
సాక్షి, అమరావతి: కొండకోనల్లో ఉంటూ ప్రకృతిని కాపాడుతున్న అడవి బిడ్డలకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. 'గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ సంక్షేమాభివృద్ధికి మన ప్రభుత్వం కృషి చేస్తోంది. గిరిజనులకు ప్రాధాన్యమిస్తూ కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం' అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
కొండకోనల్లో ఉంటూ ప్రకృతిని కాపాడుతున్న అడవి బిడ్డలకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ సంక్షేమాభివృద్ధికి మన ప్రభుత్వం కృషి చేస్తోంది. గిరిజనులకు ప్రాధాన్యమిస్తూ కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం.#WorldTribalDay
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 9, 2022