adivasis
-
‘ఆపరేషన్ కగార్’ పై సర్వత్రా చర్చ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అడవుల జిల్లాగా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి అనేక మంది వామపక్ష సిద్ధాంతాలకు ఆకర్షితులై ఉద్యమబాట పట్టారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు, ఛత్తీస్‌గఢ్‌కు సమీపంలో ఉండే ఈ ప్రాంతం మావోలకు ఇలాఖాగా మారింది. అప్పట్లో పోలీసు బలగాలకు మావోయిస్టులు కంటికి మీద కునుకు లేకుండా చేశారు. కాలక్రమంగా వారి కార్యకలాపాలు తగ్గిపోయాయి. 2026 నాటికి మావోయిస్టు పార్టీని అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కీలక స్థానాల్లో తెలుగువారునిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్‌పల్లికి చెందిన ఇర్రి మోహన్‌రెడ్డి, సెంట్రల్ పొలిట్‌బ్యూరో కేంద్ర కమిటీ సాంకేతిక విభాగంలో పనిచేస్తున్నారు. » మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన బండి ప్రకాశ్ అలియాస్ బండి దాదా సింగరేణి కోల్ కమిటీలో కీలకంగా ఉన్నారు. ఇటీవల ఆయన్ను కేంద్ర కమిటీలోకి తీసుకున్నట్టు సమాచారం. » ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెరకు చెందిన మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, రాష్ట్ర కమిటీ మెంబర్, కేబీఎం (కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల) కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. » బెల్లంపల్లికి చెందిన సలాకుల సరోజ పార్టీ నిర్వహిస్తున్న ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్నట్టుగా చెబుతారు. ఇదే మండలం చంద్రవెల్లికి చెందిన జాడి వెంకటి, అతని సహచరి పుష్ప దండకారణ్యంలోనే ఉన్నారు. » కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం అగర్‌గూడకు చెందిన చౌదరి అంకుబాయి అలియాస్ అనితక్క దండకారణ్యంలోనే ఉన్నారు. ఒక్కొక్కరి తలపై రూ.20 లక్షలకు పైనే రివార్డులు ఉన్నాయి. ఎన్కౌంటర్లు, లొంగుబాట్లుగత కొంతకాలంగా మావోయిస్టులు చనిపోవడమో, లొంగిపోవడమో జరుగుతోంది. ఐదు దశాబ్దాలకుపైగా పార్టీ కేంద్ర కమిటీలో పనిచేసిన కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్(69) గతేడు జూన్‌లో మరణించారు. బెల్లంపల్లికి చెందిన సుదర్శన్ కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ పత్రికలకు ఎడిటర్‌గా పని చేశారు. ఆయనపై రూ.కోటి రివార్డు ఉంది. » దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, గడ్చిరోలి జిల్లా ఇన్చార్జ్గా పనిచేసిన కాసర్ల రవి అలియాస్ అశోక్ ఎన్కౌంటర్లో మరణించారు. వీరే కాకుండా కంతి లింగవ్వతోపాటు సీనియర్లను పార్టీ కోల్పోయింది. మూడేళ్ల క్రితం ఉమ్మ డి జిల్లాలో ఇంద్రవెల్లి, సిర్పూర్, మంగీ, చెన్నూ రు, మంచిర్యాల ఏరియాలకు కొత్త నియామకా లు చేపట్టింది. 2020లో కాగజ్‌నగర్ మండలం కడంబా అడవుల్లో భదత్రా బలగాల చేతిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చుక్కాలు, నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్‌కు చెందిన బాదీరావు చనిపోయారు. ప్రస్తుతం కోల్‌బెల్ట్ కమిటీ సింగరేణి కారి్మకుల పక్షాన, స్థానిక ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ పత్రిక ప్రకటనలకే పరిమితమైంది.అడవి వీడి బయటకు రావాలి మా చెల్లి నా కోసం వచ్చి అక్కడే ఉండిపోయింది. నేను లొంగిపోయి సాధారణ జీవితం గడు పుతున్నా. మా చెల్లి 36 ఏళ్లుగా పార్టీలోనే ఉంది. అడవి వీడి తిరిగి వస్తే అందరికీ సంతోషం. - చౌదరి చిన్నన్న, చౌదరి అంకుబాయి అన్నయ్య, ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండలం అగర్గూడఆశయాన్ని చంపలేరు వ్యక్తులను చంపగలరు గానీ ఆశయాన్ని చంపలేరు. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకులను బలి తీసుకున్నా అంతిమ విజయం ప్రజలదే. నా స్వార్థం కోసం మా నాన్నను అజ్ఞాతం వీడమని చెప్పలేను. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే శాంతి చర్చలు జరిపి పరిష్కారాన్ని వెతకాలి. అంతేకాని ఉద్యమాన్ని అణచడం కాదు. – బండి కిరణ్, మావోయిస్టు నాయకుడు బండి ప్రకాశ్ కొడుకుజీవించే హక్కును కాపాడాలి ఆదివాసీలు నేరం చేసినట్టు లక్షల కొద్దీ బలగాలతో అడవుల్లో క్యాంపులను ఏర్పా టు చేసి అమాయకులను చంపేస్తున్నా రు. అడవి, సహజ వనరులను నాశనం చేసి సాధించేదేమిటి? 2005 నుంచి అనేక పేర్లతో ఈ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఆర్థిక, సామాజిక, అసమానతల కోణంలో చూస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో జరుపు తున్న మరణహోమాన్ని వెంటనే ఆపేయాలి. చర్చలకు పిలవాలి. ప్రతీ ఒక్కరికి జీవించే హక్కును కాపాడాలి. – నక్క నారాయణరావు,ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పౌరహక్కుల సంఘం. -
ఆదివాసులకు చేయూతనిద్దాం!
ఆంగ్లేయుల దోపిడీని ఎదురించి ఆదివాసులు స్వాతంత్య్ర పోరాటానికి పునాదులు వేశారు. కానీ కనీస హక్కులు లేకుండా ఇప్పటికీ మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు. అభివృద్ధి పనుల వల్ల నిరాశ్రయులైన వారిలో 55 శాతం దాకా ఆదివాసులేనని గణాంకాలు చెబుతున్నాయి. దురదృష్టవశాత్తూఈ అభివృద్ధి ఫలాలలో ఆదివాసుల వాటా తక్కువ. సాధారణంగా అభివృద్ధికి మరో పార్శ్వం కూడా ఉంటుంది. కానీ తమ అటవీ ఉత్పత్తులతో విధ్వంస కోణానికి తావులేని అభివృద్ధిని అడవి బిడ్డలు అందించగలరు. వారికి కావలసిందల్లా తగిన శిక్షణ, ప్రోత్సాహం, మార్కెటింగ్ సౌకర్యాలు మాత్రమే. సుస్థిరాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేసినప్పుడే, తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి సమాజం తరఫున ప్రాయశ్చిత్తం చేసినట్లవుతుంది.వైవిధ్యభరితమైన భారతీయ సంస్కృతిలో ఆదివాసులది కీలకమైన భూమిక. ప్రకృతిని దైవంగా భావించే ఆదివాసులు, ఆంగ్లేయుల దోపిడీని ఆది నుంచీ ఎదురించి స్వాతంత్య్ర పోరాటానికి పునాదులు వేశారు. భారతదేశంలోని అపారమైన సహజ సంపదపై కన్ను వేసిన బ్రిటిష్ పాలకులు 1865లో అటవీ చట్టాన్ని తీసుకువచ్చారు. 1927లో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ పేరుతో మరో చట్టం చేశారు.అడవుల పరిరక్షణ ముసుగులో సహజ వనరులను దోచుకునేందుకు ఉద్దేశించిన ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఆదివాసులు అనేక పర్యాయాలు తిరుగు బాటు చేసి మరింత అణచివేతకు గురయ్యారు. కానీ, తమ నిరంతర తిరుగుబాటు ద్వారా స్వాతంత్య్ర పోరాటానికి జీవం పోశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాల చొరవ వల్లనో, ప్రజల పోరాటాల వల్లనో వలస పాలన దుష్పరిణామాల నుంచి బయట పడగలిగాము. అయితే, ప్రధాన స్రవంతికి దూరంగా అడవుల్లో నివసిస్తున్న ఆదివాసులు ఇప్పటికీ వివక్షకు, ఉదాసీనతకు గురవుతూనే ఉన్నారు. తరతరాలుగా తాము కాపాడుకుంటున్న అడవులలో కనీస హక్కులు లేకుండా మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు. స్వాతంత్య్రానంతరం దేశంలో అడవుల హద్దులను గుర్తించారు, కానీ అడవి బిడ్డల హక్కులను విస్మరించారు. అభివృద్ధి కూడా ఆదివాసుల పాలిటశాపంగా పరిణమించింది. దేశ జనాభాలో వారు సుమారు 8 శాతం ఉంటారు. అభివృద్ధి పనుల వల్ల నిరాశ్రయులైన వారిలో 55 శాతం దాకా ఆదివాసులేనని గణాంకాలు తెలుపుతున్నాయి. దురదృష్టవ శాత్తూ ఈ అభివృద్ధి ఫలాలలో ఆదివాసుల వాటా అతి తక్కువ. అటవీ చట్టాలు అమలు చేయాలి!స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు దశాబ్దాల దాకా ఆదివాసు లను ప్రధాన స్రవంతిలో కలిపేందుకు పెద్దగా ప్రయత్నాలు జరగ లేదు. 1996లో వచ్చిన పెసా(పీఈఎస్ఏ– షెడ్యూల్డ్ ప్రాంతాలకుపంచాయతీల విస్తరణ) చట్టం, 2006 నాటి అటవీ హక్కుల చట్టం (ఫారెస్ట్ రైట్స్ యాక్ట్) ఆదివాసులకు జరుగుతూ వచ్చిన అన్యాయాల పరిష్కారం దిశగా మైలురాళ్లుగా చెప్పుకోవచ్చు. పెసా చట్టం అడవి బిడ్డల సంప్రదాయిక వనరుల నిర్వహణ విధానాలను ఆమోదిస్తూ, వారి స్వయం పాలనకు వీలు కల్పించేందుకు తీసుకువచ్చారు. ఎఫ్ఆర్ఏ చట్టం ఇంకొక అడుగు ముందుకు వేసి చారిత్రకంగా ఆది వాసులకు అటవీ హక్కుల విషయంలో జరిగిన అన్యాయాలకుముందుమాటలో క్షమాపణ చెప్పింది. ఉద్దేశాలు ఉన్నతంగా ఉన్న ప్పటికీ ఈ చట్టాల అమలు సంతృప్తికరంగా లేదు. పాలనా యంత్రాంగంలోని కొన్ని వర్గాల వ్యతిరేకత, రాష్ట్ర చట్టాలతో సరైన అనుసంధానం లేకపోవడం వల్ల ఈ చట్టాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. పెసా, ఎఫ్ఆర్ఏ చట్టాల అమలు విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర కాస్త మెరుగైన స్థానంలో ఉంది. చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు తీసుకున్న చొరవ వల్ల ఇది సాధ్యమయింది. ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులలో ఐదు శాతం నేరుగా గ్రామ పంచాయతీలకు, గ్రామసభలకు అందించాలని ఆయన నిర్దేశించడం వల్ల షెడ్యూల్డ్ ప్రాంతాలలోని ఆదివాసీ పల్లెల సాధికా రీకరణకు మార్గం సుగమమైంది. వెదురు, బీడీ ఆకుల వంటి చిన్న చిన్న అటవీ ఉత్పత్తులపై గ్రామ సభలకు హక్కులు పునరుద్ధరించారు. తద్వారా అడవులను నమ్ముకున్న స్థానికులకు ఆదాయం పొందే అవకాశం కల్పించారు. గిరిజన గ్రామసభలు అటవీ ఉత్పత్తుల విక్రయం ద్వారా నెలకు 10 నుంచి 80 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నాయి. ఆదాయం పొందే అవకాశం కల్పించడం వల్ల ఆదివాసులు అడవుల పరిరక్షణతో పాటు పెంపకం కూడా చేపట్టి ప్రకృతితో తమకున్న అవినాభావ సంబంధాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. దీంతో పెసా, ఎఫ్ఆర్ఏ చట్టాల వల్ల అడవులు నాశనమవుతాయని కొన్ని వర్గాలు చేసిన ప్రచారంలోని డొల్లతనం కూడా బయటపడింది. పెసా చట్టం అమలులో గడ్చిరోలి జిల్లా దేశంలోనే ముందంజలో ఉండి మార్గదర్శకంగా నిలిచింది. మహారాష్ట్రలో విద్యాసాగర్ రావు చొరవతో 20 లక్షల ఎకరాల అటవీ భూమి నిర్వహణ బాధ్యతను స్థానిక ఆదివాసీ గ్రామసభలకు అప్పగించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ అనుభవాలను పాఠాలుగా తీసుకొని సుస్థిరాభివృద్ధిలో ఆదివాసులను భాగస్వాములను చేయాలి.పర్యావరణ హిత ఉపాధి అవకాశాలుసాధారణంగా అభివృద్ధికి మరో పార్శ్వం కూడా ఉంటుంది. పరిశ్రమలు ఉపాధికి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నప్పటికీ వాటినుంచి వెలువడే వ్యర్థాల వల్ల గాలీ, నీరూ కలుషితమై రకరకాల రోగాలు ప్రబలుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి విధ్వంస కోణా నికి తావులేని అభివృద్ధిని అడవి బిడ్డలు అందిస్తారు. వారికి కావలసిందల్లా తగిన శిక్షణ, ప్రోత్సాహం, మార్కెటింగ్ సౌకర్యాలు మాత్రమే. అడవిలో లభ్యమయ్యే పలు వనరులను ప్రపంచానికి అవసరమయ్యే ఉత్పత్తులుగా మలిస్తే పర్యావరణానికి ఏ మాత్రం ముప్పు లేకుండా ఆదివాసులకు ఉపాధి లభిస్తుంది, దేశ ఆర్థికాభివృద్ధిలో వారు భాగస్వాములవుతారు.అడవులలో విస్తృతంగా లభించే వెదురు ద్వారా ప్రపంచానికి అవసరమయ్యే అనేక ఉత్పత్తులను తయారు చేయవచ్చు. గృహోపకర ణాల నుంచి దుస్తుల దాకా సంగీత పరికరాల నుంచి ఔషధాల దాకా రకరకాల అవసరాలకు వెదురును ఉపయోగిస్తున్నారు. అటవీ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీల వంటి ఉన్నత విద్యాసంస్థలు ముందుకు వచ్చి ఆదివాసులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రోత్స హించాలి. మహారాష్ట్రలో ఒక విశ్వవిద్యాలయం, మరో స్వచ్ఛందసంస్థ కలిసి ఆదివాసులకు వెదురు నుంచి రాఖీలు తయారు చేయడంలో శిక్షణ ఇచ్చాయి. మిగతా రాష్ట్రాలలో కూడా స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకొని ఆదివాసులకు ఆసరాగా నిలవాలి. సేంద్రీయ ఉత్ప త్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అడవిలో లభించే వనరుల ద్వారా సబ్బులు, షాంపూలు, సుగంధ ద్రవ్యాలు తయారు చేయవచ్చు. వీటికి ఎక్కువ ధర చెల్లించడానికి కూడా వినియోగ దారులు వెనకాడటం లేదు. కాబట్టి స్టార్టప్ కంపెనీలు కూడా అటవీ ఉత్పత్తులపై దృష్టి సారించాలి.ఆదివాసులకు ఆత్మగౌరవం ఎక్కువ. అవసరమైతే ఉపవాసమైనా ఉంటారు కానీ ఇంకొకరి ముందు చేయి చాచడానికి ఇష్టపడరు. అటువంటి వారికి ఆసరాగా నిలబడి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేయూతనిస్తే తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి సమాజం తరఫున ప్రాయశ్చిత్తం చేసినట్లవుతుంది. అంతే కాకుండా వేల ఏళ్లుగా ప్రతిఫలాపేక్ష లేకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ వస్తున్న అడవిబిడ్డల రుణం తీర్చుకున్నట్లవుతుంది.- వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్మొబైల్ : pvg@ekalavya.net - పి. వేణుగోపాల్ రెడ్డి -
Jharkhand Assembly Elections 2024: ఆదివాసీ సీట్లే కీలకం!
ఎన్డీఏ, ఇండియా కూటముల అమీతుమీకి జార్ఖండ్‌లో సర్వం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల పోరులో భాగంగా 13వ తేదీన తొలి దశలో 43 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. మిగతా 38 సీట్లకు నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు పోలింగ్ జరగనుంది. 23న రెండు రాష్ట్రాల ఫలితాలు ఒకేసారి వెల్లడవుతాయి. జార్ఖండ్‌లో సంఖ్యాధికులైన ఆదివాసీలే ఈసారి కూడా పార్టీ ల గెలుపోటములను నిర్ణయించనున్నారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో 28 ఎస్టీ రిజర్వుడు సీట్లే కావడం విశేషం. వాటితో పాటు పలు ఇతర అసెంబ్లీ స్థానాల్లోనూ వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. దాంతో ఆదివాసీలను ప్రసన్నం చేసుకోవడానికి అధికార ఇండియా కూటమి, విపక్ష ఎన్డీఏ సంకీర్ణ సారథి బీజేపీ పోటీ పడుతున్నాయి. 2019 ఎన్నికల్లో 28 ఎస్టీ స్థానాలకు గాను ఇండియా కూటమి సారథి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఏకంగా 19 సీట్లలో పాగా వేయడం విశేషం. మొత్తమ్మీద 26 ఎస్టీ స్థానాలూ ఇండియా కూటమి ఖాతాలోకే వెళ్లాయి. బీజేపీకి కేవలం రెండే ఎస్టీ స్థానాలు దక్కాయి. అందుకే ఈసారి ఆదివాసీ స్థానాల్లో పాగా వేయడమే ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలుకుని బీజేపీ అగ్ర నేతలంతా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. వారిపై వరాల జల్లు కురిపిస్తున్నారు. బంగ్లాదేశీ చొరబాటుదారులకు జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం ఆదివాసీ హోదా కల్పిస్తూ వారి పొట్ట కొడుతోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రధానాస్త్రంగా మలచుకున్నారు. సీఎం హేమంత్ సోరెన్ అవినీతిలో పీకల్లోతున మునిగిపోయారంటూ ఊదరగొడుతున్నారు. బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇండియా కూటమి తరఫున హేమంత్‌కు దన్నుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్ గాంధీ ప్రచార రంగంలో ఉన్నారు. ప్రియాంక కూడా ఒకట్రెండుసార్లు ప్రచారంలో పాల్గొన్నారు. ఈసారి ఇండియా కూటమిలో జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, వామపక్షాలు 3 చోట్ల పోటీలో ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ), జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం), జేడీ(యూ) కలసి పోటీ చేస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 30 స్థానాలు గెలిచి ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్‌కు 16 దక్కాయి. జేవీఎంకు 3, ఏజేఎస్యూకు 2 సీట్లొచ్చాయి. కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బంధువులు, వారసుల జోరు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారసుల హడావుడి మామూలుగా లేదు. ఈసారి ఏకంగా 25కు పైగా స్థానాల్లో నేతల బంధుమిత్రులు బరిలో ఉన్నారు. జేఎంఎంను వీడి బీజేపీలో చేరిన మాజీ సీఎం చంపయ్ సోరెన్ కుమారుడు బాబూలాల్ సోరెన్, మరో మాజీ సీఎం రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా సాహు, ఇంకో మాజీ సీఎం అర్జున్ ముండా భార్య మీరా, మరో మాజీ సీఎం మధు కోడా భార్య గీత తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. జేఎంఎం నుంచి సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన ఈసారి ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. ఆయన సోదరుడు బసంత్ సోరెన్, వదిన సీతా సోరెన్ కూడా పోటీలో ఉన్నారు. జేఎంఎం నుంచి 15 మంది దాకా నేతల వారసులు రంగంలో దిగారు. వలసదారులే ప్రధానాంశం! నిరుద్యోగం, ధరల పెరుగుదల, సాగు సంక్షోభం, గ్రామీణుల్లో నిరా శా నిస్పృహలు తదితర సమస్యలె న్నో జార్ఖండ్‌ను పట్టి పీడిస్తున్నాయి. అయితే బీజేపీ వ్యూహాత్మకంగా వలసల అంశాన్ని తలకెత్తుకుంది. వలసదారుల సంక్షోభాన్ని ప్రధాన ఎన్ని కల అంశంగా మార్చేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. జా ర్ఖండ్ జనాభాలో ఏకంగా 35 శాతం మంది వలసదారులే కావడం విశేషం. బంగ్లాదేశ్ నుంచి వచి్చపడుతున్న వలసలు ఆదివాసీల మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని బీజేపీ నేతలంతా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘సర్వే’ను బహిష్కరించిన ఐలాపూర్ ఆదివాసీలు
కన్నాయిగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ఆదివాసీ గ్రామమైన ఐలాపూర్‌లో ప్రజలు బహిష్కరించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేసి సర్వేకు వచి్చన అధికారులకు అందజేశారు. స్వాతంత్య్రానికి ముందు నుంచి ఉన్న తమ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వాలు, పాలకులు మారినా ఇప్పటి వరకు తమ గ్రామాన్ని ఎవరూ పట్టించుకోవడం లేద ని ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఐటీడీఏ నుంచి కూడా గ్రామానికి మేలు జరగలేదని మాజీ సర్పంచ్ మల్లెల లక్ష్మయ్య అన్నారు.అర్హులైన రైతుల పొలాల్లో బోర్లు వేసి సుమారు ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యుత్ లైన్ వేయలేదని, వేసిన బోర్లు నిరుపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ఏటూరు నాగారానికి మధ్యలో ఉన్న సుమారు 10 కిలోమీటర్ల రోడ్డు మార్గానికి 2018లో ప్రభుత్వం నిధులు ఇచ్చినా అటవీ శాఖ అనుమతులు లేవంటూ పనులను నిలిపివేశారని లక్ష్మయ్య మండి పడ్డారు. గ్రామానికి రోడ్డు, విద్యుత్, తాగు, సాగు నీరు, వైద్య సదుపాయాలు అందించాకే సమగ్ర కులగణన చేయాలని డిమాండ్ చేశారు. -
గొత్తికోయల ‘అరణ్య’ రోదన
వాళ్లకు గూడూ లేదు, నీడా లేదు... భూములూ లేవు, భుక్తీ లేదు... హక్కులు లేవు, అసలు గుర్తింపే లేదు. ఏ పేరుతోనైతే వాళ్లను పిలుస్తున్నామో అది వాళ్ల పేరే కాదు. పక్క రాష్ట్రం నుంచి పొరపాటునో గ్రహపాటునో తెలుగు నేలకు వలస వచ్చి దీనస్థితిలో జీవనపోరాటం సాగిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా దక్కవలసిన హక్కుల కోసం చేయిచాచి ఆర్ద్రతగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఆ వ్యధాభరిత ఆదివాసీలే ‘గొత్తికోయలు’. రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో 60 వేల మంది దాకా వీరు ఉన్నారు. రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ పలు ప్రాథమిక హక్కులను కూడా పొందలేక పోతున్నారు. ఈ అడవి బిడ్డలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తిస్తే కనీసం రాజ్యాంగం ప్రసాదించిన విద్యా ఉద్యోగ ప్రయోజనాలైనా దక్కుతాయి.దండకారణ్యంలోని బస్తర్ అటవీ ప్రాంతం మధ్యప్రదేశ్‌లో భాగంగా ఉన్నప్పుడు 1980వ దశకం నుంచీ వామపక్ష తిరుగుబాటు ఉద్యమాలు ఊపందుకున్నాయి. అడవులపై నక్సలైట్ల ఆధిపత్యం పెరిగింది. ఆ తర్వాత రాష్ట్రాల పునర్విభజనలో ఈ ప్రాంతం ఛత్తీస్‌గఢ్‌లో భాగమైంది. నక్సలైట్లకు వ్యతిరేకంగా మహేంద్ర కర్మ అనే కాంగ్రెస్ నాయకుడు 2005లో సల్వా జుడుమ్ (గోండి భాషలో ‘పవిత్ర వేట’) పేరుతో ఆదివాసులతో సాయుధ పోరాటం మొదలుపెట్టారు. రెండువైపుల తుపాకి గర్జనల మధ్య ఆదివాసుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఐతే సల్వా జుడుమ్ శిబిరాలలో తలదాచుకోవాలి, లేదంటే నక్సలైట్ల వేధింపులను భరించలేక ఊరొదిలి పారిపోవాలి.అలా వేలాది మంది ఆదివాసులు ప్రాణాలు అరచేత పట్టుకొని దండకారణ్యంలోని పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిషాలకు వలసపోయారు. తెలుగు రాష్ట్రాలలో వారిని గొత్తికోయలు అని పిలవడం మొదలుపెట్టారు. వాస్తవానికి గొత్తికోయలు అనే పేరు ఏ ఆదివాసీ తెగలకూ లేదు. గొత్తి అంటే కొండలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అటవీ ప్రాంతంతో పోలిస్తే దండకారణ్యంలోని బీజాపూర్, సుకుమా, దంతేవాడ సముద్రమట్టం నుంచి ఎక్కువ ఎత్తులో ఉంటాయి. కాబట్టి ఎగువ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కారణంగా వారిని గొత్తికోయలు అని వ్యవహరించడం మొదలుపెట్టారు. వారిలో ఎక్కువ శాతం గోండులలో ఉపజాతులైన మురియా తెగకు, మిగతావారు దొర్ల తెగకు చెందినవారు. 1980వ దశకం నుంచీ వలసలు సాగినప్పటికీ 2005 నుంచి 2011 మధ్య సల్వా జుడుమ్ కాలంలోనే అధిక శాతం ఆదివాసులు చెల్లాచెదురై ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.ఉన్నచోటి నుంచి దేశంలో మరో ప్రాంతానికి వలసపోయి, ఎటువంటి ఆదరువూ లేనివారిని స్వదేశ విస్థాపితులుగా (ఇంటెర్నల్లీ డిస్ప్లేస్డ్ పర్సన్స్–ఐడీపీస్) వ్యవహరిస్తారు. బస్తర్ ప్రాంతం నుంచి వలస వచ్చిన జనాభాకు సంబంధించి ప్రభుత్వాల వద్ద సరైన సమాచారం లేదు. ఆదివాసుల బాగు కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో 60 వేల మంది దాకా గొత్తికోయలు ఉన్నారు. అడవి మధ్యలో పోడు చేసుకొని పొట్టపోసుకోవడం తప్ప వారికి మరో ఉపాధి మార్గం తెలియదు. దేశీయంగా విస్థాపితులైన ఆదివాసుల గుర్తింపునకు, పునరావాసానికి కేంద్ర ప్రభుత్వం 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్– ఆర్ఓఎఫ్ఆర్) తీసుకువచ్చింది. 2008లో కొద్దిమంది స్థానిక గిరిజనులకు భూమిపై హక్కు కల్పించి, ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చినవారిని పక్కనపెట్టారు. ఆ చట్టం నిబంధనల ప్రకారం 2005 డిసెంబర్ 13కు ముందు వలస వచ్చి మూడు తరాలుగా 75 ఏళ్లపాటు సాగు చేసుకుంటున్న వాళ్లకే భూములపై హక్కు దఖలు పడుతుంది. అందులోనూ ఒక్కొక్కరికి గరిష్ఠంగా నాలుగు హెక్టార్ల వరకు భూమిపై హక్కు కల్పిస్తారు. అయితే, ప్రస్తుతం భూమి హక్కుల కోసం ఎదురుచూస్తున్న గొత్తికోయలు 2016 తర్వాత వలస వచ్చారని అటవీ అధికారులు వాదిస్తున్నారు. అంతకు ముందటి ఉపగ్రహ చిత్రాలను తమ వాదనకు మద్దతుగా చూపుతున్నారు. అయితే, నిర్దిష్ట ప్రదేశానికి పరిమితం కాకుండా దట్టమైన అడవులలో పోడు చేసుకుంటూ జీవనం సాగించే ఆదివాసుల అచూకీని ఉపగ్రహాలు ఎలా నిర్ధారిస్తాయన్న వాదనను అధికారులు పట్టించుకోవడం లేదు.రెండు రాష్ట్రాలలోని 28 జిల్లాల నుంచి దాదాపు 13 లక్షల ఎకరాల అటవీ భూములపై హక్కు కోసం నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. 2006 నుంచి ఇటీవలి కాలం వరకు వీటిలో అధిక శాతం దరఖాస్తులను తిరస్కరించారు. దరఖాస్తుదారులలో మైదానప్రాంత గిరిజనేతరులు ఉన్నారనీ, అక్రమంగా అటవీ భూములు సొంతం చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారనీ అధికారులు వాదిస్తున్నారు. దరఖాస్తుల తిరస్కారాలకే పరిమితమైన అధికారులు నామమాత్రంగానైనా అర్హులకు పట్టాలు అందించడం లేదు.భూమి హక్కుతో సంబంధం లేకుండా అడవి బిడ్డలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తిస్తే కనీసం రాజ్యాంగం ప్రసాదించిన విద్యా ఉద్యోగ ప్రయోజనాలైనా వీరికి దక్కి ఉండేవి. రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ పలు ప్రాథమిక హక్కులను కూడా వారు పొందలేకపోతున్నారు. వాళ్ల పిల్లలకు విద్య ఇప్పటికీ ఒక కలగానే మిగిలిపోయింది. గొత్తికోయలు అడవి మధ్యలో ఉండటం వల్ల సుదూర మైదాన ప్రాంతాల్లోని పాఠశాలలకు వెళ్లలేరు. అక్కడక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు బ్రిడ్జ్ స్కూళ్లను ప్రారంభించినప్పటికీ, ప్రాథమిక విద్య తర్వాత ముందుకు సాగడం లేదు. బాలికలు తమ ఇళ్లలో పనులకు, చిన్న పిల్లలను చూసుకోవడం వరకే పరిమితమవుతున్నారు. బాలురు అతికష్టంగా హైస్కూలు దాకా వచ్చి అర్ధాంతరంగా ఆపేసి కూలీలుగా మారిపోతున్నారు. షెడ్యూల్డ్ తెగలుగా గుర్తింపు లేకపోవడం వల్ల ఉన్నత విద్యా సంస్థల్లో, వసతి గృహాల్లో ప్రవేశం పొందలేకపోతున్నారు. చదువులే ఇలా ఉన్నాయంటే, ప్రజారోగ్యం మరీ దయనీయంగా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అడవి బిడ్డలకు అందని చందమామలు. అప్పుడప్పుడు నర్సులు రావడం, గర్భిణులను సమీప ఆరోగ్య కేంద్రాలకు తీసుకుపోవడం మినహా మిగతావాళ్లకు ఎటువంటి వైద్య సౌకర్యాలు అందడం లేదు. హక్కులు దక్కకపోవడమే కాకుండా పుండు మీద కారం చల్లినట్లు పోలీసు కేసులు గొత్తికోయలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చాలా గూడేలలో వయసుతో నిమిత్తం లేకుండా పురుషులు సమీప పోలీసు స్టేషన్లకు వెళ్లి హాజరు వేసి రావలసి ఉంటుంది. అలా వెళ్లినవారితో చాకిరీ చేయిస్తుంటారు. అప్పుడప్పుడు తప్పుడు కేసులతో నిరుత్సాహ పరుస్తుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారులు గిరిజన గూడేలను రెవెన్యూ గ్రామాలుగా గానీ, అటవీ గ్రామాలుగా గానీ గుర్తించరు. కాబట్టి, ప్రభుత్వ లెక్కల ప్రకారం గొత్తికోయల ఆవాసాలు మనుగడలో ఉండవు. తరచుగా అటవీ అధికారులు వారిని ఖాళీ చేయించడం, వారు మరో చోట గూడు చూసుకోవడం పరిపాటిగా మారింది. గొత్తికోయలకు గుర్తింపు ఇవ్వాలనే విషయంలో రెండు రాష్ట్రాలలోని పాలక, ప్రతిపక్షాలకు అభ్యంతరాలు లేవు. కానీ తగిన చొరవ కరవైనందున సమస్య పరిష్కారం కావడం లేదు. ఇప్పటికైనా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి కాడువడిన అడవిబిడ్డలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అందించాలి. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికులు, స్పందించే మనసున్న వ్యక్తులు కూడా దగాపడిన అడవి బిడ్డలకు ఊతమివ్వాలి. విద్య, వైద్యం వారికి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలి.త్రిపురలో దశాబ్దాలుగా నలుగుతున్న ఇలాంటి సమస్యను కేంద్ర ప్రభుత్వం ఇటీవల పరిష్కరించింది. 1990వ దశకంలో మిజోరంలో జాతుల పోరాటం తీవ్రరూపం దాల్చింది. బ్రూ– రియాంగ్ తెగకు చెందిన ఆదివాసులు పెద్దఎత్తున త్రిపురకు వలస వెళ్లారు. మన గొత్తికోయల మాదిరిగానే వాళ్లు కూడా స్వదేశంలో శరణార్థులై గుర్తింపు, హక్కులు లేకుండా రెండు దశాబ్దాలు దయనీయమైన పరిస్థితుల్లో జీవించారు. 2020లో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించింది. వలస వచ్చిన 43 వేల మంది బ్రూ– రియాంగ్ ఆదివాసులకు త్రిపురలో పునరావాసం కల్పించింది. వాళ్లకు గుర్తింపునిచ్చి ఇళ్లు కట్టించింది. వాళ్ల జీవితాలలో వెలుగు నింపేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల గొత్తికోయలు కూడా సరిగ్గా బ్రూ– రియాంగ్ ఆదివాసుల మాదిరిగానే ఇబ్బందులు పడుతున్నారు. రెండు రాష్ట్రాలు సత్వరం స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలి.- పి. వేణుగోపాల్ రెడ్డి, వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ ‘ pvg@ekalavya.net -
అడవి బిడ్డల తిరుగుబాటు
-
Elections 2024: ముందస్తు ఎంపిక వెనుక
ఇంకా ఎన్నికల వేడి రాజుకోలేదు.. నోటిఫికేషన్ నగారా మోగలేదు అయినా బీజేపీ అయిదు రాష్ట్రాల ఎన్నికల కసరత్తు ముందుగానే ప్రారంభించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల తొలి విడత అభ్యర్థుల జాబితా వెల్లడించింది. కమలనాథులకు ఎందుకీ తొందర? అభ్యర్థుల ఎంపిక వెనుక వ్యూహమేంటి? భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అభ్యర్థుల్ని ప్రకటించి అసెంబ్లీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించింది. మధ్యప్రదేశ్‌లో 39 మందితో, ఛత్తీస్‌గఢ్‌లో 21 మందితో తొలిజాబితా విడుదల చేసి ప్రత్యర్థి పార్టీల్లో ఎన్నికల వేడి పెంచింది. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో (రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ) రెండు రాష్ట్రాల్లో కమలం పార్టీ ముందస్తుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వెనుక దాగి ఉన్న వ్యూహంపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న పటాన్ నియోజకవర్గం నుంచి ఆయన సమీప బంధువు, బీజేపీ ఎంపీ విజయ్ భగేల్‌ను రంగంలోకి దింపి ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుందనే సంకేతాలు పంపింది. గతంలో ఒకసారి భూపేష్ భగేల్‌ను ఓడించిన ఘనత విజయ్‌కు ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ నడ్డా తదితరులు హాజరైన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలోనే ముందస్తుగా అభ్యర్థుల్ని ఖరారు చేయాలన్న నిర్ణయానికొచ్చారు. సీట్లలో ఏబీసీడీ వర్గీకరణ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ముందు అసెంబ్లీ స్థానాలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించింది. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలు – ఏ కేటగిరీ మిశ్రమ ఫలితాలు వచి్చన స్థానాలు – బీ కేటగిరీ బలహీనంగా ఉన్న స్థానాలు – సీ కేటగిరీ ఇప్పటివరకు గెలవని స్థానాలు – డీ కేటగిరీ సీ, డీ కేటగిరీ సీట్లపై దృష్టి సారించిన కమలనాథులు ఆయా సీట్లకే తొలి జాబితా విడుదల చేశారు. ఆదివాసీ ప్రాంతాలే గురి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఆదివాసీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఇప్పటివరకు బీజేపీ పాగా వెయ్యలేకపోయింది. ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ కాంగ్రెస్‌కే పట్టు ఉంది. వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికే ముందస్తుగా కసరత్తు పూర్తి చేసి బీజేపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించిన 21 స్థానాల్లో 10 ఎస్టీలకు రిజర్వ్ చేయబడినవే. ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే 13 స్థానాలు ఎస్టీ రిజర్వ్ సీట్లు. ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రచారం చేయడానికి వీలుగా అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి చేదు ఫలితాల్నే మిగిల్చాయి. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ కేవలం 15 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. ఇక మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలకు గాను 109 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 114 సీట్లతో మెజారీ్టకి ఒక్క సీటు దూరంలో మిగిలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2020లో జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఈ సారి అలాంటి పరిస్థితి రాకూడదనే అభ్యర్థుల ఎంపిక కసరత్తు ముందస్తుగా మొదలు పెట్టింది. అంతర్గత సర్వేలు ఏం చెబుతున్నాయి ? మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ అంతర్గత సర్వేలు కాస్త ఆందోళన పుట్టించేలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో 40% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని వెల్లడైంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలకు గాను 30 నుంచి 32 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశముందని సర్వేలో తేలింది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఓటమితో బీజేపీ ఇక ఏ ఒక్క రాష్ట్రాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అత్యంత కీలకమైన హిందీబెల్ట్‌లో ఒక్క రాష్ట్రంలో ఓడిపోయినా లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం పడుతుందన్న ఆందోళన పార్టీ అగ్రనాయకుల్లో ఉంది. ముందస్తు జాబితాతో మేలే బీజేపీ అగ్రనాయకులు ఎంతో కసరత్తు చేసి తాము బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించారు. ‘‘ఈసారి ఎన్నికల్లో కొత్త వ్యూహాలు అనుసరించాల్సిన అవసరం ఉంది. ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వ్యూహంలో భాగమే. అభ్యర్థులు నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయించి ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.’’అని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అయితే ఇలా ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వల్ల రెబెల్స్ బెడద కూడా ఉంటుంది. ఆ రిస్క్ తీసుకొని మరీ కమలనాథులు ముందడుగు వేశారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆదివాసీల అభివృద్ధే దేశాభివృద్ధి: గవర్నర్
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): ప్రకృతితో మమేకమై స్వచ్ఛంగా ఉండే ఆదివాసీలు అభివృద్ధి చెందినపుడే దేశం అభివృద్ధి చెందినట్లని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు. వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమంటే దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమేనని అభిప్రాయపడ్డారు. ఆధార్ సొసైటీ, ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమం సాంస్కృతిక సంస్థ, ఆదివాసీ విద్యార్థి మండలి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలకు ఆమె హాజరై మాట్లాడారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయడమంటే భగవంతుడికి సేవ చేయడమేనన్నారు. గవర్నర్‌గా ఇక్కడికి వచ్చాక ఆరు ఆది వాసీ గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ సర్వే చేయించగా...అక్కడి మహిళలు రక్తహీనతతో అధికంగా బాధపడుతున్నట్లు తేలిందని, వారికి ఐరన్ మాత్రలు పంపించగా...వాటిని తీసుకునేందుకు వారు ఇష్టపడలేదని వివరించారు. దీంతో ఐరన్ ఎక్కువగా లభించే మహువా పూలతో తయారు చేసిన లడ్డూలను పంపిణీ చేస్తే చాలామంది మహిళలు రక్తహీనతనుంచి బయటపడ్డారని తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆదివాసీలతో కలసి గవర్నర్ నృత్యాలు చేశారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ..ఆర్టి కల్ 244 ప్రకారం ఆదివాసులకు ప్రత్యేక రక్షణ చట్టాలున్నాయని, కానీ వాటిని పరిరక్షించడం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో ఆధార్ సొసైటీ జాతీయ అధ్యక్షులు వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఎంబ్రాయిడరీ ఎంపవర్మెంట్
తోడా ఆదివాసీలు... నీలగిరుల్లో ఉంటారు. వారి జీవనం ప్రకృతి ఒడిలో ప్రకృతితో మమేకమై సాగుతుంది. వారి చేతిలో రూపుదిద్దుకున్న ఎంబ్రాయిడరీ డిజైన్లు కూడా వారు నివసిస్తున్న ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి. పూలు, లతలు, పౌరాణిక గాథలు కుట్టులో రూపుదిద్దుకుంటాయి. తెల్లటి వస్త్రం, గోధుమ వర్ణంలోని వస్త్రం మీద నల్లటి దారాలతో ఈ ఎంబ్రాయిడరీ చేస్తారు. సాధారణంగా ఎంబ్రాయిడరీ చేస్తే ఒక వైపు చక్కటి డిజైన్ కనిపిస్తే వెనుక వైపు దారాల ముడులుంటాయి. తోడా ఆదివాసీలు చేసే ఎంబ్రాయిడరీలో రెండు వైపులా డిజైన్ అందంగా కనిపిస్తుంది. ఇలాంటి అందమైన పనితనం కొండలకే పరిమితమైపోతే ఎలాగ అనుకున్నారు షీలాపావెల్. నీలగిరుల్లో తోడా ఆదివాసీలు నివసించే కుగ్రామాలన్నింటిలో పర్యటించారామె. వారిని స్వయం సహాయక బృందంగా సంఘటితపరిచారు. ‘షాలోమ్ ఊటీ’ పేరుతో తోడా ఆదివాసీ మహిళలను ఒక వేదిక మీదకు తీసుకువచ్చారు షీలా పావెల్. ఇప్పుడు తోడా ఆదివాసీ మహిళలు వారానికి ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు సంపాదించుకోగలుగుతున్నారు. ‘వారి చేతిలో ఉన్న కళ గొప్పతనం వారికి తెలియజేశాను, ఆ కళను ప్రపంచానికి పరిచయం చేశాను’ అన్నారు షీలా పావెల్. సాధికారత కుట్టారు షీలా పావెల్ వయసు 59. తమిళనాడులోని ఊటీలో నివసిస్తారు. ఆమె 2005లో షాలోమ్ ఊటీ స్వయం సహాయక బృందాన్నిప్రారంభించారు. అప్పుడు 250 మందితో మొదలైన బృందంలో ఇప్పుడు 150 మంది చురుగ్గా ఉన్నారు. అప్పటి సంగతులను తెలియచేస్తూ ‘‘తోడా ఆదివాసీ మహిళల చేతిలో ఏం నైపుణ్యం ఉందో తెలియదు. అందమైన ఎంబ్రాయిడరీతో చక్కటి శాలువాలు వాళ్ల చేతిలో రూపుదిద్దుకోవాల్సిందే. ఈ మహిళలు తాము ఎంబ్రాయిడరీ చేసిన శాలువాలను సమీపంలోని ఊటీ పట్టణానికి తెచ్చి అమ్ముకునేవారు. ఊటీలో దుకాణాల వాళ్లు తక్కువ ధరకు కొని వాటిని పర్యాటకులకు మంచి ధరకు అమ్ముకునేవారు. ఈ మహిళలకు మరొక ప్రపంచం తెలియకపోవడంతో ఆ వచ్చిన డబ్బుతో సంతృప్తి పడేవారు. వారిని సంఘంగా ఏర్పరిచి, వారు తయారు చేసిన శాలువాలు, కీ చైన్లు, మఫ్లర్లు, పర్సులు వంటి వాటిని తమ బృందం పేరుతో లేబుల్ అతికించి అమ్మడం మొదలు పెట్టారు. వ్యవస్థీకృతంగా లేని పనిని, కళ చేతిలో ఉన్న వారిని వ్యవస్థీకృతం చేయడమే నేను చేసింది. అప్పట్లో షాల్ కోసం వాళ్లు తీసుకునే క్లాత్కంటే కొంచెం మెరుగైన క్లాత్ కొని ఇవ్వడం, మార్కెటింగ్ మెళకువలు నేర్పించడం వంటివి చేశాను. గతంలో ఐదు వందలకు అమ్మిన శాలువాలను ఇప్పుడు వెయ్యి రూపాయలకు అమ్మగలుగు తున్నారు. నా కళ్లముందే వారి జీవన స్థాయులు పెరిగాయి. నేను కోరుకున్న లక్ష్యాలు రెండూ నెరవేరాయి. వీరి కళ విలువ వీరికి తెలిసింది, వీరి కళ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అనుసంధానం చేయగలిగాను. తోడా ఎంబ్రాయిడరీ వస్తువులు చెన్నై, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌లో కూడా లభిస్తున్నాయిప్పుడు. కళ కొనసాగాలి ఈ కళ ఎదుర్కొంటున్న మరో చాలెంజ్ ఏమిటంటే... కొత్తతరం ఈ ఎంబ్రాయిడరీ నేర్చుకోవడం లేదు. చదువుకుని ఉద్యోగాలకు వెళ్లడం మంచి పరిణామమే. కానీ ఈ కళను కూడా నేర్చుకోవచ్చు కదా అనిపిస్తుంది. తోడా ఆదివాసీల జనాభా పదమూడు వందలుంటే అందులో ఏడు వందల వరకు మహిళలున్నారు. డెబ్బై ఏళ్ల వాళ్లతో కలుపుకుంటే ఈ ఎంబ్రాయిడరీ వచ్చిన వాళ్లు మూడు వందల లోపే ఉన్నారిప్పుడు. ఇతరులకు నేర్పించే ఆలోచనలో ఉన్నాను’’ అని తెలియ చేశారు షీలా పావెల్. -
75 ఏళ్ల తర్వాత తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మండపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యంగంలోని ఐదో షెడ్యూల్ కిందకే వస్తాయని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్ బుధవారం తీర్పు ప్రకటించారు. 75 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆదివాసీలకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువడింది. ఆదివాసుల తరపున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. అయితే, ఆ 23 గ్రామాలు రాజ్యాంగ పరిధిలోని ఐదవ షెడ్యూల్ పరిధిలోకి రావనీ ఆదివాసీయేతర నేతలు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఆదివాసీలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 షెడ్యూల్ ప్రాంతాల పరిపాలనకు సంబంధించినదని తెలిసిందే. చదవండి: బీజేపీ ఇన్చార్జి తరుణ్‌ఛుగ్ స్థానంలో భూపేంద్రయాదవ్? -
అక్కగా.. అండగా ఉంటా!
భద్రాచలం/సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘రాజ్‌భవన్ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోంది. సాధారణంగా రాజ్భవన్ల ద్వారాలు మూసి ఉంటాయి. కానీ ఈ రాజ్‌భవన్ ద్వారాలు ప్రతి ఒక్కరి కోసం తెరిచే ఉంటాయి. ఇది నిజంగా ఒక ప్రజాభవన్. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే రాజ్‌భవన్‌ను సందర్శించండి. అక్కడ ఈ అక్క మీకు అండగా ఉంటుంది. నేను తమిళనాడు ఆడపడుచునైనా తెలంగాణ అక్కనే..’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో, ఖమ్మం రూరల్ మండలంలో గవర్నర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు, విద్యార్థులతో సమావేశమయ్యారు. సీతారాములను దర్శించుకుని.. గవర్నర్ ముందుగా భద్రాచలంలో సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులతో కాసేపు ముచ్చటించారు. తర్వాత భద్రాచలంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివాసీలతో ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ‘ప్రియాతి ప్రియమైన నా ఆదివాసీ బంధువులారా..’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆదివాసీల సమస్యలు తన హృదయాన్ని కలచివేస్తున్నాయని.. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సదుపాయాలు అందకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్య, వైద్యపరంగా ఆదివాసీలు అభివృద్ధి చెందడానికి కలసి పనిచేద్దామన్నారు. జనంలోకి వెళితేనే సమస్యలు తెలుస్తాయి ప్రజలను నేరుగా కలిస్తేనే సమస్యలపై మరింత అవగాహన కలుగుతుందని, రాజ్‌భవన్‌లో కూర్చుంటే సమస్యలు మాత్రమే వినగలుగుతానని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రజల సమస్యలను, బాధలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే వచ్చానని, వీలైనంత వరకు సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాలో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను.. ఈ ప్రాంత ప్రజలు, ఆదివాసీల తరఫున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తానని చెప్పారు. పరిశోధనలపై దృష్టి పెట్టాలి దేశ ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన కోసం.. ఇన్నోవేషన్ (ఆవిష్కరణ), ఎంటర్ ప్రెన్యూర్íÙప్ (వ్యవస్థాపన) కీలకమని.. కళాశాలలు తమ క్యాంపస్‌లను ఆవిష్కరణలకు వేదికగా మార్చుకోవాలని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. విద్యార్థులు కూడా ఆవిష్కరణలు, పరిశోధనలపై దృష్టిపెట్టాలని సూచించారు. బుధవారం ఖమ్మంరూరల్ మండలంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో వై20 ఇండియా ఉత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుందని, తమ అభిరుచికి అనుగుణంగా రాణించడానికి కృషిచేయాలని సూచించారు. విద్యార్థులు రాజకీయాల్లో కూడా రాణించాలని.. చదువుకున్న రాజకీయ నాయకులు దేశానికి ఉపయోగపడతారని పేర్కొన్నారు. -
ఉట్నూర్ ఐటీడీఏకి ‘తుడుందెబ్బ’
సాక్షి,ఆదిలాబాద్: ఎస్టీల్లో నుంచి లంబాడాలను తొలగించాలని ఇప్పటివరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ఆదివాసీలు తాజాగా ప్రభుత్వం వివిధ కులాలను ఎస్టీల్లో చేర్చడంపై ఆగ్రహావేశాలతో ఆందోళన ఉధృతం చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో వాల్మీకిబోయ, ఖైతి లంబాడాతో పాటు మొత్తంగా 11 కులాలను షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో చేరుస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏను ముట్టడించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ముందుగా నిర్ణయించింది. రాష్ట్ర అధ్యక్షుడు బుర్సా పోచయ్య ఆధ్వర్యంలో సోమవారం ఆదివాసీలు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఆ తర్వాత కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సమీపంలో ఏర్పాటుచేసిన బారికేడ్లను తోసేసి ఆదివాసీలులోనికి దూసుకెళ్లారు. కార్యాలయం పైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఆవరణలో ఉన్న ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ వాహన అద్దాలను ధ్వంసం చేశారు. అదనపు బలగాలతో చేరుకున్న ఎస్పీ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్పీ డి.ఉదయ్‌కుమార్ రెడ్డి అదనపు బలగాలతో ఉట్నూర్ చేరుకున్నారు. సమస్యలను కలెక్టర్‌కు విన్నవించాలని కోరారు. అయితే ఆందోళనకారులు ఐటీడీఏ పీవో రావాలని పట్టుబట్టారు. ప్రస్తుతం నిర్మల్ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న వరుణ్‌రెడ్డి ఉట్నూర్ ఐటీడీఏకు ఇన్చార్జి పీవోగా కొనసాగుతున్నారు. ఓ గంట తర్వాత ఆయన అక్కడికి చేరుకోవడంతో ఆదివాసీలు తమ సమస్యలను విన్నవించారు. ఎస్టీల్లో అదనంగా కులాలను చేర్చడాన్ని వెనక్కి తీసుకోవాలని డి మాండ్ చేశారు. పోడు భూములకు పట్టాల జారీలో షరతులు విదించడం సరికాదన్నారు. దీనిపై వినతి పత్రాన్ని అందజేశారు. ఆయన స్పందిస్తూ ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. -
మొదలైన ‘నాగోబా’ జాతర.. ఆదివాసీలతో జనసంద్రంగా మారిన కేస్లాపూర్
ఇంద్రవెల్లి/ఉట్నూర్(ఖానాపూర్): ఆదివాసీలు గూడేలు వీడెను. నాగోబా నీడన చేరెను. ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర శనివారం మొదలైంది. వేలాదిగా తరలివచ్చిన గిరిజనులతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ జనసంద్రంగా మారింది. మూడురోజులుగా వడమర(మర్రిచెట్ల) వద్ద విడిది చేసిన మెస్రం వంశీయులు తూమ్ పూజలు(చనిపోయిన వారికి కర్మకాండలు) నిర్వహించి శనివారం ఉదయం ఆలయానికి చేరుకున్నారు. పుష్య అమావాస్య అర్థరాత్రి పవిత్ర గంగాజలాలతో నాగోబాను అభిషేకించిన అనంతరం జాతర ప్రారంభమైంది. మెస్రం వంశీయులు ఉదయం నుంచి ఆచార సంప్రదాయాలు పాటిస్తూ నాగోబాను స్మరిస్తూ ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ సమీపంలోని వడమర వద్ద విడిది చేసిన మెస్రం వంశీయులు, పెద్దలు(పటేళ్లు) శనివారం తెల్లవారుజామున 84 మందికి తూమ్ నిర్వహించారు. శనివారం నాగేంద్రుడి విగ్రహంతో నియమనిష్టలు, వాయిద్య చప్పుళ్ల మధ్య ఆలయానికి చేరుకున్నారు. సిరికొండ మండల కేంద్రం నుంచి తెప్పించిన మట్టికుండలకు మెస్రం పెద్దలు పూజలు నిర్వహించారు. మెస్రం వంశంలోని 22 తెగలకు చెందిన ఆడపడుచులు పెద్దలకు, పూజారులకు పాదాభివందనం చేస్తూ నాయక్పాడ్ నుంచి మట్టికుండలు స్వీకరించారు. అనంతరం వడమర సమీపంలోని కోనేరు నుంచి పవిత్రజలాలను నాగోబా సన్నిధికి తెచ్చారు. గతేడాది నిర్మించిన మట్టిపుట్టలను మెస్రం వంశ అల్లుళ్లు తొలగించగా దానిస్థానంలో కొత్తగా పుట్టలను తయారు చేశారు. మట్టి ఉండలను మహిళలు చేతుల మీదుగా తరలించి సతిదేవతల ఎదుట మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మెస్రం వంశీయులు గోవాడా (గుండ్రంగా గోడకట్టి ఉండే ప్రదేశం) చేరుకుని విడిది చేశారు. మహాపూజకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కాగా జాతరకు ఉమ్మడి జిల్లా నలుమూలాల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఆదివాసీలు, గిరిజనేతరులు భారీగా తరలివచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆదివాసుల హృదయ దీపాలు
తూర్పు గోదావరి జిల్లా కొండ అడవుల్లో డాక్టర్ ఊర్మిల పింగ్లె తీసిన ఇక్కడ కనిపిస్తున్న ఫొటో... హైమండార్ఫ్ దంపతులు కలిసి ఉన్న దాదాపు తుది చిత్రం. పదవీ ఉద్యోగాలు లేకపోయినా మానవ శాస్త్రవేత్తగా తనతో యాభై ఏళ్లుగా వెన్నెముకలా ఉండి అలుపెరగకుండా కలిసి పని చేసిన బెట్టీ సాహచర్యం గురించి లోతుగా తలపోస్తున్నట్టు క్రిస్టోఫ్ హైమండార్ఫ్ కనిపిస్తున్నారు ఈ చిత్రంలో. ఆ తర్వాత కొద్ది రోజులకే హైదరాబాద్‌లో 11 జనవరి 1987 నాడు బెట్టీ అని అందరూ అభిమానంగా పిలిచిన ఎలిజబెత్ హైమండార్ఫ్ గుండెపోటుతో హఠాత్తుగా ప్రాణాలు విడిచారు. ఆమె మరణం క్రిస్టోఫ్ హైమండార్ఫ్‌ను బాగా కుంగదీసింది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకే ఆయన కూడా తనువు చాలించారు. భారత్ ఈశాన్య ప్రాంతంలోని కొన్యక్ నాగాలు, ఆపతానీలు, హైదరాబాద్ నిజాం సంస్థానంలోని చెంచులు, కొండ రెడ్లు, రాజ గోండులు, ఇంకా నేపాల్ షేర్పాలు, మధ్య ప్రదేశ్ భిల్లులు.. ఈ జాతుల గురించి క్రిస్టోఫ్ వాన్ ఫ్యూరర్ హైమండార్ఫ్ చేసిన పరిశోధనలు ఇప్పటికీ ప్రామాణికంగా నిలుస్తున్నాయి. అయితే వీటన్నింటిలో ఆదిలాబాద్ రాజ్ గోండులతో ఆయన 1940ల్లో ఏర్పరచుకొని, జీవన పర్యంతం కొనసాగించిన బాంధవ్యానికి సాటి రాగలిగి నది ఏదీ లేదు. మార్లవాయి గ్రామంలో రాజ్ గోండుల మధ్య వారిలో ఒకరిగా ఒక గుడిసెలో జీవిస్తూ వారి సంప్రదాయాలు, పురాణాలను, వారి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సాధికారికంగా నమోదు చేస్తూ, ఆదివాసీ జీవన దృక్పథ సార్వజనీనమైన విలువను గుర్తుండి పోయేలా ఆవిష్కరించగలిగారు. హైదరాబాద్ సంస్థానంలోని ఆదివాసీలను దాదాపు మూడు సంవత్సరాల పాటు అధ్యయనం చేసిన తరువాత 1945లో, ఆయన విశ్లేషణల నాణ్యతను చూసిన నిజాం ప్రభుత్వం ఆయనను గిరిజన తెగలు, వెనుకబడిన తరగతుల సలహాదారుగా నియమించింది. సంస్థానంలోని ఆదివాసీల అభ్యున్నతికి కీలకమైన నూతన ప్రణాళికల రూపకల్పన, వాటి అమలు బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఆ పదవిలో ఉంటూ కుమ్రం భీం తిరుగుబాటు, వీర మరణం తరువాత పూర్తిగా ధైర్యాన్ని కోల్పోయి, తీవ్రమైన నిరాదరణకు గురవుతున్న ఆదిలాబాద్ జిల్లా గోండుల కోసం తొలి పాఠశాలలు ఏర్పరిచి, భూములు లేని వేలాది ఆదివాసీ కుటుంబాలకు దాదాపు 160 వేల ఎకరాల భూమిని పట్టాలతో సహా అందించి వారి సమగ్ర పునరుజ్జీవనానికి గొప్ప పునాది వేయగలిగారు హైమండార్ఫ్. 1950లో లండన్‌కు వెళ్లి పోయిన తర్వాత కూడా తరచుగా ఆదిలాబాద్‌ను సందర్శిస్తూ గోండుల బాగోగుల గురించి తెలుసుకుంటూ ఉండేవారు హైమండార్ఫ్ దంపతులు. 1960ల తరువాత బయటి నుండి వచ్చిన చొరబాటుదారుల దురాక్రమణకు ఆదివాసీల భూములు గురికావడం, వారి పరిస్థితి మళ్లీ హీనం కావడం హైమండార్ఫ్ దంపతులను ఎంతో బాధించేది. తమను ఎంతో ఆదరించి, అభిమానించిన గోండుల సన్నిధిలో మార్లవాయి లోనే తమ సమాధులు ఉండాలని హైమండార్ఫ్ దంపతులు కోరుకున్నారు. బెట్టి మరణం తర్వాత, ఆమె అస్థికలను మార్లవాయికి తీసుకు వచ్చి, ప్రేమాభిమానాలతో తరలివచ్చిన వేలాది ఆదివాసీల సమక్షంలో మార్లవాయి గ్రామం పక్కనే ఖననం చేశారు. క్రిస్టోఫ్ అవశేషాలను కూడా ఆయన మరణించిన చాలా ఏళ్ళ తర్వాత బెట్టి సమాధి పక్కనే పూడ్చి మరో సమాధి నిర్మింపజేశారు. బెట్టి వర్ధంతినే హైమండార్ఫ్ దంపతుల ఉమ్మడి సంస్మరణ దినంగా ప్రతి ఏడాది మార్లవాయి గ్రామంలో 11 జనవరి నాడు నిర్వహిస్తూ వస్తున్నారు. గత కొన్నే ళ్లుగా ఇది పెద్ద కార్యక్రమంగా వికసిస్తూ వస్తున్నది. మార్లవాయి గ్రామ గుసాడి నృత్య కళాకారుడు కనక రాజుకు పద్మశ్రీ గౌరవం దక్కడం దీనికి తోడయ్యింది. తమ జాతి సంస్కృతిని అధ్యయనం చేసి, తమ అభ్యున్నతి కోసం పరితపించిన మానవ శాస్త్రవేత్త దంపతులకు ఆ జాతి నుంచి లభించిన ఇటువంటి ఆరాధనకు సాటిరాగల ఉదాహరణ మరెక్కడా లేదేమో! 1980వ దశకం నుండి చివరిదాకా హైమండార్ఫ్ దంపతులను బాగా ఎరిగిన, క్రిస్టోఫ్‌తో కలిసి రెండు పరిశోధన గ్రంథాలను కూడా రాసిన ఊర్మిళ పింగ్లె, బెట్టి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు: ‘తనను కలిసిన వారందరి పట్లా గొప్ప అనురాగం చూపుతూ... గొప్ప చమత్కారం, హాస్య దృష్టిలతో జీవ చైతన్యం ఉట్టిపడుతూ ఉండేది అమె. ఆదివాసీ సమాజాల పరిస్థితి పట్ల ఎనలేని సానుభూతితో వారి అభ్యున్నతి కోసం అంతటా వాదిస్తూ ఉండేది. తన భర్తకు నిజమైన ఆత్మబంధువుగా నిలిచిన వ్యక్తి!’ (క్లిక్ చేయండి: అజ్ఞానం కంటే అహంకారం ప్రమాదం) - సుమనస్పతి రెడ్డి ఆకాశవాణి విశ్రాంత అధికారి (జనవరి 11 హైమండార్ఫ్ దంపతుల సంస్మరణ దినం) -
భయం మొదలైందా..? ఇన్నాళ్లకు ఆ ఎంపీకి జ్ఞానోదయం కలిగిందా?
ఆ సంఘం ఓ వ్యక్తికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది. ఒకసారి ఎమ్మెల్యేను చేసింది. మరోసారి ఎంపీని చేసింది. ఎంపీ కాగానే రాజకీయ జన్మనిచ్చిన సంఘాన్ని వదిలేశారాయన. జనానికి దూరమై రాజకీయంగా బలహీనమయ్యారు. ఇన్నాళ్ల తర్వాత ఆ ఎంపీకి జ్ఞానోదయం కలిగింది. మళ్లీ తనకు జీవితాన్నిచ్చిన సంఘానికి సారథ్యం వహించాలని అనుకుంటున్నారు. ఆదివాసీలకు దగ్గర కావాలంటే ఆ సంఘం నాయకత్వం ఎంత అవసరమో గ్రహించారు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు? ఆ సంఘం సంగతేంటి? ఉద్యమం నుంచి ఢిల్లీ దాకా తెలంగాణలో అణగారిన వర్గంగా ఉన్న గోండు తెగ ఆదివాసీల్లో చైతన్యాన్ని రగిల్చిన సంస్థ తుడుం దెబ్బ. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరుగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుకు గుర్తింపు లభించింది. ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా బీజేపీ తరపున విజయం సాధించారు. ఏడాదిన్నర క్రితం వరకు తుడుం దెబ్బకు నాయకత్వం వహించిన సోయం బాపూరావు.. ఎంపీ బాధ్యతల కారణంగా సంఘం నాయకత్వాన్ని వదులుకున్నారు. ఉద్యమ సారథిగా ఉన్న కాలంలో గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉద్యమం నడిపారు. ఆదివాసీల హక్కుల కోసం బలమైన ఉద్యమం నిర్మించడం ద్వారానే నాయకుడిగా గుర్తింపు పొందారాయన. మమ్మల్ని దూరం పెడతారా? ఆదివాసీల మద్దతుతోనే పార్లమెంట్లో అడుగు పెట్టిన సోయం బాపూరావు.. లంబడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని పోరాటం చేశారు. పోరాటం అగిపోయింది. సంఘం బాధ్యతల నుంచి కూడా ఏడాదిన్నర క్రితం తప్పుకున్నారు. తాము నమ్మి ఎంపీనీ చేసిన నాయకుడు ఉద్యమం నుండి వైదొలగడం అదివాసీలను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందట. ఎంపీ మీద ఆగ్రహంతో రగిలిపోతున్నారని తెలుస్తోంది. ఆయన వైఖరితోనే ఉద్యమ కాలంలో బాపూరావు వెన్నంటి ఉన్న నేతలంతా ఒక్కొక్కరుగా ఆయన్ను వీడిపోయారట. ఏడాదిరన్నరలోగానే లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో ఆదివాసీలు దూరం కావడంతో.. ఎంపీకి జ్ఞానోదయం కలిగిందంటున్నారు. ఆదివాసీలంతా తనకు వ్యతిరేకంగా ఉన్నారని సర్వేల్లో తేలిందట. మీ మాట వింట.. మీ వెంట ఉంటా.! పరిస్థితి అర్థం కావడంతో ఎంపీకి దడ మొదలైందట. గతంలో ఒక పిలుపునిస్తే చాలు... వేలాదిగా రోడ్ల మీదకు వచ్చేవారు. వారి వల్లే ఢిల్లీ వరకు వెళ్ళగలిగిన తాను.. ఇప్పుడు ఓడి పోవడం ఖాయమనే భయం మొదలైందట. దీంతో మళ్ళీ తన సామాజిక వర్గమైన ఆదివాసీలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. అందులో భాగంగానే తుడుం దెబ్బ అధ్యక్ష పదవి మళ్లీ చేపట్టాలని భావిస్తున్నారని సమాచారం. తనకు అనుకూలంగా ఉన్నవారి ద్వారా తిరిగి పదవి దక్కించుకోవడానికి సోయం బాపూరావు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. తనకు పదవి అప్పగిస్తే చాలు అదివాసీల హక్కుల కోసం మళ్లీ పోరాటం సాగిస్తానని హామీ ఇస్తున్నారట. ఆదిలాబాద్ ఎంపీ గోండులకు దగ్గర కావడానికి ఎంత ప్రయత్నిస్తున్నా.. తుడుం దెబ్బ బాధ్యతలను తిరిగి బాపూరావుకు అప్పగించడానికి ఆయన వ్యతిరేక వర్గం సిద్ధంగా లేదని తెలుస్తోంది. సోయం ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో... ఆదివాసీలు మద్దతు ఎంతవరకు కూడగడతారో చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
గొత్తికోయలను వెళ్లగొట్టాలనడం రాజ్యాంగ వ్యతిరేకచర్య: జూలకంటి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: గొత్తికోయలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలనడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని సీపీఎం మాజీ శాసనసభ పక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. ఆదివాసీలకు రాష్ట్రాల మధ్య సరిహద్దులు ఉన్నాయన్న విషయం తెలియకుండా శతాబ్దాలుగా అడవే జీవనా«ధారంగా జీవిస్తున్నారని తెలిపారు. గత రెండు, మూడు దశాబ్దాల నుంచి ఛతీస్‌గఢ్ రాష్ట్రం నుంచి పక్కనే ఉన్న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు గొత్తికోయలు వలస వచ్చారన్నారు. గురువారం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో ఆదివాసీ అటవీహక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ‘గొత్తికోయలు – పోడుభూముల సమస్యలు’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ...దశాబ్దాలుగా ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తున్న గొత్తికోయల జీవించే హక్కును కాలరాస్తూ వెళ్లగొట్టాలని చూడటం దుర్మార్గమైన చర్య అన్నారు. వారు తెలంగాణ పౌరులు కాదని మంత్రి సత్యవతిరాథోడ్, అటవీఅధికారులు బహిరంగ ప్రకటనలు ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని విమర్శించారు. అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు హత్యను బూచీగా చూపి వారికి పోడు భూములపై హక్కులు కల్పించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, గిరిజన సంఘం కార్యదర్శి ఆర్.శ్రీరాంనాయక్, రమణాల లక్ష్మయ్య, ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ మాజీ ఎమ్మెల్యే యాదగిరిరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.. సంయమనం పాటించాలి
చండ్రుగొండ ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ ఆదివాసీల చేతిలో మరణించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఆయన మరణం బాధాకరమే. నిజానికి ప్రభుత్వం పోడు భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించడంలో చూపిస్తున్న సాచివేత ధోరణే ప్రజలకూ – ప్రభుత్వ అధికారులకు మధ్య యుద్ధం జరగడానికి కారణం అని చెప్పక తప్పదు. అసలు ఈ సంఘటనకు కారణమేమిటో తేల్చడానికి జిల్లా జడ్జితో విచారణ జరిపించాలని ఆదివాసీలు కోరుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు అక్రమంగా తప్పుడు పద్ధతులలో భూ పట్టాలను మంజూరు చేస్తున్నారు అధికారులు. అలాగే గిరిజనేతరులు ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తుంటే అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఇదంతా తెలిసినా ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన షెడ్యూల్డ్ ప్రాంతంలో కనిపించకుండానే శాంతియుతమైన వాతావరణం క్రమక్రమంగా కరిగి పోతోంది. అందుకు ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్‌పై దాడి ఒక మంచి ఉదాహరణ. అటవీ అధికారులు రాష్ట్రంలో ఆదివాసీ మహిళల మీద, చిన్నారుల మీద దాడులు చేసినప్పడు; పంటలకూ, ఆహార ధాన్యాలకూ, ఇళ్ళకూ నిప్పుపెట్టినప్పుడూ, మనుషుల మీద మూత్రం పోసినప్పుడూ, ఇటువంటి మరికొన్ని అమానవీయ ఘటనలకు పాల్పడినప్పుడూ ప్రభుత్వం స్పందించిన దాఖలాలు కనిపించవు. పోడు భూములపై హక్కుల కోసం ఆదివాసీ సంఘాలు ఆందోళనలు నిర్వ హించినప్పుడు... పోడు సాగుదారులకు పట్టాలిస్తామనీ, పోడు సమస్యను పరిష్కరిస్తామనీ ఒకపక్క చెబుతూనే... మరోపక్క సాగు చేసుకుంటున్న ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులను ఉసిగొలుపుతోంది ప్రభుత్వం. ఆ నిర్లక్ష్య ధోరణి వల్లే ఈరోజు అటవీ అధికారి శ్రీనివాస్ హత్య జరిగింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు ముఖ్యమ్రంతి. చనిపోయిన శ్రీనివాసరావును ముఖ్యమంత్రి తిరిగి తీసుకొస్తాడా? ఆయన పోడు భూముల సాగుపై స్పష్టమైన వైఖరినీ, చిత్తశుద్ధినీ వెల్లడించకుండా ప్రతిసారీ ఎన్నికలసమయంలో సబ్ కమిటీల (అటవీ హక్కుల కమిటీలు) నియామకం పేరుతో కాలం వెళ్ళదీస్తూ అసలు విషయాన్ని దాటవేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆదివాసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా వాడుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారు. ఏదేమైనా... ఆదివాసీ ప్రజలూ సహనం, ఓపికతో చట్టానికి లోబడే పోరాటం కొనసాగించాలే తప్ప... ఇలా ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడం తగదు. సంయమనం పాటించాలి. (క్లిక్ చేయండి: 28 ఏళ్ల కిందట ఆయుధాలు రద్దు.. అటవీ సంరక్షకులకు రక్షణ ఏదీ?!) – వూకె రామకృష్ణ దొర, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
‘ఏ’ అంటే ఆదివాసీలు
అహ్మదాబాద్: ‘‘నాకు ‘ఏ’ అంటే ఆదివాసీలు. వారి ఆశీస్సులతో గుజరాత్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నా. ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో గతంలో డాక్టర్ల కోసం వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆసుపత్రులు, వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సొంత రాష్ట్రం గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా కప్రాడా తాలూకా నానా పోంధా గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్రంలో ఆయన ప్రచారంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఆ గుజరాత్, మై బనావ్యూ చే(ఈ గుజరాత్‌ను నేను తయారు చేశా) అనే కొత్త నినాదానికి మోదీ శ్రీకారం చుట్టారు. ప్రసంగం మధ్యలో ప్రజలతో పలుమార్లు ఈ నినాదాన్ని పలికించారు. రెక్కల కష్టంతో గుజరాత్‌ను తాము తయారు చేశామని ప్రజలంతా భావిస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరి హృదయం నుంచి వస్తున్న ప్రతి శబ్దం ‘ఆ గుజరాత్, మై బనావ్యూ చే’ అని చెబుతోందన్నారు. రాష్ట్రంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు మెజార్టీతో నెగ్గబోతున్నట్లు తనకు సమాచారం అందిందని, పాత రికార్డులను బద్దలు కొట్టడానికే తాను ఇక్కడికి వచ్చానని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ సాధించిన రికార్డుల కంటే భూపేంద్ర పటేల్(గుజరాత్ సీఎం) రికార్డులు బలంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని వివరించారు. రాష్ట్ర ప్రజల కోసం చాలినంత సమయం కేటాయిస్తానన్నారు. రాష్ట్ర ప్రగతి స్ఫూర్తిదాయకం ప్రజాసేవ అనేది గుజరాత్ సంప్రదాయం, సంస్కృతిలో ఒక భాగమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆదివాసీలు, ఇతర వర్గాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. గుజరాత్ ప్రగతిని స్ఫూర్తిగా తీసుకొని దేశ ప్రగతి కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. తాను ఢిల్లీలో ఉన్నప్పటికీ గుజరాత్ నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటానని తెలిపారు. తన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రులు పనిచేసిన వారంతా అభివృద్ధి కోసం శ్రమించారని ప్రశంసించారు. దుష్టశక్తులకు పరాజయమే సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేవారికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని మోదీ అన్నారు. గుజరాత్‌ను అప్రతిష్టపాలు చేస్తున్న దుష్టశక్తులకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తప్పదని చెప్పారు. అలాంటి శక్తులు రాష్ట్రం నుంచి తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు. -
ఎస్టీ హోదా కోసం దేశవ్యాప్తంగా కుర్మీల ఆందోళన!
కోల్‌కతా/బరిపడ/రాంచీ: తమకు షెడ్యూల్ తెగ(ఎస్టీ) హోదా కల్పించాలని, కుర్మాలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలంటూ మంగళవారం కుర్మీలు చేపట్టిన ఆందోళనలతో బెంగాల్, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు రైలు పట్టాలపై బైఠాయించడంతో ఆగ్నేయ రైల్వే 18 రైళ్లను రద్దు చేసింది. మరో 13 రైళ్లను వేరే మార్గాల్లోకి మళ్లించి, 11 రైళ్ల గమ్యస్థానాన్ని కుదించింది. ఆందోళన కారులు పురులియా వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు. పొరుగునే ఉన్న ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో కూడా కుర్మీలు రైల్ రోకోలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: జనరల్ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్: కేంద్రం -
ఆదివాసీలకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు
-
World Tribal Day: ఆదివాసీలకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: కొండకోనల్లో ఉంటూ ప్రకృతిని కాపాడుతున్న అడవి బిడ్డలకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. 'గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ సంక్షేమాభివృద్ధికి మన ప్రభుత్వం కృషి చేస్తోంది. గిరిజనులకు ప్రాధాన్యమిస్తూ కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం' అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. కొండకోనల్లో ఉంటూ ప్రకృతిని కాపాడుతున్న అడవి బిడ్డలకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ సంక్షేమాభివృద్ధికి మన ప్రభుత్వం కృషి చేస్తోంది. గిరిజనులకు ప్రాధాన్యమిస్తూ కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం.#WorldTribalDay — YS Jagan Mohan Reddy (@ysjagan) August 9, 2022 చదవండి: (ఊపందుకున్న ఆపరేషన్ ఆకర్ష్.. బీజేపీలోకి జయసుధ?) -
భారత్.. నాదీ కాదు, మోదీ-షాలదీ కాదు: ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
భారత దేశం గురించి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్.. నాది(ఒవైసీ) కాదు, మోదీ-షాలదీ కాదు.. అంతుకుమించి థాక్రేలది అసలే కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి భారత దేశం ద్రవిడియన్లు, ఆదివాసీలది అని కామెంట్స్ చేశారు. వివరాల ప్రకారం.. ఒవైసీ శనివారం మహారాష్ట్రలోని బీవండిలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)పై విరుచుకుపడ్డారు. భారత్.. ద్రవిడియన్లు, ఆదివాసీలది మాత్రమేనని అభిప్రాయపడ్డారు. నాదీ కాదు, మోదీ-షాలదీ, థాక్రేలది అసలే కాదని అన్నారు. ఆఫ్రికా, మధ్య ఆసియా, ఇరాన్, తూర్పు ఆసియా నుంచి వలస వచ్చిన వారితోనే భారత్ ఏర్పడిందని వ్యాఖ్యానించారు. దేశంలోకి మొగల్స్ వచ్చి వెళ్లిన తర్వాతే ఆర్ఎస్ఎస్, బీజేపీలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌పై మండిపడ్డారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు చేసినట్లుగా నవాబ్ మాలిక్ అరెస్ట్‌పై ప్రధాని మోదీని ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు లౌకిక పార్టీలు అని వ్యాఖ్యలు చేశారు. అయితే, సంజయ్ రౌత్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థలు(సీబీఐ, ఈడీ) ఎలాంటి చర్య తీసుకోకుండా శరద్ పవార్, ప్రధాని మోదీని కలిశారని తెలిపారు. ఇదే సమయంలో ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అరెస్ట్ అయితే ఆయనకు ఎందుకు సాయం చేయలేదని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో నవాబ్ మాలిక్.. ముస్లిం కావడం వల్లేనా..? అని ప్రశ్నించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. Bhiwandi, Maharashtra | India is neither mine, nor Thackeray's, nor Modi-Shah's. If India belongs to anyone, it's Dravidians & Adivasis but BJP-RSS only after Mughals. India was formed after people migrated from Africa, Iran, Central Asia, East Asia:AIMIM's Asaduddin Owaisi(28.5) pic.twitter.com/NmpxCYo2oC — ANI (@ANI) May 28, 2022 ఇది కూడా చదవండి: యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం -
వారొస్తేనే మిర్చి కోతలు.. వలస కూలీల బతుకుచిత్రం ఇది..
సాక్షి, ఎటపాక: కాయకష్టం వారికిష్టం..చిన్నా పెద్దా తేడాలుండవు.. సమష్టిగా పనిచేయడం.. వచ్చిన దానినే అంతా సమానంగా పంచుకోవడం వారి నైజం. కల్మషం లేని హృదయాలు వారివి. వారంతా వలస కూలీలు. పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఏటా కూలీ పనుల కోసం ఏజెన్సీకి వలస వచ్చి మూడునెలల కాలం ఇక్కడే జీవనం సాగిస్తారు. ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం మండలాలతో పాటు తెలంగాణలోని చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలు, పశ్చిమగోదావరి జిల్లాలోని కుక్కునూరు, వెలేరుపాడు మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేస్తారు. అయితే మిర్చి కోతలకు జనవరి ప్రారంభంలోనే కూలీలు కుటుంబ సమేతంగా తిండి గింజలు పట్టుకుని పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు వస్తారు. వీరిని ఇక్కడకు తీసుకొచ్చేందుకు రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఎందుకంటే వీరొస్తేనే మిర్చి పంట చేతికొచ్చేది. ఏజెన్సీలో సుమారు 8 వేల మంది వలస కూలీలు ఈ నెల చివరి వరకు ఇక్కడే ఉండి కూలి పనులు చేసుకుంటారు. మిర్చి తోటల్లోనే భోజనం చేస్తున్న కూలీలు ఆహారపు అలవాట్లు వలస కూలీలు వారి వెంట తెచ్చుకున్న దంపుడు బియ్యాన్నే భోజనం తయారీకి వాడతారు. అన్నంలో కలుపుకునేందుకు చింత పండు పులుసునే నిత్యం తయారు చేసుకుంటారు. ఘాటుగా ఉండే పచ్చి మిరపకాయలను బండపై నూరి దానినే అన్నంలో కలుపుకుని ఎంతో ఇష్టంగా తింటారు. రైతులు దయతలచి వారానికోమారు ఇచ్చే జుట్టు కోళ్లను(లగ్గారం) కోసుకుని తింటారు. వీరికి నీటి గుంటలు, సెలయేర్లు, సాగునీటి పైపుల వద్ద నీటితోనే స్నానాలు చేయడం అలవాటు. కొందరు ఆ నీటినే తాగుతుంటారు. ఎండ తీవ్రతకు చెట్ల కింద సేదతీరుతున్న ఆదివాసీలు రాత్రి భోజనాల అనంతరం సంప్రదాయ నృత్యాలతో సందడి చేసి నిద్ర పోవడం వీరి దినచర్య. ఇలా వారు పిల్లా పాపలతో కలిసి కూలి పనులు చేస్తారు. తద్వారా వచ్చిన డబ్బులు, మిరపకాయలను భద్రంగా దాచుకుని తిరిగి వారి సొంత గ్రామాలకు పయనమవుతారు. ఇలా వలస కూలీలనే నమ్ముకుని ఇక్కడి రైతులు మిర్చి సాగు చేస్తుంటారు. వీరు ఇక్కడ కూలి పనులకు ఉన్నంత కాలం స్థానిక పల్లెల్లో సందడిగా ఉంటుంది. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. కాలువల్లో చెలమ నీటిని తాగుతున్న చిన్నారులు వాగులు వంకల్లోనే నివాసం కూలీ పనులకు వచ్చిన వీరంతా గుంపులు గుంపులుగా వాగులు, గోదావరి ఇసుక దిబ్బలపై నివాసం ఉంటారు. నీటి సౌకర్యం ఉన్న చోట గుడారాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తారు. వారి వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను కలిసి వండుకుంటారు. సూర్యుడు ఉదయించక ముందే మిర్చి తోటల్లో కాయలు కోసేందుకు వెళ్లిపోతారు. కొద్ది గంటలు పనులు చేశాక వారి వెంట తెచ్చుకున్న భోజనాన్ని సమానంగా పంచుకుని తోటల్లోనే తింటారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే కొంత సమయం చెట్ల నీడనే సేదతీరి.. ఆ వెంటనే మరలా పనులకు ఉపక్రమిస్తారు. సూర్యుడు అస్తమించాక వీరి నివాస ప్రాంతాలకు క్యూ పద్ధతిలో వెళ్లిపోతారు. పని విరామంలో వారికి వారే క్షవరం చేసుకుంటున్న దృశ్యం -
గంజాయి సాగుపై ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు గంజాయి సాగుపై చేపట్టిన జాయింట్ ఆపరేషన్ విజయవంతమైంది. పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ), ఐటీడీఏ సంయుక్త భాగస్వామ్యంతో బుధవారం గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపారు. చింతూరు సబ్ డివిజన్ మోతుగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒడియా క్యాంప్‌లో ఈ ఆపరేషన్ చేపట్టారు. అక్కడి క్యాంప్‌లో నివసిస్తున్న సుమారు 130 కుటుంబాల్లో ఎక్కువ మంది చాలాకాలంగా గంజాయి సాగు చేస్తున్నారు. చింతూరు మండలంలోని వలస ఆదివాసీ గ్రామం ఒడియా క్యాంపునకు చెందిన వలస ఆదివాసీలు గంజాయి స్మగ్లర్ల ప్రలోభాలకు లొంగి ఇరురాష్ట్రాల సరిహద్దుల్లోని కొండ ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో గంజాయి సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టిన తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనా«థ్‌బాబు ఆ ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో మోతుగూడెం ఎస్సై సత్తిబాబు ఒడిశా క్యాంప్‌లో 10 ఎకరాల్లో గంజాయి సాగవుతున్నట్టు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు స్వయంగా ఆ గ్రామంంలో పర్యటించి ఆదివాసీలకు ‘పరివర్తన’ పేరిట కౌన్సెలింగ్ ఇచ్చారు. గంజాయి సాగు వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం గ్రామస్తుల సహకారంతో ఎస్పీతో పాటు ఇతర అధికారులు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో గంజాయి పండిస్తున్న ప్రాంతానికి కాలి నడకన వాగులు, గుట్టలు దాటుకుంటూ వెళ్లి గంజాయి మొక్కల్ని ధ్వంసం చేశారు. ఎకరానికి 5 వేల మొక్కల చొప్పున పదెకరాల్లో నాటిన సుమారు రూ 2.50 కోట్ల విలువైన 50 వేల మొక్కలను నరికివేసి నిప్పు పెట్టారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ బి.రమాదేవి, చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ, రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పాటిల్, చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్, ఎస్బీ డీఎస్పీ వెంకటేశ్వరరావు, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. 60 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం గూడెం కొత్తవీధి: విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ పరిధిలోని రంపుల, తియ్యల మామిడి గ్రామాల్లో గంజాయి తోటలను పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు 60 ఎకరాల్లో సాగు చేస్తున్న తోటలను ధ్వంసం చేసి నిప్పంటించామని సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. ఎస్ఈబీ, పోలీసు, ఫారెస్టు, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి గంజాయి సాగు చేస్తున్న గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ షమీర్, ఆర్ఎస్ఐ నరేంద్ర, ఏఈఎస్ బి.శ్రీనాథుడు, అటవీశాఖ అధికారి భూషణం పాల్గొన్నారు. -
ఆదివాసుల దినోత్సవం: అడవితల్లి బిడ్డల అగచాట్లు
కష్టం ఎంతైనా తరగని చిరునవ్వు.. తరాలు మారినా మారని సంస్కృతి ఆదివాసీలకే సొంతం. అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు నేటికీ అద్దం పడుతున్నాయి. ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ వారి సంస్కృతిని కాపాడుకుంటూ తరువాత తరాలకు అందిస్తున్నారు. గుస్సాడీ ఉత్సవాలతో గ్రామాల మధ్య ఐక్యతను చాటుతూ దండోరా సంబరాలతో ఆకట్టుకుంటున్నారు. గుస్సాడి వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారి ఆహార అలవాట్లు వారి ఆరోగ్యానికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారి అలవాట్లు, వేషభాషలపై ప్రత్యేక కథనం... సంప్రదాయానికి ప్రతీక వాయిద్యాలు నార్నర్(ఆసిఫాబాద్): ఆదివాసీ గిరిజనులు అనా దిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఆచారాలు నేటికీ పాటిస్తున్నారు. ప్రస్తుతకాలంలో డీజేలు, వివిధ రకాల సౌండ్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ వి వాహాలు, ఇతర కార్యక్రమాల్లో సంప్రదాయ వాయిద్యాలను ఉపయోగిస్తున్నారు. తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కన్వీనర్, గుంజాల గోండిలిపి అధ్యక్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్‌రావు ఆదివాసీ తెగలకు సంబంధింన 40 రకాల వాయిద్యాలు సేకరిం 2019 వర్చి 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో ఆదివాసీల ‘రేలపూల రాగం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమం ద్వారా సంగీత ప్రపంచానికి పరిచయం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాకృతిక జానపదం వినిపించడం లేదు. కళాకారులు బతికితే సంగీతం బతుకుతుందనే ఉద్దేశంతో ఆదివాసీలు నేటి యువతరానికి పరిచయం చేస్తున్నారు. ఆదివాసీ వాయిద్యాలు : డోల్ (డోలు) : డోలు, డ ప్పులను ఆదివాసీలు దైవ కార్యక్రమంతో పాటు ఇత ర శుభకార్యాల్లో వాయిస్తారు. గ్రామపెద్ద లేదా సమాజంలో గుర్తింపు పొందిన ఆదివాసీ వ్యక్తి మరణిస్తే అతని దహన సంస్కారాల్లో వాయిస్తారు. ఒ క్కో కార్యానికి ఒక్కోతీరు (బాజా) ఉంటుంది. పెళ్లిలో 10 రకాల డోలు వాయిస్తారు. అవసరాన్ని బట్టి డోల్యల్, చెడ్యంగల్ అనే ఇద్దరు వ్యక్తులు ఆయా రకాల్లో వాయిస్తారు. డప్ (డప్పు) : దండారీ, దేవి ఉత్సహాల్లో డప్పులు వాడుతారు. ఇది కూడా పలు రకాలుగా ఉంటుంది. బాజాల తీరు, కార్యాన్ని బ ట్టి వాయిస్తారు. ఆదివాసీల సంస్కృతిలో భాగంగా వారి ఆచారం ప్రకారం వాయిస్తూ నృత్యం చేస్తారు. పెప్రే(సన్నాయి) : పెప్రేలను ప్రధాన్, తోటిలు వాయిస్తారు. డోలు, డప్పులకు తోడు పెప్రే అవసరం ఉంటుంది. సన్నాయి లేకపోతే ఏ ఉత్సవమైనా ఘనంగా జరగదు. ఈ రెండు ఉంటేనే ఉత్సవంలో జోస్ వస్తుంది. కాలికోం(కొమ్ము) : పెప్రేతో పాటు కాలికోం ఉంటుంది. వీటిని ప్రధాన్‌లు వాడతారు. దీనిని ఉత్సవం ప్రారంభంలో లేదా ఏదైనా కార్యక్రమం ప్రారంభంలో అప్పుడప్పుడు ఊదుతూ ఉంటారు. తుడుం : డోలు, డప్లలో తుడుం ఉంటుంది. తుడుంను కేవలం దైవ, పూజా కార్యక్రమంలో మాత్రమే ఉపయోగిస్తారు. దేవుళ్లకు సంబంధించిన కార్యంతో పాటు అతిథుల స్వాగతానికి వత్రమే దీనిని వాడతారు. కిక్రీ : ఇది తోటి, ప్రధాన్‌లలో ఉంటుంది. పెర్సాపెన్, పెద్ద దేవుల పురణ కథలను కిక్రీ సమేతంగా పాడి వినిపిస్తారు. డోల్కి : ఇది ఆదివాసీలు వివాహ సమయంలో గుడికి వెళ్లేటప్పుడు ఉపయోగిస్తారు. పెళ్లి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత రాత్రి డెంసా కార్యక్రమంలో దీనిని వాడతారు. ఆకట్టుకునే సంస్కృతి,సంప్రదాయాలు.. దండేపల్లి(మంర్యాల): ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ఏటా దసరా తర్వాత ఆశ్వీయుజ పౌర్ణమితో దండారీ ఉత్సవాలు ప్రారంభిం దీపావళి అమావాస్యతో ముగిస్తారు. ఈ సమయంలో గుస్సాడీ వేషధారణ చేసి ఒక గ్రామం వారు మరో గ్రామానికి వెళ్తారు. దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి ఒడ్డున గల పద్మల్‌పురి కాకో ఆలయంలో నిర్వహించే వేడుకలకు ఆదివాసీలు అధికసంఖ్యలో తరలివస్తారు. ఆదివాసీల ఆరాధ్య దేవతలకు బియ్యంతో పాయసం, పప్పుతో రుబ్బిన గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు. దండారీ, పెర్సాపెన్ ఉత్సవాల సమయంలో ఆదివాసీలు గోదారమ్మకు శాంతి పూజలు నిర్వహిస్తారు. ఇప్పపరక నూనెకు ప్రాధాన్యం ఇంద్రవెల్లి(ఖానాపూర్): ఆదివాసీలు సంస్కృతి, సంప్రదాయాలను నేటికీ కొనసాగిస్తున్నారు. సహజవనరులైన భమి, నీరు, అడవిలో దొరికే ఫలా లపై ఆధారపడి ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు. చెట్టు, పుట్ట, నీరు వంటివాటికి పూజలు చేస్త వాటితో అవినాభావ సంబంధం ఏర్పర్చుకున్నారు. ఆదివాసీలు ఆషాఢవసంలో నిర్వహించే తొలి పండుగ అకాడి(వన)దేవతలకు పూజలు. సాగు పూజలు, శుభకార్యాలు, పెర్పపేన్, తదితర పూజలకు ఇప్పపరకనూనెకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అడవిలో సేకరించిన ఇప్ప పరకలతో తీసిన నూనెతో నైవేద్యం తయారుచేసి దేవతలకు సమర్పించడంతో పాటు దీపారాధనకు వినియోగిస్తారు. ఆదివాసీ గ్రామాల్లో టేకు మొద్దులతో తయారు చేసిన గాన దర్శనమిస్తుంది. ఈనెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించేందుకు ఆదివాసీలు సిద్ధమవుతున్నారు. మారని బతుకులు ఉట్నూర్(ఖానాపూర్): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 4లక్షల 95వేల 794 మంది అదివాసీ గిరిజనులున్నారు. వీరందరి అభివృద్ధికి బాటలు వేసేందుకు 1975లో ప్రభుత్వం ఉట్నూర్ కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీల అభివృద్ధికి బాటలు వేసేందుకు ఏర్పాటైన ఐటీడీఏ నాలుగు దశాబ్దాలు దాటినా వారి జీవన విధానంలో ఎలాంటి మార్పులను తీసుకురాలేదు. నేటికి చాలా అదివాసీ గిరిజన ప్రాంతాలు కనీస మౌలిక వసతులు, సౌకర్యాలు లేక అల్లాడుతున్నాయి. విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యం అందని ద్రాక్షగానే మిగిలింది. ఏటా జ్వరాలు, వ్యాధులతో వందల సంఖ్యలో మృత్యుఒడి చేరుతున్నారు. పండుగల్లో ప్రత్యేక ఆకర్షణగా.. జన్నారం(ఖానాపూర్): అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల సంప్రదాĶæలు నేటికీ అద్దం పడుతున్నాయి. జన్నారం మండలంలోని లోతొర్రే, అలీనగర్, కొలాంగూడ, హాస్టల్ తండా, నర్సింగాపూర్, తదితర ఆదివాసీ గ్రావల్లో అన్ని పండుగలను సంప్రదాయ బద్ధంగా జరుపుకుంటారు. దండోరా సంబరాల్లో గుస్సాడి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మా సంప్రదాయం మారదు మేమంతా ఒకేతాటిపై ఉంటాం. మా తండ్రులు, తాతలు నేర్పిన సంప్రదాయాలు వర్చుకోం. సంప్రదాయం ప్రకారం నడుచుకుంటే మా దేవుళ్లు మమ్మల్ని కాపాడుతారు. గూడెంలో చదువుకున్నోళ్లు ఉన్నా మేము చెప్పిన విధంగానే నడుచుకుంటారు. – గంగరాం, లోతొర్రే గూడెం పటేల్ లక్ష్యం సాధించాలి... ఆదిలాబాద్‌రూరల్: నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఎంతగానో శ్రమించాలి. ఇబ్బందులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించా. ఆదివాసీ తెగలో ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే స్పందించి చికిత్స అందిస్తున్నా. క్రీడల్లో రాణించే వారికి సైతం ఆర్థికంగా చేయూత అందజేస్తున్నా. – డాక్టర్ సుమలత, అసిస్టెంట్ ప్రొఫెసర్, రిమ్స్, ఆదిలాబాద్ దుకాణం నడుపుతూ చదివా ఆదిలాబాద్‌రరల్: వది బేల మండలంలోని దహేగాం. చదువుకునే రోజుల్లో సాంగిడిలో చిన్న కిరాణా షాపు నడిపించా. మా నాన్నకు పోలీస్ ఉద్యోగం అంటే ఇష్టం లేదు. సర్పంచ్ చెప్పడంతో ఒప్పుకున్నారు. ఆ రోజుల్లో మాగ్రామానికి న్యూస్‌పేపర్ వచ్చేది కాదు. కిరాణా సామాను కోసం ఆదిలాబాద్‌కు వచ్చినప్పుడు పేపర్ చదివేవాడిని. 1985లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకుని ఎస్సైగా ఉద్యోగం సాధించాను. సీఐ, డీఎస్పీ, ఏఎస్పీ, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయికి ఎదిగా. – డీజీపీకి పుష్పగుచ్ఛం అందిస్తున్న మడావి బాపురావ్,డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, సిద్దిపేట్ తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. ఆదిలాబాద్‌రరల్: ఆ రోజుల్లో ఏజన్సీ ప్రాంతాల్లో చదువుకునేందుకు అవకాశాలు లేవు. సౌకర్యాలు అంతంత వత్రమే. మా తల్లిదండ్రులు టీచర్లు కావడంతో ఉన్నత చదువులు చదివించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారి లక్ష్యానికి అనుగుణంగా కష్టపడి చదివి ఉద్యోగం సాధించా. కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యం సాధించవచ్చు. తల్లిదండ్రులు వారి పిల్లల ను ప్రోత్సహించాలి. - కుడ్మేత మనోహర్, ఏజెన్సీ డీఎంహెచ్‌వో, ఉట్నూర్ పట్టుదలతో ఉద్యోగం సాధించా ఆదిలాబాద్‌రూరల్: నేను ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే రోజుల్లో అంతగా పోటీ ఉండేది కాదు. ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదివా. ఏకకాలంలో ఆర్టీసీలో, మెడికల్ ఫీల్డ్‌లో ఉద్యోగాలు వచ్చాయి. అందులో మెడికల్ ఫీల్డ్ ఎంచుకున్నా. ఉద్యోగం సాధించాలంటే తప్పనిసరిగా కష్టపడాలి. ఉన్నత స్థాయిలో రాణించిన వారు పేదవారికి సహాయం చేస్తే వారు కూడా ఉద్యోగం సాధించే ఆస్కారం ఉంటుంది. – సిడాం వామన్‌రావు, డెప్యూటీ పారామెడికల్ ఆఫీసర్, ఆదిలాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా.. బేల(ఆదిలాబాద్): మండలంలోని సోన్కాస్లో నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన మేస్రం జనార్దన్, శాంతబాయి దంపతుల కుమారుడు మేస్రం నాగేశ్వర్ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదువు పూర్తి చేశాడు. 2013 ఫిబ్రవరిలో ఉస్మానియా యూనివర్సిటీలో జంతుశాస్త్రం విభాగంలో చేరి 2018 జూన్‌లో పట్టా సాధించాడు. సోడియం ఫ్లోరైడ్ అనే టాక్సికేట్ను ఎలుకలకు ఇచ్చి ప్లురోసిస్ అనే వ్యాధిని గుర్తించాడు. వ్యాధిని నయం చేసేందుకు అల్లనేరేడు, జామ, ఉసిరి, అడవిబెండ వంటి ఫలాల నుంచి క్యూరే్సటిన్ అనే ఔషధాన్ని తయారు చేశాడు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగంలో డాక్టరేట్ పొందాడు. ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉస్మానియా యూనివర్సిటీ, కాలేజ్ ఫర్ ఉమెన్స్, కోఠిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదర్శంగా నాగోరావు తాంసి: భీంపూర్ మండలంలోని నిపాని గ్రామానికి చెందిన మేస్రం నాగోరావు ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగం సాధించి ఆరేళ్లుగా విధులు నిర్వహిస్త తమ ప్రాంతంలోని గిరిజనులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నిపాని గ్రామంలోని గిరిజన కుటుంబం చెందిన మేస్రం భంబాయి, దేవరావ్ల కుమారుడు మేస్రం నాగోరావు. మొదటి ప్రయత్నంలోనే ఎఫ్‌సీఐలో ఉద్యోగం సాధించి 2016లో విధులలో చేరాడు.