
అమరావతి: ఏపీలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక విద్యుత్ చార్జీలు పెంచడమేనా? అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ప్రశ్నించారు. వచ్చే ఐదేళ్లు కరెంట్ చార్జీలు పెంచమంటూ ఎన్నిలక ముందు ఇచ్చిన హామీ ఏమైందంటూ వైఎస్ జగన్ నిలదీశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశారు వైఎస్ జగన్. ‘ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానం గుర్తుచేస్తున్నా’ అంటూ చంద్రబాబు 2024 ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన వీడియోను వైఎస్ జగన్ షేర్ చేశారు.
తాము అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ చార్జీలు తగ్గించేవాళ్లం అని గతంలో చెప్పిన మీరు.. ఇప్పుడు ప్రజలు ఎంతగా వద్దని వేడుకున్నా వినిపించుకోకుండా రూ.6,072.86 కోట్ల భారం వేయడం భావ్యమేనా? అని వైఎస్ జగన్ నిలదీశారు. ఇదే విషయంపై నిన్న(ఆదివారం) చంద్రబాబును ప్రశ్నించిన వైఎస్ జగన్.. తాజాగా వీడియోను పోస్ట్ చేసి మరీ చంద్రబాబు మోసపూరిత విధానాన్ని బయటపెట్టారు.
ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానం గుర్తుచేస్తున్నా @ncbn pic.twitter.com/CriUf6Or4L
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 28, 2024