సాక్షి, అరకు: పెడలబుడు గ్రామాన్ని దత్తత తీసుకున్న చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం అరకులో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి దిశగా అడుగులు పడలేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాల జీవో-97ను రద్దు చేశారని చెప్పారు. ప్రతీ నియోజక వర్గానికి కోటి రూపాయలు మంజూరు చేసి సీఎం జగన్ పెద్ద మనసు చాటుకున్నారన్నారు. గిరిజన అభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ మాధవి, కలెక్టర్ వినయ్ చంద్, జీసిసి ఎండీ బాబూరావు నాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment