
సాక్షి, అమరావతి : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలపై ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను మావోయిస్టులు కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు, హత్యలకు తావు లేదన్నారు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.