కొమరంభీం వర్థంతికి భారీగా ఆదివాసీలు
Published Sun, Oct 16 2016 10:44 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
ఈ రోజు ఆదివాసీల ఆరాధ్య దైవం, గోండు వీరుడు కొమరం భీం 76వ వర్థంతి సందర్భంగా అదికారులు భారీ ఏర్పాట్లు చేశారు. వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి జోడెఘాట్‌కు భారీగా ఆదివాసీలు తరలివస్తున్నారు. పెద్ద ఎత్తున గోండులు వస్తుండటంతో ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివాసీల సౌలభ్యం కోసం ఆర్టీసీ జోడేఘాట్‌కు ఉచిత బస్ సర్వీస్‌లను నడుపుతోంది. మరి కొద్దిసేపట్లో జరగనున్న వర్థంతి వేడుకలకు మంత్రులు చందూలాల్, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
Advertisement