
వాజేడు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు ఆదివాసీలు సోమవారం తాళాలు వేశారు. ఆదివాసీలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర బంద్ నేపథ్యంలో ఆదివాసీ సంఘాల నాయకులు ప్రతీ కార్యాలయానికి వెళ్లి బంద్ చేశారు. తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవో, సహకార సంఘం కార్యాలయాల్లో ఉన్న సిబ్బందిని మర్యాదపూర్వకంగా బయటకు పంపించి తాళాలు వేశారు.