ఇండ్ల స్థలాల కోసం ఆదివాసీల ఆందోళన | Adivasis fighting for House spaces | Sakshi
Sakshi News home page

ఇండ్ల స్థలాల కోసం ఆదివాసీల ఆందోళన

Published Tue, Jun 20 2017 5:07 PM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM

Adivasis fighting for House spaces

నిర్మల్ జిల్లా : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరుపేద ఆదివాసీ గిరిజనులు ఇండ్ల స్థలాలకోసం నిరవధిక ఆందోళనలు చేస్తున్నారు. గత యాభై రోజులుగా ఆదివాసీ గిరిజనులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలో భాగంగా ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. భీంరావు, భారతి అనే గిరిజన దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. వెంటనే పక్కనున్న వారు గుర్తించి అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆత్మహత్యాయత్నం చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం జిల్లా కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement