Araku Valley
-
ఘనంగా ముగిసిన అరకు చలి ఉత్సవాలు (ఫొటోలు)
-
మూడు రోజుల గిరిజన జాతరకు సర్వం సిద్ధం
సాక్షి, పాడేరు: ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన అరకు లోయ శుక్రవారం నుంచి జరగబోయే చలి జాతరకు ముస్తాబైంది. గిరిజన ఆచార, సంప్రదాయాలకు చలి ఉత్సవాలు అద్దం పట్టనున్నాయి. అరకు లోయలోని డిగ్రీ కళాశాల వేదికగా అరకు చలి ఉత్సవాన్ని మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. సందర్శకులను ఆకట్టుకునేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. హాట్ బెలూన్, పారాగ్లైడ్, హెలికాప్టర్ వంటి వాటిని ప్రైవేట్ సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి. వీటిలో పర్యాటకులు, స్థానికులు విహరించేలా ఏర్పాట్లు చేశారు. 10 రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారుల నృత్యాలు, సంప్రదాయ డప్పు వాయిద్యాలు హోరెత్తనున్నాయి. ఈ నెల శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ఉత్సవాలు ప్రారంభమై ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముగిసేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. అరకు మారథాన్, పద్మాపురం గార్డెన్లో ఫ్లవర్ షో, గిరిజన వంటకాల ఫుడ్ కోర్టు, పలు రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, కాఫీ రుచులు, ఫ్యాషన్ షో, సినీ కళాకారులతో కామెడీ స్కిట్స్, సుంకరమెట్ట కాఫీ తోటల్లో అరకు ట్రెక్కింగ్, హెలికాప్టర్ రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు లోయలో ఇటువంటి ఉత్సవాలను తిలకించడం లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటుంటారు పర్యాటకులు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేసిందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
లాభాల సిరి స్ట్రాబెర్రీ
గత రెండేళ్లుగా వాతావరణ పరిస్థితులు అనుకూలించక నష్టపోయిన స్ట్రాబెర్రీ రైతులకు ఈ ఏడాది పరిస్థితులు అనుకూలించాయి. దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో అన్నిఖర్చులు పోనూ ఎకరాకు రూ.2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని రైతులు పేర్కొన్నారు. సేంద్రియ విధానంలో పండించడం వల్ల కొనుగోలు చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. సాక్షి,పాడేరు: అల్లూరి జిల్లా మన్యం ప్రాంతంలో స్ట్రాబెర్రీ పండ్ల సీజన్ ప్రారంభమైంది. పర్యాటక సీజన్ కావడంతో మంచి ఆదరణ నెలకొంది. అరకులోయ, లంబసింగి ప్రాంతాల్లో 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. కొంతమంది మైదాన ప్రాంత రైతులు గిరిజనుల వద్ద భూములు లీజుకు తీసుకుని చింతపల్లి మండలం లంబసింగి ప్రాంతంలో పండిస్తున్నారు. అరకులోయలోని పెదబల్లుగుడ సమీపంలో ఎకరా విస్తీర్ణంలో గిరిజన రైతులే స్వయంగా స్ట్రాబెర్రీని పండిస్తున్నారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో పండ్ల దిగుబడి ఆశాజనకంగా ఉంది. అరకులోయ, లంబసింగి, రాజుపాకల ప్రాంతాల్లో స్ట్రాబెర్రీ పండ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు నేరుగా రైతుల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించకుండా పండించడం వల్ల పండ్లకు మంచి డిమాండ్ ఉంది. 200 గ్రాములు రూ.100 అరకులోయ, లంబసింగి ప్రాంతాల్లో రైతులు, వ్యాపారులు 200 గ్రాముల పండ్లను రూ.100కు విక్రయిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో పండ్ల వ్యాపారులకు వారు ఇదే పండ్లను రూ.90కు అమ్ముతున్నారు. విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలకు లంబసింగి ప్రాంతం నుంచి ప్రతిరోజు ఎగుమతి అవుతోంది. ఎకరానికి రూ.2లక్షల ఆదాయం ఎకరాకు మూడు వేల కిలోల వరకు దిగుబడి వస్తోందని రైతులు తెలిపారు. అన్ని ఖర్చులు పోను ఎకరాకు రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుందని వారు వివరించారు. ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉందని రాజుపాకలు ప్రాంతానికి చెందిన రైతు సత్యనారాయణ తెలిపారు. అనుకూలించిన వాతావరణం స్ట్రాబెర్రీ సాగుకు ఈఏడాది వాతావరణం అనుకూలంగా ఉంది. గత రెండేళ్లు అధిక వర్షాల కారణంగా పంటకు నష్టం వాటిల్లింది. ఈసారి మాత్రం పూత బాగుంది. పండ్ల సైజు కూడా పెద్దదిగా ఉండడంతో మరింత ఇష్టంగా తింటున్నారు. గిరిజన రైతులు సాగు చేపట్టేందుకు ముందుకు వస్తే ప్రోత్సహిస్తాం. హెక్టార్‌కు రూ.50వేల వరకు ఆర్థిక ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. – రమేష్ కుమార్‌రావు, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి, పాడేరు -
కాఫీ రైతు హ్యాపీ.. అల్లూరి జిల్లాలో విరగ్గాసిన పండ్లు
అల్లూరి జిల్లాలో ఈ ఏడాది కాఫీ విరగ్గాసింది. ఎక్కడ చూసినా ఎర్రటి పండ్లతో తోటలు కళకళలాడుతున్నాయి. తోటలు మంచి కాపుకాయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థలు కూడా పండ్ల దశలోనే కొనుగోలు చేస్తుండడంతో వాటి సేకరణను రైతులు ప్రారంభించారు. తుఫాన్ కారణంగా ఇటీవల కురిసిన వర్షాలు అనుకూలంగా ఉండడంతో కాఫీ పంట విరగ్గాసిందని కాఫీ విభాగం అధికారులు అంటున్నారు.సాక్షి,పాడేరు: అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి పొందిన అల్లూరి జిల్లాలో కాఫీకి ఈఏడాది కూడా మహర్దశ పట్టింది. కాయలు పక్వానికి వచ్చాయి. తోటల్లో విరగ్గాసిన ఎర్రని కాఫీ పండ్ల సేకరణను గిరిజన రైతులు ప్రారంభించారు. కాఫీ పంటను పండ్ల దశలోనే పాడేరు ఐటీడీఏతో పాటు గిరిజన రైతు ఉత్పత్తి సంఘాలు,పలు ఎన్జీవో సంస్థలు కొనుగోలు ప్రారంభించాయి. చింతపల్లి మాక్స్ సంస్థ ద్వారా పాడేరు ఐటీడీఏ రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ పండ్లను కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. కాఫీ పండ్ల సేకరణలో కాఫీ రైతులు వారం రోజుల నుంచి బిజీగా ఉన్నారు. సేకరించిన పండ్లను ఐటీడీఏతో పాటు పలు సంస్థలు వెంటనే కొనుగోలు చేస్తూ పల్పింగ్ యూనిట్లకు తరలిస్తున్నాయి. జీసీసీ సిబ్బంది కూడా కాఫీ గింజలు కొనుగోలు చేస్తున్నారు.1.48 లక్షల ఎకరాల్లో ఫలసాయం పాడేరు డివిజన్లోని 11 మండలాల్లో 2.42 లక్షల ఎకరాల్లో కాఫీతోటలను గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. వీటిలో 1.48 లక్షల ఎకరాల్లో ఫలసాయం ఇచ్చే కాఫీతోటలు ఉన్నాయి. ఆయా తోటల్లో కాఫీ పండ్లు విరగ్గాయడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.గత ఏడాది 17వేల మెట్రిక్ టన్నుల కాఫీ గింజలను రైతులు విక్రయించారు. ఈ ఏడాది కూడా కాపు ఆశాజనకంగా ఉండడంతో 18వేల మెట్రిక్ టన్నుల వరకు కాఫీ గింజల ఉత్పత్తి ఉంటుందని కేంద్ర కాఫీబోర్డు,పాడేరు ఐటీడీఏ కాఫీ విభాగం అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.జీసీసీ,ఐటీడీఏలు గిట్టుబాటు ధరలు ప్రకటన ఈఏడాది కూడా గిరిజన రైతులు ఉత్పత్తి చేసే కాఫీ పంటకు ఎఫెక్స్ కమిటీ సిఫారసు మేరకు జీసీసీ,పాడేరు ఐటీడీఏలు గిట్టుబాటు ధరలను ప్రకటించాయి. చింతపల్లి మాక్స్ సొసైటీ ద్వారా కొనుగోలు చేసే కాఫీ పండ్లకు కిలో రూ.44ధర చెల్లించేందుకు పాడేరు ఐటీడీఏ నిర్ణయించింది. పార్చ్మెంట్ కాఫీ గింజలను కిలో రూ.285 ధరతో, అరబికా చెర్రీ రకాన్ని కిలో రూ.150,రోబస్ట చెర్రీ రకాన్ని కిలో రూ.80కు కొనుగోలు చేయనున్నారు.డ్రైకాఫీ దిగుబడి ఎకరాకు 150 కిలోల వరకు ఉంటుంది. ఐటీడీఏ ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ఎకరాకు సుమారు రూ.40 వేల నుంచి 45 వేల వరకు రైతుకు ఆదాయం లభిస్తుంది. ఈ ఏడాది రూ. 8 కోట్లతో పండ్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా ఐటీడీఏ నిర్ణయించుకోగా, రూ. 57 కోట్ల లావాదేవీలు నిర్వహించాలని జీసీసీ భావిస్తోంది. జిల్లా మొత్తం ఈ ఏడాది రూ.400 కోట్ల వరకూ కాఫీ లావాదేవీలు జరగవచ్చని భావిస్తున్నారు. పండ్ల సేకరణ ప్రారంభించాం నాకు ఉన్న రెండు ఎకరాల్లో కాఫీ తోటలు విరగ్గాసాయి. కాపు ఆశాజనకంగా ఉంది. రెండు రోజుల నుంచి పండ్ల సేకరణ జరుపుతున్నాం. గత ఏడాది కాఫీ పంట విక్రయం ద్వారా రూ.70వేల ఆదాయం వచ్చింది. ఈ సారి కాపు అధికంగా ఉండడంతో దిగుబడి పెరుగుతుందని ఆశిస్తున్నాను. సొంతంగా పల్పింగ్ చేసి పార్చ్మెంట్ కాఫీని తయారు చేసి జీసీసీకే విక్రయిస్తాను. – సుర్ర చిట్టిబాబు, కాఫీ రైతు, కరకపుట్టు,పాడేరు మండలంకాఫీ పంటకు గిట్టుబాటు ధర గిరిజన రైతులు సాగు చేస్తున్న కాఫీ పంట నాణ్యతలో నంబర్–1గా నిలుస్తుంది. కాఫీ ఉత్ప త్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం. ఐటీడీఏ,జీసీసీ యంత్రాంగం ద్వారా కాఫీ రైతులకు మేలు చేసేలా గిట్టుబాటు ధరలను ప్రకటించాం. గిరిజనులు ఎలాంటి అపోహలకు గురికాకుండా కాఫీ పండ్లను ఐటీడీఏకు, పార్చ్మెంట్, అరబికా, రొబస్ట కాఫీ గింజలను జీసీసీకి విక్రయించి లాభాలు పొందాలి. దళారీలను ఆశ్రయించి మోసపోవద్దు. –ఎ.ఎస్.దినేష్ కుమార్, కలెక్టర్. -
గగన విహారం
మెలికలు తిరిగే ఘాట్ రోడ్డు, ఎటుచూసినా ఎత్తయిన కొండలు, పచ్చని చెట్లు, రంగురంగుల పూల మొక్కలు. మంచు దుప్పట్లో ప్రకృతి అందాలు. ఇలా భూతల స్వర్గాన్ని తలపించే అరకు అందాలను ఆకాశవీధిలోంచి వీక్షించేందుకు పాడేరు ఐటీడీఏ హాట్ ఎయిర్ బెలూన్ను అందుబాటులోకి తెచ్చింది. అరకు పద్మాపురం ఉద్యానవనంలో ఏర్పాటుచేసిన దీనిపై విహరించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. పది నిమిషాలు ఆకాశంలో విహరించేందుకు ఒకొక్కరి నుంచి రూ. 1500 వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకు 244 మంది విహరించగా 3.66 లక్షల ఆదాయం వచ్చింది. దీనిని పాడేరు ఐటీడీఏ, ఈగల్ ఫ్లై కంపెనీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇక్కడ రెండు హాట్ ఎయిర్ బెలూన్లు అందుబాటులో ఉన్నాయి.ప్రతిరోజు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12, సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అందుబాటులో ఉంటుంది. పారామెటార్లను కూడా కంపెనీ ప్రతినిధులు సిద్ధం చేశారు. ఇందుకుగాను గ్రౌండ్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇది కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. పాడేరు ప్రాంతానికి చెందిన కొంతమంది నిరుద్యోగులు ఢిల్లీలోని గురుగామ్‌లో హాట్ ఎయిర్ బెలూన్, పారా మోటార్ ఫ్లయింగ్లో శిక్షణ పొందారు. వీరంతా ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. – అరకులోయ టౌన్ -
శ్వేత మయూరం మన కశ్మీరం
పచ్చటి పర్వత శ్రేణులను ముద్దాడుతున్న మేఘమాలలు..దట్టంగా కమ్ముకున్న పొగమంచు.. శ్వేత వర్ణంలో మెరిసిసోయే మంచు దుప్పట్లు.. మలుపు తిరిగే కొండ అంచుల్లో కనువిందుచేసే అటవీ అందాలు.. ఓవైపు చల్లని గాలులు మరోవైపు ఆకుపచ్చని హరిత అందాలు.. అడవులపై పరిచినట్టుగా పవళించే మేఘాలు.. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేయాలంటే కశ్మీర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. లంబసింగిని సందర్శిస్తే సరిపోతుంది. ఇక్కడ ప్రకృతి అందాలను చూస్తేవావ్ అనాల్సిందే. చింతపల్లి: మండలంలోని లంబసింగికి తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రత్యేకత ఉంది. చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఇదే కావడం అందుకు కారణం. చలికాలం బాగా ఉధృతంగా ఉండే తరుణంలో ఇక్కడ సగటు ఉష్ణోగ్రత మూడు డిగ్రీలకు మించదు. అత్యల్ప ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్‌గా ఇక్కడ వివిధ సందర్భాల్లో నమోదైంది. 3,600 అడుగుల ఎత్తులో.. సముద్రమట్టానికి 3,600 అడుగుల ఎత్తున ఉన్న లంబసింగి ఒకప్పుడు ఎలాంటి ప్రత్యేకతలూ లేని చిన్న గిరిజన పల్లె. అటవీశాఖ చెక్‌పోస్టు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆశ్రమ గురుకుల పాఠశాల మాత్రమే ఉండేవి. విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు నుంచి బస్సులు మాత్రం ఈ ప్రాంతం మీదుగా తరచూ తిరిగేవి. ⇒ శీతాకాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఉన్న చెక్‌పోస్టు సెంటర్లో చాలాకాలం క్రితం ఓ చెట్టుకింద ఒక వ్యక్తి చలికి కొయ్యబారి చనిపోయాడని చెబుతుంటారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని కొర్రబయలు అని కూడా పిలిచేవారు. ⇒ మైదాన ప్రాంతంలో సాధారణంగా ఏడాదికి నాలుగు నెలలు మాత్రం చలి ఉంటుంది. కానీ లంబసింగి ప్రాంతంలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చలి వణికిస్తుంది. సెపె్టంబర్ మొదటి వారం నుంచి చలి ప్రభావం కనిపిస్తుంది. డిసెంబర్లో ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదైన సందర్బాలు ఉన్నాయి. ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే చింతపల్లిలో ఉష్ణోగ్రత ఇక్కడకన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. నిత్యం భోగి మంటలే.. ప్రతీ ఇంట్లో అందరికీ పెద్ద రగ్గులు ఉంటాయి. స్వెటర్లు, కంబళ్లు తప్పనిసరి. మంట కోసం కట్టెలు సిద్ధంగా ఉంచుకుంటారు. సాయంత్రమయ్యేసరికి ప్రతి ఇంట్లో అన్నం వండుకోవడానికన్నా ముందు కుంపట్లు సిద్ధం చేసుకుంటారు.తాజంగిలో బోటు షికార్, జిప్‌లైన్ తాజంగి జలాశయంలో ఐటీడీఏ ఏర్పాటుచేసిన బోట్ షికార్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. లంబసింగి వచ్చే పర్యాటకులందరూ 20 నిమిషాలు బోటులో షికారు చేసి ఎంతో సంతోషం పొందుతుంటారు. జలాశయం మీదుగా ఏర్పాటుచేసిన జిప్వే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు 250 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ జిప్ లైన్ ద్వారా కొండపై నుంచి చెరువు వరకు జారుతూ ప్రకృతి అందాలను తిలకిస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తుంటారు. మరో వ్యూపాయింట్ నర్సీపట్నం నుంచి లంబసింగి వచ్చే మార్గంలో బోడకొండమ్మ ఆలయం వద్ద మరో వ్యూపాయింట్ అందుబాటులోకి వచ్చింది. గత అరకు ఎంపీ మాధవి నిధులు వెచ్చించి దీనిని నిర్మించారు. ⇒ నర్సీపట్నం నుంచి ప్రయాణం ప్రారంభించాక చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో మలుపులతో కూడిన రోడ్లు, పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరంగా ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో కాఫీ, మిరియం తోటలు ఆకట్టుకుంటాయి. ⇒ విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నుంచే కాకుండా ఏకంగా బెంగళూరు నుంచి కూడా వాహనాల్లో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. దీనిని బట్టి ఈ ప్రదేశానికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నం, నర్సీపట్నం నుంచి ఈ ప్రాంతానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది.పర్యాటక సీజన్లో కళకళ పర్యాటక సీజన్ వచ్చిందంటే చాలు లంబసింగి పర్యాటకులతో కళకళలాడుతుంది. ఇక్కడ పూర్తిస్థాయిలో వసతులు లేనందున సమీప నర్సీపట్నంలో బస చేసి తెల్లవారుజామున ఇక్కడి పర్యాటకులు వచ్చేవారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రిసార్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ కాటేజీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.కొండల్లో ‘పాల సముద్రం’ చెరువులవేనం కొండల్లో ప్రకృతి అందాలు పాలసముద్రాన్ని తలపిస్తాయి. ఈ ప్రాంతం లంబసింగికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో పొగమంచు దట్టంగా కమ్మి ఉంటుంది. మేఘాలు మనతో మాట్లాడుతున్నాయా అనిపిస్తుంది. ఈ అపురూప అందాలను తిలకించేందుకు ఎక్కడెక్కడినుంచో ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు. పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉండేలా పాడేరు ఐటీడీఏ వ్యూపాయింట్‌ను నిర్మించింది. ⇒ శీతల వాతావరణం ప్రారంభమైన నాటి నుంచి వచ్చే పర్యాటకులతో తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి లంబసింగి సెంటర్ జాతరను తలపిస్తుంది. వీకెండ్లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. శని, ఆదివారాల్లో అయితే చెరువులవేనం జనసంద్రంగా మారుతుంది. కొంతమంది శనివారం రాత్రి లంబసింగి వచ్చి గుడారాలు వేసుకొని రాత్రంతా జాగారం చేస్తూ దట్టంగా కురుస్తున్న పొగమంచును ఆస్వాదిస్తూ గడుపుతారు. వేకువజామున చెరువులవేనం వెళ్లి ప్రకృతి అందాలను తిలకిస్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి ఏజెన్సీలో పర్యాటక అభివృద్ధికి గత ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు వెచ్చించి అభివృద్ధి చేసింది. తాజంగిలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణం చేపట్టింది. చెరువులవేనం, బోడకొండ గుడి వద్ద వ్యూపాయింట్లు నిర్మించింది.కృష్ణాపురం వద్ద ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ను ఏర్పాటుచేసింది. తాజంగి జలాశయాన్ని అభివృద్ధి చేసింది. – మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పాడేరు ఎమ్మెల్యేకనీస వసతులు అవసరం పర్యాటక ప్రాంతంగా పాచు ర్యం పొందడంతో ఈ ప్రాంత అందాలను చూడడానికి ఎంతోమంది కుటుంబాలతో వ స్తున్నారు.ఈ ప్రాంతంలో కనీస వసతులు లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాటుకు అ««ధికారులు చర్యలు చేపట్టాలి.వాహనాల నిలుపుదలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. – ప్రశాంత్, పర్యాటకుడు విజయనగరం -
మోదీ ఇష్టపడే అరకు వ్యాలీ కాఫీ..ప్రత్యేకత ఇదే..!
కాఫీ ఘుమఘుమలకు వహ్..! అని కితాబిస్తు ఒక్క సిప్ చేసేందుకు తహతహలాడుతుంటాం. అలాంటి టేస్టీ కాఫీ మన ప్రధాని మోదీ మనసును కూడా దోచుకుంది. ఆయన ప్రత్యేకంగా ఇష్టపడే అరకు వ్యాలీ కాఫీ గురించి తరుచుగా చెబుతుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని అరకులోయలో ప్రసిద్ధి గాంచిని కాఫీ రుచికి మోదీ సైతం పిదా అయ్యారు. మన్‌కీ బాత్ 111వ ఎపిసోడ్లో ఆ కాఫీ గురించి ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. గతేడాది సెప్టెంబర్ 2023లో భారతదేశం నిర్వహించిన జీ20 సదస్సులో కూడా అరకు కాఫీ గురించి హైలెట్ చేస్తూ మాట్లాడారు. అంతేగాదు మన అరకు కాఫీకి దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. అవకాశం దొరికినప్పుడల్లా అరకు కాఫీని గుర్తు తెచ్చుకుంటారు ఆయన. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి మన్ కీ బాత్‌లో మరోమారు అరకు కాఫీని ప్రశంసించడం విశేషం. కేవలం ప్రశంసలు మాత్రమే కాదు.. అరకు కాఫీ రుచిని ఆస్వాధించమని మన్ కి బాత్ శ్రోతలను కూడా కోరారు. అసలేంటి అరకు కాఫీ ప్రత్యేకతలు అంటే..అరకు కాఫీ అంటే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు లోయలో కాఫీ సాగు దాదాపు వంద ఏళ్ల నాటిది. అయితే అది 1947 తర్వాత నెమ్మదిగా క్షీణించింది. మళ్లీ 2000లలో వాణిజ్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా లాభాప్రేక్షలేని నంది ఫౌండేషన్ సంస్థ ముందుకు కొచ్చి స్థానిక రైతులను ప్రోత్సహించింది. అందుకు అవసరమైన వనరులను కూడా అందించింది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి సహాయపడింది. అలాగే అనేక మంది స్థానికులకు ఉపాధిని కూడా అందించింది. ఒకరకంగా ఈ ప్రాంతం ప్రత్యేక వాతావరణం ద్వారా పండించిన ప్రసిద్ధ కాఫీ గింజలకు పేరుగాంచేందుకు దారితీసింది. అరకులోయలో పగలు వేడిగా, రాత్రుళ్లు చల్లగా ఉండి, నేలలో అధికంగా ఐరన్ ఉండటం తదితర కారణాల వల్ల కాఫీ మొక్కలు నెమ్మదిగా పండటం మొదలయ్యింది. ఆ వాతావరణమే కాఫీ గింజలకు ప్రత్యేకమైన అరోమా రుచిని తెచ్చిపెట్టాయి కూడా. ఆ తర్వతా ఆ అరుకు వ్యాలీ కాఫీకి విశేష ప్రజాధరణ లభించి, అందరి మన్నలను అందుకుంది. అలా 2019లో, అరకు కాఫీకి భౌగోళిక సూచిక (GI) హోదా లభించింది. ప్రస్తుతం అరకు కాఫీకి దేశవ్యాప్తంగా విశేషమైన ఆధరణ ఉంది. దీనికి సంబంధించి ఫ్లాగ్షిప్ బ్రాండ్‌తో వచ్చిన బ్రూ కాఫీ మరితం ఫేమస్.(చదవండి: తప్పనిసరిగా ఉడికించే తినాల్సిన కూరగాయలివే..!) -
విశాఖ జిల్లాకు ఆయువుపట్టుగా మారిన పర్యాటకం
-
అరకులో రూ.80 వేలు..సిటీలో రూ.6 లక్షలు!
సాక్షి, సిటీబ్యూరో: గంజాయి సంబంధిత మాదకద్రవ్యమైన హష్ ఆయిల్‌ను విశాఖ ఏజెన్సీలో ఉన్న అరకు ప్రాంతం నుంచి లీటర్ రూ.80 వేలకు ఖరీదు చేసుకుని వచ్చి..హైదరాబాద్‌లోని వినియోగదారులకు రూ.6 లక్షలకు విక్రయిస్తోంది ఒక ముఠా. వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ డ్రగ్స్ దందాపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్‌్కఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. తొమ్మిది మంది నిందితుల్లో ఏడుగురిని అరెస్టు చేశామని, వీరి నుంచి హష్ ఆయిల్‌తో పాటు చెరస్ స్వా«దీనం చేసుకున్నట్లు డీసీపీ నితిక పంత్ ఆదివారం వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఓ యువతి కూడా ఉండగా..పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వినియోగం నుంచి విక్రేతలుగా మారి... గోల్కొండ పరిధిలోని సెవెన్ టూంబ్స్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ముజఫర్ అలీ పదో తరగతి తప్పడంతో చదువుకు స్వస్తి చెప్పాడు. తన స్నేహితుడైన సబ్జా కాలనీ వాసి అబు బకర్ బిన్ అబ్దుల్ ఎజాజ్ ద్వారా ఇతడికి మాదకద్రవ్యాల వినియోగం అలవాటు అయింది. వీరిద్దరూ కలిసి తరచుగా హష్ ఆయిల్ ఖరీదు చేసి నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్ళి వినియోగిస్తుండే వారు. కాలక్రమంలో వీరికి నగరంలో డ్రగ్స్‌కు ఉన్న డిమాండ్ అర్ధమైంది. దీంతో తామే హష్ ఆయిల్ దందా మొదలు పెడితే వినియోగించడంతో పాటు విక్రయించడానికి అవకాశం ఉంటుందని భావించారు. దీంతో తమ స్నేహితుడు, బైక్ మెకానిక్ మహ్మద్ ఖాసిమ్ అరకు సమీపంలోని పాడేరు ప్రాంతానికి పంపారు. చేతులు మారే కొద్దీ రేటు పైకి... ఆ ప్రాంతంలో లభించే హష్ ఆయిల్‌ను లీటర్ రూ.80 వేలకు ఖరీదు చేసిన ఖాసిమ్ బస్సుల్లో నగరానికి తీసుకువచ్చాడు. సోమాజిగూడ ప్రాంతానికి చెందిన సయ్యద్ ముర్తుజా అలీ హుస్సేన్ ఇంటికి ఈ సరుకు తీసుకువచ్చేవారు. అక్కడే దాచి పెట్టడంతో పాటు అతడితో కలిసి ఈ హష్ ఆయిల్‌ను 5 మిల్లీ లీటర్ల పరిమాణం కలిగిన చిన్న సైజు ప్లాస్టిక్ టిన్నుల్లో నింపేవాళ్లు. ఈ టిన్నుల్ని తమ వద్ద సబ్–పెడ్లర్స్‌గా పని చేస్తున్న విద్యార్థి ముబషిర్ ఖాన్ (మణికొండ), నితిన్ గౌడ్ (అయ్యప్ప సొసైటీ), క్యాటరింగ్ పని చేసే టి.పూనం కుమారీ కౌర్‌లకు ఒక్కో టిన్ను రూ.2 వేలకు అమ్మే వాళ్ళు. టోలిచౌకి వాసి జీషాన్ నవీద్, సమత కాలనీకి చెందిన సయ్యద్ అన్వరుల్లా హుస్సేనీ ఖాద్రీ కూడా వీరి నుంచి హష్ ఆయిల్ ఖరీదు చేస్తుండేవారు. వినియోగదారులకు రూ.3 వేలకు... హష్ ఆయిల్ నగరానికి తీసుకువచ్చే ఖాసిమ్, విక్రయించే ముజఫర్, అబుబకర్ తెర వెనుకే ఉండేవారు. వీరి సబ్–పెడ్లర్స్ మాత్రమే ఈ మాదకద్రవ్యాన్ని వినియోగదారులకు విక్రయించారు. 5 మిల్లీ లీటర్ల టిన్ను రూ.3 వేలు (లీటర్ రూ.6 లక్షలు) చొప్పున విక్రయించారు. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న వీరి వ్యవహారంపై పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషాకు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సై షేక్ కవియుద్దీన్ బృందం రంగంలోకి దిగి వలపన్నింది. జీషాన్, అన్వరుల్లా మినహా మిగిలిన ఏడుగురిని పట్టుకున్నారు. వీరి నుంచి 310 మిల్లీ లీటర్ల హష్ అయిల్‌తో పాటు 70 గ్రాములు చెరస్ (గంజాయి సంబంధిత డ్రగ్) స్వా«దీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇరువురి కోసం గాలిస్తున్న టాస్‌్కఫోర్స్ వీరికి చెరస్ ఎక్కడ నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అనేవి ఆరా తీస్తున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును ఫిల్మ్‌నగర్ పోలీసులకు అప్పగించారు. -
అరకు కాఫీ రుచి చూసిన జి 20 సమ్మిట్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ గుర్తింపు కలిగిన అరకు కాఫీకి మరోసారి అరుదైన ప్రాధాన్యత దక్కింది. న్యూఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన జీ20 సమ్మిట్‌లో అరకు వ్యాలీ కాఫీ ప్రదర్శనకు అవకాశం రావడమే ఇందుకు కారణం. సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌లో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) గిరిజన ఉత్పత్తులను ప్రదర్శించింది. ఈ ఎగ్జిబిషన్లో అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన రైతులు పండించిన, ప్రత్యేకమైన, అధిక నాణ్యత ప్రమాణాలు కల్గిన కాఫీని ప్రదర్శించడం గమనార్హం. ఈ గ్లోబల్ ఈవెంట్లో అరకు వ్యాలీ కాఫీ ప్రదర్శన ద్వారా ప్రీమియం కాఫీ బ్రాండ్‌గా మాత్రమే కాకుండా వాణిజ్య పరంగా సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగపడుతుందని జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి సాక్షికి తెలిపారు. జి20 శిఖరాగ్ర సమావేశాలకు వచ్చిన పలు దేశాల ప్రతినిధులకు అరకు కాఫీ రుచిని పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. జీసీసీకి ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి శోభా స్వాతిరాణి, మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా అతిథులకు ఇచ్చే బహుమతుల్లో అరకు కాఫీని సైతం అందజేయడం విశేషం. -
ఆర్గానిక్ బ్రాండ్‌తో అరకు కాఫీకి.. అంతర్జాతీయ క్రేజ్
సాక్షి, అమరావతి : అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న అరకు వ్యాలీ కాఫీకి ఆర్గానిక్ బ్రాండ్ మరింత క్రేజ్ తేనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించే అరకు వ్యాలీ కాఫీ, మిరియాలకు సేంద్రియ ధ్రువపత్రం(ఆర్గానిక్ సర్టిఫికేషన్) లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ(అపెడా) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నాలుగేళ్లుగా చేస్తున్న కృషి ఫలించింది. దీనివల్ల గిరిజన రైతులు పండించిన కాఫీ, మిరియాలకు అంతర్జాతీయ మార్కెట్లో మరింత మంచి ధరలు దక్కనున్నాయి. ఫలించిన నాలుగేళ్ల కృషి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజన్ పరిధిలోని గొందిపాకలు, లంబసింగి, కప్పాలు క్లస్టర్లలో 1,300 మంది గిరిజన రైతులు 2184.76 ఎకరాల్లో పండిస్తున్న కాఫీ, మిరియాలకు సేంద్రియ ధ్రువపత్రం సాధించడం కోసం నాలుగేళ్లుగా కృషి జరిగింది. తొలుత గొందిపాకలు గ్రామానికి చెందిన రైతులు సేంద్రియ సాగులో ముందున్నారు. గ్రామంలోని రైతులంతా కలసి గిరిజన గ్రామ స్వరాజ్య సంఘంగా ఏర్పడి సేంద్రియ సాగుకు శ్రీకారం చుట్టారు. ఎరువులు వేయకుండా సేంద్రియ పద్ధతుల్లోనే కాఫీ, అంతర పంటగా మిరియాలను పండిస్తున్నారు. గొందిపాకలుతో పాటు లంబసింగి, కప్పలు గ్రామాల్లో రైతులతోనూ సమావేశాలు నిర్వహించిన జీసీసీ సేంద్రియ సాగును ప్రోత్సహించింది. దీంతో మూడేళ్లుగా క్రమం తప్పకుండా స్కోప్ సర్టిఫికెట్ వచ్చేలా జీసీసీ కృషి చేసింది. మూడేళ్లపాటు దీనిపై సునిశిత అధ్యయనం పూర్తికావడంతో నాల్గో ఏడాది సేంద్రియ సాగు ధ్రువపత్రం జారీకి అపెడా ఆమోదం తెలిపింది. దీంతో తొలి విడతలో చింతపల్లి మండలంలోని 2,184.76 ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్న దాదాపు 1,300 మంది గిరిజన రైతులకు సేంద్రియ ధ్రువపత్రాలు అందించనున్నారు. ఇదే తరహాలో జీకే వీధి, పెదవలస, యెర్రచెరువులు క్లస్టర్లలో మరో 1,300 మంది రైతులు సుమారు 3,393.78 ఎకరాల్లో పండిస్తున్న కాఫీ, మిరియాలు పంటలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే ఏడాది జనవరి నాటికి వాటికీ సేంద్రియ ధ్రువపత్రాల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. కాగా, ఒక పంటకు సేంద్రియ ధ్రువపత్రం సాధించడం అంత తేలిక కాదు. ఇందుకు పెద్ద కసరత్తే ఉంటుంది. థర్డ్ పార్టీ వెరిఫికేషన్, ప్రతి విషయం ఆన్లైన్ వెరిఫికేషన్, ఆన్లైన్ అప్డేషన్, ప్రతి రైతు వ్యవసాయ క్షేత్రం జియో ట్యాగింగ్, వాటన్నింటినీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం వంటివి ఏ మాత్రం ఏమరుపాటు లేకుండా నిర్వహించాలి. వీటన్నిటినీ జీసీసీ అధికారులు సకాలంలో విజయవంతంగా పూర్తిచేశారు. మరో మైలురాయి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో జీసీసీ సమర్థంగా సేవలందిస్తోంది. ఇప్పటికే సేంద్రియ బ్రాండింగ్‌తో నాణ్యమైన పసుపు, తేనెను టీటీడీకీ సరఫరాచేస్తున్నా. తాజాగా నాలుగేళ్ల కృషి ఫలించడంతో కాఫీ, మిరియాల సాగుకు సేంద్రియ సాగు ధ్రువపత్రం దక్కడం జీసీసీ చరిత్రలో మరో మైలురాయి. ఇది సాధించినందుకు గర్వంగా ఉంది. – శోభ స్వాతిరాణి, చైర్పర్సన్, గిరిజన సహకార సంస్థ -
టూరిజం 2.0’.. అరకు, గండికోట
సాక్షి, అమరావతి: ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు–లంబసింగి సర్క్యూట్, గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోట ప్రాంతాలు అంతర్జాతీయ పర్యాటక ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సుమారు రూ.150 కోట్లకు పైగా అంచనాలతో మౌలిక వసతులను మెరుగుపర్చుకోనున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘స్వదేశీ దర్శన్–2.0’ పథకం కింద దేశంలోని 36 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసింది. ఇందులో అరకు–లంబసింగి సర్క్యూట్, గండికోట పర్యాటక ప్రదేశాలకు చోటు కల్పించింది. త్వరలోనే పనులు ప్రారంభించేలా కేంద్ర పర్యాటక శాఖ ప్రాజెక్టు డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ల కోసం ఆర్ఎఫ్పీలను సైతం ఆహ్వానించింది. రాష్ట్ర పర్యాటక శాఖకు ప్రాజెక్టు అమలు బాధ్యతలను అప్పగించి సమయానుకూలంగా పూర్తి చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. స్థానిక సంస్కృతికి, పౌర సమాజ స్థితిగతులను మెరుగుపర్చేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. 2.0తో అందుబాటులోకి అధునాతన వసతులు 2.0 ప్రణాళికల ద్వారా పర్యాటక సామర్థ్యాన్ని పెంచేలా ఈ రెండు ప్రాంతాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయనున్నాయి. పర్యాటక, వారసత్వ సంపద పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాయి. పర్యాటకుల కోసం వాచ్ టవర్లు, రిసార్టులు, వసతి గదులు, కన్వెన్షన్ సెంటర్లు, అడ్వెంచర్ క్రీడలు, గోల్ఫ్ కోర్సులు, యాంపీ థియేటర్లు, సాంస్కృతిక భవనాలు, సౌండ్ లైట్ షోలను అందుబాటులోకి తీసుకురానున్నాయి. స్థానిక కళాకారులు, చేతివృత్తి కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేలా వారి కోసం ప్రత్యేక దుకాణ సముదాయాలను నిర్మించనున్నాయి. ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టు, రహదారి సౌకర్యం, ల్యాండ్ స్కేప్, డిజిటల్ టెక్నాలజీ, స్థానిక కాలనీల్లో మౌలిక వసతులు కల్పించనున్నాయి. పర్యాటకుల ‘క్యూ’ అరకు లోయలో ఏపీ పర్యాటక సంస్థ 4 రిసార్టులను నిర్వహిస్తోంది. మయూరిలో 80, అరకు వేలీలో 58, అనంతగిరిలో 30, టైడా రిసార్టులో 23 గదులను అందుబాటులో ఉంచింది. ఇటీవల లంబసింగిలో సైతం 11 కొత్త కాటేజీలను నిర్మిచింది. మరోవైపు విశాఖపట్నం నుంచి ప్రత్యేక ప్యాకేజీ టూర్లను నడుపుతోంది. అరకుతో పాటు బొర్రా గుహలు, వంజంగి, కొత్తపల్లి జలపాతాలు, పాడేరు పరిసర ప్రాంతాలను పర్యాటకులు వీక్షించేలా చర్యలు చేపట్టింది. కాగా, కడప జిల్లాలోని గండికోటకు విశిష్ట చారిత్రక నేపథ్యంతో పాటు అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ తరహాలో కొండలను చీల్చుకుంటూ ప్రవహించే పెన్నా నది ఒంపులు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఇక్కడికి వారాంతాల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఇందులో వాయు, జల, భూమిపై చేసే సాహస క్రీడల అకాడమీని నెలకొల్పారు. మరోవైపు 4వేల ఎకరాల్లో గండికోట ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ హోటల్ రంగ సంస్థ ఒబెరాయ్‌ను సైతం తీసుకొస్తోంది. (చదవండి: AP: జీవో నెం.1పై హైకోర్టులో విచారణ.. చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు) -
మళ్ళీ అందుబాటులోకి అరకు కాఫీ
-
AP Cold Waves: విశాఖ ఏజెన్సీ చరిత్రలో తొలిసారి!
దేశం వ్యాప్తంగా కోల్డ్‌వేవ్ ప్రభావం కనిపిస్తోంది. చలి దెబ్బకు తెలుగు రాష్ట్రాలు గజగజలాడిపోతున్నాయి. ఏపీలోనూ చలి పంజా విసురుతోంది. మొదటిసారిగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో మునుపెన్నడూ లేనంత అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మరో 3 రోజులు ఇదే తీవ్రతతో పరిస్థితి కొనసాగవచ్చని, చిన్నపిల్లలు.. వృద్ధులు.. శ్వాసకోశ సంబంధిత సమస్యలున్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా) : చలి పులి పంజాకు రాష్ట్రం గజగజా వణికిపోతోంది. కోల్డ్ వేవ్ ప్రభావం రాష్ట్రాన్ని తాకడంతో మునుపెన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి గాలుల తీవ్రత పెరిగింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోయాయి. అక్కడ సాధారణం కంటె 3 నుంచి 5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంధ్రా కశ్మీర్‌గా అభివర్ణించే ‘చింతపల్లి’తో పాటు హుకుంపేట, జి.మాడుగుల మండలం కుంతలం, గూడెం కొత్తవీధి మండలం జీకే వీధిలో అత్యల్పంగా 1.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతకు ముందు ఆ రికార్డు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌గా ఉండేది!. డుంబ్రిగూడ మండల కేంద్రం, పెదబయలు మండలం గంపరాయిలో 2.6, హుకుంపేట మండలం కొక్కిసలో 2.7, ముంచంగిపుట్టు మండలం గొర్రెలమెట్టలో 2.8, పెదబయలులో 2.9, పాడేరులో 3.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఇక్కడ అత్యల్పంగా 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తొలిసారిగా ఇప్పుడు 1.5 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు, పర్యాటకులు ఆశ్చర్యపోతున్నారు. బయటకు రావడానికే బెంబేలెత్తిపోతున్నారు. అరకు తదితర ప్రాంతాల్లోనూ పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. విజయవాడలో ఆదివారం ఉదయం 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రాన్నీ కోల్డ్‌వేవ్ తాకినట్టే.. ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో కోల్డ్ వేవ్ ప్రభావం ఉంటుందని ప్రకటించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటె 5 నుంచి 6 డిగ్రీలు పడిపోతే కోల్డ్ వేవ్‌గా పరిగణిస్తారు. ఆంధ్రా ఊటీగా పేరున్న అరకు ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో 3 నుంచి 5 డిగ్రీలు పడిపోయాయి. దీంతో కోల్డ్ వేవ్ మన రాష్ట్రాన్ని తాకినట్లే వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశ్‌లో ఉన్న అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్(వాతావరణంలోని ఎత్తయిన ప్రదేశాల్లో వీచే గాలులు), పశ్చిమ గాలుల ప్రభావంతో కోల్డ్‌వేవ్ కొనసాగుతోంది. మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. మరీ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. -
గిరిజనులకు అండగా.. విశాఖ శ్రీ శారదా పీఠం
-
మన్యం గజగజ! భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు.. అరకులోయలో 8.6 డిగ్రీలు..
సాక్షి, పాడేరు: చలి తీవ్రతకు మన్యం ప్రాంతం గజగజ వణుకుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పొగమంచు, చలిగాలుల తీవ్రత పెరగడంతోపాటు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. అరకులోయలోని కేంద్ర కాఫీబోర్డు వద్ద సోమవారం ఉదయం 8.6 డిగ్రీలు, పాడేరుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 9డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 13.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మినుములూరులో ఆదివారం 10 డిగ్రీలు, అరకులోయలో 15.2 డిగ్రీలు, చింతపల్లిలో 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, ఒక్కరోజులోనే మినుములూరు మినహా, అరకులోయ, చింతపల్లి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గి చలిగాలులు పెరిగాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి చలి తీవ్రత పెరగడంతో స్థానికులతోపాటు ఏజెన్సీని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏజెన్సీ అంతటా పొగమంచు దట్టంగా కురుస్తోంది. సోమవారం ఉదయం 10గంటల వరకు అరకులోయ, పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, చింతపల్లి ప్రాంతాల్లో పొగమంచు కురిసింది. పది గంటల తర్వాతే సూర్యుడు కనిపించాడు. పొగమంచు కారణంగా లంబసింగి, పాడేరు, అనంతగిరి, దారకొండ, రంపుల, మోతుగూడెం, మారేడుమిల్లి ఘాట్‌రోడ్లలో వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
అరకు : మద్యం మత్తులో యువతి విచిత్ర ప్రవర్తన
-
అరకు: మద్యం మత్తులో యువతి హల్చల్..
సాక్షి, అల్లూరి జిల్లా: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులో ఓ యువతి మద్యం మత్తులో రెచ్చిపోయింది. పీకల దాకా మద్యం సేవించి ఓ దుకాణ యజమానురాలితో అనుచితంగా ప్రవర్తిస్తూ హల్చల్ చేసింది. అంతటితో ఆగకుండా ఆమెను బూతులు తిడుతూ హంగామా చేసింది. ఆమె చేష్టలకు అక్కడున్న వారంతా షాకయ్యారు. అయితే, ఆమెను దారుణంగా తిట్టిన తర్వాత ఓ చోట కూర్చుని ఆమె విచిత్రంగా ప్రవర్తించింది. బుట్టు పీక్కుంటూ నేను ఏ తప్పు చేయలేదు. నేనేమీ చేయలేదు అంటూ గట్టిగా అరస్తూ కేకలు పెట్టింది. ఈ క్రమంలో సదరు మహిళపై.. దుకాణం యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం.. పోలీసులు యువతిని స్టేషన్‌కు తీసుకుని వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. -
అగుడు కదిపితే చాలు అద్భుత లోకాల్లో ఉన్న అనుభూతి..
ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పుడు కొత్త టూరిస్టు స్పాట్లు వెలుగు చూస్తున్నాయి. అగుడు కదిపితే చాలు అద్భుత లోకాల్లో ఉన్న అనుభూతిని పంచుతున్నాయి. పాల సంద్రాన్ని తలిపించే మంచు మేఘాలతో పాటు ఇప్పుడు హొయలొలికే కొత్త జలపాతాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. అంతెత్తునుంచి ఎగసిపడే జలసవ్వడులు సుమధుర సంగీత ఝరిలో జలకాలాడిస్తున్నాయి. వాటిని సందర్శించేందుకు పర్యాటకులు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు భారీగా తరలిస్తున్న సందర్శకులు అయిష్టంగానే తిరిగి ఇళ్లకు వెళుతున్నారు. గూడెంకొత్తవీధి/అరకులోయ రూరల్: జిల్లాలో కొత్తగా వెలుగులోకి వస్తున్న టూరిస్టు స్పాట్లు సైతం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఒకదానిని మించి ఒకటి అన్నట్టు ఉన్న కొత్త ప్రాంతాలను టూరిస్టులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారు. అనంతగిరి, లంబసింగి, తాజంగి, చెరువులవెనం, పాడేరులోని వంజంగి మేఘాల కొండలే కాదు. అంతకు మించిన ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలు అరకులోయ, గూడెంకొత్తవీధి తదితర మండలాల్లో చాలా ఉన్నాయి. సప్పర్ల రెయిన్ గేజ్ గూడెంకొత్తవీధి మండల కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సప్పర్ల రెయిన్‌గేజ్ ప్రాంతం సముద్రమట్టానికి సుమారు 4000 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ 24 గంటలూ అత్యంత శీతల వాతావరణంతోపాటు మంచు మేఘాలు చాలా కిందనుంచి సందర్శకులను తాకుతూ వెళుతుంటాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన దారకొండ దారాలమ్మ ఆలయంతోపాటు సీలేరు వెళ్లే పర్యాటకులంతా తప్పనిసరిగా ఇక్కడ రెయిన్‌గేజ్ వద్దకు వెళ్లి కాసేపు ఉండి ఇక్కడ అందాలను ఆస్వాదిస్తారు. గతంలో అప్పటి ఉమ్మడి విశాఖ కలెక్టర్ యువరాజ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి పర్యటకంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ప్రస్తుత సీజనులో దూరప్రాంతాలనుంచి ఇక్కడకు వస్తున్న పర్యాటకులసంఖ్య పెరుగుతోంది. ఈ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజం కింద అభివృద్ధి చేస్తామని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. రణజిల్లేడలో.. ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో మరో అద్భుతమైన టూరిజం స్పాట్ చూపరులకు కనువిందు చేస్తోంది. పద్మాపురం పంచాయతీ రణజిల్లేడ జలపాతం ఇప్పటికే ప్రాచుర్యం పొందగా, దాని సమీపంలో అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాలు పర్యాటకులను పరవశింప చేస్తున్నాయి. ఇక్కడి మంచు సోయగాలు, సూర్యోదయ అందాలు ఆకర్షిస్తున్నాయి. మాడగడలో వ్యూ పాయింట్ కొద్ది రోజుల నుంచి పర్యాటకులతో సందడిగా మారిన మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ సోమవారం పర్యాటకులతో కిటకిటలడింది. వివిధ ప్రాంతల నుంచి వచ్చిన పర్యాటకులు సందడి చేశారు, తెల్లవారుజామునలో చల్లని వాతవరణంలో మంచు అందాలను వీక్షించి ఫొటోలు తీసుకుంటూ గడిపారు. మూడు కొత్త జలపాతాలు గూడెంకొత్తవీధికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లికి సమీపంలో దోనుగుమ్మల జలపాతం కొత్తగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడికి వెళ్లేందుకు కొద్దిదూరం సీసీ రోడ్డు నిర్మిస్తే చాలు ఈప్రాంతానికి పర్యాటకంగా ఆదరణ లభించే అవకాశం ఉంది. దోనుగుమ్మల జలపాతానికి రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశామని పంచాయతీరాజ్ జేఈ జ్యోతిబాబు తెలిపారు. జలపాతాలకు వెళ్లేందుకు రహదారి నిర్మాణానికి రూ.19లక్షలు మంజూరు చేసినట్టు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. కార్యరూపం దాల్చితే త్వరలోనే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సంపంగిగొంది జలపాతం కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది. అనంతగిరి మండలం చిట్టంపాడు జలపాతం ఇటీవల వెలుగుచూసింది. అక్కడికి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో వెళుతున్నారు. -
మన్యంలో చలి విజృంభణ
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా చలి గాలులు అధికమయ్యాయి. ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకులోయలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బుధవారం అరకులోయ కేంద్ర కాఫీ బోర్డు వద్ద 9.8 డిగ్రీలు నెలకొనగా గురువారం ఉదయం 6.8 డిగ్రీలకు పడిపోవడంతో చలి అధికమైంది. ఒక్కరోజు వ్యవధిలోనే 3 డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గడంతో అరకు ప్రాంత వాసులు చలితో ఇబ్బందులు పడుతున్నారు. పొగ మంచు దట్టంగా కురవడంతో పాటు చలి పెరగడంతో స్థానికులు, పర్యాటకులు అవస్థలు పడ్డారు. ఉదయం 10 గంటల వరకు మంచు కమ్ముకుంది. అలాగే పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 10 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 10.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో కూడా పొగ మంచు దట్టంగానే కురిసింది. -
Araku Valley: అరకు పర్యాటకుల కోసం ప్రత్యేక రైలు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): దసరా సెలవుల నేపథ్యంలో అరకు పర్యాటకుల కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం–అరకు మధ్య అక్టోబరు 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ రైలును నడిపేందుకు సిద్ధమైంది. ఈ స్పెషల్ రైలు (08509) ప్రతీ రోజు ఉదయం 8.30 గంటలకు విశాఖలో బయల్దేరి మధ్యాహ్నం 11.30 గంటలకు అరకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ స్పెషల్ రైలు(08510) అరకులో ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు 5–స్లీపర్‌క్లాస్, 7–సెకండ్ క్లాస్, 2–సెకండ్ క్లాస్ కమ్ లగేజీ కోచ్‌లతో నడుస్తుంది. ఈ రైళ్లు ఇరు మార్గాల్లో సింహాచలం, కొత్తవలస, బొర్రాగుహలు స్టేషన్లలో ఆగుతాయి. వంజంగి హిల్స్‌కు పర్యాటకుల తాకిడి సాక్షి, పాడేరు: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మేఘాల కొండ వంజంగి హిల్స్‌కు మంగళవారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. దసరా సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు, విద్యార్థులు వంజంగి హిల్స్ ప్రాంతానికి చేరుకుని సూర్యోదయంతో పాటు మంచు, మేఘాలను చూసి పరవశించారు. ఉదయం 10గంటల వరకు పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉంది. -
మంచుతెరలు.. సూర్యోదయం అందాలు అదుర్స్.. ఎక్కడంటే!
సాక్షి, అరకు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు – అనంతగిరి ఘాట్‌మార్గంలో గాలికొండ వ్యూపాయింట్ వద్ద ప్రకృతి అందాలు మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. గురువారం ఉదయం తరలివచ్చిన పర్యాటకుల సెల్ఫోన్ల వీటిని బంధించారు. మలుపుల వద్ద మంచు అందాలను తిలకించి పులకించిపోయారు. వంజంగి హిల్స్‌లో మంచుతెరలు పాడేరు : మేఘాలు, మంచు అందాల నిలయంగా విశ్వవ్యాప్తి పొందిన పాడేరు మండలం వంజంగి హిల్స్‌లో గురువారం ప్రకృతి కనువిందు చేసింది. అనేక ప్రాంతాలకు చెందిన పర్యాటకులు బుధవారం రాత్రే వంజంగి హిల్స్‌కు చేరుకుని కల్లాలబయలు, బోనంగమ్మ పర్వతంపై గుడారాలు వేసుకుని బస చేసారు. తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో సూర్యోదయం అందాలు పర్యాటకులను అబ్బురపరిచాయి. కొండల నిండా మంచు నెలకొనడంతో ఇక్కడ ప్రకృతి రమ్యతను చూసి పర్యాటకులంతా మంత్రముగ్ధులయ్యారు. ఉదయం పది గంటల వరకు మంచుతెరలు ఆకట్టుకున్నాయి. (క్లిక్: అందమైన పెళ్లికి ఆదివాసీలే పేరంటాలు) -
Araku Valley: అందమైన పెళ్లికి ఆదివాసీలే పేరంటాలు
సాక్షి, అమరావతి: ప్రకృతి అందాల నెలవైన అరకు లోయలో ‘గిరి గ్రామదర్శిని’ ఆదివాసీ జీవన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. పచ్చటి కొండలు, లోతైన లోయలు, జాలువారే జలపాతాల నడుమ అరకును సందర్శించే పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తోంది. అన్నిటికి మించి గిరిజన సంప్రదాయ వస్త్రధారణలో పర్యాటకులకు వివాహ వేడుక అవకాశాన్ని కల్పిస్తోంది. అరకులోని గిరిజన మ్యూజియానికి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పెదలబుడు’ గ్రామంలో ప్రభుత్వం ప్రత్యేకంగా గిరిజన గ్రామాన్ని నిర్మించింది. ఒడిశా సరిహద్దున గల ఈ ప్రాంతంలో దాదాపు 92 శాతం జనాభా గిరిజనులే. గిరిజన ఆచారాల్లో ఒదిగిపోవచ్చు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్లోని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) ఆదివాసీల జీవనశైలి, వారి సంప్రదాయాలు, ఆచారాలు, ఆహారపు అలవాట్లను అర్థం చేసుకోవడానికి ‘గిరి గ్రామదర్శిని’ని తీర్చిదిద్దింది. ఈ గ్రామంలో పర్యాటకులకు సాధారణ స్థానిక ఆదివాసీ వాతావ రణాన్ని అందిస్తూ సుమారు 15కి పైగా సంప్రదాయ గిరిజన గుడిసెలను ఏర్పాటు చేసింది. గిరిజనుల జీవన విధానాన్ని అనుభవించాలనుకునేవారు ఈ కాటేజీలను బుక్ చేసుకుని ఒకట్రెండు రోజులు బస చేయవచ్చు. ఈ సమయంలో పర్యాటకులు స్థానిక గిరిజన సమూహాలతో మమేకమై గడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివాసీల మాదిరిగానే కట్టు, బొట్టు, ఆభరణాలు ధరించి వారి ఆచార వ్యవహారాల్లో పాల్గొనవచ్చు. ఎద్దుల బండిపై సవారీ, రాగి అంబలి, విలు విద్య క్రీడా కేంద్రం, బొంగరం ఆట, కొమ్మ రాట్నం, థింసా ఆడుకునేందుకు ప్రత్యేక స్థలం, నాగలి పట్టి దుక్కి దున్నడం ఇలా ఒకటేమిటి అనేక అంశాలు గిరి గ్రామదర్శినిలో ఉన్నాయి. గిరిజనుల ఆట విడుపు అయిన కోడి పుంజులను పట్టుకోవడం కూడా పర్యాటకుల కార్యకలాపాల్లో భాగం చేశారు. (క్లిక్: జాతీయ సదస్సులో మరోసారి ‘అరకు కాఫీ’ అదుర్స్) అక్కడే పెళ్లి చేసుకోవచ్చు గిరి గ్రామదర్శినిలో పర్యాటకులను ఆదివాసీ వివాహ పద్ధతి ఎక్కువగా ఆకట్టుకుంటోంది. వినూత్న రీతిలో వివాహం చేసుకోవాలనుకునే యువతకు, ఇప్పటికే వివాహమైన జంటలకు గిరిజన వివాహ అనుభూతిని అందిస్తోంది. పెదలబుడు ఎకో టూరిజం వెల్ఫేర్ సొసైటీ ఈ కాన్సెప్ట్‌ను రూపొందించింది. ఇందులో వధూవరులతోపాటు, స్నేహితులు, బంధువులను కూడా గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ముస్తాబు చేస్తారు. గుడిసెను వెదురు, పూలు, ఆకులతో అలంకరిస్తారు. ఇక్కడి గిరిజన పూజారి గిరిజన సంప్రదాయాల ప్రకారం వివాహ తంతును నిర్వహించేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం తీసుకుంటారు. ఆచారమంతా గిరిజన సంగీతంతో మార్మోగుతుంది. పెళ్లి విందు కూడా స్థానిక జీవన శైలిలో ఉంటుంది. క్యాంప్ ఫైర్ చుట్టూ థింసా నృత్యం చేస్తూ స్థానిక గిరిజన మహిళలు అతిథులను అలరిస్తారు. గిరిజన వివాహాలు పూర్తిగా మహిళలతో నిర్వహిస్తుండటం కూడా ఇక్కడి విశేషం. ఈ తరహా వివాహాన్ని కోరుకునేవారు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. (క్లిక్: పర్యాటక ప్రాంతాలు కళకళ.. భారీగా ఆదాయం) -
జాతీయ సదస్సులో మరోసారి ‘అరకు కాఫీ’ అదుర్స్
సాక్షి, అమరావతి/పాడేరు : అరకు కాఫీ జాతీయ స్థాయి వేదికపై మరోసారి అదుర్స్ అనిపించింది. ప్రతిష్టాత్మక సదస్సులో ప్రథమ బహుమతిని సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ సాగును ప్రోత్సహిస్తూ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని చాటింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ గుర్తింపు పొందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో–సోషల్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు కోల్‌కతాలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది. ‘పర్యావరణాన్ని పరిరక్షిస్తూ జీవనోపాధి పెంపొందించడం–స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మహిళా సాధికారతకు ఊత మివ్వడం’ అనే అంశంపై నిర్వహించిన ఈ సద స్సులో 14 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని తమ ప్రాంతాల్లో గిరిజనుల ఆర్థికాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఏపీ ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు, డైరెక్టర్లు పి.చిన్నప్పదొర, ఎం.రామకృష్ణ, ఎస్.ఈశ్వరమ్మ, జనరల్ మేనేజర్ సీఏ మణికుమార్ ఆంధ్రాలో గిరిజనుల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్న కాఫీ ప్రాజెక్టుపై సమగ్రంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏజెన్సీ ఏరియాలోని 2,27,021 ఎకరాల్లో కాఫీ పంట సాగు చేస్తున్నారని, ఏటా గిరిజన రైతులకు కచ్చితమైన ఆదాయం లభిస్తోందని, బెంగళూరు మార్కెట్లో నాణ్యమైన కాఫీ గింజలుగా ప్రసిద్ధి చెందడం వంటి అంశాలను వివరించారు. దీంతో మన కాఫీ ప్రాజెక్ట్‌కు ప్రథమ స్థానం లభించింది. ఉన్నతాధికారుల అభినందనలు జాతీయ స్థాయి అవార్డును సాధించిన ఏపీ ట్రైకార్ బృందానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, సంచాలకులు ఎం.జాహ్నవి, ట్రైకార్ ఎండీ రవీంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ అవార్డు పొందడం ద్వారా జాతీయ స్థాయిలో అరకు కాఫీ మరోసారి గొప్ప గుర్తింపు పొందిందని ట్రైకార్ జీఎం మణికుమార్ తెలిపారు. అనుకూల వాతావరణం... ప్రభుత్వ సహకారమే కారణం రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణం, వృక్ష సంపదతో ఏర్పడే సహజసిద్ధమైన నీడ, నేల స్వభావం కాఫీ సాగుకు అత్యంత అనుకూలం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ–పాడేరు) పరిధిలో 2024–25 నాటికి దశల వారీగా కాఫీ సాగు విస్తరణను పెంచుతూ రూ.526.160 కోట్లతో ప్రత్యేక కాఫీ ప్రాజెక్ట్ అమలుకు శ్రీకారం చుట్టింది. కాఫీ సాగుకు అవసరమైన విత్తనాలు, యంత్రాలు, బోర్ల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం, మొయిన్ రోడ్డు నుంచి అంతర్గత అప్రోచ్ రోడ్ల నిర్మాణం, పల్పింగ్ యూనిట్ల ఏర్పాటు, కాఫీ గింజల సేకరణ, మార్కెటింగ్æ వంటి చర్యలను చేపట్టింది. ప్రభుత్వ తోడ్పా టు వల్ల అరకు కాఫీకి దేశ విదేశాల్లో గుర్తింపు లభిస్తోంది. యూరప్, పారిస్ సహా అంతర్జాతీయంగా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. -
పర్యాటక ప్రాంతాలు కళకళ.. భారీగా ఆదాయం
కరోనా దెబ్బకు కుదేలైన పర్యాటక రంగం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పుడు పూర్తిస్థాయిలో పుంజుకుంది. దేశవిదేశాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, డముకు వ్యూ పాయింట్, కటికి, తాటిగుడ జలపాతాలు, అరకులోయలో పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, కాఫీ హౌస్, డుంబ్రిగుడలోని చాపరాయి, పాడేరు మండలంలో వంజంగి హిల్స్‌కు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. అనంతగిరి/అరకులోయ: కరోనా కారణంగా మన్యంలో మూతపడిన పర్యాటక ప్రాంతాలు పునఃప్రారంభమైన తరువాత మండలంలోని బొర్రా గుహలతో పాటు మిగతా వాటికి సందర్శకులు తాకిడి పెరిగింది. గత రెండేళ్ల కన్నా ఈ ఏడాది గుహలను సందర్శించిన వారి సంఖ్య భారీగా పెరిగింది. పెద్ద ఎత్తున ఆదాయం సమకూరింది. 2020 సంవత్సరంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 1,80,260 మంది సందర్శించగా రూ.131.35 లక్షల ఆదాయం లభించింది. 2021 సంవత్సరంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 2,61,000 మంది సందర్శించగా రూ.187 లక్షల ఆదాయం సమకూరింది. 2021 సంవత్సరం కంటే ఈ ఏడాది గుహలను సందర్శించిన వారి సంఖ్య సుమారు 80 వేలు అధికంగా ఉంది. గత ఏడాది జనవరి నుంచి జూలై వరకు 2,22,653 మంది సందర్శించగా రూ.161.21 లక్షల ఆదాయం లభించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు సుమారు మూడు లక్షల మంది సందర్శించగా సుమారు రూ.200 లక్షలు ఆదాయం లభించింది. అరకులోయలో... గత ఏడాది అక్టోబర్ నెల నుంచి అరకులోయకు పర్యాటకుల తాకిడి పెరిగింది. పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియంతో పాటు చాపరాయి జలపాతం ప్రాంతాలకు పర్యాటకులు అధికంగా తరలివస్తున్నారు. గత 12నెలల్లో అరకులోయ గిరిజన మ్యూజియాన్ని 3 లక్షల మంది, పద్మాపురం గార్డెన్‌ను సుమారు 2.50 లక్షల మంది సందర్శించారు. సుమారు రూ.2 కోట్ల ఆదాయం లభించింది. చాపరాయి జలపాతం, పాడేరు మండలంలోని వంజంగి హిల్స్‌ను పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శిస్తున్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల సంఖ్య పెరగడంతో టూరిజంశాఖకు చెందిన రిసార్టులు, రెస్టారెంట్ల ఆదాయం భారీగా సమకూరుతోంది. (క్లిక్: వజ్రాల వేట.. అత్యంత ఖరీదైన కోహినూర్ వజ్రం కూడా అక్కడే..) పెరిగిన పర్యాటకులు బొర్రా గుహలను సందర్శించే వారి సంఖ్య పెరిగింది. బొర్రాలోని సదుపాయలు కల్పనకు చర్యలు చేపడుతున్నాం. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. – బాబుజీ డీవీఎం పర్యాటకశాఖ -
అరకులో న్యాయమూర్తి పెళ్లి వేడుక
సాక్షి, పాడేరు (ఏఎస్ఆర్ జిల్లా): గిరిజన సంప్రదాయంలో ఓ పెళ్లి వేడుక. వరుడు సుప్రీం కోర్టు న్యాయమూర్తి. వధువు ఆయన శ్రీమతి. చుట్టూ న్యాయమూర్తులు. గిరిజనులే పెళ్లి పెద్దలు. చట్టాలను ఔపోసన పట్టి, వేలాది కేసుల్లో ప్రతిభావవంతమైన తీర్పులిచ్చిన న్యాయమూర్తి, ఆయన శ్రీమతి ఆ గిరిజనుల ముందు సిగ్గుమొగ్గలయ్యారు. గిరిజన సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో మెరిసారు. మరోసారి పెళ్లి పీటలెక్కి ఒద్దికగా కూర్చున్నారు. గిరిజన పూజారులు న్యాయమూర్తి దంపతులకు గిరిజన ఆచారం ప్రకారం మరోసారి వైభవంగా వివాహం చేశారు. అలనాటి వివాహ వేడుకను గురుు తెచ్చుకుంటూ న్యాయమూర్తి మరోసారి తన శ్రీమతికి తాళి కట్టి మురిసిపోయారు. దండలు మార్చుకొని సంబరపడ్డారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలోని పెదలబుడు గ్రామంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, అమితా ఉదయ్ దంపతుల గిరిజన సంప్రదాయ వివాహ వేడుక అలరించింది. ఈ వేడుకలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా, సుచితా మిశ్రా దంపతులు, ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లాహ్, జీబా అమానుల్లాహ్ దంపతులు, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్, నల్సా డైరెక్టర్ పి. శేగల్, పాల్గొన్నారు. వేసవి విడిదిలో భాగంగా జిల్లాలోని అరకు లోయను సుప్రీంకోర్టు న్యాయమూర్తి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు, ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దంపతులు సందర్శించారు. వారితో పాటు జిల్లా న్యాయమూర్తులు రైలు మార్గంలో అరకు లోయ చేరుకున్నారు. వారికి రైల్వే స్టేషన్లో కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ వి.అభిషేక్ స్వాగతం పలికారు. గిరిజన మహిళలు థింసా నృత్యాలు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. న్యాయమూర్తులు పెదలబుడు గ్రామంలోని ఐటీడీఏ ఎకో టూరిజం ప్రాజెక్టు గిరి గ్రామదర్శినిని సందర్శించి గ్రామ దేవతలకు పూజలు చేశారు. -
విశాఖ–కిరండూల్ ఎక్స్‌ప్రెస్‌కు మరో విస్టాడోమ్ కోచ్
సాక్షి, పాడేరు : ఆంధ్రా ఊటీ అరకులోయ రైల్వే ప్రయాణికులు, పర్యాటకుల సౌకర్యార్థం విశాఖ–కిరండూల్ ఎక్స్‌ప్రెస్‌లో అదనంగా విస్టాడోమ్ కోచ్ ఏర్పాటు చేయాలని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి రైల్వే ఉన్నతాధికారులను కోరారు. ఇటీవల కేంద్ర రైల్వేశాఖ మంత్రితో చర్చించి విజయవాడ రైల్వే డీసీఎంకు అదనపు విస్టాడోమ్ ఏర్పాటుపై ఎంపీ మాధవి లేఖ రాశారు. దీంతో త్వరలో అదనపు విస్టాడోమ్ కోచ్ ఏర్పాటు చేస్తామని, ప్రయాణికులు, పర్యాటకులకు కొత్త అనుభూతి కలిగించేలా అరకు రైల్వే స్టేషన్ సుందరీకరణ చేపడతామని వాల్తేర్ డివిజన్ డీసీఎం అరకు ఎంపీకి శుక్రవారం లేఖ ద్వారా తెలిపారు. అంతేకాకుండా స్టేషన్ భవనాలను శిల్పకళతో రూపొందించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. -
ఘనంగా అరకు ఎమ్మెల్యే కుమారుడి వివాహ వేడుక
సాక్షి, అరకులోయ రూరల్: అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ కుమారుడు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చెట్టి వినయ్ వివాహ వేడుక స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్ పర్సన్ స్వాతి రాణి, ట్రైకార్ చైర్మన్ బుల్లిబాబు, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే హైమావతి పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అరకులోయ, పాడేరు తదితర ప్రాంతాలకు చెందిన ఉద్యోగ, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయపార్టీల నేతలు పాల్గొన్నారు. చదవండి: (చికెన్ 312 నాటౌట్.. చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు) -
మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు కన్నుమూత
జియ్యమ్మవలస: వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజు తండ్రి, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మామ, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు శుక్రవారం కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మూడురోజుల నుంచి విశాఖపట్నంలో ఉంటూ వైద్యసేవలు పొందుతున్నారు. శుక్రవారం ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబీకులు ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ప్రాణాలు విడిచారు. ఆయన భౌతికకాయాన్ని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని చినమేరంగి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. చంద్రశేఖరరాజు 1989 నుంచి 1994 వరకు నాగూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. ఏపీఈసీజీసీ చైర్మన్‌గా పనిచేశారు. కొమరాడ జెడ్పీటీసీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనకు భార్య రాజశ్రీదేవి, కుమారుడు పరీక్షిత్‌రాజు, కుమార్తె పల్లవిరాజు ఉన్నారు. మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఈయనకు సోదరుడు. కాగా, శత్రుచర్ల చంద్రశేఖరరాజు మృతివార్త తెలిసిన వెంటనే జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, డాక్టర్ రామ్మోహనరావు చినమేరంగి చేరుకుని భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
గంజాయితో ముగ్గురు అరెస్టు
అరకులోయ రూరల్ : మండల కేంద్రం స్థానిక ఆర్టీసీ కాంప్లేక్స్‌లో 22 కేజీలు గంజాయిని తరలించేందకు సిద్ధంగా ఉన్న ముగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ నజీర్ తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.72 వేలు ఉంటుందన్నారు. నిందితుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు, ఒక మహిళ ఉన్నరన్నారు. వీరిని మహ్మద్ ఆజాధ్‌ఆలీ, జునైధ్, ఆనమ్ ఆన్సారిలుగా గుర్తించామన్నారు. ఒడిసా రాష్ట్రం పాడువ ప్రాంతం నుంచి అరకులోయ మీదుగా గంజాయి తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో పట్టుకున్నామన్నారు. -
Famous Tourist Places Vizag: వహ్ వైజాగ్! ఒకటా రెండా.. ఎన్నెన్ని అందాలో
సాక్షి, విశాఖపట్నం : ప్రకృతి అందాలతో అలరారే విశాఖ పర్యాటకంగా కూడా గత రెండు దశాబ్ధాలుగా గణనీయంగా అభివృద్ధి చెందింది. ఒకవైపు సాగర సోయగాలు.. మరోవైపు ఎత్తైన తూర్పు కనుమల అందాలు ప్రపంచ పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. కొండ కోనలను చూసినా.. ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న మన్యంలో అడుగు పెట్టినా.. అలల సవ్వడితో.. హొయలొలుకుతున్న సాగర తీరంలో అడుగులు వేస్తున్నా.. ఆధ్యాత్మిక శోభతో ఆహ్లాదపరిచే దేవాలయాలు.. ఏ చోటకు వెళ్లినా.. భూతల స్వర్గమంటే ఇదేనేమోనన్న అనుభూతిని అందిస్తుంది. 2004 తరువాత నుంచి పర్యాటకంగా విశాఖ రూపురేఖలు మారిపోయాయి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా నగరంలోనే కాకుండా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కూడా సరికొత్త పర్యాటక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఓసారి చూసొద్దాం రండి... మదిదోచే కైలాసగిరి ఆర్కే బీచ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కైలాసగిరి ఉంది. పచ్చని పార్కులు, ఆహ్లాద వాతావరణం, బీచ్ వ్యూ ఇక్కడ మంచి అనుభూతినిస్తాయి. కొండ కింద నుంచి రోప్ వే, రోడ్డు, మెట్ల మార్గాల ద్వారా పైకి చేరుకోవచ్చు. విశాఖ వచ్చే ప్రతి పది మంది పర్యాటకుల్లో 8 మంది కైలాసగిరి వెళ్తుంటారు. చదవండి: Lambasingi: లంబసింగికి చలో చలో భీమిలి.. అందాల లోగిలి.. ఆర్కే బీచ్ రోడ్డు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో భీమిలి ఉంది. తూర్పు తీరంలో పురాతన ఓడ రేవుల్లో ఒకటిగా పిలుస్తారు. గోస్తనీనది ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. డచ్ పాలకుల సమాధులు, లైట్ హౌస్‌లు, బౌద్ధ మత ఆనవాళ్లు ఇక్కడ అనేకం. దీని ముందున్న రుషికొండ బీచ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రావడం విశేషం. జలజల జలపాతాలు.. విశాఖ మన్యంలోకి వెళ్తే.. అడుగడుగునా జలపాతాలు హొయలుపోతూ కనిపిస్తుంటాయి. కటిక, చాపరాయి, సరయు, డుడుమ, కొత్తపల్లి, సీలేరు ఐసుగెడ్డ, పిట్టలబొర్ర, బొంగుదారి జలపాతాలతో పాటు చిన్న చిన్న జలపాతాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. ఆంధ్రా ఊటీ.. అరకు.. విశాఖ మన్యం పేరు చెబితే.. పర్యాటకులు పులకరించిపోతారు. సముద్ర మట్టానికి 910 మీటర్ల ఎత్తులో ఉన్న అరకు వ్యాలీని సందర్శించేందుకు పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇది జలపాతాలు, క్రిస్టల్ క్లియర్ స్ట్రీమ్స్ , పచ్చని తోటలతో కళకళలాడుతుంటుంది. మంచు మేఘాల వంజంగి మేఘాలలో తేలిపొమ్మన్నది అంటూ టూరిస్టులు ఎంజాయ్ చేసే ప్రాంతం వంజంగి. పాడేరు మండలంలో ఉన్న వంజంగి కొండపైకి ఎక్కితే మేఘాలను తాకుతున్నట్లు అనుభూతిని పొందొచ్చు. బుద్ధం.. శరణం.. గచ్ఛామి... ఆర్కే బీచ్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ప్రాచీన బౌద్ధ క్షేత్రాలు తొట్లకొండ, బావికొండ ఉన్నాయి. తొట్లకొండ తదితర ప్రాంతాలు నిత్యం పర్యాటకులను అలరిస్తున్నాయి. జంతు ప్రపంచం పిలుస్తోంది... ఆర్కే బీచ్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో జూపార్క్ ఉంది. ఎన్నో అరుదైన జంతువులు, వన్యప్రాణులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. జూ ఎదురుగా ఉండే కంబాలకొండలో వన్యప్రాణులతో పాటు సాహస క్రీడలు, బోటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. భలే మంచు ఊరు డిసెంబర్..జనవరి మాసాల్లో వాతావరణం సుమారుగా 0 డిగ్రీలకు పడిపోతూ.. ఆంధ్రా కాశ్మీరంగా పేరొందిన లంబసింగికి చలికాలంలో పర్యాటకులు క్యూ కడతారు. సముద్ర మట్టానికి ఈ ప్రాంతం 3600 మీటర్ల ఎత్తులో ఉంది. విశాఖ నగరానికి 101 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదయం 10 గంటలైనా మంచు వీడకుండా శీతల గాలులు వీస్తు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. వీఎంఆర్డీఏ పార్క్ ఆర్కే బీచ్ వ్యూను చూస్తూ పర్యాటకులు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పిక్నిక్లు జరుపుకునేందుకు, ఆహ్లాదాన్ని పొందేందుకు అనువైన ప్రదేశం. ఇటీవలే రూ.35 కోట్లతో పార్క్‌ను అత్యాధునికంగా అభివృద్ధి చేశారు. అటు కురుసుర.. ఇటు టీయూ 142 ఆర్కే బీచ్‌లో విహరించి కాస్తా ముందుకు వెళ్తే.. పర్యాటకులను ఆకట్టుకునే కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం ఉంటుంది. దాని ఎదురుగానే టీయూ– 142 యుద్ధ విమాన మ్యూజియం. ఇప్పుడు వీటి సరసన... సీ హారియర్ మ్యూజియం సిద్ధమవుతోంది. ఇంకాస్త ముందకెళితే విక్టరీఎట్ సీ దర్శనమిస్తుంది. పురాతన బొర్రా గుహలు.. మీరు చరిత్ర ప్రేమికులైతే, బొర్రా గుహలు ఉత్తమ పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలుస్తాయి. అరకులోయలోని అనంతగిరి కొండల మధ్య ఉన్న ఈ గుహలు వేల సంవత్సరాల పురాతనమైనవే కాదు.. దేశంలో కనిపించే అన్ని గుహలలో అతిపెద్దవి. పూర్తిగా సహజ సున్నపురాయితో తయారైన ఈ గుహలు ప్రకృతిలో కాలిడోస్కోపిక్, జలపాతాలతో పాటు రాళ్లపై పడే కాంతి చాలా రంగురంగులుగా దర్శనమిస్తుంటాయి. ప్రతి ఏడాది సుమారు 3 లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తుంటారు. చరిత్ర చెప్పే మ్యూజియం వీటన్నింటినీ సందర్శించి.. ఇంకొంచెం ముందుకెళ్తే.. విశాఖ మ్యూజియం కనిపిస్తుంది. దాని ఎదురుగానే.. భారత నౌకాదళానికి చెందిన మొట్టమొదటి సబ్‌మెరైన్ కల్వరి çహాల్ కనిపిస్తుంది. విశాఖ మ్యూజియంలో భారత దేశ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు ప్రదర్శిస్తుంటారు. అల ఆర్కే బీచ్‌లో.. వైజాగ్ వచ్చే ప్రతి ఒక్కరూ బీచ్‌కు వెళ్లి తీరాల్సిందే. అందుకే వీకెండ్స్ అయితే ఇసకేస్తే రాలనంత జనం బీచ్‌లో వాలిపోతారు. షాపింగ్ మొదలుకొని స్టే, డిన్నర్ వరకూ సకల సౌకర్యాలు పర్యాటకులకు ఇక్కడ లభిస్తాయి. -
మన్యంలో చలి పులి
పాడేరు: విశాఖ ఏజెన్సీలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడుతుండడంతో పాటు పొగమంచు దట్టంగా కురుస్తున్నది. చింతపల్లిలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు దిగజారాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 7.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లి ప్రాంతంలో సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు వ్యాప్తి చెందుతుండడంతో మన్యం వాసులు చలిపులితో ఇబ్బందులు పడుతున్నారు. గురువారం పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 10 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డు వద్ద 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఆనంద్ మహీంద్రా నోట.. అరకు లోయ మాట.. కారణాలు ఇవే
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఇండస్ట్రియలిస్టు. సమాకాలిన అంశాలపై వెంటనే స్పందించే మనసున్న మనిషి. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతిభను గుర్తించి మరింత వెలుగులోకి తీసుకువచ్చే పనిలో ఎప్పుడూ ముందుంటారు. అలాంటి ప్రయత్నాల్లో మరో అధ్యాయం మన అరుకు కాఫీ ప్రయాణం కాఫీ అంటే ఎక్కువ మందికి అస్సాం గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత కర్నాటకలోని కూర్గ్ లోయ మదిలో మెదులుతుంది. కానీ మరిచిపోలేని రుచిని అందివ్వడంలో క్షణాల్లో మనసుని శరీరాన్ని ఉత్తేజపరడంలో ఆ రెండింటికి సరిసాటి మన అరుకు కాఫీ. విశాఖ ఏజెన్సీలో అరుకు లోయల్లో ఆదివాసీలు పండించే ఈ కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. అందువల్లే ఇక్కడ పండిన పంట పండదినట్టే విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఆన్లైన్లో అత్యధిక ధరకు అమ్ముడైపోతుంది. అరకు కాఫీని ఒక్కసారి రుచి చూసిన వారు కాఫీ అంటే ఇదే అంటారు. అందుకు మరో ఉదాహారణ మన ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా. ఐన్‌స్టీన్ ట్వీట్‌తో భౌతిక శాస్త్రంలో ఎన్నో ఆవిష్కరణలకు ఆద్యుడైన నోబెల్ బహుమతి గ్రహీత అల్బర్ట్ ఐన్‌స్టీన్ ఫోటోను కాఫీ తాగుతున్నట్టుగా కప్‌పై ముద్రించిన గిఫ్ ఫైల్ని ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. అందులో ఐన్‌స్టీన్ కాఫీ తాగుతూ హుషారుగా ఉంటారు. శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ సింగర్ జేమ్స్బ్రౌన్ల హుషారుగా మారడానికి కారణం... అతను కచ్చితంగా బెంగళూరులో ఉన్న అరకు కేఫ్‌లో కాఫీ తాగడమే కారణం అని అర్థం వచ్చేలా కామెంట్ రాశారు. James BrownStein? He must be at the Araku Café Bengaluru… pic.twitter.com/q7wtG5k1DT — anand mahindra (@anandmahindra) December 8, 2021 ఏంటీ అరకు ఆనంద్ మహీంద్రా నోట అరుకు కాఫీ గురించిన ప్రస్తావన వచ్చే సరికి నెటిజన్లు ఈ కాఫీ స్టోర్ ప్రత్యేకత గురించి ఆరా తీస్తున్నారు. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో అరకు కేఫ్‌కి ప్రత్యేక స్థానం ఉంది. అత్యున్నత ప్రమాణాలతో అద్భుతమైన కాఫీ తాగేందుకు అక్కడ అరకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు తోటల్లో ఆదివాసీలు సంప్రదాయ పద్దతిలో పండించే కాఫీనే ఇక్కడ ఉపయోగిస్తుంటారు. కాఫీ ఫిలాసఫీ గతంలో సైతం అరకు కాఫీకి ప్రచారం చేసి పెట్టారు ఆనంద్ మహీంద్రా. ప్రపంచ కాఫీ దినోత్సం రోజున ఆనంద్మహీంద్రాకి చెందిన నాంది ఫౌండేషన్ అరకు కాఫీ తోటల ప్రత్యేకతను తెలియజేస్తూ అక్టోబరు 1న ట్వీట్ చేసింది. దాన్ని ఆనంద్మహీంద్రా రీ ట్వీట్ చేస్తూ ఇది కప్ కాఫీ కంటే ఎక్కువ...ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అంటూ క్యాప్షన్ పెట్టారు. More than just a cup of coffee…it’s a philosophy of life… @arakucoffeein @naandi_india https://t.co/UfAH5RtIjF — anand mahindra (@anandmahindra) October 1, 2021 లక్షమందికి ఆధారం అరకు వ్యాలీలో సుమారు లక్ష మంది ఆదివాసీలు కాఫీ తోటలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ మూడు కోట్లకు పైగా కాఫీ మొక్కలు పెంచుతున్నారు. వీరికి కాఫీ తోటల సాగులో ఆధునిక పద్దతులు తెలపడంతో పాటు మార్కెటింగ్‌లో సాయం చేస్తోంది ఆనంద్మహీంద్రాకి చెందిన నాంది ఫౌండేషన్ సంస్థ. దీంతో అమెజాన్‌తో పాటు అనేక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అరకు కాఫీ లభిస్తోంది. బ్రాండ్ అంబాసిడర్లా ప్రతిభ ఎక్కడ ఉన్నా గుర్తించడం, సాయం చేస్తూ సాన పట్టడం ఆనంద్ మహీంద్రా ప్రత్యేకత. అదే పద్దతిలో అరకు కాఫీకి అండగా ఉన్నారు ఆనంద్ మహీంద్రా. కేవలం సాయం చేసి చేతులు దులుపుకోకుండా రెగ్యులర్‌గా ప్రమోట్ చేస్తూ ఎళ్ల వేళలా చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్ మాదిరి క్రమం తప్పకుండా ప్రచారం చేస్తున్నారు. - సాక్షి వెబ్ ప్రత్యేకం చదవండి: పల్లెలో ఆటో నడిపిన సీఈవో.. ఫీడ్‌బ్యాక్‌తో పాటు ఆనంద్ మహీంద్రాకు సలహా -
ఆంధ్రా కశ్మీరానికి అత్యాధునిక రైలు
ప్రకృతి రమణీయతతో విరాజిల్లుతున్న అద్భుత పర్వత పంక్తి అరకు. ఇక్కడి అందాల గురించి చెప్పాలన్నా అక్షరం పులకిస్తుంది. ఈ ప్రాంతం ఎంత అందంగా ఉంటుందో.. ఆ అందాల నడుమ చేసే ప్రయాణమూ అంతే అద్భుతంగా ఉంటుంది. మంచుదుప్పటి కప్పుకున్న గిరుల సోయగాలు, చినుకు తాకిడికి మెరిసిపోయే పచ్చదనం, గుహల మధ్య వయ్యారంగా సాగిపోయే రైల్లో ప్రయాణం.. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు మనసుకు హత్తుకుంటాయి. ఈ ప్రయాణాన్ని మరింత మజాగా మార్చింది అద్దాల పెట్టె. విశాఖ నుంచి అరకు వెళ్లే రైలుకు అమర్చిన ఈ అద్దాల పెట్టె నుంచి అణువణువూ అందాలతో తొణికిసలాడే అద్భుతాలను వీక్షిస్తూ.. ప్రయాణికులు లెక్కలేనన్ని మధురానుభూతులను ఆస్వాదించారు. ఇప్పుడు రెండు అద్దాల పెట్టెలు, స్లీపర్ కోచ్‌తో అత్యాధునిక రైలు అందుబాటులోకి వచ్చేసింది. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 22న పట్టాలెక్కనుంది. సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా ఊటీగా పిలవబడే అరకు ప్రయాణానికి మరింత అందాన్ని, సరికొత్త అనుభూతిని పంచేలా కొత్త రైలు మొదలుకానుంది. అరకు రైలు ప్రయాణమంటే ఇష్టపడని వారెవ్వరూ ఉండరు. 1968 ఏప్రిల్ 30న తొలిసారిగా అరకు–కిరండూల్ మధ్య రైలు సర్వీసు ప్రారంభించారు. అప్పటి నుంచి పాత కోచ్‌లతోనే కాలం వెళ్లదీస్తోంది. అయినప్పటికీ ఈ రైలుకు మాత్రం ఫుల్ డిమాండ్ ఉంది. అరకు అందాలు చూడాలంటే కచ్చితంగా రైలు మార్గంలోనే వెళ్లాలన్నది పర్యాటకుల కోరిక. అందుకే రైలు ప్రయాణానికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. అక్కడి ప్రకృతిని రైలు నుంచి మరింత అందంగా చూసేందుకు నాలుగేళ్ల కిందట విస్టాడోమ్ కోచ్‌ను ఏర్పాటు చేశారు. అద్దాల పెట్టెలోంచి అద్భుతాలను చూసేందుకు పర్యాటకుల నుంచి డిమాండ్ పెరిగింది. అయితే పాత కోచ్‌ల స్థానంలో అత్యాధునిక కోచ్‌లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో వస్తున్నా.. ఈస్ట్‌కోస్ట్ పట్టించుకోలేదు. కొన్ని నెలల కిందటే అరకు రైలు కోసం అత్యాధునిక కోచ్‌లు, విస్టాడోమ్ కోచ్ వచ్చినా.. పాతవాటితోనే కాలం వెళ్లదీశారు. ఇప్పుడు ఎట్టకేలకు ఆ రైలుకు మోక్షం లభించనుంది. తొలిసారిగా స్లీపర్ క్లాస్ అరకు ఎంత అందంగా ఉంటుందో.. ఆ అందాల నడుమ చేసే ప్రయాణమూ అంతే అందంగా ఉంటుంది. అద్భుతాలను వీక్షించేందుకు అరకు–కిరండూల్ మధ్య అత్యాధునికమైన లింక్ హాఫ్మన్ బుష్(ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లతో రైలు పట్టాలెక్కనుంది. ఈ ట్రైన్లో తొలిసారిగా స్లీపర్ క్లాస్ బోగీ ఏర్పాటు చేశారు. ఒక స్లీపర్ క్లాస్, 8 సెకండ్ సిట్టింగ్‌తో పాటు రెండు విస్టాడోమ్ కోచ్‌లతో ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఎల్‌హెచ్‌బీ కోచ్ ప్రత్యేకతలివీ.. గతంలో పాత బోగీల్లో ప్రయాణించే పర్యాటకులు కుదుపులతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇప్పుడు మాత్రం జర్మన్ టెక్నాలజీతో స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపుదిద్దుకున్న ఎల్‌హెచ్‌బీలు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజిన్, బయో టాయిలెట్స్, సౌకర్యవంతమైన సీట్లు ఉంటాయి. ప్రమాదవశాత్తూ కాలు జారి పడిపోకుండా కోచ్‌ల్లో పీవీసీ ఫ్లోరింగ్ ఉంటుంది. ఒక్కో కోచ్ బరువు 39.5 టన్నులు ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే సమయంలో ఒకదానికొకటి ఢీకొట్టకుండా, పడిపోకుండా ఉంటాయి. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గంటకు గరిష్టంగా 200 కిమీ వేగంతో ప్రయాణించగలవు. సాధారణ బోగీల కంటే ఎల్‌హెచ్‌బీలు పొడవుగా ఉండటం వల్ల ప్రస్తుతం ఉన్న బోగీల కంటే అదనంగా మరో 10 సీట్లు ఉంటాయి. ప్రతి కోచ్‌లో అధిక వేగంతో సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం ‘అధునాతన ఎయిర్ డిస్క్ బ్రేక్ సిస్టమ్‘ఉంటుంది. సాధారణ కోచ్‌లు 100 డెసిబెల్స్ శబ్దాన్ని చేస్తే.. ఇవి మాత్రం కేవలం గరిష్టంగా 60 డెసిబెల్ల శబ్దం ఉత్పన్నం చేస్తుంటాయి. రెండు విస్టాడోమ్లతో హాయ్.. హాయ్ విశాఖ నుంచి అరకు వెళ్లే రైలులో 2017 ఏప్రిల్ 16 విస్టాడోమ్ కోచ్ (అద్దాల పెట్టె) అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ కోచ్ నిత్యం కిటకిటలాడుతోంది. విశాఖ నుంచి అరకు 130 కిలోమీటర్లు ప్రయాణం సాగించేందుకు ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు విశాఖ–కిరండూల్ రైలులో ఈ విస్టాడోమ్ కోచ్‌ను ఏర్పాటు చేశారు. పర్యాటకులు ఈ బోగీలో ప్రయాణించేందుకు అమితాసక్తి చూపుతుండటంతో మరో కోచ్ ఏర్పాటు చేయాలని 2017లోనే ప్రతిపాదించారు. అప్పటి నుంచి ఈ ప్రతిపాదన బుట్టదాఖలవుతూ వస్తోంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కొద్ది నెలల కిందట వచ్చిన మరో కోచ్‌ను ఈ రైలుకు జత చేస్తున్నారు. దీంతో రెండు విస్టాడోమ్‌లు పర్యాటకులను కనువిందు చేయనున్నాయి. రెండు అద్దాల బోగీల్లో మొత్తం 88 సీట్లు అందుబాటులోకి వస్తాయి. 84 వంతెనలు.. 58 సొరంగాలు ఈ విస్టాడోమ్ కోచ్‌లలో సీట్లు 180 డిగ్రీల కోణంలో తిరిగే సౌకర్యం ఉంటుంది. ఒకవైపు అందాలను చూస్తున్న సమయంలో మరోవైపు తిరగాలంటే శ్రమించాల్సిన అవసరం లేకుండా రొటేటింగ్ సీట్లో సులువుగా తిరిగి 360 డిగ్రీల కోణంలో వీక్షించవచ్చు. అనంతగిరి అడవులు, ఎత్తైన కొండలు.. వాటిపై పరచుకున్న పచ్చదనం.. జలపాతాలు.. ఇలా ఎన్నో అందాలు కళ్లార్పకుండా చూసే అవకాశం కలగనుంది. 84 ప్రధాన వంతెనలు.. 58 సొరంగాల గుండా ఈ రైలు ప్రయాణించనుంది. ఒక్కో సొరంగం అర కిలోమీటర్ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ పొడవుంటుంది. ఇలా.. ఎన్నో అనుభూతులను మూటగట్టుకునేలా రైలు ప్రయాణం సాగుతుంది. రైల్వే బోర్డు అనుమతించిన వెంటనే... అరకు– కిరండూల్ మార్గంలో రెండు విస్టాడోమ్ కోచ్‌లతో ఎల్‌హెచ్‌బీ ట్రైన్ నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ నెల 22న ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. రైల్వే బోర్డు నుంచి ఇంతవరకు ఎలాంటి సమాచారం అధికారికంగా అందలేదు. ఎప్పుడు సమాచారం వస్తే అప్పుడు ప్రారంభించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే రెండుసార్టు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించాం. ఎల్‌హెచ్‌బీ ట్రైన్ ప్రారంభమైతే.. పర్యాటకులు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి పొందుతారు. – అనూప్‌కుమార్ సత్పతి, డీఆర్ఎం, వాల్తేరు డివిజన్ -
‘అరకు’ ఆనందం... అంతలోనే విషాదం
యువకులందరూ అరకు అందాలు చూద్దామని బైక్‌లపై సందడిగా బయలు దేరారు. కేరింతలు కొడుతూ ఆ రోడ్లపై ‘రయ్’మని అరకు వైపు దూసుకుపోతున్నారు. అంతలోనే ఆ యువకులకు రోడ్డు మరమ్మతుల రూపంలో మృత్యువు ఎదురైంది. అంతే ఉరకలేసే ఆ ఉత్సాహంపై ఉగ్రరూపం చూపించింది. అందులో ఒకరిని ఘటనా స్థలంలోనే ఊపిరితీసేయగా... ఇంకొకరిని చావుబతుకుల మధ్యకు నెట్టివేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి, లక్కవరపుకోట: కన్న తల్లిదండ్రులకు చెప్పాపెట్టకుండా అరుకు అందాలను తిలకించేందుకు బయలుదేరిన ఆ యువకుల జీవితాలను రోడ్డు ప్రమాదం రూపంలో ఛిద్రం చేసింది. ఓ యువకుడు తీవ్ర గాయాలతో మృతి చెందగా మరో యువకుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి హెచ్‌సీ జి.శ్రీనువాస్‌రావు, మృతుడి బంధువులు అందించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం గంగవరం గ్రామానికి చెందిన పేర్ల ధనేష్ (22), గాజువాకకు చెందిన ఎం.గుణశేఖర్లు తమ స్నేహితులతో కలిసి ఆరకు ఆందాలు చూసేందుకు బైక్‌లపై గురువారం అర్ధరాత్రి పయనమయ్యారు. చదవండి: (ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా డాక్టర్ సహా ముగ్గురి దుర్మరణం) పేర్ల ధనేష్, గుణశేఖర్లు ఒక బండిపై వెళ్తుండగా లక్కవరపుకోట పాత జంక్షన్ సమీపంలో అసంపూర్ణంగా నిర్మించి వదిలేసిన బ్రిడ్జి వద్దకు వచ్చే సరికి బైక్ వేగాన్ని అదుపు చేసుకోలేక రోడ్డు మధ్యలో ఉన్న మట్టిదిబ్బను ఢీకొట్టారు. దీంతో బైక్ నడుపుతున్న ధనేష్ కుడి కాలు విరిగిపోయి, తలకు తీవ్రగాయాలయ్యాయి. వెనుక కూర్చున్న గుణశేఖర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన మిత్రులు క్షతగ్రాత్రులను ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ధనేష్ మృతి చెందాడు. గుణశేఖర్‌ను మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు. మృతుడి తండ్రి విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తూ ఇటీవల మృతి చెందగా పెద్ద కుమారుడైన ఈయనకు ఆ ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద ఇచ్చారు. భర్త పోయి బాధతో ఉన్న ఆ తల్లికి ఆదుకుంటాడనుకున్న కొడుకు అంనంత లోకాలకు వెళ్లి పోవడంతో కన్నీరు మున్నీరవుతోంది. మృతుడి చిన్నాన్న శ్రీనువాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీజీ శ్రీనువాస రావు తెలిపారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్య ఫలితమే... ఈ బ్రిడ్జి పనులు 2018 సంవత్సరంలో అర్ధంతరంగా నిలిచిపోయాయి. సంబంధిత కాంట్రాక్టర్ కానరాకుండా పోయాడు. బ్రిడ్జి ప్రవేశంలో కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా లేకపోవడంతో అటుగా వెళ్లినవారికి పనులు ఆగిపోయిన విషయం తెలియక పోవడంతో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్టు స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ బ్రిడ్జి వద్ద 12 మంది అరకు వైపు వెళ్లే పర్యాటకులు మృతి చెందారు. ఇప్పటికైనా స్థానిక పోలీసులు స్పందించి కనీసం హెచ్చరిక బోర్డులు పెట్టాలని పలువురు కోరుతున్నారు. -
ఆంధ్రా ఊటీకి అద్దాల బోగీలు
అరకు లోయ: ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు లోయకు వచ్చే పర్యాటకుల కోసం రైల్వేశాఖ మరో రెండు అద్దాల బోగీలను అందుబాటులోకి తెస్తోంది. విశాఖ నుంచి అరకు లోయకు నడిచే రెగ్యులర్ ట్రైన్‌కు వీటిని జత చేసేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఒక అద్దాల రైలు బోగీ ఉన్నప్పటికీ పర్యాటకుల నుంచి ఈ సీజన్లో డిమాండ్ పెరిగింది. దీంతో అరకు ట్రైన్‌కు అదనంగా రెండు విస్టోడోమ్ అద్దాల బోగీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ గొడ్డేటి మాధవి, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ రైల్వే ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. గత ఏడాదే అదనంగా రెండు అద్దాల బోగీలు నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించినప్పటికీ కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. త్వరలో అందుబాటులోకి రానున్న రెండు అద్దాల బోగీలను మంగళవారం రైల్వే శాఖ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. విశాఖ నుంచి అరకు లోయ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఈ రెండు అద్దాల బోగీలు పర్యాటకులు, స్థానికులను ఆకర్షించాయి. వీటిలో రైల్వే ఏడీఆర్ఎం ఎస్కే గుప్తా, ఇతర అధికారులు ప్రయాణించారు. త్వరలో అందుబాటులోకి రానున్న రెండు అద్దాల బోగీల్లో 44 సీట్లతో పాటు, పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని రైల్వే ఏడీఆర్ఎం ఎస్కే గుప్తా తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఉన్న విస్టో డోమ్ బోగీ కన్నా ఈ రెండు బోగీల్లో మరిన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు. -
షారూక్ ఖాన్ మెచ్చిన అరకు గిరిజన మహిళ
-
Photo Feature: గ్రీన్ బ్యూటీ.. ‘స్నో’యగాలు
సాక్షి, అరకులోయ/ పాడేరు: అందాల అరకు వర్షాకాలంలో చూపే హొయలు అంతా ఇంతా కాదు. ఏ వైపు చూసినా ఆకుపచ్చని చీర ధరించిన ప్రకృతి కాంత అద్భుతంగా మారి కనువిందు చేస్తుంటుంది. ఉన్నత పర్వత శ్రేణులు ఒక వైపు, పచ్చని పంట భూములు మరోవైపు.. వానా కాలంలోనూ ప్రభాత వేళ దర్శనమిచ్చే మంచు తెరలతో వన సీమ మనోజ్ఞరూపం నేత్రపర్వం చేస్తోంది. పాడేరు ఘాట్‌లో ఒక వైపు వర్షం కురుస్తుండగా మరో వైపు కొండల నిండా మంచు తెరల నడుమ మేఘాలు కమ్ముకోవటంతో అమ్మవారి పాదాల నుంచి వంట్లమామిడి ప్రాంతం దిగువుకు మబ్బులు దారిపొడవునా ఆహ్లాదపరిచాయి. -
ముగ్గురు పిల్లలతో పాటు తల్లి ఆత్మహత్య
-
ముగ్గురు పిల్లలు సహా తల్లి అనుమానాస్పద మృతి
అరకులోయ రూరల్(విశాఖపట్నం): గోరుముద్దలు తినిపించిన ఆ చేతులే.. విషం కలిపి పెట్టాయా? జోల పాడి నిద్ర పుచ్చాల్సిన తల్లే పిల్లలను శాశ్వత నిద్రలోకి పంపిందా? భర్తతో విభేదాలను తట్టుకోలేక పిల్లల ప్రాణం తీసి.. బలవన్మరణానికి పాల్పడిందా? అక్కడి హృదయవిదారక దృశ్యాలను చూస్తే అలాగే అనిపిస్తోంది. అరకులోయ పట్టణ పరిధిలోని పాత పోస్టాఫీస్ కాలనీలో వివాహిత, ఆమె ముగ్గురు బిడ్డలు శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తల్లి ఓ గదిలో ఉరి వేసుకొని చనిపోగా.. ఆమె ముగ్గురు బిడ్డలు మరో గదిలో మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ ముగ్గురు బిడ్డలను ఆస్పత్రికి తండ్రి తీసుకువెళ్లినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అరకులోయ మండలం కొత్త బల్లుగూడ పంచాయతీ సిమిలిగూడ గ్రామానికి చెందిన శెట్టి సంజీవరావు జీసీసీలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నారు. భార్య శెట్టి సురేఖ (34), కుమార్తె సుశాన్ (10), కుమారులు సర్విన్ (8), సిరిల్(4)లతో కలిసి పాత పోస్టాఫీస్ కాలనీలో నివసిస్తున్నారు. భార్యభర్తల మధ్య కొద్ది రోజులుగా తగాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో భర్త సంజీవరావు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి చేరుకోగా మంచంపై విగతజీవులుగా ఉన్న ముగ్గురు పిల్లలను చూసి స్థానికుల సహాయంతో హుటాహుటిన ఏరియా అస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. తల్లి సురేఖ కోసం గాలించగా మరో గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించింది. పిల్లలకు అన్నంలో విషం కలిపి తినిపించి, సురేఖ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు ఆధారాలు లభించాయని సీఐ జి.డి.బాబు, ఎస్ఐ నజీర్ తెలిపారు. వంట గదిలో సగం తిన్న భోజనం ప్లేట్లు ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యే పాల్గుణ విచారం సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ హుటాహుటిన ప్రాంతీయ ఆస్పత్రికి చేరుకున్నారు. ముగ్గురు పిల్లల మృతదేహాలు చూసి చలించిపోయారు. పాత పోస్టాఫీస్ వీధిలోని సంఘటన జరిగిన నివాసానికి కూడా వెళ్లి పరిశీలించారు. -
విశాఖ మన్యంలో వలిసెల సోయగం విలసిల్లేలా..
సాక్షి, విశాఖపట్నం: మంచు తెరల మధ్య పసుపు వర్ణంతో మెరిసిపోయే వలిసె పూలు ప్రకృతి కాంతకు స్వర్ణ కాంతులద్దుతాయి. విశాఖ మన్యానికొచ్చే పర్యాటకుల మనసులను ఇట్టే దోచుకుంటాయి. ఏటవాలు కొండ ప్రాంతాల నడుమ చల్లని వాతావరణంలో పెరిగే వలిసె తోటలు కొన్నేళ్లుగా కనుమరుగవుతున్నాయి. గిరిజన రైతుల సంప్రదాయ పంట అయిన వలిసెల సాగు రెండు దశాబ్దాల్లో నాలుగో వంతుకు పడిపోయింది. అత్యధికంగా తేనె ఉండే వలిసె పూల సాగు తగ్గడంతో తేనెటీగలకు కష్టకాలం వచ్చింది. తేనె సేకరణపైనా తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వలిసె తోటలకు పూర్వ వైభవం తెచ్చేందుకు చింతపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధనలు చేపట్టింది. వలిసె తోటల మాతృ ప్రదేశం ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా. వందల ఏళ్ల క్రితమే మన్యంలోకి వచ్చి గిరిజనుల సంప్రదాయ పంటగా మారింది. విశాఖ మన్యంలోని అరుకు లోయ, పాడేరు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, అనంతగిరి, జి.మాడుగుల, చింతపల్లి ప్రాంతాలతోపాటు విజయనగరం జిల్లాలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, పాచిపెంట, శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట, తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో వలిసెల సాగు ఉండేది. తర్వాత కాలంలో విశాఖ మన్యానికే పరిమితమైంది. ఇక్కడ కూడా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం 2003–04లో 16 వేల హెక్టార్లకు పరిమితమైన వలిసెల సాగు క్రమేపీ తగ్గుతూ 2020–21 నాటికి 3,695 హెక్టార్లకు పడిపోయింది. వలిసె ఉపయోగాలివీ.. వలిసె పూలలో తేనె అధికంగా ఉంటుంది. తోటల్లో ఎకరానికి వంద చొప్పున తేనె పెట్టెల చొప్పున ఉంచి తేనెటీగల సాయంతో గిరిజనులు తేనెను సేకరిస్తారు. ఒక్కో పెట్టె నుంచి 35–40 కిలోల చొప్పున తేనె దిగుబడి వస్తుంది. వలిసె గింజల నుంచి వంటనూనె తీస్తారు. దీనిని గిరిజనులు ఇళ్లల్లో వినియోగిస్తుంటారు. ఈ నూనెను కాస్మొటిక్స్, పెయింటింగ్స్ తయారీలోనూ వినియోగిస్తున్నారు. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే వలిసె గింజలను కోళ్లు, పక్షుల దాణా తయారీలోనూ మిశ్రమంగా వాడతారు. తగ్గిపోవడానికి కారణాలు విశాఖ మన్యంలో నీరు నిలవని ఏటవాలు కొండ ప్రాంతాలు, చల్లని వాతావరణం వలిసెల సాగుకు అత్యంత అనుకూలం. పరిమాణం, రంగు, సాగు కాలంలో తేడాను బట్టి 30 రకాల వరకూ ఉన్నాయి. వలిసె గింజల దిగుబడులు తగ్గిపోవడం, రైతులకు పెద్దగా గిట్టుబాటు కాకపోవడం, భూసారం తగ్గడం వంటి పరిస్థితులు వలిసె తోటల సాగు తగ్గడానికి కారణమయ్యాయి. ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్లకు మించి వలిసె గింజల దిగుబడి రావడం లేదు. ఆకాశ పందిరి, బంగారు తీగ అనే కలుపు మొక్కలను నిరోధించడం కష్టమవుతోంది. గిరిజన రైతులు వలిసె విత్తనాలను తామే తయారుచేసుకోవడం వల్ల నాణ్యత లోపించి పంట దెబ్బతిని దిగుబడులు పెద్దగా ఉండటం లేదు. దీంతో వారంతా ప్రత్యామ్నాయ ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపడంతో సాగు విస్తీర్ణం క్రమేపీ తగ్గిపోయింది. పూర్వ వైభవానికి కృషి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్దన్‌రెడ్డి గతంలో భారతీయ నూనెగింజల పరిశోధన కేంద్రం (ఐఐవోఆర్) డైరెక్టర్‌గా ఉన్నప్పుడు వలిసెలకు పూర్వ వైభవం తేవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన చొరవతో వలిసెలపై చింతపల్లిలో నాలుగేళ్ల పరిశోధన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.69 లక్షలు మంజూరు చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో సాగవుతున్న 1,800 రకాల వలిసెల మూల విత్తనాలను న్యూఢిల్లీలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ రిసోర్సెస్ నుంచి చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రానికి తీసుకొచ్చారు. మన్యంలో వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనువైన, వివిధ తెగుళ్లను తట్టుకొని స్వల్ప కాలంలో అధిక దిగుబడిని ఇచ్చే మేలు రకం విత్తనాలను ఇక్కడి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు పాడేరు ఐటీడీఏతో పాటు సంజీవని స్వచ్ఛంద సంస్థ గిరిజన రైతులను ప్రోత్సహిస్తోంది. సాగు, సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించడమే గాక టార్పాలిన్లు, కోత పరికరాలు అందజేస్తుంది. రెండు లాభదాయక రకాల అభివృద్ధి మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ పరిసర ప్రాంతాల్లో మంచి దిగుబడి ఇస్తున్న జేఎన్ఎస్–26, జేఎన్ఎస్–28 రకాల మూల విత్తనాలను తెచ్చాం. మన్యం పరిస్థితులకు అనుగుణంగా ఉండే వీటిని ఇక్కడ అభివృద్ధి చేశాం. ఎకరానికి రెండు కిలోల విత్తనాలు వేస్తే ఆరేడు క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది. ఈ విత్తనాలను ఉచితంగా గిరిజన రైతులకు త్వరలోనే ఇస్తాం. ఇలా కనీసం వంద రకాల మేలు రకం విత్తనాలను అభివృద్ధి చేయాలనేది లక్ష్యం. గిరిజన రైతులను వలిసెల సాగు వైపు అన్నివిధాలా ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నాం. – డాక్టర్ గుత్తా రామారావు, సహాయ పరిశోధన సంచాలకులు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం -
అరకు ప్రమాదం: హుషారుగా వెళ్లి.. విషాదంగా..
సాక్షి, హైదరాబాద్: అరకు లోయలో బస్సు పడిన ప్రమాద ఘటన బాధితులు శనివారం రాత్రి నగరానికి బయలుదేరారు. నలుగురి మృతదేహాలను సైతం ప్రత్యేక వాహనంలో నగరానికి తరలించారు. షేక్‌పేట్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాదం నుంచి బయట పడిన 16 మందిని భయాందోళన ఇంకా వెంటాడుతూనే ఉంది. శుక్రవారం అరకు లోయలో బస్సు పడిపోయిన దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. 23 మంది పెద్దలు, నలుగురు పిల్లలతో కలిసి మొత్తం 27 మంది హైదరాబాద్ నుంచి విహార యాత్రకు వెళ్లారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారికి విశాఖలో అత్యవసర వైద్యాన్ని అందిస్తున్నారు. విహార యాత్రకు వెళ్లే ముందు హైదరాబాద్‌లో.. ప్రమాదం తర్వాత విశాఖ నుంచి తిరిగి వస్తూ.. ప్రమాదం నుంచి త్రుటిలో బయటిపడి ఇళ్లకు చేరుకోవడంతో 16 మంది కుటుంబ సభ్యులకు కొంత ఊరట కలిగించింది. మృతుల కుటుంబాలు మాత్రం శోకసంద్రంలో మునిగిపోయాయి. కాగా.. శనివారం ఉదయం అరకు లోయ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించేందుకు సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత కుమారి, షేక్‌పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ విశాఖపట్నం వెళ్లారు. మృతులు, గాయపడిన కుటుంబాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు కూడా అక్కడికి బయలుదేరారు. వీరు విశాఖపట్నానికి వెళ్లేందుకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విమాన టికెట్లు అందించారు. చదవండి: కామారెడ్డిలో ఆర్టీసీ బస్ బోల్తా.. నలుగురి పరిస్థితి విషమం -
అరకు ప్రమాదం: కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ
సాక్షి, విశాఖటప్నం: అరకు ప్రమాద ఘటనపై కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ఆళ్ల నాని శనివారం తెలిపారు. ఆయన మీడియా మాట్లాడుతూ.. ఈ ప్రమాద ఘటన బాధాకరం అన్నారు. తెలంగాణ నుంచి 27 మంది అరకు ప్రాంతానికి వచ్చారని, ప్రమాదంలో నలుగురు మృతి చెందారని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. ప్రత్యేక అంబులెన్స్‌లో స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అంతకు ముందు అరకు ఘాట్‌రోడ్ ప్రమాద ఘటనలో గాయపడి కేజీహెచ్ ఆస్పత్రిలో చేరిన బాధితులను మంత్రులు ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్ పరామర్శించారు. వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అరకు ఘాట్‌రోడ్ ప్రమాద ఘటనలో గాయపడిన 23 మంది బాధితులు కేజీహెచ్‌లో చికిత్స పొందుతురన్నారని డీఎంహెచ్‌వో తెలిపింది. అందులో చంద్రకళ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది పేర్కొంది. నాలుగు మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసినట్లు తెలిపింది. చదవండి: లోయలో పడ్డ బస్సు: నలుగురు మృతి -
విహారంలో విషాదం.. ఉలిక్కిపడ్డ షేక్‌పేట
సాక్షి, హైదరాబాద్ : ‘అమ్మమ్మ వెళ్లొస్తాం.. తాతయ్య అరకు అందాలు చూసొస్తాం.. అమ్మా పదిలం.. నాన్న జాగ్రత్త’ అంటూ చిరునవ్వులతో బై బై చెబుతూ ఆనందంగా విహారయాత్రకు వెళ్లిన వారిలో కొందరు రోడ్డు ప్రమాదంలో విగత జీవులయ్యారని తెలియడంతో షేక్‌పేట ప్రాంతంలో విషాదం అలముకుంది. షేక్‌పేటలోని వినాయక్‌నగర్, సీతానగర్‌కు చెందిన మూడు కుటుంబాలకు చెందిన చిన్నారులు, పెద్దలు మొత్తం 25 మంది ఈ నెల 10న ఉదయం 5.30 గంటలకు షేక్‌పేట నుంచి దినేశ్ ట్రావెల్స్ మినీ బస్సులో ఆంధ్రప్రదేశ్‌కు విహార యాత్రకు బయలుదేరి వెళ్లారు. శుక్రవారం వీరి బస్సు అరకు సమీపంలో లోయలో పడిపోవడంతో నలుగురు చనిపోయినట్లు, చాలా మందికి తీవ్రగాయాలైనట్లు ఇక్కడికి సమాచారం అందింది. దీంతో స్థానికంగా ఉన్న వారి బంధువులు తీవ్ర ఆవేదన చెందారు. గాయపడిన వారి ఆరోగ్యపరిస్థితిపై వాకబు చేశారు. వీరిలో కొంతమంది ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ యాత్రలకు.. ఈ కుటుంబాల వారు గతంలోనూ అందరూ కలిసి ఏడుపాయల, వరంగల్‌లోని పర్యాటక ప్రాంతాలకు ఆనందంగా వెళ్లి వచ్చారని...ఈసారి కూడా అలానే వస్తారని అనుకున్నామని బాధిత కుటుంబసభ్యులు వాపోయారు. మా వయసు మీద పడడంతో మమ్మల్ని ఇంటివద్దనే ఉండమన్నారని, వాళ్లు ఇలా ప్రమాదానికి గురవుతారని ఊహించలేదని వృద్ధులు ఆవేదన చెందారు. వ్యక్తిగత పనుల మీద ఇదే కుటుంబాలకు చెందిన నలుగురు చివరి నిమిషంలో పర్యటనకు వెళ్లలేదని తెలిసింది. కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే కొంతమంది బంధువులు హుటాహుటిన అరకు బయలుదేరి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యంపై ఆరా తీశారు. ట్రావెల్ ఏజెంట్‌కు ఫోన్‌కాల్ చేస్తే స్పందించకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మృతుల వివరాలు తెలియక స్థానికులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం తిరిగి రావాల్సింది.. రిటైర్డ్ బ్యాంక్ అధికారి నర్సింహారావు ఆధ్వర్యంలో విహారయాత్రకు వెళ్లారు. ఈ నెల 10న నగరం నుంచి బయలు దేరిన వీరు మొదట విజయవాడకు వెళ్లారు. అక్కడి నుంచి అమరావతి, పాలకొల్లు నరసింహాస్వామి దేవాలయం, అన్నవరం నుంచి అరకు వెళ్లారు. అరకు లోయ అందాలను తిలకించి తిరిగి సింహాచలం వెళ్తుండగా డముకు వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదానికి కొద్దిసేపటికి ముందే తమకున ఫోన్ చేసి ఆదివారం ఇంటికి వస్తామని చెప్పారని, ఇంతలోనే విషాద వార్త వినాల్సి వచ్చిందని బంధువులు కంట తడిపెట్టారు. నిన్ననే చివరగా మాట్లాడింది... మా అక్క లత నిన్ననే చివరగా ఫోన్లో మాట్లాడింది. ‘టూర్‌ను ఎంజాయ్ చేస్తున్నాం. మేమంతా సందడిగా..ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుగుతున్నాం. నీవు రాత్రిపూట మా ఇంటివైపు వెళ్లి చూడు. ఆదివారంలోపు ఇంటికి వచ్చేస్తాం’ అని చెప్పింది. ఇంతలోనే శుక్రవారం ఈ ఘటన జరగడం తీవ్రంగా కలచివేసింది. అక్క ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిందని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యాం. – విజయ్‌కుమార్ ఫికర్ పెట్టుకోవద్దని చెప్పి.. ‘టూర్‌ను ఆస్వాదిస్తున్నాం. మా మీద బెంగ పెట్టుకోకండి. పాటలు పాడుతూ.. వేళకు తింటూ పర్యటన సాగిస్తున్నాం. ఒకట్రెండు రోజుల్లో తిరిగి వస్తాం’అని తన భార్య శైలజ చెప్పిందని ఆమె భర్త జగదీశ్ రోధించారు. బస్సు ప్రమాదంలో శైలజ గాయపడ్డ సంఘటన తెలుసుకున్న ఆయన.. బస్సులో సీట్లు లేకపోవడంతో తాను ఈ పర్యటనకు వెళ్లలేపోయానని ‘సాక్షి’కి తెలిపారు. రోజూ ఫోన్ చేసేవారు రోజు తమతో మాట్లాడే తమ బంధువులు ప్రమాదానికి గురికావడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని దయానంద్ వాపోయారు. మూడు కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్న నర్సింగ్‌రావు శుక్రవారం కూడా మాట్లాడాడని, భద్రంగానే ఉన్నామని చెప్పారని ఆయన అన్నారు. చిన్నారి శ్రీనిత్య బాగానే ఉందని, పాప తండ్రి బెంగ పెట్టుకోకుండా చూడమని తనను కోరారని, ఇంతలోనే చేదు వార్త వినాల్సిరావడం కలిచివేసిందన్నారు. అంతా బాగుంది.. రేపు వస్తున్నామన్నారు.. ‘అంతా బాగుంది. పర్యటన సాఫీగా సాగుతుంది. అరకు చేరుకున్నాం. రేపటిలోగా తిరిగివస్తాం’ ప్రమాదంలో చనిపోయిన సరిత చివరిగా కుమారుడితో చెప్పిన మాటలివి. క్షేమంగా తిరిగివస్తానని చెప్పి తన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లడం తమను శోకసంద్రంలో ముంచిందని ఆమె తనయుడు నవీన్ కన్నీరు మున్నీరయ్యారు. శుక్రవారం ఉదయం తనతో మాట్లాడిన తల్లి రాత్రికి విగత జీవిగా మారడంతో ఆయన తీవ్రంగా కలత చెందారు. తీర్థయాత్రలను బాగా ఎంజాయ్ చేస్తున్నాం.. రేపు రాత్రి ఇంటికి చేరుకుంటాం. మీరేలా ఉన్నారని యోగక్షేమాలు తెలుసుకుందని ఆయన బోరున విలపించారు. అరగంట ముందే మాట్లాడా.. ఘటనకు అరగంట ముందే మా బంధువు నందూతో ఫోన్లో మాట్లాడా. ఆ బస్సులో డ్రైవర్‌ను జర్నీ వద్దు..బస్సు ఆపేయమంటూ అందరూ వారిస్తూ లొల్లి చేస్తున్న సమయంలోనే నాతో మాట్లాడాడు. జర్నీ వద్దని ఎంత చెప్పినా డ్రైవర్ వినటం లేదని చెప్పాడు. ఇలా మాట్లాడినా అరగంటలోనే బస్సు లోయలో పడిపోయింది. నాతో ఫోన్లో మాట్లాడిన నందూ తీవ్రంగా గాయపడ్డాడు. – రామారావు ఐదుగురికి విమాన టికెట్లు విశాఖ జిల్లా అరకు ప్రమాదబారిన కుటుంబసభ్యులను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పరామర్శించారు. తక్షణమే విశాఖకు వెళ్లేందుకు ఐదుగురి విమాన టికెట్లను ఆయన సమకూర్చారు. మృతదేహాలను తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
అరకు విహారం.. విషాదం.. ప్రధాని దిగ్భ్రాంతి
విహారంలో చివరి మజిలీ విషాదం మిగిల్చింది. తిరుగు పయనమైన కాసేపటికే ఓ మలుపు పర్యాటకుల ఆనందాన్ని హరించి వేసింది. ఉన్నట్లుండి బస్సు లోయలో పడిపోవడంతో ఆర్తనాదాలు మిన్నంటాయి. కాపాడండంటూ కేకలు పెద్దపెట్టున వినిపించాయి. చిన్నారులు, మహిళలు చెల్లాచెదురుగా గాయాలతో పడిపోయారు. లోయలో ప్రమాద దృశ్యం అందరి కంట నీరు తెప్పించింది. సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం డముకు ఘాట్ రోడ్డులో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలోకి పడిపోవడంతో నలుగురు పర్యాటకులు మృతి చెందగా.. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. హైదరాబాద్‌లోని షేక్ పేటకు చెందిన సత్యనారాయణ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మొత్తం 25 మంది ఈ నెల 10వ తేదీన దినేష్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు (టీఎస్09–యూబీ 3729)లో బయలుదేరారు. విజయవాడలోని పర్యాటక ప్రాంతాల్ని సందర్శించి.. విశాఖ చేరుకున్నారు. గురువారం విశాఖ నగరంలోని వివిధ సందర్శనా ప్రాంతాల్లో పర్యటించారు. శుక్రవారం ఉదయం అరకు అందాల్ని ఆస్వాదించారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో భాగంగా సింహాచలం బయలుదేరారు. గాయపడ్డ చిన్నారులు అప్పటివరకు సరదాగా సాగిన ఈ విహార యాత్రలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. రాత్రి 7 గంటల సమయంలో అనంతగిరి మండలం డముకు–టైడాకు మధ్యలో 5వ మలుపు వద్ద బస్సు అదుపు తప్పి.. ఒక్కసారిగా 80 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లిపోయింది. చిమ్మచీకటి కావడంతో.. ఏం జరుగుతుందో ఊహించేలోగా విషాదం అలముకుంది. లోయలోంచి హాహాకారాలు వినిపించడంతో.. వెనుక వస్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. బొర్రా గుహల్లో పని చేస్తున్న సిబ్బంది అక్కడి చేరుకుకొని పోలీసులు, ప్రయాణికులతో కలిసి సహాయక చర్యలకు ఉపక్రమించారు. పూర్తిగా చీకటిగా ఉండటంతో బస్సులోంచి క్షతగాత్రుల్ని వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అప్పటికే.. నలుగురు మృతి చెందినట్టు పోలీసులు ధ్రువీకరించారు. బస్సు లోయలో పడింది ఇక్కడే.. (ఫైల్) క్షతగాత్రులందరినీ 108 వాహనం, ఇతర ప్రైవేట్ వాహనాల్లో హుటాహుటిన ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. కలెక్టర్ వినయ్‌చంద్ వెంటనే స్పందించి కలెక్టరేట్లో ప్రమాదానికి సంబంధించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. క్షతగాత్రుల వివరాలు అందించేందుకు 0891–2590102, 0891–2590100 నంబర్లని అందుబాటులో ఉంచారు. ఎస్.కోట ఎమ్మెల్యే కే.శ్రీనివాసరావు మూడు అంబులెన్స్‌లను ప్రమాద స్థలికి పంపించారు. క్షతగాత్రుల్ని పరామర్శించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. బస్సు ప్రమాద దృశ్యం.. ఇరుక్కుపోయిన ఓ పర్యాటకుడు కరోనా కాలంలో బయటికి వెళ్లలేదని.. వేసవి కాలంలో ఎక్కడికైనా విహారానికి వెళ్లడం సత్యనారాయణ కుటుంబానికి అలవాటు. కరోనా కారణంగా బయటికి వెళ్లలేకపోయిన కుటుంబం.. పరిస్థితులు చక్కబడటంతో విహార యాత్రకు బయలుదేరింది. విజయవాడ, అమరావతి, మంగళగిరి, అన్నవరం దేవాలయాల్ని సందర్శించారు. గురువారం ఉదయం విశాఖలో కొన్ని ప్రాంతాలను సందర్శించి, సింహాచలం వెళ్లారు. దర్శనం కాకపోవడంతో రాత్రి అక్కడే గదులు తీసుకొని బస చేశారు. శుక్రవారం తెల్లవారు జామున 5.30 గంటలకు అరకు బయలుదేరి వెళ్లారు. తిరిగి సింహాచలం వస్తుండగా ప్రమాదం సంభవించింది. కొండను ఢీకొట్టి ఉంటే? సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణమై.. శనివారం ఉదయం సింహాచలం దర్శనం చేసుకున్న తర్వాత హైదరాబాద్ బయలు దేరాలనుకున్నారు. కిందికి వస్తుండగా బ్రేక్ ఫెయిలయ్యింది. ఘాట్ రోడ్డు డౌన్ కావడంతో.. డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోయాడు. కుడివైపునకు బస్సుని తిప్పి ఉంటే.. కొండని ఢీకొట్టి.. బస్సు రోడ్డుపై నిలిచిపోయేది. కానీ.. బస్సును అదుపు చేయలేక, డ్రైవర్ ఎడమవైపు తిప్పడంతో.. ఒక్కసారిగా లోయలోకి దూసుకుపోయింది. డ్రైవర్ కాస్త అప్రమత్తంగా ఉండుంటే ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడేవారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎస్. కోట ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స చేస్తున్న దృశ్యం మొబైల్ ఫ్లాష్ లైట్ల వెలుగులో సహాయ కార్యక్రమాలు చిమ్మ చీకటి.. ఒక్కసారిగా పెద్ద శబ్దం.. ఏం జరిగిందోనని ఆతృత, ఆందోళనలతో సమీప డముకు ప్రాంతానికి చెందిన పాతిక మంది గిరిజనులు ఘాట్ రోడ్డుకు చేరుకున్నారు. పక్కనే ఉన్న బొర్రా మోటర్ యూనిట్ సభ్యులు 20 మంది వచ్చారు. లోయలోకి బస్సు పడిపోయిందని తెలుసుకుని వెంటనే సహాయక చర్యలకు ఉపక్రమించారు. అంతలోనే హుటాహుటిన అరకు సీఐ పైడయ్య, అనంతగిరి ఎస్ఐ సుధాకర్ బృందం చేరుకుంది. గిరిజనులు, మోటార్ యూనిట్ సభ్యులు, పర్యాటకులు కొందరు పోలీసులతో కలిసి లోయలోకి దిగారు. సుమారు 80 అడుగుల లోయ.. దట్టమైన పొదలు, చెట్లు.. బస్సు ఎంత లోపలికి వెళ్లిందో కనిపెట్టేందుకే దాదాపు అరగంట సమయం పట్టింది. క్షతగాత్రుల ఆర్తనాదాలు వింటూ.. ముందుకు అడుగేశారు. మొబైల్స్‌లోని ఫ్లాష్ లైట్స్ వెలుతురుతో బస్సు వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్‌లో... పర్యటనకు బయలుదేరే ముందు... లోయ అడుగున ఉన్న బస్సులోకి వెళ్లి చూసే క్షతగాత్రులు చెల్లాచెదురుగా పడి ఉన్నారు. ముగ్గురు విగతజీవులుగా మారారు. మరో 8 నెలల పసికందు కూడా మృతి చెంది ఉంది. పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నారు. కాపాడండంటూ మహిళలు ఆర్తనాదాలు చేస్తున్నారు. అక్కడి దృశ్యాలు సహాయక చర్యలకు వెళ్లిన అందర్నీ కంటతడి పెట్టించాయి. పై నుంచి కార్లు, వ్యాన్ల లైట్లు ఫోకస్ చేశారు. పర్యాటకులు మొబైల్లోని ఫ్లాష్‌లైట్స్ ఆన్ చేసి ఉంచగా.. క్షతగాత్రులు ఒక్కొక్కర్నీ నలుగురైదుగురు గిరిజనులు కలిసి మోసుకుంటూ పైకి తీసుకొచ్చారు. ఒక 108 వాహనం రాగా.. అందులో కొందర్ని ఎక్కించి ఎస్.కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరికొందరు తమ ప్రైవేటు వాహనాల్ని సిద్ధం చేశారు. పైకి మోసుకొచ్చిన క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. యుద్ధ ప్రాతిపదికన పోలీసులు సహాయక చర్యలు వేగవంతంతో చాలా మందిని కాపాడారు. రాత్రి అక్కడే ఉందామనుకున్నాం కానీ.. మా నాన్న రిజర్వ్ బ్యాంకు ఉద్యోగిగా ఇటీవలే రిటైర్ అయ్యారు. మా కుటుంబసభ్యులంతా ఈ నెల 10న హైదరాబాద్ నుంచి బయల్దేరాం. విజయవాడ కనకదుర్గ దర్శనం చేసుకుని అమరావతి, మంగళగిరి పానకాల నరసింహాస్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నాం. ఆ తర్వాత అరకుకు వెళ్లాం. రాత్రి అరకులోనే ఉందామనుకున్నాం. కానీ సింహాచలం వెళ్లిపోదామని డ్రైవర్ చెప్పటంతో బయల్దేరాం. ఘాట్‌రోడ్డు దిగుతుండగా బ్రేకులు ఫెయిల్ కావటంతో బస్సు లోయలో పడింది. – క్షతగాత్రుడు కె.నరేశ్‌కుమార్ డ్రైవింగ్ సరిగ్గా రాని వ్యక్తిని పంపారు.. ట్రావెల్స్ యాజమాన్యం డ్రైవింగ్ సరిగా రాని వ్యక్తిని ఈ విహారయాత్రకు పంపించారు. డ్రైవర్‌కి ఘాట్ రోడ్డులో బస్సు నడపటం సరిగ్గా రాని విషయాన్ని కూడా చెప్పలేదు. బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు తక్కువ వేగంతోనే వెళ్తోంది. మేమంతా గట్టిగా కేకలు వేస్తూ కుడివైపు కొండకు ఢీ కొట్టాలని చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఎడమ వైపు దూసుకెళ్లి లోయలో పడింది. – అనిత, క్షతగాత్రురాలు ఎత్తుకుని వచ్చాం.. బస్సు లోయలో పడిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాం. ఐదుగురు సభ్యులు బృందంగా ఏర్పడి, నలుగురిని కాపాడాం. డముకు స్థానికులు యువకులు, బొర్రా మోటర్ సభ్యులు చాలా కష్టపడ్డారు. – కొర్రా అభిమాన్యం.. బొర్రా మోటర్ఫిల్డ్ లోయలో పడిన వెంటనే వెళ్లాం ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే సంఘటన స్థలానికి చేరుకున్నాం. క్షతగాత్రులను లోయ నుంచి స్థానికులతో కలసి మోసుకుని వచ్చాం. ఆపదలో ఆదుకోవాలని ముందుకు వెళ్లాం. ప్రమాదం జరిగిన ప్రదేశంలో క్షతగాత్రులను చూసి బాధ అనిపించింది. చాలామంది ముందుకు వచ్చి సాయం చేశారు. – కె.కనకబాబు బొర్రా పంచాయతీ కార్యదర్శి అరకు ఘటనపై ప్రధాని, గవర్నర్, సీఎం దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: అరకు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన పలువురు ప్రయాణికులు మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసి ఎంతో బాధపడ్డానని ట్విటర్ ద్వారా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. ప్రమాదం గురించి తెలియగానే సీఎస్ సోమేశ్‌కుమార్‌తో మాట్లాడారు. కాగా, బస్సు ప్రమాదంపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రమాద సంఘటనపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, డీఐజీ కాళిదాసు, ఎస్పీ కృష్ణతో తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్ మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. హైదరాబాద్‌లోని ప్రయాణికుల ఇళ్లకు అధికారులను పంపాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను సీఎస్ ఆదేశించారు. ఏపీ గవర్నర్, సీఎం విచారం.. సాక్షి, అమరావతి: అరకు బస్సు ప్రమాదంపై ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులను అడిగి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఈ దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విచారం సాక్షి, హైదరాబాద్: అరకు బస్సు ప్రమాద ఘటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతులకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు తక్షణ సహాయక చర్యలు అందించాలని ఏపీ అధికారులను ఆయన కోరారు. అరకు మృతులకు కేటీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: అరకు బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్నివిధాలా సాయం అందించాల్సిందిగా ఏపీ అధికారులను కోరినట్లు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ కూడా అరకు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
అరకు: లోయలో పడ్డ బస్సు: నలుగురు మృతి
సాక్షి, విశాఖపట్నం : అరకు ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి డముక వద్ద శుక్రవారం రాత్రి ఓ టూరిస్ట్ బస్సు లోయలో పడింది. దీంతో నలుగురు మృతి చెందగా 10 మందికిపైగా గాయాలయ్యాయి. మృతులంతా హైదరాబాద్ షేక్‌పేట్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. సంఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 24 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అరకునుంచి హైదరాబాద్ తిరిగివెళుతుండగా ప్రమాదం జరిగింది. పోలీసు బృందాలు, 108 సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఎస్‌కోట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మంత్రి అవంతి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ విజయ్‌చంద్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మెరుగైన చికిత్స అందించండి: సీఎం జగన్ అమరావతి : విశాఖ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో డముకు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనపై సీఎంఓ అధికారులను ఆరా తీశారు. జరుగుతున్న సహాయక చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశింశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి హైదరాబాద్ : అరకు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి న్యూఢిల్లీ : అరకు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
మంచు ముసుగులో అరకు అందాలు
ప్రకృతి గీసిన చిత్రంలా కనులను కట్టిపడేసే సహజ సౌందర్యం.. మనసును ఆహ్లాదపరిచి సేద తీర్చే సుందర సువిశాల సాగరతీరం.. విశ్వవిఖ్యాతినొందిన కేంద్రాల్లో ప్రశాంతతను చేకూర్చే ఆధ్యాత్మిక సమీరం.. ఇలా అనిర్వచనీయ అనుభూతిని సందర్శకులకు అందించే ఆకర్షణీయ కేంద్రం విశాఖ.. దేశవిదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకట్టుకునేలా అరకు పర్యాటక వైభవాన్ని సంతరించుకుంటోంది. ప్రోత్సాహకాలు, రాయితీలతో పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వం రూపొందించిన నూతన పాలసీతో పర్యాటకం పరుగులు తీయనుంది. సందర్శకుల మనసు దోచేలా ఈ సౌందర్యసీమను పర్యాటకంలో అగ్రభాగాన నిలిపేందుకు కొత్త ప్రాజెక్టులెన్నో పట్టాలెక్కనున్నాయి. సాక్షి, విశాఖపట్నం: పర్యాటకాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. టీడీపీ పాలనలో గతితప్పిన పర్యాటకానికి ఊపిరిపోసి కొత్త చిగురులు తొడిగేందుకు నూతన టూరిజం పాలసీ (2020–2025)ని ప్రవేశపెట్టంది. అనేక ప్రోత్సాహకాలు, రాయితీలతో పాటు కరోనా కారణంగా కోలుకోని టూరిజం ఆధారిత యూనిట్లకు ఊపిరి పోసే రీస్టార్ట్ ప్యాకేజీతో ప్రపంచాన్ని ఆకట్టుకునే పాలసీని రూపొందించింది. ఈ పాలసీతో ప్రతి జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. చదవండి: ఆంధ్రా ఊటి అరకు స్టార్ హోటల్స్.. రిసార్టులు సాధారణంగా ఒక పర్యాటక రంగ ప్రాజెక్టు స్థాపించాలంటే 6 ప్రభుత్వ కార్యాలయాల నుంచి అనుమతులు తప్పనిసరి. దీనికి మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. దీని బదులు సింగిల్ డెస్క్ విధానం మాదిరిగా కేవలం 30 నుంచి 90 రోజుల్లోపునే అనుమతులు వచ్చేలా విధానాన్ని మార్చారు. అదేవిధంగా.. 90 ఏళ్ల లీజుగడువు, పలు విభాగాల్లో 100 శాతం రీయింబర్స్మెంట్, యూనిట్ విద్యుత్ రూ.2 కే అందివ్వడం.. ఇలా ఎన్నో కొత్త రాయితీల కారణంగా విశాఖ జిల్లాకు సరికొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలున్నాయి. జిల్లా చుట్టూ.. పర్యాటకానికి కావల్సినంత ప్రకృతి సంపద ఉంది. దీన్ని అభివృద్ధి చేసేందుకు అనుగుణంగా ఉన్న భూములపై ఇప్పటికే దృష్టి సారించారు. టూరిజం శాఖకు సంబంధించిన 650 ఎకరాల స్థలాల్లో కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇందులో ఏయే ప్రాంతాల్లో ఎలాంటి ప్రాజెక్టులు అమలు చేస్తే పర్యాటకుల నుంచి మంచి స్పందన వస్తుందనే అంశంపై ఇప్పటికే నివేదిక సిద్ధం చేసి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు పంపించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో హోటల్స్, రిసార్టులతో కొత్త కళ తీసుకువచ్చేలా, నగర పరిధిలోనూ వినూత్న ప్రాజెక్టులకు అనుమతులిచ్చి దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే దిశగా పాలసీలో పొందుపరిచిన అంశాలు అనుకూలిస్తాయి. త్వరితగతిన ప్రాజెక్టులు వచ్చి పర్యాటక విశాఖ మరింత అభివృద్ధి చెంది పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. చదవండి: ఎగసిన ఉత్తేజం.. పర్యాటకం కళకళ.. ఫ్లోటింగ్ రెస్టారెంట్.. వాచ్ టవర్.. జిల్లాలో మూడు టూరిజం సర్క్యూట్లు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసింది. అరకు టూరిజం సర్క్యూట్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతుల రావాల్సి ఉండగా మిగిలిన సర్క్యూట్లు కూడా కొత్త పాలసీ వచ్చాక ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రూ.156 కోట్లతో అరకు ఎకో టూరిజం సరూŠయ్క్ట్ త్వరలోనే అమల్లోకి రానుంది. బౌద్ధ కేంద్రాలైన బొజ్జనకొండ, తొట్లకొండ, బావికొండను సందర్శించేలా రూ.20.70 కోట్లతో బుద్ధిస్ట్ సర్క్యూట్ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అదేవిధంగా తెన్నేటి పార్కు సమీపానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ షిప్‌ను ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి అవంతి ప్రకటించారు. షిప్ యాజమాన్యంతో చర్చలు చివరిదశలో ఉన్నాయని, అవి కొలిక్కి వచ్చాక స్పష్టత వస్తుందని తెలిపారు. కైలాసగిరిపై నుంచి సాగర తీరం అందా లు, విశాఖ నగర సొగసులు చూసేందుకు వాచ్ టవర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు సిద్ధమైతే విశాఖ పర్యాటకానికి మరింత సొబగులు చేకూరనున్నాయి. ఎస్పీవీ ద్వారా పారదర్శకంగా.. టూరిజం పాలసీ చాలా అద్భుతంగా ఉందని ఇప్పటికే స్టేక్ హోల్డర్లు, టూరిజం ఆపరేటర్లు కితాబిచ్చారు. పెట్టుబడులను ఆకర్షించేలా ఫ్రెండ్లీ పాలసీ రూపొందించాలన్న ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా కొత్త పర్యాటక విధానం తీసుకొచ్చాం. స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ద్వారా పెట్టుబడులకు పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా అనుమతులిస్తాం. చిన్న హోటల్స్, రెస్టారెంట్లు రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా తీసుకునే రుణాలపై 4.5 శాతం వడ్డీ ప్రభుత్వమే భరిస్తుంది. ప్రస్తుతం అసంఘటితంగా ఉన్న టూర్ ఆపరేటర్లు, గైడ్లకు వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ప్రొఫెషనలిజం ఉండేలా మారుస్తాం. అతిథి దేవోభవ సంప్రదాయాన్ని పాటిస్తాం. రాష్ట్రంలోని అన్ని పర్యాటక కేంద్రాలు కొత్త పాలసీతో టూరిజం పరంగా భాసిల్లుతాయి. ముఖ్యంగా విశాఖ జిల్లా పర్యాటక ఖిల్లాగా మారుతుంది. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి -
అరకు అందాల రైలు.. మళ్లీ వచ్చింది!
ఎత్తైన కొండకోనలు దాటుకుంటూ ప్రకృతి అందాల నడుమ సాగే కేకేలైన్ రైలు ప్రయాణం అంటే దేశవ్యాప్తంగా పర్యాటకులు మొగ్గు చూపుతుంటారు. కొండకోనల మధ్యలో నిర్మించిన రైల్వేమార్గంలోని ప్రయాణం వింత అనుభూతి కలిగిస్తుంది. గుహలు, జలపాతాలను ఆనుకుని రైలుప్రయాణం ఆహ్లాదంగా సాగుతుంది. కోవిడ్ నేపథ్యంలో తొమ్మిది నెలల సుదీర్ఘ విరామానంతరం శుక్రవారం కేకేలైన్‌లో ప్రత్యేక రైలు కూత పెడుతూ రావడంతో పర్యాటకులు ఆనందానికి అవధి లేకుండా పోయింది. మొదటిరోజు పర్యాటకులు భారీ సంఖ్యలోనే బొర్రా రైల్వేస్టేషన్లో దిగారు. అనంతగిరి/అరకులోయ రూరల్: కొత్తవలస–కిరండూల్ (కేకే లైన్) ప్రత్యేక రైలు రాకతో బొర్రా, అరకు రైల్వే స్టేషన్ మొదటిరోజు కళకళలాడాయి. కరోనా నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలు మూసివేయడంతో పాసింజర్ రైలును కూడా రద్దు చేశారు. గత రెండు నెలల క్రితం కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తగు జాగ్రత్తలు నేపథ్యంలోని పలు పర్యాటక ప్రాంతాలు తెరుచుకున్నాయి. పర్యాటక ప్రాంతాలు తెరచుకున్నప్పటికీ కేకేలైన్‌లోని ప్రత్యేక రైలు మాత్రం అందుబాటులోకి రాలేదు. దీంతో పర్యాటకులు రోడ్డు మార్గంలో ప్రయాణించి పర్యాటక ప్రాంతాలైన బొర్రా, అరకు అందాలను తిలకిస్తున్నారు. పర్యాటకులు, ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ శుక్రవారం నుంచి కేకేలైన్‌లో పాసింజర్ రైలు నడపడం ప్రారంభించింది. ప్రత్యేక రైలులో మొదటిరోజు పర్యాటకులు భారీ సంఖ్యలోని తరలివచ్చారు. పర్యాటకులతో బొర్రా రైల్వేస్టేషన్ కిటకిటలాడింది. అరకు 11 గంటలకు చేరుకుంది. మొదటిరోజు స్లీపర్‌కోచ్ సదుపాయం కల్పించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మాస్క్ లు ధరించి ప్రయాణం సాగించాలని రెవెన్యూ శాఖ అధికారులు పేర్కొన్నారు. చాలానెలల తరువాత రైలు రావడంతో స్థానిక ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేటి నుంచి విస్టాడోమ్ కోచ్ తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): అరకు రైలుకు విస్టాడోమ్ కోచ్ శనివారం నుంచి అందుబాటులోకి వస్తుంది. ఆంధ్రా ఊటీ అరకు అందాలను చూపించే అద్దాల కోచ్ (విస్టాడోమ్)లో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు ఈ కోచ్‌కు రిజర్వేషన్ చేసుకోవాలి. ప్రస్తుతం నడుస్తున్న విశాఖపట్నం–కిరండూల్– విశాఖపట్నం స్పెషల్ రైలు నెంబరుతో కాకుండా ఈ కోచ్‌కు మాత్రం విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే వారు 08504, అరకు నుంచి విశాఖపట్నం వచ్చేవారు 08503 నెంబరుతో రిజర్వేషన్ చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు. రిజర్వేషన్ బుకింగ్‌లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ మార్పు చేసినట్లు తెలిపారు. ఓ మంచి అనుభూతినిచ్చింది కేకేలైన్ ప్రయాణం చేయాలని చాలా రోజులు నుంచి ఎదురుచూస్తున్నాం. రైలు ప్రయాణంలో ఎతైన కొండల నడుమ సాగుతున్న ప్రయాణం ఓ మంచి అనుభూతి ఇస్తుందని, పలువురు చెబితే విన్నాం. ఈ రోజు కళ్లారా చూశాం. చాల సంతోషంగా అనిపించింది. కుటుంబంతో బొర్రాగుహలు, కటికి, తదితర పర్యాటక ప్రాంతాలను చూసేందుకు విశాఖపట్నం నుంచి కిరండూల్ రైలులో బొర్రాగుహలకు చేరుకున్నాం. – కిరణ్, శ్రీదేవి పర్యాటకురాలు టెక్కలి ప్రయాణం అద్భుతం అరకులోయ అందాలను తిలకించేందుకు చాల రోజులుగా రావాలని కోరిక ఉండేది. కేకేలైన్‌లోని శుక్రవారం నుంచి రైలు అందుబాటులోకి వస్తోందని తెలిసి సంతోషం అని్పంచింది. ప్రయాణం చేస్తున్నంతసేపు కొత్త అనుభూతి పొందాను. గుహల లోపల నుంచి రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు సరదా అనిపించింది. ఈ ప్రయాణం నాకు ఓ ప్రత్యేకం. – బెంగళూర్‌కు చెందిన పర్యాటకుడు స్నేహితులందరం కలిసి వచ్చాం కేకేలైన్‌లోని రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని తెలిసి స్నేహితులందరం కలిసి గురువారం విశాఖపట్నం చేరుకుని శుక్రవారం ఉదయం విశాఖపట్నం నుంచి బొర్రాగుహలకు చేరుకున్నాం. కొండకోనలు లోయల మధ్యలోని ప్రయాణం చాల ఆనందంగా ఉంది. చాలా సరదగా గడిపాం. రైలు ప్రయాణానికి పర్యాటకులు అసక్తి ఎందుకు చూపిస్తారో అర్థం అయింది. – శివ, అశోక్ హైదరాబాద్ -
ఎగసిన ఉత్తేజం.. పర్యాటకం కళకళ..
సహజ ప్రకృతి సందడి చేస్తోంది.. పర్యాటకుల పలకరింతలతో కొండకోనలు పులకరిస్తున్నాయి.. అలరారుతున్న అందాలని చూసి.. ఎన్నాళ్లకెన్నాళ్లకంటూ సందర్శకులు సంబరపడుతున్నారు. లాక్డౌన్ కారణంగా ఇన్నాళ్లూ ఒంటరైన పర్యాటకం.. సందర్శకుల అడుగుల సడితో కొత్త రూపు సంతరించుకుంది. కోవిడ్–19 కారణంగా వెలవెలబోయిన టూరిజం.. నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోంది. ప్రస్తుతం రోజుకు వెయ్యి మంది వరకూ జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: కరోనా కారణంగా పడకేసిన పర్యాటక రంగం మళ్లీ ఊపందుకుంది. సుమారు ఐదున్నర నెలల పాటు మూతపడిన పర్యాటక కేంద్రాలు కళకళలాడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల పునఃప్రారంభానికి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన ప్రకృతి ప్రేమికులు.. ఇప్పుడు సందర్శన స్థలాల్లో విహరించేందుకు అడుగులు వేస్తున్నారు. ఆగస్ట్‌లో లక్ష మంది మాత్రమే.. పర్యాటక ప్రాంతాలతో, సహజ సిద్ధమైన అందాలతో భాసిల్లుతున్న విశాఖ జిల్లాకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. కరోనాకు పూర్వం జిల్లాలో నెలకు సుమారు 15 నుంచి 18 లక్షల మంది పర్యాటకులు వచ్చేవారు. కోవిడ్–19 కారణంగా లాక్డౌన్ విధించడంతో సందర్శకుల సంఖ్య సున్నాకు పడిపోయింది. 2019 జనవరి నుంచి జూలై వరకూ 1,57, 86,500 మంది పర్యాటకులు జిల్లాను సందర్శించగా.. ఈ ఏడాది మార్చి 21 వరకూ 26,71,579 మంది మాత్రమే సందర్శించారు. జూలై వరకు లాక్డౌన్ ఉండటంతో ఒక్క పర్యాటకుడు కూడా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లలేదు. అదే విధంగా.. 2019 ఆగస్టులో 19,43,392 మంది రాగా.. ఈ ఏడాది ఆగస్ట్‌లో కేవ లం లక్ష మంది మాత్రమే సందర్శకులు వచ్చారు. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆంధ్రా ఊటీకి రోజుకు 200 మంది.. ఆంధ్రా ఊటీ అరకు ప్రాంతానికి సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ఇన్నాళ్లూ టూరిస్టులు లేక బోసిపోయిన మన్యం.. ఇప్పుడు వారి రాకతో కళకళలాడుతోంది. ఇప్పుడిప్పుడే పర్యాటకానికి అనుమతులు లభించడంతో అక్టోబర్‌నాటి కల్లా.. పర్యాటకం పుంజుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. అరకు, పాడేరు, బొర్రా గుహలు మొదలైన ప్రాంతాలను రోజుకు 200 మంది సందర్శిస్తున్నారు. వారాంతాల్లో మాత్రం ఈ సంఖ్య 5 రెట్లకు పెరిగి వెయ్యి మంది వరకు వస్తున్నారు. అయితే గతేడాది మాత్రం ఏజెన్సీకు రోజుకు 1000 నుంచి 1500 మందికి పైగా రాగా.. వారాంతాల్లో 3 వేలకు పైగా మన్యం అందాలు చూసేందుకు పర్యాటకులు వచ్చేవారు. డముకు వ్యూ పాయింట్ వద్ద సందర్శకులు.. తీర ప్రాంతాల్లో జనసందడి ఐదున్నర నెలల తరువాత వీఎంఆర్డీఏ ఆధీనంలో ఉన్న పార్కులు, మ్యూజియాలు, సందర్శన కేంద్రాలు తెరుచుకున్నాయి. కైలాసగిరి, వైఎస్సార్ సెంట్రల్ పార్కు, తెన్నేటి పార్కులతో పాటు అన్నింటినీ పునఃప్రారంభించడంతో సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. తీర ప్రాంతాల్లో జనసందడి నెలకొంటుంది. బీచ్ ఒడ్డున సేదతీరుతూ ఆస్వాదిస్తున్నారు. దసరాకు పెరిగే అవకాశం జిల్లాకు వస్తున్న పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆర్కే బీచ్, ఏజెన్సీలు కళకళలాడుతున్నాయి. ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రతి పర్యాటక కేంద్రం వద్ద పూర్తి రక్షణాత్మక చర్యలు చేపడుతున్నాం. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నాం. కొన్ని ప్రాంతాలకు ఇంకా సందర్శకులకు అనుమతి లేకపోవడంతో నెమ్మదిగా పుంజుకుంటోంది. దసరా నాటికి పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నాం. – ఆర్.పూర్ణిమాదేవి, జిల్లా పర్యాటక అధికారి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే.. కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం, టీయూ –142 మ్యూజియం వంటి ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున.. వాటిలో సందర్శకులకు ఇంకా అనుమతించలేదు. కైలాసగిరి రోప్‌వే, టాయ్ ట్రైన్ ఆరు నెలలుగా ప్రారంభించకపోవడంతో వాటికి పూర్తిస్థాయి మరమ్మతులు నిర్వహిస్తున్నాం. ట్రయల్ రన్ వేసి, తర్వాత ప్రారంభిస్తాం. –పి.కోటేశ్వరరావు, వీఎంఆర్డీఏ కమిషనర్ -
అద్దాల పెట్టెల్లో.. ఆంధ్రా ఊటీకి..
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి రమణీయతతో విలసిల్లుస్తున్న అద్భుత పర్వత పంక్తి అరకు. ఈ ప్రాంతం ఎంత అందంగా ఉంటుందో.. ఆ అందాల నడుమ చేసే ప్రయాణమూ అంతే అద్భుతంగా ఉంటుంది. ఎత్తైన కొండలు, కోనలు, గుహల మధ్య వయ్యారంగా సాగిపోయే రైల్లో ప్రయాణం సరికొత్త అనుభూతినిస్తుంది. ఈ ప్రయాణాన్ని మరింత మజాగా మార్చింది అద్దాల పెట్టె. విశాఖ నుంచి అరకు వెళ్లే రైలుకు అమర్చిన ఈ అద్దాల పెట్టె నుంచి అణువణువూ అందాలతో తొణికిసలాడే అద్భుతాలను వీక్షిస్తూ.. ప్రయాణికులు లెక్కలేనన్ని మధురానుభూతులను ఆస్వాదించారు. ఇప్పుడు మొత్తం అద్దాల పెట్టెలతోనే ఓ సరికొత్త రైలు.. విశాఖ– అరకు మధ్య ప్రకృతి సౌందర్యాన్ని అత్యద్భుతంగా చూపించేందుకు సిద్ధమవుతోంది. పర్యాటకుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని విశాఖ– అరకు మధ్య 5 విస్టాడోమ్ కోచ్‌లతో సర్వీస్ ప్రారంభించాలి. గతంలో దీనికి సంబంధించి ఇచ్చిన హామీ త్వరితగతిన అమల్లోకి వచ్చేలా చూడాలి. – రైల్వే మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో ఎంపీ విజయసాయిరెడ్డి ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. అరకుకు కచ్చితంగా విస్టాడోమ్ కోచ్‌లను కేటాయిస్తాం. ప్రస్తుతం ఈ కోచ్‌లు తయారీలో ఉన్నాయి. పర్యాటకుల డిమాండ్‌కు అనుగుణంగా విస్టాడోమ్ కోచ్‌లు కేటాయిస్తాం. – విజయసాయిరెడ్డి లేఖకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందన ఈ నేపథ్యంలో విదేశాలకే పరిమితమైన అద్దాలతో కూడిన విలాసవంతమైన విస్టాడోమ్ రైలు విశాఖ– అరకు మధ్య త్వరలోనే చక్కర్లు కొట్టనుంది. ఆంధ్రా ఊటీగా పిలవబడే అరకు ప్రయాణానికి మరింత అందాన్ని, సరికొత్త అనుభూతిని పంచేలా కొత్త రైలు మొదలుకానుంది. అరకు రైలు ప్రయాణమంటే ఇష్టపడని వారెవ్వరూ ఉండరు. రైలు నుంచి ప్రకృతి అందాన్ని తనివితీరా చూసేందుకు విశాఖ నుంచి అరకు వెళ్లే రైలులో 2017 ఏప్రిల్ 16 విస్టాడోమ్ కోచ్(అద్దాల పెట్టె)ను ఏర్పాటు చేశారు. ఈ కోచ్ నుంచి అద్భుతాలను చూసేందుకు పర్యాటకుల నుంచి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో మరో కోచ్ ఏర్పాటు చేయాలని 2017లోనే ప్రతిపాదించారు. అప్పటి నుంచి ఈ ప్రతిపాదన బుట్టదాఖలవుతూ వస్తోంది. తాజాగా విస్టాడోమ్ కోచ్‌లతో రైల్వే సరీ్వస్ ప్రారంభించాలని ఎంపీ విజయసాయిరెడ్డి రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖ రాయడం, దీనికి కేంద్ర రైల్వే మంత్రి స్పందిస్తూ విస్టాడోమ్ కోచ్‌లు కేటాయిస్తామని చెప్పారు. ఈ మేరకు రైల్వే బోర్డు ఐదు విస్టాడోమ్ కోచ్‌లు సిద్ధం చేస్తోంది. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న కోచ్ కలిపి మొత్తం 6 అద్దాల పెట్టెలతో స్పెషల్ టూరిస్ట్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. గతేడాది ప్రకటన అరకు పర్యాటకానికి విస్టాడోమ్ కోచ్‌లు అదనంగా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు రైల్వే మంత్రిత్వ శాఖతో పాటు రైల్వే బోర్డుపైనా ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఏకంగా 5 విస్టాడోమ్ కోచ్‌లు అరకుకు అందించేందుకు రైల్వే బోర్డు గతేడాది అంగీకారం తెలిపింది. 2019 చివరిలో విశాఖలో పర్యటించిన రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి సైతం.. అరకు కోసం 5 అద్దాల కోచ్‌లు ఇస్తున్నట్లు ప్రకటించారు. స్పెషల్ టూరిస్ట్ ట్రైన్: అరకు పర్యాటకానికి మరింత అందాన్నిచ్చేలా స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. కొత్తగా రానున్న 5 విస్టాడోమ్ కోచ్‌లతో పాటు విశాఖ–కిరండూల్ రైలుకు ప్రస్తుతం ఏర్పాటు చేసిన విస్టాడోమ్ కోచ్‌తో కలిపి మొత్తం 6 అద్దాల పెట్టెలతో స్పెషల్ టూరిస్ట్ రైలు చక్కర్లు కొట్టేలా వాల్తేరు డివిజన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒ క్కో కోచ్‌లో 45 సీట్లుంటాయి. గతంలో కేవలం 45 మంది పర్యాటకులకు మా త్రమే అద్దాల పెట్టెలో ప్రయాణించే వీలుండేది. కొత్తగా రానున్న టూరిస్ట్ రైలులో ఏకంగా 270 మంది అరకు అందాలను అద్దాల్లో వీక్షించే అవకాశం కలగనుంది. కోచ్‌లు అందుబాటులోకి రాగానే... ఇన్ని విశిష్టతలతో కూడుకున్న ఈ రైలు పట్టాలెక్కించేందుకు డివిజన్ అధికారులు ఆసక్తి చూపిస్తున్నారు. కోచ్‌లు అందుబాటులోకి వచ్చిన వెంటనే.. ఏ సమయంలో నడపాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు వాల్తేరు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అరకు సరీ్వసును రద్దు చేశారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత సర్వీసులు ప్రారంభించనున్నారు. కోచ్‌లు వచ్చిన వెంటనే ట్రయల్ రన్ నిర్వహించి.. నెల రోజుల్లోనే సరీ్వసు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతామని డివిజన్ అధికారులు చెబుతున్నారు. 84 వంతెనలు.. 58 సొరంగాలు.. ఈ విస్టాడోమ్ కోచ్‌ల్లో సీట్లు 180 డిగ్రీల కోణంలో తిరిగే సౌకర్యం ఉంటుంది. ఒకవైపు అందాల్ని చూస్తున్న సమయంలో మరోవైపు తిరగాలంటే శ్రమించాల్సిన అవసరం లేకుండా రొటేటింగ్ సీట్లో సులువుగా తిరిగి 360 డిగ్రీల కోణంలో అందాలు వీక్షించవచ్చు. అనంతగిరి అడవులు, ఎత్తైన కొండలు.. వాటిపై పరచుకున్న పచ్చదనం.. జలపాతాలు.. ఇలా.. ఎన్నో అందాలు కళ్లార్పకుండా చూసే అవకాశం కలగనుంది. 84 ప్రధాన వంతెనలు.. 58 సొరంగాల గుండా ఈ రైలు ప్రయాణించనుంది. ఒక్కో సొరంగం అర కిలోమీటర్ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ వరకు పొడవుంటుంది. ఇలా.. ఎన్నో అనుభూతుల్ని మూటగట్టుకునేలా రైలు ప్రయాణం సాగుతుంది. -
వెదురు కంజి టేస్టే వేరబ్బా.!
ముంచంగిపుట్టు(అరకు): కూరగాయల్లో ఎన్నో రకాలుంటాయి. కానీ మన్యంలో లభించే వెదురు నుంచి తీసిన చిగురు కూర రుచి వేరు అంటున్నారు గిరిజనులు. దీనిని వెదురు కొమ్ములు, వెదురు కంజి అని కూడా పిలుస్తారు. వెదురు కంజి కూర వాహ్వా.. అంటూ లొట్టలేసుకుంటున్నారు. ప్రస్తుతం మన్యంలోని మండల కేంద్రాల్లో హాట్ కేకుల్లా వెదురు కంజి అమ్మకాలు జరుగుతున్నాయి. అటవీ కొండ ప్రాంతాల్లో ఉన్న వెదురు బొంగు నుంచి లేత వెదురును తీసి చిగురును సేకరిస్తారు. దానిని శుభ్ర పరిచి ముక్కలుగా చేస్తారు. వాటిని గిరిజనులు మండల కేంద్రాలకు తెచ్చి వాటాల రూపంలో రూ.20 నుంచి రూ.40 లు వరకు విక్రయిస్తారు. వెదురు కంజిల వాటా రూ.20, అమ్మకానికి సిద్ధంగా వెదురు కంజి వెదురు కంజిని రెండు రకాలుగా కూర తయారీకి వినియోగిస్తారు. పచ్చి వెదురు కంజిని ఓ రకంగా, ఎండబెట్టి మరో విధంగా కూర తయారీకి వాడతారు. పచ్చిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు కూర తయారు చేసుకోవాలి. ఎండబెడితే ఏడాది కాలంలో ఎప్పుడైనా కూర వండుకోవచ్చు. వేపుడు, పచ్చడి, పులుసు వంటి రకాలుగా కూరను తయారు చేసుకుని చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా కూర తయారు చేసే ముందు రెండు మూడు సార్లు వెదురు కంజిని బాగా కడగాలి. అప్పుడే వెదురు కంజిలో ఉండే చేదు పోతుంది. వెదురుకంజిని బాగా ఉడకబెట్టి దాని కషయాన్ని తాగితే శరీరానికి మంచి చలువ చేస్తుందని గిరిజనులు చెబుతున్నారు. మధుమేహం, కపం, మూల వ్యాధి నివారణకు ఆయుర్వేదపరంగా ఎంతో ఉపశమనం ఇస్తుంది. కడుపులో నులి పురుగును తొలగిస్తుంది. గాయం మానేందుకు వెదురు కంజిని పేస్ట్‌గా చేసి గాయంపై రాస్తారు.మారుమూల గిరిజనులు పాము, తేలు కాటుకు ఔషధంగా సైతం దీనిని వినియోగిస్తున్నారు. -
అందాల లోకంలో విహరిద్దామా !
సాక్షి, విశాఖపట్నం: శతాబ్దాల చరిత్రకు చిరునామాగా, సంస్కృతికి చిహ్నంగా వెలుగొందుతోంది విశాఖ జిల్లా. రాష్ట్ర ప్రజలనే కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటూ ప్రముఖ పర్యాటక కేంద్రంగా విశాఖ ఖ్యాతినార్జించింది. అయితే కోవిడ్–19 కారణంగా జిల్లాలోని పర్యాటక రంగం నాలుగు నెలలుగా బోసిపోయింది. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ధాటికి పూర్తిగా కుదేలైంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం అన్ లాక్డౌన్లో ఇచ్చిన సడలింపులతో సందర్శకులను ఆహ్వానం పలికేందుకు పర్యాటక శాఖ సిద్ధమైంది. కళ తప్పిన పర్యాటకంతో భారీగా నష్టం వాటిల్లడంతో.. దాన్ని పూడ్చుకునేందుకు సరికొత్త మార్గాల్ని అన్వేషిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక రాయితీలు అమలు చేస్తూ.. సందర్శకులను ఆకర్షిస్తోంది. విశాఖ మహా నగరంతో పాటు మన్యంలోనూ టూరిజం శాఖకు చెందిన హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్‌లున్నాయి. టూరిస్టులు ఎక్కువగా వచ్చేలా చేసేందుకు కొత్త కొత్త రాయితీలను పర్యాటక శాఖ ప్రకటించింది. ఏసీ, నాన్ ఏసీ, లగ్జరీ, వీఐపీ, స్టాండర్డ్స్ పేరుతో రిసార్ట్స్‌ల్లోనూ, హోటళ్లలోనూ టూరిజం శాఖకు చెందిన గదులున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సందర్శకుల తాకిడి తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ తరుణంలో డిస్కౌంట్లతో టూరిస్టులను ఆహ్వానించేందుకు పర్యాటక శాఖ ప్రయత్నాలు చేస్తోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) పరిధిలోని హోటళ్లలో బస చేసే వారికి 3 నెలల పాటు ఏకంగా 35 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అరకు రిసార్ట్స్ రూ.700 నుంచి రూ.1250 వరకు తగ్గింపు జిల్లాలో రుషికొండ, అరకు, అనంతగిరి, లంబసింగి, టైడాల్లో ఏపీటీడీసీకి చెందిన రిసార్ట్స్‌లు, హోటల్స్ ఉన్నాయి. ఏపీటీడీసీ అమలు చేస్తున్న 35 శాతం డిస్కౌంట్‌తో ఆయా హోటల్స్‌లో గదుల స్థాయిని బట్టి రూ.700 నుంచి రూ.1,250 వరకు రాయితీ పొందే అవకాశాన్ని పర్యాటకులు సొంతం చేసుకోవచ్చు. లగ్జరీ రూమ్- రూ.1050 నుంచి రూ.1225 ఎగ్జిక్యూటివ్ రూమ్-రూ.910 నుంచి రూ.1050 డీలక్స్ రూమ్ -రూ.840 నుంచి రూ.980 స్టాండర్డ్ ఏసీ రూమ్-రూ.700 నుంచి రూ.805 అరకులోయలోని హరితా రెస్టారెంట్ పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు లాక్డౌన్ సమయంలో టూరిజం పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడు అన్‌లాక్ ప్రక్రియ మొదలవ్వడంతో.. సందర్శకులను ఆకట్టుకునేందుకు రాయితీలు ప్రకటించాం. పర్యాటకుల భద్రతకు అన్ని రిసార్ట్స్‌లు, రెస్టారెంట్లు, హోటల్స్‌లో పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. శానిటైజేషన్ పూర్తి చేశాం. గదుల్లోనూ శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నాం. లాక్డౌన్ నిబంధనలు అనుసరిస్తూ పర్యాటకులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించనున్నాం. – ప్రసాదరెడ్డి, టూరిజం శాఖ విశాఖ డివిజనల్ మేనేజర్ -
పబ్జీకి బానిసై మతిస్థిమితం కోల్పోయిన యువకుడు
సాక్షి, విశాఖపట్నం: పబ్జీ గేమ్‌కు బానిసైన ఓ యువకుడు మతిస్థిమితం కోల్పోయాడు.అరకులోయ మండలకేంద్రానికి చెందిన కౌశిక్ నిత్యం పబ్జీ గేమ్‌లో మునిగితేలేవాడు. అకస్మాత్తుగా బిగ్గరగా అరుస్తూ, పిచ్చిగా ప్రవర్తించడంతో గమనించిన కుటుంబ సభ్యులు మంగళవారం స్థానిక ఏరియా ఆస్పత్రికి తలించారు. వైద్యులు ప్రథమ చికిత్సచేసి, విశాఖ తరలించాలని సూచించారు. పబ్జీ గేమ్‌కు బానిస కావడంతోనే మతిస్థిమితం కోల్పోయాడని వారు చెప్పారు. చదవండి: పబ్జీ గేమ్‌కి బానిసై.. -
రేపటి నుంచి తెరుచుకోనున్న పర్యాటక హోటల్స్
-
‘అరకు రైలుకు మరిన్ని విస్టాడోమ్ కోచ్‌లు కావాలి’
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖపట్నం-అరకులోయ మధ్య నడిచే పర్యాటక రైలుకు అదనంగా ఐదు విస్టాడోమ్ కోచ్‌లను ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రైల్వేమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో బుధవారం ప్రత్యేక ప్రస్తావన (స్పెషల్ మెన్షన్) ద్వారా ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ.. బీచ్‌లు, గుహలు, జలపాతాలు, ఘాట్లతో విశాఖపట్నం జిల్లా పర్యాటకుల స్వర్గధామంగా విరాజిల్లుతోందని అన్నారు. ‘తూర్పు కోస్తాకు మణిహారంగా విశాఖ జిల్లా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో పర్యాటకానికి విశేష ఆకర్షణగా నిలిచిన వాటిలో విస్టాడోమ్ కోచ్ ఒకటి. ప్రస్తుతం పర్యాటక రైలుగా పరిగణించే విశాఖపట్నం-అరకు లోయ రైలుకు అనుసంధానించిన ఈ విస్టాడోమ్ కోచ్‌లో ప్రయాణం పట్ల పర్యాటకులు అమితమైన ఆసక్తి చూపుతున్నారు’ ఆయన అన్నారు. తూర్పు కనుమల్లో విస్తరించిన సువిశాలమైన ఆకుపచ్చని అడవులు, లోయలు, టన్నెల్స్ వంటి ప్రకృతి దృశ్యాలను పర్యాటకులు నిలువెత్తు అద్దాల గుండా నలుదిక్కులా వీక్షించే విధంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన విస్టాడోమ్ కోచ్ ప్రారంభించిన రోజు నుంచే పర్యాటకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నట్లు ఆయన చెప్పారు. అమిత ప్రజాదరణ పొందిన విస్టాడోమ్ కోచ్‌కు అనూహ్యమైన డిమాండ్ ఏర్పడినప్పటికీ రైలులో కేవలం ఒకే ఒక కోచ్ అందుబాటులో ఉండటం పర్యాటకులను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని అన్నారు. ‘విస్టాడోమ్ కోచ్‌లో ప్రయాణానికి టిక్కెట్ల కోసం ప్రతి రోజు సుదీర్ఘమైన వెయిటింగ్ లిస్ట్ ఉంటోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం-అరకులోయ రైలుకు కనీసం మరో అయిదు విస్టాడోమ్ కోచ్‌లను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేసి పర్యాటకుల అవసరాన్ని తీర్చాలి. అదనంగా ఏర్పాటు చేసే విస్టాడోమ్ కోచ్‌ల వలన విశాఖపట్నంలో పర్యాటక రంగానికి మరింత ఊపు ఇచ్చినట్లువుతుంది. అలాగే రైల్వేలకు కూడా దండిగా ఆదాయం లభిస్తుంది’ అని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ కారణాల దృష్ట్యా అరకు రైలుకు అదనంగా అయిదు విస్టాడోమ్ కోచ్‌ల ఏర్పాటు కోసం తగిన చర్యలు చేపట్టవలసిందిగా రైల్వే మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఆకట్టుకున్న అరకు ఉత్సవ్
-
అరకు ఉత్సవ్ అదుర్స్
అరకులోయ: పర్యాటక ప్రాంతం అరకులోయలో ప్రభుత్వం గిరిజన ఆచారాలను గౌరవిస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన, అరకు ఉత్సవ్– 2020 సంబరాలు అంబరాన్ని తాకాయి. ఉత్సవ్ చివరిరోజైన ఆదివారం ఉత్సవాన్ని తిలకించేందుకు పర్యాటకులతో పాటు ఏజెన్సీ వ్యాప్తంగా తరలిరావడంతో సాయంత్రం ఐదు గంటలకే ఎన్టీఆర్ మైదానం కిటకిటలాడింది. రికార్డు స్థాయిలో ప్రజలు తరలిరావడంతో ఉత్సవ్ ప్రాంగణం హోరెత్తింది. స్థానికంగా ఉన్న గిరిజన విద్యాలయాల్లోని గిరిజన విద్యార్థినులంతా పోటాపోటీగా గిరిజన సంప్రదాయలను ప్రతిబింబించే నృత్యాలు చేసి ఆహూతులను ఆకట్టుకున్నారు. ఇక గిరిజన సంప్రదాయ కొమ్ము, సవార, థింసా నృత్యాలు ప్రజలను మైమరిపించాయి. తెలుగు రాష్ట్రాల్లో తన పాటలతో ప్రసిద్ధిచెందిన గాయకురాలు మంగ్లీ ముగింపు ఉత్సవానికి రావడంతో అరకు ఉత్సవ్ వేదిక మరింత సందడిగా మారింది. ఆమె తనదైన శైలిలో పాటలు పాడి ప్రజలను హుషారెత్తించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన గిరిజన వంటకాలను కూడా పర్యాటకులు, స్థానికులు రుచిచూసి అద్భుతమని కితాబునిచ్చారు. ప్రభుత్వం అభివృద్ధి పథకాలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కూడా పర్యాటకులు ఆసక్తిగా తిలకించడం కనిపించింది. అలాగే ఉత్సవ్‌ను పురష్కరించుకుని అధికార యంత్రాంగం జిల్లా క్రీడలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్, కబడ్డీ, విలువిద్య, పోటీలు ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిశాయి. విజేతైన క్రీడాకారులకు అరకు ఎంపీ గోడ్డెటి మాధవి, అరకు, పాడేరు ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి నగదు బహుమతులు, మెమొంటోలు పంపిణీ చేశారు. -
‘అరకు.. ప్రకృతి ప్రసాదించిన వరం’
సాక్షి, విశాఖపట్నం: అరకు ప్రకృతి ప్రసాదించిన వరమని, ఆంధ్రప్రదేశ్‌లో అరుకు ఉండటం మన అదృష్టమని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. అరకు ఉత్సవాలను మంత్రి అవంతి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే చెట్టిఫాల్గుణ, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, టూరిజం ఎండీ ప్రవీణ కుమార్, పాడేరు ఐడీడీఏ పీవో బాలాజీ, పాడేరు సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా అవంతి శ్రీనివాస్ సాంప్రదాయ ఉత్పత్తులు, ఆహార వంటకాల స్టాల్స్‌ను ప్రారంభించారు. (ముగిసిన సీఎం జగన్, ముకేష్ అంబానీ భేటీ) ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అరకు అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. డాక్టర్లు రాని పాడేరుకు ఏకంగా మెడికల్ కాలేజీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గిరిజనులు గొప్పగా దీవించాలన్నారు. ప్రజలు ముఖ్యమంత్రిని కావాలనుకుంటే త్వరలో విశాఖలోనే అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలను సమ్మక్క-సారక్క ఉత్సవాల తరహాలో నిర్వహిస్తామని తెలిపారు. గిరిజనులు దేవతగా భావించే కొండలను కాపాడుతూ బాక్సైట్ తవ్వకాల అనుమతులను సీఎం జగన్ రద్దు చేశారని ఆయన గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి గిరిజనులే పునాదులాన్నారు. పులకింతల అరకు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. గిరిజన సంప్రదాయాలను గౌరవిస్తూ పర్యాటక అభివృద్ధికి తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. అరకు ఉత్సవాలు గిరిజన సంస్కృతికి ఇచ్చే ప్రోత్సాహకమని ఆమె తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని భాగ్యలక్ష్మి కొనియాడారు. బాక్సైట్ తవ్వకాల జీవో 97 రద్దు, పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేశారని ఆమె తెలిపారు. కుదరకపోయినా ఓ కప్పు అరకు ఎమ్మెల్యే చెట్టిఫాల్గుణ మాట్లాడుతూ.. అరకు ఉత్సవాలతో మన్యానికి అందం వచ్చిందన్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని తెలిపారు. అరకు పరిసరాల్లో ఉన్న ఎన్నో జలపాతాలను అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. తనకు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్‌లో ప్రెగ్నెన్సీ ఉమెన్ హాస్టల్ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. ఆంధ్రా ఊటి అరకు -
అరకు ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు
-
పులకింతల అరకు
అరకులోయ: మన్యం ప్రకృతి సొగసుల నిలయం. ఎటుచూసినా పచ్చందాల కనువిందే. జలపాతాల గలగలలు.. కొండ కోనల్లో సాగే ప్రయాణాలు.. పలకరించే కాఫీతోటలు.. ఆకట్టుకునే గిరిజనుల సంప్రదాయాలు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో అందాల సమాహారం. అందుకే అరకులోయ ఆంధ్రాఊటీగా ఖ్యాతిగాంచింది. ప్రపంచ స్థాయి పర్యాటకుల మది దోచుకుంది. ఇంతటి పేరుగాంచిన ‘లోయ’ భారీ ఉత్సవానికి ముస్తాబైంది. రెండురోజుల పాటు జరిగే ‘అరకు ఉత్సవం’ నేడు ప్రారంభం కానుంది. ఈ ఉత్సవానికి రూ. కోటి రూపాయల ఖర్చుతో టూరిజం శాఖ భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రా ఊటీ అందాలపై ప్రత్యేక కథనం. జలపాతాల హోరు.. పర్యాటకుల హుషారు... అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో జలపాతాలు పర్యాటకుల్ని ఆహా్వనిస్తున్నాయి. ఎత్తైన కొండల నుంచి జాలువారుతున్న నీటి ధారలు సందర్శకులకు వింత అనుభూతిని మిగులుస్తున్నాయి. కటికి జలపాతం: ►బొర్రాగుహలకు సమీపంలో ఉంది ఈ జలపాతం. ►దీని ఎత్తు 300 మీటర్లు. ►రైలు ప్రయాణంలో కూడా ఈ జలపాతం అందాల్ని వీక్షించొచ్చు. ►కటికి జలపాతం వద్ద తరచూ ట్రెక్కింగ్ క్యాంప్‌లు జరుగుతుంటాయి. తాడిగుడ: అనంతగిరి మండల కేంద్రానికి సమీపంలో ఉంది తాడిగుడ జలపాతం. అమ్మ: అనంతగిరి–హుకుంపేట మండలాల సరిహద్దులోని వేలమామిడి సమీపంలో ఎత్తైన అమ్మ జలపాతం ఉంది. మారుమూల ప్రాంతంలో ఉండడం.. రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉండడంతో పర్యాటకులు అంత దూరం వెళ్లలేకపోతున్నారు. ►అరకులోయ మండలంలోని రణజిల్లెడ, డుంబ్రిగుడ మండలంలోని కొల్లాపుట్టు, చాపరాయి జలపాతాలు కూడా పర్యాటకుల్ని రా..రమ్మంటున్నాయి. రైలు ప్రయాణం ఓ అద్భుతం... అరకులోయకు రైలు ప్రయాణం అద్భుతంగా సాగుతుంది. బోలెడు జ్ఞాపకాల్ని మిగులుస్తుంది. విశాఖలో ఉదయం 7 గంటలకు విశాఖ–కిరండోల్ పాసింజర్ రైలు బయల్దేరుతుంది. ఇందులో ప్రయాణమంటే పర్యాటకులకు అమితమైన ఇష్టం. కొండల నడుమ సాగే ఆహ్లాదకర ప్రయాణంతో పర్యాటకులు పరవశిస్తారు. విజయనగరం జిల్లా ఎస్.కోట సమీపంలోని బొడ్డవర ప్రాంతం నుంచి అరకులోయ సమీపంలోని కరకవలస వరకు రైలు ప్రయాణం ఎత్తైన కొండల నడుమ సాగుతుంది. కొండలను చీల్చి గుహలలో నిర్మించిన రైలు మార్గం పర్యాటకులను మరింత ఆకట్టుకుంటుంది. చిన్నారులు, విద్యార్థులంతా టన్నెల్స్ మధ్య రైలు ప్రయాణాన్ని చూసి తెగ సంబరపడతారు. పగలు కూడా ఈ కొండల మధ్య టన్నెల్స్ దాటే సమయంలో చీకటి ఆవరిస్తుంది. ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతిని మిగులుస్తుంది. ప్రత్యేకతలివే... ►ఈ మార్గంలో మొత్తం 52 టన్నెల్స్ ఉన్నాయి. ►బొర్రా–చిమిడిపల్లి స్టేషన్ల మధ్య 900 మీటర్ల పొడవైన భారీ టన్నెల్ ఉంది. ►ఈ టన్నెల్‌ను రైలు దాటేందుకు 20 నిమిషాలు పడుతుంది. ►మిగతా టన్నెల్స్ 200 మీటర్ల లోపునే ఉంటాయి. ►ఘాట్ మార్గం కావడంతో రైలు ప్రయాణం నెమ్మదిగా సాగుతుంది. ►బొర్రా గుహలు మీదుగానే రైలు పట్టాలు ఉండడం మరో ప్రత్యేకత. ►రైలు ప్రయాణమంతా దట్టమైన అటవీ ప్రాంతం గుండా సాగుతుంది. ►ఎత్తైన కొండలు, ప్రకృతి అందాలు, అక్కడక్కడా దర్శనమిచ్చే జలపాతాలను చూస్తూ పర్యాటకులు మంత్ర ముగ్థులవుతారు. బాగు.. యాపిల్ సాగు... యాపిల్ సాగు అంటే అందరికీ కాశ్మీర్‌లోయ గుర్తొస్తుంది. అరకులోయ కూడా యాపిల్ సాగుకు అనుకూలంగా ఉంది. పాడేరు ఐటీడీఏ, హారీ్టకల్చర్ శాఖలు ప్రయోగాత్మకంగా అరకులోయ మండలంలోని పద్మాపురం, చినలబుడులో మూడేళ్ల క్రితం యాపిల్ సాగుకు గిరిజన రైతులను ప్రోత్సహించాయి. అరకులోయలోని చల్లని వాతావరణం యాపిల్ సాగుకు అనుకూలంగా ఉండడంతో రెండేళ్ల నుంచి ఇక్కడ సిమ్లా యాపిల్స్ విరగ్గాస్తున్నాయి. అలాగే స్టాబెర్రీ పంటకు అరకులోయ ఖ్యాతిగాంచింది. ఘాట్ రోడ్లో అందాలు భలే... విశాఖపట్నం నుంచి అరకులోయకు ఉన్న రోడ్డు మార్గంలో కూడా ప్రకృతి అందాలు పర్యాటకుల్ని పలకరిస్తాయి. కొండల నడుమ ఘాట్‌రోడ్డులో ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతుంది. ఎత్తైన గాలికొండ ప్రధాన ఆకర్షణ. అలాగే దారి మధ్యలో కాఫీతోటలు కనువిందు చేస్తాయి. ఈ తోటల్లో చల్లని వాతావరణం మధ్య ప్రయాణం ఒత్తిడిని దూరం చేస్తుంది. సంప్రదాయాలకు ప్రతీకలు... అరకులోయను సందర్శించే పర్యాటకులు, చిన్నారులకు గిరిజన మ్యూజియ, పద్మాపురం గార్డెన్లు ఘన స్వాగతం పలుకుతాయి. గిరిజన మ్యూజియంలో గిరిజన ఆచార సంప్రదాయాలను ప్రతిబింబించే కళాకృతులు ఉన్నాయి. ఇక్కడ బోటు షికారు కూడా ఏర్పాటు చేశారు. పద్మాపురం బొటానికల్ గార్డెన్లో పూలు, పండ్ల జాతుల మొక్కలతో పాటు ఔషధ మొక్కలు ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ టాయ్‌ట్రైన్‌లో ప్రయాణం చిన్నారులను ఆకట్టుకుంటుంది. గుహల అందాల చూడతరమా.. అనంతగిరి మండలంలోని బొర్రాగుహలు ప్రపంచ ఖ్యాతిగాంచాయి. వీటిని సందర్శించేందుకు విదేశీ పర్యాటకులు అధికంగా వస్తుంటారు. సహజసిద్ధంగా ఏర్పడిన బొర్రాగుహలు అరకులోయ అందాలకు ప్రధాన ఆకర్షణ. గుహలలో విభిన్న ఆకృతుల్లో శిలలు పర్యాటకుల్ని ఆలోచింపజేస్తాయి. పర్యాటక శాఖ ఈ గుహల్లో విద్యుత్ వెలుగుల్ని కూడా ఏర్పాటు చేసింది. పూర్వం బొర్రాగుహల అందాలను కాగడాల వెలుతురులో వీక్షించేవారు. ఉత్సవానికి వేళాయె... గత పాలకుల నిర్లక్ష్యంతో మూడేళ్లుగా ఉత్సవాలకు నోచుకోని పర్యాటక ప్రాంతం అరకులోయలో ఈ ఏడాది అరకు ఉత్సవ్–2020ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించింది. ►శని, ఆదివారాల్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ►ఈ సంబరానికి అరకులోయలోని ఎన్టీఆర్ మైదానం వేదిక కానుంది. ►పర్యాటక శాఖ ఈ ఉత్సవాలను పర్యవేక్షిస్తోంది. ►ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, పాడేరు ఐటీడీఏ పీవో బాలాజీ, సబ్‌కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ►శుక్రవారం సాయంత్రం ఎనీ్టఆర్ మైదానాన్ని పాడేరు సబ్‌కలెక్టర్ వెంకటేశ్వర్, ఇతర టూరిజం అధికారులు సందర్శించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. అందరికీ ఆహ్వానాలు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, అరకు, పాడేరు ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి తో పాటు, జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ అరకు ఉత్సవాలకు తరలిరావాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ ఆహ్వానాలు పంపారు. -
నేటి నుంచి అరకు ఉత్సవాలు
-
అరకు ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు
-
29 నుంచి ‘అరకు ఉత్సవ్’
సాక్షి, విశాఖపట్నం: గిరిజన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ నెల 29 నుంచి రెండు రోజుల పాటు అరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో బుధవారం ‘అరకు ఉత్సవ్–2020’ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అరకు ప్రాంతం పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత పొందిందని, ఈ ఉత్సవాల ద్వారా దేశ విదేశాలకు చెందిన మరింతమంది పర్యాటకులను ఆకర్షించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ ఉత్సవాలకు నోడల్ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ వ్యవహరిస్తారన్నారు. ఏజెన్సీలోని యువత ఎంతో ఆలోచనాశక్తి కలవారని, వారిలో ఉన్న ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెడుతోందని పేర్కొన్నారు. గిరిజన యువతకు పర్యాటక శాఖలో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ ఉత్సవాల్లో ఎగ్జిబిషన్ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, డిపార్ట్మెంట్కు సంబంధించిన స్టాల్స్ 10 వంతున ఉంటాయన్నారు. అడ్వంచర్‌కు సంబంధించి పారామోటరింగ్ డే ట్రిప్, ఏటీవీ బైక్ రైడ్, రాప్లింగ్, జిప్ సైక్లింగ్, జోర్బింగ్, ట్రెక్కింగ్ తదితర క్రీడలు ఉంటాయన్నారు. ఏపీ ఐటీడీఏ బృందాలచే ట్రైబల్ ఫోక్ డాన్స్‌లు, క్లాసికల్ డ్యాన్స్‌లు, మ్యూజికల్ డ్యాన్స్ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. వాటితో పాటు గ్రామీణ క్రీడలైన కోకో, కబడ్డీ, విలువిద్య, వాలీబాల్, రంగోలి పోటీలు ఉంటాయని వివరించారు. పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లతో పాటు నగదు బహుమతి, మెమొంటోలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు, అరకు ఎమ్మెల్యేలు కె.భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, జేసీ శివశంకర్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు, పర్యాటక అధికారి పూర్ణిమాదేవి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: చైనా నుంచి క్షేమంగా ఇంటికి..) -
అరకు ఉత్సవ్ పోస్టర్‌ను విడుదల చేసిన అవంతి శ్రీనివాస్
-
అరకు ఉత్సవాల పోస్టర్ విడుదల
సాక్షి, విశాఖపట్నం : అరకు ఉత్సవాల పోస్టర్‌ను పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ బుధవారం విశాఖలో విడుదల చేశారు. ఈ నెల 29 నుంచి రెండు రోజులపాటు జరిగే ఉత్సవాల కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేయగా.. నేడు ఉత్సవాల షెడ్యూల్‌ను మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవితో పాటు అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. -
అరకు విహారయాత్రలో విషాదం..
సాక్షి, విశాఖపట్నం : అరకులో విషాదం చోటుచేసుకుంది. భీమవరం డీఎన్ఆర్ కాలేజీకి చెందిన 50 మంది విద్యార్థులు ఆదివారం కావడంతో.. అరకు అందాలు తిలకించడానికి విహారయాత్రకు వచ్చారు. ప్రముఖ సందర్శక ప్రాంతమైన బొర్రా గృహాలు రైల్వే గేట్ వద్ద ప్రమాదవశాత్తు పర్యాటక బస్సులో నుంచి ఓ యువకుడు కిందపడిపోయాడు. ఈ క్రమంలోనే పర్యాటక బస్సు అతనిపై నుంచి దూసుకుని పోయింది. ఈ ప్రమాదంలో ప్రేమ్ కుమార్ (21) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో విద్యార్థుల విహారయాత్రంలో విషాదం నెలకొంది. ఈ ఘటనతో తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
20 ఏళ్ల క్రితం తప్పిపోయి..
అరకులోయ : విశాఖ ఏజెన్సీలోని అరకులోయలో 2000 సంవత్సరంలో తప్పిపోయిన గంగాధర్ అనే గిరిజన యువకుడు 20 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమయ్యాడు. 9ఏళ్ల వయస్సులో గంగాధర్ విశాఖ రైల్వే స్టేషన్ ప్రాంతంలో తప్పిపోయి చెన్నైకి చేరుకున్నాడు. అప్పట్లో గంగాధర్ ఫొటోతో తప్పిపోయిన బాలుడి పేరిట తమిళనాడు రాష్ట్రంలోని పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. అయితే గంగాధర్‌కు చక్ర సెంట్రల్ ఆర్గనైజేషన్ అనాథాశ్రమం నిర్వాహకులు ఆశ్రయం కల్పించారు. 2015 సంవత్సరం వరకు ఆశ్రమంలోనే వసతితో పాటు చదువు కొనసాగించిన గంగాధర్ 2015లో కొంతమంది స్నేహితులతో కలిసి ఆశ్రమం నుంచి బయటకు వచ్చాడు. ఐటీఐ, కంప్యూటర్ కోర్సులను పూర్తి చేసిన గంగాధర్ తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఎల్ఐసీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదండ్రులు గుర్తుకు రావడంతో గంగాధర్ 15 రోజుల కిందట అరకులోయకు చేరుకుని తన తల్లిదండ్రులు, గ్రామం కోసం వెతుకుతున్నాడు. చిన్న వయస్సులో వెళ్లిపోవడంతో తనకు గిరిజన మ్యూజియం, సినిమాహాలు, గార్డెన్ ప్రాంతాలు మాత్రమే గుర్తున్నాయని గంగాధర్ తమిళ భాషలో వాపోతున్నాడు. గంగాధర్ తల్లిదండ్రులు, గ్రామం ఆచూకీని తెలుసుకునేందుకు స్థానిక పోలీసు అధికారులు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం గంగాధర్ పోలీసుల ఆదీనంలో ఉన్నాడు. -
అందాల అరకు
-
విశాఖ ఏజెన్సీలో గజగజ వణికిస్తున్న చలి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో స్థానికులు చలికి గజగజ వణుకుతున్నారు. ఏజెన్సీలోని మినుములూరులో 11 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్నోగ్రత నమోదవ్వగా, పాడేరు, లంబసింగిలో 12 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, అరకు, చింతపల్లిలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
'సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు'
సాక్షి, అరకులోయ : అరకువ్యాలీలోని వైఎస్సార్ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, అరకు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు, వైఎస్సార్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్‌చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. కుంభా రవిబాబు మాట్లాడుతూ... అధికార వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందుతాయని అన్నారు. కుల, మతాలకు అతీతంగా రాష్ట్రమంతా అభివృద్ది చేయాలని ఆకాంక్షిస్తున్న వైఎస్ జగన్ సుదీర్ఘ కాలంపాటు ఆరోగ్యవంతంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. చరిత్రలో ఏ నాయకుడు చేయని పాదయాత్ర వైఎస్ జగన్ చేశారని, మరో 30 ఏళ్లు ఆయనే రాష్ట్రానికి సీఎంగా ఉండాలని వ్యాఖ్యానించారు. రెండు కోట్ల మంది ప్రజలను స్వయంగా కలిసి వారి కష్టాలను తెలుసుకొని హామీలన్నింటినీ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. చట్టాలను అమలు చేయడంలో దేశానికి సీఎం జగన్ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.అన్ని ప్రాంతాల్లో అభివృద్ది సమానంగా జరగాలనే మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు, మహిళ కార్యకర్తలు పాల్గొన్నారు. -
1 నుంచి సువిధ ప్రత్యేక రైళ్లు
అల్లిపురం(విశాఖ దక్షిణ): ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సంత్రాగచ్చి–కోయంబత్తూర్ల మధ్య సువిధ ప్రత్యేక రైలును నడపనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ జి.సునీల్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు జనవరి 1 నుంచి 26 వరకు ప్రతి బుధవారం సంత్రాగచ్చిలో, జనవరి 3 నుంచి 28 వరకు ప్రతి శుక్రవారం కోయంబత్తూరులో బయలుదేరుతుందని తెలిపారు. హాతియా – బెంగుళూరు కాంటినెంటల్ వయా రాయగడ సువిధ వీక్లీ ప్రత్యేక రైలు జనవరి 3 నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రతి శుక్రవారం హాతియాలో, జనవరి 5 నుంచి మార్చి 1 వరకు బెంగుళూరు కాంటినెంటల్‌లో బయలుదేరుతుందని పేర్కొన్నారు. సంత్రాగచ్చి – కోయంబత్తూర్ల మధ్య.. సంత్రాగచ్చి–కోయంబత్తూరు(80823) సువిధ ప్రత్యేక రైలు సంత్రాగచ్చిలో ప్రతి బుధవారం రాత్రి 9.50 గంటలకు బయలుదేరుతుంది. గురువారం సాయంత్రం 4.03 గంటలకు దువ్వాడ స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరిగి 4.05 గంటలకు దువ్వాడలో బయలుదేరి శుక్రవారం మధ్యాహ్నం 2.25 గంటలకు కోయంబత్తూరు చేరుకుంటుంది. కోయంబత్తూరు – సంత్రాగచ్చి(80824) సువిధ ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం రాత్రి 9.45 గంటలకు కోయంబత్తూరులో బయలుదేరి శనివారం సాయంత్రం 6.03 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. 6.05 గంటలకు దువ్వాడలో బయలుదేరి ఆదివారం ఉదయం 8.45 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది. హాతియా – బెంగుళూరుల మధ్య.. హాతియా – బెంగుళూరు(80635) కాంటినెంటల్ సువిధ వీక్లీ రైలు ప్రతి శుక్రవారం రాత్రి 11 గంటలకు హాతియాలో బయలుదేరి శనివారం సాయంత్రం 6.03 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. 6.05 గంటలకు దువ్వాడలో బయలుదేరి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బెంగుళూరు కాంటినెంట్ల్ చేరుకుంటుంది. బెంగుళూరు కాంటినెంటల్ – హాతియా(80636) వీక్లీ ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం రాత్రి 11 గంటలకు బెంగుళూరు కాంటినెంటల్‌లో బయలుదేరి సోమవారం సాయంత్రం 6.03 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. తిరిగి 6.05 గంటలకు దువ్వాడలో బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హాతియా చేరుకుంటుంది. జనవరి 26 వరకు అరకు ఎక్స్‌ప్రెస్ పొడిగింపు.. అరకు పర్యాటకుల తాకిడి మేరకు విశాఖపట్నం – అరకు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను జనవరి 26 వరకు పొడిగిస్తున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ జి.సునీల్‌కుమార్ తెలిపారు. గత అక్టోబర్ నుంచి నడుస్తున్న ఈ ప్రత్యేక రైలుకు పర్యాటకుల నుంచి ఆదరణ బాగున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి 31 వరకు, జనవరి 1, 4, 5, 11, 12, 14, 15, 16, 18, 19, 23, 24, 25, 26 తేదీల్లో ఈ ప్రత్యేక రైలు నడుస్తుందన్నారు. విశాఖపట్నం – అరకు స్పెషల్ ఎక్స్‌ప్రెస్(08517) ప్రతి రోజు ఉదయం 8.10 గంటలకు విశాఖలో బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 11.30 గంటలకు అరకు చేరుకుంటుంది. అరకు – విశాఖపట్నం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ట్రైన్(08518) అరకులో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని తెలిపారు. ఈ రైలు సింహాచలం, కొత్తవలస, ఎస్.కోట, బొర్రాగుహలు స్టేషన్లలో ఆగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైలు సేవలను పర్యాటకులు, ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. -
చంద్రబాబు గిరిజన ద్రోహి: కుంభా రవిబాబు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్టీ కమిషన్ బిల్లును అడ్డుకుని గిరిజనుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని వైఎస్సార్సీపీ ఎస్టీ విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు అన్నారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆదివాసీలు పడుతున్న కష్టాలను చూసి, వారి సంక్షేమం కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్టీ కమిషన్ బిల్లు ప్రవేశపెడితే.. శాసన మండలిలో చంద్రబాబు అడ్డుతగిలారని అన్నారు. ఎస్టీ కమిషన్‌ను, ఎస్సీ కమిషన్ నుంచి వేరుచేసి గిరిజనులకు మేలు జరుగాలని చూస్తే.. దానిని అడ్డుకున్న చంద్రబాబు చరిత్రలో గిరిజన ద్రోహిగా మిగిలిపోతారని అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది గిరిజన ఓటర్లు ఉన్నారని, ఎస్టీకి సంబంధించి ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నాయని తెలిపారు. 2019 ఎన్నికల్లో ఎస్టీకి సంబంధించి అన్ని అసెంబ్లీ స్దానాలు, ఎంపీ స్దానాలను వైఎస్సార్సీపీ గెలుచుకోవడంతో.. ఓర్వలేకే ఎస్టీ కమిషన్ బిల్లుకు అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు. కేంద్రంలోలానే రాష్ట్రంలో కూడా ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ప్రత్యేకంగా ఉంటే.. ఎస్టీలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని సీఎం జగన్ ప్రభుత్వం ప్రయత్నించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గిరిజనులు లేని క్యాబినెట్ ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు మంత్రివర్గం మాత్రమే అని విమర్శించారు. టీడీపీకి గిరిజనులు ఓట్లేయలేదు, ఎందుకు పని చేయాలని అడిగిన వ్యక్తి చంద్రబాబు అని, అరుకు నియోజకవర్గంలో ఆయన దతత్త తీసుకున్న గ్రామాన్ని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇక కిడారి శ్రావణ్ తండ్రి చనిపోవడం, త్వరలో ఎన్నికలు వస్తుండడంతో .. సానుభూతి ఓట్లు పడుతాయని మంత్రి పదవి ఇచ్చారని పేర్కొన్నారు. అలానే గిరిజన కార్పోరేషన్ ను కూడా ప్రభుత్వం పడిపోతుందని తెలిసి నెలరోజుల ముందు ఇచ్చారంటూ మాజీ ఎమ్మెల్యే కుంభా మండిపడ్డారు. ఆదివాసిల గుండెల్లో ఎక్కడ జగన్ శాశ్వతంగా నిలిచిపోతారోనని చంద్రబాబు నాయుడు ఈర్ష్య పడుతున్నారని అన్నారు. -
కుదరకపోయినా ఓ కప్పు
మంచి కాఫీ కావాలంటే మద్రాసు కాఫీ హౌసుకి వెళ్లాల్సిందే అంటారు కాఫీ ప్రియులు. మరీ అంత దూరమైతే అక్కర్లేదు. విశాఖపట్టణం దగ్గరలో ఉన్న అరకులోనే మంచి కాఫీ చాలా సంవత్సరాలుగా దొరుకుతోంది. కిందటి ఏడాది ఈ అరకు కాఫీకి పారిస్‌లో ‘ప్రిక్స్ ఎపిక్యూర్స్’ అవార్డు కూడా వచ్చింది! ఆ అవార్డును అందుకున్నది కాఫీ గింజల్ని పండించిన అరకు గిరిజన మహిళలు కావడం విశేషం. ఇంకొక విశేషం ఏంటంటే.. పారిస్‌లో ఇప్పుడు ‘అరకు’ అనే పేరున్న కాఫీ స్టాల్ ముందర జనం ఆగిపోతున్నారు. అరకు కాఫీ ఘనతను కేవలం కొన్ని కాఫీ గింజలు ప్రపంచానికి చాటుతున్నాయి. అరకు ప్రాంతంలో ఉండే గిరిజనులు పండించిన నాణ్యమైన కాఫీ గింజలు అవి! అరకు లోయలో గిరిజన మహిళల చేతి మీద సుమారు ఒకటిన్నర లక్షల ఎకరాల్లో కాఫీ గింజలు పండుతున్నాయి. అయితే ఈ గింజలకు అంతర్జాతీయంగా మార్కెట్ ఉన్నా, ఈ గిరిజనులు మాత్రం ఆర్థికంగా నేటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘‘మేం చాలా కష్టపడి పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరం పది బస్తాల గింజలు పండించుకుంటాం. వాటి నుంచి ఒక్కొక్కరం కనీసం సీజన్‌కి రెండు లక్షల రూపాయలు సంపాదించుకుంటేనే గిట్టుబాటు అవుతుంది. కానీ మాకు ఎనభై నుంచి తొంభై వేల రూపాయలు మాత్రమే వస్తోంది. ఖర్చులన్నీ పోగా, తిండి తినటానికి సరిపడేంత డబ్బు మాత్రమే మిగులుతోంది. మా ఆర్థికస్థితిలో ఎటువంటి ఎదుగుదల లేదు. దానితో మాలో చాలామందికి కాఫీ పండించాలనే ఆసక్తి సన్నగిల్లిపోతోంది’’ అంటున్నారు అరకు గిరిజన మహిళలు. చరిత్రలోకి వెళ్తే.. 1898లో తూర్పుగోదావరి తీర ప్రాంతంలో ఒక బ్రిటిష్ అధికారి ఉండేవారు. ఆయన అక్కడి వాతావరణం చూసి, అది కాఫీ పంటకు అనుకూలంగా ఉంటుందని కాఫీ పంట వేశారు. 1950లలో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కాఫీ పంటను సాగు చేయడం మొదలైంది. అలా క్రమేపీ అరకు కాఫీ రుచికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ‘అరకు కాఫీ’ అన్న పేరూ వచ్చింది. 1980 నాటికి రాష్ట్ర ప్రభుత్వం గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ప్రారంభించి, కాఫీ పంటను ప్రోత్సహించింది. ఒకానొక సమయంలో వరి పంట కంటే కాఫీ పంట మీద లాభాలు వచ్చాయి. దాంతో చాలామంది రైతులు కాఫీ పండించడం మొదలుపెట్టారు. రెండేళ్ల క్రితం పారిస్‌లో అరకు కాఫీ స్టోర్ తెరుచుకుంది. ఈ స్టోర్ కారణంగానే కిందటి ఏడాది అరకు గిరిజన మహిళలకు అవార్డు వచ్చింది. ఇంత కమ్మని కాఫీని పండిస్తున్న ఈ గిరిజన మహిళలకు మాత్రం శ్రమకు తగ్గ ఫలితం లభించడం లేదు! -
వణికిపోతున్న విశాఖ మన్యం
సాక్షి, పాడేరు/అరకులోయ: విశాఖ ఏజెన్సీలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలి తాకిడితో ప్రజలు వణికిపోతున్నారు. ఆర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురుస్తుంది. సోమవారం ఉదయం 9 గంటల వరకు మన్యంలో మంచు తెరలు వీడలేదు. పాడేరుకు సమీపంలోని మినుములూరు కేంద్ర కాఫీబోర్డు కార్యాలయం, అరకులోయ కాఫీబోర్డు వద్ద 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శీతల ప్రాంతాలైన జి.కె.వీధి, చింతపల్లి, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో చలి తీవ్రత నెలకొంది. పొగమంచు దట్టంగా కురుస్తుండడంతో ప్రధాన రోడ్లలో వాహన చోదకులు ఉదయం 8 గంటల వరకు వాహనాలకు లైట్లు వేసుకునే ప్రయాణిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు మంచు, చలితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
అరకు అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: చెట్టి ఫాల్గుణ
సాక్షి, విశాఖ : వందకోట్లతో అరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల రోడ్లు అనుసంధాన పనులు త్వరలో ప్రారంభిస్తామని స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెట్టిఫాల్గుణ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 161 రోజుల ప్రభుత్వ పాలనపై ఎమ్మెల్యే ఫాల్గుణ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడేరులో మెడికల్ కళాశాలతోపాటు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న వివిధ పనులపై ప్రస్తావించారు. అరకు అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అరకు నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది వేలకు పైగా రైతులకు రైతు భరోసా అందిందని, వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా 756 మందికి పైగా పదివేలు ప్రోత్సాహంగా ఇచ్చినట్లు వెల్లడించారు. సంతల్లోని రైతులకు షెడ్ల నిర్మాణానికి పంతొమ్మిది కోట్లు కేటాయించినట్లు.. 25 కి.మీ సీసీ రోడ్ల నిర్మాణానికి ఎనిమిది కోట్లు కేటాయించినట్లు తెలిపారు. లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామానికి తాగునీరు సదుపాయం కల్పించనున్నామని చెట్టి ఫాల్గుణ వివరించారు. -
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అరకు ఎమ్మెల్యే ఫాల్గుణ
-
అరకు సంతలో తుపాకుల బేరం..!
సాక్షి, విశాఖపట్నం : అరకు సంతలో శనివారం ఓ విస్తుగొలిపే వార్త వెలుగుచూసింది. నాటు తుపాకులు, బాంబుల తయారీ సామాను అమ్ముతున్న ఇద్డరు మహిళల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రెండు నాటు తుపాకులు, రెండు కేజీల సీసపు గుళ్లు, తుపాకీ తయారీ సామాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవరం గ్రామానికి చెందిన బూరి సూరీడమ్మ ( 48) దాసరి దేవుడమ్మ ( 50)గా గుర్తించారు. ఈ ఇద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా అరకు సంతలో నాటు తుపాకీలు, తుపాకీ తయారీ సామాను గుట్టు చప్పుడు కాకుండా అమ్మకం సాగిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. గతంలో అనంతగిరి వద్ద ఆర్టీసీ బస్సులో బాంబు పేలుడు ఈ మహిళల పనేనని పోలీసుల అనుమానిస్తున్నారు. వారి భర్తలు తుపాకులు తయారు చేస్తుండగా సూరీడమ్మ, దేవుడమ్మ తెచ్చి అరకులో అమ్ముతున్నట్టు తెలిసింది. -
ఆంధ్రా ఊటి అరకు
పచ్చని కొండలు.. నీలి సముద్రం.. మనసుదోచే సహజ సిద్ధమైన అందాలు.. వీటన్నిటి కలబోతే విశాఖ. ప్రకృతి రమణీయతకు స్వర్గధామమైన విశాఖ అందాలను చూసి పర్యాటకులు ఫిదా అవుతుంటారు. ఆంధ్రా ఊటీ అరకు నుంచి ఆంధ్రా కాశ్మీర్ లంబసింగి వరకూ ఎటు చూసినా ప్రకృతి పలకరిస్తుంది. మది పులకరిస్తుంది. అందుకే దేశ, విదేశీ సందర్శకులు మళ్లీ మళ్లీ జిల్లాలోని అందాల్ని వీక్షించేందుకు విచ్చేస్తుంటారు. జలపాతాల హొయలు మన్యంలో జలపాతాల అందాలు కట్టిపడేస్తుంటాయి. అనంతగిరిలోని కటిక, డుంబ్రిగుడలోని చాపరాయి, దేవరాపల్లిలోని సరయు, పెదబయలులోని పిట్టలబొర్ర, బొంగదారి, ఒడిశా సరిహద్దుల్లోని ముంచంగిపుట్టులోని డుడుమ, చింతపల్లి మండలం దారకొండ, జి మాడుగులలో కొత్తపల్లి... ఇలా ఎన్నో జలపాతాలు సందర్శకుల్ని మైమరపిస్తున్నాయి. కటిక, సరయు, పిట్టలబొర్ర జలపాతాల వద్ద మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా పర్యాటకశాఖ అధికారులు ఫుడ్‌కోర్టులు, వాష్‌రూమ్‌లు, రెస్ట్రూమ్లు నిర్మిస్తున్నారు. సున్నా డిగ్రీల లంబసింగి మన్యంలో అరుకులోయకు పోటీగా పర్యాటకులను ఆకట్టుకోవడానికి లంబసింగి పోటీపడుతోంది. విశాఖ నుంచి 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంబసింగి చింతపల్లి మండలంలోని ఓ చిన్న గిరిజన గ్రామం. దీని పంచాయతీ పరిధిలోని 50 తండాల్లోనూ ఈ సీజన్లో అతి చల్లని వాతావరణం ఉంటుంది. తూర్పు కనుమల్లో సముద్ర మట్టానికి సుమారు 3 వేల అడుగుల ఎత్తున ఉండటంతో శీతాకాలం ప్రారంభం నుంచే ఇక్కడ చలి మొదలవుతుంది. నవంబరు నుంచి జనవరి వరకు 0 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఇక్కడి విశేషం.ఎతై ్తన చెట్లుతో దట్టమైన అటవీ ప్రాంతం, వాటిలో కాఫీ, మిరియాల తోటలు, ఎటు చూసినా పచ్చని మైదానాలు, నోరూరించే స్ట్రాబెర్రీ మొక్కలు... ఇవన్నీ ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తాయి. సాహసాలకు నెలవు లంబసింగి సమీపంలో కొండలపై ఇటీవల ట్రెక్కింగ్ కూడా నిర్వహిస్తున్నారు.కనీసంగా 15 మంది సభ్యుల బృందం ముందుగా ఏపీటీడీసీ అధికారులను సంప్రదిస్తే ఆ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుని పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. తాజంగి జలాశయంపై జిప్‌లైన్, ఇరువైపులా ఉన్న కొండల మధ్య రోప్ నిర్మిస్తున్నారు. లంబసింగిలో టెంటు రూములు లంబసింగిలో బస చేసేవారికి ఏపీటీడీసీ రిసార్ట్స్ నిర్మాణ పనులు వేగవంతం చేశారు. ఇప్పటివరకూ ఏపీటీడీసీ హరిత హిల్రిసార్ట్లో జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఏసీ టెంటు రూములు నాలుగు ఉన్నాయి. ఎనిమిది సూట్ రూమ్‌లు ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. అలాగే ప్రధాన భవనంలో ఆరు గదులతో పాటు 300 సీటింగ్ సామర్థ్యంతో సమావేశ మందిరం, దిగువ భాగంలో బార్ అండ్ రెస్టారెంట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. మరోవైపు ఎకో టూరిజం ప్రాజెక్టులో భాగంగా 30 టెంట్ రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. టూర్ ప్యాకేజీలు అరకు – లంబసింగి– అరకు... మన్యం ప్యాకేజీగా ఏపీటీడీసీ అందిస్తోంది. పెద్దలకు రూ.999, చిన్నపిల్లలకు రూ.799గా టికెట్ ధర. అరకు నుంచి లంబసింగి కూడా సమీపంలోనే ఉండటంతో రెండు పర్యాటక ప్రాంతాలనూ కలుపుతూ మధ్యనున్న చాపరాయి, మత్స్యగుండం, కొత్తపల్లి జలపాతాలతో పాటు ఆపిల్, పైనాపిల్, స్ట్రాబెర్రీ పండ్ల తోటలను చూసొచ్చేలా మరో ప్యాకేజీని అమల్లోకి తెచ్చారు. ప్రతి రోజూ బస్సు అరకు నుంచి ఉదయం 7 గంటలకు బయల్దేరి ఆయా ప్రాంతాలను చుట్టేసి రాత్రికి తిరిగివస్తుంది. అలాగాకుండా ఒక బృందంగా విశాఖపట్నం నుంచి లంబసింగి వెళ్లాలనుకునేవారు ముందుగా సంప్రదిస్తే కార్లను ఏర్పాటు చేస్తామని ఏపీటీడీసీ అధికారులు తెలిపారు. రైల్ కమ్ రోడ్డు ప్యాకేజీ గతంలో పర్యాటకులకు మంచి మజిలీని అందించిన రైల్ కమ్ రోడ్ ప్యాకేజీని ఇప్పుడు కొద్ది మార్పులతో ఏపీటీడీసీ తిరిగి గత నెల సెప్టెంబర్‌లో పునఃప్రారంభించింది. రూ.1450తో పెద్దలకు, రూ.1160 పిల్లలకు ఈ టికెట్ ధర నిర్ణయించారు. రైల్వేశాఖతో సంబంధం లేకుండా నేరుగా ఐఆర్సిటిసి ద్వారా రైల్ టికెట్లు బుక్ చేసి... ఈ ప్యాకేజీని ఏపీటీడీసీ అందిస్తోంది. పద్మాపురం బొటానికల్ గార్డెన్, ట్రైబల్ మ్యూజియం, ట్రైబల్ థింసా, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూపాయింట్, బొర్రా కేవ్స్, తైడా జంగిల్ బెల్కు తీసుకువెళతారు. రోడ్డు మార్గాన వెళ్లాలనుకునేవారి కోసం అరకు–బొర్రా రోడ్డు ప్యాకేజీ టూర్ ఉంది. రవాణా చార్జి కింద పెద్దలకు రూ.700, పిల్లలకు రూ.560 చెల్లించాలి. చిత్రకూట్ జలపాతం ప్యాకేజీ భారత నయాగరా అని పేరొందిన చిత్రకూట్ జలపాతం సందర్శించి వచ్చేలా టూరిజం శాఖ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మన్యానికి ఆనుకొని ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో జగదల్పూర్కు సమీపంలో ఇంద్రావతి నది ప్రవాహంలో భాగంగా అద్భుత జలరాశి ఉంది. ఈ సీజన్లో 95 అడుగుల ఎత్తు నుంచి కిందికి దుమికే ఈ జలపాత అందాల్ని చూసి తీరాల్సిందే. అలాగే జగదల్పూర్కు సమీపంలోనే కొండపై నుంచి సున్నితంగా జాలువారే తీరథ్గఢ్ జలపాతాన్ని చూసి రావచ్చు. ఇందుకోసం ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. అరకులో ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు బస్సు బయల్దేరుతుంది. ఇందుకుగాను పెద్దలకు రూ.1,900, పిల్లలకు రూ.1,500గా ప్యాకేజీ ఉంది. గొప్పగా చెప్పుకుంటాం అందాల అరకులోయను చూడటానికే ప్రతి ఏటా భారతదేశ పర్యటనకు వస్తుంటాం. ఇక్కడ ప్రకృతి అందాలు, లోయ ప్రాంతాలు, బొర్రాగుహలు ఆహ్లాదకరంగా ఉంటాయి. మా దేశంలో అరకులోయ గురించి గొప్పగా చెప్పుకుంటాం. – లూయిస్, పవుల దంపతులు, బ్రెజిల్ వలిసెపూలు చూసేందుకే.. వలిసెపూల సీజన్ అంటే మాకు చాలా ఇష్టం. నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉండి అరకుతో పాటు మిగిలిన పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తాం. పర్యాటకశాఖ రిసార్ట్‌లలో గతంలో కంటే సౌకర్యాలు మెరుగుపడ్డాయి. – ఎస్.కె.రహమాన్, కలకత్తా, పశ్చిమబెంగాల్ సీలేరు ఎలా వెళ్ళాలంటే.. విశాఖ సముద్రమట్టానికి 4900 మీటర్ల ఎత్తులో ఉండే సీలేరు ప్రకృతి అందాలకు నెలవుగా ఉంటుంది. కార్తీక మాసంలో వనభోజనాల కోసం ఇక్కడికి పెద్దసంఖ్యలో తరలివస్తారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు జలపాతాలు, గిరిజనుల ఆరాధ్య దేవతధారాలమ్మ ఆలయం సీలేరుకు వెళ్ళే మార్గంలో కనిపిస్తుంది. సీలేరు పేరు వినగానే జలవిద్యుత్ కేంద్రాలు గుర్తొస్తాయి. 1950లో ఇక్కడ జల విద్యుత్ కేంద్రాలను నిర్మించారు. – గరికిపాటి ఉమాకాంత్, సాక్షి, విశాఖపట్నం -
ఆంధ్రా ఊటీకి అద్దాల రైలు!
విదేశాలకే పరిమితమైన అద్దాలతో కూడిన విలాసవంతమైన విస్టాడోమ్ రైలు విశాఖలో చక్కర్లు కొట్టనుంది. ఆంధ్రా ఊటీగా పిలవబడే అరకు ప్రయాణానికి మరింత అందాన్ని, సరికొత్త అనుభూతిని పంచేలా కొత్త రైలు మొదలుకానుంది.అరకు రైలు ప్రయాణమంటే ఇష్టపడని వారెవ్వరూ ఉండరు. ఈ అందాల్ని రైలు నుంచి మరింత అందంగా చూసేందుకు విస్టోడామ్ కోచ్‌ని రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అద్దాల పెట్టెలోంచి అద్భుతాల్ని చూసేందుకు పర్యాటకుల నుంచి డిమాండ్ పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరో ఐదు విస్టోడామ్ కోచ్‌లు ఏర్పాటుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ 5 కోచ్‌లతోపాటు ప్రస్తుతం ఉన్న కోచ్ కలిపి మొత్తం 6 అద్దాల పెట్టెలతో స్పెషల్ టూరిస్ట్ రైలు త్వరలోనే చక్కర్లు కొట్టనుంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అరకు ఎంత అందంగా ఉంటుందో.. ఆ అందాల నడుమ చేసే ప్రయాణమూ అంతే అందంగా ఉంటుంది. అద్భుతాల్ని వీక్షించేందుకు అందమైన రైలులో ప్రయాణిస్తే.. లెక్కలేనన్ని మధురానుభూతుల్ని మూటకట్టుకోవచ్చు. ఈ ప్రయాణాన్ని మరింత మజాగా మార్చింది అద్దాల పెట్టె. విశాఖ నుంచి అరకు వెళ్లే రైలులో 2017 ఏప్రిల్ 16 విస్టాడోమ్ కోచ్(అద్దాల పెట్టె) అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ కోచ్ నిత్యం కిటకిటలాడుతూ ఉంది. విశాఖ నుంచి అరకు 130 కిలోమీటర్లు ప్రయాణం సాగించేందుకు ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు విశాఖ–కిరండూల్ రైలులో ఈ విస్టాడోమ్ కోచ్‌ని ఏర్పాటు చేశారు. పర్యాటకులు ఈ బోగీలో ప్రయాణించేందుకు అమితాసక్తి చూపుతుండటంతో మరో కోచ్ ఏర్పాటు చేయాలని 2017లోనే ప్రతిపాదించారు. అప్పటి నుంచి ఈ ప్రతిపాదన బుట్టదాఖలవుతూ వస్తోంది. వైఎస్ఆర్సీపీ ఎంపీలో చొరవతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు తరచూ అరకు పర్యాటకానికి విస్టాడోమ్ కోచ్‌లు అదనంగా ఇవ్వాలంటూ రైల్వే మంత్రిత్వ శాఖతో పాటు రైల్వే బోర్డుపైనా ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో.. ఏకంగా 5 విస్టాడోమ్ కోచ్‌లు అరకుకు అందించేందుకు రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది. గత నెల 27న ఉదయ్ రైలు ప్రారంభించేందుకు వచ్చిన రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి 5 అద్దాల కోచ్‌లు ఇస్తున్నట్లు ప్రకటించారు. అద్దాల పెట్టెలతో స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ అరకు పర్యాటకానికి మరింత అందాన్నిచ్చేలా స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. కొత్తగా రానున్న 5 విస్టాడోమ్ కోచ్‌లతో పాటు విశాఖ–కిరండూల్ రైలుకు ఏర్పాటు చేసిన విస్టాడోమ్ కోచ్‌తో కలిపి మొత్తం 6 అద్దాల పెట్టెలతో స్పెషల్ టూరిస్ట్ రైలు చక్కర్లు కొట్టనుంది. ఒక్కో కోచ్‌లో 45 సీట్లుంటాయి. గతంలో కేవలం 45 మంది పర్యాటకులకు మాత్రమే అద్దాల పెట్టెలో ప్రయాణించే వీలుండేది. కానీ.. కొత్తగా రానున్న టూరిస్ట్ రైలులో ఏకంగా 270 మంది అరకు అందాల్ని అద్దాల్లో వీక్షించే అవకాశం కలగనుంది. 84 వంతెనలు.. 58 సొరంగాలు.. ఈ విస్టాడోమ్ కోచ్‌లలో సీట్లు 180 డిగ్రీల కోణంలో తిరిగే సౌకర్యం ఉంటుంది. ఒకవైపు అందాల్ని చూస్తున్న సమయంలో మరోవైపు తిరగాలంటే శ్రమించాల్సిన అవసరం లేకుండా రొటేటింగ్ సీట్లో సులువుగా తిరిగి 360 డిగ్రీల కోణంలో అందాలు వీక్షించవచ్చు. అనంతగిరి అడవులు, ఎల్తైన కొండలూ.. వాటిపై పరచుకున్న పచ్చదనం.. జలపాతాలు.. ఇలా.. ఎన్నో అందాలు కళ్లార్పకుండా చూసే అవకాశం కలగనుంది. 84 ప్రధాన వంతెనలు.. 58 సొరంగాల గుండా ఈ రైలు ప్రయాణించనుంది. ఒక్కో సొరంగం అర కిలోమీటరు నుంచి ఒకటిన్నర కిలోమీటరు వరకూ పొడవుంటుంది. ఇలా.. ఎన్నో అనుభూతుల్ని మూటగట్టుకునేలా రైలు ప్రయాణం సాగుతుంది. కదిలే రైల్లో విస్టాడోమ్ కోచ్ నుంచి వీటిని చూస్తుంటే గాల్లో తేలుతున్న అనుభూతి కలుగుతుంది. త్వరలోనే ప్రారంభం... ఇన్ని విశిష్టతలతో కూడుకున్న ఈ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇప్పటికే ఏ సమయంలో నడపాలన్నది నిర్ణయించినట్లు వాల్తేరు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దసరా సెలవుల నేపథ్యంలో అరకు అందాల్ని వీక్షించేందుకు ఉదయం 8.10 గంటలకు విశాఖ నుంచి స్పెషల్ రైలు నడుపుతున్నారు. ఇదే సమయంలో స్పెషల్ టూరిస్ట్ విస్టాడోమ్ రైలు నడపాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులో విశాఖకు కోచ్‌లు వచ్చే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ట్రయల్ రన్ నిర్వహించి.. రానున్న రెండు నెలల్లోనే సర్వీసు ప్రారంభించే అవకాశాలున్నాయని వాల్తేరు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. -
విశాఖ అందాలకు ఫిదా..
కొండకోనలను చూసినా.. ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న మన్యంలో అడుగు పెట్టినా.. అలల సవ్వడితో.. హొయలొలుకుతున్న సాగర తీరంలో అడుగులు వేస్తున్నా.. ఆధ్యాత్మిక శోభతో ఆహ్లాదపరిచే దేవాల యాల్లో పూజ చేసినా... ఏ చోటకి వెళ్లినా.. ఏ గాలి పీల్చినా.. భూతల స్వర్గమంటే ఇదేనేమోనన్న అనుభూతిని అందిస్తోంది విహార విశాల విశాఖ. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో ఉన్న ప్రకృతి అందాలన్నీ ఓచోట చేరిస్తే.. బహుశా దాని పేరే విశాఖ అంటారేమోనన్నట్లుగా పరిఢవిల్లుతున్న అందాల జిల్లా.. పర్యాటక రంగంలో కొత్త పుంతలు తొక్కుతోంది. రాష్ట్రంలో ఏడాదికి కోటికి పైగా.. పర్యాటకులు వస్తున్న జిల్లా ఏదైనా ఉందంటే అది విశాఖపట్నమే అననడంలో ఎలాంటి సందేహం లేదు. –సాక్షి, విశాఖపట్నం, అరకులోయ మన్యం.. ప్రకృతి చెక్కిన శిల్పం ప్రకృతి కాన్వాస్‌పై రమణీయ అందాలు.. చక్కిలిగింతలు పెట్టే చలిలో కనిపించే.. సహజ సిద్ధమైన సోయగాలు, కాలుష్యాన్ని దరిచేరనివ్వని ప్రకృతి రమణీయత, కలకాలం గుర్తిండిపోయే ఎన్నో మధుర జ్ఞాపకాలను ముడుపుగా ఇచ్చే అరకు అందాలు, విశాఖ మన్యం సోయగాలను వర్ణించాలంటే అక్షరాలు సరిపోవు. ఆంధ్రా ఊటీ అరకు నుంచి ఆంధ్రా కాశ్మీర్ లంబసింగి వరకూ ఎటు చూసినా.. ప్రకృతి పలకరిస్తుంది. మది పులకరిస్తుంది. జిల్లాకు వచ్చే పర్యాటకుల్లో 80 శాతం మంది అరకు మొదలైన ఏజెన్సీ ప్రాంతాల్లోనూ పర్యాటక స్థలాలను సందర్శిస్తుంటారు. అలాంటి మన్యం అందాలకు మెరుగులు దిద్దేలా.. రూ.156 కోట్లతో అరకు టూరిజం సర్క్యూట్ పేరుతో సమీకృత ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన డీపీఆర్ కేంద్రానికి పంపించింది. త్వరలోనే దీనికి గ్రీన్ సిగ్నల్ రానుంది. ఇదే ఏర్పాటైతే మన్యంలోని 11 మండలాలు అందులో సహజ సిద్ధమైన అందాలకు నెలవైన 36 ప్రాంతాలను ఈ టూరిజం సర్క్యూట్లో భాగం కానున్నాయి. ఈ అందాలకు మరింత సొబగులద్దే నిర్మాణాలు చేపట్టనున్నారు. తొలి విడతగా 9 ఎకరాల్లోనూ, మలివిడతగా 18 ఎకరాల్లోనూ మన్యం ప్రాంతంలో పలు చోట్ల ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. జలపాతాల సవ్వడి మన్యంలో జలపాతాల అందాలు కట్టిపడేస్తుంటాయి. ముఖ్యంగా అనంతగిరిలోని కటిక జలపాతం, డుంబ్రిగుడలోని చాపరాయి, దేవరాపల్లిలోని సరయు జలపాతం, పెదబయలులోని పిట్టలబొర్ర వాటర్‌ఫాల్స్, బొంగదారి జలపాతం, ఒడిషా సరిహద్దుల్లోని ముంచంగిపుట్టులోని డుడుమ జలపాతం, చింతపల్లి మండలం దారకొండలోని జలపాతం, జిమాడుగులలో కొత్తపల్లి జలపాతం... ఇలా ఎన్నో జలపాతాలు సందర్శకుల్ని మైమరపిస్తున్నాయి. అయితే.. వాటర్‌ఫాల్స్ వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడతంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన జలపాతాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చెయ్యాలని భావిస్తున్నారు. కటిక, సరయు, పిట్టలబొర్ర జలపాతాల్ని తొలిదశలో ఎంపిక చేశారు. ఈ జలపాతాల వద్ద రూమ్‌లు, ఫుడ్‌కోర్టులు, వాష్‌రూమ్‌లు, రెస్ట్రూమ్లు నిర్మించాలని నిర్ణయించారు. సర్క్యూట్లతో సూపర్... జిల్లాలో మూడు టూరిజం సర్క్యూట్లు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసింది. అరకు టూరిజం సర్క్యూట్‌కి కేంద్రం ప్రభుత్వం నుంచి అనుమతుల రావాల్సి ఉండగా.. మిగిలిన సర్క్యూట్లు కూడా కొత్త పాలసీ వచ్చాక ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అరకు ఎకో టూరిజం సర్క్యూట్, రూ.49 కోట్లతో భీమిలిలో పాసింజర్ జెట్టీ సర్క్యూట్ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. ఈ డీపీఆర్ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉండటంతో ఇటీవలే మంత్రి అవంతి శ్రీనివాసరావు సంబంధిత అధికారులు, కేంద్ర మంత్రులతో భేటీ అయి.. ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు అనుమతులు కోరారు. అదే విధంగా బౌద్ధ కేంద్రాలైన బొజ్జనకొండ, తొట్లకొండ, బావికొండని సందర్శించేలా రూ.20.70 కోట్లతో బుద్ధిస్ట్ సర్క్యూట్ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ మూడు ప్రాజెక్టులు సిద్ధమైతే.. విశాఖ పర్యాటకానికి మరింత సొబగులు చేకూరనున్నాయి. అభివృద్ధి పథంలో నడిపిస్తాం... రెస్టారెంట్లు.. రిసార్టులు.. పెరుగుతున్న పర్యాటకానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పర్యాటక శాఖ సిద్ధమవుతోంది. పలు రెస్టారెంట్లు, రిసార్టులు నిర్మిస్తోంది. ఎర్రమట్టిదిబ్బల సమీపంలో రూ.2 కోట్లతో కంటైనర్ రెస్టారెంట్‌ను నిర్మించింది. అదే విధంగా రూ.2 కోట్లతో అరకులో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ నిర్మించింది. ఇవి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. వీటితో పాటు ఏజెన్సీలో రూ.5.5 కోట్లతో ట్రైబల్ హట్(సంత), రూ.2.2 కోట్లతో ఈట్ స్ట్రీట్ ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. ఇవే కాకుండా విభిన్న ప్రాంతాల్లో వివిధ ప్రాజెక్టు రూపకల్పనకు కసరత్తులు జరుగుతున్నాయి. ప్రైవేటు భాగస్వామ్యంతో జిల్లా వ్యాప్తంగా పర్యాటక శాఖకు ఉన్న 550 ఏకరాలను లీజుకు ఇచ్చి పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రకృతి అందాల కలబోత విశాఖపట్నం. ఈ జిల్లాను పర్యాటక స్వర్గధామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సర్క్యూట్లు, టూరిజం ప్యాకేజీలతో పాటు సరికొత్త ప్రాజెక్టులు అమలు చేసి పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించేందుకు కృషిచేస్తున్నాం. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. త్వరలోనే సందర్శకులకు అందుబాటులోకి రానున్నాయి. –అవంతి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి విదేశీయుల తాకిడి పెరుగుతోంది... విశాఖపట్నం అంటే.. విదేశీయులు చాలా ఇష్టపడుతున్నారు. అందుకే.. ప్రతి నెలా విశాఖ సందర్శిస్తున్న విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వారికి అనుగుణంగా పర్యాటక శాఖ కొత్త కొత్త ప్రాజెక్టులు పరిచయం చేస్తోంది. – పూర్ణిమ, జిల్లా పర్యాటక శాఖాధికారి విదేశీయులు ఫిదా... విశాఖ అందాలకు విదేశీ పర్యాటకులు ఫిదా అవుతున్నారు. ఏటా వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది వచ్చిన పర్యాటకుల సంఖ్య పెరిగిందని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. 2018లో 2,49,20,169 మంది స్వదేశీ పర్యాటకులతో పాటు 95,759 మంది విదేశీయులు విశాఖకు వచ్చారు. మొత్తం 2,50,13,607 మంది వచ్చారు. 2019లో ఎనిమిది నెలల్లో 1,86,47,551 మంది స్వదేశీ, 69,091 మంది విదేశీయులతో కలిపి మొత్తం 1,87,16,642 మంది పర్యాటకులు విశాఖ జిల్లాను సందర్శించారు. విదేశీ క్రీడలకూ వెల్కమ్.... సరికొత్త సాహస క్రీడకు విశాఖనే వేదికగా మార్చాలని పర్యాటక శాఖ భావిస్తోంది. ఇందుకోసం రుషికొండ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఇప్పటికే ఓ ప్రైవేట్ సంస్థ నగరం పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు బీచ్‌లను పరిశీలించింది. రుషికొండలో పారాసెయిలింగ్ నిర్వహణకు అనుకూలంగా ఉందనీ, అక్కడ సీ స్పోర్ట్స్ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏపీ టూరిజంతో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు లేఖ రాసింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు స్థానిక పర్యాటక శాఖ అధికారులు ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. త్వరలోనే రుషికొండలో విశాఖ పర్యాటకులకు పారాసెయిలింగ్ చేసే అవకాశం కలగనుంది. మరిన్ని సందర్శనీయ స్థలాలు... నగరాన్ని ఆనుకొని ఉన్న ప్రధానమైన రామకృష్ణ బీచ్(ఆర్కే బీచ్)కు రోజూ సుమారు లక్ష మంది వస్తుంటారు. శని, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో ఈ సంఖ్య రెండు నుంచి మూడు లక్షల వరకు ఉంటోంది. అదే విధంగా యారాడ, తొట్లకొండ, రుషికొండ బీచ్‌లలోనూ సందర్శకుల తాకిడి కొంత మేర ఉంటోంది. ఇలా.. కొన్ని ప్రాంతాలకే పర్యాటకం పరిమితం కాకుండా మరో 5 బీచ్‌లు అభివృద్ధి చెయ్యనుంది. భీమిలి బీచ్‌తో పాటు సాగర్‌నగర్, అప్పికొండ, పూడిమడక, తంతడి బీచ్‌లను తొలి దశలో గుర్తించింది. ఈ 5 బీచ్‌లు సందర్శకులకు అనుకూలమైన వాతావరణంతో ఉంటాయి. ఏపీటీడీసీ ప్యాకేజీలు ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ పరుగులు పెడుతోంది. ఏపీటీడీసీ విశాఖ వ్యాప్తంగా పలు టూరిజం హోటల్స్‌తో పాటు ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులో ఉంచి విషయం తెలిసిందే. అయితే ఇటీవల మరిన్ని కొత్త ప్యాకేజీలను అందుబాటులోకి తేవడం ద్వారా పర్యాటకానికి కొత్త హంగులు సంతరించుకున్నాయి. కొత్త ప్యాకేజీలు... ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు పలు ప్యాకేజీలను అందిస్తోంది. ఈ గతంలో ఉన్న ఫ్యాకేజీలకు పదును పెట్టడంతో పాటు ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలను కలుపుతూ కొత్త ఫ్యాకేజీలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కొన్ని ప్యాకేజీలు అందుబాటులో ఉండగా శుక్రవారం జరిగే పర్యాటక దినోత్సవం వేడుకల్లో ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు విశాఖపట్నం– శ్రీకాకుళం కొత్త ప్యాకేజీని ప్రారంభించనున్నారు. విశాఖ– శ్రీకాకుళం ప్రఖ్యాత అరసవల్లి దేవాలయం, శ్రీకూర్మం, శ్రీకూర్మలింగం, సీతంపేట అడ్వెంచర్ పార్కు సందర్శన కోసం ఏపీటీడీసీ ఈ ప్యాకేజీని అందిస్తోంది. పెద్దలకు రూ.670 , పిల్లలకు రూ.535గా ధర నిర్ణయించారు. ప్రతి ఆదివారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఉదయం 6.45 గంటలకు పర్యాటకులు విశాఖ ఆర్టీసీ కాంప్లక్స్‌లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. బస్సు 7 గంటలకు బయలుదేరుతుంది. తిరిగి సాయంత్రం 6 గంటలకు విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకుంటుంది. రైల్ కమ్ రోడ్డు ప్యాకేజీ గతంలో పర్యాటకులకు మంచి మజిలిని అందించిన ఈ ప్యాకేజీనిని ఏపీటీడీసీ తిరిగి ఈ నెలలో(సెప్టెంబర్) పునఃప్రారంభించింది. రూ.1500తో పెద్దలకు, రూ.1200 పిల్లలకు ఈ టికెట్ ధర నిర్ణయించారు. రైల్వేశాఖతో ఉన్న టూరిజం ఒప్పందంలో భాగంగా ఈ ప్యాకేజీని ఏపీటీడీసీ అందిస్తోంది. పద్మాపురం బొటానికల్ గార్డెన్, ట్రైబల్ మ్యూజియం, ట్రైబల్ థింసా , అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూపాయింట్, బొర్రా కేవ్స్, థైడా జంగిల్ బెల్కు తీసుకువెళతారు. ఉదయం 6.15కు రైల్వేస్టేషన్‌లోని ఏపీటీడీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. రాత్రి 9 గంటలకు తిరిగి విశాఖ చేరుకుంటారు. అరకు– లంబసింగి మధ్య.. అరకు – లంబసింగి– అరకు.. మన్యం ప్యాకేజీగా ఏపీటీడీసీ అందిస్తోంది. చాపరాయి వాటర్ స్ట్రీమ్స్, మత్స్యగుండం, కొత్తపల్లి వాటర్ పాల్స్, లంబసింగి, గాలికొండ వ్యూపాయింట్, యాపిల్, ఫైనాపిల్, స్టాబెర్రీ పంటల సందర్శన ఉంటుంది. పెద్దలకు రూ. 999, చిన్న పిల్లలకు రూ.799గా టికెట్ ధర. ఉదయం 6.45 గంటలకు అరకులోని హరిత వ్యాలీ రిసార్ట్స్‌లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. విస్తృతమైన సేవలు పర్యటకులకు విస్తృత సేవలు అందించడమే లక్ష్యంగా ఏపీటీడీసీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నాం. కార్పొరేట్ హోట ల్స్‌కు దీటుగా టూరిజం హోటల్స్‌లో సౌకర్యాలు, రూమ్స్‌ను అందుబాటులో ఉంచుతున్నాం. విశాఖ– తిరుపతి, విశాఖ – అన్నవరం, అరకు –చిత్రకోట్ వాటర్‌ఫాల్స్, విశాఖ– భద్రాచలం ప్యాకేజీలను సైతం అందుబాటులో ఉంచాం. ఠీఠీఠీ.్చp్టఛీఛి.జీn వెబ్సైట్ నుంచి అన్ని రకాల సేవలను పొందవచ్చు. – ప్రసాదరెడ్డి, డీవీఎం, ఏపీటీడీసీ