట్టారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు తెలిసింది. దీంతో ఆయా గ్రామాల్లో పోలీసులు కూంబింగ్ తీవ్రం చేశారు. కాగా శనివారం ఏటపల్లి తాలూకా గట్టపల్లి అడవుల్లో రోడ్డు నిర్మాణం జరుగుతుండటంతో అక్కడి 10 జేసీబీలు, 5 ట్రాక్టర్లను మావోయిస్టులు కాల్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో మావోయిస్టులు మెరుపుదాడులకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే యాక్షన్ టీంలు సంచిరిస్తున్నట్లు పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలోని గోదావరి సరిహద్దుల్లో పోలీసులు నిఘాను తీవ్రం చేశారు. -
దిగ్విజయ్ సింగ్‌ను ప్రశ్నించనున్న పూణే పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ : అర్బన్ నక్సల్స్ కేసుకు సంబంధించి పూణే పోలీసులు సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌ను ప్రశ్నించనున్నారు. మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న లేఖలో స్నేహితుడి నెంబర్‌గా పేర్కొన్న ఫోన్ నెంబర్ దిగ్విజయ్ సింగ్‌కు చెందినదిగా పోలీసుల విచారణలో వెల్లడైందని డీసీపీ సుహాస్ బావ్చే చెప్పారు. అయితే ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, దీనిపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్‌ను ప్రశ్నించే అవకాశం ఉందని పూణే పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థుల ద్వారా దేశవ్యాప్త నిరసనలకు సహకరించేందుకు కాంగ్రెస్ నేతలు సుముఖంగా ఉన్నారని కామ్రేడ్ సురేంద్రకు కామ్రేడ్ ప్రకాష్ రాసినట్టుగా చెబుతున్నఈ లేఖలో ప్రస్తావించారు. ఇటీవల అరెస్ట్ అయిన కార్యకర్తలకు మావోయిస్టు అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయనే ఆధారాల కోసం పూణే పోలీసులు ఈ లేఖను కోర్టులో సమర్పించారు. కాగా లేఖలో పేర్కొన్న ఫోన్ నెంబర్ దిగ్విజయ్ సింగ్‌దేననే వార్తల నేపథ్యంలో దీంతో తనకెలాంటి సంబంధం లేదని దిగ్విజయ్ తోసిపుచ్చారు. -
మన్యంలో మావోయిస్టు పోస్టర్ల కలకలం
తూర్పుగోదావరి, వై.రామవరం: మన్యంలో(ఏఓబీలో) మరలా మావోయిస్టు పోస్టర్ల కలకలం చెలరేగింది. గతనెల 12న వై.రామవరం మండల సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీ, పలకజీడి గ్రామంలో సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ పేరుతో ఒక హెచ్చరిక పోస్టరు వెలసిన విషయం విదితమే. అయితే తిరిగి శుక్రవారం అదే గ్రామ శివారులో సీపీఐ(మావోయిస్టు) ఎంకేవీబీ డివిజన్ కమిటీ పేరున కొన్ని డిమాండ్లతో కూడిన పోస్టర్లు చింతచెట్లకు అతికించి దర్శనమిచ్చాయి. శుక్రవారం ఆ గ్రామంలో వారపు సంత కావడంతో, వాటిని చూసిన సంత నిర్వాహకులైన వ్యాపారులు ఉలిక్కి పడ్డారు. గతనెలలో, ఈనెలలో రెండుసార్లు కూడా వారపు సంత రోజు శుక్రవారమే పోస్టర్లు దర్శనమివ్వడంతో వారపుసంత నిర్వహించే వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. చింత చెట్టుకు అతికించిన ఆ పోస్టర్ల ద్వా్డరా బాక్సైటు తవ్వకాలు, కాఫీతోటల సమస్యలు తదితర డిమాండ్లను ప్రభుత్వానికి అందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2014 ఎన్నికల హామీలతో ప్రజలను అనేక విధాలుగా మోసగించాయని దుయ్యబట్టారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండండి విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసు స్టేషన్ ఆవరణలో ఉన్న సీఆర్పీఎఫ్ ఎఫ్42 బెటాలియన్ అదనపు బలగాల పోలీసులకు, స్టేషన్ సిబ్బందికి అడ్డతీగల సీఐ ఎ.మురళీ కృష్ణ సూచించారు. మండల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయన్న సమాచారం అందగానే శుక్రవారం ఉదయం సీఐమురళీకృష్ణ స్థానిక పోలీసుస్టేషన్‌కు చేరుకుని, సిబ్బందిని అప్రమతం చేశారు. స్టేషన్ భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలున్నాయన్న సమాచారం మేరకు, అనుమానాస్పద ప్రదేశాల్లో, ప్రధాన రహదారిలో వచ్చిపోయే వాహనాలను సీఆర్పీఎఫ్ పోలీసుల సహాయంతో విస్తృతంగా తనిఖీ చేయాలని సిబ్బందికి ఆదేశించారు. అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని సూచించారు. అనంతరం మండల లోతట్టు గ్రామాలను సందర్శించి, మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ ఎఫ్42 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ క్లారెన్స్, సిబ్బంది పాల్గొన్నారు. -
పోలీస్ శాఖలో కలవరం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ పోలీస్ ఉన్నతాధికారుల్లో ఒత్తిడి పెరుగుతోంది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న టెన్షన్ మొదలైంది. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు ముగిశాక ఇక్కడ పోలింగ్ ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు. పలుచోట్ల మావోయిస్టుల పోస్టర్లు, హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, భద్రాద్రి, ఖమ్మంలో ఎన్నికలకు విఘాతం కలిగించేందుకు మావోలు కుట్రపన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీటికితోడు సోమవారం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన తొలిదఫా ఎన్నికల అనంతరం మావోయిస్టు యాక్షన్ దళాలు రాష్ట్ర సరిహద్దుల్లోకి చేరుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లోని భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాచలం తదితర ప్రాంతాల్లో పోలీస్ శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. బయటకు విషయం పొక్కనీయకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆయా జిల్లాల ఎస్పీలను ఆదేశించినట్లు తెలిసింది. ప్రవేశించడం సులభమా? ఛత్తీస్‌గఢ్‌లో చెదురుమదురు ఘటనలకు పాల్పడ్డ మావోయిస్టు పార్టీ తెలంగాణవైపు వచ్చేందుకు యత్నించినా నియంత్రించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీనియర్ ఐపీఎస్ ఒకరు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నుంచి కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో సంచరించే డివిజన్ కమిటీకి చెందిన యాక్షన్ దళాలే తిరుగుతున్నట్లు సమాచారం ఉందని ఎస్ఐబీ చెప్తోంది. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో అన్ని డివిజన్ కమిటీల యాక్షన్ బృందాల కార్యకలాపాలు విస్తృతం చేయాలని నిర్ణయించారని, అందులో భాగంగానే గుర్తింపు కోసం శబరి కమిటీ, మంచిర్యాల కమిటీ ప్రయత్నాలు చేస్తున్నాయని ఎస్ఐబీ తెలిపింది. సమాచారం ఇవ్వకుండా వెళ్లొద్దు... మావో ప్రాభల్య నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్లవద్దని నేతలకు ఆయా జిల్లాల ఎస్పీలు సూచించినట్లు తెలిసింది. ఒకవేళ వెళ్లాల్సివస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పినట్లు సమాచారం. -
ముగిసిన పోలింగ్; ఇద్దరు మావోయిస్టుల మృతి
రాయ్‌పూర్ : కట్టుదిట్టమైన భద్రత నడుమ ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ముగిసింది. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నా ఈసారి 70 శాతం పోలింగ్ నమోదవడం విశేషం. సురక్షిత ఓటింగ్ కోసం భద్రతా దళాలను భారీగా రంగంలోకి దించటంతో పోలింగ్ శాతం పెరిగిందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇక తొంభై నియోజక వర్గాలున్న ఛత్తీస్గడ్ రాష్ట్రంలో రాజ్‌నంద్‌గాం, కొండగాం, కాంకేర్, బస్తర్, నారాయణ్‌పూర్, సుక్మా, బీజాపూర్, దంతేవాడ జిల్లాల పరిధిలోని 18 నియోజకవర్గాల్లో ఈరోజు తొలిదశ పోలింగ్ జరిగింది. వీటిలో మావోయిస్టుల ప్రభావం ఉన్న 10 నియోజకవర్గాల్లో పోలింగ్ మధ్యాహ్నం 3 గంటలకే ముగియగా, మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మిగిలిన 72 నియోజక వర్గాల్లో ఈనెల 20(నవంబరు)న పోలింగ్ జరగనుండగా.. ఫలితాలు డిసెంబరు 11న వెలువడనున్నాయి. కాగా పోలింగ్ సమయంలో మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నందున ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో భద్రతను రెట్టింపు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు 500 కంపెనీల బలగాలతో గస్తీ ఏర్పాటు చేసిన అధికారులు.. 50 డ్రోన్లు, 17 హెలికాఫర్టు, వెయ్యి శాటిలైట్ ట్రాకర్స్‌తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల మృతి తోంక్ పాల్ చింతల్నార్ నుండి ఎలక్షన్ డ్యూటీ ముగించుకుని వస్తున్న భద్రతాదళాల మీద మావోయిస్టుల కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వీరి మృతదేహాలను భద్రత దళాలు స్వాధీన పరుచుకున్నాయి. కాగా ఈ సమయంలో భద్రతా దళాలతో పాటు, డ్యూటీ ముగించుకుని వస్తున్న ఎలక్షన్ సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన తొలిదశ ఎన్నికల పోలింగ్
-
ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన తొలిదశ ఎన్నికల పోలింగ్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గాం, కొండగాం, కాంకేర్, బస్తర్, నారాయణ్‌పూర్, సుక్మా, బీజాపూర్, దంతేవాడ జిల్లాల పరిధిలోని 18 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగుతుంది. వాటిలో మావోయిస్టుల ప్రభావం ఉన్న 10 నియోజకవర్గాల్లో పోలింగ్ వేళల్లో మార్పులు చేశారు. అక్కడ మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. మిగత ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నా నేపథ్యంలో ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేసింది. అధికారులు లక్ష మంది భద్రత సిబ్బందితో పోలింగ్ స్టేషన్ల వద్ద భద్రత ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో భద్రతను రెట్టింపు చేశారు. పోలింగ్ ప్రశాతంగా సాగేందుకు 500 కంపెనీల బలగాలతో గస్తీ ఏర్పాటు చేసిన అధికారులు.. 50 డ్రోన్లు, 17 హెలికాఫర్టు, వెయ్యి శాటిలైట్ ట్రాకర్స్‌తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ప్రజాప్రతినిధులే టార్గెట్..!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ మావోయిస్టు హెచ్చరికలు పోలీస్ శాఖను కలవరంలో పడేసేలా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తూ వచ్చిన మావోయిస్టు పార్టీ ఇప్పుడు తాజాగా ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తూ లేఖ విడుదల చేయడం సంచలనానికి తెరదీసింది. గురువారం ఉదయం బెల్లంపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను హెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేయడం గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు సాగుతున్నాయనడానికి నిదర్శనమని అంటున్నారు. కదలికలు నిజమేనా? ఇన్నాళ్లూ మావోయిస్టు పార్టీ తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోనే కార్యకలాపాలను సాగిస్తూ వస్తోంది. అయితే కొద్దిరోజుల నుంచి వాజేడు వెంకటాపురం, భద్రాచలం పరిసరాలతో పాటు భూపాలపల్లి, మంథనిలో డివిజన్ కమిటీల కార్యకలాపాలను విస్తృతం చేసినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దఫాలో ఎన్నికలు జరుగుతున్నాయి. వరుసగా 15 రోజుల నుంచి కాల్పులు, ఎదురుకాల్పులతో అటవీ ప్రాంతం రక్తసిక్తమవుతోంది. తీరా ఇప్పుడు తెలంగాణలోనూ పేలుళ్లకు మావోయిస్టు పార్టీ కుట్రపన్ని ఉంటుందా అన్న కోణంలో పోలీస్ ఉన్నతాధికారులు కూంబింగ్‌ను వేగవంతం చేశారు. వాజేడులో వెలిసిన పోస్టర్ల కింద ల్యాండ్మైన్లు అమర్చడం చూస్తే భారీ స్థాయిలో విధ్వంసానికి పాల్పడేందుకు యత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఎన్నికల సమయంలో మావోయిస్టు పార్టీ చర్యలు గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని 10 నుంచి 12 నియోజకవర్గాల్లో తీవ్రమైన భయాందోళన కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యకలాపాలు మొత్తం రాష్ట్ర కమిటీ కీలక నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లూ పెద్దగా కార్యకలాపాలు సాగించని డివిజన్ కమిటీలు ఎన్నికల సమయంలో యాక్టివ్ అవడం పోలీసులను ఒత్తిడిలోకి నెడుతోంది. రాష్ట్ర కమిటీ కింద పనిచేస్తున్న శబరి కమిటీ మాత్రమే కొంత యాక్టివ్‌గా ఉందని భావించిన నిఘా వర్గాలు ఇప్పుడు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇస్తూ ఇచ్చిన లేఖ పోలీస్ అధికారులనే షాక్‌కు గురిచేసినట్టు తెలిసింది. అయితే ఏడాదిన్నర క్రితం ఆదిలాబాద్ డివిజన్ కార్యదర్శి చార్లెస్ అలియాస్ డేవిడ్ మహారాష్ట్రలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందాడు. ఇతడి స్థానంలో వచ్చిన కొత్త కార్యదర్శి ఇప్పుడు మంచిర్యాల డివిజన్ కమిటీని లీడ్చేయడంతోపాటు దాడులకు కూడా వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు డివిజన్ కమిటీ కార్యకలాపాలు లేవని భావించిన నిఘా వర్గాలు.. ఇప్పుడు విడుదల చేసిన లేఖతో కంగుతిన్నట్టు తెలిసింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మావోయిస్టు పార్టీ క్షేత్ర స్థాయిలో రిక్రూట్మెంట్ కూడా చేసే ఆలోచన చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ లేఖపై అనుమానం... మావోయిస్టు పార్టీ మంచిర్యాల డివిజన్ కమిటీ పేరుతో మాజీ ఎమ్మెల్యేను హెచ్చరిస్తూ ఇచ్చిన లేఖపై అటు స్థానిక పోలీసులు, ఇటు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) విచారణ సాగిస్తున్నారు. సాధారణంగా మావోయిస్టుల పోస్టర్లు, లేఖలు సిద్ధాంతంతో కూడిన పదాలతో ప్రారంభమవుతాయి, అయితే బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేను హెచ్చరిస్తూ ఇచ్చిన లేఖ వీటికి భిన్నంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందని నిఘా అధికారులు స్పష్టంచేశారు. పైగా ఏ4సైజ్ పేపర్‌పై రాసి ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని నిఘా అధికారి ఒకరు స్పష్టం చేశారు. కావాలనే ఎవరైనా రాశారా లేక నిజంగా డివిజన్ కమిటీ నుంచి వచ్చిందా అన్నది రెండురోజుల్లో తెలుస్తుందని వివరించారు. -
మళ్లీ నేనే!
దేశవ్యాప్తంగా బీజేపీ కంచుకోటల్లో ఛత్తీస్‌గఢ్ ఒకటి. ఏకబిగిన మూడుసార్లు ఇక్కడ సీఎం రమణ్ సింగ్ నేతృత్వంలో బీజేపీయే అధికారంలో ఉంది. ఒకప్పటి కాంగ్రెస్ అడ్డా అయిన ఛత్తీస్‌గఢ్‌పై బీజేపీ పట్టు వెనక రమణ్ పాత్ర కీలకం. ఆ ధీమాతోనే ఆయన కూడా నాలుగోసారీ అధికారాన్ని కైవసం చేసుకుంటామంటున్నారు. జోగి రాక బీజేపీకన్నా కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టమంటున్నారు. నక్సల్స్, కుల సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలపై రమణ్ సింగ్ లెక్కలేంటి? మావోయిస్టులను అణచేస్తాం ‘మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం అప్రజాస్వామికం. ఎన్నికలు ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దీన్ని వినియోగించుకునేలా ప్రభుత్వం.. చర్యలు చేపడుతుంటే మావోయిస్టులు హెచ్చరించడమేంటి. రాష్ట్రంలో నక్సలైట్ల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించగలిగాం. ఇప్పుడు బస్తర్ ప్రాంతానికే వారు పరిమితమయ్యారు. రాష్ట్రంలో పూర్తిగా శాంతి నెలకొల్పడమే మా ప్రభుత్వ లక్ష్యం. అధికారంలోకి రాగానే ఈ దిశగా మా కార్యాచరణ ప్రారంభిస్తాం. వాస్తవానికి గత ఎన్నికల్లోనే (2013)మాకు తీవ్రమైన పోటీ ఉంది. అప్పుడే కాంగ్రెస్ నేతలను నక్సలైట్లు కాల్చి చంపారు. అంతటి సానుభూతిలోనూ మేం విజయం సాధించాం. ఇప్పుడు అంతటి తీవ్రమైన పోటీ పెద్దగా ఎదురవడం లేదు’ జోగి రావడం మంచిదే! ‘అజిత్ జోగి పోటీలో రావడం మంచిదే. జోగి తన సొంతపార్టీతో పోటీ చేయడం ఈ ఎన్నికలను మరింత రసతవత్తరంగా మారుస్తుంది. ఆయన బీఎస్పీతో కలిసి ఎన్నికల బరిలో దిగుతుండటం.. బీజేపీ, కాంగ్రెస్‌లపై దీని ప్రభావం ఉంటుంది. ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇది.. కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టం చేస్తుంది. ఆయన్ను ఇప్పటికీ కాంగ్రెస్ నేతగానే ప్రజలు భావిస్తున్నారు’ గిరిజనులెప్పుడూ మావెంటే.. ‘ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 స్థానాల్లో 29 గిరిజనులకు, 10 ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. మిగిలినవి జనరల్ స్థానాలు. గతంలో ఎస్సీ స్థానాల్లో ఎక్కువ మేమే గెలిచాం. గిరిజనులెప్పుడూ బీజేపీతోనే ఉంటారు. ఛత్తీస్‌గఢ్‌లో కులసమీకరణాల ప్రభావం పెద్దగా ఉండదు. నేను తటస్థ వాదిని. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కులాలూ నన్ను ఆదరిస్తాయి. అయినా.. అభివృద్ధి అంశంపైనే మేం ఈ సారి ఎన్నికల బరిలో నిలుచున్నాం. ఛత్తీస్‌గఢ్‌లో మేమేం చేశామో ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత అనే పదానికి తావే లేదు’ -
మావోయిస్ట్ చీఫ్‌గా బసవరాజ్
సాక్షి, హైదరాబాద్ : మావోయిస్ట్ చీఫ్ ముప్పాళ్ల లక్ష్మణరావు (గణపతి) స్ధానంలో శ్రీకాకుళంకు చెందిన నంబళ్ల కేశవరావు ఎంపికయ్యారు. వయోభారం కారణంగా గణపతి (72)ని పార్టీ ప్రధాన కార్యదర్శిగా వైదొలగాలని మావోయిస్ట్ కేంద్ర కమిటీ కోరింది. బసవరాజ్‌గా పార్టీ వర్గాలు పిలుచుకునే కేశవరావు (63) కేంద్ర మిలిటరీ కమిషన్ సారథిగా వ్యవహరిస్తున్నారు.విద్యార్ధి దశలోనే మావోయిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులైన కేశవరావు వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ పట్టభద్రులు కావడం గమనార్హం. కాగా గణపతి తలపై రూ 49 లక్షల రివార్డు ప్రకటించగా, బసవరాజ్‌కు పట్టిఇచ్చిన వారికి రూ 36 లక్షల రివార్డును పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. మరోవైపు రెండు నెలల కిందటే మావోయిస్టు పార్టీలో నాయకత్వ మార్పు చోటుచేసుకుందని తెలంగాణ పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. అరకులో ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యకు బసవరాజు వ్యూహం రూపొందించారని తాము భావిస్తున్నామని తెలిపాయి. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న గణపతి స్ధానంలో చురుకుగా ఉండే యువ నేతను ఎంపిక చేసుకునేందుకు వీలుగా పార్టీ పగ్గాలను వీడాలని గణపతికి కేంద్ర నాయకత్వం స్పష్టం చేయడంతో నాయకత్వ మార్పు జరిగిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. సైన్స్, బీఈడీల్లో గ్రాడ్యుయేట్ అయిన భూస్వామ్య రైతు కుటుంబానికి చెందిన గణపతి మూడు దశాబ్ధాలుగా మావోయిస్టు ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నారు. -
కిడారి, సోమను అందుకే హతమార్చాం
విశాఖ సిటీ: బహుళ జాతి సంస్థలకు ఏజెంట్లుగా మారి కోట్లాది రూపాయల ఆదివాసీల సహజ సంపదను కొల్లగొడుతున్నందునే ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చామని మావోయిస్టులు ప్రకటించారు. ఆంధ్ర–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ(ఏఓబీఎస్‌జెడ్‌సీ) లెటర్ హెడ్‌పై అధికార ప్రతినిధి జగబంధు పేరుతో శుక్రవారం రెండు పేజీల లేఖను విడుదల చేశారు. మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు కూడా లేటరైట్ పేరుతో బాౖక్సైట్ను దోచుకుంటున్నారని, ఆపకపోతే తర్వాతి పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కిడారి, సోమ హత్య జరిగిన వారం రోజుల తర్వాత ఆ హత్యల గురించి ఎర్ర సిరా అక్షరాలతో వచ్చిన లేఖ అబద్ధమని పోలీసులు అప్పట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత మరో లేఖ బయటకు వచ్చినా అందులో కిడారి, సోమ హత్యల గురించి మావోలు చెప్పలేదు. తాజాగా విడుదలైన లేఖలో మాత్రం హతమార్చడానికి దారితీసిన పరిస్థి తులు, జరుగుతున్న మోసాల గురించి వివరిస్తూ.. కమిటీ లెటర్‌హెడ్‌పై లేఖ రావడంతో విశ్వసనీయత చేకూరింది. లేఖలోని సారాంశం.. వారు ఆదివాసీ ద్రోహులు ‘‘కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలు ఆదివాసీ నేతలు కానే కాదు. వారు ద్రోహులు. ప్రజాసేవ ముసుగులో మామూలు స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తారు. క్వారీ యజమానులుగా, అరకు, అనంతగిరి, పాడేరు, విశాఖలో ఆస్తుల్ని, భూముల్ని అక్రమంగా గడించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగిస్తూ, బాక్సైట్ వెలికితీత కోసం జిందాల్, రస్‌అల్‌ఖైమా, అన్‌రాక్‌లకు ఏజెంట్లుగా వ్యవహరించి అక్రమంగా డబ్బు వెనకేసు కున్నారు. సివేరి సోమ ఎమ్మెల్యేగా కొనసాగిన కాలంలో ఇలాంటి దళారీ పాత్రలు నిర్వహించి నందుకుగాను, చైనా క్లే తీసేందుకు ప్రయత్నించిన సందర్భంలో డుంబ్రిగూడ మండలం కండ్రుం గ్రామాల ప్రజలంతా ఏకమై వెంటపడి తరి మారు. ప్రజాగ్రహానికి గురైనా తన తీరు మార్చు కోకుండా జిందాల్‌కు ఏజెంటుగా వ్యవహరించ డమే కాకుండా బాౖక్సైట్ విషయంలో ప్రజా వ్యతిరేకిగా వ్యవహరించాడు. సర్వేశ్వరరావు రోజుకో పార్టీని మారుస్తూ డబ్బు సంపాదనే ధ్యేయంగా అర్రులు చాచాడు. ఆయన కొన సాగిస్తున్న క్వారీని మూసెయ్యాలనే డిమాండ్‌తో హుకుంపేట మండలం గూడ గ్రామ ప్రజలు నెలల తరబడి ఆందోళన చేస్తున్నా అధికార అండతో ఏమాత్రం ఖాతరు చెయ్యలేదు. సొంత పార్టీలోనే వాటికి వ్యతిరేకంగా బహిరంగంగా ఆందోళనలు, నిరసనలు పెల్లుబికిన పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. వీరిద్దరూ మెజార్టీ ప్రజల ఆగ్రహానికి గురైన కార ణంగా ప్రజావ్యతిరేకుల్ని, ద్రోహులను అంతం చెయ్యాలనే నిర్ణయంతోనే తమ పార్టీ పీఎల్జీఏ ఆధ్వర్యంలో తీర్పుని అమలు చేశాము’’ అని జగబంధు లేఖలో స్పష్టం చేశారు. అయ్యన్నా.. మైనింగ్ మానుకో తెలుగుదేశం ప్రభుత్వ అండదండలతో తూర్పు కనుమల్లో అటవీ సంపదను బినామీ పేర్లతోనూ, ఆదివాసీ దళారులుగా పుట్టకొకరు తయారై, క్వారీలు, గనుల్ని తెరుస్తూ ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు ప్రాంతంలో లేటరైట్ పేరుతో బాక్సైట్ ఖనిజాన్ని తరలిస్తున్నారనీ, దీని వెనుక మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు విజయ్లున్నారని తెలిపారు. మన్యం ప్రాంత సంపద అక్రమ తరలింపుని తక్షణమే నిలిపెయ్యా లనీ, లేకపోతే.. జరిగే తీవ్ర పరిణామాలకు తామే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని దళారీలను, ప్రజా వ్యతిరేక నాయకుల్ని జగబంధు హెచ్చరించారు. ఇకనైనా తెలుగుదేశం ప్రభుత్వం బాక్సైట్ వెలికితీత కోసం జారీ చేసిన జీవో నం.97ని పూర్తిగా రద్దు చెయ్యడమే కాకుండా, అటవీ సంపదని అక్రమంగా దోచుకునే కార్యక్రమాల్ని మానుకోవాలని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు. -
ఎలక్షన్.. టెన్షన్!
సాక్షి, కొత్తగూడెం: ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో మాత్రం ఉద్రిక్తత నెలకొంది. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు మావోయిస్టు ప్రభావితమైనవి కావడంతో ఆందోళన నెలకొంది. తాజాగా మావోయిస్టులు సోమవారం దంతెవాడ జిల్లాలో ఎన్నికలను బహిష్కరించాలంటూ పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేశారు. దీంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, నారాయణపూర్, కాంకేర్ జిల్లాల పరిధిలోని కొన్ని వందల కిలోమీటర్ల పరిధిలో మావోయిస్టులు జనతన సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దీంతో ఈ సరిహద్దు జిల్లాల్లో నిరంతరం యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పైగా ఎనిమిది నెలలుగా మావోయిస్టులు, భద్రతా బలగాల మద్య నిత్యం పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉన్న దంతెవాడ, సుక్మా, బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్, బస్తర్ జిల్లాల్లో వచ్చే నెల 12న పోలింగ్ జరగనుంది. దేశంలోనే వామపక్ష తీవ్రవాదం అత్యధికంగా ఉన్న ప్రాంతం కావడంతో ఈ జిల్లాల్లోని 18 నియోజకవర్గాలకు మొదటి విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అరకు ఘటన నేపథ్యంలో నేతల్లో దడ.. గత సెప్టెంబర్ 23న విశాఖపట్నం జిల్లాలో (ఆంధ్రా–ఒడిశా సరిహద్దు) డుంబ్రిగూడ పోలీసుస్టేషన్ పరిధిలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హతమార్చిన విషయం విదితమే. కాగా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రోజుల తేడాతో ఎన్నికలు జరుగుతుండడంతో మరింత టెన్షన్ నెలకొంది. స్వేచ్ఛగా ప్రచారానికి వెళ్లేందుకు రెండు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులకు అవకాశం లేకుండా పోయింది. సాధారణ రోజుల్లోనే ఈ ప్రాంతాల్లో పరిస్థితి గంభీరంగా ఉంటుంది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 నియోజకవర్గాలు ఉండగా, తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లోని 18 నియోజకవర్గాల్లో మాత్రమే మొదటి దశలో ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పోలింగ్ నిర్వహిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రతిక్షణం ప్రమాదకర పరిస్థితే అనేలా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో పరిస్థితి అలా ఉంటే సరిహద్దుకు ఇటువైపు ఉన్న తెలంగాణలోనూ యుద్ధ వాతావరణమే ఉంది. భద్రాచలం నియోజకవర్గంలో మొత్తం 160 పోలింగ్ బూత్‌లు ఉండగా, అందులో 51 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల్లో మొత్తం 995 పోలింగ్ బూత్‌లు ఉండగా, వీటిలో 104 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. మరో 179 పోలింగ్ బూత్‌లు అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో, 344 పోలింగ్ బూత్‌లు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. భద్రాచలం, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లో, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగు, పెద్దపల్లి జిల్లాలోని మంథని నియోజకవర్గాల్లోని బూత్‌లు అత్యధికం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేయాల్సిన రాజకీయ పార్టీల నేతల్లో దడ నెలకొంది. మోహరించిన మరిన్ని బలగాలు మావోయిస్టుల అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మరిన్ని బలగాలను మోహరించింది. దీంతో గత కొన్ని నెలలుగా మావోయిస్టులకు, బలగాలకు మధ్య ఎడతెరిపి లేని పోరు నడుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న మర్రిగూడెం, గొల్లపల్లి, కిష్టారం, పామేడు పోలీసుస్టేషన్ల పరిధిలో సీఆర్పీఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేసింది. తెలంగాణలోని చెలిమెల, కలివేరు, గౌరారం, ఛత్తీస్‌గఢ్‌లోని తోగ్గూడెం(బీజాపూర్), పైడిగూడెం, వెలకనగూడెం, పాలోడి, పొట్కపల్లి (సుక్మా)ల్లో క్యాంపులను ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనుకడుగు వేయకుండా మావోయిస్టులపై పోరుకు బలగాలను కదిలిస్తోంది. -
చలపతే.. యాక్షన్ దళపతి!
ఆపరేషన్ లివిటిపుట్టులో మావోయిస్టు కీలకనేత చలపతి పాల్గొన్నారా?.. ఆయనే స్వయంగా ఆపరేషన్‌ను పర్యవేక్షించారా??.. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమల హత్యకు నిర్వహించిన ఈ ఆపరేషన్‌పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణలో దీనికి అవుననే సమాధానం లభిస్తోంది. గత నెల 23న జరిగిన ఈ హత్యాకాండలో మహిళా మావోయిస్టు నేత అరుణ ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించారని.. మిలటరీ కమిషన్ ఆధ్వర్యంలో చలపతి వ్యూహం రచించినట్లు ప్రాథమిక సమాచారం వచ్చింది. అయితే లోతుగా జరిగిన సిట్ విచారణలో చలపతి పాత్ర స్పష్టంగా వెల్లడైనట్లు తెలుస్తోంది. ఆయన స్వయంగా హత్యాకాండలో పాల్గొనకపోయినా.. దళంతో కలిసి వచ్చి కాస్త దూరంగా ఉండి పర్యవేక్షించారని సమాచారం. మరోవైపు మీడియాను వెంట తీసుకెళితే మావోయిస్టులు దాడికి పాల్పడరన్న వ్యూహంతోనే కిడారి తన కాన్వాయ్ వెంట మీడియా ప్రతినిధులను తీసుకెళ్లినా.. అది ఫలించలేదు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యోదంతంపై సిట్ జరుపుతున్న విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. డుంబ్రిగూడ మండలం లివిటిపుట్టులో గత నెల 23న మావో యిస్టులు వారిద్దరినీ దారుణంగా కాల్చిచంపిన ఘటనలోమావోయిస్టు మహిళా నేత అరుణ కీలకంగా వ్యవహరించినట్టు ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తాజాగా ఆమె భర్త, మావోయిస్టు కీలక నేత చలపతి కూడా ఆ ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు సిట్ అధికారులు తేల్చారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆదేశాలతో చలపతి దగ్గరుండి ఆపరేషన్ విజయవంతం చేసినట్టు తెలుస్తోంది. కాల్పుల పనిని మహిళా మావోలకు అప్పజెప్పి చలపతి మాత్రం కాస్త దూరంలోనే నిలబడినట్టు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. చలపతి, అరుణల నాయకత్వంలో ఆ రోజు ఉదయమే నందాపూర్ కమిటీకి చెందిన సుమారు 30మంది మావోయిస్టులు లివిటిపుట్టు చేరుకున్నారు. అక్కడకు మరో ముప్పై మంది మిలీషియా సభ్యులు చేరుకున్న తర్వాత ఆపరేషన్‌కు రంగం సిద్ధం చేశారని అంటున్నారు. ఏజెన్సీ టీడీపీ నేతలే ఉప్పందించారు.. కిడారికి సన్నిహితంగా ఉన్న టీడీపీ నేతలే మావోలకు ఉప్పందించారని సిట్ అధికారులు ప్రాధమిక దర్యాప్తులో తేల్చినట్టు తెలుస్తోంది. అయితే కిడారి వెన్నంటి తిరిగిన టీడీపీ నేతలు ఒక్కసారిగా మావోలతో కుమ్మక్కై ఎందుకు పక్కాగా సమాచారం అందించారన్న దానిపై మాత్రం సిట్ అధికారులకు స్పష్టత రాలేదు. వ్యాపార లావాదేవీల్లో అంతర్గత విభేదాలా.. పార్టీ ఫిరాయించిన తర్వాత టీడీపీలోని ఓ వర్గంతో వచ్చిన అంతరాలా.. అన్నది ఇప్పటికీ తేలలేదని అంటున్నారు. మొత్తానికి ఏజెన్సీకి చెందిన, కిడారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన టీడీపీ నేతలే మావోలకు ఎప్పటికప్పుడు ఆయన కదలికలపై సమాచారం ఇచ్చినట్టు మాత్రం సిట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మీడియా ప్రతినిధుల సాక్షిగానే... ఆ రోజు కిడారి మీడియా వారిని తన వెంట తీసుకువెళ్లడం వాస్తవమేనని సిట్ తేల్చింది. మీడియా ప్రతినిధులు ఉంటే దాడికి మావోయిస్టులు వెనుకంజ వేస్తారన్న ఉద్దేశంతో వ్యూహాత్మకంగా కిడారి వారిని వెంటబెట్టుకు వెళ్లారని అంటున్నారు. ఓ ప్రధాన పత్రిక విలేకరితోపాటు ముగ్గురు స్థానిక విలేకరులు ఆయన్ను అనుసరించారని తెలుస్తోంది. ఆయన కారుకు ముందు ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు విలేకరులు, కారు వెనుక మరో టూవీలర్‌పై ఇద్దరు విలేకరులు అనుసరించారు. కిడారి వాహనానికి ముందున్న విలేకరులు అక్కడ మావోలు కాపుకాయడం చూసి తమ బండి ఆపకుండా వెళ్ళిపోయారు. కిడారి వాహనం వెనుక అనుసరిస్తున్న ఇద్దరు మీడియా విలేకరులను మాత్రం మావోలు అడ్డగించినట్టు తెలిసింది. తమ ఆపరేషన్ పూర్తయ్యే వరకు వారిని అక్కడే కూర్చోబెట్టి ఆ తర్వాతే వదిలిపెట్టినట్టు చెబుతున్నారు. దీంతో సిట్ అధికారులు సదరు విలేకరులను విచారించినట్టు తెలిసింది. కాగా, ఆ రోజు ఆపరేషన్‌లో లివిటిపుట్టు గ్రామస్తుల పాత్ర ఏమీ లేదని సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు చెబుతున్నారు. సిట్ నివేదికను సర్కారు బయటపెడుతుందా? స్వయంగా అధికార తెలుగుదేశం నేతలే దగ్గరుండి ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరిలను కాల్చి చంపించిన వ్యవహారాన్ని ఎలా బయటపెట్టాలో తెలియక సిట్ అధికారులు మధనపడుతున్నారు. కారణాలు ఏమైనా కానీ టీడీపీ నేతలు అందించిన సమాచారంతోనే మావోలు పక్కా వ్యూహంతో మెరపుదాడి చేయగలిగారు. సిట్ దర్యాప్తులో ఈ విషయం స్పష్టమైంది. అయితే వాస్తవ నివేదిక బయటపెడితే సర్కారు తీరు ఎలా ఉంటుందోనన్న ఆందోళన విచారణ అధికారులను వెంటాడుతోంది. అందుకే మరింత లోతైన దర్యాప్తు కోసం విచారణ కొనసాగిస్తామని, ఏదేమైనా ఒకటి రెండు రోజుల్లో సిట్ నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని సిట్ వర్గాలు వెల్లడించాయి. -
ఏవోబీలో రెండు మావో దళాలు!
సాక్షి,అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ మన్యంలో మావోయిస్టులు విసిరిన పంజాకు ఘోరంగా అభాసుపాలైన పోలీసులు సత్తా చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏకంగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై మావోయిస్టులు పేల్చిన తూట పోలీసు శాఖకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ మావోయిస్టుల అణచివేతకు పోలీసులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఒడిశా డీజీపీ శర్మతో సమావేశమైన ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఉమ్మడి కార్యాచరణకు నిర్ణయం తీసుకున్నా రు. దీనిలో భాగంగానే కోరాçపుట్ జిల్లా చిక్కల్‌ములి వద్ద శని, ఆదివారాల్లో ఇరు రాష్ట్రాల పోలీసులు సం యుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు గాయపడినట్టు పోలీసులు చెబుతున్నప్పటికీ ఎవరనేది నిర్ధారణకు రాలేదు. ఆంధ్రలో దాడులు.. ఒడిశాలో షెల్టర్.. ఒడిశాలో షెల్టర్ తీసుకుని ఏపీలోని సరిహద్దు ప్రాంతాల్లోకి వచ్చి లక్ష్యాలు నిర్దేశించుకుని మావోయిస్టులు దాడులు చేసేలా కదులుతున్నారు. ఇందుకు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, చలపతి తదితర కీలక నేతలు నేతృత్వం వహిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఏకంగా మిలటరీ బెటాలియన్ ఉన్నట్టు గుర్తించారు. టెక్నాలజీని ఆశ్రయించిన పోలీసులు మావోయిస్టుల కదలికలను గుర్తించేలా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించారు. అన్ మాన్డ్ ఏరియల్స్(యుఏవీ), డ్రోన్లను వాడుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఏవోబీలో స్కానింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. రేడియో ట్రాన్సిస్టర్ మాదిరిగా ఉండే పరికరాన్ని ఎతైన ప్రదేశంలో అమర్చి దాని యాంటేనా ద్వారా స్కానింగ్ పద్ధతిని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ప్రస్తుతం మావోయిస్టులు వినియోగించే వైర్‌లెస్‌సెట్, మొబైల్ ఫోన్ల ద్వారా జరిగే సంభాషణలను రికార్డు చేయడంతోపాటు వారు ఏ ప్రాంతంలో, ఎంత దూరంలో ఉన్నారో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు చిక్కిన మావోయిస్టు కీలక నేత చత్తీస్‌గఢ్, ఆంధ్ర సరిహద్దుల్లో ఇడుమా బెటాలియన్ డెప్యూటీ కమాండర్ పోడియం ముడా సోమవారం పోలీసులకు చిక్కాడు. అతని అరెస్టుతో తూర్పు మన్యంలో మావోలకు ఎదురు దెబ్బ తగిలిందని పోలీసులు చెబుతున్నారు. 2014లో చత్తీస్‌గఢ్ మంత్రి మహేందర్ కర్మా సహా అనేక దాడుల్లో 116 మంది పోలీసుల మృతికి కూడా కారకుడని పోలీసులు చెబుతున్నారు. ఏవోబీలోనే ఆర్కే.. మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) ఆంధ్ర, ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోనే ఉన్నట్టు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆయనతో సహా ఏవోబీలో తలదాచుకున్న మావోయిస్టు కీలక నేతలే లక్ష్యంగానే కూంబింగ్ జరుగుతోందని స్వయంగా పోలీసు ఉన్నతాధికారులే ఆఫ్ ది రికార్డ్‌గా అంగీకరిస్తున్నారు. -
ఉలిక్కిపడిన సరిహద్దు గ్రామాలు
విజయనగరం, సాలూరు రూరల్: ఏఓబీకి 20కిలోమీటర్ల దూరంలో ఒడిశారాష్ట్రంలో ఆదివారం మధ్యాహ్నం పోలీసులు – మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన సంఘటన ఇక్కడి గిరిజన పల్లెల్లో కలకలం సృష్టించింది. విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్యసంఘటన తరువాత ఏఓబీలో పోలీసుల గాలింపు ముమ్మరమైంది. పోలీసుల బూట్ల చప్పుళ్లతో గిరిజన పల్లెలు మార్మోగుతున్నాయి. ఇంతలోనే ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ సుంకి సమీపంలోని షట్రాయ్ అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 1.45గంటల సమయంలో కాల్పుల సంఘటన చోటు చేసుకున్నట్టు ఒడిశా పోలీసు అధికారులు ధ్రువీకరించారు. అయితే ఈ సంఘటనలో ఎవరూ చనిపోయినట్టు సమాచారం లేదు. కానీ మావోయిస్టులకు చెందిన డంప్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. గాలింపు మరింత తీవ్రం ఒడిశా ఘటనలో మావోయిస్టులు తప్పించుకోవడంతో వారిని ఎలాగైనా వెంబడించి కచ్చితంగా పట్టుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఇక్కడివారిలో ఎక్కువైంది. ఇదే సమయంలో గతంలోని మావోయిస్టుల సంఘటనలు గుర్తు చేసుకుంటున్నారు. సాలూరు, పాచిపెంట మండలాల్లో గతంలో మావోల కదలికలు ఉండేవి. పాచిపెంట మండలంలో 2017 ఫిబ్రవరి 1న మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో సుమారు 11 మంది ట్రైనీ పోలీసులు మృతిచెందడం, 2016 మార్చి నెలలో శ్రీకాకుళం–కొరాపుట్ డివిజన్ కమిటీ(మావోయిస్టులు) సాలూరు మండలం కురుకూటి పంచాయతీ జాకరవలసలో గిరిజనుడైన పూసరి వెంకటరావును ఇన్ఫార్మర్ నెపంతో కాల్చిచంపిన సంఘటనలు గుర్తుచేసుకుంటున్నారు. మళ్లీ ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. -
పోలీసులు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు
సాక్షి, ఒడిశా, విజయనగరం : కోరాపుట్ జిల్లా పొట్టంగి పోలీస్ స్టేషన్ పరిథిలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఆంధ్రా, ఒడిశా బోర్డర్లోని సుంకి అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు నడుస్తున్నాయి. కాల్పులను ఒడిశా పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. కోరాపుట్ ఎస్పీ కన్వర్ బిశ్వాల్ మావోల క్యాంప్‌ను గుర్తించినట్లు ప్రకటించారు. ఒడిశా స్పెషల్ ఆపరేషన్ గ్రూపు, బీఎస్ఎఫ్ టీంలు ఈ కాల్పుల్లో పాల్గొన్నాయి. ఆదివారం మధ్యాహ్నం 1.45 నిమిషాలకు ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. 10 నుంచి 15 మంది మావోయిస్టులు ఈ కాల్లుల్లో పాల్గొన్నట్లు సమాచారం. -
మావోయిస్టుల టార్గెట్.. టీఆర్ఎస్ నేతలు!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు దాడులు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు పోలీసు యంత్రాంగానికి పలు హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాల్లో హై అలర్టు ప్రకటించాలని ప్రభుత్వానికి సూచించింది. ఛత్తీస్‌గఢ్ లాంటి మావోయిస్టు ప్రాబల్యం అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇదివరికే పోలీస్ శాఖను హైఅలర్టు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీలకు చెందిన కొందరు నాయకులును టార్గెట్‌గా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశం ఉందని జాతీయ ధర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) తెలిపింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు మావోయిస్టులు సానుకూలంగా ఉన్నారంటూ సమాచారం. కాంగ్రెస్ నేతలపై కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా దండకారణ్యంలో గత రెండు నెలలుగా మావోయిస్టులు ఎన్నికలపై ప్రత్యేక ప్రణాళిక రచించనట్లుగా నిఘా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు అలర్టుగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ఎన్నికల్లో మావోయిస్టుల వ్యూహాలకు, ప్రతి వ్యూహాలకు సిద్దం చేసినట్లు ఆయన తెలిపారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. -
పరిహారంలో ‘పచ్చ’పాతం!
సాక్షి, విశాఖపట్నం/పెదబయలు/కొయ్యూరు: మావోల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన అడవిబిడ్డల కుటుంబాలను ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వారి జీవితాలతో చెలగాటమాడుతోంది. ఉద్యోగాలిస్తాం.. ఉపాధి కల్పిస్తాం.. ఆర్థికంగా ఆదుకుంటామని వారికి ఇస్తున్న హామీలు మాటలకే పరిమితమవుతున్నాయి. వీరి బలహీనతలను ఆసరాగా చేసుకుని పోలీసు వ్యవస్థ వారిని ఇన్ఫార్మర్లుగా వాడుకుంటూ తమ లక్ష్యాలను సాధించుకుంటోందే తప్ప వారు మరణిస్తే ఆయా కుటుంబాలను మాత్రం ఆదుకోవడంలేదని విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. ప్రాణాలు పణంగా పెట్టి మావోల కదలికలు, సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేసే వీరికి ప్రభుత్వం రిక్తహస్తమే చూపుతోంది. కొన్ని సందర్భాల్లో అరకొర సాయమే అందిస్తోంది. మరోవైపు.. తమ లక్ష్యం దెబ్బతింటోందన్న భావనతో మావోలు వీరిని దొరికినప్పుడల్లా పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో మట్టుపెడుతుంటారు. వీరి కుటుంబాలను ఆదుకోవడంలో గత ప్రభుత్వాలతో పోలీస్తే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పరిహారంపై విధివిధానాల్లేవు.. మావోల దాడుల్లో మృత్యువాతపడిన వారిలో ఎవరికి ఎంత పరిహారం ఇవ్వాలన్న దానిపై ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టతలేదు. పరిహారం, సాయంపై ఇప్పటివరకు ప్రభుత్వపరంగా ఎలాంటి విధివిధానాలు లేకపోవడం గిరిజనులకు శాపంగా మారుతోంది. దీంతో అధికారంలో ఉన్న పార్టీలు, ప్రభుత్వాలు తమ వారైతే ఒకలా.. సామాన్యులైతే మరోలా వ్యవహరిస్తున్నాయి. అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా చనిపోతే వారి హోదాలు, స్థాయిని బట్టి గతంలో రూ.25లక్షల నుంచి రూ.50లక్షల వరకు చెల్లిస్తున్నారు. అదే సాధారణ పౌరులైతే ఐదు లక్షల వరకు పరిహారం.. ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి చిన్నపాటి కొలువు ఇస్తున్నారు. 20 ఏళ్లలో 94 మంది మృత్యువాత 1998–2018 మధ్య ఏఒబీ పరిధిలో మొత్తం 89 ఘటనలు జరిగాయి. వీటిలో 94మంది అమాయక గిరిజన పౌరులు మావోల తూటాలకు బలయ్యారు. 2014కు ముందు వరకు ఇన్ఫార్మర్లు, సామాన్యులు చనిపోతే వారికి రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు పరిహారం మంజూరు చేసేవారు. కానీ, గడిచిన నాలుగున్నరేళ్లలో చనిపోయిన ఏ ఒక్కరికీ పరిహారం పంపిణీ చేయడమే కాదు కనీసం ప్రతిపాదనలు పంపిన దాఖలాలు కూడా లేవు. అంతేకాదు.. 2014కు ముందు చనిపోయిన వారికి అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం సైతం నేటికీ అందించలేని దుస్థితి నెలకొంది. గడిచిన నాలుగున్నరేళ్లలో ఏఒబీ పరిధిలో సుమారు 20 మందికి పైగా చనిపోతే ఇప్పటివరకు ఒక్కపైసా పరిహారం అందని పరిస్థితి నెలకొంది. వారికోలా.. వీరికోలా.. అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద గత నెల 23న మావోలు మట్టుబెట్టారు. గతంలో ఏ ప్రజాప్రతినిధి, ఏ ఉన్నతాధికారికి ఇవ్వనంత పరిహారం ఈ ఇరువురికీ ప్రభుత్వం ప్రకటించింది. కిడారి కుటుంబానికి రూ.1.20కోట్ల పరిహారంతో పాటు ఆయన చిన్న కుమారుడికి గ్రూప్–1 ఉద్యోగం, సోమ కుటుంబానికి రూ.1.05కోట్ల పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇరువురికి విశాఖలో ఇంటి స్థలం, ఇళ్ల నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అభయమిచ్చారు. ఉద్యోగాలు కాకుండా వీరివురురికి దాదాపు రూ.3కోట్లకు పైగా సాయం ప్రకటించడంపై విమర్శలు వచ్చినా ఎవరూ తప్పుపట్టలేదు. తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మృత్యువాతపడగానే అనూహ్యంగా స్పందించిన ప్రభుత్వం గడిచిన నాలుగున్నరేళ్లలో మృతిచెందిన పోలీస్ ఇన్ఫార్మర్లు, ఇతరులపట్ల ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. వారికి కోట్లల్లో పరిహారం ఇస్తున్న ప్రభుత్వం వీరికి కనీసం లక్షల్లో కూడా పరిహారం ఇవ్వకపోతే ఎలా గిరిజన సంఘాల నేతలు నిలదీస్తున్నారు. మంజూరైనా పంపిణీకాని పరిహారం ఇదిలా ఉంటే.. 2013–14లో మావోల చేతిలో తొమ్మిది మంది ప్రాణాలొదిలారు. వారికి 2015లో రూ.27.8 లక్షలు విడుదలైంది. చింతపల్లి మండలం బలపం గ్రామానికి చెందిన గబ్బాడి చిట్టిదొరకు రూ.14లక్షలు, చీకటిమామిడి గ్రామానికి చెందిన వంతాల సుబ్బారావుకు రూ.40వేలు, జీకేవీధి మండలం దేవరాపల్లి గ్రామానికి చెందిన ఎం.మత్స్య రాజుకు రూ.1.25లక్షలు, కుంకుంపూడికి చెందిన కొర్రా సన్యాసిరావుకు రూ.2.25 లక్షలు, కొయ్యూరు మండలం ఎండకోట గ్రామానికి చెందిన ఎం.రాజుకు రూ.5 లక్షలు, రాజేంద్రపాలెం గ్రామానికి చెందిన యలమంచలి రమణకు రూ.2.5 లక్షలు, జి.మాడుగులకు చెందిన సింహాచలానికి రూ.5లక్షలు విడుదలయ్యాయి. అలాగే, మైదాన ప్రాంతానికి చెంది ఏజెన్సీలో ఆస్తి నష్టం జరిగిన నర్సీపట్నానికి చెందిన పి.సుజాతకు రూ.5లక్షలు, ఏలూరుకు చెందిన గంటా శివప్రసాద్‌కు రూ.5లక్షలు విడుదలై బ్యాంకు ఖాతాల్లో మూలుగుతున్నాయి. కానీ, నేటికీ ఈ పరిహారం పంపిణీకి నోచుకోలేదు. ఇక గడిచిన నాలుగున్నరేళ్లలో మృత్యువాతపడిన పోలీస్ ఇన్ఫార్మర్లు, ఇతరులకు ఒక్కపైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు. మాజీ మంత్రికే అందని సాయం సామాన్యులకే కాదు.. టీడీపీకే చెందిన మాజీమంత్రి మత్స్యరాజ మణికుమారికే పరిహారం అందకపోవడం గమనార్హం. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో 2003లో ఆమె భర్త వెంకట్రాజును మావోలు హతమార్చారు. ఆ సమయంలో సీఎంగా ఉన్న చంద్రబాబు, మణికుమారి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5లక్షల పరిహారాన్ని ప్రకటించారు. మణికుమారి పిల్లల్ని చదివించి వారికి అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆమెకు ప్రకటించిన రూ.5లక్షల పరిహారం నేటికీ అందని ద్రాక్షగానే మిగిలింది. ఇక పిల్లల్ని చదివించేందుకు ఆర్థిక సహాయం చేస్తానన్న మాట కూడా నీటిమూటగానే మిగిలింది. ఒక పాపకు మాత్రమే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రూ.25వేల వరకు ఆర్థిక సహాయం చేసినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతేకాదు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాక్సైట్ తవ్వకాల కోసం టీడీపీ ప్రభుత్వం జారీచేసిన జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2016లో బాక్సైట్ గనులున్న జెర్రెల పంచాయతీ సర్పంచ్ సాగిన వెంకటరమణను మావోలు మట్టుబెట్టారు. ఆయన కుటుంబానికి నేటికీ సాయం అందలేదు. ఇలా చెప్పుకుంటూపోతే చాలామందే ఉన్నారు. కూలీపని చేసుకుని పిల్లల్ని పోషిస్తున్నాను ముంచంగిపుట్టు మండలం రంగబయలు పంచాయతీ గొబ్బరిపడ గ్రామానికి చెందిన నా భర్త పాంగి రామన్నను 2015లో పోలీసు ఇన్ఫార్మర్ అనే నెపంతో మావోయిస్టులు నరికి చంపారు. అలాగే, మమ్మల్ని గ్రామం నుంచి బహిష్కరించారు. ప్రభుత్వం, పోలీసుల నుంచి ఎలాంటి పరిహారం అందలేదు. నాకు ముగ్గురు సంతానం. ఊరికాని ఊరిలో వారిని పోషించడం చాలా కష్టంగా ఉంది. సీఆర్పీఎఫ్ పోలీసులు వంటపాత్రలు మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వం, పోలీసులు ఆదుకోవాలి. – పాంగి రాశి,పాంగి రామన్న భార్య పాతికేళ్లవుతున్నా అందని పరిహారం శరభన్నపాలేనికి చెందిన సుబ్బారావును మావోయిస్టులు 1994లో పట్టపగలు అందరూ చూస్తుండగానే గ్రామంలో కాల్చి చంపేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ అతని భార్య కొండమ్మకు పైసా కూడా పరిహారం దక్కలేదు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల చుట్టూ ఆమె ఎన్నిసార్లు తిరిగినా ఇస్తామన్న రూ.ఐదు లక్షలు ఇప్పటివరకు ఇవ్వలేదు. వారసత్వ సర్టిఫికెట్లో తప్పు ఉందన్న కారణంతో జాప్యం చేస్తున్నారు. -
ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టుల పిలుపు
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు మరోసారి కీలక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జరుగునున్న ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మావోయిస్టులు అత్యంత ప్రభావిత ప్రాంతమైన బీజాపుర్ జిల్లాలో శుక్రవారం ఈ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో ప్రజలు పాల్గొనకూడదని.. ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తూ బ్యానర్లు కట్టారు. కాగా ఇటీవల జరిగిన అరకు టీడీపీ నేతల జంట హత్యల నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతాదళాలు ఇప్పటికే హైఅలర్టు ప్రకటించాయి. ముఖ్యంగా ఎన్నికలు జరుగునున్న ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులు ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు గతంలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం భారీగా భధ్రతా దళాలను మోహరించనుంది. కాగా డిసెంబర్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కూడా అసెంబ్లీలో ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. -
మావోయిస్టు పంథా మారాల్సిందే!
ప్రజాకోర్టు పేరిట జరిగిన ఈ దారుణ హత్యాకాండను ఖండించి తీరాల్సిందే. ఈరకమైన వ్యక్తిగత హింసాకాండ ఏమాత్రం కష్టజీవులకు మేలుకలిగించదు. అలా హత్యకు గురైన వారిపట్ల ప్రజలలో సానుభూతి పెరుగుతుంది. పైగా గిరిజనులపై జరుగుతున్న దోపిడీ దుర్మార్గాలు తగ్గే అవకాశం కూడా ఉండదు. ఆ సాయుధ పోరాటం, వ్యక్తిగత హింస ఇకనైనా విడనాడండి. రండి ఈ మేడిపండు ప్రజాస్వామ్యంలోని పురుగులను ఏరివేసి స్వచ్ఛమైన, సత్యమైన ప్రజాస్వామ్యాన్ని , నిజమైన ప్రజాస్వామ్యాన్ని రూపకల్పన చేసే పనిలో కృషి చేద్దాం. మీ సాహసాలు, త్యాగనిరతి, పోరాట పటిమ సముద్రంలో కురిసిన వానలాగా వృధా కాకుండా సమాజంలోకి రండి. ఇటీవల విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, అతనితోపాటు మాజీ ఎమ్మెల్యే సి.వే.రి. సోములను మావోయిస్టు దళం హతమార్చిన ఘటనతో ఆ ప్రాంతం హఠాత్తుగా ఉలిక్కిపడ్డట్టయింది. ప్రస్తుత ఎమ్మెల్యే కిడారి 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికై, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మారాడు. కొత్తగా తమ పార్టీలో చేరిన కిడారికి ఆ ప్రాంత మాజీ ఎమ్మెల్యే సి.వే.రి. సోముకు మధ్య సీఎం చంద్రబాబు రాజీ కుదిర్చి పార్టీ బలోపేతం కోసం గ్రూపులు కట్టకుండా కిడారితో కలిసి పనిచేయాలని ఆదేశించారు. ఆ రాజీలో భాగంగానే కిడారితోపాటు సోము కూడా ఆరోజు కలిసివెళ్లి మావోయిస్టుల వ్యూహంలో చిక్కుకున్నారు. మావోయిస్టు దళం అరకు ప్రాంతంలో వారిద్దరినీ చుట్టుముట్టిన సందర్భంగా కిడారిని పార్టీ మారినందుకు ఎంత ముట్టిందనీ, (12 కోట్లని కిడారి చెప్పారట), గిరిజన సంపదగా ఉండాల్సిన ఖనిజసంపదను దోచుకునే మాఫియాతో చేతులు కలపవద్దని పలుసార్లు హెచ్చరించినా ఎందుకు చేతులు కలిపావనీ ప్రశ్నించిన తర్వాత వారిద్దరినీ మావోయిస్టులు కాల్చిచంపారు. మావోయిస్టులు అవతారపురుషులా? అయితే ఈ దారుణ హత్యాకాండను ఖండించి తీరాల్సిందే. ఈరకమైన వ్యక్తిగత హింసాకాండ ఏమాత్రం కష్టజీవులకు మేలు కలిగించకపోగా అలా హత్యకు గురైన వారిపట్ల ప్రజలలో సానుభూతి పెరగడం సంగతి అటుంచి, గిరిజనులపై జరుగుతున్న దోపిడీ దుర్మార్గాలకు కూడా అది పరిష్కారం కాదు. ఈ అంశంపై 1946–51 మధ్యకాలంలో జరిగిన వీరతెలంగాణ విప్లవ సాయుధ రైతాంగ పోరాటం అనంతరం మాస్కోలో తనను కలిసిన నాటి సీపీఐ ప్రతినిధివర్గంతో అప్పటి సోవియట్ యూనియన్ అధినేత స్టాలిన్ వ్యక్తిగత హింసపై చెప్పిన అంశం కూడా మావోయిస్టుల దృష్టిలో ఉండాల్సింది. ఇలాంటి హింస కారణంగా.. ‘ ప్రజలు తమకు తాము సంఘటితమై, సమరశీల పోరాటం ద్వారా తమ శతృవర్గాన్ని ఎదుర్కొనాల్సిన చోట, ఆ కర్తవ్యాన్ని తమ బదులు అవతార పురుషుల వంటి కొందరు విప్లవకారులు నెరవేరుస్తారులే అనే భ్రమ, నిస్తేజం ప్రజల్లో కలుగుతాయి‘ అన్నది నాటి స్టాలిన్ హెచ్చరిక. పైగా ఇప్పుడు మావోయిస్టులు, తమ చర్యవలన ఎవరికి ఉపయోగం జరగాలని ఆశిస్తారో, అదే ఆదివాసీ గిరిజన శాసనసభ్యులను మట్టుబెట్టారు. అది ఆదివాసీ ప్రజానీకం దృష్టిలో కూడా దారుణమైన చర్యే అవుతుంది. ఆమేరకు మావోయిస్టులు ఆదివాసీలనుంచి వేరుపడే అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయం గమనంలో ఉండాలి. 25–09–2018 నాటి టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త ప్రకారం, ‘మావోయిస్టులు నల్లమల విడిచి వెళ్లిన తర్వాత అక్రమంగా గనుల తవ్వకాల మాఫియా, గిరిజన వనరులను దోచుకోవడం ఎక్కువైంది.‘ మావోలు అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేసిన తదుపరి ఆ ప్రాంతంలో అభివృద్ధి జరగకపోగా పోలీసులు ఆ ప్రాంతంలో నిఘా పెంచిన పిదప ఏర్పడిన ’శాంతి’ తర్వాత మైనింగ్ మాఫియా ఆగడాలు పెచ్చుమీరాయి! 2009 వరకు ఏ రాజకీయ నేత కూడా కృష్ణానదీతీరాన అక్రమ ఇసుక తవ్వకాలు చేపట్టినట్లు లేదు. ఇప్పుడు రోజుకు రూ 10 కోట్లను ఈ స్థానిక పాలకపార్టీ సిండికేట్లు దండుకుంటున్నారు. విలువైన సున్నపురాయి ఖనిజాలున్న గురజాల ప్రాంతంలో అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారు. గ్రానైట్ గనులున్న వినుకొండ, సత్తెనపల్లి వంటి చోట్ల కూడా అదే మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోంది. ఇక ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరిన ప్రజా ప్రతినిధులు, నేతలు పార్టీ మారటానికి ప్రధాన కారణం.. అక్రమంగా మైనింగ్ చేసి కోట్లు ఆర్జించవచ్చన్న ఉద్దేశంతోనేనని ఆ స్థానికులు చెప్పుకుంటున్నారు. మాచర్ల ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ కేసులో అది వాస్తవమేనని హైకోర్టు తీర్పునిచ్చింది కూడా. సమాచారం ఇచ్చిందెవరు? గతంలో ఇలాంటి దాడులకు పాల్పడిన నాలుగైదు రోజుల్లోపే ఆ చర్యకు తామే బాధ్యులమని మావోయిస్టులు ప్రకటన చేసేవారు. పది రోజులు దాటినా ఇంతవరకు మావోయిస్టుల నుంచి సాధికార ప్రకటన రాలేదు. దాంతో కొన్ని ఊహాగానాలకు ఆస్కా రం ఏర్పడింది. ఆ ప్రాంతంలో గంజాయి సాగు, ఈ మైనింగ్ వ్యవహారాలు, దాని ఎగుమతి అమ్మకాల విషయంలో స్థానిక మాఫియా నేతల మధ్య విభేదాలు వచ్చి ఒక ముఠా.. మావోయిస్టులకు కిడారి, సోముల కదలికల సమాచారం చేరవేసి వారితో కుమ్మక్కయి ఈ ఘాతుకం చేయించారన్నది అలాంటి ఊహాగానాల్లో ఒకటి. అది వాస్తవమే అయి నా, మావోయిస్టుల ఈ ఘాతుకానికి అది సమర్థన కానే కాదు. పైగా మావోయిస్టులు ఇలా కిరాయి హం తకులుగా మారారా? అనే వ్యతిరేక భావం సాధారణ ప్రజానీకంలో సైతం వెగటు కలిగిస్తుంది. వరవరరావు వంటి నేతలపై మోదీ హత్య కుట్ర కేసు ను బనాయించడం ఎంత తీవ్ర తప్పిదమో, అరకు ప్రాంతంలో మావోయిస్టుల చర్య కూడా అలాంటి తీవ్ర తప్పిదమే. మానవ హక్కుల సంఘం నేత ప్రొ. హరగోపాల్ సైతం దీన్ని ఖండించారు. మావోయిస్టుల దుశ్చర్యను నేనూ ఖండిస్తున్నాను. అయితే ప్రజాజీవితంలోకి రండని కంటితుడుపుగా అన్నట్లుగా వారికి సలహా ఇవ్వగల స్థితిలో లేను. ప్రజాజీవనం అంటే ప్రస్తుతం నడుస్తున్న ప్రజాస్వామ్య పంథాకు రమ్మనేనా? ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల తీరు చూస్తుంటే ఈ ప్రజాస్వామ్యాన్ని అటు మోదీ ఇటు చంద్రబాబు, కేసీఆర్ కలిసి నేతి బీరలో నెయ్యిలాగా చేస్తారని భయాందోళన కలుగుతోంది. ఈ ముగ్గురూ సహజ మిత్రులు. కృత్రిమంగా శతృత్వాన్ని నటిస్తున్న పార్టీల నేతలు. ఏ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించాలి? మావోయిస్టు మిత్రులారా, మీ సాయుధ పోరాటానికి, వ్యక్తిగత హింసావాదానికి కాలం చెల్లింది. ఇక దాన్ని పట్టుకుని వేళ్లాడి ఏం ప్రయోజనం? ఆ కొండల్లో, గుట్టల్లో, ఎండకు, వానకు, చలికి, ఆ పురుగుపుట్రల మధ్య ఎంత శ్రమించినా ఉపయోగం లేదు. పైగా మీరు సరే.. ఆ ఆడకూతుళ్లను కూడా ఈ కష్టభరితమైన జీవితానికి ప్రోత్సహించడం తగునా? వారిని కూడా అమరవీరులను చేయడం వల్ల ఏం ఫలితం? ఆ పంథా విడిచిపెట్టండి అని గొంతెత్తి పిలవాలనిపిస్తోంది. కానీ ప్రజాస్వామ్యం పేరిట నడుస్తున్న ఆధిపత్య కులాల, కోటీశ్వరుల దోపిడీ పాలనామార్గానికి రండని వారిని ఎలా ఆహ్వానించగలను? ఎన్నికల ప్రచారంలో ఒక పార్టీ తరపున, మరో పార్టీని తీవ్రంగా విమర్శించి తీరా ఆ పార్టీయే ప్రభుత్వంలోకి వస్తే తాము గెలిచిన పార్టీని వీడి ఆ పాలక పక్షంలో ఎలాంటి బిడియం లేకుండానే చేరిపోతున్నారు. మరోవైపున ప్రభుత్వ పక్షం లక్ష్యం కూడా తన మందీ మార్బలం పెరగడమే కనుక వీరికి ఎర్రతివాచీ పరిచి తమలో కలుపుకునేందుకు పాలకపార్టీకి కనీస లజ్జ కూడా ఉండదు. ఈ ప్రక్రియనంతటినీ పర్యవేక్షించి, ఏమాత్రం రాజ్యాంగ విలువలూ లేకుండా ప్రభుత్వ పదవులు సైతం ప్రతిష్టించే సభాపతులను చూస్తున్నాం.ప్రతిపక్షం నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను తమ పక్షంలో చేర్చుకునేందుకు 20–30 కోట్ల రూపాయలను బాబు ప్రభుత్వం ఇచ్చిందన్నది నానుడి. (అదే ఆదివాసీ ఎమ్మెల్యేలకు అయితే రూ. 10 లేదా రూ.12 కోట్లు సరిపోతుంది.) పార్టీలతో పని లేకుండా ఎలాగైనా సరే గెలిచి వస్తే చాలు ఒక్కో విజేతకు వందకోట్ల రూపాయలిచ్చి కొనుక్కుందాం అనే భరోసా ఉన్న పాలకుల ప్రజాస్వామ్యం మనది. ఇలా చెల్లింపులకు సింగపూర్ బ్యాంకు సంచీ విదిలిస్తే చాలు. లేకపోతే పోలవరం, పట్టిసీమ, నదుల అనుసంధానం, నడిచేవాళ్లు, వాహనాలు లేకున్నా 8 లేన్ల రోడ్లు, మెట్రో రైళ్లు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు నిర్మిస్తున్నట్లు చెబుతూ ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇస్తే బోలెడన్ని కమీషన్లు. ఖర్చయ్యేది ప్రజలసొమ్ము. ఆ కాంట్రాక్టర్ల ద్వారా చేరేది మనకు అనే నేతలూ.. ప్రజాసేవలో మొదటి తరగతి కూడా పూర్తి చేయని కొడుకులను చినబాబు అంటూ తన సీఎం పదవికి వారసులుగా ప్రమోట్ చేసుకున్న పెదబాబులను కళ్లముందే చూస్తున్నాం. నిజమైన ప్రజాస్వామ్యమే లక్ష్యం కావాలి! కనుక మావోయిస్టులకు చెబుతున్నాను. ఆ సాయుధ పోరాటం, వ్యక్తిగత హింస విడనాడండి. రండి ఈ మేడిపండు ప్రజాస్వామ్యంలోని పురుగులను ఏరివేసి స్వచ్ఛమైన, సత్యమైన ప్రజాస్వామ్యాన్ని నిజమైన ప్రజాస్వామ్యాన్ని రూపకల్పన చేసే పనిలో కృషి చేద్దాం. మీ సాహసాల్ని, త్యాగనిరతిని, పోరాట పటిమను సముద్రంలో కురిసిన వాన లాగా వృధా కాకుండా సమాజంలోకి రండి. పైన పేర్కొన్న పదవీవ్యామోహ, అవకాశవాద, ధనస్వామ్య, ఆధిపత్య కుల అహంకారులే కాదు. ప్రజలు కూడా ఉన్నారు. వారిలో నేటికీ నిజాయితీపరులే ఎక్కువ. వారితో కలిసి ఈ నయవంచక పాలనపై సమరశీల ఉద్యమాలు నిర్మిద్దాం. కమ్యూనిస్టు పార్టీలు చీలిపోయి, బలహీనపడినా అవి నేటికీ ప్రజాక్షేత్రంలోనే ఉన్నాయి. వాటితో మీరూ కలవండి. కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత సాధిద్దాం. కమ్యూనిస్టులు కాని వారిలో కష్టజీవులే కాదు. వర్ణ వివక్షతో అణగారిపోతున్న కోట్లాదిమంది బహుజనులున్నారు. మైనారిటీలు ఉన్నారు. మహిళలున్నారు. శ్రామిక వర్గేతర పార్టీల్లోనూ మాట తప్పని నిజాయితీపరులూ, ప్రజాసేవపై అనురక్తి కలవారూ ఉన్నారు. అందరం కలిసి ఈ నయవంచక పాలన స్థానంలో బహుజన వామపక్ష భావజాలం కల ప్రజానీకంతో నిజమైన ప్రజాస్వామ్యాన్ని సాధించే కృషిలో చేయి చేయి కలు పుదాం! మావోయిస్టులను అందుకు ఆహ్వానిద్దాం. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్ట్ విశ్లేషకులు మొబైల్ : 98481 69720 -
ట్రాఫిక్‌ను ఆపి.. కాపు కాసి..
సాక్షి, విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చేందుకు మావోయిస్టులకు స్థానిక టీడీపీ నేతలు ఏ స్థాయిలో సహాయ సహకారాలు అందించారో విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సిట్ అధికారులు, పోలీసుల కథనం ప్రకారం.. టీడీపీ నేతల సహకారంతోనే మావోలు పక్కా స్కెచ్ అమలు చేశారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల కదలికలు ఎప్పటికప్పుడు టీడీపీ నేతల ద్వారా తెలుసుకుని, మాటు వేసి మట్టుబెట్టారు. ఈ ఆపరేషన్‌లో టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు వై.సుబ్బారావు కీలక పాత్ర పోషించారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు మావోల ఉచ్చులో పడేలా చేయడంలో సుబ్బారావు దంపతులు క్రియాశీలకంగా వ్యవహరించినట్టు సిట్ ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఘటన జరిగిన గత నెల 23వ తేదీ ఉదయం సర్రాయిలో గ్రామ వికాస్ కార్యక్రమానికి కిడారి, సోమలు అరకు నుంచి బయల్దేరారని తెలియగానే, మావోలు మాటు వేసిన లివిటిపుట్టు వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంలో కూడా సుబ్బారావు మరికొంతమంది సహకారంతో క్రియాశీలకంగా వ్యవహరించినట్టు తెలిసింది. వై జంక్షన్లో ట్రాఫిక్ మళ్లింపు ఘటన జరిగిన రోజు ఉదయం నుంచే వై జంక్షన్‌గా పిలువబడే డుంబ్రిగుడ– గుంటచీమ– లివిటిపుట్టు రోడ్డులో సుబ్బారావు సివిల్ దుస్తుల్లో ఉన్న మావోలతో కలసి ట్రాఫిక్ మళ్లించే కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెబుతున్నారు. ఆ రోజంతా ఆ జంక్షన్‌లోనే ఆయన హల్చల్ చేశారని, నిత్యం వందలాది మంది రాకపోకలతో రద్దీగా ఉండే ఈ వై జంక్షన్ వద్ద ఘటన జరిగిన రోజున జనసంచారం లేకుండా చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో మావోల నుంచి తప్పించుకునేందుకు కారును మళ్లించేందుకు యత్నించగా.. గుర్తుతెలియని లారీ ఒకటి తమ వాహనాన్ని అడ్డుకుందంటూ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కారు డ్రైవర్ చిట్టిబాబు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించిన విషయం తెలిసిందే. అంతమంది మావోలు అక్కడ మాటు వేసి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల వాహనాలను అడ్డగించి ముట్టడించిన సమయంలో ఆ లారీ అటువైపుగా ఎలా వచ్చింది? సోమ కారును ఎందుకు అడ్డగించింది? ముందే ఆ ప్రాంతంలో ఉంచారా? అసలు ఆ లారీ ఎవరిది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న సుబ్బారావు భార్య మరికొంతమంది స్థానికులతో కలిసి మావోలకు ఆ రోజు భోజనాలు పెట్టినట్టు సిట్ గుర్తించింది. హెచ్ఎం చెండా ఏలియా అడ్డగింపు నిషేధిత ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ గిరిజన్ రైట్స్ (ఓపీజీఆర్) వ్యవస్థాపకుడు, ప్రస్తుతం గూడా హైస్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్న చెండా ఏలియాను బుధవారం కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు అటకాయించడం కలకలం రేపింది. హుకుంపేట మండలం గూడ రోడ్డులో కారులో వెళ్తున్న తనను ముందుగా ఓ వ్యక్తి ఆపి కారు దింపారని, తర్వాత మరో ముగ్గురు తన వద్దకు రాగా.. తృటిలో తప్పించుకున్నట్టు ఏలియా స్థానిక మీడియాకు వివరించారు. వాస్తవానికి ఏలియా నుంచి కొంత సమాచారం రాబట్టేందుకు పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిందిగా మంగళవారం అరకు పోలీసులు కోరారు. అయితే ఆయన తనకు ఆరోగ్యం బాగోలేదు.. రేపు వస్తానని చెప్పినట్లు తెలిసింది. -
మావోలకు టీడీపీ నేతల సహకారం.. నిఘా వైఫల్యం
ఇద్దరు ప్రముఖుల హత్యకు స్కెచ్ వేశారు.. పలుమార్లు మాటేశారు.. ఇంకెన్నోసార్లు రెక్కీలు చేశారు.. అయినా పోలీస్ వ్యవస్థ పసిగట్టలేకపోయింది.. నిఘా వ్యవస్థ నిద్రపోయింది.. సొంత పార్టీ నేతలే ఉప్పందిస్తున్న విషయాన్ని ఆ పార్టీ శ్రేణులూ పట్టుకోలేకపోయాయి.. ఇన్ని వైఫల్యాల ఫలితమే ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమల హత్యాకాండ.. సిట్ విచారణలో ఇవే అంశాలు ఒక్కొక్కటిగా నిర్థారణ అవుతున్నాయి.. హత్యాకాండ అనంతరం అరకు, డుంబ్రిగుడ పోలీస్స్టేషన్ల విధ్వంసంలోనూ పలువురు మావోయిస్టులు పాల్గొన్నట్లు విశ్వసనీయ సమాచారం. వీటన్నింటికీ మించి.. ఒత్తిడితోనో, బెదిరింపులవల్లో.. ఏ కారణాలతోనో.. టీడీపీ కిందిస్థాయి నేతలే మావోలకు వేగులుగా, ఇన్ఫార్మర్లుగా మారి.. తమ అగ్రనేతల కదలికల సమాచారాన్ని మావోలకు చేరవేయడం.. హత్యాకాండ కోసం వచ్చిన దళ సభ్యులకు భోజన, వసతి కల్పించినట్లు తేటతెల్లడం కావడం కలకలం రేపుతోంది.ఈ హత్యల్లో ప్రతిపక్షం కుట్ర ఉందన్న టీడీపీ నేతల ఆరోపణలను రాజకీయ లబ్ధికోసం చేసినవిగా తేల్చేస్తున్నాయి. విశాఖపట్నం : అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యకు మావోలు పలుమార్లు ప్రయత్నించినా పోలీసులు పసిగట్టలేకపోయారన్న వాదన తెరపైకి వచ్చింది. నాలుగైదుసార్లు ప్రయత్నించిన వారు.. చివరికి లివిటిపుట్టు వద్ద సెప్టెంబర్ 23న సాధించగలిగారని అంటున్నారు. అక్కడికి సరిగ్గా రెండు రోజుల ముందు సెప్టెంబర్ 21న పెదబయలు మండలం పెదగూడ పంచాయతీలోని కోయాపల్లిలో కిడారి, సోమలను హతమార్చేందుకు మావోలు మాటు వేశారని.. ఆరోజు కిడారి వచ్చినా, సోమ రాకపోవడంతో వెనక్కి తగ్గారని చెబుతున్నారు. అంతకు ముందు బొంగరం సమీపంలోని కుంటమామిడి వద్ద కూడా ప్రయత్నించి విఫలమయ్యారంటున్నారు. బలమైన ఇన్ఫార్మర్ వ్యవస్థ ఉందని గొప్పగా చెప్పుకునే పోలీసులు వీటిలో ఏ ఒక్కదాన్నీ పసిగట్టలేకపోవడం తలదించుకునేలా చేసింది. టీడీపీ నేతల సహకారంతోనే స్కెచ్ టీడీపీ సీనియర్ నాయకుడు, తూటంగి మాజీ ఎంపీటీసీ యేడెల సుబ్బారావు, అతని భార్యతోపాటు కొందరు కిడారి, సోమ అనుచరులు సహకరించడంతో మావోల పని సులువైంది. వారి సహకారంతోనే స్కెచ్ వేసి కిడారి, సోమలను రప్పించేలా లివిటిపుట్టు వద్ద ఉచ్చు పన్ని, మాటు వేశారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ బృందం ఇదే నిర్థారణకు వచ్చినట్లు తెలుస్తోంది. సుబ్బారావు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. పోతంగి పంచాయతీ అంత్రిగుడకు చెందిన కమల, శోభన్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఘటనకు ముందురోజు(శనివారం) రాత్రి సాధారణ దుస్తుల్లో ఉన్న ఇద్దరు మావోలకు అన్నం పెట్టినట్లు విచారణలో కమల అంగీకరించినట్టు తెలుస్తోంది. శోభన్ కూడా ఇదే విషయం విచారణలో చెప్పినట్లు సమాచారం. వీరితో పాటు తాజాగా మాజీ మావోయిస్టు కామరాజు సోదరుడు, టీడీపీ నాయకుడైన బిసోయి మూర్తి, టీడీపీకే చెందిన తూటంగి దతూర్ గ్రామ మాజీ సర్పంచ్ కుంతర్ల సుబ్బారావులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. టీడీపీ మాజీ ఎంపీపీ ధనేరావును ఇప్పటికే విచారిస్తున్న పోలీసులు.. మరింత సమాచార సేకరణలో భాగంగా వ్యూహాత్మకంగా అతడ్ని మంగళవారం బయటకు పంపినట్లు చెబుతున్నారు. మరో వైపు లివిటిపుట్టు పరిసర గ్రామాలకు చెందిన సుమారు పదిమందిని అదుపులోకి తీసుకొని విలువైన సమాచారం రాబట్టినట్లు తెలిసింది. వీరిందరిపై కేసులు నమోదు చేసే అవకాశాలుండగా.. అంతా టీడీపీకీ చెందినవారే కావడంతో కేసులు నమోదు చేస్తే ప్రభుత్వ స్థాయిలో ఎలాంటి ఒత్తిళ్లు వస్తాయోనన్న ఆందోళన సిట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ హత్యాకాండ వెనుక ప్రతిపక్షం కుట్ర ఉందన్న టీడీపీ నేతల ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నవేనని తేల్చేస్తున్నాయి. విధ్వంసంలోనూ మావోలు? లివిటిపుట్టులో హత్యాకాండ అనంతరం డుంబ్రిగుడ, అరుకు పోలీస్ స్టేషన్లపై జరిగిన దాడి, దహనంలోనూ మావోల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సివిల్ దుస్తుల్లో కొంతమంది మావోలు ఆందోళనకారులతో కలిసిపోయి పోలీస్‌స్టేçషన్లపై దాడికి ఆజ్యం పోశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కూతవేటు దూరంలోనే అరుకు పోలీసులు, ఏపీఎస్పీ బలగాలు ఉన్నప్పటికీ ఆందోళనకారుల్లో కలిసి ఉన్నారన్న భయంతోనే ముందడుగు వేయలేకపోయారంటునారు. విధ్వంసాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే మావోలు కాల్పులకు దిగడం లేదా బాంబులు వేసే ప్రమాదముందని, అదే జరిగితే భారీగా ప్రాణనష్టం వాటిల్లే ముప్పును గుర్తించే వెనకడుకు వేయాల్సి వచ్చిందని ఏపీఎస్పీ సిబ్బంది ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. మరోపక్క కిడారి, సోమలు హత్యకు గురైన విషయం క్షణాల్లోనే మీడియా ద్వారా పోలీస్ ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ వారు సకాలంలో స్పందించకపోవడం వల్లే మావోలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారంటున్నారు. సమాచారం వచ్చిన వెంటనే స్పందించి నలువైపుల నుంచి కూంబింగ్ చేపట్టి ఉంటే కొంతమందైనా మావోలు చిక్కేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
భయం గుప్పెట్లో సర్రాయి
విశాఖపట్నం, డుంబ్రిగుడ(అరకులోయ): మండలంలోని లివిటిపుట్టు గ్రామ సమీపంలో ఈ నెల 23న మాటువేసి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చినప్పటి నుంచి సర్రాయి గ్రామంలో గిరిజనులు తీవ్రభయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటూ గుడుపుతున్నారు. ఎవరు ఎప్పుడు వస్తారో, ఎవర్ని తీసుకెళ్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. నిద్రకు దూరమవుతున్నారు. గ్రామానికి చెందిన సుమారు తొమ్మిది మంది గిరిజనులను సోమవారం వేకువ జాము న పోలీసులు తీసుకెళ్లి విచారించి, సాయంత్రం విడిచిపెట్టారు.మంగళవారం కూడా గ్రామస్తులందరూ విచారణకు రావాలని పోలీసులు ఆదేశించండంతో వారు భయంతో వణికి పోతున్నారు. ఈ గ్రామంలో 80 కుటుంబాలకు చెందిన 400 మంది జీవిస్తున్నారు. ఈ గ్రామంలో నిర్వహించనున్న సమావేశానికి వెళుతుండగా మార్గమధ్యంలో లివిటిపుట్టు వద్ద కిడారి, సోమలను మావోయిస్టులు హత్యచేసినప్పటి నుంచి వీరికి కష్టాలు ప్రారంభమయ్యాయి. ముమ్మరంగా కూంబింగ్: మరో వైపు విశాఖ మన్యంతో పాటు ఏవోబీలో గ్రేహౌండ్స్ దళా లు,స్పెషల్ పార్టీ పోలీసులు సీఆర్పీఎఫ్ జవాన్లు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మా వోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. మండలంలో దాదాపు అన్ని గ్రామాలు, సమీప అటవీ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో సాయంత్రం అయితే చాలు ఎవరూ బయటకు రావడం లేదు. సమావేశం ఉందని తెలియదు: తమ గ్రామంలో సమావేశం ఉందని ఆ రోజు ఉదయం వరకు తెలియదని, టెంటు సామగ్రి, కుర్చీలు వచ్చిన తరువాత తెలిసిందని సర్రాయి గ్రామస్తులు తెలిపారు. అప్పటికే ఎక్కువ మంది చర్చిలకు వెళ్లిపోయామని, హత్యల సమాచారం తమకు మధ్యాహ్నం తెలిసిందని వారు చెబుతున్నారు. ఒడిశా అధికారులతో చర్చలు అరకులోయ: తమకు సవాల్ విసిరిన మావోయిస్టులను పూర్తిస్థాయిలో ఏరివేయడమే లక్ష్యంగా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈమేరకు ఇటీవల ఒడిశా డీజీపీ, మల్కన్‌గిరి,కోరాపుట్ జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో ఏపీ డీజీపీ ఠాకూర్ ఫోన్లో చర్చించినట్టు తెలిసింది.లివిటిపుట్టు సంఘటనలో పాల్గొన్న మావోయిస్టుల దండు ఇంకా సురక్షిత ప్రాంతాలకు వెళ్లలేదని, ఏవోబీలో తలదాచుకున్నారనే పక్కా సమాచారంతో పోలీసు పార్టీలు అడవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులను పూర్తిగా మట్టుబెట్టాలనే వ్యూహంతో పోలీసు పార్టీలు అడవుల్లో అడుగులు వేస్తున్నాయి. ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలోని అన్ని పోలీసు స్టేషన్లు,అవుట్ పోస్టులలో సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఒడిశాలోని పోలీసు పార్టీలు కూడా తమ అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి హత్యలు జరిగిన తరువాత మావోయిస్టులు ఏ ప్రాంతానికి వెళ్లారన్న సమాచారాన్ని కూడా పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది సహకరించిన వారిపై డీఐజీ ఆరా చింతపల్లి: అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివెరి సోమల హత్య నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మావోయిస్టులపై పూర్తి దృష్టి సారించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వారి కదలికలపై పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి విశాఖరేంజ్ డీఐజీ శ్రీకాంత్, జిల్లా రాహుల్‌దేవ్ శర్మలు అత్యంత రహస్యంగా మండల కేంద్రానికి వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్లో రాత్రి బసచేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. స్థానిక పోలీసు అధికారుల వద్ద మావోయిస్టులకు సంబంధించిన సమాచారం. ఈ ప్రాంతంలో మావోయిస్టులకు సహకరించే వారి వివరాలు అడిగితెలుసుకున్నట్టు తెలిసింది. పోలీస్ స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్టు భోగట్టా. మావోయిస్టుల దూకుడుకు అడ్డుకట్టు వేసేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించినట్టు çతెలిసింది. కిడారి హత్య, అనంతరం చోటుచేసుకున్న ఘటనల్లో పోలీసుల వైఫల్యం ఉన్నట్టు ఇటీవల డీజీపీ ఠాకూర్ ప్రకటించడంతో జిల్లా పోలీస్ అధికారులు మావోయిస్టులను ఆగడాలకు అడ్డుకట్టు వేయడమే లక్ష్యంగా పూర్తి నిఘా పెట్టినట్టు సమాచారం. హత్యల సంఘటన తరువాత డీజీపీతో కలిసి గత నెల 27 చింతపల్లి వచ్చిన డీఐజీ తాజాగా మరోసారి సందర్శించారు. పోలీసు బలగాల కూబింగ్ ముమ్మరం చేయడంతో పాటు మావోయిస్టుల కదలికలపై స్వయంగా జిల్లా పోలీస్ అధికారులు దృష్టిపెట్టడంతో మ న్యం వాతావరణం వేడెక్కుతోంది. ఏ నిమిషానికి ఏం జరుగుతందోనని మారుమూల ప్రాం తాల గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణదేవిపేట, గొలుగొండ పోలీస్స్టేషన్ల తనిఖీ గొలుగొండ(నర్సీపట్నం): ఏజెన్సీకి ముఖ ద్వారమైన కృష్ణదేవిపేట, గొలుగొండ పోలీస్ స్టేషన్లను డీఐజీ శ్రీకాంత్, విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీరి పర్యటనను గోప్యంగా ఉంచారు.డీఐజీ, ఎస్పీని ఎవరూ కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసు స్టేషన్ల భద్రతపై డీఐజీ, ఎస్పీలు ఆరా తీసినట్టు తెలిసింది. ఈ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పోలీసులు, మావోయిస్టులు మృతి చెందారు. ఈ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని భద్రత చర్యలపై ఆరా తీసినట్టు తెలిసింది. మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న నాయకులకు భద్రతపై కూడా ఆరా తీసినట్టు సమాచారం. -
అధికారుల్లో గుబులు
సాక్షి, విశాఖపట్నం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యోదంతానికి బాధ్యులను చేస్తూ ఒకరి తర్వాత మరొకరిపై చర్యలు తీసుకుంటుండడంతో అధికారుల్లో గుబులు మొదలైంది. లివిటిపుట్టు ఘటనతో ఎగసిన భావోద్వేగాల నడుమ చెలరేగిన హింసాకాండ కొద్ది గంటల్లోనే సద్దుమణిగినప్పటికీ ఆ దుర్ఘటన మాత్రం అధికారులను వెన్నాడుతోంది. పోలీసుల నిఘా వైçఫల్యాన్ని ఆసరాగా చేసుకుని లివిటిపుట్టు వద్ద మాటు వేసి మావోయిస్టులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మట్టుపెట్టారు. ఆ ఘటనకు పోలీస్ బాస్‌గా తానే బాధ్యత వహిస్తానంటూ సాక్షాత్తు డీజీపీ ఆర్పీ ఠాకూర్ చేసిన ప్రకటన పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. లివిటిపుట్టు ఘటన తర్వాత చెలరేగిన హింసాకాండను అదుపు చేయడంలో విఫలమయ్యారంటూ ఇప్పటికే డుంబ్రిగుడ ఎస్సై అమ్మనరావుపై సంఘటన జరిగిన మర్నాడే సస్పెన్షన్ వేటు వేశారు. అరకు సీఐ వెంకునాయుడ్ని రేంజ్ వీఆర్‌కు పంపుతూ రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ సోమవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావుకు అరకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. మరోవైపు అందుబాటులో బలగాలున్నా అరకు, డుంబ్రిగుడ పోలీస్స్టేషన్లపై దాడిని అదుపు చేయడంలో విఫలమయ్యారంటూ ఏపీఎస్పీ ఆఫీస్ కమాండర్ సమర్పణరావు, ఆర్ఎస్ఐ సాంబశివరావులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఏపీఎస్పీ ఐజీ ఆర్పీ మీనా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. లివిటిపుట్టు ఘటనతోపాటు అరకు, డుంబ్రిగుడలలో చెలరేగిన హింసాకాండను విచారించడానికి వేసిన సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. సిట్ సిఫార్సు మేరకే సోమవారం పోలీసు అధికారులపై చర్య తీసుకున్నారు. కాగా మరికొంతమందిపై వేటుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలకు కారణమైన నిఘా వైఫల్యానికి బాధ్యులైన ఉన్నతాధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోని ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి మధ్య పనిచేస్తున్న క్షేత్రస్థాయి అధికారులపై చర్యలు తీసుకోనవడం పట్ల ఆవేదన వ్యక్తమవుతోంది. ఘటన జరిగిన రోజున ప్రజలు తీవ్ర భావోద్వేగాలతో ఉన్నారని.. ఆ సమయంలో ఎవరు కన్పించినా దాడులు తప్పవని.. బలగాలున్నా వాటిని అదుపు చేయడం కష్టసాధ్యమన్న వాదన వినిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మరికొంతమందిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తుండడంపై ఏజెన్సీలో పనిచేస్తున్న పోలీస్ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అరకులోయ: అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చేందుకు మాటు వేసిన మావోయిస్టులకు వంటలు చేశారనే ఆరోపణలపై అంత్రిగుడ గ్రామంలో ఇద్దరు గిరిజనులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన శోభన్, కమల అనే ఇద్దరు గిరిజనులను ఆదివారం అదుపులోకి తీసుకొని, అరకులోయ స్టేషన్‌కు తరలించామని వారు తెలిపారు. సిట్ బృందంలోని పోలీసు అధికారులు ఈ ఇద్దరు గిరిజనులను స్థానిక పోలీసు అతిథి గృహంలో విచారిస్తున్నారు. తమ గ్రామానికి చెందిన శోభన్, కమలలు అమాయకులని, వారిని విడిచిపెట్టాలని పోలీసు అధికారులను కోరేందుకు అంత్రిగుడ గ్రామంలోని గిరిజనులంతా అధిక సంఖ్యలో సోమవారం పోలీసు అతిథి గృహానికి చేరుకున్నారు. కొంతమందికి మాత్రమే పోలీసు అధికారులు అనుమతి ఇచ్చి శోభన్‌తో మాట్లాడించారు. కమలతో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అంత్రిగుడ గిరిజనులు వాపోయారు. వారిని వెంటనే విడిచిపెట్టాలని అంత్రిగుడ గిరిజనులు పోలీసు అధికారులను వేడుకుంటున్నారు. -
మావోల కదలికలపై అప్రమత్తం
సాక్షి, కొత్తగూడెం/ భూపాలపల్లి: దండకారణ్యం ఆవరించి ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దులో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, సమీపంలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పోలీసు యంత్రాంగం ఎన్నికల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి సూచించారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం 4 జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీలోని అరకులో చోటుచేసుకున్నటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా వ్యవహరించాలని అన్నారు. విధుల్లో ఏమాత్రం తేడా వచ్చినా మావోయిస్టులు గెరిల్లా దాడులకు పాల్పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. పోలీసు స్పెషల్ పార్టీ, ఆపరేషన్ టీంలతో పాటు జిల్లాల ఎస్పీలు స్పెషల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇన్ఫార్మర్ల వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాలన్నారు. ఏజెన్సీలో పర్యటించే నేతల వివరాలు తెలుసుకుంటూ వారి రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సామాజిక పోలీసింగ్ విధానంతో రక్షణ చర్యలు సామాజిక పోలీసింగ్ విధానంతో రక్షణ చర్యలు చేపడతామని మహేందర్‌రెడ్డి అన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఎన్నికల కేంద్రాల వద్ద లోకల్ పోలీస్‌లు, పారామిలటరీ, స్పెషల్ ఫోర్స్, గ్రేహౌండ్స్ బలగాలతో సమ న్వయం చేసుకుంటూ భద్రతను పర్యవేక్షిస్తామని చెప్పారు. ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా అనుమానితులను గుర్తిస్తామన్నారు. సమావేశంలో నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి, ఇంటెలిజెన్సీ ఐజీ నవీన్‌చంద్, డీఐజీ ప్రభాకర్‌రావు, రామగుండం కమిషనర్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
నెత్తుటి దారిపై శాంతియాత్ర
సాక్షి, ఆసిఫాబాద్: అడవిలో తుపాకీ పట్టి ఉద్యమిస్తున్న మావోయిస్టులను జన జీవన స్రవంతిలోకి ఆహ్వానిస్తూ వారిని శాంతి వైపు మళ్లిస్తూ ఉద్యమ ప్రభావంతో నష్టపోతున్న ఆదివాసీలకు అవగాహన కల్పించేందుకు గాంధేయవాదులు ఓ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నెల 2న మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా మావోయిస్టు కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్కు కాలినడకన ‘సంవిదాన్ యాత్ర’ పేరిట అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత చేపడుతున్న ఈ శాంతియుత పాదయాత్రలో ముఖ్యంగా ఆదివాసీ తెగల్లో అధికంగా నలిగిపోతున్న గోండు తెగ వారు ఇందులో అధికంగా భాగస్వాములు అవుతున్నారు. ఈ యాత్ర ఈ నెల 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన తూర్పుగోదావరి జిల్లా చట్టి అనే ఆదివాసీ గ్రామం నుంచి ఈ పాదయాత్ర మొదలుకానుంది. ఈ యాత్రలో సెంట్రల్ గోండ్వానా నెట్ (సీజీ నెట్), రాజ్‌గోండ్ సేవా సమితి, మహాత్మాగాంధీ శబరి ఆశ్రమం, ప్రయోగ్ సమాజ్ సేవా సంస్థ తదితర సంస్థల ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఇప్పటికే ఈ యాత్రకు సంబంధించి సన్నాహాక సభలు డిల్లీ, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో జరిగాయి. తెలంగాణ నుంచి 100 మంది ఆదివాసీలు తెలంగాణ నుంచి 100 మంది వరకు గోండు, కోయ, కొలాం, మన్నేవార్ తదితర తెగల గిరిజనులు ఈ పాదయాత్రలో పాలుపంచుకొన్నారని నిర్వాహకులు చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి దాదాపు 20 మంది పాల్గొననున్నారు. శనివారం కుమురంభీం జిల్లా కేంద్రం నుంచి బయలుదేరి భద్రాచలం చేరుకుని అక్కడ ఖమ్మం, కొత్తగూడెం తదితర ప్రాంతాల నుంచి ఆదివాసీలను కలుపుకుంటూ ఈ నెల 2 వరకు తూర్పుగోదావరి జిల్లా చట్టికి చేరుకుంటారు. అక్కడి గాంధీ ఆశ్రమంలో ఆదివాసీ సంప్రదాయాలైన కోయ కోయతూర్, డోల్ పేప్రె కాళి తుడుం వాయిద్యాలతో అదే రోజున యాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు 200 కిలోమీటర్ల సాగనున్న ఈ పాదయాత్రలో మార్గమధ్యంలో పలు గిరిజన ఆవాసాల గుండా ప్రయాణిస్తూ ఆదివాసీలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు సాగనున్నారు. 1980లో మావోయిస్టులు దండకారణ్యంలో ప్రవేశించిన దారిగుండానే ఈ పాదయాత్ర కొనసాగడం విశేషం. మొత్తం పది రోజుల పాటు సాగే ఈ పాదయాత్రలో రోజుకు 20 కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తూ వచ్చే నెల 12న చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలోని జగదల్పూర్కు చేరుకుంటుంది. అనంతరం జిల్లా కేంద్రం బస్తర్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. మధ్య భారతంలో వామపక్ష భావజాలంతో అనేక మంది అమాయక గిరిజనులు అటు భద్రతా దళాలు, ఇటు మావోల ఉద్యమ ప్రభావంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఇరువర్గాల మధ్య నలిగిపోతున్న గిరిజనులను అవగాహన కల్పించేందుకు, మావోస్టులను జనజీవన స్రవంతిలోకి ఆహ్వానిస్తూ శాంతిబాట పట్టాలని కార్యక్రమం చేపట్టామని చెబుతున్నారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో పోలీసు సల్వార్జుడుం, మావోయిస్టులు జన్«థన్ సర్కారు పేరుతో ఇరు వర్గాల మధ్య గిరిజనులు నలిగిపోతున్నారని వారి గొంతుగా ఈ యాత్ర చేపట్టినట్లు పేర్కొంటున్నారు. అయితే ఇటీవల మావోయిస్టులు విశాఖపట్నం జిల్లా అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కాల్చిచంపిన ఘటనతోపాటు మరికొద్ది రోజుల్లో మావోయిస్టు వారోత్సవాలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ శాంతియాత్ర ప్రాధాన్యం సంతరించుకుంది. ఏర్పాట్లు పూర్తి మావోయిస్తు ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొల్పడానికి గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని చట్టి నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ వరకు చేపట్టిన ఈ శాంతియాత్రకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని తిడ్లాలో ఓ సన్నాహాక సభ కూడా నిర్వహించాం. – సుభారాన్షు చౌదరి, బస్తర్, పాదయాత్ర కమిటీ సభ్యుడు శాంతి నెలకొల్పేందుకే... ఏళ్లుగా అటు భద్రతాదళాలు, ఇటు మావోయిస్టు దళాల మధ్య ఆదివాసీలు నలిగిపోతున్నారు. ఇరువర్గాల మధ్య ప్రాణాలు కోల్పోతున్నది గిరిజనులు. ఈ హింస ఇక నుంచి ఆగిపోవాలని, దండకారణ్యంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకే ఈ పాదయాత్ర చేపట్టాం. దీనికి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. – సిడాం అర్జు, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, రాజ్‌గోండ్ సేవా సమితి -
‘మావోయిస్టుల ప్రకటన’పై ఉత్కంఠ
విశాఖపట్నం, అరకులోయ: డుంబ్రిగుడ మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో గల లివిటిపుట్టలో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేసిన ఘటనపై ఇంత వరకు మావోయిస్టులు ఎటువంటి ప్రకటన చేయకపోవడం మన్యంలో చర్చానీయాంశంగా మారింది. మావోయిస్టులు ఏదైన సంఘటనకు పాల్పడితే ఆ స్థలంలో విడిచిపేట్టే లేఖల ద్వారా గాని, పత్రిక ప్రకటనల ద్వారా గాని తాము ఆ సంఘటనకు ఎందుకు పాల్పడ్డాయో తెలియజేస్తారు. ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యేలను హత్య చేసి వారం రోజులు కావస్తున్నా ఇంత వరకు... ఈ నేతలను ఎందుకు హత్యచేయవలసి వచ్చిందో మావోయిస్టులు ప్రకటించలేదు. మావోయిస్టుల ప్రకటన కోసం హత్యకు గురైన నేతల కుటుంబ సభ్యులు,టీడీపీ నేతలు,మన్యం ప్రజలు,మరో వైపు పోలీసు యంత్రాంగం ఎదురుచూస్తోంది. మావో యిస్టులు ప్రకటనపై మన్యంలో ఉత్కంఠ నెలకొంది.వారు ప్రకటన చేయడంలో జాప్యానికి గల కారణాలు అంతుచిక్కడం లేదు. ఏవోబీ వ్యాప్తంగా మావోయిస్టు క్యాడర్ బలంగానే ఉంది. మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతల పేరుపై ఏదో ఒక చోట పత్రికలకు ప్రకటన వస్తుంది. దీని కోసం మీడియా కూడా ఎదురుచూస్తోంది. సంఘటన జరిగిన వారం రోజుల కావస్తున్నా మావోయిస్టు పార్టీ మౌనంగానే ఉంది. మరో వైపు పోలీసు యంత్రాంగం సిట్ బృందంతో నేతల హత్యలపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తోంది. వారిద్దరినీ మావోయిస్టులు హత్యచేయడానికి గల కారణాలను పోలీసు యంత్రాంగం కూడా నిర్ధారించలేక పోతోందని సమాచారం. ఈ హత్యలపై మరిన్ని వివరాల సేకరణకు మావోయిస్టుల ప్రకటన కూడా కీలకంగా ఉంటుందని పోలీసు యంత్రాంగం భావిస్తోంది. ఈ హత్యలకు దారితీసిన పరిస్థితులపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. రాజకీయ కోణంలో హత్యలు జరిగి ఉంటాయని,మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు,డీజీపీ ఠాకూర్లకు తెలిపారు.ఈ కోణంలోనూ పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. కారణాలు బయటపడాలంటే మావోయిస్టులు విడుదల చేసే లేఖ కూడా చాలా ముఖ్యం. నిఘా నీడలో వారపు సంతలు సీలేరు(పాడేరు): లివిటిపుట్టులో గత ఆదివారం ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమలను మావోయిస్టులు హత్య చేసిన నేపథ్యంలో వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు జరుపుతున్నారు. మావోయిస్టులు కటాఫ్ ఏరియాలోకి వెళ్లిపోయారన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ వారు విశాఖ మన్యంలో ఉన్నారని డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రకటించారు. దీంతో ఏజెన్సీలో11 మండలాల్లో అన్ని వారపు సంతల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం సీలేరు, ధారకొండ సంతలు పోలీసు ల నిఘా నీడలో జరిగాయి. అనుమానితులను తనిఖీ చేశారు. ఐదు రోజులుగా ఒడిశాసరిహద్దులో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన గుమ్మిరేవులు, ధారకొండ, సీలేరు, కొనములూరు, పాతకోట, చిత్రకొండ, బలిమెల, ఎంవి 79 వంటి ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా రోజూ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. కాగా బలిమెల రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గించాలని, గిరిజనులకు నష్టపరిహారం ఇవ్వాలని లాంచీలకు మావోయిస్టులు కరపత్రాలు అతికించారు.దీంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. టీడీపీ నేతలను విచారించిన సిట్ బృందం అరకులోయ: అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే సోమలను ఇటీవల మావోయిస్టులు హత్యచేసిన ఘటనపై సిట్ బృందం దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ బృందం ఆదివారం డుంబ్రిగుడ,అరకులోయ మండలంలోని కొంతమంది టీడీపీ నేతలను విచారించింది. హత్య జరిగిన రోజు అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలతో పాటు కండ్రూం పంచాయతీ సరాయి గ్రామానికి బయలుదేరిన టీడీపీ నేతలతో పాటు,ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన నేతల వివరాలను సేకరించిన సిట్ బృందం వారందరినీ విచారించినట్టు తెలుస్తోంది. మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు చింతపల్లి(పాడేరు): ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టుల హత్య చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం మండల కేంద్రంలో పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టులను మానవ మృగాలతోపోల్చుతూ ఖబడ్దార్, గిరిజన ద్రోహులు మావోయిస్టులంటూ పోస్టర్లలోపేర్కొన్నారు. -
మావోయిస్టుల స్కెచ్ : త్రుటిలో తప్పిన ప్రమాదం
మల్కన్‌గిరి: డీఆర్జీ జవాన్లు త్రుటిలో ప్రమాదం తప్పించుకున్నారు. మావోయిస్టుల వల నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. మందుపాతర పేలకుండానిర్వీర్యం చేయగలిగారు. మల్కన్‌గిరి జిల్లా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో దోర్నిపాల్ సమితి గోరుగొండ గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. డీఆర్జీ జవాన్లు ఆదివారం ఉదయం ఈ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ విషయం ముందుగా తెలుసుకున్న మావోయిస్టులు గోరుగొండ గ్రామం పరిసరాల్లో రోడ్డుపై సుమారు 5 కేజీల ఐఈడీ బాంబును అమర్చారు. అయితే అదే దారిలో కూంబింగ్‌కు వెళుతున్న జవాన్లు దీనిని ముందుగా గుర్తించి చాకచక్యంగా తప్పించుకుని మందుపాతరను నిర్వీర్యం చేసి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ ప్రాంతంలో జవాన్లు కూంబింగ్‌ను ముమ్మరం చేశారని ఎస్పీ సందీప్‌కుమార్ తెలిపారు. -
కిడారి కుటుంబానికి రూ.కోటి సాయం
సాక్షి, విశాఖపట్నం: ప్రజాస్వామ్యంలో హింసకు తావుండదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మావోయిస్టుల చేతిలో మృత్యువాతపడిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబసభ్యులను పాడేరులో, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులను అరకులో శుక్రవారం సీఎం పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీలో బాౖMð్సట్ గనులను తవ్వబోమని తాము స్పష్టమైన హామీ ఇచ్చినా మావోయిస్టులు దీన్ని నెపంగా చూపడం సముచితం కాదని చెప్పారు. గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడుతున్న నాయకులను దారుణంగా చంపారంటే జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. మావోలకు ఇది మంచి పద్ధతి కాదన్నారు. ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు. కిడారి కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సహాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. కిడారి రెండో కుమారుడు సందీప్‌కుమార్‌కు ప్రభుత్వశాఖలో గ్రూప్–1 ఉద్యోగం ఇస్తామన్నారు. కుటుంబంలోని నలుగురికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పార్టీపరంగా సహాయం చేస్తామన్నారు. పాడేరులో కిడారి మెమోరియల్ నిర్మిస్తామన్నారు. కిడారి పెద కుమారుడు విషయంలో అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కిడారి కుటుంబానికి విశాఖలో ఇంటిస్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు సహకరిస్తామన్నారు. అదేవిధంగా సివేరి సోమ కుటుంబంలో ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఏడుగురికి రూ.70 లక్షలు ప్రభుత్వపరంగా అందజేయడంతోపాటు పార్టీపరంగా తలో రూ.5 లక్షలు చొప్పున ఇస్తామని తెలిపారు. సోమ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతోపాటు విశాఖలో ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. అరకులో మధ్యలో నిలిచిన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి పట్టా మంజూరు చేస్తామని తెలిపారు. లోతైన పరిశీలన జరపాల్సి ఉంది..: నిఘా వైఫల్యంపై తొందరపడి మాట్లాడడం సరికాదని సీఎం అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో చూస్తామని, ఎక్కడైనా లోపాలుంటే సరిదిద్దుకుంటామని చెప్పారు. వాళ్లు(మావోయిస్టులు) వచ్చిన విధానం.. హతమార్చిన తీరుపై లోతైన పరిశీలన జరపాల్సిన అవసరముందన్నారు. జరిగిన ఘటనపై సమీక్షించుకుంటామని చెప్పారు. మంత్రులు చినరాజప్ప, ఆనందబాబు, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, పంచకర్ల రమేష్‌బాబు, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, డీజీపీ ఠాకూర్, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ పాల్గొన్నారు. -
వారెందుకెళ్లారు ?
విశాఖ క్రైం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమల హత్యోదంతంపై డీజీపీ ఆర్పీ ఠాకూర్ గురువారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, సీపీ మహేష్‌చంద్ర లడ్డా, డీఐజీ శ్రీకాంత్‌తో పాటు మరి కొంతమంది పోలీసుఅధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ కీలకసమావేశంలో జరిగిన చర్చల సారాంశం కొంత బయటకు వచ్చింది. కిడారి, సోమ ఆ రోజు ఎందుకు వెళ్లారు అన్నదానిపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. గతంలో జరిగిన దాడులు, సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. సిబ్బంది పనితీరు, అధికారుల పర్యవేక్షణపై సమీక్షించారు. హత్య చేయడానికి ముందు మావోయిస్టులు ఏరూటులో వచ్చారు, ఎక్కడ ఉన్నారు, వారికి ఎవరు ఆశ్రయమిచ్చారు అన్న విషయాలపై పోలీసులు సేకరించిన సమాచారంపై చర్చినట్టు భోగట్టా. ఈ చర్చ మధ్యాహ్నం వరకు సాగింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎస్పీ కార్యాలయం నుంచి కలెక్టర్ బయటకు వచ్చారు. తరువాత పోలీసు అధికారులతో డీజీపీ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు వస్తున్న సందర్భంగా భద్రతాపరంగా తీసుకోవలసిన ఏర్పాట్లపై చర్చించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. అనంతరం డీజీపీ ఠాకూర్ బక్కన్నపాలెంలోగల గ్రేహౌండ్స్నుసందర్శించారు. అప్రమత్తంగా ఉండాలి చింతపల్లి(పాడేరు): మన్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఠాకూర్ అన్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన చింతపల్లి పోలీస్‌స్టేషన్‌ను గురువారం రాత్రి ఆయన సందర్శిం చారు. మావోయిస్టుల కదలికలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని ఆయన స్థానిక పోలీసు అధికారులను సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ అమలుతీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసి, స్థానిక పోలీసు అధికారులను ప్రశంసించారు. చింతపల్లి,గూడెంకొత్తవీధి మండలాల్లో పరిస్థితులను అడిగితెలుసుకున్నారు. పోలీస్స్టేషన్లకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. మావోయిస్టులతో ప్రమాదం పొంచిఉన్న ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేయాలన్నారు. కార్యక్రమంలో విశాఖరేంజ్ డీఐజీ సీహెచ్ శ్రీకాంత్, చింతపల్లి డీఎస్పీ అనిల్ పులిపాటి, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అనంత్ బన్సీ, సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు. బోసిపోయిన పర్యాటక ప్రాంతాలు అరకులోయ: అరకు ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యేల హత్య తరువాత అరకులోయలో పర్యాటప్రాంతాలు బోసిపోయాయి. నేతల హత్య సంఘటన వార్తలు విస్తృతంగా ప్రసారం జరగడంతో పర్యాటకులు అరకులోయ ప్రాంత సందర్శనను వాయిదా వేసుకున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అనంతగిరి,అరకులోయ,డుంబ్రిగుడ మండలాల్లోని పర్యాటక ప్రాంతాల్లో గురువారం పర్యాటకశాఖ కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. పర్యాటకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కిరండూల్ రైలులో కూడా పర్యాటకులు స్వల్ప సంఖ్యలో అరకులోయకు వచ్చారు. బొర్రాగుహలు,కటికి జలపాతం,ఘాట్‌లో కాఫీతోటలు,డముకు,గాలికొండ వ్యూపాయింట్ ప్రాంతాలతో పాటు,పద్మాపురం గార్డెన్,గిరిజన మ్యూజియం,రణజిల్లెడ,చాపరాయి,కొల్లాపుట్టు జలపాతాల ప్రాంతాలన్నీ సందర్శకులు లేక బోసిపోయాయి.అరకులోయ ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ అతిధి గృహాలు,రిసార్ట్స్.హోటళ్లు కూడా ఖాళీగానే దర్శనమిచ్చాయి. మంత్రి లోకేష్ పర్యటన రద్దు సాక్షి, విశాఖపట్నం: మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన రద్దయ్యింది. హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఏజెన్సీలో పర్యటించాల్సి ఉంది. మంత్రి వస్తున్నట్టు కలెక్టరేట్‌తో పాటు పోలీస్‌శాఖకు మంత్రి కార్యాలయం నుంచి గురువారం మధ్యాహ్నం వర్తమానం అందింది. మీడియాకు కూడా టూర్ షెడ్యూల్ విడుదలైంది. ఇంతలో ఏమైందో ఏమో మంత్రి లోకేష్ పర్యటన రద్దయినట్టు మంత్రి కార్యాలయం నుంచి సింగిల్ లైన్ వర్తమానం అందింది. దీంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే లోకేష్ తన పర్యటనను ఎందుకు రద్దు చేసుకున్నారంటూ అధికారులే కాదు..అధికార పార్టీ నేతలు కూడా చర్చించు కుంటున్నారు. -
అణువణునా అన్వేషణ
విశాఖపట్నం, అరకులోయ, పెదబయలు: అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే సోమల హత్యోదంతం తరువాత పోలీసుశాఖ అప్రమత్తమైంది. మన్యానికి అదనపు పోలీసు బలగాలు చేరాయి. నాలుగు రోజుల నుంచి ఏజెన్సీని జల్లెడ పడుతున్నాయి. క్షుణ్ణంగా పరిశీలిస్తూ బలగాలు ముందుకు కదులుతున్నాయి. ముఖ్యంగా ఏవోబీకి ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టు,పెదబయలు, జి.మాడుగుల, జీకే వీధీ, డుంబ్రిగుడ, అరకు, అనంతగిరి మండలాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. బుధవారం డీజీపీ పర్యటించడంతో భారీగా పోలీసు పార్టీలను రంగంలోకి దింపారు. ఆయన పర్యటన ముగిసినప్పటికీ ఆ పార్టీలను మన్యంలోనే ఉంచారు. అనంతగిరి నుంచి అరకులోయ,అరకులోయ నుంచి పాడేరు రోడ్డులో పోలీసు పార్టీలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అనంతగిరి ఘాట్, సుంకరమెట్ట,జైపూర్ జంక్షన్,డుంబ్రిగుడ,కించుమండ,హుకుంపేట ప్రాంతాల్లో కూడా పోలీసు పార్టీల ను అధికంగా మోహరించారు. అడవులల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం. ప్రత్యేక పోలీసు పార్టీలను అన్ని పోలీసుస్టేషన్లలో అందుబాటులో ఉంచారు. ♦ సీఎం చంద్రబాబు మన్యంలో పర్యటించనుండడంతో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ♦ బాంబు స్క్వాడ్ తనిఖీలుఅనంతగిరి–అరకు,అరకు–పాడేరు రోడ్డులో బాంబు స్క్వాడ్ బృందాలు గురువారం తని ఖీలు నిర్వహించాయి. రహదారులకు ఇరువైపు ల, గెడ్డల వద్ద ,కల్వర్టులు, వంతెనల సమీపంలో క్షు ణంగా తనిఖీలు చేస్తున్నారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు మరి కొద్ది రోజుల పాటు ఈరోడ్లలో ఉంటాయని పోలీసుఅధికారులు చెబుతున్నారు. చివురుటాకులా.. ఇప్పుడు ఏజెన్సీ గ్రామాలు చివురుటాకులా వణికిపోతున్నాయి. అడుగుకో పోలీసు తుపాకులతో కనిసిస్తుండడంతో గిరిజనులు తీవ్ర భయోం దోళన చెందుతున్నారు. అనుమానితులను బలగాలు ప్రశ్నిస్తుండడంతో గ్రామాలను వదిలి బయటకురావడానికి వారు సాహసించడం లేదు. మండలకేంద్రానికి వెళ్లవలసిన అవసరం ఉన్నా, పనులను వాయిదా వేసుకుంటున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. సంఘటన స్థలంలో కిడారికి నివాళి డుంబ్రిగుడ(అరకులోయ): అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేసిన స్థలంలో గురువారం సర్వేశ్వరరావు కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఇద్దరు కుమారులు, కుమార్తె పూలదండలు పెట్టి, పుష్పగుచ్చాలు పట్టుకుని నివాళి అర్పించారు. కొద్దిసేపు మౌనం పాటించారు. కుటుంబ సభ్యుడు పాండురంగస్వామి మాట్లాడుతూ మంచి ఎమ్మెల్యేను కోల్పోయామన్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా వ్యవహరించినప్పటికీ అరకు,పాడేరులలో సొంత ఇల్లు కూడా లేదని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిడారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
30 మంది మావోయిస్టులు.. ఏవోబీలో ఎన్కౌంటర్..!
ఒడిషా : ఆంధ్ర-ఒడిషా సరిహద్దులోని (ఏవోబీ) కోరాపుట్ జిల్లా కుడుబు వద్ద పోలీసులు, మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఎన్కౌంటర్లో సుమారు 30 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియల్సి ఉంది. కాగా, గత ఆదివారం ఉదయం ఏవోబీలోని అరకులోయలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను మావోయిస్టులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. (చదవండి : ఎమ్మెల్యే హత్య ఇదే తొలిసారి) -
గన్‌దరగోళం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా మారిందా? ఈ ప్రశ్న పోలీసులను వేధిస్తోంది. అరకు ఘటనతో పోలీసుశాఖలో టెన్షన్ మొదలైంది. ఎమ్మెల్యే హత్యకేసులో కీలకంగా వ్యవహరించిన స్వరూపకు భీమవరంతో సంబంధాలు ఉండటంతో అక్కడ గురువారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఏజెన్సీలో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. మరోవైపు కీలక ప్రాజెక్టు పోలవరం కూడా ఇక్కడే ఉండటంతో అక్కడ బందోబస్తు పెంచారు. ఈనెల 23న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కాల్చిచంపిన మావోయిస్టుల్లో భీమవరం పట్టణానికి చెందిన మహిళా మావోయిస్టు కామేశ్వరి అలియాస్ స్వరూప ఉన్నట్లు విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు బీమవరంలోని ఇందిరమ్మ కాలనీలో తనిఖీలు చేశారు. నరసాపురం డీఎస్పీ టి.ప్రభాకర్‌బాబు ఆధ్వర్యంలో సబ్ డివిజన్‌కు చెందిన 25 మంది సీఐలు, ఎస్సెలు 150 మంది సిబ్బంది కాలనీలోని ఇంటింటికీ వెళ్లి ఆధార్‌కార్డులు, వాహనాల ధ్రువపత్రాలను తనిఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో గతం నుంచి మావోయిస్టు ఉద్యమంలోకి పెద్ద సంఖ్యలో వెళ్లిన దాఖలాలు ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 1970 నుంచి నక్సల్స్ ప్రభావితం పశ్చిమ ఏజెన్సీని మావోయిస్టులు షెల్టర్ జోన్‌గానే వాడుకుంటున్నారన్న అనుమానాలు ఉన్నాయి. 1970వ దశకం నుంచి పశ్చిమ ఏజెన్సీ నక్సలైట్ ప్రభావిత ప్రాంతంగా ఉంది. అప్పట్లో న్యూడెమోక్రసీ దళాలనే సీపీఐఎంఎల్ ప్రజాపంథా దళాలుగా పిలిచేవారు. పశ్చిమ ఏజెన్సీలో ప్రధానంగా సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ దళాలు గట్టి పట్టును కలిగి ఉన్నాయి. అయితే ఇవి ఎప్పుడూ హింసాత్మక ఘటనలకు పాల్పడలేదు. కేవలం గిరిజనుల తరుఫున వారి హక్కుల కోసం,వారి జీవన భృతి కోసం పోరాటం చేయడమే తప్ప హింసాత్మక ఘటనలకు పాల్పడలేదు. న్యూడెమోక్రసీ దళాలు పట్టు కలిగి ఉండటంతో అప్పట్లో పీపుల్స్‌వార్ గ్రూపు ఈ ప్రాంతంలోకి వచ్చినా ఇక్కడ ఉండేవారు కాదు. నక్సలైట్ వర్గాల మధ్య ఉన్న ఒప్పందాల ప్రకారం ఒక ప్రాంతంలో ఒక వర్గం పనిచేస్తే ఆ ప్రాంతంలో మరో వర్గం ఉండకూడదు. ఈ నేపథ్యంలో పీపుల్స్‌వార్ గ్రూపు నక్సలైట్లు ఈ ప్రాంతానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవారు. ఆ తరువాత కాలంలో నక్సలైట్ గ్రూపులన్నీ కలిసి మావోయిస్టులుగా మారడంతో అప్పటి నుంచి వారు ఈ ప్రాంతాన్ని షెల్టర్ జోన్‌గా వాడుకుంటున్నారని తెలుస్తోంది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు, ఆంధ్రా, ఒడిశా బోర్డర్, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణలో ఎక్కడ ఎన్కౌంటర్లు జరిగినా, గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ నిర్వహించినా మావోయిస్టు దళాలు తలదాచుకునేందుకు పశ్చిమ ఏజెన్సీకి వచ్చేవని తెలుస్తోంది. దీంతో న్యూడెమోక్రసీ దళాలూ వాటిని పట్టించుకునేవి కాదని సమాచారం. దీంతో మావోయిస్టులు తలదాచుకునేందుకు రావడం, కొద్ది రోజులు ఉండి వెళ్లిపోవడం తరుచుగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఏజెన్సీలో అడపాదడపా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో గత అనుభవాలివే.. 1990లో తొలిసారిగా న్యూడెమోక్రసీ దళ సభ్యుడు అర్జా నాగన్నను మడిమి పెంటయ్య అనే గిరిజనుడు చంపడంతో తిరిగి న్యూడెమోక్రసీ దళాలు కామవరం వద్ద పెంటయ్యను కాల్చి చంపాయి. 2000 మార్చి 17న పోలవరం మండలం చిలకలూరు జలతారు వాగు వద్ద తొలిసారి ఎన్కౌంటర్ జరిగింది. ఇరువర్గాలకు జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోలుసహా, బి.నాగేంద్రప్రతాప్ అనే కానిస్టేబుల్ మృతిచెందాడు. అదే ఏడాది జూలై 30న బుట్టాయగూడెం మండలం లక్ష్మీపురం వద్ద ఎన్కౌంటర్ జరిగింది. దీనిలో వీరన్నదళం డెప్యూటీ కమాండర్ నరకాసుర మృతిచెందారు. నవంబర్‌లో పట్టిసీమ వద్ద పోలీసులకు అందిన సమాచారం మేరకు ఆటోలో వెళుతున్న ముగ్గురు మావోయిస్టులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. రెండునెలలు గడవకుండానే 2001 జనవరి 12న ఊట్లగూడెం సమీపంలో న్యూడెమోక్రసీ దళం ప్లీనరీ జరుగుతుండగా పోలీసులు చుట్టుముట్టారు. ఇరువర్గాల కాల్పుల్లో దళ కమాండర్ ధర్మన్నతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లూ మృతిచెందారు. 2004 నవంబర్ 16న జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో దళ కమాండర్ చింతా భాస్కరరావు అలియాస్ రమేష్ అలియాస్ ప్రభాకర్ అలియాస్ భాస్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 2005 మార్చి 18న క్రాంతి దళం బుట్టాయగూడెం మండలం పందిరమామిడిగూడెం సమీపంలో ఆర్టీసీ బస్సును తగులబెట్టింది. బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ చర్యకు పాల్పడినట్లు ప్రకటించింది. పోలవరం మండలం ఎల్ఎన్డీపేటలో ఇన్ఫార్మర్ అనే నెపంతో వ్యాపారి కొల్లూరి గోపాలకృష్ణను క్రాంతి దళం కాల్చి చంపింది. 2005 ఏప్రిల్ 6న పోలవరం మండలం ఎల్ఎన్డీపేట డేరాకొండ సమీపంలో జనశక్తి కార్యదర్శి క్రాంతితో పాటు దళ సభ్యుల సమాచారం తెలిసి గ్రేహౌండ్ పోలీసులు చుట్టుముట్టగా ఇరువర్గాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. 2005 మే 23న జీలుగుమిల్లి మండలం సిర్రివారిగూడెంలో గెద్దాల సరితను అరెస్టు చేసి 8ఎంఎంరైఫిల్, 10 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలవరం మండలం ఎల్ఎన్డీపేట సమీపంలో 2005 జూలై 9న జరిగిన ఎన్కౌంటర్లో రాజన్న వర్గానికి చెందిన ఇద్దరు దళ సభ్యులు మృతిచెందారు. 2006 సెప్టెంబర్ 13న పోలవరం మండలం ములకలగూడెంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. 2008 జూలై 10న బుట్టాయగూడెం మండలం రెడ్డికోపల్లెలో 9 మంది దళసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. 2014లో డిసెంబర్ 15న జంగారెడ్డిగూడెం సమీపంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గానికి చెందిన 13మందిని అరెస్టుచేసి 9 తుపాకులు, 344 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. 2016 అక్టోబర్ 24న ఏవోబీ సరిహద్దు జంత్రి ఎన్కౌంటర్లో మావోయిస్టులు జిల్లాలోని దేవరపల్లి మండలం పల్లంట్లకు చెందిన దాసు, తాళ్ళపూడికి చెందిన దాసు బావమరిది కిరణ్ మృతిచెందారు. 2017 ఏప్రిల్ 1వ తేదీన సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గానికి చెందిన దళ సభ్యులను ముగ్గురిని అరెస్టు చేసి వీరి నుంచి ఒక విదేశీ రివాల్వర్, 10 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక కాంట్రాక్టర్‌ను హతమార్చేందుకు వీరు కుట్రపన్నారన్న ఆరోపణపై అరెస్టు చేశారు. గత అనుభవాల నేపథ్యంలో పోలీసులు ఏజెన్సీని జల్లెడ పడుతున్నారు. మరోవైపు మైదాన ప్రాంతంలోనూ మావోయిస్టు సానుభూతిపరులుగా ఉన్నవారిపై దృష్టి పెట్టారు. -
మావోయిస్టుల కట్టడికి ఐదు రకాల డ్రోన్లు!
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా మన్యంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య తర్వాత పోలీసులు కొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. దట్టమైన అడవిలో అణువణువు తెలిసిన మావోయిస్టుల్లా వెళ్లడం సాధ్యం కాబట్టి ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వామపక్ష తీవ్రవాదం ఉన్న పది రాష్ట్రాల్లో డ్రోన్లను వినియోగించి మావోయిస్టుల కదలికలను పసిగట్టాలని ఆదేశించారు. దీంతో పోలీసులు డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించారు. పది రాష్ట్రాల్లో డ్రోన్ల వినియోగం దేశవ్యాప్తంగా తీవ్రవాద సమస్య ఉన్న ప్రాంతాలతోపాటు వామపక్ష తీవ్రవాదం ఉన్న పది రాష్ట్రాల్లో ఐదు రకాల డ్రోన్లను వాడనున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మార్గదర్శకాలను అనుసరించి వాటిని అందుబాటులోకి తేనున్నారు. 250 గ్రాముల బరువు ఉండే నానో డ్రోన్, 250 గ్రాముల నుంచి 2 కిలోల వరకు బరువు ఉండే మైక్రో డ్రోన్, 2 కిలోల నుంచి 25 కిలోల వరకు ఉండే స్మాల్ డ్రోన్, 25 కిలోల నుంచి 150 కిలోలుండే మీడియం డ్రోన్, 150 కిలోలకు పైబడి బరువుండే లార్జ్ డ్రోన్లను ఉపయోగించాలని ప్రతిపాదించారు. సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్ బలగాల చేతికి.. కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), కోబ్రా దళాలు, రాష్ట్రాల పరిధిలో ఉన్న గ్రేహౌండ్స్ బలగాలకు ఈ డ్రోన్లను అందించాలని భావిస్తున్నారు. ప్రతి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులో రెండు నుంచి నాలుగు డ్రోన్లను ఏర్పాటు చేయడం, వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఢిల్లీ వరకు అనుసంధానం చేసేలా సీఆర్పీఎఫ్ కసరత్తు ప్రారంభించింది. ఈ ఐదు డ్రోన్లలో తక్కువ బరువున్న నానో, మైక్రో డ్రోన్లను ఉపయోగించుకోవాలని యోచిస్తున్నారు. 350 అడుగుల నుంచి 450 అడుగుల వరకు ఈ రెండు డ్రోన్లకు ఎగిరే శక్తి ఉంటుంది. వీటి ద్వారా పగటి పూట హెచ్డీ క్వాలిటీ వీడియోలు, ఫొటోలు చిత్రీకరించడం సులువని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అడవుల్లోనూ వినియోగించేలా.. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని అడవుల్లో సంచరించే మావోయిస్టులను గుర్తించేలా డ్రోన్లను వినియోగంలోకి తేనున్నారు. దీనికోసం శిక్షణ పొందిన పోలీసులను ఉపయోగించుకోనున్నారు. ఈ డ్రోన్ల సాయంతో మావోల కదలికలను ఫొటోలు, వీడియోల రూపంలో రికార్డు చేస్తారు. మావోయిస్టుల కోసం అడవుల్లో కూంబింగ్ చేసే ప్రత్యేక పోలీసు బలగాలకు దారి చూపించడానికి కూడా వీటిని వినియోగిస్తారు. అవసరమైతే మావోయిస్టులను కాల్చిచంపేలా వాటిని ఉపయోగిస్తారు. మావోయిస్టులు ఉన్న ప్రాంతానికి నేరుగా బాంబులు ఉన్న డ్రోన్ (సూసైడ్ డ్రోన్)లను పంపి పేలుళ్లు చేయాలని భావిస్తున్నారు. -
మారణకాండలో.. మూడు దళాలు!
దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన కిడారి, సివేరిల హత్యాకాండ వెనుక ఏం జరిగందన్న విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మావోలు వారినే ఎందుకు టార్గెట్ చేశారు?.. ఎప్పటినుంచి పథక రచన చేశారు?.. వ్యూహం అమలులో ఎవరు సహకరించారు?.. తదితర అంశాలకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ హత్యాకాండలో స్థానిక మావోయిస్టు కమిటీల ప్రమేయం ఏమీ లేదని వార్తలు వచ్చినా.. అందులో వాస్తవం లేదని తేలుతోంది. అరకు ఏజెన్సీలో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న పెదబయలు కమిటీ కూడా మావోయిస్టు మిలటరీ కమిషన్‌కు సహకరించిందని తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలను రాష్ట్రం బేఖాతరు చేయడం వల్లే ఈ ఉపద్రవం సంభవించిందనీ.. చర్చల పేరుతోనే మావోయిస్టులు కిడారిని రప్పించి మరీ వేటు వేశారని విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తోంది.మారణకాండ నుంచి ఇంకా పూర్తిగా తేరుకోని లివిటిపుట్టు గ్రామంలోని పలువురిని విచారణ పేరుతో పోలీసులు తీసుకెళ్లడం.. ఆ గ్రామస్తులను వణికించింది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మట్టుబెట్టడం ద్వారా ఏవోబీలో తమ పట్టు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు మావోయిస్టులు రెండు నెలల క్రితం నుంచే ప్రత్యేక ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు. ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరిం చిన ఆంధ్ర ఒడిశా బోర్డర్ కమిటీ, నందాపూర్ దళానికి పెదబయలు ఏరియా కమిటీలోని ముఖ్య నాయకులు పూర్తి సహకారం అందించినట్టు తెలుస్తోంది. నందా పూర్ దళానికి పెదబయలు దళ కమండర్ సుధీర్, అశోక్‌లతో పాటు ఆంధ్ర ఒడిశా సరిహద్దు కమిటీలో మంచి పట్టున్న కిరణ్ కూడా ఈ ఆపరేషన్‌లో కీలకంగా పాల్గొన్నట్టు సమాచారం. నేతలిద్దరి హత్యతో కలకలం సృష్టిం చడంతో పాటు ఏవోబీలో తమ పట్టు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు మావోలు పక్కా ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డుంబ్రి గూడ మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని లివిటిపుట్టు గ్రామాన్ని ఆపరేషన్‌కు ఎంచుకున్నట్టు చెబు తున్నారు. వాస్తవానికి కిడారి ఇటీవలి కాలంలో ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తృతంగా పర్యటించారు. గ్రామదర్శిని కార్యక్రమానికి గత శుక్రవారం మావోల అడ్డాగా పేరొందిన పెదబయలు మం డలం పెదకోడాపల్లితోపాటు అంతకుముందు పర్రెడ పంచాయతీలో కూడా పర్యటించారు. ఆ పర్యటనల్లో ఒకింత బందోబస్తు ఉన్నప్పటికీ మావోలను నిలువరిం చే సంఖ్యలో మాత్రం పోలీసులు లేరు. అయి తే ఆయా ప్రాంతాల్లో మావోలు దాడి చేయకుండా వ్యూహాత్మకంగానే లివిటిపుట్టును ఎంచుకున్నట్టు అర్ధమవుతోంది. డుంబ్రిగూడ మండల కేంద్రానికి సమీపంలో ఉండటం తో పాటు ఒడిశాకు దగ్గరగా ఉండటం, ఈ ప్రాంతంపై పోలీసులు ఏమాత్రం దృష్టి పెట్టని పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న మావోలు వ్యూహాత్మకంగానే లివిటిపుట్టులో ఆపరేషన్‌కు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మావోల అదుపులో ఇన్ఫార్మర్లు పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాల్లో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమాలకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, సోమాలు వచ్చినప్పుడు ఎంత మంది పోలీసులు భద్రతగా వస్తున్నారనే దానిపై పిన్ పాయింట్‌గా తెలుసుకునేందుకు మావోలు ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక గ్రామాల్లో పోలీసు ఇన్ఫార్మర్లుగా పని చేస్తున్నవారిని ముందుగానే గుర్తించి వారందరినీ ఇళ్ల నుంచి బయటకు రాకుండా కట్టడి చేసినట్లు తెలుస్తోంది. ఆ విధంగా తమ కదలికల సమాచారం బయటకు పొక్కకుండా మావోయిస్టులు పక్కా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెబుతున్నారు. పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ తదితర ఏవోబీ సరిహద్దు మండలాల్లోని జామిగుడ, గిన్నెలకోట, ఇంజరి, భూషి పుట్టు, రంగబయలు తదితర ప్రాంతాల్లోని పోలీసు ఇన్ఫార్మర్లను అన్ని వైపుల నుంచి కట్టడి చేశారు. ఇన్ఫార్మర్లను హతమారిస్తే పోలీసులు అప్రమత్తం అవుతారని.. అప్పుడు ఆపరేషన్ కిడారి అమలు చేయడం సాధ్యం కాదని గుర్తించే.. ఇన్ఫార్మర్లను కట్టడి చేయడానికే పరిమితయ్యారని తెలుస్తోంది. ఇలా రెండు నెలల నుం చి అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే అనుకు న్న ఆపరేషన్‌ను పక్కాగా అమలు చేశారని తెలుస్తోంది. -
రణక్షేత్రంలా మన్యం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యం యుద్ధభూమిని తలపిస్తోంది. ఎటు చూసినా ఉద్రిక్త పరిస్థితే. మావోయిస్టులు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చిన నేపథ్యంలో ఏజెన్సీలో భారీ ఎత్తున సాయుధ బలగాలు మోహరించాయి. అంతటా గ్రేహౌండ్స్, ఏపీఎస్పీ, సీఆర్పీఎఫ్ బలగాల బూటు చప్పుళ్లు వినిపిస్తున్నాయి. ఈ దళాలు ఆంధ్ర ఒడిశా సరిహద్దు (ఏవోబీ)తో పాటు విశాఖ ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే కూంబింగ్‌ను ప్రారంభించాయి. అనుమానిత ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. పాడేరు, అరకు, చింతపల్లి, సీలేరు మార్గాల్లో వీరు కనిపిస్తున్నారు. కేంద్ర పారామిలటరీ దళాలను కూడా పంపడానికి కేంద్ర హోంశాఖ సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. విశాఖ ఏజెన్సీలోని రోడ్ల వెంబడి సాయుధ పోలీసులు గస్తీ కాస్తున్నారు. మన్యంలోని పలు ప్రాంతాల్లో డాగ్‌స్క్వాడ్‌లు, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులకు మంచి పట్టుంది. దీంతో ఒకపక్క కూంబింగ్, మరోపక్క మావోయిస్టుల స్థావరాలపై పోలీసులు మరింత దృష్టి సారిస్తున్నారు.వివిధ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. సానుభూతిపరులు, అనుమానితులను ఆరా తీస్తున్నారు. మరోపక్క పోలీసులను ఎదుర్కోడానికి మావోయిస్టులూ సిద్ధంగా ఉన్నారన్న సమాచారంతో పోలీసులు మరింతగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మట్టుబెట్టిన తర్వాత మావోయిస్టులు ఎలాంటి ప్రకటన చేయకుండా మౌనంగా ఉన్నారు. ఇది కూడా వ్యూహంలో భాగమేనని భావిస్తున్నారు. తాము హతమార్చింది అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెలను కావడంతో అది తమ గొప్ప విజయంగా భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఏవోబీలో కూంబింగ్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మందుపాతర్లను అమర్చినట్టు సమచారం. తామున్న ప్రాంతానికి వచ్చే సాయుధ దళాలను మట్టుబెట్టే వ్యూహంగా పేర్కొంటున్నారు. ఈనెల 21 నుంచి మావోయిస్టు విలీన వారోత్సవాల సందర్భంగా చత్తీస్‌గఢ్‌కు చెందిన గుత్తికోయలు, కోందు దళాలను ఇప్పటికే ఏవోబీలోకి తరలించినట్టు ప్రచారం జరుగుతోంది. వీరు ఎన్కౌంటర్లకు సైతం వెరవకుండా దాడులకు పాల్పడతారన్న పేరుంది. ఇరు వర్గాలు పగ, ప్రతీకారాలతో ఉన్నందున ఏజెన్సీలో యుద్ధవాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో విశాఖ మన్యం వాసులు భయం గుప్పెట కాలం గడుపుతున్నారు. అనుమానితుల పేరిట ప్రశ్నించడానికి పోలీసులు ఎవరిని ఎప్పుడు తీసుకుపోతారోన్న భయం వీరిని వెంటాడుతోంది. ఎక్కడ ఎలాంటి ఘటన జరుగుతుందోనన్న ఆందోళనతో ఉన్నారు. లివిటిపుట్టులో డీజీపీ డుంబ్రిగుడ(అరకులోయ): ప్రజల కోసం పని చేసే మంచి గిరిజన ప్రజాప్రతినిధులను కోల్పోవడం దురదృష్టకరమని రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ అన్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేసిన మండలంలోని లివిటిపుట్టు గ్రామాన్ని, సంఘటన స్థలాన్ని బుధవారం మధ్యాహ్నం నిశితంగా పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి విచారణ చేపడుతున్నామన్నారు. ఏజెన్సీ గ్రామాలు ఒడిశాకు సరిహద్దుగా ఉండటంతో తరచూ మావోయిస్టుల కదలికలు ఉంటున్నాయన్నారు. మున్ముందు ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వీడియో క్లిప్పింగ్‌లు, ప్రత్యక్ష సాక్షులు, ఫొటోల ఆధారంగా విచారణ చేపడుతున్నామన్నారు. ఆయన వెంట ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, ఓఎస్డీ సిద్ధార్థకౌశల్, ఏఎస్పీ అమిత్‌బర్దర్, డీసీపీ ఫకీరప్ప ఉన్నారు. సోమ కుటుంబానికి పరామర్శ అరకులోయ: మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబాన్ని డీజీïపీ ఆర్పీ ఠాకూర్ పరామర్శించారు. క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఆయన ముందుగా సోమ ఇంటికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సోమ భార్య బిచ్చావతి, కుమారులు అబ్రహం,సురేష్,ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలిపారు. అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారు.. ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతో పాటు తన భర్తను అన్యాయంగా మావోయిస్టులు పొట్టనపెట్టుకుని,తమ కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశారని సోమ భార్య బిచ్చావతి డీజీపీ ఎదుట రోదించారు. తమను వీధిపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ హత్యగా విచారణ చేపట్టాలి.. తన తండ్రిని మావోయిస్టులు అన్యాయంగా చంపారని,రాజకీయ హత్య కోణంలో విచారణ చేపట్టాలని సోమ కుమారులు అబ్రహం, సురేష్‌లు డీజీపీకి విన్నవించారు. పోలీసులు కూడా రక్షణ కల్పించలేక పోయారని, డుంబ్రిగుడ ఎస్ఐ విధుల పట్ల నిర్లక్ష్యం వహించారని ఫిర్యాదు చేశారు. అన్ని విధాల న్యాయం చేస్తాం.. మావోయిస్టులు ఇద్దరు నాయకులను హత్య చేయడం బాధాకరమని, మీ కుటుంబానికి అన్ని విధాల సాయం చేస్తామని డీజీపీ ఠాకూర్, సోమ భార్య, కుమారులకు హమీ ఇచ్చారు. సిట్ దర్యాప్తుతో అన్నీ వెలుగులోకి.. పాడేరు: ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమలను మావోయిస్టులు హతమార్చిన ఘటనపై సిట్‌తో విచారణ చేపడుతున్నందున అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని డీజీపీ ఆర్.పి. ఠాకూర్ అన్నారు. బుధవారం రాత్రి పాడేరులోని కిడారి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కిడారి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. అనంతరం కిడారి భార్య పరమేశ్వరి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుమారు గంటసేపు కిడారి భార్య పరమేశ్వరితో పలు విషయాలపై ఆంతరంగికంగా చర్చించారు. తమకు జరిగిన అన్యాయం గురించి, కుటుంబ సభ్యుల పరిస్థితి గురించి ఆమె డీజీపీకి వివరించారు. తమకు అన్ని విధాల న్యాయం చేయాలని కోరారు. కిడారి సర్వేశ్వరరావు వద్ద పనిచేస్తున్న సిబ్బంది పనితీరు, అనుచరుల వ్యవహార శైలి, తదితర వాటిపై డీజీపీ కుటుంబ సభ్యుల్ని ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు డీజీపీ వెంట పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఏఎస్పీ అమిత్ బర్దర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు ఉన్నారు. -
ప్రెషర్ బాంబు పేలి జవానుకు తీవ్ర గాయాలు
పర్ణశాల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు (ఐఈడీ) పేలి డీఆర్జీ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం జరిగింది. ఎస్పీ మోహిత్ గార్గ్ కథనం ప్రకారం.. జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో డీఆర్జీ బలగాలు కూంబింగ్ ముగించుకొని బేస్ క్యాంపునకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో పరెడా గ్రామ సమీపంలో డీఆర్జీ జవాను కమ్లూ హేమ్లా మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుపై కాలు వేయడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో తీవ్ర గాయాలైన హేమ్లా ను ముందుగా బేస్ క్యాంపునకు తరలించి ప్రథమ చికిత్స అందించి, అనంతరం బీజాపుర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జవాను పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. -
ఆర్నెల్ల క్రితమే హెచ్చరిక.. అయినా!
సాక్షి, విశాఖపట్నం: ‘రామ్‌గుడా ఎన్కౌంటర్ తర్వాత ఏవోబీలో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని ధీమాగా ఉండడానికి వీల్లేదు. దండకారణ్యంలో కొంత సడలిన పట్టును మళ్లీ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మావోయిస్టుల కదలికలు ఊపందుకుంటున్నాయి. ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్నారు. ఏ క్షణమైనా మెరుపు దాడులకు తెగబడే అవకాశం లేకపోలేదు’ – ఆర్నెళ్ల కిత్రం రాష్ట్రానికి కేంద్ర నిఘా సంస్థల హెచ్చరిక.. దాడులపై ముందే అప్రమత్తం చేసినా.. తూర్పు గోదావరి, విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు మళ్లీ బలపడుతున్నారని కేంద్ర నిఘా వర్గాలు కొద్ది నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. దాదాపు 200 మందికి పైగా మావోయిస్టులు ఏవోబీలో క్రియాశీలంగా ఉన్నారని రాష్ట్రానికి పంపిన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కూడలిలో కార్యకలాపాలను విస్తరించుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న మావోయిస్టులు ఆయుధాలు, సామగ్రిని సమకూర్చుకుంటున్నారని, ఏ క్షణాన్నైనా మెరుపు దాడులకు తెగబడే అవకాశం ఉందని అప్రమత్తం చేసినట్లు తెలిసింది. ‘పొరుగు’ సేవల వ్యూహం! స్థానికంగా బలం తగ్గడంతో చత్తీస్గడ్, ఒడిశా నుంచి మావోయిస్టులను రప్పించి క్యాడర్ పెంచుకునేందుకు అగ్ర నాయకత్వం వ్యూహ రచన చేస్తోందని నిఘావర్గాలు పేర్కొన్నాయి. గతంలో మాదిరిగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కలిసి జాయింట్ ఆపరేషన్లకు వ్యూహ రచన చేయాలని నిఘా సూచించింది. ఏవోబీని షెల్టర్ జోన్‌గా ఎంచుకుంటున్నారని హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని నిఘావర్గాలు అంటున్నాయి. బీఎస్ఎఫ్ బెటాలియన్ తెచ్చుకోలేని దుస్థితి మావోయిస్టుల అణచివేతకు అదనంగా బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ బెటాలియన్ కావాలని విశాఖలో జరిగిన సమీక్షలో హోం మంత్రి చినరాజప్ప కోరగానే మంజూరు చేస్తున్నట్టు రాజ్‌నాధ్‌సింగ్ ప్రకటించారు. దాదాపు నాలుగేళ్ల పాటు కేంద్రంలో భాగస్వామిగా కొనసాగిన టీడీపీ సర్కారు ఈ బెటాలియన్ ఏపీకి తెచ్చుకోలేకపోయింది. సాంకేతిక పరిజ్ఞానం పట్టని సర్కార్ రెండున్నరేళ్ల క్రితం విశాఖలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల డీజీపీలు, ఐజీలు, డీఐజీలు ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి రాజ్నా«థ్‌సింగ్ నిర్వహించిన సమీక్షలో ఏవోబీలో మావోయిస్టు కార్యకలాపాలపైనే ఎక్కువగా చర్చ జరిగింది. ఉమ్మడి ఆపరేషన్‌తో సత్ఫలితాలు సాధించవచ్చని, నిరంతర కూంబింగ్‌తో కదలికలను కనిపెట్టాలని ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సూచించింది. మావోయిస్టుల కదలికలను పసిగట్టేందుకు కమ్యూనికేషన్ల వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించినా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. -
కిడారి హత్యలో ఆ ఇద్దరూ ఉన్నారా?
సాక్షి, అమరావతి/ఏలూరు, సాక్షి ప్రతినిధి: ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి హత్యలో మావోయిస్టులు రైను, స్వరూప ఉన్నారా? లేదా అనేదానిపై సందిగ్ధం కొనసాగుతోంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లోని జంత్రి వద్ద 2016, అక్టోబర్ 24న జరిగిన కోవర్టు దాడిలో రైను, స్వరూపలతోపాటు 27మంది కామ్రేడ్స్ అమరులయ్యారంటూ 2016, అక్టోబర్ 26న సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ప్రకటించారు. ఇదిలా ఉంటే పోలీసులు మాత్రం రైను, స్వరూపలు ఈ నెల 23న లివిటిపుట్టు ఆపరేషన్‌కు నేతృత్వం వహించారని వారి ఫొటోలతో సహా అధికారిక ప్రకటన చేశారు. అటు జగన్ ప్రకటన, ఇటు పోలీసుల ప్రకటన అయోమయానికి గురిచేసేలా ఉండటం గమనార్హం. హత్యల్లో పాల్గొన్న మావోయిస్టుల్లో ముగ్గురిని గుర్తించినట్టు పోలీసులు ప్రకటించారు. వారిలో భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్ స్వరూప అలియాస్ సింద్రి అలియాస్ చంద్రి అలియాస్ రింకీ, తూర్పుగోదావరి జిల్లా దుబ్బపాలెంకు చెందిన జలుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్, అలియాస్ రైను, విశాఖ జిల్లా కరకవానిపాలెం గ్రామానికి చెందిన వెంకట రవి చైతన్య అలియాస్ అరుణల ఫొటోలు, వివరాలతో సహా పోలీసులు విడుదల చేశారు. 2016లో మావోయిస్టు జగన్.. ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన 27 మంది కామ్రేడ్స్‌ను కోల్పోయామని వారి పేర్లతో సహా ప్రకటించారు. వీరిలో స్వరూప, రైను కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారు ఉన్నారో? లేదో? పోలీసులు లేదా మావోయిస్టులైనా నిర్ధారించాల్సి ఉంది. -
మావోయిస్టుల కట్టడికి ఐదు రకాల డ్రోన్లు!
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా మన్యంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య తర్వాత పోలీసులు కొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. దట్టమైన అడవిలో అణువణువు తెలిసిన మావోయిస్టుల్లా వెళ్లడం సాధ్యం కాబట్టి ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వామపక్ష తీవ్రవాదం ఉన్న పది రాష్ట్రాల్లో డ్రోన్లను వినియోగించి మావోయిస్టుల కదలికలను పసిగట్టాలని ఆదేశించారు. దీంతో పోలీసులు డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించారు. పది రాష్ట్రాల్లో డ్రోన్ల వినియోగం దేశవ్యాప్తంగా తీవ్రవాద సమస్య ఉన్న ప్రాంతాలతోపాటు వామపక్ష తీవ్రవాదం ఉన్న పది రాష్ట్రాల్లో ఐదు రకాల డ్రోన్లను వాడనున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మార్గదర్శకాలను అనుసరించి వాటిని అందుబాటులోకి తేనున్నారు. 250 గ్రాముల బరువు ఉండే నానో డ్రోన్, 250 గ్రాముల నుంచి 2 కిలోల వరకు బరువు ఉండే మైక్రో డ్రోన్, 2 కిలోల నుంచి 25 కిలోల వరకు ఉండే స్మాల్ డ్రోన్, 25 కిలోల నుంచి 150 కిలోలుండే మీడియం డ్రోన్, 150 కిలోలకు పైబడి బరువుండే లార్జ్ డ్రోన్లను ఉపయోగించాలని ప్రతిపాదించారు. సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్ బలగాల చేతికి.. కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), కోబ్రా దళాలు, రాష్ట్రాల పరిధిలో ఉన్న గ్రేహౌండ్స్ బలగాలకు ఈ డ్రోన్లను అందించాలని భావిస్తున్నారు. ప్రతి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులో రెండు నుంచి నాలుగు డ్రోన్లను ఏర్పాటు చేయడం, వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఢిల్లీ వరకు అనుసంధానం చేసేలా సీఆర్పీఎఫ్ కసరత్తు ప్రారంభించింది. ఈ ఐదు డ్రోన్లలో తక్కువ బరువున్న నానో, మైక్రో డ్రోన్లను ఉపయోగించుకోవాలని యోచిస్తున్నారు. 350 అడుగుల నుంచి 450 అడుగుల వరకు ఈ రెండు డ్రోన్లకు ఎగిరే శక్తి ఉంటుంది. వీటి ద్వారా పగటి పూట హెచ్డీ క్వాలిటీ వీడియోలు, ఫొటోలు చిత్రీకరించడం సులువని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అడవుల్లోనూ వినియోగించేలా.. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని అడవుల్లో సంచరించే మావోయిస్టులను గుర్తించేలా డ్రోన్లను వినియోగంలోకి తేనున్నారు. దీనికోసం శిక్షణ పొందిన పోలీసులను ఉపయోగించుకోనున్నారు. ఈ డ్రోన్ల సాయంతో మావోల కదలికలను ఫొటోలు, వీడియోల రూపంలో రికార్డు చేస్తారు. మావోయిస్టుల కోసం అడవుల్లో కూంబింగ్ చేసే ప్రత్యేక పోలీసు బలగాలకు దారి చూపించడానికి కూడా వీటిని వినియోగిస్తారు. అవసరమైతే మావోయిస్టులను కాల్చిచంపేలా వాటిని ఉపయోగిస్తారు. మావోయిస్టులు ఉన్న ప్రాంతానికి నేరుగా బాంబులు ఉన్న డ్రోన్ (సూసైడ్ డ్రోన్)లను పంపి పేలుళ్లు చేయాలని భావిస్తున్నారు. -
మంత్రి పదవి ఇస్తామన్నారు..రూ.12 కోట్లు ఇచ్చారు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పార్టీ మారితే గిరిజన కోటాలో మంత్రి పదవి ఇస్తామని అధికార తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందని ఇటీవల విశాఖ మన్యంలో మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు వెల్లడించినట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసింది. కాల్పుల కంటే ముందు కిడారిని మావోయిస్టులు లోతుగా ప్రశ్నించారని, ఆయన పలు సంచలనాత్మక విషయాలు బయటపెట్టారని ప్రత్యక్ష సాక్షులు స్పష్టం చేశారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం... అధికార పార్టీలో చేరినందుకు రూ.12 కోట్లు ఇచ్చారని, విశాఖ మన్యంలో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించేందుకు మంత్రి నారా లోకేశ్ తనకు లైసెన్స్‌లు ఇప్పించారని కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల ఎదుట ఒప్పుకున్నారు. తాను కొన్ని తప్పులు చేశానని, మైనింగ్ ఆపేస్తానని, రాజకీయాలు కూడా మానేస్తానని, ఇందుకు రెండు రోజుల సమయం ఇవ్వాలని ఆయన వేడుకున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను సైతం మావోలు ప్రశ్నించారు. పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యే కిడారితో కలిసి తిరగాలని ముఖ్యమంత్రి తనకు చెప్పారని సోమ అన్నారు. బాక్సైట్ క్వారీలతో ఎమ్మెల్యే తనకు 25 శాతం వాటా ఇచ్చారని, పెట్టుబడి ఆయనే పెడతామన్నారని, ఈ మేరకు తమ పార్టీ కూడా చెప్పిందని మావోయిస్టుల ఎదుట అంగీకరించారు. మావోయిస్టులు, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మధ్య జరిగిన సంభాషణ మావోలు: పార్టీ ఎందుకు మారావు? కిడారి: గిరిజనుల కోటాలో మంత్రి పదవి ఇస్తామన్నారు. మావోలు: పార్టీ మారినందుకు ఎంత డబ్బు తీసుకున్నావు? కిడారి: 12 కోట్లు. (తొలుత మౌనం. డ్రైవరుతో ఆరా. నాకు తెలియదన్నాక కిడారిని గట్టిగా గద్దించడంతో వెల్లడి) మావోలు: వద్దని చెప్పినా మైనింగ్ వ్యవహారాలు కొనసాగిస్తున్నావు. లైసెన్స్‌లు ఎలా వచ్చాయి? కిడారి: మంత్రి నారా లోకేశ్ ఇప్పించారు. అన్నీ ఆయనే చూసుకుంటామన్నారు. మావోలు: అయితే, వద్దనా మైనింగ్ చేస్తావా? కిడారి: కొన్ని తప్పులు చేశా. మైనింగ్ ఆపేస్తా. ఇక చేయను, ఈ మేరకు రాసిస్తా. రాజకీయాలు కూడా మానేస్తా. రెండు రోజులు సమయం ఇవ్వండి. మావోలు: ఇంకా ఏమేం ఒప్పందాలు ఉన్నాయి? కిడారి: ఇంకెప్పటికీ, ఇంకేమీ చేయను. మావోలు: చేసిందంతా ఒక ఎత్తయితే... ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నావు. కొత్తగా రెండు వాహనాలు కొన్నావు కదా! కిడారి: అవును. ట్రైకార్ సంస్థ ద్వారా రుణం తీసుకున్నా. 35 శాతం సబ్సిడీ, ఎమ్మెల్యే అలవెన్స్ ఉంది. మావోలు: అంత విలాసవంతమైన జీవితం కావాలా? కిడారి: మౌనం. సివేరి సోమతో మావోయిస్టుల సంభాషణ మావోలు: నువ్వు వాడితో(కిడారి) కలిసి ఎందుకు తిరుగుతున్నావు? సివేరి: ఎమ్మెల్యే పార్టీ మారి వచ్చినందున కలిసి తిరగమని ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని కార్యక్రమాలు, ఫంక్షన్లకు కూడా కలిసే వెళ్లమన్నారు. మావోలు: క్వారీలు వద్దన్నాం, బాక్సైట్ తవ్వొద్దని చెప్పాం కదా! సివేరి: నాకు ఎమ్మెల్యే 25 శాతం వాటా ఇచ్చారు. పెట్టుబడి ఆయనే పెడతామన్నారు. ఈ మేరకు పార్టీ కూడా చెప్పింది. పాలకులతో కుమ్మక్కై మోసం చేస్తావా? మా వద్ద నీకు సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయంటూ ఎమ్మెల్యే కిడారిని మావోయిస్టులు పలు అంశాలపై నిలదీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉన్నది ఉన్నట్లు అంగీకరించానని, ఇకపై ఎలాంటి తప్పులు చేయనని, తనను వదిలిపెట్టాలని, రెండు రోజులు అవకాశం ఇవ్వాలని కిడారి మొరపెట్టుకున్నారని చెప్పారు. గిరిజనులను బాగుచేస్తానని చెప్పి, బాక్సైట్‌కు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఇప్పుడు వారి బతుకులనే దెబ్బతీసేలా అధికార పార్టీతో చేతులు కలుపుతావా? పాలకులతో కుమ్మక్కై ఇలా ఎంతకాలం మోసం చేస్తావు? నీలాంటి వాడు బతకడానికి వీల్లేదు, నీ ఖేల్ ఖతం అంటూ కిడారిపై తుపాకులు ఎక్కుపెట్టి గుళ్లవర్షం కురిపించినట్లు సమాచారం. ఉలిక్కిపడ్డ టీడీపీ పెద్దలు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య గురించి తెలియగానే అధికార పార్టీ ముఖ్య నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సంఘటన ఎలా జరిగిందనే అంశం కంటే ఎవరైనా ఏమైనా మాట్లాడారా? ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? ముందుగా ఆ సంగతులు తెలుసుకోండి అంటూ వారు ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఉన్నందున తక్షణమే నష్ట నివారణ చర్యలపై దృష్టి సారించాలని సూచనలు చేశారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఆ పనిపైనే దృష్టి పెట్టారు. మావోయిస్టులు, ఎమ్మెల్యే మధ్య జరిగిన సంభాషణ అప్పటికే బయటకు రావడంతో... ‘‘ప్రత్యక్ష సాక్షుల నుంచి ఒక్క విషయం కూడా బయటకు పొక్కకూడదు. ఎమ్మెల్యే కొనుగోలు సంగతిని బయటకు రానివ్వొద్దు. మీరేం చేస్తారో, ఎలా చేస్తారో తెలియదు. వాళ్ల నోళ్లు నొక్కేయండి. ఒక్క మాట బయటకొచ్చినా చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. రానున్న ఎన్నికల్లో పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త’’ అంటూ అధికార పార్టీ పెద్దల నుంచి పోలీసు ఉన్నతాధికారులకు అత్యవసర ఆదేశాలు అందినట్లు తెలిసింది. ప్రత్యక్ష సాక్షుల మాటలు మార్పించండి ప్రత్యక్ష సాక్షులు ఇప్పటివరకు చెప్పిన మాటలను స్వయంగా వారితోనే మార్చి చెప్పించాలనే పోలీసు ఉన్నతాధికారుల నుంచి స్థానిక అధికారులకు ఆదేశాలు అందుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అప్పుడు ఏదో ఆందోళనతో అలా చెప్పామనే కోణంలో మళ్లీ మాట్లాడించాలని సూచిస్తున్నట్లు సమాచారం. తప్పుడు ప్రచారం చేద్దాం.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం ఇవ్వలేదని, వారు చెప్పకుండా, తమ సూచనలు లెక్కచేయకుండా వెళ్లారని, మావోయిస్టులతో చర్చించి ఒప్పందాలు చేసుకోవడానికే వెళ్లినట్లు కలరింగ్ ఇవ్వాలని, దాన్నే ఎక్కువగా ప్రచారం చేయాలనే సూచనలు ఉత్తరాంధ్రలోని టీడీపీ నేతలకు పార్టీ ముఖ్యుల నుంచి వెళ్లినట్లు తెలిసింది. తద్వారా ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంపై చర్చ జరగకుండా చూడాలనేది టీడీపీ ఎత్తుగడగా తెలుస్తోంది. పోలీసుల చేతగానితనాన్ని కూడా ప్రత్యేకంగా ప్రచారం చేయాలని కూడా అంటున్నట్లు వినికిడి. మావోల వద్ద సమాచారం నిక్షిప్తం అధికార పార్టీ తన అనుకూల మీడియా ద్వారా తిమ్మినిబమ్మి చేస్తుందని మావోయిస్టులు గ్రహించినట్లు సమాచారం. అందుకే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలతో జరిగిన సంభాషణలను వ్యూహాత్మకంగా రికార్డు చేసినట్లు తెలిసింది. సాధారణంగా ఏదైనా సంఘటనకు పాల్పడిన తరువాత మావోయిస్టులు అధికారికంగా మీడియాకు లేఖలు విడుదల చేస్తారు. ఆ లేఖల్లో మరెన్ని వివరాలు ఉంటాయో, ఎలాంటి లోగుట్లు బయటకు వస్తాయో అనే ఆందోళన కూడా తమ పార్టీ ముఖ్య నేతల్లో ఉందని టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. గిరిజన ద్రోహులైనందుకే... ఎమ్మెల్యే కిడారి వాహనాన్ని మావోయిస్టులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకునే ముందు ఆయన తీవ్ర భయాందోళనలతో తనతోపాటు వాహనంలో ఉన్న వారితో పలు అంశాలను ప్రస్తావించారు. డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు, అంగరక్షకులు, ఇతర నాయకులు ఎమ్మెల్యేతోపాటు ఉన్నారు. ఈ రోజు మావోయిస్టుల చేతిలో చచ్చాంరా... అని కిడారి వ్యాఖ్యానించినట్లు డ్రైవర్ రవి మీడియాకు చెప్పారు. ‘‘నన్ను బాక్సైట్ తవ్వకాల గురించి అడిగారు. వైకాపా నుంచి టీడీపీలోకి మారినందుకు ఎంత తీసుకున్నారో తెలుసా? అని ప్రశ్నించారు’’ అని రవి వివరించారు. కిడారి, సివేరిలు గిరిజన ద్రోహులైనందునే చంపుతున్నామని మావోయిస్టులు చెప్పినట్లు మాజీ ఎమ్మెల్యే గన్‌మెన్ స్వామి, కిడారి పీఏ అప్పారావు వెల్లడించారు. ‘‘ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేని మాత్రం కొద్దిదూరం తీసుకెళ్లారు. స్థానికులతో కొంతమంది మావోయిస్టులు చెట్టు కింద సమావేశం నిర్వహించారు. ఆ తరువాత కాల్పులు జరిగాయి’’ అరకు మాజీ సర్పంచి చటారి వెంకటరాజు తెలిపారు. స్థానికుల సమక్షంలోనే ప్రశ్నించిన మావోలు వాహనాన్ని అడ్డగించి తమ అదుపులోకి తీసుకోబోయే సమయంలో వ్యూహంలో భాగంగానే పలువురు స్థానికులను మావోయిస్టులు వెంట పెట్టుకుని వెళ్లారు. ఆ సందర్భంగానూ మావోయిస్టులు, ఎమ్మెల్యే మధ్య మాటలు జరిగాయి. సివేరి సోమ విషయంలోనూ దాదాపు ఇదేవిధంగా జరిగింది. వీటికి ప్రత్యక్ష సాక్షులుగా ఉండాలనే ఉద్దేశంతోనే స్థానికులను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ‘‘ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి గిరిజనులే. వారిని చంపేస్తే గిరిజనులు ఆగ్రహించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో సహకరించకపోవచ్చు. తమ కదలికలను పోలీసులకు తెలియజేయవచ్చు. వాటన్నింటి దృష్ట్యానే స్థానికులను వెంట తీసుకెళ్లారు. వారి సమక్షంలోనే అన్ని వివరాలు రాబట్టారు. ఆ తరువాతే కాల్చారు’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు విశ్లేషించారు. ఎమ్మెల్యే అమ్ముడుపోయిన విషయాన్ని గిరిజనుల మధ్య నిరూపించాలన్నదే మావోల ఎత్తుగడ అని పేర్కొన్నారు. తమ సమక్షంలోనే మావోయిస్టులు పలు ప్రశ్నలు అడిగినట్లు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే. సంభాషణలు బట్టబయలు కిడారి, సివేరిల హత్యకు ముందు ముగ్గురు గన్మెన్లు, ఇద్దరు డ్రైవర్లు, కిడారి పీఏ అప్పారావు, అరకు మాజీ సర్పంచ్ వెంకట్రాజు, నాయకురాలు లావణ్య తదితరులు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. వీరితోపాటు తమకు నమ్మకస్తులైన వారిని కూడా మావోలు వెంట తీసుకెళ్లారు. కొద్దిసేపు మాట్లాడిన తరువాత వేర్వేరుగా కాల్చి చంపారు. సంఘటన జరిగిన తరువాత దాదాపు ఆరేడు గంటలపాటు పోలీసుల జాడ లేదు. ఈలోగానే ప్రత్యక్ష సాక్షులు తమ కళ్లెదుట జరిగిన సంఘటనను హతుల కుటుంబీకులకు, మిత్రులు, బంధువులకు, పార్టీ ముఖ్య నాయకులకు చేరవేశారు. సంఘటనా స్థలం నుంచి అరకు పోలీసుస్టేషన్ వద్దకు మృతదేహాలను సొంత వాహనాల్లో తీసుకొచ్చేటప్పుడు మార్గమధ్యంలోని గ్రామాల్లో ప్రజల డిమాండ్ మేరకు ఆగారు. ఆ సమయంలో కూడా జరిగిన సంఘటనను వివరించారు. దీంతో సంభాషణల వ్యవహారం బట్టబయలైంది. -
అరకు హత్యాకాండలో కీలకపాత్రధారి కలకలం..
తూర్పుగోదావరి, అడ్డతీగల (రంపచోడవరం): అరకులో జరిగిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యాకాండలో కీలకపాత్ర వహించింది అడ్డతీగల మండలం దబ్బపాలేనికి చెందిన జనుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్, రైనో అని విశాఖ పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో తూర్పు మన్యంలో కలకలం మొదలైంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను ఆదివారం మావోయిస్టులు కాల్చి చంపిన నేపథ్యంలో దర్యాప్తును విస్తృతం చేసిన పోలీసు అధికారులు ముగ్గురు మావోయిస్టులు ఈ హత్యాకాండలో కీలకపాత్ర వహించినట్లు పేర్లు, ఫొటోలను విడుదల చేశారు. హత్యల్లో ప్రత్యక్ష పాత్ర ఉందంటూ విడుదల చేసిన తొలి జాబితాలోనే జనుమూరి శ్రీనుబాబు పేరు చోటు చేసుకోవడంతో మన్యంలో వాతావరణం వేడెక్కింది. పేర్లు ప్రకటించిన ముగ్గురిలో ఇద్దరు మహిళలు కావడంతో శ్రీను ఈ ఆపరేషన్‌కి నాయకత్వం వహించాడనే చర్చ పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మేరకు పోలీసుశాఖ ప్రాథమిక నిర్ధారణకు వచ్చిందంటున్నారు. అడ్డతీగల మండలం వీరవరం పంచాయతీలోని దబ్బపాలెం మూడో వీధికి చెందిన సోమయ్య, పాపాయ్యమ్మల కుమారుడు శ్రీను. ముగ్గురు సోదరులు, ఒక సోదరి కాగా శ్రీను మరో సోదరుడు వెంకటేశులు ఆలియాస్ ఆనంద్ కూడా మావోయిస్టు ఉద్యమంలో ఉంటూ 2016లో విశాఖ జిల్లా మర్రిపాకలు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడైన శ్రీను 1998 నుంచి ఆ ఉద్యమంలో పనిచేస్తున్నాడు. గతంలో బలిమెల వద్ద పోలీసులపై మావోయిస్టులు జరిపిన మెరుపు దాడితో పాటు మరికొన్ని హింసాత్మక ఘటనల్లో కీలకంగా వ్యహరించిన శ్రీనుబాబుపై పలు కేసులు నమోదైనట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్ర–ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీలోని తూర్పు డివిజన్‌తో పాటు ఒడిశా మల్కన్‌గిరి డివిజన్లో శ్రీనుబాబు కీలకంగా వ్యవహిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. శ్రీనుబాబు దబ్బపాలెంలోనే ప్రాథమిక విద్యాభాస్యం చేసిన అనంతరం చదువు మానేశాడు. శ్రీను మరో సోదరుడు వీరవరం సర్పంచ్‌గా రెండు పర్యాయాలు పనిచేశారు. ‘ఆ ప్రాంతాల్లోకి వెళ్లవద్దు’ చింతూరు (రంపచోడవరం): ఓ వైపు అరకు ఘటన.. మరోవైపు మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో చింతూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లా అరకులో ప్రజా ప్రతినిధులను హతమార్చిన మావోయిస్టులు దండకారణ్య సరిహద్దుల్లో కూడా అలాంటి ఘటనలకు పాల్పడవచ్చనే అనుమానంతో పోలీసులు చింతూరు, ఎటపాక సర్కిల్ పరిధిలోని డొంకరాయి, మోతుగూడెం, చింతూరు, ఏడుగురాళ్లపల్లి, ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం పోలీస్స్టేషన్ల పరిధిలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో భాగంగా ప్రధాన రహదారుల వెంబడి వాహనాలు ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు అనుమానితులను పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి విడిచి పెడుతున్నారు. దీంతోపాటు ప్రధాన రహదారుల వెంబడి ఉన్న కల్వర్టులను కూడా బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అరకు ఘటన అనంతరం దండకారణ్యంలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అదనపు బలగాలతో అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ప్రధానంగా ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దుమ్ముగూడెం, చర్ల, గొల్లపల్లి, కిష్టారం, కుంట, ఏడుగురాళ్లపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని సరిహద్దు ప్రాంతాలను అణువణువూ జల్లెడ పడుతున్నారు. త్వరలోనే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులకు అదనపు భద్రత కల్పిస్తున్నారు. ప్రచారం కోసం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, అటవీ ప్రాంతాల గుండా ప్రయాణించవద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. టార్గెట్లకు నోటీసులు అరకు ఘటన నేపథ్యంలో చింతూరు సబ్ డివిజన్ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లతో పాటు మావోయిస్టుల టార్గెట్‌లో ఉన్న వ్యక్తులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్నందున మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, అటవీ ప్రాంతాల గుండా ప్రయాణించవద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, అత్యవసర పనులపై వెళ్లాల్సి వస్తే తమకు సమాచారం ఇచ్చి వెళ్లాలని పోలీసులు నోటీసుల్లో సూచించారు. విస్తృత తనిఖీలు..మరో వైపు కూంబింగ్ పొరుగున ఉన్న విశాఖ జిల్లాలో మావోయిస్టుల హత్యాకాండ నేపథ్యంలో తూర్పున ప్రధాన రహదారుల వెంబడి కూడళ్లలో పోలీసులు వాహన తనిఖీలు విస్తృతంగా చేస్తున్నారు. అలాగే అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. దీంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధవాతావరణం నెలకొంది. -
నివురుగప్పిన నిప్పు.. లివిటిపుట్టు
కొద్ది వారాలుగా రెక్కీ.. రెండు మూడు రోజులపాటు మకాం.. గిరిజనుల సమక్షంలో ప్రజాకోర్టు నిర్వహణ.. కాల్పులతో అత్యంత పకడ్బందీగా ఆపరేషన్ పూర్తి.. ఆపైన తాపీగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్లిన మావోయిస్టులు.. సంచలనానికి వేదికైన లివిటిపుట్టు ఆదివారంనాటి దారుణ ఘటనకు మౌనసాక్షి. మావోలు బలహీనపడ్డారని, పోలీసులు పైచేయి సాధించారని భావిస్తున్న తరుణంలో ఉరుములేని పిడుగులా సంభవించిన ఈ సంఘటన దేనికి సంకేతం? గిరిజనులను ప్రేరేపించిన.. మావోయిస్టులకు పరోక్షంగా సహాయపడిన అంశాలేమిటి? సర్కారు దోపిడీ విధానంపై మన్య ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహానికీ, అసహనానికీ దీనిని ఓ ఉదాహరణగా భావించవచ్చా? ప్రజల్లోనూ, ప్రభుత్వ పెద్దల్లోనూ ఇప్పుడిదే హాట్ టాపిక్.. సాక్షి, విశాఖపట్నం : ఏదైనా ఆపరేషన్‌లో పాతిక మందో.. ముప్ఫైమందో మావోయిస్టులు పాల్గొంటారు. తమ ఇన్ఫార్మర్ల ద్వారా పక్కా సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని పని ముగించుకుని వెళ్లిపోతుంటారు. అంతేకాని గ్రామాల్లో మాటు వేసిన సందర్భాలు చాలా అరుదు. ఎక్కడైనా మారుమూల అటవీ ప్రాంతంలో ఏ మీటింగ్ పెట్టినా గిరిజనులందరినీ తమ వద్దకు రప్పించుకుంటారే తప్ప మావోలు గ్రామాలకు వెళ్లి ఆశ్రయం పొందడం ఉండదు. కానీ నిన్నటి లివిటిపుట్టు ఘటనలో 60–70 మంది పాల్గొనగా.. చుట్టుపక్కల వివిధ బృందాలుగా ఏర్పడి మరో 70 మందికి పైగా పహారా కాశారని చెబుతున్నారు. ఈ విధంగా సుమారు 150 మంది మావోలు ఈ ఆపరేషన్‌లో పాల్గొనడం చిన్న విషయం కాదు. పైగా డుంబ్రిగుడ మండలం కోండ్రుం పంచాయతీ సోరాయి గ్రామానికి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు వెళ్తున్నారన్న సమాచారం నాలుగైదు రోజుల ముందే ఇన్ఫార్మర్ల ద్వారా తెలియడంతో పక్కా ప్లానింగ్‌తో ఈ ఆపరేషన్‌కు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. దీనినిబట్టి మావోయిస్టులపై గిరిజనులకు గురి కుదిరిందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల, ప్రభుత్వ, దోపిడీ విధానాలతో విసిగి వేసారడం వలనే గిరిజనులు మావోలను మళ్లీ విశ్వసిస్తున్నారన్న వాదన తెరపైకి వచ్చింది. ఇందుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యోదంతం బలం చేకూరుస్తుంది. మావోయిస్టులు బృందాలుగా ఏర్పడి రెండ్రోజులు ముందుగానే లివిటిపుట్టు పరిసర గ్రామాలకు వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఇన్ఫార్మర్లు, మిలిషీయా సభ్యుల ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో సురక్షిత ప్రాంతాల్లో మకాం వేసినట్టు తెలియవచ్చింది. కనీసం ఒకటి రెండ్రోజుల ముందు ఈ ప్రాంతానికి చేరుకున్నారని భావించినా వారికి ఆశ్రయం ఇచ్చే విషయంలో గిరిజనులు ఎంతో కొంత సహకారం అందించి ఉంటారని భావిస్తున్నారు. వీరు ఆశ్రయం ఉన్న గ్రామాలు చాలా వరకు సెల్ నెట్వర్కు పనిచేసే గ్రామాలే. పైగా మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్లు, అరుకులోయకు 17 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. నిజంగా పోలీసులకు సమాచారం చేరవేయాలన్నా.. స్వయంగా చెప్పాలన్నా ఏమంత కష్టమైన పనికాదు. ఏ మార్గంలో వెళ్లినా ఒకటి రెండు గంటల్లోనే సమాచారాన్ని చేరవేయొచ్చు. కానీ ఆశ్రయం ఇచ్చిన గిరిజనులు, మిలిషీయా సభ్యులు ఎక్కడా ఏ రూపంలోనూ ఎవరికి సమాచారం చెప్పలేదు. సమాచారం చేరవేయలేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వంపైన, అధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధుల పైన నమ్మకం పూర్తిగా సడలడమే అంటున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల దోపిడీ విధానాల వల్లే గిరిజన యువతకు మళ్లీ మావోలపై గురికుదిరిందన్న వాదన బలంగా విన్పిస్తుంది. గడిచిన నాలుగేళ్లుగా టీడీపీ నేతలు గిరి సంపదను అడ్డగోలుగా దోచుకోవడమే కాకుండా తమను అన్ని విధాలుగా దోపిడికి గురిచేయడం వలనే వారి పట్ల గిరిజనులు తీవ్ర ఆగ్రహం ఉన్నారు. ఇటీవల బాక్సైట్ తవ్వకాలకు కేంద్రానికి రాష్ట్రం ద్వారా ప్రతిపాదనలు వెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవల గిరిజన ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా గిరిజన మనోభావాలకు విరుద్ధంగా బాక్సైట్ తవ్వకాలు జరపనీయమని చెప్పినా గిరిజనుల విశ్వసించడం లేదు. మరోవైపు ఫిరాయించిన పార్టీ నేతలు గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం అడ్డుకట్టవేయలేకపోవడం.. తమకు కేటాయించే కోట్లాది రూపాయల నిధులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టడం.. తమ సమస్యలను పట్టించుకోకపోవడం వంటి విషయాల్లో గిరిజనులు తీవ్ర ఆగ్రహం ఉన్నారు. ఈ కారణంగానే నిన్నటి ఘటనలో వలనేనన్న భావన బలంగా విన్పిస్తుంది. ఈ కారణంగానే తమ చెంతనే మావోలు ఉన్నçప్పటికీ వారు నోరు మెదపలేదంటున్నారు. మావోలు ఇంత పెద్ద ఎత్తున మోహరించి ఉండడంతో ఆయా గ్రామాల్లోని పోలీస్ ఇన్ఫార్మర్లను నోరుమెదిపే సాహసం చేయలేకపోయారని సమాచారం. -
లివిటిపుట్టుకు భారీగా వచ్చిన మావోయిస్టు దళాలు
అరకులోయ: ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును టార్గెట్‌గా చేసుకున్న మావోయిస్టులు మూడు రోజులుగా కండ్రూం పంచాయతీ సమీపంలోని అడవుల్లో మాటు వేసినట్టు తెలిసింది. కొందరు సాధారణ దుస్తులు ధరించి ఎలాంటి ఆయుధాలు లేకుండా ఈ ప్రాంతంలో సంచరించారని సమాచారం. కాలినడకన మూడు చోట్ల నుంచి.. ఆపరేషన్ లివిటిపుట్టులో పాల్గొనేందుకు ఏవోబీలోని మూడు ప్రాంతాల నుంచి మావోయిస్టులు భారీగా చేరుకున్నారు. ఏజెన్సీలో కీలకమైన పెదబయలు దళంతోపాటు ఒడిశా కటాఫ్ ఏరియాలోని ఏరియా కమిటీ, కొరాపుట్ జిల్లా నందపూర్ దళానికి చెందిన మావోయిస్టులంతా కాలినడకనే లివిటిపుట్టుకి ముందుగానే చేరుకున్నట్టు తెలిసింది. సాధారణంగా ప్రతి దళంలోనూ 20 మందికి మించి మావోయిస్టులు ఉండరు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమల వాహనాలను చుట్టుముట్టినపప్పుడు మావోయిస్టులు భారీగా ఉన్నారు. కొందరు ఘటనా స్థలంలో ఉండగా మరికొందరు సమీపంలోని అటవీ ప్రాంతంలో మాటు వేసినట్టు చెబుతున్నారు. వీరిని హతమార్చిన తర్వాత మళ్లీ అడవి మార్గంలోనే ఒడిశా ప్రాంతానికి తరలి వెళ్లినట్టు గిరిజనులు పేర్కొంటున్నారు. వెంటనే స్పందించని యంత్రాంగం డుంబ్రిగుడ మండలంలోని మారుమూల ప్రాంతం గుంటసీమ తరువాత ఒడిశా గ్రామాలే అధికంగా ఉన్నాయి. ఒడిశా మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం కావడంతో సులభంగా తప్పించుకునే అవకాశం కలిగింది. ఘటన తరువాత ఒడిశాలోని కోరాపుట్, విశాఖ జిల్లాల్లోని పోలీసు యంత్రాంగం సకాలంలో స్పందించలేదు. మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో హత్యలు జరిగిన తరువాత మావోయిస్టులు సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు కొంత సమయం పట్టింది. అయితే పోలీసు యంత్రాంగం నుంచి ప్రతిస్పందన లేకపోవడం మావోయిస్టులకు కలిసొచ్చింది. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ప్రకటించినప్పటికీ డుంబ్రిగుడ, ఒడిశా సరిహద్దులో పోలీసుల సంచారం కనిపించడం లేదు. ఎమ్మెల్యే కదలికలపై వివరాల సేకరణ... లివిటిపుట్టు ప్రాంతంలో కొన్నిచోట్ల సెల్‌ఫోన్ సంకేతాలు అందుబాటులో ఉన్నాయి. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ కూండ్రం పంచాయతీ సర్రాయి గ్రామానికి వస్తున్న సమాచారాన్ని మావోయిస్టులు ఎప్పటికప్పుడు సెల్ఫోన్ల ద్వారా తెలుసున్నారు. జవాన్ పోస్టుల రాత పరీక్షలో పోలీసులు బిజీ జవాన్ పోస్టుల భర్తీకి సంబంధించి గిరిజన అభ్యర్ధుల కోసం పోలీసుశాఖ ఆదివారం అరకులోయలో మెరిట్ టెస్ట్ ఏర్పాటు చేసింది. పోలీసులు ఈ పనుల్లో నిమగ్నమవుతారని, డుంబ్రిగుడ వైపు రాలేరని మావోలు లివిటి అపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. కాగా, మావోయిస్టులు ఈ ప్రాంతంలో సంచరిస్తూ మాటు వేశారనే సమాచారం బయటకు పొక్కకపోవడం గమనార్హం. -
ఉప్పందించింది గంజాయి వ్యాపారులే?
సాక్షి, విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యోదంతం వెనుక గంజాయి వ్యాపారుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిచ్చిన సమాచారంతోనే మావోయిస్టులు పక్కా వ్యూహంతో దాడికి దిగి హతమార్చినట్లు భావిస్తున్నారు. గంజాయి వ్యాపారులు, ఎమ్మెల్యే కిడారి మధ్య ఇటీవల విబేధాలు తలెత్తినట్లు చెబుతున్నారు. అందువల్లే ఎమ్మెల్యే కదలికలను వారు ఎప్పటికప్పుడు మావోయిస్టు ఇన్ఫార్మర్లకు చేరవేసినట్లు తెలిసింది. ఈ సమాచారంతోనే మావోయిస్టులు దాడి జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు. చర్చికి వెళ్లాలని బయల్దేరి... అరకులో నివాసం ఉంటున్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ శనివారం రాత్రి విజయవాడ నుంచి అరకు చేరుకున్నారు. ప్రతి ఆదివారం మాదిరిగానే ఈ నెల 23వతేదీన కుటుంబంతో కలసి స్వగ్రామం బత్తివలసలోని చర్చికు వెళ్లేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అదే సమయంలో తనతోపాటు రావాలని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కోరడంతో కాదనలేక ఆయన వెంట వాహనంలో బయల్దేరారు. ఎమ్మెల్యేతోపాటు వెళ్తున్నట్లు డుంబ్రిగుడ ఎస్ఐకి సమాచారం ఇవ్వడంతో.. ‘మీరు వెళ్లండి ఏం పర్వాలేదు.. నేను మీ వెనక తర్వాత వస్తా..’ అని చెప్పారని సోమ అనుచరులు పేర్కొంటున్నారు. సోమ అనుచరుల ద్వారా విషయం తెలుసుకున్న గంజాయి వ్యాపారులు మావోయిస్టు ఇన్ఫార్మర్లకు ఉప్పందించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ బందోబస్తు లేకుండా కిడారి, సోమ ఒంటరిగా వçస్తున్నట్లు నిర్ధారించుకున్న అనంతరం మావోయిస్టులు కార్యాచరణకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో సంఘటన జరిగిన రోజు ప్రజా ప్రతినిధుల అనుచరులు ఫోన్లలో ఎవరెవరితో మాట్లాడారు..? ఏం మాట్లాడారనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్కడ ఫోన్లు పనిచేయలేదా? ఘటన అనంతరం ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ మీడియాతో మాట్లాడుతూ లివిటిపుట్టులో సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల పూర్తి సమాచారం రాలేదని చెప్పగా.. హత్య జరిగిన విషయాన్ని పోలీసులకు ఫోన్లో తెలియజేశామని కిడారి, సోమ అనుచరులు పేర్కొనడం గమనార్హం. మన్యంలో 25 వేల ఎకరాల్లో గంజాయి సాగు.. విశాఖ మన్యంలో సుమారు పాతిక వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు స్థానిక గిరిజనులను అడ్డం పెట్టుకుని పెద్దఎత్తున గంజాయి సాగు చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. గంజాయి సాగు నిల్వ, రవాణా విషయంలో అడ్డంకులు సృష్టించకుండా ఉండేందుకు పోలీస్, ఎక్సైజ్ సిబ్బంది, అధికార పార్టీ నేతలకు వ్యాపారులు నెలవారీ మామూళ్లు ముట్టచెబుతున్నట్లు ఆరోపణలున్నాయి. సిట్ దర్యాప్తు ప్రారంభం కిడారి, సోమ డ్రైవర్లను విచారించిన అధికారులు పాడేరు: ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటనపై సిట్ అధికారులు అరకులో దర్యాప్తు ప్రారంభించారు. వీరిద్దరి వాహనాల డ్రైవర్లు రవి, చిట్టిబాబులను విచారించిన సిట్ అధికారులు సంఘటన జరిగిన తీరుపై పలు విషయాలను సేకరించారు. అనంతరం లివిటిపుట్టు వద్ద సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మరోవైపు యూనిఫైడ్, గ్రేహౌండ్స్ పోలీసు బలగాలను మన్యానికి తరలించారు. మంగళవారం ఏజెన్సీ ప్రాంతాలకు చేరుకున్న పోలీసు బలగాలు అరకు, డుంబ్రిగుడ మండలాల పరిధిలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. గన్ను పట్టిన మహిళా దండు సాక్షి, విశాఖపట్నం/అరకులోయ: ఏవోబీ మావోయిస్టు పార్టీ ఉద్యమంలో మహిళలు కీలకంగా మారారు. మావోయిస్టు పార్టీలో గతంలో మహిళల సంఖ్య తక్కువగా ఉండేది. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో 32 మంది మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో మహిళలు కూడా అధికంగానే ఉన్నారు. ఎన్కౌంటర్లో కీలక నేతలతో పాటు, తన కుమారుడు మున్నాను కూడా పొగొట్టుకున్న మావోయిస్టు అగ్రనేత ఆర్కే.. కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న తర్వాత మళ్లీ ఏవోబీలో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేశారనే విషయం ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యలతో తెలుస్తోంది. దీనికి మహిళా మావోలను ఆయన సన్నద్ధం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో విశాఖ ఏజెన్సీలోని మారుమూల గ్రామాలతో పాటు, సరిహద్దులోని ఒడిశా పల్లెల్లో మావోయిస్టు ఉద్యమంపై అగ్రనేతలు ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి అనేక గ్రామాల గిరిజన యువత ఆకర్షితులయ్యారని తెలుస్తోంది. వీరిలో 17 ఏళ్లు దాటిన గిరిజన యువతులే అధికంగా ఉన్నట్టు సమాచారం. విశాఖ ఏజెన్సీ, ఒడిశా గ్రామాలకు చెందిన గిరిజన యువతులు వందల సంఖ్యలో మావోయిస్టు పార్టీలో చేరినట్టు గతంలో ప్రచారం జరిగింది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు క్యాడర్లో మహిళలు కీలకంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏవోబీలో యువతకు పెద్దఎత్తున శిక్షణ ఇచ్చారని, ఈ శిక్షణలో గిరిజన యువతులు కూడా ఎక్కువగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. గత నెలలో ఏవోబీలో మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు జరిగాయి. ఒడిశాతో పాటు, విశాఖ ఏజెన్సీ మారుమూల గ్రామాలలోను గిరిజనులతో సమావేశాలు నిర్వహించిన సమయంలో మహిళా మావోయిస్టులే కీలకపాత్ర వహించారు. ఆయుధాలు చేతబూనిన మహిళా దండును చూసినట్లు గిరిజనులు చెబుతున్నారు. విశాఖ ఏజెన్సీ కోరుకొండ, పెదబయలు దళాలతో పాటు, ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాల్లో పలు దళాలలో మహిళలు అధికంగా ఉన్నట్లు సమాచారం. డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు గ్రామంలో ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమల వాహనాలను ముట్టడించిన వారిలో మహిళా మావోయిస్టులే అధికంగా ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మహిళా మావోయిస్టులే వారిని తుపాకులతో కాల్చి చంపారు.ఇది మహిళా మావోయిస్టులతో చేపట్టిన తొలి ఆపరేషన్‌గా ఏజెన్సీలో ప్రచారం జరుగుతుంది. రెండేళ్లుగా భారీగా రిక్రూట్మెంట్ ఏవోబీలో మావోలు బలపడుతున్నారని లివిటిపుట్టు ఘటనతో తేటతెల్ల మవుతోంది. గత రెండేళ్లలో భారీగా రిక్రూట్మెంట్ జరిగిందన్నది నిన్నటి ఘటనలో పాల్గొన్న మావోల వయసును బట్టి స్పష్టమవుతోంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం లివిటిపుట్టు ఆపరేషన్‌లో పాల్గొన్న వారిలో అత్యధికులు 18–20 ఏళ్ల లోపు వారే ఎక్కువ. దీంతో రిక్రూట్మెంట్ జరగడం లేదన్న పోలీసుల వాదన తప్పని రుజువైంది. సాక్షుల చెప్పిన సమాచారాన్ని బట్టి కాల్పుల్లో పాల్గొన్న వారు గుత్తుకోయల, కొందూస్ తెగకు చెందిన వారిగా భావిస్తున్నారు. గుత్తుకోయల తెగకు చెందిన వారు తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉంటారు. ఇక కొందూస్ తెగకు చెందిన వారు ఒడిశా–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉంటారు. కిడారి ఆపరేషన్‌లో పాల్గొన్న వారు తెలుగు మాట్లాడుతుండటంతో వీరంతా తెలంగాణ, ఏపీకి చెందిన వారేనని భావిస్తున్నారు. ఎక్కువ మంది తెలంగాణ యాసలో మాట్లాడారని సాక్షులు చెబుతున్నారు. -
మన్యంలో భయం భయం
సాక్షి, విశాఖపట్నం :అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు మట్టుబెట్టడంతో విశాఖ ఏజెన్సీలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కొంతకాలంగా గ్రామ, మండల స్థాయి నాయకులనే పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో హతమార్చడం, వాహనాలకు నిప్పుపెట్టడం వంటి ఘటనలకు పాల్పడిన మావోలు ఏకంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలనే హతమార్చడం పోలీసులకు సవాల్‌గా మారింది. తమ నేతలను రక్షించడంలో విఫలమయ్యారంటూ అరుకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆదివారం నాటి ఉద్రిక్త çపరిస్థితులు సోమవారం నాటికి కాస్త అదుపులోకి వచ్చాయి. అయితే ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఆందోళన గిరిజనుల్లో నెలకొంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హతమార్చిన ఘటనలో పాల్గొన్న మావోయిస్టులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రత్యక్ష సాక్షులు గుర్తించిన ముగ్గురు మావోల వివరాలను మీడియాకు విడుదల చేశారు. అయితే వీరు ఏ దళంలో పనిచేస్తున్నది.. ఇప్పటి వరకు ఏఏ ఘటనల్లో పాల్గొన్నది మాత్రం చెప్పలేదు. మిగిలిన వారిని కూడా త్వరలోనే గుర్తిస్తామని ప్రకటించారు. నిన్నటి ఘటన నేపథ్యంలో ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. విశాఖ మన్యంతోపాటు ఏవోబీలో గ్రేహౌండ్స్ దళాలు, స్పెషల్ పార్టీ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు కూంబింగ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు. ఘటన జరిగిన డుంబ్రిగూడ మండలంతోపాటు మావోల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. కటాఫ్ ఏరియాతోపాటు ఏవోబీ ప్రాంతాల్లో అణువణువు గాలిస్తున్నారు. అదనపు బలగాల కూంబింగ్ ఆపరేషన్‌తో ఏజెన్సీ గ్రామాలన్నీ భయం గుప్పెట్లో వణికిపోతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఆందోళన గిరిజన గ్రామాల్లో కన్పిస్తోంది. గిరిజనులైతే ఇళ్లు వదిలి బయటకొచ్చేందుకు భయపడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కర్నీ ప్రశ్నిస్తున్నారు. నిన్నటి ఘటనలో పాల్గొన్న మావోయిస్టులను చూసారా? వారి కదలికలను గమనిం చారా? గుర్తుపట్టగలరా అంటూ ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బలగాల బూట్ల చప్పుళ్లతో విశాఖ ఏజెన్సీ దద్దరిల్లిపోతుంది. మొత్తమ్మీద విశాఖ మన్యంలో ఏ క్షణాన్న ఏం జరుగుతుందోననే ఆందోళన సర్వత్రా నెలకొంది. అర్ధరాత్రి బస్సు సర్వీసులు నిలిపివేత సీలేరు (పాడేరు): ఏవోబీలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఏజెన్సీ ముఖద్వారం నర్సీపట్నం నుంచి ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతాల వరకు అడుగడుగునా పోలీసు బలగాలు మోహరించాయి. విశాఖ నుంచి ఏజెన్సీ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే రాత్రి పూట బస్సు సర్వీసులను నిలిపివేశారు. విశాఖ–భద్రాచలం, విశాఖ–హైదరాబాదు, భద్రాచలం మీదుగా రాత్రి పూట వెళ్లే బస్సులు తిరగలేదు. ఆంధ్రా, ఒడిశా, తూర్పుగోదావరి, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ముమ్మర గాలింపు చేస్తున్నారు. -
ఉనికి కోసమే దుశ్చర్య
విశాఖపట్నం, పాడేరు: మావోయిస్టుల చేతిలో హతమైన ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమ కుటుంబాల్ని అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. పాడేరులో కిడారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకుల్ని మావోయిస్టులు చంపడం విచారకరమన్నారు. తమ ఉనికిని చాటుకోవడానికే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ సంఘటనతో ప్రజల్లో అశాంతిని తొలగించి, శాంతి భద్రతలకు చర్యలు తీసుకున్నామన్నారు. పార్టీ శ్రేణులు, ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సంఘటనలో పోలీసుల వైఫల్యాలను, లోపాల్ని గుర్తించేందుకు విచారణ చేపడతామన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న నాయకుల్ని కోల్పోవడం పార్టీకి, ప్రజలకు నష్టమన్నారు. ఈ లోటు తీర్చలేదని అన్నారు. పార్టీ పరంగా ఆయా కుటుంబాలను ఆదుకోడానికి సీఎంతో చర్చిస్తామన్నారు. మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ గిరిజన సంక్షేమమే తమ సిద్ధాంతమని చెప్పుకునే మావోయిస్టులు వారి కోసం పనిచేస్తున్న నాయకుల్ని హతమార్చడం ఏమి సిద్ధాంతమని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యవాదులంతా దీనిని ఖండించాలన్నారు. వీరి అంత్యక్రియలు జరిగిన చోట స్థూపాల్ని నిర్మించి, స్మృతి వనాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కిడారి,సీవేరి సోమల కుటుంబాల్ని ఆర్థికంగా, రాజకీయంగా, ఉపాధి పరంగా ఆదుకునేందుకు కృషి చేస్తామని చెప్పారు. సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ గిరిజన సంక్షేమానికి ఆహర్నిశలు పాటుపడుతున్న కిడారిని మావోయిస్టులు హతమార్చడం బాధకరమని అన్నారు. ఎక్సైజ్‌శాఖ మంత్రి ఎస్.జవహర్ మాట్లాడుతూ గిరిజనుల కోసం పనిచేస్తున్న నాయకుల్ని చంపడం దారుణమన్నారు. తప్పు చేస్తే ప్రజలే తీర్పు ఇస్తారని, దీనిపై పౌరహక్కుల సంఘాలు కూడా స్పందించాలని అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, గనులశాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు కిడారి పార్థ్దివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. స్వచ్ఛంద బంద్ పాడేరు: కిడారి మృతికి సంతాపంగా పాడేరుతోపాటు మన్యంలోని అన్ని ప్రాంతాల వర్తకులు తమ దుకాణాలు, షాపులు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించారు. సాయంత్రం అంత్యక్రియలు జరిగే వరకు పాడేరులో బంద్ వాతావరణం ఏర్పడింది. పట్టణ ప్రజలంతా కిడారి పార్థ్దివ దేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ప్రముఖుల నివాళి.. మావోయిస్టు కాల్పుల్లో మృతి చెందిన తమ అభిమాన నేత కిడారి సర్వేశ్వరరావు పార్థ్దివ దేహాన్ని సోమవారం పాడేరులో పలువురు ప్రముఖులు, ప్రజలు సందర్శించి నివాళి అర్పించారు. అరకులో శవ పరీక్షలు ముగిసిన అనంతరం కిడారి భౌతికకాయాన్ని పాడేరులోని ఆయన క్యాంపు కార్యాలయానికి తరలించారు. కడసారి చూపు కోసం మన్యం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, బంధువులు, అధికారులు, ఉద్యోగ వర్గాలు, రాజకీయ పార్టీల నేతలు తరలి వచ్చారు. నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు మంత్రుల పరామర్శ.. కిడారి భార్య పరమేశ్వరి, పిల్లలు నాని, సందీప్, తనిష్క, కుటుంబ సభ్యుల్ని రాష్ట్ర మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, సుజయకృష్ణ రంగారావు, జవహర్, నక్కా ఆనందబాబు పరామర్శించి ఓదార్చారు. మాజీ మంత్రులు మత్స్యరాస బాలరాజు, మణికుమారి, జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని, అనకాపల్లి ఎంపీ ఎం.శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ పీజీవీఆర్ నాయుడు, ఎమ్మెల్సీలు మాధవ్, గుమ్మడి సంధ్యరాణి, పప్పల చలపతిరావు, గాదె శ్రీనివాసులునాయుడు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, అనిత, గిడ్డి ఈశ్వరి, బండారు సత్యనారాయణ, పీలా గోవింద సత్యనారాయణ, వాసుపల్లి గణేష్‌కుమార్, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సృజన, జీసీసీ ఎండీ బాబురావు నాయుడు, ఐటీడీఏ పీవో డి.కె. బాలాజీ, అడిషనల్ డిజిలు హరిష్‌రావు గుప్తా, వెంకటేశ్వర్లు, డిఐజి శ్రీకాంత్, శ్రీకాకుళం ఎస్పీ త్రివిక్రమ్ వర్మ, పాడేరు, నర్సీపట్నం ఏఎస్పీలు అమిత్‌బర్దర్, ఆరిఫ్ హఫీజ్‌లు కిడారి పార్థ్దివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ఏజెన్సీలోని వివిధ ప్రాంతాల ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం, వైఎస్ఆర్పార్టీ, బీజేపీల నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు, అధిక సంఖ్యలో హజరయ్యారు. సివేరి సోమకు కన్నీటి వీడ్కోలు అరకులోయ: అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల మృతదేహాలకు స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో సోమవారం ఉదయాన్నే పోస్టుమార్టం నిర్వహించి భౌతికకాయాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోమ మృతదేహాన్ని అరకులోయ పట్టణంలోని క్యాంపు కార్యాలయానికి తరలించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మంత్రులు, అధికారులు మృతదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భౌతికకాయాన్ని వీధుల్లో ఊరేగించి ప్రాంతీయ ఆస్పత్రి సమీపంలోని శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టారు. బొర్రా గుహలు మూత అనంతగిరి(అరకులోయ): ప్రముఖ పర్యాటక కేందం బొర్రాగుహలు సోమవారం మూతపడ్డాయి. అనంతగిరి, కాశీపట్నం, డముకు, ములియగుడ ప్రాంతాలల్లో స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ఆయా ప్రాంతాల్లోని వారంతా అభిమాన నాయకుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పెద్దఎత్తున అరకులోయ, పాడేరు తరలి వెళ్లారు. -
భయం గుప్పెట్లో పాలకపార్టీ నేతలు
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బితుకుబితుకుమంటున్నారు. ఇన్నాళూŠల్ మన్యంలో ఉంటున్న నేతలే ఆందోళన చెందేవారు. ఇప్పుడు అధికార పార్టీ నేతలు కొందరిని దళసభ్యులు టార్గెట్ చేసినట్టు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారంతో మైదానంలో ఉన్నవారూ తీవ్ర భయాదోళనలు చెందుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని వీరిని పోలీసులు కూడా హెచ్చరించడంతో మరింతగా కలవరపడుతున్నారు. ఎమ్మెల్యే కిడారి పార్టీ ఫిరాయించిన నాటి నుంచి మావోయిస్టులు అతనిపై గుర్రుగా ఉన్నారు. ఏజెన్సీలోని మరో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కూడా కన్నెర్ర చేస్తున్నట్టు సమాచారం. ఆమెను కూడా మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు గత ఏప్రిల్‌లో ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. 2004లో మంత్రి మణికుమారి భర్త వెంకట్రాజును కూడా పలుమార్లు హెచ్చరించి ఆ తర్వాత పాడేరులో పట్టపగలే మావోయిస్టులు హతమార్చారు. గతంలో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సోదరుడు శ్రీను గొలుగొండ మండలం జోగంపేట వద్ద మావోయిస్టులు హత్య చేశారు. కొన్నాళ్ల నుంచి నర్సీపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న లేటరైట్ తవ్వకాల్లో భాగస్వామ్యం ఉందంటూ అయ్యన్న తనయుడిని కూడా మావోయిస్టుల పేరిట హెచ్చరికలు వచ్చాయి. ఇలా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల లక్ష్యంగా మావోయిస్టులు గురిపెడుతుండడంతో వారిలో తీవ్ర కలవరం రేకెత్తుతోంది. -
మహిళా మావోయిస్టు నాయకత్వంలో తొలి ఆపరేషన్!
సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టు ఉద్యమ చరిత్రలో పూర్తిగా ఓ మహిళ నాయకత్వంలో ఆపరేషన్ నిర్వహించడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. గతంలో ఎక్కడ ఏ ఆపరేషన్ నిర్వహించాలన్నా కేంద్ర కమిటీ లేదా జోనల్, ఏరియా కమిటీ బాధ్యుల నాయకత్వంలోనే జరిగేవి. అందులో పాల్గొనే మావోయిస్టుల్లో కూడా ఎక్కువమంది పురుషులే ఉండేవారు. మహిళా మావోయిస్టులు ఉన్నా నేరుగా వారే ఆపరేషన్‌లో పాల్గొన్న ఘటనలు లేవనే చెప్పాలి. మావోయిస్టు ఆపరేషన్‌లో 150 మంది! తాజా ఘటనలో పాల్గొన్న వారిలో 90 శాతం మంది మహిళా మావోయిస్టులేనని ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని బట్టి తెలుస్తోంది. ఘటనలో 60 నుంచి 70 మంది పాల్గొన్నట్టు చెబుతున్నప్పటికీ ఈ ఆపరేషన్‌లో సుమారు 150 మందికి ఉన్నట్టు సమాచారం. వీరంతా గ్రూపులుగా విడిపోయి కదలికలను పసిగట్టేందుకు వేర్వేరు ప్రాంతాల్లో మోహరించినట్టు సమాచారం. ఆజాద్ సోదరి అరుణ నేతృత్వం 2015లో కొయ్యూరు ఎన్కౌంటర్లో పోలీసుల చేతిలో హతమైన మావోయిస్టు అగ్రనేత అజాద్ సోదరి అరుణ అలియాస్ వెంకట రవి చైతన్య ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలను బట్టి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను దగ్గరి నుంచి కాల్చింది కూడా అరుణగానే భావిస్తున్నారు. అరుణ ఈ ఘటనలో క్రియాశీలకంగా వ్యవహరించిందని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. సుదీర్ఘకాలం పాటు మావోయిస్టు ఉద్యమంలో ఉన్న ఆమె పలు ఆపరేషన్స్‌లో పాల్గొన్నప్పటికీ నేరుగా ఆపరేషన్‌కు నాయకత్వం వహించింది మాత్రం ఇదే మొదటిసారని చెబుతున్నారు. -
మన్యంలో మళ్లీ అలజడి
కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఏజెన్సీలో మళ్లీ తుపాకుల మోత మోగింది. అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావు, అదే స్థానం నుంచి గతంలో గెలిచిన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ఆదివారం నక్సలైట్ల తుపాకి గుళ్లకు బలయ్యారు. తెలుగుదేశం ఆధ్వర్యంలో జరిగే గ్రామదర్శిని సభలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆ ఇద్దరినీ దాదాపు 65మందికిపైగా నక్సలైట్లు అడ్డగించి అతి సమీపం నుంచి కాల్చిచంపారు. 2016 అక్టోబర్‌లో ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో దాదాపు 30మంది మావోయిస్టులు, గ్రేహౌండ్స్ కమాండర్ ఒకరు మరణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులుండేవి. హత్యలు, ఎన్కౌంటర్లు, మందుపాతర పేలుళ్లతో అది అట్టుడికేది. కానీ విభజన తర్వాత 2016 నాటి ఎన్కౌంటర్ ఉదంతం మినహా చెప్పుకోదగిన ఘటన చోటుచేసుకోలేదు. అయితే అలాగని ఆ ప్రాంతం నక్సలైట్ల ప్రభావం నుంచి పూర్తిగా బయటపడలేదు. అడపా దడపా వారి కార్యకలాపాల జాడ కనబడుతూనే ఉంది. పైగా మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి విలీన వారో త్సవాలు మొదలయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అంతేగాక కిడారి నిర్వహిస్తున్న మైనింగ్ వ్యాపారంపైనా, ఆయన నడుపుతున్న క్వారీపైనా మావో యిస్టులు హెచ్చరిస్తున్నారని చెబుతున్నారు. ఈ కారణం వల్లనే తాను గ్రామదర్శిని సభకు వెళ్లలేనని కిడారి చెప్పినా చంద్రబాబు వెళ్లితీరాలని ఆదేశించారని, చివరకు ఈ దారుణం చోటుచేసుకున్నదని అంటున్నారు. కనీసం ఏజెన్సీలో పోలీసు నిఘా సక్రమంగా ఉన్నా వారిద్దరూ క్షేమంగా తిరిగి రాగ లిగేవారు. ఇది లేదు సరిగదా... వారు పోలీసులకు సమాచారం అందించకుండా వెళ్లారని హోం మంత్రి చిన రాజప్ప అంటున్నారు. కానీ తాము బందోబస్తు కల్పించాలని స్థానిక పోలీసులను కోరా మని, కానీ వారు పట్టించుకోలేదని కిడారి వ్యక్తిగత సహాయకుడు చెబుతున్నారు. ఇలాంటి సమ యాల్లో హోంమంత్రి స్థాయి నాయకుడు అన్నివైపుల నుంచీ సమాచారం తెలుసుకుని మాట్లాడాలి. కానీ ఆయన పోలీసులిచ్చిన ప్రకటన చదివి చేతులు దులుపుకున్నారని అర్ధమవుతోంది. వీరిద్దరి హత్య తర్వాత స్థానికంగా ఏ స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులున్నాయో ఆయనకు తెలియనిది కాదు. నక్సలైట్ల ఘాతుకం గురించి ఫోన్లో సమాచారం ఇస్తే, అక్కడి నుంచి మృతదేహాలను మీరే తీసు కురండని ఒక ఎస్ఐ సలహా ఇచ్చారని కిడారి అనుచరుడొకరు చెబుతున్నారు. నాలుగు గంటల పాటు వారి మృతదేహాలు ఘటనాస్థలి వద్దే ఉండిపోయాయి. చివరకు అనుచరులే వాటిని తీసు కెళ్లాల్సివచ్చింది. పోలీసులు చూపిన ఈ నిర్లక్ష్య వైఖరికి ఆగ్రహించి కిడారి, సోమ అభిమానులు రెచ్చిపోయి అరకు, డుంబ్రిగూడ పోలీస్స్టేషన్లపై దాడి చేశారు. భారీ విధ్వంసం సృష్టించారు. రికా ర్డులు, వాహనాలు కాలిబూడిదయ్యాయి. పోలీసులు ప్రాణభయంతో పరుగులు తీయాల్సి వచ్చింది. కిడారి సర్వేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిచి ఏడాదిక్రితం తెలుగుదేశంలోకి ఫిరాయించారు. అధికార పార్టీలో చేరి, ఆ పార్టీ ఆదేశాలతో ఒక సభ నిర్వహించడానికెళ్తున్న ఎమ్మెల్యే మాటకే అక్కడ దిక్కులేని స్థితి ఉన్నదంటే చంద్రబాబు పాలన ఎంత అస్తవ్యస్థంగా సాగుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. నక్సలైట్లు చీకటి మాటున ఈ దాడి చేయలేదు. మిట్ట మధ్యాహ్నం ప్రధాన రహదారి పక్కనే కాపుగాశారు. అది మరీ మారుమూల ప్రాంతమేమీ కాదు. సెల్‌ఫోన్ టవర్లకు సమీపంలోనే ఘటనా స్థలి ఉంది. ఎలాంటి సమాచారాన్నయినా క్షణాల్లో బయటి ప్రపంచానికి చేరేయటం చాలా సులభం. కానీ నక్సలైట్ల దాడి తర్వాత అరగంటకుగానీ పోలీసులకు ఆ సంగతి తెలియలేదు. ఇంకా విచిత్రమేమంటే దాడికి పాల్పడినవారు నలుగురైదుగురు కాదు... వారు భారీ సంఖ్యలో ఉన్నారు. పైగా వారంక్రితమే వారంతా పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా నుంచి వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇంతమంది ఏజెన్సీలో ప్రవేశించినా నిఘా వర్గాలకు సమాచారం లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణంగా నక్సలైట్లు ఏదైనా వారోత్సవాలకు పిలుపునిచ్చినప్పుడు పోలీసులు ఏజెన్సీ ప్రాంతాన్ని జల్లెడ పడతారు. కానీ ఈసారి అలా జరగలేదు సరిగదా నిఘా సైతం లేదు. కనీసం మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు గనుక, అటువైపు వెళ్లొద్దని ప్రజా ప్రతినిధులకైనా సూచనలివ్వలేదు. ఇటీవలికాలంలో అధికారంలో ఉంటున్నవారు నిఘా వ్యవస్థలను ప్రతిపక్షాలపై నిఘా ఉంచేం దుకు వాడుకుంటూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. చంద్రబాబు దీన్ని మరింతగా దిగజా ర్చారు. పొరుగునున్న తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీకి ఎక్కడెక్కడ గెలిచే అవకాశాలున్నాయో ఆరా తీసేందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థను అక్కడికి తరలించారు. కొన్నేళ్లక్రితం తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించి ఆయన భంగ పడ్డారు. ఆయన సన్నిహితుడు రేవంత్‌రెడ్డి డబ్బు సంచులతో పోలీసులకు దొరికిపోయారు. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేతో బాబు సంభాషణల ఆడియో బయటికొచ్చింది. తెలంగాణ పోలీసులు ఇంత పెద్ద ఆపరేషన్ నిర్వహిస్తే మీరేం చేస్తున్నారని అప్పట్లో బాబు ఇంటెలిజెన్స్ విభాగంపై విరుచుకుపడ్డా రని కథనాలు వెలువడ్డాయి. బహుశా ఆ కారణం వల్ల ఈసారి ఇంటెలిజెన్స్ సిబ్బంది మొత్తం తెలం గాణలో మోహరించినట్టు కనబడుతోంది. ఇలాంటి అధ్వాన్నమైన పరిస్థితుల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడంలో ఆశ్చర్యమేముంది? నక్సలైట్ల దాడి అనంతరం ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర స్థాయిలో గాలింపు మొదలైంది. అయితే ఇదంతా జాగ్రత్తగా సాగాలి. అమాయకు లైన గిరిజనులను వేధించకుండా దాడికి కారకులైనవారిని పట్టుకోవటంపైనే దృష్టి సారించాలి. అలాగే గిరిజనుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్న మైనింగ్ కార్యకలాపాలు మూతబడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే నక్సలైట్ల కార్యకలాపాలను నివారించటం సాధ్యం. -
అరకు ఘటనతో అప్రమత్తం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులు ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను కాల్చి చంపిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, ఉద్యమంలో అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టులు, వారి కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లపై మళ్లీ నిఘా ముమ్మరం చేశారు. మావోయిస్టు పార్టీ ఉద్యమాలకు ఒకప్పుడు గుండెకాయలాంటి ఉత్తర తెలంగాణలో పూర్వవైభవం కోసం మావోయిస్టు పార్టీ ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే కమిటీల పునర్వ్యవస్థీకరణ, కొత్త కమిటీలకు శ్రీకారం చుట్టిందని ఇంటెలిజెన్స్ తాజాగా పోలీసులకు సమాచారం ఇచ్చింది. అప్రమత్తం చేసిన ఇంటెలిజెన్స్ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను విశాఖపట్నం జిల్లా దుంబ్రిగూడ మండలం పోతంగి గ్రామ పంచాయతీ లివిటిపుట్టులో ఆదివారం మధ్యా హ్నం మావోయిస్టులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ పోలీసులను అప్రమత్తం చేసింది. పాత కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసు బాస్ మహేందర్‌రెడ్డి కూడా ఈ జిల్లాల పోలీసు అధికారులతో మాట్లాడి పరిస్థితులపై ఆరా తీసినట్లు తెలిసింది. కొత్తగా కమిటీలు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీలను పునరుద్ధరించిన సంగతిని కూడా ఇంటెలిజెన్స్ సంబంధిత అధికారులకు సూచించింది. పూర్వ కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన జిల్లాలను కలుపుకొని ఈ కమిటీలు వేసినట్లు పోలీసువర్గాలు నిర్ధారించాయి. పెద్దపల్లి–కరీంనగర్–భూపాలపల్లి జయశంకర్–వరంగల్ జిల్లాలు కలిపి ఓ డివిజన్ కమిటీ కాగా, ఆ కమిటీకి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ కింద ఏటూరునాగారం–మహదేవ్పూర్ ఏరియా కమిటీ, ఇల్లెందు–నర్సంపేట ఏరియా కమిటీలు వేయగా, ఆ కమిటీలు సుధాకర్, కూసం మంగు అలియాస్ లచ్చన్నలు ఏరియా కమిటీ కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నారు. మంచిర్యాల– కొమురంభీం (ఎం.కె.బి.) డివిజనల్ కమిటీకి ఇంతకుముందు ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా ఉన్న మైలారపు ఆదెల్లు అలియాస్ భాస్కర్‌కు నాయకత్వం అప్పగించారు. ఇంద్రవల్లి ఏరియా కమిటీ, మంగి ఏరియా కమిటీ, చెన్నూర్–సిర్పూర్ ఏరియా కమిటీలు ఏర్పాటైనట్లు పోలీసులకు పక్కా సమాచారం అందించారు. భద్రాద్రి కొత్తగూడెం– తూర్పుగోదావరి డివిజనల్ కమిటీ కొత్తగా ఏర్పడగా, ఈ కమిటీకి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ కార్యదర్శిగా ఉన్నారు. ఈ కమిటీ కింద చర్ల–శబరి ఏరియా కమిటీ, లోకే సారమ్మ అలియాస్ సుజాత నేతృత్వంలో మణుగూరు ఏరియా కమిటీ, కుంజా లక్ష్మణ్ అలియాస్ లచ్చన్న నేతృత్వంలో స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. అలాగే చర్ల–శబరి ఏరియా కమిటీ కింద మడకం కోసీ అలియాస్ రజిత నేతృత్వంలో చర్ల లోకల్ ఆర్గనైజింగ్ స్క్వాడ్, ఉబ్బ మోహన్ అలియాస్ సునిల్ నేతృత్వంలో శబరి లోకల్ ఆర్గనైజిగ్ స్క్వాడ్లు పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలం గాణలోనూ దాడుల కోసం మావోయిస్టులు అదను కోసం చూసే అవకాశం లేకపోలేదని, గతంలో హిట్‌లిస్టులో ఉన్న రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. గతంలో హెచ్చరికలు ఉన్న ప్రజాప్రతినిధులు ఒంటరిగా తిరగొద్దని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో దాడులకు పాల్పడే అవకాశం లేకపోలేదని, గతంలో టార్గెట్లుగా ప్రకటించిన వారిని అప్రమత్తం చేస్తున్నారు. సరిహద్దుల్లో జల్లెడ సాక్షి, కొత్తగూడెం: ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమను మావోయిస్టులు కాల్చి చంపడంతో సరిహద్దుల్లో బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో దండకారణ్యాన్ని అణువణువూ జల్లెడ పట్టేందుకు హైదరాబాద్ నుంచి భారీగా అదనపు బలగాలను దించారు. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో నుంచి ఈ బలగాలు దండకారణ్యంలోకి చేరుకున్నాయి. ఎన్నికల నేపథ్యంలో సరిహద్దుల్లో ఉన్న భద్రాచలం, పినపాక, ములుగు, మంథని భూపాలపల్లి నియోజకవర్గాలకు చెందిన రాజకీయ నాయకులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మావోయిస్టులు పలువురు నేతలపై రెక్కీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు నెలల క్రితం మంథని ఎమ్మెల్యే పుట్టా మధుకు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. ఏవోబీ రాష్ట్ర కమిటీ నేతృత్వంలోనే అరకు దాడి! ఆంధ్రా ఒడిశా సరిహద్దు రాష్ట్ర కమిటీ నేతృత్వంలో అరకు ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న, రాష్ట్ర మిలటరీ కార్యదర్శి ప్రతాపరెడ్డి అలియాస్ చలపతి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఉదయ్ అలియాస్ గాజర్ల రవి, బెల్లి నారాయణస్వామి, చెల్లూరి నారాయణస్వామి అలియాస్ సోమన్న, అరుణల ఆధ్వర్యంలో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. -
మావోయిస్టులను గుర్తించిన పోలీసులు
-
అరకు దాడిలో పాల్గొన్న మావోయిస్టులు వీరే..
సాక్షి, విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చిన మావోయిస్టులలో ముగ్గురిని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వారు సోమవారం వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. కిడారి, సోమలపై దాడిలో పాల్గొన్న వారు ఎవరనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికుల సాయంతో ముగ్గురు మావోయిస్టులను గుర్తించిన పోలీసులు వారికి సంబంధించిన వివరాలతో పాటు ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. అంతేకాకుండా జిల్లా పోలీసులు, ప్రత్యేక బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ తెలియజేశారు. కాగా, డుంబ్రిగుడ మండలం తొట్టంగి వద్ద కిడారి, సోమలపై దాడి జరిపిన వారిలో సాయుధులైన మహిళా మావోయిస్టులే ఎక్కువగా ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాలు: 1. వెంకట రవి చైతన్య అలియాస్ అరుణ, గ్రామం కరకవానిపాలెం, మండలం పెందుర్తి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 2. కామేశ్వరి అలియాస్ స్వరూప, సీంద్రి చంద్రి, రింకీ- భీమవరం టౌన్, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్ 3. జలమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్, రైనో - గ్రామం దబ్బపాలెం, అడ్డతీగల పోలీసు స్టేషన్ పరిధి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్ -
కిడారి, సోమ అంత్యక్రియలు పూర్తి
పాడేరు/అరకులోయ/పాడేరు/డుంబ్రిగుడ/పెదవాల్తేరు: విశాఖ మన్యంలో మావోయిస్టులు కాల్చి చంపిన ప్రభుత్వ విప్, అరుకు శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు, మాజీ శాసనసభ్యుడు సివేరి సోమ అంత్యక్రియలు సోమవారం అధికార లాంఛనాలతో ముగిశాయి. అరకులోని ప్రాంతీయ ఆస్పత్రిలో సోమవారం ఉదయం వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. పాడేరులో కిడారి సర్వేశ్వరరావుకు, అరకులో సోమకు అనుచరులు, బంధువులు కన్నీటి మధ్య అంత్యక్రియలు పూర్తిచేశారు. తొలుత కిడారి భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి పాడేరు వీధుల్లో అంతిమయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో మాజీ మంత్రులు మత్స్యరాస బాలరాజు, మణికుమారి, ఎంపీ శ్రీనివాసరావు, జిల్లా ఎమ్మెల్యేలు, మందకృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు. పాడేరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో పట్టుపరిశ్రమశాఖ ప్రదర్శన క్షేత్రం వద్ద ప్రభుత్వ స్థలంలో కిడారి భౌతికకాయానికి పోలీసులు గౌరవవందనం చేశారు. మంత్రులు చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, సుజయకృష్ణ రంగారావు, జవహర్, నక్కా ఆనందబాబు, కళావెంకటరావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కిడారి భార్య పరమేశ్వరి, పిల్లలు నాని, సందీప్, తనిష్క, ఇతర కుటుంబ సభ్యులను మంత్రులు ఓదార్చారు. అంత్యక్రియల్లో జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, వైఎస్సార్సీపీ, బీజేపీ, టీడీపీ నేతలు పాల్గొని కిడారి మృతదేహానికి నివాళులు అర్పించారు. సోమకు తుది వీడ్కోలు పోస్టుమార్టం అనంతరం సోమ మృతదేహాన్ని ఆయన క్యాంపు కార్యాలయానికి తరలించారు. తొలుత హెలికాప్టర్లో అరకు చేరుకున్న మంత్రులు సోమ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సోమ కుటుంబసభ్యులను పరామర్శించారు. మందకృష్ణ మాదిగ, కారెం శివాజి, అరకులోయ వైఎస్సార్సీపీ సమన్వయకర్త శెట్టి పాల్గుణ తదితరులు సోమ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం భౌతికకాయాన్ని పురవీధుల్లో ఊరేగించి స్థానిక ప్రాంతీయ ఆస్పత్రి సమీపంలోని శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. భద్రతా వైఫల్యాలపై విచారణ: చినరాజప్ప ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటనలో భద్రతాపరమైన వైఫల్యాలపై ఉన్నతాధికారులతో విచారణ జరిపిస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. పాడేరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజన నాయకుల్ని మావోయిస్టులు చంపడం విచారకరమని, ఉనికిని చాటుకోవడానికే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. నాయకుల్ని కాపాడే బాధ్యత పోలీసులపై ఉందన్నారు. డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద కిడారి, సోమలను మావోలు చంపిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, ఇంటిలిజెన్స్ డీసీపీ ఫకీరప్ప సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉనికిని చాటుకోవడానికి, పోలీసులపై ప్రతీకార చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోలు చంపారన్నారు. ఒడిశా రాష్ట్రం నందపూర్ కమిటీ దళ సభ్యులు ఈ సంఘటనకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. కూంబింగ్ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యక్ష సాక్షుల ద్వారా వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. కాగా, శర్మ, ఫకీరప్ప అరకులోయ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంఘటన స్థలానికి బైక్‌పై వెళ్లారు. ఎస్సై సస్పెన్షన్.. విశాఖ ఏజెన్సీలోని డుంబ్రిగుడ సబ్ఇన్స్పెక్టర్ వై.అమ్మనరావుని సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో వైఫల్యం కారణంగా ఎస్ఐని సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు. ముగ్గురు మావోల గుర్తింపు సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలను కాల్చి చంపిన మావోయిస్టుల్లోని ముగ్గురిని పోలీసులు గుర్తించారు. ప్రత్యక్ష సాక్షులు గుర్తుపట్టిన ఆ ముగ్గురు మావోల ఫొటోలు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ మీడియాకు విడుదల చేశారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల పోలీస్‌స్టేషన్ పరిధి దబ్బపాలెం గ్రామానికి చెందిన జలుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్ అలియాస్ రైనో, పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్ స్వరూప అలియాస్ సింద్రి, అలియాస్ రింకి, విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం గ్రామానికి చెందిన వెంకటరవి చైతన్య అలియాస్ అరుణ ఉన్నారు. ప్రత్యక్ష సాక్షులు ఈ ముగ్గుర్ని గుర్తుపట్టారని, ఈ ఘటనలో పాల్గొన్న మిగిలిన వారిని కూడా త్వరలోనే గుర్తిస్తామని ఎస్పీ తెలిపారు. పోలీసులకు సమాచారం లేకుండా ఏజెన్సీలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు బయటకు వెళ్లరాదని, ముఖ్యంగా అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే భీమవరానికి చెందిన కామేశ్వరి ఈ కాల్పుల్లో పాల్గొనడం జిల్లాలో చర్చనీయాంశమైంది. నిజానికి కామేశ్వరిది శ్రీకాకుళం కాగా, భీమవరానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. వారు విడిపోయిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా గోకవరం బస్ డిపోలో కండక్టర్‌గా పనిచేసింది. 2008–09 సమయంలో మావోలతో పరిచయం అయ్యి వారితో కలసి వెళ్లినట్లు సమాచారం. -
మన్యంలో పేలిన మావో గన్స్
-
మంటలు రేపిన మారణకాండ
ఒక ప్రతీకారేచ్ఛ మారణకాండ సృష్టించింది.. ఆ మారణకాండకు నిరసనగా ఆగ్రహజ్వాల రగిలింది. అందాల అరకును అట్టుడికించింది.. మొత్తం మన్యాన్ని భయం గుప్పిట్లోకి నెట్టింది.నవ్యాంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా మావోయిస్టులు పంజా విసిరారు. అరకు టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి, అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోల తూటాలకు నేలకొరిగారు. స్థానికులు, నేతల అనుచరుల్లో అలజడిని, ఆగ్రహాన్ని రేపిన ఈ ఘటన.. అరకు, డుంబ్రిగుడ పోలీస్స్టేషన్లపై దాడికి, దహనానికి పురిగొల్పింది. అనూహ్యంగా జరిగిన మారణకాండ, దాడులు, విధ్వంసాలతో అరుకులోయ చివురుటాకులా వణికిపోయింది. ఈ మొత్తం ఘటనలో కిడారి, సివేరిల మృతదేహాలు నాలుగు గంటల పాటు సంఘటన స్థలంలోనూ.. మరో నాలుగు గంటలు వారి వాహనాల్లోనూ అనాథల్లా మిగిలిపోవడం స్థానికులను కలచివేసింది. సాక్షి విశాఖపట్నం/పాడేరు రూరల్/అరుకులోయ: విశాఖ మన్యం ఉలిక్కిపడింది. మావోయిస్టుల ఘాతుకంతో ఏవోబీ భీతిల్లింది. అధికారపార్టీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు, మాజీ ప్రజాప్రతినిధి సీవేరిసోమను కాల్చి చంపిన ఘటన ఏజెన్సీలో కలకలం రేపుతోంది. డుంబ్రిగుడ మండల కేంద్రానికి రెండు కిలోమీటర్లు దూరంలోని పోతంగి పంచాయతీ లివిటిపుట్టులో జరిగిన ఈ ఘటనతో ఏవోబీ ఉలిక్కిపడింది. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను ఆదివారం మధ్యాహ్నం 12.20గంటల సమయంలో మావోయిస్టులు దారుణంగా కాల్చిచంపారు. వీరిద్దరినీ అతి దగ్గరగా కాల్చిచంపడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. డుంబ్రిగుడ మండలం లివిటి పుట్టు వద్ద మావోలు ఈ దాడికి పాల్పడ్డారు. అరకు నుంచి డుంబ్రిగుడ, గుంటసీమ రోడ్డు మీదుగా కండ్రుం పంచాయతీకి కార్యకర్తలు, అనుచరులు సహా మూడు వాహనాల్లో బయలు దేరిన కిడారివాహనాల్ని ముందుగానే మాటువేసిన40 మంది మహిళలు సహా 70 మంది సాయుధదళం కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల అడ్డగించి మార్గమధ్యంలోనే మట్టుబెట్టారు. ఉదయం 11 గంటలక వరకూ అరకులోనే ఉన్న కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమతో కలిసి లివిటి పుట్టు గ్రామానికి క్షేత్ర స్థాయి పరిశీలనకు బయలుదేరి వెళ్లారు. గ్రామ సమీపంలో మార్గమధ్యంలో వాహనాలపై ఒక్కసారిగా మావోలు అడ్డగించారు. ఎమ్మెల్యే గన్మెన్ల వద్ద నుంచి తుపాకీలు, సెల్ఫోన్లు లాక్కొని వారిని దూరంగా పంపించేశారు. అనంతరం వారంతా చూస్తుండగానే చూస్తుండగానే ఎమ్మెల్యే కిడారిని, మాజీ ఎమ్మెల్యే సోమకు చేతులు కట్టికొద్ది దూరం ముందుకు తీసుకువెళ్ళి అరమ–గుంటసీమ జంక్షన్ వద్ద నిలిపివేశారు. ఇటీవల చోటు చేసుకున్న పలు అంశాలపై ఎమ్మెల్యే కిడారితో కొద్ది సేపు చర్చించారు. గూడ క్వారీ పర్యావరణాన్ని దెబ్బదీస్తున్నందున మూసెయ్యాలని గతంలో పలు మార్లు హెచ్చరించినా ఎందుకు నడిపిస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భయంతో వణికిపోయిన కిడారి.. ఈ ఒక్కసారికీ క్షమించాలంటూ వేడుకున్నా.. మావోలు వినిపించుకోకుండా కాల్చిచంపారు. పక్కనే ఉన్న మాజీ ఎమ్మెల్యే సోమ ఈ దృశ్యాన్ని చూసి భీతావహుడై పారిపోయేందుకు ప్రయత్నించగా ఆయన్ని కూడా మట్టు బెట్టారు. అనంతరం గాల్లోకి కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి మావోయిస్టులు వెళ్లిపోయారు. అట్టుడికిన అరకు ఘటనతో అభిమానులు, కుటుంబ సభ్యులు, అనుచరుల ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్లకు తరలివచ్చారు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘాతుకం అంటూ సీఐపై మండిపడ్డారు. మూడు రోజుల నుంచి మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు జరుగుతున్నా ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అరకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లపై దాడికి తెగబడ్డారు. రాళ్లు రువ్వి, లోపల ఉన్న ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలను పగులగొట్టడంతోపాటు లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర రికార్డులు, బయట ఉన్న మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలను కూడా ధ్వంసం చేశారు. అనంతరం వాహనాలకు, స్టేషన్లకు నిప్పుపెట్టారు. పోలీసులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. రాత్రి వరకు ఈ రెండు స్టేషన్లలోనూ మంటలు అదుపులోనికి రాలేదు. వాహనాలు దగ్ధమవుతూ పెద్ద ఎత్తున శబ్ధాలు రావడంతో జనం దూరంగా వెళ్లిపోయారు. పోలీసుల వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మృతదేహాల తరలింపులోనూ కొద్దిసేపు హైడ్రామా నడిచింది. దీంతో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు, కిడారి, సోమ అభిమానులు, కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులయ్యారు. అంతటా విషాదం పాడేరు: అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు మావోయిస్టుల తూటాలకు బలవ్వడంతో మన్యమంతటా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఈ వార్త అంతటా దావానంలా వ్యాపించింది. వారి బంధువులు, అభిమానులు, వివిధ గిరిజన వర్గాలు, ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. కన్నీటి పర్యంతమయ్యారు. అనూహ్య మరణం పట్ల తీవ్ర దిగ్రాంతిని వ్యక్తం చేశారు. టీడీపీ వర్గాల్లో తీవ్ర ఆందోళన, అలజడి వ్యక్తమవుతోంది. పాడేరులోని సర్వేశ్వరరావు క్యాంపు కార్యాలయం వద్ద, సతీమణి పరమేశ్వరి స్వగ్రామమైన పట్టణంలోని గొందూరు కాలనీలో విషాదం చోటుచేసుకుంది. సర్వేశ్వరరావు క్యాంపు కార్యాలయం వద్ద ఆయన చిత్రపటం ఉంచి బంధువులు నివాళి అర్పించారు. పలువురు మహిళలు కంటతడి పెట్టుకున్నారు. కొందరు సంఘటన స్థలానికి తరలివెళ్లారు. కుగ్రామం నుంచి ప్రభుత్వ విప్ వరకు పాడేరు: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుది ఓ కుగ్రామం. పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ నడిమివాడలో నిరుపేద కుటుంబంలో పుట్టారు. జి.మాడుగుల మండలం కిల్లంకోటలో ఉండేవారు. చిన్నప్పుడే పెళ్లయింది. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యాపారం పట్ల మక్కువ చూపేవారు.1990లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి మంత్రి కొణతాల రామకృష్ణకు మంచి నమ్మకస్తుడిగా ఉండేవారు. వైఎస్సార్ హయాంలో ఎమ్మెల్సీ పదవి వరించింది. రెండేళ్లపాటు పదవిలో కొనసాగారు. వైఎస్సార్ మరణం తరువాత వైఎస్సార్సీపీ అరకు సమన్వయకర్తగా వ్యవహరించి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2016 ఏప్రిల్ 28న టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ విప్‌గా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్నారు. పోలీస్స్టేషన్లకు నిప్పు.. అరకులోయ: ఇదే సమయంలో రెండు మృతదేహాలు వాహనాల్లో ఈ స్టేషన్ల వద్దకు వచ్చేసరికి వారి అనుచరులు, అభిమానులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఒక్కసారిగా పక్కపక్కనే ఉన్న అరకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లపై దాడికి తెగబడ్డారు. వీరంతా రాళ్లు రువ్వి, లోపల ఉన్న ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలను పగులగొట్టడంతోపాటు లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర రికార్డులు, బయట ఉన్న మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలను కూడా ధ్వంసం చేశారు. రాత్రి వరకు ఈ రెండు స్టేషన్లలోనూ మంటలు అదుపులోనికి రాలేదు. వాహనాలు దగ్ధమవుతూ పెద్ద ఎత్తున శబ్ధాలు రావడంతో జనం దూరంగా వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఈ రెండు స్టేషన్లకు పక్కనే విద్యుత్ ట్రాన్స్పార్మర్లు ఉండడంతో ముందుస్తుగా ఎలాంటి ప్రమాదం జరగకుండా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగుతున్న విషయాన్ని తెలుసుకున్న కొందరు పోలీసులు వెనుక నుంచి వచ్చి ఒక భవనంలో ఉన్న ఏపీఎస్పీ బెటాలియన్‌కు చెందిన బ్యాగులు, తుపాకులను తీసుకుని బయటకు వచ్చారు. లేకుంటే తుపాకులు కూడా కాలిపోయే పరిస్థితి ఉండేది. సీఆర్పీఎఫ్ ముట్టడిలో అరకు.. రూరల్ ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులు అంత అరకులోయలోని పరిస్థితిని సమీక్షించారు. దీంతో జిల్లాలోని అందుబాటులో ఉన్న సీఎర్పీఎఫ్ బలగాలను అరకులోయ ప్రాంతానికి హుటాహుటిన తరలించారు. బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. అరకులోయలో పలు ప్రధాన జంక్షన్ల వద్ద సీఆర్పీఎఫ్ దళాలు పహరా కాస్తున్నాయి. అరకులోయలోనే పోస్టుమార్టం డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతదేహాల పోస్టుమార్టానికి అరకులోయ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఏర్పాట్లు చేస్తున్నారని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ తెలిపారు. పోస్టుమార్టానికి మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తీసుకొస్తున్నారన్న సమాచారంతో మెయిన్ గేట్ నుంచి మార్చురీ వరకు అడుగడుగునా పోలీసులు మోహరించారు. మధ్యాహ్నాం 3 గంటలకే పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. వారితో పాటు సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి పోస్టుమార్టానికి ఏర్పాట్లు చేశారు. అయితే మృతదేహాలను అక్కడి నుంచి తీసుకురానివ్వకుండా అభిమానులు, ప్రజలు అడ్డుకోవడంతో అరకులోయ ఏరియా ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహిస్తారని డాక్టర్ అర్జున్ ‘సాక్షి’కి తెలిపారు. -
పోలీసులకు సమాచారం ఇవ్వలేదా? చెప్పినా వినలేదా!
సాక్షి, విశాఖపట్నం: అరకు శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు డుంబ్రిగుడ మండలంలోని లివిటిపుట్టు గ్రామదర్శిని కార్యక్రమానికి వెళ్తున్నట్టు పోలీసులకు సమాచారం ఇవ్వలేదా? అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. వాస్తవానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులు ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లాలంటే ముందుగా పోలీసులకు సమాచారమిస్తారు. అందుకు అవసరమైన బందోబస్తును పోలీసులు సమకూరుస్తారు. ఈనెల 21 నుంచి మావోయిస్టులు విలీన వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ తమకు సమాచారం లేకుండా ఎక్కడకూ వెళ్లవద్దని పోలీసులు ముందుగానే స్పష్టం చేశారు. అయినప్పటికీ కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలు మారుమూలన ఉన్న లివిటిపుట్టు గ్రామదర్శిని కార్యక్రమానికి ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్యే సర్వేశ్వరరావుకు ఇద్దరు గన్మెన్లు, సోమకు ఒక గన్‌మెన్ ఉన్నారు. వీరిని వెంటబెట్టుకుని గ్రామదర్శినికి పయనమయ్యారు. అరకు నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో లివిటిపుట్టు గ్రామం చేరువలోకి వెళ్లేసరికి ఇదే అదనుగా సాయు«ధులైన మావోయిస్టులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సోమలను హతమార్చారు. భారీ సంఖ్యలో ఉన్న సాయుధ మావోయిస్టుల ముందు కేవలం ముగ్గురు గన్మెన్లు నిస్సహాయలయ్యారు. గన్మెన్ల నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు తమ వద్ద ఉన్న తుపాకులతో వారిద్దరిని కాల్చి చంపారు. సాయుధులైన తమకు ముందస్తు సమాచారం ఇచ్చివుంటే పోలీసు సిబ్బందిని పంపేవారమని పోలీసు అధికారులు చెబుతున్నారు. మావోయిస్టుల విలీన వారోత్సవాల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలన్న పోలీసుల సూచనలను పట్టించుకోకుండా వెళ్లి హతమవ్వడం జీర్ణించుకోలేకపోతున్నామని హోంమంత్రి చినరాజప్ప వ్యాఖ్యానించారు. -
ఎమ్మెల్యే హత్య ఇదే తొలిసారి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా చరిత్రలో మావోయిస్టులు శాసనసభ్యుడిని మట్టుబెట్టడం ఇదే ప్రథమం. ఆంధ్ర –ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో విశాఖ జిల్లా కూడా ఉంది. దీంతో వారి ప్రాబల్యం జిల్లాలో అధికంగానే కనిపిస్తుంది. తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అనుమానించిన వారిని దళసభ్యులు హతమారుస్తున్నారు. వీరిలో ఇన్ఫార్మర్ల నెపంతో కొందరిని, తమకు ప్రత్యర్థులుగా భావిస్తున్న పోలీసులు, మావోయిస్టులను, ప్రభుత్వానికి అనుకూలంగా, గిరిజనులకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని ప్రజాప్రతినిధులను వీరు చంపుతున్నారు. 1990లో అప్పటి చింతపల్లి ఎమ్మెల్యే పసుపులేటి బాలరాజు, ఐటీడీఏ పీవో దాసరి శ్రీనివాసులు, తదితరులను పీపుల్స్‌వార్ నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. జైలులో ఉన్న నక్సలైట్ నేత క్రాంతి రణదేవ్‌ను విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఈ కిడ్నాప్‌నకు అప్పట్లో పాల్పడ్డారు. దాదాపు నెల రోజుల అనంతరం ప్రభుత్వం క్రాంతి రణదేవ్‌ను విడుదలతో నక్సలైట్లు బాలరాజు, తదితరులను విడిచిపెట్టారు. అప్పట్లో నక్సల్స్ చెరలో ఉన్న వీరందరినీ హతమారుస్తారని అంతా ఆందోళన చెందారు. తాజాగా ఇప్పుడు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, అదే నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను కాల్చి చంపారు. ఇలా ఒక ఎమ్మెల్యేను, మరో మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు హతమార్చడం విశాఖ చరిత్రలో ఇదే తొలిసారి! కళ్లెదుట చంపేశారు.. ఎమ్మెల్యే కిడారి వద్ద కొంతకాలంగా పీఏగా పని చేస్తున్నాను. ఆదివారం కండ్రుం పంచాయతీ సర్రాయిలో పార్టీ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు వెళ్తున్న సమయంలో మావోయిస్టులు అడ్డగించారు. వాహనంలో ఉన్న ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు గన్మేన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, డ్రైవర్, నన్ను కిందకు దింపారు. ఎమ్మెల్యేతో మాట్లాడే పనుందంటూ కొంతదూరం తీసుకువెళ్ళారు. మమ్మల్ని ఇక్కడ నుంచి కదిలితే చంపేస్తామని తుపాకులు ఎక్కుపెట్టారు. కొంత సమయం తర్వాత అంతా చూస్తుండగానే ఎమ్మెల్యేను తుపాకితో కాల్చిచంపారు.– అప్పారావు, కిడారి పీఏ ఎస్ఐ బాధ్యత రాహిత్యం వల్లే..టీడీపీ కార్యకర్తల ఆరోపణ డుంబ్రిగుడ(అరకులోయ): తనిఖీల పేరిట అరకు రోడ్డులో హడావుడి చేసే డుంబ్రిగుడ ఎస్ఐ అమ్మనరావు మండలం శాంతి భద్రతలను పట్టించుకోక పోవడం దారుణం అంటూ టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఎస్ఐ బాధ్యత రాహిత్యం వల్లే సంఘటన చోటుచేసుకుందన్నారు. డుంబ్రిగుడ పోలీసు స్టేషన్‌పై దాడి చేసి ఆందోళన చేపట్టారు. ఎస్ఐను వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. అయ్యన్న దిగ్భ్రాంతి నర్సీపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోములను మావోయిస్టులు దారుణంగా హత్య చేయటంపై రోడ్లు భవనాలశాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంఘటనపై ఆయన స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో ఇటువంటి హత్యలు సరికాదన్నారు. ఇటువంటి ఘటనలు జరిగిన సందర్భంలో ప్రజలు సంయమనం పాటించాలన్నారు. కిడారి, సోమ హత్యలను ఖండించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎప్పటికప్పుడు సీఎంకు సమాచారం : కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన నేపథ్యంలో ఏజెన్సీ అంతటా అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అలాగే భారీ స్థాయిలో భద్రతా బలగాలను ఏజెన్సీకి పంపించామని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సమాచారన్ని ఎప్పటికప్పుడు సీఎం, సీఎస్‌తో మాట్లాడుతున్నామని సమాచారాన్ని వాళ్లికి అందిస్తున్నామని తెలిపారు. కాల్పులపై విచారణ చేపట్టునున్నట్లు విలేకరులకు తెలిపారు. కేడీపేటలో కొవ్వొత్తుల ర్యాలీ గొలుగొండ(నర్సీపట్నం): మావోయిస్టుల చర్యకు నిరసనగా కొయ్యూరు సీఐ ఉదయకుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు, గ్రామస్తులు కృష్ణదేవిపేటలో ఆదివారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. చట్టాలను చేతుల్లో తీసుకొని హింసకు పాల్పడుతున్న మావోయిస్టులకు తగిన గుణపాఠం తప్పదని సీఐ పేర్కొన్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జీవో 97 వల్లే.. సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీల్లో బాక్సైట్ తవ్వకాలు వీలు కల్పించే 97వ నంబరు జీవోను విడుదల చేయడం వల్లే మన్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందన్న వాదనకు బలం చేకూరుతోంది. అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య నేపథ్యంలో ఈ జీవో అంశం చర్చనీయాంశంగా మారింది. 2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 97వ నంబరు జీవోను జారీ చేశారు. ఈ జీవో ద్వారా మన్యంలో లేటరైట్ పేరిట లోపాయకారీగా బాక్సైట్ తవ్వకాలకు మార్గం సుగమమైంది. ఈ జీవో రద్దు కోరుతూ గిరిజనులు, ప్రజా సంఘాలు ఎన్నో ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఏజెన్సీలో ప్రశాంత వాతావరణం కరువవడమే కాక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బలికావలసి వస్తోందన్న ఆవేదన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. -
కిడారి, సోమ మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి
-
విశాఖ జిల్లాలో..మావోగన్స్ ఘాతుకం
-
భయోత్పాతం.. భీతావహం
లివిటిపుట్టు నుంచి సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ మన్యం ఉలిక్కిపడింది. మావోయిస్టుల ఘాతుకంతో ఏవోబీ భీతిల్లింది. రామ్‌గుడ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా, మన్యంలో తమ ప్రాబల్యం ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు మావోయిస్టులు తెగబడ్డారు. అందరూ చూస్తుండగానే ఓ ప్రజాప్రతినిధితో పాటు, మాజీ ప్రజాప్రతినిధిని కాల్చి చంపిన ఘటన ఏజెన్సీలో కలకలం రేపుతోంది. మావోయిస్టులకు విశాఖ మన్యం పెట్టనికోట. ఖాకీ చొక్కా అటువైపు తొంగి చూడలేదనే మాటలు వినిపించేవి. అయితే రామ్‌గుడ పరిసరాల్లో 2016 అక్టోబర్ 24న మావోయిస్టులపై ఒక్కసారిగా విరుచుకుపడిన పోలీసులు 30 మంది నక్సల్స్‌ను హతమార్చారు. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు కీలక నేతలు సైతం ప్రాణాలు కోల్పోవడంతో.. ఏవోబీపై పూర్తి ఆధిపత్యం సాధించామని పోలీసులు భావించారు. దేశచరిత్రలోనే అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా పేర్కొనే.. పోలీసుల ఏకపక్ష యుద్ధంలో కీలక నేతలు నేలకొరగడం మావోలకు మింగుడు పడలేదు. ప్రతీకారంతో రగిలిపోయారు. అదనుకోసం ఎదురుచూశారు. ఏజెన్సీలో అడపాదడపా ఉనికి చాటుతూనే వచ్చారు. ఒకవైపు గ్రేహౌండ్స్ దళాలు, పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేసినా.. పలు హింసాత్మక చర్యలకు పాల్పడడమేగాక వారోత్సవాలు జరపడం, పోస్టర్లు వేయడం వంటి చర్యల ద్వారా వారు తమ ఉనికి చాటుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా కేబినెట్ హోదా ఉన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కాల్చి చంపి భయోత్పాతాన్ని సృష్టించారు. మన్యంపై తమ పట్టు కోల్పోలేదని చాటడంతోపాటు భయం పుట్టించేందుకే ఎమ్మెల్యే, మాజీ ప్రజాప్రతినిధిపై విరుచుకుపడి హతమార్చినట్టు తెలుస్తోంది. రామ్‌గుడ ఎన్కౌంటర్ సమయంలో 11 మంది మహిళా మావోయిస్టులు మరణించారు. ఈ కారణంగానే ఈ జంట హత్యల వ్యవహారంలో సింహభాగం మహిళా యాక్షన్ టీమ్ సభ్యులే పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఘటనతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మన్యంలో భయంభయం ఓ ఎమ్మెల్యేను చంపడం మన్యంలో ఇదే తొలిసారి కావడంతో ఏజెన్సీ ప్రాంతంలో భయోత్పాతం నెలకొంది. తమ బలం నిరూపించేందుకు మావోయిస్టులు తెగబడిన ఈ ఘటన మన్యంలో కలకలం రేపింది. ఈ ఘటనతో గిరిసీమలు వణికిపోతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయాందోళనలతో గ్రామస్తులు బితుకుబితుకుమంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేను మావోయిస్టులు హతమార్చిన దరిమిలా ఏజెన్సీలోని గిరి గ్రామాల్లో పోలీసులను భారీ ఎత్తున మోహరించారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో.. ఎప్పుడెలా ఉంటుందోననే భయంతో మారుమూల గూడేల్లోని ప్రజలు హడలిపోతున్నారు. ఆదివాసీలు ఇళ్లు వదిలి బయటకు రావట్లేదు. పొలం పనులకు వెళ్లేందుకూ జంకుతున్నారు. డుంబ్రిగుడ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. మరికొన్ని గ్రామాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. 2014లో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలపై మావోయిస్టులు ప్రధానంగా దృష్టి సారించారు. సుకుమా జిల్లాలో జరిపిన దాడిలో 15 మంది భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు చనిపోయారు. మహారాష్ట్ర గడ్చిరోలిలో నక్సలైట్లు పేల్చిన మందుపాతరలో ఏడుగురు పోలీసులు చనిపోయారు. మొత్తం సంఘటనలు – 155 చనిపోయిన పౌరులు – 128 మరణించిన భద్రతాసిబ్బంది – 87 2015లో ఛత్తీస్‌గఢ్ మందు పాతరలు, ఎన్కౌంటర్లతో దద్దరిల్లింది. మొత్తం సంఘటనలు – 118 చనిపోయిన పౌరులు – 93 చనిపోయిన భద్రతాసిబ్బంది – 57 2016లో ఛత్తీస్‌గఢ్‌లో దాడులు జరిగినప్పటికీ గతంతో పోలిస్తే తక్కువ ఘటనలు జరిగాయి. మొత్తం సంఘటనలు – 69 మొత్తం చనిపోయిన పౌరులు – 123 మొత్తం చనిపోయిన భద్రతాసిబ్బంది – 66 -
అట్టుడికిన మన్యం
సాక్షి విశాఖపట్నం/ పాడేరు రూరల్/అరుకులోయ/డుంబ్రిగుడ/ఎంవీపీకాలనీ: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చడంతో అరకులోయ అట్టుడికిపోయింది. వారి అభిమానులు, అనుచరులు, కుటుంబ సభ్యులు ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. ఎమ్మెల్యే కార్యక్రమ వివరాలు శనివారం సాయంత్రం డుంబ్రిగుడ పోలీసులకు తెలియజేసినప్పటికీ ఆదివారం కిడారికి పోలీసులు రక్షణ కల్పించలేదని.. ఇది అదునుగా చూసి మావోలు వారిని చంపేశారని పోలీసులపై ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వారు అరకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లకు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సీఐ వెంకునాయుడితో వాగ్వాదానికి దిగారు. రక్షణ కల్పించాలని సమాచారం ఇచ్చినప్పటికీ ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. మూడు రోజులుగా మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు జరుగుతున్నాయని తెలిసినా తమ నేతలకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. డుంబ్రిగుడ ఎస్ఐ ఆమనరావును ఇక్కడకు తీసుకురావాలని, జరిగిన హత్యలకు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. మృతదేహాలను విశాఖ తరలించనివ్వం.. లివిటిపుట్టు నుంచి మృతదేహాలను తరలించేందుకు పోలీసులు రాకపోవడంతో నేతల అనుచరులు వారి వాహనాల్లోనే అరకుకు తరలించారు. సాయంత్రం 5 గంటల సమయంలో వారు పోలీస్ స్టే్టషన్ సమీపానికి చేరుకోగానే అరకు సీఐ వచ్చి.. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించాలని, అక్కడే పోస్టుమార్టం చేస్తారని చెప్పారు. దీంతో ఒక్కసారిగా కిడారి, సోమ అభిమానులు, కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులయ్యారు. మృత దేహాలను విశాఖకు తరలించడానికి అంగీకరించబోమని మృతదేహాలతో తీసుకుని రోడ్డుపై గంటకుపైగా బైఠాయించారు. ఇక్కడే పోస్టుమార్టం నిర్వహించాలని పట్టుబట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే వరకు మృతదేహాలను కదలనిచ్చేది లేదంటూ నినాదాలు చేశారు. బందోబస్తును పట్టించుకోని పోలీసులు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన తరువాత ఎమ్మెల్యే కిడారి ఏజెన్సీకి రావడం తగ్గించేశారు. అరకు నియోజకవర్గంలో కూడా పెద్దగా తిరగడం లేదు. ఇటీవల తెలుగుదేశం పార్టీ గ్రామదర్శిని, గ్రామ వికాస్ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించడంతో కొద్ది రోజులుగా అరకు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మావోల ముప్పు ముందు నుంచి ఊహిస్తున్న కిడారి... బందోబస్తు కోసం శనివారం రాత్రి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు ఆయన పీఏ అప్పారావు చెప్పారు. తనతో ఎస్ఐ అమ్మనరావుకు ఫోన్ చేయించారని, అయినా సరే పోలీసులు ఆదివారం నాటి పర్యటనకు బందోబస్తు కల్పించలేదని వివరించారు. పోలీసులురూట్ వాచ్ కూడా చేయలేదన్నారు.రూరల్ ఏస్పీ, పోలీసు ఉన్నతాధికారులు అరకులోయలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏజెన్సీలోని 11 మండలాల్లో టీడీపీ నేతలకు, ప్రజాప్రతినిధులకు పోలీసుల హెచ్చరికలతో వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. నేడు హోంమంత్రి రాక.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మృతదేహాలను ఆదివారం రాత్రి అరకులోయలోని వారి క్యాంపు కార్యాలయాలకు తరలించారు. ఏపీ సీఎం అమెరికా పర్యటనలో ఉండటంతో హోంమంత్రి చినరాజప్ప సోమవారం ఉదయం అరకులోయకు చేరుకుంటారు. మంత్రి సమక్షంలో స్థానిక ఏరియా ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం తర్వాత ఎమ్మెల్యే కిడారి మృతదేహాన్ని పాడేరుకు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన మాదెల పంచాయతీ బట్టివలస గ్రామానికి తరలించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతితో విశాఖలోని ఎంవీపీ కాలనీలో ఆయన ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీస్ స్టేషన్లకు నిప్పు.. పోలీసులతో వాగ్వాదం జరుగుతున్న సమయంలోనే రెండు మృతదేహాలను స్టేషన్ల వద్దకు తీసుకువచ్చేసరికి వారి అనుచరులు, అభిమానులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. పక్కపక్కనే ఉన్న అరకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లపై దాడికి తెగబడ్డారు. రాళ్లు రువ్వి, లోపల ఉన్న ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలను పగులగొట్టారు. కంప్యూటర్లు, ఇతర రికార్డులు, మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలను కూడా ధ్వంసం చేశారు. అనంతరం వాహనాలకు, స్టేషన్లకు నిప్పుపెట్టారు. దీంతో వాహనాలు, స్టేషన్ రికార్డులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఆందోళనకారులు విధ్వంసానికి దిగడంతో పోలీసులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఏపీఎస్పీ బెటాలియన్‌కు చెందిన బ్యాగులు, తుపాకులను బయటకు తీసుకెళ్లడంతో అవి మంటలబారిన పడలేదు. -
తూర్పుకొండల్లో.. మావోగన్స్ ఘాతుకం
లివిటిపుట్టు నుంచి సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/డుంబ్రిగుడ: ఏటా జరిగే వారోత్సవాలకు ముందుగా మాటు వేసి పొంచిన మావోయిస్టులు విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను దారుణంగా కాల్చి చంపారు. ఏవోబీలో దాదాపు 65 మందితో కూడిన మావోయిస్టు దళం ఈ దాడికి పథక రచన చేసి కొద్ది రోజులుగా రంగంలోకి దిగి సంచరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థను రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సర్వే చేసేందుకు తరలిం చడంతో ఈ ఘాతుకం జరిగిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా పోలీసులు రాకపోవడంతో చివరకు కిడారి అనుచరులే మృతదేహాలను వాహనాల్లో తరలించారు. అధికార పార్టీలో చేరిన ఓ ఎమ్మెల్యే హత్య జరిగితే సాయంత్రం వరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే సోమ అనుచరులు అరకు, డుమ్రిగూడ పోలీస్స్టేషన్లపై దాడికి దిగి నిప్పంటించి విధ్వంసం సృష్టించారు. గ్రామదర్శిని, గ్రామవికాస్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయల్దేరి... విశాఖ మన్యంలో మావోయిస్టులు ప్రతికారేచ్ఛతో మారణకాండకు పాల్పడ్డారు. క్యాబినేట్ హోదా కలిగిన అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావుతోపాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను పట్టపగలే కాల్చి చంపారు. డుంబ్రిగుడ మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలోని పోతంగి పంచాయతీ లివిటిపుట్టులో ఆదివారం మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కండ్రుం పంచాయతీ సార్రాయి గ్రామంలో టీడీపీ తలపెట్టిన గ్రామదర్శిని, గ్రామవికాస్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కిడారి, సోమలు అరకు నుంచి ఉదయం 11 గంటల సమయంలో డుంబ్రిగుడ, గుంటసీమ మీదుగా కార్యకర్తలు, అనుచరులతో కలసి మూడు వాహనాల్లో బయలుదేరారు. లివిటిపుట్టు వద్ద అప్పటికే మాటువేసిన 40 మంది మహిళా మావోయిస్టులతో సహా 70 మంది సాయుధులు టీడీపీ నేతల వాహనాలను అడ్డగించారు. గన్మెన్ల నుంచి తుపాకులు, సెల్ఫోన్లు తీసుకుని దూరంగా వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యే కిడారి వాహనంలో ఉన్న డ్రైవర్ చిట్టిబాబు, ఇద్దరు గన్మెన్లు, వ్యక్తిగత సహాయకుడు అప్పారావు, అరకు జెడ్పీటీసీ కూన వనజ భర్త రమేష్, అరకు మాజీ సర్పంచ్ ఛటారి వెంకటరాజులు దూరంగా వెళ్లి నిల్చున్నారు. మాజీ ఎమ్మెల్యే సోమ వాహనంలో ఉన్న గన్‌మెన్, డ్రైవర్లను కూడా మావోయిస్టులు దూరంగా పంపేశారు. అనంతరం కిడారి, సోమ చేతులు కట్టేసి కొంత దూరం తీసుకెళ్లి అరమ–గుంటసీమ జంక్షన్ వద్ద ఆగారు. ఓ దశలో మాజీ ఎమ్మెల్యే సోమ పారిపోయేందుకు ప్రయత్నించగా దారుణంగా చంపేస్తామని హెచ్చరించారు. మరో వాహనంలో ఉన్న ఎంపీటీసీ లావణ్య, ఆమె భర్త చంద్రశేఖర్, కించుమండ ఎంపీటీసీ ప్రమీల తదితరులను తాము చెప్పేవరకు అక్కడినుంచి వెళ్లవద్దని ఆదేశించారు. కాళ్లు పట్టుకున్నా కనికరించ లేదు... ఎమ్మెల్యే కిడారిని కొద్ది దూరంలో ఉన్న చింతచెట్టు కిందకు తీసుకెళ్లిన మావోయిస్టులు ప్రశ్నల వర్షం కురిపించారు. గూడ క్వారీని నిలిపివేయాలని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వినడం లేదని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించి అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు ఏం చేశావని నిలదీశారు. ఈ విషయాలపై ఎన్నిసార్లు చెప్పినా ఆయన వైఖరిలో మార్పు రాలేదన్నారు. తనను నిలదీస్తున్న మహిళా మావోయిస్టులతో.. ‘మీ కాళ్లు పట్టుకుంటా క్షమించేయండి మేడం...!’ అంటూ కిడారి ముందుకు పడిపోయారు. నీకేమీ కాదంటూ ముందున్న మహిళా మావోలు ఆయన్ని నిల్చోబెట్టగా ఇంతలో ఓ మహిళా మావోయిస్టు వెనుక నుంచి అతిదగ్గరగా తుపాకీతో కాల్చింది. అనంతరం ముగ్గురు మహిళా మావోయిస్టులు నాలుగు రౌండ్లు కాల్చడంతో కిడారి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆ తర్వాత ఏడు రౌండ్లు గాలిలోకి కాల్చారు. అదే సమయంలో మరికొందరు మావోయిస్టులు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను పది అడుగుల దూరంలో ఉన్న గుంటసీమ రోడ్డులోని పనసచెట్టు వద్దకు తీసుకువెళ్లారు. ‘నువ్వు ఎమ్మెల్యేగా ఉండగా ఓ మావోయిస్టును దారుణంగా చంపించావు. మాదెల పంచాయతీ బట్టివలసలోని క్వారీని మూసేయమని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు.. పైగా పారిపోయేందుకు యత్నించావు...’ అంటూ ఆయనపై తూటాల వర్షం కురిపించడంతో కుప్పకూలిపోయారు. అనంతరం మావోయిస్టులు గుంటసీమ రోడ్డు నుంచి స్వర్ణయిగుడ అటవీ ప్రాంతం మీదుగా వెళ్లిపోయారు. మలుపులో మందుపాతర... వాస్తవానికి లివిటిపుట్టు గ్రామ సరిహద్దులోనే ఎమ్మెల్యే కిడారి వాహనాన్ని పేల్చి వేసేందుకు మావోయిస్టులు మలుపు వద్ద మందు పాతరలు అమర్చారు. అయితే కిడారి భారీ బందోబస్తు లేకుండా రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించి వాహనాన్ని అడ్డుకున్నారు. ఘటన అనంతరం కొందరు మిలీషియా సభ్యులు మావోయిస్టులు అమర్చిన మందుపాతర్లను తవ్వి తీసుకెళ్లారు. బాంబులు పెట్టిన చోట పెద్ద పెద్ద బండరాళ్లు ఉంచారు. సాయంత్రం దాకా వెళ్లని పోలీసులు ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు కాల్చి చంపగా పోలీసులు సాయంత్రం వరకు ఘటనా స్థలానికి వెళ్లేందుకు కూడా సాహసించలేదు. హత్య జరిగిన వెంటనే కిడారి పీఏ అప్పారావు డుంబ్రిగుడ ఎస్సై అమనరావుకు ఫోన్లో విషయం తెలియచేయగా వస్తున్నామని అన్నారే గానీ ఒక్క కానిస్టేబుల్ కూడా వెళ్లలేదు. నాలుగు గంటలు ఘటనా స్థలంలోనే మృతదేహాలు పోలీసులు రాకపోవడంతో సుమారు నాలుగు గంటలు వేచి చూసిన కిడారి అనుచరులు, కార్యకర్తలు చివరికి ఎమ్మెల్యే వాహనమైన ఇన్నోవాలోనే ఆయన మృతదేహాన్ని, సోమ మృతదేహాన్ని ఆయన స్కార్పియో వాహనంలో అరకు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వణికిపోయిన లివిటిపుట్టు మావోయిస్టుల మారణకాండతో లివిటిపుట్టు, సమీప గ్రామాలైన కొత్తవలస, తోటవలస, వంతర్డ, స్వర్ణాయిగూడ, సింధిపుట్టులో గిరిజనులు భయకంపితులయ్యారు. ఘటన జరిగిన లివిటిపుట్టులోని 30 కుటుంబాల్లో చాలామంది పక్క గ్రామాలకు పరుగులు దీశారు. ఈ ఘటన గురించి ప్రశ్నించిన వారికి తాము ఊళ్లో లేమని సమాధానం చెబుతున్నారు. -
ఏవోబీలో ఎర్రజెండా!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రలో విస్తరించిన ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏఓబీ)ను కంచుకోటగా చేసుకుని ఉద్యమాన్ని సాగిస్తున్న మావోయిస్టులు ఒకానొక సమయంలో తమ ఉనికిని చాటుకోవాల్సిన దుస్థితి నుంచి ఏకంగా ఒక శాసనసభ్యుడిని, మరో మాజీ ఎమ్మెల్యేను చంపే స్థాయికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఏవోబీలో ఎర్రజెండాపై ‘సాక్షి’ కథనం. భద్రతా విధానాల్లో మార్పులు: మావోయిస్టుల భద్రతా విధానాలు పకడ్బ్డందీగా ఉంటాయి. ఏవోబీకి కేంద్ర కమిటీ సభ్యులు వచ్చినప్పుడు, పోలీసులు తమ శిబిరాలపై దాడులు చేసినప్పుడు మావోయిస్టులు మూడంచెల భద్రతా విధానాన్ని అనుసరిస్తుంటారు. దానిలో లోపాలపై ముఖ్య నేతలు కొంత కాలం క్రితం సమీక్ష చేశారు. కొత్త వ్యూహం ప్రకారం.. డెన్‌లో కొందరు ఉంటే 25 మంది వరకు రక్షణ సెంట్రీల మాదిరిగా నాలుగు వైపులా ఉంటారు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు: మారుతున్న కాలానికనుగుణంగా మావోయిస్టులు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఏవోబీలో చెడ్డా భూషణం గురించి తెలియని వారుండరు. అతను ఉద్యమంలో ఉన్నంత వరకు సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉండేది. అతను పట్టుబడ్డాక కుడుముల రవి, చలపతి వంటి వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాచార మార్పిడి కోసం ఉపయో గించారు. అలాగే తమకు అవసరమయ్యే ఆయుధాలను, ఆయుధ తయారీ సామగ్రిని మన్యంలో వ్యాపారాలు, కాంట్రాక్టు పనులు చేసే వారి నుంచే సమకూర్చుకుంటున్నారనే విషయం చాలా కాలం క్రితమే బయటపడింది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి మావోయిస్టులను రప్పించి కేడర్‌ను పెంచుకోవడంతోపాటు అగ్రనాయకత్వంలో మార్పులు చేశారు. సరికొత్త విధానాలు సాధారణంగా మావోయిస్టులు సమాచార మార్పిడికి సంప్రదాయ పద్ధతులనే ఎక్కువగా ఆచరిస్తుంటారు. ముఖ్యంగా కోడ్ భాషలోనే వారి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థ అందుబాటులోకి వచ్చి కోడ్ భాషకు బదులు వాకీ టాకీలు, వైర్లెస్ పరికరాలు, స్మార్ట్ సెల్ఫోన్లు వినియోగిస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మావోయిస్టుల స్థావరాలను పోలీసులు సులభంగా కనిపెట్టగలుగుతున్నారు. ఒకప్పుడు మీడియాకు సమాచారం చెప్పాలంటే విలేకరులను అడవిలోకి తీసుకువెళ్లి మాట్లాడే వారు.కానీ ఇప్పుడు సీడీలు చేసి మరీ పంపిస్తున్నారు. దళపతి.. చలపతి అనంతపురం జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా ఉండేవారు. ఆయనే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి ఏవోబీలో దళపతి అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రా–ఒడిశా బోర్డర్ (ఏవోబీ) ఇన్చార్జ్గా ఉన్నారు. ఇటీవలే జాంబ్రిని ఎన్కౌంటర్ చేసిన పోలీసులు చలపతిని టార్గెట్ చేశారు. కొరుకొండ ఏరియా కమిటీకి ఒకప్పుడు పట్టున్న ప్రాంతమైన అన్నవరం ప్రాంతంలో కొద్ది కాలంగా మావోయిస్టుల కదలికలు తగ్గాయి. డిప్యూటీ కమాండర్ వంతల మల్లేష్ లొంగుబాటుతో పోలీసుల దృష్టి ఈ ప్రాంతం నుంచి పక్కకు మళ్లడంతో చలపతి ఈ ప్రాంతాన్ని షెల్టర్ జోన్‌గా మార్చుకున్నాడని తెలుసుకుని పోలీసులు చేసిన దాడిలో అతను తప్పించుకున్నాడు. -
విభజన తర్వాత పేలిన తొలి తూటా!
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనానంతరం ఓ ఎమ్మెల్యేపై మావోయిస్టులు తొలితూటాను పేల్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల దారుణ వైఫల్యానికి ఈ ఘటన అద్దం పడుతోంది. సరిగ్గా 6 నెలల క్రితం మావోయిస్టుల కదలికలపై ‘సాక్షి’ ముందుగానే హెచ్చరించినా పరిస్థితులను గ్రహించటంలో ప్రభుత్వం విఫలం కావడంతోనే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. 2014లో వైఎస్సార్ సీపీ గుర్తుపై విశాఖ జిల్లా ఎస్టీ నియోజకవర్గమైన అరకు శాసనసభ్యుడిగా గెలుపొందిన కిడారి సర్వేశ్వరరావు అనంతరం పార్టీ ఫిరాయించి అధికార టీడీపీలో చేరడం తెలిసిందే. ఆయనకు విప్ పదవి ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం మావోయిస్టుల నుంచి కాపాడకోలేకపోయింది. దాడికి ఆర్కే వ్యూహ రచన ఆంధ్ర ఒడిశా బోర్డర్ (ఏఓబీ) జోన్‌లోని మల్కన్‌గిరి, కోరాపుట్, బస్తర్(ఎంకేబీ) ఏరియాకు చెందిన మావోయిస్టు కీలక దళం ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు సమాచారం. 65 మందికిపైగా మావోయిస్టు మిలటరీ ప్లాటూన్ థర్డ్ సీఆర్సీ (సెంట్రల్ రివల్యూషనరీ కంపెనీ) సభ్యులు ఇందులో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు చెబుతున్నారు. ఒడిశాలో సాకేత్ పేరుతో షెల్టర్ పొందుతున్న అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే వ్యూహ రచనతోనే ఈ దాడి జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. రెండో గిరిజన ఎమ్మెల్యే.. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన వారిలో ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. 17 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో రాగ్యానాయక్ హత్యకు గురికాగా ఇప్పుడు కిడారిని మావోయిస్టులు హతమార్చారు. ఉమ్మడి ఏపీలో ప్రజాప్రతినిధుల హత్యలు, కిడ్నాప్‌లు.. 1990 వరంగల్‌లో మాజీ మంత్రి హయగ్రీవాచారిని మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. 1991 మలక్‌పేట్ ఎమ్మెల్యే సుధీర్ కుమార్ కిడ్నాప్. మావోయిస్టు నేత నెమలూరి భాస్కర్‌రావు విడుదలకు డిమాండ్. 1993 పెనుగొండ ఎమ్మెల్యే చెన్నారెడ్డి హత్య, మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే రంగదాసును హత్య చేశారు. 1995 నెల్లూరు జిల్లాకు చెందిన మాగుంట సుబ్బరామిరెడ్డిని దారుణంగా చంపారు. 1999 మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు,ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే పురుషోత్తంరావు హత్య. 2000 మార్చి 7న అప్పటి మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని మందుపాతర అమర్చి చంపేశారు. 2001 డిసెంబర్ 30న దేవరకొండ ఎమ్మెల్యే రాగ్యానాయక్‌ను కాల్చి చంపారు. అప్పటి కొల్లాపూర్ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి జూపల్లి కృష్ణారావుపై నక్సలైట్లు దాడిచేయగా గన్‌మెన్‌తో పాటు ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు. 2003 అక్టోబర్ 24న తిరుపతి అలిపిరిలో చంద్రబాబుపై క్లే్లమోర్ మైన్స్ పేల్చి దాడికి పాల్పడ్డారు. 2005 ఆగస్టు 15న మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డిపై కాల్పులు జరిపి చంపారు. 2007 సెప్టెంబర్ 17న మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిపై మావోయిస్టు పార్టీ ల్యాండ్మైన్లతో దాడిచేసింది. జనార్దన్‌రెడ్డి, ఆయన సతీమణి రాజ్యలక్ష్మి తృటిలో తప్పించుకున్నారు. -
కిడారి, సోమ హత్యలపై స్థానికుల్లో పెల్లుబికిన ఆగ్రహం
-
అరకు ఘటనపై సోమ గన్‌మెన్ ఏం చెప్పారంటే
సాక్షి, విశాఖపట్నం : వేల కోట్లు దోచుకుతింటున్నారు, ఎంత మంది వద్దని చెప్పినా వినరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మావోయిస్టులు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను కాల్చి చంపారని ప్రత్యేక్ష్య సాక్షి, సోమ గన్‌మెన్ స్వామి చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిడారి, సివేరిలను చంపే ముందు 20 నిమిషాలు మావోయిస్టులు మీటింగ్ పెట్టారని తెలిపారు. ‘మావోయిస్టులు మా కార్లను అడ్డుకున్నారు. మా అందరిని రౌండప్ చేసి ఆయుధాలను లాక్కున్నారు. అనంతరం కొంచెం దూరంగా వెళ్లి 20 నిమిషాలు పాటు మీటీంగ్‌పెట్టారు. ప్రభుత్వానికి తొత్తులుగా మారారని కిడారి, సివేరిలపై మావోయిస్టులు మండిపడ్డారు. ఏజెన్సీ భూముల్లో బాక్సైట్ తవ్వకాలకు ప్లాన్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ మద్దతుతో మూడు క్వారీలు నడుపుతున్నారు, వేల కోట్లు దోచుకుంటున్నారు’ అని చెబుతూ ఇద్దరిపై ఒకేసారి కాల్పులు జరిపారని స్వామి పేర్కొన్నారు. -
కిడారి, సోమ హత్యలపై స్థానికులు ఆగ్రహం
-
పోలీస్ స్టేషన్లపై సోమ అనుచరుల దాడి
సాక్షి, విశాఖపట్నం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి అనుచరులు అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై దాడి చేశారు. డుంబ్రి గూడ పోలీసుస్టేషన్‌కు నిప్పంటించారు. పోలీసుల నిర్లక్ష్యమే సోమ హత్యకు కారణమని నినాదాలు చేశారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ పోలీసులు ప్రాణభయంతో పరుగులు తీశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. ఈ దాడిలో పోలీస్టేషన్ల అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసయ్యాయి. ఓ కానిస్టేబుల్‌పై సోము అనుచరులు భౌతికంగా దాడిచేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. -
మా అందరిని రౌండప్ చేసి ఆయుధాలను లాక్కున్నారు
-
అరకు ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలపై ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను మావోయిస్టులు కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు, హత్యలకు తావు లేదన్నారు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
గన్మెన్ల ఆయుధాలు తీసుకొని బెదిరించి..
-
మమ్మల్ని గన్స్‌తో రౌండప్ చేశారు: ఎమ్మెల్యే డ్రైవర్
సాక్షి, విశాఖపట్నం : తమని తుపాకులతో రౌండప్ చేసి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను దూరంగా తీసుకెళ్లి మావోయిస్టుల కాల్పులు జరిపారని ప్రత్యక్షసాక్షి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోము కారు డ్రైవర్ కే చిట్టిబాబు మీడియాకు తెలిపారు. తమ వాహనాలను అడ్డగించిన మావోయిస్టులు.. గన్మెన్ల ఆయుధాలు తీసుకొని తమని దూరంగా తీసుకెళ్లారన్నారు. అనంతరం కారుల్లో నుంచి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను దింపి చేతులను వెనక్కి కట్టేసి నడిపించుకుంటూ మరికొంత మంది మావోయిస్టులు దూరంగా తీసుకెళ్లారని తెలిపారు. పారిపోవడానికి ప్రయత్నిస్తే కాల్చిపారేస్తామని మా దగ్గర కాపలా ఉన్నవారు బెదిరించినట్లు చిట్టిబాబు పేర్కొన్నారు. అనంతరం వారిపై జరిపిన కాల్పులు శబ్దం వినబడ్డాక మమ్మల్ని వదిలేసారని, వారెన్ని అక్రమాలు చేశారో తెలుసా అని తమను ప్రశ్నించారని చిట్టిబాబు చెప్పారు. -
‘మా నాన్నను ఎందుకు చంపారో తెలియదు’
ఢిల్లీ: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపడంపై ఆయన కుమారుడు నాని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తన తండ్రిని మావోయిస్టులు ఎందుకు చంపారో తెలియదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మావోయిస్టుల నుంచి తమకు ఎప్పుడు హెచ్చరికలు రాలేదని, నాన్న కూడా ఎప్పుడూ ఈ ప్రస్తావన తీసుకురాలేదన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సర్వేశ్వరరావు కుమారుడు నాని..దాడి గురించి తెలుసుకున్న వెంటనే విశాఖకు బయల్దేరారు. ఆదివారం అరకు లోయలో కిడారి సర్వేశ్వరరావుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు (43) కన్నుమూశారు. ఆయనతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. డుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. దాడిలో కిడారి అనుచరులు మరికొంతమందికి కూడా గాయాలైనట్టు సమాచారం. -
క్వారీ వివాదమే ఎమ్మెల్యే హత్యకు కారణమా..?
సాక్షి, విశాఖపట్నం : ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు ఆదివారం ఉదయం దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే హత్యకు క్వారీ వివాదమే కారణమని తెలుస్తోంది. కిడారికి చెందిన గూడ క్వారీని మూసివేయాలని మావోయిస్టులు పలుమార్లు ఆయన హెచ్చరించినట్లు సమాచారం. ఈ క్వారీ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నందున మూసివేయాలనే డిమాండ్ స్థానికుల నుంచి కూడా వ్యక్తమైంది. ఈ విషయంలో ఎమ్మెల్యే మావోయిస్టులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పక్కా ప్రణాళికతో మావోయిస్టులు తన మైనింగ్ దగ్గరకు వెళ్తున్న ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరు సోముపై కాల్పులు జరిపారు. అయితే ఎమ్మెల్యే కిడారి పర్యటనపై తమకు సమాచారం లేదని స్థానికు పోలీసులు తెలిపారు. చదవండి: మావోయిస్టుల ఘాతుకం: అరకు ఎమ్మెల్యే కాల్చివేత -
అరకు ఎమ్మెల్యేను కాల్చిచంపిన మావోయిస్టులు
-
మావోయిస్టుల ఘాతుకం: అరకు ఎమ్మెల్యే కాల్చివేత
సాక్షి, విశాఖపట్నం: అరకు లోయలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆదివారం మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు (43) కన్నుమూశారు. ఆయనతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. డుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. దాడిలో కిడారి అనుచరులు మరికొంతమందికి కూడా గాయాలైనట్టు సమాచారం. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిడారి అనంతరం టీడీపీలో చేరారు. కిడారికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కిడారిపై దాడి జరిగినట్టు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ నిర్ధారించారు. మావోయిస్టులు హిట్ లిస్టులో ఉన్న కిడారికి హెచ్చరికలు జారీ చేస్తూ గతంలో పోస్టర్లు వెలిశాయి. ఈ దాడిలో దాదాపు 50మంది మహిళ మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారం. తన క్వారీ మైనింగ్ వద్దకు వెళ్తున్న సమయంలో కిడారి, ఆయన అనుచరులపై మావోయిస్టులు మాటువేసి దాడి చేశారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో మహిళా మావోయిస్టులు అతి సమీపం నుంచి వారిపై కాల్పులు జరిపారు. గతంలోనూ పలుసార్లు కిడారిని మావోయిస్టులు బెదిరిస్తూ వచ్చారు. దాడి అనంతరం మావోయిస్టులు ఎటువెళ్లారనే దానిపై పోలీసులు గాలింపు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చిచంపడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం.. దాడి గురించి తెలియగానే బాధపడ్డారు. ఈ దాడిని ఖండిస్తూ ఓ ప్రకటననువిడుదల చేశారు. వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభ్యన్నతికి కిడారి, సివేరి చేసిన సేవలను కొనియాడిన సీఎం.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ దాడిని ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించాలన్నారు. -
మావోయిస్టులపై ‘డ్రోన్’ వెపన్
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టుల కదలికల నియం త్రణకు కేంద్ర హోంశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవలే కేంద్రం నూతన డ్రోన్ పాలసీని ప్రక టించింది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ పాలసీ ద్వారా మావోయిస్టుల నియం త్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని భావిస్తోంది. రెండ్రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన సెక్యూరిటీ ఎక్స్పో లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్య లు ఇప్పుడు మావోయిస్టు పార్టీలో కలవరం సృష్టిస్తు న్నాయి. కొత్త డ్రోన్ పాలసీ ద్వారా దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేయడంతోపాటు మావోయిస్టులు, తీవ్రవాద సమస్యను తుడిచివేస్తామన్నారు. త్వరలోనే కార్యాచరణ ఉంటుందని, దేశ అంతర్గత భద్రతాబలగాలకు డ్రోన్లను అందుబాటులోకి తెచ్చేం దుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. రంగంలోకి ఐదు రకాల డ్రోన్లు... డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మార్గదర్శకా ల ప్రకారం ఐదు రకాల డ్రోన్లను అందుబాటులోకి తేబోతున్నారు. ఇందులో నానో డ్రోన్ 250 గ్రాముల బరువు మాత్రమే ఉంది. మైక్రోడ్రోన్ 250 గ్రాముల నుంచి 2 కిలోల బరువు వరకు ఉంటుంది. స్మాల్ డ్రోన్ 2 కిలోల నుంచి 25 కిలోల వరకు ఉంటుంది. మీడియం డ్రోన్ 25 కిలోల నుంచి 150 కిలోల బరువు, లార్జ్‌డ్రోన్ 150 కిలోలకు పైబడి బరువుం టుంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అడవులకే పరిమితమైన మావోయిస్టుల కార్యకలాపాలను మరింత నియంత్రించి, మావోయి స్టు కదలికలను పూర్తిస్థాయిలో అదుపు చేసేందుకు ఈ డ్రోన్లను ఉపయోగించాలని సీఆర్పీఎఫ్కు కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు జారీ అయినట్టు తెలిసిం ది. గతంలో రోబోల ద్వారా మావోయిస్టులను ఎదు ర్కొనేందుకు కొంత ప్రయత్నించినా ఆశించిన çఫలితా లు రాలేదు. దీనితో ఈసారి గగనతలం నుంచి మావోయిస్టు కార్యకలాపాలను గుర్తించి, ఎన్కౌంట ర్ వ్యవహారాలను డ్రోన్ ద్వారా బలగాల ఆపరేటిం గ్‌కు ఉపయోగించుకునేందుకు ఈ వ్యవస్థను అంది పుచ్చుకోవాలని హోంశాఖ ఆదేశాల్లో స్పష్టం చేసింది. సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్... కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్), కోబ్రా దళాలు, రాష్ట్రాల పరిధిలో ఉన్న గ్రేహౌండ్స్ బలగాలకు ఈ డ్రోన్లను అందించాలని భావిస్తున్నారు. ఇందుకుగాను ప్రతీ సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులో రెండు నుంచి 4 డ్రోన్లను ఏర్పాటు చేయడం, వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఆయా బేస్ క్యాంపుల నుంచి ఢిల్లీ వరకు అనుసంధానం చేసేందుకు సీఆర్పీఎఫ్ కసరత్తు ప్రారంభించింది. ఈ ఐదు డ్రోన్లలో తక్కువ బరువున్న నానో, మైక్రో డ్రోన్లను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. 350 అడుగుల నుంచి 450 అడుగుల వరకు ఈ రెండు డ్రోన్లకు ఎగిరేశక్తి ఉంటుంది. వీటి ద్వారా డే టైమ్‌లో హెడ్టీ క్వాలిటీ వీడియో, ఫొటోలు చిత్రీకరించడం సులభమని నిఘావర్గాలు భావిస్తున్నాయి. వీటికన్నా బరువున్న వాటిని ఉపయోగించడం వల్ల శత్రువు అప్రమత్తమవుతాడని, ఇవి చేసే శబ్దం వల్ల టార్గెట్ మిస్‌ఫైర్ అయ్యే ప్రమాదముంటుందని నిఘా అధికారులు భావిస్తున్నారు. సమాచార మార్పిడి తప్పనిసరి డ్రోన్ల ద్వారా మావోయిస్టుల కదలికల ను ఎప్పటికప్పుడు గుర్తించడమే కాకుండా ఆయా ప్రభావిత రాష్ట్రాల ప్రత్యేక విభాగా లకు సమాచారమివ్వాలని కేంద్ర హోంశాఖ సీఆర్పీఎఫ్తోపాటు కోబ్రా తదితర విభాగా లకు సూచించింది. రాష్ట్రాల్లో ఉన్న మావోయి స్టుల కార్యకలాపాలు స్థానిక పరిస్థితులను çప్రభావితం చేస్తాయని, ఇందులో భాగంగా అక్కడి రాష్ట్రాల స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరోల పని కూడా కీలకమని సూచించింది. -
‘మావో అర్బన్’ విచ్ఛిన్నమే లక్ష్యంగా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మావోయిస్టు సానుభూతి పరులు, పౌర హక్కుల నేతల అరెస్టులు తీవ్ర వివాదమవడం తెల్సిందే. అయితే జనావాసాల్లో చురుగ్గా పనిచేస్తున్న మావోయిస్టు వ్యూహకర్తలు, వారి మద్దతుదారుల్ని గుర్తించి అరెస్టులు చేయాలని కేంద్ర హోం శాఖ నుంచి రాష్ట్రాల భద్రతా దళాలకు స్పష్టమైన ఆదేశాలు అందాయని సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. అజ్ఞాతంలో ఉన్న మావో దళాలపై దాడులతో సమాంతరంగా మావోయిస్టుల అర్బన్ నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేయడమే తాజా దాడుల లక్ష్యంగా భావిస్తున్నారు. తాజాగా ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) తన నివేదికలో.. నాన్ గవర్నమెంట్ గ్రూపులుగా పైకి కనిపించే మావోయిస్టు ఫ్రంట్ సంస్థలు పట్టణ ప్రాంతాల్లో చురుగ్గా పనిచేస్తున్నాయని, అజ్ఞాతంలోని తిరుగుబాటుదారులకు మద్దతుతో పాటు నాయకత్వం వహిస్తున్నాయని తెలిపింది. వారి వ్యూహాలకు అనుగుణంగా.. మావోయిస్టులు భద్రతా దళాలపై దాడులకు ప్రణాళికతో పాటు వ్యూహరచన చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో దాదాపు 300 మంది పట్టణ మావోయిస్టుల్ని అరెస్టు చేసినట్లు హోం శాఖ వర్గాల సమాచారం. అందువల్ల మావో వ్యూహకర్తలు, వారి మద్దతుదారులపై అన్ని వైపుల నుంచి దాడి చేయాలని భద్రతా బలగాలకు ఆదేశాలు అందాయి. రాష్ట్ర బలగాలతో సన్నిహితంగా పనిచేయడంతో పాటు, అప్రమత్తంగా ఉండాలని సీఆర్పీఎఫ్ను కేంద్రం ఆదేశించింది. గ్రేహౌండ్స్‌తో సమాంతరంగా ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక చేస్తోందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసే ఈ దళం ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్, ఒడిశాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో మావోయిస్టుల్ని ఎదుర్కోనుంది. ఐబీ నివేదిక ప్రకారం పట్టణ మావోయిస్టులు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చండీగఢ్, రాంచీ, హైదరాబాద్, నాగ్‌పూర్, మదురై, ఇతర ప్రాంతాల్లో విస్తరించినట్లు సమాచారం. -
ఐఈడీ పేల్చిన మావోయిస్టులు
పర్ణశాల: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. కూంబింగ్ ముగించుకొని తిరిగి వస్తున్న డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డ్స్ బలగాలను లక్ష్యంగా చేసుకుని భారీ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ)ని పేల్చారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురు డీఆర్జీ జవానులు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని పూలబ్‌గరీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెడ్డపరా అడవుల్లో డీఆర్జీ బలగాలు కూం బింగ్ నిర్వహించి శనివారం పోలీస్ స్టేషన్‌కు తిరిగి వస్తుండగా స్టేషన్‌కు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలోని కేరళ గ్రామ శివారులో మావోయిస్టులు భారీ ఐఈడీని పేల్చారు. ఈ పేలుడు ధాటికి డీఆర్జీ జవానులు జ్ఞానేంద్ర‡ ప్రతాజీ, మడివి కమల్, పూల్‌చంద్ బాగలే, వీరేంద్ర నాగ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సుక్మా ఆస్పత్రికి తరలించగా, జ్ఞానేంద్ర ప్రతాజీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి మరో ఘటనలో కబీర్ధా జిల్లాలో దందాబారా అడవిలో శనివారం భద్రతా దళాలకు, మావో యిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందింది. అనంతరం ఘటనా స్థలంలో ఆయుధాలు, నిత్యావస వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ లాల్ యాత్రం సింగ్ తెలిపారు. -
పౌర హక్కుల నేతల అరెస్టు: సంచలన ఆరోపణలు
ముంబై: దేశవ్యాప్తంగా అయిదుగురు పౌర హక్కుల నేతలను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు మరోసారి సంచలన ఆరోపణలకు దిగారు. పుణె సమీపంలోని భీమా-కోరేగావ్ హింసాకాండకు సంబంధించి దేశవ్యాప్తంగా హక్కుల నేతల ఇళ్లపై దాడులు, అరెస్టులపై చెలరేగిన విమర్శలు, కోర్టు మొట్టికాయల నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం స్పందించారు. మహారాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) పరమ్ బీర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. రాజీవ్ గాంధీ హత్య తరహాలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారన్నారు. స్పష్టమైన ఆధారాలతోనే తాము ఈ అరెస్టులు చేశామన్నారు. మావోయిస్టులు, పౌర హక్కుల నేతలకు మధ్య జరిగిన ఉత్తరప్రత్యుర్తాలకు సంబంధించిన లేఖలు తమకు లభించాయన్నారు. ఈ లేఖలను ఏడీజీ తన ప్రెస్మీట్లో మీడియా ముందు ప్రదర్శించారు. ఇప్పటివరకు తాము సేకరించిన లేఖలు కొన్ని వేలు ఉన్నాయనీ, అందులో ముఖ్యమైన వాటినే మీడియా ముందు ఉంచుతున్నామని తెలిపారు. అయితే మావోయిస్టుల కుట్రలకు పౌర హక్కుల నేతలు సహకరించారన్నారని ఈ లేఖలు స్పష్టం చేస్తున్నాయని పరమ్ బీర్ సింగ్ చెప్పారు. ముఖ్యంగా సుధా భరద్వాజ్ కామ్రేడ్ ప్రకాశ్‌కు ఒక లేఖ రాశారనీ, హక్కుల దుర్వినియోగంపై సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో అందులో రాశారన్నారు. శత్రువులకు వ్యతిరేకంగా తమ పని మొదలైందని కూడా ఆమె రాశారని ఏడీజీ పేర్కొన్నారు. మావోయిస్టు నేతలు, ఇతర సంస్థలతో కలిపి మయన్మార్‌లో రహస్యంగా సమావేశమయ్యారనీ, జమ్మూకశ్మీర్ ఉగ్రవాదులు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో భారీ ఎత్తున కుట్ర చేశారని, గ్రెనేడ్ లాంచర్స్ లాంటి ఆయుధాల కొనుగోలుకు నిధులు సేకరించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బీమా కోరేగావ్ అల్లర్లలో అరెస్టయిన కేడర్ కోసం మావోయిస్టు సెంట్రల్ కమిటీ రూ.15 లక్షల మంజూరు చేసిందన్నారు. 2017, డిసెంబర్ 31వ తేదీన బీమా కోరేగావ్‌లో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించిన కేసును జనవరి 8వ తేదీన నమోదు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రసంగాలు చేయడం వల్ల కేసు నమోదు చేయాల్సి వచ్చిందని ఏడీజీ తెలిపారు. కాగా, భీమా కోరెగావ్ హింసాకాండ కేసులో పౌర హక్కుల నేతలు వరవరరావు, అరుణ్ పెరీరా, గౌతమ్ నవ్లఖా, వెర్నాన్ గొంజాల్విస్, సుధా భరద్వాజ్ లను పుణే పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ తేదీ (సెప్టెంబరు 6) వరకు వారిని గృహ నిర్బంధంలో ఉంచాలని బుధవారం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరంతా గృహనిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే.